ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2014-10-20

Hub of Telugu News: తల్లిదండ్రులను చంపేసి 72 రోజులు ఇంట్లోనే ఉంచేసిన బాలిక

2014-10-20 09:13 AM Kiran Reddy (noreply@blogger.com)
16 సంవత్సరాల బాలిక తన 22 సంవత్సరాల బాయ్ ఫ్రెండ్ తో కలిసి దత్తత తీసుకున్న తల్లిదండ్రులను చంపిన ఘటన వడోదరాలో చోటు చేసుకుంది.ఇంటి నుండి చెడు వాసన రావడంతో ఇంటి చుట్టుపక్కల వారు పోలిసులకు సమాచారం అందించారు.పోలీసులు బలవంతంగా తలుపులు తెరచి చూస్తే అందులో రెండు శవాలు కనిపించాయి.అమ్మాయి మీద అనుమానంతో పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది.హత్య చేసింది తానే అని ఒప్పుకుంది.తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఈ

Hub of Telugu News: జయలలితకు రజనీకాంత్ లేఖ.. బీజేపీ షాక్

2014-10-20 09:05 AM Kiran Reddy (noreply@blogger.com)
అక్రమాస్తుల కేసులో అరెస్టు అయి, శనివారం జైలు నుంచి విడుదలైన అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సూపర్ స్టార్ రజనీకాంత్ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ లేఖ రాశారు. ఇది బీజేపీ నేతలను షాక్‌కు గురిచేసింది. రజనీని తమ పార్టీలోకి తెచ్చేందుకు బీజేపీ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.    ఇప్పుడు ఆయన హఠాత్తుగా జయకు లేఖ రాయడం బీజేపీకి రుచించలేదని అంటున్నారు. రజనీతో పాటు

బివిడి ప్రసాదరావు: మ్'లు 06

2014-10-20 08:56 AM బివిడి ప్రసాదరావు (noreply@blogger.com)
శారీరకమ్ శృంగారమ్ మానసికమ్ సాగరమ్ ***

జయం సంతోషం: గాఢ నిద్ర మీకూ కావాలనుకుంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి !

2014-10-20 07:11 AM satish kumar (noreply@blogger.com)
ప్రస్తుత కాలంలో వ్యక్తులు విశ్రాంతి తీసుకునే సమయం తగ్గిపోతోంది. బిజీ లైఫ్, ఒత్తిళ్ళు ఇలా ఎన్నో అంశాలు వ్యక్తులపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా నిద్రపోయేందుకు తగిన సమయం దొరక్క ఇబ్బంది పడుతుంటారు కొందరు. మరికొందరు పడుకున్నా నిద్ర రాక, అటూ ఇటూ దొర్లుతుంటారు. కంటినిండా నిద్రతోనే అందమైనా, ఆరోగ్యమైనా! శిశువులను చూడండి, వారు ఎంతో హాయిగా నిద్రపోతారు. అలాంటి గాఢ నిద్ర మీకూ కావాలనుకుంటే ఈ చిట్కాలు

kavithaa prasthanam: water management

2014-10-20 07:10 AM chennapragada v n s sarma (noreply@blogger.com)

రాఘవ్ వాయిస్: భారతదేశం - సెక్యులరిజం

2014-10-20 07:07 AM rajiv raghav
ఏ దేశానికైనా తమ శతాబ్దలనాటి చరిత్రని ప్రతిబింబిచే విధంగా మసలుకోవడం, సాంస్కృతిక  సంప్రదాయాలను మర్చిపోకుండా కొనసాగించడం అంటే తమ ప్రాంతానికున్న విశిష్టతని, చరిత్రని భావి తరాలకు తెలియజేయాలనే. ఆయితే ప్రస్తుతం ఎన్ని దేశాలు ఇటువంటి పని చేస్తున్నాయో తెలియదు కానీ, ఇండోనేషియా దేశంకు సంబంధించి “హిందూ జ్వాల” నామం కల్గిన పేసుబుక్కు వాల్ నుండి సేకరించిన సమాచారం బాగుందనిపించి ఉన్నదున్నట్టుగా ఇక్కడ పోస్టు

balu: అందరికీ ధన్యవాదములు

2014-10-20 06:59 AM suji panigrahi (noreply@blogger.com)
నేటితో నా బ్లాగర్ వీక్షకుల సంఖ్య 10025 కి చేరిందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. సాధారణ గృహిణి ఐన నాకు ఇంటర్నెట్ గురించి అసలు తెలియని దశలో మావారి ప్రోత్సాహంతో ఫేస్ బుక్, బ్లాగర్ ల్లొ ఖాతాలు ఓపెన్ చేయించి వాటి గురించి వివరించారు. దీంతొ నా బ్లాగర్ ప్రపంచంలో నా మదిలో భావాలు, నాకు తెలిసిన మంచి విషయాలు, నేను చదివిన సంప్రదాయాలపై మిత్రులందరితో పంచుకుంటున్నాను. తక్కువ వ్యవధిలోనే పదివేల మంది నా బ్లాగర్

శ్రీ కామాక్షి: ఈ సారి కంచి యాత్ర...

2014-10-20 06:40 AM nagendra ayyagari (noreply@blogger.com)
కార్తీకంలో సత్సంగ సభ్యులందరం తెలపెట్టిన ’నగరేషు కాంచీ’ యాత్ర ఏర్పాట్లకు వెళ్ళి ఇవ్వాళ పొద్దున్నే వచ్చాము.  నేను, ఇతర స్నేహితులందరం ఈ 3 days 30 temples type బస్సు యాత్రలకి ఫక్తు వ్యతిరేకులం. ఏం చూస్తాం ఏం సాధిస్తాం, అలా వెళ్ళి వచ్చిం తరవాత ఫలానా క్షేత్రంలో ఫలానా చూసారుగా కాస్త చెప్పండి మేము వెళ్ళినప్పుడు చూడాలనుక్కుంటాన్నామంటే ఆ ఆలయదైవం ఎవరు అని తప్ప మిగతా విషయాలు తెలీవు అంటారు.. సరే

ఆలోచనా తరంగాలు: తెలుగు సినిమా పాటల ట్రాక్స్-మచిలీపట్నం ట్రిప్-ఆధ్యాత్మిక చర్చ-1

2014-10-20 06:14 AM Satya Narayana Sarma (noreply@blogger.com)
తెలుగు,హిందీ పాతపాటల ట్రాక్స్ సేకరించడం,తీరిక సమయాలలో వాటిని పాడటం నాకొక హాబీ.నాదగ్గర మెహదీ హసన్,రఫీ,కిషోర్,మన్నాడే,హేమంత్ కుమార్,తలత్ మెహమూద్,ముఖేష్,మహేంద్ర కపూర్,జేసుదాస్ ల హిందీ ట్రాక్స్ చాలా ఉన్నాయి.అలాగే పంకజ్ ఉదాస్,గులాం అలీ లు పాడిన ఘజల్ ట్రాక్సూ ఉన్నాయి.తీరిక సమయాలలో నేనొక్కడినే వాటిని పాడుకుంటూ ఉంటాను. లేదా స్నేహితులు,సంగీత ప్రేమికుల సమక్షంలో పాడుతూ ఉంటాను. పాటలు పాడటం చిన్నప్పటి

సోవియట్ తెలుగు పుస్తకాలు: ANIL MADE IT POSSIBLE…! by Artist Sivaji

2014-10-20 05:56 AM అనిల్ బత్తుల (noreply@blogger.com)
Time, sometimes forgets to inspire us, the readers; especially when you are very selective in choosing books as a night cap. That is how most of us have missed the best of Soviet, Russian Literature in Telugu now a days. Especially our children have lost the wonder of those soviet books with art of illustrations, paintings etc. In fact these books gave us the taste of those times when we used

అమయ: కథాసాహిత్యంలో విలక్షణ కంఠస్వరం

2014-10-20 05:42 AM సామాన్య
http://www.prajasakti.in/index.php?srv=10301&id=1205914 ప్రజాశక్తి వారధి లో   కథ రాయడం ఒక కళ. ముడిసరుకు వుంటే సరిపోదు, దానిని కళాత్మకంగా వ్యక్తం చేయగల నైపుణ్యం అవసరం. ఏం రాయాలన్నదే కాదు, ఎలా రాయాలన్నది ప్రధానం. ఈ అంశాన్ని దశాబ్దాలుగా సాహిత్యరంగంలో నొక్కి వక్కాణిస్తున్నప్పటికీ చాలామంది వస్తువుకు ఇచ్చే ప్రాముఖ్యం కథనానికీ, కథనంలో శిల్పానికీ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో కళాత్మక

ఆలోచనలు...: నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు

2014-10-20 05:08 AM ప్రవీణ

నీ జ్ఞాపకాలే…….. నువ్వు కాదు

10501739_10202924104285571_6450727191125881808_n

 

 

 

 

ఏ హడావుడి, మరే సందడి లేని నిశ్శబ్దంలో
గాలి సవ్వడి, ఆకుల గలగలలు లేని సందర్భంలో
నెలవంక బెదురుబెదురుగా అడుగులో అడుగులేస్తూ
మేఘాల చాటు కెళ్తున్న తరుణంలో,
చూరు నుంచీ జారిపోబోతున్న ఘడియ
అక్కడే స్తభించిపోయిన సమయంలో,
ఆరు బయట నేనుకాక మరెవ్వరూ లేనట్టూ
చుట్టూ ఉన్న మనుష్యలూ, పరిస్తితులూ
ఉన్నఫలంగా ఉన్నవన్నీ మాయమయిపోయినట్టూ,
నన్ను నా ఆలోచనలలోనికి
నా ఆలోచనలు నీ జ్ఞాపకాలోనికి
నీ జ్ఞాపకాలోని నన్ను
నాలోని నిన్ను
ఆర్తిగా హృదయానికి హత్తుకోగలిగితే
నువ్వు లేవన్న లోటు లేనేలేదుగా!

1379807_10200809291496573_199867157_nకన్నెర్ర చేసినా, కన్నీరు పెట్టినా
కెలికివేయబడ్డ రాతను తిరిగి రాయనూలేను.
పాళీ పట్టలేని నిస్సహాయతో, నిస్సత్తువో
అనుభవించేసాక
ఇంకా ఊహలేంటి ఊసులేంటనే తర్కాన్ని
ఆ చివరి మెట్టున పెట్టి
ఇక్కడే దొర్లిన మన కబుర్లను
కుదురుగా కుర్చోపెడతాను మొదటి మెట్టున.
మాటకారివి నువ్వనుకునేవు!
నీతో అల్లుకున్న నా ఆశలు, కలలు, జ్ఞాపకాలే
నా ప్రపంచంలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి
వీనులవిందుగా ఆలికిస్తూ ఉంటాను.

నువ్వు గుర్తొచ్చిన ప్రతీసారి కొత్తగానే ఉంటుంది
నీతో కరిగిన కాలం
కొత్త వర్ణాల మేళవింపుతో
సరికొత్త చిత్రాలను నా మనోఫలకంపై చిత్రిస్తూనే ఉంటుంది.
కుంచె పట్టిన చిత్రకారుడువి నువ్వనుకునేవు!
కాన్వాసుపై ఒలికేవన్ని నా నీ స్మృతులే.

అక్కడో ఇక్కడో ఎంతకని తవ్వుకుంటాం కాలాన్ని, గతాన్ని
అప్పుడో ఇప్పుడో ఎన్నని కొలుస్తాం గాయాలను, కన్నీటిని
అంగీకారం భౌతికమై లోకానిదైతే
ఆలోచన ఆధ్యాత్మికమై నాదవుతుంది.

DSC_0271చేజిక్కించుకోలేని బంధాలు
చేజార్చుకున్న ప్రేమలు
ఉండీ లేనట్టుండే సుఖదుఃఖాలు
తనపర జీవితాలు జీవించేసాక
ప్రేమలు విరహాలకు తావే లేదిక.
ఉన్నదంతా రాసులుగా పోగేసుకున్న నీ జ్ఞాపకాలే…. నువ్వు కాదు!


namaste nestama: ప్రకృతికి ప్రతిఒక్కరం ప్రణమిల్లుదాం

2014-10-20 05:03 AM Rajeswararao Konda (noreply@blogger.com)
విశాఖను కలవర పెట్టిన హుదుద్ నిలువనీడ లేకుండా చేసిన హుదుద్ కడలి తీరాన్ని గడగడలాడించిన హుదుద్ ఉప్పెనై నగరాన్ని ముప్పుతిప్పలు పెట్టిన హుదుద్ నందనవనమైన సుందర నగరాన్నిశిథిలం చేసిన హుదుద్ సుడిగాలితో పెనవేసుకుని కల్లోలం సృష్టించిన హుదుద్ మానవ తప్పిదాలను మరోసారి హెచ్చరించిన హుదుద్ మరువలేని గాయాలతో అంధకారాన్ని నింపిన హుదుద్ ప్రకృతి ప్రకోపంతో ప్రతాపం చూపిన హుదుద్ పచ్చదనాన్ని మైమరిచిన పైశాచికాన్ని

Telugu Online Radio: జారి పడింది సొంత టాయిలెట్ లో-నష్టపరిహారం 28వేల యూరోలు

2014-10-20 04:42 AM Devender Pulugujja (noreply@blogger.com)
61 సంవత్సరాల మహిళ తన సొంత ఇంట్లోని టాయిలెట్ లో కాలు జారి పడిపోయినందుకు 28 వేల యూరోలు నష్టపరిహారం పొందింది. 2011 సెప్టెంబర్ లో ఇసాబెల్లా ఓసులివన్ ఇంట్లో టాయిలెట్ లో కాలు జారి పడింది.తన కుడి మోకాలికి బలమైన గాయమైంది.దాంతో కోర్టుకెక్కింది ఇసాబెల్లా.పడిపోవడానికి వారం రోజుల ముందే ఇంట్లో టాయిలెట్ రిపేర్ చేయించాను,కాంట్రాక్టర్ నిర్లక్షమే నేను పడిపోవడానికి కారణం,టాయిలెట్ లో సరిగా టైల్స్ వేయలేదు,

యశోదకృష్ణ: బ్రిక్స్ తో చేసిన సినిమా బొమ్మలు - 15 ఏళ్ల పిల్లాడి ప్రతిభ

2014-10-20 04:40 AM సాహితి (noreply@blogger.com)
The Sound of Music Morgspenny Productions Life of Pi Morgspenny Productions Wayne's World Morgspenny Productions The Wizard of Oz Morgspenny Productions Pulp Fiction Morgspenny Productions Dirty Dancing Morgspenny Productions The Shining Morgspenny Productions E.T. the Extra-Terrestrial Morgspenny Productions

సాక్ష్యం సంచలన పత్రిక: క్రైస్తవ పండితుల అపార్ధాలు-బైబిల్ గ్రంధ యధార్ధాలు: "యేసు దృష్టిలో దేవుడెవరు"

2014-10-20 04:24 AM Ahmed Chowdary (noreply@blogger.com)
వాస్తవానికి యేసు బోధించిందేమిటి? నేటి సువార్తికులు బోధిస్తున్నదేమిటి? ఏనాడైనా యేసు నేను దేవుడనని బోధించుకున్నారా? త్రిత్వము,త్రియేక దేవుడనే విశ్వాసాన్ని బైబిల్ సమర్ధిస్తుందా? అసలు యేసువారు ఏమి బోధించారు? ఆయన బోధనలలో దేవుడెవరు?...ఇత్యాది విషయాలన్నీ కూలంకషంగా చర్చించబడిన పుస్తకం: "యేసు దృష్టిలో దేవుడెవరు". పై ప్రశ్నలకు సమాధానం కోసం ఈ పుస్తకం చదవాల్సిందే! ఈ లింక్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి

కినిగె బ్లాగు: ఆబాల గోపాలానికీ సరళ వ్యావహారికంలో భాగవతం

2014-10-20 04:20 AM venu

నవ్య వారపత్రికలో సంవత్సరానికి పైగా వెలువడి పాఠకుల విశేష ఆదరణ పొందిన రచన భాగవతం . భాగవతం ఎవరు రాశారు? ఎందుకు రాశారు? ఏ ప్రయోజనాన్ని ఆశించి రాశారు? భాగవతం వల్ల పాఠకులకు లాభించేదేమిటి? భాగవతం ఎందుకు చదవాలి? వంటి అనేక ప్రశ్నలకు జవాబుగా ఆబాలగోపాలానికి సరళ వ్యావహారికంలో అర్ధమయ్యేలా అయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాధశర్మ ‘అరణి’ పేరిట అందించే అధ్బుత రచన ఇది .

ద్వాపరయుగం చివరి దశలో శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించాడు కృష్ణద్వైపాయనుడు(వేదవ్యాసుడు),కలియుగంలో మానవులంతా అవినీతిపరులై , పాపాలే ప్రాణవాయువుగా జీవిస్తారని , ఆపదలకూ , అపార్ధాలకు లోనవుతారని ధ్యానయోగంలో గ్రహించి వారికి ధర్మస్వరూపాన్ని తెలియజెప్పేందుకు రాశిలా ఉన్న నాలుగు వేదాలను విభజించాడు.పంచమ వేదాన్ని(భారతం) సర్వవ్యాప్తం చేసేందుకు శిష్యులకు భోధించాడు. అయినా ఆయనను తీవ్ర మనోవ్యధ వెంటాడడంతో నారదమహర్షి ఆదేశానుసారం భాగవత రచన చేశాడు.పాండవ వంశజుడైన పరీక్షిన్మహారాజు శమీకమునిని అవమానించినందుకు అతడి కుమారుడు శృంగి శాపానికి గురవుతాడు. ఏడురోజుల్లో మరణం తధ్యమని విచారపడుతూ గంగానదిలో ప్రాయోపవిష్టుడై పరీక్షిత్తునకు మహాభాగవతాన్ని వినిపించాడు శుకమహర్షి. ప్రజలు కలియుగంలో ఎలాంటి పాపాత్ములై సంచరిస్తారో తెలియజేశాడు.కలియుగధర్మాన్ని చెప్పి బ్రహ్మోపదేశం చేశాడు.దీనినే నైమిశారణ్యంలో పద్దెనిమిదివేల శ్లోకాలలో శౌనకాదిమునులకు సూతుడు వినిపించాడు.ఆ విధంగా మహాభాగవతం మానవలోకంలో దశదిశలా వ్యాపించింది.ఈ భాగవతాన్ని ఎక్కడ పఠిస్తారో ఆ స్ధలం పుణ్యతీర్ధంతో సమానం.దీనిని విన్నవారు మోక్షపదం అందుకుంటారు.భాగవతం కంటే మోక్షదాయకమైనది మరోటిలేదు.

ఇలాంటి పురాణ విజ్ఞానాన్ని కొందరికే పరిమితం చేయడం , తరతమభేదాలకు అతీతంగా చదివించేందుకు అవకాశం కల్పించని కారణంగా మన సమాజం అనేక మనస్పర్ధలకూ, విభజనలకు దారి తీసింది.అలాంటి తప్పులకు పరిహారమే సార్వజనీనమైన జనభాష.తెలుగుభాషను పట్టిపట్టి చదువుకొనే కొత్తతరంవారు కూడా చదివి అర్ధం చేసుకోవడానికి,తద్వారా భాషా మాధుర్యాన్ని అనుభవించి భాషాభిమానాన్ని వృధ్ధి చేసుకోవడానికి కూడా తోడ్పడే రచన ఇది.

వ్యాసభాగవతాన్ని జనసామాన్యానికి చేరువ చేసేందుకు యాభైనాలుగు శీర్షికలు,ఉప శీర్షికలతో నవ్యలో అరణి(కలం పేరు) చేసిన ఈ రచనకు అనూహ్య స్పందన లభించింది.పాఠకదేవుళ్ళు వేలాది లేఖలతో నవ్య వారపత్రికను ముంచెత్తారు. ఆ స్పూర్తితో విస్తారమైన భక్తజనకోటిని అలరించేందుకు అమరావతీ ప్రచురణకర్తల చొరవతో అరణి భాగవతం ఇప్పుడు తిరిగి పుస్తకరూపంలో వెలువడింది. మనకు తెలియని ఎన్నో పాత్రలు , కథలు , వాటిని హృద్యంగా వివరించే సరళ వర్ణనలు ఇటు పిల్లలనూ అటు పెద్దలనూ వదలకుండా చదివింపజేస్తాయి.భాగవతోత్తముల కధలు , శ్రీ కృష్ణుని బాల్యక్రీడలు ,జరాసంధునితో బలరామకృష్ణుల యుధ్ధం , రుక్మిణీ కళ్యాణం సహా అష్టభార్యలతో వివాహాలు , శమంతకమణి కథ, శివకేశవుల యధ్ధం , పౌండ్రకవాసుదేవుని కథ , ధర్మరాజు రాజసూయం , శిశుపాలవధ , సుభద్రార్జునుల వివాహం , అర్జున గర్వభంగం , అవతార సమాప్తి వరకు ఇందులోని కథలన్నీ ప్రతిరోజు చదువుకొని తరించేవే ! పెద్దలతో పాటు ముఖ్యంగా పిల్లలకూ ఎంతగానో ఉపకరించే పుస్తకమిది.

నవ్య వారపత్రిక –  08/10/2014

 

Bhagavatam_15Oct2014_NavyaWeekly

 

 

“భాగవతం” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.

భాగవతం on kinige

 

Bhagavatam600

 

Related Posts:

తెలుగు విజ్ఞానం వినోదం: తంజావూరు , మహాబలిపురంలోని కట్టడాలు::అద్భుత డ్రిల్లింగ్ పరిజ్ఞానం :: అత్యద్భుత శిల్పకళానైపుణ్యం:: Excellent ancient Drilling technology used in Mahabalipuram and Tanjore peria kovel

2014-10-20 04:05 AM sri raga (noreply@blogger.com)
ఇప్పుడు మనకు డ్రిల్లింగ్ మిషన్ లైతే ఉన్నాయి కాని... పూర్వం మూడు మి.మీ. రంధ్రాల నుండి ఒక పదిహేను అడుగుల వ్యాసం కల రంధ్రాలను ఎలా చేసే వారో .. ఎందుకంటే అసలు సున్నాను కనుగొనక ముందే ఒక కొండను ఈ విధంగా నిక్కచ్చిగా ఏ గాయం లేకుండా తొలచడం సాధ్యమయ్యే పని కాదు.. ఇప్పుడు మీరు చూస్తున్న మొదటి చిత్రం తంజావూరు బృహదీశ్వరాలయంలోని పెరియకోవెల్ లోని తోరణానికి సంభందించినది.. Tanjore Peria Kovel Tanjore Peria

RECIPES: Ragi Wheat Dosa

2014-10-20 03:43 AM Lakshmi p
Ingredients1 cup ragi flour1 cup wheat flourButter milk for mixing Salt to taste Cooking StyleMix the ingredients well & it should be of the thickness of regular dosa batter.Keep it over night and make dosas next day. Serve with any kind of chutney.

RECIPES: Rava Dosa

2014-10-20 03:43 AM Lakshmi p
Ingredients1 cup fine sooji (semolina) 1/2 cup rice flour or plain flour 1 Tbsp oil1/8 tsp soda bicarb 2 1/2 cups buttermilk 1 tsp coriander chopped fine 2 green chillies chopped fine Cooking StyleBlend all the ingredients together. Add more buttermilk if necessary. The batter should be relatively thin (pouring consistency). Salt to taste. Keep aside for 20 - 30 minutes. Heat griddle to

vsprabodha: భవిష్యత్ గుడిసెపై వెలుగురేఖలు

2014-10-20 03:42 AM vsprabodha

స్నేహ సంబంధాలు మసకేసి
స్వార్ధం రాచపుండై విధ్వంసం సృష్టిస్తూ
గుప్పెడు గుండెని గుండుసూది మొనలతో గుచ్చుతూ
పచ్చి పుండై ఆరని గాయంతో మూగగా రోదిస్తున్న
నన్ను చూసి చిద్విలాసంతో చిందులేస్తుంటే ..
బంధాలు ఆత్మీయతానుబంధాలు వెలిసిపోయి
మంచు కత్తితో ముక్కలు ముక్కలు చేస్తూ
సరిహద్దులు దాటి కాకులు గద్దలకేసి ఆనందిస్తూ
పగడపు దిబ్బల్లా పొడుచుకొచ్చిన అహంకారంతో
అనుబంధాలన్న పదానికే అర్ధం మార్చేస్తుంటే ..
అమ్మమ్మ చెప్పిన కథలో పాము మింగిన చంద్రుడిలా
రాళ్ళు రప్పల మధ్య రణభుమిలా ఉన్న నాలో
ఉన్నాం, నీకు మేమున్నామని భరోసా ఇస్తూ
గ్రహణం వీడి భవిష్యత్ గుడిసెపై వెలుగురేఖలు విచ్చుకుంటూ ..

వి. శాంతి ప్రబోధ
20. 10.2014


he'art' beats n strokes: resulte De Maharashtra

2014-10-20 03:40 AM kannaji e
broken alliance given new hope to one and broken heart to other... half injured parties became disabled...and.....hello anybody knows where about of MNS??? Oo.....saaheb... kuthe aahet tumhee???

కష్టేఫలి: ఒంటెద్దుబండి

2014-10-20 03:35 AM sarma (noreply@blogger.com)

పని లేక..: పవిత్ర భారతనారి

2014-10-20 02:03 AM y.v.ramana (noreply@blogger.com)
"ఇది హిందూదేశం, పవిత్ర భారత దేశం. స్త్రీలని గౌరవించడం మన సంప్రదాయం. స్త్రీ శక్తిస్వరూపిణి. ఆదిపరాశక్తి. ప్రపంచంలో స్త్రీని దేవతగా పూజించే దేశం ఏదన్నా వుందీ అంటే - అది మన భారత దేశమే. ఇట్టి సర్వోన్నతమైన దేశంలో జన్మించినందుకు నాకు గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. హృదయం ఆనందంతో ఆవిరైపోతుంది. ఒక్కోసారి సంతోషం ఎక్కువై కళ్ళు తిరుగుతుంటాయి, నరాలు పీకుతుంటాయి కూడా!" "అవునా? మరి ఈ దేశంలో స్త్రీలపై

నీరాజనం: షట్దర్శనములు

2014-10-20 01:44 AM deepika gogisetty (noreply@blogger.com)
భగవంతుని చేరటానికి వైదికముగా చెప్పబడినవి 6 దర్శనములు అవి సంఖ్య  యోగం  న్యాయం  వైశేషిక  ఉత్తర మీమాంస  పూర్వ మీమాంస

ఆంధ్రామృతం: వాపీ కూప తటాకాద్యై ... మేలిమి బంగారం మన సంస్కృతి,

2014-10-20 01:30 AM చింతా రామ కృష్ణా రావు. (noreply@blogger.com)
జైశ్రీరామ్.  శ్లో. వాపీ కూప తటాకాద్యైర్వాజపేయశతైర్మఖైః గవాం కోటి ప్రదానేన భూమిహర్తా న శుద్ధ్యతి. (పారాశర స్మృతి 12-49) గీ. కూప, వాపీతటాకముల్ కొలిప మరియు వాజపేయాది క్రతువులు వంద చేయ గోవులను కోటి దానంబు కోరి చేయ, పరుల కేదారహరు దోష హరణమగునె? భావము. మడుగు బావి, నూయి, చెరువు మున్నగునవి నిర్మించినను, వాజపేయాది వంద యజ్ఞములు చేసినను,కోటి గంగి గోవులను దానము చేసినను, పరుల భూమిని అపహరించుట వలన వచ్చెడి

పాటతో నేను: ఆ రోజు నా రాణి...

2014-10-20 01:30 AM వేణూశ్రీకాంత్ (noreply@blogger.com)
బృందావనం సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమాలలో ఒకటి. దానిలోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్సే. నాకు ఇప్పటికీ ఆ పాటలు వింటూంటే ఈ సినిమా చూసిన రోజులు గుర్తొచ్చి ఒక చక్కని అనుభూతి పొందుతాను. ఈ సినిమాలో సరదాగా సాగే ఒక చక్కని పాటను మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. చిత్రం : బృందావనం (1992)సంగీతం : మాధవపెద్ది సురేష్రచన :

కష్టేఫలే: శర్మ కాలక్షేపంకబుర్లు-ఎంతవారలైన కాంతదాసులే!……

2014-10-20 12:05 AM kastephale
ఎంతవారలైన కాంతదాసులే!…… వసువులు ఎనిమిదిమంది, దేవతలు. వారొక సారి తమతమ భార్యలతో కలసి వసిష్ఠుని ఆశ్రమానికి వచ్చారు.వసిష్ఠులు ఆశ్రమం లో లేరు. అక్కడ నందిని అనే ధేనువును చూచారు. అది వసిష్ఠుని తపస్సుకు కావలసిన సకల సంబారాలూ సమకూర్చేది. దీని పాలు తాగితే మానవులు పదివేల సంవత్సరాలు రోగం, ముసలితనం లేకుండా జీవిస్తారు,దీనిని కలిగి ఉండడం … చదవడం కొనసాగించండి

2014-10-19

మానవవాదం: భగవద్గీత--హరిమోహన్ ఝా -- తెలుగు-జె. లక్ష్మీరెడ్డి

2014-10-19 11:34 PM innaiah (noreply@blogger.com)
మైథిలీ మూలం ‘ఖట్టర్ కాకా’ హరిమోహన్ ఝా భగవద్గీత నా చేతిలో భగవద్గీత చూసి వికటకవి చిన్నాన్న అన్నాడు - ఏం నాయనా! ఈ మధ్య గీతా పారాయణం చేస్తున్నావా ఏం? అలా అయితే నీకు దూరంగా ఉండాలి! నేను ఆశ్చర్యపోయి అడిగాను - ఎందుకు చిన్నాన్నా? చిన్నాన్న - చూడబ్బాయ్, మొదట అర్జునునిలో ప్రేమ, మమకారం ఉండేవి. ‘వీళ్ళు అన్నదమ్ములు. వీళ్ళు చిన్నాన్న - పెదనాన్నలు, ఆయన పితామహుడు, వీళ్ళ పైకి చేయి ఎలా ఎత్తేది?’ అని

Harsha: హీరోలు – అభిమానులు

2014-10-19 08:52 PM Harsha

లనచిత్ర రంగం, ఒక రంగుల లోకం. సుప్రసిద్ధ నటులను మనకు పరిచయం చేసిన ఒక రంగం. ఈ రంగం ఇప్పుడు “పరిశ్రమ” గా మారి చలనచిత్ర పరిశ్రమగా రూపాంతరం చెందింది. ఈ పరిశ్రమ బయటనుండి ఒక అధ్యితీమైన సువర్ణ సుందర స్వప్న లోకం, కాని మనకు తెలియని ఎన్నో ఆకలి దప్పుల కష్టాలు, కర్కోటక శ్రమ దోపిడి, నిస్సుగ్గు స్వార్ద అవకాశవాదం, మనుషులను మనుషులు గా గుర్తించని ఒక విచిత్ర లోకం. లక్షణ, అవలక్షన గుణాల సామూహిక సమ్మోహన ప్రపంచం.

“మానవ సంభందాలు అన్నీ ఆర్దిక సంభందాలే” అని కార్ల్ మార్క్స్ అన్నట్టు మన నిజ జీవితంలో ఎలాగైతే ఆప్యాతలు ప్రేమలు తగ్గి వ్యాపారాత్మక విలువలు పెరిగాయో అలాగే ఈ పరిశ్రమలో కూడా అంత కంటే ఎక్కువగానే వ్యాపారంగా మారిపోయింది. తెలుగు సినీ కళామతల్లి అని నిస్వార్ధంగా పిలిచుకునే కొంతం మంది “అభాగ్యులు” తప్పించి మిగిలిన అందరూ వ్యాపారులే. నాకు తెలిసిన అంత వరకు NTR – ANRల నటించిన కాలంతోటే కళని తల్లిగా చూసుకునే రోజులు పోయాయి, ఆ తరువాత వచ్చిన వారందరిలో వ్యాపారాత్మక ధోరణితో వచ్చిన వారే ఎక్కువ. అందుకు ఉదాహరణ పూర్వం నటించడం అనే కళని నాటక రంగం ద్వారా నటీ నటులు ఆ రంగాన్ని పోషించేవారు. కాని ఇప్పుడు  నటీనటులను చలనచిత్ర రంగం పోషించాల్సి వస్తుంది అందుకే కాబోలు ఇది చలచిత్ర పరిశ్రమగా రూపాంతరం చెందింది. పూర్వం నాటకాల ద్వార ప్రజలకు వినోదం పంచేవారు అదే మాధ్యమాన్ని ఉపయోగించి ఎంతో మంది మహానుభావులు ప్రగతిశీల భావాలను ప్రజలకు అతి సులువుగా ఎంతో ప్రభావితంగా విషయాన్నీ అర్ధం అయ్యేలాగా చెప్పి జాగుర పరిచే వారు. ఎప్పుడు అయితే సినిమా రంగం వ్యాపారత్మక ఆలోచనలు పురుడు పోసుకున్నాయో అది పూర్తిగా వినోదం పంచే మాధ్యమంగా తయారైంది. మన తెలుగు చిత్ర సీమలో ఉన్న హీరోలు కావొచ్చు దర్శకులు కావొచ్చు వారి వారసులు ఎవరైనా కాని నిర్మాతనుండి నిర్మొహమాటంగా ముక్కు పిండి వసూలు చేసేవారే గాని ఇబ్బందులు వచ్చినవి సదరు నిర్మాతను లేక డిస్త్రిబ్యుటర్లను ఆదుకున్దామనే ధ్యాసే లేనప్పుడు వీరిని ఎ రకంగా గౌరవంగా చూడగలరు సామాన్యులు. ఆ సామాన్యుల్లో నేను ఒకడిగా ఇది రాస్తున్నాను.

ఒక హీరో తన నటన ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంటారు. ఆ అభిమానానికి చాల కొలబద్దలు వాటిల్లో నటన, ఆహార్యం, నిబద్దత, క్రమశిక్షణ, సేవా గుణం లాంటి వాటితో పాటు కులం అనే దౌర్భాగ్యపు కొలబద్ద ఒకటి ఎక్కువగా మన పరిశ్రమలో వుంది. ఈ దౌర్భాగ్యపు (కుల) అభిమానులు వాళ్ళ ఆ హీరోలకు మంచి పేరు కంటే చెడ్డ పేరు వచ్చిన దాకలాలే ఎక్కువ ఎందుకంటే పిచ్చి బ్రమల్లో ఆ హీరోలను విహరిమ్పచేస్తారు. ఈ కుల పిచ్చితో రాజకీయాల్లోకి వచ్చి చావు దెబ్బ తిన్న హీరోలు లేక పోలేదు. ఇలాంటి కుల పిచ్చి అభిమానులు వారి సంఘాల వలన చిత్ర పరిశ్రమలో అందరివాడుగా వున్న హీరోలు రాజకీయరంగంలో కొందరివాడిగా అయిపోయారు. పరిపక్వత లేని కొంతమంది హీరోలు రాజకీయాల్లో వేసే తప్పటడుగులు వలన ప్రజాజీవన ప్రయాణాలను ఒడిదుడుకులు గురయ్యాయి. అలంటి వాటిల్లో ఒకటి మన రాష్ట్రంలో మెగాస్టార్ గా పిలబడే చిరంజీవి అనే నటుడు చేసిన ఒక తప్పటడుగు ఈ రాష్ట్ర ప్రజల జీవితాలనే సమూలంగా మార్చివేసిన ఘటన. పార్టీ పెట్టటం అంటే సినిమా రికార్డులు తిరగ రాయటం లాంటిదే అనే బ్రమతో ప్రజల జీవితాలతో ఆడుకునే అధికారం నిస్సందేహంగా ఈ కుల అభిమానులు కలిగించినదే. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ని స్థాపించిన 9నెలలో పార్టీ ని అధికారంలోకి తెచ్చిన ఘనత (సినిమా పరిభాషలో రికార్డు) ని తిరగ రాయాలనే ఉద్దేశం కావొచ్చు, మరేదైనా కావొచ్చు పార్టీ పెట్టిన దగ్గరనుండి అన్నీ అలంటి బ్రమల చుట్టే తిరిగారు, కాస్తో కూస్తో సమాజం పట్ల ఆ సమాజంలో బ్రతికే ప్రజల జీవితాల పట్ల అవగాహన వున్న పవన్ కళ్యాణ్ సహజంగానే అన్నకు మద్దత్తు తెలిపారు. కాని ఎన్నిక ఫలితాలు వచ్చేదాకా అర్ధం కాలేదు మహామేత ఆడిన నాటకంలో పావు అయ్యాడని. అంతటితో ఆ ప్రజాజీవన విధ్వంసం ఆపకుండా పార్టీ పెట్టేటప్పుడు ప్రకటించిన భావాలు, విధి విధానాలు గాలికి వొదిలి, రక్తాన్ని దారపోసి పార్టీని నడిపిన అభిమానులను పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. తమ్ముళ్ళు వ్యతిరేకించినా వినలా, నిజమైన అభిమానులు వద్దన్నా వినలా, సామజిక సలహాదారులు చెప్పింది చెవికి ఎక్కిన్చుకోకుండా తెలుగు ప్రజల జీవితాల్ని ఢిల్లీ సోనియా కాళ్ళ దగ్గర పడేసాడు. ఆ బలంతో మదమెక్కి ఇష్టానుసారంగా దారి తెన్నూ లేకుండా తెలుగు రాష్ట్రాన్ని విభజన చేసింది. విభజన తప్పు కాదు అది చేసిన విధానమే అత్యంత దారుణం అని ప్రజలు నెత్తినోరు బాదుకున్నా ఈయనగారికి వినపడలా. ఈ దౌర్భాగ్యపు ఘటనలో కూడా ఈయనగారు ఢిల్లీ మేడం రాసిన ఉత్తరాన్నే సభలో చదివి డం డం లాడించారు. అసలు వీరికంటూ ఒక ఆలోచన లేదా, వీరి అపరిపక్వ నిర్ణయాల ద్వారా ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు. అందుకే కాబోలు ప్రజలు ఆ పార్టీకి ఆంద్ర రాష్ట్ర చట్ట సభల్లో అసలు ప్రాధాన్యతే లేకుండా చేసారు. ఎన్నిలప్పుడు పురుడు పోసుకున్న ఒక తోక పార్టీ చీరాల ప్రజా సమితి కి అన్నా ఒక సీటు వచ్చింది కాని 125 చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెప్పుకునే చిరంజీవి గారికి ఒక్క సీటు కూడా లేకుండా చేసారు ప్రజలు. ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం వీరికి ఎలాగైతే ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కును బలవంతంగా అయినా  లాగేసుకునే హక్కు కలిగించిందో అలాగే ప్రజలుకు కూడా వీరు చేసే పనికి మాలిన పనులను, పనికి మాలిన చేష్టలను, పనికి మాలిన మాటలను ఎండగట్టే హక్కు కల్పించింది. కాబట్టి ఇలాంటి హీరోలను కులం నేపధ్యంలో నెత్తిన ఎక్కించుకునే అభిమానులకు ఒక విజ్ఞప్తి ప్రజలు అడిగే ప్రశ్నలకు దమ్ముంటే వివరించాలి గాని గుడ్డిగా వ్యతిరేకించడం అవివేకం అవుతుంది. ఇకనైనా ఈ నాయకులూ ప్రజలకనుకూలంగా నడిచి వివేకం ప్రదర్శిస్తారనుకున్దాం, ఇది సదరు రాజకీయ నాయకుడుగా ఎదిగిన ఏ హీరోకైనా వర్తిస్తుంది చిరంజీవి కావొచ్చు, బాలకృష్ణ కావొచ్చు, పవన్ కళ్యాణ్ కావొచ్చు ఎవరైనా ఓళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల మనోభావాలు గురుతెరిగి ప్రవర్తించాల్సిందే.

మేము వీరి సినిమాలను వ్యతిరేకించడం లేదు; ప్రజల ఆర్ధిక, సామజిక హక్కులకు సంబంధించిన విషయాల్లో వీరి నిర్ణయాలను తప్పు బడతున్నాము. అది ప్రజాస్వామ్యం మాకు కల్పించిన హక్కు. చిరంజీవి రేపు కాళీగా వుండి 150వ సినిమా చేస్తే నేను కూడా చూస్తాను అది వేరే విషయం ఎందుకంటే అది “సినిమా” ఇది “రాజకీయం”. రెండూ వేరు.


Filed under: రాజకీయాలు Tagged: Andhra Pradesh, Bala Krishna, Chiranjeevi, Harsha Kodali, Nandamuri Taraka Rama Rao, NTR

ది ఆంధ్రా హ్యూమనిస్ట్: తన ధనాన్నీ, జ్ఞానాన్నీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులతో పంచుకోవడం

2014-10-19 07:00 PM ది ఆంధ్రా హ్యూమనిస్ట్ (noreply@blogger.com)
అంటే సాధ్యమైనంతవఱకూ ఇతరులకు సహాయం చేయడం. మానవజాతికి చరిత్రలో ఇప్పటిదాకా ఏదైనా మేలు జఱిగిందంటే దానిక్కారణం– కొందఱు వ్యక్తులు ప్రతిఫలాపేక్ష లేకుండా తమ సంపదనీ, జ్ఞానాన్నీ ఇతరులకు ఉచితంగా పంచిపెట్టడం వల్లనే. వట్ఠి ఉపయోగవాదాన్ని (utilitarianism) ఆశ్రయించినవారి వల్లా, ప్రతీదీ అమ్మజూపేవారి వల్లా మానవాళికి ఎన్నడూ ఏ మేలూ జఱగలేదు. ఇహ ముందూ జఱగబోవడం లేదు. నిజానికి ఈ తరువాతి రెండు తరహాల వ్యక్తులూ మొదటి తరహా

శంకరాభరణం: నిషిద్ధాక్షరి - 15

2014-10-19 06:40 PM కంది శంకరయ్య
కవిమిత్రులారా,"ల. ళ" లు లేకుండఊర్మిళాదేవి నిద్రను గురించిమీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

శంకరాభరణం: పద్యరచన - 712 (ఆర్త రక్షణము)

2014-10-19 06:35 PM కంది శంకరయ్య
కవిమిత్రులారా,ఈనాటి పద్యరచనకు అంశము...."ఆర్త రక్షణము"

మధుర కవనం: దత్తపది: కాకి - కోయిల - బాతు - నెమలి...భారతార్థంలో...నచ్చిన ఛందం...

2014-10-19 06:26 PM గుండు మధుసూదన్ (noreply@blogger.com)
తేది: సెప్టెంబర్ 30, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన కాకి - కోయిల - బాతు - నెమలి పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా నేను రాసిన తేటగీతి: (తననుఁ బట్ట నుంకించుచున్న కీచకుని ద్రౌపది వారించు సందర్భము) "వలదు కీచకా, కిన్క! నన్ బట్టుకొనియు మత్పతుల ప్రతిక్రియ నంది మ్రందకోయి! లలిని స్త్రీ షాడ బాతురుం డెలమిఁ గనఁగ బుద్ధియుతుఁడౌనె, మలిన కర్ముఁ డగుఁగాని?!"

నా తెలంగాణ కోటి రత్నాల వీణ: శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తి ఆగదు!!!

2014-10-19 06:02 PM గుండు మధుసూదన్ (noreply@blogger.com)
-ఈ విషయంలో ఏపీ మంత్రి నాతో మాట్లాడలేదు-మంత్రి హరీశ్‌రావు స్పష్టీకరణ శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తిని ఆపే అవకాశం ఏమాత్రం లేదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు స్పష్టంచేశారు. "మా పంటలను ఎండబెట్టుకుని మీకు (ఆంధ్రప్రదేశ్‍కు) నీళ్ళు ఇవ్వాలా ? తెలంగాణ రైతులు ఇబ్బందుల్లో ఉన్న సంగతి మీకు తెలియదా? తెలంగాణలో విద్యుత్‌లోటు ఉందన్న సంగతి మీ కంటికి కనబడటం లేదా? విద్యుత్తులో

కల్లూరి భాస్కరం: ఎన్సీపీ ముక్త్ మహారాష్ట్ర నినాదం ఎందుకు ఇవ్వలేదో?!

2014-10-19 05:28 PM Kalluri Bhaskaram (noreply@blogger.com)
ఎగ్జిట్ పోల్స్ వచ్చాక , అందులోనూ అవి ఫలితాలను చాలావరకూ accurateగా  అంచనా వేయడం మొదలెట్టాక ఎన్నికల అసలు ఫలితాల మీద ఆసక్తి తగ్గిపొతోంది. ఎలక్ట్రానిక్ మీడియా దీనిని ఎందుకు గమనించడం లేదో తెలియదు. అసలు ఫలితాల రోజున రోజంతా టివి చానెళ్ళ ముందు జనాన్ని కదలకుండా కూర్చోబెట్టాలన్న  దాని లక్ష్యానికి ఇది   పనికొచ్చేది కాదు. అయినా ఎగ్జిట్ ఫలితాల పేరుతొ ఒకసారి , అసలు ఫలితాల పేరుతో  రోజంతా మరోసారి అవి ఎందుకు

Eco Ganesh: అష్టసిద్ధులు

2014-10-19 04:47 PM eco vinayaka (noreply@blogger.com)
సందేహం - అష్టసిద్ధులు అని అంటారు కదా, వాటి గురించి వివరించండి ? సమాధానం - సనాతనధర్మం ప్రకారం మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ద్యేశం ఆత్మవిచారణ చేసి, ఆత్మానుభూతిని పొందిముక్తి పొందడం. ముక్తి పొందిన ఆత్మకు చావుపుట్టుకలు ఉండవు. ఆత్మ అనగానే అది ఏదో ఒక కొత్త శక్తి అని భావించకూడదు. నా శరీరంలో ఉండే నేను ఆత్మ. నేను ఈ శరీరాన్ని ధరించాను. శరీరం వస్త్రాన్ని ధరించినట్టుగానే, ఆత్మ శరీరాన్ని ధరించింది. వస్త్రం

సారెడ్డి సంచిక: G.K.క్విజ్-13

2014-10-19 03:53 PM pratapreddy sareddy (noreply@blogger.com)
1. సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? 2. మలేరియా వ్యాధి కారణంగా శరీరంలో ఏ భాగం పెద్దగా అగును? 3. ఆటంబాంబులో జరిగే చర్య ఏమి? 4. గ్యాస్ వెల్డింగ్ కు ఉపయోగించు వాయువులు ఏవి? 5. వస్తువు యొక్క బల, భ్రామకాల మొత్తం శూన్యం అయ్యే బిందువును ఏమందురు? 6. ‘డెత్ ఆఫ్ ఏ సిటి’  గ్రంథకర్త ఎవరు? 7. ‘పంజాబ్ కేసరి’ అను భిరుదు ఎవరికి కలదు? 8. క్రీడా శిక్షకులకు ఇచ్చే అవార్డు మనదేశంలో ఏది?

ఆ'రాధ'న: సీమతల్లి

2014-10-19 03:51 PM radha m (noreply@blogger.com)
నిన్న వాన కురిసెళ్ళిపోయిందిగా లాస్ట్ పాండ్ లో నీళ్ళొచ్చాయోమో చూద్దామని బయలుదేరాము. గుట్ట దారంతా బండలు, ముళ్ళ పొదలూ, పిచ్చి మొక్కలూ.... దివ్యంగా వెలిగిపోతున్న రిషికొండ నిర్మలమైన సాయంకాలపుటెండలో అందంగా gigantic గా అన్ని contours తో స్పష్టంగా కనపడుతోంది. ఆ కొండ ఎన్నెన్ని మార్పులు చూపిస్తుందో తనలోనివి! లోతులు, ఎత్తులు, పల్లాలు, చెట్లు, రంగులు - ఎప్పుడో ఏదో జరిగి మమ్మల్ని చైతన్యంలో ముంచి తేల్చి

నేనెవరు?: మనస్సాక్షి నాతో ఇలా అంటుందేమిటబ్బా?

2014-10-19 03:45 PM K Srinivas (noreply@blogger.com)
నేను అద్దాన్ని నా ముందు నిలబడు! నిన్ను చూపిస్తాను నా వద్దకు వచ్చే ముందు నీ కళ్ళజోడు తీసి రా నీ నమ్మకాలు,అభిప్రాయాలు,సంతృప్తి ఉంటే? నిన్ను నిన్ను గా చూపలేను నన్ను ముక్కలు చేసినా నువ్వేంటో నిన్ను చూపిస్తాను! కాని నీ ఆనందం కోసం నిన్ను మార్చి చూపించను! ధైర్యం ఉంటే రా?

మన భద్రాచలం...!: భీంసేన్ జోషి గారి తో ఒక రోజు...!

2014-10-19 03:08 PM Murthy (noreply@blogger.com)
నా కిప్పటికి అనిపిస్తుంది నేను భీం సేన్ జోషీ గారి ని కలిసానా ..లేకా కలా అని..!కాని నిజమే ఎందుకంటే నాతో పాటు వచ్చిన ఇంకొక మిత్రుడు కూడా అప్పుడప్పుడూ గుర్తు చేస్తుంటాడు కాబట్టి..! అతనిప్పుడు జహీరా బాద్ అనే ఊరిలో కాలేజీ కూడా నడిపే మా మిత్రుడు ప్రతాప్ కుమార్ కాబట్టి.బహుశా అది 1991 వ సంవత్సరం..నాకు డైరీ రాసే అలవాటు లేదు..ఇంకా అప్పట్లో ఈ ఫేస్ బుక్ లేదా బ్లాగు ల్లాంటివి నాకు పరిచయం కాలేదు ..!పూణే

Infinity (∞): I have a dream - Martin Luther King Jr.

2014-10-19 02:41 PM సూర్యుడు (noreply@blogger.com)
Full text of the speech is here (in PDF format)

అమృతమథనం: గుండెల్లో నిద్ర పోతా...!అను జర్నలిస్టో పాఖ్యానం

2014-10-19 02:35 PM buddha murali
మీడియా వాళ్లు అంతా వచ్చారా? ’’ అని అప్పటికి మూడవ సారి అడిగారు పొన్నాల.‘‘లేదు సార్’’ అని చెప్పగానే అలాగా అని పొన్నాల నిద్రలోకి జారుకున్నారు.కెమెరా మెన్‌ల తొక్కిసలాట రిపోర్టర్ల హడావుడితో నిద్ర నుంచి మేల్కొన్న పొన్నాల ‘‘గుండెల్లో నిద్ర పోతా’’ అంటూ ఆవేశంగా పలికారు.‘‘సార్ ఇంకా అందరూ రాలేదు. ముందు కెమెరాలను సెట్ చేయనివ్వండి. మీరిలా ఇష్టం వచ్చినప్పుడు అలా డైలాగు చెబితే ఎమోషన్ పోతుంది. మేం లేపుతాం కదా’’

జీవి ముచ్చట్లు (Gv-Blog): SSC ONLINE INFORMATION VIDEO

2014-10-19 01:57 PM గోపాల్ వీరనాల(జీవి) (noreply@blogger.com)
How to Register SSC Online SSC Registration form for Printing ; Download How to Resize Photo to below 30KB  & Signature to below 15KB

గిరిం పేట స్కూలోళ్ళ కతల్ వెతల్ స్మృతుల్: The Savior – ఓ అసాధారణ చిత్రం

2014-10-19 01:56 PM mhsgreamspet

ఓ కథను చిత్రం గా మలచటం సహజం కాని ఓ చిత్రాన్ని కథ గా రాస్తే ఇంకా  బాగుండేది అనిపిస్తే మటుకు ఆ చిత్రంలో ఏదో విశేషమున్నట్లే. సరిగ్గా అలాంటి భావనే కలిగింది “The Savior” అనే ఆంగ్ల చిత్రాన్ని చూసాక. యాదార్ఘ ఘటనల ఆధారంగా, బోస్నియా లో చెలరేగిన ఘర్ష ణ ల నేపధ్యం లో తీసిన ఈ చిత్రం 1998 లో విడుదలైందట. కాకతాళియం గా ఈ చిత్రాన్ని ఈ మధ్య చూసాను. చూసాక అనిపించింది ఎంత మంచి చిత్రాన్ని ఇన్నాళ్లు మిస్ అయ్యానో అని. 

ఓ అమెరికన్ అధికారి (Dennis Quaid ) కుటుంబం తీవ్ర వాదుల దాడిలో చనిపోతారు. ఆవేశం లో అతడు ఓ మత వర్గానికి చెందిన వారిని విచక్షణా రహితంగా షూట్ చేస్తాడు. చేసిన తప్పు ని దిద్దుకోవటం కోసం తన పేరు, ఉనికి మార్చుకుని ఓ ప్రత్యేక సైన్యం లో చేరి బోస్నియా సైన్యానికి పని చేయటానికి వెళ్తాడు. అక్కడ జరుగుతున్న హింస, అమానవీయ చర్యలు చూసి చలించిపోతాడు. ఆ నేపధ్యం లో ఎన్నో excesses కి గురై అవాంచిత గర్భంతో deep shock లో వున్నఓ మహిళ ని ఇంటికి చేర్చటానికి పూనుకుంటాడు. దారిలో తనపై జరిగే దాడిని ఎదిరించి, ఆమెకి తనే పురుడు పోస్తాడు. తీవ్ర నైరాశ్యం తో వున్న ఆమెని ఆదరించి వెన్నంటి ఇంటికి వెళ్తాడు . అవమాన భారంతో ఆమె కుటుంబం తనని అతడినే తీసుకెళ్ళమని చెపుతారు. ఆమెని UN safe zone కి తీసుకెళ్లాలని బిడ్డతో పాటు బయల్దేరుతాడు. అంత వరకూ బిడ్డని కాదనుకున్న ఆమె అతడితో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ పరిపూర్ణమైన తల్లిగా మారుతుంది. చివరికి ఆ తల్లి బిడ్డల్ని గమ్య స్థానానికి చేర్చాడా లేడా అన్నది చిత్ర సారాంశం. ఈ చిత్రం ముగిసే తీరు మాత్రం హృదయాన్ని కదిలించటం ఖాయం

మనిషి ప్రాణాలకి ఇతరులు ఇచ్చే విలువ ఎంత దయనీయంగా వుంటుందో ఇందులో చూడొచ్చు. హింస, ఘర్షణల నేపధ్యం లో కేవలం సాటి మనిషి అన్న అంశం తప్ప ఇంకే విషయమూ common లేని ఇద్దరు పెద్ద వాళ్ళు, ఓ పసి కందు మధ్య ఏర్పడే మానవీయ బంధాలు కళ్ళు చెమర్చే విధంగా తీసారు. మానవత్వం కన్నా మించిన దేది లేదు అని అంతర్లీనంగా ప్రతి సన్నివేశం లోనూ చెపుతుందీ చిత్రం. కొన్ని సంఘటనలను యదార్థం గా జరిగినట్టు చూపించే ప్రక్రియ లో ( ఓ ఉంగరం కోసం ఓ మహిళా చేతి వేలుని నరకటం , ప్రయాణీకులని చంపటం) షాక్ ఎక్కువగా వుంటుంది కాని చిత్రం లో ఎక్కడా అసభ్యతకి తావు ఇవ్వలేదు

మాటలు కొన్నే అయినా మనుషుల మధ్య జరిగే సంఘర్షణని ఓ ప్రేక్షకునిగా మనల్నే ఫీల్ అయ్యేలాగ తీసారీ చిత్రాన్ని. సహజత్వం కోసం చిత్రంలో చూపించే ప్రాంతానికి చెందిన నటులనే ఎంపిక చేసారు. మీరు ఈ చిత్రం చూడకుంటే మాత్రం ఓ మంచి చిత్రం మిస్ అయ్యినట్టే.


జనారణ్యేంద్రుని విజయ గర్జన: కేన్సర్ “జాలం” –17- సైబర్ కాప్స్ – ఏలూరిపాటి

2014-10-19 01:28 PM yeluripati
రొమాన్స్ ఫ్రాడ్ లో అమ్మాయిలు మాత్రమే ఆయుధాలు . వీరుచేసేది ఎమోషనల్ లాస్, ఫైనాన్షియల్ లాస్ . కోట్లు పోయినా సంపాదించుకోవచ్చు. కానీ మానసికంగా నష్టపోయింది తిరిగి సంపాదించడం కష్టం . ఎమోషనల్ లాస్ ను పోలీసులకు చెప్పడం, కోర్టులలో రుజువు చేయడం చాలా కష్టం. పోలీసులు కేవలం తమ సానుభూతి మాత్రమే తెలుపగలరు. *********                 **********         *********** కీమో సపోర్టివ్ సెలైన్ ఇద్దరికీ ఒకే … చదవడం కొనసాగించండి

ఎగిసే అలలు....: వెన్నల సంతకం

2014-10-19 01:00 PM ఎగిసే అలలు.... (noreply@blogger.com)
రాతిరి వేళ ఆకాశమంతా విరబూసిన చుక్కలు కురిపించే పసిడి వెలుగులలో తడుస్తున్నప్పుడు అనుభూతుల వేణువేదో కొంగొత్త సంగీతాన్ని ఆలపిస్తుంది. అలాంటప్పుడు, ఆ మధుర క్షణాల మీద మనసు పయనం సాగిస్తూ.. స్వప్న లోకంలోకి జారిపోతుంది. ఎప్పుడూ గీయని కలల చిత్రమేదో వెన్నల హంగుతో రంగుల్ని అద్దుకుంటుంది. ఎన్నడూ వినని వెన్నల  పాటేదో మనసు గొంతుతో హాయిగా పాడుకుంటుంది. చీకటి గూటిలో దీపంలా వున్న చందమామను చూస్తూ.

తెలుగు వారి బ్లాగ్: దిక్కు తోచని పరిస్థితి

2014-10-19 11:59 AM indu (noreply@blogger.com)
వశిష్ట తాతగారు ఊరిలో చనిపోతే పెద్ద ఖర్మరోజు భారీగా విందు ఏర్పాటు చేశారు.భోజన సమయానికి ఎక్కడెక్కడి బంధువులు,మిత్రులు,శ్రేయోభిలాషులు వచ్చారు.కొంతమంది భోజనం చేస్తున్నారు. కొంతమంది భోజనం చేయడానికి అప్పుడే కూర్చున్నారు.అంతవరకూ వాతావరణం ఎండతో వేడిగా ఉండి అప్పటికప్పుడు మబ్బుపట్టి అకస్మాత్తుగా భారీవర్షం పడిపోయింది.పల్లెటూరులో పెద్దపెద్ద స్థలాలు ఉంటాయి కనుక ఇంటిదగ్గర భోజనాలు

ఉచిత స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్లు: అమ్మ కాబోతున్న వారికి అమ్మ లాంటి అప్లికేషన్ "అమ్మ".

2014-10-19 10:55 AM శివ ప్రసాద్
తల్లి కాబోతున్న వారు తమ ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి కుంటుంబాలలో తల్లుల సంరక్షణ మరియు వారికి కావలసిన సూచనలను చెప్పడానికి అనుభవం ఉన్న  వారు అందుబాటులో ఉంటారు. కాని ఈ రోజుల్లో చాలా మంది తల్లులకు ఈ విధంగా సూచనలను ఇచ్చే వారు లేరు. ఈ లోటును కొంతైనా తీర్చడానికి అమ్మ (మధర్) అనే ఆండ్రాయిడ్ అప్లికేషను ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషను నేరుగా మొబైల్ ఫోన్ లో తల్లులు తీసుకోవలసిన

ఘంటసాల: గాన గంధర్వుడు ఘంటసాల - భక్తి టీవి స్పెషల్ - ఫిబ్రవరి 2014

2014-10-19 10:31 AM Sury Vulimiri (noreply@blogger.com)
గాన గంధర్వుడు ఘంటసాల వర్ధంతి సందర్భంగా ఫిబ్రవరి 2014 లో భక్తి టీవి హైదరాబాదు సమర్పించిన రెండు భాగాల సమీక్ష ఈ ప్రదర్శనము. మొదటి భాగము రెండవ భాగము THANKS: To BhaktiTV for uploading the video clips to You Tube

Tollywood photo profiles: Srinivas Reddy-శ్రీనివాస్ రెడ్డి(cine Commedian)

2014-10-19 10:13 AM Dr.Seshagirirao-MBBS (noreply@blogger.com)
పరిచయం (Introduction) : Srinivas Reddy-శ్రీనివాస్ రెడ్డి(cine Commedian) మొదట బుల్లి తెర నటుడుగా యాంకర్ గా చేస్తూ నటుడు గా ఎదిగేడు . మంది కేరక్టర్ , ప్రతిభ ఉన్న తెలుగు నటుడు .  జీవిత విశేషాలు (profile) :  పేరు : Srinivas Reddy Varamala-శ్రీనివాస్ రెడ్డి(cine Commedian) పుట్టిన తేదీ : 07-సెప్టెంబర్ -1949,  ఊరు : ఖమ్మం (khammam జిల్లా), నాన్న : రామి రెడ్డి (వి.డి.వొ -గా పని),

వరూధిని: మంచ్ పర్ విరాజ్ మాన్ .... !!

2014-10-19 09:42 AM Zilebi (noreply@blogger.com)
మంచ్ పర్ విరాజ్ మాన్ .... !! ఈ పై వాక్యం వింటే నే మీకెవరు గుర్తొస్తారు ? అట్లాగే మన బ్లాగు లోకం లో కూడా ఇట్లాంటి స్టాండర్డ్ వాక్యాలు టపా రూపేణా కాకుంటే , కామెంటు రూపేణా రాసే వాళ్ళు ఉన్నారు . ఉదాహరణ కి 'చీర్స్' చెప్పందే జిలేబి సైన్ ఔట్ చస్తే చెయ్యదు !! ( ఈ విడ గారు అదేమి భాషో గాని, 'టపాలు' కట్టేస్తూ ఉంటారు ! ఎవరి కి టపా కడుతున్నా రండీ అని ఆ మధ్య ఒక పెద్దావిడ/పెద్దాయన జిలేబి 'కాలు' లాగేరు

అనంతుని అంతరంగ తరంగాలు: ఒక చిన్ని కవిత

2014-10-19 08:59 AM Ananth Mugi (noreply@blogger.com)
సరి సరి యనుమాట కొసరి కొసరి వడ్డించ గడసరి వైరియైన సరియే అనడే జీవితము సరిగమలగు ఇది మగసిరి  గల మాట అనుట సరియా కాదా

మూడు బీర్ల తర్వాత: హుద్ హుద్ తుఫాను విశాఖపట్టణం లో ఐ.టి పరిశ్రమ అవకాశాలాను దెబ్బతీసిందా?

2014-10-19 07:54 AM akkirajub

 6TV లో నేను పాల్గొన్న చర్చ.  మొదటిసారి టి.వి. తెరమిద.

 

 

అనువాద కవిత్వం: చూపు తిప్పుకోలేనంత ప్రేమ : Rumi (1207 – 1273)

2014-10-19 06:36 AM satya prasad pemmaraju (noreply@blogger.com)
పనంతా చక్కబెట్టి మూసేస్తి దుకాణం.  కూనిరాగాల కవిత్వమే ఇక నా సేద్యం ! చూపు తిప్పుకోలేనంత ప్రేమ పుట్టింది నీ పైన, నా జీవితం, హ్రదయం పిండి పోశా నీ లోన ! - - - - అనువాదం : పెమ్మరాజు సత్య ప్రసాద్, చిత్రం : ఇమామ్ మలెకి.  *******&********

Apurupa Arogyam: మగవారి పై టెస్టోస్టీరాన్‌ హర్మోన్ ప్రభావం

2014-10-19 06:07 AM Apurupa Telugu (noreply@blogger.com)
మగవాళ్లు ఎందుకు అబద్ధాలు చెబుతారు? సాహసాలు చేయటానికి ముందుకెందుకు దూకుతారు? భావోద్వేగాలను వ్యక్తం చేయకుండా లోపలే ఎందుకు దాచుకుంటారు? వీటన్నింటికీ టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ ప్రభావమే కారణమని చెబుతున్నారు అమెరికా సైకియాట్రిస్ట్‌లు. వారు ఆడవారు, మగవారి ఆలోచనలు, ప్రవర్తనలకు గల తేడాలను విశ్లేషించారు. అందుకు కారణమవుతున్న అంశాలనూ వివరించారు.  అందులో కొన్ని విషయాలు మీ కోసం.. గర్భంలో ఉండగానే

పాపాయి: ఎంతకాలమిలా ...?

2014-10-19 05:30 AM గోదారి సుధీర
ఇవాళ పొద్దుటే నిదుర మంచం మీదనే  పాపాయి నాకు చాలా యూ ట్యూబ్ వీడియో లు చూపించింది . అందులో ఇలాటివి కొన్ని . ఇవి చూసి నేను చాలా ఆశ్చర్య పడ్డాను . నా ఆశ్చర్యాన్ని పాపాయి తో షేర్ చేసాను . ఇటువంటి ఎన్ని వీడియోలు చూసినా అన్నింటిలోనూ పాపాయిలె అమ్మ పాత్ర పోషిస్తున్నారు . ఎక్కడా అబ్బాయిలు ఇలాటి బొమ్మలతో ఆడే వీడియోలు లేవు . ఎందుకలా స్టీరియో  టైపిగ్గా మనం ఆడపిల్లలికి బిడ్డ బాధ్యత మనది మాత్రమె అని ,

యశోదకృష్ణ: Great Engineering

2014-10-19 04:40 AM సాహితి (noreply@blogger.com)

Punch Pataka: ' ముల్లంగి ' ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?

2014-10-19 04:30 AM ns p
పూర్తిగా చదవండి

మన భద్రాచలం...!: Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (నలభై ఐదవ భాగం)

2014-10-19 03:38 AM Murthy (noreply@blogger.com)
Mario Puzo నవల The God Father సంక్షిప్తంగా (నలభై ఐదవ భాగం) 1947 లో వెల్లువెత్తిన మాఫియా ఫేమిలీ ల మధ్య పోరాటం అటు అయిదు మాఫియా ఫేమిలీ లకు,ఇటు Corleone ఫేమిలీ కి కూడా బాగా నష్టాలు కలిగించింది.McClusky..అదే ఆ Police Captain  ని మాఫియా ఫేమిలీ ల్లో ఒకరు చంపి ఉంటారని,వారిని తమకు అప్పగించమని పోలీస్ వర్గాల నుంచి వత్తిడి వచ్చింది.ఎవరకి వారు మాకు తెలియదని అంటూ మిన్నకున్నారు.దానితో పోలీస్ వర్గాల నుంచి

పెరటితోట: కందా బచ్చలి

2014-10-19 03:30 AM స్నేహ

కంద – పావుకేజీ
బచ్చలి – మధ్యస్తంగా ఉన్నవి మూడు కట్టలు
పోపు కి కావల్సినవి – మినపప్పు, శనగపప్పు రెండుస్పూన్స్ చొప్పున, కొద్దిగా ఆవాలు, ఇంగువ
పచ్చిమిర్చి – 2
అల్లం – చిన్న ముక్క
ఆవాలు – 2 స్పూన్స్
చింతపండు రసం – చిక్కనిది 3 స్పూన్స్
వేరుశనగ గుళ్ళు -పోపులో ఇష్టమైతే వేసుకోవచ్చు
చింతపండు రసం – చిక్కనిది ఒక
పసుపు, ఉప్పు , కరివేపాకు- తగినంత
ఇంగువ – కొద్దిగా
కందని కడిగి చెక్కు తీసి మీడియమ సైజ్ లో ముక్కలుగా కోసుకోవాలి. బచ్చలి కడిగి తరుక్కోవాలి.

DSCN0681
గిన్నెలో తగినంత నీరు పోసి కంద ముక్కలు ఉడకనివ్వాలి. ముక్క సగం ఉడికాక బచ్చలి వేయాలి. తగినంత ఉప్పు, పసుపు వేయాలి. నీరు ఉడకటానికి సరపడా మాత్రమే పోయాలి. ఇలా కష్టమనుకుంటే కొ ద్దిగా నీరుపోసి కుక్కర్ లో ఒక రెండి విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోండి.
బాణాలి లో నూనె వేసి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, ఇంగువ వేయాలి. వేగాక అల్లం, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి .

DSCN0685

 

ఇవి వేగాక చింతపండు రసం వేయాలి. నూనె పైకి తేలేదాక ఉడికించండి.

DSCN0686

నూనె పైకి తేలాక ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. ఒక ఐదునిమిషాలు అలానే ఉంచి స్టవ్ మీంచి దించెయ్యండి. కూర కాస్త చల్లారాక ఆవ పెట్టండి.

DSCN0696

DSCN0697

ఆవ పెట్టటం
రెండు స్పూన్స్ ఆవాలు చిన్నరోలులో కాస్త దంచి, కొద్దిగా నీరు పోసి మెత్తగా నూరుకోవాలి.

DSCN0687

ముందే నీరు పోస్తే ఆవాలు నలగవు. కాస్త నలిగాక నీరు పోయాలి.

DSCN0689
రోలు లేకపోతే మిక్సీ లో ఇంత తక్కువ నలగవు అనుకుంటే పొడిగా ఆవపిండి పట్టుకుని కావలసినంత పొడిలో నీరు పోసుకుని ముద్దగా చేసుకోవాలి. మిగిలిన పొడిలో చిటికెడు ఉప్పు వేసుకుని డబ్బాలో పోసుకుంటే నిలువ ఉంటుంది.

లేదూ ఎప్పటిదప్పుడే చేసుకోవాలంటే మిక్సీ లో నలగని పక్షం లో కావాలంటే ఆవాలు తో పాటు పచ్చిమిర్చి వేసి మిక్సీ పడితే ఆవముద్ద మెత్తగా వస్తుంది.
ఆవ పెట్టిన కూరలు అప్పటికప్పుడే కన్నా కాస్త ఊరితే ఇంకా బాగుంటాయి. ఆవ పెట్టాక కూర వేడి చెయ్యద్దు. చేదు వచ్చే అవకాశముంది.

వ్యాఖ్యలు

2014-10-20

2014-10-20 07:50 AM Sreedasyam Laxmaiah
చాలా బాగుంది.
2014-10-20 07:18 AM మిస్సన్న
తండ్రిని వధియించి తనయుని గాచిన <br />...........యా మహా విష్ణువు దార్త రక్ష <br />మకరిని ఖండించి మత్తేభమును గాచి <br />..........నట్టిది శ్రీహరి యార్త రక్ష <br />మానము రక్షించి మానిని గాచిన <br />..........యట్టిది మాధవు నార్త రక్ష <br />గోవర్ధనము నెత్తి గోపకాళిని గాచి<br />..........నట్టిది గోవిందు నార్త రక్ష <br /><br />అన్యమెరుగక మదిలోన ననవరతము <br />నన్ను స్మరియించు వారి ననన్య కరుణ <br />
2014-10-20 05:47 AM bujji
Telugodu&quot; meeru adigina telugu lipi ikkada vundocchu.<br /><br />http://sampoornaramayanam.blogspot.com
2014-10-20 05:07 AM UG SriRam (noreply@blogger.com)
అది వచ్చే ఎన్నికల నినాదమండి. నమో, అమిత్ షా కాంబినేషన్ ఊహించని అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. గత సంవత్సరం బిజెపి కి ఈ దశ పడుతుందని తలపండిన రాజకీయ మేధావులు అనుకోనుండరు. ఒక్క సంవత్సరం లో ఎన్నో మార్పులు. ముఖ్యంగా బి.జె.పి కి ఒ.బి.సి, యస్.సి, యస్.టి ఓటర్ల మద్దతు విపరీతంగా లభిస్తున్నాది. అగ్రవర్ణ భూస్వామ్య కులాల పార్టిలు ఇవన్ని నేడు కుటుంబ పార్టిలు, ఆదరణ లభించటంలేదు. రానున్న రోజులలో యన్.సి.పి. ఒక్కటే
2014-10-20 03:13 AM చింతా రామ కృష్ణా రావు. (noreply@blogger.com)
అజ్ఞాత గారూ! ఈ కార్యక్రమ వివరాల కొఱకు మీరు శ్రీమాన్ సత్యప్రసాద్ గార్ని 9849592738 అనే సంఖ్య గల చరవాణి ద్వారా సంప్రదించవచ్చును.
2014-10-20 02:30 AM Usha Rani K (noreply@blogger.com)
జిలేబీ గారు, మీరన్నదే సరైన శీర్షిక. ప్రయత్నపూర్వకం గా తప్పా తెలుగు వాడుక, సాధన తగ్గటం ఒక కారణమైతే ఒకటి పదును తగ్గుతున్న నా బుర్ర కావచ్చు. :) నెనర్లు!

2014-10-19

2014-10-19 06:17 PM Sury Vulimiri (noreply@blogger.com)
శ్రీ రామకృష్ణ మూర్తి గారికి, మా బ్లాగు దర్శించినందుకు ధన్యవాదములు. బ్లాగుకు కుడి చేతి ప్రక్కన యిచ్చిన సూచికలో ఇంతవరకు వివిధ రాగాల లో మాస్టారు పాడిన / కట్టిన బాణీల వివరాలు ఉన్నాయి. చూడగలరు.
2014-10-19 05:31 PM VEERA REDDY KESARI
నిజంగా ఇంటిల్లపాదీ చూడాల్సిన సినిమా.
2014-10-19 04:00 PM Rama Krishna Murthy Renduchintala (noreply@blogger.com)
ఈ పాట పంతువరాళి లో వుందని యిప్పుడే నాకు తెలిసింది.కలకత్తా కచేరీ లో పాడిన అదనపు చరణం కూడా వినే అదృష్టం దక్కింది.దీనికి ఈ బ్లాగు నిర్వాహకులకు ధన్యవాదాలు
2014-10-19 03:49 PM rajasekhar Dasari
పున్నమినాగు సినిమాలో నరసింహరాజు హీరో, చిరంజీవి విలన్
2014-10-19 03:38 PM Ammanamanchi Krishna Sastry (noreply@blogger.com)
డియర్ Zilebi!<br /><br />చాలా సంతోషం.<br /><br />ధన్యవాదాలు.
2014-10-19 03:03 PM SIVARAMAPRASAD KAPPAGANTU (noreply@blogger.com)
In the same style, your comment on the results of State Elections in Haryana and Maharashtra.
2014-10-19 03:02 PM Anonymous (noreply@blogger.com)
కార్యక్రమంలో పాల్గొనాలంటే ఎవరిని సంప్రదించాలి. దయచేసి వివరాలు తెలుపగలరు
2014-10-19 01:35 PM bonagiri (noreply@blogger.com)
చీర్స్. చీర్స్..
2014-10-19 11:54 AM sarma (noreply@blogger.com)
లెస్సు లెస్స బలికితిరి
2014-10-19 09:18 AM Zilebi (noreply@blogger.com)
<br />వః వః !!<br /><br />జిలేబి
2014-10-19 09:13 AM Zilebi (noreply@blogger.com)
<br />సైకియాట్రిస్టు గారికో చిక్కు ప్రశ్న ! - అదెందు కండీ , తాయెత్తుల కి సాయెబు తాయెత్తులకే విలువ ఎక్కువ ?<br /><br />(మీరు ఈ కామెంటు కి మరో టపా రాస్తారని ఆశిస్తో !!<br /><br />జిలేబి
2014-10-19 09:09 AM Zilebi
అబ్బా, కథ లో ఏమి మేటరు ఉన్నా అది గోదావరి తీరానికి లింకు కుదర కుంటే ఈ గోదావరి తీరం వాళ్లకి ఉపశమనం దక్కదు సుమీ!! జేకే !!<br /><br />ఇట్లాగే ఒక శ్రీ కృష్ణ మాయ అన్న (నారదులవారు బ్రహ్మ చర్యం వదిలి పెట్టి సంసార జంజాటం లో పడడం కథా వస్తువు!) సినిమా చూసినట్టు గుర్తు !!<br /><br />చీర్స్<br />జిలేబి
2014-10-19 07:55 AM Sekhar Babu Pandilla (noreply@blogger.com)
మీ కృషి అభినందనీయం..
2014-10-19 07:48 AM THIRUPALU P (noreply@blogger.com)
// నేరం చేసారు అని నిరూపించటం చాలా కష్టం. మొన్నీమధ్య 18 ఏళ్ళు కూడా పట్టచ్చు అని తెలుసుకున్నాను. //<br />అవునండీ, పనిలేక ,పాట లేక, తింటానికి తిండి లేక, ఉంటానికి గూడులేక చిన్న చిన్న దొంగ తనాలు చేసే దొంగ వెదవల్ని బొక్కలో తోసి మక్కెలిరగతణ్ణడం కాదు, చెయ్యని దొంగ తనాలుకూడా వప్పించడమైతే చాలా చాలా తేలిక గానీ. చాలా బాగా చెప్పారు LAKKAARAJU GAARU.
2014-10-19 07:00 AM Hari Babu Suraneni (noreply@blogger.com)
అవును,నేను అవన్నీ చదివాను.వాల్మీకి బోయవాడు.రామ మంత్రొపోపాసనతో రామాయణం రాయగలిగాడని నేను అనుకోవడం లేదు. నేను హిందువునే కానీ హిదూత్వంలో వున్న ప్రతి చెత్తనీ సమర్ధించను.నాకు మొత్తం హిదూత్వంలో వున్న అన్ని విషయాల గురించీ తెలియదు కూడాను.కాకపోతే నాకు తెలిసిన ప్రతి విషయాన్నీ యదార్ధమా కాదా, అది నా జీవితంలో నేను వుపయోగించుకోగలనా లేదా అనే వుపయోగిత దృష్తితో చూసి నాకు హేతుబధ్ధంగా అనిపిస్తేనే నమ్ముతాను. <br /><
2014-10-19 06:49 AM Ramesh Babu Polaki (noreply@blogger.com)
chala bagundi
2014-10-19 05:55 AM శ్యామలీయం
జేవీరావుగారూ,<br /><br />మీకు ఈ వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.<br /><br />చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి యథాప్రకారం అన్నారు. మరి అడగటానికి మోమోటమి దేనికి? దివ్యంగా అడగవచ్చును. నాకు తెలిసినంతలో వివరించటానికి ప్రయత్నిస్తాను.
2014-10-19 05:09 AM Marripoodi Mahojas (noreply@blogger.com)
మీ దాకా రాలేదేమో ఈ వార్త. ఈ మధ్య ఇండియాలో స్వాస్థ్య అనే చిన్న పరికరాన్ని ప్రవేశపెట్టారు. దాని సైజు ఒక మామూలు పుస్తకమంత ఉంటుంది. దాన్ని ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ కి కనెక్ట్ చేసి 33 రకాల ఆరోగ్యపరీక్షలు నిర్వహించవచ్చునట. ఫోన్ తెరమీద రిసల్ట్ డిస్ప్లే అవుతుంది. ఖరీదు రు.25,000 అంటున్నారు. ఆల్రెడీ కాశ్మీర్ లో గ్రామీణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో 4000 స్వాస్థ్య పరికరాల్నిపంచిపెట్టారట.
2014-10-19 02:50 AM SIVARAMAPRASAD KAPPAGANTU
గొట్టాలు పట్టుకుని &quot;ఐతే&quot; అనే మాటను, లెక్కలేనన్ని సార్లు పొంతన/సందర్భశుద్ధి లేకుండా ఒక పడికట్టు మాటగా వాగేసే టి వి విలేఖర్లకు, ఉంటారో లేదో తెలియని వారి సంపాదకులకు, మీరు చెప్పిన ఉదంతంలో, అమెరికన్ అధ్యక్షుడు సామాన్యుడి లాగా హోటల్ కు వెళ్లి డబ్బులు చెల్లించటానికి తన కార్డు ఇవ్వటం అనేది వార్త అనిపించకపోవటం, ఆ కార్డు క్లోనింగ్ కు గురయ్యింది అన్నది మాత్రమే వార్త అనిపించటంలో ఆశ్చర్యం నాకేమీ

2014-10-18

2014-10-18 10:08 PM Rao S Lakkaraju (noreply@blogger.com)
ఎన్నిఆటంకాలు వచ్చినా దాటుకుంటూ శంకరాభరణం ద్వారా ఎంతమంది చేతో సాహిత్యసేవ చేయిస్తూ విశ్రాంత జీవితం గడుపుతున్న మీకు ఎన్ని ప్రణామములు ఇవ్వాలో చెప్పలేము. <br />ఇక నేనంటారా వరసాగ్గా చదువుకోటానికి మంచి పద్యాలు ఉంటాయని నాకు నచ్చిన పద్య కుసుమాలని ఒక పుష్పక మాలలో కూరుస్తున్నాను. <br />మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.
2014-10-18 09:49 PM ప్రేరణ... (noreply@blogger.com)
మీ కవితలోని వాస్తవాలు మదిని దొలుస్తున్నాయి అర్పితగారు.
2014-10-18 07:09 PM venkat (noreply@blogger.com)
చిరంజీవి గారికి మతవ్యాపారుల బోధనలు బాగా వంటబట్టినట్టున్నాయి....వారికి ఇంక గొర్రెలవలె ఆ మతవ్యాపారుల మాటలకు తలాడించటం తప్ప సొంతగా ఆలోచన చేయలేరు.... భారతీయులలో కొంతైన ఐక్యమత్యం ఉందంటే ఈ భారతీయ పండుగలే కారణం..... ఈ పండుగుల సారాంశం చెడు మీద మంచితనం విజయం కాని....... ఎవరని చంపడంకాదు.
2014-10-18 07:06 PM శ్రీకాంత్ చారి (noreply@blogger.com)
హరిబాబు గారు,<br /><br />పుష్యమిత్రుని ప్రసక్తి బాగానే తీసుకు వచ్చారు. అసలు ఈ పుష్యమిత్రుడు ఎవరు? బౌద్ధ మతాన్ని స్వీకరించిన మౌర్య వంశపు చివరి రాజును వధించి రాజ్యాన్ని చేజిక్కించుకున్న వాడు. తర్వాత ఇతడు అప్పటికి చాలాకాలం కిందే మూలన బడ్డ సనాతన ధర్మానికి తిరిగి ప్రాణం పోశాడు. <br /><br />మరి చిరిగి మూలన పడ్డ పాత కోటును తిరిగి వాడాలంటే అతుకులు వేయాలి గదా! అలాంటి అతుకులే రామాయణ మహాభారతాలు. కాబట్టి ఆ
2014-10-18 05:32 PM Anonymous (noreply@blogger.com)
బాబూ చిట్టీ చిరంజీవీ, <br />బ్రతుకమ్మకూ వేరే దేవతలకు సంబంధం లేదా? అలా అయితే దసరా సధర్భం గా చేసుకోవటం ఎందుకు? దసరా కు, అమ్మవారికీ కూడా సంబంధం లేదా? ఇది కూడా మీ కిరస్థానీ ఇస్కూల్లోనే చెప్పారా? &quot;వె`రే వాళ్ళని చంపి చేసుకుంటున్నాం&quot; అంటున్నావ్? వెరే వాళ్లు అంటే ఎవరు? <br />తెలంగాణా పండగలు, ఆంధ్రా పండగలు అన్నీ వెరే వెరే ఉన్నాయి అని నీకెవరు సెప్పినారు సిన్న తండ్రి? <br /><br />దీపావళి వెరా?
2014-10-18 05:14 PM Kcube Varma (noreply@blogger.com)
మీరు రాసినవి ఏకబిగిన చదవడం కాస్తా కష్టంగా వుందీమధ్య. కుదురుగా వుండి చదవాల్సి వస్తొంది. భావానికి తగ్గ చిత్రం బాగుంది. కుదురుగా కూచున్నా అనిశ్చలత్వం ఆమె కాలి బొటనవేళ్ళ కదలికలో కనిపిస్తోంది. మీ ప్రత్యేకత ఎక్కడా మిస్సవ్వనివ్వరు కదా? అభినందనలతో..
2014-10-18 05:09 PM Kcube Varma (noreply@blogger.com)
ఇది అదేనా! అని అడిగిన నా కంటనీరును గాంచి...<br />అడిగిన ప్రశ్నకి జవాబుగా అక్కున చేర్చుకున్నావు! touching lies.. mere ilaa raayagalaru..
2014-10-18 04:59 PM కంది శంకరయ్య (noreply@blogger.com)
నచ్చిన పద్యాలని ఇలా ఎత్తి ఇలా ప్రత్యేకంగా ప్రకటించడం కూడా సాహిత్యసేవే. ధన్యవాదాలు.
2014-10-18 03:42 PM Jitu

Zilebi gaaru,

Ee perlu panikiraavu. Eevi already janaalu vaaduthunna perle kadaa… Manshulu ki kaakapena… Mithaayilu ki. Perulu… eppudu evaru vini eraganivi unndaali.
:D :D

2014-10-18 03:34 PM Jyoti

Muraligaaru,

Unique peru pedtaarani anndaru ilaa vekrichutunnaaru. Anndariki unna pere pedte yenviti avutundo… cheptaanu.

Chinnappudu, naa class lo inko mugguru Jyotilu unde vaaru. Maa perlu… B. Jyoti, I. Jyoti, M. Jyoti, C.M.P. Jyoti.

Maa di o chinna ooru. So naa majority classmates’ parents… doubled up as colleagues. So naa tho ade grade lo, vere section lo maa amma colleague abbaiy chadivevaadu. Waadu evaro naaku teleedu, nenu evaro.. waadiki teleedu. Maaku telee kunda maa ammaki aa aunty ki unsaid competition undedi.

O saari term end exams tarvaatha.. o roju amma office ninchi intiki ochi.. nannu chitaka baadindi. Enduko naaku teleedu. Adigite kopam thattukoleka… yenvi cheppadu. Mottaniki baaga dabbalu thinnaanu. Tarvaatha amma kopam taggeka… “nuvvu parikshalo fail ayevu. Ayinattu naaku cheppaledu. Maa colleague office lo anndara mundu nannu vekrinchindi. Nee valla nenu navvulupaalu ayenu”, ani cheppindi. “Amma nenu fail avaledu. Maaku inka papers ivvaledu” ante nammadu. Malli abadhamaaduthunaanu ani kooda kottindi.

Mottaniki… neeku evaru chepperu ani adigenu. Ayithe falaana aunty cheppindi. Aa aunty abbaiy nee class lone unnadu ata. waadu cheppedu. Jyoti fail ayindi ani. … ani cheppendi.

Rendo roju nenu school lo aa rendo section ki velli, aa abbaiy evaro kannukoni, waadi class peekenu. “Yenvi raa, nenu neeku asalu telusaa? Nenu fail ayenu ani cheppevaadu nuvvu evaru ani.” Waadiki kooda vishayam ardham kaa ledu. “I am sorry. I don’t know you. ” ani annaadu.

Mottaniki ki kadha yenviti ante…. waadi section lo unna inko Jyoti fail ayindi. Maatallo… waadu, maa class lo Jyoti fail ayindi ani cheppedu. Aa maata pattukoni waalaa amma maa ammani vekrinchindi. Adi back story.

Evaro fail ayithe, nenu dabbalu thinnaanu endukante… we both had the same name. :-/

So… moral of the story… ‘kids should have unique names’. :D

2014-10-18 02:14 PM SIVARAMAPRASAD KAPPAGANTU
శ్రీనివాస రావుగారూ మీ పాత జ్ఞాపకం అంజయ్య గారి వర్ధంతి సందర్భంగా మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.<br /><br />అంత ప్రేమగా అంజయ్య గారి ఇంటికి వచ్చిన రాజీవ్ గాంధీ గారు మరి కొద్ది నెలల్లోనే ఆయన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా విమానాశ్రయంలో ఎందుకు తిట్టి ఉంటారు అన్న సంశయం కలుగుతున్నది. అలా అంజయ్య గారిని మరీ పబ్లిక్ గా తిట్టిపోయ్యటమే కదా, ఎన్ టి ఆర్ కు, వరంలా లభించి, తెలుగుదేశం పెట్టిన కొత్తల్లో. ఆయన
2014-10-18 12:38 PM ఆకాంక్ష (noreply@blogger.com)
సంఘజీవివి కదా సంస్కారంతో మెలగాలి
2014-10-18 09:52 AM RAJ A
కృతజ్ఞతలు ప్రవీణ్ గారూ..
2014-10-18 09:47 AM RAJ A
కృతజ్ఞతలు ప్రవీణ్ గారూ..
2014-10-18 08:20 AM vallisarvani
Thanks for sharing your experience jvrao garu. It is nice to hear that your son became a doctor. You can share your experience on the link I have given in the article to win exclusive Diwali gifts.
2014-10-18 07:40 AM Mani Teja Inavolu
Name:Maniteja<br />Dob:6/8/1992<br />time:2:20pm<br />Can know my all details of rasi ?
2014-10-18 07:17 AM Hema Bobbu (noreply@blogger.com)
మరీ ఇప్పుడు ఎక్కడైనా జాంబవంత, హనుమంతుల రామాయణం దొరుకుతుందా అండి...........
2014-10-18 06:16 AM bonagiri
చాలా మంచి సినిమా. హైస్కూల్ విద్యార్థులందరికీ చూపించవలసిన సినిమా.
2014-10-18 05:17 AM Payoffers dotin (noreply@blogger.com)
Earn from Ur Website or Blog thr PayOffers.in!<br /><br />Hello,<br /><br />Nice to e-meet you. A very warm greetings from PayOffers Publisher Team.<br /><br />I am Sanaya Publisher Development Manager @ PayOffers Publisher Team.<br /><br />I would like to introduce you and invite you to our platform, PayOffers.in which is one of the fastest growing Indian Publisher Network.<br /><br />If you&#39
2014-10-18 05:01 AM Rajesh Babu
విలువలు కలిగివున్న సినిమా ఇది.
2014-10-18 04:01 AM Amarendra Reddy Sagila (noreply@blogger.com)
చాలా బాగుంది మధుర గారూ...
2014-10-18 03:59 AM sarma (noreply@blogger.com)
Good

2014-10-17

2014-10-17 07:17 PM jvrao
Meeru cheppina chivari chitka.......prathi deepaavalikee gurthu chesukuntam.<br />1984 lo deepaavali 5 rojulu mundu maa thandrigaaru poyaaru.<br />pillalu inka chinna vaallu.....tapakayala saradaa maamule.<br />hadavudilo tapakayalu teledu nenu. <br />Maa friends moulasahib gari kutumbam maa pillalni teesuku vellaaru tapakayalu kaalpinchadaniki. Chivarlo ....baaga mandu koorina oka chichubuddi
2014-10-17 05:59 PM indu (noreply@blogger.com)
పేర్లు ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకోవచ్చు.నేను పెట్టిన పేరు ప్రగ్య.ప్రజ్ఞ ఇంతకుముందు పోస్ట్ లోనే ఉపయోగించాను.క్రొత్తపేర్లు తయారు చేసుకోవడం మొదటినుండి అలవాటు.ఏది ఏమైనా తప్పుగా వ్రాశానేమోనని సరిచేద్దామనుకున్నందుకు ధన్యవాదములు.
2014-10-17 05:52 PM Hima bindu (noreply@blogger.com)
బాగుందండీ
2014-10-17 05:31 PM nunagoppala chandramohan
జీవితాన్ని ప్రతి క్షణం జీవించడం అంటే ఇదన్నమాట
2014-10-17 05:31 PM bobby14 (noreply@blogger.com)
Mumbai Escorts<br />Mumbai Escorts<br />Mumbai Escorts<br />Mumbai Escorts<br />Mumbai Escorts<br />Mumbai Escorts<br />Mumbai Escorts<br /><a href="http://www.bobyraj.in/" rel="nofollow">www.bobyraj.in</a><br />
2014-10-17 04:15 PM ప్రసాదు (noreply@blogger.com)
ప్రగ్య కాదు ప్రజ్ఞ
2014-10-17 04:14 PM Payal (noreply@blogger.com)
I too don&#39;t have experience bhai :-)
2014-10-17 03:07 PM గుండు మధుసూదన్ (noreply@blogger.com)
నీ యేడుపుగొట్టు రాతకు తోడు ఇంగ్లీషుభాషొకటా? తప్పుడు తడకలతో...<br /><br />నీలాంటి చెవిటిమాలోకాలు (మహాబధిరులు) ఉండబట్టే మా యీ శంఖారావాలు మళ్ళీ మళ్ళీ వినిపించాల్సివస్తున్నది.<br /><br />మా తెలంగాణను ఆంధ్రలో కలుపుకొన్నప్పటినుండీ ఇప్పటివరకూ...మీ ఆంధ్రా అక్రమార్కులు...<br /><br />&quot;చేసిందే (దోపిడీ) చేతరా అక్రమార్క ఆంధ్రులు&quot; <br /><br />అని మేం అనాలి...<br /><br />నువ్వు అంధుడివీ, బధిరుడివీ
2014-10-17 12:43 PM శ్రీనివాస చక్రవర్తి (noreply@blogger.com)
thank you anonymous garu!
2014-10-17 11:18 AM madhavaraopabbaraju

శ్రీ కుమార్ గారికి, నమస్కారములు.

you tube లో భగవద్గీత, ఘంటశాలవారిచే పాడబడిన, అర్ధంతో సహా వున్నది. దాని “ link ” క్రింద ఇస్తున్నాను. link ని నొక్కి, ఆ వీడియో ని వినండి.

మీ స్నేహశీలి,
మాధవరావు.

2014-10-17 11:03 AM madhavaraopabbaraju

శ్రీ లక్కరాజుగారికి, నమస్కారములు.

టపా మీకు నచ్చినందుకు ధన్యవాదములు.

మీ స్నేహశీలి,
మాధవరావు.

పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..