ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2015-04-19

కినిగె పత్రిక: నీలీ – ఆకుపచ్చ (15) - డా. చిత్తర్వు మధు

2015-04-19 12:00 AM డా. చిత్తర్వు మధు
Download PDF   EPUB   MOBI దీని ముందుభాగం 30. అలల మీద తేలుతూ ఎదురవబోయే పరిణామాలను, ప్రమాదాలను అంచనా వేస్తున్నాను. అంతా చాలా స్పష్టంగా ఉంది. సమూరా, అతని బృందం చాలా చక్కగా ప్రణాళికలు రూపొందించారు. తాము పారిపోడానికి బంగాళాఖాతంలో ఓ నౌకని సిద్ధంగా ఉంచుకున్నారు. దాంట్లో, పూర్తి పాఠ్యం ...

2015-04-18

పుస్తకం: పుస్తకావిష్కరణ – ఆహ్వానం

2015-04-18 07:15 AM పుస్తకం.నెట్
సి బాచ్ అమ్మాయి కథా సంకలనం ఆవిష్కరణ, కె.ఎన్.మల్లీశ్వరి రచనల పరిచయం సభకు ఆహ్వానం ఇది. తేదీ: 26 ఏప్రిల్ 2015 సమయం: సాయంత్రం 5:30-8:00 వేదిక: వేములపల్లి కళాక్షేత్రం, వైశాఖీ స్టోర్స్ పార్క్, మురళీనగర్, విశాఖపట్నం-7 మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి. (వార్త అందించినందుకు అనిల్ అట్లూరి గారికి ధన్యవాదాలు)

2015-04-17

విహంగ: 1950 కి పూర్వం తెలుగులో స్త్రీల నవలలు

2015-04-17 07:10 PM కాత్యాయనీ విద్మహే
- కాత్యాయనీ విద్మహే డా.గంగు కిషన్‌ ప్రసాద్‌ తెలుగులో నవల పుట్టటమే స్త్రీలు పాఠకులుగా వున్నారన్న చైతన్యంతో పుట్టింది. ఇంగ్లీషు భాషా సాహిత్యాల ప్రభావంతో నవలా ప్రక్రియను తెలుగులో అంటుగట్టే ప్రయత్నాలు 1870లలో మొదలైతే నవలా రచనను ప్రోత్సాహించాలన్న సంకల్పంతో వీరేశలింగం పంతులు చింతామణి పత్రికలో నవలల పోటీలు ప్రారంభించాడు. 1892 మార్చి, ఏప్రిల్‌ సంచికలలో … Continue reading

Kandireega.com: శృతి హాసన్ తప్పు లేదట

2015-04-17 04:30 PM Srinivas

shruti_hassan_1హీరొయిన్ శృతి హాసన్‌ను వేధించడంలో భాగంగానే పివిపి సంస్థ వాస్తవాలను దాచి పిటిషన్లు దాఖలు చేస్తూ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆమె తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. శృతీహాసన్‌పై పిక్చర్ హౌస్ మీడియా దాఖలు చేసిన పిటిషన్‌ను 25వ అదనపు చీఫ్ జడ్జి సాంబశివరావునాయుడు శుక్రవారం మరోసారి విచారించారు.

ఈ సందర్భంగా శృతీహాసన్ తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. వాస్తవానికి శృతీహాసన్ స్థానంలో తమన్నాతో ఏప్రిల్ 2 నుంచి హైదరాబాద్‌లోనే సినిమా షూటింగ్ నిర్వహిస్తూ… మరోవైపు తమ సినిమా పూర్తయ్యే వరకూ శృతీహాసన్ మరో సినిమాలో నటించకుండా ఈ కోర్టు నుంచి మధ్యంతర ఆదేశాలు పొందారని నివేదించారు.

Related Videos

The post శృతి హాసన్ తప్పు లేదట appeared first on Kandireega.com.

Kandireega.com: మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్

2015-04-17 04:26 PM Srinivas

Rajendra Prasad is new MAA presidentమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో నటుడు రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. తనపై పోటీ చేసిన జయసుధ మీద ఆయన 85 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మార్చి 29వ తేదీన జరిగిన మా ఎన్నికల్లో మొత్తం 702 మంది సభ్యులకు గాను 394 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆరోరౌండు పూర్తయ్యే సరికే ఆయన స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. చివరకు ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన జయసుధ మీద 85 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో రాజేంద్రప్రసాద్ అభిమానులు, ఆయన వర్గీయులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

Related Videos

The post మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ appeared first on Kandireega.com.

పుస్తకం: వంగూరి ఫౌండేషన్ ఉగాది రచన పోటీ బహుమతుల ప్రదానం – ఆహ్వానం

2015-04-17 01:31 PM పుస్తకం.నెట్
వివరాలు: తేదీ: 21, ఏప్రిల్ 2015 సమయం: సాయంత్రం 6 గంటలకు వేదిక: కళాసుబ్బారావు కళా వేదిక, శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాదు పురస్కార గ్రహీతలు, ముఖ్య అతిథుల వివరాలకోసం జత చేసిన ఆహ్వాన పత్రం చూడండి.

2015-04-16

జాబిల్లి: గాలిదెయ్యానికి  సైన్స్ పాఠం

2015-04-16 01:14 PM
అది బాలాజీనగర్ ఉన్నత పాఠశాల. ఎనిమిదో తరగతిలో సత్యప్రసాద్ సార్ అటెండెన్స్ తీసుకుంటున్నాడు.ఆయన ఆ తరగతికి సామాన్య శాస్త్రం బోధిస్తాడు. వారంరోజులనుండి కమల బడికి రావడం లేదు. “కమల ఎందుకు బడికి రావడం లేదు ?” పిల్లలని అడిగాడు. “గాలి పోసిందంట సార్,లేవడం లేదు, పట్నం పోయి మంత్రపు తాయొత్తు కట్టించుకొని వచ్చారు., రేపటినుండి వస్తుందట” … Continue reading

Home: ఇది 'నిర్మాణ' నామ సంవత్సరం

2015-04-16 10:52 AM Vishnu Shankar Jarugumilli (vishnu@crorepatihomes.net)

Img: colourbox.com

పంచాంగం ప్రకారం తెలుగు ప్రజలు ఈ ఉగాది మన్మధ నామ సంవత్సరంలో ప్రవేశించేరు. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  ఏం జరగబోతోందని చూస్తే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా  ఈ సంవత్సరాన్ని “మన్మధ నామ” అని కాక “నిర్మాణ నామ” సంవత్సరం అని పిల్చుకుంటే బావుంటున్దనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఏనాడూ చూడనంత భారీ స్థాయిలో ఈ ఏడు నిర్మాణ రంగం పుంజుకోబోతోంది కాబట్టి.

కాస్త వెనక్కు వెళ్లి, క్రితం ఏడు జూన్ లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా పగ్గాలు చేపట్టిన నాటి రోజులు గుర్తుకు తెచ్చుకుందాం. ఈ ‘పాత పేరున్న కొత్త రాష్ట్రం’ ఆది లోనే హంస పాదు అన్నట్టుగా ఎన్నో సమస్యలతో జనించింది. రాజధాని లేదు. ఎక్కడ వస్తుందో కూడా తెలీదు. ఉన్నత విద్యాలయాలు లేవు. వ్యాపార కార్యాలయాలు లేవు. ఉద్యోగాలు అసలే లేవు. రాష్ట్రానిదేమో లోటు బడ్జెట్టు. కేంద్రం సాయమందిస్తే తప్ప జీత భత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితి. అసలు ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అని ఆలోచించడానికకే భయమేసే పరిస్థితి. ఈ నాటికీ అలాగే ఉన్నట్టుగా కొందరికీ అనిపించవచ్చు. కానీ చాప కింద నీరులా నెమ్మదిగా, నిదానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విషయాల్లో చాలా వరకూ స్పష్టత తీసుకొచ్చింది.

మొదట రాజధాని విషయానికొద్దాం.

Read More...

సారంగ: అనామకుల ఆయుధం!

2015-04-16 04:39 AM editor

నారాయణస్వామి వెంకటయోగి 

swamy1“కళ అబద్దం . అది నిజాన్ని చెప్తుంది” – పికాసో

“ఎడ్యుయార్డోను ప్రచురించడం అంటే శత్రువుని ప్రచురించడమే ! అబద్దాలకూ, ఉదాసీనతకూ, అలక్ష్యతకూ అన్నింటికంటే మించి మతిమరపుకు శత్రువు! మన నేరాలు గుర్తు పెట్టుకోబడతాయి. అతని సౌకుమార్యం విధ్వంసకారకం, అతని నిజాయితీ ప్రచండమైనది” – జాన్ బెర్గర్

~

 ప్రపంచ ప్రఖ్యాత లాటిన్ అమెరికా రచయిత, ఉరుగ్వే దేశానికి చెందిన జర్నలిస్టు, నవలా రచయితా కవీ ఎడ్యుయార్డొ గాలియానో,  74 యేండ్ల వయసులో కాన్సర్ తో పోరాడుతూ ఏప్రిల్ 13, 2015  న మరణించారు. గాలియానో ప్రముఖ రచన ‘ఓపెన్ వేన్స్ ఆఫ్ లాటిన్ అమెరికా – ఫైవ్ సెంచరీస్ ఆఫ్ ద పిలేజ్ ఆఫ్ ఎ కాంటినెంట్’ (చిట్లిన రక్తనాళాల లాటిన్ అమెరికా – ఐదు శతాబ్దాలుగా కొల్లగొట్టబడిన ఒక ఖండపు గాథ) ను వెనీజువెలా అధ్యక్షుడు హుగో షావేజ్ అమెరికా అధ్యక్షుడు ఒబామా కు బహుమతిగా ఇవ్వడం అప్పట్లో పెద్ద సంచలనాన్నే సృష్టించింది.

ఆ పుస్తకం 1971 లో మొదటిసారిగా ప్రచురించబడినప్పటినుండీ కొన్ని లక్షల కాపీల్లో అమ్ముడై రికార్డు సృష్టించింది. చీలీ, ఉరుగ్వే, అర్జెంటీనా దేశాల్లో మిలిటరీ నియంతృత్వ ప్రభుత్వాలు ఆ పుస్తకాన్నినిషేధించాయి. తన స్వదేశమైన ఉరుగ్వే లో 1973 లో మిలిటరీ హుంటా అధికారాన్ని చేజికించుకున్నాక, ప్రవాసానికి వెళ్ళిపోయిన గాలియానో ‘’మెమరీ ఆఫ్ ఫైర్” (అగ్నిస్మృతి) అనే ప్రముఖ రచన చేసారు. దానిలో గాలియానో ఐదు శతాబ్దాలా అమెరికా ఖండాల చరిత్ర తిరిగి రాసారు. “సాకర్ ఇన్ సన్ అండ్ షాడో” (ఎండా నీడలలో సాకర్ ), “అప్ సైడ్ డౌన్” (తలకిందులుగా ),” వాయిసెస్ ఆఫ్ టైమ్  “ (కాల స్వరాలు), “మిర్రర్స్ “ (అద్దాలు), “వి సే నో” (మేము కాదంటున్నాము) – అతని ప్రముఖ రచనలల్లో మరికొన్ని. గాలియానో కు సాంస్కృతిక స్వేఛ్చ కిచ్చే లన్నాన్ అవార్డు,ఇంకా తదితర అనేక అంతర్జాతీయ అవార్డులు వచ్చినయి.

గాలియానో మరణం, కేవలం లాటిన్ అమెరికా లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం, సత్యానికి జయం కోసం పోరాడుతున్న కోట్లాది ప్రజానీకానికి తీరని లోటు. అందరినీ కలుపుకుని పోయే, న్యాయమైన, సమైక్య లాటిన్ అమెరికా కోసం పోరాడే వారందరికీ గాలియానో మరణం తీవ్రమైన నష్టం. లాటిన్ అమెరికా లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నోరులేని నిరుపేద అనామక ప్రజానీకానికి గొంతునిచ్చి వారి దైన్యాన్ని,  ఆగ్రహాన్ని తన రచనల్లో అత్యంత శక్తివంతంగా పలికిన గాలియానో అమరులు. చిరస్మరణీయులు, ఆయన రచనలు అనామకుల చేతుల్లో ప్రపంచాన్ని మార్చే బలమైన ఆయుధాలు.

“సామ్రాజ్యవాదులు, దోపిడీ శక్తులు అనుక్షణం మనందరిలో మతిమరపును కలిగిస్తూ ఉంటాయి – వారి దుర్మార్గాలను మైమరపింపజేసే మతిమరపు. మన రచనలు సాహిత్యం ప్రజల్లో గ్నాపక శక్తిని పెంపొందించాలె” అంటారు గాలియానో. సాంప్రదాయిక విద్యనేదీ పాఠశాలకు పోయి నేర్చుకోని గాలియానో, ఉరుగ్వే రాజధాని మాంటేవీడియో లోని కాఫీ హోటళ్ళలో చదువు నేర్చుకున్నాడు. కథలు చెప్పే కళలు నేర్చుకున్నాడు. అక్కడ్నుండే,  గడచిన ఐదు శతాబ్దాల కథలన్నీ యిప్పుడే జరుగుతున్నట్టుగా భమింప జేసే అద్భుత మాయాజాలాన్ని సృష్టిస్తూ రచనలు చేసాడు. మరచిపోయిన గతాన్ని వర్తమానం లో యిప్పుడే జరుగుతున్నట్టుగా  ఆవిష్కరించి, సామ్రాజ్యవాదులు తన అందమైన లాటిన్ అమెరికా ఖండాన్నెలా దోపిడీ చేసి కొల్లగొట్టారో కళ్లకు గట్టేలా చిత్రించారు గాలియానో.

“మన గ్నాపకాలను ముక్కల కింద కోసేసారు. నేను చేసిందల్లా మన నిజమైన గ్నాపకాలను పునర్నిర్మించడమే. మానవజాతి గ్నాపకాలు మానవ ఇంద్ర ధనుస్సు లాంటిది . అది నిజమైన ఇంద్ర ధనుస్సుకన్న అందమైనది. కానీ మానవ ఇంద్రధనుస్సు పురుషాహంకారం, జాత్యహంకారం, మిలిటరీ నియంతృత్వం లాంటి అనేక దుర్మార్గాల చేత చిన్నాభిన్నమైంది. ధ్వంసం చేయబడ్డది. అనేక దుర్మార్గాలు మానవ జాతి గొప్పతనాన్ని, మనకు మాత్రమే సాధ్యమయ్యే ఔన్నత్యాన్ని, సౌందర్యాన్ని విధ్వంసం చేస్తూ ఉన్నయి. ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడి వాటిచేత అణచివేయబడుతున్న అనామకులకు గొంతునివ్వడమే రచయితల నిజమైన కర్తవ్యం. అట్లాంటి రచనే నిజమైన గొప్ప రచన”  అన్నారు గాలియానో. తాను నమ్మిన దాని కోసం  జీవితం లో చివరి క్షణం దాకా  నిలబడ్డ మహోన్నత వ్యక్తిత్వం గల రచయిత గాలియానో.

“We shall miss him dearly”.

అనామకులు

ఈగలు తమకోసం ఒక కుక్కపిల్లను కొనుక్కోవాలని కలగంటాయి. అనామకులు దరిద్రం నుండి బయటపడాలని కలగంటారు. యేదో ఒక అద్భుత దినాన హఠాత్తుగా బకెట్ల కొద్దీ అదృష్టం తమ మీద వర్షిస్తుందని – కానీ అదెప్పుడూ జరగదు, నిన్న, యివాళ్ళ,  రేపు యెప్పటికీ జరగదు – అదృష్టం కనీసం తుంపరలెక్కన్న కూడా రాదు అనామకులు  దాన్నెంత గట్టిగా పిలిచినా సరే  – వాళ్ళ కుడి కన్ను యెంత అదిరినా సరే, ప్రతి రోజూ ఠంచను గా కుడికాలు ముందుపెట్టి పనులు మొదలుపెట్టినా సరే, ప్రతీ కొత్త సంవత్సరం ఒక కొత్త చీపురుతో మొదలు పెట్టినా సరే …

అనామకులు: అనామకుల పిల్లలు, దేనికీ యజమానులు కారు. అనామకులు, యెవరూ కాని వారు,  యెవరికీ కాని వారు, ప్రతి క్షణం ప్రాణభయంతో ఉరుకుతూ, ప్రతి క్షణం చచ్చిపోతూ, అన్ని రకాలుగా వోడిపోతూ, వోడించబడుతూ …

యెవరైతే లేరో,  కానీ వుండవచ్చో
యెవరికైతే  భాషలు రావు, కానీ మాండలికాలు మాట్లాడతారో
యెవరికైతే మతాలుండవు,  కానీ మూఢనమ్మకాలుంటయో
యెవరికైతే కళలు కాదు,  కానీ హస్తకళలు తెలుసో

యెవరికైతే సంస్కృతుండదు, కానీ జానపదముంటుందో
యెవరైతే మనుషులు కాదు,  కానీ మానవ వనరులో
యెవరికైతే ముఖాలుండవు  కానీ చేతులున్నాయో

యెవరికైతే పేర్లుండవు,  కానీ అంకెలు గా మాత్రమే తెలుసో
యెవరైతే స్థానిక వార్తా పత్రికల పోలీసు వార్తల్లోనే  కానీ,
ప్రపంచ చరిత్రలో యెక్కడా కనబడరో…
అనామకులు –
వాళ్లని కాల్చిపారేసిన బులెట్ విలువ కూడా లేని వాళ్ళు.

 

*

సారంగ: గ్రీన్ గేబుల్స్ ఇంట్లో ఆన్ – రెండో అధ్యాయం

2015-04-16 04:35 AM editor

   మాథ్యూ కుత్ బర్ట్, అతని ఎర్ర గుర్రమూ పెద్దగా శ్రమ పడకుండానే ఎనిమిది మైళ్ళూ దాటి బ్రైట్ రివర్ కి వెళ్ళారు. ఆ దారి చాలా బావుంటుంది , కుదురుగా పొలాల మధ్యన ఇమిడిన ఇళ్ళతో. అక్కడక్కడా  బాల్సం వుడ్ చెట్లు…ప్లం చెట్లకి విరగకాసిన పళ్ళు. ఆపిల్ తోటల మీంచి వచ్చే గాలి సువాసన వేస్తోంది. మైదాన పు వాలు,   వంగిన ఆకాశం లోకి కలిసే చోట మంచుముత్యాలు ఊదారంగు లో మెరుస్తున్నాయి. ప్రతి రోజూ వసంతమే ఐనట్లు కొమ్మల్లో పిట్టలు పాడుతున్నాయి.

మాథ్యూ కి హాయిగానే ఉంది, తెలియని ఆడవాళ్ళెవరైనా ఎదురుపడ్డప్పుడు తప్ప… ఖచ్చితంగా వాళ్ళని తలఊపి పలకరించాలి మరి.

మాథ్యూ కి మెరిల్లా, మిసెస్ లిండ్ లు తప్పించి ఇంకే ఆడవాళ్ళన్నా వెర్రి బెదురు. వాళ్ళేదో తనని చూసి నవ్వుకుంటున్నట్లే ఉంటుంది అతనికి. అందులో నిజమూ ఉందేమో…అతను వింతగానే కనిపిస్తాడు చూసేవాళ్ళకి.వంగిపోయి ఉండే   బుజాల దాకా పెరిగిన జుట్టు, పొడుగ్గా ఒత్తుగా గడ్డం. ఆ గడ్డం అతనికి ఇరవై ఏళ్ళ వయసు నుంచీ అలాగే ఉంది…నిజానికి తల నెరిసిపోవటం తప్ప ఇరవై లోనూ అరవై లోనూ అతను ఒకలాగే ఉన్నాడు.

అతను స్టేషన్ చేరేసరికి అక్కడ రైలు ఉన్న ఛాయలేవీ లేవు…బాగా ముందే వచ్చేశానా అనుకున్నాడు. పొడుగాటి ప్లాట్ ఫాం మీద ఎవ్వరూ లేరు…ఆ చివార్న , చెక్కపెట్టెల  మీద కూర్చుని ఒక చిన్న పిల్ల తప్ప. ఆ వైపు తలతిప్పి కూడా చూడకుండా మాథ్యూ వెతుకుతూ ఉన్నాడు పిల్లాడి కోసం . చూసి ఉంటే –  ఆమె  బిక్కు బిక్కుమంటూ ఎవరికోసమో ఎదురు చూస్తుండటం అర్థమైపోయేదే.

గదికి తాళం పెట్టేసి  భోజనానికి పోబోతున్న  స్టేషన్  మాస్టర్ ని నిలబెట్టి అడిగాడు- అయిదున్నర బండి రావటానికి ఇంకా ఆలస్యం ఉందా అని.  ” వచ్చి వెళ్ళిపోయి అర్థ గంట దాటింది ” –  చెప్పాడాయన.  ” ఒక్క చిన్నపిల్ల మాత్రం దిగింది అందులోంచి..ఎవరో రావాలట ఆమె కోసం . లేడీస్ వెయిటింగ్  రూం లో కూర్చోమన్నాను , అక్కడే ప్లాట్ ఫాం మీదే ఉంటానంది . కొంచెం తమాషా  పిల్లలా ఉందేమిటో ”

మాథ్యూ – ” అమ్మాయి కోసం కాదండీ నేనొచ్చిందీ, అబ్బాయి ఒకడు దిగాలి ఈ రైల్లోంచి. మిసెస్ అలెక్జాండర్ స్పెన్సర్  అబ్బాయిని కాదూ పంపుతానందీ ? ”

స్టేషన్ మాస్టర్ అర్థమైనట్లు  ఈల వేసి అన్నాడు – ” ఏదో పొరబాటు జరిగినట్లుంది. మిసెస్ స్పెన్సర్ అయితే రైల్లోంచి దిగింది, ఈ పిల్లని నాకు అప్పజెప్పింది కూడా. నువూ మీ చెల్లెలూ నోవా స్కోటియా అనాథాశ్రమం నుంచి ఈ పిల్లనే తెచ్చుకుని పెంచుకోబోతున్నారని చెప్పింది నాకు. అబ్బాయెవరూ లేడు ఇక్కడ, నేనేమైనా దాచిపెట్టాననుకుంటున్నావా ? ”

మాథ్యూ కి  మెరిల్లా ఉండి ఉంటే బాగుండేదనిపించింది…అయోమయంగా అన్నాడు – ” నాకేమీ అర్థం కావట్లేదే ”

 

” అదేదో ఆ పిల్లనే అడిగి చూడు.అన్ని కబుర్లూ చెప్పేదాని లాగే ఉంది. మీరు అడిగిన రకం అబ్బాయిలు అనాథాశ్రమం లో అయిపోయారో ఏమో ” – నిర్లక్ష్యంగా అనేసి వెళ్ళిపోయాడు, అప్పటికే బాగా ఆకలేస్తోంది ఆయనకి.

మాథ్యూ ఒక్కడే పిల్లతో మిగిలిపోయాడు. అతనికి  అసలే ఆడపిల్లలంటే మొహమాటమూ  పిచ్చి భయమూ. ..నువ్వు అబ్బాయివి ఎందుకు అయావు కావూ అని ఆ పిల్లని పట్టుకుని ఏమని అడగటం ?

MythiliScaled

 

ఆ పిల్ల మాథ్యూ స్టేషన్ లోకి వచ్చినప్పటినుంచీ అతన్నే కళ్ళప్పగించి చూస్తోంది. పది పదకొండేళ్ళుంటాయేమో, బాగా పొట్టిగా బిగుతుగా ఐపోయిన బూడిద రంగు గౌను వేసుకుని ఉంది, అది బాగా వెలిసిపోయింది కూడా. మట్టి రంగు టోపీ కిందినుంచి రెండు లావుపాటి ఎర్రటి జడలు వేలాడుతున్నాయి .  పీక్కుపోయిన తెల్లటి మొహమూ, అక్కడక్కడా  చిన్న ముదురు జేగురు రంగు మచ్చలు [freckles ] 1….ఒకసారి ఆకుపచ్చగా, ఇంకొకసారి బూడిదరంగులో కనిపించే పెద్ద పెద్ద కళ్ళూ వెడల్పాటి నోరూ. మామూలుగా చూస్తే ఇంతే.

లోతుగా చూడగలిగేవాళ్ళకి ఆ గడ్డం కొనదేలి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.   కళ్ళ నిండా చెప్పలేనంత ఉత్సాహం, జీవ శక్తి చిందులు తొక్కుతాయి. పెదవులు భావోద్వేగాన్నీ  మధురమైన స్వభావాన్నీ సూచిస్తాయి. మొత్తం మీద ఆ ఆకారం లోపల ఉన్నది అసాధారణమైన ఆత్మ.

మాథ్యూ భయపడినట్లు అతనే ముందు పలకరించే అవసరం రాలేదు. తన కోసమే అతను వస్తున్నాడనిపిస్తూనే ఆ పిల్ల దిగ్గున లేచి నిలబడి, ఒక చేత్తో తన సంచీ పట్టుకునే ఉంది కనుక రెండో చేతిని అతని వైపుకు చాచింది –  హాండ్ షేక్ ఇచ్చేందుకు.

వింతైన తియ్యటి గొంతుతో మాట్లాడేసింది – ” మీరే కదూ, మాథ్యూ కుత్ బర్ట్ ?  అమ్మయ్య. మీరింకా ఎందుకు రాలేదా అనుకుంటున్నా. ఎందుకు వచ్చి ఉండరా అని ఆలోచిస్తున్నా.  ఈ రైలు కట్ట దిగి ఆ మలుపు దాటితే అక్కడ పెద్ద చెర్రీ చెట్టు ఉంది చూశారా ?  ఒకవేళ మీరిప్పుడు రాకపోతే ఆ చెట్టెక్కేసి రాత్రంతా ఉండిపోదామనుకున్నా. నాకేం భయం వెయ్యదండీ…వెన్నెట్లో తెల్లటి చెర్రీ పూల మధ్యన కొమ్మల్లో  నిద్ర పోతే చల్లటి పాలరాయి కొండల్లో పడుకున్నట్లుండదూ ? మీరెలాగూ పొద్దునే వచ్చేస్తారుగా ! ”

మాథ్యూ ఆ చిన్న చెయ్యి అందుకుని ఊపాడు. అప్పటికప్పుడే అతనొక నిర్ణయానికి వచ్చాడు –  ఇదంతా పొరబాటనీ మాకు అమ్మాయి అక్కర్లేదనీ  ఆ మెరిసిపోయే కళ్ళ వైపు చూస్తూ తను చెప్పలేడుగాక చెప్పలేడు. ఇక్కడ స్టేషన్ లో వదల్లేడు గా ఏమైనా, ఇంటికి తీసుకుపోతాడు,  ఆ చెప్పే దేదో మెరిల్లా నే చెప్పుకోనీ. ఇప్పుడే  ప్రశ్నలూ సంజాయిషీలూ తన వల్ల కావు.

ఆమెతో అన్నాడు – ” ఆలస్యమైంది. ఏమనుకోకు. ఆ సంచీ ఇలా ఇవ్వు. బయట గుర్రపు బండి ఉంది ”

” వద్దండీ, ఏం బరువు లేదుగా, నేను మొయ్యగలను ” – పిల్ల బోలెడు సంతోషం గా ఏమిటేమిటో చెప్పుకుపోయింది ” నా సామానంతా ఇందులోనే ఉందనుకోండి, ఐనా బరువుండదు. పైగా , దీన్నొకలాగా మటుకే పట్టుకోవాలి, లేకపోతే హాండిల్ ఊడిపోతుంది..పాత సంచీ కదండీ . చెర్రీ చెట్టులో నిద్రపోవటం బాగానే ఉండేదిగానీ మీరు వచ్చేయటం ఇంకా బావుంది. మనం చాలా దూరం వెళ్ళాలి కదా, మిసెస్ స్పెన్సర్ చెప్పారు, ఎనిమిది మైళ్ళని. నాకు అలా ప్రయాణం చేయటం గొప్పసరదా. మీ ఇంట్లో మీతోబాటు ఉండిపోవచ్చంటే ఎంత సంతోషంగా ఉందో ! నాకెప్పుడూ ఎవరూ లేనే లేరు. అనాథాశ్రమం లో ఐతే మరీ ఘోరం. నేను అక్కడున్నది నాలుగు నెలలే అనుకోండి…ఐనా సరే. మీరెప్పుడూ అలాంటి చోట ఉండి ఉండరేమో..అసలు ఊహించుకోలేరు అక్కడ ఎలా ఉంటుందో . మిసెస్ స్పెన్సర్ నేను అలా అనకూడదని అన్నారు…చెడ్డ పిల్లలకి మాత్రమే అలా అనిపిస్తుందట.  ఆవిడ అక్కడ ఉండి చూశారా చెప్పండి, ఉంటేనే గదా తెలిసేది ? పాపం అనాథాశ్రమం వాళ్ళు మంచి వాళ్ళే…కాని అస్సలు ఊహ లేదు వాళ్ళకి. పిల్లలకి మటుకు బోలెడు ఊహలు. నా పక్కన ఉండే పిల్ల తను ఒక జమీందారుల పిల్లననీ, చిన్నప్పుడే ఆయా కోపం వచ్చి మార్చేసిందనీ, ఎవరికైనా తెలిసేలోపు ఆవిడ చచ్చిపోయిందనీ అనుకుంటుండేది. నాకూ అలా అనుకోవాలని ఉండేది..రాత్రంతా ఊహించుకునేదాన్ని…పగలు ఖాళీ ఉండదుగా మరి ! అలా నిద్రపోకనో ఏమో , ఇలా చిక్కిపోయాను. బాగా సన్నగా ఉన్నాను కదండి ? బొద్దుగా చక్కగా ఉంటే ఎంత బావుంటుందో ….”

అప్పటికింక చెప్పటం ఆపింది, గుక్క తిప్పుకుందుకు. ఈ లోపు గుర్రం బండి వరకూ వచ్చారు. ఎక్కి కూర్చుని కొంచెం దూరం వెళ్ళే దాకా ఏమీ మాట్లాడలే. కొండవాలు లోంచి  బాగా లోతుగా వెళ్తోంది బాట.  బండి లో వాళ్ళ తలల పైగా ఎంతో ఎత్తున  …విరగబూసిన తెల్లటి పూలతో ,  సన్నని చెర్రీ చెట్ల  కొమ్మలు . పిల్ల ఒక చిన్న పూల కొమ్మ తుంచుకుని ఇష్టంగా బుగ్గ మీద రాసుకుంది.

” ఎంత బావుందో …ఆ  పూలు తెల్లటి లేస్ లా లేవూ ? ఆ చెట్టు  చూస్తే మీకేమనిపిస్తోంది ? ” అడిగింది మాథ్యూ ని.

”  మ్మ్. ఏమో మరి ” – మాథ్యూ.

anne2 (1)

” పెళ్ళి కూతురిలా ఉంది కదండీ, తెల్లటి మేలి ముసుగు వేసుకున్నట్లు..పెళ్ళికూతుర్ని నేనెప్పుడూ చూడలేదు, విన్నా అంతే. నాకెప్పుడూ పెళ్ళి అవదనే అనుకుంటా, నేనంత బాగోను కదా ? ” మాథ్యూ ఉలిక్కిపడ్డాడు . అదేం పట్టించుకోకుండా పిల్ల కొనసాగించింది – ” కాని ఎప్పుడైనా అలాంటి తెల్ల గౌను, పొడుగాటిది వేసుకోవాలనిపిస్తుంటుంది.  వేరే దేశాలకి వెళ్ళే  మిషనరీ లు ఎవరైనా నన్ను పెళ్ళి చేసుకోవచ్చేమో…వాళ్ళకి అందం గురించి పట్టింపులు ఉండకూడదుగా. ఇవాళ పొద్దున్నే ఈ గౌను వేసుకుని బయల్దేరానా,  …మరి ఇదేం బాగాలేదు కదా..రైల్లో అందరికీ  నన్ను చూసి జాలేస్తోందేమో అనిపించింది, నీలి రంగు సిల్క్ గౌన్ లాగా దీన్ని ఊహించుకున్నా.  అనాథాశ్రమం లో పిల్లలందరూ ఇలాంటి బూడిదరంగు గౌన్లే వేసుకోవాలి..ఎందుకంటే ఎవరో గొప్పాయన మూడొందల గజాల బట్ట దానం చేశారట..దాంతో కుట్టించారు. ఆయన అది అమ్ముకోలేక ఇచ్చేశాడని కొందరు అనుకున్నారుగాని నేనైతే పాపం ఆయన మంచాయన అనే అనుకున్నా. బోట్ లో వస్తుంటే కొంచెం కూడా కడుపులో తిప్పలేదు నాకు , సిల్క్ గౌన్ తో బాటు మంచి బూట్లూ, గ్లవ్స్ వేసుకున్నట్లూ పూలు వేలాడే టోపీ పెట్టుకున్నట్లూ నాకొక బంగారు వాచ్ కూడా ఉన్నట్లూ ఊహించుకున్నా..హాయిగా ఉండింది. మిసెస్ స్పెన్సర్ కి కూడా కడుపులో  తిప్పదుట, చెప్పారు. నేనేమో అటూ ఇటూ తెగ తిరుగుతున్నాననీ నన్ను నీళ్ళలో పడిపోకుండా  కనిపెట్టుకుంటూ ఉంటే వికారం పెట్టేందుకు తీరిక  ఎక్కడుందనీ కూడా అన్నారావిడ.  అదీ ఒకందుకు మంచిదే కదండీ  ? బోట్ లో చూడాల్సినవన్నీ ఒకేసారి చూసెయ్యాలి గదా నేను, మళ్ళీ ఎప్పుడైనా ఎక్కుతానో లేదో ?

 

అబ్బ ! ఎన్ని పూలచెట్లో !!!! ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవి ప్రపంచం లోకెల్లా అందమైందని విన్నా..ఇక్కడ ఉండిపోయినట్లు ఊహించుకునేదాన్ని..నిజంగా ఉంటానని అనుకోనేలేదు ! ఈ రోడ్ లు భలే ఎర్రగా ఉన్నాయి కదా ? మేం రైల్లో వస్తూంటే కూడా కనిపించాయి, మాతోబాటు పరిగెత్తుతూ. అవి ఎందుకు ఎర్రగా ఉన్నాయని మిసెస్ స్పెన్సర్ ని అడిగాను. ఆవిడ అప్పటికే నేనొక వెయ్యి ప్రశ్నలు వేసి ఉంటాననీ, ఇంక అడగద్దనీ అన్నారు. ప్రశ్నలు అడక్కపోతే సంగతులెలా తెలుస్తాయి చెప్పండి ? ఇంతకీ ఈ రోడ్ లు ఎర్రగా ఎందుకున్నాయీ ? ”

మాథ్యూ ” ఏమో  మరి …”

పిల్ల- ” సర్లెండి. ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకుందుకు అన్ని సంగతులున్నాయి కదా అనుకుంటే భలే సరదాగా ఉంటుంది కదా ? అన్నీ తెలిసిపోతే ఏం బావుంటుందీ…ఊహించుకుందుకు ఏమీ ఉండదాయె.

నే నే మన్నా ఎక్కువగా మాట్లాడుతున్నానాండీ ? అందరూ అదే అంటుంటారు …మీరూ అదే అంటే మాట్లాడటం ఆపేస్తా…నేనైనా అనుకుంటే చెయ్యగలను, కొంచెం ఇబ్బందే కానీ…”

మాథ్యూ తనకే ఆశ్చర్యం వేసేలా ఆనందిస్తున్నాడు. ఎక్కువ మాట్లాడని చాలా మందికి లాగే అతనికీ ఎవరైనా మాట్లాడుతుంటే ఇష్టమే…తననేమీ పెద్దగా అడక్కుండా ఉంటే. కాని ఒక చిన్న ఆడపిల్ల నుంచి తనకి  ఆహ్లాదం వస్తుందని అతనెప్పుడూ అనుకోలేదు. ఆడవాళ్ళే చిరాకు పుట్టిస్తారనుకుంటే ఆడపిల్లలు మరీ దరిద్రం. ఏమిటో బెరుకు బెరుగ్గా ఓర చూపులు చూసుకుంటూ పక్కనుంచే వెళ్ళి పోతుంటారు , వాళ్ళని అమాంతం మింగెయ్యాలనిపించేంత కోపం వచ్చేది. అవోన్లియా లో అందరు ఆడపిల్లలూ అంతే. మాథ్యూ స్వతహాగా మేధకుడు. పాదరసం లా ఉన్న ఈ పిల్ల బుర్ర ని తను అందుకోలేకపోయినా, ఈ పిల్ల ఏదో చాలా వేరుగా ఉందనీ ఈ బుల్లి  మంత్రగత్తె వాగుడు తనకి బాగానే ఉందనీ అతనికి అనిపించింది.

కొంచెం బిడియంగా చెప్పాడు

” ఏం పర్వాలేదు..నీ ఇష్టమొచ్చినంత మాట్లాడచ్చు. ”

పిల్ల – ” అమ్మయ్య. బతికించారు. మనిద్దరికీ సరిపడేలాగే ఉంది. మాట్లాడాలనిపించినప్పుడల్లా  మాట్లాడటం ఎంతో బావుంటుంది. అదేమిటో..పిల్లలు కనబడాలి గానీ వినబడకూడదని నాకిప్పటికి  లక్షసార్లు చెప్పి ఉంటారు అందరూ. ఇంకానేమో..నేను పెద్ద పెద్ద మాటలు వాడితే అంతా నవ్వుతారు కూడానూ…మరి పెద్ద పెద్ద విషయాలు చెప్పాలంటే పెద్ద మాటలే వాడాలి కదండి ? ”

” అవునవును, నిజమే ” మాథ్యూ ఒప్పుకున్నాడు.

పిల్ల- ” నా నాలుక్కి నరం లేదని మిసెస్ స్పెన్సర్ అన్నారు..అంటే ఏమిటో ? నాకు తెలిసి నాదీ మామూలు నాలుకే  …అవునూ మీ ఇంటి పేరు గ్రీన్ గేబుల్స్ అట కదా ? అక్కడ బోలెడు చెట్లున్నాయని మిసెస్ స్పెన్సర్ చెప్పారు..నాకు చెట్లంటే ఎంతిష్టమో ! అనాథాశ్రమం లో ఎక్కువ ఉండేవే కావు..ఉన్న కాసినీ పాపం దిగులు మొహాలేసుకుని ఉండేవి, చుట్టూ కటకటాలు..అవీ అనాథల్లాగే ఉంటాయి. వాటిని చూస్తేనే ఏడుపొచ్చేది. నేను వాటితో అనేదాన్నీ…” మీరే కనుక ఏ పెద్ద అడవిలోనో ఉండి ఉంటే ఎంత ఎత్తుగా ఎదిగేవారో ! మీ చుట్టూ ఇంకా చాలా చెట్లుండేవి తోడుగా. మీ కొమ్మల్లో పిట్టలు పాడేవి, మీ వేళ్ళ మీద నాచు మొక్కలూ  జూన్ బెల్సూ పెరిగేవి…పక్కనే ఒక సెలయేరు కూడా ఉండేది..కదా  !  పాపం..

ఇక్కడ మీకెలా ఉంటుందో నాకు తెలుసు  ” అని. ఇవాళ వాటిని వదిలేసి రావాలంటే చాలా బాధేసింది నాకు. గ్రీన్ గేబుల్స్ ఇంటి దగ్గర సెలయేరు ఉందాండీ ? మిసెస్ స్పెన్సర్ ని అడగటం మర్చిపోయాను ”

మాథ్యూ – ” ఇంటి పక్కనే ఉందిగా ”

” అరే..భలే ఉందే. ఒక సెలయేరు పక్కనే ఉండాలన్నది నా కల్లో ఒకటి, ఉంటానని అనుకోలేదు ఎప్పుడూ. కలలు నిజం కావుగా , ఐతే బావుంటుంది గానీ…! ఇవాళ ఇంచుమించు పూర్తి సంతోషంగా ఉన్నా నేను, పూర్తి పూర్తి సంతోషంగా ఎందుకు లేనంటే… చెప్తా ఉండండి, ఇదేమిటీ, ఈ రంగుని ఏమంటారు ? ” పిల్ల తన జడనొకదాన్ని ఎత్తి పట్టుకుని మాథ్యూ కి చూపించింది.

మాథ్యూ – ” ఇది ఎరుపు కదా ? ” అన్నాడు.

ఏళ్ళ తరబడి గొప్ప  దుఃఖాన్ని మోస్తున్నదానిలాగా పిల్ల అతి గాఢంగా నిట్టూర్చింది. జడని కిందికి వదిలేసింది.

” అవును, ఎరుపు. ఎర్రటి జుట్టున్న ఎవరైనా పూర్తి సంతోషంగా ఉండగలరా చెప్పండి ? నేను బక్కగా ఉంటాను, నా కళ్ళు ఆకు పచ్చగా ఉంటాయి, మొహం మీద ఈ మచ్చలున్నాయి…ఇవేవీ లేనట్లు – నేను పుష్టిగా , గులాబి రంగులో ఉన్నట్లూ నా కళ్ళు వయొలెట్ రంగులో మెరుస్తున్నట్లూ ఊహించుకోగలను. నా జుట్టు గురించి మాత్రం అలా అస్సలు వీలవదు…నల్లగా తుమ్మెద రెక్కల్లాగా ఉందనో బంగారు రంగులో మిలమిలలాడుతోందనో ,  ఊహించుకోనే లేను. ఇది నాకు ఆజన్మ శోకం. ఒక నవల్లో ఒక అమ్మాయికి ఇలాగే ఆజన్మ శోకం ఉంటుంది, ఆమె జుట్టు ఎర్రగా లేదు మరి, బంగారు రంగులో ఉందట ..ఆమె నుదురు చంద్రకాంత శిల లాగ ఉందట…చంద్రకాంత శిలంటే ఏమిటండీ ? ”

” నాకు తెలీదనుకుంటా ” బెదురుగా అన్నాడు మాథ్యూ. చిన్నప్పుడెప్పుడో తోటి కుర్రాడొకడు తనని రంగులరాట్నం ఎక్కిస్తే కళ్ళు తిరగటం గుర్తొచ్చింది.

” అదేదో చక్కటి వస్తువే అయి ఉంటుంది..ఆ అమ్మాయి అతిలోక సౌందర్యరాశి మరి. అతిలోక సౌందర్యం ఉంటేఎలా ఉంటుందో మీకేమైనా తెలుసాండీ ? ” పిల్ల అడిగింది.

” లేదు, తెలీదు ” మాథ్యూ చెప్పాడు.

పిల్ల అడిగింది- ” అవునండీ, మీరు ఏది కోరుకుంటారు …అతిలోక సౌందర్యం గా ఉండటమా ? అద్భుతమైన తెలివి తో ఉండటమా ? లేకపోతే దేవుడంత మంచిగా ఉండటమా ? ”

” సరిగ్గా తెలీదు ” మాథ్యూ చెప్పుకున్నాడు.

” నాకూ తెలీదు, ఎప్పటికీ తేల్చుకోలేను. ఎలా ఐనా మాత్రం ఉండబోయానా  ఏమిటిలెండి నేను. దేవుడంత మంచిగా ఐతే ఎప్పటికీ అవనను.  మిసెస్ స్పెన్సర్ అన్నారు కదా………మిస్టర్ కుత్ బర్ట్ ! మిస్టర్ కుత్ బర్ట్ !   మిస్టర్ కుత్ బర్ట్ ! ” మిసెస్ స్పెన్సర్  అలా ఏమీ అనలేదు , పిల్ల బండి లోంచి కిందికి దొర్లలేదు, మాథ్యూ విడ్డూరపు పనేమీ చేయలేదు …పిల్ల అరిచింది వీటిలో దేనికీ కాదు. దారి వంపు తిరిగి వాళ్ళు ‘ అవెన్యూ ‘ లోకి ప్రవేశించారు అంతే.

ఈ అవెన్యూ నాలుగైదు వంద ల గజాలు పొడవున, అటూ ఇటూ పెద్ద పెద్ద ఆపిల్ చెట్ల తో ఉంటుంది. వాటిని అక్కడ ఏనాడో ఎవరో పనిగట్టుకుని పెంచారు. విరబూసిఉన్న రెండు వైపుల చెట్లూ కలుసుకుని పైన  పరిమళించే  మంచు చాందినీ పరిచినట్లుంది. ఊదారంగు సంజవెలుగు గాలిలో నిండిపోయి ఉంది.  కాస్త దూరంగా సంధ్యాకాశం  వర్ణ చిత్రం లాగా కనిపిస్తోంది… గులాబిరంగు గాజుతో చేసిన బ్రహ్మాండమైన చర్చ్ కిటికీ లాగా. ఆ సౌందర్యానికి లోనై పిల్లకి మాటలు రాలేదు. చేతులతో తనని తాను చుట్టుకుని వెనక్కి వాలి ఆ వైభవానికి తలెత్తి చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి బండి దూరం వెళ్ళాక కూడా ఆమె పలకలేదు, ఆ పడమటి దిక్కు కేసి, సూర్యాస్తమయం కేసి, ఆనందం నిండిన ముఖం తో చూస్తూనే ఉండిపోయింది. ఆ వెలుగుల నేపథ్యం మీద ఏ సుందర దృశ్యాల కవాతు కనిపిస్తోందో ! న్యూ బ్రిడ్జ్  ఊళ్ళోంచి –  కుక్కలు అరుస్తూన్న వీధుల్లోంచి,  కుతూహలంగా కేకలు పెడుతూ మూగే చిన్న కుర్రాళ్ళ మధ్యలోంచి , బండి వెళ్తున్నప్పుడు   కూడా,  ఆమె మౌనం గానే ఉంది . మూడు మైళ్ళు దాటేశారు. మాట్లాడినంత శక్తితోనూ ఆమె నిశ్శబ్దంగా ఉండగలదిలా ఉంది.

” బాగా అలిసిపోయావు కదూ ? ఆకలేస్తోందా ? ” మాథ్యూ అడిగాడు, ఆమె మాట్లాడకపోవటానికి అవే కారణాలనుకుని. ” ఇంకెంతో దూరం లేదులే, వచ్చేశాం. ఒక మైలు ఉంటుంది ” ధైర్యం చెప్పాడు.

ఆమె  ట్రాన్స్ లోంచి బయటికొచ్చి నిట్టూర్చింది. నక్షత్రాల వెంట ఎంతెంత దూరాలకో వెళ్ళి వచ్చినట్లుంది ముఖం, స్వప్నా ల్లో తేలుతున్నట్లు.

”ఆ. మిస్టర్ కుత్ బర్ట్ ! మనం దాటి వచ్చామే, ఆ తెల్లటి చోటు, అదేమిటి ? ”

” దాన్ని అవెన్యూ అంటాం ” మాథ్యూ కొద్ది క్షణాలు ఆలోచించి అన్నాడు – ” అందమైన చోటు అది ”

” అందమా…ఆ మాట ఎంత దూరం వెళ్తుంది గనుక, చాలదు అలా అంటే. అది అద్భుతం. ఉన్నదానికంటే ఇంకా ఎక్కువగా  ఊహించుకోలేనిది ఇప్పటి వరకూ నాకు కనిపించలేదు, ఇదే మొదలు. ఇక్కడ తృప్తిగా ఉంది ” గుండె మీద చెయ్యి పెట్టుకుని చూపిస్తూ అంది పిల్ల, ” ఏదో నొప్పిగా ఉంది, ఆ నొప్పికూడా సుఖంగానే ఉంది. ఇలాంటి నొప్పి మీకెప్పుడైనా వచ్చిందా మిస్టర్ కుత్ బర్ట్ ? ”

” లేదు, నాకు గుర్తున్నంతవరకూ లేదు ” మాథ్యూ అన్నాడు.

” చాలా సార్లు వస్తుంది నాకు , చాలా గొప్పగా ఉన్నదాన్ని చూస్తే.  ‘ అవెన్యూ ‘ అదేం పేరు…దానికి సరిపోదు అసలు. ‘ ఆహ్లాద శ్వేత మార్గం ‘ అంటేనో ? బావుందా ? ఉన్న పేరుతో దేన్నైనా పిలవటం పెద్ద నచ్చదు నాకు. అనాథాశ్రమం లో హెప్జిబా జెంకిన్స్ అని ఒక అమ్మాయి ఉండేది, తనని ఎప్పుడూ నేను రొసాలియా డెవేరే అని ఊహించుకునేదాన్ని. అందరూ ఆ చోటుని అవెన్యూ అన్నా నేను మాత్రం ఆహ్లాద శ్వేత మార్గం అనే అంటాను. అయితే దగ్గరికి వచ్చేశామా ? సంతోషంగా ఉంది, బాధ గానూ ఉంది. ప్రయాణం చాలా బావుండింది కదా, అయిపోతోందని బాధ. మంచి విషయాలు కూడా అయిపోతుంటాయి, బాధేస్తుంది. తర్వాత ఇంకా మంచివి జరగచ్చనుకోండి, కాని అలా అని నమ్మకం లేదు కదా. నా అనుభవం ఐతే జరగవు అనే.  ఇంటికి వెళ్తున్నామంటే సంతోషంగా ఉంది, నాకెప్పుడూ ఇల్లే ఉన్నట్లు గుర్తు లేదు గా మరి ! ఇందాక చెప్పానే , అలాంటి హాయైన నొప్పి మళ్ళీ వస్తోంది, ఇల్లు తలుచుకుంటే. ”

ఒక చిన్న కొండ పైకి ఎక్కుతోంది బండి. కిందికి చూస్తే పెద్ద చెరువు. పొడుగ్గా, మెలికలు తిరుగుతూ, ఇంచుమించు నది లాగా ఉంది. మధ్యలోంచి ఒక వంతెన. జేగురు రంగులో ఉన్న ఇసుక గుట్టల వెనక నుంచి  సముద్రం కనిపిస్తోంది. ఆ నీరు వింత వింతగా వెలుగుతోంది … నీలంగా , ఆకుపచ్చగా, గులాబి రంగుగా, ఇంకేవేవో పేరు తెలీని రంగులుగా. అవేవో ఈ లోకానికి చెందిన వెలుగుల్లాగా లేవు. వంతెన కి అవతల చెరువు ఒడ్డు న దట్టంగా ఫర్ చెట్లూ, మేపుల్ చెట్లూ…చిక్కగా పాకే వాటి నీడలు. అక్కడక్కడా ఒక ప్లం చెట్టు చెరువు మీదికి వంగి ఉంది, తెల్లటి దుస్తులు వేసుకుని అద్దం లో చూసుకోబోయే అమ్మాయికి మల్లే. చెరువు అంచున బురదలో గొంతు విప్పి పాడుకుంటున్న కప్పలు. ఆపిల్ తోట లోంచి చిన్న బూడిదరంగు ఇల్లు తొంగి చూస్తోంది, ఇంకా పూర్తిగా చీకటి పడకపోయినా  ఇంటి కిటికీలో దీపం వెలుగుతోంది.

” అది బారీ చెరువు ” మాథ్యూ చెప్పాడు.

” ఊహూ, ఈ పేరూ బాగోలేదు. దీన్నేమని పిలవనూ … ‘ ప్రకాశమాన   సరోవరం ‘ . సరైన పేరు. పేరు సరైందైతే  తెలిసిపోతుంది నాకు, నా గుండె ఒకలాగ గుబుక్కుమంటుంది అప్పుడు. మీకెప్పుడైనా అలా అంటుందా ? ”

యథాప్రకారం మాథ్యూ ఆలోచించాడు ..” దోసపాదుకి చీడ పడితే దాన్ని చూసినప్పుడు  నా గుండె గుబుక్కుమంటుంది ” సూచించాడు.

” అదీ ఇలాంటిదేనంటారా ? ఏమో మరి. కాదేమో, చీడకీ వెలిగే నీళ్ళకీ సంబంధం ఉందంటారా ? అవునూ, దాన్ని బారీ చెరువని ఎందుకంటారు ? ”

” ఆ ఇల్లు మిస్టర్ బారీ ది కదా, అందుకేనేమో. ఆ ఇంటి పేరు ‘ తోట వాలు ‘ . అదిగో, ఆ చెట్ల గుబురు అడ్డం లేకపోతే ఇక్కడ్నుంచి గ్రీన్ గేబుల్స్ కనిపిస్తుంది. మనం ఇలా చుట్టు తిరిగి ఇంకో అరమైలు వెళ్ళాలి ”

” మిస్టర్ బారీ కి చిన్న అమ్మాయిలెవరైనా ఉన్నారా ? చిన్నంటే మరీ చిన్న కాదు, నా అంత వాళ్ళు ”

” ఒకమ్మాయి ఉంది. ఆమె పేరు డయానా ”

” ఓ.. ” పిల్ల గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది – ” ఎంత చక్కటి పేరు ! ”

మాథ్యూ- ” ఏమో. నాకైతే అంత పద్ధతైన పేరులా ఉండదు. 2 జేన్ అనో, మేరీ అనో, అలాంటి శుభ్రమైన పేరేదైనా పెట్టాల్సింది. డయానా పుట్టినప్పుడు ఇక్కడొక స్కూల్ మాస్టర్ ఉండేవాడు, ఆయన్ని పేరు పెట్టమంటే ఈ పేరు పెట్టాడు. ” నిరసనగా అన్నాడు.

పిల్ల- ” నేను పుట్టినప్పుడూ అలాంటి మాస్టరెవరైనా ఉండి ఉంటే బావుండేది. ఇదిగో, వంతెన. కళ్ళు గట్టిగా మూసుకుంటానేం, నాకెప్పుడూ వంతెనల మీంచి వెళ్ళటమంటే చాలా భయం. గబుక్కున మధ్యలో అది కూలిపోతేనో ? మధ్యలోకొచ్చాక కళ్ళు తెరుస్తా. ఒక వేళ వంతెన కూలిపోతుంటే అదంతా  చూడాలిగా మరి ?  పెద్ద చప్పుడవుతుంది కదూ అప్పుడు , నాకిష్టం. ఇష్టపడేందుకు ఎన్నెన్ని విష యాలో ప్రపంచం లో ! ఆ..ఆ..దాటేశాం…ఇప్పుడు వెనక్కి చూస్తా. గుడ్ నైట్ ప్రకాశమాన సరోవరమా ! నాకు ఇష్టమైన వాటన్నిటికీ గుడ్ నైట్ చెప్తుంటాను, వాటికీ అలా చెప్పటం నచ్చుతుంది. ఆ నీళ్ళు నన్ను చూసి నవ్వుతున్నాయేమో ”

కొండ దాటి మలుపు తిరుగుతుంటే మాథ్యూ అన్నాడు….” ఆ.ఇదిగో. వచ్చేసినట్లే .అదే గ్రీన్ గేబుల్స్ ”

” ఆగండి.చెప్పెయ్యకండి..నన్ను ఊహించుకోనియ్యండి , సరిగ్గా ఊహిస్తానో లేదో ” అతను చూపించబోయే చెయ్యి పట్టుకుని ఆపి,  తన చేత్తో కళ్ళు గట్టిగా మూసుకుంది. కాసేపటికి కళ్ళు విప్పి చుట్టూ చూసింది. సూర్యుడు అస్తమించి కాసేపవుతోంది… కానీ ,పండిన  వెలుగు అంతా పరచుకునే ఉంది. బంతిపువ్వు రంగు ఆ కాశం మీద దూరం నుంచి చర్చ్ గోపురం కనిపిస్తోంది. కిందన పొడుగ్గా లోయ, నాజూగ్గా కనిపించే  ఎత్తు పల్లాల మధ్య లోంచి పొలాలూ వాటిలో రైతుల ఇళ్ళూ. పిల్ల కళ్ళు ఒకవైపునుంచి ఇంకోవైపుకి ఆత్రంగా , ఆర్తిగా వెతికాయి.  దారికి బాగా ఎడంగా , ఎడమ వైపుకి తిరిగి ఆమె చూపు ఆఖర్న ఆగింది. మీగడ రంగు  కట్టడం  , చుట్టూ పూసిన చెట్ల తో, ఆ మునిమాపు వెలుతురు లో చిట్టడవి మధ్యలోంచి. ఆ పైన, నైఋతి దిక్కున , మచ్చ లేని ఆకాశం లో స్ఫటికం లాగా మెరుస్తున్న పెద్ద నక్షత్రం …దారిదివ్వె లాగా , అభయమిస్తున్నట్లుగా.

చూపిస్తూ అంది ఆమె – ” అదిగో, అదే- కదూ ? ”

మాథ్యూ ఉల్లాసంగా గుర్రం వీపుని కళ్ళెం తో తట్టాడు ..” కనిపెట్టేశావే ! మిసెస్ స్పెన్సర్ చెప్పిందా ? ”

” లేదు. నిజంగా ! అసలు చెప్పలేదు. చూడగానే అదే  ఇల్లని అర్థమైపోయింది. నేను కలలు కన్నట్లే ఉంది. తెలుసాండీ, నా చెయ్యి మొత్తం కమిలిపోయింది ఇవాళ. ఇది నిజమే అని తెలిసేందుకు ఎన్నిసార్లు గిల్లుకున్నానో నన్ను. అస్తమానం ఇదంతా కలేమో, అయిపోతుందేమో- అనిపిస్తూనే ఉండింది. చివరికి ఇంత మంచి కల ,  కలే అయితేలెమ్మని గిల్లుకోవటం ఆపేశాను. కాని నిజం ఇది, ఇంటికి వచ్చాం ”

anne3 (1)

 

ఆనందంగా నిట్టూర్చి నిశ్శబ్దం లోకి జారింది.

మాథ్యూ ఇబ్బందిగా కదిలాడు. తను  అనుకునేటట్లు అది తన ఇల్లు కాబోవటం లేదని పిల్లకి చెప్పాల్సింది అతను కాకుండా  మెరిల్లా అయినందుకు అతనికి కాస్త ఊరటగా అనిపించింది. మిసెస్ లిండ్ ఇల్లు  దాటారు. చీకటి పడింది, కాని రాచెల్ లిండ్ కిటికీ పక్కన కూర్చుని వాళ్ళని గమనించలేనంత చీకటి ఐతే కాదు. ఈ పిల్ల పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోబోవటం తలుచుకుని మాథ్యూకి పెద్ద దిగులు వచ్చింది. ఆ కళ్ళలో వెలుతురు గుప్పున ఆరిపోతుందా ? అతనికి ఏదో హత్య చేయబోతున్నట్లుంది.

పెరడంతా బాగా చీకటిగా ఉంది. పొప్లార్ చెట్ల ఆకులు గలగలమంటున్నాయి.

పిల్లని బండిలోంచి కిందికి దించుతుంటే ,  అంది..” చూడండి..చెట్లు నిద్రలో మాట్లాడుతు న్నా యి…ఎంత మంచి కలలొస్తున్నాయో వాటికి ! ”

‘ తనకున్న సామానంతా ‘  దాచిన సంచీని గట్టిగా పట్టుకుని అతని వెంట ఆమె ఇంట్లో అడుగు పెట్టింది.

                                                                      [ఇంకా ఉంది ]

  1. చలి దేశాలలో చర్మం మీద ఏర్పడే ముదురు జేగురు రంగు మచ్చలు. చాలా సార్లు యుక్తవయసు వచ్చేసరికి అవి తగ్గిపోతాయి.
  2. డయానా  ఒక గ్రీక్ దేవత. ఆ పేరు క్రైస్తవానికి విరుద్ధంగా ఉందని మాథ్యూ అభిప్రాయం.

 

 

 

 

 

 

 

 

 

2015-04-15

కొత్తపల్లి: పదాల్ని వెతికి పట్టుకోండి

2015-04-15 09:49 AM

స్నేహితుడు, ఉడత, జంతువులు, మనుషులు, ఆహారం,...

కొత్తపల్లి: అమ్మ ప్రేమ

2015-04-15 09:49 AM

"అమ్మ ప్రేమ ఎన్నో నేర్పిస్తుంది. అమ్మ ప్రేమను పొందిన ఒక ఆడపిల్ల తన చిన్నతనంలో చదువుకోలేకపోయినా కూడా జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగిందో తెలియజేయడమే నా ఈ కథలోని ముఖ్య ఉద్దేశం" అని రాస్తున్నది వినూత్న. చూడండి.. రచన: M. వినూత్న, తొమ్మిదవ తరగతి, తేజ టాలెంట్ స్కూల్, కోదాడ, నల్గొండ జిల్లా. కూర్పు చేర్పులు: కొత్తపల్లి

2015-04-14

లోకహితం: హిందూధర్మంలోకి తిరిగివచ్చేవారికి ఆత్మీయ స్వాగతం

2015-04-14 01:54 PM Loka Hitham (noreply@blogger.com)
మతంమారిన హిందువులు తిరిగి తమ మాతృధర్మంలోకి రావాలనుకున్నట్లయితే వారికి హిందువులు ఆత్మీయ స్వాగతం పలకాలని, అటువంటి వారికి పూర్థి భద్రత కల్పించాల్సిన పూర్తిగా చదవండి

లోకహితం: సంక్రాంతి - రథసప్తమి

2015-04-14 12:51 PM Loka Hitham (noreply@blogger.com)
మకరరాశిలో ప్రవేశించిన సూర్యుడు సంక్రాంతి మొదలు ఉత్తరాయణంలో ప్రయాణిస్తూ ఏడు గుర్రాల రథాన్నెక్కి ఈశాన్యదిశగా వెళ్తుంటాడు. సంక్రాంతి తరువాత వచ్చే మాఘమాసంలో పూర్తిగా చదవండి

Home: దేవుడిపై ఓ ఫిజిసిస్ట్ అభిప్రాయం పై నా అభిప్రాయం

2015-04-14 12:48 PM Yadavalli VR (whyweare2010@gmail.com)

దేవుడనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఒక అమెరికన్ ఫిజిసిస్ట్ తెలిపిన తన అభిప్రాయం ఇది –

“Every account of a higher power that I’ve seen described, of all religions that I’ve seen, include many statements with regard to the benevolence of that power. When I look at the universe and all the ways the universe wants to kill us, I find it hard to reconcile that with statements of beneficence.” తను నాస్తికుణ్ణని చెప్పడు కానీ ఆస్తికుణ్ణనీ అనడు. అగ్నోస్టిక్ కేటగరీ. సైంటిస్టుగా చాలా సాధించాడు, వ్యక్తిగా మంచివాడు. ఆయనలో తప్పు పట్టేందుకు ఏమీలేదు. బట్, చదువుకున్నవాళ్ళని ఇలాంటి స్టేట్మెంట్స్ ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా మతంపట్ల విముఖతతో ఉన్నవాళ్ళని. మనిషిని దేవుడికి దగ్గరచెయ్యాల్సిన వివిధ మతాల్లో చోటుచేసుకునే మూఢవిశ్వాసాలు, దురాచారాలు, వితండవాదాలు, ఫెనాటిసిజాలకి విసుగుచెందిన వాళ్ళు ఆస్తికత్వానికి, దేర్-ఫోర్ దేవుడికి దూరంగా జరగటానికి ఇవి ఊతం ఇస్తాయి.

నాస్తికత్వాన్ని సపోర్ట్ చెయ్యడానికి సైన్సుని వాడుకోవడం సర్వసాధారణం.  సైన్సులోనే ఆస్తికత్వాన్ని చూడడం కొంచెం అరుదు. God is no where  అని ఒక సైంటిస్ట్ అన్నప్పుడు, వివేకానందుడు లేక స్వామి రామతీర్థ God is now here అని అక్షరాల సద్దుబాటుతో సమాధానం ఇచ్చారని అంటారు. దృక్కోణం మారితే భగవంతుడు ఎక్కడ చూసినా కనిపిస్తాడు. సో, సైంటిస్ట్ మాటలకి కదిలిన నా ఆలోచనలు ఇలా సాగాయి -   What is universe and what are you? Are you not a part and parcel of the universe? Can a wave ever think of the ways the ocean tries to kill it? A wave owes its existence to the ocean and has no separate existence or “non-existence” of its own. It results from the movements of the ocean; has a brief existence and finally disappears into its originator – Only to appear again at a different point in the same old ocean! Then where and how does the question of the ocean killing a wave arise? Unless the wave starts questioning /exploring the ways in which the ocean created it. ఆ సైంటిస్టుతో మాట్లాడే అవకాశం ఉంటే పైవిధంగా వాదించేవాణ్ణేమో. అదెలాగో అయ్యే పనికాదు కనక నాకు నేను ఇచ్చుకున్న ఎక్స్ప్లనేషన్ ఇదీ –

Read More...

నవతరంగం: Vasham – A crowdfunded Telugu feature film!!

2015-04-14 10:56 AM అతిథి
The first crowd funded Indian film Manthan(1975) directed by the versatile director Shyam Benegal was funded by 5 lakh farmers who contributed 2 rupees each! Anurag Kashyap also followed this. In South Indian films,crowdfunding is very new, and Pawan kumar’s Lucia is the first success here. It is slowly becoming a trend in south India(...)

2015-04-02

వాకిలి: ఇటువైపు చూడవు నువ్వు

2015-04-02 04:16 PM వాకిలి

టువైపు చూడవు నువ్వు. ఎందుకంటే
నూతనమైనది ఏదీ నీకు కనిపించకపోవచ్చు. ఆఖరకు ఒక పదం కూడా ఒక్క ప్రతీక కూడా -
అవే మూసిన తలుపులు. అవే వెలసిన గోడలు. వాటిపై పిచ్చిగీతలు -

నువ్వు చూడవు వాటివైపు. ఎందుకంటే మరి అవి
ఏ పసివేళ్ళూ లేక వడలిపోయిన రంగులో, లేక ఎవరూ లేని రాత్రుళ్లో, రాత్రుళ్ళలో
ఆగిపోయిన శ్వాసలో, నువ్వు లేవని తెలసి ఇక నిన్ను పిలవలేక
స్థాణువై చిట్లిన పెదాలో, తెలియదు ఎవరికీ -

ఎందుకంటే
ఎవరితోనూ మాట్లాడవు అవి – ఎందుకంటే
ఎవరి ముందూ తమ చరిత్రలు విప్పుకోవు అవి. ఎందుకంటే
ఎవరి ముందూ, తమ గాధలు చెప్పుకోవు అవి. ఎందుకంటే
ఎవరి ముందూ, కన్నీళ్లు పెట్టుకోవు అవి. చివరిగా

ఎందుకంటే

నీ అరచేతుల్లోంచి జారిపోయిన గాజు పుష్పాలు అవి
ఏ ప్రదర్శనశాలలోనో ఇమడలేక తప్పిపోయి, దారి తెలియక బిక్కుబిక్కుమనే పిల్లలు అవి
గూళ్ళు రాలిపోయి, గుడ్లు చితికిపోయి అక్కడక్కడే అల్లల్లాడే పిచ్చుకలూ, తల్లులూ అవి -

అంతిమంగా
స్వప్నాలలో, గోడలలోంచి నీడలు తొలుచుకు వచ్చి కమ్ముకునే వేళల్లో
నువ్వు గుర్తుకు వచ్చి, తటాలున లేచి కూర్చుని
దడదడలాడే గుండెతో వణికిపోయే నేను – అవి.

అవును.
వాళ్ళు చెప్పేదే నిజం. సృజనా, నూతనమైనది ఏమీ లేదు. ఎప్పటిలాగే
ఇటువైపు చూడవు నువ్వు !

 


 

2. నువ్వు ఉన్నందుకే

అలసిపోయాను.
ఈ రాత్రి – ఆఖరకు దీపం వెలిగించుకునే ఓపిక కూడా లేదు. అప్పటిదాకా వీచి
ప్రాణం పోసిన గాలి నిశ్చలంగా మారినట్టు
చీకటి ఇంత కుదురుగా, కరకుగా చిక్కగా

నుదురుని బలంగా
ఒక రాయికేసి మోదుకున్నట్టు ఉంటుందని తెలిసింది ఈనాడే. సృజనా, సృజనా
తడి ఆరి, ఎండి పగిలిపోయిన పెదాలు.
పగటి నిప్పుల్లో దగ్ధమయిన కనులు
ఏ మాత్రమూ ఆశనివ్వని నక్షత్రాలు

వడలి, వొంగిపోయిన లతలు.
పక్షులు వొదిలివేసిన గూడు. వ్యాపించి జలదరింపజేసే నీడలు. పగిలిన కుండీలు.
ఇక హృదయమొక తెగిన పూలకొమ్మై
అరచేయి అంచున ఆఖరి శ్వాసతో

ఊగిసలాడే ఒక చిన్ని ఎరుపు పూవై
ఈ సమయమై, రెండు అరచేతుల మధ్య ముఖాన్ని కుక్కుకునే ఒంటరితనమై
చివరికి నువ్వై -

సృజనా, అవును
అలసి పోయాను.
ఇదంతా నువ్వు ఉన్నందుకే. ఇదంతా నువ్వు ఉండి
ఇక్కడ లేనందుకే

 

**** (*) ****

విహంగ: వివాహం

2015-04-02 05:53 AM కె . వరలక్ష్మి
ఏప్రెల్ నెలలో మా ఫిఫ్త్ ఫాం పరీక్షలు ముగిసాయి .ఆరో తరగతి పరీక్షలు వ్రాసిన మా పెద్ద చెల్లిని కూడా నాతో కూర్చో బెట్టుకుని చదివించేను . చిన్న వాళ్లు ముగ్గురికీ ప్రాధమిక పాఠశాలలో పరీక్షలు ఎప్పుడో అయి పోయేయి . ఆ వారం కొండల్రావు గారు వస్తూ వస్తూ చెస్ బోర్డు , పావులు … Continue reading

2015-04-01

మాలిక పత్రిక | మాలిక పత్రిక: మాలిక పత్రిక ఏఫ్రిల్ 2015 సంచికకు స్వాగతం

2015-04-01 07:34 AM జ్యోతి వలబోజు
Jyothivalaboju Chief Editor and Content Head పాఠకుల ఆదరాభిమానాలతో మరిన్ని ఆకర్షణీయమైన, పఠనీయమైన వేర్వేరు అంశాల మీద రాయబడిన రచనలను మీకోసం అందిస్తోంది మాలిక పత్రిక. ఈ నెలనుండి మాలిక పత్రికలో నాలుగు విభిన్నమైన సీరియళ్లు ప్రారంభమవుతున్నాయి.  మరిన్ని కొత్త ప్రయోగాలకు మాలిక పత్రిక ఎప్పుడు ఆహ్వానిస్తుంది. మీరు రాయాలనుకుంటున్నారా? రాయండి.  ఈ చిరునామాకు పంపండి. editor@maalika.org ఈ నెల విశేషాలు: 00.  మండా సుధారాణి   01. ధీర 2 02. అంతా [...]

మాలిక పత్రిక | మాలిక పత్రిక: మండా సుధారాణి

2015-04-01 05:03 AM Editor
రచన, ఇంటర్వ్యూ: విశాలి పెరి శ్రీమతి మండా సుధా రాణి గారు..  ఇప్పటి సంగీత విదుషీమణులలో అగ్రగణ్యురాలు. పల్లవి పాడటంలో ప్రవీణురాలు.  ప్రస్తుతం విశాఖలో ఎందరో సంగీత అభ్యాసకులకు మార్గదర్శిగా ఉంటున్నారు. ఈవిడ 1964 లో విజయనగరం లో శ్రీమతి కల్యాణి, రమణ మూర్తి గార్ల దంపతులకు ఆ వీణాపాణి సరస్వతీదేవి పుట్టినరోజుగా చెప్పబడుతొన్న వసంత పంచమి నాడు జన్మించారు. విజయనగరం మహరాజా కాలేజి నుండి బి.ఎస్.సి. పట్టభద్రులైనారు. ఆ తరువాత  ఆంధ్ర యూనివర్సిటిలో సంగీత డిప్లమా [...]

కౌముది మాసపత్రిక: కౌముది ఆడియో వారపత్రికలు

2015-04-01 12:11 AM
కౌముది ఆడియో వారపత్రికలు

కౌముది మాసపత్రిక: కౌముది - ఏప్రిల్ 2015 - 100వ ప్రత్యేక సంచిక విడుదలైంది..!

2015-04-01 12:10 AM
కౌముది - ఏప్రిల్ 2015 - 100వ ప్రత్యేక సంచిక విడుదలైంది..!

2015-03-31

వాకిలి: ఇంతకీ- ఎందుకనీ రాయడం?

2015-03-31 09:19 PM వాకిలి

ఎందుకు రాస్తావు?

“ఎప్పుడూ కాదుకానీ, ఎప్పుడో ఒకసారి, అదెప్పుడో ఎందుకో ఇంకా సరిగ్గా తెలీదు. ఏదో ఆరాటం మొదలౌతుంది. ఎక్కడా తిన్నగా ఉండనీదు, చేస్తున్న పనేంటో అర్థం కాదు. అప్పుడొకటే దారి. వీలు చేసుకుని ఎక్కడోచోట కూర్చుని ఉన్న ఫళాన రాసెయ్యాలి. హమ్మయ్య! రాసేస్తానా, అప్పుడు కాస్త ఊపిరాడటం మొదలౌతుంది.”

మరి నీసంగతి?

“ఏదైనా కష్టమొస్తుంది కదా. చాలా పెద్ద విషాదం ఒక్కోసారి. బాగా బాధేస్తుంది. ఏడ్చినా, ఎవరితో చెప్పుకున్నా తీరదు. ఆ తీవ్రత, విషాదపు లోతు ఉన్నదున్నట్టు బయటికి పంపాలంటే రాసుకోడం తప్ప వేరే దారి లేదు.”

సరే- ఇంకా ఎప్పుడెప్పుడు?

“ఏదైనా ఒక సంఘటన జరుగుతుంది. ఒక అన్యాయం, ఒక మూర్ఖత్వం, ఒక అణచివేత కనపడతాయి. ఆ ఒక్కటీ ఒక్కటి కాదనీ, వాటి మూలమైన భావజాలం మనుషుల్లోనూ, సమాజపు తీరులోనూ లోతుగా ఇంకిపోయి ఉందని, అలాంటివి జరుగుతున్నాయని తెలీని వాళ్లకి చెప్పాలని, ఎందుకు జరుగుతున్నాయో అప్పటికప్పుడు బేరీజు వెయ్యకుండా మరిన్ని ఉదాహరణలతో చర్చించాలని, రచనలద్వారా, ఆ ఆలోచననీ, వివేకాన్నీ విస్తరించాలనీ ఉంటుంది.”

కథో కవితో చెప్పగల నేర్పు, భాష, శైలి లాంటివన్నీ కేవలం సాధనాలు (టూల్స్) గా అర్ధం చేసుకుంటే వీటన్నిటినీ వాడుకుని రాసే శక్తి/బలహీనత/అనివార్యత ఏదైతే ఉందో అదే రచన. మాములుగా అందరూ చూసే ఒక ర్రైల్వే స్టేషన్ దృశ్యాన్నో, ఒక సాయంత్రపు సంతనో, ఒక వర్షాకాలపు మధ్యాహ్నాన్నో టెలిస్కోపిక్ కళ్లతో చూస్తాడు రచయిత. తన అభిప్రాయాల్లోకి, ఆలోచనల్లోకి, తన భావజాలపు లోతుల్లోకి అదే పదునైన చూపుని విసురుకుంటాడు. ఒక అనుభూతిగానో, అనుకంపనగానో తను అనుభవించిన సంచలనాన్ని భాషా ప్రపంచపు అర్థాల్లోకి ఇరికించటానికి పదే పదే ప్రయత్నిస్తుంటాడు.

రచన చేసేటప్పటి రచయిత స్థితి ఒక పూనకమో, ట్రాన్సో అనిపిస్తుంది. వ్యక్తిగత జీవితంలో తనేమిటో దానికి దూరంగా మరొక కొత్త మనిషిగా, ఆ కాసేపటికి ఆ రచనా వస్తువే తన పూర్తి అస్తిత్వంగా మారిపోతాడు. ఒక్కోసారి తన అనుభవానికి, తెలివికీ మించిన ఊహాశక్తితో రచయిత పరిధిని మించి రచన ఎదిగిపోవడమూ, దానికది స్వతంత్రంగా కొత్తదారుల్లో సాగిపోవడమూ కూడా నివ్వెరపోయి చూసుకుంటాడు. ఇది నేను రాయడం వల్ల వచ్చింది కాదు, నా ద్వారా బయటకొచ్చింది అని అర్థం చేసుకుని అక్షరాల ముందు వినమ్రుడౌతాడు.

***

“చూడు- ఇన్ని రాత్రులు మేలుకున్నావ్. మధ్యలో తిండి సహించక మానుకున్నావ్, ఏడ్చావ్, జుట్టు పీక్కుని తలబాదుకున్నావ్. చివరికి ఈ పుంజీడు కాగితాల మీద ఏదో రాశావ్. అసలెవరైనా చదువుతారంటావా? ఇదంతా కనీసం ఒక్క మనిషికైనా సరిగ్గా అర్థమౌతుందంటావా? అసలెందుకూ రాస్తావ్?”

వేళ్ల మెటికలు విరుచుకుంటూ, అప్పటిదాకా మోస్తున్న టన్నుల బరువుని దింపుకున్నవాడిలా నిట్టూర్చి అతనన్నాడు-
“నేనూ ఆలోచించాను. నేనురాసేది చాలామందికి, అసలెవరికీ అర్థం కాకపోవచ్చేమో అని రూఢీగా అనిపించింది కూడా ఒకసారి. కానీ రాశాను. లోకం సంగతేమో కానీ, రాసుకున్న ప్రతిసారీ బహుశా, నాకు నేను ఏమైనా అర్థమౌతానేమో తెలుసుకోడానికి రాస్తాను.”

**** (*) ****

2015-03-29

వీక్షణం: Veekshanam April 2015

2015-03-29 03:30 AM veekshanampatrika

Please click on cover image to view Veekshanam April 2015 issue

04_April_2015

04-April-2015


2015-03-25

ఈమాట: అమెరికా ఎమరీ యూనివర్శిటీలో తెలుగు సాహిత్యపీఠం

2015-03-25 09:28 PM Madhav
మార్చ్ 26న అట్లాంటా నగరంలోని ఎమరీ యూనివర్సిటీలో తెలుగు ఆచార్య పదవి నెలకొల్పబడబోతున్న సందర్భంగా ప్రత్యేక ప్రకటన ఈమాట పాఠకులతో పంచుకోడం కోసం.

2015-03-16

జాబిల్లి: మాటే మంత్రం

2015-03-16 01:49 PM
రంగాపురంలోని పాండురంగం చాలాధనవంతుడు.తాను గొప్పవాడిననే గర్వమూ అతని ధనమత ఉంది . ఎవ్వరికీ ఒక పట్టాన సహాయంచేసేవాడుకాదు.అందరూ అతడివెనక గేలిచేసేవారు.ఎవ్వరూ అతడితో మాట్లాడనుపెద్దగా ఇష్టపడేవారుకాదు. పాండురంగంమాత్రం అందరూ తాను గొప్పవాడైనందున తనకు భయపడి ఎవ్వరూమాట్లాడటంలేదనిభ్రమించేవాడు.ఇలాఉండగా ఆఊరిపాఠశాలకు మురళిఅనే మాస్టర్ ట్రాన్స్ ఫరై వచ్చాడు. అతడునివసించను ఇల్లుకోసం వెతుక్కుంటుండగా,ఆఊరి రైతుఒకతను”పంతులుంగారూ!మీకీ ఊర్లోనివసించను తగినఇల్లు దొరకడం కష్టం,అన్నీపూరిళ్ళే!పట్నం నుండీ … Continue reading

2015-03-01

ఈమాట: ఈమాట మార్చ్ 2015 సంచికకు స్వాగతం!

2015-03-01 12:12 PM Madhav
ఒక సమాజపు ఔన్నత్యం, ఆ సమాజం తన స్త్రీలు, పిల్లలు, వృద్ధులతో ఎలా ప్రవర్తిస్తుంది అన్న అంశంపై ఆధారపడి వుంటుందని వాడుక. వీరితో మనం ప్రస్తుతం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకూ తెలుసు. ఇప్పుడు ఈ జాబితాలో మనదేశపు రచయితలనూ కళాకారులనూ చేర్చవలసి రావడం దౌర్భాగ్యం. సంస్కృతి పేరుతో స్త్రీల పైన, మనోభావాలు దెబ్బ తింటున్నాయన్న నెపంతో రచయితలు, కళాకారుల పైన, తమ ఆత్మన్యూనతను కప్పి పుచ్చుకునేందుకు ఈ సంస్కృతీరక్షకుల దౌర్జన్యం రానురానూ దుర్భరమవుతున్నది. వీరికి మాత్రమే సమాజపు మంచీ చెడూ తెలుసు, వీరు ఒప్పుకున్నవే విలువలు, కేవలం వీరే నైతికధర్మాధికారులు, వీరిని వీరే ఎన్నుకుంటారు. సృజనకూ అభిప్రాయ వ్యక్తీకరణకూ స్వేచ్ఛ ఇవ్వని సమాజమూ విమర్శను తీసుకోలేని సంస్కృతీ పతనానికే దారి తీస్తాయని వీరు గ్రహించరు. ఈ రకమైన ప్రవర్తనలో వీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారో స్పష్టంగానే కనిపిస్తుంది. మనవారు రాయని శాస్త్రం లేదని, ప్రవచించని సత్యం లేదని, కనిపెట్టని విజ్ఞానం లేదని, మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ అబద్ధాల చరిత్రలు రాసుకున్నంత మాత్రాన మన సమాజం, సంస్కృతి ఉన్నతమైనవి అయిపోవని, మన ఔన్నత్యం కేవలం మన ప్రజాస్వామ్యపు విలువలని కాపాడుకోవడం లోనే ఉందనీ వీరు గ్రహించరు. సంస్కృతీసాంప్రదాయాల పరిరక్షణ ముసుగులో వీరు చేస్తున్న అఘాయిత్యాలు కేవలం వీరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే. ఈ రకమైన నిర్బంధాలు మానవ చరిత్రలో కొత్త కాదు. కాలం నిదానంగా అయినా సరే, నిష్పక్షపాతంగానే నిజాన్ని వెలికితీస్తుంది. చరిత్రలో ఇంతకు ముందు ఇదేవిధంగా ఎందరో ఉగ్రవాదులను పంపిన దారినే వీరినీ పంపుతుంది. రక్షణ కోసం స్వాతంత్ర్యాన్ని త్యాగం చేసిన మనిషి ఆ రెంటికీ అర్హుడు కాడని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నట్టు, ఇలాంటి ప్రతికూలత ఎదురైనప్పుడల్లా ఎవరికీ తల ఒగ్గకుండా మన స్వేచ్ఛను నిర్భయంగా ప్రకటించుకుంటూ వుండడమే మనం చేయగలిగిందీ చేయాల్సిందీ.

2015-02-28

వీక్షణం: Veekshanam March 2015

2015-02-28 12:53 PM veekshanampatrika

Please click the cover image to view Veekshanam March 2015 issue

03_March_2015

03-march-2015_cover


2015-02-13

అభ్యుదయ » అభ్యుదయ: కేశవరెడ్డి మృతికి అరసం సంతాపం

Kesavareddy

 

స్మశానం దున్నేరు, మునెమ్మ, చివరి గుడిసె, రాముండాది రాజ్జెముండాది వంటి నవలల్లో దళిత జీవిత దుర్భరత్వాన్ని, పాఠకులను చైతన్యవంతం చేసేలా, ఆలోచనలు రేకెత్తించేలా రచనలు సాగించిన నిబద్ధ రచయిత కేశవరెడ్డి. దళితవాదం లేని రోజుల్లో దళిత హక్కుల కోసం ఉద్యమస్థాయిలో వినిపించిన బలమైన గొంతు కేశవరెడ్డి !

మనవజీవితపు చీకటి కోణాలను, సంక్లిష్టతలను తనదైన శైలిలో చిత్రించిన గొప్ప నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి మృతికి అభ్యుదయ రచయితల సంఘం (అరసం) సంతాపం తెలుపుతోంది.

 

- వల్లూరు శివప్రసాద్

ప్రధాన కార్యదర్శి

అభ్యుదయ రచయితల సంఘం

2015-01-17

Mydukur | మైదుకూరు: బక్కాయపల్లెలో వైభవంగా శివుడి గ్రామోత్సవం

2015-01-17 11:46 AM ఎడిటర్
సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఖాజీపేట మండలం బక్కాయపల్లె గ్రామానికి శనివారం ఉదయం చేరుకున్న ముత్తులూరుపాడు శ్రీగంగాపార్వతి సమేత పరమేశ్వర స్వామి కి గ్రామ ప్రజలు ఘనంగా నీరాజనాలు పట్టారు . సంక్రాంతి గ్రామోత్సవంలో శివుడు కనుమ పండగ రోజున ముత్తులూరుపాడు నుండి మూలవారిపల్లె, శాంతినగరం, శ్రీనివాసపురం , బి.కొత్తపల్లె , బి.తిప్పాయపల్లె లమీదుగా  ఊరేగిస్తూ బక్కాయపల్లె కు చేరుకున్నాడు . ఈ సందర్భంగా మేళతాళాలతో, బాణసంచాతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు . భక్తితో హారతులు పట్టారు. […]

2015-01-15

Mydukur | మైదుకూరు: చింతకుంట శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి దేవళం

2015-01-15 02:14 PM ఎడిటర్
మైదుకూరు:కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట లోని శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం ఎంతో ప్రాచీనమైనది. చింతకుంట గ్రామ శివార్ల లోని చెరువు , గ్రామంలో శిధిలావస్థలో ఉన్న శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం చింతకుంట గ్రామ పురాతన  చరిత్రకు, గతంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక  వైభవానికి  తార్కాణంగా నిలుస్తున్నాయి. చెన్నకేశవ ఆలయం జనమేజయుని కాలంలో నిర్మించబడిందని గ్రామస్తులు చెబుతున్నప్పటికీ ఆలయ వాస్తు, నిర్మాణ రీతులను పరిశీలిస్తే ఈ ఆలయం విజయనగర రాజులకాలంలో 13,14 శతాబ్దాల కాలంలో నిర్మించ బడినట్లుగా దాఖలాలున్నాయి […]

2014-12-13

అభ్యుదయ » అభ్యుదయ: ఈ తరం కోసం “కథాస్రవంతి”

2014-12-13 08:21 AM అరసం

Katha Sravanthi Sankalanam

 

వందేళ్ళు పైబడిన తెలుగు కథా చరిత్రలో ఎందరో గొప్ప కథకులు తెలుగు కథను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వేగవంతమైన నేటి ఆధునిక జీవితంలో, సాహిత్యాభిలాష ఉన్నా వేలసంఖ్యలో  ఉన్న కథలలో ఏవి చదవాలి? ఎవరివి చదవాలి? మంచి కథలను ఎంచుకోవడం ఎలా?  అన్న ప్రశ్నలు ఎదురవుతాయి. యువ రచయితలకు కూడా అధ్యయనం పెద్ద సమస్యగా మారింది!

 

ఈ ప్రశ్నలకు సమాధానమే “ఈతరం కోసం … కథాస్రవంతి’’

 

తెలుగు కథను సుసంపన్నం చేసిన మహా రచయితల రచనల నుండి 10 గొప్ప కధలను ఎంపిక చేసి, ఆయా రచయితల జీవితం, సాహిత్యంపై వివరణలతో, నేటి మంచి రచయితలే సంపాదకులుగా అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ సబ్సిడీ ధరతో అందిస్తున్న గొప్ప కథా సంకలనాలు మీ కోసం….

మల్టీ కలర్ లో, మంచి పేపర్ తో అత్యంత తక్కువ ధరలో ఈతరం  కోసం కథా పరిమళాలు ..

 

రచయితల పేర్లు
చాగంటి సోమయాజులు అల్లం రాజయ్య
కేతు విశ్వనాధ రెడ్డి పి.సత్యవతి
పెద్దిభొట్ల సుబ్బరామయ్య కొలకలూరి ఇనాక్
కొడవటిగంటి కుటుంబరావు మధురాంతకం రాజారాం
ఓల్గా మునిపల్లె రాజు

 

అరసం అందిస్తున్న 10 మంది గొప్ప రచయితల 10 కథ సంకలనాల సెట్ సబ్సిడి ధర రూ.500/-

AnandBooks.com ఈ సంకలనాల సెట్ ను ప్రీ పబ్లికేషన్ ఆఫర్ గా (Pre Publication Offer) మరింత తగ్గింపు ధరతో రూ. 400/- కే అందిస్తున్నది. ఈ అవకాశం డిసెంబరు 31 వరకు మాత్రమే!.

నేడే మీ కాపీ బుక్ చేసుకోండి.! Click Here >>

ముందుగా బుక్ చేసుకున్న పాఠకులకు జనవరి మొదటి వారంలో రిజిష్టర్ పోస్ట్ ద్వారా సెట్ ను పంపుతాము.

ఈ కొత్త సంవత్సరాన్ని మంచి కథా పఠనంతో ప్రారంభిద్దాం …..రండి

 

*****

2014-11-17

నవతరంగం: Haider – Analysis

2014-11-17 04:08 PM అతిథి
1995 ఖుర్రం - ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న లాయరు, చాలా తెలివయినవాడు. తన వదిన ఘజాల అంటే అతనికి చాలా ఇష్టం, ప్రేమ, ఆరాధనా సర్వస్వం. అతని కలల రాకుమారి ని తనకు దక్కదనే విషయం అర్ధం చేసుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవలనుకున్నాడు. కాని విధి అతనికి ఇంకో అవకాశం ఇచ్చింది.   Dr.హలాల్ మీర్ – ఘజాల భర్త , తన ఎకైక సంతానం అయిన హైదర్ అంటె డాక్టర్ కి ప్రాణం, కొన్నాల(...)

2014-11-05

జంధ్యావందనం: జంధ్యాలకి డాక్టరేట్ పురస్కారం

2014-11-05 06:29 AM

123 తెలుగు.కాం వారి సౌజన్యంతో

కింద లింక్ లో అసలు వార్త చూడవచ్చు

http://www.123telugu.com/telugu/news/late-director-jandhyala-receives-doctorate.html

2014-08-12

బాల గౌతమి: Inspire జిల్లా స్థాయి సైన్స్ సదస్సు

2014-08-12 05:09 PM Murthy (noreply@blogger.com)
Inspire జిల్లా స్థాయి సైన్స్ సదస్సు లో నందిగామపాడు విధ్యార్థులు ది.3-8-2014 నుండి 5-8-2014 దాకా సత్తుపల్లి పట్టణం లో గల జ్యోతి నిలయం లో జిల్లాస్థాయి Inspire సైన్ ప్రోగ్రాం కన్నులవిందుగా ..కోలాహలంగా జరిగింది.ఖమ్మం జిల్లా నాలుగుచెరగులనుంచి విధ్యార్థినీ విధ్యార్థులు దీని లో ఉత్సాహంగా ఫాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ,నందిగామపాడు నుంచి ఇద్దరు విధ్యార్థులు ఈ

2014-08-11

బాల గౌతమి: (శీర్షిక లేదు)

2014-08-11 03:08 PM Murthy (noreply@blogger.com)
బాల గౌతమి పిల్లలకోసం నడపబడుతున్న ద్వైమాసిక వెబ్ మేగజైన్.బాలలు ఆనందించడానికి,ఆస్వాదించడానికి,సృజనాత్మకతను పంచుకోవడానికి ఈ వెబ్ మేగజైన్ ఒక వేదికలా ఉపయోగపడాలనేది మా అభిమతం ...!దీనిలోని రకరకాల శీర్షికల్ని గమనించి మీకు ఆసక్తి గలిగిన అంశాల్ని,రచనల్ని,చిత్రాలని మాకు పంపించమని బాలలని కోరుతున్నాం. మీ రచనలు ఇంగ్లీష్ లోనైనా ఉండవచ్చు లేదా తెలుగు లోనైనా ఉండవచ్చు ..!అయితే పూర్తి చిరునామా ,మీరు

2014-03-20

జంధ్యావందనం: అహ నా పెళ్ళంట - లక్ష్మీపతి

2014-03-20 07:30 AM

ఆదివిష్ణు రాసిన 'సత్యం గారి ఇల్లు ' కధ/నవల లోని సత్యం పాత్రనే లక్ష్మీపతి గా మార్చారు.ఆ పాత్రలో కోట శ్రీనివాసరావు నిజంగా జీవించారనే చెప్పాలి.

లక్ష్మీపతి పాత్రను తొలుత రావుగోపాలరావు చేత వేయించాలనుకున్నారు.లుక్ పరంగానూ,నేటివిటీ పరంగానూ ఆయన కరక్ట్ కాదేమోనని ఎవరో సందేహం వెలిబుచ్చటంతో జంధ్యాల కోటను ఎన్నుకున్నారు.అప్పటికి కోట సినిమా ఫీల్డ్ కొచ్చి  రెండేళ్ళు అవుతోంది.


సినిమాల్లోకొచ్చేముందు కోట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం చేస్తూ తీరిక దొరికినప్పుడల్లా నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు.జంధ్యాల "అమరజీవి" సినిమా చేస్తున్నప్పుడు సరదాగా కోట తో ఓ వేషం వేయించారు. అక్కినేని ఇంటి ఓనర్ పాత్రలో కనిపిస్తారాయన.కోటకి నటునిగా తొలి చిత్రం "ప్రాణం ఖరీదు".ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ తో అమరజీవి లో నటించారు.తర్వాత బాబాయ్ అబ్బాయ్ లో కూడా ఓ పాత్ర పోషించారు.

2013-11-30

పొద్దు: నందనవనం – వచనకవి సమ్మేళనం – రెండవ భాగం

2013-11-30 10:18 AM స్వాతికుమారి
నందనవనం - ఉగాది వచన కవి సమ్మేళనంలో రెండవ భాగం పూర్తిగా..

2013-11-29

పొద్దు: ఆరు దశాబ్దాల క్రితపు తెలుగు పత్రిక – 2

2013-11-29 01:44 PM కొడవటిగంటి రోహిణీ ప్రసాద్
అలనాటి తెలుగు పత్రిక పేజీల చిత్రాలు. పూర్తిగా..

2013-08-11

TRP: Better That We Break

2013-08-11 05:46 PM Tanfika Radita Putri (noreply@blogger.com)
The first. I dont know what must i post in here. But I think my brain its a runyem rued whatever is that. This post i will telling about love story. Chech this out
I never knew perfection till 
I heard you speak and now it kills me 
Just to hear you say the simple things 
Now waking up is hard to do 
Sleeping's impossible too 
And every thing's reminding me of you 
What can I do? 
It's not right, not okay 
Say the words that you're saying 
Maybe we're better off this way 
I'm not fine, I'm in pain 
It's harder everyday 
Maybe we're better off this way 
It's better that we break 
A fool to let you slip away 
I'll chase you just to hear you say 
You're scared enough 
You think that I'm insane 
I see you, you look so nice from here 
Pity, I can't see it clearly 
Why you're standing there 
It disappears, it disappears 
Saw you sitting on the lawn 
You're fragile and you're cold 
But that's all right 
The lie these days is getting rough 
Knocked you down and beat you up 
But it's just a roller coaster anyway.

2013-01-18

మన్యసీమ: MANYASEEMA TELUGU DAILY

2013-01-18 05:08 PM manyasima
MANYASEEMA TELUGU DAILY http://www.manyaseema.com/index.php?a=epaperFiled under: వార్తలు

మన్యసీమ: మన్యసీమ తెలుగు దినపత్రిక

2013-01-18 04:37 PM manyasima
http://www.scribd.com/fullscreen/120973838Filed under: వార్తలు

2012-09-22

వాచకంపక్షపత్రిక: (శీర్షిక లేదు)

2012-09-22 06:36 AM Chikati Thrinadh (noreply@blogger.com)
వాచకం పక్షపత్రిక సెప్టెంబర్ 16 - 30

వాచకంపక్షపత్రిక: (శీర్షిక లేదు)

2012-09-22 06:18 AM Chikati Thrinadh (noreply@blogger.com)
వాచకం పక్షపత్రిక  జూలై 1 - 15

2012-02-10

For Kids: ఇరుక్కున్న ముక్కు

2012-02-10 10:47 AM ADMIN
రచన  : కాదంబరి పిదూరి చిలక చిలక, రామ చిలుక; ముక్కు మీద టెక్కు కోపం;  కోపం, అలుక కుప్పలు అయ్యి;  ముక్కు కాస్తా ఎర్రన ఆయెను; ఎర్రన, తిమ్మన-  ముక్కు కవితలకు;  అల్లికలెన్నో అందించినది  రాచిలకమ్మ చిన్ని నాసిక ఎర్రని -అలకల- కినుకల శుకము  దోర జామ పళ్ళను చూసీ………. చూసీ, చూడగనే……..  Q:- ఆ! ఏం చేసినది?       ఆహాహా! ఏమి చేసినది? జామ కాయను కొరికె కసుక్కున; పండులొ ముక్కు ఇరుక్కున్నది [...]

For Kids: వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము

2012-02-10 10:41 AM ADMIN
రచన  : కాదంబరి పిదూరి విష్ణువర్ధనుని భార్య అఖిలాండేశ్వరీ దేవి.  వారి కుమార్తె హరిత, కుమారుడు గ్రీష్మ దేవ్.  విదేహ రాజ్యానికి నదీశ్వర్ ఏలిక.  “మా పుత్రిక స్వయం వరము జరుగుతుంది.  కాబట్టి మీరెల్లరూ ఈ సంరంభములో పాల్గొనవలసినదిగా  కోరుచున్నాము“ విష్ణువర్ధనుని కుటుంబీకులు -  వారి బంధువుల పాలనలో ఉన్న విదేహ రాజ్యానికి వెళ్ళారు. నదీశ్వరుని కుమార్తె అంతకు మునుపే, రోహణుని ప్రేమించింది,  కాబట్టి ఆమె అక్కడ స్వయంవరములో  రోహణుని మెడలో వరమాల వేసినది,  వారిరువురికీ పరిణయం కుదిరింది. ************************************** అందరూ తమ [...]

2011-10-18

వినుకొండ_ప్రెస్: గత యాబై సంవత్సరాలలో మూడు లక్షల మంది పసికందులను అపహరించిందట ఈ మతసంస్థ

2011-10-18 04:10 PM వినుకొండ ప్రెస్ (noreply@blogger.com)
http://www.dailymail.co.uk/news/article-2049647/BBC-documentary-exposes-50-year-scandal-baby-trafficking-Catholic-church-Spain.htmlగత యాబై సంవత్సరాలలో మూడు లక్షల మంది పసికందులను అపహరించిందట ఈ మతసంస్థ.ఎంతఘోరం ? చదావండి పై లింకులో
వ్యాఖ్యలు
2015-04-19
2015-04-19 09:53 AM Radha - Comments for వాకిలి
2015-04-19 09:52 AM Radha - Comments for వాకిలి

బావుంది విజయ్ బాబు గారూ, ఇలాంటి చిన్నపిల్ల వైపు నుండి నేను కథ రాయాలని అనుకుని సగం రాసి ఉన్నాను. పూర్తి చేయాలి. ఈ సందర్భంగా తాగుబోతు వాని భార్య చెప్పే కథ నేను రాసి నా బ్లాగ్ లో పెట్టుకున్న ఈ చిన్ని కథని చదువుతారని షేర్ చేసుకుంటున్నాను సమయం ఉన్నప్పుడు చూడండి
రాధ

2015-04-19 07:58 AM bhuvanachandra - Comments for సారంగ

ధన్యవాదాలు అక్బర్ పాషా గారూ …నమస్తే

2015-04-19 06:41 AM Vijaya Babu Koganti - Comments for సారంగ

చాలా ఆసక్తికరమైన విషయాలనందించిన పరిశోధనాత్మక వ్యాసం. శీర్షికతో ఆసక్తిని పెంచిన వ్యాసంఆసాంతం అలానే సాగింది. కేవలం శ్రీ శ్రీమాత్రమే కాదు చాలా మంది ప్రముఖమైన కవులు కూడా శ్రీ సెట్టి నరసింహం గారి రచనలకు ప్రభావితులై కూడా ప్రకటించని విషయం సత్యమనిపిస్తోంది. మంచి వ్యాసం అందించినందుకు అభినందనలు.

2015-04-19 01:36 AM varaprasad - Comments for పుస్తకం

ముందుగా అరునగార్ని అబినందిచాలి,ఇంట చక్కటి సమీక్ష రాసినందుకు.అయితే కొందరి ఆలోచనే కరెక్ట్ అనుకోవద్దు.ముక్యంగా ప్ర్రీతి విషయంలో,వివాహబందాన్ని కేవలం డబ్బుతోనూ సుకాలతోను సరిపేట్టుకోవలనుకొంటే భారతీయ సమాజంలో వివాహబందానికి ఇంత గౌరవం ఉండేదికాదు ఇంతకాలం మన్నేదికాదు.

2015-04-19 01:15 AM varaprasad - Comments for పుస్తకం

అచ్చంగా మీ కామెంట్స్ చదువుతుంటే చలాన్ని కళ్ళెదుటే చూస్తున్నట్టుంది,చలాన్ని శ్రీశ్రీని మళ్ళీ మళ్ళీ చదవాలనిపించడమే వాళ్ళ గొప్పదనం మన అదృష్టం.

2015-04-18
2015-04-18 06:30 PM D.Venkateswara Rao - Comments for విహంగ

ఎవరన్నా అనకున్నా
వృద్ధాప్యపు నరకమేగా

సమయం వరమిచ్చినా
దేహం సహకరించినా
నిజంగా క్షణ క్షణమూ
ఊహల జ్ఞాపకాల మైకంలో

కలల సౌందర్యంలో జీవించడం
మానవ జన్మకు బరువేగా

2015-04-18 05:56 PM D.Venkateswara Rao - Comments for విహంగ

మీ వీలునామాలోని ఆ నాలుగు పద్యాలను
మీ గడియాలం ఎన్ని కాలాలు ఎన్ని యుగాల వరకూ తీసుకు పోతుందో ఎవరికీ తెలుసు
మీ గడియారాన్ని ఈ లోకం ఆనందంతో ఆదరిస్తుంది.

2015-04-16
2015-04-16 08:05 AM G K S Raja - Comments for ఈమాట

@babjilu సుమారు ఆరు సంవత్సరాల తరువాత స్పందిస్తున్నాను. మీవి ప్రేలాపనలుగా ఏ మాత్రం అనిపించలేదు. చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పారు. పైగా మాండలీక సొగసులద్దేరు. బహు ముచ్చటగా ఉంది. ఎటొచ్చీ, కొడవళ్ళ, రోహిణీ ప్రసాద్ సంగతే నా మట్టి బుర్రకు అందడంలేదు. మీరు నావ్యాఖ్యను చూస్తే స్పందించండి. మీ గురించి కుతూహలంగా ఉంది. నమస్తే.

2015-04-16 07:46 AM G K S Raja - Comments for ఈమాట

శ్రీనివాస్ గారికి, మాధవ్ గారికి అందరం చెప్పినట్టే మరీ మరీ కృతజ్ఞతలు. విశేషించి ఈమాట వారికి, రమ భరద్వాజ గారికీ వందనాలు. రమ గారి సమాధానం అర్ధవంతంగా ఉంది. 25 ఏళ్ళ తరువాత మళ్ళీ బీరువా తెరిచాను చలం పుస్తకాల పునశ్చరణకి. ముందు ‘దాడి’ తులసి గారికి కృతజ్ఞతలు చెప్పాలి, రమ గారిచే ఇంత మంచి వ్యాఖ్య వ్రాయించినందుకు. స్త్రీల కు సంబంధించి, వారి సమస్యల పట్ల చలం కంటే అవగాహన, జీవితకాల నిబధ్ధత కలిగిన మరొకరి గురించి నాకు తెలియదు. మీకెవరికన్నా తెలిస్తే తప్పక తెలియచేయగలరు. నా బీరువాలో పెద్ద అరలో చలం పుస్తకాల పక్కన కొంచెం చోటు మిగిలి ఉంది. అజ్ఞానం వల్ల ఆ చోటు భర్తీ చెయ్యలేదు. తులసి గారి నుండి సమాచారం కోసం ఎదురు చూస్తాను. అన్నిటికీ మించి, ఇంతకాలం ‘ఈమాట’ లోని ఇంత అమూల్యమయిన విషయాలను గమనించనందుకు నా మీద నాకే జాలి కలుగుతోంది.

2015-04-11
2015-04-11 03:54 AM K. Narendra Mohan - వీక్షణం పై వ్యాఖ్యలు

Inka rajadhani yerpadaledu kaani “encounter” mathram modalaindi. Chittoor advullo chanipoyina vallu hanthakula, smugglerla, kooliela ane vishayam vadilesthe, adupuloki tesukunna vaarina pattukelli champasaraandi bahiranga rahasyam. TDP nayakule, avi hatyalani cheppakane chepparu.

Chanipoyina vari pakkane doolalu padi unte, vaari vaatini moosthune polisula pai daadi chesaraa ? Vyastha entha digajaari poyindi kanabaduthundi. Ee hanthaka vyavasthaku antham palakadam ippudu mundunna karthvayama.

2015-04-08
2015-04-08 12:03 PM Chimata Rajendraprasad Prasad - Comments for స్త్రీవాద పత్రిక భూమిక

ఓపిక,డబ్బుకు ఇబ్బంది లేని తల్లీ కూళ్ళ కు సంతోషంగా ఉండ డానికి ఎన్ని చెయ్యచ్చో గొప్పగాచూ పించారు. ఉద్యోగ బాధ్యతల్తో జీవితంలో సంగీతం, సాహిత్యం ఇంకాచిన్న చిన్న సంతోషాలకు ఎలా దూరమవుతారో , అవి మళ్లీ తిరిగి జీవితం లోకి తెచ్చేటట్టు చేసిన తల్లి కూతురే అదృష్ట వంతురాలని అనడంలో ఔచిత్యం ఉంది. పెద్ద వయసులో, పాత స్నేహితులను కలవాలను కోడం అది కూతురు అమలు పరచడం అపురూపంగా కాల్పనికంగా ఉంది.

2015-04-06
2015-04-06 05:05 AM Munna - Comments for నవతరంగం

అయ్యా,విలువల గురించి మాట్లాడకండి నవ్వొస్తుంది
ఇక్కడ విలువలు ఎవడికి కావలి
సరదా కోసం చూసే సినీమా లో
సరదానే ఉండాలి కాని
ఆ శ్రీకాకుళం అబ్బాయి మానసిక
వేదన ఎవడికి కావాలి ఆ వేదాన మేం అనుభవించడం లేదా

మన దేశం లో కొన్ని కార్పోరేట్ ప్రకటనలు చూసారా
ఒక ద్విచక్ర వాహనాన్ని చూసి మన ఆడవాళ్ళు దానివెంట పరిగెడతార
ఎవడో దిక్కుమాలిన సెంటు కొట్టుకున్నాడని
మన ఆడవాళ్ళు ఆది ముడ్డి సుట్టు తిరుగుతార
అవి చూడడానికి మీరు టీవీ ముందు కూర్చుని ఆ సినెమా చూసి రివ్యూస్ రాస్తున్నార
ఇక్కడ ఎవరిదీ తప్పులేదు
హ్యాపి డేస్ సినిమా బాగుంది
ఖర్చుపెట్టిన 50 రూపాయలకి విలువ ఉందా లేదా అంతే

2015-03-29
2015-03-29 11:32 AM narendra mohan kommalapati - వీక్షణం పై వ్యాఖ్యలు

Truparaneni Hanuman Choudhary (Veekshanam April Lekhalu) samcharam ekkada sekarincharogaani tappulo, abbadalo rasaru. Syriza kootami lo fascist golden dawn baghaswami kaadu. Adhikaram loki vacchaka Syriza golden dawn mattadudaarulatho , gharshana paduthune undi. Syriza kootami pradhanamga vamapaksha samsthala, green partyla kootami. Syriza prabhutvam lo aikya sanghatana erparichindi Independent greeks party tho. Independent greeks jatiyavada party, syriza kaadu.

2015-03-28
2015-03-28 06:59 PM April Fools Day - Comments for నవతరంగం

Mi website loni Acticles anni Chala Bagunnayi… I really Liked reading ur blog

2015-03-26
2015-03-26 12:49 PM రవికుమార్ బడుగు - Comments for స్త్రీవాద పత్రిక భూమిక

కలేకూరి దళితుడు కాబట్టి తాగుబోతయ్యాడు.. లేదంటే శ్రీశ్రీ అయ్యేటోడు

2015-03-23
2015-03-23 12:38 PM Marripoodi Mahojas (noreply@blogger.com) - వినుకొండ_ప్రెస్
This comment has been removed by the author.
2015-03-09
2015-03-09 11:34 AM aparna sanghanabhatla - Comments for జాబిల్లి

its good story

2015-03-09 11:33 AM aparna sanghanabhatla - Comments for జాబిల్లి

chala bagundi

2014-12-11
2014-12-11 05:15 PM sridhar - తెలంగాణ సోయి

i am a short film director i from warangal i need of your self for one shorfilm please contact in
7794915831

2014-10-24
2014-10-24 02:20 PM sudhakar - తెలంగాణ సోయి

Pl.give the details of latest edition

2014-08-10
2014-08-10 10:08 AM munisekharreddy - Comments for Mydukur | మైదుకూరు

Ippudu anadrasramamu sidhilovasthalo vundhi.

2014-06-30
2014-06-30 09:38 AM DIVYA - Comments for For Kids

nice story

2014-06-14
2014-06-14 06:32 AM rathnamsjcc - Comments for పొద్దు

భూమి మీద మనం జన్మించడానికి ఒక మార్గం కావాలి. పూర్వజన్మ పాపపుణ్యాల్ని అనుభవించి, తిరిగి వచ్చినచోటేక చేరుకుంటాం. అలా మనకి సాయపడుతున్న జన్మకారకులు తల్లిదండ్రులు. మనతోపాటు మరికొన్న జీవాలు ఋణానుబంధాలననుసరించి అదే గర్భవాసాన జన్మిస్తూవుంటారు. వారే మనకు సోెదరులు అవుతారు. ఫలానా వారు మనకి సోెదరిగా జన్మిస్తుందనిగానీ, సెదరుడుగా పుడతాడని గానీ మనకు ముందుగా తెలియదు. అదే జన్మరహస్యం.
ఇలా జన్మించిన మనకి తల్లి, తండ్రి, అక్కా, అన్నా, చెల్లెలు, తమ్ముడు అనే బంధాలు ఏర్పడతాయి. తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు వీరెవరూ మనతోపాటు రారు. అలాగే మనం మరణించేటప్పుడు తిరిగి ఈ తల్లి గర్భానికి చేరం. తల్లిదం డ్రులూ మనతో రారు. జన్మించడానికి, మరణించడానికి మధ్య నున్న వ్యవధిలో మనకి ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు బుద్దిపూర్వకంగా పుడుతూవుంటాయి. పెళ్ళి, పిల్లలు, సంసారం అనే సడిగుండంలో చిక్కుకుని, జీవితకాలంలో మనం కూడబె ట్టుకున్నది ఉన్నవారికి వదిలి తిరుగు ప్రయాణం అవుతాం. అప్పుడు మన సంసారంలో భార్యగానీ, పిల్లలుగానీ మనతో పాటు రారు. అందుకే వీటిమీద వ్యామోహాన్ని పెంచుకోకూ డదు. ఈ సంసార సాగరంలో పడితే పుడుతూ, మరిన్ని పాపకర్మలు చేస్తూ మరణిస్తూ తిరిగి వాటిని అనుభవించడానికి మరో గర్భాన జన్మిస్తూ ఇలా అంతులేని భవసాగరాన్ని జననమరణాలతో ఈదులాడుతూనే ఉండాలి.
అందుకే పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమంటారు. మంచి జన్మ లభించినందుకు ఈ జన్మలోనే పాప పరిహారం చేసు కుని, సకల బంధాలనూ విడనాడి, ఆ పరమేశ్వరుని పాదాలచెంత శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవడా నికి అహర్నిశలూ కృషిచేయాలి. ధర్మ పథంలో పయనిస్తూ, ఆ పరమపథాన్ని చేరుకోవడానికి భగవన్నామాన్ని జీవిత నౌకగా చేసుకుని నవవిధ భక్తిమార్గాలలో ఈ భవ సాగరాన్ని దాటాలి.
మరి మనకి తోడుగా, నీడగా ఉండేది ఏదీ..? అనే సంశయా నికి సమాధానంగానే శంకరులవారు ప్రబోధించారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి పరమేశ్వరుని శరణాగతి ఒక్కటే మార్గం అని. అన్ని జన్మల్లోనూ ఉత్కృష్టమైనది మానవ జన్మ. జన్మరాహిత్యాన్ని పొందడానికి ఇదే చక్కని చుక్కాని. పుట్టుక వల్ల ఏర్పడిన భవబంధాల మీద అనురక్తిని పెంచుకోకుండా, భగవంతుని అన్వేషించి పట్టుకుంటే ఈ జననమరణ చక్రంలో పడి కొట్టుకుపోకుండా ఆ పరమేశ్వరుడే మనల్ని ఒడ్డుకి చేరుస్తాడు. ఎవరూ మనతో రాకపోయినప్పటికీ, నీడలా మనని అంటిపెట్టుకు వచ్చేవి పాపపుణ్యాలు మాత్రమే అన్న విషయం విజ్ఞులందరికీ తెలిసినదే.

పుణ్యచరణ వలన ఉత్తమగతులు కలుగుతాయన్నదే వేదవాక్కు. అందుకు ఈశ్వరుడు అనుగ్రిహంచిన ఈ జన్మని, తిరిగి పరమేశ్వరార్పణమే చేయాలి. బ్రహ్మాండం నుంచి పుట్టిన అణువులు, పరమాణువులు మళ్ళీ బ్రహ్మాండంలోనే విలీనం కావాలి. అదే ప్రకృతి. దానిననుసరించి వర్తించడమే మానవ ధర్మం. అందుకు తగిన సాధన ప్రతి మానవుడు చేయాలి. అప్పుడే జన్మరాహిత్యం కలుగుతుంది. మనసా, వాచా, కర్మణా భగవంతుని సాన్నిధ్యాన్ని కోరుకునే ప్రతీ మానవుడు ఆయనలోనే లీనమవుతాడు. ఆయనే జన్మాంతరాన మనతో పాటు నడిచే, నడిపించే బాంధవుడు. మనం మమకారం పెంచుకున్నవారెవ్వరూ మనతో ఉండరు, రారు. అందుకే పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమంటారు. మంచి జన్మ లభించినందుకు ఈ జన్మలోనే పాప పరిహారం చేసుకుని, సకల బంధాలనూ విడనాడి, ఆ పరమేశ్వరుని పాదాలచెంత శాశ్వత స్థానాన్ని సంపాదించుకోవడానికి అహర్నిశలూ కృషిచేయాలి. ధర్మ పథంలో పయనిస్తూ, ఆ పరమపథాన్ని చేరుకోవడానికి భగవన్నామాన్ని జీవిత నౌకగా చేసుకుని నవవిధ భక్తిమార్గాలలో ఈ భవ సాగరాన్ని దాటాలి.

2014-05-19
2014-05-19 04:13 AM Anonymous (noreply@blogger.com) - లోకహితం
Very Good Article, Please keep publish this type of informative and helpful articles
2014-05-16
2014-05-16 04:06 AM Anonymous (noreply@blogger.com) - లోకహితం
Anduke, manchi vaallu ane mudra tesesukoni , start fighting.
2014-05-12
2014-05-12 06:33 AM LAXMI - Comments for For Kids

GOOD…

2014-04-19
2014-04-19 04:19 AM Ravi - Comments for Mydukur | మైదుకూరు

Please provide latest information on the site
Thank you for developing this wite

2013-11-29
2013-11-29 10:10 AM chandra - Comments for పొద్దు

kadedi kathaki anarham…!!!!

2013-02-28
2013-02-28 04:17 AM Kamal Kumar - Comments for మన్యసీమ

మీలాంటి వాళ్లు మరింత మంది అణగారిన వర్గాల కోసం కృషిచేయాల్సి ఉంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ మధ్యే మేము గిరిజనుల కోసం ఉచిత వైద్య సేవల కార్యక్రమాన్ని ప్రారంభించాం. త్వరలోనే మిమ్మల్ని కలిసి మరిన్ని విషయాలు చర్చించనున్నాం.

2012-03-08
2012-03-08 12:15 PM supree - Comments for మన్యసీమ

why it is not opening telugu calender

2011-10-22
2011-10-22 02:15 PM Anonymous (noreply@blogger.com) - వినుకొండ_ప్రెస్
రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సుమారు ఏభైకి పైగా అంశాలతో సంపూర్ణవిషయాలతో వెలువడుతున్నపత్రిక ఇదే. మిగతావి కేవలం తమ సంస్థల కార్యకలాపాలకోసం ప్రారంభించబడినవి మాత్రమే నండి
2011-04-11
2011-04-11 02:43 AM నచకి - Comments for ప్రాణహిత

పైన నేను ఉటంకించిన అభివ్యక్తులు యివీ:

“చరిత్రని వ్యాపారం చేస్తుంది. వ్యాపారాన్ని చరిత్ర చేస్తుంది.”

“నాలుగు సగం చిక్కిపోయిన వూళ్ళు ఆరిపోతున్న చలి నెగడు ముందు కూర్చొని, కట్టెపుల్లల చేతుల్ని నిప్పుల మీదికి తోస్తున్నాయి”

“చరిత్ర చొక్కాని తిరగేసి తొడుక్కుంటున్నా, నన్ను దాచేసిన చిరుగు కంతల్లోంచి సూర్యుణ్ణి కంటున్నా.”

“కలల కళల మాయా దర్పణమా, కాసేపు పగిలిపో!”

2011-04-11 02:40 AM నచకి - Comments for ప్రాణహిత

<>

<>

<>

<>

ఇవి చాలా నవీనమైన అభివ్యక్తులుగా కనిపించాయి. ఇక పాదాల విఱుపుల గుఱించి… ఏమో, నా మటుకు నాకైతే విఱుపుతో చదవటం అలవాటేననవచ్చు… కవిత్వం కొత్తగా అలవడుతున్న వాళ్ళకెలా ఉంటుందో మఱి? (సంభాషణయినా పదునుగా ఉన్నా లేకున్నా పలకడానికి ఒక ఎస్వీరంగారావుంటే పట్టు అదే వస్తుంది. పలుకుతున్నవాడు కొత్తగా మొలిచిన పిల్లనటుడైతే?) …పదనాద సమబంధం గుఱించి నాకు అంతటి అవగాహన లేకున్నా నాకెందుకో పాదాలుగా విడదీస్తేనే బాగుంటుందన్న భావన. ఈ భావన యండమూరి నవలల్లో అక్కడక్కడా కవితాత్మకంగా సాగే వాక్యాలు చదివిన నాటి నుంచి మాఱలేదన్న ప్రస్తావన సముచితమేమో. కానీ కవిత్వాన్ని మాత్రమే గమనిస్తే బోలెడంత కనిపిస్తోంది!

2011-01-21
2011-01-21 02:39 PM Mauli (noreply@blogger.com) - Books & Galfriends
Asalu name Geetaa chaarya chebitE bAvuntundi..vAru cheppaka pOyina..ikkada pen name lA, blog names alavaatE
2011-01-21 02:24 PM Srinivasa Raghava (noreply@blogger.com) - Books & Galfriends
super Hasini garu...inthaki meku oka vishyam telsa...Geethacharya kuda fake character...asalu name vere vundi...inka chala mystery vundi...nannu contact cheste anni chepta...
2009-02-14
2009-02-14 06:14 PM తాడేపల్లి - తెలుగు సాహిత్య వేదిక పై వ్యాఖ్యలు

కీ.శే.కేశవాచారి నా బ్లాగులో అప్పుడప్పుడు వ్యాఖ్యలు రాసేవారు. ఆయన బ్లాగులు నేను చదవలేదు. వ్యాఖ్యాతగానే పరిచయం. అయితే నేను సమైక్యవాదిని కావడం ఆయనకి నచ్చక వ్యాఖ్యలు రాసిన సందర్భాలే హెచ్చు. శైలిలో ఆవేశం జాస్తి. కానీ అది నిజజీవితంలో తొందఱపాటు నిర్ణయానికి దారితీసిందంటే బాధాకరంగా ఉంది.

2009-02-14 02:28 PM శివ బండారు - తెలుగు సాహిత్య వేదిక పై వ్యాఖ్యలు

వడ్లూరి కేశవాచారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..