2013-07-07
Featuresindia.com RSS Feed: లాభాల బాటలో సెన్సెక్స్
Featuresindia.com RSS Feed: అమల్లోకి నూతన ఔషధ ధర
ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: అమెరికాలో ప్రయాణికుల విమానం క్రాష్ ల్యాండింగ్ -ఫోటోలు
ముఖ్య వార్తలు: (శీర్షిక లేదు)
TDP News: కోదండరాం తెలంగాణ ద్రోహి : ఎర్రబెల్లి
TDP News: టీడీపీలో వేధింపులకు చోటు లేదు: బాబు
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ఉచిత పధకాల ఖర్చు మోయలేం బాబోయ్! -కార్టూన్
2013-07-06
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ఇళవరసన్ ది హత్యా, ఆత్మహత్యా? -తొలగని అనుమానాలు
Lok Satta News: విద్యార్థులకు పాఠాలు బోధించిన ఎమ్మెల్యే
Lok Satta News: ముండే ఉదంతాన్ని ఎన్నికల సంస్కరణలకు అవకాశంగా ఈసీ ఉపయోగించుకోవాలి: జేపీ లేఖ
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ఈజిప్టులో మిలట్రీ ప్రజాస్వామ్యం -కార్టూన్
Manyaseema.com RSS Feed: వేర్వేరు ఘటనల్లో పధ్నాలుగు మంది మృతి
ఖమ్మం: రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో శనివారం జరిగిన వేర్వేరు ఘనటల్లో పధ్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం
2013-07-05
Manyaseema.com RSS Feed: నిర్జల ఘటం... లేనిదే సాగదు గమనం!
నిల్వచేసిన రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేందుకు ఉపయోగించే సాధనాన్ని విద్యుత్ ఘటం లేదా బ్యాటరీ అంటారు. ఈ ఘటాలను
జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్: గుజరాత్ పోలీసు సాక్ష్యంలో మోడి పేరు
24 గంటలు: ఇవేమి రిజర్వేషన్లు బాసూ..!
2013-07-02
24 గంటలు: స్థానిక ఎన్నికల తర్వాత విభజనపై తీర్మానం
2013-07-01
24 గంటలు: స్పీడ్ పెంచిన సీమాంధ్ర నేతలు
24 గంటలు: కాంగ్రెస్ లో కలకలం రేపిన డిగ్గీరాజా
2013-06-30
24 గంటలు: శైలజానాథ్ అయినా మాట మార్చాల్సిందేనట!
24 గంటలు: కేవలం వాళ్లే అడ్డుపడుతున్నారట!
2013-06-08
ప్రజాశక్తి: సానియాది కాదు నల్లేరుపై నడత 'ఎగైనెస్ట్ ఆల్ ఆడ్స్'
2013-05-22
ప్రజాశక్తి: వందేళ్ళ చరిత్రంటే పాటలు, డాన్స్‌లు కాదు
2013-05-16
ప్రజాశక్తి: మోసకారి కంపెనీలతో జాగ్రత్త..
2013-05-15
ప్రజాశక్తి: ఢిల్లీ గ్యాంగ్‌రేప్ నిందితుడిపై విషప్రయోగం?
ప్రజాశక్తి: ఈ వలలో పడకండి!
2012-03-07
Mulakkada. Latest Blog Articles From Telugu News: సినిమాలను పైరసీ చేసే యంగ్ హీరో
సినిమాలను పైరసీ చేసి అమ్మటం నేరం... అలాగే సినిమా వాళ్ళకు పైరసీ చేసేవాళ్లంటే మహా ...
Mulakkada. Latest Blog Articles From Telugu News: జగన్ హవా తగ్గుతోంది: జెసి
జగన్ హవా తగ్గుతోంది,కడపలో ఉన్నంత ఉండదు: ...
2012-02-03
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారి అరెస్ట్
ఫోర్జరీ పత్రాలతో 70 కిలోల బంగారాన్ని లోన్‌గా తీసుకుని ఓ బ్యాంక్‌కు కుచ్చుటోపీ పెట్టాడన్న ఆరోపణలతో సంజయ్ అగర్వాల్ అనే వ్యాపారిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కోఠిలోని ఓ జ్యూయెలరీ దుకాణం యజమాని సంజయ్ అగర్వాల్ 2010వ సంవత్సరం అక్టోబర్ నెలలో నాలుగు దఫాలుగా గోల్డ్‌ను లోన్‌గా తీసుకున్నాడు. నిందితుడు ఫేక్ బ్యాంక్ గ్యారెంటితో ఈ లోన్ తీసుకున్నాడు. ఇతను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో అకౌంట్ మెయింటెన్ చేస్తున్నాడు. ఆ డాక్యుమెంట్లు చూపించి ఎస్‌బిఐలో ఆయన ఈ లోన్ పొందాడు.
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: నేడు ఆసీస్ తో రెండో టి20 మ్యాచ్
దెబ్బ మీద దెబ్బతో కుంగిపోయిన టీమిండియా నేడు మరో పోరాటానికి సిద్ధమవుతోంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మెల్బోర్న్లో మొదలయ్యే చివరి, రెండో టి-ట్వంటీ మ్యాచ్లో అయినా ఆసిస్ను ఓడించాలనే లక్ష్యంతో ఉంది భారత్. అంతేకాకుండా బలహీనంగా ఉన్న బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేసే ఆలోచనలో ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్ర ఒత్తిడిలో భారత్ బరిలోకి దిగుతోంది. శుక్రవారం ఎమ్‌సీజీ మైదానంలో జరిగే రెండో టి20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది.
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: టిటిడికి వ్యతిరేకంగా తిరుమలకు కాలిబాటలో : చిన్న జీయర్
చిన్న జీయర్ శిష్యులతో తిరుపతి కోలాహలంగా మారింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మరికొద్దిసేపట్లో విష్ణు సహస్రనామ స్త్రోత్రపారాయణం జరగనుంది. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు కాలిబాటలో జీయర్ యాత్ర చేపడతారు. టిటిడి 110 తప్పులు చేసిందని ప్రకటించిన నేపథ్యంలో చిన్నజీయర్ పర్యటన ఉత్కంఠగా మారింది. గతంలో టీటీడీపై చేసిన వాదనకు తాను కట్టుబడి ఉన్నానని దీనిపై పూర్తిస్తాయిలో వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు త్రిదండి చిన్నజీయర్ స్వామి తెలిపారు.
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: విభేదాల్లేవు, అన్నయ్య ఆదేశిస్తే పోటీ చేస్తా : నాగబాబు
తాము అన్నయ్య చిరంజీవి వెంటే ఉంటామని ఆయన తమ్ముడు ప్రముఖ నిర్మాత నాగబాబు స్పష్టం చేశారు. అన్నయ్య ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తామని కూడా చెప్పారు. నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ తను, తన సోదరుడు పవన్ కళ్యాన్ అన్నయ్య తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వెంటే ఉన్నామన్నారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదన్నారు. ఆయన వల్లనే తాము ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు.
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: జయ దెబ్బ : శశికళ సోదరుడు దివాకరన్ అరెస్టు
2011-08-13
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: ఈ ఏడాదిలోనే చరణ్ నిశ్చితార్థం : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ నిశ్చితార్థం ఈ ఏడాదిలోపే జరగనుంది. ఈరోజు చరణ్ తండ్రి ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే రాంచరణ్, ఉపాసనల నిశ్చితార్థం జరగనుందని తెలిపారు. ఇరు కుటుంబాలు కలిసి వారంలోగా నిశ్చితార్థానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా హైదరాబాదు నగర మేయర్ కార్తీక చిరంజీవికి రాఖీ కట్టారు.
2011-04-24
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: సత్యసాయి బాబా జీవిత విశేషాలు
అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో 1926 నవంబర్ 23వ తేదిన పెద్ద వెంకప్ప రాజు, ఈశ్వరమ్మ దంపతులకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ఫలముగా భగవాన్ సత్యసాయి జన్మించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న పిదప స్వామి జన్మించడం తో ఆయన తల్లితండ్రులు ఆయనకు సత్యనారాయణ రాజు అని నామకరణం చేసారు. బాబా పసికందుగా ఉన్నప్పటి నుండే అనేకమైన అద్బుతాలు జరిగాయని అంటారు. ఆయన పుట్టిన తరుణంలో ఇంటిలోని సంగీత వాద్యాలు వాటంతటవే మ్రోగాయట. బాబా జననం తరువాత ఈశ్వరమ్మ పక్కలో ఒక నాగుపాము దర్శనమిచ్చిందని ఇది ఆ అవతార పురుషుడి లీలగా భక్తులు చెబుతారు.
బాబా చిన్న తనం నుండి ఆధ్యాత్మిక స్మరణలో ఉండేవారట. తనతో చదువుకొనే తోటి విద్యార్దులకు ఎప్పుడూ ఆత్యధ్మిక బోధనలు చేసేవారు. పురాతన శ్లోకాలను అవలీలగా చెప్పేవారట. ఎప్పుడూ ఏకాగ్రతతో మౌనంగా ఉండేవారని తినే ఆహారంపై కూడా ఎప్పుడూ ఆసక్తి చూపేవారు కాదని భక్తులు చెబుతారు. అయితే ఉన్నట్టుండి ఒక రోజు తన 14వ ఏట 1940 మార్చి 28వ తేదీన తను షిర్డీ సాయిబాబా అవతారమని ప్రకటించారు. "నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా పని నాకున్నది" అని చెప్పి తన చదువుకు స్వస్టి పలికారట. ఆతరువాత దాదాపుగా మూడేళ్ళు పాటు ఒక పొలంలో ధ్యానం చేసారట. అప్పటినుండి ఆయనకు భక్తులు పెరగడం మొదలు పెట్టారు. ఆయన ఆధ్యాత్మిక బోధనలు చుట్టుపక్కల గ్రామాలను, రాష్ట్రాలనే కాకుండా సుమారు 150 దేశాల ప్రజలను ఆకర్షించింది. పదుల్లో మొదలైన భక్తుల సంఖ్య కోట్లల్లో కి పెరింగింది. నిరుపెదైన, కోటీశ్వరుడైన బాబాకి సమానమే. నిరుపేదైన దేశాలను ఏలే రాజైన బాబాకు భక్తులుగా మారిపోయారు.
ఒక్కప్పుడు పుట్టపర్తి గ్రామంలో బస్సు సౌకర్యం కూడా లేదు. కానీ ఇప్పుడు అదో అద్బుతమైన ఆత్యధ్మిక కేంద్రం. నిరుపేదల ఆరోగ్య పరిరక్షణా కేంద్రం. ఏంతో మందికి ఉచితంగా చదువు చెబుతున్న విద్యా నిలయం. నిత్యం బాబా స్మరణతో, ఆత్యధ్మిక బోధనలతో అలరారుతున్నఒక ప్రశాంతమైన నిలయం. తన తల్లి ఈశ్వరమ్మ కోరిక మేరకు 1954 లోనే 12 పడకలతో ఒక ఆసుపత్రిని పుట్టపర్తిలో నిర్మిచారు. "సత్యసాయి ట్రస్ట్" ద్వారా వచ్చిన విరాళాలతో ఈ ఆసుపత్రి ని ప్రపంచంలోనే ఉన్నతమైన ప్రమాణాలతో అభివృద్ధి చేసారు. ఇక్కడ పేద ప్రజలకు లక్షల విలువచేసే వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. వైద్యంతో పాటు అక్కడికి వచ్చిన రోగులను ఆప్యాయంగా పలకరించడం, వారిని అన్నివిదాల కరుణతో చూడడం ఇక్కడి ప్రత్యేకత. అందుకే ఈ ఆసుపత్రికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లబించింది.
సత్య సాయి సేవా కార్యక్రమాల్లో మరో ముక్యమైనది "సత్యసాయి మంచినీటి పధకం". తాగునీటి కోసం పరితపిస్తున్నకొన్ని ప్రాంతాలను ఆయన దత్తతికి తీసుకున్నారు. దాదాపుగా 1300 కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ప్రాంతాలవారి దాహార్తిని తీర్చి సత్య సాయి కరుణామూర్తిగా కీర్తించబడ్డాడు. ఒకానొక సమయంలో ఈ పధకానికి డబ్బు లేక పోవటంతో ట్రస్ట్ ఆస్తులను బ్యాంక్ లో తనకా పెట్టి లోన్ ద్వారా డబ్బు సేకరించి మంచినీటి పధకాలను పూర్తీ చేసారు సత్య సాయి. ఈ పతకాలను కేవలం ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చెయ్యకుండా ప్రక్క రాష్ట్రమైన తమిళనాడు కి కూడా ఈ మంచినీటి పధకంతో దాహార్తిని తీర్చారు.
మరో ముక్యమైన సేవాకార్యక్రమం ఉచిత విధ్య. ముందుగా చెప్పుకున్నట్లు, పుట్టపర్తి ఒక సరస్వతి నిలయం. ఇక్కడ రిజర్వేషన్లు ఉండవు. పేద, ధనిక అనే బేదం ఉండదు. ఒకటే లక్యం, "నేటి బాలను రేపటి ఉత్తమ పౌరులుగా" తీర్చి దిద్దడం. ఆద్యాత్మికతో కూడిన ఉన్నత ప్రమాణాలతో అత్యున్నతమైన మైన విద్యను విలువలను జోడించి బోదిస్తారు. "మానవసేవే మాధవసేవ" అనే తత్వాన్ని వీరికి బోదించడం ద్వారా వీరిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతారు.
ఒక వ్యక్తిని భగవంతుని గా కొలవడానికి ఆయనకు అద్బుత శక్తులు అవసరంలేదు. దయాగుణం, కరుణ, ప్రేమ కలిగిన వారెవరైనా భగవంతునితో సమానమే. అలంటి వారిలో "సత్య సాయి" ఒకరని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఎంతోమందికి ప్రేమను పంచిన కరుణామూర్తి సత్య సాయిబాబా. ఈయన మరణం అసత్యం. మరణించింది కేవలం ఈయన శరీరం మాత్రమే కానీ ఈయన పంచిన ప్రేమ కాదు, ఆయన ఆత్మ మన శ్వాసలో కలిసిపోయింది. అంటే ప్రతీ ఒక్కరూ ఆయన ఏమైతే కోరుకున్నారో, ఏ ప్రేమనైతే పంచి వెళ్ళారో వాటిని పాటించాలి.
2011-03-15
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: చెద పట్టిన శ్రీజ, బరద్వాజ్ ల ప్రేమ
చిరంజీవి కూతురు శ్రీజ గుర్తుంది కదా? ఎందుకు ఉండదు అప్పటిలో ఆమెగారు చేసిన సీన్ చిన్నదేమీ కాదు కదా! శ్రీజ, శిరీష్ బరద్వాజ్... చాలా గొప్ప ప్రేమికులు. అందర్ని ఎదిరించి 2007 అక్టోబర్ న్యూ బోయిన్పల్లి ఆర్యసమాజ్ లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి చేసుకున్న వీరి వివాహానికి అప్పటిలో చాలా మంది (బయటి పెద్దలు) సపోర్ట్ చేసారు. చేసేది లేక చిరంజీవి మౌనంగా ఉన్నారు. అది జరిగిపోయిన కధ!
2011-03-04
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: మూడు గంటల్లో ముగిసిన మ్యాచ్
ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ లో బంగ్లా చిత్తుగా ఓడింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా 18.5 ఓవర్లలోనే విండిస్ బౌలర్లు విజృంబించడంతో 58 పరుగులకే కుప్పకూలిపోయింది. బెన్ 4, సమీ 3, రోచ్ 3 వికెట్లు తీసి బంగ్లా తక్కువ స్కోరు చేయడానికి కారణమయ్యారు. బంగ్లా బ్యాట్స్ మెన్లలో సిద్దికి(25), అష్రాఫుల్(11) తప్ప మిగతావారెవరూ రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు.
2011-02-25
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: ప్రముఖ రచయిత ముళ్ళపూడి ఇక లేరు
బుడుగు ముళ్ళపూడి వెంకటరమణ గురువారం తెల్లవారు జామున రెండు గంటలకు చెన్నైలో మరణించారు. ఈయన వయస్సు 79 సంవత్సరాలు. పదిరోజులుగా ఫ్లూ జ్వరంతో బాదపడుతున్న ఈయన గురువారం తెల్లవారుజామున కన్నుమూసారు. ముళ్ళపూడి 1931 జూన్ 28 న తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో జన్మించారు. ముళ్ళపూడి అసలు పేరు ముళ్ళపూడి వెంకటరావు.
2011-02-21
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: కెన్యా కూనలపై న్యూజీలాండ్ ఘనవిజయం
ప్రపంచ కప్ లో నిన్న జరిగిన రెండవ మ్యాచ్ లో కెన్యా కూనలపై న్యుజీల్యాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా సాగింది. కెన్యా ఏ దశలోనూ తన ఆదిపత్యాన్ని కనబరచలేదు, కదా కనీసం ప్రతిఘటన కుడా ఇవ్వలేకపోయింది. న్యూజీలాండ్ బౌలర్ల ధాటికి కెన్యా అల్లాడి పోయింది, 23.5 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌట్ అయ్యారు. న్యూజీలాండ్ కి ఈ మ్యాచ్ మంచి ప్రాక్టిస్ మ్యాచ్ గా ఉపయోగపడింది.
2011-02-19
Telugu News - Telugu News Online, Breaking Telugu News, తెలుగు న్యూస్: సెంచరీలతో కదం తొక్కిన సెహ్వాగ్, కోహ్లి
ప్రపంచకప్ తొలి వన్డేలో సెహ్వాగ్(140 బంతుల్లో 175, 14-4, 5-6), కోహ్లీ(83 బంతుల్లో 100, 8-4, 2-6)లు సెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్ పై భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 370 పరుగుల భారీ స్కోరు చేసింది. వీరేందర్ సెహ్వాగ్ బంగ్లాదేశ్ బౌలర్లను చీల్చి చెండాడాడు. 2011వ వన్డే ప్రపంచకప్‌లో తొలి సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా సెహ్వాగ్ రికార్డుకెక్కాడు. కేవలం 94 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో వంద పరుగులు సాధించాడు.