కూడలి అనేది తెలుగు బ్లాగుల నుండి కొత్త టపాలని సేకరించి, వాటిని వర్గీకరించి సంబంధిత పేజీలలో చూపించే సంకలిని. కూడలి మీకు నచ్చితే, మీ బ్లాగు లేదా సైటు నుండి కూడలికి లంకె వేయండి.
తెలుగు బ్లాగావరణంలో తెలుగు బ్లాగుల నుండి ఫీడులను సంకలనించడం అనేది కూడలితోనే మొదలయ్యింది. కూడలి మాత్రమే కాక క్రింద పేర్కొన్న ఇతర తెలుగు బ్లాగుల సంకలినులు కూడా అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి.
- తెలుగుబ్లాగర్స్.కామ్
- తేనెగూడు
- జల్లెడ
ఇంటర్నెట్టు వచ్చింది కానీ, అది ఇంగిలిపీసులో ఉంటుంది. ‘నేటివిటీ’ అనేది చచ్చుబడిపోయింది. మళ్ళీ కూడలిలో ఈ మధ్యే ఆ ఆనందాన్ని ‘కొంత’ అనుభవిస్తున్నాను.
— నాగరాజా
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మన తెలుగు వాళ్ళు రాసే అభిప్రాయాలను ఒకే వేదిక మీద పంచుకునేందుకు కూడలి ఒక వేదికగా నిలచింది.
— సుధాకర్ (శోధన)
అమెరికాలో నేను ఒంటరి అన్న భావన రాలేదంటే దానికి కారణం..మన కూడలి.
— గార్ల సురేంద్ర నవీన్
కూడలి దొరికనప్పటి నుండీ, దాన్ని గంట గంటకీ చూడకపోతే ఏదో వెలితి. మా ఆవిడ ఫోన్ చేసినప్పుడు నేను ముక్తసరిగా జవాబిస్తే “ఏంటి కూడలిలో బ్లాగులు చదువుతున్నారా? లేక మీరే రాస్తున్నారా?” అంటూ ఎత్తిపొడుస్తోంది! :-(
— చరసాల ప్రసాద్
'కూడలి' భవిష్యత్ (సరదాగ ఒక 'డ్రీ౦' )
మన కూడలి లో రాతల ప్రవాహ౦ చూస్తొ౦టే కొన్నాళ్ళ తర్వాత బాగా ప్రాచుర్య౦ పొ౦ది పరిస్థితి ఇలా వు౦టు౦దేమోనని అనిపిస్తు౦ది...
— ఆస్ట్రేలియా నుంచి సాయి