ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2010-07-30

The Invincible Rebel Road: తెలంగాణా జన విజయం

2010-07-30 05:38 AM admin

ఉప ఎన్నికలలో తెలంగాణావాదం గెలిచింది. తెలంగాణా వస్తే కాంగ్రెస్ ద్వారానే వస్తుందని వాదించిన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందో అడిగితే ఏమని చెపుతాడు. ఉప ఎన్నికలలో తెలంగాణావాదాన్ని గెలిపించినందుకు తెలంగాణా ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను.

2010-07-28

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: ఆ అనిల్ .. మా అనిల్ కాదు....

2010-07-28 06:17 AM విజయ సతీష్ కుమార్ బోడపాటి (noreply@blogger.com)
బ్రదర్ అనిల్ కుమార్ మీద ఈ మధ్య ఈనాడు, ఆంధ్రజ్యోతి తో పాటు సాక్షి తప్ప ఇంచుమించు అన్ని తెలుగు పేపర్స్ లో వార్తలు గుప్పు మన్నాక, సాక్షి పేపర్ డామేజి కంట్రోల్ మొదలు పెట్టింది. ఐతే అన్ని పత్రికలూ ఆరోపించినా, సాక్షి మాత్రం ఈనాడునే ఎందుకు టార్గెట్ చేస్తుందో?. బయ్యారం మునిగింది అంటూ ఈనాడు లో వచ్చిన వార్తకు ప్రతి గా సాక్షి లో ఆ అనిల్ మా అనిల్ కాదు అంటూ పోటో తో సహా తండ్రి పేరు పేర్కొంటూ సాక్షి పెద్ద

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు: అధర్మం గా ధర్మాన....

2010-07-28 05:58 AM విజయ సతీష్ కుమార్ బోడపాటి (noreply@blogger.com)
నిన్న కాక మొన్న సోంపేట లో మా పొట్ట కొట్టకండి, మా గాలి, నీరు, భూమి కలుషితం చేయకండి అని ఎలుగెత్తిన ప్రజల మీద కాల్పులు జరిపి ఇద్దరి ప్రాణాలు బలిగొన్న సంఘటన ఇంకా మరవక ముందే. మంత్రి పదవి వెలగబెడుతూ బాధ్యతాయుతమైన స్థానంలో వున్న ధర్మాన మళ్లి పాత పాటే అందుకొన్నాడు. ఎవరు ఏమనుకొన్న , ఎందరు అడ్డు వచ్చినా పవర్ ప్లాంట్ పెట్టి తీరుతామని సెలవిచ్చారు. ఒక పక్క అనుమతులు నేరకరించినా, ప్రజల వ్యతిరేకం గా ఉన్నప్పటికీ

2010-07-22

గుండె చప్పుడు...: సోంపేట ప్రజలపై దౌర్జన్యకాండ చిత్రాలు

2010-07-22 08:37 AM Konatham Dileep
(ఈ చిత్రాలను పంపించిన సమత మిత్రుడు గంజివరపు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు) బాధితులపై విరుచుకుపడ్డ నాగార్జున కంపెనీ ప్రైవేటు సెక్యూరిటీ. వీళ్లను దాడికి ఉసిగొల్పింది పోలీసులే గుండుదెబ్బ తిన్న బాధితుడు నిండు ప్రాణం బలిగొన్నారు

గుండె చప్పుడు...: ఆత్మలూ, గౌరవాలూ …

2010-07-22 06:52 AM Konatham Dileep
బాబు గారి బాబ్లీ నాటకం అడ్డం తిరగడం మొదలైంది. “తెలుగు జాతి ఆత్మ గౌరవం” అంటూ ఇక్కడ గొంతులు చించుకుంటున్న సమయంలోనే బాబ్లీ ప్రాజెక్టును కట్టిన గుత్తేదారు మన తెలుగు వాడే నన్న విషయం బయటపడింది. ప్రముఖ ఆంధ్రా కాంట్రాక్టర్ మాగంటి రాజేంద్ర ప్రసాద్ కు చెందిన సోమ కన్స్ట్రక్షన్స్ ఈ ప్రాజెక్టును కట్టింది. వివరాలు సోమ కన్స్ట్రక్షన్స్ వారి వెబ్ సైటులో ఇక్కడ చూడండి. (http://www.soma.co.in/) సో, తెలుగు వారికి ద్రోహం చేసినవాడు “మన” వాడే . [...]

2010-07-21

చదువరి: నిష్పాక్షికతను కోరే పక్షపాతులు!

2010-07-21 01:05 PM చదువరి (noreply@blogger.com)
చంద్రబాబు బాబ్లి యాత్ర నేపథ్యంలో, కొందరు మీడియా మీద పడ్డారు.  మీడియా అనవసరంగా చంద్రబాబుకు ప్రాధాన్యతనిచ్చి, ఉపఎన్నికల్లో  తెరాస ఓడేందుకు పని చేస్తోంది - ఇదీ వారి ఆరోపణ. చాలా అసంబద్ధమైన ఆరోపణ అది. అసలీ నాలుగైదు రోజుల్లో బాబ్లి యాత్రకు మించిన ప్రాధాన్యత కలిగిన మరో సంఘటన లేదు, అంతకంటే పెద్ద వార్తా లేదు. అంచేత, సహజంగానే బాబ్లి యాత్ర  మీడియాలో బాగా ఫోకసైంది.   జూలై  16 , 20 ల మధ్య చంద్రబాబు తన

2010-07-20

జాబిల్లి » రాజకీయం: తెలుగు జాతి ముండమోసిందా …..

2010-07-20 06:23 AM కట్టా విజయ్
తెలుగు జాతి ముండమోసిందా లేక ముండమోపుల పాలనలో చేవ చచ్చి నవరంధ్రాలు మూసుకుపోయాయా…..మానవత్వం లేకుండా భోజనం చేసే వాళ్ళని ఇంత దారుణంగా బూటు కాళ్ళతో తొక్కుతూ ఈడ్చుకేల్తున్నా గాని చూస్తూనే వుండటమా ….. తెలుగు జాతికి కాంగ్రెస్ చేసిన సత్కారం అనుకోవాలా లేక పదవుల కోసం తెలుగు జాతిని ముండమోపి మరాఠా నేతల కాళ్ళ ముందు పడుకోబెట్టారు అనుకోవాలా . ఒక తెలుగువాడి ఆవేదన .(( నా స్నేహితుడు శివరాం  బింగ్ చేసినది.)) Filed under: రాజకీయం, [...]

2010-07-18

చదువరి: బాబ్లి సమస్య - చంద్రబాబుది ఉత్తమ స్వార్థం, మిగతావాళ్లది నీచ స్వార్థం!

2010-07-18 01:30 PM చదువరి (noreply@blogger.com)
గోదావరి మీద మహారాష్ట్ర కడుతున్న బాబ్లి ప్రాజెక్టు గురించి తెదేపా గొడవ చేస్తూ సమస్యను రాష్ట్రాన్ని దాటించి మహారాష్ట్రకు, అక్కడినుంచి ఢిల్లీకీ చేర్చింది. ప్రాజెక్టు చూస్తామంటూ బస్సు యాత్ర చేపట్టి అక్కడి ప్రభుత్వం చెరలో పడ్డారు. ప్రాజెక్టు చూడకుండా తిరిగి పొయ్యేది లేదని చెప్పి, చంద్రబాబు సమస్యను చాలా చక్కగా వెలుగులోకి తెచ్చాడు. కానీ, ఈ ఆందోళనపై ప్రభుత్వమూ, మిగతా పార్టీల ధోరణి మాత్రం ఆందోళన

2010-07-06

చదువరి: మాకూ ఉపశమనం కావాలి!

2010-07-06 03:34 AM చదువరి (noreply@blogger.com)
కేంద్ర మంత్రి శరద్ పవారుకు పనెక్కువైపోయిందంట, కాస్త రిలీఫు కావాలంట. అవును మరి, బీసీసీఐ, ఐసీసీల్లో పనిచెయ్యడం చేత ఇక్కడ మంత్రిగా పని చెయ్యడానికి టైము దొరకడం లేదు, తీరికా దొరకడం లేదు పాపం. అందుగ్గాను, కేంద్రమంత్రిగా పని తగ్గించాలంట.  మంత్రి పదవిని ఈడి బాబు ఈడికి వారసత్వంగా ఇచ్చినట్టు, పన్నులేసుకుని ఈణ్ణి పోషించండని మన నెత్తిన కూచ్చోబెట్టినట్టూ, ఈ పనీ పాటా చెయ్యని సన్నాసికి కంచిగరుడసేవ చేస్తూ పని

2010-06-10

చదువరి: మందు x మందులు

2010-06-10 09:40 AM చదువరి (noreply@blogger.com)
రాష్ట్రంలో మందు దుకాణాల పాటలు కోట్లలో పాడారు. ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు పోగేసుకుంది. పాటలు పాడినవాళ్ళలో ఎక్కువమంది రాజకీయులే. ఏదో ఒక కొట్టులో వాటాలేని ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే అతగాడు పాపం మరీ అమాయకుడైనా అయ్యుండాలి, లేదా మరింకేదైనా డబ్బులొచ్చే యవ్వారంలో తలమునకలుగా ఉండి ఉండాలి, లేదా జయప్రకాశ్ నారాయణైనా అయ్యుండాలి! డబ్బులకోసం జనాల జేబులను కొల్లగొడుతోంది ప్రభుత్వమంటూ ఈ వేలంపాటలమీద విమర్శలొచ్చాయి.

2010-05-25

చదువరి: ఒక్కడే మహానుభావుడు..

2010-05-25 03:52 AM చదువరి (noreply@blogger.com)
మహానటుడు ఎస్వీరంగారావు గురించి బాపు రమణలు ఒక స్కెచ్చి రాసారు ఒకప్పుడు. రంగారావు మనస్తత్వాన్ని, అభిరుచులను, అలవాట్లను, నటన తీరునూ విశ్లేషిస్తూ అనేక రంగారావులను ఆవిష్కరిస్తారు -కంగారం’గారావు, ’చతురం’గారావు,.. -ఇలాగ. ఆ స్కెచ్చిని సిగ్గులేకుండా అనుకరించే ఇంకో స్కెచ్చి ఇది. అయితే తాము ఎవరి గురించి రాస్తున్నారో బాపురమణలు హెడ్డింగు పెట్టి మరీ చెప్పేసారు. నేను మాత్రం ఎవరి గురించి రాస్తున్నానో చెప్పడం

2010-02-10

జాబిల్లి » రాజకీయం: కేసీఆర్ … "నీకు గోరికడతాం కొడక" … నీ (క్రాంతి) – సేకరణ

2010-02-10 07:10 AM కట్టా విజయ్
ఇప్పుడు సమాధులు మాట్లాడుతున్నై…!, రాత్రికిరాత్రి తెలంగాణ నిద్రలేచి కాళ్ళ కింద గతాన్ని తోవ్వు కుంటాండి, సాయుధ పోరాట గమనాన్నీ గుర్తుకు తెచ్చు కున్తన్ది ! ఒక "బద్మాశ్ గాడి మాట" మృతవీరుల ఆత్మని తూట్లు తూట్లు జేస్తన్నది..! ఇప్పుడు నేను చరిత్ర తెలియనోని నాల్కను గొసకపొయి కామ్రెడ్ "రావి నారాయణ రెడ్డి" సమాధి ముందు బెట్టాల.. బానిసల్ని జేసినోని బూజానెక్కి "ఓటు" కోసం నీతిమాలిన మాటలో డి కంట్లో వరంగల్లు కారం జల్లాల..! ఈ గద్ద ముక్కొడికి [...]

2009-12-14

ఫణి.. పక్కా తెలుగబ్బాయ్! » రాజకీయం: నిజం నిప్పులాంటిదే.. కాస్త చేదుగా కూడా ఉంటుంది..!!

2009-12-14 06:35 PM Phanikumar

(ఇది ఆనందిని గారి టపా http://kovela.blogspot.com/2009/12/blog-post_14.html కి జవాబు.. రాయడం మొదలెడితే మరీ పెద్దదయ్యి కూర్చుంది.. అందుకని కొత్త టపా..!)

విశ్లేషణ బాగుంది .. కానీ, మీ టపాలో కొన్ని విషయాలని పాయింట్ చెయ్యాలి …నేను వ్యక్తిగతం గా రెండు లేదా మూడు రాష్ట్రాలకి వ్యతిరేకం కాదు, కానీ చాలా విషయాలలో మీరు చూపించినది నాణానికి ఒక  వైపు మాత్రమే..

1. సంస్కృతి-చిన్న చూపు : మీరు ఒక్క కృష్ణ, గుంటూరు తెలుగు తో పోల్చి అంటున్నారు.. మన అదృష్టమో, దురదృష్టమో గానీ.. తెలుగు కి చాల యాసలున్నాయి.. అది ఉత్తరాంధ్ర కావొచ్చు, గోదావరి జిల్లాలు కావొచ్చు, రాయల సీమ కావొచ్చు.. సమస్య, ఏదో కృష్ణ గుంటూరు యసలని ఒక “బెంచ్ మార్క్” టైపు లో తీసుకోవడం వల్ల వచ్చింది.. ఇది తెలంగాణా యాస ఒక్క దానికి సంబంధించిన సమస్య కాదు… (సో వాట్, మాకు మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు అనొద్దు)
2 . “తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒక జాతిగా భావిస్తే, ఆ ప్రజలంతా కలిసి మెలిసి ఉండటం అంటే, పరస్పర మనోభావాలను గౌరవించుకోవటం జరగాలి. ఒకరితో మరొకరు మమేకం కావాలి. పండుగల్లో, పర్వదినాల్లో పరస్పరం కలగలిసిపోవాలి.. సంబరాలు చేసుకోవాలి.. సౌభ్రాతృత్వంతో మెలగాలి. భాషలోని యాసను గౌరవించాలి.” — ఇది “ideal situation” నా ఉద్దేశం లో..  జరగాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవట్లేదు.. ఇప్పుడు అలా జరగటం లేదు కూడా.. చిన్న ఉదాహరణ.. తూర్పు గోదావరి లో ఉన్నా కాలేజీ లలోకి చాల మంది ఉత్తరాంధ్ర కుర్రాళ్ళు వచ్చి చదువుతూ ఉంటారు.. వాళ్ళందరినీ వేరేగా చూడటం, ఆట పట్టించటం చాలా చాలా కామన్.. వాళ్ళ పండగలు కూడా కొన్ని వేరేగా ఉంటాయి….ఇదే పరిస్థితి తూగో కుర్రాళ్ళది వైజాగ్ లో.. :) టిట్ ఫర్ టాట్ మరి..!!
సరే రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు అని..దానికి ఒక్క ఆంధ్ర వాళ్లనే తప్పు పట్టడం సరైనది కాదు..  ఈ మధ్య మీడియా పుణ్యమా అని కాస్త అక్కడి ఆడవాళ్ళు దసరా టైం లో బతుకమ్మ ప్రోగ్రాం లు ఆసక్తి గా చూడటం అవీ జరుగుతున్నాయి.. కొంతలో కొంత బెటర్…
౩. “తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయిని వివాహం చేసుకుంటే, అబ్బాయి ఆంధ్రా వైపు మొగ్గుతాడు.. తెలంగాణ అమ్మాయి ఆంధ్ర అబ్బాయిని చేసుకుంటే అటోమెటిక్‌గా మారిపోతుంది..” — మీరు మరీ generalize  చేస్తున్నట్టు అనిపించట్లేదా?!!  ఏదో ఆంధ్ర వాళ్ళందరూ dominating characters  టైపు లో!!
4. “ఉస్మానియా విశ్వవిద్యాలయం నిజాం కాలం నాటిది… ఉస్మానియా మెడికల్‌ కాలేజీ, వుమెన్‌‌సకాలేజీ, హైకోర్టు, రాజ్‌భవన్‌, అసెంబ్లీ, దిల్‌కుశ్‌ గెస్‌‌టహౌస్‌, పురానాపూల్‌, నయాపూల్‌, మక్కామసీదు, హుస్సేన్‌సాగర్‌,”.. చాలా సింపుల్ గా తీసి పారేశారు కదండీ..! ఇది రాజధానే గా… దీన్ని మైంటైన్ చెయ్యడానికి ప్రజల పన్నులేగా వాడేది.. అది ఒక్క తెలంగాణా వాళ్ళేం కట్టలేదుగా..
అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్లై ఓవర్ లు,  హైటెక్ సిటీ,  ఇంత infrastructure, ఇన్ని investments ఊరికే రావుగా… ఈ విషయం మాత్రం మీరు అర్ధం చేసుకోవాలి.. రాజధాని ఇక్కడ ఉన్నప్పుడు, పెట్టుబడులు పెట్టె పారిశ్రామిక వేత్తల తో పాటు, ఉద్యోగార్ధులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా వస్తారు…. హటాత్తుగా ఇది మీది కాదు అంటే ఎవడికైనా కాలుతుంది…. ఇది రాజధాని కాబట్టి, ఇక్కడ బెటర్ opportunities ఉన్నాయి కాబట్టి, సొంతూల్లో పోలాలమ్మి అయినా వస్తారు.. ఇది నీ ఏరియా కాదు అంటే అంత తేలిగ్గా కుదిరే వ్యవహారం కాదు…
5. ” ఆంధ్రప్రాంత ప్రజలు తమ వనరులపై తాము సొంతగా జీవించలేరని, ఇతరుల వనరులపైనే… ” — కించ పరచడం, అవమానాలు గురించి మాట్లాడిన మీరే, ఇదే టపాలో మీరే ఆంధ్ర ప్రజలని కించ పరిచారు.. ఔరా! రాజధాని అప్పటిలాగే ఏ కర్నూల్ లోనో, లేకపోతె విజయవాడ లోనో ఉండి ఉండాల్సింది.. అప్పుడు తెలిసేది ఎవరు ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చేదో..!!
6 “ఎందుకింత బేలతనం..?” — నిజమే, బేలతనమే, తమ హక్కుల కోసం పోరాడ లేని బేలతనం.. అన్నీ ఒకప్పుడు మద్రాస్ కి, ఇప్పుడు హైదరాబాద్ కి తరలిస్తుంటే మాట్లాడలేని బేల తనం… ఓ  హైటెక్ సిటీ, ఓ NIT, ఓ IIIT, ఓ IIT లేకుండా అన్నీ పక్క వాడికే ఇస్తుంటే, అందరూ మనవాళ్ళే అప్పుడు అనుకుని, ఇప్పుడేమో వాడు ఛీ పో అంటుంటే ఏం చెయ్యాలో తెలియని బేల తనం.. అమాయకత్వానికి మంచి శాస్తే జరిగింది.. ఇక ముందైనా తెలివి గా ఉండాలి..
7 మీ అనుకోలు – “రెండు జాతులు” అనేదే సరి కాదు.. తెలుగు వాళ్ళందరూ ఒకటే జాతి.. వేర్వేరు పాలకుల కింద ఉండటం మూలాన వేర్వేరు అలవాట్లు, కొంతమటుకు సంస్కృతి వచ్చాయి..  అలా కాదు అంటారా, జాతి అంటే మీ నిర్వచనం చెప్పండి మరి..!
8 ” హైదరాబాద్ తప్ప మిగిలిన తెలంగాణా ప్రాంతాల గురించి మాట్లాడకపోవడం”..  మిగతా ప్రాంతాలతో పెద్దగా సంబంధాలు లేవు కాబట్టి ముందు గుర్తొచ్చేది హైదరాబాదే.. అదీ కాక చాలా మంది “సెటిలర్స్” ఉన్నారు గా అక్కడ…సరే ఆంధ్ర/సీమ నాయకులు ఏదో చిత్త శుద్ధి తో మాట్లాడుతున్నారని నేను అనను..

ఒకటి మాత్రం ఒప్పుకుంటున్నా.. ఇంతకాలం నోర్మూసుకుని కూర్చుని ఇప్పుడు హడావుడిగా సమైక్యాంధ్ర అంటే అటు ఆంధ్ర/సీమ ఇటు తెలంగాణా ప్రజలు ఇద్దరికీ చిరాకే.. అంతకు ముందు అన్నీ పార్టీలు తెలంగాణాకి అనుకూలం అని ప్రకటించారు… నా ఉద్దేశం లో అప్పుడు ప్రజాభిప్రాయం (ఆంధ్ర/సీమ వాళ్ళ ది ముఖ్యం గా) పట్టించుకోలేదు .. జనాలు కూడా ఏం మాట్లాడకుండా ఊరుకున్నారు..ఇప్పుడు హటాత్తుగా రాష్ట్ర ఏర్పాటు విధానం ప్రారంభం అని ప్రకటించేసరికి ఎవ్వరికీ ఊపిరి ఆడట్లేదు.. అంతే!!

ఏది ఏమైనా,
రాజధాని హైదరాబాద్ కాకుండా ఉండి ఉంటే, ఇంత గోల అయ్యేదే కాదా.. ఇంకో రాష్ట్రం ఇవ్వడానికి..?!!
(ఏమో, అప్పుడు ఆంధ్ర వాళ్ళు రాష్ట్రం కావాలనీ, తెలంగాణా వాళ్ళు వద్దనీ అనొచ్చేమో!)

నాకు అర్ధంయ్యినంతవరకు, ఇప్పుడు కొత్త రాష్ట్రం కావాలి అంటే, ఆంధ్ర/సీమ వాళ్ళని ఒప్పించడం ఒక్కటే మార్గం…(concensus)!!


2009-11-01

చదువరి: సాయంకాలమైంది!

2009-11-01 07:39 PM చదువరి (noreply@blogger.com)
అప్పుడే సాయంకాలమైంది. సూర్యాస్తమయం చేరువైంది.  సంవత్సరం కిందట ఉజ్వలంగా ఉదయించిన ప్రజారాజ్యం సూర్యుడు, కాంగ్రెసు తుప్పల్లో కుంకబోతున్నాడు. పాపం చిరంజీవి! హీరో కావాలనుకున్నవాడు మొన్నటి ఎన్నికల్లో జీరో అయ్యాడు. ఇప్పుడు కాంగ్రెసు పంచన చేరి, నిదానంగా వంత పాత్రలు వేసి, ఎప్పుడోకప్పుడు హీరో కాకపోతానా అని చూస్తున్నట్టున్నాడు. కాంగ్రెసుతో పెట్టుకుంటున్న ఈ పొత్తు కారణంగా ఒక్కటి మాత్రం స్పష్టం.. ఒకవేళ ఈ

2009-10-23

చదువరి: ఆ.. ట ఆగిందా!

2009-10-23 11:30 PM చదువరి (noreply@blogger.com)
ఒకరి సీ...టు గోవిందా! ఓ పక్క శవాన్ని పెట్టుకోని, అంత బాధనూ దిగమింగుతూ కూడా జగను బ్యాచ్చీ అంత రాజకీయం చేసారే! అంతటి కష్టంలోనూ రాజకీయం చెయ్యక తప్పని వాళ్ళ పరిస్థితిని అధిష్ఠానదేవత  ఇసుమంతైనా పట్టించుకుందా? మరీ సెంటిమెంట్లు లేనట్టుగా వ్యవహరించింది. మా జగను కుర్రాడు-రోశయ్యేమో ముసలాడు, యువతను ప్రోత్సహించాల్సిన తరుణమిది, జగన్ను కుర్చీ ఎక్కించాల్సిన సమయమిదే అంటూ ఊదరగొట్టేసిందే జగను బ్యాచ్చీ! టీవీ

2009-10-13

చదువరి: హైకమాండు, హై.కమాండు

2009-10-13 11:30 PM చదువరి (noreply@blogger.com)
జగను హై. చేరాడు. ఇక ఢిల్లీలో  హైకమాండు - హైదరాబాదులో  హై.కమాండు. మంత్రులు, ఎమ్మెల్యేల  తీర్థయాత్రాస్థలం ఇక కళకళలాడబోతోంది.  ముఖ్యమంత్రి జగనుకు చేసే ఫోన్లు ఇలా ఉండొచ్చు - 'జగనూ, ఆ రఘువీరారెడ్డి ఉంటే రేపో ఎల్లుండో ఓసారి సచివాలయానికి పంపించవా, కాస్త పనుంది.' పాకిస్తానువాడిక్కూడా వద్దురా నాయనా ఇలాంటి మంత్రులు ! * * ** * * * * * ** * * * * * ** * * * * * ** * * * పాపం ముఖ్యమంత్రి! ఆఫీసులో ఉంటే ఈ

2009-10-10

చదువరి: ఒబామాకు నోబెలిస్తే మనకెందుకాశ్చర్యం?

2009-10-10 04:35 PM చదువరి (noreply@blogger.com)
ఒబామాకు నోబెలిస్తున్నట్టు ప్రకటించినప్పుడు అక్కడున్న విలేకరులు ఆశ్చర్యంతో ఆవులించారు. ప్రపంచమంతా విస్తుపోయింది. అధ్యక్షపదవిలోకి వచ్చిన 12 రోజుల్లోనే అతడు అంత శాంతిదూత ఎలా అయ్యాడో పాపం ఒబామాకు కూడా అర్థమయ్యుండదు. ఒక రకంగా ఇది ఒబామాను చిన్నబుచ్చడమే. ఒబామాను విమర్శించేందుకు, అతడి మీద కార్టూన్లు జోకులూ వేసుకునేందుకు ప్రజలకిచ్చిన అవకాశమే ఇది. ఇప్పుడు నేనేం చేసానని నాకీ పురస్కారం అని అతడు తలపట్టుకునే

2009-09-28

చదువరి: జగనే మాయ! పదవే మాయ!!

2009-09-28 05:56 PM చదువరి (noreply@blogger.com)
రాష్ట్రంలో కాంగ్రెసు నాయకులు ఎప్పుడూ కూడా అధికార కుటుంబానికి పాలేళ్ళే. ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్.. ఇలా ఎప్పుడూ ఎవరో ఒక వ్యక్తికి ఊడిగం చేస్తూ ఉంటారు. కొందరు పెద్ద పాలేళ్ళు, కొందరు ఇంట్లో పనులుచేసే చిన్న పాలేళ్ళు, కొందరు రోజుకూలీలు. ఎన్ని రకాలున్నప్పటికీ అందరూ పాలేళ్ళే. దొర కనుసన్నలలో ఉండటం కోసం నానాతంటాలు పడతారు. కానీ గత ఐదేళ్ళుగా పరిస్థితి ఏంటంటే.. ఢిల్లీలోనే కాకుండా ఇక్కడే, హై.లోనే ఒక

2009-09-03

చదువరి: రాజశేఖరరెడ్డి మరణం, ఆ తరవాత

2009-09-03 12:21 PM చదువరి (noreply@blogger.com)
సంచలనాల జీవితం సంచలనంగానే ముగిసింది. అరవయ్యో యేట రాజకీయాలనుండి విశ్రాంతి తీసుకుందామనుకున్నా, అలా జరగలేదు. ప్రతి మనిషికీ తన జీవితంలో చేసిన పనులను, తను సాధించినవిజయాలను నెమరు వేసుకుని, తన తప్పొప్పులను సమీక్షించుకునే అవకాశం బహుశా వానప్రస్థంలో కలుగుతుంది. కానీ వై.ఎస్‌కు ఆ అవకాశం లేకపోయింది. ముఖ్యమంత్రిగా తీరుబడిలేని జీవితం గడుపుతూండగానే అర్థంతరంగా  జీవిత ప్రయాణం ముగిసింది. ఈ దుర్ఘటనలో మరణించిన

2009-05-18

చదువరి: కాంగ్రెసు గెలిచింది

2009-05-18 01:35 AM చదువరి (noreply@blogger.com)
రాజశేఖరరెడ్డి గెలిచాడు. రాజశేఖరరెడ్డి ఐదేళ్ళ అద్భుతమైన పాలనకు మురిసి ప్రజలు వోట్లేసారని కాదు, ప్రతిపక్షాలు ఈ ఐదేళ్ళలో అద్భుతమైన పనితీరేమీ కనబరచలేదు కాబట్టి. 'ఇదిగో వీళ్ళకు వోటేస్తే మంచి, సమర్ధవంతమైన పాలనను అందిస్తారు' అనే నమ్మకాన్ని ప్రజలకు కలిపించలేకపోయారు కాబట్టి కాంగ్రెసు గెలిచింది. ప్రభుత్వ వ్యతిరేక వోట్లను ప్రతిపక్షాలు చీల్చుకోడంతో కాంగ్రెసు గట్టెక్కింది. గతంలో కంటే సీట్లు తగ్గడాన్ని బట్టి

2009-04-20

తెలుగు 'వాడి'ని: ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే !?

2009-04-20 02:50 AM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
నమస్తే ఆంధ్ర.కాం అనే  సైట్ లో ప్రచురించిన ఈ వార్తను చదవండి. పూర్తి వివరాలకు : ముఖ్యమంత్రి అసహనానికి మూలమైన నివేదిక ఇదే ! ఆ పై వార్తలోని ముఖ్యాంశాలు :

2009-04-18

చదువరి: కుఁయ్..కుయ్...కుయ్య్

2009-04-18 08:28 AM చదువరి (noreply@blogger.com)
ఎన్నికల ప్రచారంలో తన ఆరోగ్యశ్రీ  పథకం గురించి చెప్పుకునే క్రమమంలో అంబులెన్సు మోతను అనుకరించడానికి గాను రాజశేఖరరెడ్డి కుఁయ్.. కుఁయ్.. కూఁయ్.. అంటూ గుక్కపట్టి అరిచేవాడు. యాడుల్లో తమ ఉత్పత్తులను తేలిగ్గా గుర్తుకు తెచ్చేలా ఉండటం కోసం, తమ ఉత్పత్తికో బ్రాండు గుర్తింపును, బ్రాండు విలువనూ తేవడం కోసం జింగిల్స్ వాడుతూంటారు. అలాగ,  వయ్యెస్ కూడా ఈ కూతతో తనకూ, ఆరోగ్యశ్రీకీ ప్రజల్లో ఒక బ్రాండుస్పృహ కలిగించే

2009-04-17

తెలుగు 'వాడి'ని: 165 రాకపోతే రాజకీయ సన్యాసం : పవన్

2009-04-17 06:33 PM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
వార్త వివరాలు ఇక్కడ చూడండి : పవన్ శపథం  ............... దీనికి మరలా భీషణ/భీష్మ ప్రతిజ్ఞ అని వెధవ కవరింగ్ ఈ మీడియా వాళ్లు .. మరీ 'అధికారం' లోకి రాకపోతే అనో  లేక 148 రాకపోతే అనో అంటే మరీ దరిద్రంగా ఉంటుంది అని .. 165 అని ఒక తొక్కలో నంబర్ ఒకటి .. వీళ్ల తెలివితేటలే తెలివితేటలు ... ఎంత చక్కగా సెలవిస్తున్నారు వాళ్లు తరువాత చెయ్యబోయేది ఏమిటి అని .... జనాలు ఎంత వెధవలు లాగా కనపడుతున్నారు వీళ్లకి ..

2009-04-13

చదువరి: చారిత్రిక అవసరం

2009-04-13 07:32 PM చదువరి (noreply@blogger.com)
అధికారమనేది లక్ష్యం కాకూడదు, అదొక మార్గం అంతే! అంటున్నాడు లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ. జాతినిర్మాణం, బిడ్డల భవిష్యత్తూ లక్ష్యాలు కావాలి. అధికారం -దాన్ని సాధించే మార్గం కావాలి. కానీ సాంప్రదాయిక రాజకీయ పార్టీలు అధికారాన్ని లక్ష్యంగా చూస్తున్నాయి అని అంటున్నాడు. పేదరికాన్ని తొలగిస్తాం, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం, ఆరోగ్య సిరులు అందిస్తాం అని చెప్పుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు. చాలా పార్టీలే

2009-04-10

తెలుగు 'వాడి'ని: PRP అంటే ......... !!!!!!!

2009-04-10 11:11 PM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
రోజా గారు : పనికి రాని పార్టీ ( Paniki Rani Party) సాక్షి టివి వారు : పైసలు రాబట్టే పార్టీ ( Paisalu Rabatte Party )   ....................................   ఇప్పటిదాకా ఉన్న వార్తలను బట్టి చూస్తే(నిజానిజాలు ఎలా ఉన్నా) సాక్షి వారి క్రియేటివిటీ బాగానే ఉధ్ధరించినట్టు ఉంది.   ఇక ఎన్నికలు అయిపోయిన తరువాత, రోజా గారి వ్యంగ్యాస్త్రం నిజమవుతుందేమో చూడాలి. ..................................

2009-04-09

చదువరి: ఏం తేడా లేదు!

2009-04-09 08:08 PM చదువరి (noreply@blogger.com)
ఇన్నాళ్ళూ ప్రజారాజ్యాన్ని రాజ్యేతరులే విమర్శించారు. ఆ పార్టీలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. మిగతా పార్టీల కంటే కొత్తదనం, వైవిధ్యత ఏదీ లేదన్నారు. డబ్బులు తీసుకుని టిక్కెట్లిస్తున్నారనీ అన్నారు. చిరంజీవి పైకి కనబడేంత సౌమ్యుడు, అమాయకుడూ కాదన్నారు. అతడిది నటన అని అన్నారు. అది అతివినయం అనీ అన్నారు. కానీ ఇప్పుడు.. రాజ్య పౌరులే అంటున్నారు. మన్నికైన వారని ఎన్నిక చేసి తెచ్చుకున్న వారే అంటున్నారీ మాటలు.

2009-03-15

తెలుగు 'వాడి'ని: జూనియర్ యన్.టి.ఆర్ చెపుతున్న బస్సు కధ

2009-03-15 05:09 PM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
TopAndhra అనే వెబ్ సైట్ లో ప్రచురించిన ఈ ఆర్టికల్ చదవండి లేదా కింద ఉన్న ఈ ఇమేజ్ అయినా చూడండి. [ఇమేజ్ స్పష్టంగా లేకపోయినా లేదా పూర్తిగా కనిపించకపోయినా, దయచేసి ఇమేజ్ మీద క్లిక్ చేయండి.] దీని గురించి ఇక్కడ ప్రస్తావించటానికి ఒకే ఒక్క కారణం ఏమిటి అంటే, ఇందులో నాకు బాగా నచ్చిన ఉపమానం ఉండటమే .. అది ...... అయ్యా, నీకు డ్రైవింగ్ కొత్త కదా, అనుభవం లేదు కదా? అని ప్రశ్నిస్తే, ... ఆ! ఏముంది మీరు

2009-03-12

దిల్ సే ... » రాజకీయాలు: TOP 10 డవలాగులు

2009-03-12 01:44 PM శ్రవణ్
And the joint winners are... రోజా ........................ పళ్ళు రాలగొడతా బాలకృష్ణ .................... సామాన్యులకు రక్షణేది?

2009-03-07

తెలుగు 'వాడి'ని: "దేశం" హామీలు జయహో ! ... "రాజ్యం" రాయితీలు వెలవెల ?

2009-03-07 12:27 AM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మానిఫెస్టోలో ఉన్న పధకాలపై సూర్య దినపత్రిక వారు నిర్వహించిన అభిప్రాయసేకరణల వివరాలు ............. ఈ దిగువన ఉన్న మూడు లింక్స్ లో ఉన్న వాటిని క్లుప్తంగా చెప్పాలి అంటే  ............ తెలుగుదేశం పార్టీ పథకాల అమ్ములపొదిలో మరో పాశుపతాస్త్రం చేరింది. పేద, నిరుపేద, మధ్య తరగతి వర్గాల పెదవులపై చిరు నవ్వులు పూయించే మరో జనాకర్షక పథకానికి ఆ పార్టీ తెరలేపింది. ఎన్నికల వేళ..

2009-01-25

ఫణి.. పక్కా తెలుగబ్బాయ్! » రాజకీయం: బియ్యం కిలో రూ. 20 కా? ఎక్కడండీ బాబూ?!

2009-01-25 05:32 PM Phanikumar

ఓ పక్క మన మంత్రి గారు తనిఖీలు చేస్తూ ‘సూపర్ ఫైన్’ రకం బియ్యం కేవలం 20 రూపాయలకే అమ్మేలా చూస్తున్నామంటారు.. ఇంకో పక్క ముఖ్య మంత్రి గారు చంద్ర బాబు కొట్లలో తప్ప అన్ని చోట్లా 20 కే అమ్ముతున్నారంటూ తనదైన శైలి లో వ్యంగ్యం గా  జవాబిస్తారు…

అంత నమ్మకంగా చెప్తుంటే నిజమనే అనుకుందాం…  హైదరాబాదులో సాధారణ కిరాణా షాపులో అడిగా..  రూ. 27 అన్నిటికంటే తక్కువ రకం.. రూ. 30 ది ఒక మాదిరిగా ఉంది.. నేను చంద్రబాబు కొట్లలో కొననే కొనను.. అడిగింది మామూలు షాపు.. పోనీ హైదరాబాదు కదా ఎక్కువే ఉంటుంది, మిగిలిన చోట్ల తక్కువే ఉంటుంది అనుకుని, సొంతూరు అమలాపురం లో అడిగా.. ఎక్కడా 26 కి తక్కువే చెప్పలేదు ఎవరూ.. నేను అక్కడ ఉన్న అన్ని బియ్యం రకాల రేట్ల గురించీ అడిగాను మరి…

అసలు ఈ ‘సూపర్ ఫైన్’  బియ్యం అంటే ఏంటి? బయట మామూలుగా మనం కొనే కిరాణా కొట్లలో (పెద్ద షాపులని మర్చిపొండి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు) ఈ రకం అమ్మరా? అంటే సాధారణ ప్రజలు తినేది ఈ రకం కాదా? అప్పుడు దాన్ని తక్కువకి అమ్మడం వల్ల జనాలకి ఉపయోగం ఏంటి? మరి అలా కాకపోతే సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే అబద్ధం చెప్తున్నట్టా? లేకపోతే ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుందా?  అబ్బే… నాకైతే ఏం అర్ధం కావట్లేదు…!!


2009-01-18

చదువరి: హద్దులేని అధికార పక్షం - అడ్డలేని ప్రతిపక్షం

2009-01-18 08:35 PM చదువరి (noreply@blogger.com)
ఐదేళ్ళుగా ఈ అధికారపక్షం ఆంధ్రప్రదేశ్‌ను ఎన్ని రకాలుగా దోచుకోవచ్చో అన్ని రకాలుగానూ దోచుకుంటోంది. కుంభకోణాల యజ్ఞాలు చేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం వారిని అడ్డుకోలేకపోతోంది. ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తే ప్రభుత్వం తప్పులను బయటపెట్టవచ్చో, ఒకప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షానికి తెలిసే ఉండాలి. కానీ ఈ ప్రతిపక్షం అలా తెలిసినట్టుగా వ్యవహరించడంలేదు. ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని తప్పులను ఎత్తి చూపినా

2008-12-06

చదువరి: మన భద్రతే మనకు ముఖ్యం

2008-12-06 03:44 AM చదువరి (noreply@blogger.com)
దేశానికి నాయకుల ప్రాణాలు ఎంత ముఖ్యమో, సామాన్యుడి ప్రాణాలు కూడా అంతే ముఖ్యం -తేడాయే లేదు. ఆఫ్టరాల్ నాయకుడికే జెడ్లూ, జెడ్‌ప్లస్సులూ ఉంటే అతణ్ణి తయారుచేసిన సామాన్యుడికెన్ని ఉండాలి? ముందు మనమీ సంగతిని ఒప్పుకుంటే ఇక ముందుకు పోవచ్చు. ---------------------------------------------నిఘా వర్గాల నివేదికలను బట్టి, విమానాశ్రయాలను, ఓడరేవులను, భవనాలను, నేలను, నీటిని, గాలిని, కాపలా కాసి, దాడి చేసే ఉగ్రవాదులను

2008-11-29

చదువరి: ప్రధానికో లేఖ

2008-11-29 06:13 PM చదువరి (noreply@blogger.com)
కంథమాల్లో జరిగినదాని గురించి తలెత్తుకోలేకపోతున్నామని, బయటి దేశాల్లో పరువు పోయిందని, ఫ్రాన్సు అధ్యక్షుడో మరొహడో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోయానని వాపోయిన ప్రధానమంత్రి గారూ.. ముంబైలో మూడురోజుల పాటు, వందలాది మందిని ఖైదీలుగా పట్టుకుని, 195 మందిని పొట్టనబెట్టుకుని, బీభత్సం సృష్టించిన ఈ సంఘటన మీకు లజ్జాకరంగా అనిపించలేదా? మూడు రోజులపాటు నగరాన్ని కిడ్నాపు చేసి, దేశం మొత్తాన్నీ హడలగొట్టిన సంఘటన

2008-11-27

చదువరి: దిగులుగా ఉంది

2008-11-27 06:02 PM చదువరి (noreply@blogger.com)
మనం రోడ్డు మీద వెళుతూంటేనో, రైలు టిక్కెట్టు కొనేందుకు వరసలో నుంచుంటేనో, ఏ కూరగాయలు కొనుక్కుంటున్నపుడో మనకు అటుగానో, ఇటుగానో నిలబడి తుపాకీతో టపటపా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసి, తాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. నువ్వు ఫలానా మతం వాడివి కదా.. ఐతే ఇదిగో నీకిదే గతి అంటూనో, నువ్వు ఫలానా దేశం వాడివి కదా అయితే అనుభవించు అంటూనో మన కణతలోకి గుండేసి చంపేస్తారు ఆ తరవాత ఓ ఇద్దర్నో ముగ్గుర్నో పట్టుకుని

2008-11-13

చదువరి: వంశ గర్జన

2008-11-13 06:31 PM చదువరి (noreply@blogger.com)
యువగర్జన అంటూ తెదేపా మంచి హడావుడే చేసింది. బహిరంగ సభలకు, రోడ్డు షోలకు జనం రావడమే బలానికి కొలబద్దైతే తమ బలాన్ని బహు చక్కగా ప్రదర్శన చేసింది. ఇతర పార్టీల్లో తమ పట్ల విశ్వాసాన్ని, తమ శక్తియుక్తుల పట్ల గౌరవాన్నీ కలిగించేలా బలనిరూపణ చేసుకుంది. అయితే, ఆ వేదిక మీద బాలకృష్ణ చెప్పిందేమిటి? అతడి ప్రసంగం నేను కొంతే విన్నాను. ఏ ధోరణిలో అది ఉంటుందని అనుకున్నానో అలాగే ఉందది. రామారావు గురించీ, ఆయన చేసిన పనుల

2008-11-01

చదువరి: ఇడుపులపాయ ఎస్టేటు - ఆంధ్రప్రదేశ్ ఎస్టేటు

2008-11-01 06:24 AM చదువరి (noreply@blogger.com)
ఈ రెండూ శివదేవుడివే! ఇడుపులపాయలో ఆసామికి తెలవకుండా ఒక్ఖ మొక్కజొన్న కండెను కాపలావాడు తెంపుకెళ్ళగలడా? నాలుగు మామిడికాయలను కోసుకెళ్ళి ఆవకాయ పెట్టుకోగలడా? ఆ సంగతి ఆసామికి తెలిస్తే వాడి కథేమవుతుంది? "అయ్యా ఫలానా మునిరత్నం దొంగతనంగా మామిడికాయలు కోసుకెళ్ళాడు" అని మరో వెంకటప్ప ఆరోపిస్తే ఏం జరుగుతుంది? పంచాయితీ జరుగుతుంది నిజమేమిటో తేలుతుంది. దొంగ అని తేలితే మునిరత్నం, ఆరోపణ తప్పని తేలితే వెంకటప్పల సంగతి

2008-10-17

దిల్ సే ... » రాజకీయాలు: TOP 10

2008-10-17 11:16 AM శ్రవణ్
And the award goes to ..... * బస్సువాడు చక్కటి బాలసుబ్రహ్మణ్యం పాట పెట్టాడు..వింటూ అలా ఎప్పుడు నిద్ర పొయ్యనో తెలియదు..కానీ ఎప్పుడూ లేచానో తెలుసు.. ఎక్కడినుంచో అస్సహ్యంగా రమణ గోగుల గొంతు వినిపించినప్పుడు * అసలు ప్రత్యేకమైన కారణాలేవీ లేకుండా.. పాకిస్తాన్ క్రికెటర్లను చూడగానే ద్వేషిస్తుంటారే కొంతమంది మూర్ఖులు...వాళ్ళలో ఒకడిని నేను. * * నాన్సెన్స్ - ఐదు రన్లు కాదు.....సగం రన్నుతో గెలిచినా సరె....గెలిచిన వాడే హేరో.. * ఆ కవర్లు ఇటీ వదినా...ఎన్నింటికెళ్ళాలి?

2008-09-13

చదువరి: మరో 'పిరికి' చర్య

2008-09-13 07:10 PM చదువరి (noreply@blogger.com)
ఇంకోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈ సారి ఢిల్లీ. ఊరు మారింది, స్థలాలు మారాయి.  బాంబులేసినవాళ్ళు వాళ్ళేనట -మేమేనని బోర విరుచుకుని మరీ చెబుతున్నారు. మరో 'పిరికి' చర్యను ఖండించి పారేసారు భారత హోమ్ మంత్రి. ఢిల్లీలో జరిగిన దానికి నాకు చాలా విచారంగా ఉంది. మనకు ఇబ్బందులు కలగజేయాలనుకునేవారి కుట్ర ఇది. వాళ్ళ దుష్ట పన్నాగాలను పారనీయకుండా చెయ్యాలి. మనందరం ఐక్యంగా వీళ్ళను ఎదుర్కొందాం. సరిగ్గా ఇదేకాదు,

2008-09-03

ప్రజా రాజ్యం వార్తలు: ప్రజా రాజ్యంతో కలిసి పని చేయడానికి సీ.పీ.ఐ. (ఎం) సిద్ధం.

2008-09-03 04:17 PM admin

ప్రజల సమస్యలపై ప్రజా రాజ్యంతో కలిసి పని చేయడానికి సీ.పీ.ఐ. (ఎం) పార్టీ సంసిద్ధత వ్యక్తం చెసింది. ప్రజా రాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రాని కలిసిన తర్వాత విలేకరుల సమావేసంలొ ఈ విషయాన్ని సీ.పీ.ఐ. (ఎం) నాయకులు ప్రకటించారు.

ప్రజా రాజ్యం వార్తలు: మావోయిస్టులు ప్రజా రాజ్యం పార్టీని అపార్ధం చేసుకున్నారు.

2008-09-03 07:57 AM admin

మావోయిస్టుల ప్రకటనపై ప్రజా రాజ్యం పార్టీ అధికార ప్రతినిధులైన డాక్టర్ మిత్రా, పరకాల ప్రభాకర్ ఈ విధంగా స్పందించారు, “మావోయిస్టులు మమ్మల్ని అపార్ధం చేసుకున్నారు. నక్సలిజంపై చిరంజీవికి స్పస్టమైన అవగహన ఉంది. ఇది కేవలం శాంతి భద్రతల సమస్య కాదు. సామజిక, ఆర్ధిక సమస్య అన్నది ప్రజా రాజ్యం పార్టీ విధానం. చిరంజీవి మాటలని మీడియా తప్పుగా ప్రచరం చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ‘నలుగురు నక్సలైట్లను చంపినంత మాత్రాన  ఈ సమస్య పరిష్కారం కాదు.’ అన్న చిరింజీవి అభిప్రాయాన్ని ‘నలుగురు మనుష్యులను చంపినంత మాత్రాన  ఈ సమస్య పరిష్కారం కాదు.’ అని తప్పుగా ప్రచారం జరిగింది. పార్టీ విధానాలను త్వరలో పుస్తకం రూపంలో వెలువరిస్తాము”

2008-09-02

ప్రజా రాజ్యం వార్తలు: ప్రజా రాజ్యం

2008-09-02 01:27 PM admin

ప్రజా రాజ్యం వెబ్సైట్ కి స్వాగతం.

“ప్రెమే లక్ష్యం … సేవే మార్గం” నినాదంతొ ముందుకు సాగుతున్న చిరంజీవికి  అందరం సహకరిద్దాం.

2008-08-29

చదువరి: కందానికో నూలుపోగు

2008-08-29 08:15 PM చదువరి (noreply@blogger.com)
ఏ యుగంలోనైనా అందం నాలుగు పాదాల మీదా నడిచే పద్యం, కందం. ఈ మధ్య బ్లాగుల్లో మళ్ళీ కంద పద్యం కాంతులీనింది -ముఖ్యంగా రెండు బ్లాగుల కారణంగా. కందపద్యం ఎలా చెప్పాలో రాకేశ్వరరావు సచిత్రంగా సోదాహరణంగా వివరించారు. కందపు గ్లామరును, గ్రామరునూ వివరిస్తూ చంద్రిమలో ఓ చక్కని జాబు వచ్చింది. ఈ రెండు చోట్లా బహు చక్కని వ్యాఖ్యలూ, వాటిలో అందమైన ఆశుకందాలూ వచ్చాయి. ఓపక్క అక్కడ వ్యాఖ్యలు రాస్తూనే రానారె తన బ్లాగులో ఒక

2008-08-28

చదువరి: ప్రజారాజ్యం కోసం చిరంజీవి ప్రజారాజ్యం తెచ్చాడు

2008-08-28 01:19 AM చదువరి (noreply@blogger.com)
ఎట్టకేలకు చిరంజీవి పార్టీ వచ్చేసింది. ప్రజారాజ్యం అనే చక్కని పేరు పెట్టుకుని 2008 ఆగస్టు 26 న ఈ పార్టీ పుట్టింది. జెండాను ఆవిష్కరించిన చిరంజీవి, అది ఏయే అంశాలకు ప్రతీకగా నిలవబోతోందో కూడా చెప్పాడు. లక్షల మంది ఉత్సాహవంతులైన వీరాభిమానుల కోలాహలం మధ్య తిరుపతిలో పార్టీ పేరు ప్రకటించడమే కాకుండా స్థూలంగా పార్టీ విధానాలను కూడా వివరించాడు. మొత్తం మీద ప్రజారాజ్యం ఆవిర్భావం సందడిగా జరిగింది.'తాను భిన్నమైన

2008-08-17

చదువరి: అన్నయ్యల పోటీ

2008-08-17 07:38 PM చదువరి (noreply@blogger.com)
రాజకీయాలంటే అనేకానేక నిర్వచనాలతో పాటు భావోద్వేగాల ఆట అనే ఒక వ్యుత్పత్తి కూడా ఉండుంటుంది. ఏదో రకంగా ప్రజల సెంటిమెంటు మీద ఆటాడాలి, వోట్లను వేటాడాలి. (ఆ పైన ప్రజలను చెండాడాలి). అందుకోసం అనేకానేక పద్ధతులను మనవాళ్ళు కనిపెట్టారు. అన్నయ్యను మించిన సెంటిమెంటలు వస్తువు మరోటి లేదని మన రాజకీయులు నమ్మడమే కాదు నిరూపించారు కూడాను. అఖిలాంధ్ర ఆడపడుచులకు అన్నను అంటూ ఎన్టీవోడు వచ్చినపుడు కాంగ్రెసోళ్ళు 'ఏడిసాడు, ఈ

2008-04-27

తెలుగు 'వాడి'ని: 'చిరు' కి జూనియర్ యన్.టి.ఆర్ చెక్ పెట్టగలడా !? - ఈనాడుఆంధ్ర పోల్

2008-04-27 03:18 AM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
ఈరోజు యాధృశ్చికంగా ఈనాడుఆంధ్ర.కాం (courtesy : కొత్తపాళీ గారి తెలుగు భీభత్సం టపా) అనే వెబ్ సైట్ కి వెళ్లగా అక్కడ కనబడిన ఈ చిరు vs యన్.టి.ఆర్ అనే పోల్ కనబడటంతో దాని ఫలితం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించటంతో మీతో పంచుకుందామనే ప్రయత్నమే ఈ టపా ....పైన ఆశ్చర్యం అని ఎందుకు అన్నాను అంటే మనం చూసే/చదివే అన్ని(కుడి-ఎడంగా) ప్రముఖ పత్రికలలో మరియు/లేదా వెబ్ సైట్స్ లో ఇంత పెద్ద తేడాతో చిరు కి వ్యతిరేకంగా

2008-01-19

తెలుగు 'వాడి'ని: ప్రముఖ దినపత్రికలలోని కార్టూన్ ల మరియు ప్రజాభిప్రాయసేకరణల పరంపర - మొదటిది ( వై.యస్.ఆర్ :: ప్రభుత్వ పాలన)

2008-01-19 03:44 AM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
మనం ప్రతి రోజూ చదివే తెలుగు దినపత్రికలలో (ఈనాడు , ఆంధ్రజ్యోతి మొదలుగునవి) .. అలాగే Internet లో ఉన్న తెలుగు Web Sites (AndhraCafe , TeluguLo , ThatsTelugu etc) లో ప్రచురించబడే కార్టూన్స్ మరియు ప్రజాభిప్రాయసేకరణలు అన్నింటినీ ఒక సమూహంగా చేసి, వాటిలోనుంచి కొన్ని విభాగాలుగా .. వై.యస్.ఆర్ మరియు ప్రభుత్వ పాలన, తెలుగుదేశం మరియు చంద్ర బాబు, సోనియామన్మోహనీయం మరియు కేంద్ర ప్రభుత్వ పాలన మొదలగునవి...తయారు

2007-11-29

తెలుగు 'వాడి'ని: చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి మరియు మనలో పదేళ్లలో ఎంత మార్పు !?

2007-11-29 10:36 PM తెలుగు'వాడి'ని (noreply@blogger.com)
కాలచక్రంలో పదేళ్లు గిర్రున తిరిగిపోయాయి. పాలక ప్రతిపక్షాల స్థానాలు మారాయి ... హైదరాబాద్, బెంగుళూరు మొదలగు సిటీల నుండి మనం అమెరికాకు వచ్చిపడ్డాము .. రూపాయి స్థానంలో డాలర్ కనపడటం మొదలెట్టింది...కానీ మారనిది, ఆరేడు (మూకుమ్మడిగా లేక బయటకు తెలిసింది) సంవత్సరాల క్రితం మొదలైన రైతుల కష్టాలు, ఆత్మహత్యలు మరియు వారి జీవన స్థితిగతులు...మారని ఆ రైతుని చూసి ఒక రైతుబిడ్డగా ఆవేదనతో ఎందుకో ఈ పదేళ్లను మననం
వ్యాఖ్యలు
2010-07-29
2010-07-29 10:06 AM Konatham Dileep - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

మీది తెలంగాణా అని తెలుసు సోదరా! అందుకే కదా “జై తెలంగాణా” అనిపిస్తానని అన్నది/

2010-07-27
2010-07-27 03:01 PM chavakiran - గుండె చప్పుడు... కి వ్యాఖ్యలు

సమస్య అంతా నేను తెలంగాణా వాణ్ని అవ్వటంతోనే వస్తుంది. :-)

2010-07-19
2010-07-19 04:47 AM సుజాత (noreply@blogger.com) - ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
ఏ జిల్లా పేరు అయినా మార్చాల్సి వస్తే అప్పుటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బట్టి మారుస్తారనుకుంటాను. మా గుంటూరు జిల్లా విషయానికొస్తే అప్పుటికి కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాసు బ్రహ్మానందరెడ్డి జిల్లా అవుతుంది! తెలుగు దేశం అధికారంలో ఉంటే కోడెల శివప్రసాద్ జిల్లా అవుతుంది.:-))
2010-07-18
2010-07-18 02:06 PM srinivasa chowdary gunnam (noreply@blogger.com) - ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
nice analysis satish. neelo eee konam kooda vundani eppativaraku teliyaledu. nice concept. Congrats and carry on.
2010-05-24
2010-05-24 10:22 AM ramu - Comments for The Invincible Rebel Road

I had realized the mistake. I’ll never write it.
thanks
ramu
apmediakaburlu.blogspot.com

2010-04-18
2010-04-18 07:19 AM vijayanandchary - Comments for The Invincible Rebel Road

Hi

This is Vj (vijayanandchary)

nice COMMENT OF yours

i appreciate u r through Keep going on Legend

Ur s

Vj

పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish