ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2014-10-02

Featuresindia.com RSS Feed: లాభాల బాటలో సెన్సెక్స్‌

2014-10-02 01:01 PM
సెన్సెక్స్‌ వరుసగా నాలుగో రోజూ లాభాల బాటలో నడిచింది. శుక్రవారం నాడు 39 పాయింట్లు పెరిగింది. పవర్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, రియాలిటీ రంగాలకు చెందిన స్టాక్‌లలో బాగా కొనుగోళ్ళు జరిగాయి. విదేశీ పెట్టుబడులు కూడా పెరిగాయి. ఇండెక్స్‌ 20,286.12 పాయింట్లకు చేరుకుంది. నిఫ్టీ 17.40 పాయింట్లు పెరిగి 6,187.30 వద్ద ముగిసింది....

Featuresindia.com RSS Feed: అమల్లోకి నూతన ఔషధ ధర

2014-10-02 01:01 PM
నూతన ఔషధ విధానం గురువారం నుంచి అమల్లోకి వచ్చిన నేప థ్యంలో దానిపై సాధారణ ప్రజానీకంలో ఆశలు పెరిగాయి. దీని వల్ల మందుల రేట్లు గరిష్ఠంగా 80 శాతం దాకా తగ్గే అవకాశం ఉంది. ఈ విధానం కింద ప్రభుత్వం పలు ఔషధాలను డీవ్డ్‌ు ఎసెన్షి యల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు వాటి ధరలపై నియంత్రణ ఉంటుంది...

ప్రధానపేజీ: బండ్ల గణేష్‌ అలా ట్రాక్ తప్పించాడా...? 'గోవిందుడు..'పై గోలగోల

2014-10-02 12:44 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గోవిందుడు అందరి వాడేలే'తో అక్టోబర్ 1న వచ్చిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంపై ముందు నుండీ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించిందనేది సినీ ...

ప్రధానపేజీ: రామ్‌ చరణ్‌పై ఏదేదో రాస్తున్నారట... కృష్ణవంశీ గరంగరం

2014-10-02 12:02 PM
ఇటీవలే విడుదలైన 'గోవిందుడు అందరివాడేలే' సినిమాపై రకరకాలుగా మీడియాలో రివ్యూలు వెలువడ్డాయి. ఈ చిత్రాన్ని గతంలో వచ్చిన పలు చిత్రాలతో పోలుస్తూ రాశారు. ఈ విషయమై కృష్ణవంశీ ఘాటుగా స్పందిస్తున్నారు. రాయాలని కొందరు ఏవేవో రాసినట్లుగా అనిపిస్తుంది. ఇలాంటి ...

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: తమిళనాడా, జయలలితా? -కార్టూన్

2014-10-02 10:16 AM Sekhar V

Tamilnadu & JJ

తమిళనాడు ప్రజల పురచ్చి తలైవి జైలు పాలు కావడంతో ఆమె నియమించిన మంత్రివర్గం రాజీనామా చేసింది. జయలలితకు నమ్మినబంటుగా పేరు పడి సరిగ్గా ఇలాంటి సందర్భంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని ఒకసారి అధిష్టించి జయలలిత విడుదల కాగానే తిరిగి ఆమె పీఠాన్ని ఆమెకు అప్పగించిన పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు కొత్త మంత్రివర్గమూ కొలువుతీరింది.

పేరుకు కొత్త మంత్రివర్గమే గానీ పాత మంత్రివర్గాన్నే పన్నీర్ సెల్వం కొనసాగించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రులు, ఎమ్మేల్యేలు వ్యవహరించిన తీరు ఓ విచిత్ర వాతావరణాన్ని అక్కడ సృష్టించింది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు దాదాపు ప్రతిఒక్క మంత్రీ కన్నీరు పెట్టుకుంతూ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి గారే భోరున ఏడుస్తూ కన్నీరు కాల్వలు కట్టించినపుడు ఇక ఇతర మంత్రులు ఏడ్వకపోతే తప్పవుతుంది. దాంతో బహుశా ఏడుపు రానివారు కూడా బలవంతంగా దుఃఖాన్ని కూడదీసుకుని, ప్రపంచం తల్లకిందులైపోయిందన్న భావాన్ని ఒలికిస్తూ ఆ నాలుగు ప్రమాణ పూర్వక మాటలు చెప్పి జైలు పాలయిన తమ నేతకు సహానుభూతి ప్రకటించారు.

మంత్రులందరూ వరసబెట్టి ఏడుస్తుంటే పాపం గవర్నర్ రోశయ్యగారికి ఏమీ పాలుపోలేదు. అప్పటికీ ఆయన మంత్రుల భుజం తడుతూ ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ ఓదార్చగానే కన్నీళ్లు ఆపేస్తే సీన్ రక్తి కట్టదు అనుకున్నారేమో, మంత్రులు తమ దుఖపూరిత ప్రమాణాన్ని కొనసాగించారు. ఏడుస్తూ ప్రమాణం పూర్తి చేసిన పన్నీర్ సెల్వం, పూర్తయ్యాక కూడా కళ్ళు తుడుచుకోవడం మానలేదు. దానితో ఇతర ఆహూతులు సైతం దిగాలు మొఖం పెట్టుకుని తలలు కిందికి వాల్చి తామూ దుఃఖంలో ఉన్నామని తెలిపారు.

ప్రమాణం అయ్యాక జైలుకెళ్లి జయలలితను పలకరించేందుకు అందరూ బెంగుళూరు ప్రయాణమై వెళ్లారు. కానీ జయలలిత వారిని కలవడానికి నిరాకరించారు. మంత్రివర్గం రాష్ట్రాన్ని పాలించాలి గాని ఇక్కడేం పని అన్నట్లుగా సందేశం ఇచ్చి పంపేశారు. ఆ విధంగా జయలలిత ప్రతిష్ట తమిళజన హృదయాల్లో ఒక మెట్టు పైకి ఎగబాకగా, ఆమె సహచర నేతల ప్రొఫైల్ ఒక మెట్టు దిగజారింది. వెరసి ఎ.ఐ.ఏ.ఎం.కె పార్టీలో అధినేత్రి ఏకఛత్రాధిపత్యం గ్యారంటీ చేయబడింది. ముఖ్యమంత్రి, మంత్రుల దుఃఖాన్ని కింద ఫొటోల్లో చూడవచ్చు.

కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గం బాధ్యత తమిళనాడును పాలించడం. ఆ పని మాని మంత్రులు జయలలిత జైలీకరణపై దుఃఖించడంలో మునిగిపోయారని కార్టూన్ వెక్కిరిస్తోంది.

01 Panneer Selvam -CM 02 Loyalty 03 Valamathi 04 Ministers 05 Ministers 06 Ministry 07 Panneer 08 At AIADMK office
Filed under: కార్టూన్లు, రాజకీయాలు Tagged: జయలలిత, తమిళనాడు, పన్నీర్ సెల్వం

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: మా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరదు -చైనా

2014-10-02 09:14 AM Sekhar V

Xi Jinping in India

భారత ప్రధాని నరేంద్ర మోడి అమెరికా పర్యటన ముగిసిన నేపధ్యంలో పర్యటన అనంతర పరిస్ధితిని చైనా ప్రభుత్వ అధికార పత్రిక పీపుల్స్ డెయిలీ సమీక్షించింది. అమెరికా తన నేతృత్వంలో తలపెట్టిన చైనా వ్యతిరేక కూటమిలో ఇండియా చేరే అవకాశం లేదని మోడి అమెరికా పర్యటన ద్వారా గ్రహించవచ్చని పత్రిక పేర్కొంది. తమ అవగాహనకు కారణాలను పత్రిక వివరించింది. భారత విదేశీ విధానం పునాదులు అలీన ఉద్యమంలో ఉన్నందున ప్రపంచ ధృవ పోటీల్లో ఇండియా ఒక పక్షం వహించబోదని ఆశాభావం వ్యక్తం చేసింది.

బారక్ ఒబామా అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం ‘పివోట్ టు ఆసియా’ వ్యూహాన్ని అమెరికా ప్రకటించింది. ఈ వ్యూహం కింద అమెరికా తన మిలట్రీ వ్యూహ కేంద్రాన్ని ఆసియాకు తరలించనున్నట్లు తెలిపింది. ఆర్ధికంగా భారీ అంగలతో దూసుకెళ్తున్న చైనాను నిలువరించడానికే అమెరికా ఈ వ్యూహాన్ని ప్రకటించింది. నిజానికి బారక్ ఒబామా అధికారంలోకి రాక మునుపే అమెరికా తన ప్రపంచాధిపత్య మిలట్రీ వ్యూహ కేంద్రాన్ని ఆసియాకు తరలించే ఏర్పాట్లలో మునిగింది. మధ్య ప్రాచ్యంను యుద్ధ జ్వాలలలో రగుల్చుతూ ఆ జ్వాలలను ఆసియాకు విస్తరించే వ్యూహాన్ని అమెరికా స్ధిరంగా అనుసరిస్తోంది.

9/11 దాడుల సాకుతో ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయడం, బిన్ లాడెన్ తో సంబంధం ఉందనీ, సామూహిక విధ్వంసక మారణాయుధాలు ఉన్నాయని సాకు చూపుతూ ఇరాక్ ను దురాక్రమించడం, లిబియాలో శత్రుశేషాన్ని నిర్మూలించి ఆ దేశాన్ని టెర్రరిస్టుల కార్ఖానాగా మార్చడం, సిరియాలో కిరాయి తిరుగుబాటును ప్రవేశపెట్టి తద్వారా ఇరాన్ ను కబళించడం, అంతర్జాతీయ వేదికలపై తన వ్యూహానికి అడ్డు వస్తున్న రష్యాను లొంగదీసుకునేందుకు ఉక్రెయిన్ లో ప్రజాస్వామికంగా ఎన్నికయిన ప్రభుత్వాన్ని కూలదోసి విధ్వంసక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలపడం, నాటో కూటమిని రష్యా సరిహద్దులకు విస్తరించడం… ఇవన్నీ అమెరికా ప్రకటించిన పివోట్-టు-ఆసియా వ్యూహంలో భాగమే.

తన వ్యూహంలో భాగంగా ఇండియాను తన మిత్రదేశంగా చేర్చుకోవాలని అమెరికా సంకల్పించింది. అందుకే దశాబ్దాలుగా ఇండియాపై అమలు చేస్తున్న అణు ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేస్తూ ‘పౌర అణు ఒప్పందం కుదుర్చుకుంది. ఆసియాలో చైనాను ఎదిరించి సమస్యలు సృష్టించే దేశంగా ఇండియాను నిలపాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే ఈ వ్యూహంలో ఇండియా భాగస్వామి కాబోదని చైనా పత్రిక పీపుల్స్ డెయిలీ, మోడి అమెరికా పర్యటన అనంతరం విశ్లేషించింది. ఈ విశ్లేషణ ఇండియా పాలకులను ఆకర్షించడానికా లేక నిజంగానే అది చైనా అవగాహనా అన్నది చర్చనీయం. తన అవగాహనకు పత్రిక ప్రధానంగా మూడు కారణాలు చెప్పింది.

మొదటిది ఇండియా అలీన నేపధ్యం. అలీన విదేశాంగ విధానంలో పునాదులు కలిగి ఉన్న ఇండియా చైనా స్నేహాన్ని కాలదన్నుకుని అమెరికాతో స్నేహంవైపు పూర్తిగా మొగ్గు చూపే పనికి పూనుకోదన్నది పీపుల్స్ డెయిలీ అభిప్రాయం. ఈ అంచనా నిజం అయితే అది ఇండియాకు అత్యంత ప్రయోజనకరం అనడంలో సందేహం లేదు. అమెరికాతో స్నేహం చేసి బాపుకున్న బలహీన దేశం ప్రపంచంలో లేనే లేదు. అమెరికా స్నేహంలో సమానత ఉండదు. అమెరికా చెప్పినట్టల్లా చేస్తేనే స్నేహం, లేదంటే శత్రుత్వమే. అమెరికా చెప్పింది వినడం అంటే దేశ ఆర్ధిక, రాజకీయ సార్వభౌమాధికారాన్ని అమెరికాకు పాదాక్రాంతం చేయడం. కనుక అమెరికాకు ఎంత దూరంగా ఉంటే ఏ దేశానికైనా అంత మంచింది. ముఖ్యంగా ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అది ఇంకా నిజం.

చైనా చెప్పిన రెండో కారణం: ఇటీవలే చైనా అధ్యక్షుడు ఇండియా పర్యటించినప్పుడు ఇరు దేశాలు ‘సన్నిహిత అభివృద్ధి భాగస్వామ్యం’ నెలకొల్పుకునేందుకు అంగీకరించడం. ఈ రీత్యా ఇరు దేశాల మధ్య పరిష్కారం కానీ సరిహద్దు భూభాగాల సమస్య ఇరు దేశాల సంబంధ బాంధవ్యాలకు ఆటంకం కాబోవని పీపుల్స్ డెయిలీ అంచనా వేసింది. లడఖ్ లో ఇటీవల తలెత్తిన ఉద్రిక్తతలను ఇరు సైన్యాలు తమ తమ పాత స్ధానాలకు వెనక్కి వెళ్లాలని అంగీకరించడం ద్వారా పరిష్కరించుకున్నాయని కనుక పీపుల్స్ డెయిలీ అంచనా ఈ అంశంలో నిజమే కావచ్చని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు వ్యాఖ్యానించడం విశేషం.

మూడో కారణం, చైనా దృష్టిలో అమెరికా తలపెట్టిన ‘ఆసియా పివోట్’ వ్యూహం, లేదా రీ బ్యాలన్సింగ్ సిద్ధాంతం ప్రధానంగా జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్ లలో ఆవిష్కృతం అవుతుంది తప్ప ఇండియాలో కాదు. జపాన్ లో 40,000 మంది అమెరికా సైనికులు తిష్టవేసి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఈ సంఖ్య 50,000 దాటడం పరిపాటి. దక్షిణ కొరియాలో 35,000 మంది అమెరికా సైనికులు ఉండేవారు 2008లో బుష్ అధ్యక్షరికంలోని అమెరికాతో కుదిరిన ఒప్పందం మేరకు ఈ సంఖ్యను 28,500 కు తగ్గించారు. ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా ఈ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ సం. జనవరిలో అదనంగా 800 సైనికులను, అత్యాధునిక ఆయుధాలను పంపేందుకు ఒబామా నిర్ణయించాడు.  ఆసియాలో రీ బ్యాలన్సింగ్ ప్రక్రియలో భాగంగా అదనపు సైనికులను పంపుతున్నామని అమెరికా ప్రకటించింది కూడా.  ఆస్ట్రేలియాలో కనీసం 2,500 మంది సైనికులను రొటేషన్ ప్రాతిపదికన నిలిపే ఒప్పందం ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి. వారికి ఆస్ట్రేలియా మిలట్రీ వసతుల్లో ప్రవేశం కల్పించేందుకు ఒప్పందం వీలు కల్పిస్తోంది. అలాగే పెర్త్ లోని నౌకా స్ధావరంలోనూ అమెరికా సైన్యానికి ప్రవేశం ఇవ్వబోతున్నారు. ఫిలిప్పైన్స్ లో పదేళ్లపాటు అమెరికా సైన్యాన్ని తాత్కాలిక ప్రాతిపదికన (అవసరం వచ్చినపుడు) నిలిపే ఒప్పందాన్ని గత ఏప్రిల్ లో ఇరు దేశాలు కుదుర్చుకున్నాయి.

ఆసియా-పివోట్ వ్యూహానికి ఆర్ధిక అనుబంధంగా అమెరికా అంతర్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందానికి రూపకల్పన చేసింది. ట్రాన్స్ పసిఫిక్ పార్టనర్ షిప్ (టి.పి.పి) గా పిలిచే ఈ ఒప్పందం ప్రాధమిక లక్ష్యం చైనాను ఆర్ధికంగా కూడా నిల్వరించడం. టి.పి.పిలో జపాన్, ఆస్ట్రేలియా, న్యూ జీలాండ్, అమెరికా, కెనడా, పెరు, సింగపూర్, వియత్నాం దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే వియత్నాం, ఫిలిప్పైన్స్ లాంటి ఆగ్నేయాసియా దేశాలు చైనాకు కోపం తెప్పించే పనిని ధైర్యంగా చేసే పరిస్ధితిలో లేవన్నది ఒక వాస్తవం. చైనాతో ఉన్న వ్యాపార సంబంధాలను అవి వదులుకోలేకపోవడం దీనికి కారణం. ఇండియా టి.పి.పి చట్రంలో ఇమిడేందుకు అవకాశమే లేదన్నది చైనా అభిప్రాయం. ఇండియా ప్రధానంగా దేశంలో ఎఫ్.డి.ఐ లను పెంచుకునేందుకే కేంద్రీకరించిందని, ఆర్ధిక వ్యవస్ధను పునరుద్ధరించుకునే ప్రయత్నంలో ఉన్నందున ప్రపంచ స్ధాయి విదేశీ వ్యూహాలపట్ల ఆసక్తి లేదని చైనా భావిస్తోంది.

చైనా అంచనాలు నిజం అయితే అది భారత ప్రజలకు సాపేక్షికంగా ప్రయోజనకరం కాగలదు. ఎందుకంటే వాణిజ్య ఒప్పందాలు, ఎఫ్.డి.ఐ ల విషయంలో అమెరికా విధించే అవమానకర విషమ షరతులను చైనా ఇంతవరకు ఏ దేశం పైనా విధించలేదు.


Filed under: యుద్ధము-శాంతి Tagged: అలీన ఉద్యమం, ఆసియా పివోట్, గ్జి జిన్ పింగ్, చైనా ఇండియా సంబంధాలు

2014-10-01

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: తెరేష్ బాబు విభజన గీత -సంస్మరణ

2014-10-01 02:07 PM Sekhar V

Teresh Babu

కవి, తెలంగాణ రాష్ట్ర వాసి పైడి తెరేష్ బాబు గారు చనిపోయారని మిత్రుల ద్వారా తెలిసింది. ఆయనతో నాకు వ్యక్తిగత పరిచయం లేదు. కానీ ఉద్యమ భావజాల సంబంధం వ్యక్తిగత పరిచయాలకు అతీతమైనది. ఆ కారణం వలన ఆయనకు నాకు మధ్య భావాత్మక వారధిగా నిలిచిన ‘విభజన గీత’ను, సంస్మరణ కోసం పునర్ముద్రిస్తున్నాను.

పీడిత జనం ప్రపంచంలో ఏమూల ఉన్నా వారికి కూడా తెలియని ఒక సార్వజనీన ఏకత్వం వారి మధ్య ఏర్పడిపోయి ఉంటుంది. అది ఒక్కోసారి అనుభవంలోకి వస్తుంది. అనుభవంలోకి రాకపోనూ వచ్చు. అనుభవంలోకి వచ్చినప్పుడు ఈ ఏకత్వం ఒక శక్తిగా మారుతుంది. వ్యక్తికి బహువచనం శక్తి అని ఎరుకపరుస్తుంది.

తెలంగాణ ఉద్యమం మరుగున పడిన ఎన్నో వజ్రాలను వెలికి తీసి సానపట్టింది. కానీ తెలంగాణ సమాజంలో అభ్యుదయ శక్తులు బలహీనంగా ఉండడంతో ఆ వజ్రాలు అంతిమ ప్రయోజనాన్ని అందుకోలేకపోయాయి.  ఆటలు ఆడి, పాటలు పాడి, కవిత్వం రచించి… అనేకమంది తెలంగాణ ఉద్యమానికి చేదోడువాదోడుగా నిలిచారు. ఇంటర్నెట్ లో ఉద్యమానికి ప్రచారం కల్పించినవారిలో బహుశా తెరేష్ బాబు ఒకరై ఉండాలి. అందువలన ఆయన ఇష్టపడి రాసిన విభజన గీతను పునర్ముద్రించడం ఆయనకు తగిన సంస్మరణ కాగలదని భావిస్తున్నాను.

భగవద్గీత శ్లోకాలను అనుకరిస్తూ తెరేష్ బాబు తనదైన గీతను రచించారు. సమైక్యాంధ్ర పేరుతో కొన్ని ధనికవర్గాలు ప్రేరేపించిన బూటకపు సెంటిమెంట్లను తెరేష్ బాబు తన అనుకరణ శ్లోకాలతో తెగనాడారు. ఉద్యమ కార్యకర్తలకు ఉత్సాహం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా హాస్య చతురతతో చేయడం వలన ఈ రచనకు ఒక ప్రత్యేకత వచ్చి చేరింది. గీతను గానం చేసిన ఘంటసాల గొంతులోని గంభీరతను శ్లోక వివరణలోనే పట్టివ్వడం తెరేష్ బాబు ‘గీత’ లోని అనితర సాధ్యమైన ప్రత్యేకత. తెలిసిన నాలుగు మాటలను కలగాపులగం చేస్తూ శ్లోకం రాసిన అనుభూతిని పాఠకులకు ఇవ్వడం మరో ప్రత్యేకత. భాషాపరంగా ఈ శ్లోకాలకు అర్ధం ఉండదు గానీ అర్ధం ఉన్నట్లుగా ధ్వనింపజేస్తాయి.

‘అపార్ధా’ అంటూ సంబోధించడం ఒక చాతుర్యం. శ్రీకృష్ణుడు తన గీతను బోధించింది పార్ధుడికి. అందుకని పార్ధా అని సంబోధిస్తాడు కృష్ణుడు. అపార్ధా అనడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అపార్ధం చేసుకోవద్దన్న అర్ధం స్ఫురిస్తుంది. అలాగే ఆల్రెడీ అపార్ధం చేసుకున్నవారిని ఎత్తిపొడవడమూ కనిపిస్తుంది. తాను చెప్పేది గీత అన్న సందేశమూ ఇస్తుంది. విభజన గీతలో ప్రధాన అంశం ‘అధిక్షేపణ’. అది గుర్తిస్తే మరొకందుకు ఉడుక్కునే బాధ తప్పుతుంది.

తెరేష్ బాబు నిజానికి జన్మతః తెలంగాణ వాసి కాదు. ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లాలో జన్మించిన తెరేష్ కవిగా, గాయకుడిగా ఆలిండియా రేడియోలో తెలంగాణలో ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్లారు. అనంతరం హైద్రాబాద్ కు బదిలీ అయ్యి అక్కడే నివాసం ఏర్పరుచుకున్నారు. పీడిత జనుల హృదయం తెలిసినవాడు కనుక ప్రాంతానికి అతీతంగా తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.

***   ***   ***

విభజన గీత

పేరెంట్సో జన్మహ పేమెంట్సో విద్యతి! వన్ బై వనేస్య వరసస్య సంభవామి దగే దగే!
ఇంతోహి బతుకు ఇంటెనక మరణస్య! చర్చా ప్రహసనన కరిష్యాం జిల్ జిల్ జిగే!!!!
అపార్థా!
పేరెంట్స్ వలన జన్మము, పేమెంట్స్ వలన చదువు, చదువు వలన ఉద్యోగము, ఉద్యోగము వలన లంచము, లంచము వలన నేరము, నేరము వలన అరెస్టు, అరెస్టువలన బెయిలు,బెయిలు వలన పునర్జన్మము సంభవమగుచున్నవి.
అంతియె కాని ఉద్యోగ సంఘముల సమ్మె వలన సమైక్యాంధ్ర సిద్ధించునని ఎచటయునూ లిఖించబడలేదు. ఇంత బతుకు బతికి గృహము వెనుక మరణించినయట్లు… అను సామెతను అనుసరించి ఇంత సమ్మె జేసి సింపుల్ గా సైలెంటై పోవుట పరువుతక్కువ పనిగా భావించబడుచున్నది.
కనుకనే ముఖ్యమంత్రితో చర్చలు అను ప్రహసనము రచింపబడుచున్నది. చర్చలు జరుగుట , అవి సఫలమైనవని మీడియా ఎదుట పళ్ళికిలించుట, ఒకవేళ ప్రభుత్వం గనక మాట తప్పితే సమ్మెను ఉధృతం చేస్తామని తాళపత్ర ధ్వనులు [తాటాకు చప్పుళ్ళు] సృష్టించుట సహజాతి సహజం.
అనివార్యంబగు ఇట్టి లత్తుకోరు చేష్టలను గాంచి నీవు చింతింపతగదు. పండగ చేసికొనుము.
టిటిటిటిటీం టుట్టూం టుయ్యూం [ఇది విచిత్ర వీణానాదము]

***                ***                ***

“బల్బో బస్సాహి సమ్మ్యామ్యహం
దీక్షో భగ్నాయ వినిర్గతీ!!!”

అపార్థా…!

ఆరే ప్రతి బల్బు వెలగక తప్పదు
ఆగే ప్రతి బస్సు కదలక తప్పదు
జరిపే ప్రతి సమ్మె ఆపక తప్పదు
చేసే ప్రతి దీక్ష భగ్నం కాక తప్పదు
ఇవన్నియు ఢిల్లీ వలననే సంభవించుచున్నవి

టీ టిటిటి ట్యూం టుయ్ [ఇది వీణా నాదము]

***                ***                ***

కోతోహి చింపాంజీ నక్కస్య గోతో! మంత్రామ్యహి ముఖ్యోతి!
జీవస్య ఎంజీవం ద్రోహోర్మహి!బిల్లేచ పాసేణ ఢిల్లీ చిల్లీశ్యతి!!
 
అపార్థా…!
కోతుల యందు చింపాంజీ, నక్కల యందు గోతికాడ నక్క, నాయకుల యందు ఎన్జీవో నాయకుడు, మంత్రులలో ముఖ్యమంత్రి, ద్రోహుల యందు తెలంగాణ వ్యతిరేకి ఉత్తములుగా కీర్తింపబడుదురు. అట్టివారిని జూచి నీవు చింతింపవలదు. బిల్లు వచ్చుట ఖాయము. పాసగుట తధ్యము. లేని ఎడల ఢిల్లీ ఛిల్లీ యగుట నిక్కము.
 
పిపిపిపిపీ ఫ్యూం [ఇది వేణు నాదము]

***                ***                ***

చంచలో గూడస్య చర్లపల్లిహి! గుణపాఠో నేర్పిష్యతి!
ఏకాంగ్రేసోపి ఎదిరిష్యతి ! చార్గిషీటో శరణం దుర్గతి!!

అపార్థా…!
 
కాంగ్రెస్ పార్టీని ఎదిరించిన వారికి ఎట్టి దుర్గతి సంభవించునో చంచల్ గూడ చర్లపల్లాది జైళ్ళు వివరించుచున్నవి. అధిష్ఠానమును ధిక్కరించి రాజీనామాలు చేసినవారికి చార్జిషీట్లు తప్పవని సీబియయ్యాది సంస్థలు నిరూపించుచున్నవి.
 
నాకుట, పీకుట, శవాలపై చిల్లర ఏరుకొనుట తప్ప ఇతరములెరుగని కీలుబొమ్మలు రాజీనామాలు చేయుట, స్పీకర్ని కలియుట వంటివి ఒఠ్ఠి బోగస్ విషయములుగా నీవు గుర్తింప వలయును. మీడియా ముందు వారు వేయు కుప్పిగంతులను నీ వినోదార్థము ప్రదర్శించు నాటకములు గా భావించి సంతసింపుము.
 
భొయ్ భొయ్ భొయ్ భోయ్ య్ య్ య్ [ఇది తీర్థపు తడి ఎరుగని సమైక్య శంఖారావం]

***                ***                ***

జేబోహి నతి ఔరంగ జేబస్య!బాబోహి కబాబహం!
సమ్యోహయతి సకలజనహ! మిమిక్రీణాం కరామ్యహం!!

అపార్థా…!
 
జేబులున్న  ప్రతివారూ ఔరంగ జేబు కాజాలరు. బాబులగు ప్రతివారూ కబాబు కాలేరు [పొరపాట్న అశోకబాబు అనుకునేరు] సమ్మెలెన్ని జేసిననూ సకలజనుల సమ్మెకు సాటిరావు. పులిని చూసి వాతలు పెట్టుకున్న నక్కలు చిట్టచివరకు వాడవలసినది జాలిం లోషన్, జిందా తిలిస్మాత్ మరియూ జులాబ్ గోలీలు. ఇది తెర వెనుక దాగిన ఉ’పని’శక్తుల సారాంశము.
 
ఎంపీపీ డుం డుం డుం ఎంపీ పీ పీ డుం [ఇవి అమంగళ వాద్య విశేషములు]

***                ***                ***

తొక్కో తోటకూరస్య పార్లో పిప్పరమెంటస్యచ!
చిప్పోహి చిప్పహ బస్సోపి కొలంబసహ గరీయసి!!
 
అపార్థా…!
 
బసులు సిలబసులు చిప్పులు షిప్పులు మాళ్ళు, రుమాళ్ళు పెరుమాళ్ళు బిట్లు హాబిట్లు ద్రవములు ఉపద్రవములు బాబులు రుబాబులు వాడలు బెజవాడలు పిప్పరమెంట్లు పార్లమెంట్లు ఘనములు జఘనములు సర్వము సకలము నాచే సృజించబడినవి. పదముల యందు పేర్లయందు సామ్యమున్నంత మాత్రమున కంప్యూటర్ చిప్ కరకరమని నములు ఆలూ చిప్ కానేరదు. బస్ సిలబస్ గానూ, సిలబస్ కొలంబస్ గానూ మారజాలవు.
 
నీవెంత గోకి గొడవ చేసి పాకి కిందబడి దొర్లాడిననూ ఏదియును మరియొకదానితో ఏకార్ధమును సాధింపజాలదు. కావున ఏకాభిప్రాయ సాధన తొక్కా తొటకూర వంటి పదబంధములను భవబంధములను విడనాడి విభజన దిశగా పయనించి విముక్తుడవు కమ్ము. ఇక కుమ్ము.
 
పపంప పంప పాం టటంట టంట టాం [ఇది శాక్సోఫోన్ నాదము]

***                ***                ***

భార్యేతి భర్తంచ మధ్యస్య మసీర్హోర్మసి వంటింటిమసి!
ఇరుప్రాంతో సహోదరస్య నిర్భయ నివాస తత్వమసి!!
 
అపార్థా…!
 
భార్యా భర్తల మధ్య ఉండవలసింది ఇంటిమసీ యే గాని వంటింటి మసి కాదు. అట్టి విధముననే ఇరుప్రాంతముల వారిమధ్య ఉండదగినది సోదరభావమే గాని ఉదరభావము [పొట్టగొట్టుట యను వినాశకర భావము] కాదు.
 
ఈ తత్వమును గుర్తెరిగి, ఇప్పుడున్న పరిస్థితులయందు ఒకరికొకరు సహకరించుకొనుట యనునది అత్యంత ఆవశ్యకమగుచున్నది. ఇది గనుక సంభవమైనచో ఏ ప్రాంత వాసులైననూ ఎక్కడైననూ నిర్భయముగా నిశ్చయముగా ఆచంద్రతారార్కము నివసించ వీలగును. ఇది కష్టాదశ పురాణముల సారాంశము.

లలలూ లలలూ! లలల లలల లలలూ!! [అవునూ!!! ఇది ఏమి నాదము?]

***                ***                ***

అల్పపీడనోపి సముద్రస్య కుయ్యోమొర్రో శోకిష్యతి
ఢిల్లీణాం రిమోటహ తిప్పస్య నల్లాం కిం పీకిష్యతి
 
అపార్థా…!
 
చిన్న అల్పపీడనమునకే ఎంతటి సముద్రమైననూ కుయ్యో మొర్రో అని దిక్కులు పిక్కటిల్లునటుల మొత్తుకొనును. అట్టి సత్యము గుర్తెరుంగక, ఢిల్లీ రిమోటు తిప్పితే గాని గిద్దెడు నీరుగారని ఒక నల్లా [కుళాయి] ఏకముగా తుఫానునే ఆపుదునని పల్కుట హాస్యాస్పద వ్యాఖ్యగాను కొండొకచో ప్రగల్భము గాను భావించబడుచున్నది.
 
ప్రజలను బ్రోచు ప్రభువులే ఇవ్విధమున మాటలాడుట వినాశకాలమును సూచించుచున్నది.
 
మ్యావ్ మ్యావ్ మెమ్మెమ్మె మేడం మై ఢిల్లీ ఆవూం?[ఇది గోడ మీది పిల్లి నాదము]

***                ***                ***

నడిచే రైలోహ్యం స్టాపో శక్తి చైనతి మోటారోం సిగ్నలహ
ప్రాణేతి వెంటిలేటరహ సమైక్యవాదోణాం సెక్యూరిటీ హి

అపార్థా …!
 
రైలును ఆపగల శక్తి చైనుకు, మోటారు వాహనములను ఆపగల శక్తి ట్రాఫిక్ సిగ్నళ్ళకు, పోయే ప్రాణములను ఆపగల శక్తి వెంటిలేటర్లకు ఉన్నట్లే సమైక్యవాదులను అడ్డుకోగల శక్తి ఢిల్లీ పెద్దల సెక్యూరిటీ సిబ్బందికి కలదు.
 
వారినే ఒప్పించుట చేతకానివారు పెద్దలను ఒప్పించి విభజనను అడ్డుకుంటామని పల్కుట మిక్కిలి హాస్యాస్పదము.
 
వృం వృం వృం వౄం ం ం [ఇది రివర్సు గేరు నాదము]

***                ***                ***

మేఘస్య ఢీం మెరుపంచ జోగీణాం ద్వయం భస్మహ
భజనోపి విభజనేతివ్యతిరేకం మూతస్య దంతహ నష్టహ
 
అపార్థా…!
 
మేఘములు రెండు ఢీ కొన్న మెరుపు రాలును. జోగీ జోగీ రాసుకున్న బూడిద రాలును. భజనా తత్పరత విభజన వ్యతిరేకత ఒకేనోట జాల్వారిన కారణమున మూతిపండ్లు రాలుచున్నవని విశ్వసనీయ వర్గములు ఘోషించుచున్నవి.
 
పిప్పీ పీ! పప్పీ పా !పెప్పెప్పె బెబ్బెబ్బె ![ఇది సన్నాయి నొక్కుల నాదము]

***                ***                ***

మ్యాచ్చోహి ఫిక్సింగహ కిం కరిష్యోపి జగద్విదితహతహ
తీర్మాణాం అవిశ్వాసపి రక్షతి ప్రతిపక్షాం అనుభవిష్యతి

అపార్థా!

గతమున మేసిన దొంగగడ్డి కారణమున, చిప్పకూడు ఎచట తినవలసి రావచ్చునో యను భయము వలన, కేంద్ర, రాష్ట్ర పాలకపక్షముతో లోపాయికారీ మాచ్ ఫిక్సింగులకు పాల్పడి, శాసనసభయందు అవిశ్వాస తీర్మానము వీగిపోవునటులజేసి, ప్రజాకంటక ప్రభుత్వమును కాపాడిన ప్రధాన ప్రతిపక్షము వారే… మాచ్ ఫిక్సింగుల గురించి నేడు విమర్శించుచున్నారు. ఇది చిత్రములలోకెల్ల భళారే విచిత్రము. రథము దిగి కాస్సేపు పగలబడి నవ్వుకొందము. రమ్ము.

అయ్యో కుయ్యో మొర్రో [ఇది అస్తిత్వవేదనా నాదము]

***               ***               ***

ఏకాం హి ద్వయో ఏకహ! ఏకాద్వయో త్రయంబకరాం!
త్రయోదశాంచ ద్వాదశహ! రిమోటాస్త్రాం ప్రయోగామ్యహం !

అపార్థా!

రెండు ఒకట్లు ఒకటి యని, ఒక రెండ్లు మూడు యని, మూడు ఒకట్లు పదమూడున్నర యని, పదమూడు ఒకట్లు పన్నెండుంబాతిక యని దేనికి తోచిన కథనము అది ప్రచురణము, ప్రసారము చేయుచున్నది. ఏ పత్రిక, ఏ చానల్ కథనము ఎట్లేడ్చిననూ బకరా వలె నమ్మక, రెండు ఒకట్లు రెండే యను గణిత సూత్రముననుసరించి రెండు రాష్ట్రముల ఏర్పాటు తప్పదను సత్యమును నీవు విశ్వసింపుము.

కొన్ని పత్రికలకు, చానళ్ళకు రెండో ఎక్కము కూడా సరిగా రాదను వాస్తవమును మరింత బలముగా విశ్వసించి వాటిపై రిమోటాస్త్రము ప్రయోగించు సమయమాసన్నమైనదని గుర్తించుము.

టంగ్ టంగ్ టంగ్ టట్టంగ్ టంగ్ [ఇది ప్రాధమిక పాఠశాల ఘంఠారావము మరియూ పరమశుంఠా నాదము]

***               ***               ***

రణాన్నినాదోపి కరామి శంఖనాదస్య హేతుబద్ధహ పరిగణనాం
కారణోపి మూలాంచ విస్మరస్య మూలశంకో నాద వినిపిష్యాం

అపార్థా!

రణమునకు కారణములు, కారణములకు మూల కారణములు ఆధారములగుచున్నవి. ఇరుపక్షములు కలిగిన రణమునందు మ్రోగు శంఖము సమరశంఖారావమగును. మూలకారణములు విస్మరించి ఏక పక్షముగ మ్రోగు శంఖము మూలశంకా రావమగును [మొలలు మున్నగు వ్యాధి విశేషములతో కూడిన మిక్కిలి బాధాకరంబగు ఆర్తనాదము]

కోట్లఖర్చుతో కూడుకొనిన వోట్ల వ్యూహములకు మరికొన్ని నెలల వ్యవధి కలదు. కావున జనసమీకరణములు చేయుట మాని విభజన సమీకరణముల గురించి యోచింపుము. పదమూడు జిల్లాల ప్రత్యేక రాష్ట్రము కొరకు పోరాడుము.

హమ్మా నాయనా దేవుడా తండ్రీ [ఇది మూలశంకా నాదము]

***               ***               ***

సమైక్యో జీవిత యపి మొత్తుకస్య విభాజిత పాలనం రహతి
విభజనోపి విముక్తస్య కహే ఏకతాం రహే పాలకానాం దుర్మతి

అపార్థా!

సమైక్యముగా ఉండెదమని మొత్తుకున్నపడు విభజించి పాలింతురు. విభజించి పాలించమని అడిగినపుడు సమైక్యముగా ఉండుడందురు.

కావున, పాలకులెప్పుడైనను దుర్మతులే ననియూ సర్వకాల సర్వావస్థలయందు వారు ప్రజా వ్యతిరేక విధానములనే పాటింతురను సత్యమును నీవు గ్రహించుము. ప్రజానుకూల నిర్ణయము ప్రకటించి అద్దానిని అమలు చేయు విషయమై కాలయాపన చేయుట వెనుక గల స్వార్ధ రాజకీయములను పసిగట్టుము.

టటటటాం టుయ్యుం టుక్కూం [ఇది వి+పరిణీత వీణా నాదము]


Filed under: సమాజం సంస్కృతి Tagged: తెరేష్ బాబు, విభజన గీత

2014-09-30

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: హాంగ్ కాగ్ ట్రబుల్డ్ వాటర్స్ లో పశ్చిమ చేపలవేట -ఫోటోలు

2014-09-30 05:42 PM Sekhar V

ఏదో ముతక సామెత చెప్పినట్లు హాంగ్ కాంగ్ లో కొనసాగుతున్న ‘ఆక్యుపై సెంట్రల్’ ఉద్యమం చూసి పశ్చిమ దేశాలు, పత్రికలు ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నాయి. చైనాలో ప్రజాస్వామ్యం(!) కోసం జనం ఏ కాస్త ఆందోళన చేసినా పశ్చిమ పత్రికల్లో రంగురంగుల ఊహాలు, అల్లికలు ప్రత్యక్షం అవుతాయి. అదే అమెరికాలో నల్లవారిపై పోలీసుల దాష్టీకంపై ఆందోళనలు జరిగినా, ఐరోపాలో పొదుపు విధానాలకు వ్యతిరేకంగా నెలలతరబడి ఆందోళనలు జరుగుతున్నా, ప్రభుత్వాల తీవ్ర అణచివేతలపై దృష్టి పెట్టడం అటుంచి ప్రజల ఆందోళనలే ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రచారం చేసి పెడతాయి.

హాంగ్ కాంగ్ లో కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున జనం వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనల్లో యువతరం అధికంగా పాల్గొంటోంది. హాంగ్ కాంగ్ ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ ముందు ఉన్న విశాలమైన మైదానంలో బైఠాయించి పలువురు ఆందోళనకారులు ‘ఆక్యుపై సెంట్రల్’ ఉద్యమం నిర్వహిస్తున్నారు. 1997లో హాంగ్ కాంగ్, చైనాలో విలీనం అవుతున్న సందర్భంగా చైనా ఇచ్చిన హామీల నుండి వెనక్కి మళ్లిందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. హామీ ఇచ్చినట్లుగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

చైనా ఇప్పటికీ తమ దేశంలో సోషలిస్టు వ్యవస్ధ ఉందని తన ప్రజలకు చెబుతుంది. (భారత దేశంలో కొన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా అదే చెబుతాయి.) మావో జెడాంగ్ పట్ల ప్రజల్లో ఇప్పటికీ ఉన్న ఆదరణ, గౌరవం వల్ల సోషలిజాన్ని తాము ఎప్పుడో త్యజించిన సంగతి వివిధ పదాడంబరాల మాటున దాచి పెడుతుంది. కానీ విదేశాల్లో అమెరికా, ఐరోపా రాజ్యాలతో వాణిజ్య కార్యకలాపాల సందర్భంగా తమది మార్కెట్ ఎకానమీ అని చైనా అధికారులు చెబుతారు. వాళ్ళు విదేశాల్లో చెప్పేదే నిజం.

1997లో ఇప్పటి స్ధాయిలో చైనా ఇంకా మార్కెటీకరణ చెందలేదు. అప్పటికి చైనా ఆర్ధిక శక్తి కూడా కాదు. కానీ మార్కెట్ ఆర్ధిక సంస్కరణలను శరవేగంగా అమలు చేస్తోంది. 1997 వరకు హాంగ్ కాంగ్ బ్రిటన్ ఆధీనంలో ఉండేది. లీజు ఒప్పందం ముగియడంతో హాంగ్ కాంగ్ ను బ్రిటన్, చైనాకు వెనక్కి ఇచ్చేసింది. ఆ సందర్భంలో ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. బ్రిటన్ ఎలాగూ మార్కెట్ ఎకానమీయే. చైనాలో కూడా మార్కెట్ ఎకానమీ ప్రవేశం పూర్తయింది. కానీ జనానికి మాత్రం సోషలిజమే అమలు చేస్తున్నామని చెబుతున్నారు. ఈ పరిస్ధితుల్లో హాంగ్ కాంగ్ లో మార్కెట్ ఎకానమీని సోషలిజంగా చెప్పడం చైనా పాలకులకు సాధ్యం కాదు. చైనాలో విలీనం అయ్యాక హాంగ్ కాంగ్ లోని మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధను ఏం చేయాలి అన్న ప్రశ్న దేశం ముందుకు వచ్చింది.

ఈ సమస్య పరిష్కారం కోసం చైనా పాలకులు ఒక కొత్త నడమంత్రపు సిద్ధాంతానికి తెర తీశారు. చైనా పెట్టుబడిదారీ సంస్కరణలకు ఆద్యుడయిన డెంగ్ జియావో పింగ్ హయాంలోనే ఈ పనికిమాలిన సిద్ధాంతం వల్లించారు. ‘ఒక దేశంలో రెండు వ్యవస్ధలు’ (One country, two systems) అన్నదే ఆ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం హాంగ్ కాంగ్ చైనాలో వీలీనం అయ్యాక చైనాలో సోషలిస్టు వ్యవస్ధ, హాంగ్ కాంగ్ లో మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ (పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధ) కొనసాగుతాయని చైనా పాలకులు ప్రజలకు నచ్చజెప్పారు. ఇది అటు చైనాలో సోషలిస్టు సెంటిమెంట్లను, ఇటు హాంగ్ కాంగ్ లో బ్రిటన్ నుండి వారసత్వంగా సంక్రమించిన పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య సెంటిమెంట్లను జోకొట్టడానికి ఉద్దేశించిన సిద్ధాంతం. నిజానికి ఇది సిద్ధాంతం కాదు. సిద్ధాంతం పేరుతో ఇరు వైపులా ఉన్న ప్రజలను మోసం చేసేందుకు ఉద్దేశించిన ఎత్తుగడ.

విలీనం నాటి ఒప్పందమే ‘బేసిక్ లా’ గా హాంగ్ కాంగ్ లో అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ఒక దేశంలో రెండు వ్యవస్ధలు 50 సం.ల పాటు కొనసాగుతాయి. ఈ లోపు, ఆ తర్వాత హాంగ్ కాంగ్ ప్రజల స్వేచ్ఛా హక్కులు భద్రంగా కాపాడబడతాయి.

ఈ బేసిక్ లా ఉల్లంఘించి తనకు ఇష్టం వచ్చిన పాలకులను హాంగ్ కాంగ్ పై రుద్దేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్నాయి. హామీ ఇచ్చినట్లు Universal Sufferage అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2017లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను మొదట చైనా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుందని ఇటీవల చైనా ప్రకటించడంతో ఆందోళనలు మొదలయ్యాయి.

చైనా ప్రకటన వాస్తవానికి బేసిక్ లా ఉల్లంఘన కాదు. ప్రజలందరికీ సమాన ఓటు హక్కు కల్పించడాన్ని Universal Suffrage (సార్వత్రిక ఓటు హక్కు) అంటారు. బేసిక్ లా ప్రకారం పోటీదారులను చైనా మొదట నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత మాత్రమే సార్వత్రిక ఓటు హక్కు అమలవుతుంది. ఎకాఎకిన సార్వత్రిక ఓటుహక్కు అమలు చేస్తామని బేసిక్ లా లో లేదు. కనుక బేసిక్ లా ను ఉల్లంఘించే సమస్యే లేదు.

హాంగ్ కాంగ్ ప్రజల్లో ఒక అసంతృప్తి గూడు కట్టుకుని ఉండడమే ప్రస్తుత ఆందోళనలకు మూల కారణం. ఆ మాటకొస్తే చైనా మెయిన్ ల్యాండ్ ప్రజల్లోనూ అసంతృప్తి పోగు పడి ఉంది. అమెరికా, ఐరోపా, ఇండియా… ఇలా దాదాపు ప్రతి దేశంలోనూ అసంతృప్తి రగులుతూ ఉంది. దానికి కారణం ఏ దేశంలోనూ ప్రజా ప్రభుత్వాలు లేకపోవడమే. ఉన్న ప్రభుత్వాలన్నీ ధనిక వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసేవే తప్ప ప్రజల కోసం నికరంగా పని చేసే ప్రభుత్వాలు దాదాపు ఏ దేశంలోనూ లేదు. అసమానతలు ఉన్న వ్యవస్ధల లక్షణమే అంత.

ఇలా గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తి వెల్లడి చేసేందుకు తాజా చైనా ప్రకటన ఒక అవకాశం కల్పించింది. రబ్బరు బుడగ నిండా గాలి బిర్రుగా ఊదితే లోపలి గాలి, ఒత్తిడి వల్ల ఏదో విధంగా బైటపడేందుకు ప్రయత్నిస్తుంది. అది భౌతిక లక్షణం. ఆ ప్రయత్నంలో బుడగ ఉపరితలంలో రబ్బరు పొర ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ చీల్చుకుని గాలి బైటపడుతుంది. ఒకేసారి బైటపడడం వల్ల టప్ అని శబ్దం వస్తుంది.

హాంగ్ కాంగ్ లోనూ ఇదే జరుగుతోంది. హాంగ్ కాంగ్ ప్రజల్లోని అసంతృప్తి ఒక అవకాశం చూసుకుని బహిర్గతం అవుతోంది. ముఖ్యంగా హాంగ్ కాంగ్ యువతలో ఈ అసంతృప్తి మెండుగా ఉంది. స్ధానిక యువతరానికీ, విలీనం అనంతరం మెయిన్ ల్యాండ్ నుండి వలస వచ్చిన చైనీయులకు మధ్య అపనమ్మకపు పొర ఒకటి ఏర్పడి ఉంది. హాంగ్ కాంగ్ లో ఏదో బాపుకుందామని కుప్పలు తెప్పలుగా వచ్చిన వాళ్ళు స్ధానికుల ఉద్యోగావకాశాలను కుదించివేశారు. తక్కువ వేతనాలకు పని చేసేందుకు సిద్ధం అవడంతో స్ధానికుల వేతనాలు కూడా పడిపోయాయి. విద్య, వైద్యం, ఉద్యోగం… ఇలా వివిధ రంగాల్లో అవకాశాలు పలచబడ్డాయి. దీనికి ప్రత్యక్ష కారణంగా హాంగ్ కాంగ్ వాసులకు చైనా ప్రధాన భూభాగం నుండి వలస వచ్చినవారే కనిపిస్తున్నారు. ఇలా కుదించుకుపోయిన ఆర్ధిక అవకాశాలు రాజకీయ అసంతృప్తిగా మారి రాజకీయ డిమాండ్ల రూపాన్ని సంతరించుకుంది.

ఈ నేపధ్యంలో తలెత్తినదే ఆందోళనకారుల సార్వత్రిక ఓటు హక్కు డిమాండ్. నిజానికి ఈ డిమాండ్ వల్ల హాంగ్ కాంగ్ ప్రజలకు అదనంగా ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. సార్వత్రిక ఓటు హక్కులు ఉన్న సో కాల్డ్ ప్రజాస్వామ్య దేశాల్లో ఏ మాత్రం ప్రజాస్వామ్యం ఏడ్చింది గనుక హాంగ్ కాంగ్ లో ఏడవడానికి? ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకునే దేశాల్లో వాస్తవంగా అమలులో ఉన్నది బూర్జువా నియంతృత్వం తప్ప ప్రజాస్వామ్యం కాదు. ఓటు హక్కు తమ నెత్తిపై ఎవరు కూర్చోవచ్చో జనం ఎంచుకోవడానికి ఇచ్చిన హక్కు. ఎవరు గెలిచినా వారు కూర్చునేది జనం నెత్తిపైనే. ఇలాంటి హక్కు వల్ల హాంగ్ కాంగ్ ప్రజలకు అదనంగా ఒరిగేది ఏమీ ఉండదు. హాంగ్ కాంగ్ లో బ్రిటన్ ప్రాపకంలో ఉన్న పెట్టుబడిదారీ శక్తులకు మరింత leverage ఇవ్వడానికి మాత్రమే సార్వత్రిక ఓటు హక్కు ఇస్తుంది.

హాంగ్ కాంగ్ ఆందోళనకారుల డిమాండ్ కూ, ‘బేసిక్ లా’ ఒప్పందంలో చైనా అంగీకరించిన దానికి ఒకటే తేడా. చైనా నామినేట్ చేసిన కొందరు వ్యక్తులు మాత్రమే పోటీ చేస్తారని ఒప్పందం చెబుతుంది. చైనా నామినేషన్ ప్రక్రియ ఉండకూడదని ఆందోళనకారుల డిమాండ్. తరిచి చూస్తే ఇది బ్రిటిష్ ప్రాపకంలోని ధనికవర్గాల డిమాండ్ అని అర్ధం అవుతుంది.

హాంగ్ కాంగ్ 1997 నుండి చైనాలో భాగం అయింది. ఆ పరిస్ధితి సార్వత్రిక ఓటు హక్కు వల్ల మారదు. ఆర్ధిక వ్యవస్ధల పరంగా చూస్తే హాంగ్ కాంగ్ లో ఉన్న వ్యవస్ధే చైనా లోనూ ఉంది. కనిపిస్తున్న తేడా కేవలం పైపై ఉపరితలం లోనిదే. అది పునాదిలోని లేదా స్వభావంలోని తేడా కాదు. కనుక హాంగ్ కాంగ్ ప్రజల డిమాండు మరింత ముందుకు వెళ్ళాలి. అది చైనా ప్రజలను కూడా సమానంగా చూడాలి. ప్రజలందరికీ ఉపాధి సౌకర్యం కల్పించే వ్యవస్ధను డిమాండ్ చేయాలి. కొద్దిమంది ధనికుల డిమాండ్లను తమవిగా చేసుకున్నామని హాంగ్ కాంగ్ యువతరం గుర్తెరగాలి. పశ్చిమ ప్రజాస్వామ్య ఎండమావుల్లో ఉన్నది ప్రజాస్వామ్యం కాదని అది కేవలం జిలుగు వెలుగుల మాయాజలతారు మాత్రమేనని వారు తెలుసుకోవాలి.

చైనా ప్రభుత్వం వరకు చూస్తే ఇప్పటివరకూ తీవ్రమైన అణచివేత పద్ధలకు దిగలేదు. అమెరికా, ఐరోపా రాజ్యాలు అమలు చేసిన అమానవీయ అణచివేత పద్ధతులకు ఇంకా దిగలేదు. పైగా హాంగ్ కాంగ్ ప్రభుత్వం జరిపించిన భాష్పవాయు ప్రయోగం, పెప్పర్ స్ప్రే ప్రయోగాలను చైనా అధికార పత్రికలు విమర్శించాయి. సంయమనం పాటించాలని హితవు పలికాయి. చైనా జాతీయ సెంటిమెంట్లకు పెట్టింది పేరయిన అధికారిక ఆంగ్ల పత్రిక గ్లోబల్ టైమ్స్ సైతం హాంగ్ కాంగ్ ప్రత్యేక పాలనా ప్రాంత ప్రభుత్వ బలప్రయోగాన్ని విమర్శించింది. ఈ విమర్శల వెనుక పరిస్ధితి చేయిదాటిపోతుందేమోనన్న చైనా పాలకుల ఆందోళన కనిపిస్తోంది.

టియర్ గ్యాస్ ను విస్తృతంగా ప్రయోగించడం వల్ల ప్రయోజనం లేదని, ఓపిక వహిస్తే ఆందోళనకారులు వెనక్కి వెళ్తారని చైనా ప్రభుత్వం ప్రస్తుతానికి భావిస్తోంది. ఒకవేళ అలా జరగకపోతే అణచివేత తీవ్రం చేసినా ఆశ్చర్యం లేదు. ఆందోళనలు అదుపు తప్పితే విరమిస్తామని ఆందోళన నాయకులు ప్రకటిస్తున్నందున ఆ ప్రమాదం లేకపోవచ్చు. అదుపు తప్పితే చూసి తరించాలని మంటల్లో చుట్టలు కాల్చుకునేందుకు అలవాటు పడ్డ పశ్చిమ ప్రజాస్వామ్య ఛాంపియన్లు భావిస్తున్నాయి. వెరసి హాంగ్ కాంగ్ ఆందోళనలు ఒకానొక కోణంలో పశ్చిమ-చైనా శిబిరాల మధ్య ఏర్పడి ఉన్న ప్రపంచ ధృవాత్మక వైరుధ్యాల వ్యక్తీకరణగా కూడా చూడవలసి ఉంటుంది. ఆందోళనల్లో పశ్చిమ పాత్ర ఏ మాత్రం ఉందన్నదానిపై ఆధారపడి ఈ వ్యక్తీకరణ బలం ఆధారపడి ఉంటుంది. అటువంటి సూచనలు ఇంకా స్పష్టంగా వెల్లడి కావలసే ఉంది.

Photos: The Atlantic, CNN

Hong Kong protests 01 Hong Kong protests 02 Hong Kong protests 03 Hong Kong protests 04 Hong Kong protests 05 Hong Kong protests 06 Hong Kong protests 07 Hong Kong protests 08 Hong Kong protests 09 Hong Kong protests 10 Hong Kong protests 11 Hong Kong protests 12 Hong Kong protests 13 Hong Kong protests 14 Hong Kong protests 15 Hong Kong protests 16 Hong Kong protests 17 Hong Kong protests 18 Hong Kong protests 19 Hong Kong protests 20
Filed under: యుద్ధము-శాంతి, రాజకీయాలు Tagged: ఒక చైనా రెండు వ్యవస్ధలు, బేసిక్ లా, హాంగ్ కాంగ్, హాంగ్ కాంగ్ ఆందోళనలు

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: ఈ పెద్దాయనను ఎలా అర్ధం చేసుకోవాలి?

2014-09-30 11:02 AM Sekhar V

Kalyanasundaram

పై ఫోటోలో సూటు బాబుల మధ్య వినమ్రంగా నిలబడ్డ పెద్దాయన పేరు కళ్యాణ సుందరం. ఆయన గురించి తెలుసుకుంటే ఆశ్చర్యంతో నోట మాట రాక స్ధాణువులమై పోతాం. తన సర్వస్వం అవసరంలో ఉన్నవారి కోసం ధారపోసిన కళ్యాణ సుందరం లాంటి పెద్ద మనుషుల్ని చూస్తే మనమూ మనుషులమైనందుకు కాస్త గర్విస్తాం. ఆయనతో ఏదో విధంగా సంబంధం కలుపుకుని ఇంకా గర్వించడానికి ప్రయత్నిస్తాం. ఈయన తెలుగు వారై ఉంటే కాస్త ఎక్కువ గర్వపడదాం అనుకున్నాను. తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు గనక మన పక్క రాష్ట్రం వారే అన్న గర్వంతో సరిపుచ్చుకున్నాను.

ఇంతకీ ఆయన ఏం చేశారు?

ఈ ప్రశ్న కంటే ‘ఏం చేయలేదు?’ అని అడగడం ఉత్తమం.

కళ్యాణ సుందరం గారు ఒక లైబ్రేరియన్. భారత దేశంలో అత్యుత్తమ లైబ్రేరియన్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి మెచ్చిన గొప్ప లైబ్రేరియన్. ఆయన తన 35 సంవత్సరాల సర్వీసులో ప్రతి ఒక్క నెల వేతనంలో ప్రతి ఒక్క పైసాను అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఇచ్చేశారు. తాను రిటైర్ అయ్యాక రు 10 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే ఆ మొత్తాన్ని కూడా అవసరం ఉన్నవారికి ఇచ్చేశారు. ప్రపంచంలో తన సంపాదన మొత్తాన్ని సంపూర్ణంగా పరుల కోసం వినియోగించిన ఏకైక వ్యక్తి ఈయనేనట.

కళ్యాణ సుందరం గారి సేవలను గుర్తించిన అమెరికా ప్రభుత్వం ‘మేన్ ఆఫ్ ద మిలీనియం’ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఈ అవార్డు కింద ఆయనకు రు. 30 కోట్ల రూపాయలు ముట్టింది. ఆ మొత్తాన్ని కూడా యధావిధిగా ఛారిటీ కార్యకలాపాలకే ఖర్చు చేశారు. ఈయన గురించి తెలుసుకుని తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ గారు తన తండ్రిగా దత్తగత తీసుకున్నారుట. ఆయనకు పెళ్లి కాలేదు. కాదు, ఆయన పెళ్లి చేసుకోలేదు.

మరి ఎలా బతికారు? తన పొట్టగడవడానికి లైబ్రేరియన్ విధుల అనంతరం ఆయన అనేక చిన్న చిన్న పనులు చేశారు. చాలాకాలం పాటు సర్వర్ గా పని చేసి ఆ మొత్తంతో కడుపు నింపుకున్నారని తెలిస్తే అర్జెంటుగా వెళ్ళి ఆయన కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. తన కార్యకలాపాలకు ఆయన ఇచ్చిన వివరణ చాలా సామాన్యమైనది. పెద్ద పెద్ద సిద్ధాంతాలేమీ ఆయన చెప్పలేదు.

ఏదో ఒక విధంగా మనం సమాజానికి ఎంతో కొంత ఇవ్వనిదే మొదట మనల్ని మనం పోషించుకోలేము. సామాజిక మంచి కోసం ఒక్కరైనా సరే, తనవంతు కృషి తాను చేస్తే సమాజంలో ఎంతో కొంత మార్పు వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను.

చాలా సామాన్యంగా ఉంది కదా ఆయన చెప్పింది! నిన్ను నువ్వు నిలుపుకోవాలంటే పక్కవాడిని నిలబట్టాలన్నదే ఆయన సిద్ధాంతానికి కేంద్ర బిందువు. ఇది ఒక నిత్య సత్యం. మనిషి స్వతహాగా సంఘ జీవి. సంఘ జీవితం, శ్రమ చేసే గుణం ఈ రెండు లక్షణాలే మనిషిని జంతువు నుండి వేరు చేశాయి. సంఘజీవితంలోని ప్రధాన లక్షణం ఉమ్మడి శ్రమతో అవసరాలు తీర్చుకోవడం. మనం గడపదాటి కాలు బైట పెట్టాలంటే అనేక వస్తువులను మన ఒంటిపై ధరించి, అనేక ఆహార పదార్ధాలను భుజించిగాని కదలలేము. మన ఒంటిపై ఉండే బట్ట, వాచీ, పెన్ను, కాగితం, కళ్ళజోడు, నూనె… ఇలా సమస్త వస్తువులు మన తోటి మనిషి తయారు చేసినదే తప్ప అన్నీ మనం చేసుకున్నవి కావు. ప్రతి ఒక్కరూ తాను స్వయంగా తయారు చేసుకున్న వస్తువును మాత్రమే వినియోగించాలి అని షరతు పెడితే ఎవ్వరూ బతకలేరు. కళ్యాణ సుందరం గారు చెబుతున్నది కూడా ఇదే. కాకపోతే ఆయన వేరే మాటల్లో చెప్పారు. ‘సమాజానికి మనం ఎంతో కొంత చేయనిదే మనల్ని మనం నిలుపుకోలేము’ అని.

Mr. Kalayanasundaramకళ్యాణ సుందరం గారు తాను విద్యార్ధిగా ఉన్న కాలం తప్పితే మిగిలిన కాలం అంతా సంఘ సేవలోనే గడిపారు. అనగా 45 యేళ్లుగా ఆయన సంఘసేవలో ఉన్నారు. లైబ్రెరీ సైన్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన సుందరం గారు లైబ్రేరియన్ గా వినూత్న పద్ధతులను ఆవిష్కరించి చదువరులకు పుస్తకాలను సులభంగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేశారట. ట్యుటి కోరిన్ జిల్లాలోని శ్రీ వైకుంఠంలో కుమార్ కూరుపర ఆర్ట్స్ కాలేజీ లోని లైబ్రెరీలో 35 యేళ్లపాటు లైబ్రేరియన్ గా పని చేశారు. జీత భత్యాలన్నీ సంఘ సేవకు ఇవ్వడంతో పాటు తన శరీర భాగాలను కూడా ఆయన డొనేట్ చేశారు.

‘భారత దేశపు అత్యుత్తమ లైబ్రేరియన్’గా భారత ప్రభుత్వం గుర్తించి సత్కరించింది.  ‘ప్రపంచంలో అతి గొప్ప 10 మంది లైబ్రేరియన్ లలో ఒకరు’గా కూడా ఆయన గుర్తింపు పొందారు. కేంబ్రిడ్జిలోని ద ఇంటర్నేషనల్ బయోగ్రాఫికల్ సెంటర్ అనే సంస్ధ ఆయనను ప్రపంచంలో అత్యంత ఉదాత్తమైన వ్యక్తిగా (One of the noblest of the world) గుర్తించింది. ఐక్యరాజ్య సమితి ఆయనను 20 వ శతాబ్దపు విశిష్ట వ్యక్తులలో (One of the Outstanding people of the 20th Century) ఒకరిగా గుర్తించింది. పైన చెప్పినట్లు అమెరికా సంస్ధ ఒకటి ‘మేన్ ఆఫ్ ద మిలీనియం’ గా గుర్తించి అవార్డు ప్రదానం చేసింది. సుందరం గారు ‘పాలం’ అనే సంక్షేమ సంస్ధను స్ధాపించి నిర్వహిస్తున్నారు. దాతలకు, దానం గ్రహీతలకు మధ్య వారధిగా ఈ సంస్ధ పని చేస్తుంది.

ఇంతకీ ఆయన ఇంత కఠినమైన, అద్భుతమైన జీవితాన్ని ఎలా, ఎందుకు ఎంచుకున్నారు?

1953లో జన్మించిన కళ్యాణ సుందరం చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఆయన పేదలకు సేవ చేసేలా స్పూర్తినిచ్చింది ఆయన తల్లి గారే. ఆయన కాలేజీలో ఉండగా ఇండియా-చైనా యుద్ధం బద్దలయింది. యుద్ధ సాయం నిమిత్తం ఆయన తన బంగారు గొలుసును అప్పటి ముఖ్యమంత్రి కామ రాజ్ కు ఇచ్చారు. అనంతరం ఆనంద వికటన్ పత్రిక ఎడిటర్ బాల సురమణ్యంను కలిశారు. “నువ్వు స్వయంగా సంపాదించింది దానం చేసి నా వద్దకు రా. అప్పుడు నీ గురించి రాస్తాను అని ఆయన నాతో అన్నారు. నేనీ సంగతి ఎవరీ చెప్పలేదు. నేను దానిని సవాలుగా తీసుకున్నాను” అని కళ్యాణ సుందరం చెప్పినట్లు లిస్ లింక్స్ అనే వెబ్ సైట్ తెలిపింది.

ఆ విధంగా ఆయన లైబ్రేరియన్ ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి నెల నుండే వేతనం మొత్తాన్ని అవసరంలో ఉన్నవారికోసం వెచ్చించడం ప్రారంభించారు. ఆయన తనకు తానే సవాలు విసురుకుని దాన్ని నెరవేర్చుతూ వచ్చారు. పెళ్లి చేసుకోనిది ఈ కారణం వల్లనేనేమో తెలియదు గానీ పెళ్లి చేసుకుంటే గనుక ఆయనపై అనివార్యంగా కొన్ని బాధ్యతలు వచ్చిపడి లక్ష్య శుద్ధికి భంగం కలిగి ఉండేది అనడంలో సందేహం లేదు.

1990లో ఆయన రిటైర్ అయిననాటి పాత బాకీలు (ఎరియర్స్) వచ్చాయి. ఆ మొత్తాన్ని ఆయన తిరునల్వేలి జిల్లా కలెక్టర్ సహాయ నిధికి ఇచ్చేశారు. అప్పుడు  ఆ జిల్లా కలెక్టర్ సుందరం గారి నిరసనలను పట్టించుకోకుండా మీటింగు ఏర్పాటు చేసి ఆయన గురించి లోకానికి వెల్లడి చేశారు. అప్పటివరకూ ఆయన దాతృత్వం గురించి ఆయన చుట్టూ ఉన్నవారికి తప్ప ఎవరికీ తెలియదట. ఆయన ఏర్పాటు చేసిన సంస్ధ పాలం, ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల్లో తుఫానులు వచ్చినపుడు సహాయం చేసింది. మహా రాష్ట్ర, గుజరాత్ లలో భూకంపం వచ్చినపుడు బాధితులకు సహాయం చేసింది.

ప్రతి ఒక్కరూ తాను ఎంచుకున్న రంగంలో ఏదో ఒకటి సాధించాలని కళ్యాణ సుందరం గారు చెబుతారు. చెప్పడమే గాకుండా చేసి చూపించారు కూడా. దేశంలో బెస్ట్ లైబ్రేరియన్ గా, ప్రపంచంలో బెస్ట్ లైబ్రేరియన్స్ లో ఒకరిగా గుర్తింపును పొందడంలో ఆయన తన రంగంలో చేసిన కృషి కనిపిస్తుంది. పి.జి కోర్సు చేస్తుండగా లైబ్రెరీ సైన్స్ లో ఆయన సమర్పించిన ధీసిస్ ఆయనకు డిస్టింక్షన్ తెచ్చి పెట్టింది. ఆయన ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారట. ముఖ్యంగా యువకులు, పిల్లలు కొద్ది సేపట్లోనే ఆయనతో స్నేహం చేస్తారట.

సుందరం గారు ఖాదీ దుస్తులనే ధరిస్తారు. లైబ్రేరియన్ గా ఉండగా ఆయన ఒక సారి సభలో గాంధీయిజం గురించి చెప్పవలసి వచ్చిందట. గాంధీ ప్రతిపాదించిన ఖాదీ దుస్తుల ధారణ మంచి ఉద్దేశ్యంతో కూడిందని ఆయన సభలో చెప్పారు. కానీ ఆ మాట చెబుతున్నప్పుడు కాస్త ఖరీదయిన దుస్తులను తాను ధరించి ఉన్నానని ఆయన గుర్తించి అప్పటి నుండి ఖాదీ దుస్తులను మాత్రమే ధరించడం ప్రారంభించారు.

స్వార్ధ రాహిత్యం, సేవాగుణం, చెప్పిన మాట పొల్లు పోకుండా ఆచరించడం, నీతి చెప్పే ముందు మొదట తాను ఆచరించి చూపడం… ఇవన్నీ కళ్యాణ సుందరం గారి సుగుణాలని ఇదంతా చదివాక మనకు అర్ధం అవుతుంది. అయితే అసలు విషయం అది కాదు. ఈ లక్షణాలన్నీ ఒకే ఒక మూల లక్షణం నుండి ఉద్భవించాయి. అది ఆయన ‘ఏదీ తన ఆస్తి కాదు’ అనుకోవడం. అనగా స్వంత ఆస్తి విధానాన్ని ఆయన తిరస్కరించారు. చివరికి తన నెలవారి వేతనం కూడా తనది కాదు అని ఆయన నమ్మారు. ఆ నమ్మకం వల్లనే ఆయన తన వద్దకు వచ్చిన ప్రతి రూపాయినీ చాలా తేలికగా, గడ్డిపోచ లెక్కన అవసరంలో ఉన్నవారికి ఇవ్వగలిగారు.

కమ్యూనిస్టు సిద్ధాంతంలోని ప్రధాన, మూలాంశం ఇదే. స్వంత ఆస్తిని రద్దు చేయడం. సమాజంలో క్రమానుగత మార్పులు తీసుకు వస్తూ చివరికి స్వంత ఆస్తి లేకుండా చేయడం కమ్యూనిస్టు సిద్ధాంత లక్ష్యం. (కానీ అందుకు ఆస్తులు కలవారు ఒప్పుకోరు.) నిజానికి ఎవ్వరైనా తమది అనుకునే ఏ ఆస్తీ వారిది కాదు. సమస్తం ప్రకృతి నుండి వచ్చినదే. ప్రకృతి ఇవ్వకుండా మనిషి అవసరం ఏదీ తీరదు.

ఆ ప్రకృతి మనిషి పుట్టక ముందే ఉనికిలో ఉంది. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వచ్చి అణు వినాశనం వల్ల మనిషి అనేవాడు లేకుండా పోయినా ప్రకృతి మాత్రం నిలిచి ఉంటుంది. ప్రకృతి నుండి ఒకానొక దశలో మనిషి పుట్టినపుడు ప్రకృతి మనిషి ఆస్తి కాదు. శ్రమ చేయడం అనే ప్రత్యేక లక్షణం వల్ల మనిషి క్రాంగా సంఘజీవిగా అవతరించి ప్రకృతిని స్వాధీనం చేసుకుని చివరికి ప్రకృతిని తన ఆస్తులుగా విభజించుకున్నాడు. కనుక స్వంత ఆస్తి లేనంత మాత్రాన మనిషి మనుగడ ఏమీ ఆగిపోదు. పైగా మరింత సమున్నతంగా, అత్యంత ఉన్నత స్ధాయిలో మనిషి బతకగలడు.

కళ్యాణ సుందరం ఈ సత్యాన్ని తన సొంత జీవనం ద్వారా రుజువు చేసి చూపారు. తనకంటూ ఆస్తి లేకపోయినా అణువణువూ స్వార్ధం నిండిన లోకంలో నిస్వార్ధంగా బతుకుతూ ఆస్తి లేని జీవితం ఆచరణ సాధ్యం అని నిరూపించారు.

నాకు వ్యక్తిగతంగా ‘ఆ నలుగురు’ సినిమా అంటే చాలా ఇష్టం. గౌరవం కూడా. అయితే ఆ సినిమాలో హీరో జీవితం ఆదర్శనీయం అనుకున్నానే గానీ ఆచరణ సాధ్యం అని గట్టిగా నమ్మలేదు. స్ధైర్యం, నమ్మకం, నిబద్ధత ఉంటే ఆ జీవితం సాధ్యం అనుకున్నానే గానీ నిజంగా అలాంటి జీవితం, నిజం చెప్పాలంటే ఇంకా ఉన్నతమైన జీవితం గడుపుతున్న వ్యక్తి మానమధ్యనే ఉన్నారని మాత్రం తెలియదు.

వీలయితే కళ్యాణ సుందరం గారిని కలిసి మాట్లాడాలని ఉంది. కానీ దానికంటే ముఖ్యం ఆయన ఆదర్శంలో వెయ్యో వంతయినా సరే పాటించడం!


Filed under: మార్క్సిజం, సమాజం సంస్కృతి Tagged: కమ్యూనిజం, కళ్యాణ సుందరం, మార్క్సిజం, స్వంత ఆస్తి విధానం

24 గంటలు: మామ్ అదరగొడుతోంది

2014-09-30 05:59 AM D Liberty (noreply@blogger.com)
తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని అందుకుని, అద్భుతం సృష్టించిన ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్, తన పనిని కూడా ఎంతో సమర్థవంతంగా చేస్తోంది. అంగారకుడికి సంబంధించిన ఫోటోలను తీస్తూ.. వాటిని ఎంతో జాగ్రత్తగా ఇస్రోకుపంపిస్తోంది. ఎంతో క్లారిటీగా ఉన్న ఈ ఫోటోలతో మార్స్ అధ్యయనం మరింత సులువు కానుంది. అంగారకుడిపై ఉన్న ధూళి తుపాన్లకు సంబంధించి మామ్ తీసిన ఫోటోలను విడుదల చేసింది ఇస్రో. సెప్టెంబర్ 28, 2014న మామ్ తీసిన

24 గంటలు: గోవిందుడికి లీలలకు సెన్సార్ కోతలు

2014-09-30 05:39 AM D Liberty (noreply@blogger.com)
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఫ్యామిలీ ఎంటరైనర్ గోవిందుడు అందరివాడేలే. కుటుంబ కథాంశమంటూ యూనిట్ అంతా జోరుగా ప్రచారం చేస్తున్నా.. ఇందులో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయంటూ కోత వేసింది సెన్సార్ బోర్డ్. ఆ కోతలు ఇవీ...1. కాజల్ జాకెట్ బటన్ ను రామ్ చరణ్ విప్పుతున్న సీన్ (9సెకన్లు)2. రా..రా.. రాజకుమార పాటలో హీరోయిన్ కూర్చున్నప్పుడు ఆమె తొడలను చూపించే

2014-09-29

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: గుజరాత్ లో మత కొట్లాటలు, 140 మంది అరెస్టు -ఫోటోలు

2014-09-29 05:10 PM Sekhar V

గుజరాత్ లో మరోసారి మత పరమైన అల్లర్లు చెలరేగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత ప్రధాని నరేంద్ర మోడి పోటీ చేసి, అత్యధిక మెజారిటీతో గెలిచి, అనంతరం వదులుకున్న వదోదర నగరంలో ఈ అల్లర్లు చెలరేగాయి. ‘వసుధైక కుటుంబం’ భారత దేశ సిద్ధాంతం అని న్యూయార్క్, వాషింగ్టన్ డి.సిలలో ప్రధాని చెప్పుకుంటున్న సమయంలోనే ఆయన పోటీ చేసిన వదోదరలో మత కొట్లాటలు చెలరేగడం గమనార్హమైన విషయం.

గత గురువారం నుండి వదోదరలో అల్లర్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఫేస్ బుక్ ఖాతాదారు ఒకరు పోస్ట్ చేసిన బొమ్మ ముస్లిం మతాన్ని అవమానించేదిగా ఉండడంతో అల్లర్లు ప్రారంభం అయ్యాయని గుజరాత్ పోలీసు అధికారులు చెప్పారు. ఫేస్ బుక్ పోస్ట్ చేసిన వ్యక్తిని సునీల్ రాహుల్ జీ గా పోలీసులు గుర్తించారు. శనివారం నాడు ఒకరు, ఆదివారం నాడు మరొకరు కత్తిపోట్లకు గురి కావడంతో అల్లర్లు తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రిజర్వ్ పోలీసు బలగాలను తరలించామని పరిస్ధితి అదుపులో ఉందని పోలీసులు ప్రకటించారు.

అల్లర్లకు పాల్పడుతున్నవారిని గుర్తించి పోలీసులు అరెస్టులు చేశారు. ఇప్పటివరకు 140 మందిని అరెస్టు చేశారని రాయిటర్స్ పత్రిక తెలిపింది. భారత పత్రికలు అరెస్టుల సంఖ్యను 40 అని చెబుతున్నాయి. రాహుల్ జీ ని అరెస్టు చేసి సెక్షన్ 295 A కింద కేసు పెట్టామని, ఐ.టి చట్టం సెక్షన్ 65, 66 ల కింద కూడా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

కత్తిపోట్లకు గురయిన సంఘటనలు రెండు జరిగాయని పోలీసులు తెలిపారు. కత్తి పోట్లకు గురైన వారు, కత్తి పోట్లకు బాధ్యులుగా పోలీసులు గుర్తించినవారు ఇరువురు ఒకే మతానికి చెందినవారుగా కొన్ని పత్రికలు తెలిపాయి. అయితే పోలీసులు చెప్పని మరో కత్తిపోట్ల సంఘటన కూడా జరిగిందని, దుండగులు ముసుగులు ధరించి వచ్చి ఒక వ్యాపారిని పొడిచారని పత్రికలు తెలిపాయి. ఒక కత్తిపోటు సంఘటనలో నిందితుడు సంజయ్ బాగ్ గా నవపురా పోలీసులు గుర్తించారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది. సంజయ్ బాగ్ బి.జె.పి పార్టీ కార్యకర్త అని, ఆయన అక్రమ మద్యం వ్యాపారి అని పత్రిక తెలిపింది.

ఫేస్ బుక్ పోస్టుకు వ్యతిరేకంగా ఒక మతానికి చెందిన జనం గుంపులు గుంపులుగా అల్లర్లకు, విధ్వంసానికి దిగారని అనంతరం ప్రత్యర్ధి మతానికి చెందినవారు కూడా దాడులకు పాల్పడ్డారని పోలీసులు, పత్రికల ద్వారా తెలుస్తోంది. ఇక అనంతరం ఎవరు ముందు అన్న గీత చెరిగిపోయింది. పరస్పరం రాళ్ళు రువ్వుకుంటూ, వాహనాలు తగలబెడుతూ, షాపులు ధ్వంసం చేస్తూ అల్లర్లు నగరంలోని ఇతర ప్రాంతాలకు పాకాయి.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రకారం ఆదివారం వఘాడియా రోడ్డులోని కళాదర్శన్ చార్ రాస్తా ఏరియాలో 28 యేళ్ళ టీ వ్యాపారిని వెనక నుండి కొందరు వ్యక్తులు కత్తితో పలుమార్లు పొడిచారు. టీ వ్యాపారి పేరు శైలేష్ రాజ్ పుట్ అని పత్రిక తెలిపింది. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వెళ్ళి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ముసుగులు ధరించిన వ్యక్తులు శైలేష్ ని పొడిచారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. రాష్ట్ర రిజర్వు పోలీసులను ఏరియాలో దించారు.

రెండో కత్తిపోటు ఘటన మహేంద్ర దంగి అనే 48 సం.ల వ్యాపారి పైన జరిగింది. మంగళ్ బజార్ లో ఆయనపై దాడి జరిగిందని ఆయనను కూడా వెనుక నుంచి వచ్చి పొడిచారని తెలుస్తోంది. వీరు ముసుగుల్లో వచ్చారా ఎలా వచ్చారు అన్నది పత్రిక సమాచారం ఇవ్వలేదు. మంగళ్ బజార్ లోనే మరో వ్యాపారిపై దాడి జరిగినప్పటికి ఆయన పోలీసులకు రిపోర్ట్ చేయడానికి ఇష్టపడలేదని పత్రిక తెలిపింది.

ఆయూబ్ హసన్ భాయ్ అనే పేరుగల హిస్టరీ షీటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కొన్ని పత్రికలు తెలిపాయి. అయితే ఆయన కొన్ని వారాలుగా పరారీలో ఉన్నాడని, ఇప్పటి మత అల్లర్లకు బాధ్యుడన్న సమాచారం పోలీసుల వద్ద లేదని ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది.

సోమవారం మరో అల్లర్ల ఘటన జరిగినట్లుగా పత్రికలు నివేదించలేదు. పరిస్ధితి అదుపులో ఉందన్న పోలీసు అధికారుల ప్రకటనలు మాత్రమే ప్రచురించాయి. అల్లర్లు వేగంగా వ్యాపించడంతో పోలీసులు మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేయించారు. పోలీసులు, ఎస్.ఆర్.పి.ఎఫ్, ఆర్.పి.ఎఫ్ బలగాలను అన్ని సెంటర్లలోను దించి పహారా కాయిస్తున్నారు.

అయితే ఈ చర్యలను 2002 నాటి దాడుల సందర్భంగా పోలీసులు ఎందుకు చేపట్టలేదన్నదే ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్న. కాపాడమంటూ వెళ్ళిన జనానికి ‘మిమ్మల్ని రక్షించవద్దని మాకు పై నుండి ఆదేశాలు వచ్చాయి’ అని చెప్పిన పోలీసులు తమ బాధ్యత తాము నిర్వర్తించి ఉంటే చాలా ప్రాణ నష్టాన్ని నివారించి ఉండేవారు కాదా? అప్పటికీ, ఇప్పటికీ అనేకమంది సమాధానం ఇవ్వడానికి ఇబ్బంది పడే ప్రశ్న ఇది. ఈ రోజు తమ నేత వాషింగ్టన్ లో, న్యూయార్క్ లో భారత దేశ ‘వసుధైక కుటుంబం’ సిద్ధాంతం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు గనుక, ఆ సందర్భానికి తగిన వాతావరణం ఇక్కడ ఉండాలి గనుక చట్ట బద్ధ బలగాలు పని చేసేలా చూస్తారా?

టు సర్కిల్స్ వెబ్ సైట్ ప్రకారం ఇప్పుడు కూడా పోలీసులు ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. తమ ఇళ్ళల్లోకి చొరబడి పోలీసులు బూతులు తిడుతున్నారని, సామానును ధ్వంసం చేసి వెళ్తున్నారని, తమ వాహనాలను తగలబెట్టారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఇదే నిజం అయితే అల్లర్లను నిరోధించడం మాని పోలీసులే అల్లర్లకు దిగారని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. వదోదర లోని లెఃరిపుర దర్వాజా ఏరియాలో బైక్ ప్రమాదం జరిగిందని ఇందులో ఇరు మతాలవారు ఉండడంతో అల్లర్లు మొదలయ్యాయని టూ సర్కిల్స్ తెలిపింది. ఫేస్ బుక్ పోస్ట్ ఘటన బైక్ ప్రమాద ఘటనకు తోడైందని తెలిపింది. ఫేస్ బుక్ కు నిరసనగా ముస్లింలు రాహుల్ జి ఇంటిపై రాళ్ళు వేశారని, వారికి ప్రతీకారంగా అవతలివారు కూడా రాళ్ళు వేయడంతో ఘటన పెద్దదై విస్తరించిందని తెలిపింది.

ఈ రెండు ఘటనలకు ముందు మరో ముఖ్య ఘటన చోటు చేసుకుంది నవరాత్రి సందర్భంగా గుజరాత్ లో గర్బా డ్యాన్స్ ప్రదర్శనలు జరుగుతాయి. ఈ ప్రదర్శనల్లో ముస్లింలు కూడా పాల్గొనడం ఒక ఆచారంగా తెలుస్తోంది. లవ్ జిహాద్ కు నిరసనగా ఈసారి గర్భా డ్యాన్స్ లో ముస్లింలు పాల్గొనకుండా నిరోధించాలని వి.హెచ్.పి, బి.జె.పి లు పిలుపు ఇచ్చాయి. పండగ ఉత్సవంలో పాల్గొనేందుకు అందరూ అర్హులే అని గుజరాత్ హోమ్ సెక్రటరీ ఎస్.కె.నందా, పోలీసులు ప్రకటిస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో గుజరాత్ లోనూ ఇతర మరికొన్ని రాష్ట్రాల్లోనూ వాతావరణం మతపరంగా ఛార్జ్ అయి ఉంది. అల్లర్లు చెలరేగడానికి తగిన పరిస్ధితులను ఏర్పరించింది ఇదే. నవరాత్రి ప్రారంభం అయింది గురువారమే కావడం గమనార్హం.

ఇంకా ఘోరం ఏమిటంటే గర్భా ఉత్సవంలో పాల్గొనేందుకు ముస్లింలూ అర్హులే అన్నందుకు గుజరాత్ హోమ్ కార్యదర్శిని వి.హెచ్.పి తీవ్రంగా హెచ్చరించడం. అహ్మదాబాద్ వి.హెచ్.పి కార్యదర్శి ఓ ప్రకటనలో ఇలా ప్రశ్నించారు. “నందా ఏమన్నా మత నాయకుడా? జగన్నాధ ఆలయంకు సంబంధించిన ఆయన బంధువులు ఆలయంలోకి ముస్లింలను అనుమతిస్తారా? ముందు ఆయన మసీదులపై లౌడ్ స్పీకర్లను కట్టడి చేయాలి. ఆ తర్వాతే ఆయన గర్భాలో లౌడ్ స్పీకర్లను నిషేదించాలని ఆదేశాలు ఇవ్వాలి.”

హిందూ మతం పరమత సహాన శీలి అనీ, అందరినీ తనలో ఇముడ్చుకుంటుందని, అన్ని మతాల వారిని సమాదరిస్తుందని పలువురు హిందూ మత పెద్దలు తరచుగా చెప్పే మాట. అనేకమంది హిందువులు కూడా ఆ విలువను నమ్ముతారు కూడా. కానీ వి.హెచ్.పి నాయకుడి ప్రకటన ఇందుకు విరుద్ధంగా ఉంది.

గుజరాత్ అల్లర్ల వార్తను ది హిందు పత్రిక పెద్దగా కవర్ చేయకపోవడం ఒకింత చోద్యంగా కనిపిస్తోంది. ఎన్.డి.టి.వి, ఇండియన్ ఎక్స్ ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ పోస్ట్, డి.ఎన్.ఏ, జీ న్యూస్ తదితర భారతీయ పత్రికలతో పాటు రాయిటర్స్, బి.బి.సి లాంటి పశ్చిమ పత్రికలు సైతం వదోదర అల్లర్లను విస్తృత స్ధాయిలో కవర్ చేశాయి. ది హిందు పత్రిక చిన్నపాటి వార్తలతో సరిపుచ్చింది. బహుశా

Vadodara riots 01 Vadodara riots 02 Vadodara riots 03 Vadodara riots 04 Vadodara riots 05 Vadodara riots 06 Vadodara riots 07 Vadodara riots 08
Filed under: రాజకీయాలు, సమాజం సంస్కృతి Tagged: ఫేస్ బుక్ పోస్ట్, వదోదర అల్లర్లు, వసుధైక కుటుంబం

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: విద్యుత్ కోతలతో అల్లాడుతున్న తెలంగాణ

2014-09-29 01:38 PM Sekhar V

POWER-CUTS

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతీకారం వల్లనోఏమో తెలియదు గానీ తెలంగాణ జిల్లాలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి. డిమాండ్ కు సరఫరాకు మధ్య భారీ అంతరం తలెత్తడంతో వేసవి చాలా దూరం ఉన్నా అప్పుడే వేసివి తరహా కోతలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. అధికారిక కోతలు పట్టణాల్లో రోజుకు 4 గంటలు అని ప్రకటించి అనధికారికంగా మరిన్ని గంటలు కోత విధిస్తున్నారు. పల్లెల గురించి చెప్పుకోకపోతేనే మేలు.

తెలంగాణలో విద్యుత్ కోతలకు ప్రధాన బాధితులు అక్కడి రైతాంగం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నెల రోజుల్లోనే విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన అక్కడి రైతులపై అమానుషంగా లాఠీ ఛార్జీ చేయించడం ద్వారా కె.సి.ఆర్ ప్రభుత్వం తన స్వభావం ఏమిటో స్పష్టంగా చాటుకుంది. నక్సలైట్ల ఎజెండాయే తన ఎజెండా అని ఉద్యమ కాలంలో ప్రతి సభలోనూ చెప్పిన కె.సి.ఆర్ అధికారంలోకి వచ్చాక వరవర రావు, కళ్యాణ రావులు తలపెట్టిన చిన్న సభకు అనుమతి ఇవ్వకపోగా వారిద్దరితో పాటు పలువురిని అరెస్టు చేసి కేసులు బనాయించాడు.

ఒక సర్కిల్ పూర్తయిందన్నమాట! ధర్మాగ్రహం ప్రకటిస్తున్న రైతులపై లాఠీలు ఝుళిపించగలిగిన కే.సి.ఆర్, సరిగ్గా అదే దృష్టి కోణంతో వరవర రావు తదితరుల సభకు అనుమతి ఇవ్వలేదని జనం అర్ధం చేసుకోవాల్సిన విషయం.

రైతులతో పాటు దాదాపు ప్రతి రంగంలోని జనం విద్యుత్ కోతల వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. నగర జనం అతి తక్కువగా 4 గంటల కోతలు అనుభవిస్తుంటే పల్లె జనం అత్యధికంగా 18 గంటల కోతలు ఎదుర్కొంటున్నారు. నైరుతి ఋతుపవనాలు ప్రభావం కోల్పోయి అలా వెనక్కి వెళ్తుండగానే ఇలా కోతలు మొదలు కావడం బట్టి మునుముందు తెలంగాణ ప్రజల విద్యుత్ పరిస్ధితి ఊహించడానికి కూడా భయం వేస్తుండవచ్చు. ‘ఆంధ్ర వాళ్ళు ఇవ్వకపోతే ఇక విద్యుత్ లేదా? మేము జాతీయ గ్రిడ్ నుండి విద్యుత్ కొంటాం, రైతులు ఇబ్బంది పడనివ్వం, 9 గంటలు విద్యుత్ కరెక్ట్ గా ఇస్తాం” అని కె.సి.ఆర్ ఎన్నికల్లోనూ, ఉద్యమంలోనూ ఢంకా భజాయించి మరీ హామీ ఇచ్చారు. వాస్తవంలో అదేమీ లేకపోగా ప్రశ్నించిన రైతుపై లాఠీ ఝుళిపించారు.

వేసవి రాకకు ఇంకా 5 నెలల సమయం ఉంది. కానీ తెలంగాణలో విద్యుత్ కోతలపరంగా అప్పుడే వేసవి మొదలైంది. విద్యుత్ అధికారులు రాష్ట్రం మొత్తం మీద 500MW నుండి 550MW వరకు కొరత ఉందని చెబుతున్నారు. అయితే వాస్తవ కొరత 1500 MW పై మాటే అని అనధికారికంగా అంగీకరిస్తున్నారు.

బోరు బావుల కింద సేద్యం చేస్తున్న రైతులు విద్యుత్ కోతల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వారికి రోజుకు 4 నుండి 5 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. ఆ విద్యుత్ కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. పోనీ పారిశ్రామిక రంగం ఏమన్నా చల్లగా ఉందంటే ఆ పరిస్ధితి కూడా లేదని తెలుస్తోంది. వారానికి రెండు రోజులు పవర్ హాలిడే పాటించమని ప్రభుత్వం పరిశ్రమలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. సలహా కాదు, నిజంగానే పవర్ హాలిడే అమలు చేస్తున్నారని పారిశ్రామికవేత్తలు కొందరు చెబుతున్నారు. వారంలో ఒక రోజు పూర్తిగా సరఫరా ఇవ్వడం లేదనీ మిగిలిన 6 రోజుల్లో రోజుకి 8 గంటలు మాత్రమే నికరంగా విద్యుత్ సరఫరా అవుతోందని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.

ఉదాహరణకి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రకటిత కోత 4 గంటలు కాగా అప్రకటిత కోతలు మరో 2 గంటలు అమలు చేస్తున్నారు. జిల్లాలోని ఇతర పట్టణాల్లో 8 గంటల కోతలు అమలు చేస్తుండగా పల్లెల్లో 12 గంటలకు పైనే కోత పడుతోంది. జిల్లాలో 100 MW విద్యుత్ కొరత ఉన్నదని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ప్రభాకర్ చెప్పారని ది హిందు తెలిపింది. 450 MW మేరకు డిమాండ్ ఉండగా 348 MW మాత్రమే సరఫరా చేయగలుగుతున్నామని ఆయన తెలిపారు.

వరంగల్ జిల్లాలో భారీ విద్యుత్ డిమాండ్ ఉంటుంది. 2,100 MW విద్యుత్ డిమాండ్ ఉండగా 1,500 MW మాత్రమే సరఫరా అవుతోంది. అనగా ఏకంగా 600 MW విద్యుత్ కొరత! వినియోగదారులను గ్రూపులుగా విభజించి వంతులవారిగా విద్యుత్ ఇస్తున్నామని జిల్లా విద్యుత్ పంపిణీ అధికారులు చెబుతున్నారు.

కరీం నగర్ లో విద్యుత్ సరఫరా వేళల్లో తీవ్ర అస్తవ్యస్త పరిస్ధితులు నెలకొనడంతో పంటలు ఎండి వాలిపోతున్నాయి. పొడి వాతావరణం అదనపు సమస్యగా మారింది. 4 నుండి 5 గంటలు మాత్రమే సరఫరా అవుతుండడంతో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పరిస్ధితి ఇంకా ఘోరం. డిమాండ్, సప్లై మధ్య అంతరం తీవ్రంగా ఉండడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా కోతలు అమలు చేస్తున్నారు.

జిల్లా వ్యాపితంగా పారిశ్రామిక ప్రాంతం విస్తరించిన మెదక్ జిల్లాలో ప్రధాన విద్యుత్ డిమాండు పరిశ్రమల నుండే వస్తుంది. దానితో వారానికి రెండు రోజుల పాటు పవర్ హాలిడే అమలు చేస్తున్నారు. అలా చేస్తే తప్ప విద్యుత్ సరిపోనీ పరిస్ధితి. పలు పారిశ్రామిక యూనిట్లు డీజెల్ జనరేటర్ల సహాయంతో సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఇచ్చిన వివరాల ప్రకారం రోజుకి 6.2 మిలియన్ యూనిట్లు అవసరం కాగా 4.9 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుతోంది. నల్లగొండ జిల్లాలో 22.5 మి.యూ విద్యుత్ డిమాండ్ కు గాను 18 మి.యూ మాత్రమే సరఫరా అవుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లలో నీటి రాబడి తగ్గడంతో విద్యుత్ ఉత్పత్తి భారీగా పడిపోయింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలోనూ ఇదే పరిస్ధితి ఉందని వివిధ పత్రికల ద్వారా తెలుస్తోంది.

తెలంగాణలో విద్యుత్ కొరత ఊహించనిదేమీ కాదు. కానీ పాలకుల అసమర్ధత, అశ్రద్ధ, చిత్తశుద్ధి లేమి ప్రజలకు మరింత భారంగా పరిణమించాయి. తెలంగాణ వస్తే ఇక సమస్యలే ఉండవని ప్రచారం చేసుకున్న కె.సి.ఆర్ ప్రజలకు సమాధానం చెప్పడం మాని అణచివేత పద్ధతులకు తెగించడం శోచనీయం. ప్రజల సమస్యలు పరిష్కరించే చిత్త శుద్ధి ఉంటే ప్రజలకు నచ్చజెప్పడం, క్రమ శిక్షణ పాటించేలా చూడడం పెద్ద సమస్య కాదు. కానీ పాలకులకు లేనిదే చిత్త శుద్ధి. మాయమాటలు చెప్పి, ప్రతి చిన్నా, పెద్దా సమస్యకు ఆంధ్ర పాలకులను చూపిన కె.సి.ఆర్, ఇప్పుడు స్వయంగా అధికారంలో ఉన్నారు. ఆయనపై ఆంధ్ర పాలకుల ప్రభావం ఏమీ లేదు (లేక ఉందా?). కాబట్టి ఆయనకు సాకులు లేవు. సాకులు లేక, చిత్తశుద్ధి కూడా లేక అణచివేతకు దిగుతున్నారు.


Filed under: పోరాటాలు, రాజకీయాలు Tagged: కె.సి.ఆర్, తెలంగాణ, విద్యుత్ కోతలు

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: జయలలిత: అల్లంత శిఖరాన… దభేల్! -కార్టూన్

2014-09-29 09:41 AM Sekhar V

Jayalalitha at peek

జయలలిత కెరీర్ ఇక ముగిసినట్లేనా? ముగిసినట్లే అని ఆమె వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఆమె అభిమానులు మాత్రం ఇప్పటికీ శోక హృదయులై ఉన్నా, మించిపోయింది ఏమీ లేదన్న ధైర్యంతో ఉన్నారు. చో రామస్వామి లాంటి తమిళ రాజకీయ విశ్లేషకులు ఆమెకు ఇంకా అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.

జయలలిత తన కెరీర్ లో పీక్ దశలో ఉండగా కోర్టు తీర్పు ఆమెకు ఆశనిపాతం అయిందని ది హిందూ లాంటి పత్రికలు సైతం విశ్లేషించాయి. పీక్ దశ అంటే శిఖరాగ్రం అనే. శిఖరాగ్రాన ఉన్నప్పుడూ ఇక పైకి పోయే దారి ఉండదు. ముందుకు పోయే దారీ ఉండదు. ముందుకు కదిలితే ఇక దభేల్ మని అల్లంత ఎత్తునుండి పడిపోవడమే మిగులుతుంది.

శిఖరాగ్రాన చేయవలసిందల్లా జాగ్రత్తగా తన స్ధానాన్ని కాపాడుకోవడమే. అదమరుపుగా ఉంటే ఎవరు వచ్చి తోసేస్తారో తెలియదు. అది రాజకీయ శిఖరాగ్రం అయితే చెప్పనే అవసరం లేదు. ఆ స్ధానంలో ఉన్నవారిని తోసేసి ఆక్రమించడానికి ఎందరో కాచుకుని కూర్చుంటారు. జయలలిత లాంటి మొండి ఘటం వ్యక్తులకైతే శత్రువులకు కొదవ ఎక్కడిది?

జయలలిత ఎవరినైతే తన ఆత్మీయ స్నేహితులుగా భావించి నెత్తిన పెట్టుకుందో సరిగ్గా వారి వల్లనే జైలు ఊచలు లెక్కపెట్టుకునే పరిస్ధితికి చేరుకోవడం గమనార్హం. ఆమె మొదటి సారి ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కాలంలో ఆమె అనుంగు స్నేహితురాలు శశికళ, ఆమె కుటుంబ సభ్యులు లెక్కలేనన్ని పేపర్ కంపెనీలు పెట్టి ప్రభుత్వ ఆస్తులను కాజేశారు. అవే ఇప్పుడు అక్రమ ఆస్తుల కేసుగా ఆమె మెడకు చుట్టుకుని జైలు గోడల మధ్య నిలిపాయి.

జయలలిత, అవినీతి పరురాలిగా జైలు శిక్ష పడిన మొట్టమొదటి సర్వింగ్ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. చట్టం సరిగ్గా అమలైతే శిక్షా కాలం 4 సం.లు కాకుండా మరో 6 సం.లు ఆమె పోటీకి అనర్హురాలు. అనగా 2024 వరకూ ఆమెకు రాజకీయ జీవితం ఉండకూడదు. కానీ విచిత్రం ఏమిటంటే భారత దేశంలో అవినీతి కేసులో జైలుపాలైతే అపకీర్తికి బదులు సానుభూతి కుప్పలు తెప్పలుగా పోగు పడుతుంది. ఇది కూడా ‘బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ’ అంటారో, పాలితులు తమ పాలకుల భావోద్వేగాలను తమవిగా భ్రమపడడం అంటారో మేడిపండు డెమోక్రసీ ఆరాధకులు చెప్పాలి.

ప్రస్తుతానికి అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు కనిపిస్తున్నప్పటికీ రాజకీయ పలుకుబడి, అధికారిక సంబంధాలు ఉన్నవారికి దారులు మూసుకుపోవడం అన్నది కొద్ది రోజులే ఉంటుంది. మహా అయితే కొద్ది నెలలు ఉండవచ్చు. ఈ లోపు జరగవలసిన ఒప్పందాలు జరుగుతాయి. కొన్ని త్యాగాలు చోటు చేసుకోవచ్చు. అంతిమంగా కొండంత సానుభూతిని వెంటపెట్టుకుని మళ్ళీ ఎన్నికల్లో నిలబడే రోజు జయలలితాకు త్వరలో రాకపోతేనే ఆశ్చర్యం! ఎందుకంటే భారత రాజకీయ, ఆర్ధిక, సామాజిక వ్యవస్ధ పని చేసేది కలిగిన వర్గాల కోసమే.


Filed under: కార్టూన్లు, రాజకీయాలు Tagged: జయలలిత, రాజకీయ అవినీతి

Nalgonda Online News Paper: Nalgonda Online News Paper

2014-09-29 09:41 AM Osmanian King (noreply@blogger.com)
*శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  * తెలంగాణ లో ఏర్పడబోతున్న 12 కొత్త జిల్లాలు * తెలంగాణ లో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు  * తెలంగాణ లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ఫలితాలు * కౌంటింగ్ హాలు వద్ద జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్ధుల ప్రవర్తణా నియమావళి * టిఆరెస్స్ నేత మాజీ నక్సలైట్ కొనాపురి రాములు హత్య *జగ్గారెడ్డి కోడ్ ఉల్లంఘన సహకరించిన TV9 పోలీసుల రాకతో ఇరువర్గాలు పరారీ * మోసంకోసం ధగాకోసం ETV3 * గెలుపే

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: అధిక ఫిస్కల్ లోటు ఋణ సంక్షోభానికి దారి -ఈనాడు

2014-09-29 08:40 AM Sekhar V

ఈ వారం ఈనాడు పత్రికలో ఫిస్కల్ డెఫిసిట్, రెవిన్యూ డెఫిసిట్ ల గురించి చర్చించాను. మార్కెట్ ఎకానమీ ఉన్న ఆర్ధిక వ్యవస్ధల్లో ఫిస్కల్ డెఫిసిట్ (కోశాగార లోటు) కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు నెలకొని ఉన్నప్పుడు, “మన ఎకనమిక్ ఫండమెంటల్స్ స్ధిరంగా ఉన్నాయి. ఇబ్బందేమీ లేదు” అని ఆర్ధిక మంత్రులు, ప్రధాన మంత్రులు మేకపోతు గాంభీర్యంతో చెబుతుంటారు. అలాంటి ఫండమెంటల్స్ లో ఫిస్కల్ డెఫిసిట్ ఒకటి.

ప్రభుత్వాలు రాబడి కంటే ఖర్చు ఎక్కువ చేస్తే అది ఫిస్కల్ డెఫిసిట్ కు దారి తీస్తుంది. ఇంతకుముందు భాగాల్లో చర్చించినట్లు గతంలో ఫిస్కల్ లోటు అసలేమీ లేకుండా బడ్జెట్ లు ప్రతిపాదించడమే తెలివైన ఆర్ధిక నిర్వహణగా భావించేవారు. కానీ సంక్షోభాల ఉరవడి పెరుగుతూ పోతుండడంతో వాటిని కవర్ చేసుకోవలసిన అవసరం పెట్టుబడిదారీ వర్గాలకు వచ్చింది. వారి అవసరాన్ని జాన్ మేనార్డ్ కీన్స్ తన అగ్రిగేట్ డిమాండ్ సూత్రం ద్వారా తీర్చాడు.

కీన్స్ తర్వాత ఇక ఫిస్కల్ లోటు ఆర్ధిక దుబారాకు సంకేతంగా ఉండడం ఆగిపోయింది. పైగా సంక్షోభం నుండి బైటపడేందుకు లోటు బడ్జెట్ లే అవసరం అన్న సౌకర్యం వచ్చేసింది. ఒక దేశ జి.డి.పిలో ఫిస్కల్ లోటు 3 శాతం వరకూ ఉన్నా ఫర్వాలేదని ఆర్ధికవేత్తలు దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ విధంగా పెట్టుబడిదారీ సంక్షోభాలను కీన్స్ గారి లోటు సిద్ధాంతం ఒక మేరకు కవర్ చేసింది. ఆర్ధిక దుబారాను కొలిచేందుకు రెవిన్యూ లోటు పేరుతో మరో పదబంధాన్ని ప్రవేశపెట్టారు. రెవిన్యూ లోటు అంటే ఏమిటో ఆర్టికల్ లో చూడవచ్చు.

యధావిధిగా: ఈనాడు పత్రికలో ఆర్టికల్ చదవాలనుకుంటే కింది లింక్ క్లిక్ చేయండి.

రెవిన్యూ లోటు ఎందుకు లెక్కిస్తారు?

పి.డి.ఎఫ్ డాక్యుమెంట్ లో ఆర్టికల్ చదవడానికి కింది బొమ్మను క్లిక్ చేయగలరు. డౌన్ లోడ్ చేసుకోవడానికి రైట్ క్లిక్ చేయండి.

 Eenadu -29.09.2014


Filed under: ఆర్ధికం Tagged: ఈనాడు, ఋణ సంక్షోభం, కోశాగార లోటు, ఫిస్కల్ డెఫిసిట్, రెవిన్యూ లోటు

24 గంటలు: చీరలమ్ముకుంటున్న శిల్పాషెట్టి

2014-09-29 05:47 AM D Liberty (noreply@blogger.com)
ఒకప్పటి సూపర్ హీరోయిన్.. అందాల రాక్షసి..శిల్పాషెట్టి ఇప్పుడు చీరలమ్ముకొంటోంది. అందేంటి.. హీరోయిన్ గా సంపాదించిన సొమ్ము ఏమైపోయింది.. భర్త రాజ్ కుంద్రా ఆస్తి ఏమైపోయిందని ఆందోళన పడకండి.. ఇదంతా ఆమె సైడ్ బిజినెస్. తన అందచందాలే పెట్టుబడిగా సంపాదనా మార్గాలను నిరంతరం అన్వేషించే శిల్పా.. గతంలోనూ యోగాసనాలు వేసి, ఆ సీడీలు అమ్ముకుని  ప్రపంచాన్ని ఊపేసింది. ఆమె పేరుతో కాస్మోటిక్ ప్రొడక్ట్స్ కూడా సేల్

2014-09-28

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ: భూమికి దూరంగా… గాలిలో తేలుతూ… -ఫోటోలు

2014-09-28 03:38 PM Sekhar V

విమానాలు సరే! ఉన్నచోటనే గాలిలో తేలిపోయే ఆటలు, ఆట వస్తువులు మనిషికి ఇప్పుడు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి ఆటలు, ఆట వస్తువులు ఉనికిలోకి రావడానికి కారణం ఏమిటో తెలుసుకుంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది.

భారీ ఉత్పత్తులు తీయగల యంత్రాలను కనిపెట్టాక ఆర్ధిక పిరమిడ్ లో అగ్రభాగాన తిష్ట వేసిన కలిగిన వర్గాలకు తీరికే తీరిక! ఈ తీరిక సమయం క్రమంగా మానసిక జబ్బులకు దారి తీయడం మొదలైంది. ఈ ప్రమాదాన్ని తప్పించడానికి వారికి అత్యంత తీవ్ర స్ధాయి ఆనందాలను, ఒక్కోసారి పర్వెర్టెడ్ ఆనందలను కూడా, అందించే పరికరాలు అవసరం అయ్యాయి.

సాహసం, ఉత్సాహం, యవ్వనోద్రేకం… ఇలా అనేక బూటకపు సహజత్వాలతో వాటి అవసరాలను సమర్ధించుకున్నారు. వీటిలో కొన్ని సాహసత్వాన్ని ప్రదర్శించడం నిజమే అయినా అది అవసరం లేని సాహసత్వం. కొని తెచ్చుకున్న సాహసత్వం. మనిషిని ఉత్తి పుణ్యానికి ప్రమాదం అంచుకు తీసుకెల్లే సాహసత్వం. అజారుద్దీన్ తనయుడు హైద్రాబాద్ ఔటర్ రింగు రోడ్డులో ద్విచక్ర వాహనాల పందెంలో ప్రాణాలు కోల్పోవడం ఈ కోవలోనిదే.

ఈ కింది ఫోటోలు అలాంటి సాహస క్రీడలకు చెందినవే. వీటిలో అత్యధిక సాహస దృశ్యాలు అత్యంత ఖరీదైనవి. సామాన్య మానవుడికి ఏ మాత్రం అందుబాటులోకి రానివి. కలిగిన వర్గాలలోని ఒకడి ముల్లెని మరొకడి ముల్లెగా క్షణాల్లో మార్చే క్రీడలివి.

మొదటి ఫోటో ఎలా సాధ్యం అయిందో నాకు ఒక పట్టాన అర్ధం కాలేదు, ఇప్పటికీ. రెడ్ బుల్ X-ఫైటర్స్ వరల్డ్ టూర్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా రాజధాని ప్రిటోరియాలో స్పానియార్డ్ మైకేల్ మేలేరో సాధన చేస్తున్నాడని ఫోటో కాప్షన్ లో చెప్పారు. కానీ ఆ సాధన ఎలా చేస్తున్నారో, అసలీ ఫోటో ఎలా సాధ్యపడిందో వివరం లేదు. ఎవరికన్నా తెలిస్తే చెప్పండి.

రెండో ఫోటో గ్రీసు లోని ఒక టూరిస్టు స్పాట్ వద్ద డ్రీమ్ వాకర్ గ్రూపు సభ్యుడు రోప్ జంపింగ్ చేస్తున్న దృశ్యం. ప్రపంచంలో 80 అద్భుతమైన చోట్లలో గాలిలో నుండి జంప్ చేయడం డ్రీమ్ వాకర్ గ్రూప్ లక్ష్యం అట. ఈ లక్ష్యానికి కాస్తన్నా అర్ధం ఉందా? ఎక్కువైపోయిన డబ్బు తగలేయడం తప్ప!

అదే స్పాట్ లో (నవాగీయో బీచ్, గ్రీసు) అదే సాహసికుడు కిందకు పడుతూ పైన నిలబడ్డవారిని ఫోటో తీస్తున్న దృశ్యం మూడో ఫోటో. హాలికాప్టర్ నుండి తాళ్ళతో వేలాడ దీసిన కార్పెట్ పైన కూర్చొని జర్మనీ పియానిస్టు ఒకరు పియానో వాయిస్తున్న దృశ్యం ఆ తర్వాతది. అక్కడ కూర్చొని పియానో వాయిస్తే విని తరించే మహాత్ములెవరో ఆ పియానిస్టుకి తెలియాలి. ఇదంతా ‘ఆరంజ్ పియానో టూర్’ లో భాగంట!

స్పెయిన్ లోని ఓ పట్నంలో ‘డెవిల్ జంప్’ అనే పండగలో భాగంగా ఓ వ్యక్తి పిల్లల మీదుగా ‘దెయ్యపు దూకు’ దూకుతున్న దృశ్యం ఐదో ఫోటో. ఈ దూకుడు లో పాల్గొనే పసి పిల్లలు దెయ్యం బారిన పడే ప్రమాదం నుండి తప్పించుకుంటారట. ఇదో పవిత్రమైన దూకుడు అన్నట్లు!

ఆరో ఫోటో కైట్ సర్ఫింగ్ కు చెందిన దృశ్యం. ఒకేసారి పెద్ద సంఖ్యలో కైట్ సర్ఫింగ్ చేస్తున్న బృందంగా గిన్నీస్ రికార్డ్ బుక్ లో స్ధానం కోసం ఇలా చేస్తున్నారు వీళ్ళు. ఇది కూడా స్పెయిన్ లోనిదే. గత రికార్డు 318 మందితో కూడిన కైట్ సర్ఫింగ్ కాగా వీళ్ళు ఆ రికార్డు బద్దలు కొడుతూ 352 మందితో కైట్ సర్ఫింగ్ చేశారు.

7వ ఫోటో ఆట కాదు. మిలట్రీ శిక్షణలో భాగం. చైనా మిలట్రీ సభ్యుడొకరు టాక్టికల్ ట్రైనింగ్ లో భాగంగా ఇలా మండుతున్న చక్రం లో నుండి దూకుతున్నాడు. ఆ తర్వాత ఫోటోలో తుఫాను గాలులతో చెలగాటం ఆడుతున్న సాహసికుడు. ఆస్ట్రేలియా పట్టణం మెల్ బోర్న్ లో సముద్రపు అలలపైన సర్ఫింగ్ చేస్తూ, అతి వేగంగా వీస్తున్న తుఫాను గాలిని ఆసరా చేసుకుని పయర్ మీదుగా దూకుతున్నాడీ సాహసికుడు. ఏ మాత్రం అంచనా తప్పినా చావు తప్పని సాహసం ఇది. కానీ ఏం లాభం? ప్రయోజనం లేని సాహసం.

9వ ఫోటోలో ఇండోర్ ఏర్పాట్లలో స్కై డైవింగ్ లో శిక్షణ పొందుతున్న దృశ్యం. ఓ పెద్ద ఎత్తైన గాలి ఛాంబర్లలో భారీ ఫ్యాన్ లను ఏర్పాటు చేసి ఇలా గాలిలో దూకే శిక్షణ ఇస్తున్నారు, అమెరికా రాష్ట్రం ఇల్లినాయిస్ లో. పారాచ్యూట్ శిక్షణలో భాగం కనుక దీనివల్ల ఉపయోగం ఉంటుంది.

తర్వాత ఫోటోలో స్లోవేకియాకు చెందిన ఏరోబిక్ గ్రూపు వాళ్ళు గ్లైడర్ల సహాయంతో నింగికి పెయింటింగ్ వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అంతర్జాతీయ ఎయిర్ ఫెస్టివల్ లో భాగంగా ఇది చేస్తున్నారు. ఒక ఇజ్రాయెలీ అరబ్బు యువకుడు ఎత్తైన చోటి నుండి మధ్యధరా సముద్రంలో దూకుతున్న దృశ్యం ఆ తర్వాతి ఫోటో.

స్విట్జర్లాండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 100 సం.ల క్రితం ఉపయోగించిన మొట్టమొదటి యుద్ధ విమాన మోడల్ తో ఓ వాయు సైనికుడు ప్రదర్శన ఇస్తున్న దృశ్యం 12వ ఫోటో లోనిది. 13వ ఫోటోలో ఒక జమ్ము కాశ్మీర్ పోలీసు భారత స్వతంత్ర దినం సందర్భంగా శ్రీనగర్ లో ట్యూబ్ లైట్ ల గుండా దూసుకెళ్తూ ప్రదర్శన ఇస్తున్నాడు.

14వ ఫోటోలో మళ్ళీ స్విట్జర్లాండ్ ఎయిర్ ఫోర్స్ ప్రదర్శనదే. ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా దీపావళి తరహా మతాబాలను గాలిలో ప్రయోగిస్తూ చూపరులకు కనుల విందు చేస్తున్నారు. 15వ ఫోటో: రెడ్ బుల్ ఎయిర్ ఫోర్స్ బృందం వాళ్ళు న్యూయార్క్ నగరంలోని ఫ్రీడం టవర్ మీదుగా గాలిలో ప్రదర్శన ఇస్తున్న దృశ్యం. రెడ్ బుల్ కంపెనీ ఇచ్చే ప్రదర్శనలన్నీ వృధా కార్యక్రమాలే. కంపెనీ ప్రమోషన్ కు తప్ప ఎందుకూ ఉపయోగపడవు.

16వ ఫోటో కూడా నాకు అర్ధం కాలేదు. ఫ్రాన్స్ లో ఫ్లై బోర్డింగ్ చేస్తున్న దృశ్యం అని చెప్పారు గానీ అదేంటో తెలియలేదు.

రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలో ప్యాలస్ స్క్వేర్ లో ఉన్న అలెగ్జాండర్ స్తంభం మీదుగా స్నో మొబైల్ వాహనం ద్వారా దూకుతున్న దృశ్యం ఆ తర్వాత ఫోటో. మంచు దేశంలో ఇలాంటి క్రీడలు సహజమే కావచ్చు. 18వ ఫోటోలో వాటర్ వాల్ జంపింగ్ పోటీల్లో ఒక పోటీదారు పాల్గొంటున్న దృశ్యం. ఇది మొదటి అంతర్జాతీయ వాటర్ ఫాల్ జంపింగ్ పోటీ అట. బోస్నియా నగరం జాజ్కే లో జరిగింది.

చైనాలోని షావోలిన్ టెంపుల్ మార్షల్ ఆర్ట్క్స్ కళాకారులు ఒక యుద్ధ విద్యా ప్రదర్శన కోసం రిహార్సల్ వేస్తున్న దృశ్యం ఆ తర్వాత ఫోటో. నాన్ జింగ్ యూత్ ఒలింపిక్స్ లో భాగంగా ఈ విద్యను ప్రదర్శిస్తారు.

చివరి ఫోటో హై డ్రైవింగ్ పోటీలోని ఓ దృశ్యం. కొసోవో దేశంలో జాకోవా నగరంలో ఈ ఫోటీలు జరుగుతాయి. ఒక వంతెన మీది నుండి వివిధ ఆకారాల్లో దూకుతూ పోటీ పడడం ఈ పోటీల లక్ష్యం.

Photos: The Atlantic

01 Red Bull X-Fighters World Tour -Pretoria 02 Dream walker jump -Greece 03 Dream walker tour -Navagio, Greece 04 Piano on Flying Carpet -Munich, Germany 05 Devil's Jump -Spain 06 Most Kite Surfers attempt -Tarifa, Spain 07 Ring of Fire jumping -Chinese Soldier 08 Surfing over pier -Melbourne, Australia 09 Sky diving practice -Illinois, USA 10 Sky painting -Slovakia International Air Fest 11 Meditarranean jumping -Israel 12 Swiss first Air Force plane model 13 Jammu Kashmir Police feat 14 Swiss Air Force air show 15 Red Bull Air Force fly show -Manhattan, New York 16 Flyboard practice -Nice, France 17 Snowmobile jumping -St. Petersburg, Russia 18 Waterfall jumping competition -Bosnia 19 Shaolin Martial Arts school rehearsal 20 High diving competition -Kosovo

 


Filed under: సమాజం సంస్కృతి Tagged: ఫోటోలు

2014-09-21

SEVA: బాపు బొమ్మలు

2014-09-21 11:25 PM SEVA

prasad_atluriపడుచుపిల్ల పరువాల వంపుల్లో
వాలుజడ వయ్యారపు మలుపుల్లో
రాధాకృష్ణుల తన్మయత్వపు చూపుల్లో
బుడుగ్గాడి బుడిబుడి అడుగుల్లో
ఎంత ఒద్దికగా ఒదిగి పోవాలో
ఆ గీతలకు నిర్దుష్టంగా తెలుసు
అందుకే అవి బాపు బొమ్మలు
అచ్చమైన తెలుగు లోగిళ్ళు
అజరామరపు చిత్రకళ ఆనవాళ్ళు..

bapu bommalu-sevaచిత్రసీమలో ముత్యమంత ముగ్గేసి
సీతాకల్యాణం చేసి రామరాజ్యం స్థాపించి
సంపూర్ణ రామాయణం చూపించినా..
భర్తను పెళ్ళికొడుకు చేసి
భార్యను మిస్టర్ పెళ్ళాం చేసి
కళ్యాణ తాంబూలాలు అందించి
పెళ్ళిపుస్తకం కలిపి కుట్టినా
తూరుపు వెళ్ళే రైలు సాక్షిగా
అవి మన బాపు దృశ్యకావ్యాలు
మనసుకు హత్తుకున్న మాధుర్యాలు ..

సహచరుడు రమణతో
స్నేహ బంధం కొనసాగించడానికో
బొమ్మలకు ప్రాణం పొయ్యటంలో
బ్రమ్మకొచ్చిన సందేహం తీర్చడానికో
అకస్మాత్తుగా స్వర్గానికి వెళ్లినట్టున్నావ్
నీ గీతల్లోని గిలిగింతలు తగలక
మా చిత్రకళ చిన్నబోదా?!..
నీ చిత్రాల్లోని తెలుగుదనం కానరాక
మా చిత్రసీమ బోసిపోదా?!..
మరణమంటే మరుగైపోవటమేనా?

మనిషిలో నైపుణ్యం… మనిషితో పోవటమేనా?
ఉయ్ మిస్ యు బాపు …!!

ప్రసాద్ అట్లూరి

Share

SEVA: మైహోంకు గేమింగ్‌ సిటీ భూములే

2014-09-21 11:21 PM SEVA

హైదరాబాద్‌ : ప్రతిష్ఠాత్మకమైన హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ స్థలాల బదలాయింపుపై తాను చేసిన ఆరోపణలపై ప్ర భుత్వం, అధికారులు తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలపై పరువునష్టం కేసు దాఖలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొ నేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో రేవంత్‌ రెడ్డి విలేకరులతో ఆయన మాట్లాడారు.

revanth-reddyమెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ స్థలాల బదాలాయింపునకు సంబంధించిన ఫైళ్లన్నిం టినీ అఖిలపక్షం సమావేశంలో పెట్టాలని ప్రభుత్వా న్ని డిమాండ్‌ చేశారు. స్పీకర్‌ వద్ద ఉంచినా తమకు సమ్మతమేనన్నారు. మెట్రో భూకేటాయింపులు, బదలాయింపుల వివాదంపై చర్చకు ఐటీ మంత్రి కేటీఆర్‌ ముందుకు రావాలని సవాల్‌ విసిరారు. ఐటీఐఆర్‌లో భాగం గా రూ.350 కోట్లకు గేమింగ్‌ సిటీ కో సం సుమారు 8 లక్షల చదరపు అడు గుల స్థలాన్ని కేటాయించడం ద్వారా 15వేల మందికి ఉపాధి లభిస్తుందని అప్పట్లో ఏపీఐఐసీ వీసీఎండీ జయేష్‌ రంజన్‌ ప్రకటించారని రేవంత్‌ గుర్తు చేశారు. అలాంటి గేమింగ్‌ సిటీకి కేటాయించిన స్థలాన్ని ఆక్వాస్పేస్‌ డెవలపర్స్‌కు ఎందుకు బదలాయించారని ఆయన ప్రశ్నించారు. ఈ ఏడాది జనవరిలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి గేమింగ్‌ సిటీ ప్రారంభోత్సవానికి వెళితే టీ ఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి మైహోం రామేశ్వర్‌రావు ధర్నా చేసి అడ్డుకున్నారని, అప్పటి ఐటీ మంత్రి పొ న్నా టల లక్ష్మయ్యను బెదిరించారని ఆరోపించారు. గేమింగ్‌ సిటీ స్థలంపై కన్నేయడం వల్లే వారు ఈ విధంగా చేశారన్నారు. నాటి ధర్నాకు సంబంధించిన సీడీలను రేవంత్‌ విలేకరులకు అందజేశారు. ఈ ఏడాది జూన్‌2న టీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టగానే జూన్‌ 27న జీవో ఎంఎస్‌ 6ను జారీ చేసి, స్టాంప్‌ డ్యూటీని మినహాయించి ఆగస్టులో మైహోంకు భూముల బదలాయింపును పూర్తి చేసినట్లు టీఎస్‌ ఐఐసీ వీసీఎండీ వెంకట్‌ నర్సింహారెడ్డి శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో స్పష్టం చేశారని వివరించారు. ఇది అక్రమ బదలాయింపు అని, ఇలాంటి బదలాయింపులు చేస్తే తన ఉద్యోగానికి ఎసరు వస్తుందనే భయంతో జయేష్‌ రంజన్‌ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని తెలిపారు. సుమారు రూ.700 కోట్లు చెల్లించిన డీఎల్‌ఎఫ్‌కు ఏడేళ్లు గడిచినా స్థలాన్ని కేటాయించని ప్రభుత్వం రామేశ్వరరావుకు కేవలం ఏడు నెలలు గడవక ముందే స్థలాన్ని కేటాయించిందటే, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు ఈ పని చేసిందో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ట్రాన్స్‌కో, గేమింగ్‌ సిటీ, పోలీస్‌ శాఖకు కేటాయించిన స్థలాలను మైహోం సిటీకి బదలాయిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ బదలాయింపులతో సుమారు రూ.1000 నుంచి 1500 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం జరుగుతుందన్నా రు. భూబదలాయింపులను రద్దు చేయని పక్షంలో శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. బలప్రయోగంతో దాటవేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. తాను చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తామని ఆక్వాస్పేస్‌ డెవలపర్స్‌ చేసిన ప్రకటను స్వాగతిస్తున్నట్లు రేవంత్‌ ప్రకటించారు. కాగా, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పీర్ల పండుగలో బుడ్డర్‌ఖాన్‌ లాంటివారని ఎద్దేవా చేశా రు. ఆయనలా మాట్లాడి, తన స్థాయిని దిగజార్చుకోలేనని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Share

2014-09-20

Lok Satta News: ఫీజు జమైతేనే ధ్రువీకరణపత్రాలు

2014-09-20 12:17 PM tnsatish (noreply@blogger.com)
Courtesy: Eenadu

2014-09-14

24 గంటలు: బెజవాడలో మెట్రో రైల్ పరుగులు

2014-09-14 01:31 PM D Liberty (noreply@blogger.com)
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడతో పాటు చుట్టుపక్కల నగరాలైన గుంటూరు, తెనాలి, మంగళగిరిలకు మెట్రో రైలు ప్రాజెక్టును ఇస్తామంటూ విభజన చట్టంలో చెప్పింది కేంద్రం. అయితే, ఈ మెట్రో రైలు బెజవాడలో పరుగులు పెడితే ఎలా ఉంటుందన్నదానికి దృశ్యరూపం ఇచ్చారు ఎలిమెంట్ స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ విద్యార్థులు. అయితే మెట్రో రైలు బదులు, మోనో రైలును మోడల్ గా తీసుకున్నారు. విజయవాడలోని ప్రధాన ప్రాంతాలను వీడియో తీసి,

2014-09-13

24 గంటలు: బాబు కోరిక తీరుతుందా..?

2014-09-13 02:47 AM D Liberty (noreply@blogger.com)
సింగపూర్ తరహాలో ఏపీ రాజధాని నిర్మాణానికి కసరత్తును వేగవంతం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే ఓ సలహా మండలి, మరో సబ్ కమిటీ పనిచేస్తుండగా.. ఇటీవలే అంతర్జాతీయ కన్సెల్టెన్సీ మెకన్సీ నుంచి ఓ నివేదికను కూడా తెప్పించుకుంది. రాజధానిలో 40 అంతస్థుల భవనాలను నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఆ నివేదికలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలో కృష్ణానదికి ఇరువైపులా

2014-09-11

24 గంటలు: శ్వేత చేస్తే తప్పు.. సన్నీ చేస్తే ఒప్పా..?

2014-09-11 03:42 AM D Liberty (noreply@blogger.com)
కాలగ్రహణమో.. దురదృష్టమో.. సినీనటి శ్వేతబసు ప్రసాద్ పోలీసులకు పట్టుబడింది. సెక్స్ రాకెట్ నిర్వహిస్తోందంటూ ఆమె పరువును బజారున పడేసింది పోలీస్ వ్యవస్థ, మీడియా. శ్వేత పై రోజుకో కథనంతో సొమ్ములు సంపాదించుకునే పనిలో పడింది నేషనల్ మీడియా. సినిమా అవకాశాలు తగ్గిపోయి, ఏమీ చేయలేని పరిస్థితిల్లో ఈ కూపంలోకి దిగానని నిజాయితీగానే ఒప్పుకుంది శ్వేత. బాలనటిగా జాతీయ అవార్డు అందుకుని, ఎంతో టాలెంట్ ఉన్న ఆమెకు

2014-08-07

Nalgonda Online News Paper: PG Colleges in Nalgonda

2014-08-07 10:35 AM Osmanian King (noreply@blogger.com)
Sai Bharathi Degree and PG College in Nalgonda Kakathiya PG College Nalgonda Nalanda PG College Nalgonda

2014-05-26

chandranna: 'Mahanadu' kicks off tomorrow

2014-05-26 01:44 PM Arjun p (noreply@blogger.com)
HYDERABAD: A rejuvenated Telugu Desam Party aims to become a national party from being a regional outfit as it sits for its two-day annual conclave 'Mahanadu' from tomorrow to deliberate the issue among other things.Victory in recent elections to the (new) Andhra Pradesh Assembly has come as a major boost to the party that was confined to the opposition in the last ten years. The TDP is set to

2014-05-22

chandranna: (శీర్షిక లేదు)

2014-05-22 01:56 PM Arjun p (noreply@blogger.com)
Every city in Seema-Andhra will become a growth engine, creating jobs and driving development. Visakhapatnam – Shipping hub Vijayawada – Automobile industries Guntur – Agriculture and allied industries Tirupathi – Processing of agricultural produce CBN will bring back Seema-Andhra on the path to prosperity.

2014-05-13

Manyaseema.com RSS Feed: చరిత్రలో ఈ రోజు/మే 13

2014-05-13 12:09 AM
* 1857 : మలేరియా వ్యాధి కారకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ జననం.(మ.1932)
* 1905 : భారత మాజీ

Manyaseema.com RSS Feed: ‘పైడి’ పలుకులు...

2014-05-13 12:08 AM
* ప్రగల్బాలు పలికేవారు పిసరంత కూడా సాధించలేరు.
* ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాన్ని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక

2014-05-04

2014-03-08

ప్రజాశక్తి: Thammineni Veerabhadram Cycle Yatra Photos

2014-03-08 02:56 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
Thammineni Veerabhadram CPI(M) Thammineni Veerabhadram CPI(M) Telangana Secretary

ప్రజాశక్తి: సిపిఐ(ఎం) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పి.మధు (P.Madhu CPI(M) Photos)

2014-03-08 01:32 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
''పెనుమల్లి మధు..'' ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపడంలోనూ.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించడంలోనూ.. ఆయన శైలి ప్రత్యేకం. దివిసీమలో ఉప్పెన వచ్చిన సమయంలోనూ.. మహబూబ్‌నగర్‌ జిల్లాను కరువు కబళించిన సమయంలోనూ.. మధు నిర్వహించిన పాత్ర అనిర్వచనీయమైంది. ప్రజల పక్షాన ఆయన నిర్వహించిన అసాధారణ పోరాటాలు, పార్టీ విధానం పట్ల ఆయన చూపించిన నిబద్ధతే ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర

ప్రజాశక్తి: పార్టీ విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తా : తమ్మినేని వీరభద్రం(Thammineni Veerabhadram Photos)

2014-03-08 12:44 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
పార్టీ ఎంచుకున్న రాజకీయ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం ఎంబీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ద్వారా ప్రజలకు ఎన్నో విధాలా మేలు జరుగుతుందని పాలక వర్గాలు పేర్కొన్నాయన్నారు. వీటిని ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మారని తెలిపారు. రాబోయే కాలంలో

2014-02-17

ప్రజాశక్తి: ఢిల్లీ-అటిన్షన్-హైదరాబాద్

2014-02-17 11:53 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
ఆంధ్ర ప్రదేశ్‌ విభజన బిల్లుపై కదలికలు వేగం పుంజుకున్నాయి. కాంగ్రెస్‌ అధిష్టానం చకచకా పావులు కదిపింది.బిల్లుపై చర్చ ప్రారంభించడమే గాక ఓటింగు కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. బిజెపి కూడా సహకరించే ధోరణిలో వుందంటున్నారు. ఆ పార్టీ నేతలతో స్వయంగా సోనియా గాంధీ ఈ విషయం ప్రస్తావించడం, సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలతో రాహుల్‌ గాంధీ మంతనాలు జరపడం, కొన్ని సవరణలపై కె.సి.ఆర్‌ కూడా సుముఖత

ప్రజాశక్తి: ఎన్నికల చిత్తంబరం

2014-02-17 11:52 PM ప్రజాశక్తి (noreply@blogger.com)
ఆర్థిక మంత్రి చిదంబరం ఆఖరి అనామతు పద్దులో అనుకున్నంత పని చేశాడు. అంతా బావున్నట్టు చెబుతూనే అనేక భారాలకు ద్వారాలు తెరిచాడు. ఉత్పత్తి రంగం వృద్ధి గొప్పలు ఉత్తుత్తివని తేలిపోగా వ్యవ'సాయం' మిథ్యగా మిగిల్చాడు. చెప్పిన అంచనాలకన్నా ప్రణాళికా కేటాయింపు అమాంతం 66 వేల కోట్లు కత్తెర వేశాడు. కేంద్ర ప్రణాళికకూ వివిధ రాష్ట్రాలకూ ఇచ్చే సహాయం మొత్తం 80 వేల కోట్లకు పైగా తెగ్గోశాడు. అవసరాలకు

2012-03-07

Mulakkada. Latest Blog Articles From Telugu News: సినిమాలను పైరసీ చేసే యంగ్ హీరో

2012-03-07 12:00 AM

సినిమాలను పైరసీ చేసి అమ్మటం నేరం... అలాగే సినిమా వాళ్ళకు పైరసీ చేసేవాళ్లంటే మహా ...

Mulakkada. Latest Blog Articles From Telugu News: జగన్ హవా తగ్గుతోంది: జెసి

2012-03-07 12:00 AM

జగన్ హవా తగ్గుతోంది,కడపలో ఉన్నంత ఉండదు: ...

2011-01-27

సిరా వెలుగు: ప్రభుత్వంపై విశ్వాసాన్ని నిరూపించుకోండి

2011-01-27 09:31 AM సిరా వెలుగు (noreply@blogger.com)
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దమ్ముంటే తన ప్రభుత్వంపై విశ్వాసాన్ని నిరూపించుకోవాలని, తాము మాత్రం పదవులకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని జగన్‌ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సవాల్‌ విసిరారు. తమ రాజీనామా కోరడానికి ముందు ముఖ్యమంత్రితో సహా వైఎస్సార్‌ ఫోటో పెట్టుకుని గెలిచిన ప్రతిఒక్కరూ కూడా రాజీనామా చేసి తిరిగి గెలవాలని అన్నారు. వైఎస్‌ ఫోటో లేకుండా తాము స్వతంత్రంగా, సొంతంగా గెలిచామనే ధైర్యముంటే
2013-01-18
2013-01-18 05:08 PM manyasima - మన్యసీమ
MANYASEEMA TELUGU DAILY http://www.manyaseema.com/index.php?a=epaperFiled under: వార్తలు
2013-01-18 04:37 PM manyasima - మన్యసీమ
http://www.scribd.com/fullscreen/120973838Filed under: వార్తలు
2012-05-19
2012-05-19 07:07 PM swamy (noreply@blogger.com) - దృశ్యం
మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న భాను కిరణ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భాను గన్‌మన్‌గా పని చేసిన మధుమోహన్‌ను సీఐడీ అధికారులు విచారించిన సందర్భంగా కొత్త విషయాలు బయట పడుతున్నాయి. హత్యకు గురయ్యే కొన్ని రోజుల ముందు భానుతో కలిసి సూరి గోవా వెళ్ళాడు. వీరితో పాటు సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ, ఇద్దరు హీరోయిన్లు, ఓ ప్రముఖ హీరో కూడా వీరితో ఉన్నారు.
2012-05-07
2012-05-07 12:01 PM swamy (noreply@blogger.com) - దృశ్యం
న్యూ టాలెంట్స్ కు బంపర్ ఆఫర్స్!మీకు సినీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాలని ఉందా..? నటీనటులుగా మారాలని ఉందా..?దర్శకత్వ ప్రతిభ చూపించాలని ఉందా..?స్ర్కిప్టు కూడా అద్భుతంగా రాయగలరా..?అయితే మీ కోసం అద్భుత అవకాశాలు...! సినిమా రంగంలో రాణించాలనే ఉత్సాహంతో ఉన్న కొత్త నటీనటులు, దర్శకులకు ఆర్ ఆర్ మూవీమేకర్స్ బ్యానర్ బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారు.. Read More Story
2009-12-16
2009-12-16 04:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-07-27
2009-07-27 02:07 PM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Priyanka Kothari Hot & Sexy Images
2009-05-18
2009-05-18 03:13 PM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
శ్రీలంకలో కొన్ని దశాబ్దాలపాటు వేర్పాటువాద ఉద్యమానికి నేతృత్వం వహించిన ఎల్టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్‌ శ్రీలంక దళాల కాల్పుల్లో మృత్యువాత పడ్డాడు. ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సైనిక దళాలతో సుమారు రెండున్నర గంటలపాటు ప్రభాకరన్ సేన ఎదురు కాల్పులకు దిగింది. దీంతో సహనం కోల్పోయిన సైన్యం ప్రభాకరన్ ప్రయాణిస్తున్న వాహనంపై రాకేట్ లాంచర్‌ను వదిలారు. దీంతో వాహనంలో ఉన్న
2009-05-18 02:46 PM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
రవితేజ చిత్రమంటేనే అటు వినోదం, ఇటు యాక్షన్ కలగలసి ఉంటుందని ఊహించే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిన చిత్రం కిక్. రవితేజ, ఇలియానాలు కలిసి నటించిన ఈ కిక్ చిత్రం ఆద్యంతం సరదాగా సాగిపోతూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వెంకట్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.రవితేజ చిత్రాలంటేనే చాలా హుషారుగా ఉండి పెద్దలతోపాటు పిల్లలను కూడా ఎంటర్‌టైన్ చేసేలా
2009-04-22
2009-04-22 05:46 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-04-10
2009-04-10 07:19 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Earth is an award-winning British natural history film from the BBC Natural History Unit. It was released in cinemas internationally in 2007 and is due to be released in the US on 22 April 2009. The British version was narrated by Patrick Stewart and the US version is to be narrated by James Earl Jones. A UK-German co-production, it was filmed entirely in high-definition and 35mm using the
2009-04-03
2009-04-03 06:08 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Cloudy with a Chance of Meatballs is a 2009 computer-animated forthcoming 3D film produced by Sony Pictures Animation and distributed by Columbia Pictures. It is scheduled for a theatrical release on September 18, 2009 and is inspired by the children's book of the same name by Judi Barrett and Ron Barrett. It is the Sony Pictures Animation's third film. Whereas the book had one speaking
2009-03-30
2009-03-30 06:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-28
2009-03-28 12:12 PM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
రామ్ చరణ్ తేజ ఈ ఉగాది నాడు తన 24 వ జన్మ దినం జరుపుకుంటున్నాడు. ఈ ఉగాది అతనికి, ఆయన తండ్రి చిరంజీవికి ఎన్నో శుభాలు తెచ్చి పెట్టింది. గత వారం రామ్ చరణ్ ఒక సాఫ్ట్ డ్రింక్ కు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. నేడు చిరంజీవి తన ప్రజారాజ్యం తొలి జాబితా విడుదల చేశారు. ఉగాది రోజులే ప్రజారాజ్యం ఉమ్మడి గుర్తుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రజారాజ్యానికి వారు కోరుకున్న రైలు బండి గుర్తు
2009-03-16
2009-03-16 05:24 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
ఛార్మి హీరోయిన్ గా చేస్తున్న మనోరమ. మీ శ్రేయాభిలాషి చిత్రంతో పేరుతెచ్చుకున్న ఈశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. మంత్ర ఫీవర్ ఈ మధ్యన తగ్గిందని వరస ఫ్లాపులు ఛార్మికి గుర్తు చేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం వర్కవుట్ అయితేనే ఫలితముంటుందని ఛార్మి ఎదురుచూస్తోంది. టెర్రరిస్టుని మార్చే కథతో ఓ థ్రిల్లర్ లా ఈ చిత్రం రాబోతోందని వినికిడి. మస్త్ వంటి చెత్త సినిమాతో తెలుగు లో ప్రవేశించిన జీ మోషన్
2009-03-14
2009-03-14 07:04 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-14 06:58 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Imagine if you’d had a 6-foot monster to help you through the tough times when you were eleven. Someone to live in your backyard shed, hide out in the attic with you watching monster movies, defend you against bullies, someone to be your best pal, always. And the amazing thing? You’re the only one who knows he exists. This is exactly what happens to WILLY when the stuffed toy he had as a child
2009-03-14 06:37 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
“X-Men Origins: Wolverine” WallpapersVenkateshwarlu Bulemoni
2009-03-12
2009-03-12 09:14 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
అఫిషియల్ ట్రైలెర్
2009-03-11
2009-03-11 05:30 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Mary and Max is a forthcoming stop motion clay-animation feature film from Australia, based on real story, directed and written by Adam Elliot. The voice cast Toni Collette, Philip Seymour Hoffman, and Eric Bana. The film premiered on the opening night of the 2009 Sundance Film Festival. Basic PlotThe film tell the story of the unlikely pen-pal friendship between Mary, a chubby lonely
2009-03-10
2009-03-10 08:04 AM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
కష్టాల్లో ఉన్న పార్టీని రక్షించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ పేర్కొన్నారు. అయితే నేడు రాజకీయాల్లోకి వస్తున్న నటులంతా ఏదో ఒకటి ఆశించే వస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న బాలకృష్ణ నెల్లూరులో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ ప్రజలకోసమే రాజకీయాల్లోకి
2009-03-10 07:58 AM Webdunia (noreply@blogger.com) - Webdunia Telugu
సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణమ ఈ హోళికా పూర్ణిమ. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమ కూడాను. అందుకే పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఓ ఉత్సవంలా జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సుఖదుఃఖాల సమ్మిళతంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనంద సాగరంలో మునిగిపోతారు. ఆ రోజన హోళీ జరుపుకున్న ప్రతి ఒక్కరు
2009-03-07
2009-03-07 05:55 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-03-02
2009-03-02 06:00 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-23
2009-02-23 10:08 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-21
2009-02-21 06:40 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
This new IMAX adventure transports moviegoers to some of the most exotic and isolated undersea locations on Earth, including Southern Australia, New Guinea and others in the Indo-Pacific region, allowing them to experience face-to-face encounters with some of the most mysterious and stunning creatures of the sea. It offers a uniquely inspirational and entertaining way to explore the beauty and
2009-02-21 06:37 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Tollywood lead actress Charmme’s latest Telugu film 16 days is all set to release on 20 February. This film deals with 16-day-long period in the life of the lead pair, besides the situations that would surround them. Charmme is playing the role of Angelina who has the special talent of mimicking Pawan Kalyan, Ravi Teja, Sunil etc. Arvind plays male lead.
2009-02-20
2009-02-20 05:44 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-17
2009-02-17 05:47 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
2009-02-14
2009-02-14 05:44 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Sontha Vooru is a Telugu Movie, starring Raja and Theertha as the lead pair, directed by P Sunil Kumar Reddy. Produced by Y Ravindra Babu & Kishore Baasireddy, and music composed by . The film Shooting is in progress.
2009-02-12
2009-02-12 10:56 AM PSTL (noreply@blogger.com) - పిరమిడ్ సాయిమిర థియేటర్ లిమిటెడ్
Shriya Saran (born September 11, 1982) is an Indian film actress. She began her career acting in music videos, while also attending an acting studio to follow her dream to act. After her debut in 2001 with Ishtam, she gained Telugu cinema's attention in 2002 by playing the role of Bhanu in Santhosham, her first major hit. Following the film she appeared in several Telugu films with prominent
పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..