కూడలి / వెబ్‌పత్రికలు
	<language>te</language>
కూడలి
నవతరంగం: లక్ష హిట్ల నవతరంగం
	<description>ఈ రోజుతో నవతరంగం లక్ష హిట్లు చేరుకున్న సందర్భంగా నవతరంగం పాఠకులకు కృతజ్ఞతలు. నా తో పాటు కలిసి పని చేసి, నవతరంగంలో భాగమైన సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరిగ్గా ఐదు నిమిషాల క్రితం నవతరంగం సైట్ స్టాట్స్ రికార్డు చేసే సైటు మీటర్[sitemeter] లక్ష హిట్లు చూపించింది.
ఎనిమిది నెలల్లో ఇన్ని హిట్లు రావడం తక్కువా, ఎక్కువా అని పోల్చడానికి కానీ, లేదా మరొక సైటు కంటే మాకే ఎక్కువ హిట్లు వచ్చాయని చెప్పడం ఇక్కడ [...]</description>
నవతరంగం: KungFu Panda (2008)
	<description>kungfu panda డ్రీమ్‍వర్క్స్ వారి యానిమేషన్ చిత్రం. కుంగ్‍ఫూ నేర్చుకోవాలనుకుంటున్న ఓ పండా (panda) కథే ఈ సినిమా. చాలా యానిమేషన్ సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా అంతర్లీనంగా జీవితం ఉంది. జీవిత సత్యం ఉంది. కానీ, ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి అంటే, ఆద్యంతమూ హాస్యంతో నవ్విస్తూనే ఆ విషయాన్ని చెప్పడం. సెంటీ డైలాగులు, సెంటీ సీన్లూ లేకుండానే సినిమా ద్వారా చెప్పదలుచుకున్న సీరియస్ విషయాన్ని తేలిగ్గా చెప్పేసారు.  
కథ విషయానికొస్తే, పో [...]</description>
పొద్దు: తెలుగు - పిల్లలు
	<description>-లలిత
ప్రస్తుత పరిస్థితులలో ఆంగ్లం ఉండగా ఆంధ్రం ఎందుకనే ధోరణి ప్రబలంగా [...]</description>
పొద్దు: హార్ట్ బ్రేకింగ్
	<description>-పట్రాయని సుధారాణి
దేవుడి విగ్రహం రాయిలా నిలబడి ఉంది. రాయిలా ఉన్న తనను, తను సృష్టించిన మనిషి ఇంత అందమైన రూపంలో [...]</description>
ప్రజాకళ: విరామం లేని పయనం
	<description>అక్షరాల్ని లోకానికిచ్చి
హఠాత్తుగాఎక్కడికో పయనమయ్యావు
నిరంతర సాహిత్య శ్రామికుడా!
పయనమేదైనా
పచ్చటి బతుకుల కోసమే కదా
నువ్ జీవించింది
ఎర్రపొద్దు కోసం
ఎన్ని రాత్రులు ఎదురుచూశావో
ఎన్ని దీపాల్ని సిద్ధం చేశావో
నువ్ లేని శూన్యం
నిండా ఆక్రమించిన వేళ ఇది
ఎన్ని హదయాలు
ద్రవిస్తాయో తెలుసు నీకు
అందుకేనేమో..నువ్
ప్రేమించిన ఈ క్షేత్రం నిండ
విత్తనాలేవో ముందుగానే నాటావు
విత్తనం పగిలిన చప్పుడు
స్పష్టంగా వినిపిస్తుంది
భూమిని చీల్చుకొని
రెక్కలు తొడుక్కోడానికి
నీ విత్తనాలన్ని
తహతహలాడుతున్నాయి
నీ కోసం కార్చే కన్నీళ్లే
(ఇటీవల కనుమూసిన విమర్శకులు హరి పురుషోత్తమరావు కోసం)
-పసునూరి రవీందర్</description>
	<dc:creator>ప్రజాకళ</dc:creator>
ప్రజాకళ: దళిత సమస్యలపై ప్రజాసాహితి దృక్పథం
	<description>-డా//దార్ల వెంకటేశ్వరరావు 
ప్రజాసాహితి సాహిత్య, సాంస్కృతికోద్యమ మాసపత్రిక. ఆగస్టు 1977 నుండి నేటి వరకూ నిరంతరాయంగా వెలువడుతున్న పత్రిక. అదీ పీడితుల పక్షాన నిలబడుతున్న పత్రిక. సమాజంలో జరిగే అనేక సంఘటనలకు తనదైన దృక్పథంతో కొనసాగుతున్న పత్రిక. కొన్నిసార్లు రెండు, మూడు నెలలకు కలిపి ప్రచురించినా మూడు వందల సంచికకు చేరువయ్యింది. అలాంటి పత్రిక ఇప్పుడు మూడు వందలవ సంచికకు చేరింది.
దీన్ని ఒక ప్రత్యేక సంచికగా కూడా తీసుకొచ్చే హడావిడిలో ఉంది. ఒక  పత్రిక [...]</description>
	<dc:creator>ప్రజాకళ</dc:creator>
ప్రజాకళ: ” బొంబాయి బస్తీల్లో, భివాండీ, సూరత్ మురికివాడల్లో నికృష్టమైన బతుకు బతుకుతున్న ఈ తెలంగాణ కార్మికులు సిరిసిల్లా జగిత్యాల పోరాటల తర్వాత ఆ ప్రాంతాల్లో నిర్మించిన కార్మికోద్యమాలైనా, సాంస్క­ృతికోద్యమాలైనా తాము కరిగిపోతూ చుట్టూ వెలుగులు ప్రవరిస్తున్న జీవితాలకు దాఖలాలు.”
	<description>వెలుగు బాటలైన వలస జీవులు
 - వరవరరావు 
ముంబాయి.. దుబాయి.. బొగ్గుబాయిల పోలికలు, తేడాల గురించి పిట్టల రవీందర్ చేసిన పరిశీల న, విశ్లేషణ (ఆంధ్రజ్యోతి 12 ఆగస్ట్ 2008) చాలా ఆసక్తిదాయకంగా ఉంది. మరిన్ని ఆలోచనలను రేకేత్తించేదిగా ఉన్నది. వ్యవసాయ జీవితంలోకి వ్యవసాయ సంబంధమైన పరిశ్రమలు వచ్చినపుడు కొత్త ఉత్పత్తి శక్తుల వికాసం, కార్మిక వర్గం ఏర్పడడం, కార్మిక చైతన్యం, ఆ చైతన్యం తిరిగి గ్రామీణ రైతాంగ జీవితంపై చూపే ప్రభావం - ఇవన్నీ బొగ్గుబాయి, [...]</description>
	<dc:creator>ప్రజాకళ</dc:creator>
ప్రజాకళ: “హురియత్ కాన్ఫరెన్స్‌ను ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా గౌరవించి వారితో ప్రజాస్వామికంగా వ్యవహరించే బదులు ఆ సంస్థను చీల్చి ఒక అనుకూల వర్గాన్ని తయారు చేసుకోవాలన్నది భారత ప్రభుత్వ వైఖరిగా ఉండింది ఇన్నాళ్లూ..”
కాశ్మీర్‌లో మన కర్తవ్యం
 - కె.బాలగోపాల్ 
అవి దేశ విభజన రోజులు. ఉపఖండమంతటా -ముఖ్యంగా ఉత్తర, వాయవ్య, తూర్పు ప్రాంతాల లో నరమేధం జరుగుతున్నది. హిందూ, సిక్కు మూకలు ముస్లింలను, ముస్లిం మూకలు హిందువులనూ సిక్కులనూ నరుకుతున్నారు, సజీవంగా కాల్చి చంపుతున్నారు. ఇళ్ళు తగుల బెడుతున్నారు. స్త్రీలను రేప్ చేస్తున్నారు.
ఇంతటి హింసను ఉపఖండం అప్పటివరకు చూసి ఎరుగదు. ఆ సమయంలో [...]</description>
	<dc:creator>ప్రజాకళ</dc:creator>
ప్రజాకళ: పాలస్తీనా గాయం
	<description>- మహమూద్ దార్వీష్
  పాలస్తీనా జాతీయ కవి 
  (ఫద్వా తుఖాన్ స్మృతిలో) 
1.
ఉహు! మాకు గుర్తు చేయనక్కరలేదు
మాలోనే వుంది, మౌంట్-కేరమెల్ పర్వతం
మా కనురెప్పల పైన కదులుతున్నాయి, గెలీలీ లోని గడ్డిపోచలు
మా నేలలోని పర్వతానికీ, భూభాగానికీ, మాకూ మధ్య భేదం ఉందనుకోకండి
దానిని మేం చేరగలమా అని అడగకండి
మేమూ మా దేశమూ ఒకే దేహం ఒకే ప్రాణం .
2.
మేము వసంతంలో ఎగిరే పావురాలం కాదు
మా ప్రేమబంధం ఎన్నటికీ చెదిరిపోయేది కాదు
అక్కా! ఇరవై యేండ్ల [...]</description>
	<dc:creator>ప్రజాకళ</dc:creator>
ప్రజాకళ: దోబూచుల వెన్నెల
	<description>వెన్నెల మైదానాన్ని కప్పుకొని బస్సెక్కుతాను
వందనోటు చిల్లర వెంపర్లాటలో
దాన్ని ఎటో కుక్కిపెడతాను
ఈ సీటో ఆ సీటో వూగుతూ ప్రయాణంసాగి
బస్సుదిగి ఇంటిమెట్లెక్కుతూ గుర్తుకొచ్చి
జేబులోనో సంచిలోనో చెయ్యిపెడితే
ఎంతకీ దొరకదు
ఎక్కడ పోయిందని వెతకాలో
సందిగ్దంగా
కాళ్ళీడ్చుకుంటూ లోనికెళ్ళి
ఏ మంచంమీదో వొరిగిపోతాను
నిద్రిస్తున్న కళ్ళలో తెరసిన ఆకాశంలోంచి
జలపాతమై తుంపరలై వర్షిస్తుంది
తడిసిపోతూ
స్నానమాడుతూ
కనుకొలుకుల్లో బందీచేసాననుకుంటా
రెప్పతెర్వగానే
రివ్వున ఎగిరిపోతుంది
మళ్ళీ వేట
మళ్ళీ వెదకులాట
మళ్ళీ దోబూచులాట
	<dc:creator>ప్రజాకళ</dc:creator>
ప్రజాకళ: దేశీయ వనరులు కోటాను కోట్ల పుట్టెడు భారతీయులకు ముట్టినట్టేనా ఆరు దశాబ్దాలు కన్న రుతువులు ఏమిచ్చినట్టు? ఏమి పొందినట్టు. ఈ దేశం మీద మట్టి పిసుక్కుని బతికే ఏ శ్రమజీవి బతుకు ఒడ్డెక్కినట్టు? ఏ హక్కు నెరవేరినట్టు, ఏ స్వేచ్ఛ పురివిప్పినట్టు
 - అల్లం నారాయణ 
	<dc:creator>ప్రజాకళ</dc:creator>
ప్రజాకళ: “100 ఎకరాల లీజును కాశ్మీరీలు ఇంతగా వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటన్న ప్రశ్నకు జవాబు కావలసిందేనంటే, తమ ఉనికి పట్ల ,తమ నేల పట్ల,తమ సంస్కృతి పట్ల వారికి ఉన్న ఉద్వేగభరితమైన బంధాన్ని కారణంగా చూపించవలసి ఉంటుంది.”
	<description>ఇంకెంత మూల్యం చెల్లిస్తాం?
 - కె.బాలగోపాల్ 
జమ్మూలో భారతీయ జనతా పార్టీ నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని చాలా మంది విమర్శిస్తున్నారు. మంటలు మండాలని కోరుకునే వాళ్లు నిప్పుతోనే చెలగాటం ఆడుతారు, నీళ్లతో కాదు. 1953లో షేక్ అబ్దుల్లా అక్రమ బర్తరఫ్‌కు, అక్రమ అరెస్ట్‌కు దారితీసిన ఆనాటి జనసంఘ్ నినాదాన్ని ఎల్.కె. అద్వానీ ఇవ్వాళ జ్ఞాప కం చేసుకుంటున్నాడంటే అన్నీ తెలిసే ఆ పని చేస్తున్నాడు. తన చంచల స్వభావాన్ని రాజకీయ ప్రతిష్ఠ చాటున దాచి యోగ్యుడయిన పాలకుడిగా, [...]</description>
	<dc:creator>ప్రజాకళ</dc:creator>
ఈమాట: డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ వార్షికోత్సవ సమావేశము
	<description>1998 జనవరి నెల్లో ఒక ఆదివారం మధ్యాహ్నం పది పదిహేను మంది తెలుగు సాహిత్యం అంటే ఆసక్తి ఉన్న వ్యక్తులు ఏనార్బర్ పబ్లిక్ లైబ్రరీలో కలుసుకుని తమకి నచ్చిన కవితల్ని, పద్యాల్ని చదివి మిగతావారితో పంచుకున్నాం. ఆ కార్యక్రమం ఒక సంస్థ ఆవిర్భావానికి పునాది అని అప్పుడు మేమూహించలేదు.
ఈ పదేళ్ళలోనూ ఒక చర్చా వేదికగా, ఒక సంస్థగా ఎంతో దూరం ప్రయాణించాము. 2002 అమెరికా సాహిత్య సదస్సునీ, 2005 తానా సమావేశాల్లో సాహిత్య సదస్సునీ విజయవంతంగా నిర్వహించాము. [...]</description>
	<dc:creator>డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి</dc:creator>
భూమిక: Front Page Aug08
	<dc:creator>భూమిక</dc:creator>
భూమిక: పురుషసంఘాలా? పురుషాహంకార సంఘాలా?
	<description>కుటుంబ హింసలో మగ్గుతున్న స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నుండి స్త్రీలకు రక్షణ చట్టం 2005ను పకడ్బందీగా (మగవాళ్ళ తోడ్పాటును కూడా తీసుకుంటూ) అమలు పరచాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి జూన్‌ 25న ఒక సమావేశం ఏర్పాటు చేసారు.
	<dc:creator>భూమిక</dc:creator>