2008-08-27

నవతరంగం: లక్ష హిట్ల నవతరంగం

2008-08-27 10:03 AM
ఈ రోజుతో నవతరంగం లక్ష హిట్లు చేరుకున్న సందర్భంగా నవతరంగం పాఠకులకు కృతజ్ఞతలు. నా తో పాటు కలిసి పని చేసి, నవతరంగంలో భాగమైన సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరిగ్గా ఐదు నిమిషాల క్రితం నవతరంగం సైట్ స్టాట్స్ రికార్డు చేసే సైటు మీటర్[sitemeter] లక్ష హిట్లు చూపించింది. ఎనిమిది నెలల్లో ఇన్ని హిట్లు రావడం తక్కువా, ఎక్కువా అని పోల్చడానికి కానీ, లేదా మరొక సైటు కంటే మాకే ఎక్కువ హిట్లు వచ్చాయని చెప్పడం ఇక్కడ [...]

నవతరంగం: KungFu Panda (2008)

2008-08-27 10:03 AM
kungfu panda డ్రీమ్‍వర్క్స్ వారి యానిమేషన్ చిత్రం. కుంగ్‍ఫూ నేర్చుకోవాలనుకుంటున్న ఓ పండా (panda) కథే ఈ సినిమా. చాలా యానిమేషన్ సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా అంతర్లీనంగా జీవితం ఉంది. జీవిత సత్యం ఉంది. కానీ, ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి అంటే, ఆద్యంతమూ హాస్యంతో నవ్విస్తూనే ఆ విషయాన్ని చెప్పడం. సెంటీ డైలాగులు, సెంటీ సీన్లూ లేకుండానే సినిమా ద్వారా చెప్పదలుచుకున్న సీరియస్ విషయాన్ని తేలిగ్గా చెప్పేసారు. కథ విషయానికొస్తే, పో [...]

పొద్దు: తెలుగు - పిల్లలు

2008-08-27 10:03 AM
-లలిత “తెలుగు నేర్పడం ఎలా?” అన్న పేరుతో రంగనాయకమ్మ గారు కొన్ని తెలుగు పాఠ్యపుస్తకాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ, కొన్ని సూచనలనూ జోడించి ఒక పుస్తకం వ్రాశారు. రంగనాయకమ్మగారే ఒక పాఠ్య పుస్తకం కూడా రాశారు. చదివిందీ, నేర్పిందీ మర్చిపోయిన తర్వాత మిగిలినదే విద్య అని ఆంగ్లంలో ఒక నానుడి. అది వాడుకుని, ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు మిగిలిన అనుభూతి, నా ఆలోచనలు ఇక్కడ పంచుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితులలో ఆంగ్లం ఉండగా ఆంధ్రం ఎందుకనే ధోరణి ప్రబలంగా [...]

పొద్దు: హార్ట్ బ్రేకింగ్

2008-08-27 10:03 AM
-పట్రాయని సుధారాణి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ ఉన్న ప్రవీణ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోవెల ఇప్పటివరకూ ఎంత ప్రశాంతంగా ఉంది! ఎక్కడిదీ ఘంటానాదం… ఎవరూ కనిపించరేం? వెనక్కి తిరిగి చూసింది. ఫోన్ లో ఆశ చెప్పిన విషయం ప్రవీణ ని గాల్లో తేలుస్తోంది. ‘ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్న అవకాశం! ఇన్నాళ్ళకు చేతికందొస్తోంది. ఎప్పుడూ పల్లవికే దొరికే ఛాన్స్… ఇవాళ నాదే…’ దేవుడి విగ్రహం రాయిలా నిలబడి ఉంది. రాయిలా ఉన్న తనను, తను సృష్టించిన మనిషి ఇంత అందమైన రూపంలో [...]

ప్రజాకళ: విరామం లేని పయనం

2008-08-27 03:42 AM ప్రజాకళ
అక్షరాల్ని లోకానికిచ్చి హఠాత్తుగాఎక్కడికో పయనమయ్యావు నిరంతర సాహిత్య శ్రామికుడా! పయనమేదైనా పచ్చటి బతుకుల కోసమే కదా నువ్ జీవించింది ఎర్రపొద్దు కోసం ఎన్ని రాత్రులు ఎదురుచూశావో ఎన్ని దీపాల్ని సిద్ధం చేశావో నువ్ లేని శూన్యం నిండా ఆక్రమించిన వేళ ఇది ఎన్ని హదయాలు ద్రవిస్తాయో తెలుసు నీకు అందుకేనేమో..నువ్ ప్రేమించిన ఈ క్షేత్రం నిండ విత్తనాలేవో ముందుగానే నాటావు విత్తనం పగిలిన చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది భూమిని చీల్చుకొని రెక్కలు తొడుక్కోడానికి నీ విత్తనాలన్ని తహతహలాడుతున్నాయి నీ కోసం కార్చే కన్నీళ్లే ఇక వాన చినుకులు…! (ఇటీవల కనుమూసిన విమర్శకులు హరి పురుషోత్తమరావు కోసం) -పసునూరి రవీందర్

ప్రజాకళ: దళిత సమస్యలపై ప్రజాసాహితి దృక్పథం

2008-08-27 03:38 AM ప్రజాకళ
-డా//దార్ల వెంకటేశ్వరరావు ప్రజాసాహితి సాహిత్య, సాంస్కృతికోద్యమ మాసపత్రిక. ఆగస్టు 1977 నుండి నేటి వరకూ నిరంతరాయంగా వెలువడుతున్న పత్రిక. అదీ పీడితుల పక్షాన నిలబడుతున్న పత్రిక. సమాజంలో జరిగే అనేక సంఘటనలకు తనదైన దృక్పథంతో కొనసాగుతున్న పత్రిక. కొన్నిసార్లు రెండు, మూడు నెలలకు కలిపి ప్రచురించినా మూడు వందల సంచికకు చేరువయ్యింది. అలాంటి పత్రిక ఇప్పుడు మూడు వందలవ సంచికకు చేరింది. దీన్ని ఒక ప్రత్యేక సంచికగా కూడా తీసుకొచ్చే హడావిడిలో ఉంది. ఒక పత్రిక [...]

ప్రజాకళ: ” బొంబాయి బస్తీల్లో, భివాండీ, సూరత్ మురికివాడల్లో నికృష్టమైన బతుకు బతుకుతున్న ఈ తెలంగాణ కార్మికులు సిరిసిల్లా జగిత్యాల పోరాటల తర్వాత ఆ ప్రాంతాల్లో నిర్మించిన కార్మికోద్యమాలైనా, సాంస్క­ృతికోద్యమాలైనా తాము కరిగిపోతూ చుట్టూ వెలుగులు ప్రవరిస్తున్న జీవితాలకు దాఖలాలు.”

2008-08-27 03:30 AM ప్రజాకళ
వెలుగు బాటలైన వలస జీవులు - వరవరరావు ముంబాయి.. దుబాయి.. బొగ్గుబాయిల పోలికలు, తేడాల గురించి పిట్టల రవీందర్ చేసిన పరిశీల న, విశ్లేషణ (ఆంధ్రజ్యోతి 12 ఆగస్ట్ 2008) చాలా ఆసక్తిదాయకంగా ఉంది. మరిన్ని ఆలోచనలను రేకేత్తించేదిగా ఉన్నది. వ్యవసాయ జీవితంలోకి వ్యవసాయ సంబంధమైన పరిశ్రమలు వచ్చినపుడు కొత్త ఉత్పత్తి శక్తుల వికాసం, కార్మిక వర్గం ఏర్పడడం, కార్మిక చైతన్యం, ఆ చైతన్యం తిరిగి గ్రామీణ రైతాంగ జీవితంపై చూపే ప్రభావం - ఇవన్నీ బొగ్గుబాయి, [...]

ప్రజాకళ: “హురియత్ కాన్ఫరెన్స్‌ను ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా గౌరవించి వారితో ప్రజాస్వామికంగా వ్యవహరించే బదులు ఆ సంస్థను చీల్చి ఒక అనుకూల వర్గాన్ని తయారు చేసుకోవాలన్నది భారత ప్రభుత్వ వైఖరిగా ఉండింది ఇన్నాళ్లూ..”

2008-08-27 03:10 AM ప్రజాకళ
“మెజారిటీ ప్రజల స్వాతంత్య్ర కాంక్ష మైనారిటీ వర్గ ప్రజలలో అభద్రతను పెంచి వారి వలసకు దారితీసింది.” కాశ్మీర్‌లో మన కర్తవ్యం - కె.బాలగోపాల్ అవి దేశ విభజన రోజులు. ఉపఖండమంతటా -ముఖ్యంగా ఉత్తర, వాయవ్య, తూర్పు ప్రాంతాల లో నరమేధం జరుగుతున్నది. హిందూ, సిక్కు మూకలు ముస్లింలను, ముస్లిం మూకలు హిందువులనూ సిక్కులనూ నరుకుతున్నారు, సజీవంగా కాల్చి చంపుతున్నారు. ఇళ్ళు తగుల బెడుతున్నారు. స్త్రీలను రేప్ చేస్తున్నారు. ఇంతటి హింసను ఉపఖండం అప్పటివరకు చూసి ఎరుగదు. ఆ సమయంలో [...]

ప్రజాకళ: పాలస్తీనా గాయం

2008-08-27 03:00 AM ప్రజాకళ
- మహమూద్ దార్వీష్ పాలస్తీనా జాతీయ కవి (ఫద్వా తుఖాన్ స్మృతిలో) 1. ఉహు! మాకు గుర్తు చేయనక్కరలేదు మాలోనే వుంది, మౌంట్-కేరమెల్ పర్వతం మా కనురెప్పల పైన కదులుతున్నాయి, గెలీలీ లోని గడ్డిపోచలు మా నేలలోని పర్వతానికీ, భూభాగానికీ, మాకూ మధ్య భేదం ఉందనుకోకండి దానిని మేం చేరగలమా అని అడగకండి మేమూ మా దేశమూ ఒకే దేహం ఒకే ప్రాణం . 2. మేము వసంతంలో ఎగిరే పావురాలం కాదు మా ప్రేమబంధం ఎన్నటికీ చెదిరిపోయేది కాదు అక్కా! ఇరవై యేండ్ల [...]

ప్రజాకళ: దోబూచుల వెన్నెల

2008-08-27 02:42 AM ప్రజాకళ
వెన్నెల మైదానాన్ని కప్పుకొని బస్సెక్కుతాను వందనోటు చిల్లర వెంపర్లాటలో దాన్ని ఎటో కుక్కిపెడతాను ఈ సీటో ఆ సీటో వూగుతూ ప్రయాణంసాగి బస్సుదిగి ఇంటిమెట్లెక్కుతూ గుర్తుకొచ్చి జేబులోనో సంచిలోనో చెయ్యిపెడితే ఎంతకీ దొరకదు ఎక్కడ పోయిందని వెతకాలో సందిగ్దంగా కాళ్ళీడ్చుకుంటూ లోనికెళ్ళి ఏ మంచంమీదో వొరిగిపోతాను నిద్రిస్తున్న కళ్ళలో తెరసిన ఆకాశంలోంచి జలపాతమై తుంపరలై వర్షిస్తుంది తడిసిపోతూ స్నానమాడుతూ కనుకొలుకుల్లో బందీచేసాననుకుంటా రెప్పతెర్వగానే రివ్వున ఎగిరిపోతుంది మళ్ళీ వేట మళ్ళీ వెదకులాట మళ్ళీ దోబూచులాట [...]

2008-08-16

ప్రజాకళ: దేశీయ వనరులు కోటాను కోట్ల పుట్టెడు భారతీయులకు ముట్టినట్టేనా ఆరు దశాబ్దాలు కన్న రుతువులు ఏమిచ్చినట్టు? ఏమి పొందినట్టు. ఈ దేశం మీద మట్టి పిసుక్కుని బతికే ఏ శ్రమజీవి బతుకు ఒడ్డెక్కినట్టు? ఏ హక్కు నెరవేరినట్టు, ఏ స్వేచ్ఛ పురివిప్పినట్టు

2008-08-16 07:53 PM ప్రజాకళ
మా… తుఝే సలామ్ - అల్లం నారాయణ ఇక ఇక్కడితో స్వేచ్ఛ అంతమవుతుంది. కనీసం మరో ఏడాది దాకా. అడపాదడపా ఇంటి స్థలం కోసం కూడా తుపాకి తూటాలు స్వీకరించిన వారి స్వేచ్ఛ గురించి మాట్లాడే ఒక సందర్భం రావొచ్చు కానీ, మరో ఏడాది దాకా స్వాతంత్య్రం గురించి మాట్లాడాల్సిందేమీ లేకపోవచ్చు. పొద్దున్నే మెలకువతో ప్రారంభమయింది స్వేచ్ఛ. ‘మా తుఝే సలామ్’ అంటున్నడు రహమాన్. వందేమాతరం అని ఒత్తి పలికి విరిచి, బహుశా అది బంకింబాబు వందేమాతరం [...]

2008-08-13

ప్రజాకళ: “100 ఎకరాల లీజును కాశ్మీరీలు ఇంతగా వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటన్న ప్రశ్నకు జవాబు కావలసిందేనంటే, తమ ఉనికి పట్ల ,తమ నేల పట్ల,తమ సంస్కృతి పట్ల వారికి ఉన్న ఉద్వేగభరితమైన బంధాన్ని కారణంగా చూపించవలసి ఉంటుంది.”

2008-08-13 05:00 AM ప్రజాకళ
ఇంకెంత మూల్యం చెల్లిస్తాం? - కె.బాలగోపాల్ జమ్మూలో భారతీయ జనతా పార్టీ నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని చాలా మంది విమర్శిస్తున్నారు. మంటలు మండాలని కోరుకునే వాళ్లు నిప్పుతోనే చెలగాటం ఆడుతారు, నీళ్లతో కాదు. 1953లో షేక్ అబ్దుల్లా అక్రమ బర్తరఫ్‌కు, అక్రమ అరెస్ట్‌కు దారితీసిన ఆనాటి జనసంఘ్ నినాదాన్ని ఎల్.కె. అద్వానీ ఇవ్వాళ జ్ఞాప కం చేసుకుంటున్నాడంటే అన్నీ తెలిసే ఆ పని చేస్తున్నాడు. తన చంచల స్వభావాన్ని రాజకీయ ప్రతిష్ఠ చాటున దాచి యోగ్యుడయిన పాలకుడిగా, [...]

2008-08-12

ఈమాట: డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి పదవ వార్షికోత్సవ సమావేశము

2008-08-12 10:50 AM డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి
1998 జనవరి నెల్లో ఒక ఆదివారం మధ్యాహ్నం పది పదిహేను మంది తెలుగు సాహిత్యం అంటే ఆసక్తి ఉన్న వ్యక్తులు ఏనార్బర్ పబ్లిక్ లైబ్రరీలో కలుసుకుని తమకి నచ్చిన కవితల్ని, పద్యాల్ని చదివి మిగతావారితో పంచుకున్నాం. ఆ కార్యక్రమం ఒక సంస్థ ఆవిర్భావానికి పునాది అని అప్పుడు మేమూహించలేదు. ఈ పదేళ్ళలోనూ ఒక చర్చా వేదికగా, ఒక సంస్థగా ఎంతో దూరం ప్రయాణించాము. 2002 అమెరికా సాహిత్య సదస్సునీ, 2005 తానా సమావేశాల్లో సాహిత్య సదస్సునీ విజయవంతంగా నిర్వహించాము. [...]

2008-08-10

భూమిక: Front Page Aug08

2008-08-10 06:12 AM భూమిక

భూమిక: పురుషసంఘాలా? పురుషాహంకార సంఘాలా?

2008-08-10 06:06 AM భూమిక
కుటుంబ హింసలో మగ్గుతున్న స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన గృహహింస నుండి స్త్రీలకు రక్షణ చట్టం 2005ను పకడ్బందీగా (మగవాళ్ళ తోడ్పాటును కూడా తీసుకుంటూ) అమలు పరచాలన్న ఉద్దేశ్యంతో కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి రేణుకా చౌదరి జూన్‌ 25న ఒక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి ‘యూనిఫెమ్‌’ సభ్యులతో పాటు స్త్రీల మీద హింస తగ్గాలని, చట్టం సక్రమంగా అమలవ్వాలని భావించే, నిబద్ధతతో ఆలోచించే పురుషులు చాలామంది హాజరయ్యారు. లోపల [...]

2008-08-09

భూమిక: ప్రతిస్పందన(లైలా యెర్నేని ఉత్తరానికి భూమిక పాఠకుల స్పందన)

2008-08-09 07:16 AM భూమిక
లైలాగారూ..! మీ లేఖ మా పత్రిక ‘భూమిక’ద్వారా చూసాను..ఒక్క అక్షరంలో కూడా సభ్యత లేకపోవడమం నన్నీ ఉత్తరం రాయడానికి దోహదపరిచింది.. ప్రతి పత్రికకు విమర్శలు అవసరమే..కానీ దూషించే హక్కు ఎవరికీ లేదు..ఇది  ఈనాటి పత్రిక కాదు…ఎన్నో ఏళ్ళుగా ప్రముఖుల పర్యవేక్షణలో  ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి..కేవలం స్త్రీలకే అని కాకుండా పురుషులకు కూడా సముచిత స్థానం కల్పిస్తూ..తనదైన బాటలో నడుస్తున్న పత్రికను దిక్కుమాలిన పత్రిక అనడం సముచితం కాదు…మనం ఒకరిని దూషిస్తేనో, వేలెత్తి చూపితేనో గొప్పవారమయిపోతామనే భ్రమలు ఇప్పుడు లేవు.. మనం [...]

భూమిక: ప్రపంచీకరణ విషవలయంలో స్త్రీలు

2008-08-09 06:39 AM భూమిక
అరణ్య సామాజిక వ్యవస్థలో స్త్రీల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తరతరాల సామాజిక పరిణామం నిరూపించింది.  సమాజ గమనంలో, ఆధునిక తరాల అభివృద్ధి క్రమంలో మహిళల తోడ్పాటు ఎంత గణనీయమైనదో చరిత్ర నిరూపించింది.   తరతరాల పురుషాధిక్య భావజాలంలో, పురుష స్వామ్య సంస్కృతిలో అడుగడుగునా బానిసత్వంతో మగ్గుతూ వచ్చినా, సమాజం చూసే చిన్నచూపును పెద్దమనసుతో భరిస్తూ వచ్చినా, మహిళలు ఏనాడూ తమ అస్తిత్వాన్ని కోల్పోలేదు.  తీవ్ర సామాజిక నిర్బంధాల మధ్య, కుటుంబ నియంత్రణల మధ్య కూడా క్రమంగా పుంజుకుంటూ తమ ఆవశ్యకతను [...]

భూమిక: ‘’ఎవరి అందం ఎవరికి ఆనందం?'’

2008-08-09 06:37 AM భూమిక
పోడూరి కృష్ణకుమారి   చేతిలో ఉన్న వీక్లీలోకి చూస్తూ నిట్టూర్చింది మీనాక్షి.  చదువుతున్న కథ పేజీ మధ్యలో పెద్ద బాక్స్‌ కట్టి ఓ నటి బొమ్మ.  దానికింద ఏదో వివరణ ఉన్నాయి.   అలా పేజీలో ఉన్న మేటరుకి సంబంధం లేకుండా మధ్యమధ్యలో బాక్స్‌ ఐటమ్స్‌ వెయ్యడం పత్రికల్లో మామూలే.   అందుకు మీనాక్షికి ఏం అభ్యంతరం లేదు.  ఆ బాక్స్‌లో ఉన్న బొమ్మను చూస్తే కాస్త విచారం కలిగింది మీనాక్షికి.   అందులో అమ్మాయి (ఏదో హిట్‌ మూవీ హీరోయిన్‌) తను తొడుక్కున్న లోవెయిస్ట్‌ జీన్స్‌ను [...]

భూమిక: ‘’పెయింటింగ్సే నా పిల్లలు'’-గోపాలుని విజయలక్ష్మి

2008-08-09 06:32 AM భూమిక
కొండేపూడి నిర్మల హైదరాబాద్‌లో వారం రోజులు వుండాల్సిన పని పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లో వున్న మా చెల్లెలు లీల ఇంటికొచ్చాను. నిన్న పొద్దున్నే కాఫీ తాగుతూ మొగుడ్ని ఫోన్లో వింటున్నాను. అనారోగ్యాల మధ్య, ఆర్ధిక బాధల మధ్య నెత్తి మీదకు జారిన నూరు వరహాల కొమ్మనీ గానీ దాని మీదున్న నీలి పచ్చ పిట్టను కానీ పట్టించుకోలేదు. లీల అత్తగారు పిలిచి చూపించింది ‘’అదిగో ఆ పిట్టని చూడు…అబ్బ ఎంత బావుందో నీలి పచ్చ మొహాం, నల్లటి రెక్కల దాని మీద [...]

భూమిక: ఆర్‌. వసుంధరాదేవి రచనల్లో తాత్వికదర్శనం

2008-08-09 06:22 AM భూమిక
రచన, సేకరణ : పుష్పాంజలి వసుంధరాదేవి కథలు సుందర ప్రకృతికీ మానవ సహజ నైజాలకు ప్రతికృతులు.  జర, రుజ, మరణాలకు అర్థం వెదికే అన్వేషణలు.  సృష్టి రహస్యాన్ని చేధించే పరిశోధనలు.   ఈమె కథల్లో తాత్వికచింతన అంతర్గత ప్రవాహంలా సాగుతుంటుంది.  జీవితంలో జరిగే అతిసాధారణమైన సంఘటనల నుంచి మానవనైజాలను వెదికే కథలవి.  హృదయంతరాళ జిగిబిగి ఆలోచనల చిక్కు ముళ్లు విడదీసే ప్రయత్నాలివి.  లౌకిక సంఘటనల నుంచి ప్రగాఢమైన అలౌకికతను ప్రతిబింబిస్తాయి వసుంధరాదేవి కథలు. ‘’పంచభూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనట'’ అంటూ సృష్టిరహస్యాన్ని పాటగా పాడే [...]

భూమిక: ఆమెకో అక్షర నివాళి

2008-08-09 06:13 AM భూమిక
రేణుక అయోల సాహిత్య లోకంలో ఆమె పరిచయం  కొద్ది నెలలు కావచ్చు….. స్నేహ హృదయాన్ని  అందిపుచ్చుకొన్నాను ఎప్పుడు ఎదురొచ్చినా నిండుగా నవ్వుల పువ్వులు వెదజల్లే ఆ ఆత్మీతయను పదిలపరచుకొన్నాను అందరితోపాటూ కలసీ తలకోన అడవుల్లోనైనా భూమిక ఆఫీసులోనైనా మనతో పాటూ ఎన్నోసార్లు  కలసి నడచిన   ఆమె… మన మధ్య లేదనుకుంటే  సన్నని కోత ఆమె మనకు కనిపించకపోయినా మనతో ఇమిడిన గతం పదే పదే తలచుకొనేలా చేస్తుంది స్నేహం విలువ చాలా గొప్పది అది ఎప్పుడూ గతించదు  మన పరిచయాలు అక్షరాలే మనమెంత తొందరగా కలసిపోయి విడిపోయినా  దూరాలు పెంచుకొన్నా మిగిలిపోయిన జ్ఞాపకాలు పుస్తకాల మధ్య  పేజీల కొమ్మల చివర్న   సజీవంగా గుర్తుండిపోయే  ఆమెకో అక్షర నివాళి   (భార్గవీరావుగారి స్మృతిలో)

భూమిక: తెరతీయగ రాదా

2008-08-09 06:11 AM భూమిక
సువార్తమ్మ మావోళ్ళే మాలో వాళ్ళేనని నమ్మాం అంబేడ్కర్‌ బొమ్మ పెట్టుకున్నారు కదా… దోపిడీ చెయ్యర్లే అనుకున్నం కలిసి పోరాడుదాం అన్నపుడల్లా కలిసి పంచుకుందాం అంటున్నారని బెమపడ్డాం కాడెద్దులై ఎట్టి పనిలో నలిగినోళ్ళం ఒకరికొకరు ఓదార్పు అయినోళ్ళం దొరతనం ముందు మీరూ మేమూ ఒక్కటే అనుకున్నాం ఒక మెట్టు పైకెక్కి మాపైనే కాళ్ళెత్తినారు మా లోగుట్టు ఎరిగి మా మల్లల్ని పగలగొట్టినారు మా బువ్వ గుంజుకుని మమ్మల్నే బూకరించినారు మాదిగ వారిని మా దిగువ వారని ఈసడించినారు ‘దారా’ ధర్మం మాట్లాడుతున్నావా? నిజమైతే చెప్పు సియ్యల దండేస్తాం ముడుసుగొట్టి పెడతాం అవునూ మన కులపెద్దలేరీ? ఎబిసిడి కంచాల్లో రిజర్వేషన్‌ మెతుకులు పంచమని పంచాయితీ జరుగుతుంటే [...]

భూమిక: వివాహమహోత్సవం

2008-08-09 06:10 AM భూమిక
కె. వరలక్ష్మి అందరూ రావాలి పెళ్లికి అమ్మాయి అమ్మానాన్నల కళ్ళల్లో ఆరిపోబోతున్న దివ్వెల్ని చూడాలి…. అంతా అద్భుతంగానే ఉంది ఖరీదైన కళ్యాణమండపం లక్షల విలువైన పచ్చిపూల తోరణాలు నాలుగు వీధుల అంచులమేరకు నగిషీ బల్బుల అలంకరణలు అప్పటికప్పుడు మొలిపించిన కృత్రిమవనాల సోయగాలు పరిమళద్రవ్యాల ఫౌంటెన్లు అంతా అద్భుతంగానే ఉంది సన్నాయి వాద్యాల సవ్వడులు బేండుమేళాల బృహద్వాయింపులు అంతంత మాత్రంగా తిని వదిలేసే ఆకుల్లో షడ్రసోపేత విందులు నవదంపతుల ముఖాల్లో చిరునవ్వుల చిందులు అంతా అద్భుతంగానే ఉంది ఇరవైలక్షల కేష్‌ ఇన్నాళ్లూ కుటుంబానికి చేదోడై నిలిచిన అరణంభూమి ఆరెకరాలు ప్లాట్లు ఫ్లాట్లు వాటిని సంపాదించడానికి పడిన పాట్లు అమ్మాయి ఒంటిన అరవైతులాల బంగారం ఆరుకేజీల వెండి అంతకు రెట్టింపు ఇత్తడి బియ్యం బస్తాలు పప్పులు ఉప్పులు పెళ్లయ్యాక చూసుకుంటే ఊరంతా అప్పులు అబ్బాయి రాజధానిలో సాఫ్ట్ [...]

భూమిక: ఆ నవ్వులిక పూయవు ఆ నడకలిక సాగవు!

2008-08-09 06:06 AM భూమిక
వారణాసి నాగలక్ష్మి ‘ప్రభంజనం’ చిన్నబోయింది… ప్రవాహం ఆగిపోయింది భార్గవి అస్తమయంతో. అయోమయమైన ఆకాశం తొలకరించడం మానేసింది ఆ నవ్వులిక పూయవని తెలిసి పువ్వులు మొగ్గలై ముడుచుకున్నాయి ఆ నడకలిక సాగవని తెలిసి ‘ప్రణవగంగ’ ఆమె నెత్తుకుని కదిలిపోయింది అగ్నికీలల్లో రూపాన్ని వదిలేసి ఆ సుందరాత్మ పైకెగసింది ఇంకెన్నో మిత్ర సమూహాలపై స్నేహ వర్షమై కురిసిపోవాలని మరెన్నో అక్షరాలుగా మళ్ళీ మొలకెత్తాలని!   (ప్రభంజనరావుగారికి సహానుభూతితో)

భూమిక: అమ్మంటే…?

2008-08-09 06:04 AM భూమిక
యస్‌.వివేకానంద అమ్మంటే రెండు అక్షరాలే! అయినా దాగిన మాతృత్వం ఆకట్టుకునే వాత్సల్యం… అగుపించని త్యాగం కొట్టవచ్చేటట్టువుపించే ఔదార్యం! అమ్మంటే టోటల్‌గా ఒక పవిత్ర దేవాలయం! అమ్మంటే విద్యాలయం! అమ్మంటే… ఓర్పు!నేర్పు! అమ్మంటే ఆలంబన! అమ్మంటే అనురాగం అమ్మంటే ఔన్నత్యం అమ్మే సృష్టికి మూలం! అమ్మే జాగతికి వెలుగు! అమ్మంటే .. ఆలన!పాలన! అమ్మలేని జగమే శూన్యం! ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది అమ్మ ఋణం! కన్నతల్లిని గౌరవిస్తే ఈ సృష్టిలో సకల చరాచరాలను గౌరవించినట్టే! ప్రాణాధికంగా మాతృత్వాన్ని గౌరవించు! తరించు!!

భూమిక: మsheన్

2008-08-09 05:57 AM భూమిక
టి. సంపత్‌కువర ‘’అమ్మా… అమ్మా… లెవ్వవే! స్కూలుకి టైమవుతుంది.  ఈ రోజు యూనిట్‌ టెస్టుంది…'’ సరోజనుండి ఎలాంటి స్పందనా లేదు.  గాఢనిద్రలో ఉన్నట్టుంది.   ఐదు నిమిషాలయ్యాక పదేళ్ళ కూతురు అనన్య తండ్రి దగ్గరికెళ్ళి ఆయన్ని లేపే ప్రయత్నం చేసింది. కృష్ణారెడ్డి బద్దకంగా, నిద్రలోనే ‘’అమ్మని లేపమ్మా…'’ విసుగ్గా అన్నాడు. అనన్యకి గాబరాగా ఉంది.  తనతో అయ్యే పనుల్ని తాను చేసుకొంది.  డ్రెస్సు వేసుకొంది.  నీళ్ళబాటిల్‌ నింపుకొంది.  స్కూలుబ్యాగు సర్దుకొంది.  తల దువ్వుకొంది.  షూస్‌ వేసుకొంది… లంచ్‌బాక్స్‌ ఒకటే మిగిలింది.  దానికి అమ్మే కావాలి.  [...]

భూమిక: టోని మారిసన్‌

2008-08-09 05:24 AM భూమిక
పి. సత్యవతి పదేళ్ళకిందట అనుకోకుండా మా వూరి మైత్రీ బుక్‌హవుజ్‌లో నాకు ‘బిలవ్డ్‌’ అనే పుస్తకం దొరికింది.  టోని మారిసన్‌ అనే రచయిత్రి గురించి వినడమే కానీ అప్పటిదాకా నేను ఆవిడని చదవలేదు. ఏదైన ఒక పుస్తకం కొనగానే చదివెయ్యడం అలవాటు చొప్పున ఆ పుస్తకాన్ని ఆత్రంగా చదవబోయాను కానీ అది అట్లా ఆషామాషీగా చదివి పడేసే పుస్తకం కాదు కదా! ఒకసారి చదివేసి మళ్ళీ ఇంకోసారి చదివాక ఆ పుస్తకానికి పులిట్జర్‌ ప్రైజు రావడం ఎంత సహజమో, ఆ రచయిత్రికి [...]

భూమిక: స్త్రీవాద కవిత్వంలో శిల్ప విశేషాలు

2008-08-09 05:04 AM భూమిక
.’డా.వై .కామేశ్వరి ‘సుఖం అంటే ఏమిటి?’ అని పూర్వం ఎప్పుడో ఒక నిర్భాగ్యుడు తన గురువును అడిగాడట. ‘నీకాలి కంటే తక్కువ కొలత ఉన్న చెప్పులను వేసుకొని, కాసేపు ఆగాక దాన్ని విడచివెయ్యి. అప్పుడు సుఖం ఏమిటో తెలుస్తుంది’ అన్నాడట ఆ గురువు.   స్త్రీవాద కవిత్వాన్ని గురించి మాట్లాడుకునే సందర్భంలో ఈ కథను చెప్పుకోక తప్పదు.  వెనకటి కాలంలో స్త్రీలు తమ కాలికంటే తక్కువ కొలత గల చెప్పులనే ధరించి జీవితాలను గడిపివేశారు.  వాటిని ఒక్క క్షణమైనా విడచివెయ్యటం జరగలేదు.  వారికి [...]

భూమిక: భావకవితాశైలిలో రాజకుమారి కవిత్వం’

2008-08-09 05:02 AM భూమిక
డా. శిలాలోలిత కవిత్వమంటే ఉన్న ప్రేమతో, చాలాకాలంపాటు రచనావ్యాసంగానికి అడ్డుకట్ట పడినా, రెట్టించిన ఉత్సాహంతో కవిత్వాన్ని మళ్ళీ ప్రారంభించిన కవయిత్రి కె. రాజకుమారి.    ’భావాల మేఘాలతో  అక్షరాల చినుకులతో  పదాల స్వాతివాన  నా కవిత  నా వనసాక్షర సరోవరంలో  వికసించిన పదాల ‘భావరాజీవం’ నా కవిత  అంటూ తన కవిత్వ నేపథ్యాన్ని వినిపించింది.  రాజమండ్రిలో వున్న ఈ కవయిత్రి ‘వీరేశలింగం’ సాహిత్య సామాజిక కృషి గురించి రెండు కవితలు రాసింది.  లాయర్‌గా, సామాజిక కార్యకర్తగా ఆమెకున్న రాజకీయనుభవాలన్నీ కవితలైనాయి.  భార్యాభర్తలు ‘సమాంతరరేఖలు’గా వుండే తీరును  ’దగ్గరగానే ఉన్నా ఒకదాని  నొకటి చూచుకోలేని రెండు కళ్ళల్లా  మనసు [...]

2008-08-03

ప్రాణహిత: అదృశ్య దృశ్యాలన్నీ….

2008-08-03 04:36 AM ప్రాణహిత
- కమలాకర్ బొల్లోజు ఒక్కొక్క ప్పుడు బండ రాయిలా మారిపోతున్నపుడు నిన్న పాడిన కోయిల పాట లా నువు పుడతావు…

ప్రాణహిత: కొండపల్లి బొమ్మ

2008-08-03 04:35 AM ప్రాణహిత
-సి.హెచ్‌.ఉషారాణి అమ్మమొఖం తెరిపిగా వుంటుంది. కతికితే అతకదంటున్న ప్లేట్లు, అటు, ఇటుగా తిరగబడి వున్న నా ఫొటోలు, నన్ను దాటి పోలేదు.

ప్రాణహిత: మరణ శాసనం

2008-08-03 03:26 AM ప్రాణహిత
-డా.జి.వి. రత్నాకర్‌ వ వల పల్లె గుండెల గాయం పోతురాజు బండని అంకమ్మ చెట్టుని కులదైవం చెన్నకేసులు సోమిని నిలదీసి నాయం చేయమని అడుగుతుంది.

ప్రాణహిత: మనుషులు వయమౌతున్నారు.

2008-08-03 03:25 AM ప్రాణహిత
- మంచికంటి మనుషులు వయమౌతున్నారు. బతికిన నాలుగుక్ష్షణాలు సజీవంగా బతకడమే కావాలి మనిషిగా పుట్టిన మనిషికి

ప్రాణహిత: ఆత్మీయులు

2008-08-03 03:22 AM ప్రాణహిత
-పలమనేరు బాలాజీ ఇంట్లోకి అడుగుపెడుతుంటే అమ్మ గబగబా ఎదురొచ్చింది. నాన్న నా వైపే చస్త హాల్లో నిలబడ్డాడు. ఆయన అప్పుడే ఆఫీసు నుండి వచ్చినట్లుంది. మొహంలో అలసట కనిపిస్తోంది. ”ఉత్తరం వచ్చిందా” అడుగుతోంది అమ్మ-నా వెహంలోకే గుచ్చిగుచ్చి చస్త. నిస్తేజంగా ఆమె వైపే చస్త అక్కడే నిలబడిపోయను. ఆమెకు బదులు చెప్పే శక్తి నాకు లేకపోయింది. ఆమె మొహంలో ఇంకా ఏదో ఆశ మిణుకు మిణుకుమంటున్నట్లు-”ఫోన్‌ ఏమైనా వచ్చిందా పోనీ” ఆమె గొంతునిండా వేదన, ఆశ, కలగలసి పోయయి.

ప్రాణహిత: మాల పంతులమ్మకు సెలవు కావాల్నా?

2008-08-03 03:04 AM ప్రాణహిత
-పి. అనురాధ అమ్మో! అప్పుడే ఇంత చీకటి ఎలా అయింది? అంతేకదా నాలుగ్గంటలకి కూర్చున్నావ్‌. టైం చూడు అప్పుడే ఎనిమిది కావొస్తుంది. ఏమనుకున్నావ్‌…ఏదీ నీ కోసం ఆగదు..అమ్మ ఒడిలో ఆడుకునే పాపే ఆగలేక నేలమీద ఎప్పుడు ప్రాకాలా అని ఎగురుతుంది. అలాంటిది ఈ కాలం ఆగుతుందా నీ పిచ్చి గాని చూడు ఆకాశం ఎంత నిర్మలత్వాన్ని పొందిందో. పగలంతా భగభగమండే ఎండలో అలసిన గీతలేవీ కనిపించని ఆ ఆకాశపు అందం ఎంత బాగుందో…

ప్రాణహిత: నీ ఆశ నీదే

2008-08-03 03:01 AM రమ్య గీతిక
- రమ్య గీతిక.కే పద్దెనిమిది ఏళ్ళ వైవాహిక జీవితం లో ఒక గృహిణిగా బాధ్యతలను విజయవంతంగా నెరవేర్చాను, అన్నీ సజావుగా గడిచి పోయాయి. తన జీవితం లో తీరని కోరిక ఒకే ఒక్కటి అది తీర్చడానికి [...]

ప్రాణహిత: లచ్చిందేవి

2008-08-03 02:56 AM పెద్దింటి అశోక్‌ కుమార్‌
లింబాద్రి బతుకంత బర్రె మీదనే. అది బర్రెంటే బర్రె గాదు గౌడి బర్రె బిందెడుపాలు. యాడాదికో ఈత. కొన్ని బర్లు ఈనే ముందు ఆరునెలలు పాలియ్యయి. లింబాద్రి బర్రె అట్లగాదు. వారమంటే వారం రోజులే! ఆ వారం గూడా పిండుకుంటే ఇండికి సరిపడ పాలిస్తది కానీ జిగురు జిగురుంటయని లింబాద్రి పిండడు.

ప్రాణహిత: ఇంటర్నెట్‌లో సాహిత్య పరిమళాలు

2008-08-03 02:54 AM ప్రాణహిత
-పెరుగు రామకృష్ణ ఇరవైయేళ్ళ క్రితం సాయంత్రం అయితే చాలు మిత్రులంతా ఒక్కో సెంటర్‌లో గుంపులుగా చేరి కబుర్లు కలబోసుకునేవారు.పదేళ్ళ క్రితం వరకూ పత్రికల్లో వచ్చే సీరియల్స్‌, కవిత్వం, కధల గురించి ఇంకా సామాజిక అంశాల గురించి చర్చించుకునేవారు. కంప్యూటర్‌ విస్తృతి ఈ దేశంలో పెరిగాక ఇప్పుడందరి కలయిక ‘నెట్‌ కేఫ్‌’లలోనే.’బుక్‌ కల్చర్‌ పోయి లుక్‌ కల్చర్‌’ వచ్చేసిందని ఒక మహాకవి అన్నట్లు ఇంటర్‌నెట్‌ ఇప్పుడు అందరి ప్రపంచం అయిపోయింది.

ప్రాణహిత: శిల్ప ప్రజ్ఞలో సావజిక వాస్తవికత, లోకజ్ఞత, స్థానీయత!

2008-08-03 02:50 AM ప్రాణహిత
: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి రచనా వైశిష్ట్యం! -విహారి అతి తక్కువ సంఖ్యలో రచనలు చేసి, చేసిన ప్రతి రచనకూ బహుమతుల, పురస్కారాలు పొంది, అత్యంత గౌరవప్రదమైన సాహితీ కీర్తిని సముపార్జించుకున్న అరుదైన రచయిత-జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు..వారు చేసిన రచనలన్నీ గట్టి గింజలు కావటమే వారి ప్రథితకు కారణం. మూర్తి గారి అభిజనం గొప్పది.వారి తండ్రిగారు కీ.శే. జొన్నవిత్తుల రామకృష్ణ శర్మగారు సంస్కృతాంధ్రాంగ్ల భాషా పండితులు, కవి, గాయకుడు, నాటకకర్త, విమర్శకులు. తల్లిగారు లక్ష్మీనరసమ్మ గారు విదుషీమణి.

ప్రాణహిత: అధ్యాయం 10: చలో వూండెడ్ నీ!!!

2008-08-03 02:47 AM మమత
నేను రాడికల్నో రెవల్యూషనరీనో అని నేను అనుకోను. అలాంటి లేబుల్సు తెల్లవాళ్లు మామీద రుద్దారు. ఎప్పుడైనా మేము కోరుకున్నదల్లా మా బతుకులు మమ్మల్ని మాకు తోచినట్లు బతకనివ్వమని మాత్రమే. పేపరు మీద మాత్రమే రాసినట్లు కాకుండా నిజంగానే మమ్మల్ని మేము పరిపాలించుకోనివ్వమని , మా హక్కుల్ని గుర్తించమని ! అలా డిమాండు చెయ్యడం రెవల్యూషనరీ అయితే నేను ఆ వర్ణనకు సరిగా సరిపోతాను.

ప్రాణహిత: ద పోస్ట్ మాన్ : (నాలుగవ భాగం)

2008-08-03 02:46 AM ఎన్. వేణుగోపాల్
- ఆంటోనియో స్కార్మెటా (తెలుగు: ఎన్ వేణుగోపాల్) టెలిగ్రాఫ్ ఆపరేటర్ కోస్మెకు రెండు సూత్రాలు చాల ఇష్టమైనవి. వాటిలో ఒకటి సోషలిజం. దాని గురించి ఆయన తన దగ్గర పనిచేసేవారి బుర్రలు తింటుండేవాడు. వాళ్లందరూ అప్పటికే ఆ సిద్ధాంతానికి సానుభూతిపరులో, కార్యకర్తలో అయినా సరే. రెండో సంగతేమో పోస్టాఫీసులోపల పోస్టాఫీసు టోపీ పెట్టుకోవడం.

ప్రాణహిత: స్వాతంత్రం అంటే?

2008-08-03 02:42 AM జయప్రకాశ్ తెలంగాణ
స్వాతంత్రం అంటే? ‘Can we look beyond the FREEDOM that is being marketed to us?’ is the million Dollar question? (ఎందుకంటె రూపాయిల భాష ఎవరు మాట్లాడుతలేరు కాబట్టి). ఇప్పుడు ఉన్న తరం మార్కెట్ శక్తులకు ఎంత ప్రభావితం అయితుందో వేరేగ చెప్పనవసరం లేదు. ఎనభైలు, తొంభైల తరాలకన్న ఇప్పటి (ఇంటర్నెట్) తరం ఆశలు ఆశయాలల్ల చాల మార్పులొచ్చినయి.

ప్రాణహిత: అమెరికాలో పత్రికలు

2008-08-03 02:41 AM ప్రాణహిత
కొద్ది కాలంగా పుస్తకాలు / పత్రికల గుట్టలు పడుతున్నాయి,వాటిని దీక్షగా చదివిన పాపాన పోలేదు.కాస్త తెరపి దొరికింది,కూలంకషంగా చదవడం మొదలెట్టా. Newyorker మంచి పత్రిక.న్యూయార్క్ లో ఆడే నాటకాలు, జరిగే కార్యక్రమాలే కాకుండా మంచి సమీక్షలు చోటు చేసుకుంటాయి. ప్రత్యేక సంచికలకు(వంటలు/Architecture వగైరాలు)ప్రసిద్ధి గాంచిందీ పత్రిక. FALL పుస్తకాల గురించి మంచి సంచిక వెలువడింది. రష్యన్ నవలానువాదాలు మొదట్లో ఎలా ఉండేవి?తర్వాత్తర్వాత నిపుణ మతులు ప్రవేశించాక ఏ తీరున దోస్తవిస్కీ,టాల్ స్టాయ్,తుర్గినీవ్ ల రచనలు పాఠకులకు అందుబాటులోకి [...]

ప్రాణహిత: తెలుగు దళిత కథాపరిణామం

2008-08-03 02:31 AM ప్రాణహిత
-డా//దార్ల వెంకటేశ్వరరావు తెలుగులో దళిత సాహిత్యం కవిత్వం, కథ, నవల, నాటకం, పాట, విమర్శ తదితర ప్రక్రియలతో పరిపుష్టిగానే వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే, దళిత సాహిత్యం ప్రక్రియాపరంగా కూడా ఎంతో వైవిధ్యాన్ని చాటుతోంది. ప్రజలతో, ప్రజల ఆకాంక్షలతో ప్రత్యక్ష సంబంధాల ప్రతిఫలనం కూడా దళితసాహిత్యంలో కనిపించే విశిష్టతల్లో ఒకటి. విప్లవ సాహిత్యనంతరం తమ సమస్యల కోసం ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాలు నడిపి, ఆ భావాలను సాహిత్యంగా సృజనీకరించే సాహిత్య దృక్పథం దళిత సాహిత్యంలోనే స్పష్టంగా [...]

2008-08-02

కొత్తపల్లి: పెద్దదిక్కు

2008-08-02 05:26 PM

శ్రావణ భాద్రపదాలు అనే పేరుతో కోస్తాంధ్రలో వాడుకలో ఉండిన ఈ కథను గంగమ్మక్క రాయలసీమ రూపంలో గుర్తుచేస్తున్నది. గంగమ్మక్క టింబక్టుబడి, చెన్నేకొత్తపల్లిలో చిన్నపిల్లలకు చదువులు చెబుతున్నది. ఎన్నేళ్ళు గడిచినా ఆనందాన్నందించే ఈ కథను మీరూ చదవండి, మరోసారి నవ్వుకోండి.

కొత్తపల్లి: అల్లరి దయ్యం

2008-08-02 05:26 PM

అల్లరి చేయటం అంటే ఇష్టం లేని పిల్లలు ఉండరు. వాళ్లంతా పెద్దవుతున్నకొద్దీ అల్లరి మానేస్తారు, కానీ ఆలోగా రకరకాల భయాలు పెంచుకుంటారు. దయ్యాలంటేను, రాక్షసులంటేను భయాలు మనసులో గూడు కట్టుకుంటాయి. అసలు దయ్యాలున్నాయో లేవో గాని ఇలా మనసులో నిలవ ఉండే దయ్యాలు మాత్రం పిల్లల్ని నిజంగా గందరగోళ పెడతాయి. ఇలా భయపెట్టే దయ్యాల్ని పోగొట్టాలంటే వాటినీ మానవీయం చేయటం ఒక మార్గం. నారాయణ రాసిన ఈ ’అల్లరి దయ్యం’ కథ అలాంటి ప్రయత్నం చేస్తుంది. చూడండి.

2008-07-31

ప్రజాకళ: అభివృద్ధికి అణుశక్తి అవశ్యమా? - కె.బాలగోపాల్

2008-07-31 04:46 PM ప్రజాకళ
అణు ఒప్పందం గురించి రాస్తున్నవారందరూ అపోహలు తొలగించడానికి రాస్తున్నామనే అంటున్నా రు. ప్రజలకు స్వతహాగా అపోహలు కలగడానికిది సాయిబాబా కన్ను తెరవడమో వినాయకుడి క్షీరపానమో కాదు. ఒకరు కలిగిస్తే తప్ప ఈ విషయంలో అపోహలు కలి గే అవకాశం లేదు. ఊహలయినా అపోహలయినా వ్యాఖ్యా తల అభిప్రాయాల వల్ల కలుగుతున్నవే. ఈ అభిప్రాయాలకు ప్రత్యక్ష ఆధారం మూడే మూడు పత్రాలు. ఒకటి భారత-అమెరికా 123 ఒప్పందం. రెండవది అమెరికా జారీ చేసిన హైడ్ చట్టం. మూడవది భారత్‌కూ అంతర్జాతీయ [...]

2008-07-21

ప్రజాకళ: బానిసలు కానిదెన్నడు? - ఎన్ వేణుగోపాల్

2008-07-21 07:22 PM ప్రజాకళ
ప్రతివాదం జూలై 19, 2008 కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం అమెరికాకు బానిసలా ప్రవర్తిస్తున్నదని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్య అక్షర సత్యమే గాని ఆయన నోట రావడమే కొంచెం ఎబ్బెట్టుగానూ ఆశ్చర్యంగానూ ఉన్నది. రాష్ట్రప్రభుత్వ రాజకీయార్థిక విధానాలు ఎట్లా నడవాలో ప్రపంచబ్యాంకు రాసి ఇచ్చిన పత్రాన్ని తు.చ. తప్పకుండా అమలు చేసిన చరిత్ర ఆయనది. ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికన్ ఏజెంటులాగ వ్యవహరిస్తున్నారని అణు ఒప్పందం వ్యవహారం మొదలయినప్పటినుంచీ వామపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు కూడ అటువంటివే. ఆయనను ప్రధానిగా [...]

ప్రజాకళ: అణుఒప్పందం వాస్తవాలు

2008-07-21 05:44 AM ప్రజాకళ
పార్లమెంటులో మెజార్టీ కోల్పోయిన కాంగ్రెసు ప్రభుత్వం, జార్జ్ బుష్ తో “అణుఒప్పందం” చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. పైకి న్యూక్లియర్ రియాక్టర్లకు అవసరమయ్యే యురేనియం ఇంధనం సమకూర్చుకోవటం యీ ఒప్పంద లక్ష్యమైనా, దీనివెనక ఎంతో రహస్య ఎజెండా వుంది. అంతర్జాతీయ మార్కెట్టులో యురేనియం, ప్లూటోనియం ఖరీదు చేయాలంటే, అమ్మడానికి సిద్ధంగా ఎన్నో దేశాలున్నాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా కొనటానికి అవకాశమున్నది. మరి అమెరికా నిబంధనలకు తలవగ్గాలిసిన అవసరమున్నదా? భారతదేశ విదేశాంగవిధానాన్ని యుద్ధోన్మాద అమెరికాకు తాకట్టుబెడుతూ, లాలూచీలతో, రహస్య ఒప్పందం [...]

ప్రజాకళ: “గొర్లను తినెటోడు పోతె బర్లను తినెటోడచ్చిండు”

2008-07-21 04:15 AM ప్రజాకళ
ఒక ఆటోవాలా… నేనూ… చిరంజీవి - అల్లం నారాయణ ‘ఈనె అడ్డగోలుగున్నడు సార్. మా బతుకులు నాశ్నం చేస్తండు. డిజిటల్ మీటర్లని పెట్టిచ్చిండు.కంపెనీల కాడ దొ… మా ఆటోవాళ్ల బత్కు లు బండలు చేసిండు సార్. ఈనె జూడు. ఎట్ల కట్టుకున్నడో బంగ్ల’ ఉరుము లేని పిడుగు. ఒక ఆటోవాలాకు అంత ఆగ్రహం ఉన్నట్టుగానీ, అది ఒక అపరిచితునితో, ఆటో లో కూచున్న కస్టమర్‌తో అంత ఉద్రేకంగా పంచుకుంటాడనిగానీ ఊహించి ఉండలేదు. ‘ద హిందూ’ దగ్గర ఎక్కా [...]
వ్యాఖ్యలు
2008-08-27
Comment on “100 ఎకరాల లీజును కాశ్మీరీలు ఇంతగా వ్యతిరేకించడానికి గల కారణం ఏమిటన్న ప్రశ్నకు జవాబు కావలసిందేనంటే, తమ ఉనికి పట్ల ,తమ నేల పట్ల,తమ సంస్కృతి పట్ల వారికి ఉన్న ఉద్వేగభరితమైన బంధాన్ని కారణంగా చూపించవలసి ఉంటుంది.” by hari devana
2008-08-27 07:38 AM - ప్రజాకళ

అయ్యా బాలగోపాల్ గారు,
విజయవాడలో క్లాసు రూములో ఒక అమ్మాయిని నరికి చంపటానికిగల కారణం ఏమిటన్న ప్రశ్నకు జవాబు కావలసినదేమిటంటే, మగాడు అయిన తన ఉనికి పట్ల, అమ్మాయి అయిన ఆమె నిస్సహాయత పట్ల, అమ్మయి పైన తన ప్రేమ వల్ల, వ్యామోహం వల్ల, పిచ్చి అభిమానం వల్ల వానికి వున్న ఉద్వేగభరితమైన భందాన్ని కారణంగా చూపించవలసి వుంటుంది.

Comment on లక్ష హిట్ల నవతరంగం by సుధాకర బాబు
2008-08-27 07:10 AM సుధాకర బాబు - Comments for నవతరంగం

అభినందనలు.

సినిమా పత్రిక అంటే పుకార్లు, అర్ధనగ్నపు బొమ్మలు. - సినిమా సైటులంటే డౌన్‌లోడులు, బూతులు - అన్న అభిప్రాయం బలంగా ఉన్న సమయంలో విజ్ఞానాత్మకమైన సినిమా సమాచారానికి స్థానం ఉందని, దానికి ఆదరణ కూడా లభిస్తుందని మీరు ఋజువు చేశారు. కాని ఈ దృక్పథం మన టీ.వీ.ఛానెళ్ళ వారికి అస్సలు ఉండకపోవడం దురదృష్టం.

Comment on స్వేచ్ఛా విహంగాలు (Stray birds) by maha
2008-08-27 05:33 AM maha - Comments for పొద్దు

excellent
ravindaragari githangali kuda telugulo prachurinchagalaru.

Comment on KungFu Panda (2008) by ceenu
2008-08-27 03:39 AM ceenu - Comments for నవతరంగం

hi sowmya …kungfu panda cinema naaku chalabaga nachindi ,anukoni paristhitilo panda barilo diginapudu Aaadhi guruvu(tortoise) ‘there is no accidents’ ante every thing writtend anaa?bhagavanthudi aagnya merake jarugutundani naaku ardhamaindi ……ceenu

2008-08-26
Comment on చిత్రీకరణల వెనుక వక్రీకరణలు -పసునూరి రవీందర్‌ by బాబి
2008-08-26 08:00 PM - ప్రజాకళ

అయ్యా రవీందర్,
నువ్వు చెప్పినది చాలా బాగుంది. బుద్ది చెప్పి గడ్డి తిన్న చందంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. తెలంగాణ భాషేమి తక్కువ కాదు అని నువ్వు చెపుతూనే ఎక్కడ తెలంగాణ యాస కలవకుండా రాయడం వెనుక మర్మమేమిటో ఒకసారి ప్రజలందరికి వ్యక్తపరిస్తే బాగుంటుంది.

తెలంగాణ భాష గురించి ఇంతలా మాట్లాడుతున్న నీలాంటి ఒక వ్యక్తి కోస్తాంద్ర భాష లో రాసినప్పుడు సినిమాలో హీరోయిన్ తెలంగాణ భాషలో మాట్లాడాలనుకోవడం అంత అవివేకం మరొకటి లేదు. పాతబస్తీ, గండిపేట, దూల్ పేట లలో రౌడీలను చూపించారు అంటే ఆ ప్రాంతమంతా రౌడీలే ఉంటారా అన్నది మంచి ప్రశ్నే కానీ సినిమా కథ అంతా కోస్తాంద్ర,రాయలసీమ జిల్లాల్లో తీసి రౌడీపాత్రలకోసం మాత్రమే మన పాతబస్తీ తదితర ప్రాంతాలకు రాలేదు కదా. సినిమా అంతా హైద్రాబాద్ లోనే తీస్తునట్లు చూపుతున్నారు అలాంటప్పుడు హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలో రౌడీలను చూపిస్తే రౌడీలందరు ఆ ప్రాంతంలో ఉన్నట్లా.. ?? సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజనీరు పాత్రదారిని బాలానగర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్లు చూపలేరు కదా…

పెద్దాపురం, చిలకలూరిపేట చిలకల గురించి సినిమాలలో చిత్రీకరించిన సంధర్బాలు లేవా.. అంటే పెద్దాపురం, చిలకలూరిపేట వాసులంతా వేశ్యా వృత్తినే చేస్తున్నారా.?? ఇలా ప్రతిదానిని భూతద్దంలో చూసి (చూపి) మనని మనం కించపరచుకోకుండా చేయవలసిన పని చూస్తే బాగుంటుందని నా ఆలోచన.

నేను తెలియక ఏమన్నా తప్పుగా బ్లాగి (వాగి) ఉంటే క్షమించండి.

మీ……..

Comment on యానిమేషను సినిమాలు … by ప్రవీణ్ గార్లపాటి
2008-08-26 07:14 PM ప్రవీణ్ గార్లపాటి - Comments for నవతరంగం

@ మహేష్:
మొదలు అంటూ ఉంది. నాకది సంతోషం కలిగించే విషయం. మన పురాణాలు మంచి intriguing కథలు. అవి యానిమేషనుగా మలచడం మంచిదే.

@ సుజాత:
యానిమేషను నచ్చంది ఎవరికి :)

@ ప్రపుల్ల:
WALL-E కూడా ఒక ఎక్సలెంటు సినిమా !

@ సౌమ్య:
వ్యాసాన్ని ఇంకా పొడిగించలేక అలా సర్దుకోవాల్సి వచ్చింది. అందుకే కనీసం వాటిని స్మరించి తరించా :-)

అసలు చెప్పుకుంటూ పోతే అద్భుతమయిన యానిమేషను సినిమాలకి అంతే ఉండదు. లయన్ కింగ్, మాన్స్టర్స్ ఇంక్, ఆంట్ బుల్లీ, ఎ బగ్స్ లైఫ్, రాటటూయీ ఇంకా ఎన్నో.

Comment on నువ్వు బతికే ఉన్నావా by GURRAM SEETARAMULU
2008-08-26 06:39 PM GURRAM SEETARAMULU - Comments for ప్రాణహిత

నిరాశా కాకుటే ఏం ఉంటాది ?
ఎవరికి వారె యమునా తీరె !
కొందరు POST MODRANISTU LU అయారు ,
మరి కొందరు NGO LU న డూపుతున్నారు,
కొందరు కవిత కూడూ పెట్టూ ద్దా అంటూన్నరు,
తుపాకులు వదిలి నటుల పంచ న చెరారు ,
ఇన్కొందరు CHIRUIST LU AYYARU ,
ఇన్కొందరు అన్ని ISAA L AKU KAALA DOSAM PATIINDANNARU
ANTAA ABBADDAM……??????????????????????????

Comment on హార్ట్ బ్రేకింగ్ by దూర్వాసుల పద్మనాభం
2008-08-26 05:40 PM దూర్వాసుల పద్మనాభం - Comments for పొద్దు

ఆశ్లీల దృశ్యాలను చూపించడానికి టివి వాళ్ళు ఇటువంటి అడ్డదార్లు తొక్కడం పరిపాటయిపోతోంది.ఏమైనా అంటే ఈ కాలం యూత్ ఇవి కోరుకుంటున్నారంటారు. వీటిని కంట్రోల్ చెయ్యటం ప్రభుత్వం పని కాదా?
ఏమైనా నలుగురిని బాధిస్తున్న విషయాన్ని కధారూపంలో సున్నితంగా అందించారు.

Comment on ఛందోధర్మము by Kameswara Rao
2008-08-26 05:30 PM - Comments for ఈమాట

పదేళ్ళుగా eగ్రూపుల్లో ఉండి చూసిన సాధారణ విషయం ఒకటుంది. ఒకరేదో విషయం మీద ఒక పోస్టు వేస్తారు, దానికి సంబంధించిన టైటిలేదో పెట్టి. అది సిసింద్రీలా వేసిన చోట ఉండకుండా దానిష్టం వచ్చిన దిశలో, ఇష్టం వచ్చిన రీతిలో భూమ్యాకాశాల్లో సంచరించడం మొదలుపెడుతుంది. దాంతో కాస్త తెలివున్న వాళ్ళు ఆ పోస్టు టైటులు మారిన విషయానికి అణుగుణంగా మారుస్తూ ఉంటారు.
అలాటి సౌకర్యమిక్కడేమైనా ఉంటే ఈ వ్యాసం టైటిలు అర్జంటుగా మార్చేయాల్సిన అవసరం ఉన్నట్టు నాకు గట్టిగా అనిపిస్తోంది :)

Comment on “గొర్లను తినెటోడు పోతె బర్లను తినెటోడచ్చిండు” by Rallavagu
2008-08-26 03:48 PM - ప్రజాకళ

బతక లేక ఆటో నడుపుకునే వాళ్ళ మీద కన్నా ప్రభుత్వ0 ముసుగులో ప్రజా ధనాన్ని దోచుకు0టూ చిరునవ్వులు చి0ది0చే వాళ్ళే ధనికులైనా దరిద్రులు.మీటరు కనీస ధర ఒక కుటు0బ మనుగడకి సరిపోతుందా అని ఆలోచించాలి. బడా పారిశ్రామిక వేత్తలు సబ్సిడీల పేర రాష్ట్ర ఖజానాని దోచుకుంటున్నా అది పెద్దగా అనిపించదు. ఎందుకంటే, మన జేబులోను0చి పోవట్లేదు కాబట్టి.

Comment on ఛందోధర్మము by జె.యు.బి.వి. ప్రసాద్
2008-08-26 03:25 PM - Comments for ఈమాట

విప్లవ్ గారు, “పిల్లలకొరకు ‘నీతి పుస్తకాలు’ రాయటానికి child molestors పనికి రారు, రాసిన విషయం ఎంత గొప్పదయినా సరే. రాసే వాళ్ళకు credibility ఉండాలి కాబట్టే ఎవర్రాసారు అన్నది ముఖ్యం” అని రాసినదాన్ని, బాబ్జీలు గారు మహా యాంత్రికంగా అర్థం చేసుకుని, బదులుగా ఆయన, “మీరు రాసిన “ఛైల్డ్ మోలెస్టర్స్” చిన్న పిల్లల కథలు రాయడానికి పనికిరారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళకోసం కథలు రాస్తే పర్వాలేదా?” అని అడిగారు. అదా దానర్థం?

విప్లవ్ గారు రాసిన మాటల వెనకనున్న అర్థాన్ని సరిగా గ్రహించాలి. నీతివంతమైన ప్రవర్తన లేని మనుషులు గురివింద గింజల్లాగా, నంగనాచుల్లాగా ఇతరులకి నీతులు చేప్పే అర్హత కలిగి వుండరు అని అర్థం. యాంత్రికంగా అర్థం చేసుకుని, చైల్డ్ మోలెస్టర్సూ, పెద్దాళ్ళూ, గట్రా అని రాస్తే, ఏమన్నా అర్థం వుంటుందా?

విప్లవ్ గారు రాసింది చాలా కరెక్టు. “దెయ్యాలు మంత్రాలు వల్లించకూడదు” అని అంటారు చూశారా, అలాగన్న మాట. నీతి లేని వారు నీతి గురించి ఇతరులకి చెప్తే, “నువ్వు చేసేదేవిటీ, చెప్పొచ్చావు గొప్పగా ఇతరులకి” అని ఆ ఇతరులు నిలదీస్తారు. వాళ్ళు దులుపుకు పోతారనుకోండీ, అది వేరే సంగతి.

అయితే ప్రస్తుత సమాజాన్ని పరిశీలించండి. దెయ్యాల కధలూ, థ్రిల్లర్ నవల్లూ రాసి, పాపులర్ రచయితగా పేరు సంపాదించుకుని, కాలేజీ ఆడపిల్లను వశపరుచుకుని, ఆ పిల్ల ఆత్మహత్యకు కారణమైన గొప్ప రచయిత ఈ రోజుకీ గొప్పగానే చలామణీ అవుతున్నాడు. విప్లవాల గురించి గొప్పగా రాసి, ఇద్దరు భార్యలను పెట్టుకుని, బయట స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటూ, “ఎన్ని సిగరెట్లు కాల్చినా చార్ మీనార్ కాల్చిన తృప్తి వుండదు. ఎంత మంది ఆడవాళ్ళతో తిరిగినా, నా రెండో భార్యతో గడిపినట్టు వుండదు” అని ఆత్మ కధలో రాసుకుని, ఆ బయటి ఆడవాళ్ళను స్నేహితులతో పంచుకుంటూ, విచ్చలవిడిగా తిరుగుబోతుతనాన్ని ప్రదర్శించిన వారు మహా కవులుగా చలామణీ అవుతూ, పతితల గురించీ, భ్రష్టల గురించీ గొప్ప కవిత్వాలు రాశారు. ఇద్దరు భార్యల భుజాల మీదా చేతులు వేసి, పత్రికల్లో ఫొటోలు వేయించుకునే విప్లవ కవులున్నారు. ఇలా ఎంత మంది గురించో చెప్పుకోవచ్చు. ప్రజలు వీళ్ళ సాహిత్యం చదవడం మానేశారా? ఆ మధ్య ఆడపిల్లల్ని ఇండియా నించి తీసుకువచ్చి, అమెరికాలో వ్యభిచారంలోకి దించిన బిజినెస్ మేన్ కేసు గురించి విన్నాము. ఆ మనిషీ హాయిగా బతుకుతూనే వున్నాడు.

పైన వుదాహరించిన వాళ్ళకి సమర్థకులు లేరా? వాళ్ళేమంటారు? “ఈ సాహిత్యకారుల అసలు జీవితాలు మాకెండుకూ? వారు రాసింది మాత్రమే చూస్తాం” అని సన్నాయి రాగాలు తీస్తారు. ఇంకా గడుసు సమర్థకులైతే, “వీళ్ళ గురించి తెలిసినవన్నీ నిజాలే అని గేరంటీ ఏమిటీ? ఏమో, అవి నిజాలు కావేమో? మీరేమన్నా చూశారా? మీ దగ్గర రుజువులున్నాయా?” అని మన్నే దబాయిస్తారు. చాలా మంది అయితే, “ఏమోనండీ! మాకవేవీ తెలియవు” అని తప్పించుకుంటారు.

అదీగాక నీతులు రాసేవారి చరిత్రలు చాలా మందికి నిజంగానే తెలియవు. తెలిసినా పట్టించుకోరు. “సిగరెట్ కాల్చేవాడు ఇతరులకి కాల్చొద్దని చెప్పకూడదా? ఆ అలవాటు వల్ల జరిగే హాని అనుభవిస్తున్నాడు కాబట్టి, ఇతరులకి చెప్పగలుగుతున్నాడు” అని మొండిగా వాదిస్తారు కొంత మంది మహానుభావులు.

ఇదంతా చూస్తే, కప్పల తక్కెడ వ్యవహారమే గుర్తొస్తుంది. “ఏది నీతీ, ఏది అవినీతీ? అన్నీ కాలాన్ని బట్టి మారుతూ వుంటాయి” అని అడ్డగోలుగా మాట్టాడే సూడో ఫెమినిస్టులూ, సూడో కమ్యూనిస్టులూ కూడా వున్నారు.

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే, విప్లవ్ గారు చెప్పింది కరెక్టే అయినా, ప్రస్తుత సమాజంలో ఆయన చెప్పింది జరగడం లేదు. అవినీతి పరులు నీతి గురించి సాహిత్యంలో పొగలు కక్కుతూనే వున్నారు!

- జె.యు.బి.వి. ప్రసాద్

Comment on లక్ష హిట్ల నవతరంగం by meenakshi
2008-08-26 12:02 PM meenakshi - Comments for నవతరంగం

navatarangam..rachayitalaku andariki na hrudayapoorvaka abhinandanalu…

Comment on లక్ష హిట్ల నవతరంగం by శిద్దారెడ్డి వెంకట్
2008-08-26 11:33 AM శిద్దారెడ్డి వెంకట్ - Comments for నవతరంగం

@సాయి,జ్యోతి,జాన్,రావు,శివ,రెడ్డి,శ్రీవిద్య మరియు మిగిలిన పాఠకులకి
ధన్యవాదాలు.

Comment on ‘నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు’ : పాతికేళ్ల తర్వాత శ్రీశ్రీ by manogna
2008-08-26 09:47 AM manogna - Comments for ప్రాణహిత

మీరు చెప్పింది చాలా సత్యము. ఎంతగా క0ప్యుటరల వినియొగ0 పెరిగినప్పటికి సాహిత్యము చదివె వారు చదువుతూనె వున్నారు. ముఖ్యముగా శ్రీశ్రీ రచనల్ని. కాబట్టి ఎప్పటికి ఆయన రచన్లు నిలిచె వుంటాయి. మీ వ్యాస్ము బాగుంది

Comment on బంధుత్వం by murthy
2008-08-26 07:34 AM - Comments for ఈమాట

నచ్చింది. చాలా బాగుంది.

రక్తపు బొట్టుని కలుసుకోవాలనే మీ వూహ బాగుంది.

Comment on తెలుగు దళిత కథాపరిణామం by Kadire Krishna
2008-08-26 06:53 AM Kadire Krishna - Comments for ప్రాణహిత

డియరు దా.వె. చాల బాగూ వచిణనది.

Comment on కొంగేదీ? by Raja
2008-08-26 06:48 AM Raja - Comments for పొద్దు

శీర్షిక చూడగానే సుబ్రహ్మణ్యంగారు “కొంగు ఏదీ” అనే రొమాంటిక్ కవిత రాశారేమో అనుకున్నా, Utter disappointment.

Comment on కొంగేదీ? by Falling Angel
2008-08-26 06:42 AM Falling Angel - Comments for పొద్దు

రాకేశ్వరా, మమేకం అనుకుంటా !!
Am I sounding like master of the obvious :P

Comment on వచ్చే నాలుగు నెలల్లో…. by Srinivas
2008-08-26 06:31 AM Srinivas - Comments for నవతరంగం

naa vote hitchcock ki.

Comment on Hazaaron Khwaishein Aisi (2005) by Srividya
2008-08-26 06:28 AM Srividya - Comments for నవతరంగం

:) . You are increasing my “Must Watch” Films list.

Comment on Hazaaron Khwaishein Aisi (2005) by Srinivas
2008-08-26 06:27 AM Srinivas - Comments for నవతరంగం

mee vyaasam chadivaaka cinema choodaalani decide ayipoyaanu. sudhir mishra gurinchi nenu chaalaa vinnaanu. kaanee intavaraku atani cinema choose avakaasam raaledu. aayana teesina khoya khoya chand koodaa baagundani vinnaanu.

Comment on లక్ష హిట్ల నవతరంగం by Srividya
2008-08-26 06:19 AM Srividya - Comments for నవతరంగం

Conrats… Gr8 to hear it.
I like this site very much.

Comment on కులాంతర వివాహంపై ఒక బ్రాహ్మణ ధృక్కోణం ‘సప్తపది’ by కె.మహేష్ కుమార్
2008-08-26 03:42 AM కె.మహేష్ కుమార్ - Comments for నవతరంగం

@అరుణ: ఈ వ్యాసంకూడా అందరి ఆమోదం కోసం కాదు. కేవలం విభిన్నదృక్కోణాల్ని పంచుకోవడానికి మాత్రమే.కాబట్టి మీ వ్యాఖ్య/అభిప్రాయం తోపాటూ మీకు తెలిసిన నిజానికి అంతే ప్రాముఖ్యత ఉంది.

Comment on హార్ట్ బ్రేకింగ్ by Kolluru Jagannadha Rao( Ramesh)
2008-08-26 12:12 AM Kolluru Jagannadha Rao( Ramesh) - Comments for పొద్దు

Subject chalaa bagundi.Andaru chadavaalsina kadha.Prsent trend people tappkunda chadavali.

2008-08-25
Comment on ఛందోధర్మము by mOhana
2008-08-25 08:41 PM - Comments for ఈమాట

నన్నయ కాలములో ఋ-కారాన్ని రి-కారముగా పలికేవారు.
అందుకే ఆ కాలపు శాసనాలలో కూడ ఋణము అనృ దానికి
బదులు రిణము అని వాడారు. కాని తిక్కన కాలానికే ఋ-కారాన్ని
రు-కారముగా పలకడానికి ఆరంభించారు. తిక్కనగారు కొన్ని
చోటులలో ఋ-కారానికి రు-కారానికి యతి కూడ చెల్లించారు.
సామాన్యముగా ఛందస్సులో ఇది నిషిద్దము. ఋ-కారానికి
రి-కారానికి, ఇ, ఈ, ఎ, ఏ, హి, హీ, హె, హే, యి, యీ, యె,
యే, ఋ-కారము ఉన్న అన్ని హల్లులకు యతి చెల్లుతుంది.
కాబట్టి అమ్రుతము అని పలికేటప్పుడు, వ్యావహారిక భాషలో
అమృతమునకు బదులు అలా రాయడములో తప్పు లేదని
నా భావన. గ్రాంథికముగా మాత్రము అది సరి కాదు, అంతే.
తెలుగువారు మాత్రమే కాదు, కన్నడ, మరాఠీ, ఒరియా భాషలలో
ఋ-కారాన్ని రు-కారముగా పలుకుతారు. మిగిలిన ఉత్తర
భాషలలో రి-కారముగా పలుకుతారు.
విధేయుడు - మోహన

Comment on తెల్ల కాయితం by murthy
2008-08-25 08:00 PM - Comments for ఈమాట

నమస్కారం. నేను ఈ స్టోరీ చదివాక చాలా బాగా నచ్చింది. కోటి పాత్ర సూపర్. ఫాదర్, మదర్ పాత్రలు బాగా వున్నాయి. Totally story matter super!

Comment on ఛందోధర్మము by baabjeelu
2008-08-25 03:16 PM - Comments for ఈమాట

విప్లవ్ గారూ,
“రాసే తెలుగు” గురించి: ఇది “అమ్రుతం”, “క్రుష్ణుడు” అని నేను రాసిన వాటిగురించి అనుకుంటాను. వుప్పల లక్ష్మణరావుగారి ప్రభావం. ఈ మాట సంపాదక వర్గం వారే హెచ్చరించేరు. మా గురువుగారు కూడా “స్పెల్లింగ్” దిద్దించేరు.అమృతం అని రాయడం కష్టవని నేననుకోవటంలేదు. నిజానికి అంత పట్టింపూ లేదు. మిగిలిన కవుల/రచయత(త్రు)ల, వ్యాసుళ్ళ తల్లిదండ్రులు ఈ మాట సంపాదకవర్గాన్ని కలిసి ఇలాటి “స్పెల్లింగులు” రాసే వాళ్ళ అభిప్రాయాలు మీ పత్రికలో వేస్తే కుదరదు, కాదూ కూడదంటే మాపిల్లల “టీసీ” లిచ్చేయండి అని బెదిరించేరనుకోండి, అప్పుడు నేను మారిపోవచ్చు లేదా ఈ మాట లో నేను అభిప్రాయాలు రాయకపోవొచ్చు.
ఇహ “క్రెడిబిలిటీ” గురించి: “ఎటొచ్చీ రాసే వాళ్ళ అర్హత తోనే పేచీ” అని రాజా శంకర్ గారన్నదీ, దాని గురించి మిగిలినవాళ్ళందరూ రాసింది, రాసే వాళ్ళ రాయగలిగే సత్తువ గురించి. ఛందస్సు గురించీ, లక్షణ గ్రంధాలు చదవడం గురించీ, నన్నయాది కవుల కావ్యాలని ఔపోసన పట్టడం గురించీ వగైరాల గురించి. ఇదంతా “గుంచీ” దగ్గరో, “బొంకులదిబ్బ” దగ్గరో, “ఐకోనేరు గట్టు” మీదో (పెద్దాంజనేయస్వామి గుడి దగ్గర) సాయింత్రం కలుసుకుని కబుర్లాడుకునే వాళ్ళ వ్యవహారం. మిగతా పరిస్తితులన్నీ మారకుండా వుంటే అప్పుడు కవికి కావల్సిన “అర్హత” ల గురించి.

మీరు చెప్పిన జారుడుబండ సంగతి: జీవితంలో మిగిలిన వ్యవహారాల్లో కవి ఎలావుండాలన్నది. చాలా కష్టం. జీవితం “డైనమిక్” వ్యవహారం కదా? అందులోనూ “ఫోర్త్ డైమన్షన్” ని పట్టుకుని అప్పుడు “త్రీడైమన్షన్” లో కవిగారి సంగతి తేల్చడం “కమ్నిస్టులు” కూడా చెయ్యలేరేమో? ఎందుకంటే “ఫోర్త్ డైమన్షన్” ని పట్టుకుని ఆపగలగడం కుదరదు. అందుకే, తెలిసిన వారు కాబట్టి “జారుడు బండ” అని చక్కగా చెప్పేరు. (”కమ్నిస్టులు” అంటే మిగిలిన అందరికన్నా తెలివయిన వాళ్ళని చిన్నపట్నించీ “బ్రైన్ వాష్” అవడంవల్ల వాడేను.)
మీరు రాసిన “ఛైల్డ్ మోలెస్టర్స్” చిన్న పిల్లల కథలు రాయడానికి పనికిరారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళకోసం కథలు రాస్తే పర్వాలేదా?

Comment on నువ్వు బతికే ఉన్నావా by Hrk
2008-08-25 02:34 PM Hrk - Comments for ప్రాణహిత

చాలా కాలం కిందట నగ్నముని ‘ఉదయించని ఉదయాలు’లో ఇలాంటి పద్యమొకటి చదివినప్పుడు కలిగిన విచలత్వం మళ్లీ కలిగించింది ఈ పద్యం. రెండింటికీ ఏమీ సంబంధం లేదు. అయితే నగ్నముని పద్యం లోని వేదన కూడా దుర్భర పరాయీకరణం కల్పించినదే గాని, సందర్భం, యాటిట్యూడ్ వేరు.
మనుషులు ఒకరికొకరు కాకుండా పోవదంలోని ఆవేదనను చాల నిగ్రహం పాటిస్తూ, ఎక్కడా ఫీలింగ్ చెడిపోకుండా చెప్పగలిగారుపి. మోహన్. నేను, నువ్వు, తాను… అని కాదు, అందరం ‘ఒకరు’ చచ్చారో బతికారో పట్టించుకోనంతగా మన (మనందరి) బతుకులు తయారయ్యాయి.
ఒక అబ్జర్వేషన్ ని మితృలతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రాణహిత మే నెల సంచికలో ఘంటసాల నిర్మల, ఈ సంచికలో విమల, పి. మోహన్… ముగ్గురూ వేర్వేరు సందర్భాల్ని ఆసరా చేసుకుని ఒకే బాధను చెప్పారు. మూడింటిలో ఉన్నది తీవ్ర నిరాశే, క్రియాశీల నిరాశే. ఇట్టాగే ఉంటె ఇంకేమీ ఉండదు, ఇకనైనా మేల్కొందాం అనే (అన్యాపదేశమే అయినా) చాల బలమయిన హెచ్చరిక. .మనందరం కలిసి ఏదో హృద్యమైన పరిష్కారం దిశగా వేదన పదుతున్నామా? ఔననుకుంటాను…. హెచ్చార్కె

Comment on ఛందోధర్మము by Ravikiran Timmireddy
2008-08-25 02:34 PM - Comments for ఈమాట

“ఇదిగో, బతుకంటే ఇదీ బతుకు, ఇలా బతకడవే బతుకు.” ఫలాని విధంగా బ్రతకటవే గొప్ప, ఫలాని దార్లో ప్రయాణించడవే వొప్పు, బతుక్కి ఫలాని నిర్వచనవే కరక్టు. ఒక అనంతవైన అనుభవానికి దిశ నిర్దేశం చేసే ప్రయత్నం. ఎల్లలు లేనటువంటి ఒక అద్భుతానికి చట్రాలు బిగించే ప్రయత్నం. నియమితవైన సంఘంలో, పరిమితవైన అవకాశాలున్న సంఘంలో (బతుకవసరాలు తీర్చుకోడానికి) ఈ రకవైన దిశనిర్దేశం సహజవే. కానీ కొందరుంటారు వాళ్ళని నియమాల్తోనూ, అవకాశాల్తోనూ ఆపడం సాద్యంకాదు. అకాశాన్నీ, గాలిని, అనంతాన్ని నింపుకుని పుట్టిన వాళ్ళు, ఆన్ని చట్రాలని పగల కోడ్తారు, అన్ని నియమాల్ని చిందరవందర చేస్తారు. వాళ్ళకి బ్రతుకొక స్వప్నం, వాళ్ళు బ్రతుకుని, బ్రతకడాన్ని వేరువేరుగా చూడరు, వాళ్ళు కవితని, వచన కవితని విడదీసి చూడరు. నా ద్రుష్టిలో బ్రతుకుని అనుభవించి పలవరించడవే కవిత్వం. ఆ పలవరింతకి వొక నియమావళి అక్కరలేదు, ఒక రెఫరెన్సు అక్కరలేదు. దానికో ప్రణాలిక, పాఠ్య గ్రంధం అక్కరలేదు, దానికో సర్టిఫికేట్ అక్కరలేదు. ఆ అనుభూతి, ఆ పలవరింత ఎదుటి మనసుని తాకగలిగితే చ�