ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2014-11-27

అనువాదలహరి: అపేక్షించదగ్గవి … మాక్స్ ఎర్మాన్, అమెరికను

2014-11-27 07:26 PM NS Murty

ఆతృతా, రణగొణధ్వనులమధ్య శాంతంగా స్థిరంగా నడుచుకో; నిశ్శబ్దంలో ఎంత  ప్రశాంతత ఉందో గుర్తుంచుకో.  సాధ్యమైనంతవరకు, ఎవరికీ తలవంచకుండానే, మంచి అనుబంధాలు కలిగి ఉండు; నువ్వు సత్యాన్ని చెప్పేటప్పుడు స్పష్టంగా,  నెమ్మదిగా చెప్పు; అలాగే, ఇతరులు ఏది చెప్పినా శ్రద్ధగా విను, వాళ్లు ఎంత మొద్దులూ, మూర్ఖులూ ఐనా; ఎందుకంటే, ప్రతి వ్యక్తికీ ఒక కథ ఉంటుంది.

గట్టిగా అరిచి, దురుసుగా మాటాడే వాళ్ళని తప్పించుకు తిరుగు; వాళ్ళు నీ మనస్సుకి క్షోభ కలిగిస్తారు. ఇతరులతో అస్తమానం నిన్ను నువ్వు పోల్చుకుంటుంటే, నువ్వు జీవితం పట్ల నిరాశ పెంచుకోవడమో లేక అహంభావిగా మారడమో జరిగే అవకాశం ఉంది; ఎప్పుడూ నీకంటే తక్కువ వాళ్ళూ, ఎక్కువ వాళ్ళూ ఉంటూనే ఉంటారు;  నీ విజయాలను ఆస్వాదించడంతో బాటు, నీ ప్రణాళికలను కూడా ఆనందించు.

నువ్వు చేసే వృత్తి ఎంత చిన్నదైనా, దానిపట్ల సంతృప్తి కలిగి ఉండు.  అదృష్టాన్ని మార్చే కాలం చేసే అనేక లీలల్లో, అదే నీకు విలువైన ఆస్థిగా నిలబడుతుంది. నీ వ్యాపార విషయాల్లో తగినంత జాగ్రత్త వహించు; ఎందుకంటే ప్రపంచం మోసగాళ్ళ మయం. అంత మాత్రం చేత నువ్వు విలువైన వస్తువుల్ని గుర్తించడంలో గుడ్డివాడివి కాకు;  చాలా మంది మనుషులు ఉదాత్తమైన ఆదర్శాలకోసం పాటుపడుతుంటారు; నీ చుట్టూ జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన ధీరులున్నారు.

నువ్వు నువ్వుగా జీవించు. ముఖ్యంగా ప్రేమ నటించవద్దు. అలాగని ప్రేమ పట్ల నిరాశకూడా వద్దు; ఎందుకంటే, శుష్కించిపోయి, జీవితంపట్ల విరక్తి కలిగే సందర్భాల్లో అదొక్కటే పచ్చగడ్డిలా శాశ్వతంగా ఉంటుంది.

వృద్ధులు చెప్పిన మంచి సలహాలు విను;  వయసు చేసే పనులను వినమ్రంగా స్వీకరించు; అనుకోని దుర్ఘటనలు సంభవిస్తే నిన్ను నువ్వు రక్షించుకుందికి, మానసిక ధైర్యాన్ని అలవరచుకో. అలాగని, ఊహించుకుంటూ బాధపడకు. చాలా  భయాలు ఒంటరితనం వల్లా,  అలసట వల్లా కలుగుతుంటాయి. పరిపూర్ణమైన క్రమశిక్షణకు మించి, నీ పట్ల నువ్వు మెత్తగా ప్రవర్తించు.

నువ్వు ఈ విశ్వ శిశువువి, పరీవ్యాప్తమైన చెట్లూ, చుక్కలకంటే తక్కువేమీ కాదు; నీకు ఇక్కడ జీవించడానికి హక్కు ఉంది. నీకు అది అవగతం అవుతున్నా, లేకపోయినా, ఈ విశ్వం నిస్సందేహంగా తనను తాను ప్రకటించుకుంటూనే ఉంది

కనుక దేముడి విషయంలో ప్రశాంతంగా ఉండు. అతని గురించి నీ ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ, నీ ఆశలూ కష్టాలూ ఏవయినప్పటికీ, సందడిచేసే ఈ జీవితపు గందరగోళంలో,  నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఎంతగా కపటం నిండినా, చేసిన గొడ్డు చాకిరీయే చేస్తున్నా, కలలు తెగిపడినా, ఈ ప్రపంచం ఇంకా సుందరంగానే ఉంటుంది.

ఎప్పుడూ ఉల్లాసంగా ఉండు

హాయిగా ఉండడానికి ప్రయత్నించు.

.

మాక్స్ ఎర్మాన్

September 26, 1872 – September 9, 1945

అమెరికను

.

Max Ehrmann

.

Desiderata

 .

Go placidly amid the noise and haste, and remember what peace there may be in silence.

As far as possible without surrender be on good terms with all persons. Speak your truth quietly and clearly; and listen to others, even the dull and ignorant; they too have their story.

Avoid loud and aggressive persons, they are vexations to the spirit. If you compare yourself with others, you may become vain and bitter; for always there will be greater and lesser persons than yourself. Enjoy your achievements as well as your plans.

Keep interested in your career, however humble; it is a real possession in the changing fortunes of time. Exercise caution in your business affairs; for the world is full of trickery. But let this not blind you to what virtue there is; many persons strive for high ideals; and everywhere life is full of heroism.

Be yourself. Especially, do not feign affection. Neither be cynical about love; for in the face of all aridity and disenchantment it is as perennial as the grass.

Take kindly the counsel of the years, gracefully surrendering the things of youth. Nurture strength of spirit to shield you in sudden misfortune. But do not distress yourself with imaginings. Many fears are born of fatigue and loneliness. Beyond a wholesome discipline, be gentle with yourself.

You are a child of the universe, no less than the trees and the stars; you have a right to be here. And whether or not it is clear to you, no doubt the universe is unfolding as it should.

Therefore be at peace with God, whatever you conceive Him to be, and whatever your labours and aspirations, in the noisy confusion of life keep peace with your soul.

With all its sham, drudgery and broken dreams, it is still a beautiful world.

Be cheerful.

Strive to be happy.

.

Max Ehrmann

September 26, 1872 – September 9, 1945

American

 


Filed under: అనువాదాలు, కవితలు Tagged: 20th Century, American, Max Ehrmann

నువ్వుశెట్టి బ్రదర్స్: మనసు దోచుకున్న తెలుగు కీచకుడు

2014-11-27 05:09 PM నువ్వుశెట్టి బ్రదర్స్

Originally posted on నువ్వుశెట్టి బ్రదర్స్:

(కీచక వేషధారి శ్రీ పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు మరియు విరాటరాజు పాత్రధారి)

వసంత కాలం ఆరంభమైందంటే చాలు, కళలు పురివిప్పి నాట్యం చేస్తాయి అహ్మదాబాద్ లో. దక్షిణ భారతదేశం లో పుట్టి జగమంతా వ్యాప్తి చెందిన భరతనాట్యానికి గుజరాత్ లో జీవం పోసింది గురు శ్రీమతి ఇలాక్షి బెన్ ఠాకోర్. “నృత్యభారతి” సంస్థని 1960 లో స్థాపించి భరతనాట్యానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చి కొన్ని వందలమంది నృత్యకారుల్ని తయారుచేసింది . కళ కే అంకితమైన ఈ సంస్థను ఇప్పుడు పాత కొత్తల మేలి కలయికలతో, అనేక కొత్త నృత్యరీతులు కనుగొని సరికొత్త కోణాలను ఆవిష్కరించిన ఆమె కుమారుడు ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ మరియు నృత్యకారుడు శ్రీ చందన్ ఠాకూర్ సమర్ధవంతంగా నడిపిస్తున్నారు.

(గురు శ్రీ చందన్ ఠాకోర్)

ప్రతి సంవత్సరం వసంత కాలారంభంలో మూడు రోజులపాటు కనులవిందుగా జరిగే ఈ నృత్య కార్యక్రమాలకు మన దేశంలోని ఇతర నృత్యకారుల్ని సగౌరవంగా ఆహ్వానిస్తారు. ఇందులో భాగంగా ఈ సారి చెన్నై నుండి చిదంబరం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అధినేత శ్రీమతి చిత్రా విశ్వేశ్వరన్ మరియు ఆమె శిష్యురాళ్ళు, ఒరిస్సా , నృత్యాయన్ నుండి శ్రీ దుర్గా చరణ్ రణబీర్ మరియు వారి విద్యార్ధులు…..ఇక ఆడిటోరియం ని దద్దరిల్లజేసి, అందరి చేత ఔరా! అనిపించుకున్న శ్రీ బాల త్రిపుర సుందర కూచిపూడి నాట్య కళాక్షేత్రం, విజయవాడ నుండి గురు శ్రీ పసుమర్తి వెంకటేశ్వర…

View original 394 more words


Filed under: మనసులో మాట

తెలుగు తూలిక: వెనకటి నేను 2 – బాలతార (కథ)

2014-11-27 03:47 PM మాలతి
(42 ఏళ్ళ వెనక!) “ఏరోజు పేపరు చూసినా చచ్చిపోయినవాళ్ళూ, తప్పిపోయినవాళ్ళూ, ఏక్సిడంట్లూ, ఎడ్వర్టైజుమెంట్లూను,” రామకృష్ణ విసుగ్గా పేపరు కింద పడేశాడు. అసలు పేపరు మధ్యాహ్నంపూట రావడంవల్లనే నాకు సగం చచ్చిపోయింది పేపరు చూడాలన్న కోరిక ఆనందపురం వచ్చేక. కాకపోతే ఏ రోజుకారోజు ఇంకొక్క ఇరవై రోజులు, ఇంకొక్క పందొమ్మిది రోజులు – ఇంతకీ ఇక్కడికి వచ్చింది

2014-11-26

అనువాదలహరి: స్వరకర్త… W H ఆడెన్, అమెరికను కవి

2014-11-26 07:00 PM NS Murty

మిగతావాళ్ళందరూ అనువదిస్తారు: ఒక చిత్రకారుడు
దృశ్యమానప్రపంచాన్ని అంగీకరించినా, తృణీకరించినా;
తనజీవితంలోకితొంగిచూచి, మధించి వెలికి తీస్తాడు ప్రతిబింబాలని
ఒక కవి …వాటితో మమేకమవడానికో, విభేదించడానికో;
జీవితం నుండి కళ … అతి కష్టమైన అనుకరణ
మధ్యనున్న ఖాళీలను పూరించడానికి మనమీద ఆధారపడుతూ;
కేవలం నీ స్వరాలొక్కటే అచ్చమైన సహజ సృష్టి,
నీ పాట ఒక్కటే అపురూపమైన కానుక;
ఓ ఆనందమా! నీ సన్నిధిని మాకు కలుగజెయ్యి,
సాష్టాంగపడేలా పులకరింతలు కలుగజెయ్యి,
మా మౌనాలపై, సందేహాలపై దాడిచెయ్యి;
ఓ అజ్ఞాత గీతికా! నువ్వు, నువ్వొక్కతెవే
ఈ మా ఉనికిని తప్పు పట్టకుండా ఉన్నది;
నీ క్షమని కాదంబరిలా మాకు అనుగ్రహించు.
.
W H ఆడెన్
21 ఫిబ్రవరి – 1907 – 29 సెప్టెంబరు 1973
అమెరికను కవి.

.

The Composer

.

All the others translate: the painter sketches

A visible world to love or reject;

Rummaging into his living, the poet fetches

The images out that hurt and connect.

From Life to Art by painstaking adaption

Relying on us to cover the rift;

Only your notes are pure contraption,

Only your song is an absolute gift.

 

Pour out your presence, O delight, cascading

The falls of the knee and the weirs of the spine,

Our climate of silence and doubt invading;

You, alone, alone, O imaginary song,

Are unable to say an existence is wrong,

And pour out your forgiveness like a wine.

.

W H Auden

21 February 1907 – 29 September 1973

American Poet


Filed under: అనువాదాలు, కవితలు Tagged: 20th Century, English Poet, WH Auden

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఇంతదూరం నడిచి వచ్చాక - 8

2014-11-26 06:13 PM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
~*~ ఏకాంతం అనుకుని ఎవ్వరు సడిచెయ్యని చోటొకటి వెదుక్కొనికూర్చొనిగతం వర్తమానలాల మధ్య చిక్కుకుపోయినమాయాజాలాన్ని విదిలించుకొని రావడం కష్టమే కావచ్చు ** కాలానికి వేసిన గాలపు ఎరను కదుపుతున్నట్లుఆకుల మధ్య గాలి కదులుతుంటుంది కంటికికన్పడని చేపకోసంమనసు మున్కలువేస్తుంది ** చిరునవ్వు పులుముకున్న బాల్యమిత్రులుఅవసారాలనవ్వును అతికించుకున్న సహోద్యోగులుఎదురెదురుగా కళ్ళెదుట వెళ్ళిపోతుంటారు

2014-11-25

సాహితీ-యానం: ఇస్మాయిల్ గారి గురించి మరోసారి.....

2014-11-25 01:43 PM బొల్లోజు బాబా (noreply@blogger.com)
ఈ రోజు ప్రముఖ కవి ఇస్మాయిల్ గారి 11 వ వర్ధంతి.  ఆ సందర్భం గా ఆయన గురించి ఇదివరలో వ్రాసిన ఒక వ్యాసం మరలా ............ భవదీయుడు బొల్లోజు బాబా ఇస్మాయిల్  కవిత్వం,  కాసిన్ని జ్ఞాపకాలు, కొన్ని ఫొటోలు అప్పుడు నేను పి.జి. విద్యార్ధిని.  కవిత్వం అంటే తిలక్, ఇస్మాయిల్, శిఖామణి, చలం అని అనుకొనే రోజులవి. అప్పటికి అచ్చయిన నా కొన్ని కవితలను ఇస్మాయిల్ గారికి చూపించాలని

2014-11-24

తెలుగు తూలిక: వెనకటి నేను! – ప్రతి ధ్వనులుసంకలనంమీద సమీక్ష

2014-11-24 06:54 PM మాలతి
వెనకటి నేను! - ఈ శీర్షికలో నేను గతంలో రాసిన కొన్ని – ప్రచురించనవీ, ప్రచురించినా పదిమంది కళ్ళా పడనివి – మళ్ళీ ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. వాటిమీద ఈనాటి నావ్యాఖ్యలు చేరుస్తాను అవసరమనుకున్నచోట. వెనకటి టపాలో ప్రస్తావించిన “కథానిలయం నాకు చేసినమేలు” కోవలోకే వస్తుంది ఇది. వారి సైటు చూసినప్పుడు నా ఉత్సాహం ఇనుమడించింది. అక్కడ

నువ్వుశెట్టి బ్రదర్స్: “రాజకీయభేతాళం”

2014-11-24 04:54 PM నువ్వుశెట్టి బ్రదర్స్

Originally posted on నువ్వుశెట్టి బ్రదర్స్:

bhetaalam

                       పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజానవేసుకుని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, “రాజా, ఇంత అర్ధరాత్రి వేళ విశ్రాంతి, నిద్రా సుఖాలకు దూరమై, గుడ్ల గూబలూ ,విషసర్పాలు, ఆకలిగొన్న నక్కలూ తిరుగాడే ఈ శ్మశానంలో నువ్వుపడుతున్న శ్రమ అర్ధహీనంగా తోస్తున్నది. నీ జీవితాశయం, ధ్యేయము ఏమిటి? గొప్ప కీర్తి సంపాదించాలనా? లేక అంతులేని సంపదా, లేక ఇంకా ఉన్నతమైన పదవా? ఎందుకంటే ఉన్నత పదవులలో ఉన్న మనిషి ఆవేశాలకూ, ఉద్వేగాలకూ లొంగకుండా సరైన నిర్ణయాలు తీసు కోగలిగినప్పుడే తన పదవికి, సమాజానికి న్యాయంచేయగలడు.
రాజుకి రాజనీతి విషయాలలో సలహాలిచ్చేందుకు మంత్రులూ, యుద్దవ్యూహాలలో తోడ్పడేటందుకు సేనాపతులూ, ఐహిక ఆధ్యాత్మిక చింతనాపరంగా కలిగే సంశయాలను తీర్చేందుకు పండితులూ ఉంటారు , నీ ఆస్థానములో అలాంటి వారికి కొదువవుండదని భావిస్తున్నాను. కాని వారి లో కొందరు ఒక్కొక్కసారి స్వార్ధం కొద్దిగాని, లేక హేతు,ఆచార విరుద్దమైన సమస్యను ఏదోవిధంగా పరిష్కరించి తృప్తి పడదామన్న తాపత్రయం కొద్దీ గానీ చిత్రమైన ఆలోచనలు చేస్తారు అలాంటివారి సలహాలు విని నిర్ణయాలు తీసుకుంటే తరువాత ఇరువైపులా న్యాయం చేయలేక  మౌనమోహనుడిలా మౌనాన్నే ఆశ్రయించక తప్పదు. నీకు ముందే హెచ్చరికగా ఉండేందుకు ఆయన కధ చెబుతాను, శ్రమ తెలియకుండా విను,” అంటూ ఇలా చెప్పసాగాడు.

ఫాటలి పుత్రా న్ని మౌనమోహనుడు…

View original 361 more words


Filed under: మనసులో మాట

మడత పేజీ: నాన్నకు కొత్త చూపు

2014-11-24 04:34 PM Chandra Latha (noreply@blogger.com)
Sri GuruBabu and Aruna GoginEni, Dr.indumathi Parikh, me and KotapaTi Murahari Rao garu ( father) 1998,January, IHEU International conference,Bombay. ఏ దానం గురించైనా మాట్లాడానికైనా, ఆట్టే సంశయాలు ఎదురురావు. ఎందుకంటే , వాటికి సంబంధించిన సామాజిక వాతావరణం మన చుట్టూ ఆవరించుకొని  ఉంటుంది. ఆయా సంస్కృతులు సమాజాలు ... ఏ యే దానాలు ఎలా చేయాలో, ఏ దానాల వలన ఏ యే పుణ్యలోకాలకు చేరుస్తాయో కూడా సవివరంగా

మడత పేజీ: జేజేలు..!

2014-11-24 02:32 AM Chandra Latha (noreply@blogger.com)
అవి శ్రీలక్ష్మి ఆయేషా ఉదంతాల రోజులు. ఆడపిల్లలు వంటరిగా పట్నమెళ్ళి చదువుకోవాలంటే , ఎక్కడ చూసినా ఒక అభద్ర భావన.  పల్లెల గడపల్లోంచి పట్నానికి చదువులకోసం వచ్చే ఆడపిల్లలకు  ఒక సురక్షితమైన ఆవాసం ఉండాలనీ.. ఒక అమ్మాయి చదువు,వృత్తి నైపుణ్యము ,ఆ కుటుంబానికంతా ఆసరా అవుంతుందనీ.. ఆయన చాలా స్పష్టంగా నమ్మారు. తనకు తోచినంతలో కళాశాల విద్యార్ధునిలకు ఒక వసతిగృహం ఏర్పాటులో చాలా కృషి చేశారు. డా. కాసరనేని జయప్రదాంబ

2014-11-23

అక్షర శిక్షలు!: నీ కనులు కదలాడితే…

2014-11-23 04:20 AM K.S.M.Phanindra

ఎప్పుడో పెళ్ళికి ముందు బ్రహ్మచారి జీవితంలో రాసుకున్న ఓ (కల్పితమైన) ప్రేమ కవిత!

నీ కనులు కదలాడితే
ఏ వెన్నెల తునకలో ఎదలో అక్షరాలై జాలువారి
కవితగా పొంగి పొరలాయి కానీ
నాకు కవితలొచ్చా చెప్పు?

నువ్వు నవ్వు రువ్వితే
ఏ హాయి తెమ్మెరో చైత్ర గీతమై తాకి
మనసు కోయిల గొంతు విప్పింది కానీ
నాకు పాటలొచ్చా చెప్పు?

నీ సొగసు కళలే
కుంచెలై ఎదలో చెరగని రేఖలే చిత్రించి
కనులకి తెలియని కలలనద్దాయికానీ
నాకు కలలు తెలుసా చెప్పు?

నిన్ను అలా చూస్తుంటే
మథుర భావాలెన్నోచిరు అలలై నను తాకి
నావలా నన్ను ఊయలూపాయి కానీ
నాకు నాట్యమొచ్చా చెప్పు?


Filed under: వచనాలు

"తెర"చాటు చందమామ: కన్నానులే, కలయికలు ఏనాడు ఆగవులే!

2014-11-23 01:44 AM K.S.M.Phanindra

రెహ్మాన్ పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన పాట “బొంబాయి” చిత్రంలోని “కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే అన్నది. నా దృష్టిలో ఇది వేటూరి రాసిన గొప్ప పాటల్లో ఒకటి. కానీ చిత్రంగా ఈ పాట సాహిత్యం చాలా అపార్థాలకి దారితీసింది. ఓ మూడు సంఘటనలు చెప్తాను. 

  1. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా కాలేజీ ఫంక్షన్‌లో ఓ అమ్మాయి ఈ పాట తమిళ్‌లో పాడుతూ ఉంటే నా వెనుక కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ళు ఆ అమ్మాయి గురించి కామెంట్ వేస్తూ చులకనగా అన్న మాటలు –  “తెలుగులో పాడితే పాటలోని బూతులు తెలిసిపోతాయని తమిళ్‌లో పాడుతోందిరా!”. సినిమాలో కొత్తగా పెళ్ళైన స్నేహితురాలిని సరసంగా ఆటపట్టిస్తూ అమ్మాయిలు పాడే లైన్లు ఈ పాటకి కోరస్‌గా వస్తాయి. “మామకొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో!” వంటి వాక్యాల వల్ల కాబోలు ఇది “బూతు పాట” గా తీర్మానించారు నా వెనుకసీటు అబ్బాయిలు! ఇది పూర్తిగా తప్పు! నిజానికి పాటలోని అంశానికీ ఈ కోరస్‌కి సంబంధం లేదు. అందుకే ప్రస్తుత వ్యాసంలో కోరస్ ని చర్చించకుండా వదిలేస్తున్నాను.
  2. కోరస్ శృంగారపరంగా ఉంది కాబట్టి పాట కూడా శృంగార గీతమే అని చాలామంది పొరబడతారు. నేను చెన్నై I.I.T.లో చదివే రోజుల్లో ఏటా జరిగే సంగీత ఉత్సవం “సారంగ్” లో ఒక అమ్మాయి ఈ పాటని తమిళ్‌లో చాలా ఫీల్ అయ్యి హావభావాలతో శృంగార తాదాత్మ్యంతో పాడింది. సాహిత్యంలో కొన్ని వాక్యాలు శృంగారంతో ఉండడం వల్ల కాబోలు ఆ అమ్మాయి ఈ పాటని శృంగార గీతం అనుకుంది. కానీ నా దృష్టిలో ఇది శృంగార గీతం కాదు. ఒక ముస్లిం అమ్మాయి, ఒక హిందూ అబ్బాయిపై పడ్డప్పుడు తనలో తాను ఎదుర్కొనే సంఘర్షణ ఈ పాట. సామాజిక కట్టుబాట్లకి తలొగ్గాలా, ప్రేమ వైపు ఒగ్గాలా అన్న ఆలోచన సరదా విషయం కాదు, తీవ్రమైనది. ప్రేమలో పడిన ఆ అమ్మాయి తనని తాను అద్దంలో చూసుకుంటూ తనలోని భావాలన్నిటినీ (ప్రేమా, శృంగారం, విరహం, శోకం వగైరా) నిజాయితీగా పరామర్శించుకునే సీరియస్ పాట ఇది! అందుకే గాయని చిత్ర ఈ పాటలోని “జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం” అని పాడేటప్పుడు నవ్వే నవ్వు రసభంగంగా అనిపిస్తుంది నాకు!
  3. చాలా రోజుల వరకూ నాకీ పాటలోని కొన్ని లైన్లు అర్థమయ్యేవి కావు. ఓ రోజు “పాడుతా తీయగా” చూస్తుంటే ఎవరో ఈ పాట పాడారు. SPB ఈ పాట సాహిత్యం గురించి వివరిస్తాడేమో అని నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాను. తీరా చూస్తే SPB, “ఏమిటో! వేటూరి ఇష్టం వచ్చినట్టు పదాలు కూర్చేశాడు. నాకో ముక్క అర్థం కాలేదు!” అని తేల్చేశాడు! వేటూరి అర్థంపర్థం లేని పాటలు రాసిన మాట నిజమే కానీ మంచి సంగీతం, సందర్భం కుదిరినప్పుడు మనకి అర్థం కాకపోయినా ఆయన అర్థవంతంగానే రాస్తాడు అని నా నమ్మకం. కొంచెం పరిశ్రమిస్తే ఈ పాట నాకు బాగానే అర్థమైంది. చాలా గొప్పగా ఉందనిపించింది. నాకు అర్థమైనది మీతో పంచుకోవాలనే ఈ వ్యాసం!

 పల్లవిలోనే కనిపించే కవిత్వం, పాటంతా తర్వాత దట్టంగా పరుచుకుంటుంది - 

కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే

నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే

అందాల వయసేదొ తెలితామరై, విరబూసె వలపేదో నాలో

నీ పేరు నా పేరు తెలుసా మరీ, హృదయాల కథ మారె నీలో

వలపందుకే కలిపేనులే, ఒడిచేరె వయసెన్నడో

 

ఈ ప్రేమ “తొలిచూపు ప్రేమ”, హృదయాలను సూటిగా తాకిన ప్రేమ. అందుకే “తొలిచూపు కలయికలు” అంతటితో ఆగిపోవు అంటోంది. ఆ అబ్బాయికి తనపైగల ఆరాధన అమ్మాయికి చెప్పకనే తెలిసిపోయింది! మగవాడి కళ్ళలోని భావాలని (నీ కళ్ళలో పలికినవి…) ఆడవాళ్ళు ఇట్టే పసిగట్టగలుగుతారు – అది ప్రేమ అయినా, కాంక్ష అయినా! కాబట్టి ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు. తెల్లని తామరలా విరిసిన ఆమె వయసుకి సుగంధంలా దరిచేరిందీ ప్రేమ! ఎవరెవరో తెలియకపోయినా అతని హృదయం గల్లంతైంది! ఊరూ, పేరూ, వివరాలు తెలుసుకుని ప్రేమించేది ప్రేమవ్వదు! వయసు వచ్చి చేరాకా, వలపు గుండె తట్టాకా, ఝల్లుమనని జన్మ ఉంటుందా? 

ఉరికే కసివయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం

జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం

అందం తొలికెరటం; చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె

చిత్తం చిరుదీపం; రెపరెప రూపం తుళ్ళి పడసాగె

పసి చినుకే ఇగురు సుమా, మూగిరేగే దావాగ్ని పుడితే

మూగె నా గుండెలో నీలి మంట 

ఉరికే వయసుని ప్రేమ చల్లగా తాకింది. కానీ దాని వల్ల కుదురు రాకపోగా తడబాటు పెరిగింది. ఏదో కొత్త ధైర్యం కూడా వచ్చింది. అందుకే ప్రాయం కోసం, ప్రణయం కోసం పరదాని కొంచెం పక్కకి జరిపే చొరవొచ్చి చేరింది. “అందం తడబడింది” అన్న అందమైన ప్రయోగం వేటూరిలోని కవిని చూపెడుతోంది. అమ్మాయి పెరిగిన మహమ్మదీయ వాతావరణాన్ని సూచించడానికి “పరదా” అని వాడాడు. 

ప్రేమలో పడ్డాక, అందం తొలికెరటమై ఉప్పొంగింది. తీయని ఊహల్లో తుళ్ళే మనసు ఆ కెరటానికి నీటి మెరుపులా అమరింది! ఎంత అందమైన ఊహ! అయితే వాస్తవంలోకి వస్తే ఈ ప్రేమ ఫలించడం ఎంత కష్టమో తెలిసి అదే మనసు సంఘర్షణకి గురౌతోంది.  అది ఎలా ఉందంటే గాలికి రెపరెపలాడుతున్న దీపం లాగ! ఇలా మనసు ఊగిసలాటని పాజిటివ్‌గా నెగిటివ్‌గా రెండు అద్భుతమైన ఉపమానాలతో చెప్పాడు. వెంటనే ఇంకో అందమైన ఉపమానం – గుండెలో నీలిమంట మూగిందట, తానొక పసిచినుకట, ఆ నీలిమంట దావాగ్నిలా మారితే ఆ పసిచినుకు గతేం కానూ? అని ప్రశ్న. ఇక్కడ మంట శృంగారపరమైన ప్రతీక కావొచ్చు, లేదా వేదనా/సంఘర్షణా కావొచ్చు. “మూగె నా గుండెలో నీలిమంట..” అని అర్థోక్తిలో వదిలెయ్యడం మంచి ఫీల్ ఇచ్చింది. ఈ మూడు ఉపమానాలనీ మనం ఇంకొన్ని విధాలుగా కూడా అన్వయించుకోవచ్చు, అదే ఇక్కడి అందం. 

శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలూగింది నీలో

తొలిపొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో

ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారె రేయల్లే

ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే

ఇది నిజమా కల నిజమా, గిల్లుకున్న జన్మనడిగా

నీ నమాజుల్లో ఓనమాలు మరిచా 

మొదటి చరణంలో ఆ అమ్మాయి తన అనుభూతినీ, పరిస్థితినీ వివరిస్తే రెండో చరణంలో “ఎందుకు ఇలా అయ్యింది”, “ఇప్పుడేం చెయ్యాలి” అన్న ఆలోచన కనిపిస్తుంది. ప్రేమ భావం ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది అంటే – వయసు ప్రభావం అని సమాధానం! వయసు మాయలాడి, జగత్కిలాడి! అది అబ్బాయిని శ్రుతి మించి ఉయ్యాలలూగిస్తే, అమ్మాయిని గిలిగింతలు పెట్టి తాపాన్ని ఎగదోస్తోంది! ఈ తీయని ఊహల మైమరపులో, పగలు కూడా రేయిలా మారుతోందట. “తెల్లారె రేయల్లే” అన్న ప్రయోగం ఎంత చక్కగా ఉందో! అదే సమయంలో ఒకవేళ వియోగమే వస్తే బ్రతుకు విఫలమే కదా అన్న స్పృహ కలుగుతోంది. దీనిని “ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరవ్వడం” అన్నాడు! ఎంత కవిత్వం అండి. ప్రస్తుత మాధుర్యం పూలలో తేనె అయితే ప్రేమ వైఫల్యం రాలే పూల కన్నీరే కదా! “ఎర్రమల్లెలు” అంటే “ఎరుపు రంగులో ఉన్న ఓ రకం మల్లెలు” అన్న అర్థం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ “ఎరుపు” ని రక్తం/వేదనకీ లేక సిగ్గు/శృంగారానికి సూచికగా వాడినట్టు అనిపిస్తోంది. వేటూరి పాటల్లో తవ్వుకున్న వారికి తగినంత నీరు!

పాటని ముగించే ఆఖరి లైన్లు నాకు చాలా ఇష్టం. తరచి చూస్తే ఇదంతా కలా నిజమా అని ఆ అమ్మాయికి అనిపిస్తోంది. లేకపోతే తానేమిటి ఇలా అయిపోవడం ఏమిటి? ఈ ప్రేమని జయించి తీరకపోతే బ్రతుకు వృథా అనిపించేంత మాయ ఎలా జరిగింది? స్పృహలో ఉన్నామా కలలో ఉన్నామా తేల్చుకోడానికి చేతిని గిల్లి చూసుకుంటాం. అయితే ఆ అమ్మాయి తన బ్రతుకుని గిల్లి అడిగిందట! “గిల్లుకున్న జన్మనడిగా” – ఎంత అద్భుతమైన ప్రయోగం! ఇంకా ఈ తీయని ఊహల మైమరపులో భాషనే మరిచిపోయిందిట! ఈ భావాన్ని కూడా ఎంత అద్భుతంగా చెప్పాడండి – “నీ నమాజుల్లో ఓనమాలు మరిచా”. “నమాజు” అనడం ద్వారా అమ్మాయి ముస్లిం అన్న విషయం గుర్తు చేస్తూ, తనది కేవలం తీయని ఊహ కాదు, ఓ ఆరాధన, ఓ ప్రార్థన అని తెలియజేస్తున్నాడు! ఓనమాలు – అంటే అక్షరాలు అనే కాదు, “ఓం నమః” ని గుర్తుచెయ్యడం ద్వారా అబ్బాయి హైందత్వాన్ని కూడా స్ఫురింపజెయ్యడం. అంటే ఈ మతాల వైషమ్యాలు మరిచి, ఈ అడ్డుగోడలు దాటి ప్రేమని సాధించుకుందాం అని చెప్పడం! ఈ రెండు వాక్యాలకీ వేటూరికి దణ్ణం పెట్టొచ్చు అనిపిస్తుంది నాకు!

ఒక్కసారి ఈ పాటలో వాడిన ఉపమానాలు, పదచిత్రాలు అన్నీ ఊహించుకుంటూ ఈ పాట సాహిత్యాన్ని మళ్ళీ చదవండి. ఎంత గొప్ప సాహిత్యమో తెలుస్తుంది. నిజానికి ఇది డబ్బింగ్ పాట. తమిళ కవి వైరముత్తుకి కొంత క్రెడిట్ దక్కాలి. అయితే పాట తమిళ సాహిత్య అనువాదం చూస్తే వేటూరి తనదైన ఊపమానాలు, ప్రయోగాలు చేస్తూ అనుసృజన చేసాడు కానీ, అనువాదం చెయ్యలేదని తెలుస్తుంది. పైగా డబ్బింగ్ పాటల్లో సైతం చక్కని భాషా, చిక్కని కవిత్వం పలికించడం వేటూరికే తెలిసిన విద్య! వేటూరి గొప్ప డబ్బింగ్ పాటల రచయిత కాకపోవచ్చు కానీ, డబ్బింగ్ పాటలకి కూడా గొప్పతనం దక్కేలా చాలా మంచి రచనలు చేసాడనడానికి ఈ పాటే ఉదాహరణ!

(తొలి ప్రచురణ వేటూరి వెబ్సైటులో)


2014-11-22

మడత పేజీ: పొద్దొడ్డుకు జేరినమంటే..!!!

2014-11-22 03:42 AM Chandra Latha (noreply@blogger.com)
" మాయమై పోతున్నడమ్మా..   మనిషన్నవాడు...   ఓ చెల్లీ చెందురమ్మా..." maayapOtunnaDammaa.. O chellee chendurammaa..Andesri @ Balotsav 2014 PC" Amarendra Dasari garu.  "  కలతల్ల  కదుముల్ల   కల్లోల బతుకుల్ల ..  కడమారి చితులల్ల  కటికబారిన  వెతలల్ల..,  ఇగ్గులాడి.....ఈదులాడి పొద్దొడ్డుకు  జేరినమంటే, పక పక నవ్వినమంటే...                                 ఇంతన్నా

2014-11-20

హసీనా: హసీనా

2014-11-20 03:23 AM హసీనా (దీర్ఘ కవిత) (noreply@blogger.com)
1 రాయాలని కలం పట్టగానే రాణి ఈగను మోసుకొచ్చిన తేనెటీగల్లా ముసిరే ఆలోచనలు కాస్త కళ్ళుమూస్తే ఓ అస్పష్టపు రూపం పదే పదే మనసు మానిటర్ పై కదుల్తూ వెంటాడుతోంది ఆ రూపం ఎప్పుడూ పోరాడుతూ మాట్లాడుతోది, ఏడ్పిస్తోంది 2 కీచకుల చూపులమద్య ఒంటరి యోద్ధ గాలికి ఎగిరే కాగితపుముక్కల్లా మాటల కసువులను వూడుస్తూ, వూడుస్తూ బరువెక్కిన చీపురులా మూలచేరి, మునగదీసుకొని గాయాల గురుతులను లవణజలంతో

2014-11-18

సురుచి: శ్రీమతి&శ్రీ ఎస్.ఎస్. ప్రసాద్ విద్యా సాంస్కృతి క సంస్థ

2014-11-18 05:36 PM జ్ఞాన ప్రసూన (noreply@blogger.com)
శ్రీమతి&శ్రీ ఎస్.ఎస్. ప్రసాద్ విద్యా సాంస్కృతి క సంస్థ                      ఒక ఆశయం మనిషి జీవితంలో   వెలుగును తెస్తుంది.కళారాధనకు కాసులు గ్రుమ్మరించ నక్కరలేదు,కాసులు ప్రోగుచేయనక్కర లేదు. సహృదయుల్ని నలుగుర్ని   ఆహ్వానించి సంతోషంగా ,సరదాగా కళామ తల్లికి సేవ చేయవచ్చు. కళాకారుల్ని గుర్తించి ప్రోత్స హిస్తే చాలు వారికి ఎనలేని బలం వస్తుంది.ఇటువంటి ఆశయం తోనే శింగరాజు ప్రసాదు,వారి శ్రీమతి విజయలక్ష్మి

సాహితీ-యానం: సారస్వత మేరువు శ్రీ ఆవంత్స సోమసుందర్

2014-11-18 04:07 PM బొల్లోజు బాబా (noreply@blogger.com)
ఆరున్నర దశాబ్దాలుగా సాహితీ వ్యాసంగం చేస్తున్నశ్రీ సోమసుందర్ గారు నిత్యయవ్వనుడు, నిత్యోత్సాహి. తెలుగు సాహిత్యక్షేత్రంలో కురువృద్దుడు. వయసు 90 వసంతాలు దాటినప్పటికీ ఇప్పటికీ కవిత్వాన్ని తన ఉఛ్వాస నిశ్వాసాలుగా వెలువరిస్తున్న గొప్ప కవి, విమర్శకుడు శ్రీ సోమసుందర్ గారు. శ్రీ సోమసుందర్ గారు కవిగా, కధకుడిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న రూపాలతోగత 66 సంత్సరాలుగా సాహితీ సేవ చేయుచున్నారు.

2014-11-16

సాహితీ-యానం: (శీర్షిక లేదు)

2014-11-16 09:28 AM బొల్లోజు బాబా (noreply@blogger.com)
అందరూఉత్తపేర్లేనటఅనాచ్ఛాదిత ఆత్మలుబయటపడేలాఈ పేర్లనుబండకేసి తోమాలి బొల్లోజు బాబా

2014-11-15

సాహితీ-యానం: 1816 నాటి తెలుగు సమాజం - రంగుల చిత్రాలలో

2014-11-15 03:04 AM బొల్లోజు బాబా (noreply@blogger.com)
రవివర్మ కు ముందు హిందూ దేవతల చిత్రాలు ఎలా ఉండేవో అంటూ ఎక్కడో చర్చ జరిగింది. 1816 లో M.Leger, Jean Amable అనే ఫ్రెంచి దేశస్థులు వేసిన కొన్ని చిత్రాల లింకు ఇది. ఇందులో మహిషాసురమర్ధిని, భక్తకన్నప్ప, వివిధ కులవృత్తులు, సారాతయారీ, పైపుతాగుతూ రాట్నం వడికే స్త్రీ, కసరత్తులు చేస్తున్న స్త్రీ, పురుషులు వంటి చిత్రాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇవి తెలుగునాట చిత్రించబడటం మరో విశేషం. ఒకరకంగా టైమ్ మెషిన్ లో

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): చాట్

2014-11-15 02:52 AM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
~*~ జీవనం నిత్య నడక, పరుగులు ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి ప్రాధాన్యత ఆసక్తిని తొక్కిపడుతుంది ఒక్కోసారి మరుగైపోతుంది ** ఏది కవిత్వం ఏది జీవితం ఏది ప్రాధాన్యత ** ఒక సంభాషణ నాతో నేను నీతో నేను అందరితో నేను ** పని ప్రతిఫలానిస్తుంది సంభాషణేమిస్తుంది ఎప్పుడైనా ఒక్కసారి సంభాషించి చూడు నడకలో ఎక్కడొకచోట ఊతమిస్తుంది కన్రెప్పమూసి కళ్ళలోనే ఆలింగనంచేసుకో ఏదీ ఎక్కడికీ పారిపోదు సుమా! ---- Radhi

2014-11-14

సాహితీ-యానం: చదువులు

2014-11-14 03:21 AM బొల్లోజు బాబా (noreply@blogger.com)
స్వచ్ఛమైన సెలయేరు పొర్లుతూ దొర్లుతూ నదిని చేరేసరికి నిలువెల్లా మురికి మురికి బొల్లోజు బాబా

2014-11-09

Telugu Anuvadam | తెలుగు అనువాదం: గ్రామసీమల్లో మంత్రిగారి పాదయాత్ర

2014-11-09 02:23 AM Soma Sankar

నా 101వ అనువాద కథ – “గ్రామసీమల్లో మంత్రిగారి పాదయాత్ర” – ఈ రోజు (9 నవంబర్ 2014) ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది.
నేపాల్‌లో ఊళ్ళూనుకుంటున్న రాజకీయ అవినీతిని గురించి వ్యంగ్యంగా చెప్పిన కథ ఇది. రాజకీయ నాయకులు తమ పొరపాట్లను సైతం ఘనకార్యలుగా మార్చి ఎలా ప్రచారం చేసుకుంటారో చెబుతుందీ కథ. ప్రజలకి ఏవో తాయిలాలిచ్చి, అసలు సిసలైన ప్రయోజనాలను తామెలా పొందుతారో ఈ కథ ప్రస్తావిస్తుంది.
మూలకథని నేపాలీ భాషలో నయన్‍రాజ్ పాండే “చాక్లెట్” అనే పేరుతో రాయగా, ప్రసిద్ధ నేపాలీ జర్నలిస్ట్ వీణా పున్ “కాండీ” అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఆంగ్ల అనువాదం సుప్రసిద్ధ వెబ్‌జైన్ www.wordswithoutborders.org లో సెప్టెంబర్ 2014 సంచికలో ప్రచురితమైంది. ఆంగ్ల అనువాదాన్ని ఈ లింక్ లో చదవచ్చు http://wordswithoutborders.org/article/candy
తెలుగు అనువాదాన్ని ఈ లింక్‌లలో చదవండి.

http://epaper.prajasakti.com/371025/Sopathi/Sopathi#page/10/1

http://epaper.prajasakti.com/371025/Sopathi/Sopathi#page/11/1

2014-11-08

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఒక ఊహ

2014-11-08 12:05 PM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
లేఖినిని ఆవిష్కరించినదెవరో నాలో ఒక ఊహ స్పురించగానే సర్రున ఎక్కడెక్కడో ప్రాకి   చేతివేళ్ళలో చేరగానే ఒక్కొక్క అక్షరం ఒకదానితో ఒకటి పేర్చబడుతుంది కవితై మీముందు నిలుస్తుంది ...

ఇంద్రధనుస్సు: వీచిక - 6

2014-11-08 10:11 AM రవి (noreply@blogger.com)
అపశంకమంకపరివర్తనోచితాశ్చలితాః పురః పతిముపైతుమాత్మజాః |అనురోదతీవ కరుణేన పత్రిణాం విరుతేన వత్సలతయైష నిమ్నగాః || (శిశుపాలవధము - నాలుగవ సర్గ - 47) అపశంకం = నిశ్చింతగా, అంకపరివర్తనోచితాః = సహజముగ నొడిని తిరుగాడెడు, ఆత్మజాః = బిడ్డలు పురః = ఇప్పుడు, పతిముపైతుం = మగని చేరుటకునై, చలితాః = వెడలినవి (కాగా), కరుణేన = దుఃఖముతో, అనురోదతీ ఇవ = శోకించుచున్నట్టుగా , పత్రిణాం = పక్షుల, విరుతేన = కూజితములతో,

2014-11-07

సురుచి: . సింధూరం చెట్టు

2014-11-07 11:04 AM జ్ఞాన ప్రసూన (noreply@blogger.com)
మొన్న   మా బంధువులింటికి   వెళ్లి   వస్తు   వాకిట్లో    అటు ఇటు చూస్తె  ఒక చెట్టుకి    స్ట్రా బెర్రీస్    లాంటి ఎర్రటి   కాయలు   గుత్తులు గుత్తులు   గా కనిపించాయి  ఇవేమికాయలు   అని అడిగా  అప్పుడు వాళ్ళు చెప్పారు ఇవి సింధూరం  కాయలండీ అని. సింధూరం   చూసాగానీ    సింధూరం చెట్టు  కాయలు ఇంతవరకు   చూడలేదు . హనుమంతుడి   విగ్రహం ఎప్పుడు సింధూరము తో    నిండి వుంటుంది . అది ఎలా తయారవుతుంది?  అనే

2014-11-05

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): కనుమరుగైన మిత్రుడా!

2014-11-05 05:42 PM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
రెవ. షాలేం రాజు, ఏలూరు   సముద్రమంత దుఃఖానికి ఒక్కసారిగా నేత్రాలివ్వడం రెపరెప ఎగసే గుండెచప్పుళ్ళను పొదవి పట్టుకోవడం ఎవ్వరికైనా సులువేమీ కాదు ** చెట్టున పండిన ఆకులు రాలినట్టు రాలిపోతున్న ఆనవాళ్ళకు ఒంటరికొమ్మ సాక్ష్యంగా నిలబడి ఉండటం కష్టమే కావచ్చు ** ఒకొక్కటిగా చితాబస్మమౌతున్న జ్ఞాపకాలు సమాధులకు పుష్పగుచ్చాలు కాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయి చూస్తున్న కళ్ళకు రహదారిపై నడుస్తూ

ఇంద్రధనుస్సు: సంస్కృత సౌరభాలు - 21

2014-11-05 04:38 PM రవి (noreply@blogger.com)
నా బాల్యంలో సంస్కృతం (అనువాదం) మాస్టారు సిలబసులో పాఠాలు కాక, ఇతరత్రా కవుల గురించి కూడా చెబుతుండేవారు. ఆ సందర్భంలో ఒక కవి గురించి చెబుతూ, "ఆ కవి ఒక రాక్షసుడు" అనడం బాగా గుర్తు. చాలా కాలం తర్వాత ఆ రాక్షసుడు అన్న మాటకు అర్థం కొంత ఊహించడానికి వీలయింది.  ఆ కవి పేరు మాఘుడు. సంస్కృతసాహిత్యంలో రామాయణ మహాభారతాదుల తర్వాత శ్రవ్యకావ్యాలకు ఒక ఒరవడి కల్పించినది కవికులతిలకుడైన కాళిదాసు అయితే

2014-11-02

అక్షర శిక్షలు!: పిల్లలు

2014-11-02 05:16 AM K.S.M.Phanindra

ఖలీల్ జీబ్రాన్ రాసిన “ప్రొఫెట్” పుస్తకం గొప్ప ఆధ్యాత్మిక గ్రంధంగా పేరుపొందింది. “యండమూరి వీరేంద్రనాథ్” తన పుస్తకం “పడమటి కోయిల పల్లవి” లో ఈ పుస్తకంలోని కొన్ని కవితలకి చేసిన అనుసృజన ద్వారా నాకు “ప్రొఫెట్” గురించి తెలిసింది. మూలంలో చూస్తే గాఢమైన భావం ఎక్కువగా కనిపించింది కవిత్వం కన్నా. యండమూరి అనువాదంలో కవిత్వం చొప్పించాలనే తాపత్రయం ఎక్కువ కనిపించింది. పొడి పొడి మాటలలో మూలానికి దగ్గరగా అనువదిస్తే ఎలా ఉంటుందో చూద్దామని నేను ఎప్పుడో 2005లో ఓ ప్రయత్నం చేసి “పిల్లలు”, “పెళ్లి” అనే కవితలని అనువదించాను. అందులో “పిల్లలు” కవిత ఇలా వచ్చింది -

మీ పిల్లలు మీ పిల్లలు కారు!
బ్రతుకు తనకై తాను పడే తపనకు వాళ్ళు ప్రతిరూపాలు
మీ ద్వారా పుడతారు కానీ మీ నుండి కాదు
మీతోనే ఉంటారు కానీ మీ సొంతం కారు

వాళ్ళకి మీ ప్రేమని పంచండి, మీ ఆలోచనలను కాదు
ఎందుకంటే వాళ్ళకీ సొంత ఆలోచనలుంటాయ్
వాళ్ళ దేహాలను సాకండి, మనసులని కాదు
ఎందుకంటే రేపటి సీమలో మెలిగే వాళ్ళ మనసుని మీరు కలలో సైతం దర్శించలేరు
వాళ్ళలా మారడానికి ప్రయత్నించండి కానీ మీలా వాళ్ళని తయ్యారు చెయ్యకండి!
ఎందుకంటే బ్రతుకు వెనక్కి నడవదు, నిన్నటితో ఊగిసలాడుతూ కూర్చోదు!

మిమ్మల్ని విల్లుగా చేసి సంధించిన బాణాలు వాళ్ళు!
అనంతమైన బాటనున్న లక్ష్యానికి గురి చూసి
బాణాలు వేగంగా దూరంగా సాగేలా
విలుకాడు తన బలంతో మిమ్మల్ని వంచుతాడు
ఆనందంగా ఆయన చేతిలో వంగి సహకరించండి
ఎందుకంటే దూసుకు పోయే బాణంతో పాటూ
స్థిరంగా సంధించిన వింటిని కూడా
ఆయన ప్రేమిస్తాడు!

- 23.04.05


Filed under: అనువాదాలు, వచనాలు

2014-10-30

సాహితీ-యానం: నీటిపొర

2014-10-30 12:32 PM బొల్లోజు బాబా (noreply@blogger.com)
తాగుడు పై సదభిప్రాయం లేకపోయినా దురభిప్రాయం మాత్రం ఉండేది కాదు అదో పురాతన విలాసం కదాని కానీ మొన్నోరోజు మా కాలేజీలో ఓ విద్యార్ధిని తండ్రి తన కూతుర్ని నలుగురెదుటా బూతులు తిడుతూ అవమానించినపుడు ఆమె కనుల నీటిపొరలో తాగుబోతు తండ్రులందరూ దగ్ధమైపోవాలనుకొన్నాను “కొయిటా అమ్మ నా పేర్న పంపించే డబ్బుల కోసమే ఇదంతా” అని ఆ అమ్మాయి అన్నప్పుడు ఆ నీటిపొరలో ఈ మద్యప్రపంచం కొట్టుకు పోవాలనుకొన్నాను

2014-10-24

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఒక సమయం

2014-10-24 12:44 AM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
గాలి, వాన సర్దుమణిగాకసంకేతంకోసం వెళ్ళినకాకి తిరిగిరాకపోవచ్చు పావురం కాళీగానే తిరిగి తిరిగి రావచ్చు ఒక సమయంఒక లేచిగురుమళ్ళీ పావురం రాకకుఎదురుచూస్తుంటుంది

2014-10-23

సాహితీ-యానం: దీపావళి

2014-10-23 06:27 AM బొల్లోజు బాబా (noreply@blogger.com)
కవులు దీపాల్లాంటి వారు దీపారాధనలో ఒక దీపం వందదీపాలను వెలిగించినట్లుగాకవి ఒక ఆలోచననుసమాజంపై చల్లివేనవేల చైతన్య దీపాల్నిపండిస్తాడు ఈ ప్రపంచంలో ఎక్కడో, ఎప్పుడో ఏదో ఓ మూలనుంచి చీకట్లోంచో లేక ఆకట్లోంచో కవి కాంతి బొట్లుగా కాలంలోకి ప్రవహిస్తాడు ఆకాశం నక్షత్రయుతమౌతుంది నేల హరితకాంతుల్ని పొందుతుంది దారితప్పిన అలలు దీపస్థంభాన్ని కనుగొంటాయి కవి దీపధారా లేక దీపమే కవిధారా అనేది ఎవరూ తేల్చలేరు ఒకటి

2014-10-22

సురుచి: ఆధారం

2014-10-22 05:40 PM జ్ఞాన ప్రసూన (noreply@blogger.com)
ఆధారం     నాలుగున్నర అవగానే శీను   టపాకాయలన్నీ   అరుగుమీద  పేర్చడం ప్రారంభించాడు.    ఇప్పుడే ఎందుకురా అవన్నీ  పరుస్తున్నావు? అంది  లక్ష్మి    "అమ్మా!"  అన్నీ   విడి విడిగా  పెట్టుకొంటున్నానే!  తీసుకొడం తేలిక,ఎన్ని కాల్చానో  ఎన్ని వున్నా యో తెలుస్తుంది.అన్నాడు శీను    లక్ష్మి దీపాలు వెలిగించడానికి   కొత్త ప్రమిదలు తెప్పించి  నిన్ననే   నీళ్ళలొ నానబెట్టింది.అలా చేస్తే నూనె ఆట్టే

2014-10-16

సురుచి: బందరు నెచ్చెలి వెళ్ళిపోయింది

2014-10-16 06:12 PM జ్ఞాన ప్రసూన (noreply@blogger.com)
బందరు   నెచ్చెలి     వెళ్ళిపోయింది                      ఒకొకసారి     మనస్సు   శరీరము  శిధి లమయిపోయినట్లు  అనిపిస్తుంది . కూచోలేము,తిరగలేము ,తినలేము ,పనిచేయలేము నిద్రపోలేము  ఏదో అలజడి,ఆవేదన. ఈరోజు    లేచినదగ్గరనుంచి  అలానేవుంది .   మా పెద్దకోడలు    అమెరికా  వెడుతోంది . దిగులా అంటే  అలా లేదు . అది వెళ్ళాక    అలా కూర్చుండి పొయాను.  ఇంతలో  ఫోన్  ట్రింగ్ ట్రింగ్  అని   రారా అని పిల్చింది

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఇంతదూరం నడచివచ్చాక - 7

2014-10-16 02:40 PM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
~*~ చెట్టున పండిన ఆకులు రాలినట్టు రాలిపోతున్న ఆనవాళ్ళకు ఒంటరి కొమ్మ సాక్ష్యంగా నిలబడి ఉండటం  కష్టమే కావచ్చు ** ఒకొక్కటిగా చితాబస్మమౌతున్న జ్ఞాపకాలు సమాధులకు పుష్పగుచ్చాలు కాసింత అనుబంధంతో హృదయాన్ని మెలిపెడుతుంటాయి చూస్తున్న కళ్ళకు రహదారిపై నడుస్తూ నడస్తూ మలుపుతిరిగి కనబడనట్టు దృశ్యాదృశ్యాల మధ్య మనసు చిక్కుకుంటుంది ** కొన్ని పాదముద్రలను వదిలేయడం కొన్ని పాదముద్రలను వెదుక్కోవడం అనివార్య

2014-10-15

BHASKAR: సెందురూడా....... సెందురూడా by satya sreenivas

2014-10-15 01:30 AM the tree (noreply@blogger.com)
రైలు కట్టమీద సగం తెగిన సెందురూడా ఖాళీ సీసాలో సివరి సుక్కైన సెందురూడా ఆలైనా అమ్మవోలె సాకినోడ సెందురూడా అయ్యబోతే అమ్మకు తెల్లసీరైనా సెందురూడా పిడికిడంత ఆకాశంలో కోరికంత సెందురూడా మనసులేని మనసుల్లో సగం తెగిన సెందురూడా గుటక లేని గొంతులోన గ్రహణమైన సెందురూడా బీడువారిన భూమిలోన రాయైన సెందురూడా మోడువారిన జీవుల్లో కాష్టమైన సెందురూడా నిండిన గూడులో చనుపాలైన సెందురూడా కనురెప్పల మీద

2014-10-12

Telugu Anuvadam | తెలుగు అనువాదం: నువ్వు చూడని జీవితంలో ఎలా ఫెయిలయ్యావ్?

2014-10-12 04:55 AM Soma Sankar

ఆదిత్యా!
నీకు నిండా పాతికేళ్ళు లేవు…
ఏం జీవితం చూసావని
ఈ పని చేసావ్?

బలవంతంగా తనువు చాలించేంత
జీవితమైతే ఖచ్చితంగా చూడలేదు నువ్వు.
జీవించి ఉన్నప్పుడు ఫెయిలవలేదు
మరణించి విఫలమయ్యావు…
అయినవాళ్ళకి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చి…

జీవితం ఉన్నది జీవించడానికే కాని
బలవంతంగా మరణాన్ని ఆహ్వానించడానికి కాదని…
తెలుసుకోలేక ఫెయిలయ్యావ్!!
జీవితమెన్నడూ బ్రతకడమే నేర్పుతుంది..
చావమనెప్పుడూ చెప్పదు…
నేర్చుకునే అవకాశాన్ని స్వీకరించకుండానే
ఫెయిలయ్యావని నీకు నువ్వే నిర్ణయించుకుని
బ్రతుకునంతం చేసుకుంటే…
మిత్రమా, ఆ ఫెయిల్యూర్ జీవితానిది కాదు…

మరోసారి ఆలోచించుకునే అవకాశమేలేదిక నీకు..
బ్రతికి ఉంటేనే కదా సక్సెస్సో ఫెయిల్యూరో తెలిసేది..
నీ జీవితం నీ ఒక్కడిదే కాదని…
నువ్వు గ్రహించి ఉంటే ఈ పని చేసేవాడివి కాదు..

(జీవితంలో ఫెయిలయ్యానని తల్లిదండ్రులకి ఉత్తరం వ్రాసి పెట్టి శామీర్‌పేట్‌లో ఆత్మహత్య చేసుకున్న ఆదిత్య పవన్ అనే కుర్రాడి గురించి ఈ రోజు (12 అక్టోబర్ 2014) పొద్దున్న చదివిన వార్తకు స్పందనగా ఈ వాక్యాలు..)

2014-10-08

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఇంతదూరం నడిచొచ్చాక - 6

2014-10-08 05:20 PM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
~*~ కొంత హోదానుకొంత సౌఖ్యాన్ని అనుభవించాకహఠాత్తుగా ప్రక్కకు పెట్టడం కష్టమే కావచ్చు. ఊరి దూరాన్నిఅలా అలా ప్రయాణిస్తూఒక్కసారిగా హోదాను సౌఖ్యాన్ని విడచిసమూహంలోకి చొచ్చిగంటా, రెండు గంటల ప్రయాణాన్నితోసుకుంటూ బస్సులో ఎక్కిచెమట, పుగాకు ఇంకొంచెం మరేదైనా వాసనలతోఉక్కిరిబిక్కిరిచేసేవారి మధ్యఊరూరా ఆగుకుంటూఅరుపులు తోపులాటలుచంటిపిల్లల ఏడ్పులతోవిసుగుదలకు వినవచ్చే బూతుపదాల ధ్వనితోప్రయాణించడం

BHASKAR: కొమరం భీమ్ - తప్పక చదవవలసిన చరిత్ర.

2014-10-08 01:06 PM the tree (noreply@blogger.com)
కొమరం భీం,పహలీ సెప్టంబర్,1940,.(1-9-1940),. తిధుల ప్రకారం ఆశ్వయుజమాసం ,శుద్దపౌర్ణమి, .గోండులకు అత్యంత పవిత్రమైన దినం(ఈరోజు),. దోపిడికి,వంచనకు గురై తుపాకి పట్టి స్వయంపాలనకై కలలు కన్న,ఓ వీరుడి స్వప్నం కల్లలైన రోజు,.. రక్తం చిందించి,నేలకొరిగిపోయిన రోజు,. స్థానిక షావుకారులు,అధికారులు,దొరల వంచనకు గురైన కుటుంబాలకు చెందిన సాధరణమైన గోండు బాలుడు,.ఎలా తిరుగుబాటు జెండా ఎగరవేసాడో,.హత్యచేసి,పారిపోయి,దేశమంతా

2014-10-03

సురుచి: శుభాకాంక్షలు

2014-10-03 10:18 AM జ్ఞాన ప్రసూన (noreply@blogger.com)
శుభాకాంక్షలు సురుచి   సాహితీ    బంధువులందరికీ    జయీభవ!  దిగ్విజయీభవ

2014-10-01

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఇంతదూరం నడిచొచ్చాక - 5

2014-10-01 01:18 AM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
~*~ పుస్తకాల అరను సర్దుతూ నలిగి అట్టచిరిగిన పుస్తకమొకటి చేతిని తాకుతుంది కళ్ళలోకి ప్రసరించిన జ్ఞాపకంతో మూర్చపోతాను అక్షరాలను పద్యాలుగా పేర్చిన చోటుకు లాక్కెళుతుంది ~*~ ముడిపడ్డ కొన్ని ఆలోచనలు పేజీల్లోంచి లేచివస్తాయి ~*~ ప్రేమించడం నేర్చిన సమయాలు దూదిపింజం ఎగురుతున్నట్టు చిత్రాలు పాటలు, పద్యాలు, కవిత్వాలు లైబ్రరీలో దాక్కున్న వాక్యాలు పొన్నగపూలు రాలినట్టు ఓ తెల్లని పరిమళం ~*~ గోడమీద రాసిన

2014-09-26

Naa Kavitha: ఏడవకే నా హృదయమా

2014-09-26 08:37 AM Narendra Meka (noreply@blogger.com)
ఏడవకే నా హృదయమా ఏది ఏమైనా .. మాయదారి  జీవితాన ..మంచి కడతేరినా మిన్నకుండవే మనసా .. మాటలే కరువైనా ... మనోవ్యదే నిను  వెంటాడినా అశ్రువులే ఆవిరైనా ... కలలన్నీ కల్లలైనా.. ఏడవకే నా హృదయమా ఏది ఏమైనా .. కడతేరక నీ తోడుంటా కతమారేవరకు కలబడతా విధితో నా కట్టె కాలేవరకు ఏడవకే నా హృదయమా ఏది ఏమైనా ..

Naa Kavitha: క్షమించు బంధమా

2014-09-26 08:22 AM Narendra Meka (noreply@blogger.com)
నీ మాట వింటే నను మంచోడినంటావ్ ! వినకపోతే .... మూర్కుడినంటావ్ లోకాన్ని చూసి బతకమంటావ్ ! నవ్వలేనని బెదిరిస్తావ్ బంధం మాటున నువ్వెన్ని బంధనాలు వేసినా ... నాలోని నేను ప్రతి క్షణం బ్రతికే ఉంటాను . నా మది మాటే వింటాను క్షమించు బంధమా ... నా తర్వాతే నువ్వు

2014-09-23

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఇంతదూరం నడిచొచ్చాక -4

2014-09-23 10:33 PM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
~*~ నీ కోసమే నీకు నాకు తెలిసిన పాటొకటి పాడుకుంటూ తిరుగుతున్నా ఎక్కడికి పారిపోగలం బాల్యంలో ఆ చివర నువ్వు, ఈ చివర నేను క్రిందికి మీదికి ఊగినట్టు ఊగుతుంది మనసు నిత్యం చూసే ముఖాల మధ్య అక్కడే అతుక్కుపోవడం ఎవ్వరూ గుర్తించని ముఖాన్ని తొడుక్కుని ఎక్కడికో పారిపోవడం నిత్యజీవనంలో ఏదైనా సాధ్యమే! ** ముఖ కవళికలతో ఎవర్నో గుర్తించాననుకుంటాను సమూహాలలో పడి ఎక్కడో ఏదొ మర్చిపోతాను మట్టి పరిమళాన్ని

2014-09-22

తెలుగు సమస్య పూరణా - తోరణం: from Kris Kon

2014-09-22 10:55 AM కొండూరు కృష్ణ (ఆత్రేయ ) (noreply@blogger.com)
Hi! http://luts71.myjino.ru/co/interest.php Kris Kon

2014-09-16

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): సుమభాషితం

2014-09-16 12:45 AM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
~*~ 1  సుతారంగా పూలల్లడం ఓ కళ ప్రతిదానికి ఒక సమయం ఉన్నట్టే పూలల్లడాన్కి ఓ సమయం ఉంది 2  పరిమళం నిండిన రేకల్ని మునివేళ్ళతో పట్టుకుని దారాన్ని ముడివేయడం ఒకదానివెంటకటి చేర్చడం కొన్ని చేతులకే సాధ్యం 3 మాటలల్లడం అందరూ నేర్చే విద్యే మాటల్లో పరిమళాన్ని పొదగడం ఒక మనసుతో మరో మనసును కంటికి కనిపించని అనుబంధపు దారంతో ముడివేయడమే క్లిష్టమైనది 4 పూలబాల పాడిన పాట అప్పుడప్పుడూ చెవిలో దూరి ‘కరుణ ‘శ్రీని

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): దర్శిస్తే .....

2014-09-16 12:10 AM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
కొండమీదనుంచి దృష్టిసారిస్తే సుందరదృశ్యాలు కన్పడతాయి అక్కడక్కడ కొన్ని కొండలు నగరాలను చూపిస్తాయి పాము మెలికలు తిరుగుతూ నడుస్తున్నట్టు కొన్ని కొండలను తాకుతూ నదులు సాగిపోతాయి చెట్లాకులతో హరితవస్త్రాన్ని ధరించి హొయలుపోతాయి నదికి నిశ్చలత్వం లేనట్టే మనసు కూడా కొద్దిసేపు ఆ నదిలో చేపనై ఈదాలని ఈది ఈది అలసిన చేపకు రెక్కలొచ్చి హరిత వస్త్రంపై వాలి సేదదీరాలని ఉవ్విళ్ళూరుతుంది కొన్ని కొండలు దేవతానిలయాలు

2014-09-09

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): కవిత రాయాలని నేను ఎన్నడూ ప్రయత్నించను

2014-09-09 07:23 PM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
ఆలోచనల్ని మడచి బద్దకంగా రాత్రి నిశ్శబ్దంలోకి జారుకోవాలనుకుంటాను అనుకుంటాం గానీ రాత్రి నిశ్శబ్దమైనదేమీ కాదు సుమా! రాతిపొరల్లోంచి నేలపొరల్లోంచి ప్రయాణించే ప్రవాహమొకటి మొదలౌతుంది వరదనీటికి పోటెక్కిన నదీతీరాలను దాటలేక నిస్తేజంగా నిలబడిపోతాను ప్రవాహాలలో ఈదడం ఓ సాహస కళ * చీకటిని ముసుగుగా తెచ్చుకున్న రాత్రి రోజూ నే నడిచే చోటుల్లోనే భయపెట్టాలని చూస్తుంది * పూలకుండీలో

2014-09-08

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఏదైనా రాద్దామా! వద్దా!!

2014-09-08 04:57 PM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
~*~ గోడలపై అలా ఉప్పొంగిన సముద్రపు అలలా రాయడానికి ఏమైనా ఉందా గోడలిప్పుడు వీధుల్లో లేవు ప్రపంచవీధుల్లోకి వచ్చాయి నిద్రరాని రాత్రిని కత్తిరిస్తూ గోడలపై ఎదో రాయాలని గోడనిప్పుడు దేనికి ప్రతీక చేయలంటారు! ~*~  అలా బాల్యంలోకి నడిచివెళ్తే నివాసాలమధ్య గోడలెక్కడా కన్పడవేం! ~*~ ఒకప్పుడు  గోడపై నల్లబోర్డుమీదా రాసినవాటిని  ఎప్పటికప్పుడు చెరిపేసినా జ్ఞానమేదో వికసించిందంపించేది ఒకప్పుడు  గోడమీద రాతల్ని

2014-09-05

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఇంతదూరం నడిచొచ్చాక - 3

2014-09-05 02:21 AM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
~*~ నిన్ను ప్రేమిస్తున్నాని చెప్పలేని ఒకానొక సందిగ్దావస్థలో మొగ్గతొడిగిన ప్రేమ లోలోనదాగి పుస్తకంలోనే ఎండిపోయింది ఇప్పుడు వయస్సు తెచ్చిన ధైర్యమో, అనుభవమో కథలు కథలుగా మాటలు పొరలు పొరలుగా ఎందరిముందైనా విప్పాలని చూస్తుంది ~*~ కొన్ని సిగ్గులపరదాలు తొలగిపోయాక ఎగిరొచ్చే సీతాకోకచిలుకల ఊహలకు కిటికీలు మూసుకుపోయాక ప్రతిస్పందనేది ఉండదు కదా! అయినా నిలబడ్డ చోటులోకి ఎగిరొచ్చే పిట్టలకు తీరిగ్గా కొన్ని

2014-09-04

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఇంతదూరం నడిచొచ్చాక - 2

2014-09-04 03:21 PM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
~*~ Photo :కాశి రాజు   చెరువులను వెతుక్కుంటూ కలువలను తెంపుకోవడం కష్టమే కావచ్చు బురదంటిన కాళ్ళతో కొన్ని తామర/కలువ పూలను మిత్రులకివ్వడంలో ఏముండేదో అంచనావేయడం సులువేనంటారా! తిరిగిన మలుపులూ బసచేసిన మజిలీలూ పొందిన అనుభవాలూ కలసుకున్న అనుబంధాలూ అన్నింటిమధ్య బహుశ మనోపలకంలో తామర/కలువలు చెరిగిపోవచ్చు ఎండిపోయిన చెరువుగట్లపై దారులు విడిపోయినట్లు చెరోభావజాలాల దారులయ్యాక అందుకున్న స్నేహహస్తం భుజం తట్టిన

అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఇంతదూరం నడిచొచ్చాక - 1

2014-09-04 03:14 PM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com)
దారిని వెతుక్కుంటూ వెనక్కు వెళ్ళడం కష్టమే కావచ్చు తిరిగిన మలుపులూ బసచేసిన మజిలీలూ పొందిన అనుభవాలూ కలసుకున్న అనుబంధాలూ బహుశ మనోపలకంనుండి చెరిగిపోవచ్చు పురావస్తు పరిశోధనలా తవ్వుకోవల్సిందే ! అందుకున్న స్నేహహస్తం భుజం తట్టిన ప్రోత్సహక స్పర్శ ఎక్కడ మూటగా మిగిలిపోయిందో వెదకాల్సిందే! ~*~ అపజయాలూ అవమానాలూ ఆనందాలూ సన్మానాలూ ఏదొక భావావేశాన్ని దాచివుంచుతాయి ! ~*~ వస్తుప్రపంచాన్కి కొలమానాలెక్కువ అందుకే
వ్యాఖ్యలు
2014-11-27
2014-11-27 07:18 AM వానా - సంగతులూ,సందర్భాలూ…. పై వ్యాఖ్యలు

మంచి విషయాలు చెప్పారు.
‘కుమారుని వలెనూ కావవే గిరికుమారీ సుకుమారీ ‘ అన్న ఒక అద్భుత మైన కృతిని ఆయన పద్నాలుగేళ్ల వయసులో రాశారట. దాన్ని రామ వర్మ గారు ఒక వర్క్ షాప్ లో నేర్పగా విన్నాను. కూర్చిన రాగం హృద్యమైనది.

2014-11-27 07:13 AM వానా - సంగతులూ,సందర్భాలూ…. పై వ్యాఖ్యలు

బావుందండీ మీ బ్లాగు. ఇప్పుడే మొదటిసారి చూసి, ఇన్నాళ్ళూ చూడకపోతినే అనుకున్నా.

2014-11-26
2014-11-26 08:40 PM Kag Murali krishna (noreply@blogger.com) - మడత పేజీ
ఏంటో..ఈ మనుషులు..<br />చుట్టూ వెధవలను చూసి మనసు కటువుగా మార్చుకునే లోపునే..నిజమైన మనిషంటే ఏంటో,మనిషికున్న,ఉండాల్సిన విలువలేంటో చూపిస్తూ ఉంటే..<br />నేనూ మనిషినేనని..చుట్టూ ఇలాంటి మనుష్యులు తట్టి చెబుతున్నా..<br />ముసుగులో ఉండనూలేక..తీయనూ లేక నలుగుతూ..ఉన్నా..
2014-11-26 12:40 PM cbrao (noreply@blogger.com) - మడత పేజీ
One can live after death through organ donation.
2014-11-26 11:27 AM సుబ్రహ్మణ్యం నిష్ఠల Subrahmanyam Nishtala (noreply@blogger.com) - సాహితీ-యానం
I am very happy to see the article posted by you and read it interestingly. Thank you for your post.
2014-11-25
2014-11-25 06:03 PM NS Murty - అనువాదలహరి పై వ్యాఖ్యలు

శర్మగారూ,
నమస్కారం.
ఈ కవితలో జీవిత చరమాంక స్థితి గురించి చెబుతోంది కవయిత్రి. మనిషికి వయసుపైబడి, జీవితంలో ఓడిపోయానని అనిపించి, తను తన అపరాధాలకి బానిస అయిపోయి, ఆశలు ఇసకరేణువుల్లా వేళ్ళసందులోంచి జారిపోతున్నప్పుడు, అతనికి నిరాశ నిస్పృహలు ఆవరిస్తాయి. ఒక్క పాట. కూని రాగం, ఒక మంచి ఆలోచన రాదు. అలా రాగలిగితే, అతనికి ఇంకా స్వయం నిర్ణయాధికారం ఉన్నట్టే. అంటే, ఆ సమస్యలోంచి, ఆ పరిస్థితిలోంచి బయటపడే ప్రయత్నం చెయ్యగలడు విధికి తలవంచకుండా. అప్పుడే మనిషి మనసుకి ఊరట కల్పించగలడు. మాటల గారడి చేసైనా. అదే క్షణికమైన సత్యం. ఆనందం. అంటే, బలహీనమైన క్షణాల్లో మనసుని నిగ్రహించుకోగలగడం స్వర్గంతో సమానం అని.
అభివాదములతో

2014-11-25 07:33 AM Jai Gottimukkala - Comments for నువ్వుశెట్టి బ్రదర్స్

“హైదరాబాదు ఆంధ్రలో ఉండి ఉంటే”

Nice dream :)

హైదరాబాద్ 1956లొ కూడా తెలంగాణాలో ఉండేది. ఆ విషయం బెతాలుడికి తెలిసే అవకాశం లేదంటారా?

2014-11-25 07:31 AM Jai Gottimukkala - Comments for నువ్వుశెట్టి బ్రదర్స్

అవే పాత కాలం చెల్లిన వాదనలు!

2014-11-25 01:01 AM Babu Gogineni (noreply@blogger.com) - మడత పేజీ
Thank you Chandra, for a most warm and moving post about my dear mother ... <br /><br />No one had any clue of her terrible brain tumor until a few hours before she died - her unsymptomatic brain stem tumor directly affected respirationl <br /><br />When I landed in India, Innaiah garu was there at the Airport along with my dear friend Uday and throughout and after, Murahari Rao garu had a
2014-11-24
2014-11-24 11:09 PM sarma - అనువాదలహరి పై వ్యాఖ్యలు

pls elaborate

2014-11-24 01:40 AM Ms Sharma (noreply@blogger.com) - సురుచి
చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు వ్రాసారు మీరు. మేము అక్కడ ఉండి చూసిన అనుభూతి కలిగింది. శ్రీమతి &amp; శ్రీ ఎస్. ఎస్. ప్రసాదు గార్లుకు అభినందనలు, శుభాకాంక్షలు.<br /><br />శైలజ శర్మ<br />http://summersofindia.blogspot.in/
2014-11-23
2014-11-23 10:03 PM K.S.M.Phanindra - అక్షర శిక్షలు! పై వ్యాఖ్యలు

థాంక్స్ అన్నా! గజలో కాదో తెలియదు. ఆ రోజుల్లో ఏదో ఊపొచ్చి సరదాగా రాశాను.
నాకు ప్రేమ కవితలూ, భావ కవితలూ ఇష్టమైనా చిత్రంగా నేను చాలా తక్కువ కవితలు
రాశాను అలాటివి!

On Sat Nov 22 2014 at 10:38:02 PM అక్షర శిక్షలు! wrote:

>

2014-11-23 09:50 PM K.S.M.Phanindra - "తెర"చాటు చందమామ పై వ్యాఖ్యలు

ఈ లైన్లు నేను రాసినట్టు నాకే గుర్తు లేదు! మీ పుణ్యమా అని మళ్ళీ ఎప్పుడో
రాసిన ఈ ఆర్టికల్ చదివాను. థాంక్స్ నాయుడు గారూ!

On Sun Nov 23 2014 at 11:45:45 AM "తెర"చాటు చందమామ wrote:

>

2014-11-23 07:45 PM పైడి నాయుడు - "తెర"చాటు చందమామ పై వ్యాఖ్యలు

ఈ పాటలో వర్ణించిన “అందం”, మనసుని “పులకింపజేసే” అందం. తనువుని “పలికింపజేసే” అందం కాదు. ఒక్కసారి పాటని ఆసాంతం చదవండి. ఒక అందమైన అనుభూతి మనసుకి కలుగుతుంది. అప్పుడు వేటూరి కూడా 70 ఏళ్ళ వృద్ధుడిలా కాక, పదహారేళ్ళ కన్నెపిల్లలా నవ్వుతూ కనిపిస్తాడు! … ఆ నవ్వు పేరు “తెలుగు”, ఆ కలం ఊరు “వెలుగు”!!
చాలా బాగుంది

2014-11-23 06:38 AM నచకి (NaChaKi / Dr. Chakravarthula Kiran) - అక్షర శిక్షలు! పై వ్యాఖ్యలు

ఘజల్ ప్రక్రియకి దగ్గఱగా ఉన్నట్టుంది యీ కవిత? చాలా బాగుంది.

2014-11-19
2014-11-19 10:30 AM DARPANAM (noreply@blogger.com) - సాహితీ-యానం
ఏయేటికాయేడు తననుతాను అప్ డేట్ చేసుకున్నాడు కనుకనే <br />ఎప్పటికీ ఆయన రచనలు నూతనంగా ఉన్నాయి ..... <br />అంతటి మహానుభావుడి గురింఛి చాలా బాగా వ్రాసిన మీరు మాత్రం తక్కువ వారా?
2014-11-19 09:04 AM శ్రీలలిత (noreply@blogger.com) - సురుచి
మహానుభావులు అందరికీ వందనాలు. విశేషాలు వివరించినందుకు ధన్యవాదాలు..
2014-11-08
2014-11-08 10:11 AM రవి (noreply@blogger.com) - ఇంద్రధనుస్సు
అపశంకమంకపరివర్తనోచితాశ్చలితాః పురః పతిముపైతుమాత్మజాః |అనురోదతీవ కరుణేన పత్రిణాం విరుతేన వత్సలతయైష నిమ్నగాః || (శిశుపాలవధము - నాలుగవ సర్గ - 47) అపశంకం = నిశ్చింతగా, అంకపరివర్తనోచితాః = సహజముగ నొడిని తిరుగాడెడు, ఆత్మజాః = బిడ్డలు పురః = ఇప్పుడు, పతిముపైతుం = మగని చేరుటకునై, చలితాః = వెడలినవి (కాగా), కరుణేన = దుఃఖముతో, అనురోదతీ ఇవ = శోకించుచున్నట్టుగా , పత్రిణాం = పక్షుల, విరుతేన = కూజితములతో,
2014-11-07
2014-11-07 12:56 PM sai sudha (noreply@blogger.com) - సురుచి
వెండితెరపై తనదైన శైలిలో నవ్వులు కురిపిస్తాడు బ్రహ్మానందం. ఒక్క డైలాగ్ కూడా మాట్లాడకుండా నవ్వించగల సత్తా ఆయనది. ఓ మంచి కళాకారుడికి నిదర్శనం బ్రహ్మనందం అంటే అతిశయోక్తి కాదు. బ్రహ్మీ మంచి నటుడే కాదు.. మంచి పెయింటర్ కూడా. ఇప్పటివరకు ఎన్నో బొమ్మలు గీశాడు. వాటిలో శివుడు, వెంకటేశ్వర స్వామిని కలిపి, గీసిన అద్భుతమైన బొమ్మ ఒకటి. తాజాగా, వెంకటేశ్వర స్వామి బొమ్మ తయారు చేశారు బ్రహ్మానందం. అయితే.. పెన్సిల్
2014-11-05
2014-11-05 06:19 PM Augustus Augustya (noreply@blogger.com) - అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
మిత్రులారా!<br />ఎన్నడైనా రహదారిలో నేను కనుమరుగైతే<br />సమాధులలో వెదక్కండి<br />అక్కడుంచేపూలు జ్ఞాపకాన్ని రగిలించేందుకేనని గుర్తుంచుకోండి<br />ఎప్పుడైనా నాతో కలివున్న<br />చిత్రంలో వెదకండి ఒక్క జ్ఞాపకమైనా దొరుకుతుంది.
2014-11-05 04:38 PM రవి (noreply@blogger.com) - ఇంద్రధనుస్సు
నా బాల్యంలో సంస్కృతం (అనువాదం) మాస్టారు సిలబసులో పాఠాలు కాక, ఇతరత్రా కవుల గురించి కూడా చెబుతుండేవారు. ఆ సందర్భంలో ఒక కవి గురించి చెబుతూ, "ఆ కవి ఒక రాక్షసుడు" అనడం బాగా గుర్తు. చాలా కాలం తర్వాత ఆ రాక్షసుడు అన్న మాటకు అర్థం కొంత ఊహించడానికి వీలయింది.  ఆ కవి పేరు మాఘుడు. సంస్కృతసాహిత్యంలో రామాయణ మహాభారతాదుల తర్వాత శ్రవ్యకావ్యాలకు ఒక ఒరవడి కల్పించినది కవికులతిలకుడైన కాళిదాసు అయితే
2014-10-31
2014-10-31 03:26 PM Regu Vardan (noreply@blogger.com) - స్నేహమా....
news4andhra -- The Ultimate Source for Entertainment News, Movie Reviews, celebrity Interviews and many more at one place<br /><a href="http://www.news4andhra.com/reviews" title="Latest Telugu Movies Reviews" rel="nofollow">Latest Telugu Movies Reviews</a><br /><a href="http://www.news4andhra.com/interviews" title="Telugu Actors Interviews" rel="nofollow">Telugu Actors Interviews</a>
2014-10-31 03:23 PM Regu Vardan (noreply@blogger.com) - కవిత్వం
news4andhra -- The Ultimate Source for Entertainment News, Movie Reviews, celebrity Interviews and many more at one place<br /><a href="http://www.news4andhra.com/reviews" title="Latest Telugu Movies Reviews" rel="nofollow">Latest Telugu Movies Reviews</a><br /><a href="http://www.news4andhra.com/interviews" title="Telugu Actors Interviews" rel="nofollow">Telugu Actors Interviews</a>
2014-10-23
2014-10-23 11:52 AM తెలుగు పాటల సాహిత్యం (noreply@blogger.com) - Naa Kavitha
బాగా రాసారండి .. ఇంకా మీరు ఇలాంటి కవితలు ఎన్నో రాయాలని కోరుకుంటూ ....
2014-10-23 11:39 AM తెలుగు పాటలు (noreply@blogger.com) - సాహితీ-యానం
ఓహ్ అది మీ పేరా అండి
2014-10-23 11:37 AM తెలుగు పాటలు (noreply@blogger.com) - సాహితీ-యానం
నాకు చివరి మాట అర్థం కాలేదు అండి &quot;బొల్లోజు బాబా&quot; అంటే ఏంటి .. నాకు తెలీనవి తెలుస్కుందామని అడుగుతున్నాను ఇది కూడా తెలీద అనుకోకుండా నాకు చెప్పండి
2014-10-17
2014-10-17 04:50 AM Tejaswi (noreply@blogger.com) - సురుచి
అంత చిరకాల మిత్రురాలు వీడిపోయారంటే ఎంతో బాధగానే ఉంటుంది. మీరు మనసు దిటవుపరుచుకోవాలని కోరుకుంటున్నాను.
2014-09-06
2014-09-06 02:53 PM మఠం మల్లిఖార్జున స్వామి (noreply@blogger.com) - దార్ల
కావ్యం అంటే మూలార్థం కవిచే రచించబడిన గ్రంథం, ఇదే అర్థాన్ని పలుచోట్ల పలువురు ప్రముఖులు ప్రస్తావించడం జరిగింది. నిజానికి మొదట్లో వచ్చినవి పద్య గ్రంధాలే వాటినే కావ్యాలని వచించారు. తరువాత కాలంలో గద్య గ్రంధాలూ వచ్చాయి, వాటిని గద్య కావ్యాలు అన్నారు. కాకపోతే కాలం మారిన కొద్ది కావ్యానికి కొత్త కొత్త నిర్వచణాలు వచ్చి చేరాయి-విస్తృతమయ్యాయి. కవిజనాశ్రయం కావ్యం ఎలా అవుతుంది అని ప్రశ్నించటం అర్థంలేని వాదనే
2014-09-06 02:16 PM rammohan thummuri (noreply@blogger.com) - అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
Nice
2014-09-06 02:13 PM rammohan thummuri (noreply@blogger.com) - అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
Very nice thoughts
2014-09-05
2014-09-05 02:35 AM Aparanji Fine Arts (noreply@blogger.com) - అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
వస్తుప్రపంచాన్కి కొలమానాలెక్కువ<br />అందుకే<br />ఏదీ ఎక్కువకాలం ఉండదు
2014-09-02
2014-09-02 03:48 PM రవి (noreply@blogger.com) - ఇంద్రధనుస్సు
ప్రాచీన సంస్కృతసాహిత్యంలో కనిపించిన ఒక చిత్రమైన హైర్ స్టైల్ గురించి, ఇంకొన్ని విషయాల గురించి ఈ సారి కొన్ని ముచ్చట్లు. అశోక వృక్షం క్రింద కూర్చుని ఒకాయన సుందరీవిరహవేదన పడుతున్నాడు. సుందరి - అతని భార్య పేరు. సార్థకనామధేయ. ఈతని పేరు నందుడు. ఆ కావ్యం సౌందరనందం.  కావ్యాన్ని రచించిన మహాకవి కాళిదాసుకన్నా పూర్వుడైన అశ్వఘోషుడు. ప్రియురాలయిన సుందరిని వదిలి నందుడు, బుద్ధుని ద్వారా ప్రవ్రజన దీక్ష
2014-08-31
2014-08-31 12:26 PM జాన్‌హైడ్ కనుమూరి (noreply@blogger.com) - దార్ల
something to think
2014-08-26
2014-08-26 07:25 AM Sridhar Sharma (noreply@blogger.com) - దార్ల
HI DARLA GARU good constructive aproach keep going.<br /><br />M.Sridhar sharma<br />asst.proff in english<br />BSIT
2014-08-26 07:23 AM Sridhar Sharma (noreply@blogger.com) - దార్ల
hi darla garu constructive approach-keep going<br />M. Sridhar sharma <br />asst.proff in english<br />BSIT.
2014-08-26 07:08 AM vrdarla (noreply@blogger.com) - దార్ల
శ్యామలీయంగారు,<br />చాలా మంచి విషయాన్ని చర్చకు తీసుకొచ్చారు. ఇక్కడ కవిజనాశ్రయం ఒక లక్షణగ్రంథం. కానీ కావ్యంగా సంబోధిస్తూ ఆచార్య ఎస్వీరామారావుగారు ఈ వ్యాసాన్ని రాశారు. మరి శీర్షికను ఆయనే పెట్టారో, పత్రికల వాళ్ళు పెట్టారో తెలియదు కానీ కావ్యం అనడంలోని ఔచిత్యాన్ని మనం ప్రశ్నించుకోవాల్సిందే.మీరు ఆచార్యుల వారు అని సంబోధించింది కూడా ఆయనకే చెందుతుందనుకుంటున్నాను. సమాధానం ఆయన నుండి మనం తెలిసికొంటే
2014-08-25
2014-08-25 02:16 PM శ్యామలీయం (noreply@blogger.com) - దార్ల
ఆచార్యులవారు ఛందోలక్షణగ్రంథానికి కావ్యత్వం ఆపాదించటం కొంచెం ఆలోచించదగిన విషయం. ఇది అనిదంపూర్వమైన ధోరణి అనుకుంటాను. అచార్యులవారికి కావ్యలక్షణాల గురించి తప్పకుండా మంచి అవగాహన ఉండే ఉంటుందన్నది నిర్వివాదం. ఛందోలక్షణగ్రంథంలో కనీసం ఒక కథ అంటూ కూడా ఉండదు కదా అటువంటి కావ్యం అనటం సబబేనా అన్నది నా ప్రశ్న. ఇదే ధోరణిని ప్రామాణికం చేసేస్తే వైద్యజ్యోతిషాదిరంగాల్లో అప్పట్లూ రచించబడ్ద పుస్తాకాలూ‌కావ్యాలే
2014-08-20
2014-08-20 09:54 AM Hari Babu Suraneni (noreply@blogger.com) - సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి)
సాయత్రం మాంసం తెచ్చుకుని వండినా, కూరమొత్తం పడెయ్యలేక మొత్తం నేనే తిన్నాను.<br />&gt;&gt;<br />యేం చేస్తాం సార్!(వంట) చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా?!
2014-08-14
2014-08-14 05:05 PM K M Rao (noreply@blogger.com) - దార్ల
I am really aghast to see the blind hatred for seemandhra people in the minds of the so called leaders of Telangana of all hues and from all walks - politicians, employees, teachers,film makers. It is much worse than a Pakistani Jihadis have against the Hindus. In both cases, the hatred was systemactically injected into the minds of gullible people. In near future , I am sure there will be school
2014-08-13
2014-08-13 11:56 AM కనకాంబరం (noreply@blogger.com) - దార్ల
వివరణాత్మకమైన మీ వ్యాసం బాగుంది. నీను దీర్ఘ కవితలతో సంతృప్తి చెందక, చిరు కవితా ప్రక్రియలపై దృష్టి పెట్టి ప్రయోగాలు చేస్తూ వస్తున్నాను. ఫేస్ బుక్ లో... నా స్వీయ కుడ్యం పైననూ ఇతర సమూహాలలోనూ, నానో లు, రెక్కలు ,హైకూలు,ఫెంటోలు రాసి పోస్ట్ చేయడం జరిగింది . నా నానోలు శ్రీ హనుమాన్ హానీ గారు సంతృప్తి పడినవే కొన్ని వేలు వుండి ఉండవచ్చు. నిజానికి అంతర్జాల పుటలలో వున్న,వాటిని లెక్కించడం, సంకలన పరచడం
2014-07-29
2014-07-29 05:49 PM Ragu Vardan (noreply@blogger.com) - స్నేహమా....
చాలా బావుంది...<br />News4andhra.com is a Telugu news portal and provides <br /><a href="http://www.news4andhra.com/movies" rel="nofollow">Telugu Movie News</a>, Latest and Breaking News on Political News and <a href="http://www.news4andhra.com/reviews" rel="nofollow">Telugu Movie Reviews</a> at one place<br />
2014-07-29 04:34 PM Ragu Vardan (noreply@blogger.com) - పడమటి గోదావరి రాగం.
చాలా బావుంది...<br />News4andhra.com is a Telugu news portal and provides <br /><a href="http://www.news4andhra.com/movies" rel="nofollow">Telugu Movie News</a>, Latest and Breaking News on Political News and <a href="http://www.news4andhra.com/reviews" rel="nofollow">Telugu Movie Reviews</a> at one place<br />
2014-07-29 03:34 PM Ragu Vardan (noreply@blogger.com) - కవిత్వం
బావుంది వ్యాసం చక్కని కొటేషన్లతో. ధన్యవాదాలు<br /><a href="http://www.news4andhra.com/home" rel="nofollow">Telugu Cinema News</a>
2014-07-28
2014-07-28 06:23 PM Anitha Chowdary (noreply@blogger.com) - స్నేహమా....
chaala baaga raasarandi <br /><a href="http://www.lyricsintelugu.com/" rel="nofollow">Telugu Songs Lyrics</a><br />
2014-07-26
2014-07-26 09:06 AM nagarani yerra (noreply@blogger.com) - సురుచి
కళ్లు చమర్చాయండీ.భగవంతుడు ఆ తల్లిదండ్రుల కు బ్రతికే ధైర్యాన్ని ఇస్తాడు తప్పకుండా .
2014-06-29
2014-06-29 07:57 AM kaasi raju (noreply@blogger.com) - అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి)
thank youi john annayya
2014-06-18
2014-06-18 03:46 PM Krishna Sai Navuluri (noreply@blogger.com) - మనస్విని
Bujjuluuuuu......... Ntha cute ga unnavo.... Ne matalu... Ne allari... Baga miss avuthunna... <br />Nenu life lo appatiki marchipolenu... Airport lo ne adupu.... Uuummmmaaahhhh love u bujjulu gadu.....
2014-06-18 09:48 AM PN Praveen (noreply@blogger.com) - మనస్విని
My dear cute Appy. 6 years tharvatha reply isthunnandhuku peddha Sorry. <br /><br />U will be always special. Chikku gadu vachaka kuda...��<br /><br />Gurthunchu Ko ee Fotos theesindhi mee mama gaadey...
2014-06-18 09:15 AM Sri Cha (noreply@blogger.com) - మనస్విని
Apple... so cute.....
2014-06-16
2014-06-16 12:59 AM nmraobandi (noreply@blogger.com) - సాహితీ-యానం
&quot;అన్ని నిర్ణయాలు<br />ముందే అయిపోయాయి<br />ఏదో కాలక్షేపానికి<br />జీవించాలి అంతే!&quot;<br /><br />యదార్ధం చెప్పారు...<br />ఎద కు అర్ధమయ్యేలా...<br />గ్రీటింగ్స్ సర్ ...
పైకిబ్లాగులువార్తలుజాలపత్రికలుఫొటోలుసేకరణలుenglishటైపింగు ట్యూటరు..ఈబుక్స్..