2012-05-16
....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....: మళ్ళీ 'సాక్షి' ఛానెల్ లో చేరిన స్వప్న
తెలు-గోడు: నా దేశం
2012-05-13
శాస్త్ర విజ్ఞానము: కాటన్ విప్లవాన్ని కొన సాగించిన రావ్
2012-05-12
తెలుగు తూలిక: ఊసుపోక – ఇ-చదువుడు వీరాభిమాని!!
ఏటి ఒడ్డున: రంగులు
కాలాస్త్రి: గబ్బర్ సింగ్ - ఇంక మూడు ఫ్లాపులు లెక్కబెట్టుకోండి!
2012-05-11
బ్లాగాడిస్తా!: సత్తెయ్య - శాకయ్య
2012-05-10
తెలుగు తూలిక: మార్పు 40
2012-05-09
శాస్త్ర విజ్ఞానము: కాంతి కణధార కాదు, తరంగం - హైగెన్స్
2012-05-06
మనోనేత్రం: రాంబాబు కథలు - పెళ్ళి చేసి చూడు
2012-05-05
శ్రీ కృష్ణదేవరాయలు: ఓ 'ఇరవై' కథ
నెమలికన్ను: జమీల్యా
2012-05-03
KadaliTaraga : a wave in the Ocean !: ఒకవైపు వాగాడంబరం మరొకవైపు ప్రజావ్యతిరేకత
సాక్షి దినపత్రిక కోసం
అర్థశాస్త్రవేత్తలు ఒకేవాక్యంలో ఒకవంక అని ఒక విషయం, మరొకవంక అని మరొక విషయం చెపుతారని అర్థశాస్త్రం మీద ఒక ప్రఖ్యాత పరిహాసం ఉంది. భారత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి అర్థశాస్త్రం తెలుసునో లేదో గాని ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఒకవంక వాగాడంబరమూ, మరొకవంక ప్రజావ్యతిరేకతా నిండా ఉన్నాయి.
శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2012-13 బడ్జెట్ యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ విధానాల అచ్చమైన కొనసాగింపుగా ఉంది. ఆమాటకొస్తే 1991-92 బడ్జెట్ నాటినుంచీ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ శక్తుల మద్దతుతో సాగుతున్న ప్రజావ్యతిరేక బడ్జెట్ల పరంపరలో భాగంగానే ఉంది. నిజానికి యుపిఎ మాత్రమే కాదు, ఈ ఇరవై సంవత్సరాలలో కేంద్రంలో అధికారం చలాయించిన ఇప్పటి ప్రతిపక్షాల కూటమి నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ అయినా, ఇవాళ మూడో ప్రత్యామ్నాయం గురించి కలలుగంటున్న రాజకీయ పక్షాలయినా, రాష్ట్రాలలో గద్దెనెక్కిన అన్ని రంగుల రాజకీయ పక్షాలయినా స్వల్పమైన అక్షరాల, అంకెల, వాగ్దానాల మార్పులతో ఇటువంటి బడ్జెట్లనే ప్రవేశపెట్టాయి. ప్రపంచీకరణ విధానాల తర్వాత ఈ దేశ పాలకవర్గాలకు అంతకుముందరి నామమాత్రపు ప్రజాసంక్షేమ, ప్రజానుకూల విధానాలను ప్రకటించాలనే ఒత్తిడి కూడ లేకుండాపోయింది. అందులోనూ ఎన్నికల సంవత్సరం కాకపోతే ప్రజల ఊసే అవసరం లేదని భావిస్తున్నారని ప్రతి బడ్జెటూ చూపుతూనే ఉంది.
కొత్త బడ్జెట్ గురించి తక్షణ స్పందనగా ముఖ్యంగా చెప్పవలసిన అంశాలు నాలుగైదు ఉన్నాయి.
మొట్టమొదటిది ఈ సంవత్సరం తమ ప్రభుత్వం ఐదు లక్ష్యాలు పెట్టుకున్నదని ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటన శుష్క వాగాడంబరం. వాటిలో కొన్ని లక్ష్యాలు అర్థరహితమైనవి. ఆ లక్ష్యాలలో నిజంగా ప్రజానుకూలమైన వాటిని అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు. వాటిలో ప్రజావ్యతిరేకమైనవి మాత్రం వెంటనే అమలులోకి వస్తాయి.
ఉదాహరణకు మొదటి లక్ష్యంగా స్థానిక, దేశీయ డిమాండ్ ను పెంచి తద్వారా ఆర్థికవ్యవస్థను వృద్ధి చేసి, పునరుద్ధరణ సాధిస్తానని ఆర్థిక మంత్రి అన్నారు. కాని స్థానిక, దేశీయ డిమాండ్ పెంచాలంటే ఉపాధి సౌకర్యాలు పెంచాలి, ప్రజల ఆర్థిక ఆదాయం పెంచే చర్యలు చేపట్టాలి. లేదా, దేశీయ, స్థానిక మార్కెట్ సరుకుల, సేవల ధరలు తగ్గించి వాటి డిమాండ్ పెరగడానికి తోడ్పడాలి. ఆ సరుకుల, సేవల ఉత్పత్తి కారకాల ధరలు తగ్గించే చర్యలు తీసుకోవాలి. ఈ నాలుగు మార్గాలు తప్ప దేశీయ డిమాండ్ పెంచగల మరొక మార్గమేదీ లేదు. కాని ఉపాధి సౌకర్యాల పెంపుదలకూ, కొత్త ఉద్యోగకల్పనకూ సంబంధించిన చర్యలేవీ ఈ బడ్జెట్ లో లేవు. ప్రజల ఆదాయం పెంచే చర్యలు లేవు సరిగదా, సబ్సిడీలలో భారీ కోత, ఇంకా కోత విధిస్తామనే హెచ్చరిక, పరోక్ష పన్నులను పెంచడం వంటి నిజ ఆదాయాలను తగ్గించే చర్యలెన్నో ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తామనే శుష్క వాగ్దానాలు తప్ప నిజంగా సరుకుల, సేవల ధరలు తగ్గించే, నియంత్రించే ఉద్దేశం కూడ ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. కనుక మొత్తంగా మొదటి లక్ష్యం కాగితం మీద మిగిలిపోతుంది గాని ఆచరణలోకి రాదు.
ప్రైవేటు పెట్టుబడులు విపరీతంగా త్వరితగతిన పెరిగేలా చూడడం, కొన్నిరంగాలలో ప్రైవేటీకరణకు ఉన్న అవరోధాలను తొలగించడం రెండో లక్ష్యమని ఈ బడ్జెట్ ప్రకటించింది. ఇది మాత్రం తక్షణమే అమలు లోకి వచ్చే లక్ష్యం. నిజంగానే ఈ బడ్జెట్ లోనే కార్పొరేట్ పన్ను పెంచకుండా ఉండడం, ప్రభుత్వరంగం నుంచి ఈ సంవత్సరం ముప్పైవేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఉపసంహరిస్తామని ప్రకటించడం ఈ బడ్జెట్ లో ఉన్నాయి. విద్యుదుత్పత్తి, రహదారులు, విమానాల మరమ్మత్తు, గృహనిర్మాణం, నీటిపారుదల పథకాలు వంటి రంగాలలో విదేశీ వాణిజ్య రుణాలను, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని అనుమతించ బోతున్నామని కూడ బడ్జెట్ ప్రకటించింది. రక్షణ రంగంలో కూడ ప్రైవేట్ రంగాన్ని అనుమతించబోతున్నారు. అంటే తమకు కావలసిన లక్ష్యాలనేమో వెంటనే అమలులోకి తేవడం, ప్రజానుకూల లక్ష్యాలుగా కనబడేవాటిని ఊరికే ప్రకటించి, ఆచరణ కార్యక్రమాన్ని ప్రకటించకపోవడం మరొకసారి వ్యక్తమయింది.
పోషకాహార లోపాన్ని తగ్గించడాన్ని మూడో లక్ష్యంగా ప్రకటించారు గాని దాని వివరాలలోకి వెళితే ప్రకటించిన నిధులు, లబ్ధి పొందే ప్రాంతాలు అన్నీ చూస్తే ఇది హళ్లికి హళ్లి సున్నకు సున్న అని తేలుతుంది. ఇక పాలన, పారదర్శకత, అక్రమ సంపద, ప్రజాజీవితంలో అవినీతి వంటి లక్ష్యాలు గాలి మాటలేనని కొత్తగా చెప్పనక్కరలేదు.
కళ్లు తిరిగిపోయే భారీ అంకెలు ప్రకటించడం, అంత భారీ నిధులు ప్రభుత్వం దగ్గర లేవు గనుక ప్రైవేటు రంగాన్ని అహ్వానిస్తున్నామని అనడం బడ్జెట్లలోనూ, ఈ రెండు దశాబ్దాల విధానాలలోనూ ప్రభుత్వాలకు అలవాటు అయిపోయింది. సరిగ్గా అలాగే ఈ బడ్జెట్ లో కూడ పన్నెండో ప్రణాళికలో మౌలిక సాధనా సంపత్తికి రు. యాభై లక్షల కోట్లు కావాలని, దానిలో సగం ప్రైవేటు రంగానికి అప్పగిస్తున్నామని ప్రకటించారు. ప్రైవేటు రంగం పునాది లాభాపేక్ష అని, లాభాలు రాని రంగాలలోకి అవి రావని, వచ్చిన రంగాలలో కూడ ప్రజావసరాల పునాదిపై గాక లాభాపేక్ష పునాదిపై పనిచేసి ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తాయని, అందువల్ల ప్రభుత్వరంగం కావాలని తొలిదశాబ్దాలలో చెప్పుకున్న ఆదర్శాలను మన్మోహనార్థశాస్త్రం తారుమారు చేస్తున్నది.
ఈ బడ్జెట్ లో మరొక అంశం ప్రత్యక్ష పన్నుల భారాన్ని తగ్గిస్తూ, పరోక్ష పన్నుల భారాన్ని పెంచడం, మరిన్ని సేవారంగాలను పన్నుల పరిధిలోకి తేవడం. ఇవన్నీ అర్థశాస్త్ర సిద్ధాంతాలకు తలకిందుల వ్యవహారం మాత్రమే గాక ద్రవ్యోల్బణాన్ని మరింతగా పెంచేవి. ప్రత్యక్ష పన్నులు విధించగలిగిన అధికాదాయ వర్గాలను, కార్పొరేట్ రంగాన్ని వదిలేసి, ప్రతి సరుకులోనూ కలిసే పరోక్ష పన్నులను పెంచుతూ పేద, మధ్యతరగతి వర్గాలకు తెలియకుండానే వారి గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేసే విధానం ఇది.
కంటి తుడుపు చర్యగా ఆహారభద్రతా చట్టం కిందికి వచ్చే సబ్సిడీని మాత్రం యథాతథంగా ఉంచుతామని అంటూనే, “మిగిలిన అన్ని సబ్సిడీలను ప్రతికూల ఫలితాలు లేకుండా ఆర్థిక వ్యవస్థ భరించగలిగిన స్థాయికి తగ్గిస్తామ”ని సన్నాయి నొక్కారు. నిజానికి ఇవాళ పేద, మధ్యతరగతి వర్గాలకు అందే మొత్తం సబ్సిడీలు ధనిక, పారిశ్రామిక, వ్యాపార వర్గాలకు అందుతున్న రాయితీలలో సగం కూడ కాదు. అలాగే కార్పొరేట్, ప్రైవేట్, సంపన్న వర్గాలు ఎగ్గొడుతున్న పన్నులన్నీ సక్రమంగా వసూలు చేయగలిగితే పేద, మధ్యతరగతి వర్గాల సబ్సిడీలు సమస్యే కాదు. కాని నూతన ఆర్థిక విధానాలు మొదలయిన నాటినుంచీ పాలకవర్గాలన్నీ పేద, మధ్యతరగతి వర్గాలకు అందే సబ్సిడీలను కత్తిరించాలనే ఉత్సాహపడుతున్నాయి.
ఇక కొన్ని అంకెలు ఎంత మాయ చేస్తాయంటే పోషకాహార విలువలు పెంచే ప్రయత్నంలో భాగంగా మధ్యాహ్న భోజన పథకానికి రు. 11,937 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన పొట్టవిప్పి చూస్తే అసలు రంగు బయటపడుతుంది. దేశ6లోని విద్యార్థుల సంఖ్యతో, పాఠశాలల సంఖ్యతో, మధ్యాహ్న భోజనం అవసరమైన బాలబాలికల సంఖ్యతో పోల్చిచూస్తే పోషకాహారం కాదుగదా, పిడికెడు మెతుకులు దొరికే పరిస్థితి ఉండదు.
నెమలికన్ను: జాజి పూసే వేళ...
2012-05-01
మనస్వి: బై...బై....
KadaliTaraga : a wave in the Ocean !: ప్రపంచానికి మేడేనిచ్చిన నేల…
For Namasthe Telangana
నూట ఇరవై ఆరు సంవత్సరాల కింద మొట్టమొదటిసారి ఎనిమిది గంటల పని దినం కోరుతూ పోలీసు కాల్పులలో మరణించిన కార్మికుల నెత్తుటితో తడిసిన నేల.
ఒరిగిపోయిన వీరుడి చొక్కానే ధిక్కార పతాకగా ఎగరేసి ఎర్రజెండాను మరింత ఎరుపెక్కించిన నేల.
వాక్సభాస్వాతంత్ర్యాలను అణచదలచిన అధికారవర్గాల మీద బాంబులతో సవాల్ విసిరిన నేల.
పత్రికా సంపాదకుడే కార్మికోద్యమానికీ, ప్రదర్శనకూ నాయకుడై, బూటకపు విచారణలో మరణశిక్షకు గురై కార్మిక మేధావి ఐక్యతను చాటిన నేల.
కాల్పులు జరిపి కార్మికులను బలిగొన్న పోలీసులకే స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తే ఒకటికి నాలుగుసార్లు విగ్రహ విధ్వంసం చేసి, అమర కార్మికుల విగ్రహాలు నిలిపిన నేల.
ఇవాళ్టికీ ఉజ్వల ప్రేరణగా, గతవర్తమానాల వారధిగా నిలిచే నేల.
అమెరికాలో షికాగో నగరంలో హే మార్కెట్.
మేడే చరిత్ర చదివినప్పటినుంచీ, ఎన్నో ఏళ్లుగా మేడే సభల్లో ఆ విషయాలు మాట్లాడుతున్నప్పటినుంచీ చూడాలని అనుకుంటున్న ఆ నేలను చూసినప్పుడు మనసు ఉప్పొంగిపోయింది. నాలుగు సంవత్సరాల కింద ఒక మిట్ట మధ్యాహ్నం ఆ నేలను వెతుక్కుంటూ వెళ్ళి అక్కడి మట్టిని, అక్కడి స్మారక విగ్రహాన్ని స్పృశించి, అక్కడ పొందిన రెండు మూడు వింత అనుభవాల స్మృతి ఇది.
సహచరి వనజకు బర్కిలీ విశ్వవిద్యాలయంలో పదినెలల ఫెలోషిప్ వచ్చినప్పుడు, నాకూ చివరి పది వారాల పాటు అమెరికాలో ఉండే అవకాశం వచ్చింది. తొలి ఎనిమిది వారాలు పశ్చిమ తీరంలోనే ఉండిపోయినా, మిగిలిన రెండు వారాలు తూర్పు, మధ్య భాగాలలో కొన్ని ప్రాంతాలైనా చూడాలని అనుకున్నప్పుడు షికాగో, హేమార్కెట్ మేడే జన్మస్థలం ఆ జాబితాలో అగ్రభాగాన నిలిచింది. జూన్ 15న తిరుగు ప్రయాణం కాగా, జూన్ 8న డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ సమావేశంలో మాట్లాడవలసి ఉండింది. ఈ రెండు తేదీలకూ మధ్య షికాగో ప్రయాణం పెట్టుకున్నాం. జూన్ 11 పొద్దున మిత్రుడు ఆనంద్ ముసునూరు కారులో డెట్రాయిట్ నుంచి షికాగో బయల్దేరాం. అది మూడు వందల మైళ్ల, నాలుగు గంటల ప్రయాణం.
షికాగో వెళ్లాక అక్కడ చాలకాలంగా ఉంటున్న హరినాథ్ ఏపూరి కూడ మాతో కలిశారు. హేమార్కెట్ ఎక్కడ ఉందో, ఎలా వెళ్లాలో షికాగో మాప్ లు వెతికాం. ఇప్పుడా స్థలానికి హేమార్కెట్ అనే పేరు లేదు. ఆ స్థలం అంతా మారిపోయింది. హేమార్కెట్ అని ఎంత మందిని అడిగినా ఎవరూ చెప్పలేకపోయారు. మళ్లీ మాప్ లు వెతికి హేమార్కెట్ స్మారక స్థూపం నార్త్ డెస్ ప్లెయిన్స్ స్ట్రీట్ మీద ఉందని గుర్తించాం. మొత్తానికి అరగంట వెతికి ఆ స్థలానికి వెళితే రోడ్డు పక్కన భారీ కాంస్య విగ్రహాల సముదాయం. మన ఎడ్లబండి లాంటి బండి. చక్రాలు విరిగి పడి ఉన్నాయి. దాని కింద మృతదేహాలో, క్షతగాత్రులో ఐదారుగురు మనుషుల విగ్రహాలు. బండి మీద ఒక ఉపన్యాసకుడు. అతని పక్కన నిలబడి ఇద్దరు మనుషులు. ఒక పడిపోయిన మనిషి. అక్కడ ఒక శిలాఫలకం తప్ప మరే సమాచారమూ లేదు. నిజానికి అమెరికాలో ప్రతి చూడదగిన ప్రదేశం దగ్గరా కుప్పలు కుప్పలుగా సమాచారం, పుస్తకాలు, జ్ఞాపికల అమ్మకాల దుకాణాలు ఉంటాయి గాని ఈ స్మారక చిహ్నం దగ్గర మాత్రం ఏమీ లేవు. ఆ శిలాఫలకం మీద, విగ్రహాల మీద ఆయా కాలాలలో అక్కడికి వచ్చిన కమ్యూనిస్టులు, అనార్కిస్టులు, ఇతరులు రాసిన నినాదాలు, బొమ్మలు, గ్రాఫిటి ఎన్నో ఉన్నాయి.
ఒక నినాదం “మొదట వాళ్లు మీ ప్రాణాలు తీశారు, ఇప్పుడు వాళ్లు మీ జ్ఞాపకాన్నీ దోపిడీ చేస్తున్నారు” అని. మరొకటి ఒక వృత్తంలో ఎ అనే ఇంగ్లిష్ అక్షరం, అనార్కిస్టుల చిహ్నం. అలాగే అమెరికన్ పతాకను తలకిందులుగా చిత్రించిన బొమ్మలు.
ఆ స్మృతి చిహ్నం వెనుక చాల కథ ఉంది.
ఎనిమిది గంటల పనిదినాన్ని కోరుతూ 1886 మే 4న అక్కడ జరిగిన ప్రదర్శనలో పోలీసు కాల్పులు మాత్రమే కాక బాంబు పేలుళ్లు కూడ జరిగాయి. బాంబు పేలుళ్లలో ఏడుగురు పోలీసు అధికారులు, నలుగురు పౌరులు మరణించారు. ఆ తర్వాత జరిగిన విచారణలో బాంబు ఎవరు విసిరారో చెప్పలేమని ప్రాసిక్యూషనే స్వయంగా ఒప్పుకుంది గాని ఆ మరణాలకు బాధ్యులుగా కార్మిక నాయకుల మీద కేసు నడిపింది. ఎనిమిది గంటల పని దినానికి అనుకూలంగా ప్రచారం చేసిన, ఆ బూటకపు విచారణలో ఆ రోజు ప్రదర్శనలో ప్రధాన ఉపన్యాసకుడైన పత్రికా సంపాదకుడు ఆగస్ట్ స్పీస్ తో సహా ఎనిమిది మందికి మరణ శిక్ష విధించారు. ఇద్దరికి దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చినా స్పీస్ ను, మరి ఐదుగురిని 1887 నవంబర్ 11న ఉరికంబం ఎక్కించారు. ఆ ఉరికంబం మీద నిలిచి ఆగస్ట్ స్పీస్ చేసిన ఊహాగానం కనీసం స్మృతి చిహ్నం విషయంలోనైనా నిజమయింది. “మా మౌనం ఇవాళ మీరు నులిమేస్తున్న ఈ కంఠాల కన్న శక్తివంతమైనదని రుజువయ్యే రోజొకటి వస్తుంది” అని స్పీస్ చివరి మాటగా అన్నాడట.
నిజంగానే ఆ హేమార్కెట్ ప్రదర్శన స్మృతి ప్రపంచానికి మేడేను ఇచ్చింది. ఫ్రెంచి విప్లవ శతజయంతి సందర్భంగా 1889లో పారిస్ లో జరిగిన రెండవ ఇంటర్నేషనల్ సమావేశం షికాగో అమరుల స్మృతిలో ప్రపంచ వ్యాప్తంగా మేడేను కార్మిక దినంగా జరపాలని పిలుపు ఇచ్చింది. ఆ తర్వాతి సంవత్సరం నుంచీ మేడే కార్మిక పోరాట దీక్షాదినంగా ప్రపంచంలో వందకు పైగా దేశాలలో అధికారికంగా సాగుతూనే ఉంది. అమెరికా పాలకులు మేడే జరపకుండా ఉండడానికి సెప్టెంబర్ మొదటి సోమవారాన్ని కార్మిక దినంగా ప్రకటించారు గాని, ప్రజలు, కార్మికులు, కమ్యూనిస్టులు మేడేనే జరుపుకుంటారు.
ఇక హేమార్కెట్ లో మరణించిన పోలీసుల స్మృతి చిహ్నంగా ఒక పోలీసు అధికారి కాంస్య విగ్రహాన్ని తయారు చేసి హేమార్కెట్ చౌరస్తాలో ఆ 1889లోనే ప్రతిష్టించారు. కాని 1927 మే 4 న ఒక ఆ దారిన పోయే వాహనం ఒకటి దాన్ని గుద్దేసి పడగొట్టింది. “మనుషులను చంపిన పొలీసు విగ్రహాన్ని ప్రతి రోజూ చూసి కడుపు రగిలిపోయింది” అని ఆ వాహన డ్రైవర్ అన్నాడు. అలా ధ్వంసమైన విగ్రహాన్ని ఏడాది తిరగకుండానే తిరిగి నెలకొల్పి, మరొక చోటికి మార్చారు. ఆ తర్వాత 1950లలో రహదారి నిర్మాణంలో దాన్ని రహదారికి కనబడేలా ప్రస్తుత స్మృతి చిహ్నం ఉన్నచోట ఒక పెద్ద గద్దె మీద నెలకొల్పారు. కాని 1968 మే 4న వియత్నాం యుద్ధ వ్యతిరేక ప్రదర్శకులు ఆ విగ్రహానికి తారు పూశారు. తర్వాత 1969 అక్టోబర్ లో వెదర్ మాన్ బృందం శక్తివంతమైన బాంబు పెట్టి విగ్రహాన్ని పేల్చివేసింది. దాని స్థానంలో 1970 మేలో మళ్లీ విగ్రహాన్ని నెలకొల్పితే, దాన్ని కూడ వాళ్లే అక్టోబర్ లో పేల్చివేశారు. అప్పుడు దాన్ని పునర్నిర్మించి ఇరవై నాలుగు గంటల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాలు ఆగకపోవడంతో చివరికి 1972లో ఆ విగ్రహాన్ని పోలీసు కార్యాలయ ప్రాంగణంలోకి మార్చారు. అక్కడినించి కూడ 1976లో మరింత రక్షణ ఉండే పోలీసు అకాడమీ భవనంలోకి మార్చారు. తర్వాత మూడు దశాబ్దాల పాటు ఆ గద్దె ఏ విగ్రహమూ చిహ్నమూ లేకుండానే ఉండిపోయింది. ఈ లోగా 1992లో షికాగో పురపాలక సంస్థ ఆ స్థలాన్ని స్మారకచిహ్నంగా ప్రకటించి, అక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసింది. “కార్మికులకూ యజమానులకూ మధ్య ఒక దశాబ్దం పాటు సాగిన తగాదా మరింత ముదిరి ఇక్కడ ఘర్షణగా మారి కార్మికుల, పోలీసుల విషాదకర మరణాలకు దారితీసింది. ఇక్కడ క్రేన్స్ అల్లీ ముందు 1886 మే 4న కార్మిక ప్రదర్శన జరుగుతుండగా, డెస్ ప్లెయిన్స్ వీథి నుంచి వస్తున్న పోలీసు బృందంపై బాంబు విసరబడింది. ఆ తర్వాత ఎనిమిది మంది కార్మిక కార్యకర్తలపై జరిగిన విచారణ ప్రపంచ వ్యాపిత కార్మికోద్యమాన్ని ఆకర్షించి, అనేక నగరాలలో మేడే ప్రదర్శనల సంప్రదాయాన్ని ప్రారంభించింది” అని ఆ ఫలకం చెపుతుంది.
పురపాలక సంస్థ, కార్మిక సంఘాలు, పోలీస్ యూనియన్ కూడ కలిసి 2004లో ప్రస్తుతం ఉన్న పదిహేను అడుగుల ఎత్తయిన స్మృతి చిహ్నాన్ని నిర్మించి ఆవిష్కరించాయి. ఈ సారి పోలీసులు స్మృతి చిహ్నంలో లేరు. ఇది కార్మిక నాయకులు బండి మీద నిలబడి ఉపన్యసిస్తున్న దృశ్యానికి కళాకారిణి, శిల్పి మేరీ బ్రాగర్ చేసిన రూపకల్పన.
మేం ముగ్గురం ఆ స్మృతి చిహ్నం చుట్టూ తిరుగుతూ, అది ఎక్కి చూస్తూ, ఫొటోలు తీసుకుంటూ కాసేపు గడిపాం. అలా మేం అక్కడ ఉండగా ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల వృద్ధుడు, సరిగ్గా నడలేకపోతున్నాడు. ఎండ భరించలేనట్టు టోపీ పెట్టుకున్నాడు. ఇంగ్లిష్ కూడ రాదు. ఆ స్మృతి చిహ్నం దగ్గరికి వచ్చి, దాన్ని ఆప్యాయంగా తడుముతూ, కళ్లనీళ్లు పెట్టుకుంటూ దానిచుట్టూ కాసేపు పిచ్చివాడిలా తిరిగి వెళ్లిపోయాడు.
మరి కాసేపటికి ఒక ముప్పై సంవత్సరాల యువతి, తన చిన్నారి, రెండేళ్లు నిండని పాపను ప్రామ్ లో కూచోబెట్టుకుని నడిపిస్తూ అక్కడికి వచ్చింది. ఆ పాపకు తమ భాషలో షికాగో అమరవీరుల కథ, మేడే కథ చెపుతోంది. పలకరిస్తే, ఆమె చెరూకీ అనే స్థానిక ఆదివాసి తెగకు చెందిన యువతి. అటువంటి వందలాది ఆదివాసి జాతులను ఊచకోత కోసి, జాతి హననకాండ జరిపి నిర్మూలించి యూరపియన్ వలసవాదులు అమెరికాను ఆక్రమించుకున్న కథ అందరికీ తెలిసిందే. ఆమె పేరు కాథీ మల్లారె. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. హేమార్కెట్ ప్రదర్శన గురించీ, స్మారక చిహ్నం గురించీ కథంతా ఆమె చెప్పిందే. ఆమెనూ, పాపనూ కూడ ఫొటోలు తీసి ఆ ఫొటోలు పంపితే ఆమె మంచి జవాబు రాసింది.
“అంతమందిని అడిగినా స్మృతి చిహ్నం చిరునామా దొరకలేదంటే మీరు అడిగినవాళ్లు మీలాగే యాత్రికులో, షికాగో తెలియనివాళ్లో అయిఉంటారు. కాని షికాగోలో ప్రతి మూడో తరగతి విద్యార్థికీ నగర చరిత్ర చెపుతారు… దురదృష్టవశాత్తూ 1886లో ఉన్నటువంటి దుర్మార్గ రాజకీయాలే ఇవాళ కూడ ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘం నాయకురాలి మీద తప్పుడు విచారణ జరుగుతోంది. ఎల్లప్పుడూ పచ్చగా ఉండవలసిన ఒక ఉద్యానవనాన్ని తీసేసి అక్కడ భవనాలు నిర్మించడానికి నగర మేయర్ పర్యావరణ వ్యతిరేక నిర్ణయం తీసుకున్నాడు. మా నగరానికి ఒకప్పుడు తోటల నగరం అని పేరుండేది. ఇప్పుడు బహుశా ఆరు అంతస్తుల కారు పార్కింగ్ గారేజిల పైన మా తోటలు ఉండేట్టుంది…. సరుకుల కొనుగోళ్ల యావ నుంచీ, టెలివిజన్ కు అతుక్కుపోయిన జీవితాల నుంచీ, మైమరపించే వీడియో ఆటల నుంచీ నా సహచర పౌరులు ఏదో ఒకరోజు మేల్కొంటారని ఆశిస్తున్నాను. ప్రపంచాన్ని సంక్షోభం ఆవరించి ఉన్నదనీ, అమెరికన్ బాస్కెట్ బాల్ ఆటగాళ్లూ ఫుట్ బాల్ ఆటగాళ్లూ ఆ సంక్షోభం నుంచి తమను రక్షించలేరనీ మా ప్రజలు తెలుసుకుంటారనే నా ఆశ” అని ఆమె 2008 జూన్ 18న నాకు రాసింది.
నాలుగు సంవత్సరాల తర్వాత ఆక్యుపై వాల్ స్ట్రీట్ తో మొదలై అమెరికా వ్యాప్తంగా డజన్లకొద్దీ నగరాలలో, షికాగో లో కూడ జరిగిన ప్రజా ఉద్యమాల భవిష్యవాణి అది. మేడే చిరంజీవి.
http://www.namasthetelangaana.com/sunday/article.asp?category=10&subCategory=17&ContentId=99902
2012-04-30
అక్షరం: వెల్చేరు “కన్యాశుల్కం” : మంచి అనువాదానికి భాష, దృక్కోణం రెండు కళ్ళు!
2012-04-28
బ్లాగాడిస్తా!: అమృతత్వం నుంచీ అమృతత్వం లోకి...
2012-04-27
ఏటి ఒడ్డున: కొండవాగులో బంతి -- కథ వెనక కథ
2012-04-26
శ్రీ కృష్ణదేవరాయలు: ఇన్-ఫాచ్యుయేషన్.
2012-04-25
మనసులో మాట: ఈ దేశంలో ఒక భాగమిది
2012-04-24
రేఖా చిత్రం: అడిగేవాడికి చెప్పేవాడు లోకువ !
2012-04-23
మనోనేత్రం: కిట్టు కథలు - ఆస్తి ఎవరిది?
2012-04-22
నాతో నేను నా గురించి...: దేవస్థానం సినిమా గురించి
2012-04-21
రాతలు-కోతలు: విజయవాడ లో శంకర్ జైకిషన్ స్మృత్యంజలి.

ఇవాళ్ళ విజయవాడలో హాసం క్లబ్ ఆధ్వర్యంలో నెలనెల మూదవ శనివారం సాయంత్రం అంతే ఈ రోజు సాయంత్రం జైగే సభలో నేను శంకర్ జైకిషన్ స్మృత్యమలి కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాను. నేను శంకర్ జైకిషన్ జీవిత విశేషాలు, వారు తమ సంగీతం ద్వారా సృజించిన మహత్తరాయిన మాయాఅలం గురించి వివరిస్తూంటే, డాక్టర్ రాధాకృష్ణ మరో స్థానిక గాయని తో కలసి శంకర్ జైకిషన్ అమర గీతాలను గానం చేస్తారు. ఈ ఆర్యక్రమానికి వీలైనంత పెద్ద సంఖ్యలో హాజాఇ కార్యక్రమాని జయప్రదం చేయండి. షంకర్ జైకిషన్ పాటాల మాధుర్యాన్ని అనుభవించండి.
2012-04-19
రేఖా చిత్రం: నవ్వించే పూతరేకులు
2012-04-17
మాయాశశిరేఖ: సా..రీ...గా...మా..పాఆఆఆఆఆఆఅ....
2012-04-12
అక్షరం: పుట్టిన రోజు అక్షరాలా...
2012-04-09
e-తెలుగు: వెబ్ డెవలపర్లకు e-తెలుగు అవగాహనా సదస్సు (హైదరాబాద్, ఏప్రిల్ 15)
సమయం
ఆదివారం, ఏప్రిల్ 15, 2012 — ఉదయం 10 గంటల నుండి
మధ్యాహ్నం 12 గంటల వరకు
వేదిక
హనీపాట్ ఐటీ కన్సల్టింగ్ ప్రై. లి.
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ,
ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,
హైదరాబాద్ - 500 004.
(గూగుల్ పటం)
సంప్రదింపులు:
93965 33666, support @ etelugu [dot] org
మనస్వి: కృష్ణవేణి
2012-04-05
ఏటి ఒడ్డున: కొండవాగులో బంతి
2012-04-02
శోధన: చాలా రోజులకు...
రాతలు-కోతలు: సన్ ఫ్లవర్ వారపత్రిక కొత్త సంచిక విడుదలయింది.
4.4.2012 నాటి సన్ ఫ్లవర్ వార పత్రిక నిజానికి గత బుధవారమే విడుదలయింది. నేను కాస్త ఆలస్యంగా ఈ విషయాన్ని తెలియచేస్తున్నాను.
ఇదీ మనలోకం శీర్షికన 29ఏళ్ళు ఏకధాటిగా నిర్మించిన భవనంలో ఒకేరాత్రి గడిపి ఆ తరువాత పాడుపెట్టిన విచిత్ర కథ కె ఆర్ సుధాకర్ రావ్ రచించిన ఏక్ దిన్ కా సుకం- హజార్ సాల్ కా అవమానం చదవండి.
ఆచార్య ఫణీంద్ర రచించిన సీతా హృదయం గేయాలు మృదుమధురంగా వుంటాయి.
లక్ష్మణ చక్రవర్తి సాహిత్య వ్యాసం, జాషువా కవిత్వం, స్థానికత, దేశీయత, ఈ సంచికలో ప్రచురితం.
పెన్నా శివరామకృష్ణ ప్రయోగాత్మక గజల్ కూడా ప్రచురితం.
సన్ ఫ్లవర్ స్మృతి శీర్షికన, 1872 నాటి ఆంధ్రభాషా సంజీవని అనే పత్రికలో ప్రచురించిన కొన్ని పద్యాలు. ఇవి వార్తా పత్రికాలక్షణాన్ని చెప్తాయి. ఇవి చదివితే అప్పటి వార్తకూ, ఇప్పటి వార్తకూ ఎంత తేడా వచ్చిందో తెలుస్తుంది.
ఇవి కాక, కొత్తగా సన్ ఫ్లవర్ పద ప్రహేళిక ఆరంభమయింది.
ఇంకా, ఎం వేంకటేశ్వర్ రావ్ సీరియల్, ఆలంబన, నేను రాస్తున్న మారణహోమం డాట్ ఆర్గ్, సీరియళ్ళున్నాయి.
ఈ సారి విహారి కథ ఇల్లు, రాంపా కథ, నెక్లెస్ నెక్ లు ప్రత్యేక ఆకర్షణలు.
ఇంకా సినిమా గాసిప్పులు, చిట్కాలు, నీతులూ, కవితలూ, సూక్తులతో సన్ ఫ్లవర్ సంపూర్ణ కుటుంబ వార పత్రికగా ఎదగాలని ప్రయత్నిస్తోంది.
చెప్పటం మరిచాబు, ఈసారి బాలల సాంప్రదాయ గీతం, చప్పట్లోయ్, తాళాలోయ్…
ఈ పత్రికకు చందా కట్టాలనుకున్నవారుఈ క్రింది చిరునామ సంప్రదించాలి.
సన్ ఫ్లవర్ బిల్డింగ్స్, మున్సిఫ్ స్ట్రీట్, 5వ వార్డు, చల్లపల్లి, కృష్ణా జిల్లా
ఫోను; 08671-223376, లేక, 7382616925 కు ఫోను చేయవచ్చు.
2012-04-01
ఏటి ఒడ్డున: శూన్యంలో పూలు
సరిగమలు: ఏం వైభోగం మా రామయ్యది!
2012-03-31
జీవితంలో కొత్త కోణం...: పుస్తకాల డాక్టర్..
2012-03-28
మనసులో మాట: నాలాగా ఎందరో!
2012-03-24
నేను చెప్పేది ఏమిటంటే...: ఓ వీకెండ్ రాత్రి ఏమి జరిగిందంటే........
2012-03-20
మాయాశశిరేఖ: పనిమనిషి!
2012-03-19
అందం: ఆత్మ ఆటవెలది
శ్రీ కృష్ణదేవరాయలు: "కాఫీ విత్ కొత్తపాళీ"...
2012-03-15
శ్రీ కృష్ణదేవరాయలు: "మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు"
2012-03-08
సరిగమలు: వెలలేని మా ఖజానా...
2012-03-06
ఏటి ఒడ్డున: ఈ క్షణం
అందం: పతంజలిమహర్షికృత చరణశృఙ్గరహిత నటరాజస్తోత్రం
2012-03-03
అశోక్ జ్ఞాపకాలూ కబుర్లూ: రిప్ వాన్ వింకిల్
2012-02-29
జీవితంలో కొత్త కోణం...: శ్రీనివాసాచార్యులు.. హృదయం చలువపందిరి
2012-02-26
మనసులో మాట: శ్రీరామ రాజ్యం పుస్తకం..కాసిన్ని కబుర్లూ,బొమ్మలూ!
2012-02-25
నాతో నేను నా గురించి...: ఇష్క్ సినిమా గురించి చిత్రమాలికలో
పొల్లు మరియు తర్వాత అక్షరం కలిసిపోకుండా ఉండటానికి కావల్సిన కనిపించని అక్షరం (ZWNJ) నేను ఇంత క్రితం తయారు చేసిన ఆపిల్ లేయవుటులో లేదు. ఈ అక్షరాన్ని చేర్చిన కొత్త లేయవుటుని ఈ లంకె నుండి దించుకోండి (దీన్ని స్థాపించుకునే ముందు మీ కంప్యూటర్లో ఉన్న ఆపిల్ లేయవుటుని uninstall చేసుకోవాలి).
ఇక ఙ కోసం Right Alt + R, ఞ కోసం Right Alt + T లను ఉపయోగించండి.
ప్రస్తుతానికి లోహిత్ రమణీయలతో సరిపెట్టుకోవాల్సిందేనండీ. హెడ్డింగుల కోసం తెలుగు విజయం ఖతులను వాడి చూడండి.
Nice one…
Thy name development
@ సౌమ్య, వినదగు ఎవ్వరు చెప్పిన అన్నది నీపట్ల వర్తించదనుకుంటా :p. @ నోరూ, మెదడూ తిరిగిపోయే పుస్తకాలు, ఆఁ, నాకూ ఆశ్చర్యంగానే ఉంది అది చదువుతున్నానంటే. నువ్వు కనీసం 13, 14 అధ్యాయాలు చదువు అని చెప్దును గానీ నువ్వు వినవని తెలుసు కదా.
)
@ ఉష, మీరూ ఓ చెయ్యి వేసినందుకు నాకు పరమానందంగా ఉంది. ధన్యవాదాలు.
బావుంది. నేను ఉద్యమ ప్రచారం కావిస్తున్నాను. నాకు గాక మరొక ఇద్దరికి కొన్నాను. మావి నూక్ సంఘాలు.
ఈ మధ్యన పరిచయమైన ఇజ్రేయిలీ అతను నా వంతు కృషిని మెచ్చుకుని తానూ కొనుక్కున్నాడు. నా నాలుగు లెక్క ఆ విధంగా సరిపడింది.



