2007-03-09

రెండు రెళ్ళు ఆరు

మరి పందుల పెంపకం, గేదేలకు చేసే వైద్యం,లాంటివి చూడన...

మరి పందుల పెంపకం, గేదేలకు చేసే వైద్యం,లాంటివి చూడనట్టుంది. చూస్తే ఖచ్చితంగా పిచ్చి ఎక్కేది. చావాలని నిర్ణయించుకుంటే దూల దర్షన్ చూస్తే సరి. జీవితం మీద మిగిలిన కొద్దో గొప్పో ఆశ నశించడం ఖాయం.

shadruchulu, 2007-03-09 07:47 AMకి రాసారు.

విహారి.

అబ్బా..పడీ పడీ నవ్వానండి.మీరు పెట్టిన షరతులు అదిర...

అబ్బా..పడీ పడీ నవ్వానండి.మీరు పెట్టిన షరతులు అదిరిపోయాయి.అలాగే కానీయండి "అయ్యో పాపం విహారి" గారు.

radhika, 2007-03-09 05:25 AMకి రాసారు.

paapam peddaayana

paapam peddaayana

radhika, 2007-03-09 05:09 AMకి రాసారు.

అనిల్ చీమలమఱ్ఱి

సంతోషం ..కాని వట్టి చేతులతో రావొద్దు. పెళ్ళీ, రిసె...

సంతోషం ..కాని వట్టి చేతులతో రావొద్దు. పెళ్ళీ, రిసెప్షన్ చిత్రాలతో రావాలి. లెకపోతే బాగోదు మరి.

shadruchulu, 2007-03-09 05:01 AMకి రాసారు.

శోధన

ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఇది కుడా చెప్పక తప్పదు...

ఇక సందర్భం వచ్చింది కాబట్టి ఇది కుడా చెప్పక తప్పదు.సీన్ సితార్. (MNR college సందర్భం లో)న్యూజిలాండ్ ఆస్ట్రేలియా బౌలింగ్ ని ఇరగదీసింది.పోలీసులు నిందితుణ్ణి బొక్కలో వేసారు ఆ ఛానల్ వారు వాడే ఇటువంటి మాటలు చాలు వాళ్ల ఛానల్ ప్రమాణాలు అంచనా వేయడానికి.

పారుపల్లి, 2007-03-09 05:01 AMకి రాసారు.

Naveen, 2007-03-09 05:01 AMకి రాసారు.

నేను DishTV వాడుతున్నా..కాబట్టి భరించాల్సిందే...

నేను DishTV వాడుతున్నా..కాబట్టి భరించాల్సిందే...

సుధాకర్(శోధన), 2007-03-09 05:01 AMకి రాసారు.

నా మదిలో ...

నా అభిప్రాయం కూడా ఇదే.....రిజర్వేషన్లు అడిగేవాళ్ళు...

నా అభిప్రాయం కూడా ఇదే.....రిజర్వేషన్లు అడిగేవాళ్ళు సిగ్గుపడాలి. చేతకాని వాళ్ళే అలా అడుగుతారు. ఈ రాజకీయ నాయకులకు దమ్ముంటే పేదలకు రిజర్వేషన్లు ఇమ్మను.

Naveen, 2007-03-09 05:01 AMకి రాసారు.

ఎందుకంటే మీకంత సీన్ లేదు అవసరం లేదని ....

ఎందుకంటే మీకంత సీన్ లేదు అవసరం లేదని ....

shadruchulu, 2007-03-09 05:01 AMకి రాసారు.

రెండు రెళ్ళు ఆరు

'పాత సామాన్లు కొంటాం.......':)) yahoo smilies ఇక్క...

'పాత సామాన్లు కొంటాం.......':)) yahoo smilies ఇక్కడ పని చెయ్యయి కని లేకుంటె ఒక 100 సార్లు =)) [ అదే rolling on the floor & laughing loudly smily] అని పెట్టేటోడ్ని (ఒక 10 సార్ల దొర్లి మరి) Good One !

Japes, 2007-03-09 03:53 AMకి రాసారు.

జేప్స్

Comment on జీవితం : విధా? లేక యాదృచ్ఛికమా? by Sreekanth

Bagundira… nee rayadam……kaani antha rasaka katha lo vuundi mee anna ani thelisinka baleduara….edo bada anipisthundi…..
kaani edi eppudu ela jaragalo ala jaruguthundi..daaniki evvaru karanam kaaru ….ade devuni maya anukunta nenu…….

Sreekanth, 2007-03-09 03:49 AMకి రాసారు.

రెండు రెళ్ళు ఆరు

:) ఈ పోస్ట్ చదివినంక నాకు కూడ ఇదే తట్టింది .... "ప...

:) ఈ పోస్ట్ చదివినంక నాకు కూడ ఇదే తట్టింది .... "పట్టాభి కి జరిగిన అవమానం గుర్తుకు వచ్చింది. అంతే...వెంటనే నిర్ణయించుకున్నాను - ఈ రోజంతా దూరదర్శన్ చూసి, రేపు ఆఫీసుకు వెళ్ళి అందరితో చెప్తాను. ఏమి చెస్తారో చూద్దాం." మల్ల దూరదర్శన్ (దుల / దురద - దర్శన్) చూసి నిర్ధారించుకోవాలని ! Good one !

Japes, 2007-03-09 03:39 AMకి రాసారు.

విహారి.

అబ్బా ఆశ దోశ అప్పడం పిజ్జా బర్గర్ కాదూ!

అబ్బా ఆశ దోశ అప్పడం పిజ్జా బర్గర్ కాదూ!

shadruchulu, 2007-03-09 02:03 AMకి రాసారు.

శోధన

ఇకనైనా ఈ మహా మగ లోకం కుహానా స్త్రీ వాదాలు మాని, స్...

ఇకనైనా ఈ మహా మగ లోకం కుహానా స్త్రీ వాదాలు మాని, స్త్రీని ముందు మనిషిగా గౌరవించటం నేర్చుకుని మసలుకోవడం మంచిది. అదేదో ఇంట్లో నుంచే మొదలు పెడితే మరీ మంచిది.మీరన్నదాంట్లో దీనితో నేను ఏకీభవిస్తాను.రిజర్వేషన్ల మీద మాత్రం మీతో ఏకీభవించలేను.

ప్రవీణ్ గార్లపాటి, 2007-03-09 01:35 AMకి రాసారు.

దళితులకి ఎలక్షన్లో రిజర్వేషన్లిచ్చినా ఇలాంటి ( htt...

దళితులకి ఎలక్షన్లో రిజర్వేషన్లిచ్చినా ఇలాంటి ( http://www.hinduonnet.com/fline/fl2210/stories/20050520002603900.htm ) సిగ్గుచేటు పనులు జరుగుతున్నాయి..ఇక మహిళలకి రిజర్వేషన్లిచ్చినా పెద్ద లాభంలేదు..అయినా మహిళలు అల్పసంతోషులండోయ్..సంవత్సరంలో ఒకరోజు మహిళదినం మిగిలిన 364 రోజులన్నీ పురుషదినాలే..హా హా హా..

రవి వైజాసత్య, 2007-03-09 01:01 AMకి రాసారు.

రెండు రెళ్ళు ఆరు

హ హ ..ఏమి హాస్యం! ఈ సినిమాలోళ్ళు మిమ్మల్ని చూసైనా ...

హ హ ..ఏమి హాస్యం! ఈ సినిమాలోళ్ళు మిమ్మల్ని చూసైనా హాస్యం ఎలా వుండాలో నేర్చుకున్నారు గాదు.వాఖ్యానాలలో శోధన సుధాకరూ నవ్వించారు.--ప్రసాద్http://blog.charasala.com

spandana, 2007-03-09 01:01 AMకి రాసారు.

శోధన

అజిత్ గారు ఇటీవల నా బ్లాగులో ("నేను" అనగా...) వాఖ్...

అజిత్ గారు ఇటీవల నా బ్లాగులో ("నేను" అనగా...) వాఖ్యానం రాస్తూ "మీకు మతమౌఢ్యదృష్టి తొలగి.." అంటూ రాశారు. మతమంటేనే నాకు పడదు ..నాలో మత మౌడ్యం ఎలా కనిపించిందబ్బా అజిత్ గారికి అని నేను తెగ కంగారు పడిపోయా!ఈ TV9 ను మీ మీ కేబుల్ ఆపరేటర్లతో చెప్పి తొలగించుకోకపోయారా?--ప్రసాద్http://blog.charasala.com

spandana, 2007-03-09 12:51 AMకి రాసారు.

కాలాస్త్రి

డైరీ చదువుతున్నట్టు గా వుంది ఈ పోస్ట్ చదువుతుంటే.మ...

డైరీ చదువుతున్నట్టు గా వుంది ఈ పోస్ట్ చదువుతుంటే.మీ శ్రీమతి గారికి డెలివరీ సవ్యం గా జరగాలని కోరుకుంటున్నాను.

radhika, 2007-03-09 12:34 AMకి రాసారు.

శోధన

మహిళల దగా దినోత్సవం వ్యాసం పేరు, వ్యాసంలో చెప్పిన ...

మహిళల దగా దినోత్సవం వ్యాసం పేరు, వ్యాసంలో చెప్పిన విషయాలు బాగా ఉన్నాయి. ఈ రోజు ఆంధ్రజ్యొతి ప్రకారం ఈ మహిళల దినం అంటే ఏమిటో చాల మంది ఉద్యొగినులకు, కాలేజ్ విధ్యార్ధినులకు తెలియదని రాసారు. అదీ సంగతి.

cbrao, 2007-03-09 12:26 AMకి రాసారు.

2007-03-08

Comments for సంగతులూ,సందర్భాలూ….

Comment on త్యాగరాజ స్వామి గడుసుతనం! by Thyaga

మంచి విశ్లేషణాత్మకయిన టపా. మనసులో ఉన్న మాటలని, భావావేశాన్ని అందంగా కూర్పు చేసినప్పుడు ఆ వాక్యార్ధ సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది. అలా చేసిన పని ఈ టపాలో స్వచ్చంగా కనపడుతోంది. అందుకోండి అభినందనలు

Thyaga, 2007-03-08 11:58 PMకి రాసారు.

'సత్య'శోధన

నమస్తే సత్యసాయిగారూ, ఈ మధ్య బ్లాగులకూపంలో నుండి కా...

నమస్తే సత్యసాయిగారూ, ఈ మధ్య బ్లాగులకూపంలో నుండి కాస్త బయట తిరగడంతో కొన్ని మంచి టపాలను చదవలేకపోయాను. మీరు చాలా బాగా రాస్తున్నారు. కొరియా చప్పిడివంటలు మీరు కలిపే తెలుగు నుడి'కారం'తో రుచినిగొని ఆవురావురుమంటూ తినేలా ఘుమఘుమలాడయి.

రానారె, 2007-03-08 11:00 PMకి రాసారు.

మీరనేది నిజమే- వంటకు పట్టే సమయమూ, రుచీ విలోమానుపతం...

మీరనేది నిజమే- వంటకు పట్టే సమయమూ, రుచీ విలోమానుపతంలో ఉంటాయి. ఆ మధ్య కూర మాడ్చినపుడు తెలిసొచ్చింది.:-)అన్నట్టు మీ బ్లాగు మంటనక్కలో బాగా కనపడాలంటే.. మీరు జస్టిఫై చెయ్యడం మానెయ్యాలి. (వీవెన్ తయారించిన అన్‌ జస్టిఫై వాడితే బాగానే కనపడుతుంది.) కొన్ని సార్లు 'అన్ జస్ట్' గా ఉంటేనే పని జరుగుతుందండి.

చదువరి, 2007-03-08 11:00 PMకి రాసారు.

తిండి విశేషాలు చెప్పారు. ఎన్నొ ప్రత్యేకతలు కలిగిన...

తిండి విశేషాలు చెప్పారు. ఎన్నొ ప్రత్యేకతలు కలిగిన Jeju Island, South Korea విశేషాలు సచిత్రంగా వివరిస్తే మా కనులకు కూడా విందు చేసిన వాళ్ళవుతారు.

cbrao, 2007-03-08 10:39 PMకి రాసారు.

అనిల్ చీమలమఱ్ఱి

ఆ! ఆ! కనిపిస్తోంది. ఆ పిండి వంటలు. ఆ పెళ్ళి హడావుడ...

ఆ! ఆ! కనిపిస్తోంది. ఆ పిండి వంటలు. ఆ పెళ్ళి హడావుడి అందులోని అలకలూ.బంధు మిత్రుల ఇంటింటికి వెళ్ళి ఆరంగించడాలు. ఆ గిఫ్ట్ ప్యాక్ లు విప్పడాలు అన్నీ అయిపోయి "ఈ బ్లాగే ఎంతో హాయి " అనడం కూడా వినిపిస్తోంది.విహారి

విహారి, 2007-03-08 10:38 PMకి రాసారు.

హృదయ బృందావని

ఈ పాటలు,ప్రతీ పాటకి పెట్టిన చిత్రాలతో మీ బ్లాగు బృ...

ఈ పాటలు,ప్రతీ పాటకి పెట్టిన చిత్రాలతో మీ బ్లాగు బృందావనం లానే వుందండి.

radhika, 2007-03-08 09:29 PMకి రాసారు.

మ్యూసింగ్స్

Comment on Desamuduru generation by Krishna

పిల్లలు హైపర్ ఏక్టివ్ గా తయారవుతున్నరీమధ్య. దీనికి తోడు సకలరహస్యాలూ పిల్లలకి సైతం అర్ధమయ్యేలా నూరిపోస్తున్న సినిమాలు, టి.వి. కార్యక్రమాలు.

కాలాలతో నిమిత్తం లేకుండా పిల్లలకి ఉండే మౌలిక లక్షణం హిపోక్రసీ (చెప్పేది ఒకటి చేసేది ఒకటి) ని తట్టుకోలేకపోవడం. ఇప్పటి పిల్లలకి కాసింత లాజికల్ థింకింగ్ ఎక్కువ కావడం వల్ల పెద్దలు జాగ్రత్తగా ఉండక తప్పదు.

నీతి కథలు చెప్పే తల్లులు, రామాయణం, మహాభారతం విడమర్చి చెప్పే తాతలు, తాతమ్మల స్థానే వెకిలి వేషాల పోగో చానళ్ళు తయారయ్యాయి ఇప్పుడు.
పిల్లలు తప్పు చేస్తుంటే మందలించడం అటుంచి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించే తీరిక తగ్గిపోతోంది ఈ నాటి తల్లితండ్రులలో.

చదువుకున్న వాళ్ళలోనే ఇలా ఉంటే పేదలు, అభాగ్యులు, విచ్చలవిడితనం మూర్తిభవించే వారి సంతానం ఏ మాత్రం గొప్పగా ఉంటుంది?. కాబట్టి ఆషాకిరణ్ లాంటి స్కూళ్ళల్లో పిల్లలకి ఎథిక్స్, మోరల్ వేల్యూస్ ప్రత్యేకించి నూరిపోస్తూ ఉండాలి. పిల్లల్లో దేశముదురుతనం పెరిగిన మాట వాస్తవమే. అయితే వాళ్ళు మునుపటి కన్నా మనం నేర్పేది మరింత వేగంగా నేర్చుకోగలుగుతున్నారన్నదీ నిజమే. శాంతి మేడం మరియు మీలాం టిటీచరమ్మల పుణ్యమా అని అషాకిరణ్ పిల్లలు జీవితంలో ఉన్నత స్థానాలకి చేరగలరని ఆశ పడ్తున్నాను.

కృష్ణ

హైదరాబాద్ మహానగరం

Krishna, 2007-03-08 08:41 PMకి రాసారు.

నా మదిలో ...

మహిళా దినోత్సవ శుభాకాంక్షలుwww.thelugodu.blogspot....

మహిళా దినోత్సవ శుభాకాంక్షలుwww.thelugodu.blogspot.com

F A M U S, 2007-03-08 08:12 PMకి రాసారు.

సాలభంజికలు

కొత్తపాళీగారు,మీరు చెప్పింది నిజమేనేమో. మొదట ఒక బా...

కొత్తపాళీగారు,మీరు చెప్పింది నిజమేనేమో. మొదట ఒక బాహ్య చిత్రంతో మెదలెట్టి, క్రమక్రమంగా ఒకే బావాన్ని 'abstract' చేస్తూపోవడం ఇందులో చేసిన ప్రయోగం.మొదటి పాదంలోని వస్తువు, రెండోపాదంలోని వస్తువు గా రూపాంతరం చెంది, గమ్యాన్ని చేరుకోడం అనేది కవితా వస్తువు.చివరి చరణంలో మట్టుకు - రూపాంతరం చెందడంలో ఉన్న 'process' ని (తపస్సు, అంతర్మధనం) కూడా explicit గా చెప్పడం కొసమెరపు.విజ్ఞులైన మీరన్నారు కాబట్టి

Nagaraju Pappu, 2007-03-08 08:00 PMకి రాసారు.

చిన్ని పద్యాలు దేనికదే హైకూల్లా భావగర్భితమై ఉన్నాయ...

చిన్ని పద్యాలు దేనికదే హైకూల్లా భావగర్భితమై ఉన్నాయి కానీ, ఏమో సార్, మొత్తం మీద progression (శ్రేణి? శ్రేఢి??) అతకనట్టూ, తత్ఫలితంగా వోలుమొత్తమ్మీద భావం పండనట్టూ అనిపించింది.@రాధిక - మీ పేరడీ సముచితంగా ఉంది. గురువుగారి ఆలోచనా స్రవంతిని బాగా పట్టుకున్నారు :-)

కొత్త పాళీ, 2007-03-08 08:00 PMకి రాసారు.

"తాటిచెట్ల ఏకాంత తపస్సుకుటీరమైమనిషికి నీడనివ్వాలని...

"తాటిచెట్ల ఏకాంత తపస్సుకుటీరమైమనిషికి నీడనివ్వాలని"ఇది నాకు బాగా నచ్చింది...

Sriram, 2007-03-08 07:57 PMకి రాసారు.

జేప్స్

Comment on జీవితం : విధా? లేక యాదృచ్ఛికమా? by Jaya Prakash

FYI :
http://www.vaarttha.com/pages/archives/20/WAR/WAR-1.pdf http://www.vaarttha.com/pages/archives/20/WAR/WAR-2.pdf (the pictures are graphic, viewer discretion advised)
… one thing i didn’t understand is, why they mis-reported that ‘ …the sumo hit a parked DCM… ‘, when the eye witnesses said that both the vehicles were in motion when the accident happened.

Jaya Prakash, 2007-03-08 07:38 PMకి రాసారు.

Comments for ఈమాట

Comment on ఇద్దరు దుర్మార్గులు by PhaNi DokkA

రవికిరణ్ గారూ,

నమస్కారం. నా కథపై మీ అభిప్రాయాలు చెప్పినందుకు కృతజ్ఞతలు.

లక్షణమైన నా తెలుగు పాత్ర “గోపిక” ఉండగా, ఏ బెంగాలీ పాత్రనో అరువు తెచ్చుకోవడానికి నాకు మనస్కరించదు. పైగా, మీరు చెప్పిన శరత్ గారి రాజ్యలక్ష్మి ఎవరో నాకు తెలియదు కూడాను.

సంఘదృష్టితో చూస్తే మోహన్ దుర్మార్గుడిలా అనిపిస్తాడు. కానీ అతనిలోనూ ఆత్మ పరిశీలన వున్నది, మంచీ చెడులని వేరుగా చూడగల విచక్షణ ఉన్నది, అంతర్మధనం వున్నది. కథ దానితోనే మొదలయ్యిందిగా.

సాధారణంగా, మనకేదైనా విషయం అర్థం కాకపోయినా, దాన్ని తెలుసుకోవాలని మనం ప్రయత్నించకపోయినా, ఆ విషయంపై మనకు ద్వేషమూ, వ్యతిరేకతా కలుగుతాయంటారు. మోహన్ కి దీప అర్థం కాలేదు. అతను తెలుసుకోవాలనీ ప్రయత్నించలేదు. అయినా అతనికి ఆమె అంటే గౌరవం, కాస్త భయం ఉన్నాయి, ద్వేషం లేదు.

ఇన్ని బాగుపడే లక్షణాలున్నా, “ఆడదాని చూడ అర్థంబు చూడ..” అన్న చందాన, అతని బలహీనత అతనికుంది.

చెప్పే విధంగా చెబితే, బుర్రకెక్కడానికి నాలుగు మాటలు చాలు. గోపిక ఆ పనే చేసింది, రవ్వంత సమయం, సందర్భం చూసుకుని.

ఏదో నాకు తోచింది చెప్పాను, మిమ్మల్ని ఎల్లాగోల్లా ఒప్పించేసే ఉద్దేశ్యంతో మాత్రం కాదు…ఏదో నా తుత్తి కోసం.

మీ అభిప్రాయాలని గౌరవిస్తూ,
ఫణి డొక్కా.

2007-03-08 07:28 PMకి రాసారు.

నా మదిలో ...

ఈ ఒక్క రోజే వాల్ల "దినం" మిగతా అన్ని 'రోజులూ' మనవే...

ఈ ఒక్క రోజే వాల్ల "దినం" మిగతా అన్ని 'రోజులూ' మనవే ...హ హ హ .... దీన్నే వికటాట్టహాసం అంటారు .... హి హ హ హ హ ..// PS: NO OFFENSE MEANT :) //

Krishna, 2007-03-08 07:13 PMకి రాసారు.

VRDARLA

very nice initiative and congratulations-thelugodu...

very nice initiative and congratulations-thelugodu

F A M U S, 2007-03-08 07:11 PMకి రాసారు.

సంగతులు

భావం బాగుంది. నాకైతే మీ వివరణ చదవక ముందే మీరే ఉద్ద...

భావం బాగుంది. నాకైతే మీ వివరణ చదవక ముందే మీరే ఉద్దేశ్యంలో వ్రాసారో అదే అర్ధమైంది. ఆర్ధిక శాస్త్రం చదవడంవల్ల 'విలువ'లు బాగా అర్ధమవుతున్నాయనుకొంటా. అలా ఉంచేస్తే బాగానే ఉంటుందేమో. మీరు కొత్తగా సూచించిన మార్పు సరిగ్గా అతుకుతోందా? ఒకసారి స్వరంతో అని చూడండి. 'ఆనందం మృగ్యమయిపోతుందా' అంటే ప్రాస, భావం సరిపోతాయేమో పరిశీలించండి.

సత్యసాయి కొవ్వలి, 2007-03-08 07:04 PMకి రాసారు.

Comments for ఈమాట

Comment on రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు by Sai Brahmanandam Gorti

వ్యాస కర్త గారి వివరణ కాస్త దురుసుగా ఉన్నట్లుగా అనిపించిందని నా అభిప్రాయం. ఏ వ్యాసమైనా, కథ అయినా, కవిత అయినా విమర్శ ఉన్నప్పుడే దాని బాగోగులు తేలేది! రచయితలకి తమ తమ రచనలనీ, అభిప్రాయాలనీ, విశ్లేషణనీ, ప్రజల్లోకి తీసుకెళ్ళే స్వేచ్ఛ ఎలా ఉంటుందో, పాఠకులకీ విమర్శంచే స్వాతంత్ర్యం ఉంటుది కూడా! ఈ వ్యాసం బాగోలేదని ఎవరూ ఉటంకించ లేదు. అక్కడక్కడ కాస్త తప్పులు దొర్లాయంతే ! దానికే సవాళ్ళు చేస్తే ఎవరూ ఏమీ చేయలేరు.

2007-03-08 06:59 PMకి రాసారు.

నా మదిలో ...

@కొత్త పాళీ గారు: సినిమాని సినిమాగా చూడడం అలవాటు న...

@కొత్త పాళీ గారు: సినిమాని సినిమాగా చూడడం అలవాటు నాకు. ఎంతో మంది లాగా విమర్శ దృష్టితో చూడటం నాకు పెద్దగా అలవాటు కాలేదు. నేను సినీ జీవితాన్ని, నిజ జీవితాన్ని పోల్చను. అలాగని అది తప్పు అని కూడా కాదు.నాకు సంబంధించినంత వరకూ ఆహ్లాదంగా నడిచే (నా ప్రకారం) ఏ సినిమా అయినా నాకు మంచి సినిమా కింద లెక్కే.తనకింద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమ్మాయిని ఆఫీసులో పదిమంది ముందూ పదే పదే అవమానిస్తూ ఉండటం "విలువ" ఎలా

ప్రవీణ్ గార్లపాటి, 2007-03-08 06:34 PMకి రాసారు.

Comments for పూతరేక్స్

Comment on వృద్దాప్యం? by ప్రసాద్

ఇంకా పోలికలు చాలానే వున్నాయి.

పిల్లలకు పాల దంతాలు వచ్చినట్లే ముసలి వాళ్ళకు కూడా పాల దంతాలు వస్తాయట. ఒకవేళ రాకపోయినా పళ్ళులేని ఇద్దరిదీ బోసినవ్వే!

పిల్లవాడు నడవడం రాక పడుతూ లేస్తూ నడిస్తే వృద్దులుకూడా నడవలేక పడుతూ లేస్తూ నడుస్తారు.

మొత్తం మీద మీరన్నట్లు పసి వారికీ ముసలివారికి పోలికలెన్నో వున్నా వీరి విషయం లో అంతా వ్యతిరేక దిశలో నడుస్తుంది. ప్చ్!

–ప్రసాద్
http://blog.charasala.com

ప్రసాద్, 2007-03-08 06:24 PMకి రాసారు.

Movies

nice.

nice.

Sindhu, 2007-03-08 05:45 PMకి రాసారు.

రుచులు

chicken lo water poyyakunda cooker lo pedithe vudu...

chicken lo water poyyakunda cooker lo pedithe vudukutunda.

Sindhu, 2007-03-08 05:40 PMకి రాసారు.

నా మదిలో ...

మన్మథుడు సినిమా చెత్త అనను గానీ ఇంత పొగడవలసింది కూ...

మన్మథుడు సినిమా చెత్త అనను గానీ ఇంత పొగడవలసింది కూడా ఏమీ లేదనిపించింది. నాకు చాలా చోట్ల బోరు కొట్టింది. కథలో అనేక పాత్రలు చేసే పనుల్లో అలా ఎందుకు చేస్తారో అర్థం కాదు. సినిమాకున్న రెండు హైలైట్స్ మాటల రచయితగా త్రివిక్రం, బంకు సీను పాత్రలో సునిల్. @పారుపల్లి గారు - తనకింద ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అమ్మాయిని ఆఫీసులో పదిమంది ముందూ పదే పదే అవమానిస్తూ ఉండటం "విలువ" ఎలా అవుతుంది సార్? మీరన్నది బహుశా

కొత్త పాళీ, 2007-03-08 05:37 PMకి రాసారు.

Comments for ఈమాట

Comment on భయం! by కొత్తపాళీ

అద్భుతం!
తెలుగులో ఇట్లాంటి ఇతివృత్తంతో కథ నేను చదవలేదు. ఏవో కొన్ని వేట, అడవి కథలు ఉన్నాయి గానీ ఈ కథలోని “వాతావరణమే” వేరు.
మాస్టారూ, ఆ కాస్త ఓపికా చేసుకుని నవలే రాయండి.
కొన్ని చోట్ల ఫుట్ నోట్సు కావాలి. ఉదా: చత్వారీ వాక్పధాలు
చాలా వర్ణనలు బావున్నాయి, కళ్ళకి కట్టినట్టు. కానీ అక్కడక్కడా కొన్ని వాక్యాలు ముందు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో తర్జుమా చేసినట్టు వంకరగా అనిపిస్తున్నాయి.
ఎప్పుడో చాన్నాళ్ళక్రితం ఒక నవల చదివాను. HG Wells రాసింది, పేరు Marriage అనుకుంటా.
అందులో ఒక యువ దంపతులు తమ వివాహాన్ని పటిష్ఠం చేసుకోవటానికి ఇలాగే గ్రీన్లాండ్ టండ్రాలో మూణ్ణేల్లో ఆర్నెల్లో ఉంటారు. విచిత్రమైన కథ.
మీ అభయారణ్యం లింకు పనిచెయ్యడం లేదు. ఈ కథ ఎక్కడ దొరుకుతుంది?

2007-03-08 05:15 PMకి రాసారు.

Comment on రెండు సంగీత సంప్రదాయాల్లో అష్టదిగ్గజాలు by ravikiran timmireddy

సర్వజ్ఞత ఎవరికుంటుంది? ఎవరికీ వుండదు. అందువలన తప్పులుండతం ఎంత సహజవో, తప్పులెన్నటం అంత సహజవే. మన ఆలోచనలు మనలో వున్నంతవరకూ మనవే, ఎవరికీ విమర్శంచే హక్కు లేదు, కానీ అవే బయటకొస్తే, విన్న వాళ్ళకీ చదివిన వాళ్ళకీ అందరికీ తప్పులెతికే హక్కుంది. అందువలన దాంట్లో బలాబలాలు తేల్చుకోవటం ఎందుకండీ? మీరు వ్రాశారు, నచ్చిన మాలాటి నలుగురం చదివి, ఆహా, వోహొ అనుకున్నాం. నచ్చని నలుగురు, ఏవి నచ్చలేదో చెప్పేరు, అంతే కదా, దానికే బాలా బలాలు తేల్చుకునే సవాళ్ళేందుకు సార్.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

2007-03-08 05:03 PMకి రాసారు.

Comment on పునశ్చరణం by ravikiran timmireddy

నిద్రపోతున్న నా కూతుర్ని చూస్తుంటే మళ్ళా, మళ్ళా చూడాలనిపిస్తుంది. నా చేతుల్లో వొదిగిపోయిన ఆ పిల్లేనా, ఈ రోజు నేనెత్తలేనంత ఎత్తుకి ఎదిగిపోయింది అనిపిస్తుంది. చెప్పలేని అధ్భుతవైన భావవొకటి మనసంతా విస్తరిస్తుంది. కాగితం మీద పరచుకున్న ఈ నల్లని నాలుగు మరకలు, మన మన్సులో పుట్టిన, మనలో భాగవే కదూ! మెదడులో వుక్కిరిబిక్కిరగా వున్న ఆ రసాయనిక సమీకరం విచ్చుకున్న రూపవేకదా మన కవితకానీ, కథ కానీ.

చాలా అద్భుతంగా వుందండీ మీ కవిత వైదేహీ శశిధర్ గారు.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

2007-03-08 04:44 PMకి రాసారు.

Comment on ఇద్దరు దుర్మార్గులు by ravikiran timmireddy

కథ వ్రాసిన తీరు బాగుంది. కానీ కథలో వుండాల్సిన భావావేశం పూర్తిగా లుప్థమైపోయింది. గోపిక శరత్ గారి రాజ్యలక్శ్మినో, చంద్రముఖినో కొంచం అరువుతెచ్చుకున్నా, కనీసం వొక పాత్రగా, ఇష్టం, కష్టం, ప్రేమ మొదలైన వుద్వేగాలున్నటువంటి పాత్రగా, మనిషిగా కనిపిస్తుంది. కానీ మొహన్కవేవీ వున్నట్టు అనిపించదు. భార్యంటే గౌరవం, కించిత్ భయం, తప్ప ఎక్కడా ప్రేమ కనిపించదు. గోపిక పట్ల, ఆపుకోలేని నరాల వొత్తిడి తప్ప ఏ మాత్రం ప్రేమ కనిపించదు. గోపిక చెప్పిన నాలుగు మాటలతో మారిపోయిన మోహన్ పాత్ర, చాలా అసహజంగా, చాలా షాలో గా వుంది.

రవికిరణ్ తిమ్మిరెడ్డి

2007-03-08 04:08 PMకి రాసారు.

Comment on భాషా సంబంధ నిరూపణ - భాషాశాస్త్రం 101 by ప్రసాద్

కనక దుర్గ వ్యాసాలు, ఇంకా నాలాంటి సాధారణ వ్యక్తి తర్కానికే నిలవని వ్యాసాలు ఎందుకు ప్రముఖ పత్రికలలో ప్రచురిస్తారో అర్థం కాదు.
మొత్తానికి గడ్డి బాగా పెట్టారు. అలాంటి వాదన ఎక్కడ తలెత్తినా ఇదిగో అంటూ చూపించడానికి మంచి వ్యాసం రాశారు. ధన్య వాదాలు.
వ్యాసానికి మరిన్ని హంగులు దిద్దిన, శోభ చేకూర్చిన ఈ అభిప్రాయమాలకు అభినందనలు.
–ప్రసాద్
http://blog.charasala.com

2007-03-08 03:52 PMకి రాసారు.

Comment on చాదస్తం by JUBV PRASAD

ఈ కధలోని పాత్రధారి ఆ పెళ్ళికి వెళ్ళకపోవడం, రాఘవ తన మాట వినలేదని కాదు. ఒకవేళ రాఘవ ఆవిడ మాటలు విని, సింపుల్ గా గుళ్ళో పెళ్ళి చేసుకున్నా, ఆవిడ వెళ్ళేది కాదు. ఎందుకంటే ఆవిడ నాస్త్రికురాలు. పైపెచ్చు సాంప్రదాయంగానూ, ఆడంబరంగానూ చేసుకునే పెళ్ళిళ్ళకి ఆవిడ వెళ్ళదు. ఆ విధంగా పెళ్ళి చేసుకునేది తన సొంత పిల్లలయినా సరే, ఆవిడ వెళ్ళదు. అదీ ఆవిడ సిద్ధాంతం. ఈ మాటలన్నిటికీ ఈ కధలోనే ఆధారాలున్నాయి. అయితే అటువంటి పెళ్ళిళ్ళు జరిగాక కూడా, ఆ మనుషులు మంచిగా వుంటే, ఆవిడ వారితో సత్సంబంధాలలోనే వుంటుంది. ఈ విషయాలన్నీ పాత్రధారి తన మాటల్లో అంటుంది కధలో.
అప్పుచేసి పప్పు కూడు తినొద్దనడం, అనవసరంగా ఆడంబరానికి పోవద్దనడం సిద్ధాంతం కాదు, కామన్ సెన్సు. అయితే ఈ సమాజంలో వున్న “వ్యక్తిగత” స్వేచ్ఛ కొద్దీ, మనుషులు తమ కిష్టమైనట్టు చేస్తారు.
పెళ్ళిలో భాగస్వామిని ఎన్నుకోవడం మాత్రమే పూర్తిగా “వ్యక్త్రిగతం”, మిగిలిన విషయాలన్నీ కాదు. పెళ్ళిలో చాలా విషయాలు, చాలా మంది మనుషులతో, అంటే, సమాజంతో, ముడి పడి వుంటాయి.
ఆస్తికులు తమ సిద్ధాంతాల మీద ఎంత గట్టిగా వుంటారో, నాస్తికులు కూడా తమ సిద్ధాంతాల మీద అంత గట్టిగా వుంటారు (అర కొర నాస్తికులు కాదనుకోండీ).

ఫ్రసాద్

2007-03-08 03:35 PMకి రాసారు.

సౌమ్య

Comment on K.M.Radhakrishnan by Sriram

రాధాకృష్నన్ శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగా సినిమా సంగీతం చేస్తున్న కొద్దిమందిలో ఒకడు. కొన్ని రాగాలు ఎక్కువగా వాడతారు కానీ మీరన్నట్టు ఇంకోన్ని పాటలు చెయ్యనియ్యండి. its too early to make a judgement.

అన్నట్టు “నింగి నేలకి…” అన్నపాట కూడా శాస్త్రీయ సంగీతం ఆధారమైనదే. హంసానంది రాగంలో ఉంది. సాగర సంగమంలో వేదం అణువణువున…, ఇంకా హాయి హాయిగా ఆమని సాగే… ఈ రాగంలో ఉన్న కొన్ని పాటలు.

Sriram, 2007-03-08 02:50 PMకి రాసారు.

శోధన

అజిత్‌ గారు, మనం చాలా సంస్కృత పదాలని తెలుగు పదాలుగ...

అజిత్‌ గారు, మనం చాలా సంస్కృత పదాలని తెలుగు పదాలుగా మార్చుకున్నది నిజమే. అవి చాలా వరకు కవితల కోసమో పద్యాల కోసమో (పండిత భాషలో) ఉపయోగిస్తాం. ఒకవేళ తెలుగులో ఆ పదానికి సమానమైనది లేకపోతే మనం తప్పక దానిని ఉపయోగిస్తాం. ఉదాహరణకి పువ్వు అన్నది తెలుగు పదం. పుష్పము అంటే మీరన్నట్టు సంస్కృత పదం. మనం ఎప్పుడన్నా పువ్వు అని అంటామే గానీ పుష్పం అనం కదా సాధారణంగా. ఏ కవితల్లాంటి వాటిలోనో వీటిని ఉపయోగిస్తుంటాం. కానీ

శ్రీనివాస, 2007-03-08 02:48 PMకి రాసారు.

Comments for పూతరేక్స్

Comment on వృద్దాప్యం? by radhika

నిజమే.చదవడానికి చాలా సాధారణ విషయాలలానే కనిపిస్తున్నా చదివాకా ఒక్కసారి అత్మావలోకనం చెసుకుంటే బాధగా అనిపించింది.నేను తాతయ్య దగ్గర ఇలాగే ప్రవర్తించేదానిని ఒక్కొసారి. చాలా ఆలోచింపచేసింది నన్ను.

radhika, 2007-03-08 02:45 PMకి రాసారు.