2013-05-29
samhitha: (శీర్షిక లేదు)
వందేమాతరం: కాక్టస్ పువ్వులు
Pictures: Lily-1
2013-05-28
Rani: ఏం చేయాలి?
ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ,మనం తీసుకొనే ఆహారం విషయమే చూడండి ,ఈ రోజుల్లో మన ఆహారంలో రుచికే మొదటి ప్రాధాన్యం . ఆహార నిపుణులు చెప్పిన విధంగా ఆరోగ్యకరంగా ,వండుదామని ,
ప్రయత్నిస్తే ,తినడానికిఇంట్లో అందరికీ కష్టమే . అయినా చేస్తూనే ఉంటాననుకోండి .
ఒక రోజు పేపర్లో రోజుకు 5కప్పుల కాఫీ తాగినా పరవాలేదని ,అధ్యయనాలు రుజువు చేశాయని, వస్తుంది ,
ఈ ఇంకో నాలుగు రోజులు పోయాక ,కాఫీ ,టీ ,మానేస్తే గుండె జబ్బుల ముప్పు ,సగానికి తగ్గిపోతుందని ,మరొక వార్త. ఈ రెండింట్లో దేన్నీ అనుసరించాలా ,అని కాస్సేపు ఆలోచన .
కోడిగుడ్డు లోని పచ్చ సోన తినొద్దని డాక్టర్లు చెబుతారు . ఈ మధ్య ఒక పేపర్లో రోజుకు నాలుగు పచ్చ సోనలు తిన్నా ఏం పర్వాలేదట . అది చదివి తినడం మొదలు పెట్టామా ,తరువాత వచ్చే సమస్యలకు మనదే భాద్యత .
సాధారణంగా డైటీషియన్లు ఉపాహారం మానవద్దు . తప్పనిసరిగా తీసుకోవాలని చెబుతారు . కొన్ని పదుల సంవత్సరాల నుండీ మనం కూడా టిఫిన్ ఉదయాన్నే తినడానికి ,అలవాటు పడ్డాము . అది కూడా ఇడ్లి , దోశ
లాంటివి మంచివి అంటారు . కానీ ఈ మధ్య ఒక ఆయుర్వేద డాక్టర్ గారు వ్రాసిన ప్రకారం ఉదయం టిఫిన్ల రూపం లో మినపప్పు వాడకం ఎక్కువ అయినందు వల్లనే ఇపుడు వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు, ఎక్కువ అవుతున్నాయట . ఉదయాన్నే పెరుగన్నం తింటే మంచిదనీ చెప్పారాయన . అది ఎంతమందికి సహిస్తుంది చెప్పండి? వేడి వేడి టిఫిన్లకు అలవాటు పడిపోయిన ప్రాణాలివి .
ఇట్లా విరుద్ధంగా ఉండే విషయాలు చదివినపుడు ,చాలా తికమకగా ఉండి ,దేన్నీ అనుసరించాలా అని కాస్సేపు ఆలోచించాలి, మనకు లభించే సమయాన్ని బట్టీ ,మన పని వేళలను బట్టీ , మన వయసును ,మన శరీర తత్వాన్ని బట్టి ,మనకు ఏది నప్పుతుందో ,దాన్ని ప్రకారం మనం ఆహారాన్ని తీసుకొంటే , చాలా ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు .
సౌకర్యాలు ఎక్కువ అయిన ఈరోజుల్లో ,వాటితో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ గానే ఉంటున్నాయి. ఏం చేద్దాం? ఏ విషయం లోనైనా సమతుల్యత పాటించడానికి ప్రయత్నం చేయడమే మనం చేయగలిగినది .
,
2013-05-27
Nature Tints: Pearl Flower
2013-05-26
Pictures: పిచ్చుకల జంట
2013-05-25
samhitha: Green
Rani: Lovebirds breakfast
2013-05-23
చూడ చక్కని: గడ్డి - పూలు
2013-05-22
My Pics: Bleeding Hearts 2
Rani: వాము అన్నము:
వాము అన్నము. రాత్రి మిగిలిన అన్నం తో చేసిన నిమ్మకాయపులిహోర తినీతినీ,విసుగు అన్పిస్తే ఒకసారి ఈ వాము అన్నం ప్రయత్నించి చూడండి. కావలసినవి. మినపప్పు ఆవాలు వాము ఎండుమిర్చి పల్లీలు కరివేపాకు ఇంగువ నూనె ఉప్పు అన్నం పైన చెప్పిన తాలింపు దినుసులన్నీ మనం తీసుకొనే అన్నానికి సరిపోను తీసుకొవాలి. అన్నం విడివిడిగా చిదుపుకొని సరిపడా ఉప్పు ,ఒక చెంచా నూనె వేసుకొని బాగా కలుపుకొవాలి. నూనె వేడి చేసి పల్లీలు,మినపప్పు,ఆవాలు,కొంచెం ఎక్కువ మోతాదులో వాము,ఎండుమిర్చి,కరివేపాకు ఇంగువ,వరుసగా వేసి దోరగా వేగిన తరువాత, అన్నం లో వేసి,కరివేపాకు,ఎండుమిర్చి చేత్తో నలిపి తాలింపు అంతా అన్నంతో బాగా కలిపితే,జీర్ణశక్తికి బాగా ఉపయోగపడే ,వాము అన్నం తయారు. చేసి చూడండి. అన్నం #Telugu
మధుర చిత్రాలు: Spring Blooms - 10 - Bleeding Hearts
My Pics: Bleeding Hearts
2013-05-21
Rani: (శీర్షిక లేదు)
Rani: candy vs love birds:
నా పాత టపాలు చూసిన వారికి తెలిసే ఉంటుంది . candy అంటే మా పెంపుడు కుక్క అనడం కన్నా, family member
అనాలి. ఇంట్లో దానిదే రాజ్యం . అందుకే పక్షుల్ని తీసికోనిరావడం దానికి అస్సలు ఇష్టం లెదు.
రెండు రోజుల క్రితం ఆఫీస్ నుండి వస్తూ మావారు రెండు love birds తీసికొని వచ్చారు . మిట్ట మధ్యాహ్నం ఎండలో పెట్టి వాటిని అమ్ముతుంటే జాలి అన్పించి తీసుకోన్నారట . ఈ ఎండలకు మనమే తట్టుకోలేక పోతున్నాం . ఇంట్లో కాస్త నీడలో పెట్టవచ్చు ,అని అనుకున్నారట .
ఇక చూడాలి దాని అరుపులు . మేం వాటి దగ్గరకు ,వెడితే చాలు అరవడం మొదలు . వాటిని పలకరిస్తే దీనికి కోపం . కుక్క కు కోపమేమిటి ? అనుకుంటున్నారా? దానికి అన్నీ అర్ధం అవుతాయండీ! అది లేకుండా చూసి వాటిని పలకరించాల్సివస్తుంది . అది లేనపుడే వాటికి నీరు ,మేత పెట్టడం . చిన్న చిన్న పిట్టలు, ముద్దుగా ఉన్నాయ్.మొదటి రోజు ఈ అరుపులకు భయపడి, పంజరానికి అతక్కుపోయాయి . ఇపుడు చక్కగా అరుస్తూ ఒకదాన్ని ఒకటి ముక్కులతో పొడుచుకుంటూ ఆడుకుంటున్నాయి .
చిత్రాలు మీ టైటిల్ నా ఫోటో: మీ టైటిల్ నా ఫోటో
చిత్రాలు మీ టైటిల్ నా ఫోటో: మీ టైటిల్ నా ఫోటో
2013-05-20
చిత్రాలు మీ టైటిల్ నా ఫోటో: మీ టైటిల్ నా ఫోటో
చిత్రాలు మీ టైటిల్ నా ఫోటో: మీ టైటిల్ నా ఫోటో
పక్షులు: గిజిగాడు -2
19 May 2013
Pictures: ఆకాశవీధి లో
2013-05-19
మధుర చిత్రాలు: పిచ్చుకలు (Sparrows)
Rani: మాఊరు
పశ్చిమ గోదావరి జిల్లా లో ఉంది .
చూసారుగా మా ఊరిలోని పచ్చని పొలాలు.
చిన్న తిరుపతి గా పిలవబడే ద్వారకాతిరుమల మా జిల్లా లోనే ఉంది .
ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన పంచారామాలలో రెండు మా జిల్లా లోనే ఉన్నాయి.
మా ఊరి ప్రక్కనే ఉన్న భీమవరం లోని గునుపూడి, లోని "సోమారామం" లో సోమేశ్వర స్వామి ,
పాలకొల్లు లోని క్షీరారామం లో ,క్షీరా రామ లింగేశ్వర స్వామి కొలువైఉన్నారు.
పెనుగొండ లో, వైశ్యుల ఆరాధ్యదేవత అయిన కన్యకా పరమేశ్వరి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ,
చివరిగా ఒక మాట, నాన్ వెజ్ పచ్చళ్ళ కు భీమవరం పెట్టింది పేరు,
2013-05-18
Rani: సినిమాలే లేవా?
ఈ రోజెందుకో ఖాళీగా ఉండి ఏమీ తోచక సినిమాకు వెడదామని అన్పించి పేపర్ చేతిలోకి తీసుకున్నాను. నగరం లో ఎక్కడెక్కడ, ఏమేమి సినిమాలు, ఆడుతున్నాయో చూద్దామని. తెలుగు సినిమాల జాబితా లో పేర్లన్నీ చదువుతుంటేనే భయం వేసి సినిమా ఆలోచనే విరమించుకున్నాము.
లవ్ టచ్
లవ్ సైకిల్
తడా ఖా
మిడత
పైన వ్రాసినవి మచ్చుకు కొన్ని మాత్రమె. ఇంకా కొన్ని డబ్బింగ్ చిత్రాలు,
ప్రేమ కధలు పెద్ద వాళ్ళం కూడా చూసేలా తీస్తే పిల్లలు చూడరా? ప్రేమ కధకు కుటుంబం ,దానితో అనుబంధాలు ,గురించి తీసిన సినిమాలు, ఎన్నో విజయ వంతమైనాయి. పది సంవత్సరాల క్రిందట తీసిన కొన్ని సినిమాలు ఇప్పటికీ టీవీ లో వస్తే మిస్ అవ్వకుండా చూస్తాము. ఎందుకని? వాటిలో అన్నీ సమ పాళ్ళల్లోఉంటాయి కనుక విసుగు అన్పించదు . ఇప్పటి వాటిల్లో కధ తప్ప మిగతావన్నీ ఎక్కువే .
ఈ మధ్యన గ్రాఫిక్స్ ఎక్కువగా పెట్టి తీసిన సినిమాలు కధ తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయగలిగాము . మన వాళ్ళేనా ఇంత బాగా తీసింది !అనుకున్నాము. అలాంటివీ, మంచి కుటుంబ కధ ఉన్న చిత్రాలు ,రావాలి. అవి లేకనే" ,పెద్ద వాళ్ళు మాకు చూట్టానికి ,సినిమాలే లెవు. " అనుకొనే పరిస్తితి వచ్చింది
2013-05-16
Rani: బంతిపూలు
రంగురంగుల బంతిపూలు :
పసుపు బంతి
పెరుగు బంతి
ఎరుపు బంతి
పాల బంతి
2013-05-15
Nature Tints: Flute
బేసికన్ను: जन्मं मृत्युः genesis et mortis
Pictures: బుల్ బుల్
2013-05-14
పక్షులు: గిజిగాడు
Rani: Jasmine flower from my back yard
Rani http://ranivani.blogspot.com/