ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2013-07-19

Home: చదువంటే!

2013-07-19 08:10 AM venkataramireddy sannapureddy ([email protected])

రెమ్మలకి టాటా చెప్పి మెల్లిగా కొమ్మల్ని విడిచి 

దారెంట - నడిచే సరిగమలై, మెరిసే కిరణాలై 
బడిముంగిట గీతమై అల్లుకొనే 
ఒకే చెట్టు పూవుల్లాంటి బడిపిల్లల్ని చూసి 
ఆ పిల్ల కళ్లు - చిన్ని చిన్ని మడుగులవుతాయి. 
ఆమెక్కూడా - 
తనో పూవయి ఆ వరసల్లో అమరాలని వుంది. 
బడి గీతాన్ని గుండెల్లో దారంలా గుచ్చుకోవాలని వుంది. 
కళ్ల ప్రతిబింబాల్ని పలకల్లో అక్షరాలుగా చూసుకోవాలనీ వుంది. 
అయితే - 
రోగిష్టి తల్లి చేతి సద్దిమూటను భుజాన వేలాడేసుకొని 
సంజె చీకట్లదాకా ఆమె కూలిఎండను మోయాలి గదా ! 
కాళ్లు చేతుల్ని అరగదీసి విరదీసి 
అడవంతా ఒక మోపుగా పొయ్యికిందకి తేవాలిగదా ! 
బర్రెమందకు తోకగా వేలాడి తూలాడి 
తలను పచ్చి పేడగంప చేసుకురావాలిగదా ! 
కొమ్మ కొమ్మకు దోటి కొడవలిగా సాగి సాగి 
ఒంటిని రెమ్మలుగా చీల్చుకొని మేకపిల్లల్ని ఆడించాలి గదా ! 
అందుకే - 
ఆ పిల్ల చదువు నిరంతరం 
తల్లి అడుగుల దారుల్లోనే వుంటుంది. 
ఆచిన్నారి - 
పెంకు బిళ్లతో కుండల్ని గీకి గీకి 
అంట్లు తోమే వొడుపులో 'అ' 'ఆ' లు దిద్దుకోవాలి. 
మొండి పొరకతో నేలంతా గీకి గీకి 
దుమ్ముతెరల పలకలో చదువుకర్థం తెలిసికోవాలి. 
చంకనెక్కిన తమ్ముళ్ల ఆకలిరాగాల ఏడుపుల్లో 
బడి గీతాల్ని పదే పదే మననం చేసుకోవాలి. 
ఆమెకిప్పుడు - 
అక్షరాలు నేర్చుకోవటమే కాదు చదువంటే - 
కడుపు నింపుకొనేందుకు అరపావు గింజల్ని సంపాదించడం. 
పదాల్ని పలకటమే కాదు చదువంటే - 
ఒంటిని కప్పేందుకు బెత్తెడు గుడ్డపేలిక సాధించటం. 
పాఠాలు అప్పజెప్పటమే కాదు చదువంటే - 
అమ్మదనాన్ని బతికించేందుకు పసితల్లిగా మారటం . . . . .

 

 

పుస్తకం: పద్యానికి కరుణశ్రీ

2013-07-19 01:30 AM పుస్తకం.నెట్
(ఈ వ్యాసం నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాల సంకలనం “వ్యాఖ్యావళి” లోనిది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మరణించినపుడు వచ్చిన సంపాదకీయ వ్యాసం. ఈ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురించడం కాపీహక్కుల ఉల్లంఘన అయిన పక్షంలో దయచేసి [email protected] కు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేస్తే వ్యాసం తొలగించగలము – పుస్తకం.నెట్) ****** గణ యతి ప్రాసలతో కూడిన పద్యం తెలుగు వాడి సొత్తు. సంస్కృతంతో సహా ఏ భాషా ఛందస్సులో లేని సొగసు తెలుగు పద్యానిది. [...]

2013-07-18

వాకిలి: రెండో రాత్రి

2013-07-18 06:50 PM వాకిలి

సమాంతర లోకాలనడుమ
పోగొట్టుకున్న కళ్ళనీ, కన్నీళ్ళనీ
చర్మపు గోడనీడన వెతుకుతూ
రక్తపు నాలిక..

అద్దం
పగిలిన నిశ్శబ్దపు కమురువాసనలతో
కాలిన రాబందుల రతి
ఎండిన చెట్టుమీద

సమాధిన బాల్యపు మలంలో
అజీర్ణమైన ఓ అయోమయపు కల
మీద ఇసుక చల్లుతూ
సాయంత్రాకాశపు అసంతృప్త సముద్రం..

అక్షరాలు కప్పుకున్న సీసాలోంచి
శాపగ్రస్థపు బల్లిమూతి
విదిల్చిన నిషిధ్దవాక్యపు
రంగుపువ్వుల చెమట బూడిద..
నోటికో..నుదుటికో..

నేలతవ్విన వెన్నెలల్లో
కాళ్ళు కడుక్కుంటూ
మొండెంలేని కాలం
చెప్పుల్లో చేరని క్షితిజమ్మీద..

చేతివేళ్ళదాకా మెలితిరుగుతున్న
కడుపులో దుఃఖపు నొప్పికి
ఙ్నాపకాల జెండా మీద
అదృశ్య గతాల అవనతం..
మంచు కురిసిన మురిక్కాలవలో ఈదుతూ
ప్రాణం.. ఆత్మనొంటరి చేసి..

రెండో రాత్రి సమీపిస్తోంది
కళ్ళనీ కన్నీళ్ళనీ తొడుక్కోవాలి..
ఒక్క మనిషైనా కనపడకపోతాడా
ఉమ్మేసిన మొహాన్ని తుడుచుకోడానికి..
కనీసం వినపడకపోతాడా
ఒక్క మనిషైనా..
కప్పేసిన మోహాల్ని తెరుచుకోడానికి

వాకిలి: పడిలేవడం

2013-07-18 06:50 PM వాకిలి

మేధస్సు
సాంకేతికాక్షరాల మధింపు
డిజిటల్లో, అనలాగ్గో పరికరాల సూచికల్తో
నా భద్రతను అంచనా వేసుకుంటాను

ఎదిగిన పరిజ్ఞానంతో
ఎన్ని దారుల్ని పరుచుకున్నానో !

అభద్రతా గుండంలోకి
జారిపోయిన క్షణం ఊహించని ప్రవాహం!

నే నిలబెట్టిన శివుణ్ణి తోసుకుంటూ
గంగవేసే ఉరకలు
కాళ్ళక్రింద మట్టిని కోస్తూ
నన్నూ నా శివుణ్ణీ బ్రమింపచేసాయి

నా జ్ఞానాన్ని
అజ్ఞానంలోకి నెట్టేస్తూ, ప్రశ్నిస్తూ
ఒక బీభత్సం

గల్లంతైన దేహాలు
కూకటివేళ్ళతో కొట్టుకుపోయిన భవనాలు
లయతప్పిన ప్రకృతి నృత్యం
వరదవదిలెళ్ళిన బురద

కాళ్ళు ఆరనివ్వని నీటి మధ్య
గొంతు తడుపుకోలేక కన్నీటిని చప్పరిస్తున్నాను

ఆకలి.. భయం… నిస్సత్తువ…
ఇంకా కేకలు వేస్తూనేవుంది

నాకిప్పుడు దార్లు
-నానిన నీటిలోంచిపుట్టే అంకురానికొక నేలను సిద్దం చేయడం
అప్పటివరకూ నన్ను నేను బ్రతికించుకోవాలి
-మోకరిల్లే దిక్కుకోసం దృక్కులు చూడటం

                   ***

నీ వైపు చూడటం అత్యాశేమీ కాదు
పడిలేవటం కెరటానికి నాకూ అలవాటేగా!

 

2013-07-17

సారంగ: ఛానెల్ 24/7 -15 వ భాగం

2013-07-17 06:36 PM editor

sujatha photo

  (కిందటి వారం తరువాయి)

ఆయనకు దక్షిణామూర్తిని చూడాలనిపించింది. అతన్ని భరించాలనిపించింది. ఆయన తప్పకుండా ఏదో ఒకటి అంటాడు. తన జీవితాన్ని విమర్శిస్తాడు. ఇది కూడదంటాడు. తను ఇంకెలాగో ఉండాలంటాడు. ఆయన తనను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. తన స్నేహితుడు. ఆయన ఇంకోలా ఎలా వుంటాడు.

బాయ్‌ని పిలిచి దక్షిణామూర్తిగారిని లోపలికి తీసుకు రమ్మన్నాడు. తను గబగబ వచ్చేశాడు. ఆయన అందరినీ పలకరిస్తూ స్టూడియో బయటే నిలబడ్డాడు. ఆయనకొసం తను ఆగలేదు. ఇప్పుడాయన చెప్పేవన్నీ తన మనసు తనకు చెబుతున్న విషయాలు. తన గురించి తనకు తెలిసినవీ, తన విజ్ఞత తనను మనిషిగా  ఉండమని హెచ్చ్చరిస్తున్నవే. ఇప్పుడు దక్షిణామూర్తి వస్తాడు అనుకొన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

***

“ఇప్పుడు అడుగుతున్నా మేడం.. మీ పర్సనల్ లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేసుకున్నారో చెప్పండి..”

“నయనా.. నువ్వు ప్రశ్న సరిగ్గా అడుగు. నేను తిన్నగా చెబుతాను. నీ ఆలోచనలోంచి నన్ను చూస్తున్నావు. నా జీవితంలో డిస్ట్రబెన్స్ లేదు. నేనో మార్గం ఎంచుకొని అటు తిన్నగా నడుస్తూ వచ్చాను. ఒక వ్యాపారి తన వ్యాపారం అభివృద్ధి చేసుకొన్నట్లు నాయర్‌తో విడిపోయేసరికి నేను ఎడిటర్‌గా వున్నానని చెప్పానుగా. ఒక పత్రికా నిర్వహణ నా పర్సనల్ లైఫ్‌కి ఎక్కడా టైం కేటాయించనివ్వలేదు. ప్రపంచంకంటే కొన్ని గంటలు ముందుగా నిద్రలేవలసిన ఒక జర్నలిస్ట్ తనని తాను ఎంతగా అప్‌డేట్ చేసుకోవాలో అంతా చేశాను. ఇతర పత్రికలతో పోటీ, నా పత్రిక నిరంతరం సర్కులేషన్ పెంచుకోవటం కోసం నే పడ్డ తపన, నా కేంప్‌లో నేను కలుసుకొనే మనుష్యులు,నా జీవితానికి కేంద్ర బిందువు నా కెరీర్, నేను ఉమెన్ ఎడిటర్‌ని, టాప్‌మోస్ట్ జర్నలిస్ట్‌ని, ఎడిటర్స్ గిల్డ్ మెంబర్‌ని. నా ఎడిటోరియల్స్ గురించి నిరంతరం చదువు విశ్రాంతి లేని నా జీవితంలో నాయర్ ఎక్కడో మాయం అయ్యాడు”

“అంటే  కెరీర్, పర్సనల్ లైఫ్‌కి విలువివ్వదా..?”

“మనం ఒక ప్రవాహంలో వున్నాం. ఉదయం నిద్రలేవటం దగ్గరనుంచి ఆఫీస్ ఫోన్స్, బయటనుంచి కలుసుకోవలసిన వీఇపిలు.  పర్సనల్ లైఫ్‌కి ఒక గీత చెరిగిపోయింది. నాయర్‌తో విడిపోయాక నాకింకో పర్సనల్ జీవితం ఏముంది. పాపాయి చదువుకొంటుంది. బాబాయి కుటుంబంతో వుంది. నాకు ఆమె బాధ్యత లేదు. నేను, నాకోసం చరిత్రలో ఒక పేజీ సంపాదించుకోవాలనుకొన్నాను. అది నా లక్ష్యం.”

“వైఫల్యాలు, నష్టాలు. ఏవీ లేవా…?”

“ఓ గాడ్ నీకింకా అర్ధం కావటం లేదు. నాకోసంగా పిల్లలు లేరు. స్నేహితులు, బంధువులు, విహారయాత్రలు ఏవీ లేవు. తెలుసు కదా. మన పత్రిక పబ్లిక్ ఇష్యూకి వెళ్లింది. చానల్ లాంచ్ చేశాం. పొలిటికల్ ఎడిటర్‌ని. నేనెక్కిన మెట్లు ఏవీ మిగల్లేదు. కానీ నాకోసం వెనక్కి తిరిగి చూస్తె ఈ కెరీర్ వదిలేస్తే నేనేం చేయాలో నాకు తెలియదు. వృత్తి తప్ప నాకేం లేదు.”

“ఇందుకు బాధపడుతున్నారా? ఏమైనా నష్టపోయారా..?”

“బాధపడటం లేదు. నన్నెవరన్నా ఇలా వుండాల్సిందే అని నిర్భంధించారా.. లేదే.. నాకై నేను ఎంచుకొని కోరి వరించిన జీవితం. అటు నష్టపోయానో లేదో అర్ధం కాని జీవితం. నన్ను ఓ మీటింగ్‌లో నా జీవితంలో జరిగిన  యదార్ధ హాస్య సంఘటన, మీరు అందరితో కలిసి నవ్వుకొన్న్న సంఘటన గురించి చెప్పమని అడిగారు. హాస్య సంఘటన అలాంటిదేమీ లేదు. మరపురాని సంఘటనలంటే అవార్దులు తీసుకొనే అవకాశాలు తప్ప ఇంకేం లేదు. దాన్ని నేను నిర్వచించలేక పోతున్నాననుకొంటా..”

“అంటే కుటుంబ జీవితం పాపాయితో గడపటం మిస్ అయ్యారా…?”

“ఏమో,  కుటుంబ జీవితం నాకు ప్రత్యేకంగా అందించిన ప్రత్యేకమైన అనుభవాలు  ఏవీ లేవు. అటు నాన్నగారి సమయబద్ధమైన పొలిటికల్ జీవితం. అందులో ఆయన కుటుంబం కోసం కేటాయించినది ఏదీ లేదు. ఇటు నాయర్ కోరుకొన్న జీవితంలో నేను ఎల్లాగూ లేను. ఆయంతో కలసి ఉన్నంతకాలం ఆయన రాజకీయాలకు చెందిన మనిషే. ఆయనకు పర్సనల్ జీవితం ఉంటే ఆయన సొంత బతుకే. తను గొప్ప వ్యక్తిగా ఎదగటం. మరి ఈ మనుష్యులు నాకు నేర్పింది ఇదేనేమో “

“కెరీరే లక్ష్యం అయితే ఇంకేముండదా మేడం..”

“ఇంకా అంటే బహుశా లేదేమో.. నీకు ఉద్యోగం లక్ష్యం. ఉదయం లేచి తయారై ఆఫెస్‌కు వస్తావు. సాయంత్రం వరకూ గంటకోసారి న్యూస్‌లో కనిపించాలి. ఇప్పుడే శ్రీధర్ అన్నాడు. ఐదవుతూనే నువ్వు ఇంకో ప్రీ రికార్డెడ్ ప్రోగ్రాంకు అటెండ్ అవ్వాలని. ప్రోగ్రాం కాన్సెప్ట్‌ని బట్టి ఏం కట్టుకోవాలో, ఏ నగలో, ఏ డ్రస్‌లో ఆలోచిస్తావు. నీకు పాప వుంటే దాన్ని గురించి ఉదయం నుంచి ఎన్నిసార్లు ఆలోచించగలిగేదానివి”

నయన ఆలోచిస్తుంది.

స్వాతి ఆమెను చూస్తోంది.

“నయనా.. ఎప్పటి సంగతో చెబుతున్నా. మా పాపకి పన్నేండేళ్లు వచ్చాయి. మొదట్లో నేను గమనించలేదు కానీ, ప్రతిరోజూ నేను ఇంటికి వచ్చేవరకు మేలుకొని వుండేది. ఒక్కోసారి ఆఫీస్‌కు వచ్చేది. చాంబర్‌లోకి రాకుండా బయటనే కూర్చునేది. రిపోర్టర్స్ రూంలో కూర్చుని వాళ్లతో మాట్లాడేది. నేను నా పనులయ్యాక కలిసేదాని. ఇద్దరం కలిసి కారెక్కేవాళ్లం. దాన్ని దగ్గరకు తీసుకొన్నా నాకు ఏదో ఫోన్, నేనేదో ఆఫీస్‌లో ఎవరితోనో ఏదో చెప్పాల్సిన అవసరం, థర్డ్ ఎడిషన్‌లోనో, లాస్ట్ ఎడిషన్‌లోనో చేయాల్సిన మార్పులు, లాస్ట్ మినిట్స్‌లో వచ్చిన ఫ్లాష్ న్యూస్ ఏదో ఒకటి నా మనసంతా. పోనీ ఏ మీటింగ్‌కో కలిసి వెళ్ళేవాళ్లం. ఆ మీటింగ్‌లో నేను మొత్తంగా వుండగలను. కానీ పాపాయి పాత్ర ఎంతవరకూ. మొదటిసారి అందరూ పలకరిస్తారు. ఇంకా దగ్గరివాళ్లయితే దగ్గర కూర్చోమంటారు అంటే. నేను తనని ఎంత ఎంగేజ్ చేయగలను” అంది.

“నెమ్మదిగా తర్వాత మానుకొందనుకొంటా” స్వాతి ఆలోచిస్తూ ఊరుకొంది.

తలెత్తి చినంగా నవ్వింది

“ఆమె పెళ్ళి కోసం ముందుగా వారం రోజులున్నాను. ఇంట్లో పెళ్ళయ్యాక తను అమెరికా వెళ్ళే ఏర్పాట్లలో వుంది. తను వెళ్ళేందుకు రెండు నెలలు పట్టింది. ఆ రెండు నెలల్లో రెండు సార్లు తన కోసం వెళ్ళేను. మొత్తం పాపాయి కోసం నేను సంవత్సరంలో నాలుగైదు రోజులు కేటాయించానేమో. ఇంట్లోనే వున్నా పెద్దగా కలిసి లేము. నా పనుల్లో నేను, పాపాయికి నేనేం ఇచ్చాను. తనను కనటం తప్ప”

“ఇప్పుడు అమ్మలా ఆలోచించారు” నవ్వింది నయన.

“అంటే నయనా. మన సొసైటీలో స్త్రీలకు ప్రత్యేకమైన ఫార్మేట్ వుంది. ఆమె ఎలా వుండాలో ఎవరో ఆలోచించి డిజైన్ చేసి ఇచ్చిన ఫార్మెట్. దాన్ని సొసైటీ ఆమోదించింది. ఆమె ఇలా ప్రేమించాలి. ఇలా పెళ్ళాడాలి పిల్లల్ని కనాలి. కుటుంబానికి ఇలా సేవ చేయాలి. ఆమె మనసులో ఈ స్థాయిలో మెల్టింగ్ పాయింట్ వుండాలి. మరి నేను అలా కాకుండా ఇంకోలా వుంటానంటే అతిగా లేదూ. ఈ స్వేచ్చని ఎవరు ఎలా ఆమోదిస్తారు. ఇటు నాయర్‌ కోసం విచారించకా, అటు పాపాయిని సరిగ్గా తల్లి పాత్రలో వుండి చేరదీయకా, స్వాతిలాగా కెరీరిస్ట్‌గా నిలబడ్డానంటే నాకేం విశేషణాలుంటాయి చెప్పు”

నయన తడబడింది. నిజం మాట్లాడితే ఏం బావుంటుంది. తన ఉద్ధేశ్యంలో తన దృష్టిలో ఈవిడ చాలా స్ట్రిక్ట్. ఎండితో కలిసి ప్లాన్ వేస్తే అవతలవాడు మటాష్, తను ఏదైనా కావాలనుకొంటే ఎలాగైనా సాధిస్తుంది. దయాదాక్షిణ్యాలు లేవు. ఇంకా అబ్బో.. ఎవర్నీ ప్రేమించదు. శిఖండి. ఏం మనిషిరా బాబూ అనేవాళ్ళే ఎక్కువమంది. ఎంతదాకా ఎందుకు. తనకే పదిసార్లు హెచ్చరికలు చేసింది. గ్రూప్‌లు కట్టకూడదంటుంది. అతి చనువు కూడదంటుంది. అనవసరమైన రిలేషన్స్ పెంచుకోవద్దంటుంది. బహుశా కళ్లెత్తి చూస్తే ఆవులిస్తే పేగులు లెక్కపెడుతుంది. నయననే చూస్తున్న స్వాతి నవ్వింది.

“నేను నీ ఆఖరి ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. ” అన్నది.

నయన కంగారుగా చూసింది.

“ఇంకేం లేదు మేడం” అన్నది.

“ఇంకేమున్నాయో ఆలోచించుకో. నీకు ఇరవై నిముషాలే టైం” అన్నది కుర్చీలో హాయిగా రిలాక్సయిపోతూ.

 

***

 

దక్షిణామూర్తిగారు డోర్ తెరుచుకుని లోపలికి వచ్చారు. ఫోన్‌లో మాట్లాడూతున్న ఎస్ఆర్‌నాయుడు లేచి ఆయన్ను కూర్చోమన్నట్టు తన ఎదురుగ్గా వున్న చూపించి మర్యాద చేశాడు. ఆఫీస్ మొత్తం బాంబే నుంచి వచ్చిన ఇంటీరియర్ డెకొరేషన్ ఎక్స్‌పర్ట్ డిజైన్ చేశాడు. చాలా అందమైన ఆఫీస్. దక్షిణామూర్తి తన కాబిన్‌ను ఆశ్చర్యంగా చూస్తున్నాడా లేదా ఆయన మొహం వంక చూస్తున్నాడు ఎస్ఆర్‌నాయుడు. కూర్చుంటూ పై కండువాతో ముఖం తుడుచుకొంటూ ఎదురుగ్గా రాక్స్‌లో వున్న పుస్తకాల వంక చూస్తున్నాడు.

“భోజనం చేద్దాం దక్షిణామూర్తిగారూ” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు.

దక్షిణామూర్తి తల వూపాడు.

“ఫ్రెష్ అవుతారా?” అన్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“వస్తూ బాత్‌రూంకు వెళ్ళివచ్చా” అన్నాడాయన.

ఆయన ఖద్దరు షర్ట్, జీన్స్ పాంట్ తమాషాగా వుంటుంది. ఆ కాంబినేషన్ పైన ఖద్దరు తువ్వాలు వంటిది మెడచుట్టూ వేసుకొంటాడు. ఎస్ఆర్‌నాయుడు చాలా స్టయిల్‌గా వుంటాడు. చక్కని మడత నలగని షర్టు నలుపు తెలుపులుగా వున్న ఉంగరాల జుట్టు చక్కగా దువ్వుకొని  ఎప్పుడు పడితే అప్పుడు లైవ్‌లో కనిపించటానికి వీలుగా రెడీగా వుంటాడు.

భోజనం వచ్చింది. ట్రేలో వున్న డిష్‌లన్నీ ఒక్కోటి తీసి చూస్తున్నాడు దక్షిణామూర్తి. నాకు సాంబార్ చాలోయ్ అన్నాడు బాయ్‌తో. బటర్ నాన్, పుల్కా కూడా ఉన్నాయి సార్ అన్నాడు బాయ్. వద్దులేవయ్యా రైస్ తింటాను అన్నాడాయన.

“ఎలా వుంది చానల్” అన్నాడు ఎస్ఆర్‌నాయుడుతో.

“చూస్తున్నారుగా సెకండ్ ప్లేస్‌లో. అటూ ఇటూ ఫస్ట ప్లేస్ కూడా”

“అవును చాలా సెన్సేషనల్ చేసావు” అన్నాడు దక్షిణామూర్తి.

తింటున్నది గొంతులో పడ్డట్టు అయింది. సెన్సేషనల్ అంటే ఈయన వెక్కిరింతా పొగడ్తా.

“మొన్న మీ చైర్మన్‌గారు ఎయిర్‌పోర్టులో కలిశారు.  చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయనకు పవర్ ప్రాజెక్ట్ వచ్చిందంటగా. మీ కృషి చాలా వుందన్నాడు.

తింటున్న భోజనం కమ్మగా లేదనిపించింది ఎస్ఆర్‌నాయుడుకు.

చైర్మన్ ఆదికేశవులుకి ఎన్నో బిజినెస్‌లు వున్నాయి. ఎన్నో సంస్థల్లో పెట్టుబడులున్నాయి. ఈ చానల్‌లో ఆయనకూ షేర్స్ ఉన్నాయి. నేనూ స్వాతీ డైరెక్టర్స్ . తెలుసు కదా..”

“ఆయన తమ్ముడు శ్రీరంగనాయకులు నేనూ క్లాస్‌మేట్స్”

ఈసారి దగ్గొచ్చింది ఎస్ఆర్‌నాయుడుకు. ఇది తనకు తెలియదు.

“అయితే పెద్దయ్యాక ఎప్పుడూ రిలేషన్స్‌లో లేము. మొన్నమాటల్లో చెప్పుకొన్నాము. శ్రీరంగనాయకులు మినిష్టర్ అయ్యాక నేను కలుసుకొన్నది లేదు. ఇష్యూ బయటికి వచ్చాక నీతో మాట్లాడాలనుకొన్నా.”

ఎస్ఆర్‌నాయుడుకు ఏం మాట్లాడాలో తోచటం లేదు. ఆదికేశవులు కాలేజ్ సంగతి ఎక్కడా బయటకు రాకుండా తనే చూశాడు. గవర్నమెంట్ లాండ్ అది. లీజ్‌కు తీసుకొన్నారు. పర్మిషన్స్ తెచ్చుకోవచ్చునని బిల్డింగ్స్ కట్టేశారు. ఆ స్థలం లీజుకు ఇచ్చినందుకు అప్పటి కమీషనర్‌ను కోటీశ్వరుణ్ణి చేశాడు ఆదికేశవులు. ఆయన ఆస్తులు సగం తన పేరుపైనే ఉన్నాయి. ఈ చానల్‌లో తను పెట్టిన షేర్లు అతను ఇచ్చినవే. వాళ్ల కోసం తను ఏం చేస్తే సరిపోతుంది..?”

“నువ్వు చాలా రిస్క్ తీసుకొంటున్నావు. నీతో మాట్లాడాలనే వచ్చా. ఓన్లీ ఫ్రెండ్లీగా. నువ్వు స్వాతి కలిసి డెయిలీని ఎన్నో ఎడిషన్లు చేశారు. ఆ పెట్టుబడి ఎక్కడిదో నాకు తెలుసు. ఈ చానల్ పెట్టుబడీ నాకు తెలుసు. స్వాతి నాన్నగారు బతికుంటే ఇదంతా జరిగేది కాదు. ఒకప్పుడు ఆ పత్రికకు ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఉండేది. అవ్వాళ్టి పార్టీ లీడర్స్‌కి పదవులు లేవు. ప్రజాసేవ తప్ప. ఆదికేశవులు దాన్ని టేకోవర్ చేశాడని అందరికీ తెలుసు. బయట నువ్వు చాలా బద్నామ్ అవుతున్నావు”

ఇంత చెబుతూ తాపీగా అన్నం తింటున్న మనిషి వైపు తెల్లబోయి చూస్తున్నాదు ఎస్ఆర్‌నాయుడు.

“పత్రిక, చానల్ అడ్డంపెట్టి ఎన్నింటికి పర్మిషన్ తెచ్చుకొన్నాడో నువ్వెలా డిల్లీ చుట్టూ తిరుగుతున్నావో నీ తోటివాళ్లు ఎంతలా గమనిస్తున్నారో తెలుసా నీకు”

దక్షిణామూర్తి ఏనాడో పాతికేళ్ల గతంలోంచి లేచొచ్చి కూర్చున్నట్టు వుంది ఎస్ఆర్‌నాయుడుకి.

ఇద్దరూ ఎడిటోరియల్‌లో షిఫ్ట్ ఇన్‌చార్జ్‌లుగా పనిచేసేవాళ్లు. ఎడిటోరియల్ రాయటంలో పోటి, రిపోర్టింగ్‌లో పోటీ. కొత్త కొత్త విషయాలు రాయటంలో పోటీ. ఆరోగ్యకరమైన పోటీలో ఇద్దరూ వెలిగిపోతుండేవాళ్లు.

“నాతో శ్రీరంగనాయకులు చెప్పారు. ఒక్క రూపాయి చేతిలోంచి పెట్టకుండా ఎలా సంపాదించారో ఆదికేశవులు చెప్పుకొచ్చాడు. తను మినిష్టరుగా అడ్డమైన లాబీయింగ్‌లతో ఎన్ని కాంట్రాక్టులు, ఎన్నో పర్మిషన్లు ఇప్పిస్తూ వాళ్లందరిచేత ఈ చానల్‌లో పెట్టుబడులు పెట్టించాడో, మొత్తం చానల్స్‌లో టాప్‌లో ఎలా ఉందో చెప్పాడు నాకు. నువ్వు స్వాతి ఎవరెవరికి కొమ్ము కాస్తున్నారో, ఏం స్టోరీలు చేస్తున్నారో, ఎవరిని ఎలా బెదిరిస్తున్నారో, ఇవన్నీ నీకు వాళ్లు తెలిసే చేస్తున్నావా? ఆదికేశవులు బావున్నాడు. వాళ్ల తమ్ముడూ బావున్నాడు. వాళ్ల ఆస్తులు , పిల్లలు అంతా బావున్నారు. మరి నువ్వెలా వున్నావు? ఇదంతా నీకెందుకు నీ అంత మంచి రైటర్ ఎవరున్నారు? నీ పిల్లలు బుద్ధిమంతులు. చక్కగా చదువుకొన్నారు. నీకు కోట్ల ఆస్తులు లేకపోతే ఏం.. ఎందుకిదంతా. ఆదికేశవుల్ని ఎదిరించాడని. ఆ కల్నల్ పర్సనల్ లైఫ్ చానల్‌లోకి లాగి నవ్వుల పాలు చేశావు. ఆయన ఎవరిని చేరదీస్తే నీకెందుకు. ఎదుటివాళ్ల బెడ్‌రూమ్స్‌లోకి తొంగిచూడాలా నువ్వు”

తినటం ఆపి దక్షిణామూర్తి వైపు చూస్తున్నాడు నాయుడు. ఆయనకు ఊహించని దెబ్బ ఇది. దక్షిణామూర్తిని ఎలా తొక్కేయాలా అని ఉదయం నుంచి ఆలోచిస్తున్నాడు తను. ఉద్యోగం సద్యోగం లేక దిక్కులేక ఉన్నాడనుకొన్నాదు. ఈయన తనకే పాఠాలు చెబుతున్నాడు.

“నీకు నేను చెప్పటం ఏమిటి అని ఆలోచించాను. నేను పత్రిక వదిలేశాక నీకు తెలుసుగా పుస్తకాల ట్రాన్స్‌లేషన్ పెట్టుకొన్నాను. మానవ చరిత్ర పన్నెండు వాల్యూమ్స్ అయ్యాయి. తెలుగు మాండలికాలు తయారయ్యాయి. పిల్లల పుస్తకాలు చాలా చేసాను. ఒక రకంగా ఇదివరకటి కంటే తీరిక లేకుండా వున్నా. మనం చేయవలసిన పనులు ఎన్నో వున్నాయి. అవన్నీ వదిలేసి ఇప్పుడిలా.. ఇదంతా ఎందుకు? నాకు తోచింది చెప్పాను. వినటం, వినకపోవటం నీ ఇష్టం.” అన్నాడు ఎస్ఆర్‌నాయుడు వంక చూసి.

ఎస్ఆర్‌నాయుడుకి నోటమాట రాలేదు. పాతికేళ్ళ గతంలోకి నడిచిపోయి దక్షిణామూర్తితో కలిసి రాత్రివేళ లాంగ్ డ్రైవ్ చేయాలనిపించింది. పత్రిక వృద్ధిలోకి రావటం కోసం కొత్త కొత్త ప్రయోగాల కోసం రాత్రిళ్ళు నిద్రపోక  మేలుకొని చేసిన చర్చలు గుర్తొస్తున్నాయి. ఎక్కడో తమ స్నేహం, జీవిత మాధుర్యం చేజారాయి. తను తుఫానులో కొట్టుకుపోయాడు.

“తినలేను” అన్నాడు నీరసంగా తింటున్న ప్లేటు వదిలేసి.

“తిను తిను.. నేను కంపెనీ ఇస్తా. ఇంకా ఫ్రూట్ సలాడ్ వుంది చూశవా?”అన్నాను దక్షిణామూర్తి కప్పు చేతిలోకి తీసుకొని.

ఎందుకో దక్షిణామూర్తిపైన కోపం రాలేదు. తన హోదా తన చానల్. తన గొప్పతనం ఏవీ గుర్తు రాలేదు. తనను నిలదీసే ధైర్యం ఎవ్వరికుంటుంది. తను ఎవ్వరికైనా సమాధానం చెప్పుకోవాలా అంటే తన మనస్సుకే అనుకొన్నాడు. శాంతిగా అనిపించింది. తీరిగ్గా భోజనానికి ఉపక్రమించాడు. రూం చల్లగా వుంది.

 

 

సారంగ: వీలునామా – 8 వ భాగం

2013-07-17 06:30 PM editor
శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

                     పడి లేచే కడలి తరంగం

 ఎస్టేటు చేరుకుని అందులో కొంచెం కుదురుకున్న ఫ్రాన్సిస్ హొగార్త్ ఆ ఎస్టేటు ధరా, తనకి లభించిన సంపదా చూసుకొని ఆశ్చర్య పోయాడు. బేంకులో వున్న నగదూ, షేర్లూ, ఇంకా అక్కడక్కడా మదుపు పెట్టిన డబ్బూ, అంతా కలిసి జేన్ అనుకొన్నట్టు దాదాపు నలభై వేల పౌండ్ల పైనే వున్నట్టుంది. ఎస్టేటు లో కొంచెం భూమిని సాగు చేయించినట్టున్నాడు పెద్దాయన.

ముందు ఎల్సీ ఆ వూరి జనం ఫ్రాన్సిస్ ని ఆదరిస్తారా అని అనుమానపడింది కానీ, ఆ భయం అర్థం లేనిది. ఆ వూళ్ళో ఇదే అంతస్థుకి చెందిన కుటుంబాలలో దాదాపు ఇరవై మంది పెళ్ళీడు కొచ్చిన ఆడపిల్లలుంటే, నలుగురు పెళ్ళీడుకొచ్చిన యువకులున్నారు, విలియం డాల్జెల్ తో సహా. అలాటప్పుడు, యుక్త వయసుల్లో వున్న ఇద్దరమ్మాయిలు ఊరు వదిలి, చక్కగా చదువుకుని పెళ్ళి కాని ఒక మగవాడొస్తూంటే ఊళ్ళోని సంపన్న కుటుంబాలు అతన్ని ఎందుకు నిరాదరిస్తాయి?  సహజంగానే అతని కొరకు విందులూ, వినోదాలూ ఏర్పాటు చేయబడ్డాయి. తమ తమ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి తండ్రులూ, తల్లులూ ఎంత దూరమైనా వెళ్తారూ, ఆత్మ గౌరవాన్ని ఎంతైనా చంపుకుంటారు.  బ్రిటిష్ సంఘంలో ఎంత విషాదకరమైన పరిస్థితి! ఒక వర్గాన్ని ఆకాశానికెత్తేస్తూ, ఇంకో సగాన్ని పాతాళానికి నొక్కేస్తూ…

ఇహ స్కాట్లాండ్ లో ఒక మారుమూల పల్లెటూళ్ళొ అంతకంటే మెరుగైన పరిస్థితి ఎలా వుంటుంది? అప్పటికే పల్లెటూళ్లలో మధ్య తరగతి, సంపన్న కుటుంబాలనుంచి యువకులు అవకాశాలు వెతుక్కుంటూ, కాలనీల్లోకి, భారతదేశానికో, అమెరికాకో, ఆస్ట్రేలియాకో వెళ్ళిపోతున్నారు. అంత దూరం కాకుంటే కనీసం పట్టణాలకైనా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో పడి వుండడం తప్ప చేసేదేం వుంది? చదువూ లేక, వృత్తీ వ్యాపారాలూ లేక, కేవలం ఎవరో ఒకరు వచ్చి కన్నె చెర విడిపించాలని ఎదురు చూడాల్సి రావడం ఎంత దుర్భరం!

కాలనీల్లోంచి తిరిగొచ్చిన యువకుల కంటికి సహజంగా తమతోటి కలిసి ఆడుకుని పెరిగి పెద్దయిన యువతులకంటే, చిన్న వయసులో వున్న బాలికలే ఎక్కువ నచ్చుతారు. పాపం, చదువూ, జీవనాధారమూ, పెళ్ళీ లేక ఒక తరం యువతులంతా అమ్మా-నాన్నల పంచనో, అన్న దమ్ముల పంచనో పడి వుండాల్సొస్తుంది.

ఇంత దుర్భరమైన పరిస్థితిలో, ముఫ్పై అయిదేళ్ళ బ్రహ్మచారీ, చదువు సంధ్యలున్నవాడూ, ఆస్తి పరుడూ తమ మధ్యకొస్తే ఆడపిల్లల తలి దండ్రుల ఆశలు ఆకాశాన్నంటటంలో ఆశ్చర్యమేముంది? అతన్ని విందులకూ, వినోదాలకూ ఆహ్వానిస్తూ కుప్పతెప్పలుగా ఉత్తరాలొచ్చి పడ్డాయి.

అయితే ఈ పరుగు పందెంలో అందరికన్నా ముందు పరుగు ప్రారంభించింది మాత్రం రెన్నీ దంపతులే. తన కింద, తన సంస్థలోనే పనిచేస్తున్న ఫ్రాన్సిస్ ఉన్నట్టుండి గొప్ప ఆస్తిపరుడు కాగానే, రెన్నీ ఆ అవకాశాన్ని వొదల దల్చుకోలేదు. తన కూతురు ఎలిజాకి ఇంతకన్న మంచి వరుణ్ణి తాను తేలేడు. అందుకే ఒకసారి తన ఎస్టేటు చూడడానికి రమ్మని ఫ్రాన్సిస్ ఆహ్వానించిందే తాడవు, రెన్నీ దంపతులు కూతురితో సహా వస్తామని మాటిచ్చారు.

నిజానికి శ్రీమతి రెన్నీ ఫ్రాన్సిస్ ని వూళ్ళో వుండే సంపన్న కుటుంబాలు ఎగరేసుకు పోతారేమోనని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఫ్రాన్సిస్ సహజంగా ముభావి. పైగా యేళ్ళ తరబడి ఒంటరితనానికి అలవాటు పడ్డవాడు. అందుకే వూళ్ళో కుటుంబాలతో పెద్దగా మనసిచ్చి కలవలేకపోయాడు. అతనికెందుకో వూళ్ళో వాళ్ళు అంత నచ్చలేదు కూడా. అన్నిటికంటే వూరి వాళ్ళు జేన్, ఎల్సీల పట్ల చూపించిన నిరాదరణ అతన్ని ఎంతో నొప్పించింది. ఆ నిరాదరణ ఆ అక్క-చెల్లెళ్ళ పట్ల కాదనీ, తన తండ్రి పట్ల అనీ అతను గుర్తించలేకపోయాడు.

చాలా మామూలు మనుషులుండే ఆ వూళ్ళో, పెద్దాయన హొగార్త్ భావాలూ, మతపరమైన నమ్మకాలూ, కొంచెం విభిన్నంగా అనిపించేవు. దాంతో వూరి వారికి అతనంటే కొంచెం అనుమానం అసహనం కూడా వుండేవి. అతని పెంపకంలో పెరిగిన అమ్మాయిలవడం చేత, ఆ అనుమానమూ, అసహనమూ, జేన్, ఎల్సీల పైకి కూడా తిరిగాయి. దానికి తోడు వేరే ఆడదిక్కులేని ఇల్లు. వాళ్ళిద్దర్నీ ఆయన మగపిల్లల్లా పెంచాడందులో. అయేసరికి వూరి వారికీ హొగార్త్ గారి కుటుంబానికి పెద్ద సఖ్యతేమీ వుండేది కాదు.

అదెలాగున్నా, పెద్దాయన ఆడపిల్లలకి చిల్లి గవ్వ ఇవ్వకుండా వీధిలో నిలబెట్టాడని తెలిసినప్పుడు మాత్రం, వూరి వాళ్ళు చాలా బాధ పడ్డారు. వాళ్లకొరకు చందాలు పోగు చేయలనుకున్నారు కూడా. చిన్న చిన్న సహాయలు చేయాలనుకున్నారు. అయితే జేన్, ఎల్సీలిద్దరూ ఎవరి దయా దాక్షిణ్యాల మిదా ఆధారపడదల్చుకోలేదు. అందుకే వూరొదిలి పట్నంలో బ్రతుకు తెరువు వెతుక్కుంటున్నారనీ, చాకలి మనిషి, పెగ్గీ ఇంట్లో అద్దెకుంటున్నరనీ తెలిసి వూళ్ళొ వాళ్ళు బాధ పడ్డారు.

పెగ్గీ చాలా యేళ్ళు స్కాట్ లాండు వదిలి ఆస్ట్రేలియాలో వుండడం వల్ల, ఆమె ఆలోచనలో కొంచెం వైశాల్యం వచ్చింది. అందుకే వూరి వాళ్ళలా, హొగార్త్ నమ్మకాలకీ, ఆచార వ్యవహారాలకీ ఆడపిల్లలని తప్పు పట్టలేదు. వూళ్ళో వున్నప్పుడు కూడా వాళ్ళ బట్టలు వుతికి ఇస్త్రీ చేస్తూ, వాళ్ళతో చనువుగా, స్నేహంగా వుండేది పెగ్గీ.   జేన్, ఎల్సీలు ఇల్లొదిలి వెళ్ళేటప్పుడు పెగ్గీలాగే, ఇంట్లోని నౌకర్లూ, చాకర్లూ అందరూ ఎంతో బాధ పడ్డారు.

 

  ***

  ఎడిన్ బరోలోని ఆ వీధిలో ఆ చిన్న ఇల్లు దొరకడం అదృష్టమే, అనుకుంది పెగ్గీ. చిన్నదైనా ఇల్లు శుభ్రంగా వుంది. గాలీ వెల్తురూ ధారాళంగా వచ్చే గదిని అక్క-చెల్లెళ్ళిద్దరికీ అద్దెకిచ్చింది. పెగ్గీ చెల్లెలి మావగారు థామస్ లారీ కి కూడా, ఇల్లూ, ఇంట్లోంచి బయటికి చూసే కిటికీ భలే నచ్చాయి. పెగ్గీ చెల్లి పిల్లలయిదుగురికీ ఇల్లు బ్రహ్మాండంగా నచ్చేసింది.

జేన్, ఎల్సీలు మాత్రం, దిగజారిపోయిన పరిస్థితులూ, అంత చిన్న ఇంట్లో సర్దుకోవడమూ తలచుకుని భయపడ్డారు. ఎంత శుభ్రంగా వున్నా, ఆ ఇంట్లోంచి వాళ్ళకలవాటు లేని లేమి అడుగడుగునా తొంగిచూస్తోంది.

అయినా, వాళ్ళిద్దరూ పెగ్గీ కుటుంబంతో వీలైనంతగా సర్దుకుపోవాలనే నిశ్చయించుకున్నారు. అందుకే, ఆ రాత్రి భోజనం వాళ్ళు పెగ్గీ కుటుంబంతో పాటు కలిసే చేసారు, పెగ్గీ ఎంత వారించినా. ఆ గందరగోళానికి వాళ్ళకసలు భోజనమే సయించలేదు. ఏదో తిన్నామనిపించి తమ గదికి వెళ్ళి కూర్చున్నారు. వున్నట్టుండి బావురుమంది ఎల్సీ.

“జేన్! నాకిక్కడేం బాగోలేదు. చాలా భయమేస్తుంది. పేదరికం గురించి కవితలు రాయడమూ, చదవడమూ వేరు, నిజాంగా పేదరికాన్ని అనుభవించడం వేరు. పేదరికంలో అందముందని ఎందుకు రాస్తారు, జేన్?”

“నువ్వవన్నీ ఆలోచించకు ఎల్సీ! నిజానికి నాకు మన వూళ్ళో వున్న కుటుంబాలూ, వాళ్ళ కృత్రిమ మర్యాదలూ, కపటనాటకాలకంటే పెగ్గీ కుటుంబమే ఎంతగానో నచ్చింది. మనకీ పరిస్థితి నచ్చినా నచ్చకపోయినా, మనం సర్దుకు పోక తప్పఫు! అర్థమయిందా?”

“అబ్బ! ఆ పెద్ద తాతగారు ఎందుకలా దగ్గుతాడు జేన్? ఆయన దగ్గరొచ్చే ఆ ముక్కు పొడుం వాసన! టీ కప్పులోంచి సాసర్లో పోసుకుని తాగుతారు వీళ్ళు, చూసావా? ఛీ!”

“ఎల్సీ! నిజం చెప్పు, అవన్నీ అంత ముఖ్యమైన విషయాలా? వాళ్ళలాగా ఏ పరిస్థితికైనా యెదురీదే శక్తి లేనందుకు మనం సిగ్గుపడాల్సిన మాట!  ఏదో పెద్ద చదివేసుకున్నాం అన్న అహంకారం తప్ప మన దగ్గరేముంది, ఆలోచించు!”

“ఏమోలే! ఇవాళ రాత్రైతే నేనొక్క మాట కూడా రాయలేను. మనసంతా చికాగ్గా వుంది. ఈ వూరూ, ఈ మురికీ, ఈ ఇల్లూ…”

“అదేం లేదు ఎల్సీ! బయట ఎడిన్ బరో చాలా అందంగా వుంటుంది తెల్సా! రేపు నిన్ను బయటికి తీసికెళ్తా! ఇద్దరమూ అలా నాలుగు వీథులూ నడిచొద్దాం, సరేనా?”

“సరే! రేపణ్ణించి మళ్ళీ రాయడం మొదలు పెడతా! ఇవాళ్తికి వొదిలేస్తా!”

“అవును! నీకెప్పుడు మనసులో హాయిగా అనిపిస్తే అప్పుడే రాసుకో. ఇప్పుడిక పడుకో!”

తలుపు దగ్గర చప్పుడైంది. పెగ్గీ గుమ్మంలోంచి మొహం లోపలికి పెట్టి,

“అమ్మాయిగారూ! అంతా బాగుందా? ఇంకా ఏమైనా కావాలా?” అని అడిగింది.

“లేదు పెగ్గీ! ఏమీ వొద్దు, కానీ నువ్వొచ్చి కాసేపు కూర్చోరాదూ?” జేన్ ఆహ్వానించింది.

పెగ్గీ లోపలికొచ్చి కూర్చొంది.

ఎల్సీ గబగబా తన కగితాల కట్ట సంచీలోకి తోసేసింది. అవన్నీ ఎల్సీ ఎవరికో రాస్తున్న ప్రేమలేఖలనుకుంది పెగ్గీ!

“చిన్న అమ్మాయిగారు ఏదో ఉత్తరాలు రాసుకుంటున్నట్టున్నారు. నేనొచ్చి పాడు చేసానా?”

“వుత్తరాలు కాదు పెగ్గీ! ఎల్సీ ఒక పుస్తకం రాస్తోంది!”

“పుస్తకమే? వామ్మో! నాకు అసలు సరిగ్గా చదవడమే రాయడం రాదమ్మాయిగారూ! మీరా పుస్తకాలెలా రాస్తారో గానీ! అయితే, దానికేమైనా డబ్బొస్తుందాండీ?”

“చూద్దాం! వస్తుందో రాదో!”

“అంతే లెండీ! చదువున్న మారాజులు! నాకు పెన్ను పట్టుకుంటే అక్షరం ముక్క రాదు! ఆస్ట్రేలియాలో వున్నప్పుడు ఇంటికి ఉత్తరాలు రాసే దిక్కులేకపోయింది. ఎవరినైనా అడగడానికి సిగ్గు పడిపోయాను. ఏదో కూడబలుక్కోని నా ఇష్టం వొచ్చినట్టు రెండు మాటలు రాసి పడేసేదాన్ని లెండి. అందుకే, నాలా అవస్థలు పడొద్దని ఈ పిల్లలందరికీ చదువు చెప్పిస్తున్నాను.”

“పెగ్గీ! నువ్వు నీ ఆస్ట్రేలియా జీవితం గురించి చెప్పాలి మాకు. నాకైతే భలే కుతూహలంగా వుంది!”

“ఎందుకు లెండి అమ్మాయి గారు! మీరవన్నీ మళ్ళీ ఏ పుస్తకంలోనో రాస్తే అంతా నన్ను చూసి నవ్వుతారు!” అనుమానంగా అంది పెగ్గీ!

నవ్వింది ఎల్సీ!

“లేదు పెగ్గీ నువ్వు చెప్పే సంగతులు నేనెప్పుడూ పుస్తకాల్లో రాయను సరేనా?”

ఆమె కాగితాల్లోకి తొంగి చూసింది పెగ్గీ.

“అమ్మాయి గారూ! మీర్రాసే లైనులు ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా వున్నాయండి! అంటే మీరు రాసేది కవితలే కదండీ?”

“అవును పెగ్గీ ! అవి కవితలే!”

“ఇహ అయితే నా గురించి చెప్తా లెండి. కథలైతే భయం కానీ, కవితలైతే భయం ఎందుకు?”

“అవునూ, నువ్వు ఆస్ట్రేలియానుంచి ఒంటరిగా వచ్చావెందుకు? అందరూ నువ్వు పెళ్ళి చేసుకుని జంటగా వస్తావనుకున్నారు.”జేన్ కుతూహలంగా అడిగింది.

“అవునండీ! పెళ్ళాడడానికి అవకాశాలు కూడా వచ్చాయండి. కానీ, నేను పెళ్ళాడి నా దారి చూసుకుంటే, ఈ చిన్న పిల్లల గతి ఏమిటి చెప్పండి? ఒకరిద్దరైతే ఈ పిల్లల బాధ్యత కూడా తీసుకుంటామన్నారు కానీ, నాకెందుకో నమ్మకం లేక పోయింది!”

“ఈ పిల్లలు పెద్దయ్యాక మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళు పెగ్గీ! అప్పుడు మళ్ళీ ఎవరైనా నచ్చితే పెళ్ళి చేసుకో.” సలహా ఇచ్చింది ఎల్సీ.

“లేదు లేమ్మా! నాకు చాలా నచ్చిన మనిషికి మెల్బోర్న్ లో పెళ్ళయిపోయింది. అతను మాత్రం ఎన్నాళ్ళని ఆగతాడు చెప్పండి? నాకు తెల్సుసు చిన్నమ్మాయి గారూ, మీరేమనుకుంటున్నారో! పెగ్గీ లాటి దాన్ని కూడా ఇష్టపడే మగవాళ్ళుంటారా, అనేకదా? అయితే ఆస్ట్రేలియా లాటి చోట అంద చందాలకంటే కష్టపడే మనస్తత్వానికే ఎక్కువ విలువ. అందుకే నాలాటి దాన్ని కూడా చేశుకోవడానికి ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు ముందుకొచ్చారు. ఇంత ఇదిగా అడుగుతున్నారు కాబట్టి నా కథ చెప్తా వినండి.”

పెగ్గీ సర్దుకుని నేల మీద చతికిలబడింది. ఎల్సీ అక్క దగ్గరికి జరిగి, ఆమె వొళ్ళో తల పెట్టుకుంది. జేన్ చెల్లెలి జుట్టులోంచి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ, పెగ్గీ కథ వినడానికి సిద్ధమైంది.

  ***

(సశేషం )

 

Home: ఈ యజమాని చాలా మంచివాడు!

2013-07-17 04:55 PM kusuma kumari ([email protected])

 

రావూరి భరద్వాజ ధనికొండ వద్ద ఉద్యోగం చేసారు. తర్వాత ఆయన వద్ద పని మానేసారు. 1958 లో ఒక ఫౌంటెన్ పెన్ కంపెనీలో చేరారు. ఒకనాడు కలములను మిషనులలో తయారు చేస్తున్నారు. అప్పుడు ఒక పెన్నుకాస్తా పాడైంది. దాంతో ఆ కంపెనీ ఓనర్ కివిపరీతమైన కోపం వచ్చింది. రౌద్రంతో ఎదురుగా దొరికిన రావూరి భరద్వాజను చడామడా తిట్టేసాడు. 
 
నిజానికి ఆ యజమాని యొక్క అన్న కుమారుని వలన ‘తయారీలో ఉన్న ఆ పెన్ను‘ పాడైంది. రావూరి భరద్వాజ నెమ్మదిగా విషయాన్ని విడమర్చి చెప్పాలని ప్రయత్నించాడు. కానీ క్రోధావేశాలతో ఊగిపోతూన్న ఆ కంపెనీ స్వంతదారు- “నోర్ముయ్! మాట్లాడావంటే పళ్ళు రాలగొడ్తాను.” అని ఱంకెలు వేసాడు.
 
కొంతకాలం గడిచింది. ఒక రోజు  యజమాని కొడుకు రావూరి భరద్వాజ వద్దకు వచ్చి చిన్న సాయాన్ని అడిగాడు. 
అతని రిక్వెస్టును మన్నించి రావూరి భరద్వాజ తనకు చేతనైన హెల్ప్ చేసాడు. ఆ దొరగారి కుమారుడిని తనకు తెలిసిన చోట ఉద్యోగం ఇప్పించాడు రావూరి భరద్వాజ. ఆయన అలాగ ఉద్యోగం  ఇప్పించిన చోట చేరాడు ఆ అబ్బాయి. ఉద్యోగం పురుష లక్షణం- అని అప్పటి నానుడి. సంతోషంతో పనిలో చేరిన స్వామి తనయునితో ఇలా చెప్పాడు రావూరి భరద్వాజ
 
“అబ్బీ! జాగ్రత్తగా పని చేసుకో! ఈ యజమాని చాలా మంచివాడు. మీ నాన్నగారి మాదిరిగా నిష్కారణంగా కోపగించుకోడు. చేయని తప్పుకు పళ్ళు రాలగొడ్తానని మాత్రం అసలే అనడు.” 
 
{ఆధారము:- “నాకు దేవుని చూడాలని ఉంది”- "తెలుగు విద్యార్ధి} 

 

 

2013-07-15

పుస్తకం: వీక్షణం-40

2013-07-15 01:30 AM పుస్తకం.నెట్
తెలుగు అంతర్జాలం విశ్వదర్శనం చేయించిన ఋక్కు – రేమద్దుల దివాకర్‌రావు వ్యాసం ఆంధ్రజ్యోతి “వివిధ”లో వచ్చింది. “భాషా సాహిత్యాల పరిశోధనా సౌధం” – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ వ్యాసం, “అద్భుత తాళపత్ర సంపదకు గ్రహణం!” - డి. శ్రీనివాసకృష వ్యాసం, “సమాజ ప్రతిబింబం.. జైనేంద్ర సాహిత్యం” – భమిడిపాటి గౌరీశంకర్ వ్యాసం, గోర్కీ ‘ అమ్మ’ కు కవితా రూపం … : వ్యాసం ప్రజాశక్తి “సవ్వడి”లో వచ్చింది. జాతక కథలపై దీవిసుబ్బరావు వ్యాసం, “వాళ్ల జమీల్యా ఉంది… [...]

2013-07-14

కౌముది మాసపత్రిక: ఎన్.టి.రామారావు గురించి టాక్ షో - నాలుగవ భాగం

2013-07-14 06:10 AM
ఎన్.టి.రామారావు గురించి టాక్ షో - నాలుగవ భాగం

కౌముది మాసపత్రిక: కౌముది - జూలై 2013 సంచిక విడుదలైంది

2013-07-14 06:10 AM
కౌముది - జూలై 2013 సంచిక విడుదలైంది

నవతరంగం: Poetry

2013-07-14 05:51 AM వెంకట్ శిద్దారెడ్డి
జీవితపు రహస్యాల మేలిముసుగు తొలగింపే కవిత్వం! ఒక జ్ఞాపకం. అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. నా వయసెంతో గుర్తుపెట్టుకోగలిగేంత వయసు కూడా కాదు. బహుశా అప్పుడు నాకు మూడేళ్ల వయసు ఉండవచ్చు. ఆ రోజు అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. పదేళ్ల వయసున్న మా పెద్దక్క ఆ రోజుకి నాకు తల్లయ్యింది. ఉదయాన్నే స్నానం చేపించి నాకు రంగు రంగులున్న బట్టలు తొడిగింది. మేమిద్దరం హాల్లో ఉన్నాం. కిటికీ కి వేలాడుతున్న ఎరుపు రంగు పరదాలగుండా ప్రవహిస్తోన్న సూర్యకాంతి(...)

2013-07-13

Home: AKBAR - Chapter 4

2013-07-13 10:18 AM Laurence Binyon ([email protected])

IV

ONE morning, late in November 1542, Humayun, encamped on the shores of a small lake with a force of some two thousand horsemen lent him by a friendly chief, saw the dust of a group of riders approaching at speed over the desert. The homeless emperor had need to be wary. For two years, driven from his kingdom by the victories of Sher Shah, he had been wandering in the sandy wilderness of Sind, to the west of India, with a handful of followers. He could settle on no plan. He knew not whom he could trust. His own brothers, Kamran and Askari, were his rivals : doubtful friends, probable enemies. Swift riders were only too likely to be bearers of bad news. But on this day Humayun could hope. The riders came from the direction of Umarkot, a little fortified town some twenty miles distant from his camp : and at Umarkot he had left his young wife expecting shortly to be a mother.

Babar, Humayun, Akbar andJahangirThe messenger rode into the camp with joyful signs. Hamida had been delivered of a boy. Humayun had an heir. Here at last was something of good augury : and Humayun rejoiced in the thought of his beloved girl-wife (she was only fifteen when she gave birth to her first-born). She had not been over-willing to marry a fugitive king without a crown; but she had charmed his heart, he had wooed her with ardour, and now she had given him an heir and hope.

Such an occasion should have been celebrated with pomp and ceremony and the giving of many presents. What was the proud father to do in his poverty? His servant Jauhar, who was there, has recorded the scene : how Jauhar was ordered to bring a bag of silver coins and a silver bracelet and a pod of must; and how Humayun ordered the silver to be given back to the owners from whom it had been taken (a convenient mode of largesse), and taking the pod of musk broke it on a porcelain dish and distributed it among the chief of his followers, and said, ‘This is all the present I can afford to make you on the birth of my son, whose fame will, I trust, be one day expanded over all the world, as the perfume of the musk now fills this tent.’ The child was given the name of Akbar. He was born on the twenty-third day of November 1542.

But Humayun could not at once have the joy of embracing wife and son. He was on the march, and did not rest till he had taken possession of the town of Jun and made his encampment secure against surprise. At last, on 28th December, Hamida and her baby arrived, and Humayun for the first time set eyes on his son. Till July of the following year he stayed at Jun, planning what he should to next. The birth of his son strengthened, no doubt, the resolution, which he had never given up, to recover by some means of other his lost kingdom. For though he had many weaknesses, and was no master of war like his father, he had a certain tenacity of purpose even in circumstances the most desperate. He could not for ever roam the deserts of Sind. Should he try for Kandahar? Once there, he might get help from the Persian Shah. It was on Kandahar that he decided to march. But there were his two brothers, Kamran and Askari, to be reckoned with. Kamran was ruler of Kabul, and Askari, the younger brother, held the province of Kandahar under Kamran. Their attitude was doubtful : but the hazard must be run. Humayun had a long and difficult march before him. He had to cross the Indus and then find a way over the mountain-barriers of Baluchistan. Arrived at the frontier of Kandahar province, Humayun received sudden and dismaying news. Askari, his brother, was in motion to attack him with a force far outnumbering his own. There was nothing for it but to flee, and not a moment to be lost. There was a hurried consultation. The child Akbar had been brought so far in his mother’s arms : but in the mountains of Afghanistan the extremes of heat and cold would be fatal to a one-year-old baby, now that they must travel on horseback and at forced speed. The child was left behind in the care of Jauhar. They were even short of horses, and Hamida must ride on Humayun’s horse with him. The fugitives dashed away to the mountains, and were hardly gone when Askari swooped downon the camp and captured his infant nephew.

Read More...

2013-07-12

నవతరంగం: సాహసం

2013-07-12 08:52 PM వెంకట్ శిద్దారెడ్డి
ఐతే సినిమాతో మొదలుపెట్టి కేవలం నాలుగు సినిమాలతో అశేష అభిమానులని సంపాదించుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. నాలుగేళ్ల క్రితం వచ్చిన ప్రయాణం సినిమా కాస్త నిరాశ కలిగించినప్పటినుంచీ చందు గారి తర్వాత సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తూ వచ్చారు. ఇవాళ విడుదలయిన సాహసం సినిమాతో యేలేటి మరో సారి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పటికే అన్ని వర్గాల నుంచీ ప్రశంసలు అందుకున్న ఈ సినిమా గురించి ఒక విశ్లేషణాత్మక వ్యాసం. కథ గా(...)

బాల గౌతమి: (శీర్షిక లేదు)

2013-07-12 05:39 PM Murthy ([email protected])
http://balagoutami.blogspot.in/p/news.html

లోకహితం: ఉత్తరాఖండ్ ప్రళయం వెనుక...?

2013-07-12 11:30 AM Loka Hitham ([email protected])
గంగమ్మ ఉగ్రరూపం దాల్చింది. తన బిడ్డల పైనే కన్నెర్ర చేసింది. ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టేసింది. వేలాది మందిని తనలో కలుపుకొని సమాధి చేసింది. పటపటా పళ్లు కొరుకుతూ పూర్తిగా చదవండి

లోకహితం: చెవిలో నొప్పి, చెముడు

2013-07-12 11:29 AM Loka Hitham ([email protected])
మల్లె ఆకుల నుండి రసము తీసి వడపోసి దానిలో నాలుగవ వంతు తేనె కలిపి 2 నుండి 4 పూర్తిగా చదవండి

పుస్తకం: సంజీవదేవ్ శతజయంతి సభ-ఆహ్వానం

2013-07-12 04:39 AM పుస్తకం.నెట్
సంజీవ దేవ్ శతజయంతి సభ వివరాలు: తేదీ: 21 జులై 2013, ఆదివారం సమయం: ఉదయం 10:30 గంటలకు వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్, దోమలగూడ, ఇందిరాపార్క్ దగ్గర, హైదరాబాద్. ఈ సభలో సంజీవదేవ్ ఇంటర్వ్యూ గల డీవీడీ ప్రదర్శన, “సంజీవదేవ్ జీవనరాగం” (అనుసృజన) అన్న రావెల సాంబశివరావు పుస్తకావిష్కరణ ఉంటుంది. మరిన్ని వివరాలకి ఆహ్వానపత్రం చూడగలరు.

పుస్తకం: సౌశీల్య పురస్కార ప్రదాన సభ – ఆహ్వానం

2013-07-12 04:31 AM పుస్తకం.నెట్
డాక్టర్ రాళ్ళపల్లి సుందరం (విశ్రాంత తెలుగు ఆచార్యులు, మైసూరు విశ్వవిద్యాలయం) తమ తల్లిగారి పేరిట నెలకొల్పిన సౌశీల్య పురస్కార ప్రదాన సభ 13-07-2013 న సాయంత్రం ఐదు గంటలకు, హోటెల్ అలంకార్ ఇన్, విజయవాడలో జరుగనుంది. పురస్కార స్వీకర్త బాలాంత్రపు రజనీకాంతరావు గారు. వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి. (వార్త సౌజన్యం – అనిల్ అట్లూరి)

పుస్తకం: జీవితాన్నిమరింతగా ప్రేమించడం నేర్పిన…

2013-07-12 01:30 AM Srinivas Vuruputuri
ఈ పుస్తకం రాసినావిడ పేరు జిల్ బోల్టీ టేలర్. ఆవిడ ఓ neuro anatomist (నాడీ మండల నిర్మాణ శాస్త్రవేత్త అనాలా? బ్రెయిన్ సైంటిస్టు అనడం తేలికేమో). జిల్ కన్నా ఓ ఏడాదిన్నర పెద్దవాడైన తన అన్నయ్య చిన్నప్పటినుంచీ సైకోసిస్ లక్షణాలను కనబరచేవాడట. చాలాకాలం తరువాత – ఆయన ముప్పయ్యొకటో యేట – ఆయనకి ష్కిజోఫ్రీనియా ఉన్నదని నిర్థారించారట వైద్యులు. “ఒకే ప్రపంచాన్ని చూస్తున్న మా ఇద్దరి నడుమ ఎంత వ్యత్యాసం? నా కలలను నేను సాకారం [...]

2013-07-11

Home: దాగుడుమూతలు

2013-07-11 08:54 AM సాయికిరణ్ కుమార్ ([email protected])

ఎప్పుడో మొదలైన ఆట ఇది
ఇప్పటికీ మారలేదు.

దాటిన గోడలు
దాగిన నీడలు
అన్వేషణలో ఇవి మామూలే

వైఫల్యం, వైరాగ్యం మధ్య
గెలుపు అనుమానాస్పదమైతే
ఆ పక్కనే మరో ఆశ

అలజడే అదృశ్యమైతే
కనుచూపు మేరా
కాంతిపుంజాలే

పుస్తకం: తనికెళ్ళ భరణి సాహితీ పురస్కారం 2013 ప్రదానోత్సవం

2013-07-11 07:22 AM పుస్తకం.నెట్
తనికెళ్ళ భరణి సాహితీ పురస్కారం 2013 ప్రదానోత్సవం ఈ వారాంతంలో జరుగనుంది. పురస్కార స్వీకర్త నగ్నముని. ప్రదానోత్సవ సభ ఆహ్వానం, వివరాలు ఇవి: తేదీ: 14 జులై 2013, ఆదివారం. సమయం: సాయంత్రం 6 గంటలకు వేదిక: శ్రీ తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ “నగ్నమునిది మెదడు చితికి కవితంతా నెత్తురు దిగంబరపు అంబరాలు గుబాళించు అత్తరు!” -తనికెళ్ళ భరణి.

పుస్తకం: దీపతోరణం – సమీక్ష

2013-07-11 01:30 AM అతిథి
వ్యాసకర్త: యు. సారిక, సూర్యాపేట ******* దీపతోరణం అనే ఈ కథానికల సంకలనంలో వంద మంది రచయిత్రుల కథలున్నాయి. ప్రస్తుతం కథలు రాస్తున్న దాదాపు రచయిత్రులందరూ ఈ దీపాలంకరణలో పాలు పంచుకున్నారు. నవరసాలూ ఒలికినప్పటికీ…..ఈ సంపుటి లో ఎన్నదగిన కథలు తక్కువే ఉన్నాయని చెప్పక తప్పదు. వీటిలో సమస్యలు చర్చించినవీ, అభ్యుదయ భావాలున్నవీ, పురోగామి దృక్పథం తో కూడుకున్నవీ,మానవత్వానికి వన్నె తెచ్చేవీ ఉన్నాయి. ఇంకా హాస్య కథలూ, సందేశాత్మక కథలూ చోటు చేసుకున్నాయి. స్త్రీల సమస్యల్ని నిజాయితీ’గా [...]

2013-07-10

పుస్తకం: “రాయవాచకము” ఆవిష్కరణ సభ

2013-07-10 12:03 PM పుస్తకం.నెట్
విశ్వనాథ నాయనయ్య వారి స్థానపతి 16 వ శతాబ్దంలో రచించిన “రాయవాచకము” పుస్తకానికి శ్రీ మోదుగుల రవికృష్ణ సంపాదకత్వంలో పటాలు, చిత్రాలు మరియు వివరణలతో తాజా ముద్రణ వచ్చింది. ఆ పుస్తకావిష్కరణ వివరాలు: తేదీ: 13 జూలై 2013 శనివారం సమయం: సాయంత్రం 6.30 గంటలకు వేదిక:అన్నమయ్య కళావేదిక ప్రాంగణం, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం, బృందావన్ గార్డెన్స్‌, గుంటూరు. మరిన్ని వివరాలకి కినిగె.కాం వారి వెబ్సైటులో చూడండి.

పుస్తకం: The original short stories of Sherlock Holmes

2013-07-10 01:30 AM అతిథి
Written by: Pramadha Mohana, IX D, Delhi Public School, Nacharam, Hyderabad. ****** This summer, when I was looking for a good book to read, I stumbled upon “The Original Short Stories of Sherlock Holmes”, taking me back to the time when I had had my first acquaintance with Mr. Sherlock Holmes. My first Holmes‘story, I [...]

2013-07-08

పుస్తకం: వీక్షణం-39

2013-07-08 01:30 AM పుస్తకం.నెట్
తెలుగు అంతర్జాలం గండపెండేరమంటే..? – అవధానం నాగరాజారావు వ్యాసం; ఆచార్య కొలకలూరి ఇనాక్ అమృతోత్సవం-సాహితీ వజ్రోత్సవం సందర్భంగా రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి వ్యాసం “అక్షరానికి అరవయ్యేళ్ళు” – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి. వౌలిక తేజానికి పరావర్తనమే ‘చేతనావర్తం’ – మాదిరాజు రంగారావు వ్యాసం; “అసలు సమస్య స్పృశించడమే కర్తవ్యం” వ్యాసం; “కన్నడ వేమన… కవి సర్వజ్ఞుడు!” – స్వరోచి వ్యాసం – ఆంధ్రభూమి “సాహితి” శీర్షిక విశేషాలు. కా.రా. గారితో ఎన్.వేణుగోపాల్ సంభాషణ; “అసమర్థుని జీవయాత్ర” పై వ్యాసం; [...]

2013-07-07

జాబిల్లి: అక్షరమే అమ్మ

2013-07-07 12:09 PM జాబిల్లి
  ‘అ’ అని నోరు తెరవమని అమ్మ గోరు ముద్దలు తినిపించింది ‘ఆ’ అని నవ్విస్తూ ‘ఇ, ఈ’ ల ఇకఇకలతో ‘ఉ, ఊ’ అని నేనంటున్నా ‘ఎ, ఏ’ , ‘ఐ’ అంటూ ‘ఒ, ఓ ‘ , ‘ఔ’నని నాతో అనిపిస్తూ ‘అం’ అన్న నా ముద్దు పలుకులకి ‘అః’ అని అమ్మ … Continue reading

Home: తెల్లారింది లెగండో కొక్కురోకో

2013-07-07 07:13 AM Vishnu Shankar Jarugumilli ([email protected])
M.V. Raghu (Image: The Hindu)ఎం.వి.రఘు దర్సకత్వంలో 25 సంవత్సరాల క్రితం జూలై 23, 1988న విడుదలైన "కళ్ళు" చిత్రం, తెలుగులో వచ్చిన అతి కొద్ది కళాత్మక చిత్రాలో ఒకటి.
 
ఆ రోజుల్లో పూర్తిగా కొత్త వాళ్ళతో తీసి ఎన్నో అవార్డ్లు సాధించిన ఈ చిత్రంలో, సీతారామ శాస్త్రి రాసి, స్వయంగా పాడిన ఈ పాట, సాహితీ పరంగా ఓ ఆణిముత్యం. బాలసుబ్రమణ్యం సంగీతం అందించిన ఈ పాట సాహిత్యం “ఆవకాయ” ద్వారా అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
 
తెల్లారింది లెగండో కొక్కురోకోమంచాలింక దిగండో కొక్కురోకో
 
పాములాంటి చీకటి పడగ దించి పోయింది , బయం నేదు బయం నేదు నిదర ముసుగు తీయండి
చావు లాంటి రాతిరి సూరు దాటి పోయింది , బయం నేదు బయం నేదు చాపాలు సుట్టేయండి
ముడుసుకున్న రెక్కలిడిసి పిట్ట చెట్టు ఇడిచింది , మూసుకున్న రెప్పలిప్పి సూపులెగరనియ్యండి
 
తెల్లారింది లెగండో కొక్కురోకోమంచాలింక దిగండో కొక్కురోకో
 
చురుకు తగ్గిపోయింది చందురునికంటికి ,   చులకనైపోయింది లోకం సీకటికి
కునుకు వచ్చి తూగింది చల్లబడ్డ దీపం , ఎనక రెచ్చిపోయింది అల్లుకున్న పాపం
మసకబారి పోయిందా చూసేకన్నూ, ముసురుకుందా మైకం మన్నూ మిన్నూ
కాలం కట్టిన గంతలు తీసి , కాంతుల ఎల్లువ గంతులు వేసి
 
తెల్లారింది లెగండో కొక్కురోకో, మంచాలింక దిగండో కొక్కురోకో
 
ఎక్కిరించు రేయిని చూసి ఎర్రబడ్డ ఆకాశం, ఎక్కుపెట్టి ఇసిరిందా సూరీడి సూపుల బాణం
కాలి బూడిదైపోదా కమ్ముకున్న నీడా , ఊపిరితో నిలబడుతుందా చిక్కని పాపాల పీడా
సెమటబొట్టు చమురుగా సూరీడ్ని ఎలిగిద్దాం , వెలుగుచెట్టు కొమ్మల్లో అగ్గిపూలు పూయిద్దాం
వేకువ చెట్టున కత్తులు దూసి , రేతిరి మత్తును ముక్కలు చేసి
 
తెల్లారింది లెగండో కొక్కురోకో, మంచాలింక దిగండో కొక్కురోకో
 
 

2013-07-05

వీక్షణం: Veekshanam July 2013

2013-07-05 01:14 PM veekshanampatrika

Veekshanam July 2013 issue 

click  07_july_2013  to view the issue

07_july_2013


స్త్రీవాద పత్రిక భూమిక: Cover page

2013-07-05 10:52 AM భూమిక

Home: AKBAR - Chapter 3

2013-07-05 06:42 AM Laurence Binyon ([email protected])

III

BUT what of his more immediate ancestry?

Once, returning from a campaign, Akbar questioned Monserrate about Sebastian, king of Portugal, who had fallen fighting against the Moors in 1578. When he had heard the story, he burst out, ‘I can never sufficiently praise the heroism of those who fight hand to hand and in deadly earnest. But I shall never cease to condemn the cowardice of those who prefer the safety of their bodies to the eternal glory of War!’

The joy of danger, the eternal glory of war! It might be the voice of Babur. From the June day when his father – short, stout, careless, hasty – visiting his pigeons in a pigeon-house on the top of a precipice was suddenly hurled to the bottom, pigeons and all, by a landslip and transferred to another world, Babut, then a boy of eleven, had to fight for his crown or his life or his ambition; and he loved it. The moment that he heard that his father was dead he sprang on horseback. Three invasions menaced his capital. He had to meet and quell them all. Three years later, he seized Samarcand, the city of his forefather Timur, the city of his dreams. After a hundred days of possession, he lost it. Twice later he was to hold it for a brief time : then he lost it for ever. His Usbeg enemies were too strong for him. And he had lost his little kingdom of Ferghana too. His great ambition had been to sit on Timur’s throne in Samarcand. He renounced that cherished dream, but a throne he was determined to have, while he tramped the hills an exile among the shepherds. He had undying confidence in his star. His thoughts turned south-ward. Kabul was in a state of anarchy, following the death of its king, who was Babur’s uncle. He decided to march on Kabul. He took it and became king. At Kabul he was on the road to India : and according to his own account, the thought of subduing Hindostan was already in his mind as soon as he had become master of Kabul. Long before, a very old woman had told him tales of Timur’s invasion of India : and he had never forgotten. If he could not have Timur’s throne in Samarcand, he might follow in his ancestor’s footsteps southward. But it was twenty-two years after the conquest of Kabul before he entered Delhi in triumpth and founded the empire that Akbar was to rule.

In temperament and in certain outstanding traits of character Akbar resembled his grandfather. But we shall note the differences.

Babur in his perfectly frank and delightful Memoirs, one of the most remarkable books of its kind ever written, gives us a vivid self-portrait. He has the Mongol restlessness in his blood : but he is much more a Turk, and has no words strong enough for his hatred and contempt of the Mongols he knew. With enormous energy and absolutely fearless courage, he is rapid in his decisions, often succeeding by his swift action but often betrayed into disaster by his reckless confidence. But he could profit by experience. He trained his army to a high pitch of efficiency : he became a master of the art of war. Severe in discipline, he could at times be savagely cruel (the Mongol strain perhaps coming out), yet in general he was chivalrous, loyal, generous, and forgiving. He hated falseness above all.

Babur might appear to be nothing more than a splendid adventurer of exceptional ability, but that he seems, all through the amazing vicissitudes of his career, to have nourished the dream of founding an empire, and to have succeeded, not by the mere luck of a soldier of fortune but by a singular pertinacity and belief in his destiny. And even as an adventurer he is remarkable. This hardy soldier, this marvelous fighter, who swims every river he comes across, astonishes us by his singular sensibility. A man could win his heart by his love of poetry as surely as by his swordsmanship. Was he flying from his enemies in bitter weather with a handful of followers? He would compose a few couplets as he rode, and his spirits revived as by magic. But it was his intense delight in the beauty of the world which made so large a part of his unquenchable zest in life. Was ever such a lover of flowers? His first thought in a newly acquired territory was to make a garden, himself superintending the disposition of the beds and the leading of fresh runnels of water among them. In the year before his death in 1530, amid the heat and dust of India, he writes : “The other day they brought me a musk-melon : as I cut it up I felt a deep home-sickness and sense of exile from my native land, and I could not help weeping.’

Read More...

2013-07-04

విహంగ: దాలప్ప తీర్థం పుస్తకావిష్కరణ

2013-07-04 03:18 PM విహంగ మహిళా పత్రిక

Home: ఎవరు వారు?

2013-07-04 07:33 AM skv ([email protected])
ఇక దాని బ్రతుకంతమొంది గోడల మధ్యనే గడిచి పోతుందనుకున్నాను 
రోదనే తప్ప దానికిక నవ్వే యోగమే లేదనుకున్నాను 
కానీ ఉన్నట్టుండి దానికెవ్వరో పట్టాభిషేకం చేసారు 
ఇపుడది చిందించే హాసాన ఈ లోకమే మెరిసి మురిసిపోతోంది 
ఎవరు వారు? కంటికి రెప్పలై, ఇలా ఆ మానవతకు పట్టం కట్టినవారు 
వారించలేని కల్లోలాన్ని పీడకలలా మలచిన వారు 
విలాసంగా నవ్వుతున్న మృత్యువు వెన్నులో వణుకు పుట్టించిన వారు 
ఎవరు వారు? ఆత్మీయతకు అద్దం పట్టినవారు 
ఆప్యాయతలో అమ్మనూ మించిపోయినవారు 
అడవి దారుల పట్టి పోతున్న సమాజానికి అసలు దారిని చూపినవారు 
ఎవరు వారు? కోటల్లోని మాటల రాయుళ్ళకు 
మనుషులను చేరడమెలాగో చేతల్లో చూపినవారు 
ఆదుకోవడమే ఆయుధానికి పరమార్ధమని చాటినవారు 
ఇరుకిరుకు దారుల, మనసుల మూలల్లోకి చేరినవారు 
ఎవరు వారు? దేవుడే దిక్కంటూ మ్రొక్కిన వారికి దిక్కైన వారు 
విలువలకు దిక్సూచి ఐనవారు 
మనుషులుగా మనలను గుభాళించమన్నవారు 
ఎవరు వారు? నిన్నటి రోదనల మాటున రేపటి నవ్వులను బ్రతికించిన వారు 
ఉలికిపడిన జాతి గుండెనూరడించినవారు 
అమ్మ పాల ఋణాన్ని ఇంత చక్కగా తీర్చుకున్నవారు 
ఎవరు వారు? చావు బ్రతుకుల సరిహద్దు సీమలను 
సాహసంతో సమీపించి 
ఆ దేవుని కన్నా ఓ మెట్టు పైన నిలబడినవారు 
అమృతం కూడా ఈయలేనంతటి అమరత్వాన్ని 
మానవత్వపు మాటున అందుకున్న వారు 
ఎవరు వారు? ఎవరు వారు?

2013-07-03

Home: మంకు తిమ్మ కగ్గ- కన్నడ "వేమన" పద్యాలు

2013-07-03 07:50 AM kadambari piduri ([email protected])

తెలుగు భాషలో “మంకు పట్టు” అనే ఒక పదం ఉన్నది. గత దశాబ్దము కిందటి వరకూ ఈ మాట పెద్దల నాలుకల మీద బాగానే ఆడుతూండేది. “అలాగ మంకు పట్టు పట్టకు. పెంకె తనం పనికి రాదు”అంటూ పిల్లలకు బుద్ధి సుద్ధులను గరిపేవాళ్ళు. "పెంకె ఘటం వీడమ్మా!" అంటూ ఆ రోజులలో విసుక్కోవడమూ కద్దు. అలా “పెంకి పెళ్ళాం” అనే సినిమా కూడా వచ్చింది. రాజసులోచన హీరోయిన్, ఎన్. టి. రామారావు హీరో. షేక్ స్పియర్ డ్రామా “The Taming of the shrew” అనే కథాంశముతో భారతీయతతో రంగరించి చేసిన తెలుగు సినిమా అది. 

సరే! ఇంతకీ ప్రస్తుతం “మంకు” అనే ఈ పద మీమాంస ఎందుకు వచ్చింది?

*******************

ఆట వెలది అనగానే మనకు ఠకాల్న జ్ఞాపకం వచ్చే కవి “మహా కవి వేమన”.  “విశ్వదాభిరామ వినుర వేమ” అనే మకుటంతో ఛందో బద్ధ శతక పద్యాలలో మకుటాయమానమై ప్రభలీనుతూన్నది కదా. మన తెలుగు కవి వేమన్న- తన పద్యాలలోని పోలికలు నిత్య జన జీవితాల నుంచి గైకొన్నాడు. అలవోకగా అనేక భావలను శ్రోతలకు చిటికెలో బోధ పడేటట్లుగా రాసిన ఆటవెలదులు. అతి సామాన్యమైన పోలికలతో అనంత భావాలను “కొండలను చూపిన అద్దము” వోలె ఉన్నట్టి ఆ చిట్టి పద్దెములు ప్రజల చేత “ఔరా!” అనిపిస్తూ ముక్కుల మీద వేళ్ళు వేసుకునేట్లు చేసినవీ అంటే ఏ మాత్రమూ అతిశయోక్తి కాదు.

*******************

మన పొరుగు రాష్ట్రమైన కర్ణాట రాష్ట్రములోని “మంకు తిమ్మ” రచనలు కూడా వేమన సూక్తులను బోలినవి. 

DVG“మంకు తిమ్మ కగ్గ”గా (ಮಂಕು ತಿಮ್ಮನ ಕಗ್ಗ) పిలువబడే పద్యాల గుచ్చాన్ని అల్ల్లినది ప్రముఖ కన్నడ కవి డాక్టర్ దేవనహల్లి వెంకటరమణయ్య గుండప్ప. వీరు డి.వి.జి అన్న హ్రస్వ నామముతో సుప్రసిద్ధులు. కర్ణాటక సీమలో బహుళ వ్యాప్తిలో ఉన్నవి. సమత్వ భావనను జగతికి చాటిన వాక్కులు, కగ్గ పద్దెములు. సంఘములోని మూఢనమ్మకాలను, దౌష్ట్యాన్నీ ఎత్తిచూపుతూ కేవలము పండితులనే కాక పామరులను సైతం ఆకట్టుకున్నవి.

కవి పరిచయము

కృష్ణమూర్తి నాడిగ గారు బురదలో కూరుకుని మరుగున పడిన సహస్ర దళ నళినములను లోకానికి కరతలామలకం గావించారు. తీరా బైటికి తీసాక అవి మామూలు పువ్వులు కావు, అపరంజి పద్మములు- అని తెలుసుకుని, యావత్తు కన్నడ సారస్వత సీమ అచ్చెరువుతో ఆనందంలో ఓలలాడింది. అంతటి అద్భుత అమూల్య ముక్తక కౌస్తుభములను కావ్య ప్రపంచమునకు అందించగలిగిన భాగ్యశాలి D.V.G. కి “డాక్టరేట్”ను 1975 లో Karnataka state Government ఇచ్చింది.

అంతేనా! ఆయన అనేక గౌరవ పురస్కారములను అందుకున్నారు.

1974 లో "పద్మభూషణ్ అవార్డు"ను కర్ణాటక ప్రభుత్వం 1974 లో ఇచ్చి, గౌరవించింది. 1970 లో 90 వేల రూపాయల పారితోషికమును రాష్ట్ర ప్రభుత్వము ఇచ్చి, సన్మానం చేసింది. ఈ మాన్యతా సభ బెంగుళూరులోని "రవీంద్ర కళాక్షేత్ర" లో వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్ చేతుల మీదుగా D.V.G. అందుకున్నారు. ఆ నాటి సభాసదులు మరొక మంచి సంఘటనా సరోరుహమును తమ మానససరోరములలో నిలుపుకోగలిగారు.

అదేమిటంటే- D.V. గుండప్ప- తాను పొందిన 90,000/- నూ అప్పటికప్పుడే బెంగుళూరులోని "గోఖలే ఇన్ స్టిట్యూట్" కు విరాళముగా ఇచ్చారు. ("Gokhale Institute of Public Affairs (GIPA) located in Bull Temple Road, Basavanagudi.

1988 లో భారతీయ పోస్టల్ సర్వీసు వారు "stamp of Dr. Gundappa" ను రూపొందించి ఆ మహనీయునికి నివాళులు అర్పించింది. డి.వి.జి.- గా విఖ్యాతి గాంచిన “డాక్టర్ దేవనహల్లి వెంకటరమణయ్య గుండప్ప” మంకు తిమ్మ కగ్గ ప్రోక్త కబ్బములను వెలుగు లోకి తెచ్చి, ప్రాచీన, అర్వాచీన కర్ణాటక సాహిత్య నందన వనములో కొత్త పూల మొక్కలను విరగబూసిన ఘనతను దక్కించుకున్నారు.

****************

మచ్చుకు కొన్ని 'తిమ్మ' నుడువులు చూద్దాము:-

Read More...

2013-07-02

స్త్రీవాద పత్రిక భూమిక: సంపాదకీయం

2013-07-02 01:30 PM భూమిక
మైలారం పిల్ల….. పిల్లకాదు, మహా పిడుగు పోరుగడ్డ….. ఓరుగల్లు….. రుద్రమ సాహసం….. వరంగల్‌ గురించి తలుచుకుంటేనే వొళ్ళు పులకరిస్తుంది. నేను పుట్టింది ఆంధ్రలోనే. అయితేనేం వరంగల్‌….. నాకు యిష్టమైన ప్రాంతం. అలాంటి ఉద్యమాల వరంగల్‌ నుండి ఓ పేదపిల్ల, కూలిపిల్ల….. జీవితం కుప్పకూలిపోతున్నా….. కూడదీసుకుని….. నిఠారుగా నిలబడి….. ఐనా, నేను ఓడిపోలేదు! అంటూ ఓ పొలికేక … Continue reading

2013-07-01

కొత్తపల్లి: కొత్తపల్లి e-పుస్తకం

2013-07-01 04:00 PM

కొత్తపల్లి పుస్తకాన్ని ప్రత్యేకమైన...

కొత్తపల్లి: కొత్తపల్లి డౌన్లోడులు

2013-07-01 04:00 PM

కొత్తపల్లి పత్రిక పిడియఫ్ ప్రతిని ఇక్కడినుండి...

ఈమాట: ఈమాట జులై 2013 సంచికకు స్వాగతం!

2013-07-01 11:06 AM
మానవ సమాజ పరిణామ క్రమంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం లిపి పుట్టుక -- రాత ద్వారా మానవుడు సమాచారాన్ని పంచుకోవడం. ఆ రాత పుట్టుక, పెరుగుదలల పూర్వోత్తరాలను ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్ వివరిస్తున్న సమీక్షా వ్యాసపు మొదటి భాగం రాత పుట్టుక, పరిణామం: 1. పాశ్చాత్య ప్రపంచం; భగవంతం కవిత త్రిపురాత్రి... త్రిపురహిత పగలు ఇటీవలే కీర్తిశేషుడైన కవి, రచయిత త్రిపుర జ్ఞాపకంలో కనకప్రసాద్ అవధారు; కవి, పుస్తకం, కర్తృత్వం మీద తన సిద్ధాంతాన్ని మరికొంచెం వివరిస్తూ వెల్చేరు నారాయణ రావు రాసిన వ్యాసం మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు రెండవ భాగం; మే 24-26న డాలస్‌లో జరిగిన తానా 19వ ద్వైవార్షిక సమావేశాల జ్ఞాపిక ఈమాట గ్రంథాలయంలో; ఆకాశవాణి పన్నాల సుబ్రహ్మణ్య భట్టు త్రిపురల పిచ్చాపాటీ;నాకు నచ్చిన పద్యం శీర్షికను ఇకనుంచీ కొనసాగించే భైరవభట్ల కామేశ్వర రావు మొదట చెప్పిన పద్యం దాశరథి మించుకాగడా -- ఈ సంచికలో విశేషాలు.

తెలుగు పలుకు - తానా 2013 జ్ఞాపిక


ఇంకా ఈ సంచికలో: ఎలనాగ, తః తః, స్వాతికుమారి, నారాయణ, జాన్‌హైడ్, ఆర్. దమయంతి, దేశికాచార్యులు, ప్రసాద్, భాస్కర్, ఇంద్రాణి, శ్రీవల్లీ రాధిక, హెచ్చార్కెల కవితలు; రవిశంకర్, సుబ్రహ్మణ్యం, శివకుమారశర్మల కథలు; మోహన రావు, మురళీధరరావుల వ్యాసాలు; సత్యం శంకరమంచి అపురూపమైన ఆడియో రూపకం హరహరమహదేవ...

ఈమాట: చిన్నారి - దేవత

2013-07-01 11:06 AM అవినేని భాస్కర్
కండలు తిరిగిన కుర్రాడొకడు ఎక్కాడు మొరటుగా రెక్కలు నలిగేట్టు వాడి చేతిలో చిట్లిన గాజు చనిపోయిన తన ప్రేయసి పెట్టిన తొలిముద్దు జ్ఞాపకపు ముక్క

ఈమాట: సిఱుమియుం తేవదైయుం

2013-07-01 11:05 AM కవిప్పేరరసు వైరముత్తు
తిడీరెండ్రు మేగంగళ్ కూడిప్ పుదైత్తన వానై ఒరే తిసైయిల్ వీసలాయిట్రు ఉలగక్ కాట్రు పూనైయురుట్టియ కణ్ణాడిక్కుడమాయ్ ఉరుండదు పూమి స్వరం - వైరముత్తు; సంగీతం - ఇళయవన్ మరుండదు మానుడం అప్పోదుదాన్ అదువుం నిగళ్దదు వాన్వెళియిల్ ఒరు వైరక్కోడు కోడు వళర్దు వెళిచ్చమానదు వెళిచ్చ విరిందు సిఱగు ముళైత్త తేవదైయానదు సిఱగు నడుంగ తేవదై సొన్నదు: “48 మణి నేరత్తిల్ ఉలగప్పందు కిళియప్ పోగిఱదు ఏఱువోర్ ఏఱుగ ఎన్చిఱగిల్ ఇన్నొరు కిరగం ఎడుత్తేగువేన్ ఇరండే ఇరండు నిబందనైగళ్: ఎళువర్ మట్టుమే ఏఱలాం ఉమక్కు పిడిత్త ఒరు పొరుళ్ మట్టుం ఉడన్కొండు వరలాం” పుజవలియుళ్ళ ఇళైఞన్ ఒరువన్ సిఱగు నొఱుంగ ఏఱినాన్ అవన్ కైయిల్ ఇఱంద కాదలియిన్ ఉడైంద వళైయల్ ముదల్ ముత్తత్తు ఞాబగత్తుండు ఒన్నొరు కిరగం కొండాన్ ఎండ్రెండ్రుం వాళ్గ కొట్టిముళంగుం కోషత్తోడు సిఱగేఱినార్ అరసియల్వాది తంగక్ కడిగారం కళట్రియెఱిందు కళింబేఱియ [...]

ఈమాట: దైవం

2013-07-01 11:05 AM పాలపర్తి ఇంద్రాణి
కడలి అడుగున వెలిగే చేప కడుపు లోపల తిరిగే పాప రక్తమంటిన సింహపు కోర

ఈమాట: మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం

2013-07-01 11:05 AM గరిమెళ్ళ నారాయణ
ఎవరన్నారు మనిషంటే ఘన పదార్ధమని? చెట్టిక్కిన వాడూ మనిషే ఎక్కిన కొమ్మను నరుక్కున్న వాడు మనిషే కింద పడి విలవిలలాడి మృత్యువును ముద్దాడిన వాడూ మనిషే

ఈమాట: నా హృదయం

2013-07-01 11:05 AM టి. శ్రీవల్లీ రాధిక
దానికన్నా నిరుపయోగమైనది లేదు రూపం లేదు భాషా రాదు నడవడం తెలియదు నవ్వీ ఎరుగదు కష్టాలు తీర్చదు కరచాలనానికీ అందదు

ఈమాట: సిరిపాలుఁడు

2013-07-01 11:04 AM తిరుమల కృష్ణదేశికాచార్యులు
పున్నాగములు కొన్ని మూర్ధంబునందు, కాంచనంబులు కొన్ని కంఠంబునందు, మల్లెపూవులు కొన్ని యుల్లంబునందు, హల్లకంబులు కొన్ని హస్తంబులందు, పంకజంబులు కొన్ని పాదంబులందు,

ఈమాట: వేకువనే మోకరించే ఆమె

2013-07-01 11:04 AM జాన్‌హైడ్ కనుమూరి
వేకువలో పాడే ఆమె గొంతు లోంచి విడుదలయ్యే ధ్వని తరంగాలు నిరంతరంగా ప్రకంపనాలు రేపుతుంటాయి

ఈమాట: అలిఖిత కఠిన శాసనం!

2013-07-01 11:04 AM ఆర్. దమయంతి
తడారిన గాలి, వడి వడిగా నడుస్తూ నిప్పులోకి దూకుతోంది. తన చివరి పరిమళపు జావళిని వినిపిస్తూ ఓ మల్లె మట్టిలో రాలిన చప్పుడవుతోంది.

ఈమాట: రహస్య సాంగత్యం

2013-07-01 11:03 AM ఎలనాగ
కనపడని ఒక విచ్ఛేదం కడుపులో పొంచి వున్నట్టు బద్దలవబోయే బాంబు ఒకటి లోపల బస చేసి టిక్ టిక్ టిక్ అంటున్నట్టు దేహం లోని అంతరింద్రియంపై దాడి చేసేందుకు క్రూరమృగమొకటి

ఈమాట: మళ్ళీ అదే సంచిక

2013-07-01 11:03 AM తః తః
మన ప్రేమ మన కలల చుట్టూ మనం అల్లుకున్న వల అది కొండగాలి కౌగిలిలో కోన కిలకిల...

ఈమాట: త్రిపురాత్రి… త్రిపురహిత పగలు…

2013-07-01 11:03 AM భగవంతం
శరీరంతో మీరు లేని ప్రపంచంలో నేనూ కొంతకాలం నివసిస్తాను త్రిపురా...! మనిషి ఉన్నప్పటి ప్రపంచాన్ని లేనప్పటి ప్రపంచంతో పోల్చుకుంటూ - కొన్ని కాంతి సమయాల్ని తింటూ - వింత ఆటలో పాల్గొంటూ...

ఈమాట: నదిలోని నీరు

2013-07-01 11:02 AM బండ్లమూడి స్వాతికుమారి
సంధ్యా సముద్రమూ చెరోవైపు నుంచి మీదకొచ్చి పడుతుంటే తిరిగి వెళ్లే ప్రతి అలతో పాటు ఇసుకలోకి కూరుకుపోయే పాదాల్ని పైకి లాక్కుంటూ ప్రయాసపడే వాడు దీపస్థంభానికి చిక్కుకుని రెపరెపలాడుతున్న గాలిపటంతో గుసగుసగా అన్నాడు నాకు తెలుసు ఓడిపోవడానికే మొదలెట్టాను ఈ ఆటని

ఈమాట: పావురాలు

2013-07-01 11:02 AM బి. వి. వి. ప్రసాద్
ఈ పావురాలు ఎగిరేందుకు పుట్టినవికావు ఇవి వాలేందుకే ఈ లోకంలోకి వచ్చాయి కాస్త నీడా కాస్త శాంతీ ఉన్నచోట వాలి నీడ లాంటి శాంతి లోకి వృత్తంలా మరలి
వ్యాఖ్యలు
2013-07-19
Comment on Fourth face by Elanaaga
2013-07-19 09:17 AM Elanaaga - Comments for వాకిలి

స్వాతీ శ్రీపాద గారూ!
చక్కని అనువాదం చేసినందుకు అభినందనలు.అయితే నాకు కలిగిన కొన్ని అనుమానాలను మీ ముందుంచుతున్నాను.
1.రెండవ పంక్తి పూర్తి గందరగోళంగా వుంది. it అనే పదాన్ని పూర్తిగా తీసివేయటమో, లేక దాన్ని keep పక్కనకు
మార్చటమో చేస్తే బాగుండేది.
2.తూనీగలు అనే అర్థంలో వాడి ఉంటే dragonflies అని ఒకే పదంగా కలిపి రాయాలి,dragon flies అని
విడివిడిగా కాదు.Dragon flies అంటే డ్రాగన్ ఎగిరిపోతుంది అనే అర్థం వస్తుంది.మనం కరెక్టుగా రాశామా లేదా అన్నదే
ముఖ్యం తప్ప అక్కడ డ్రాగన్ అనే పదం వచ్చే అవకాశమే లేదని తెలియదా అని దాటవేయలేం కదా!
3.What is creation తర్వాత question mark పెట్టి Nothing but అనే పదాలను next line లోనికి
పంపిస్తే సవ్యంగా వుండేది.
4.ఆంగ్లభాషలో destructing అనే పదమే లేదు.’Destroying’ మాత్రం వుంది.మళ్లీ destruction,
destructive అనేవి సరైన ఆంగ్లపదాలే. Constructing కూడా రైటే.Destructing మాత్రం తప్పు.
5.wet-wet అని రెండు సార్లు రాయటం అవసరమా? బహుశా తెలుగు మూలంలో ‘తడితడిగా’ అని వున్నందుకు
అలా రాశారేమో!
6.It will be delayed కు బదులు I will be delayed అని కాని, There will be a delay
అని గాని రాసి వుంటే సరిగ్గా ఉండేదేమో.
వీటిని వొదిలేస్తే మీ అనువాదం భేషుగ్గా వుంది.
అనుమానాలను వెలిబుచ్చినందుకు అన్యథా భావించరని తలుస్తూ -

Comment on కడలిని దాటిన కార్తి by mythili
2013-07-19 07:31 AM mythili - Comments for సారంగ

సూచనామాత్రంగా చెప్తే అందం వచ్చే విషయాలని ఇంత ‘విపులం ‘ గా వర్ణించటం ఎందుకు?’సాఫ్ట్ పోర్న్ ‘ ప్రధానస్రవంతిలో భాగం అయిపోతూ ఉన్న ఇప్పుడు ఇలా అడగటం అసందర్భంగానూ చాదస్తంగానూ అనిపించే అవకాశం ఉన్నా అడగకుండా ఉండలేకపోతున్నాను

Comment on దేవుడమ్మ by Prasad Bhoja
2013-07-19 07:23 AM Prasad Bhoja - Comments for సారంగ

చాలా బాగా రాసారు ఝాన్సీ గారు … దేవుడు ఇలాగ కూడా ఉపయోగపడడం బాగుంది… మీ చిత్తూరు యాస బాగుంది.
మీరు ఇంకా ఇలాంటి కథలు రాయాలి..

Comment on చిన్నప్పటి రష్యన్ కథలు by mythili
2013-07-19 07:22 AM mythili - Comments for పుస్తకం

ఇంకా ‘ బుల్లి మట్టి ఇల్లు ‘,’బంగారుగిన్నె ‘ ..ఇలాంటి హార్డ్ బాక్ పుస్తకాలూ ఉన్నాయి.ఆ అనువాదాల భాష కూడా వింతగా,సరదాగా ఉంటుంది.ఉప్పల లక్ష్మణ రావు గారివయితే ఇంకా.ఆయన అనువదించిన ‘ వర్షంలో నక్షత్రాలు ‘ అనే కథల సంపుటిని భద్రంగా దాచాము. ‘బంతిమీద డాన్స్ చేసిన అమ్మాయి ‘ ,’రంగులపేటిక ‘,వర్షంలో నక్షత్రాలు ‘ చాలా మంచి ‘పిల్లల ‘ కథలు అందులో.

Comment on రంగ పిన్ని ఆకాశం by జ్యోతిర్మయి
2013-07-19 06:10 AM జ్యోతిర్మయి - Comments for వాకిలి

ప్రవీణ గారి ‘పెద్ద మనిషి’ కవిత గుర్తొచ్చింది. కొత్త పరిష్కారం.మీ శైలి చాలా నచ్చింది పద్మ గారు.

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by Ravikiran Timmireddy
2013-07-19 02:15 AM - Comments for ఈమాట

నాకు ఏదో పన్నెండో క్లాసు దాకా అత్తెసరు మార్కులతో చదువుకున్న తెలుగే నాకు తెలుసు. అందుకని ఇక్కడ నా సందేహాలు, కొన్ని సార్లు చాలా ప్రాధమికంగా, చాలా సిల్లీగా అనిపించడనికి ఆవాకాశవుంది. తెలుగే తెలియని వాడికి ఇక లింగ్విస్టిక్స్ గురించి ఏవంత అవగాహన ఉంటుంది. అక్కడా, ఇక్కడా చదువుకున్న, విన్న ఆ కొద్ది తెలిసీ తెలియని గ్నానం తప్ప. అందుకని కొలిచాల గారు మీరు కొంచం ఓపికగా నా సందేహాలు తీర్చాలి.

మా ఇంటి పేరు తిమ్మిరెడ్డి. చిత్తూరు జిల్లాలో తిమ్మిరెడ్డి వారి పల్లె అని ఒక గ్రామం ఉంది. ఆ మధ్య ఒకరు, తెలంగాణాలో కూడా తిమ్మిరెడ్డి పేరుతో ఒక ఊరు వుందని చెప్పేరు. సరే మా పూర్వీకులు చిత్తూరు నుంచో, తెలంగాణా నుంచో నెల్లూరు జిల్లా, అల్లూరికి వచ్చారని అనుకుందాం. అందువలన వారిని తిమ్మిరెడ్డి వారని అనే వాళ్ళని, ఆ తర్వాత అదే ఇంటి పేరు గా స్థిర పడిందని అనుకుందాం. కానీ నాకు తెలుసు నా చిన్నప్పుడు, మా ఊర్లో ఇద్దరు వెంకట రెడ్లుంటే, వారి ఇంటి పేర్లు ఒకటే. అందుకని ఒకర్ని ఇంటిపేరు+వెంకటరెడ్డి అని మరొకరిని, గంగిరేను చెట్టు వెంకట రెడ్డని పిలిచే వాళ్ళు. కానీ ఆ గంగిరేను చెట్టు వెంకట రెడ్డి ఇంటి పేరు, బహుశా రెండు జనరేషన్స్ తర్వాత కూడా (జనరేషన్ 25 ఏళ్ళనుకుంటే) వాళ్ళ ఇంటి పేరుతో నే ఉనారు, వాళ్ళు గంగిరేని చెట్టు వాళ్ళవలా. అదీ గాక ఓ పది, ఇరవై జనరేషన్స్ క్రితం కూడా, మన ఊళ్ళలో గుళ్ళూ అవి, ఉండేవి కదా, వ్రతాలు, గిట్రా చేసేవాళ్ళు కదా. అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటిపేరు వాళ్ళ గివెన్ నేం తోపాటు చెప్పాలి కదా. అందుకని అసల ఇంటి పేరంటూ ఒకటి వుండుంటే అది ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకతని కల్పించగలిగే స్థితి వున్నప్పుడు ఏ ఊరినించి వచ్చినా, బయట ఎవరు ఎలా పిలచినా, వారి ఇంటి పేరు, అంత ప్రత్యేకత ఉన్నా పేరు ఎవరూ మార్చుకోరు కదా. ఇంత సులభంగా అప్పట్లో ఇంటి పేర్లు మారి పోగలిగితే ఇక ఆ ఇంటి పేరుకి ప్రత్యేకత ఏవుంది? నా అనుమానం ఏవిటంటే అప్పుడసల ఇంటిపేర్లే లేవేవోనని.

నాకు తెలిసింది తక్కువే, నే చదివిన టెక్స్టు బుక్కుల్లో ఎవరూ క్రిష్ణ దేవరాయల ఇంటి పేరు చెప్పలేదు. కానీ పెద్దన గారిని అల్లసాని పెద్దన గారన్నారే. అల్లసాని వారి ఇంటీంటి పేరా, లేకపోతే అది వారి పేరా? అలాగే, రెడ్డి రాజుల వంశంలో వారికి ఇంటి పేర్లని కొన్ని సార్లనిపించినా, కానీ వారింటి పేరు వారి కొడుకులకి వచ్చినట్టులేదే. పెదకోమటి వేమారెడ్డి కొడుకు రచ్చ వేమారెడ్డి. కాటమ రాజు పేరు తెలుసు, రాజరాజ నరేంద్రుడు పేరు తెలుసు, అశోకుడి పేరు తెలుసు, సిద్దార్ధుడు పేరు, సుయోధనుడి పేరు, పాండు రాజు పేరు తెలుసు. వారి వంశం సూర్య వంశవనో, చంద్ర వంశవనో, కురు వంశవనో, అదో ఇదో అని చెప్పుకున్నారు గాని. ఎవరూ కూడా ఇంటి పేరుని కలిపి జోడించి చెప్పుకున్నట్టు లేదు. నాది వినికిడి గ్నానవే అనుకోండి. నాకేవో ఈ ఇంటి పేర్లనేవి చారిత్రికంగా ఈ మధ్య వచ్చిన పరిణామవేవో అనిపిస్తుంది. కన్నడీకులకి, తమిళ వాళ్ళకి వాళ్ళ నాయన పేరే కదా ఇంటిపేరు.

-రవికిరణ్ తిమ్మిరెడ్డి.

2013-07-18
Comment on తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక by మోహన
2013-07-18 07:18 PM - Comments for ఈమాట

ప్రత్యేక సంచికల విలువలు పూర్తిగా ఆయా సంచికల సంపాదకులపైన ఆధారపడినవి. వాళ్లు ఆ సంచికకు ఎన్నుకొన్న వస్తువుపైన (theme) ఆధారపడి ఉంటుంది. ఈ విలువలను generalize చేయలేము. వారి ఆసక్తి, అనుభవము, ముఖ్యముగా వారికి ఉండే కాలావధి మున్నగువానిపైన ప్రత్యేకముగా ఇవి ఆధారపడి ఉంటాయి. నిడివిలో ఈ ప్రత్యేక సంచిక సుమారు రెండు ఈమాట సంచికల సమానము. అనగా నాలుగు నెలలలో ఈమాట చేయగలిగినది, ఈ సంపాదకులు సుమారు రెండు నెలలలో చేయవలసి ఉంటుంది. అంతే కాక రచయితలు కూడ వివిధ రంగాలలో ప్రావీణ్యముగలవారై ఉంటారు. ఇంకొక విషయము ఏమనగా ఇందులో కొందరు ప్రసిద్ధ రచయితలను ఆహ్వానించి వారి వ్యాసాలను కవితలను ప్రచురించడము ఆనవాయితీ. అటువంటివారి రచనలను బాగున్నా లేకపోయినా మార్చడము అంత సులభమైన పని కాదు. వారి మిగిలిన పనులతోబాటు ఈ సంచికను కూడ వెలుగులోకి తెచ్చినందులకు ఈమాట ప్రచురణవర్గమును మనము అభినందించాలి. విధేయుడు - మోహన

Comment on తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక by jayaprabha
2013-07-18 05:59 PM - Comments for ఈమాట

నేను టైపు చేసిన అభిప్రాయం క్లిక్ అయ్యేకా పోయిందేమి? నాకు కూడా వేమూరి వారికి కలిగిన అభిప్రాయమే కలిగింది. ఈమాట చదివే వాళ్లకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుగా ఈ తానా సమావేశాల ప్రత్యేక సంచికల జోడింపుల బరువేల??

మంచి రచనలకి కొరత ఉన్నట్టు గా తానా సంచికలు తీరు చూస్తే తెలుస్తోంది. తెలుగుదేశంలో అచ్చయ్యే సంచికల బాట లోనే రూపు దిద్దుకునే ఇటువంటి సంచికల ప్రత్యేకత ఏమిటో?? రచనలలోనూ ఎడిటింగ్ లోనూ ఈ లోపం స్పస్టంగా కనిపిస్తోంది. చదవాలని అనిపించే రచనలు కనిపించలేదు. ఒక తీరూ తెన్నూ లేని సంచిక! criminal waste of paper.

జయప్రభ.

Comment on సాహసం by sripathi
2013-07-18 05:26 PM sripathi - Comments for నవతరంగం

venkat garu call me urgent

8686111022

Comment on Poetry by sripathi
2013-07-18 05:24 PM sripathi - Comments for నవతరంగం

venkat garu please call me 8686111022

Comment on నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా by కామేశ్వరరావు
2013-07-18 05:11 PM - Comments for ఈమాట

లైలాగారూ,

ప్రాచీన ఆధునిక కవిత్వాలను పోలుస్తూ ఆధునికకవిత్వపు ప్రతీకలలో కచ్చితత్వం లేదనడంలో, అది అర్థంలేని కవిత్వమనడం నా ఉద్దేశం కాదు. దాశరథి కవిత్వాన్ని తక్కువ చేసే ఉద్దేశం అంతకన్నా కన్నాకాదు. అది ఆధునికకవిత్వానికి గుణమనే నేను నమ్ముతాను.

ఇక పశ్చిమదిశలో నాట్యమాడే విషయం గురించి మీరిచ్చిన వివరణ కూడా అర్థవంతంగానే ఉంది. అయితే అగ్నిధార, రుద్రవీణతో బాటు మహాంధ్రోదయం, పునర్నవం వంటి మిగతా కవిత్వ సంపుటాలు ఒకటికి రెండుసార్లు చదివినా నాకు మీరన్న అర్థం గోచరించ లేదు. ఇప్పుడు కూడా మీరిచ్చినది ఒక అర్థవంతమైన వివరణగానే నేను భావిస్తాను తప్ప కచ్చితంగా అదే దాని అర్థం అని ఒప్పుకోలేను. కచ్చితమైన ఒకటే అర్థం తీసుకోవలసిన అవసరమూ లేదు.

అసలు ఎలాంటి అర్థవంతమైన అన్వయమూ వివరణా కుదరని అయోమయ కవిత్వం మీరన్న “real mess”. అయితే అది కూడా ఆధునికకవిత్వంలో పుష్కలంగా కనిపిస్తుంది. దాని గురించి ప్రస్తుతం మాట్లాడ దలుచుకోలేదు.

ఇక మీరు చివరన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది నేను కాదు. :-) The treasure is not mine anymore, so it is not I who locked it up. :-)

Comment on తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక by Rao Vemuri
2013-07-18 04:45 PM - Comments for ఈమాట

సమావేశాల ప్రత్యేక సంచికలని ఈమాట తో జోడించడంతో కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక సంచికలోని పదార్థం అందరికి అందుబాటులోకి వస్తోంది, నిజమే. కాని, ఈమాట లోని పదార్థం వడపోతకి గురి అయినట్లే ఆయా ప్రత్యేక సంచికలలో పదార్థం కూడ గురవుతోంది అనే భావం స్పురిస్తోంది. నాకు తెలిసినంతమట్టుకి సమావేశాల ప్రత్యేక సంచికల కూర్పులో అంత వడపోతకి, సంపాదకుల అభిప్రాయాలని గణనలోకి తీసుకొని రచయితలు తిరగరాయడానికి అవకాశాలు ఉండవు. కనుక ఇలా జోడించడంతో ఈమాటకి ఉన్న విలువ, గుర్తింపు ఆ ప్రత్యేక సంచికకి కూడ ఆపాదించబడుతోంది. ఇది ఎంతవరకు సమంజసమో పాఠకులే నిర్ణయించాలి.

Comment on ఆటా గలాట్టా గురించి by rahimanuddin
2013-07-18 04:37 PM rahimanuddin - Comments for పుస్తకం

ఓ రెణ్ణెల్ల క్రితం ఆట్టాగలాట్టా వారి అంగడి చిరునామా మారింది. కొత్త చిరునామా :
134, 1st A Main Road KHB Colony, 5th Block Koramangala Bangalore, Karnataka 560095
080 3018 1626
ఇది హొసూర్ రోడ్ లో ఫోరం మాల్ తరువాత వచ్చే సెంట్ జాన్స్ హాస్పిటల్ ముందు వచ్చే సందులో ఉంది. కోరమంగల నుండి వచ్చే వారు జ్యోతి నివాస్ కాలేజీ వైపు వస్తే, కాలేజీ ముందే ఆట్టా గలాట్టా ఉంటుంది.
కొత్తగా ఆంధ్ర నగరి అనే పుస్తకం అందుబాటులో ఉంది.
ఇంకా మధుబాబు, యండమూరి, రంగనాయకమ్మ, రావి శాస్త్రి మొ॥ వారి రచనలు చూడవచ్చు.

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by jayaprabha
2013-07-18 07:41 AM - Comments for ఈమాట

వేమూరి గారూ! మీ కధ చదివేను. మీరు చెప్పిన ఆ సంగతులన్నీ నేను మా పెద్దవాళ్ల ద్వారా విని ఉన్నాను. “పేరూరు ద్రావిడులు గుర్రాన్ని గుడెక్కించడం” అన్న కధతో సహా! చాలా సంతోషం. రాణీ శివశంకర శర్మ రాసిన “ది లాస్ట్ బ్రాహ్మిన్” అన్న వారి తండ్రిగారి బయోగ్రఫీ సైతం కొంత వరకు ఈ ద్రావిడులని గురించి చెప్పేదే!!

మీ కధ చదువుతున్నప్పుడు నాకు అచ్యుతదేవరాయలి గారి “వ్యాకరణం వారు” కధ స్పురణకి వస్తూనే ఉంది. అయితే అదే మీ ఈ కధకి ప్రేరణ అని మీరు చెప్పడం ద్వారా చివరలో, నా సందేహం తీరింది. అంత పాత ఇతివృత్తం ఉన్న ఆ కధకి శీర్షికగా మీరు ఒక ఇంగ్లీషు పేరుని ఉంచడం నాకు ఇబ్బందిగా అనిపించింది సుమా! మీ పీడీఎఫ్ లో అచ్చుతప్పులు నన్ను ఇబ్బంది పెట్టేయి. చాలా అచ్చు తప్పులు ఉన్నాయి. వాటిని సవరించే వీలుంటుందా??

జయప్రభ.

Comment on రహస్య సాంగత్యం by రాజా పిడూరి
2013-07-18 02:56 AM - Comments for ఈమాట

చాలా గాఢంగా ఉందండి మీ కవిత…

ధన్య వాదాలు

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by Rao Vemuri
2013-07-18 01:58 AM - Comments for ఈమాట

జయప్రభ గారూ,
ద్రావిడుల ప్రస్తావన తీసుకొచ్చేరు కనుక చెబుతున్నాను. చాల రోజుల క్రితం నేను రాసిన ఒక కథలో నాకు తెలిసినంతమట్టుకు ద్రావిడుల చరిత్ర ప్రస్తావించేను. శాస్త్రీయ పద్ధతులలో పరిశోధన చేసినది కాదు కాని కథలో వీరభద్రశాస్త్రి పుట్టుపూర్వోత్తరాలు చర్చిస్తూ ద్రావిడుల కథ కూడ చెప్పేను. సరదా ఉంటే నా “ఇంటిపుట” లో ఉంది. అంశం 17 చూడండి. కథ అంతా చదవక్కర లేదు - మరీ పొడుగెక్కువ.

2013-07-17
Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by rajashankar
2013-07-17 10:28 PM - Comments for ఈమాట

సురేశ్ గారు,
ఓపికగా సమాధానమిచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
ఇంకా మీరు “వ్యాసకర్త రాసింది గుండ్లకమ్మ అనే నది గురించి.” అని అన్నారు. My reference to the “kamma” community was directed more towards how the essayist defined ‘కమ్మనారు’ (please see below) and my interpretation of it. Sorry I should have been more direct and explicit in my reference.

“రావికంపాడు, పోలకంపాడు మొదలైన గ్రామనామాల్లో కన్పిస్తున్న ‘కమ్మ’కు నది అని అర్థం. గుండ్లకమ్మ మనం ఎరిగినదే. కృష్ణానదికి ‘పేరకమ్మ’ అనేది అచ్చపు తెనుగు పేరు. ఈ రెండు కమ్మలకు మధ్య వున్న నాడు ‘కమ్మనాడు’. ‘కమ్మగుట్టు గడప దాటదు’ అనే సామెతను కమ్మవారి కుటుంబాలలోని గుట్టు గడప దాటి బయటకు రాదనే అర్థంలో వివరించడం పరిపాటి. నిజానికిది సరికాదు. కమ్మనాటి గుట్టు కడప దాటిపోదు అని అర్థం.”

రాజాశఙ్కర్ కాశీనాథుని

Comment on నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా by lyla yerneni
2013-07-17 08:03 PM - Comments for ఈమాట

అలాగే తూర్పు నవోదయానికీ, పడమర విలయానికీ ప్రతీక కాబట్టి, ఇక్కడ కవి చేయదలచుకున్నది లయమే కాబట్టి పశ్చిమ దిక్కుని పేర్కొన్నాడని కూడా అనుకోవచ్చు.

“ఆంథ్ర భారతి” వెబ్ సైట్ లో దాశరధి కవిత్వం -”అగ్నిధార,” “రుద్రవీణ” ఉన్నాయి కదా. అందులోని పద్యాలను చదివితే (చూ: ముక్త భూమి, కవాటం ) అప్పుడు తూర్పుదేవుడు శివుడు, పశ్చిమంలో ఎందుకు తాండవమాడ దలిచాడో తేలికగా తెలుస్తుంది. (కవి కాలం నాటి) తెలంగాణ బంగారుఖజానాల బీగాలు, బందూకుల సప్లైకోసం, పాశ్చాత్య పాలకుల /తెల్ల దళారుల చేతుల్లో, నిజాం నవాబు ఉంచాడని కవి ఆక్రోశం, ఆగ్రహం.

I don’t think it is that difficult to understand this poet. I don’t think he is messing up his metaphors ( used here, by me, synonymous to “Figurative Language”) that bad. For a real mess, you can read Tilak’s Ahalya in this magazine.

How have you been Kamesh! :-) When are we going to read your award winning Telugu poetry. Why is this treasure locked up from us?

లైలా

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by jayaprabha
2013-07-17 05:33 PM - Comments for ఈమాట

మీ ఊహ బాగానే ఉంది గానీ కొలిచాలా!! అనాతవరం (అనాతారం కొలోక్వియల్ గా) అనిపిండి వారైనా.. వేరే ఇతర పేర్లున్న ద్రావిడ బ్రాహ్మణ్యమైనా వృత్తిపరంగా ఎక్కువగా వేదపండితులు. వ్యవసాయం వారి జీవిక కోసం ఇంత ఉంటే ఉండొచ్చును గానీ వారు వ్యాపారార్ధం వ్యవసాయం చేసిన వారు కారు నాకు తెలిసి. ఇంకా మరీ ఆ పాత పాత రోజుల్లో అసలు అలాంటి వారు అంటే వ్యయసాయదారులు ఎవరూ లేరేమో :) మీ అభిప్రాయం ప్రకారం ఈ అనిపిండిఅన్న వ్యుత్ప్తత్తి ని సాధించడానికి “అనుములు” పనికి వస్తాయే గానీ అది వారి కులం రీత్యా ఎక్కడా నప్పుతున్నట్టు గా లేదు. ఏదేమైనా మా “అనిపిండి” ని గురించి నాకు ఇంతకుమించిన సమాచారం తెలియదు కూడానూ. తెలిసేవీలూ కనిపించడం లేదు. ఇంకెవరికైనా ఇంతకన్నా ఎక్కువ సమాచారం తెలిస్తే తప్ప.. అటువంటి వారు ముందుకొచ్చి వివరిస్తే తప్ప, కదా?? మామూలుగా అయితే ఇలాంటి విషయాలని సాధారణంగా మనం ఎక్కువగా పట్టించుకోం! తీరా ఆలోచించడం మొదలుపెడితే ఇదిగో ఇలా అన్నీ సందేహాలే!! అసలు విషయం తెలిసే అవకాశం తక్కువే అనుకుంటాను. ఏదేమైనా మా ఇంటిపేరుని గురించి నాకింత జ్ఞానాన్ని ప్రసాదించారు మీరు. అందుకు నా సంతోషాన్ని తెలియజేస్తూ.. ప్రస్తుతానికి ఉంటాను,

ఇట్లు ,
అనిపిండి జయప్రభ.

Comment on నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా by కామేశ్వరరావు
2013-07-17 05:22 PM - Comments for ఈమాట

జయప్రభగారూ, మోహనగారు, ధన్యవాదాలు.

మోహనగారూ, శివుడు పశ్చిమ దిశలో నాట్యం చేయడం నేను కూడా వినలేదు. ఇక్కడా విషయాన్ని కవికి తప్ప శివునికి అన్వయించుకోలేము. పశ్చిమ దిక్కే ఎందుకంటే బహుశా పడమటి సంధ్యని స్ఫురింపచేయడానికి అయ్యుండవచ్చు. అపరసంధ్యలోనే కదా శివుడు తాండవమాడతాడని ప్రసిద్ధి. అలాగే తూర్పు నవోదయానికీ, పడమర విలయానికీ ప్రతీక కాబట్టి, ఇక్కడ కవి చేయదలచుకున్నది లయమే కాబట్టి పశ్చిమ దిక్కుని పేర్కొన్నాడని కూడా అనుకోవచ్చు.

ప్రాచీనుల ఆలంకారిక ప్రయోగాలకూ, ఆధునికుల ప్రతీకలకూ కనిపించే ఒక ముఖ్యమైన తేడా యిదేననిపిస్తుంది నాకు. ప్రాచీన పద్ధతిలో పోలిక (లేదా వక్రోక్తి) వ్యంగ్యాన్ని సృష్టించినా అందులో ఒక కచ్చితత్వం ఉంటుంది. అంటే, ఒక అలంకారం ద్వారా కవి ధ్వనింపజేయాలనుకున్నది ఏదైనా అది కచ్చితంగా ఇదీ అని ఉంటుంది. అది పాఠకులకి అలాగే అందుతుంది. అలా అందకపోవడాన్ని దోషంగా భావించారు పూర్వ ఆలంకారికులు. ఆధునికకవిత్వంలో అది ఒక గుణమై కూర్చుంది! మనిషి మనసులో పెరిగిన సంక్లిష్టతకి ప్రతిబింబమేమో యిది. అందుకే ప్రాచీన పద్యాలని వ్యాఖ్యానించడం సులభం (పైగా వ్యాఖ్యానించే పద్ధతులు కూడా కొన్ని ఏర్పడి ఉన్నాయి). ఆధునికకవిత్వాన్ని వ్యాఖ్యానించడం బహుకష్టం.

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by jayaprabha
2013-07-17 02:40 PM - Comments for ఈమాట

కొలిచాలా మరోమాట!

మీరు ద్రావిడ అన్నమాట అన్న తర్వాత నాకు చెప్పాలని అంపించిన ఒక సంగతి ఇదీ!!

దీనికీ మళ్ళీ మా ఇంటి పేరుకీ మీకు ఏమన్నా తోచవచ్చునేమో సంబంధం. మేము తంజావూరు.. కుంభకోణం దగ్గరి అగ్రహారాలనించి అంటే దక్షిణ దేశం నించి కోనసీమకి వలస వచ్చిన వారం. వలస సరిగ్గా ఎప్పుడు జరిగినదీ చెప్పగల్గిన ఖచ్చితమైన ఆధారాలేం లేవు. ఆదిభట్ల నారాయణ దాసు గారు, తాతా సుబ్బరాయ శాస్త్రి గారికి జరిగిన షస్టి పూర్తి సభలో “పేరూరి అరవల పెంపు నిలిపితివయ్య” అని అంటారు. కోనసీమలోని పేరూరి బ్రాహ్మణ్యాన్ని ఆయన అలా “అరవలు” అని సూటిగా సంబోధన చేయడం గమనించవలసిన విషయం! అందువలన మా ఇళ్లపేర్లకీ ద్రవిడ దేశానికీ ఏమన్నా మూల సంబంధం ఉండే వీలుందా ?/ ఇదొక సందేహం! కాగా అసలు ఇలాంటి విషయాలు ఎప్పటికైనా ఇథమిథ్థంగా తేలేవేనా ?? అని ఇంకోసందేహం. ఇలాంటప్పుడు నాగమురళీ గారు చెప్పిన హాస్యోక్తులే శరణ్యమేమో మరి. మీ ఆలోచనకి ఈ సమాచారం ఏమన్నా ఉపకరించేదే అయితే స్వీకరించండి.

ఇంక కవిరచయితలలో శ్రీరంగం స్రీనివాసరావు, భాగవతుల శంకరం [ ఆరుద్ర], చెళ్లపిళ్ల వెంకటశాస్త్రీ, చిలకమర్తీ ఇలా వీరంతా కూడా ద్రావిడులే అయినా శాఖాబేధం ఉంది. వీరిని దిమిల/దివిల ద్రావిడులూ.. అనీ చెళ్లపిళ్ల, చిలకమర్తి వారిని ఆరామ ద్రావిడులు అని అంటారు. ఇందులో శ్రీశ్రీ పూర్వీకులేమన్నా శ్రీరంగం వారేమో మరి! ఆదిభట్ల నారయణ దాసుగారు తన ఆత్మకధలో తమ పూర్వీకుడైన ” ఆదిభట్టు” ని గురించి రాసేరు అక్కడ “భట్టు” నామం వారు ఘూర్జరదేశం వారని ఆయన వివరణ ఇచ్చేరు. మొదటి వలస ద్రావిడులది అరవదేశం, అటునించి తెలుగుదేశం అని నారాయణదాసు గారి ఉవాచ!

భవదీయ,
జయప్రభ.

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by సురేశ్ కొలిచాల
2013-07-17 02:36 PM - Comments for ఈమాట

జయప్రభ అనిపిండి ఇలా అన్నారు:

మీరెవరూ అని మా పూర్వీకులని ఎవరన్నా అడిగారనుకోండి, వాళ్ళు “మేం అనాతారం అనిపిండారమండీ ” అని చెప్పేవారన్నమాట! ఇలాగే వేరే గృహనామాలు కూడా వారి వారివి ఆయా ఊళ్లతో కలిపే చెబుతారు. అనిపిండి కేవలం ఇంటిపేరే అయి వారు వారి ఊరుని అనాతారం అని చెప్పుకున్నప్పుడు మీరన్న “పిండి” అన్న పదానికి ఇక్కడ విడిగా ఒక గ్రామ స్పృహ అని వివరించే వీలుందా? నాకు స్పస్టంగా రూపుదిద్దుకోడం లేదు విషయం! కానీ మీ ఊహ మాత్రం బాగుంది. మీరు మరింత వెలుగు ఈ విషయం మీద ప్రసరింపజేయాలని కోరుతున్నాను.

జయప్రభ గారు: నిన్న మీకు జవాబు రాసిన తరువాత స్థిమితంగా ఆలోచిస్తే, మీ ఇంటిపేరు విషయమై ఇప్పుడు నాకు కొంత స్పష్టత ఏర్పడిందనిపిస్తుంది. మీ ఇంటిపేరు గ్రామనామం కాకుండా మీ పూర్వీకులు పండిచే ధాన్యాల ఆధారంగా వచ్చి ఉంటుంది. ధాన్యాల ఆధారంగా తెలుగులో ఎన్నో ఇంటిపేర్లు ఉన్నాయి కదా! కందుల, మిరియాల, ఆవాల, పెసలు, నేతి, బియ్యం, ఉప్పల, పప్పు, వంకాయల అన్నవి మచ్చుకు కొన్ని.

అనుములు అనపమొక్కకు వచ్చే గింజలు. వాటిని అనపగింజలు అని కూడా అంటారు. అనుములను పిండి చేస్తే ఆ పిండిని అనుం + పిండి = అనుఁపిండి అనిగాని, అనప పిండి = అనప్పిండి అని గానీ అనే వారేమో. ఆ పిండి దొరికే వారి కుటుంబాలను అనుపిండి అనిగాని అనప్పిండి అని గాని పిలిచే వారేమో. అనాతారం (ఇది అనంతవరంకు రూపాంతరం కావచ్చు) అనే ఊళ్ళో అనప్పిండి దొరికే వంశస్థులను ‘అనాతారం అనుపిండి’ వారని పిలిచేవారని నాకనిపిస్తుంది.

అనపిండి, అనుపిండి అన్న పదాలలో చివరి రెండు ఇ-కారాలతో స్వరమైత్రి కూడి రెండవ అచ్చుకూడా ఇ- కారంగా మారి అది అనిపిండిగా స్థిరపడిందని నాకనిపిస్తుంది. మీరేమంటారు?

సురేశ్.

నాగమురళి గారు: ఏలూరును హేలాపురి గానూ, నల్లగొండను నీలగిరిగాను, కొలిచాలను కోలాచలంగాను — అన్నీ సంస్కృతం నుండే ఉద్భవించాయని — వివరించే పండిత వ్యుత్పత్తులు కోకొల్లలు.

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by సురేశ్ కొలిచాల
2013-07-17 02:01 PM - Comments for ఈమాట

రాజాశఙ్కర్ కాశీనాథుని ఇలా అన్నారు:

“గుండ్లకమ్మ అంటే గుండ్ల కప్పు అయ్యే అవకాశం ఉంది.”

Not to muddy the waters further but…
నాకు తెలిసి “కమ్మ” అంటే జాబు (ఉత్తరము). “కమ్మ”లను అందించడం వృత్తిగా అవలంబించిన కారణంగా కమ్మవారైనారని ఏదో కమ్మవారి చరిత్రను తెలిపే పుస్తకంలో చదివిన గుర్తు.

వ్యాసకర్త రాసింది గుండ్లకమ్మ అనే నది గురించి.

“‘కమ్మ’లను అందించడం వృత్తిగా అవలంబించిన కారణంగా కమ్మవారైనారని” వివరించడం లోకనిరుక్తి (folk etymology). కర్మ అన్న సంస్కృత పదం ప్రాకృతంలో, పాళీలో కమ్మ- గా మారిందని (ధర్మ అన్నది దమ్మ-గా మారినట్టు), దాని ఆధారంగానే కమ్మ-, కమ్మరి-, కమ్మతీడు- మొదలైన వృత్తి నామాలు వచ్చాయని భాషావేత్తల నమ్మకం (చూ. తెలుగు భాషా చరిత్ర 2010).

నా ధర్మపత్ని పుట్టిన ఊరు పంజాబ్ లోని పటియాల. అ ఊళ్ళో సంస్కృత పండితుడు ఒకాయన నాతో అ ఊరి పేరుని గురించి ఇచ్చిన వివరణ ప్రకారం ఆ ఊరి అసలు పేరు పతి (రాజు) ఆల (ఊరు) అంటే రాజుగారి ఊరు (రాచనగరు) అని. Is there a remote possibility that the ‘ఆల’ in Patiala is the same as the ‘ఆల’ in Telugu?

నాకు తెలిసి పటియాల అసలు పేరు పటియావాల. పటియావాల అన్న ఇంటి పేరు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. అలాగే, చుడియాల, బొరియాల, దధియాల అన్న పదాలన్ని చుడియావాల, బొరియావాల, దధివాల అన్న ఊర్ల పేర్లు గానే పరిగణించాలని నా అభిప్రాయం.

పటియావాల అంటే పట్టములు- (బట్టలు) నేసే వారు ఉండే ఊరు. పట-/పట్ట- అన్నది cloth, garment అన్న అర్థంలో సంస్కృతంలో ఉంది. తెలుగులో బట్ట- అన్నది సంస్కృత/ప్రాకృతాలనుండి వచ్చిందనే చెప్పవచ్చు. అయితే, పట్ట- అన్నది అనార్య పదమని కొంతమంది వాదన. ముండా భాషలలో పత్తిని కర్పట- అని కర్పస అని అంటారు. ఈ పదాల ఆధారంగానే సంస్కృతంలో పట్ట- అన్న పదం వాడుకలోకి వచ్చిందని వారి వాదన. ఏది ఏమైనా, పటియాల పటియావాలా నుండి వచ్చిందే కానీ, ద్రావిడ గ్రామ ప్రత్యయమైన *ఞాల/ఆల తో సంబంధం లేదని నా అభిప్రాయం.

ద్రావిడ భాషలలో ఒకటైన బ్రాహుయీ గురించి మరెప్పుడైనా!

Comment on అతిథి వ్యయో భవ by CHARY
2013-07-17 11:19 AM - Comments for ఈమాట

వేలు విడిచిన మామయ్య బావమరిది తమ్ముడు మామయ్య నా? చెప్మా!!!!

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by nagamurali
2013-07-17 09:34 AM - Comments for ఈమాట

సురేశ్ గారు, విలువైన సమాచారాన్ని అందించినందుకు చాలా కృతజ్ఞతలు.

వ్యాసానికీ, చర్చకీ సంబంధం లేని కామెడీ సంగతి ఒకటి గుర్తొచ్చింది - (ఇది లోకల్ న్యూస్ పేపర్లో చదివిన సీరియస్ విషయం కాబట్టి నిజానికిది కామెడీ కాకపోవచ్చు. పెద్దలు క్షమించాలి.)

బోడసకుర్రు, కేశనకుర్రు, సామంతకుర్రు, పుల్లేటికుర్రు, గంగలకుర్రు మొదలైన ఊళ్ళ గురించి ఓ కథ విన్నాను. వ్యాసుడు కోనసీమలో మరో కాశీని, గంగని ఇంకా ఏవేవో కూడా సృష్టించాట్ట. తర్వాత ఎందుకో కోపం వచ్చి ‘కాశీం న కురు’, ‘గంగాం న కురు’ అని శపించాట్ట. అవే కేశనకుర్రు, గంగనకుర్రు అయ్యాయిట. (మిగతా పేర్లకి సంబంధించిన శాపాలు నాకు గుర్తు లేవిప్పుడు).

పుల్లేటి కుర్రు గురించి మరో కథ ఇక్కడ.

మా నాన్న సరదాగా ఫోక్/పండిత ఎటిమాలజీల గురించి చెప్తూ ‘గోవింద’ అన్న శబ్దం ఎలా వచ్చిందో ఓ కథ అల్లి చెప్పేవారు - ‘గోవు ఇందా, గోవు ఇందా’ అని దేవుడికి ఎవరో గోవుని సమర్పించారుట. అదే గోవింద అయ్యింది.

Comment on సాహసం by jay
2013-07-17 08:05 AM jay - Comments for నవతరంగం

అన్నింటికంటే ముఖ్యంగా “బ్రహ్మానందం” లేడు.
‘brahmanamdam’ga undi

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by rajashankar
2013-07-17 03:14 AM - Comments for ఈమాట

నా ధర్మపత్ని పుట్టిన ఊరు పంజాబ్ లోని పటియాల. అ ఊళ్ళో సంస్కృత పండితుడు ఒకాయన నాతో అ ఊరి పేరుని గురించి ఇచ్చిన వివరణ ప్రకారం ఆ ఊరి అసలు పేరు పతి (రాజు) ఆల (ఊరు) అంటే రాజుగారి ఊరు (రాచనగరు) అని. Is there a remote possibility that the ‘ఆల’ in Patiala is the same as the ‘ఆల’ in Telugu? After all didn’t the Telugus live as far north as Baluchistan at some point in time? Isn’t there a dialect still in use today called BrAhuyi (or something like that) that is related to Telugu? I concede that I am a complete novice when it comes to languages and linguistics but these are honest questions nonetheless.

Sincerely,
Rajashankar

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by rajashankar
2013-07-17 02:47 AM - Comments for ఈమాట

“రచయిత ఊహ తప్ప కమ్మ అన్న పదానికి ‘నది’ అన్న అర్థం ఇవ్వడానికి ఏ ఆధారమూ కనిపించదు. కమ్మ అన్నది కప్పు- అన్న అర్థంలో తమిళంలో వాడుక ఉంది. గుండ్లకమ్మ అంటే గుండ్ల కప్పు అయ్యే అవకాశం ఉంది.”

Not to muddy the waters further but…
నాకు తెలిసి “కమ్మ” అంటే జాబు (ఉత్తరము). “కమ్మ”లను అందించడం వృత్తిగా అవలంబించిన కారణంగా కమ్మవారైనారని ఏదో కమ్మవారి చరిత్రను తెలిపే పుస్తకంలో చదివిన గుర్తు.

రాజాశఙ్కర్ కాశీనాథుని

2013-07-16
Comment on అలిఖిత కఠిన శాసనం! by D.Venkateswara Rao
2013-07-16 07:05 PM - Comments for ఈమాట

మీ కవిత అంతే ఒక శిలా శాసనం
నా అభిప్రాయం అంతా సాంత్వనం

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by jayaprabha
2013-07-16 05:32 PM - Comments for ఈమాట

కొలిచాలా,

:) మీ వివరణ తో నా సందేహం మరింత జటిలం అయినట్టుంది! ఒక వూరు ఒక ఇంటి పేరుకి ఎన్నిక కావటం మా ప్రాంతాలలో ఉంది. ఉదాహరణకి “నందాపురపు పట్టీ” లో ఉండే అగ్రహారాలలో ఒక్కో అగ్రహారం ఊరుపేరు ఏదైనా ఆ ఊరిలో ఒక ఇంటి పేరు ఎక్కువగా గణనకి వస్తుంది. ఇంటి పేరుకీ వూరి పేరుకీ ప్రత్యక్ష సంబంధం ఏదీ ఉండదు, అయితే ఆ ఇంటి పేరుని ఆ ఊరిపేరునీ కలిపి పేర్కొనడం మాత్రం ఉంటుంది . ఆవూళ్ళో వేరే ఇళ్ళపేళ్ళున్నా ఒక ఇంటిపేరుకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. మీరెవరూ అని మా పూర్వీకులని ఎవరన్నా అడిగారనుకోండి, వాళ్ళు “మేం అనాతారం అనిపిండారమండీ ” అని చెప్పేవారన్నమాట! ఇలాగే వేరే గృహనామాలు కూడా వారి వారివి ఆయా ఊళ్లతో కలిపే చెబుతారు.

అనిపిండి కేవలం ఇంటిపేరే అయి వారు వారి ఊరుని అనాతారం అని చెప్పుకున్నప్పుడు మీరన్న “పిండి” అన్న పదానికి ఇక్కడ విడిగా ఒక గ్రామ స్పృహ అని వివరించే వీలుందా?? నాకు స్పస్టంగా రూపుదిద్దుకోడం లేదు విషయం! కానీ మీ ఊహ మాత్రం బాగుంది. మీరు మరింత వెలుగు ఈ విషయం మీద ప్రసరింపజేయాలని కోరుతున్నాను.
థాంక్యూ !
జయప్రభ.

Comment on ‘అమ్మా నన్ను క్షమించొద్దు ‘ ….. by dr.c.bhavani devi
2013-07-16 04:19 PM dr.c.bhavani devi - Comments for విహంగ

హేమలతగారికి, నమస్తే
అరసి గారి సమీక్ష బాగుంది.  ధన్యవాదాలు.
భవానీదేవి.

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by సురేశ్ కొలిచాల
2013-07-16 04:03 PM - Comments for ఈమాట

జయప్రభ గారు,

అనిపిండి, అనుపిండి, అనప్పిండి అని మూడు రకాలుగా మీ ఇంటి పేరు ఉండడానికి ఒక కారణం అను-, -పిండి రెండు వేరు విభాగాలు కావటం వల్ల కావచ్చు. ధాతువుల్లో ప్రథమాచ్చుకు ఉన్న ప్రాముఖ్యత చివరి అచ్చుకు ఉండదు. అదీకాక తెలుగులో స్వరమైత్రి (vowel harmony) వల్ల మధ్యాచ్చులు చివరి అచ్చులతో కలసి పోవడం కద్దు. అనుపిండి లో చివరి రెండు ఇ- కారాలకు మైత్రిగా అనుపిండి- అనిపిండి కావడం తెలుగులో అసాధారణమేమి కాదు.

పిండి, పిండిప్రోలు (ఖమ్మం జిల్లాలో ఊరు), పిండిసూర, మురిపిండి అన్న ఇతర ఇంటిపేర్లకు మీ ఇంటిపేరుకు సంబంధం ఉండవచ్చు. అలాగే, అనియాది, అనిశెట్టి, అనుమగుర్తి, అనుమాలశెట్టి, అనుముల, అనుమోలు అన్న ఇంటి పేర్లకు మీ ఇంటిపేరుకు సంబంధం ఉందో లేదో ఎవరైనా పరిశోధన చెయ్యాలి.

ఉత్తరాదిలో “గ్రామము” అన్న అర్థంలో పిండి/పిండ్ అన్న ఊళ్ళ పేర్లు సర్వసాధారణంగా కనిపిస్తాయి. పాకిస్తాన్ లోని రావల్ పిండి నుండి పంజాబ్‌లోని బారాపిండ్, బీస్పిండ్, భల్లాపిండ్, బీర్ పిండ్, హబిత్ పిండి, గిద్దర్ పిండి, కపూర్ పిండ్, నవాపిండ్, రాణీపిండ్, వరకూ, అలాగే, అలహాబాద్ జిల్లాలో, ఫిరోజ్ పూర్ జిల్లాలో “పిండి” అన్న పేరు గల గ్రామాలు ఉన్నాయి. ఈ ఉత్తరాదిలోని “పిండి” గ్రామాలకు మీ ఇంటిపేరుకు సంబంధం ఉందో లేదో ఇదమిత్థంగా చెప్పలేను.

నా ఊహ: “పిండి” అనేది గ్రామనామానికి సంబంధించిన ప్రత్యయమైతే, అను-/అని- అన్నది అనుములు అన్న ధాన్యానికి సంబంధించినదై ఉండవచ్చు. అనుములు ఉత్పత్తి చేసే అనుప- చెట్టు ఉన్న ఊరిని అనుపిండి అని అన్నారేమో. ఇది పూర్తిగా నా ఊహే కానీ, శాస్త్రీయమైన వివరణ కాదు. భారతదేశంలోని ఊర్ల పేర్లపై సమగ్రమైన డేటాబేసు తయారు చేసి దానిపై విపులంగా ఒక పరిశోధనా వ్యాసం రాయాలన్నది నాకున్న కోరికల్లో ఒకటి. ఎప్పటికైనా వీలుచేసుకొని ఆ ప్రాజెక్టును పూర్తి చెయ్యగలననే ఆశిస్తున్నాను.

Comment on ఒక వేసవి by పల్లేటి బాలాజీ
2013-07-16 02:37 PM - Comments for ఈమాట

విదేశాల్లొ పిల్లలున్న ఎవరికైనా నచ్చే కథ
పల్లేటి బాలాజీ

Comment on ఇద్దరమ్మాయిల కథ…., సిండ్రెల్లా, బ్యూటీ అండ్‌ ది బీస్ట్‌! by sreekanth edigineni
2013-07-16 09:57 AM sreekanth edigineni - Comments for స్త్రీవాద పత్రిక భూమిక

మీరు ఎలాగయినా విమర్శించాల్సిందే అనే తొందరలో ఉన్నట్లున్నారు . తొందర పడక విషయాన్ని మళ్ళీ ఒక సారి చదవండి. ఆవిడ ప్రస్తావించిన బిడ్డ వయసును గుర్తుంచుకొని మీ మేధో ప్రదర్శన చేయండి .

Comment on వచ్చాను ఇక చూస్తాను… by mehdi ali
2013-07-16 07:32 AM mehdi ali - Comments for విహంగ

ఆర్ద్రంగా , అందంగా ఉండి మనసుకు స్పృశించేలా ఉంది

Comment on వేకువనే మోకరించే ఆమె by జాన్ హైడ్ కనుమూరి
2013-07-16 07:01 AM - Comments for ఈమాట

Dadala Venkateswara Rao గారు

కవిత్వం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు.
అనుభవాలు, అనుభూతులు వ్యక్తిగతమే అయినా ప్రశ్న వ్యక్తిగతం కాదు (ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో )

మీ స్పందనకు ధన్యవాదములు.

Comment on విలువల వలువలున్న సినిమా. by manibhushan
2013-07-16 06:38 AM manibhushan - Comments for నవతరంగం

పైన ఓ కథ చెబుతూ, అదే “సుమంగళి” సినిమా అంటున్నారు. రెండూ ఒకటి కాదేమోనండీ. రెండింటిలోనూ ఏన్నార్, సావిత్రిలే ఉన్నారు. బహుశా పొరబడ్డారేమో చూసుకోండి గీతాచార్య గారూ.
మీరు చెబుతున్న కథ మాంగల్య బలం సినిమాకి సరిపోతుందేమో!

Comment on ఒక వేసవి by Vasu
2013-07-16 05:24 AM - Comments for ఈమాట

మీ ముందు కథల లాగే ఆలోచింప చేసేది గా ఉంది. నాకు ఇది మీ ముందు కథల కంటే బాగా నచ్చింది.

మా తాతయ్య అంటారు ప్రేమ, వాత్సల్యం, ఆప్యాయత కిందకు ప్రవహిస్తాయి తాత నించి తండ్రికి తండ్రి నించి కొడుకుకి ఇలా. అది సహజం. కానీ అంతకంతకీ ఆ ప్రేమలు కూడా తగ్గిపోతున్నాయేమో. ప్లాస్టిక్ ప్రేమలు ఐపొతున్నాయనిపిస్తుంది ఒక్కోసారి. దానికి కారణం పెరుగుతున్న materialism కావచ్చు.

పిల్ల జమిందారు సినిమాలో అన్నట్టు రాను రాను మనం వస్తువులను ప్రేమించి మనుషులను వాడుకుంటున్నామేమో .

Comment on ఒక వేసవి by manibhushan
2013-07-16 05:14 AM - Comments for ఈమాట

కథ కవితాత్మకంగా ఉంది. మరింత స్పష్టత ఉంటే బాగుండేది. మూడో తరం కాసిన్ని కబుర్లూ, కూసింత ఆప్యాయత కోరుకుంటున్నాయని చెబుతూనే… వాళ్ళు ఫక్తు భౌతికవాదులుగా తయారవుతున్నారన్న ఆవేదనను సైతం వెలిబుచ్చారు. అయితే, కథ పూర్తయ్యాక ఏ ఒక్కరూ మనసులో ఇమడని పరిస్థితి. కథలో మూల వస్తువు (సెంటర్ పాయింట్ మిస్సయ్యారు) కోల్పోయారనిపించింది.

Comment on తెలుగువారి ఊళ్ల పేర్లు - ఇంటి పేర్లు by jayaprabha
2013-07-16 04:19 AM - Comments for ఈమాట

కొలిచాలా! మీ వివరణ బాగుంది. నేను కూడా వేమూరి గారి లాగానే సముద్ర తీర నగరాలకే పట్టణం అన్న అర్ధం స్థిరపడి ఉంటుందని అనుకున్నాను. అలా ఎక్కడో చదివినట్టు కూడా గుర్తు. బహుశా నాలాగే అనుకున్న ఎవరో రాసి ఉంటారు. ఇప్పుడు చప్పున రిఫరెన్సు ఇవ్వలేను లెండి.

ఇకపోతే ఇంటిపేర్లు ప్రస్తావన వచ్చింది గనక అడుగుతున్నానూ …ఉదాహరణకి మా ఇంటిపేరే ఉంది చూడండీ… అనిపిండి అని. దీనికి అనుపిండి అనీ అనప్పిండి అనీ కూడా రూపాంతరాలని చూసేను నేను. అనాతారం అనిపిండివారని పేరు. అనాతారం అంటే అనాత వరం. కోనసీమ దగ్గర పేరూరు, నందంపూడి పరిసరప్రాంతాలలో కావొచ్చును. అది మా పూర్వీకుల ఊరే అయినా నేనింత దాకా ఆ కోనసీమ చూడలేదు. అట్నించి తూర్పు సీమలకి వలస పోయి మా వాళ్ళు విజయనగరం దగ్గర పల్లెలలో స్థిరపడ్డారట!

ఇంతకీ ఒక ఇంటిపేరు కి ఇలా మూడు వెర్షన్స్ ఎందుకు ఉన్నవో చెప్పగలరూ? అదీగాక ఈ ఇంటిపేరుకి అర్ధం ఏమై ఉండవచ్చునూ? ఎవరన్నా నా ఈ సందేహం తీర్చిన, ధన్యురాలిని.

జయప్రభ.

పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..