ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2015-05-17

జాబిల్లి: వైద్యుని విధి

2015-05-17 06:47 AM
సాయికృపానర్శింగ్ హోంలో ‘చిన్నపిల్లల డాక్టర్స్ ‘సెలెక్షన్ కోసం ప్రకటన చూసి, కొత్తగాడాక్టర్ డిగ్రీఅందుకున్నవాళ్ళు,కాస్తంత అనుభవఙ్ఞులు,ఆనర్శింగ్ హోంలో కొంతకాలమైనాపని చేస్తే మంచిగుర్తింపుతోపాటు,ఆకర్షణీయమైన జీతం,క్వార్టర్స్ మొదలైనవి లభిస్తాయని భావించిన వారు అంతాకల్సి ఓ50మంది వెయిటింగ్ హాల్లో8.30గంటలకేవచ్చిచేరారు.ఇంటర్వ్యూ9గం.కు.అంతా  తమతమ సర్టిఫికేట్స్ సరిచూసుకుంటున్నారు.ప్రతిఒక్కరూపక్కవారినితమరైవల్గాలోలోనభావిసున్నా పైకి నవ్వుముఖంతో పలకరించుకుంటున్నారు. ఇంతలో ఒకతల్లి ఏడుస్తూ లోనికివచ్చింది.గుమ్మంవద్ద కూర్చుని ఉన్నఅటెండర్ నుచూసి “అయ్యా! నాబిడ్డకు చాలాజ్వరంగా … Continue reading

2015-05-07

పాఠశాల: ఐదవ వార్షికోత్సవం/నేనెరిగిన పంచభూతాలు

2015-05-07 03:47 AM జ్యోతిర్మయి
"వార్షికోత్సవం ఈ సంవత్సరం......"  ""చేద్దాం చేద్దాం" పిల్లలదీ పెద్దలదీ ఒకటే మాట. "ఎలాగా? పోయినేడాది లాగానేనా" "అబ్బే, పోయిన సంవత్సరం మన పాఠశాల వాళ్ళమే చేసుకున్నాం తప్ప వేరే వాళ్ళను పిలవలేక పోయాం. ఈ సంవత్సరం అలా కాదు ఆసక్తి ఉన్న స్నేహితులను కూడా పిలుద్దాం" "మనమే దగ్గరదగ్గరగా నలభై ఐదు కుంటుంబాలు. క్లబ్ హౌస్ సరిపోదు.మరి ఎక్కడ చేద్దాం? " "ఏదైనా స్కూల్ తీసుకుందా౦" స్కూల్ గురించి వేట మొదలైంది.

పాఠశాల: ఆరవ వార్షికోత్సవం

2015-05-07 03:43 AM జ్యోతిర్మయి
పాఠశాల మొదలుపెట్టి ఆరు సంవత్సరాలు పూర్తయిందంటే నమ్మశక్యంగా లేదు. తెలుగులో ఒక్క అక్షరం పలకలేని పిల్లలు ఈరోజు మాట్లాడుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొదలు పెట్టినప్పుడు పుస్తకాలు లేవు, ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో తెలీదు. అలాంటిది ఇవాళ మాకై మేము సొంతంగా పాఠ్యాంశాలను రూపొందించుకుని పాఠాలు చెప్పగలగడమే కాక, పాఠాలు చెప్పాలన్న ఉత్సాహంతో ముందుకు వచ్చిన వారికి ప్రణాళిక ఇవ్వగలిగే స్థాయికి

2015-04-16

జాబిల్లి: గాలిదెయ్యానికి  సైన్స్ పాఠం

2015-04-16 01:14 PM
అది బాలాజీనగర్ ఉన్నత పాఠశాల. ఎనిమిదో తరగతిలో సత్యప్రసాద్ సార్ అటెండెన్స్ తీసుకుంటున్నాడు.ఆయన ఆ తరగతికి సామాన్య శాస్త్రం బోధిస్తాడు. వారంరోజులనుండి కమల బడికి రావడం లేదు. “కమల ఎందుకు బడికి రావడం లేదు ?” పిల్లలని అడిగాడు. “గాలి పోసిందంట సార్,లేవడం లేదు, పట్నం పోయి మంత్రపు తాయొత్తు కట్టించుకొని వచ్చారు., రేపటినుండి వస్తుందట” … Continue reading

2015-04-15

Prabhava ప్రభవ: Greeshma Prabhava

2015-04-15 11:03 AM Prabhava
Summer  Classes Time : 10 am to 12  Noon .  Van facility is available.  FOR  ALL AGES ! 1.      Language Skills  : English (one month ) ·         Spoken   *  Integrated skills      * Creative  Writing 2.      After School : Special care on Select subjects like

కొత్తపల్లి: పదాల్ని వెతికి పట్టుకోండి

2015-04-15 09:49 AM

స్నేహితుడు, ఉడత, జంతువులు, మనుషులు, ఆహారం,...

కొత్తపల్లి: అమ్మ ప్రేమ

2015-04-15 09:49 AM

"అమ్మ ప్రేమ ఎన్నో నేర్పిస్తుంది. అమ్మ ప్రేమను పొందిన ఒక ఆడపిల్ల తన చిన్నతనంలో చదువుకోలేకపోయినా కూడా జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగిందో తెలియజేయడమే నా ఈ కథలోని ముఖ్య ఉద్దేశం" అని రాస్తున్నది వినూత్న. చూడండి.. రచన: M. వినూత్న, తొమ్మిదవ తరగతి, తేజ టాలెంట్ స్కూల్, కోదాడ, నల్గొండ జిల్లా. కూర్పు చేర్పులు: కొత్తపల్లి

2014-12-23

Prabhava ప్రభవ: మీ పిల్లలకోసం ... కానుక!

2014-12-23 05:32 PM Prabhava
కాలాలు మారినా పిల్లలు మారేనా?ఇది పిల్లలకు ముచ్చటగా కానుకలు తీసి ఇచ్చే కాలం కదా!  మరి, మీరు మీ పిల్లలకోసం ఏమి కానుకలు ఇవ్వ బోతున్నారు ?  మా పిల్లల కోసం శీతాకాలం పాటలు వెతికి వడపొస్తోంటే , ఈ ఆణిముత్యం దొరికింది. మొదటిది అసలు సిసలుది. రెండొది..ఇప్పటిది.  చూడండి..  1. https://www.youtube.com/watch?v=2Dec9Jb_Ac42. https://www.youtube.com/watch?v=HH4ZU7LNbUU Merry Christamas ! Prabhava,

2013-10-21

తెలుగు మాటలు: చందమామ, చెల్లాయి

2013-10-21 10:18 PM లలిత (తెలుగు4కిడ్స్)

983973_10201278466744668_822303091_nచల్లని సాయంత్రం వేళ, రమా, ఉమా, చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎప్పుడొచ్చాడో, చందమామ, మబ్బుల వెనకాల నుంచీ తొంగి చూస్తున్నాడు.
ఉమ చంద్రుడికేసి చూసింది. సరిగ్గా ఇలాంటిదే ఆ సాయంత్రం కూడా. గుర్తుకొచ్చి ఒళ్ళు గగుర్పొడిచింది. అంతలోనే ఫక్కున నవ్వొచ్చింది. రమకి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగాస్నేహితురాలి వైపు చూసింది. ఉమ చిన్నగా నవ్వడం చూసి, ఊపిరి పీల్చుకుంది.
“సంగతేంటో చెప్తాను విను,” అంటూ, ఉమ ఇలా చెప్పింది.
“ఇరవై ఏళ్ళ క్రితం, ఇలానే ఒక రోజు సాయంత్రం, పెరటి మెట్ల మీద కూర్చుని చందమామను చూస్తున్నాను. చందమామను చూడడం నాకు చాలా ఇష్టం. మా పక్క వీధి నుంచి నుంచి మా ఇంటికి వస్తూ, దారిలో చందమామ నా వెంట వస్తున్నాడో లేదో అని చూసుకుంటూనే ఉండే దాన్ని. బస్సులో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు బస్సు కిటికీలోంచి చంద్రుడిని చూస్తూనే ఉండే దాన్ని. ఎంత దూరం మాతో అలా రాగలుగుతాడు? అని అనుమానం. చెట్టెక్కితే చందమామ చేతికి అందుతాడని అనుకునే దాన్ని. మేడ మీదకు ఎక్కినప్పుడు అందక పోతే, కొండ మీద ఎక్కితే అందుతాడేమో అనిపించేది. ఎంతో దూరంలో ఉంటాడని తెలిసినా, అందుకోగలనని ఊహించుకోవాలనిపించేది.”
“మరి చందమామ అంటే నీకు అంత ఇష్టమైతే, నువ్వు ఇందాక గుర్తు చేసుకుని భయపడినది దేనికి?” అని అడిగింది రమ.
“చెప్తున్నాను విను.” అంటూ ఉమ ఇంకా ఇలా చెప్పింది, “నా చందమామ సరదాను చాలా ఆట పట్టించే వాడు మా అన్నయ్య. ‘పొద్దు తిరుగుడు పువ్వు సూర్యుడితో పాటు తిరుగుతుంది. చెల్లాయేమో చంద్రుడితో!’ అనే వాడు.”
“నిజమేలా ఉంది మరి!” అంది రమ, నవ్వుతూ.
ఉమ కూడా నవ్వేసి కథ కొనసాగించింది, “కాసేపయ్యాక బావి దగ్గరికెళ్ళి బావి లోకి తొంగి చూస్తున్నాను. బావి నీళ్ళలో చందమామ తేలి ఆడుకుంటున్నట్టు ఊహించుకుంటున్నాను. ఇంతలో పెద్ద శబ్దం వినిపించింది! గుండె ఝల్లు మంది. గిరుక్కున పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే, అప్పటి వరకూ అక్కడ పుస్తకం చదువుకుంటూ కూర్చున్న మా అన్నయ్య కనిపించ లేదు! పుస్తకం కింద పడి ఉంది. కుర్చీ కూడా తల్ల కిందులుగా ఉంది. మా అమ్మా, నాన్న, బయటికి ఏదో పని మీద వెళ్ళారు. ఇంకా చాలా సేపటి దాకా రారు. మా అన్నయ్యని పిలుస్తూ, ఇల్లంతా తిరిగి చూశాను. ఇంక పక్క వాళ్ళని పిలుద్దామనుకునేంతలో, కిటికీలోంచి చందమామ కనిపిస్తుంటే, అప్రయత్నంగా అటు వైపు చూశాను. కిటికీ పక్కన ఉన్న అద్దంలో మా అన్నయ్య ప్రతిబింబం కనిపించింది. బట్టలు పెట్టుకునే గూటికి కట్టి ఉన్న తెర వెనక దాక్కుని, తొంగి చూస్తూ అద్దంలో కనిపించి నాకు దొరికిపోయాడు.” అని ఒక క్షణం ఆగింది.
“అంతేనా?” అంది రమ.
“ఇంకా ఉంది, చెప్తాను, విను”, మళ్ళీ చెప్పడం మొదలు పెట్టింది, ఉమ.
“అన్నను పట్టి ఇచ్చిన చందమామకు కృతజ్ఞతలు చెప్పుకుని పెరట్లోకి వెళ్ళాను, ఇంకా, అన్నయ్యను గట్టిగా పిలుస్తూనే. పెరట్లో అన్న పడేసి శబ్దం చేసిన పెద్ద బండ రాయొకటి కనిపించింది. ఆ రాయిని దొర్లించుకుంటూ బావి దగ్గరకు తీసుకెళ్ళి ఎత్తి నీళ్ళలో పడేశాను, ‘అన్నయ్యా!’ అని గట్టిగా అరుస్తూ. మా అన్నయ్య ఒక్క ఉదుటున పరిగెత్తుకుని వచ్చి చూశాడు…నాకు నవ్వాగలేదు”, అని అంటుంటే, రమ నవ్వడం మొదలు పెట్టింది.
“చందమామ సాయం చేశాడు కాబట్టి దొరికిపోయాను, లేకపోతేనా….” అంటూ వెనకాలనుంచి చిన్నగా ఎవరో గొణుక్కోవడం వినిపించింది.
మబ్బు తొలగిపోయి చందమామ కూడా మనసారా నవ్వాడు.
(Courtesy Chandamama)


Filed under: కథలు

2013-09-28

తెలుగు మాటలు: ఎదిగే చెట్టు – పెరిగే పిల్లాడు

2013-09-28 05:18 AM లలిత (తెలుగు4కిడ్స్)

రంగడు మంచి పిల్లాడు. చదువులోనూ ముందుంటాడు. ఐతే అందరి పిల్లలలాగే అల్లరి కూడా చేస్తుంటాడూ. పని మీద శ్రద్ధ తక్కువ.

ప్రొద్దున లేచినప్పట్నుంచీ రాత్రి పడుకునే దాకా ఏదో ఒక విషయంలో రంగడిని కసురుకుంటూనే ఉంటుంది తల్లి కనకమ్మ. “అలాగేనా కూర్చోవడం?”, “చొక్కా గుండీలు చూడు ఎలా ఎగుడు దిగుడుగా పెట్టుకున్నావో?” “అలా మెతుకు మెతుకూ ఏరుకు తింటే ఎప్పటికయ్యేను?”, “పుస్తకాలు వెనక్కి మడిచి పట్టుకుంటే పాడైపోతాయి!”, “ఇంత పొద్దు పోయింది. ఇంకా పడుకోకుండా ఆ ఆటలేంటి?” ఇలా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.

రంగడికి తల్లి తనని కసురుకోవడం ఎంతగా అలవాటైపోయిందంటే ఆమె మాటలు వినిపించుకోవడం మానేశాడు. దాంతో కనకమ్మ గట్టిగా అరిచి చెప్పాల్సి వచ్చేది. రంగడి చేత చిన్న పని చేయించడానికి కూడా ఎంతో కష్టపడుతున్నట్లు అనిపించేది కనకమ్మకి.

ఒక రోజు సాయంత్రం కనకమ్మ మొక్కలకు నీళ్ళు పెడుతోంది. పూల మొక్కలన్నీ చక్కగా విచ్చుకున్నాయి. జామ చెట్టు పూతకొచ్చింది. కొన్నేళ్ళ క్రితం ఈ ఇంట్లో క్రొత్తగా దిగినప్పుడు పెరడంతా బోసిగా ఉండేది. పెరట్లో చేరిన చెత్తా చెదారం తీసేసి చక్కగా బాగు చేసి రక రకాల మొక్కలు తెచ్చి నాటింది కనకమ్మ. వాటన్నిటికీ పాదులు చేసి శ్రద్ధగా నీరు పెట్టేది.

ఒక రోజు చిన్ని రంగడు జామ చెట్టుకు అదే పనిగా నీరు పెట్టిన సంగతి గుర్తుకొచ్చి కనకమ్మకు నవ్వొచ్చింది. “రోజూ కొన్ని కొన్ని నీళ్ళు పోసే బదులు ఒకే రోజు బోలెడు నీళ్ళు పోస్తే బోలెడంత ఎదిగిపోతుంది కదా! అప్పుడూ ఎంచక్కా మనం రేపే కాయలు కోసుకుని తినచ్చు!” అని ముద్దు ముద్దు మాటలతో తనతో అనడం గుర్తు చేసుకుంది. “చిన్నతనం!” అని మురిపెంగా మనసులో నవ్వుకుంది.

అంతలోనే ఆమెకు ఇంకో ఆలోచన వచ్చింది. తను ఇప్పుడూ చేస్తున్నదీ అదే కదా. “ప్రొద్దుట్నుంచీ రాత్రి దాకా కసురుకుని ఒక్క రోజులో రంగడి ప్రవర్తన పెద్దరికంగా మార్చెయ్యాలనుకుంటే ఎలాగా?”

ఆ రోజు నుంచీ కనకమ్మ కసురుకోవడం మానేసింది. మెల్లగా గుర్తు చెయ్యడం మాత్రమే చేసేది. ముందు కొన్ని రోజులు రంగడు మెత్తగా చెప్పినప్పుడు వినకుండా మొరాయించేవాడు. అలవాటు కొద్దీ అరవబోయి తమాయించుకునేది కనకమ్మ. రంగడు కొద్ది సేపయ్యాక పొరపాటు గ్రహించుకుని సరిదిద్దుకునే వాడు. క్రమంగా కనకమ్మ గుర్తు చెయ్యాల్సిన అవసరం లేకుండానే పనులు శ్రద్ధగా చేసుకోవడం నేర్చుకున్నాడు.

ఒకరోజు రంగడు జామ చెట్టెక్కి మగ్గిన పళ్ళు కోసుకొచ్చాడు. “అమ్మా, గుర్తుందా, నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు వెంటనే పెద్దదైపోవాలని జామచెట్టుకి అదే పనిగా నీళ్ళు పోసేవాడిని?” అన్నాడు.

సమాధానంగా కనకమ్మ చిన్నగా నవ్వి రంగడిని దగ్గరకు తీసుకుంది.


Filed under: కథలు

2013-05-05

బాల కళ: 'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ '

2013-05-05 02:53 AM తాతా రమేశ్ బాబు
నేను నిర్వహించిన తెలుగు జానపద కళా చైతన్య యాత్ర ను 'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ ' లో నమోదు చేసారు . క్రింది లింక్ లో చూడండి    http://www.telugubookofrecords.com/home/category/find-record/page/5/

2013-03-12

పుస్తకం » Focus-ChildrensLit: రెండు బాలల పుస్తకాల గురించి..

2013-03-12 07:01 PM అతిథి
రాసిన వారు: అరిపిరాల సత్యప్రసాద్ ************************* బాల సాహిత్యం అనగానే నాకు గుర్తొచ్చేవి – చిన్నప్పుడు విన్న ఏడు చేపల కథలు, ఆ తరువాత చందమామలోనో బాలమిత్రలోనో చదివిన రాజు గారు మాంత్రికుడు లాంటి కాల్పనిక కథలు, పాఠ్యాంశాలుగా వచ్చిన పంచతంత్రం లాంటి నీతి కథలు, ఇంకా ఆంగ్ల ఉపవాచకాలుగా చదువుకున్న సిందబాదు/కాపర్ ఫీల్డ్/హకల్ బర్రీ ఫిన్ సాహసాలు. ఆ తరువాత అవకాశాన్ని బటి లైబ్రరీలో చదువుకున్న దేశభక్తి కథలు, మరికొన్ని సరదా కథలు. ఇవన్నీ ఒక […]

2012-11-10

పుస్తకం » Focus-ChildrensLit: పిల్లలు, పుస్తకాలు, నా అనుభవాలు

2012-11-10 03:18 PM అతిథి
రాసిన వారు: భైరవభట్ల కామేశ్వరరావు. ************************** నిజానికి పైనున్న ఆ “పిల్లలు” పదంలో “లు” సైలెంట్ ఎందుకంటే పిల్లలతో నా అనుభవాలు మా ఒక్కగానొక్క పాపతోనే కాబట్టి! ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదో ఒక పుస్తకం గురించో, కొన్ని పుస్తకాల గురించో పరిచయమో విశ్లేషణో కాదు. ఇవి కేవలం నా స్వంత అనుభవాలు (ఉరఫ్ సొంత డబ్బా). ఇవి మరెవరికైనా ఉపయోగపడతాయా లేదా అన్నది నిర్ణయించాల్సిన బాధ్యత పుస్తకం సైటు వాళ్ళదే. కాబట్టి దీన్ని ఒకవేళ పుస్తకం […]

2012-08-20

బాల కళ: స్పాట్ పెయింటింగ్ మరియు ఆధునిక ,సాంప్రదాయ వాయిద్యాల పోటి

2012-08-20 04:34 PM తాతా రమేశ్ బాబు
స్పాట్ పెయింటింగ్ మరియు ఆధునిక ,సాంప్రదాయ వాయిద్యాల పోటి లో పాల్గొని ,మీ చిన్నారులను పాల్గొనేలా ప్రోత్సహించి ................సృజనాత్మకత ను వెలికి తీసి ................. అందరికి ఆహ్వానం. చిత్రకళా సేవలో .... తాతా రమేశ్ బాబు

2012-03-21

mamcimaata: hyma1947

2012-03-21 11:26 AM hyma1947

ఒకే శ్రోత
ఒక మారు ఒక పండితుడు కంచిలోని శంకరాచార్యులవారి వద్దకు వెళ్ళి , భక్తి తో నమస్కరించి
” స్వామీ ! నేను గొప్ప పండితుడ్ని.భగవద్గీత ప్రవచనం చేయడంలో పేరు పొందినవాడిని.ఇంతవరకూ వేయి ప్రవచనాలు చేశాను . తమరు అనుగ్రహిస్తే ఈ శంకర మఠంలో భాగవద్గీత ప్రవచనం పద్ధెనిమిది రోజులపాటు చేయాలని సంకల్పించి వచ్చాను.అనుగ్ర హించగలరు.” అని విన్నవించుకున్నాడు.
ఆచార్యులు చిరునవ్వుతో ” దాందేముంది తప్పక ప్రవచించు ,నేను ఒక పక్షంపాటు యాత్రలకు వెళ్ళవలసి ఉంది.నీవు నిర్విఘ్నంగా నీపని కానీ.” అని చెప్పి ఆచార్యులు మఠం విడచి యాత్రలకై బయల్దేరారు.

మన పండితుడు ఆరోజున మహదానందంగా భగవద్గీత ప్రవచనం మొదలుపెట్టారు. పద్దెనిమిది రోజులూ ఇట్టే గడచిపోయాయి. ఆచార్యులవారు యాత్రలు ముగించుకుని వచ్చారు.పండితుడు వెళ్ళి ఆచార్యుల పాదాలకు నమస్కరించగా ” ఏం ! నాయనా! నీ భగవద్గీత ప్రవచనం నిర్విఘ్నంగా సాగిందికదా! ఏ ఇబ్బందీ కలుగ లేదు కదా!నేను సమయానికి లేకుండా వెళ్ళవలసి వచ్చింది నాయనా! ” అని పలుకరించారు.

” స్వామీ మొదటిరోజు శ్రోతలు బాగానే వచ్చారు.క్రమంగాతగ్గి చివరకు ఒక్కరుమాత్రమే మిగిలారు స్వామీ ! నాశ్రమంతా వృధా ఐంది ,అదే నాబాధ !” అని చెప్పాగా , ఆచార్యులవారు ” నాయనా ! శ్రీకృష్ణ భగవానులవారు గీత బోధించినపుడు విన్నది అర్జునుడు ఒక్కడేకదా!నీలా ఆయన బాధపడినట్లు లేదే!” అన్నారు . పండితుడి అహంకారం వదలి తలదించుకున్నాడు,ఆచార్యులవద్ద తాను మహా పండితుడినని చెప్పుకున్నoదుకు ——————-


2012-02-10

For Kids: ఇరుక్కున్న ముక్కు

2012-02-10 10:47 AM ADMIN
రచన  : కాదంబరి పిదూరి చిలక చిలక, రామ చిలుక; ముక్కు మీద టెక్కు కోపం;  కోపం, అలుక కుప్పలు అయ్యి;  ముక్కు కాస్తా ఎర్రన ఆయెను; ఎర్రన, తిమ్మన-  ముక్కు కవితలకు;  అల్లికలెన్నో అందించినది  రాచిలకమ్మ చిన్ని నాసిక ఎర్రని -అలకల- కినుకల శుకము  దోర జామ పళ్ళను చూసీ………. చూసీ, చూడగనే……..  Q:- ఆ! ఏం చేసినది?       ఆహాహా! ఏమి చేసినది? జామ కాయను కొరికె కసుక్కున; పండులొ ముక్కు ఇరుక్కున్నది [...]

For Kids: వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము

2012-02-10 10:41 AM ADMIN
రచన  : కాదంబరి పిదూరి విష్ణువర్ధనుని భార్య అఖిలాండేశ్వరీ దేవి.  వారి కుమార్తె హరిత, కుమారుడు గ్రీష్మ దేవ్.  విదేహ రాజ్యానికి నదీశ్వర్ ఏలిక.  “మా పుత్రిక స్వయం వరము జరుగుతుంది.  కాబట్టి మీరెల్లరూ ఈ సంరంభములో పాల్గొనవలసినదిగా  కోరుచున్నాము“ విష్ణువర్ధనుని కుటుంబీకులు -  వారి బంధువుల పాలనలో ఉన్న విదేహ రాజ్యానికి వెళ్ళారు. నదీశ్వరుని కుమార్తె అంతకు మునుపే, రోహణుని ప్రేమించింది,  కాబట్టి ఆమె అక్కడ స్వయంవరములో  రోహణుని మెడలో వరమాల వేసినది,  వారిరువురికీ పరిణయం కుదిరింది. ************************************** అందరూ తమ [...]

2012-02-09

mamcimaata: vinayaka vandanam

2012-02-09 03:13 PM hyma1947

బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు.
———————
బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు…
బుజ్జిగణపా! నీకు కోటిదండాలు.
1. సాక్షి గణపా !నీకు సాష్టాంగ దండాలు
విద్య గణపా! నీకు వేయిదండాలు
వీర గణపా !నీకు వేవేల దండాలు
సుగుణ గణపా ! నీకు చాలదండాలు .
2.పార్వతీ బిడ్డడా! పాదదండాలు
శివునితనయా !నీకుశిరసు దండాలు
శ్రవణసోదర !నీకు సహస్రదండాలు
దేవపూజ్యుడ ! నీకు దొడ్డ దండాలు .

3. విఘ్న వినాశక! నీకు వీరదండాలు
శతృ విజేయా ! శతకోటిదండాలు
ఏకదంతుడ !నీకు ఏకాగ్రదండాలు
అగ్రపూజ్యుడ !నీకు అరకోటిదండాలు .

4. సిధ్ధిగణపా ! నీకు సర్వదా దండాలు
బుధ్ధిగణపా! నీకు బోలెడు దండాలు
గంగపుతృడ !నీకు గంపెడు దండాలు
గణనాధుడా! నీకు నీ గుడి చుట్టు దండాలు .
దండాలు! దండాలు !దండాలు !దండాలు!.


2011-08-05

పిట్ట కథలు: గోపయ్య నల్లనా.. ఎందువలనా?

2011-08-05 10:04 PM కొత్తావకాయ
"అమ్మా.."  "ఏం కన్నయ్యా!" అని అడిగింది యశోదమ్మ కృష్ణుడిని. "నాకు కోపమొచ్చింది" "కోపం అంటే ఏంటి, కన్నయ్యా?" "ఏమో! వచ్చింది. అంతే!" "సరే, వచ్చింది లే!" "ఉహూ, ఎందుకూ? అని అడుగు" "హ్మ్" "హ్మ్మ్ కాదు, "ఎందుకు కన్నయ్యా?" అని అడగాలి" "అడిగాను లే , చెప్పు" "నన్ను నల్ల వాడని అన్న నవ్వాడు." "పోన్లే, అన్నేగా!" "వల్లభుడు కూడా నవ్వాడు. నీలమణీ నవ్వాడు." "నవ్వనీలే నాన్నా. వాళ్ళని తెల్లవాళ్ళని నువ్వూ నవ్వు

2011-05-07

పిట్ట కథలు: చిట్టెలుక - కొత్త కలుగు

2011-05-07 10:32 AM కొత్తావకాయ
అనగనగా ఓ అడవిలో ఓ చిట్టెలుక ఉంది. అది కొత్తగా కలుగు వెతుక్కుని కాపురం పెట్టింది. ఓ రోజు అది కడుపెక్కా  తినేసి, గెంతుకుంటూ కలుగుకి వచ్చేసరికి దాని కలుగు ముందు ఓ పెద్ద బండరాయి అడ్డుగా ఉంది." ఇదేంట్రా?" అనుకొని చేతితో నెట్టి చూసింది. బలంగా తోసి చూసింది. లాభం లేదని రాయిని తొలవడం మొదలు పెట్టింది. "గయ్ "మని అరుస్తూ ఆ రాయి కాస్తా లేచి కూచుంది.  రాయి అనుకొని ఎలుక తొలవబోయింది కూటి కునుకు తీస్తున్న సింహం

2010-12-17

ఆహా! ఓహో!: కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!

2010-12-17 09:50 AM Aha!Oho!
జారు బాబూ!కొత్తపల్లి పత్రిక అక్టోబరు సంచికలో ఇచ్చిన బొమ్మకు స్పందన. రచన, చిత్రం: Y. గీతా ప్రియ దర్శిని, ఇంటర్మీడియట్,నంద్యాల. రామ్ నగర్ లో ఒక పిల్లల పార్కు ఉంది. ఆ పార్కు ఇళ్ళ మధ్య ఉండేది. పిల్లలు పార్కులో ఆడుకోవడానికి టిక్కెట్టు కొనుక్కొనాలి. తల్లిదండ్రులు కూడా ‘పిల్లలు హోంవర్కు పూర్తి చేస్తే పార్కు టిక్కెట్టు కొనిపిస్తాము’ అనేవాళ్ళు. దాంతో పిల్లలు తొందరగా హోంవర్కు ముగించుకొని,

2010-09-27

ఆహా! ఓహో!: పగలే వెన్నెలా - పరవశమాయెగా!

2010-09-27 06:52 AM Aha!Oho!
ఇది నా సొంత కథ. ఎక్కడా విని చదివి వ్రాసింది కాదు.అనగా అనగా..... పంపానది తీరంలోని అడవిలో చకోర పక్షులు నివసించేవి. అవి చంద్రుడి వెన్నెలను తప్పించి ఇంక దేనిని ఆహారంగా తీసుకునేవి కాదు. ఒక మధ్యాహ్నపూట, ఒక చకోర పక్షి, ఒక దిరిసెన చెట్టు మీద కూర్చుని కునికి పాట్లు పడుతుంది. ఆ చకోర పక్షి తనలో తను ‘ఈ రోజు అమావాస్య! చంద్రుడు రాడు. ఈ రొజుకు మాకు పస్తు’ అనుకుంది. అంతలో ఆ ప్రదేశమంతా వెన్నెల వెలుగు

2010-06-27

బాల సాహిత్యం: ప్రణాళిక-క్రమశిక్షణ

2010-06-27 05:45 PM global animal
మనం నిర్దేశించుకున్న పనిని వెంటనే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టడం సరైన పద్ధతే... కానీ, దానివల్ల విజయవంతంగా అ పనిని పూర్తిచేయలేకపోవచ్చు. కాస్త ఆలస్యమైనా చక్కటి ప్రణాళిక వేసుకుని , క్రమశిక్షణతో చేసినప్ప్పుడు పని ఎంత క్లిష్టమైనా సునాయాసంగా పూర్తవుతుందనేది వాస్తవం. ఓ ప్రముఖుడి జీవితంలోని కొన్నిఘట్టాలను పరిశీలిద్దాం. ఆయన ఒకసారి తన స్వగ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న

బాల సాహిత్యం: ఈగలమోత

2010-06-27 05:37 PM global animal
పూర్వం లలాటరాజ్యాన్ని విచిత్రసేనుడు పాలిస్తుండేవాడు. ఒకసారి అతనికో సమస్య వచ్చింది. గుంపులు గుంపులుగా వచ్చిన ఈగలు సభలో తీవ్ర అసౌకర్యాన్ని కలిగించసాగాయి. ఝుమ్మని మోత చేస్తూ సభికులు, రాజు మొహంపై వాలసాగాయి. ఎంత తోలినా తిరిగి వచ్చేవి. కొంతమంది మాట్లాడేటప్పుడు నోటిగుండా పొట్టలోకి జారుకునేవి. వాటి దెబ్బకు అందరూ గగ్గోలు పెట్టారు. పరిష్కారం చూపమని రాజును వేడుకున్నారు. సేవకులు వింజామరలతో వీస్తున్నా అది

2010-05-17

మడత పేజీ: తకిట తరికిట

2010-05-17 04:04 AM Chandra Latha
తకిట తరికిట ***************పిల్లల పుస్తకాలు ఎలా ఉండాలి? అక్షరాల పరిణామం ఎలా ఉండాలి? బొమ్మలు, రంగులు ఎలాంటివి వాడాలి? పుస్తకం లో కథ ఎలా ఉండాలి?కథనం ఎలా సాగాలి? పాత్రలు, సంభాషణలు సంఘటనలు ఎలా కూర్చాలి? నీతి ఎలా అందించాలి?ఏ వయసుకు ఎలాంటి పుస్తకాలు అందించవచ్చును?పిల్లలు స్వయానా చదవ గలిగిన పుస్తకాలు(READ ALONE) అన్నవి ఎలా ఉండాలి? పిల్లలు బిగ్గరగా చదివ గలిగే (READ Aloud)పుస్తకాలు ఎలా ఉండాలి?…ఇలాంటి

2010-05-16

మడత పేజీ: ఏమిటీ శబ్దం ?

2010-05-16 02:06 AM Chandra Latha
టప్ టపా టప్! ఏమిటీ శబ్దం ? ఎలుగుబంటికి భయం వేసింది.జింక గడగడలాడింది.బ్రతుకు జీవుడా అని పరిగెత్తింది.చిరుతపులి కూడా ఆలస్యం చేయలేదు.సింహం గారు సరేసరి! "రండర్రా నేస్తాల్లారా !అసలీ టప్ టపా టప్! "ఏమిటో చూద్దాం.ఇంత మందిమి ఉన్నాం కదా,భయమెందుకు ?" అంది చీమ. * ఆ తరువాత ఏం జరిగింది? చిట్టిచీమతో అందరూ కలిసి వెళ్ళారా? వెళితే ఏమి చూశారు?ఛూసి ఏమి చేసారు? ఊహు ,నేనెందుకు చెబుతాను? మీరే చదవండి.ఈ బుజ్జి పుస్తకం

2009-07-26

పిట్ట కథలు - అభివృద్ధి కథలు: ఇంకొక ద్రిమ్మరి

2009-07-26 03:37 PM Narayana
ఒకసారి నాకు రోడ్డుమీద ఇంకో మనిషి కనబడ్డాడు-అతనుకూడా కొంచెం తిక్క మనిషిలాగానే ఉన్నాడు. అతను నాతో అన్నాడు:"నేనొక ద్రిమ్మరిని. చాలాసార్లు నాకు అనిపిస్తుంటుంది- 'నేను ఈ భూమిమీద పొట్టి పొట్టి మనుషులమధ్య తిరుగాడుతున్నాన'ని. మరి, అలా నాతల మిగిలినవాళ్ళ తలలకంటే భూమినుండి డెబ్భై క్యూబిట్లు దూరంగా ఉన్నది గనక, అది ఇంకొంచెం ఉన్నతమైన, స్వతంత్రమైన ఆలోచనల్ని ఉత్పత్తి చేస్తూంటుందేమో!""కానీ నిజానికి నేను మనుషుల

పిట్ట కథలు - అభివృద్ధి కథలు: ఇద్దరు వేటగాళ్లు

2009-07-26 02:31 PM Narayana
వసంత ఋతువులో ఒకనాడు సంతోషమూ, దు:ఖమూ ఒక చెరువు ఒడ్డున కూర్చుని ఉన్నాయి. నిశ్శబ్ద ప్రశాంతతలీనే నీళ్లకు దగ్గరగా చేరగిలపడి, అవి మాట్లాడుకుంటున్నాయి.ఈ భూమి మీద ఉన్న అందం గురించీ; అడవిలోనూ, కొండల్లోనూ ఉన్న అద్భుత జీవ సంపద గురించీ; ఉదయ సంధ్యలోను, సాయం సమయంలోనూ వినిపించే పాటల గురించీ మాట్లాడింది సంతోషం.అప్పుడు దు:ఖం మాట్లాడుతూ సంతోషం చెప్పిన వాటిని అన్నింటినీ అంగీకరించింది- ఎందుకంటే కాలపు మహిమా,

2007-11-13

Kids World ~ బాల ప్రపంచం: Kid Stories (English)

2007-11-13 10:18 AM హృదయ బృందావని
Pinocchio Pinocchio.mp3Jack and the BeanstalkJack and the Beans...Peter and the WolfPeter And The Wolf...Grimm's Fairy TaleGrimm's Fairy Tale...Green Eggs and HamGreen Eggs And Ham...Fox in the SocksFox in Socks.mp3

2007-08-29

Kids World ~ బాల ప్రపంచం: Kid Stories (English)

2007-08-29 02:00 AM హృదయ బృందావని
The Little MermaidThe Little Mermaid...The Jungle Book The Jungle Book.mp...The Three Billy Goats Gruff The Three Billy Go...The Rainbow Fish The Rainbow Fish.m...The Ugly DucklingThe Ugly Duckling....

2006-07-04

తెలుగులో బాల సాహిత్యం: తెలుగులో బాల సాహిత్యం

2006-07-04 05:28 AM బాల సాహిత్యం
తెలుగులో బాల సాహిత్యంఈ నా బ్లాగులో నెమ్మదిగా బాలల సాహిత్యానికి సంబంధించినవి అన్నీ సమకూరుద్దాము అని చిన్ని ప్రయత్నం మొదలు పెట్టాను
వ్యాఖ్యలు
2015-05-12
2015-05-12 08:40 AM shrilekha narendar - Comments for For Kids

Nice good story and we want such a moral stories.

2015-05-03
2015-05-03 04:17 PM satyanarayana s v - Comments for For Kids

Good moral story….
very good tactice to dealing atta

2015-05-01
2015-05-01 09:35 AM Mahaboobali - Comments for జాబిల్లి

Very thought provoking

2015-05-01 09:32 AM vennela - Comments for జాబిల్లి

maa rachanalanu mee website lo pettacha?
pettachu anukunte process vivarinchagalaru

2014-08-21
2014-08-21 09:05 AM mangu - పిట్ట కథలు
meeru mana mohana singh gaarini vuddesinchi ee katha ni post chesaaraa
2014-05-26
2014-05-26 07:23 AM Prabhava - Prabhava ప్రభవ
You can contact any of the numbers given there. Prabhava can also send you the copies. Contact person Sujatha 9652928084
email. prabhava.books@gmail.com
Thank you
2014-05-26 05:16 AM Komali - Prabhava ప్రభవ
ఈ పుస్తకాన్ని ఎలా తెప్పించుకోవాలో చెప్పగలరు
2014-04-16
2014-04-16 02:13 PM Hari Babu Suraneni - పిట్ట కథలు
>నేను మహా ప్రభువులకి మంత్రిని కాని వంకాయకి కాదు కదండీ
?ఇదీ అసలు పాయింటు, తెలివయిన వాడు!
2014-03-26
2014-03-26 04:19 PM SambaSivaRao Nulu - బాల కళ
రమేష్ బాబు గారు నమస్తే! మీ ఈ బాలకళ.. బ్లాగ్ చాలా బావుంది.. ప్రత్యేకముగా, మాస్టారు పులవర్తి కోర్నేలియస్గా గారి "మావూరు" కవిత చాలానచ్చింది..
2013-10-22
2013-10-22 12:02 PM venkata lakshmi narayana - Comments for తెలుగు మాటలు

చాలా మంచి ప్రయత్నం…అద్భుత ప్రక్రియ…పిల్లలతో పాటు పెద్దలనూ అలరిస్తుంది

2013-06-23
2013-06-23 12:26 AM లలిత (తెలుగు4కిడ్స్) - Comments for తెలుగు మాటలు

ధన్యవాదాలు :)

2012-07-12
2012-07-12 04:27 AM Kalasagar - బాల కళ
be come a good artist.
2010-12-28
2010-12-28 12:44 PM gosukonda sudhakar - బాల సాహిత్యం
మంత్ర శాస్త్రము ప్రకారము ఆంగ్లము:
http://donotkeepyourself.blogspot.com/
2010-12-28 12:38 PM gosukonda sudhakar - ఆహా! ఓహో!
మంత్ర శాస్త్రము ప్రకారము ఆంగ్లము:
http://donotkeepyourself.blogspot.com/
2010-12-17
2010-12-17 11:01 AM Venhu - ఆహా! ఓహో!
బావుంది. చిన్న పిల్లల కదే అయినప్పటికీ చెప్పిన విధానం బావుంది. నేనూ మల్లాది, మధుబాబు అభిమానినే.
2010-09-08
2010-09-08 02:05 PM Mr WordPress - mamcimaata పై వ్యాఖ్యలు

Hi, this is a comment.
To delete a comment, just log in, and view the posts’ comments, there you will have the option to edit or delete them.

2010-07-01
2010-07-01 03:13 PM venkat - Kids World ~ బాల ప్రపంచం
i need neethi for this.im working for my project on this story
2010-05-19
2010-05-19 03:22 AM AMMA ODI - బాల సాహిత్యం
కథ బాగుందండి.
2007-10-22
2007-10-22 04:23 AM Anonymous - Kids World ~ బాల ప్రపంచం
brundaavani garu i couldn't access your other blogs. i am regular visitor to those blogs. any tech. problem?
2007-05-29
2007-05-29 07:00 PM కొత్త పాళీ - పిల్లలు-బంధానికి అర్ధాలు
చాలా ముచ్చటగా ఉన్నారు. మా అందరి తరపునా కూడా ఇంత ఉప్పూ మిరపకాయలూ దిష్టి దిగతుడుచి పొయ్యండి. :-)
అషితి - ఇతిహాస్ .. కిరణ్ చెప్పినట్టు పాలిండ్రోం పేర్లు. వీళ్ళు కవలలా?
మీ బ్లాగు టైటిలుకూడా బాగుంది.
2007-05-16
2007-05-16 03:40 PM ahiri - తెలుగులో బాల సాహిత్యం
hello.
What happened to your blog?
Have you started writing yet.
Please do write
venkat
www.24fps.co.in
2006-11-28
2006-11-28 09:10 PM Ramanadha Reddy - తెలుగులో బాల సాహిత్యం
!!???
పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..