ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2015-12-12

కళాగౌతమి-తెలుగు సాహిత్య మాస పత్రిక: Sri Kalagowtami – December 2015

2015-12-12 04:58 PM డా. బులుసు వేంకట సత్యనారాయణ మూర్తి

కళాగౌతమి-తెలుగు సాహిత్య మాస పత్రిక: Sri Kalagowtami – December 2015

2015-12-12 04:51 PM డా. బులుసు వేంకట సత్యనారాయణ మూర్తి

2015-10-17

తెలుగు: రాయలసీమ పై కవితల పోటీ

2015-10-17 04:28 PM తవ్వా ఓబుల్ రెడ్డి
రాయలసీమ పై కవితల పోటీ

2015-10-04

కళాగౌతమి-తెలుగు సాహిత్య మాస పత్రిక: sri kalagowtami october 2015

2015-10-04 03:57 PM డా. బులుసు వేంకట సత్యనారాయణ మూర్తి

2015-08-12

మనోనేత్రం: అన్నమయ్య: తెలుగుపదానికి జన్మదినం

2015-08-12 08:26 PM Sandeep P
1997 లో విడుదలైన అన్నమయ్య చిత్రం లోని వేటూరి రాసిన చక్కనైన పాటల సాహిత్యానికి కీరవాణి అనువైన బాణీలు సమకూర్చారు. అంతకు ముందే వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, చెంగల్వ పూదండ, మాతృదేవోభవ వంటి చిత్రాలలో వీరిద్దరి జోడీ తెలుగుదనానికి సత్కారం చేసింది. ఈ చిత్రం కూడా ఆ కోవకు చెందిందే. పాట వ్రాసిన తరువాత బాణీ సమకూర్చితే ఆ కవి స్వేచ్ఛ పదాల ఒరవడిలో తెలుస్తుంది. అలాగే బాణీలో కూడా ఆ మార్దవం కనిపిస్తుంది.

2015-01-08

మన తెలుగు పదాలు: Banker - ?

2015-01-08 07:50 AM మన తెలుగు పదాలు

మన తెలుగు పదాలు: Salesperson ---- తెలుగు లో

2015-01-08 07:46 AM మన తెలుగు పదాలు

2014-12-17

వీవెనుడి టెక్కునిక్కులు » తెలుగు భాష: చిఱుచిరలు

2014-12-17 04:31 AM వీవెన్
‘చిరకాలం’ అంటే ఎక్కువ కాలం అని అర్థం. కానీ ‘చిరుప్రాయం’ అంటే చిన్న వయసు అని. ఏమిటీ తిరకాసు?

2014-12-13

e-తెలుగు: ఆదివారం అనగా (డిసెంబర్ 14న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం

2014-12-13 04:37 AM kasyap

ఈ నెల రెండవ ఆదివారం అనగా (డిసెంబర్ 9న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాదులో.  డిసెంబర్ రెండవ ఆదివారం 14 2014 —హైదరాబాదులో తెలుగు బ్లాగుల దినోత్సవం .  తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం మరియు తేనీటి విందుని e-తెలుగు ఏర్పాటు చేసింది. తెలుగు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన.

పూర్తిగా చదవండి

2014-09-24

వీవెనుడి టెక్కునిక్కులు » తెలుగు భాష: తమిళులు తెలుగు లిపి నేర్చుకోడానికి పనిముట్లు

2014-09-24 04:15 AM వీవెన్
తమిళులు (ఇంకా ఇతరత్రా కారణాల వల్ల తమిళం మొదటి భాషగా నేర్చుకున్నవారూ) తెలుగు లిపిని నేర్చుకోడానికి ప్రయత్నిస్తే వారికి ఎదురయ్యే ఇబ్బందుల్లో మొదటిది, అందరమూ ఊహించేది, మూల అక్షరాల రూపాల్లో భేదం. రెండవ ఇబ్బంది తెలుగు లిపికి ఉన్న ప్రత్యేక లక్షణాలు తమిళ లిపికి లేకపోవడం (ఇది అనూహ్యం). వెల్లడింపు: నాకు తమిళం రాదు. ఐదారు పదాలు తెలుసు, నాలుగైదు అక్షరాలు గుర్తుపట్టగలను. తెలుగు నేర్పడం గురించీ దానిలోని సమస్యల గురించీ అవగాహన తక్కువే. ఈ టపా […]

2014-08-07

తెలుగు: ఎల్లంపల్లె సమీపంలో పురాతన శాసనాలు, రాతి శిల్పాలు లభ్యం

2014-08-07 02:41 AM తవ్వా ఓబుల్ రెడ్డి
కడప జిల్లా  మైదుకూరు మండలం ఎల్లంపల్లె సమీపంలోని గగ్గితిప్ప వద్ద పురాతన శాసనాలు, రాతి శిల్పాలు ఈ విషయమై రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీ రెండవ దేవరాయలు పరిపాలిస్తూ ఉండగా విజయనగర సామ్రాజ్య సామంతరాజు సంబెట పిన్నయ దేవ మహారాజు యెల్లంపల్లె సమీపంలో పేరనిపాడు రాజధానిగా ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ క్రీస్తుశకం 1428 లో  ఈ శాసనాలను వేయించారని తెలిపారు. విజయనగర సామ్రాజ్య

2014-08-01

వీవెనుడి టెక్కునిక్కులు » తెలుగు భాష: తెలుగు భాషకి ఆధునిక హోదా: జాలమే వేదిక!

2014-08-01 04:47 AM వీవెన్
కొన్నాళ్ళ క్రితం ప్రజ బ్లాగులో తెలుగు భాషకు ప్రాచీన హోదా వల్ల ఒరిగేది ఏమైనా ఉందా? అన్న ప్రశ్న వచ్చింది. (విచారకరంగా ఆ టపా ఇప్పుడు అందుబాటులో లేదు.) దానిపై రహ్మనుద్దీన్ తన ఆలోచనలను మరో టపాలో పంచుకున్నాడు. దీని ద్వారా కొంతవరకూ మూల టపా సారాంశాన్ని గ్రహించవచ్చు. ప్రజ టపాకి నేను స్పందిస్తూ ప్రాచీన హోదా, తత్ఫలిత విశిష్ట కేంద్రమూ సామాన్యులకి నేరుగా ఉపయోగపడకపోవచ్చు కానీ వాటివల్ల చరిత్ర సాహిత్య రంగాలకు ఏదైనా ప్రయోజనం ఉండొచ్చు […]

2014-07-17

తెలుగు: (శీర్షిక లేదు)

2014-07-17 05:50 PM తవ్వా ఓబుల్ రెడ్డి

2014-05-30

వీవెనుడి టెక్కునిక్కులు » తెలుగు భాష: తెలుగులో a.m. p.m.?

2014-05-30 12:10 PM వీవెన్
ఆంగ్లంలో 12-గంటల ఫార్మాటులో సమయాన్ని చెప్పేప్పుడు మధ్యాహ్నానానికి ముందో తర్వాతో సూచించడానికి a.m. అనీ p.m. అనీ వాడతాం. తెలుగులో అయితే, మాట్లాడేటప్పుడు తడుముకోకుండా ఉదయం/పొద్దున్న/మార్నింగు 8 గంటలకు అనో, రాత్రి/నైటు 8 గంటలకు అనో తెల్లవారు 5 గంటలకు అనో, సాయంకాలం/ఈవెనింగు 5 గంటలకు అనో అంటాం. కానీ కంప్యూటర్లోనో లేదా వేరే డిస్‌ప్లేలలో సమయాన్ని తక్కువ అక్షరాలతో సూచించాల్సి వచ్చినప్పుడు లేదా సాంకేతికంగా లాంఛనప్రాయంగా వాడాల్సివచ్చినప్పుడు తెలుగులో (ఏయెమ్, పీయెమ్ కాకుండా) ఏ పదాలను […]

2014-01-01

e-తెలుగు: మొబైళ్ళలో తెలుగు

2014-01-01 10:58 AM వీవెన్

ఇటీవల చేతిఫోన్ల వాడకం బాగా పెరిగింది. గతంలో కొన్ని ఫోన్లు తెలుగు కీప్యాడుతో కూడా వచ్చేవి. స్మార్టుఫోన్లు రావడం మొదలైనప్పుడు వాటిల్లో తెలుగుకి తోడ్పాటు ఉండేది కాదు. కానీ ఈ మధ్య స్మార్టుఫోన్లు కూడా తెలుగుకి తోడ్పాటుతో వస్తున్నాయి (ఫోను మొత్తం తెలుగులో లేకపోయినా, తెలుగుని చూడవచ్చూ, టైపుచేయవచ్చూ). తెలుగు తోడ్పాటు ఉన్న ఫోన్లూ, తెలుగు టైపు చేయడానికి అందుబాటులో ఉన్న పద్ధతుల సంగ్రహమే ఈ పేజీ.

తెలుగు చూడడం

ప్రస్తుతం లభించే అన్ని రకాల స్మార్టు ఫోన్లూ తెలుగు తోడ్పాటుతో వస్తున్నాయి. ఏయే ఫోన్లు ఏ సంచిక నుండి తెలుగును సరిగా చూపిస్తాయో అన్న వివరాలు:

పూర్తిగా చదవండి

2012-12-27

e-తెలుగు: 27 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు కార్యక్రమాల నివేదిక

2012-12-27 06:23 AM kasyap

27 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో    అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసే క్రమంలో e-తెలుగు ప్రతి సంవత్సరం లాగానే  ఒక స్టాలు తీసికొని నిర్వహించింది. ఈ సారి కూడా e-తెలుగు సభ్యులు, తెలుగు బ్లాగరులు  ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.e తెలుగు స్టాలు 

పూర్తిగా చదవండి

2012-12-06

e-తెలుగు: హైదరాబాదులో తెలుగు బ్లాగుల దినోత్సవం, 2012

2012-12-06 02:18 AM వీవెన్

e-తెలుగు సభ్యులకు ఔత్సాహికులకు, తెలుగు బ్లాగర్లకు, తెలుగు భాషాభిమానులకూ… తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!

తెలుగు బ్లాగుల దినోత్సవం — డిసెంబర్ రెండవ ఆదివారం

ఈ నెల రెండవ ఆదివారం అనగా (డిసెంబర్ 9న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం మరియు తేనీటి విందుని e-తెలుగు ఏర్పాటు చేసింది. తెలుగు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వివరాలు:

సమయం:
ఆదివారం, డిసెంబర్ 09, 2012 ఉదయం 10 గంటలకు

వేదిక:
హనీపాట్ ఐటీ కన్సెల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్,
మొదటి అంతస్తు, పూర్ణీ ప్లాజా,
షాదాన్ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా,
ఖైరతాబాద్,
హైదరాబాద్. (గూగుల్ పటం)

సంప్రదింపులు:
93965 33666

పూర్తిగా చదవండి

2012-09-18

మనోనేత్రం: కారణమాలాలంకారం

2012-09-18 05:51 AM Sandeep P
వ్యాకరణం -> అలంకారాలు -> అర్థాలంకారాలు -> కారణమాలాలంకారం లక్షణం: (గ్రంథం: సంస్కృతచంద్రాలోకం, రచన: జయదేవ కవి) గుంభః కారణమాలా స్యాద్యథా ప్రాక్ప్రాంత కారణైఃనయేన శ్రీః శ్రియా త్యాగస్త్యాగేన విపులం యశః(గ్రంథం: తెలుగు చంద్రాలోకం, రచన: ఆడిదము సూరకవి)వరుస దప్పని కారణావళులతోడఁగీలు కొల్పినఁ గారణమాలయగునునీతిచే సిరి సిరి చేత దాతృతయునుదాతృతను భూరియశమన్నరీతి శర్వభావం: కారణం కార్యం ఒకదానికొకటిగా

2011-11-11

చదువరి: గూగులుకు తెలుగు నేర్పాలి మనం!

2011-11-11 03:20 PM చదువరి
తెలుగులో పదాలను వాక్యంలో ఇమిడ్చేటపుడు అవి రూపం కోల్పోతూ ఉంటాయి. సంధి జరిగి, సమాసం ఏర్పడినపుడు, బహువచనాలైనపుడు, విభక్తులు చేరినపుడు, .. ఇలా అనేక రకాలుగా పదాల రూపు మారుతూంటుంది. క్రియా రూపాలను బట్టి మారడం సరేసరి! ఇంగ్లీషులోనూ మారతాయిగానీ, తెలుగులో మారినంత ఎక్కువగా ఆ భాషలో జరగదు. పైగా ఇంగ్లీషులో జరిగే మార్పులు కొన్ని ఖచ్చితమైన నియమాలకు లోబడి జరుగుతాయి. ఆ నియమాలు కూడా తక్కువే. తెలుగులోనూ

చదువరి: తెలుగులో వెతకటం అంత వీజీ కాదు గురూ!

2011-11-11 11:16 AM చదువరి
(ఈ వ్యాసంలో కొన్ని పదాల పక్కన బ్రాకెట్లలో అంకెలు చూపించాను. అవి - ఆగస్టు 2 రాత్రి ఆయాపదాల కోసం గూగిలించినపుడు వచ్చిన ఫలితాల సంఖ్య. మళ్ళీ వెతికితే ఈ ఫలితాలు కొద్దిగా అటూఇటూ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ రాసినదంతా గూగుల్లో వెతకడాన్ని దృష్టిలో పెట్టుకుని రాసినదే. గూగిలించడం అంటే google.com లో వెతకడం.)  ----------------------------- జాలంలో ఏదైనా సమాచారం కోసం వెతకాలంటే సెర్చింజనే గతి. సెర్చింజనుకు

2011-08-31

చదువరి: తెలుగులో తేదీని ఎలా రాయాలి? (Date format in Telugu)

2011-08-31 07:33 AM చదువరి
తెలుగులో తేదీ ఆకృతి - తేదీ ఫార్మాట్ (Date format) - ఎలా ఉండాలి? ’ఎలా ఏముంది.. 08/31/11 అని ,అంతేగా’ అంటారు నేటి ఐటీ ఘనపాఠీలు. నాకు తెలిసిన ఐటీ కుర్రాడొకడు కిస్మీసు సెలవలకి అమెరికా నుంచి వాళ్ళూరు వచ్చాడు. వాళ్ళ తాతకు ఏదో కాగితం రాసిపెడుతూ తేదీని 12/13/06 అని రాసాడంట. అదిచూసి, ఆ పెద్దాయన, ’సదవేత్తే ఉండమతి పోయిందిరా నీకు’ అని అన్నాడంట. తేదీని తిరగరాసి, ’ఎమెరికన్స్ డేట్ ని అట్లాగే రాస్తారు తాతా’,

2011-08-21

మాయాశశిరేఖ: అచ్చ తెలుగు పదాలు

2011-08-21 10:14 AM ఆ.సౌమ్య
నాకు తెలుగు మీదున్న ప్రేమ నా చేత కొన్ని పనులు చేయిస్తూ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా నేను చేపట్టిన పని అచ్చ తెలుగు పదాలని వెతకడం. మూలద్రవిడ భాష నుండి తమిళం, తెలుగు, కన్నడం వచ్చాయని మనకి తెలుసు. ఆర్య సంస్కృతి, ద్రవిడ సంస్కృతిలో విలీనమయినప్పుడు భాగంగా సంస్కృతం, ద్రవిడ భాషలన్నిటిలోనూ బాగా కలిసిపోయింది. ఈరోజుకి ఏది అచ్చ తెలుగు పదమో, ఏది సంస్కృతపదమో పోల్చుకుని, విడదీయలేనంతగా సంస్కృతం తెలుగులో కలిసిపోయింది.

2011-07-09

అన్వీక్షణం » భాష, ఛందస్సు, వ్యాకరణం: తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (4)

2011-07-09 10:23 PM venkat.b.rao

పలుకుబడి అంటే పలికే తీరు.  ఇందులో ‘బడి’ అనేది ప్రత్యయం. ఇలాంటిదే ‘రాబడి’, వచ్చే తీరు అని అర్ధం.  కానీ జన వ్యవహారంలో ‘రాబడి’ అంటేనే ‘ఆదాయం’ అన్న అర్ధం స్థిరపడిపోయింది. ‘ఈ వ్యాపారంలో రాబడి బాగా ఉంటుందా?’ అంటే ఆదాయం వచ్చే తీరు బాగానే ఉంటుందా అని అర్ధం.

‘అరికం’ ఒక ప్రత్యయం. లక్షణాన్ని తెలుపుతుంది. పేదరికం, పెద్దరికం, చుట్టరికం, ఇల్లరికం, రాచరికం ఇత్యాదిగ. ‘అరి’ అనేది అచ్చ తెలుగు పదం. లక్షణాన్ని తెలుపుతుంది. నేర్పరి, పొడగరి, సిగ్గరి  ఇత్యాదిగా. దీనికి పొడిగింపే ‘అరికం’.

‘అమ్మా! మాదా కబళం తల్లీ!’ ఇందులో మాదా కబళం అనే మాట ‘మాధవ కబళం’. కృష్ణార్పణం తో సరిసమానమైనదిగా భావించబడాలని అర్ధం.

చదువులు, మాటలు కట్టిపెట్టి అంటే ఇక ‘చదివేది లేదా మాట్లాడుకునేదీ ప్రస్తుతానికి ఆపి’ అనే అర్ధంలో ఇప్పుడుంది. ఇందులో ‘కట్టిపెట్టడం’ అనే మాట చరిత్ర చాలా వెనకకు పోతుంది.  అంటే, పుస్తకాలు తాళపత్ర గ్రంథాల రూపంలో ఉండిన కాలందాకా నన్నమాట. తాళపత్ర గ్రంథాన్ని కట్టిపెట్టాలిసిందేగాని పుస్తకం మూసినంత సుళువుగా మూయలేంగదా. మాట మాత్రం వాడుకలో అలా నిలిచిపోయింది.

‘అభ్యంతరం’ అనే మాటకు ‘ఇంటి లోపలి గది’ అని అర్ధం. ‘అభ్యంతరం లేదు’ అనే మాటకు ‘అడ్డుచెప్పటానికి ఏమీ లేదు’ అన్న అర్ధంలో ప్రస్తుతం వాడుకలో ఉంది. అయితే ఈ అర్ధం ఎలా వచ్చిందనేది అర్ధం కావడానికి ఒక సందర్భం ద్వారా చెప్పుకోవాలి. ఒక ఇంటి యజమాని ముందు వసారాలోనో, వరండాలోని కూర్చుని ఉంటాడు. ఇంతలో ఒకతను వచ్చి ‘అయ్యా! తమతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి,’ అన్నాడు. దానికా యింటి యజమాని సమాధానంగా, ‘అట్లాగా! అయితే ఇక్కడ పరవాలేదా, అభ్యంతరం గాని ఉందా?’ అని ప్రశ్నిస్తాడు. ఇక్కడ యింటి యజమాని అర్ధం ‘ఇంటి లోపలి గదిలోనికి వెళ్ళాలిసిన అవసరం ఉందా?’ అని అర్ధం. దానికి ఆ వచ్చిన మనిషి, ‘అబ్బే, అభ్యంతరమేమీ లేదు. ఇక్కడ మాట్లాడుకోవచ్చును,’ అంటాడు. అంటే ‘లోనికి వెళ్ళవలలిసినంత రహస్యమేమీ కాదు’ అని అర్ధం. ఇలా మొదలైంది, పోనుపోనూ ‘అభ్యంతరం’ అన్న మాటకు ‘సమ్మతి తెలుపలేనిది’ అన్న అర్ధం లోక వ్యవహారంలో స్థిరపడిపోయింది.

‘పితలాటకం’ అనే మాట ప్రస్తుతం వాడకంలో ‘తంటా’ అన్న అర్ధంలో ఉంది. ‘ఇతగాడితో పెద్ద పితలాటకం’ అంటే, ‘ఇతనితో వ్యవహారం ఏమంత మంచిదికాడు, ఇతను తంటాలు తెచ్చిపెట్టే మనిషి ‘ అని అర్ధం. ఈ మాట ‘పిత్తళిహాటకం’ అన్న మాటకు అపభ్రంశమని చెబుతారు. అంటే ‘ఇత్తడిని బంగారం లాగా చేసే మనిషి ‘ అని అర్ధం. నిందార్ధంలో ‘ఇత్తడిని బంగారంగా చూపించే మనిషి’ అని. నిందార్ధం జనవ్యవహారంలో స్థిరపడిపోయింది.


2011-06-16

అవీ-ఇవీ: పదిరోజుల్లో కన్నడం - ఒకటో రోజు

2011-06-16 10:03 AM త్రివిక్రమ్ Trivikram
రెండేండ్ల కిందట నేను "పదిరోజుల్లో కన్నడం" పుస్తకం రాస్తానని చెప్పి ముందస్తు ఆర్డర్ల కోసం ప్రకటన ఇస్తే ఔత్సాహికులు పొలోమని ఆర్డర్లిచ్చేశారు. వాళ్ళ ఉత్సాహాన్ని జోకొట్టి పడుకోబెట్టింది ఇన్నాళ్ళూ నాలో సహజసిద్ధంగా ఉన్న బద్ధకం. ఐతే ఈమధ్యకాలంలో నా కన్నడ పరిజ్ఞానం విపరీతంగా పెరిగిపోయి నాకు నిజంగానే కన్నడం కొద్దికొద్దిగా అర్థమైపోతోందేమోనని చాలా రొంబ తుంబ డౌటనుమానం కూడా వచ్చేస్తోంది. దాన్ని

2011-06-15

చీకటివెలుగులు: తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

2011-06-15 07:50 AM హరి
భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి

2011-05-29

అన్వీక్షణం » భాష, ఛందస్సు, వ్యాకరణం: తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (3)

2011-05-29 07:12 PM venkat.b.rao

అందలము – అందలానికి ఎత్తేశాడు అంటే పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు అన్న అర్ధంలో ఇప్పుడు వాడకంలో ఉన్నట్లుగా కనపడుతుంది గాని, అందలము అన్న మాటకు  ‘పక్కలన తెరలు లేని పల్లకీ’ అని అర్ధం. పూర్వం రాజులకాలంలో రాజాస్థానానికి తీసుకుని వెళ్ళేప్పుడు సన్మానితులను అందరికీ కనిపించే విధంగా అందలం ఎక్కించి తీసుకుని వెళ్ళేవాళ్ళు. రాజులకాలం పోయి, అందలాలు మాయమయ్యాక, పొగడ్తలలో ముంచెయ్యడం అన్న మాటకు అర్ధంగా అందలమన్న మాట మిగిలింది.

లొట్ట వేసుకుంటూ, లొట్టలు వేసుకుంటూ అంటే చాలా ఇష్టంగా తినడం అన్న అర్ధంలో ఇప్పుడు వాడ బడుతోంది. అయితే, ఈ లొట్ట వేసుకుంటూ అన్న మాటకు అర్ధం నిజానికి ‘లోటాడు వేసుకుంటూ’ అని. పూర్వకవుల ప్రయోగాలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ‘కల్లు లొట్టెడు త్రాగి కైపెక్కి’ (వేణుగోపాల శతకం) ఇత్యాదిగా. లొట్టి అన్న పదానికి చెట్టునుండి కల్లును తేసే కుండ అని అర్ధం. లొట్టెడు తాగడం అంటే కల్లు ముంతడు తాగడం అనేగా అర్ధం. అయితే, కాలక్రమేణా జనసామాన్యం సమ్మతికి తగినట్లుగా అర్ధాన్ని మార్చుకుని ఇష్టంగా తినడం అన్న అర్ధంలో ఈ మాట కుదురుకుంది.

ఇప్పుడెవరూ ఇలా అడగడానికి ధైర్యం చెయ్యరుగాని, ఒకప్పుడు మీరే కులస్తులు? అని అడగడానికి గ్రామీణులలో ‘మీరేముట్లు?’ అని అడగడం వాడకంలో ఉందేది. ఇందులో మూడు మాటలున్నాయి. మీరు, ఏమి, ఉట్లు లేదా ఉట్టులు, అనేవి ఆ మూడు మాటలు. వీటిల్లో ‘ఉట్టు’ అన్న పదానికి ‘పుట్టు’ అనీ, ఇంకా ‘కారు, స్రవించు’ అనీ అర్ధాలున్నాయి. ఏ కులంలో జన్మించారు లేదా పుట్టారు అని ప్రశ్నించడానికి సంక్షిప్తంగా తయారయిన రూపమే ‘ఏముట్లు’ అన్న మాట. అయితే, ఇప్పటికే ఈ మాట మరుగున పడిపోయింది.


2011-03-04

అన్వీక్షణం » భాష, ఛందస్సు, వ్యాకరణం: వేణుగోపాల శతకం – కొన్ని సంగతులు (2)

2011-03-04 04:51 PM venkat.b.rao

నానుడులు, లోకోక్తులు అనదగినటువంటివి, అర్ధం అదే అయినా ఇప్పుడు వేరే మాటలలో ప్రయోగంలో ఉన్నటువంటివి, కొన్నైతే అసలు ప్రయోగంలో లేనటువంటివి, మరికొన్ని వేంకటకవి స్వయంగా సందర్భానికి అతికేట్లుగా కల్పించినట్లు అనిపించేటువంటివి, వేణుగోపాల శతకంలో చాలా కనిపిస్తాయి.  వాటిల్లో కొన్నిటిని క్రింద చూపడ మైంది:

‘వెన్న యుండియు నేతికి వెదికి నటుల’ – ఇంటిలో వెన్న సమృధ్ధిగా ఉన్న సంగతి మరిచి నేతికోసం ప్రయాస పడినట్లుగా అని ఈ మాటల అర్ధం. అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అనే సామెత, ఒడిలో బిడ్డను పెట్టుకుని ఇల్లాంతా వెదకడ మన్న సామెతా దీనికి కాస్తంత దగ్గరగా అనిపిస్తాయి తప్ప పూర్తిగా ఈ మాటల అర్ధంతో సరిపోగల సామెత ఇప్పుడు వ్యవహారంలో ఒక్కటి కూడా లేదని నా కనిపిస్తుంది.

‘కల్ల పసిండికి కాంతి మెండు’ – మెరిసేదంతా బంగారం కాదు (all that glitters is not gold అన్న ఆంగ్ల సామెతకు మక్కికి మక్కి) ఇప్పుడు వ్యవహారంలో ఎక్కువుగా వినిపించే సామెత.  కాని అర్ధంలో సూక్ష్మమైన తేడా ఉంది. ‘ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుంది’ అన్న సామెత అర్ధానికి ఈ సామెత అర్ధానికి ఓమొస్తరుగా సామ్యం కుదురుతుంది. కానీ ఇందులో హేళణ ఎక్కువగా ధ్వనిస్తుంది. పై సామెతలో భావ గాంభీర్యం ఎక్కువ.

‘అల్ప విద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద’ ఇంత చక్కని నానుడి ఇప్పుడు ప్రయోగంలోనే లేదు. half knowledge is always dangerous అన్న ఆంగ్ల లోకోక్తిని గుర్తుంచు కున్నంతగా మనం ఈ సామెతను గుర్తుంచుకోలేదు. 

‘ఆబోతు పేదల యశము గోరు’ – ఇది అత్యంత హృద్యమైన నానుడి.  బసవయ్యను అంత ఎత్తులో, ఉన్నతమైన రూపంలో  లేపాక్షిలో మనవాళ్ళెందుకు మలుచుకుని స్థాపించుకున్నారో ఈ మాటల వల్ల అర్ధమవుతుంది.

‘గజముపై చౌడోలు గాడిద కెత్తితే, మోయునా పడవేశి కూయు గాని’ – చౌడోలు అంటే ఏనుగుపై  అంబారి. భారం మోయగలడో లేడో చూసి తలకెత్తాలి అనీ, సమర్ధత సరిగా గుర్తెరిగి కాని ఏపనినైనా అప్పగించ కూడదనీ ఈ మాటల అర్ధం. ఇదసలు ఇప్పుడు ప్రయోగంలో లేదు.

‘వలపు రూపెఱుగదు, నిద్ర సుఖం బెఱుగదు, ఆకలిలో నాల్క అఱుచి ఎరుగదు’ – ఇది ఒక నానుడుల మాలిక.  ఇందులో మొదటి దానికి సారూప్యత గలిగిన ‘ప్రెమ గుడ్డిది’ అనే ఇప్పుడు వాడుకలో ఉన్ననానుడి love is blind అనే ఆంగ్ల లోకోక్తి కి మక్కికి మక్కి.  దీనిని గుర్తుంచుకుని  వాడుతున్నాం మనం. నిద్ర సుఖ మెరుగదు అనే నానుడి అప్పటికి ఇప్పటికి అలాగే ప్రచారంలో ఉంది.  ఇక మూడవది ‘ఆకలి రుచి ఎరుగదు’ అన్న రూపంలో సంక్షిప్తమై ప్రయోగంలో ఉంది. ఆకలిలో నాల్క ‘అఱుచి’ ఎరుగదన్నదే హృద్యమైన అసలు రూపం.


2011-03-02

అన్వీక్షణం » భాష, ఛందస్సు, వ్యాకరణం: తెలుగులో పదాలు – కొన్ని ఆసక్తికరమైన అర్ధవివరణలు (2)

2011-03-02 03:49 PM venkat.b.rao

‘అకము’ అనే పదానికి అర్ధం పాపము అని. న అకము, నాకము అంటే పాపము లేనిది, కాబట్టి స్వర్గం.

‘అక్షతలు’ అనగా క్షతమై ఉండనివి unbroken grains అని అర్ధం. అందుకే అక్షతలు తయారు చేసేప్పుడు నిండు బియ్యపు గింజలనే తీసుకోవాలి, అలాంటివే శిరస్సుపై ధరించడం గానీ, చల్లడం గానీ చేయ్యాలి.

‘పరము’, పరముపడి ఉండడం అంటే అభోజనం ఉండడం. పరగడుపు, పరము కడుపు, అభోజనమై ఉన్న, అప్పటికింకా ఏ అహారమూ తీసుకోని స్థితిలో అని అర్ధం.

‘అందె’ అనే మాటకు నూపురము a foot trinklet అని అర్ధం (అందెల రవళుల సందడి మరి మరి….). కానీ అందె వేసిన చేయి అన్నప్పుడు ఇది చేతి కంకణాన్ని సూచిస్తుంది. అయితే ఈ కంకణం ప్రజ్ఞకు ప్రశంశా పూర్వకంగా బహూకరింప బడినదై ఉంటుందనేది ఆ మాటల అర్ధం చెప్పకనే చెబుతుంది.

‘బోన’ అనే పదానికి వండిన ప్రాలు, అన్నం అనే అర్ధం ఉండేది. దీని నించే బోనము అయ్యింది. ఇదే ‘బోనాలు’ అనే మాట. అయితే, బోనము అనే పదం సంస్కృత ‘భోజనము’ అనే పదానికి వికృతి రూపమని కూడా చెబుతారు.

‘హాయిగా’ అన్న మాట సుఖంగా అని ప్రయోగంలో ఇప్పుడున్న అర్ధం. శరీరం బాగా అలసట చెంది ఉన్న తరుణంలో కొంత విశ్రాంతి దొరికితే, అప్పుడు అసంకల్పితంగా నోటినుండి విడుదలయ్యే ‘హా’ అనే ఊర్పుతో కూడుకున్న శబ్దం నుంచి ఈ పదం ఏర్పడింది. కవుల ప్రయోగాల్లో ఇది ఇలాగే కనిపిస్తుంది (సుఖమంది ‘హా’ యని సొక్కువేళ…ఇత్యాదిగ).

‘భడవా’ అన్న మాట ఇప్పుడు ‘చిన్న వయసులోనే పెద్ద పనులు చేయగల నేర్పరి’ లేదా ‘వయసుకు మించిన పనులు చేయగల ప్రావీణ్యత గలవాడు’ అన్న అర్ధంలో పిల్లలను ఒకింత మెచ్చుకోలు ధ్వనించే విధంగా మందలిస్తున్న సందర్భంలో వాడబడుతోంది.  కానీ, ‘బడవా’ అన్న మాట కవుల ప్రయోగాల్లో ‘తార్చువాడు, తార్చునది’ అన్న అర్ధంలో వాడబడింది. (పంచాంగములు మోసి, బడవాతనము చేసి…ఇత్యాదిగ).

‘అల్లారు ముద్దుగా’ అనే పదబంధానికి చాలా ముద్దుగా, అంటే ఏ కష్టమూ తెలీనీయకుండా చూసుకోవడం, అలా పెంచడం అనేది ప్రయోగంలో జనసమ్మతి పొందిన అర్ధం. ఈ పదబంధంలోని ‘అల్లారు’ అనే మాటను అల్ల, ఆరు అని రెండు మాటలుగా విడదీసి చూపించింది బ్రౌణ్యం. అయితే ఈ రెండు పదాల విడి అర్ధాలు ఇక్కడ పొసగవు. అల్లరే ముద్దుగా, అంటే చేసే అల్లరియే ముద్దుగా అనే అర్ధంలో వాడబడినది రాను రానూ అపభ్రంశమై అల్లారు ముద్దుగా మారిందని నా అభిప్రాయం. ఈ అభిప్రాయంతో మీరు సోపపత్తికంగా విబేధించవచ్చు.

‘వాస్తవము’ అంటే నిజం అన్నది రూఢార్ధం. వస్తువులో నిక్షిప్తమై దృగ్గోచరమయేదీ, అనుభవమయ్యేదీ ఏదైతే ఉందో అది తాత్త్వికంగా నిజం కాబట్టి, వస్తుగతమై ఉండేది వాస్తవము, నిజం అన్నది రూఢార్ధమైందని నా అభిప్రాయం. ఈ అభిప్రాయంతోనూ మీరు సోపపత్తికంగా విబేధించవచ్చు.


2011-02-21

చంద్రిమ » భాష: తెలుగు పద్యాల్లో ఆంగ్ల పాఠాలు – 2

2011-02-21 08:24 AM kmcmohan

కొంత, చాలా కాలం క్రితం, కొన్ని పద్యాల్ని తెలుగు పద్యాల్లో ఆంగ్లోచ్ఛారణా పాఠాలన్న పేర పెట్టాను. శ్రీ సుదర్శనం గారి పద్యాల పాఠాలు మెల్లమెల్లగా వందను తాకుతున్నాయి. ఉచ్ఛారణను దాటి పద వ్యుత్పత్తి, భాషాభాగాలను స్పృశిస్తూ కొంత ప్రౌఢంగా మారింది. ఈ పద్యాలను యూనికోడులో టైపు చేయడం తప్ప నా హస్తవాసి మరేమీ లేదు. మచ్చుకి మరికొన్ని పద్యాలు ఇక్కడ:

1.
మర్క్యురి పాదరసంబౌ
సర్క్యూయిటసనగ నొప్పు సర్కిట్ పరమై
హర్క్యూలీజ్ అతి బలుడౌ
పర్క్యూటేనియసనంగ త్వగ్ మూలమగున్

(Mercury, Circuitous, Circuit, Hercules, Percutaneous )

2.
క్వెశ్చన్ అన ప్రశ్న యగు, స
జశ్చన్ సూచన యగును, డిజశ్చన్ మరి డై
జశ్చన్ జీర్ణక్రియ, కం
జశ్చన్ సమ్మర్దమగును సంధ్యా నాటీ!

(Question, Suggestion, Digestion, Congestion )

3.
భాషా విభాగంబు మారగా వెన్వెంట
మారును గాదె యుచ్చారణంబు
హీలు హెల్తయ్యెను హేలు తత్పరమెయౌ
ఫూడ్, ఫీడ్ విభేదంబు పొదలునిటులె
బ్రీడు బ్రూడగు గాదె బ్లీడు బ్లడ్ ఇట్టులే
గ్రేస్ నుండి క్రియకల్గు గ్రేజనంగ
నీ నీలగును నెస్టు నెజిలగు గమనింప
ఈక్వల్ ఇక్వాలిటీ ఇటులె చెల్లు
కాఫ్ నుండి కావ్ గల్గు హాఫ్ నుండియే హావ్, బి
లీఫ్ బిలీవ్ అగును రిలీఫు నిట్లె
సాలిడ్ సలిడిఫైయె స్టడి స్ట్యూడియస్ అగు
టిట్యులర్ టైటిలు డీపు డెప్తు
లోరయ్యె లర్న్ లెండు లోనుగ మారెను
సీ సైటు, సిట్ సీటు, స్టీలు స్టెల్తు
నిట్ నాట్‍గ మారె ఎనిమి ఇనిమికల్, అ
బైడ్‍ అబోడగు, బైండు బాండు
డీడయ్యె డూ, డ్రాపు డ్రిప్పిట్టులేయగు
నౌనయ్యె నామినల్ నాగభూష ;
స్కూల్ స్కలేస్టిక్ అగు సోషల్ ససైయటి
వైసును విషియేటు గ్లాసు గ్లేజు
ఇంక్లైన్ అలెజ్‍ నుండి ఇంక్లినేషను మరి
ఏలిగేషన్ గల్గు నిందుమౌళి
స్పేసు స్పేషియలగు పేలస్ పలేషియల్
డివినిటియు డివైను కవయునిట్లె

పాప్యులర్ పీపులును మరి పాప్యులసును
ఏకపరమగు అబిలిటి ఏబులిటులె
క్లియరు క్లేరిటిగా మారె క్లీను క్లెన్సు
కాలని కలోనియల్లాయె కాలకంఠ!

( భాషా విభాగంబు = Parts of Speech
Heal – Health, hale; Food – Feed; Breed – Brood; Bleed – Blood; Grass – Graze; Knee – Kneel;
Nest – Nesting; Equal – Equality; Calf – Calve; Half – Halve; Belief – Believe; Relief – Relieve;
Solid – Solidify; Study – Studious; Title – Titular; Deep – Depth; Learn – Lore; Lend – Lone; See – Sight; Sit – Seat; Steal – Stealth ; Knit – Knot; Enemy – Inimical; Abide – Abode; Bind – Bond; Do – Deed; Drop – Drip; Noun – Nominal; School – Scholastic; Social – Society; Vice – Vitiate; Glass – Glaze; Incline – Inclination; Allege – Allegation; Space – Spatial; Palace – Palatial; Divinity – Divine; People – Popular, Populace; Able – Ability; Clear – Clarity; Clean – Cleanse; Colony – Colonial )

4.
వర్ణక్రమము వేరు, భావమ్ము వేరయి
ఉచ్చారణము మాత్రమొకటె యైన
యట్టి పదంబులు హామఫోన్సనబడు
ఈ క్రింది పదములిట్టివియె యగును
హేర్‍ రోడ్‍ మరి గరిల హియరు డియరును గ్రీస్
సేల్‍ ఫేలనంగను మేలననిటె
కాంప్లిమెంట్‍ ప్రిన్సిపల్‍ కాన్ఫిడంట్‍ కౌన్సిలు
మీటని రెడ్‍ అన పీసునిటులె

బేరనగ సోల్‍ రెయిననగ ఫేరనంగ
పేరనంగ సైట్ సోరన పేక్టనంగ
బ్రేకనగ కర్నలనగ హీల్‍ బీటనంగ
రీడ్‍ మరియు చెక్‍ రీక్‍ ను హోల్‍ వృషభ వాహ!

వర్ణక్రమము = Spelling
Homophone
Hare – Hair; Hear – Here; Dear – Deer; Greece – Grease; Sale – Sail; Pale – Pail; Male – Mail; Compliment – Complement; Principle – Principal; Confident – Confidant; Meat – Meet; Red – Read (Past Tense);
Bear – Bare; Sole – Soul – Seoul (capital of South Korea); Rain – Rein – Reign; Soar – Sore;
Pear – Pare – Pair; Site – Sight; Shear – Sheer; Pact – Packed; Brake – Break; Colonel – Kernel;
Heel – Heal; Beer – Bier; Read – Reed; Check – Cheque; Wreak – Reek;

5.
హామగ్రాఫునకుండు నానార్థములు, ప
లిసెమి యన పలు అర్థములే యెసంగు
స్లఫ్ ‍అనంగను ఫాస్టన సౌండనంగ
మినిటు మైన్యూటు మరి టియర్ జననిటులనె
హామఫోనును మరియును హామగ్రాఫు
ఒదిగియుండును హామనిం పదమునందె

(Homograph; Polysemy; Slough; Sound; Minute; Tear – Tier; Homonym )

6.
స్టేటివ్ క్రియలు దెల్పు స్థిమిత పరిస్థితి
కాన ’ఇంగ్’ (ing) వీనికి కలుపరాదు
అమరు సామాన్య ధర్మముగ ’ఇంగ్’ చేర్పమి
బీయింగ్ క్రియలివియె బేసికంటి!
ఇంద్రియ గ్రాహ్యము లీహలూ హలు రుచుల్
నడవడి వైఖరి నమ్మకముల
చాటునీక్రియలు; డిసర్వు నండస్టేండు
సీం, లవ్ అనంగ పర్సీవ్ బిలాంగు

వరలు వ్యతిరేకి డైనమిక్‍ వర్బనంగ
ఇవియె డూయింగ్ క్రియలన నెసగు, చలన
శీలత ఈ క్రియ ధర్మము సెండ్, రిపేరు
వర్కనగ, వీనికి ’ఇంగ్’ చేర్చవచ్చు నీశ!

(Stative; Being; Deserve; Understand; Seem; Love; Perceive; Belong; Dynamic; Doing; Send; Repair; Work )

7.
ఈ క్రింది పదముల ఎయ్చ్ (H), మూగయై యుండు
ఆనస్టు, అవర్, ఏర్, ఆనరనగ
ఆర్చును, హర్టు గ్రేఅం టెమ్స్ ను, సేంటిపి
సేంతిపి పాస్ట్యుమస్‍ చేటమనగ
ఏంటని, ఏంతని హెమరిజ్ టిరీసయు
టామస్ షెపడ్ డాల్య డాలియ యన
మరి హిగిన్ బాటమ్స్ మాం మోం అనగవచ్చు
మెక్‍ కీమాను వీఇకిల్ వీహికిలన

ఫారిడనగ ఫోర్‍హెడ్‍ అన ద్వయము సరియె
వీయిమెంట్‍ వీహిమెంట్‍ మరి నీయిలిజము
నీహిలిజమన ప్రయిబిషన్ ప్రోహిబిషను
హీ (He) కి ఊనిక లేనిచో ఈ, ఇ యగును
ఇట్లె డిసేబీల్ డిసబీల్‍ మహేశ! సాంబ!

(Honest; Hour; Heir: Honour; Herb; Graham; Thames; Xanthippe; Posthumous; Chatham; Anthony; Haemorrhage; Theresa; Thomas; Shepherd; Dahlia; Higginbothams; Maugham; Mac Mohan ; Vehicle; Forehead; Vehement; Nihilism; Prohibition; Disable )

8.
పదములు కొన్ని వ్యాప్తములు పెనల్టిమేట్
అంతాక్షరము మూగదేను, కాని
తత్పదోత్పన్న పదావళి యందున
మూగవోయిన శబ్దము రవళించు
పేరడైం పేరడిగ్మేటిక్‍ రిసైన్ రెసి
గ్నేషను, సైను సిగ్నేచరగును
హిం హిమ్నలగును ఇట్లె రేన్ రెగ్నమౌ
సాలం సలమ్నిటి శమన వైరి!
కాలమగును కాలంనిస్టు కాలమిస్టు
ఫ్లెం ను ఫ్లేగ్మేటికగును బాలేందు మౌళి!
క్రం అగును క్రంబులాటం ను కండెమిటులె
పాంజనితము పాల్మేటును పాల్మరునగు

(ఉత్పన్న పదావళి = Derived Words; Paradigm – Paradigmatic; Resign – Resignation; Sign – Signature; Hymn – Hymnal; Reign – Regnam; Solemn – Solemnity; Column – Columnist; Phlegm –Phlegmatic; Crum – Crumble; Autumn – Autumnal; Condemn – Condemnation; Palm – Palmate, Palmer )

9.
లవ్‍లోన గివ్‍ లొ పల్కగరాదు గద ’ఈ’ (e)
ఐనచో నిదియేల అతికియుండు
యనగ నుత్తరంబె ’ఈ’ ఆది పదాచ్చును
దీర్ఘీకరించును త్రిపుర వైరి!
మ్యాట్ మేట్ అగునిటులె ప్యేన్ పేనగును డిమర్
డిమ్యుఅర్ అగును బిట్ ఇట్లె బైటు
స్టాప్ స్టోప్ గ మారును స్టార్‍ స్టేరు కారు కేర్‍
మెట్, టబ్లు మారును మీటు, ట్యూబు

డూ అగున్ డోగ టాప్, పిన్‍ లు టాపు, పైను
స్పిట్ పరిణతియె స్పైట్ శివ! మహేశ!
పైని ’ఈ’ మేజిక్ ఈ యని పలుక బడును
ఈ ను తొలగింతు రమెరికనులీ పదముల
ఏక్స్ చివరను ఏడ్జ్ చివర గిరీశ! సాంబ!

(Love; Give; Mat – Mate; Pan – Pane; Demur – Demure; Bit – Bite; Stop – Stope; Star – Stare; Car – Care; Met – Mete; Tub – Tube; Do – Doe; Top – Tope; Pin – Pine; Spit – Spite; Grip – Gripe; American Spelling for Axe is Ax and Adze is Adz)

10.
గ్రీస్‍ నుండి డీమాస్‍ యురీక ను పై (π) దెచ్చి
ఇటలి పీట్సను గ్రహియించి మెచ్చి
ఏంజైన పెక్టరిస్‍ ఏ ప్లూరిబస్‍ యూన
మునుదెచ్చి లేటిను మూలకముగ
భరత ఖండమునుండి బహువ్రీహి గొంపోయి
జర్మనీ నుండి కైసరును దెచ్చి
స్పేనిష్‍ నుండి సవేన, ప్వెబ్లో గొని
పర్షియా నుండి దర్బారు దెచ్చి

ఫ్రాన్సు దేశపు రాండివూ పరిగణించి
పోర్చుగల్ నుండి పాద్రి, టైఫూను దెచ్చి
సూక్తులిటుపన్ని సర్వాంగ సుందరముగ
అలరు దేదీప్యమానమై ఆంగ్ల వాణి

(Demos; Eureka; Pizza; Bahuvreehi Samasa/Compound; Angina Pectoris; E Pluribus Unum; Kaiser; Savannah; Pueblo; Durbar; Rendezvous; Padre; Typhoon)


Filed under: Uncategorized Tagged: ఉచ్చారణ, తెలుగు, పద్యాలు, భాష

2011-01-12

చీకటివెలుగులు: సంయమనం

2011-01-12 07:20 PM హరి
గత నెల రోజులుగా ఆంధ్రాలో, తెలంగాణాలో జరుగుతున్న ఉద్యమాలలో ఒక పదం మరీ మరీ వినిపించింది. ఈ పదాన్ని పలకడానికి అటు టీవీ యాంకర్లు, ఇటు రాజకీయ వాదులు, మరోవంక పోలీసులు విపరీతంగా శ్రమించారు. అదేదో గొప్ప చాలా పెద్ద పదం అనుకుంటే పొరపాటే. ఆ పదమే 'సంయమనం'. దీన్ని ఎన్ని రకాలుగా పలికారో చూద్దాం.సయ్యమనంసైమయనంసమ్మయనంసమయమనంసైమానం...ఒక పదాన్ని ఇన్ని రకాలుగా పలుకు తున్నారంటే దాంట్లో క్లిష్టత ఉండ బట్టే కదా? హిందీ

చీకటివెలుగులు: పద్యాలతో కుస్తీ

2011-01-12 07:18 PM హరి
td{ vertical-align: top; } పదో తరగతి చదివేటప్పుడు తెలుగు టీచర్ అనంతాచార్యుల వారు చందస్సు నేర్పించారు. ఆ సందర్భంగా  ఆటవెలది పద్యాన్ని బోధిస్తూ, ఒక పద్య పాదాన్ని ఇచ్చి పూరించమని చెప్పారు. అది... 'ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు' చందస్సు నేర్చుకున్న ఆనందంతో సమధికోత్సాహంతో ఇలా పూరించాను.  ఆ. వె.ఆట వెలదు లెల్ల నాటాడు నప్పుడు పాడునపుడు మనము పరవశించి  మేను పులకరించి మేఘ మధ్యంబునం దాటలాడుచున్న

2010-10-01

పొద్దు » భాష: మార్పు

2010-10-01 03:42 AM భారతి

బళ్ళు తెరిచి, చూస్తుండగానే నాలుగు నెలలు గడిచాయి. అప్పుడే క్వార్టర్లీ పరీక్షలొచ్చేశాయి. నగరంలో ఆంగ్లపాఠశాలలో, అప్పుడప్పుడే మాటలు నేర్చిన చిన్నపిల్లలు కేజీల్లెక్కన చదువుకుంటున్నారు.


ఎస్ ఫర్ స్పైడర్
ఎస్ ఫర్ స్పైడర్

Continue reading

2010-06-07

పొద్దు » భాష: పోతన కవిత్వ పటుత్వము

2010-06-07 09:11 PM tapidharmarao
__ శ్రీ తాపీ ధర్మారావు (పరిశోధన, 1954) “ముక్కుతిమ్మనార్యు ముద్దుపలు”కన్నట్లే పోతన్నది సహజ పాండిత్యమనీ అతను రామభక్తి పరాయణుడనీ సహృదయులు తమ అభిప్రాయాన్ని ‘గుళిగారూపం’గా ప్రకటించారు. దానితో ఇటీవలి పాఠక లోకానికి బమ్మెర పోతరాజూ, యెడ్ల రామదాసూ ఒక్క తరగతి రచయితలుగా కనబడ నారంభించారు. సహజ పాండిత్యం కాబట్టి పోతన్న ఆంధ్ర శబ్దచింతామణిగానీ కనీసం చిన్నయసూరి … Continue reading

2010-05-23

నచకి "బ్లాగో"తం » భాష: శ్రీ వేటూరి సుందరరామమూర్తి: ఒక చిర(ఱు) జ్ఞాపకం

2010-05-23 08:24 AM నచకి (NaChaKi / Dr. Chakravarthula Kiran)
“రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే!” “ఆకాశాన సూర్యుడుండడు సందెవేళలో!” “వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి” “గతించిపోవు గాథ నేననీ!” “నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన, ఆ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన?” … ఇలా ఎన్ని వ్రాసినా వేదాంతి, కవి అయినా తన జీవనగీతం కూడా ఇలాగే పాడవలసి వస్తుందని … చదవడం కొనసాగించండి

2010-02-25

నచకి "బ్లాగో"తం » భాష: కనబడుట లేదు!

2010-02-25 10:26 AM నచకి (NaChaKi / Dr. Chakravarthula Kiran)
పేరు: చాంచల్యం కరిగిన బాల్యం! గుర్తులు: తప్పిపోయిన సమయంలో స్వచ్ఛమైన మనసు తొడుక్కుని ఉంది, మనిషితనం తప్పించి మరే భాషా రాదు, మనసు భాష కొంచెం అర్థం చేసుకోగలదు “పైకి తెలియకపోయినా అందరూ నిన్నే వెతుకుతున్నారు… నీవు వెళ్ళినప్పటి నుంచి బ్రతుకుతల్లి నవ్వుని మరచిపోయింది! వచ్చెయ్యి, నిన్ను నన్నుగా చేసుకుంటా!”

నచకి "బ్లాగో"తం » భాష: ఏంటి, పదేళ్ళా…!

2010-02-25 10:15 AM నచకి (NaChaKi / Dr. Chakravarthula Kiran)
నిజమే… క్యాలెండర్‌లో “20” తరువాత “0” కాస్తా “1” అయింది! “ఒకటి”కి ఎంత విలువనో కదా!అబ్బే పదేళ్ళేనా… ఎంతో నేర్పించింది జీవితం… చేరదీసి తట్టి, చాచి పెట్టి కొట్టి చాలానే నేర్పింది జీ..వి..తం! నేనే… ఏమీ నేర్చుకోలేదు!విదేశంలో పదేళ్ళున్నానంటే… “ఆహా!” అన్నవాళ్ళే అంతా! “అయ్యో” అనుండాలని ఎందరికి తెలుసు!? తల్లిభూమి చేదయ్యిందా?అదేంటో… మనసు బ్రతికే ఉంది … చదవడం కొనసాగించండి

2009-11-23

తేజస్వి » మాతృభాష: English నుంచి తెలుగు నేర్చుకోవలసినది….

2009-11-23 05:28 PM Sai Praveen OS
ఇది మీరు చదువుతున్నారంటే కచ్చితంగా తెలుగువారే అయివుంటారని నేను అనుకుంటాను. తెలుగులో బ్లాగు/సైట్లను నిర్వహిస్తున్నవారు, రచనలు చేసేవారు మాతృభాష మీద అభిమానము చేతనే ఆ పని చేస్తున్నారు. కని గమనించారా? తెలుగు బ్లాగుల URLలు ఆంగ్లములో ఉన్నది. కనీసం, తెలుగులో URL అంటే ఏంటని కూడా నాకు తెలియదు. అది నా పరి(దుః)స్థితి. కాని, మనకు నచ్చిన భాషలో URLలను పొందవచ్చని ఎక్కడో ఒక బ్లాగులో చదివాను.  ప్రస్తుతం తెలుగుభాష యొక్క స్థితిని ఏవిధంగా మెరుగుపరచడం అని […]

2009-11-03

పొద్దు » భాష: ప్రాథమిక విద్య – మన ప్రాథమ్యాలెక్కడ?

2009-11-03 06:26 AM చదువరి
రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలోను - ప్రభుత్వం నడిపేదైనా, ప్రైవేటుదైనా - ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించడాన్ని నిర్బంధం చెయ్యాలి. ఇంటర్మీడియేటు వరకు తెలుగు ఒక బోధనాంశంగా నిర్బంధం చెయ్యాలి. కర్ణాటక కన్నడం కోసం ఈ పనులు చేసింది. మహారాష్ట్ర మరాఠీ కోసం చేసింది. మన ప్రభుత్వం తెలుగు కోసం ఎందుకు చెయ్యదు? Continue reading

2009-08-18

తేజస్వి » మాతృభాష: ఆనందించాలా ?! సిగ్గుపడాలా??!!

2009-08-18 01:01 AM Sai Praveen OS
క్రొన్ని రోజుల క్రిదంట నేను ఈ వార్తను చదివాను. తెలుగు భాషను పరిరక్షించడానికి ప్రవాసాంధ్రులు నడుంబిగించారు. మాతృభాషను కాపాడేందుకు ఉద్యమంలా కార్యక్రమాలను నిర్వహించాలని దీనికి పూర్తి సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికాలోని ప్రవాసాంధ్రులు తీర్మానించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం మహాసభలలో ఈ తీర్మానాన్ని చేస్తూ తెలుగు భాష తియ్యదనాన్ని చాటిచెప్పిన వేమన, సుమతీ తదితర శతకాలను సీ.డి.లుగా తయారు చేస్తున్నామని నిర్వహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ […]

2009-06-29

పొద్దు » భాష: An Apology of a Telugu fa(lu)natic

2009-06-29 06:00 PM భైరవభట్ల కామేశ్వరరావు
కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు "ఈ తరానికి ప్రశ్నలు" సంధించిన దరిమిలా తెలుగు భాష మనుగడ గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ వ్యాసంపై వచ్చిన కొన్ని స్పందనలపై భైరవభట్ల కామేశ్వర రావు గారి ప్రతిస్పందన ఇది. Continue reading

2009-06-01

చంద్రిమ » భాష: భాషలతో ఒక రోజు

2009-06-01 11:04 AM kmcmohan

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేసే ప్రతిచోటా టోలిక్ (TOLIC – Town Official Language Implementation Committee) అనే సమితి ఉంటుంది. ఆ పట్టణంలో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, జాతీయ బ్యాంకులు అందులో సభ్యులు.ఊళ్ళోని ఏదో ఒక పెద్ద సంస్థ టోలిక్ కు అధ్యక్షత వహిస్తుంది.ఈ TOLIC ను హిందీలో నరాకాస్ అంటారు – ‘నగర రాజ్ భాషా కార్యాన్వయన్ సమితి’ అన్న మాట. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ రాజభాష ఐన హిందీ ని ఎంతవరకు అమలు చేస్తున్నాయో రివ్యూ చేసి పార్లమెంటుకు రిపోర్టు చేయడం, హిందీ అమలుకు సూచనలివ్వడం ఈ సమితి పనులు. మైసూరులో భారతీయ భాషా సంస్థాన్ (Central Institute of Indian Languages – CIIL) ఈ సమితి కి అధ్యక్షత వహిస్తుంది. మా కార్యాలయంలో ఈ రాజభాషా అమలు సమన్వయకుడి పదవి నాది (Official Language Coordinator). ఆ బాధ్యతల రీత్యా నేను నెలకోసారి భారతీయ భాషా సంస్థాన్ కు వెళ్ళవలసి వస్తుంది.

గత సోమవారం మధ్యాహ్నం సమావేశానికి CIIL నుండి పిలుపు వచ్చింది . ఆ ముందురోజే బ్లాగుల్లో భాషా చర్చలతో బుర్ర వేడెక్కి ఉండడాన ఆఫీసులో కూడా అవే అలోచనలతో ఉన్న నాకు అదేరోజు భాషల నిలయానికి వెళ్ళవలసి రావడం యాదృచ్ఛికమే ఐనా ఆలోచనలనుండి కొంత విముక్తి కలుగుతుందనే ఉద్దేశ్యంతో ఎగ్గొట్టకుండా వెళ్ళాను. హిందీ అమలు గురించి చర్చలు జరుగుతున్నాయి. అన్యమనస్కంగా ఉన్ననాకు పెద్దగా తలకెక్కడం లేదు. సభాధ్యక్షత వహించిన ప్రొఫెసర్ రాజేష్ సచ్ దేవ , CIIL ఉప సంచాలకులు, ఈ విషయం గమనించినట్లు నాకప్పుడు తెలియలేదు. సమావేశం ముగిసిన తరువాత దగ్గరకు పిలిచి అడిగారు – ” ఇక్కడ లేవు నువ్వు ఏమిటి సంగతి?” అని. ఎలాగూ అడిగారు కదా అని భాష గురించి నాక్కొన్ని ప్రశ్నలున్నాయని చెప్పాను. ఆయన కూడా కొంత తీరిగ్గా ఉండడంతో కాసేపు వివరంగా మాట్లాడారు మా సంభాషణలో ఆయన చెప్పిన సంగతులు, యథాతథంగా కాకుండా, నా మాటల్లో క్రింద వ్రాస్తున్నా:

అసలు అధికార భాషంటే ఏమిటి అన్న దానికి సచ్ దేవ గారి వివరణ:

అధికార భాష అన్నది మూడు రకాలు:

1. Legislative Official Language : పరిపాలనా సౌలభ్యం కోసం శాసన పూర్వకంగా ప్రభుత్వం అదేశించిన అధికార భాష. మన దేశంలో హిందీ లాగా.

2. Symbolic Official Language : ప్రభుత్వం లాంఛనంగా ప్రకటించిన అధికార భాష, ఆంధ్ర ప్రదేశ్ లో ఉర్దూ లాగా, పాండిచ్చేరిలో ఫ్రెంచి లాగా – ఒక వర్గాన్ని సంతోష పరచడంకోసం ఒక భాషను అధికారభాషగా లాంఛనంగా ప్రకటిస్తారు గానీ నిజానికి ఆ భాషలో అధికారిక కార్య కలాపాలేవీ జరగవు.

౩. Working Official Language : ఇది ఎవరైతే అధికారిక కార్య కలాపాలు నిర్వహిస్తారో వారికి అనువుగా ఉండే భాష అన్నమాట. మన దేశంలో ఆంగ్ల భాష లాగా. ఎవరు అవునన్నా కాదన్నా చివరికి ఆ భాషలోనే అన్ని అధికారిక పత్రాలూ వెలువడుతాయి.

ఈ మూడు రకాల అధికార భాషలూ ఏ దేశంలో నైతే ఒకే భాషగా ఉంటుందో అది భాషా పరంగా ఎంతో సౌలభ్యం ఉన్న దేశం అన్నమాట. చాలా వరకు ఐరోపా దేశాలు,అమెరికా(ఉత్తర,దక్షిణ), చైనా, తూర్పు ఆసియా దేశాలు, అరబ్బు దేశాలు ఈ కోవలోకి వస్తాయి.

ఆఫ్రికాలో లాంఛనంగా ప్రతి దేశానికీ ఓ అధికార భాష ఉంటుంది కానీ, నిజానికి దైనందిన కార్యకలాపాలన్నీ ఆంగ్లంలోనో, ఫ్రెంచిభాషలోనో జరుగుతాయి. అక్కడ సామాన్య ప్రజలకు , పాలనాధికారులకు మధ్య భాష పెద్ద అంతరాన్నే సృష్టిస్తుంది.

ఇక మూడవ దానికి ఉదాహరణ మనదేశమే. అనేక భాషా సంస్కృతులకు నిలయమైన మన దేశంలో ఆంగ్లం అప్రకటిత అధికార భాషగా స్థిరపడిపోయింది. రాజ్యాంగంలో కేవలం కొంతకాలం పాటు , హిందీ అధికార భాషగా నిలద్రొక్కుకొనేంత వరకు ఒక ‘లింక్ లాంగ్వేజ్’ గా వాడమని చెప్పిన భాష ఈనాడు తొలగించ వీలుకాని దశకు చేరుకొంది.

హిందీ భాష రాజ భాషగా ఎందుకు ఇంకా నిలద్రొక్కుకోలేదు అన్నదానికి ఆయన విశ్లేషణ ఇది:

హిందీని అధికార భాషగా పెట్టినప్పుడు పెద్దలకు తెలుసు. ఇతర భారతీయ భాషలు హిందీకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాయని, ఆయా భాషల ప్రజలు అంత తొందరగా హిందీని అంగీకరించరనీ. ఇతర భారతీయ భాషలన్నింటినుండీ పదాలను స్వీకరించి కలుపుకుంటూ హిందీ ఒక కొత్త భారతీయ భాష, భారతీయులందరి భాషగా అవతరించాలని ఆశ్వాసించారు. కానీ వాస్తవంలో జరిగింది వేరు. ఇతర భారతీయ భాషలనుండి చెప్పుకోదగ్గ సంఖ్యలో పదాలేవీ హిందీలో చేరలేదు. దానితో బాటే ఆ భాష కొన్ని భాషల ప్రజలను చేరలేదు. ప్రభుత్వం గత యాభై యేళ్ళుగా హిందీని ఒక సర్వశక్తిమంతమైన భాషగా అభివృధ్ధి పరచడంలో విఫలమైంది. నేటికి కూడా ఒక ఇంజనీరింగ్ గానీ వైద్య శాస్త్రంగానీ హిందీలో చదవగలిగే అవకాశంలేదు. ఎందుకూ పనికిరాని జాతీయ భాషను ఎవరైనా ఎందుకు పనిగట్టుకొని నేర్చుకొంటారు? చైనా, ఇజ్రాయెల్, కొరియా, చివరికి మన చుట్టుప్రక్కలున్న సింహళం, థాయ్ లాంటి భాషలు కూడా హిందీకంటే అభివృధ్ధి చెందాయి.

హిందీ అమలుకు నియుక్తమైన కమిటీలన్నీ, “అన్ని భారతీయ భాషా పదాలనూ” అన్న రాజ్యాంగ కర్తల మాటలను ప్రక్కన పెట్టేశారు. ‘జనని సంస్కృతమ్ము సకలభాషలకును’ అన్న సూక్తిని గుర్తుకు తెచ్చుకొని సంస్కృత పదాలను కలిపేస్తే, అన్ని భాషల పదాలను కలిపేసినట్టే కదా అని అతితెలివిగా అలోచించి బోలెడన్ని సంస్కృత పదాలను హిందీలోకి తరలించేశారు (అంటే రాజభాష ఐన హిందీ అన్నమాట). అయ్యవారిని చేయబోతే కోతి అయిందన్న సామెతగా అలా కృత్రిమంగా తయారైన రాజభాష, అటు హిందీ మాతృభాషగా కలవారికీ మింగుడు పడక, అటు హిందీయేతర జనుల మన్ననలూ పొందక రెండికీ చెడింది. ఉదాహరణకు కొన్ని హిందీ పదాలు, హిందీ మాతృభాషగా కలవారు ఉపయోగించేవి-రాజభాషా నిఘంటువులు చెప్పేవి:

ప్రజా వ్యవహారంలోని హిందీ———-రాజభాష (శుధ్ధ్‌ హిందీ)———–తెలుగు మాట

ఇంత్ జామ్ కర్నా ——————-ప్రబంధ్ కర్నా———————-సిధ్ధం చేయడం (prepare)
ఇంత్ జార్ కర్నా———————ప్రతీక్షా కర్నా———————–వేచి ఉండడం (wait)
ఔర్——————————— ఏవం —————————–మరియు (and)
మగర్——————————–పరంతు————————– కానీ (but)
కార్ఖానా——————————సంయంత్ర్————————కర్మాగారం (plant/ factory)

ఇలా ఎన్నో. ఈ రెండవ నిలువు వరుస లోని హిందీ భాషను హిందీరాష్ట్రాల్లో వారెవ్వరూ వారి దైనందిక వ్యవహారంలో గానీ, సాహిత్య సృష్టిలో గానీ వాడరు. అది కేవలం ప్రభుత్వ పత్రాలకే పరిమితం ఐపోయిన ఒక కృతక భాష. ఇతర భాషీయులకు కొంత సులభమైనా వారు ఈ భాష నేర్చుకొన్నందువలన అదనపు ప్రయోజనం ఏమీ లేదు. పైగా ఉత్తరాదిలో ఆ రెండో వరుసలోని భాషను వాడితే వాడు హిందీయేతర జాతీయుడని రూఢిగా తెలిసిపోతుంది. వాళ్ళు నవ్వుకోవడానికితప్ప అనుకున్న విషయాన్ని వ్యక్తీకరించడానికి ఆ భాష పనికిరాదు. అలా మన రాజ భాష, రాజ భాషగానే మిగిలిపోయింది గానీ ప్రజలకు , వింధ్యకు రెండువైపులనున్నవారికీ, చేరువకాలేక పోయింది.

ఐనా హిందీ భాష పెరుగుతోంది. భాషాభివృధ్ధికి చేపట్టిన ప్రభుత్వ ప్రాజెక్టులన్నీ వాటి లక్ష్యాలను అందుకోలేక పోయినా సరే, హిందీ భాష విస్తరిస్తోంది. 2001 జనగణన వివరాల ప్రకారం దేశంలో 40% ప్రజలకు హిందీ మాతృభాష ఐతే మరో 25% మంది హిందీని ద్వితీయ భాషగా వాడుతున్నారు. కనీసం మరో పది శాతం ప్రజలకు హిందీలో కనీస పరిజ్ఞానం ఉంది. మరి ఈ విస్తరణ ఎలా జరిగింది? బాలీవుడ్ వలన, హిందీ టీవీ ఛానెళ్ళ వలన! ఎందుకంటే అవి ప్రజల భాష మాట్లాడాయి. బలవంతపు శాసనాల ద్వారా కాక, సాంస్కృతిక సంబంధాలద్వారా ప్రజలకు దగ్గరయ్యింది. ఈనాడు టివీ ఛానెళ్ళలో సీరియళ్ళు చూస్తూనే దక్షిణ భారత మహిళలు హిందీ నేర్చుకొంటున్నారు. అందుకు ఉదాహరణగా ఆయన ఒక సన్నివేశాన్ని వివరించారు – సచ్ దేవా గారు కన్నడ భాషావాది ఐన ప్రముఖ కన్నడ రచయిత లింగదేవరు హళెమనె గారి యింటికి వెళ్ళినప్పుడు ఆయనతో ఆయన కూతురు దెబ్బలాడుతోందట. ‘ టివీలో నేను హిందీ కార్యక్రమాలే చూస్తాను, కన్నడ కార్యక్రమాలొద్దు’ అని. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో తన యీడు పిల్లలందరూ హిందీ సీరియళ్ళ గురించే చర్చించుకొంటారట. అవి చూడకపోతే స్నేహితులతో మాట్లాడుకోవడానికి కామన్ విషయం దొరకదట. ఇలాంటి సామాజిక అవసరాలే భాషాభివృధ్ధికి దోహదం చేస్తాయి గానీ, శాసనాల ఒత్తిడులు కావని చెప్పారు.

ఆయన ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు – ఆ మధ్య ఆయన తమిళనాడులో UGC వారి సమావేశంలో పాల్గొన్నప్పుడు అక్కడున్న ప్రొఫెసర్లలో ఎంతమందికి హిందీ వచ్చని అడిగారట. 22 మందిలో ముగ్గురు మాత్రమే తమకు హిందీ వచ్చని చెప్పారట. వారిలో ఎందరు తమ పిల్లలకు హిందీ నేర్పాలనుకుంటున్నారని అడిగారట. అందరూ చెయ్యెత్తడమే కాదు, తమ పిల్లలకు ఇప్పటికే హిందీలో ప్రవేశం ఉందని అందరూ చెప్పారట. తమిళనాడులో కూడా హిందీ పట్ల తగ్గుతున్న వ్యతిరేకతకు ఇది నిదర్శనమని అన్నారు.

మరి చిన్నభాషలు ప్రమాదంలో పడవా? అని అడిగాను నేను. CIIL, భాషల ఆస్పత్రి వంటిదనీ, అక్కడ ప్రతియేటా ఎన్నో భాషల చావులు చూస్తామనీ చెప్పారు. మానవ పరిణామ క్రమంలో భాషల పుట్టడం, అంతరించడం సహజ పరిణామమనీ, అందులో మనం పెద్దగా చేయగలిందేమీ లేదనీ ఆయన అభిప్రాయం. కోయ, చెంచు వంటి గిరిజన భాషలు మాట్లాడే వారు, బ్రతుకు తెరువుకోసం, వారుంటున్న రాష్ట్రపు భాషను నేర్చుకోవడం, రాష్ట్రపు భాషను మాట్లాడే వారు, మరింత మొబిలిటీ కోసం హిందీ నేర్చుకోవడం, హిందీ మాట్లాడే వారు మంచి ఉద్యోగావకాశాలకోసం ఆంగ్లం నేర్చుకోవడం, కొన్ని తరాల తరువాత తమ వారసత్వపు భాషలకు దూరమైపోవడం మామూలే. అలా కాకుండా ఉండాలంటే వారికి తమ భాషను మర్చిపోకుండా ఉండేందుకు, అదనపు శ్రమ వెచ్చించి నేర్చుకొనేందుకు ఏదో ఒక incentive కావాలి. అవి ఆర్థిక కారణాలు కావచ్చు, సాంస్కృతిక కారణాలు కావచ్చు, బలమైన కారణం ఉండడం ముఖ్యం. అలాంటి కారణాన్ని సాహిత్యమో, కళలో ఇవ్వగలవు. అందుకోసమే తమ తమ సాహిత్యాన్ని రక్షించుకోవడం సమాజాలకు ముఖ్యం.

అనునిత్యం భాషలకోసం పరిశ్రమించే ఒక విద్యావేత్తతో కొంతసేపు మాట్లాడడం మనసును తేలిక పరచింది. కానీ ఆయన మాటల్లో భాషల భవితవ్యం గురించి ఒక ఆశావహ దృక్పథం కనిపించక పోవడం కొంత నిరాశను కలిగించింది.

తరువాత, అక్కడే క్లాసికల్ తెలుగు విభాగాన్ని చూస్తున్న శ్రీ కందాళం శ్రీనివాసాచార్య గారిని కలిసి మాట్లాడాను. తమిళ విభాగాధిపతి శ్రీ తొల్కాప్పియన్ గారిని కూడా కలుసుకొన్నాను. ఆ సంభాషణలు కూడా భాషల భవితవ్యం పట్ల ఆశను కలిగించేలా లేవు.

అలా నా రోజంతా భాషలమధ్య గడిచింది.


ఇందులో ప్రచురించారుUncategorized Tagged: భాష, రాజభాష, హిందీ, CIIL, Musings, Official Language

2008-11-12

అవీ-ఇవీ: తెలుగు పతాక ఆవిష్కరణ, తెలుగు శాసనాల మ్యూజియం

2008-11-12 05:17 AM త్రివిక్రమ్ Trivikram
సి.పి.బ్రౌన్ 210వ జయంతి సందర్భంగా నేడు సి.పి. బ్రౌన్ భాషాపరిశోధక కేంద్రంలో తెలుగు పతాకం ఆవిష్కరణ జరుగుతోంది. భారత జాతీయ పతాకాన్ని రూపొందించిందే ఒక తెలుగువాడైనప్పుడు ఆ తెలుగువారి పతాకం ఇంకెంత గొప్పగా ఉంటుందో చూడాలనే ఆసక్తితో తెలుగు నేలకు వచ్చి నిరాశ చెందిన సి.పి. బ్రౌన్ చుట్టం గురించి జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి కథ "తెలుగు పతాకం" నిరుడు సాహిత్యనేత్రం నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి

2008-08-30

నచకి "బ్లాగో"తం » భాష: నేడు తెలుగు భాషా దినోత్సవం

2008-08-30 04:41 AM నచకి (NaChaKi / Dr. Chakravarthula Kiran)
(తొలుత “ఆర్కుట్”లోని ఒక కూటమిలో వ్రాసిన యీ టపాని తగుమాత్రంగా దిద్ది యిక్కడ ఉంచుతున్నాను.) మొట్టమొదటగా మనం గ్రహించవలసినది తెలుగు భాష అంతరించిపోలేదు, అంతరించదు కూడా అన్న విషయం! ప్రతి భాషకు “మనుగడ ప్రశ్నార్థకమే” అన్న పరిస్థితి ఒక్కోసారి తత్కాలీన ప్రజల మనస్సుల్లో రావచ్చు గాక! కానీ, వేయి సంవత్సరాలకు పైగా తల వంచకుండా రెపరెపలాడుతున్న … చదవడం కొనసాగించండి

2008-02-27

తేట తెలుగు - తేనె వంటి తెలుగు » భాష: మాతృభాషకి ఉష్ట్రపక్షుల సేవలు

2008-02-27 06:42 PM kiran
ఉష్ట్రపక్షి అంటే నిప్పుకోడి, ఆస్ట్రిచ్ పక్షి. దీని గురించి ఒక వింతైన నానుడి ప్రచారంలో ఉంది. ఎప్పుడైనా క్రూరమృగాలు వేటాడుతున్నాయేమోనన్న భయం వేస్తే, ఇది మహా తెలివిగా తన బుర్రకాయని ఇసకలో దాచేసుకుంటుంది. తనకి ఏమీ కనపడకపోతే, తను ఎవ్వరికీ కనపడనేమోనని దాని ధైర్యం. ఇది కేవలం నానుడి అయినా, మన తెలుగుభాషని రక్షించుకోవడం కోసం … చదవడం కొనసాగించండి

2007-07-05

తేట తెలుగు - తేనె వంటి తెలుగు » భాష: తేట తెలుగులో లాటిను వర్బులు – (4)

2007-07-05 11:17 PM kiran
ఈ రోజు నా ఆఖరి విడత అనువాదాలు పోస్టు చేస్తున్నాను. ఈ తెలుగు పదాలపై చర్చకి, రిఫరెన్సుకి, కొత్త పదాలు సూచించడానికి తెలుగుపదం వికికి రండి. మనందరు కలిసి కృషి చేస్తే ఈ వెబ్ సైటే ఒక ప్రామాణికమైన తెలుగు డిక్షనరీగా అవతరిస్తుంది. ఇకపై నా బ్లాగు తిరిగి సరదాలు, సంగతులతో మామూలుగా నడుస్తుంది 31) … చదవడం కొనసాగించండి

2007-07-04

తేట తెలుగు - తేనె వంటి తెలుగు » భాష: తేట తెలుగులో లాటిను వర్బులు – (3)

2007-07-04 11:24 PM kiran
ఈ రోజు మరికొన్ని క్రియాపదాలను తెలుగులోకి అనువదింప ప్రయత్నిస్తున్నాను. ఈ పదాలన్ని కొత్తవి కావు, కొన్ని జనబాహుళ్యంలో వాడుకలో ఉన్నవే. ఈ పదాలకి ఉదాహరణ వాక్యాలు కూడా చేర్చితే బాగుంటుంది. 21) indicate, predicate, syndicate : dicãre (to show) indication, indicator, indicating, indicated, indicatable, syndicate (noun) చూపించు / చూపు … చదవడం కొనసాగించండి

2007-07-03

తేట తెలుగు - తేనె వంటి తెలుగు » భాష: తేట తెలుగులో లాటిను వర్బులు – (2)

2007-07-03 11:40 PM kiran
నిన్నటి పోస్టులో కొన్ని తెలుగు క్రియా పదాలను సూచించాను. కొన్ని పదాలు బాగానే కుదిరాయి. ఉదాహరణకి, కనిపెట్టు (డిస్కవర్) అని తెలుగువాళ్ళం వాడుతున్నాం కనుక, కనితెచ్చు (డెడ్యూస్/డిరైవ్) అనేది ఈజీగా గుర్తించుకోగలం. ఉపయోగించే ఉపసర్గా-ప్రత్యయాలలో కూడా కొంత ఏకీభావం కుదురుతోంది. ఈరోజు, మరికొన్ని పదాలకు తేటతెలుగులో పదనిర్మాణ ప్రయత్నం చేస్తాను. 11) oppress, depress, impress, … చదవడం కొనసాగించండి
పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..