2007-10-18

జ్యోతి

Comment on పాపం పిల్లలు!!!! by Sarath

జ్యోతి,

మీ ఆవేదన నిజం. అందుకే మా పిల్లలమీద అటువంటి భారం పడకుండా చూసుకుంటున్నాను. పిల్లల్లని పిల్లలుగా చూస్తూ వారి బాల్యానికి ఈమాత్రమూ భంగం కలగకుండా చూస్తున్నాను. రాంకులు రావాలనీ ఎప్పుడూ అనను - కాకపోతే మొదటి శ్రేణిలొ వుండమని అప్పుడప్పుడు అంటుంటాను. చదువులో కాకపోయినా తమ కిష్టమయిన ఏదో ఒక రంగంలో మొదటగా వుండాలని ప్రోత్సహిస్తుంటాను. మీరు చెప్పిన కారణాల వల్లనే మా పిల్లలని ఇండియాలో ఏ మాత్రమూ చదివించలేదు. కొద్ది నెలల క్రితం ప్రయోగాత్మకంగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ హైదరబాదులో చేర్పిస్తే అక్కడా అలాగే ఏడ్చింది చదువు రుద్దుడు. ఆ చదువులు చదవలేమంటే పిల్ల్లల పరిస్థితి అర్ధమయ్యి మళ్ళీ యు ఎస్ కి వచ్చాము. ఇక్కడి చదువులు హాయిగా వున్నాయి. మిగతా దేశీలలాగా ఇక్కడ కూడా ర్యాంకులు పెట్టాలని నేను నస పెట్టను కాబట్టి వారికి ఇంకా హాయిగా వుంది. రచయిత చలం అయితే చదువెందుకు అంటాడు - ఏ సంగీతం లాగానో ఇష్టమయిన వాళ్ళే చదువుకోవాలంటాడు.

ర్యాంకులకంటే వాల్ల బాల్యమే ప్రధానమయినది మనం గుర్తించాలి.

శరత్

Sarath, 2007-10-18 11:28 PMకి రాసారు.

రెండు రెళ్ళు ఆరు

Over ki 666666 but Nee Tapa ki 666666666

Over ki 666666 but Nee Tapa ki 666666666

Ravi, 2007-10-18 07:47 PMకి రాసారు.

GGGGGGGGGGGGGGUUUUUUUUUUUUUDDDDDDDDDDD........6666...

GGGGGGGGGGGGGGUUUUUUUUUUUUUDDDDDDDDDDD........666666......

Ravi, 2007-10-18 07:47 PMకి రాసారు.

adirindi guru -- srinivas

adirindi guru -- srinivas

Anonymous, 2007-10-18 07:47 PMకి రాసారు.

గుడ్ వన్... బాగుంది.అగార్కర్ మీద సెటైర్లు బాగా పేల...

గుడ్ వన్... బాగుంది.అగార్కర్ మీద సెటైర్లు బాగా పేలాయి.

ప్రవీణ్ గార్లపాటి, 2007-10-18 07:47 PMకి రాసారు.

తెలుగులో తప్పటడుగులు

కొత్తపాళీ గారు,ప్రచురించే ముందు భోగ్యము, భోజ్యము మ...

కొత్తపాళీ గారు,ప్రచురించే ముందు భోగ్యము, భోజ్యము మధ్య బొమ్మబొరుసా తీరుగా అయ్యింది నా పని. చివరకి మాంఛి అనుభవించ తగ్గ తిండి సుమా అని చెప్పాలని, భోగ్యమని అన్నాను. ఏమంటారు?జ్యోతిగారు,నేను మీ(లాంటి)వాడినే (భాగ్యరాజా ఉవాచ!).. అయినా మాలాంటివాళ్ళు, మీలాంటివాళ్ళు ఏమిటండి, దారుణం :) ఎందులోనో రావుగోపాలరావు అన్నట్లుగా ‘మనందరిదీ ఒకే కులం, బ్లాగులం’ (ఆయన అన్నిది నాయకులం).

Giri, 2007-10-18 08:15 PMకి రాసారు.

Comments for ఊక దంపుడు

Comment on నెనర్లు by vookadampudu

కొత్తపాళీ గారు,
నెనర్లు. గురువు గారి బ్లాగ్‍లో ఈ టపా చూడమని చెబుదామంటే నాకు గూగులమ్మ ఖాతా లేదు.

గిరి గారు,
మీ పద్యం బాగుంది. ఓ సారి చదువరి గారి బ్లాగులో గురులఘువులు చూడండి.
కిరణ్ గారు,
నెనర్లు బయట ప్రపంచం లోకి త్వరలో అదే వెళ్తుంది అని నా నమ్మకం

vookadampudu, 2007-10-18 07:00 PMకి రాసారు.

Comment on వందన శతముల్ by vookadampudu

శ్రీరాం గారు,
బహుకాల దర్శనాలు. వ్యాఖ్య చూసి కొత్తగా ఏమైనా అచ్చువత్తేరేమో అని చూస్తే కనపడలేదు.. అదివారం అగచాట్లలో ప్రశ్నకు సమాధానం, రానారే, నాగరాజు గారి సమస్యలకు పూరణలు ..మీరు చాలానే బాకీ..

వికటకవిగారు,
మీరు చెప్పింది నిజమండీ. .. వాని సములకున్ వద్ద మళ్ళా వాగ్దేవీ అనో వాగ్దానమో , వాక్పటిమ అనో వస్తే తప్ప .. ఆ ప్రవాహం సాగి పోదు..

బ్లాగేశ్వరుడుగారు,
వాగ్దేవి కి , బ్రహ్మ కి , అతని సములైన హరహరులకి,
వాగ్దేవికి సములైన గౌరీలక్ష్మీ లకు, వాగ్దేవికివర పుత్రులన దగిన పండితులకు వందనములు అని భావము..

vookadampudu, 2007-10-18 06:56 PMకి రాసారు.

తెలుగులో తప్పటడుగులు

1. పాట రూప్ తెరా మస్తానా .. చిత్రీకరణ పూర్తిగా నీడ...

1. పాట రూప్ తెరా మస్తానా .. చిత్రీకరణ పూర్తిగా నీడలతో చూపిస్తాడు, అవునా?2. దోసనార గారు చెప్పినదానికి చిన్న కొసరు ప్రముఖనటుల సుపుత్రుల తొలి చిత్రాలివి.3. నటి జయప్రద అనుకుంటున్నా ..అందులో వేటూరి నటించారా? ఏమో తెలీదు.4. దోసనార గారు చెప్పేశారు5. పక్కింటి అమ్మాయి ఏంఓ అనుకున్నా. అందులో చక్రవర్తి సంగీతం మేష్టరుగా కనిపిస్తాడు.6. మొదట "నా హృదయంలో నిదురించే చెలీ" అనుకున్నా. నాగేశ్వర్రావు పియానో

కొత్త పాళీ, 2007-10-18 07:08 PMకి రాసారు.

రెండు రెళ్ళు ఆరు

super... dummuleparu. maro sari mee speciality chu...

super... dummuleparu. maro sari mee speciality chupincharu.

karthik, 2007-10-18 06:57 PMకి రాసారు.

జ్యోతి

Comment on పాపం పిల్లలు!!!! by Budaraju Aswin

చదువు పద్యమందు చాలదా ఓక్కటి

Budaraju Aswin, 2007-10-18 05:19 PMకి రాసారు.

రెండు రెళ్ళు ఆరు

కొత్తగా ఏమని రాయమంటావు భయ్యా..ఇరగదీసావు ఎప్పటిలాగా...

కొత్తగా ఏమని రాయమంటావు భయ్యా..ఇరగదీసావు ఎప్పటిలాగానే.ఈ వారం లో ఇంకో టపా రాయకపోతే నేను పోతాను హిమాలయాలకు.

Sreenivas Kishore, 2007-10-18 06:19 PMకి రాసారు.

Comments for సంగతులూ,సందర్భాలూ….

Comment on పెళ్ళి తీర్చిన సమస్య! by Giri

శ్రీరాం గారు,
బావున్నాయి మీ పద్యాలు..ఒక టపా తీగ కదిలిస్తే డొంక కదులుతోంది మీరు పొందుపరిచిన లంకెల వల్ల, తీరికగా వచ్చి మళ్ళి చదువుతాను. తెనాలిరామకృష్ణుడి మీద మీరు రాసిన టపా కూడా బావుంది. ఆక్కడ ఉంచిన పూరణ నేను రాఘవ గారి సైట్లో ఇంత క్రితమే చూసాను.

ఇవీ, రాఘవగారి పద్యాలూ చదువుతుంటే ఒక పక్క ఆనందము, మరో పక్క తెలుగు పదజాలం పెంచుకోవాలనే ఆత్రమూ కలుగుతున్నాయి. నెనరులు!

గిరి

Giri, 2007-10-18 03:34 PMకి రాసారు.

రెండు రెళ్ళు ఆరు

Baasu... Bangalore auto valla meeda satire keka :)...

Baasu... Bangalore auto valla meeda satire keka :)Kastha frequent ga rayi basoo...

RSG, 2007-10-18 01:41 PMకి రాసారు.

కెవ్వ్, కేక, కత్తి, అరుపులు. చించేశారండీ గురూగారూ,...

కెవ్వ్, కేక, కత్తి, అరుపులు. చించేశారండీ గురూగారూ, ముఖ్యంగా అజీత్ అగార్కర్ యూనిస్ ఖాన్ తో మాట్లాడింది చదివేటప్పుడు ఆఫీసులో వున్నానని కూడా మర్చిపోయి గట్టిగా నవ్వేశాను.

బ్లాగాగ్ని, 2007-10-18 12:58 PMకి రాసారు.

చెప్పాలని ఉంది!

Comment on ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు by శ్రీహర్ష PVSS

కశ్యప్,
అందుకోండి శుభాకాంక్షలు

శ్రీహర్ష PVSS, 2007-10-18 11:42 AMకి రాసారు.

రెండు రెళ్ళు ఆరు

adbhutam! ee postu lo sixerley sixerlu.

adbhutam! ee postu lo sixerley sixerlu.

Anonymous, 2007-10-18 12:05 PMకి రాసారు.

జ్యోతి

Comment on పాపం పిల్లలు!!!! by laitha

జ్యోతి,
ఈ విషయం పై నాకూ టపా రాసేంత ఆవేశం ఉంది.
ఇందులో మనం అందరం భాగస్వాములమే.
కారణం భయం. ఇంజనీరో డాక్టరో కాకపోతే ఇంకేమీ పనికి రాదనే భయం
పరువు పోతుందనే భయం. ఇంక వేరే options తెలియలేనితనం.
ఇక్కడ కూడా వెంటనే కనిపించదు కానీ పోటీ చాలా ఉంటుంది. అయితే జనాభా తక్కువ. ఇక్కడ ఆసియా వాళ్ళూ (అంటే దేశీలు, చైనా దేశీయులు) మా దగ్గర అయితే ఈ పటికే ఇన్ని నేర్పించేశ్తారు, అని ఇంట్లోనే లేడా “కుమోన్” తరగతుల్లోనో వేసేసి నేర్పించెయ్యాలని చూస్తుంటారు. అదీ కుదరక పోతే ముఖ్యంగా తెలుగు వారు పిల్లలను ఇండియాలో పెద్ద వారి దగ్గర ఉంచి అక్కడ బడిలో మూడేళ్ళకే చేర్పించేసి నేర్పించెయ్య్యాలనుకుంటారు.
ఇక మేము ఇళ్ళు కొనేందుకు చూస్తుంటే ఒక realtor ఆ development గురించి చెప్తూ ఇక్కడే ఒక ప్రైవేటు బడి ఉంది. అక్కడ చేరితే తప్పని సరిగా ivy కాలేజీలే అని advertisemnent. ప్రైవేటు పాఠశాల అంటే బోలెడు ఖర్చు. ఇప్పట్నుంచే ఇంత పెడితే రేపు స్కాలర్షిప్పు రాకుంటే మళ్ళీ కాలేజీ ఫీజులు తడిసి మోపెడు అవుతాయే ఎలా అని ఇంకో ఆలోచన. అలా ప్రైవేటు బడిలో చేర్పించినా, ఆ బడికి తగ్గట్టు లేరనిపిస్తే ఎప్పుడైనా యాజమాన్యం వారు తీసెయ్యొచ్చు.
నాకు తెలిసిన ఒకరు రెండేళ్ళకే అక్షరాలు దిద్దించేసి, నాలుగేళ్ళకే 3 digit addition నేర్పించేసి, అయినా ఇంకా ఏమో తక్కువ చేస్తున్నామనుకుంటారు. అమ్మో పోటీ!
ఎక్కడైనా కాని, ఇక్కడ మాత్రం స్నేహం, బంధుత్వం కన్నా పోటీలే ఎక్కువ ఉంటాయి.
ఎందుకిలా? ఎంతమంది ఎన్ని చోట్ల చేరినా ఎన్ని సీట్లు ఉంటాయి? ఎంతమంది విజేతలుంటారు? ఏం సాధిస్తున్నాము? ఎనిమిదో తరగతి నుండే IIT coachinG, దానికి entrance, దానికి coaching…. ఎటు వైపు వెళ్తునాము? ఇలా చేసి ఆ పిల్లాడూ inter కొచ్చి నేను చదవను పో అని మొండికేస్తే వాడ్ని తిట్టడమూ.

laitha, 2007-10-18 10:20 AMకి రాసారు.

Comment on పుణుకులు… by జ్యోతి

ఎవ్వరికీ తెలీదా??

DTS

జ్యోతి, 2007-10-18 09:22 AMకి రాసారు.

Comments for భాగ్యనగరం

Comment on శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో ఉధ్యోగావకాశాలు by mohanrao

i want to know the cell no. of ceo of the sv channel

mohanrao, 2007-10-18 08:40 AMకి రాసారు.

చెప్పాలని ఉంది!

Comment on ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు by వెంకట రమణ

శుభాకాంక్షలు..

వెంకట రమణ, 2007-10-18 08:38 AMకి రాసారు.

చావా కిరణ్

Comment on ఆగిపొయిన గుండెను, by chavakiran

బ్లాగ్ ఈశ్వరా! అది శివలింగ పువ్వు కాదు, ఏదో పక్కింటి వాళ్ళ ఇంటి ముందటి పువ్వు.

chavakiran, 2007-10-18 08:29 AMకి రాసారు.

Comments for 24ఫ్రేములు, 64కళలు

Comment on ఎందుకీ మొసలి కన్నీరు? by viswanath

మీడియా వాళ్లను అనుకోవడమంత తప్పు మరొకటి లేదు.
పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా ఉండకుంటే ఇలాంటి ఇబ్బందులే ఎదురౌతాయి.

viswanath, 2007-10-18 08:28 AMకి రాసారు.

చావా కిరణ్

Comment on ఆగిపొయిన గుండెను, by chavakiran

Here,
On this lonely island,
Under this semi bonsay tree,
On this sand rock,
I am sleeping,
perminantly ?

surrounded by water
sometimes blue
sometimes white in color.

Now,
Somebody trying to wake me up!
Now,
Somebody trying to move me away from this place,
Now,
somebody is throwing rocks on water
which I moved away long ago
with the hope to stay here
with the wish to stay here
alone and serene.
Now,
Somebody is trying to wake me up!

chavakiran, 2007-10-18 08:25 AMకి రాసారు.

తెలుగులో తప్పటడుగులు

చివరి పాదం"ఆకళ్ళను దీర్చు భోజ్యము బకాసుర పూజ్యము మ...

చివరి పాదం"ఆకళ్ళను దీర్చు భోజ్యము బకాసుర పూజ్యము మేగియే కదా" అని ఉండాలి.నాకు వంట బాగా వచ్చు, కానీ హాస్టలు, లాడ్జి వంటి చోట్ల, "ఆకటి వేళల" మేగీయే శరణ్యం. ఎంతంటే, నేనూ, నా స్నేహితులు కలిసి ఏకంగా ఒక Maggi cuisine తయారు చేశాము. జ్యోతి, మీకెందుకంత ఉలుకు? మీరూ మొదలెట్టండి .. కంఠాభరణంలో లాగా .."చింతపండు దెచ్చి రాచ్చిప్పలో వేసి ...":-)

కొత్త పాళీ, 2007-10-18 09:03 AMకి రాసారు.

చెప్పాలని ఉంది!

Comment on ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు by chavakiran

Congrats.

chavakiran, 2007-10-18 07:46 AMకి రాసారు.

Comments for సాలభంజికలు

Comment on ఓ మల్లెతీగె, మరో నల్లపూసా by జ్యోతి

కాబోయే మొగుడు అందరికీ మొద్దబ్బాయైనా మన్మధుడిలానే ఉంటాడండి కొత్తపాళిగారు. కాస్త పాత బడ్డాకే కదా అసలు రంగు తెలిసేది.

శ్రీరామ్..
మా పెద్దలందరమూ కుర్రతనం దాటినా ఆ చాయలు మర్చిపోము కదా. ఈనాటి తరం వారైతే చచ్చీ చెడి ఉద్యోగాలు చేసి అలసిపోతారు ఇక వేరేవి గుర్తుకురావు. మీలాంటివారిని ఉత్తేజపరచడానికి , మీకే తెలుసు అనుకున్న అల్లరులు మేమూ ఒకప్పుడు చేసినవే అని పెద్దలు కూడా కుర్రవాళ్ళవడానికి అప్పుడప్పుడు ప్రయత్నిస్తుంటారు. అయినా వయసు పెరిగేది తనువుకు గాని, మనసుకు కాదుగా….

2007-10-18 07:44 AMకి రాసారు.

Comments for ఊక దంపుడు

Comment on నెనర్లు by chavakiran

ఏందో ఈ బ్లాగులు, ఇప్పుడు నడిచే ట్రెండు పద్యాల ట్రెండు అన్న మాట. :) సినిమాల్లా ఫాక్సన్ ట్రెండు కాకపోవడ్డం సంతోషం. :::)))))

chavakiran, 2007-10-18 07:02 AMకి రాసారు.

Comments for 24ఫ్రేములు, 64కళలు

Comment on ఎందుకీ మొసలి కన్నీరు? by సుధాకర్

టీవి 9 మానసిక దౌర్భాగ్యం మనకు తెలియంది కాదు. “మీరు అక్కడే వుండి గమనిస్తూ వుండండి” ఇదీ వారు స్టూడియో నుంచి లైవ్ లో తమ ప్రతినిధితో చెప్పిన మాటలు. చిరంజీవి వీళ్ళందరి మీద దావా ఎందుకు వెయ్యకూడదు? ఈనాడుకు ఈ వార్త మొదటి పేజీలో వెయ్యాలన్న చెత్త ఐడియా రావటం వారి వార్తల నాణ్యతా పతనాన్నే సూచిస్తుంది. మంచి సమాజం కోసం మంచి మనుషులు, మనసులు మాకు కావాలి. ఈ చెత్త టీవిలు రంగంలోనికి దిగి సమాజాన్ని ఉద్దరించనక్కరలేదు.

సుధాకర్, 2007-10-18 07:00 AMకి రాసారు.

Comments for సృజన - అనుసృజన

Comment on పాఠకుల అభిప్రాయాలు by కొల్లూరి సోమ శంకర్

వికటకవి గారూ, మీ సూచనకి నెనర్లు. నా కథలలో కల్పన జోడింపుని మరింత మెరుగు పరుచుకోడానికి ప్రయత్నిస్తాను.

చిలకపాటి శ్రీనివాసు గారు, మీ వ్యాఖ్యలకు నా ధన్యవాదాలు.

కొత్తపాళీ గారూ, మీ సూచన బాగుంది. వెబ్ జీన్లలో నా కథలు పొస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

చదువరి గారూ, విపులంగా వివరించినందుకు కృతజ్ఞతలు. మీ సూచనల ప్రకరం నా బ్లాగులో కనిపించే టపాల సంఖ్యని కుదించాను. కథలని కూడా రెండు భాగాలుగ పొస్ట్ చేస్తాను. సొంత కథ రాసిన నేపథ్యం, అనువాద కథతో పాటు ఆ భాషలో ఆ రచయిత, ఆ రచనల కున్న విశిష్టతల గురించి కూడా కొద్దిగా రాస్తాను. మీ సూచనలు నాకు ఉపయోగపడతాయి.

అరుణ గారూ, మీ అభిప్రాయం తెలుసుకున్నాక సంతోషం కలిగింది.thank you

విజయ కుమార్ గారూ, మంచి టానిక్ లాంటి వ్యాఖ్య రాసి నాకు ప్రొత్సాహాన్న్నిచ్చారు. కృతజ్ఞతలు.

కొల్లూరి సోమ శంకర్, 2007-10-18 06:45 AMకి రాసారు.

Comments for ఊక దంపుడు

Comment on వందన శతముల్ by Sriram

అయ్యా…ఊక కోసమొస్తే ఎక్కడా కనపడదే! రెండు పద్యాలూ బాస్మతీ గింజల్లా మెరుస్తున్నాయి!

Sriram, 2007-10-18 06:41 AMకి రాసారు.

Comments for సాలభంజికలు

Comment on ఓ మల్లెతీగె, మరో నల్లపూసా by Sriram

అడగందే ఎవరూ పెట్టరు కానీ అడగగానే ఇంత మంచి విందు చేస్తారనుకోలేదు. మీ ఇంటి అన్నపూర్ణ చేతి ఆవుపాల జున్ను గుర్తొచ్చింది.

ఐనా ఈ మధ్య ఇలా పెద్దలందరూ కుర్రతనంలోకొచ్చెస్తుంటే మా సంగతేంగానూ!

నాగరాజుగారూ, మీరు భోజరాజులుంగారిలాగా “పుష్పం పుష్పేణ శోభితం” లాంటి సంస్కృత సమస్యలు సంధిస్తే నా బోటి రామలింగాలు ఏం గావాలి! మన బ్లాగులోకంలో కాళిదాసు లెవరైనా ఉన్నారేమో మరి చూడాలి!

2007-10-18 06:36 AMకి రాసారు.

Comments for సృజన - అనుసృజన

Comment on పాఠకుల అభిప్రాయాలు by వింజమూరి విజయకుమార్

నేనూ మీలానే కథలూ, కాస్త కష్టతరమైన వ్యాసాలూ రాసే రచయితనే. కానీ, నా ప్రకారం పాఠకులు ఎప్పుడూ ఉంటారు. కాకుంటే, మామూలు పోస్ట్ ల కున్నంత సంఖ్యలో వుండకపోవచ్చు. కానీ, చదివినవారు ఒక్కరైనా కామెంట్ మీకు యివ్వకపోయినా మీరు వాళ్ల మనసులో ముద్రించుకుపోయి వుంటారు. గంగిగోవు పాలు గరిటెడైనను తరహాలో. . .ఆ ఒక్కరు చాలదూ మనకి? ఉదాహరణకి నా బ్లాగులో నేను జీనో పేరడాక్సులు-పూర్వపక్షం వ్యాసం నాలుగు టపాలుగా నాలుగు రోజులు రాసాను. రీడర్లు తక్కవే. కానీ, నాల్గవ భాగంలో ఒకే కామెంట్ వచ్చింది. మనసు, కడుపు అంతా నిండిపోయింది. వేసుకోండి వీరతాళ్లు అన్నాడు ఆ వ్యాఖ్యాత. కష్టం అంతా మర్చిపోజేసిన ఒకే ఒక్క వ్యాఖ్య. ఏమంటారు? ఆపవద్దు. కొనసాగించండి కథలు.

వింజమూరి విజయకుమార్, 2007-10-18 06:24 AMకి రాసారు.

రెండు రెళ్ళు ఆరు

బాసూ, మొత్తానికి లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చారు...

బాసూ, మొత్తానికి లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చారు కదా, ఈ T20 మ్యాచ్ మీ శైలిలో అదరగొట్టేసారు, ముఖ్యంగా అజిత్ అగార్కర్ మీద జోక్ అదుర్స్...

Srinivas Ch, 2007-10-18 07:16 AMకి రాసారు.

Comments for 24ఫ్రేములు, 64కళలు

Comment on ఎందుకీ మొసలి కన్నీరు? by చదువరి

మీరు మన టీవీ చానెళ్ళ గురించి సరిగ్గానే ఊహించారు. రాత్రి ఇంటికి పోయాక “టీవీ ఐదు” (కొత్తగా వచ్చిందిలెండి) పెట్టానండి. ‘పాపం చిరంజీవిని ఇతర టీవీ వాళ్ళు ఎంత క్షోభకు గురిచేసారో చూడండం’టూ జనాల చేత చెప్పించారు. ఓ గంట పైగా సాగింది. తోటి ఛానెళ్ళకు వ్యతిరేకంగా చెప్పించి పబ్బం గడుపుకుందామన్న ఆ సిగ్గులేని ఆలోచన మనకు చూడగానే తెలసిపోయింది. (మాకా పెళ్ళి ఫుటేజి ముందే అందినప్పటికీ పద్ధతి గాదని చూపించలేదు అని చెప్పుకున్నారు. కానీ అదే పెళ్ళికి సంబంధించిన వివాదాన్ని సొమ్ము చూసుకోవాలన్న చవకబారు ఆలోచన మాత్రం తేటతెల్లంగా తెలిసింది.) ఓ సినిమాలో బ్రహ్మానందం, ఏవీఎస్ ల కామెడీ ఉందండి.. ఏవీఎస్ బ్రహ్మానందం పెళ్ళాన్ని పొరపాటున వాటేసుకుంటాడు. దానికి తెగ ఫీలై పోతూ బ్రహ్మానందానికి సారీలు చెబుతూ నిదరపోనీయడు. తన పెళ్ళాన్ని వాడు వాటేసుకున్నాడన్న బాధ కంటే వాడు దాన్ని పదేపదే తిరగతోడ్డంతో బ్రహ్మానందానికి చిర్రెత్తుకొస్తుంది. టీవీ 9 వాడి హడావుడి సంగతేమో గానీ, టీవీ ఐదు వాళ్ళ వెకిలిచేష్టలు మాత్రం తలనెప్పి తెప్పించి ఉండాలి, సంబంధీకులకి. మొత్తానికి ఈ చానెళ్ళ యుద్ధం నిన్న మంచి వినోదమే పంచింది.

చదువరి, 2007-10-18 06:05 AMకి రాసారు.

Comments for ఊక దంపుడు

Comment on రామం మిధ్య - నామం మిధ్య by చంద్ర శేఖర్ కాండ్రు

మాష్టారూ నేను కామ్రేడ్‌ని కాను, తెలుగువాడ్ని.

చంద్ర శేఖర్ కాండ్రు, 2007-10-18 05:34 AMకి రాసారు.

రెండు రెళ్ళు ఆరు

T20 కప్పు ప్రత్యక్ష పసారం, మరియు ముఖ్య ఝటనలు మీశైల...

T20 కప్పు ప్రత్యక్ష పసారం, మరియు ముఖ్య ఝటనలు మీశైలి లొ బాగా చూపించారు.

బ్లాగేశ్వరుడు, 2007-10-18 06:09 AMకి రాసారు.

Comments for సృజన - అనుసృజన

Comment on పాఠకుల అభిప్రాయాలు by Aruna Gosukonda

Ayyo..
I read almost all your stories.
All of them are good.
I feek lazy to write comments.
Please dont stop writing. Meekosam miru cheyyanDi. naalanTi vaallu kuDa pani lo pani ga anandistaaru.[:)]

Aruna Gosukonda, 2007-10-18 04:53 AMకి రాసారు.

తెలుగులో తప్పటడుగులు

ఇది చాలా దారుణం. ఇలా అందరూ పద్యాలు రాసేస్తుంటే మాల...

ఇది చాలా దారుణం. ఇలా అందరూ పద్యాలు రాసేస్తుంటే మాలాంటివాళ్ళు ఏం కావాలి...పద్యాలు రాయడానికి పనికిరాని విషయమే లేనట్టుంది మన బ్లాగర్లకి. విహారి కూడా రాస్తాడంట. బాబోయ్!!!!

జ్యోతి, 2007-10-18 05:12 AMకి రాసారు.

చెప్పాలని ఉంది!

Comment on ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు by ‌వెన్నెల

Happy Married Life…
:-)

‌వెన్నెల, 2007-10-18 04:10 AMకి రాసారు.

జ్యోతి

Comment on పేద్ద తప్పు!!!!!!!!! by Medha

Even I heard of this, some months back.. Before vodafone enters into India also the site is working…!

Medha, 2007-10-18 03:18 AMకి రాసారు.

Comments for సృజన - అనుసృజన

Comment on పాఠకుల అభిప్రాయాలు by చదువరి

బ్లాగు భౌతికాంశాల ఆధారంగా కొన్ని సూచనలు..
1. మీ బ్లాగు హోమ్ పేజీకి వెళ్ళాననుకోండి.. దాదాపు పది జాబులు లోడవుతున్నాయి; కాస్త ఎక్కువ సమయం తీసుకుంటోంది. ముందే ఒక్కో జాబూ పెద్దదిగా ఉంటుంది, పది జాబులు పేజీకెక్కాలంటే కాస్త ఎక్కువ సమయమే పడుతున్నది. వాటిని ఏ రెండుకో మూడుకో తగ్గించండి.
2. పెద్ద కథలను భాగాలుగా విడగొట్టి, జాబు పరిమాణాన్ని ఒక పరిమితిలో ఉంచండి. చదివేందుకు వీలుగా ఉంటుంది. అంతంత పెద్ద పెద్ద కథలను ఏకబిగిన - అందునా తెరమీద - చదవాలంటే కాస్త ఇబ్బందండి.

ఇక జాబు విషయానికి సంబంధించి..
1. గతంలో రాసిన కథలను తిరిగి ఇక్కడ పెడుతున్నారని అనుకుంటున్నాను. ఆ కథ రాసిన నేపథ్యం లాంటివి రాస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. (నాకు అసలు కంటే ఇలాంటి కొసర్ల మీదే ఆసక్తి ఎక్కువ లెండి)
2. అనువాదాలు చేస్తున్నారు గదా.. కథతో పాటు ఆ భాషలో ఆ రచయిత, ఆ రచనల కున్న విశిష్టతల గురించి కూడా కొద్దిగా రాయండి.

నా బ్లాగులో వ్యాఖ్యల డబ్బా లోడు కావడానికి ఏడుస్తోందని చదువరులు చెబితేనే నాకు తెలిసింది. ఇవీ మీకు ఉపయోగపడతాయని ఆశిస్తాను.

చదువరి, 2007-10-18 03:17 AMకి రాసారు.

Comment on పాఠకుల అభిప్రాయాలు by కొత్తపాళీ

కథలు పంచుకోడానికి బహుశా బ్లాగుల సరైన వేదిక కాదేమో.
ఒక సగటు బ్లాగుని అలవోకగా చదివేస్తాం. ఏమన్నా చెప్పాలనిపిస్తే ఓ రెండు ముక్కలు చెబుతాం వ్యాఖ్యలో. కథలకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ అలాంటీది కాదు. అందులో మీవి కొంచెం సీరియస్ కథలు కదా. మీరు వెబ్-జీన్లమీద దృష్టిపెడితే బెటారేమో, బ్లాగులో వెయ్యటం కంటే.

కొత్తపాళీ, 2007-10-18 02:34 AMకి రాసారు.

చదువరి

మంచి పాయింటు లేవదీశారు నవీన్. మీ తోటి వారిని కూడగట...

మంచి పాయింటు లేవదీశారు నవీన్. మీ తోటి వారిని కూడగట్టుకుని ఒక voters' club ఎందుకు మొదలు పెట్టకూడదు?

కొత్త పాళీ, 2007-10-18 02:05 AMకి రాసారు.

యేళ్ళ నుంచి రాజకీయ రాబంధుల కబోధి పాలనలో విలవిల లాడ...

యేళ్ళ నుంచి రాజకీయ రాబంధుల కబోధి పాలనలో విలవిల లాడుతున్న సమాజాన్ని చూసి చూసి, అసహ్యం పొంది..కెరటాల్లా ఎగసి పడుతున్న బాధను వరుసపెట్టి టపాలల్లో వ్రాస్తున్నారు.."చాలా సంతోషం" అని వ్రాయలేను. సమస్యను వివరించడం సగం పని మాత్రమే. దానికి మనం ఏమి చేయగలమో ఆలోచించగలిగితే??నాకైతే ఏ ఉద్యోగం మానేసి..కౌన్సిలరుగానో చైర్మెనుగానో పోటీ చేసి..రాజకీయాలు ఊరులో లేకుండా చేసి ఆదర్శ పట్టణంగా మారుస్తాం అన్న ఆవేశం వస్తుంది.

నవీన్ గార్ల, 2007-10-18 01:42 AMకి రాసారు.

2007-10-17

చెప్పాలని ఉంది!

Comment on ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు by రాజశేఖర్

శుభాకాంక్షలు కశ్యప్ గారు :)

రాజశేఖర్, 2007-10-17 11:28 PMకి రాసారు.

2007-10-18

విహారి.

త్వరగా ఆ పద్యాలేవో నేర్చుకొని పద్యాలతో పాటుగా పద్య...

త్వరగా ఆ పద్యాలేవో నేర్చుకొని పద్యాలతో పాటుగా పద్యాలు నేర్చుకోవడమెలా అనే టపాను కూడా వ్రాయండి. నాకు కూడా వాతలు పెట్టుకోవాలని చాలా సరదాగా ఉంది.

వెంకట రమణ, 2007-10-18 12:25 AMకి రాసారు.

2007-10-17

నా బ్లాగు, నా సోది, నా నస.

సెప్టెంబరు నెల మొదట్లో రాకేశ్వరుడి బ్లాగులో వ్యాఖ్...

సెప్టెంబరు నెల మొదట్లో రాకేశ్వరుడి బ్లాగులో వ్యాఖ్య రాస్తూ "అమెరికా తెలుగు కథ" చదువుతున్నానని సెలవిచ్చారు. చదవటం పూర్తయిందా? నాకు కొంచెం కుతూహలంగా ఉంది - వీలుచూసుకుని నా ఈ ప్రశ్నలకు జవాబులివ్వగలరు:1. మీకు ఈ పుస్తకం ఎలా వచ్చింది? ఎవరైనా ఇచ్చారా?2. ఒకవేళ మీరే షాపులో కొన్నట్టైతే ఇది కొనాలని మీకెందుకు అనిపించింది?3. తుపాకి అనే కథ చదివారా? ఎలా ఉంది?4. మీకు బాగా నచ్చిన కొన్ని క్థల గురించి చెప్పండి.

కొత్త పాళీ, 2007-10-17 11:10 PMకి రాసారు.

చదువరి

ఆయనెవరో ఆ కాలంలో సాహిత్య మరమరాలు వడ్డించారు. ఈనాటి...

ఆయనెవరో ఆ కాలంలో సాహిత్య మరమరాలు వడ్డించారు. ఈనాటి మీ ఈ రాజకీయ మరమరాలు మాంఛి ఘాటుగా ఉన్నాయి.

కొత్త పాళీ, 2007-10-17 10:41 PMకి రాసారు.

Comments for 24ఫ్రేములు, 64కళలు

Comment on ఎందుకీ మొసలి కన్నీరు? by chaitanya

there is no point to feel bad about chiru or the little girl

if teh same case happens to a normal family no one cares and this stupid people strt talking daily and there is no point to feel bad about chiru
hehhehe

i think chiru is positive towords love only in his films but against in his real life

love is different in reel and in real……….

chaitanya, 2007-10-17 09:39 PMకి రాసారు.

Comment on ఎందుకీ మొసలి కన్నీరు? by chaitanya

press and media is a business
nothing social nothing charitable only money

there are people against a person who want to elavate a matter
at the same time there are many to support a false statement or a wrong thing for their own profit.

when u compare chirus issue and balakrishna’s case
we can get the clear picture

chaitanya, 2007-10-17 09:39 PMకి రాసారు.

Comments for సాలభంజికలు

Comment on ఓ మల్లెతీగె, మరో నల్లపూసా by నవీన్ గార్ల

మాంచి పుస్తకంలో చాలా ఆసక్తికరమైన పేజీలు చదువుతున్నట్లు ఉంది. మిగతా పేజీలకోసం ఎదురు చూస్తాం.

2007-10-17 09:17 PMకి రాసారు.

విహారి.

అభీష్టసిద్ధిరస్తు

అభీష్టసిద్ధిరస్తు

కొత్త పాళీ, 2007-10-17 09:30 PMకి రాసారు.

చదువరి

చదువరి గారు, నిజం చెప్పినారు, సూక్ష్మముగా, రాజకీయా...

చదువరి గారు, నిజం చెప్పినారు, సూక్ష్మముగా, రాజకీయాన్ని కాసి వడపోసినట్లు ఉంది మీ టపా.-మరమరాలు

మరమరాలు, 2007-10-17 09:19 PMకి రాసారు.

విహారి.

అచ్చం నాకూ ఇలాంటి అవేశమే వచ్చింది. కానీ ప్రస్తుతం ...

అచ్చం నాకూ ఇలాంటి అవేశమే వచ్చింది. కానీ ప్రస్తుతం వాతలు తట్టుకొనే శక్తిలేదేమోనని కాస్త తమాయించుకున్నా. ఆల్ ద బెస్ట్.

తెలుగు వీర, 2007-10-17 09:14 PMకి రాసారు.

చెప్పాలని ఉంది!

Comment on ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు by కందర్ప కృష్ణమోహన్

(ఏంటో పిల్లలందరూ పెద్దలైపోతూనే ఉంటారు..ఒక్క క్షణమాగదు కదా సమయం..)
కశ్యపులవారికి బెస్టాఫులక్కూ..

కందర్ప కృష్ణమోహన్, 2007-10-17 08:09 PMకి రాసారు.

Comments for పూతరేక్స్

Comment on అన్న బ్లాగాడోచ్…… by నవీన్ గార్ల

నేను అడిగిన వెంటనే మీరు శ్రమపడి తెలుగు పరిశ్రమకు సంబంధించిన ప్రశ్నలు అడిగినందుకు నిజంగా చాలా సంతోషం అయ్యింది. ప్రశ్నలు తయారు చెయ్యడం ఎంత శ్రమో నాకు తెలుసు. మీరు టపాయించిన టపాలు చూస్తున్నాను. వాటికి సమాధానం ఇవ్వకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి.
౧. నాకు వచ్చిన ప్రశ్నలకు జనాలు ఇది వరకే జవాబు ఇచ్చి ఉండటం
౨. నాకు ఇక్కడ అబూధాబిలో పిచ్చ పిచ్చగా పని వచ్చి పడింది. పచ్చిగా చెప్పాలంటే..పది మంది కలసి….@#$%…చేసినట్టుంది :( …నాకిష్టమైన వికీలో ఒక వ్యాసం వ్రాసి రెండు నెలల పైన అయిపోయిందంటే నమ్మండి.
కానీ మీ ప్రశ్నల ప్రవాహాన్ని అలా ప్రవహింపజేస్తూండండి..దాహం తీర్చుకోవడానికి తప్పకుండా వస్తాను :)

..ఇక్కడికి వచ్చి మరొక్కసారి గుర్తుచేసినందుకు ఇంకా సంతోషం (నన్ను గుర్తెట్టుకున్నారుగా మరి:)

నవీన్ గార్ల, 2007-10-17 07:20 PMకి రాసారు.

చెప్పాలని ఉంది!

Comment on ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు by నేనుసైతం

శుభాకాంక్షలు మిత్రమా!
–నేనుసైతం

నేనుసైతం, 2007-10-17 07:04 PMకి రాసారు.

Comments for సాలభంజికలు

Comment on ఓ మల్లెతీగె, మరో నల్లపూసా by నేనుసైతం

మాష్టారూ! అద్భుతం. మీ అనుభవాలు, మీరు చెప్పిన విధానము ఎంతో బాగున్నాయి. మీరు కొంచం తీరిక చేసుకొని మరిన్ని టపాలు వ్రాయాలని మా కోరిక.

రాధిక గారూ! గురువు గారు,కొత్తపాళీ గారి మాట వింటున్నారా :)

2007-10-17 06:58 PMకి రాసారు.

తెలుగులో తప్పటడుగులు

ఇప్పుడు హాయిగా ఉందండి చదువుకోటానికి. :-)

ఇప్పుడు హాయిగా ఉందండి చదువుకోటానికి. :-)

వికటకవి, 2007-10-17 07:47 PMకి రాసారు.

Comments for సాలభంజికలు

Comment on ఓ మల్లెతీగె, మరో నల్లపూసా by ప్రవీణ్ గార్లపాటి

భలే ఆహ్లాదంగా రాశారు మీ అనుభవాలు…

2007-10-17 05:53 PMకి రాసారు.

Comments for ఊక దంపుడు

Comment on నెనర్లు by Giri

ఆ. బాగు బాగు పద్య మాల నెనరులు ,తా
బాసు గురువు *గారు బాగుగ తమ
సాలెగూటిలోన జాబితా పెట్టగా
అనవసరము చేయ ఆంగ్లపలుకు

*మొదట బావుంటుంది కదా అని తాబాసు బాసు అని రాసాను..తెలుగు వాడుక పెంచడానికి జరుగుతున్న కృషి గురించి రాస్తూ ఆంగ్లమెందుకులే అని (వికటకవిగారు ఎలాగూ ఎత్తిచూపుతారని :) తలచి, గురువు గారు గా మార్చాను.

Giri, 2007-10-17 05:42 PMకి రాసారు.

Comments for ఊహా ప్రపంచం

Comment on నా గురించి by naveen achari

సమాధానం ఇవ్వడం చేతగాక అభిప్రాయాల్ని తఒలగించే ఈ పెద్దమనిషి విమర్షలు రాయండి అనడం ఒక కాకమ్మ కథ.

naveen achari, 2007-10-17 05:23 PMకి రాసారు.

Comment on తెలంగాణ by naveen achari

ఇక్కడ ఇచ్చిన నా అభిప్రాయాన్నిఈ మేధావి రచయిత గారు సమాధానమివ్వడ0 చేతగాక తొలగించారు.

జై తెలంగాణ…!!

నవీన్ ఆచారి.

naveen achari, 2007-10-17 05:20 PMకి రాసారు.

Comments for సృజన - అనుసృజన

Comment on పాఠకుల అభిప్రాయాలు by Chilakapati Srinivas

Don’t worry about the lack for comments. Pl. continue to write. You are doing a good job in translations and the original ones also are good.

Chilakapati Srinivas, 2007-10-17 05:17 PMకి రాసారు.

Comments for ఈమాట

Comment on పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? by Rohiniprasad

ఈ రోజుల్లో పుస్తకాలు చదవడమే తగ్గిపోయింది. తెలుగూ అంతే. మా కొలీగ్ ఒకమ్మాయికి నేను ఎవరి గురించో “మితభాషి” అంటే అదేమిటో అర్థం కాలేదు! ఈ పరిస్థితుల్లో క్లాసిక్స్ చదవడం మరీ అరుదైన విషయం. నా లెక్కన అటువంటివి చదివినవారు మంచి విషయాలను తేలిక భాషలో విశదపరుస్తూ వ్యాసాలు రాసి సామాన్యపాఠకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తే బావుంటుంది.

ప్రాచీన తెలుగు సాహిత్యం తమకు బాగా తెలుసునని తిరిగే చాలామంది ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం సంపుటాలను గుట్టుగా చదివి నేర్చుకుంటూ ఉండడం నా చిన్నప్పుడే గమనించాను. ఇప్పుడు ఆ సంపుటాలను చదివేవారే కరువవుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇలా ఒకవంక “క్వాలిటీ” పలచబడుతూ ఉన్నప్పటికీ గాఢమైన ఆసక్తి ఉన్నవాళ్లు మటుకు ఎప్పటికప్పుడు ఒకటీ అరా తయారవుతూనే ఉన్నారు. తక్కిన పాఠకులకు వారే “కళ్ళూ, చెవుల” రూపంలో పనిచెయ్యాలి. అలా జరిగితే కనీసం చర్చించటానికైనా కొందరు మిగులుతారు. పరుచూరి శ్రీనివాస్ వంటి వారి బాధ్యత అదే.

2007-10-17 05:13 PMకి రాసారు.

Comments for తెలుగు సాహిత్యం

Comment on సాహిత్యం by కొత్త పాళీ

మీరెందుకు కొత్త టపాలు రాయడంలేదు?

కొత్త పాళీ, 2007-10-17 04:43 PMకి రాసారు.

Comments for ఊక దంపుడు

Comment on నెనర్లు by కొత్త పాళీ

చివరి పాదం చాలా బాగా వచ్చింది. అభినందనలు. ఇంతకీ గురువ్గారు చూశారో లేదో?

కొత్త పాళీ, 2007-10-17 04:17 PMకి రాసారు.

చెప్పాలని ఉంది!

Comment on ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు by dnchari

అభినందనలు…..మా సమూహానికి స్వాగతం.

dnchari, 2007-10-17 04:13 PMకి రాసారు.

Comments for ఊక దంపుడు

Comment on వందన శతముల్ by బ్లాగేశ్వరుడు

త్రిప్రాస తో భలేగా ఉంది పద్యం.
వాగ్దేవీసమనేత్రుల అనగా ఈ అర్భకుడికి అర్థముఁగాలేదు. భావం మాత్రమే తెలిసింది.

బ్లాగేశ్వరుడు, 2007-10-17 04:06 PMకి రాసారు.

చెప్పాలని ఉంది!

Comment on ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు by కొత్త పాళీ

@జ్యోతి - “కశ్యపా! ” ???
ఇదేంటి, ఇది నా పేటెంటు సంబోధన .. మీరు హైజాక్ చేస్తే యెలా? :-)

కొత్త పాళీ, 2007-10-17 03:46 PMకి రాసారు.

Comments for సృజన - అనుసృజన

Comment on పాఠకుల అభిప్రాయాలు by వికటకవి

మీ అభిప్రాయ సేకరణ బాగుంది.మీ కథల్లో వాస్తవాలు ఎక్కువ, కొంచం కల్పన జతచేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. అంటే నిజం అక్కర్లేదా మీకు అనకండి. కాస్త ఆ రసం కూడా జోడిస్తే బాగుంటుందని, అంతే. :-)

వికటకవి, 2007-10-17 03:33 PMకి రాసారు.

తెలుగులో తప్పటడుగులు

గిరి..మీ ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇచ్చాను:http://gsn...

గిరి..మీ ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇచ్చాను:http://gsnaveen.wordpress.com/2007/09/19/anna_blaagaadu/#comment-529

నవీన్ గార్ల, 2007-10-17 04:22 PMకి రాసారు.

చావా కిరణ్

Comment on ఆగిపొయిన గుండెను, by teresa

అర్థం కాలేదు :(

teresa, 2007-10-17 02:10 PMకి రాసారు.

Comments for ప్రాణహిత

Comment on కలమ్మ కలకలం by vageeshan

Subhadra garu keep it up,
This yor second story red by me on women sarpanches from dalith background from you. I hope more stories in this genre from you. It seems a real world experiance dramatised.
There are many missing links in the story. what was the Response of Dora for kalama taking things on her own.
But any way Kalamma might have taken the decission to go to station keeing the emergency nature of the case. readers with poistive conciousness will be happy to see kalamma going to police Station.kalammas strength lies in many factors some eloboration of them would have been done in the story. Content of story need some more sharpening.
what if SP was not cooperative? any way this question may not be of very serious use.
The language part of your story is wonderful. Your narration is gripping with number of proverbs generally used in telangan daily lingo of common people.

But said this much
keep It Up

vageeshan, 2007-10-17 12:47 PMకి రాసారు.

పైకిబ్లాగులువ్యాఖ్యలువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుenglishసేకరణలు