2007-10-06

ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరి పోరాటం

2007-10-06 07:00 AM భూమిక - భూమిక
జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరశనని ప్రపంచానికి తెలియచెప్పింది. అంతకు మించిన దారేదీ ఆమెకు కన్పించలేదు. అంత తీవ్రమైన చర్యకి దిగితే తప్ప ఆమె ఎదుర్కొంటున్న సమస్య ఎవరికీ అర్ధం కాలేదు. పోలీసులు, న్యాయవ్యవస్థ ఆమె పట్ల వ్యవహరించిన నిర్లక్ష్యవైఖరి ప్రపంచానికి తేటతెల్లం కాలేదు. ఎవరీ పూజా చౌహాన్? 2004లో పూజకి ప్రతాప్ చౌహాన్తో పెళ్ళయింది. ప్రతాప్ కూరగాయలమ్ముకుంట, పేపర్లు పంచుత జీవనం [...]

(శీర్షిక లేదు)

2007-10-06 06:58 AM భూమిక - భూమిక
ఎన్. వేణుగోపాల్,హైద్రాబాద్ గౌరవనీయ మిత్రులు కొండవీటి సత్యవతి గారికి, భమిక సెప్టెంబర్ 2007 సంచికలో ‘వనవీయ భాష నేటి అవసరం’ అని మీరు రాసిన సంపాదకీయం స్పర్తితో పూర్తిగా ఏకీభవిస్త మీ ఆవేదనలో, ఆందోళనలో భాగం పంచుకుంటున్నాను. ప్రత్యావ్నయ ఉద్యవలు నడపదలచినవారి వ్యక్తీకరణలో అటువంటి భాష దొర్లగడదనే విషయంలో మరొక అభిప్రాయమే ఉండడానికి వీలులేదు. అయితే మీ సంపాదకీయం చదివాక నాలో కలిగిన ఒకటి రెండు అభిప్రాయలను కూడ చెప్పవలసి ఉంది. ఆ సభ గురించి, అక్కడ ప్రకటించిన [...]

(శీర్షిక లేదు)

2007-10-06 06:55 AM భూమిక - భూమిక
డా. విద్యాసాగర్ అంగళకుర్తి, హైదరాబాదు సంపాదకుల వారికి నమస్సులు, సెప్టెంబరు 2007 ‘’భమిక'’ లో మన భాషమీద మీ సంపాదకీయం వో లోతైన విషయన్ని ఎత్తి చపుతోంది. దీన్ని మనం తీవ్రంగా పరిగణించాలి. మన తెలుగు భాషలో ఎన్నో పదాలు స్త్రీని కించపరిచేవిగా ఉన్నాయి. అయితే ఈ పదాలన్నీ వాడుకలో ఎంతగా కలిసిపోయయంటే వాటిని వాడకుండా ఉండలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. వాస్తవానికి చాలా మందికి అటువంటి పదాలను వాడుతున్నామన్న [...]

(శీర్షిక లేదు)

2007-10-06 06:54 AM భూమిక - భూమిక
అనిశెట్టి రజిత, వరంగల్ సంపాదకులకు, నమస్సులు ! గత సంచిక సంపాదకీయంలో ‘నేటి అవసరమైన వనవీయ భాష’ గురించి మీరు ప్రస్తావించారు. ఈ రోజు సృష్టిలో మనిషికి ఇతర ప్రాణులకన్నా ఎక్కువ గౌరవం ఒక సావజిక హోదా ఉన్నాయంటే ముఖ్యమైన వ్యక్తీకరణ లక్షణాల్లో ఒకటి భాష. గౌరవనీయమైన వనవ భాషనే నాగరికులెవ్వరైనా కోరుకుంటారు. పీడనల సవజంలో ఒకరినొకరు కించపర్చుకోవడానికి, అగౌరవపరుస్త హింసించుకోవడానికి భాష కూడా ఒక ఆయుధంగా ఉపయెగించబడుతున్నది. శ్రీశ్రీ ‘అనంతం’ ప్రచురణ జరిగిన తరువాత అందులో స్త్రీల [...]

(శీర్షిక లేదు)

2007-10-06 06:51 AM భూమిక - భూమిక
విజయశ్రీ, హైద్రాబాద్ సత్యవతిగారికి అభినందనలు చెపుత నా ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సెప్టెంబర్ వసం భమికలో వఘసర్యకాంతి, పుష్ప రాసిన విమెన్స్ కాలేజీ అనుభవం, డి. చంద్రకళ కవితా, వసంతకువరిగారి ‘పరంపర’ కథానిక దేనికదే చాలా బావున్నాయి. స్త్రీలని అన్ని కోణాల్లో చపించే కధానికలు, ఇతర ప్రక్రియలు ప్రచురించడంతో చాలా ఆసక్తికరంగా ఉంది భమిక. ‘స్త్రీవాదం’ అంటే స్త్రీలుసంప్రదాయలకి విరుద్ధంగా ఉండాలనే నియమంలేదు కదా. సంప్రదాయలని కించపరుస్త రాసిన కొండేపూడి నిర్మలగారి వ్యాసం కొంత వెలుగును చడాలేవె.

(శీర్షిక లేదు)

2007-10-06 06:50 AM భూమిక - భూమిక
రేణుక అయోల, హైద్రాబాద్ మృదంగం శీర్షికలో కొండేపూడి నిర్మలగారి వ్యాసం చదివాక నాలుగు ముక్కలు రాయలనిపించింది. రచయిత్రి వివాహ వేడుకలని సరిగ్గా అర్ధం చేసుకున్నట్లు లేదు. సంప్రదాయలు వర్చాలని సచిస్తున్నారా. లేక వివాహ వేడుకలని వెక్కిరిస్తున్నారా అర్ధం కాలేదు. బాల్యవివాహాలు వేరు, సంప్రదాయ సిద్ధ వివాహ వేడుకలు వేరు. పరిణితి చెందినవారు. నేటి యువతి యువకులు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నా, కలిసి జీవిస్త వారి వారి అస్థిత్వాలని చెదరరకుండా ముందుకు సాగిననాడు అది ఆధునిక జీవనమే అవుతుంది.వట్లాడలేమన్నట్లుగా [...]

(శీర్షిక లేదు)

2007-10-06 06:49 AM భూమిక - భూమిక
వందన, శివాజీపాలెం సెప్టెంబరు సంచికలో డా. ఎండ్లరి సుధాకర్ గారు, రాష్ట్రపతి పదాన్ని ‘రాష్ట్రసతి’ గా వర్చాలంట, అలా వరుస్తే జెండర్ పరంగా గౌరవంగా వుంటుంది అని అంటున్నారు. మంత్రి కార్యదర్శి వంటి అధికారిక పదవే ‘రాష్ట్రపతి’ కూడా. మంత్రి స్త్రీ అయితే మంత్రిణి, కార్యదర్శి అయితే కార్యదర్శిణి అని అనం. అలా అనకపోయినా ఆ పదవులకూ, ఆ పదవులనలంకరించిన స్త్రీలకూ నష్టమేం లేదు. ‘పతి’ అంటే, మగాడు-మొగుడు’ అని అనుకోవలసిన అవసరమే [...]

(శీర్షిక లేదు)

2007-10-06 06:46 AM భూమిక - భూమిక
నటరాజ్, విశాఖ సెప్టెంబరు భూమికలో, ‘నను మించి వ్యాపించనంత వరకు నీ విస్తృతీ నా కిష్టం’ అని డా. జరీనా బేగం గారు మగ పెద్ద మనసును కవితలో చాలా బాగా వ్యక్తీకరించారు. భమిక లోని కవితల సెలక్షన్ బాగుంటుంది. బొవ్మ-బొరుసు, డి. చంద్రకళ గారి కవిత, నిష్టూరమైన నిజాల్ని మొకం మీద గుద్దింది. మగాళ్ళు సిగ్గొదిలేసి కొన్ని యుగాలయ్యింది. యిప్పుడు కావలసింది యిట్లాంటి చెప్పుదెబ్బలే. పరంపర కథలో వసంతకువరిగారు, అంత మంచి అత్తగారికి [...]

పెనుచీకటిలో చిరుదీపం

2007-10-06 06:42 AM భూమిక - భూమిక
కొండవీటి సత్యవతి 2006 మార్చి 16న భూమిక హెల్ప్లైన్ ప్రారంభమైంది. ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు రెండు వేలకు పైచిలుకు స్త్రీలు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకోవడం, వారికి కావలసిన సవచారం, సలహాలను అందించడం జరిగింది. ఎన్నో సీరియస్ కేసులను పరిష్కరించుకునేలా దిశా నిర్దేశం యివ్వడం జరిగింది. అసలు ఈ హెల్ప్లైన్ ప్రారంభించా లన్న ఆలోచన ఎలా కలిగిందని చాలామంది అడుగుతుంటారు. మీకందరికి తెలుసు 1993 నుండి భమిక పత్రిక విజయ వంతంగా నడుస్తోంది. పత్రికలో [...]

ఓర్చుకో… మార్చుకో…

2007-10-06 06:39 AM భూమిక - భూమిక
భార్గవీరావు పచ్చటి పెళ్ళిపందిరి! పూలు, పన్నీరు, పసుపు, కుంకుమ, గంధం… అన్నీ కలబోసిన పల్చటి సుగంధం అతిధులకు ఆహ్వానం పలుకుతోంది. వెల్లివిరుస్తున్న సంతోషం మంగళ వాద్యాల్లా సన్నాయి లా వినిపిస్తోంది. ఉచ్ఛస్వరంలో మంత్రోచ్ఛా రణల మధ్య ఉదయ, భాను ప్రకాశ్ భార్యా భర్తలవుతున్నారు. ‘’ఈడ, జోడ ఎంత ముచ్చటగా వుంది! పేర్లు కూడా - జంట స్వరాల్లా - ఉదయ, భాను - ఒకరికోసం ఒకరు పుట్టినట్టు! అదృష్టవంతులు!'’ పెళ్ళికి వచ్చిన బంధు [...]

మాటలు - వెలివేసే పద్ధతులు

2007-10-06 06:36 AM భూమిక - భూమిక
థెమ్సులా అఓ అనువాదం: ఓల్గా సవజంలోని అన్ని రపాలలో వున్న అధికార నిర్మాణాలకు వెలివేసే పద్ధతులు అవసరమైన ముందస్తు పరిస్థితిగా ఉండటమనేది వనవజాతి ఉనికిలోని ఒక స్వీయ వైరుధ్యంతో కూడిన సత్యం. ఈ సత్రం ప్రకారం హక్కులను, అవకాశాలు కొద్దిమంది చేతిలోనే ఉండి చాలామందికి నిరాకరించబడతాయి. విశాల పరిధిలో చసినపుడు సాంఘిక వెలి అనేది ప్రధానంగా జాతి కేంద్రంగా యేర్పడుత వచ్చింది. దాని మూలంగా కొన్ని గ్రపులను సవజపు అట్టడుగు వర్గాలుగా వుంచేందుకు అవసరమైన [...]

షులామిత్ ఫైర్ స్టోన్ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్

2007-10-06 06:32 AM భూమిక - భూమిక
పి.సత్యవతి రెండవ దశ స్త్రీవాదోద్యమ ప్రభంజనంలో వెలువడిన సంచలనాత్మక గ్రంధాలలో ‘’ద డైలెక్టిక్స్ ఆఫ్ సెక్స్'’ ఒకటి. రాడికల్ స్త్రీవాదాన్ని ప్రారంభించిన వారిలో ముఖ్యులైన షులామిత్ ఫైర్ స్టోన్. ఈ గ్రంథ రచయిత్రి రెడ్ స్టాకింగ్స్ అనే న్యయర్క్ స్త్రీవాదుల సంఫన్ని స్థాపించింది. రెండవ ప్రపంప యుద్ధానంతర కాలంలో కెనడాలో జన్మించిన షులామిత్, చికాగో ఆర్ట్ ఇన్స్టిట్యట్లో బాచిలర్స్ డిగ్రీ చేసింది. తరువాత న్యయర్క్లో స్ధిరపడి క్రియశీల స్త్రీవాద రాజకీయలలోకి అడుగు పెట్టింది. ‘’ద డైలెక్టిక్స్ ఆఫ్ [...]

ఆమె ఓ ప్రవాహం

2007-10-06 06:26 AM భూమిక - భూమిక
అరసవిల్లి కృష్ణ ఆకాశంపై రక్తమరకలు అక్షరంలో తుడిచేద్దామనుకున్నాను ఆకాశం నవ్వింది నా హృదయదీపం రెపరెపలాడింది. వొకే పయ్రణంలో ఇద్దరిదీ చెరోదిక్కు ఒకే చెట్టుకు పూచిన రెండుపూల మధ్య రెండుదేశాల మధ్య ఉన్న దరం గంగానది అన్నా, జీవనదిని గుండెలపై వెస్తున్న సీ్తలన్నా ఆమెకు, కన్నీటి పవ్రాహమంత ఇష్టం ఆమె మనుషులు గురించే వట్లాడుతుంది మనిషికంటే సౌందర్యమేముంది? రెండువటల మధ్య నీటిజలం కోసం వెదుకుతుంది ఆమె! వంతెన కడుతుంది ఆకాశంలో వర్షమబ్బు అంటే ఇష్టం అచ్చం వ అమ్మలానే వర్షిస్తుంది. సర్యుడు ఖాళీ చేసిన ఆకాశంపై రక్తమరకలు అక్షరం చేతులమధ్య నుండి కాగితంపైకి పవ్రహిస్తుంది చంపేయండి! చంపేయడం చాలా తేలిక సీ్తలను చంపడం [...]

తస్లీమాలు గావాలి

2007-10-06 06:16 AM భూమిక - భూమిక
ఉదయమిత్ర భూమి గుడ్రంగా ఉందన్నందుకు కాల్చిన పెనం మీద వడ్చినా నిజాన్ని నిర్భయంగా చెప్పిన కోపర్నికస్ ధిక్కారంలోంచి వట్లాడుతున్నా… తన పజ్రల స్వాతంత్యం కోసం తానే స్వయంగా మంటల్లోకి నడిచి తన పజ్రల ఆకాంక్షల్ని తుదిదాకా వెలిగించిన జోన్ ఆఫ్ ఆర్క్ త్యాగనిరతిలోంచి వట్లాడుతున్నా… ఆడపిల్లలకు అక్షరం నేర్పినందుకు ఆడపిల్లలకు బడిని పెట్టినందుకు రాళ్ళదెబ్బలు తిన్నా అవవనాలెదురైనా మడమ తిప్పని సరస్వతీపూలే సహనంలోంచి వట్లాడుతున్నా… కత్తుల పహారాల మధ్య ఎగిసిన రప్కన్వర్ చితిలోంచి వట్లాడుతున్నా వృద్ధాప్యంలో విడాకుల పాలయి ముష్టిభరణానికి నోచుకోని షాబానో నిస్సహాయతలోంచి వట్లాడుతున్నా. భస్వాములకూ, నైజాములకూ ఎదురొడ్డి భమిపోరులో నిల్చిగెల్చిన ఐలమ్మ అనుభవంలోంచి వట్లాడుతున్నా. అనేకానేక అరాచకాల [...]

ఉర్దూ సాహిత్యంలో భార్యది కాదు, ప్రేయసిదే వెలుగు

2007-10-06 05:29 AM భూమిక - భూమిక
(శ్రీ జుబైర్ రిజ్వీతో డా|| రమేశ్ ఉపాధ్యాయ ‘కుటుంబంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపైన జరిపిన ఇంటర్వ్యలోని చివరి భాగం. హిందీనుండి అనువాదం.) అనువాదం: డా|| జె.ఎల్. రెడ్డి (’పూరే కద్ కా ఆఇనా’, ‘ఉర్ద, ఫునన్ ఔర్ అదబ్’, ‘గాఅబ్ ఔర్ ఫుననే లతీషా’, ‘గర్దిశ్-ఏ-పా’ లాంటి 10 పుస్తకాల రచయిత, ‘జెహన్-ఏ-జదీద్’ అనే (ప్రముఖ త్రైవసిక సాహిత్యపత్రిక సంపాదకుడు జుబేర్ రిజ్వీ (జననం 1936) ప్రసిద్ధ ఉర్ద కవి, విమర్శకుడు. 1991 నుండి ఈ పత్రికను [...]

తస్లీమాకి క్షమాపణలు

2007-10-06 05:25 AM భూమిక - భూమిక
సీతారాం - తస్లీమాకి క్షమాపణలు. అవమానించి నందుకు. అవవనించడాన్ని సహించినందుకు, తిలకించినందుకు. ప్రేక్షకులమై నిలబడినందుకు. తస్లీవకి క్షవపణలు. మత విషయలు సున్నితమైన వని భావించినందుకు మేమెవరమూ ఇంకాస్త పెద్దగా పెదవి విప్పనందుకు. మనుషులుగా మనం అనుకుంటు న్నంత సున్నితంగా మతాలు లేవని ముందే గ్రహించనందుకు తస్లీవకి క్షవపణలు. జరిగిన దాడిని వారివారి అనుకూలతల మేరకు వారు త్వరగా మరచిపోయినందుకు క్షవపణలు. ఆమె రచనలు పూర్తిగా చదవనందుకు, చదవకుండానే [...]

2007-10-02

ఈనెల రచనలు

2007-10-02 10:15 AM పొద్దు - పొద్దు
ప్రసిద్ధ పాత్రికేయుడు, నెల్లుట్ల వేణుగోపాలరావు ఈనెల పొద్దు అతిథి. సమకాలీన సామాజిక రాజకీయ విషయాలపై విమర్శనాత్మక వ్యాసాలు రాసే వేణుగోపాల్, నెజ్జనులు చెయ్యగలిగిన పనులను సూచిస్తున్నారు. ఆయన కడలితరగ పేరుతో బ్లాగును నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో “వర్తమానం” శీర్షికన వ్యాసాలు రాస్తున్నారు. అతిథి వ్యాసం రాసేందుకు పొద్దు అభ్యర్ధనను మన్నించి ఈ వ్యాసాన్ని రాసి ఇచ్చినందుకు వేణుగోపాల్ గారికి పొద్దు కృతజ్ఞతలు తెలుపుతోంది! ఈ నెల రచనలు: నెజ్జనులకు సూచనలు

నెజ్జనులకు సూచనలు

2007-10-02 10:14 AM పొద్దు - పొద్దు
కొండొకచో ఆ అభివ్యక్తిలో అనుచితమయిన వ్యక్తీకరణలూ, అసంపూర్ణ భావాలూ కూడ వస్తూ ఉండవచ్చును. కాని ఆ అభ్యంతరాలను మించి చూడవలసిన విషయమేమంటే, ఇంతకుముందువరకూ రచన తమకు సంబంధలేని వ్యవహారమని అనుకున్న వర్గాల నుంచి హఠాత్తుగా రచయితలు పుట్టుకొస్తున్నారు. అవి పూర్తి రచనలు కాకపోవచ్చును, కాని రచనా ప్రయత్నాలు.

2007-10-01

నల్లగొర్రె

2007-10-01 08:54 PM స్కైబాబ - ప్రాణహిత
తలొంచుకుని ముందు నడుస్తున్న సహచరుణ్ని అనుసరిస్తున్నాయి గొర్రెలన్నీ తలొంచుకుని నడవడం గొర్రెల అలవాటు కదా

గుప్పిట్లో భూగోళం

2007-10-01 08:53 PM బండ్ల మాధవ రావు - ప్రాణహిత
ప్రత్యక్ష సంభాషణల నిరంతర అంతరాయాల మధ్య ఇప్పుడు అందరం సెల్లో బందీలమయ్యాం సంభోదనా పరికరాలైన పేర్లు సంఖ్యలు గా మారిపోయాయి

విముక్తి గీతం

2007-10-01 08:51 PM కొండెపోగు బి. డేవిడ్‌ లివింగ్‌స్టన్‌ - ప్రాణహిత
కొత్త రాగమెత్తుకో వద్దు నే సవర్ణుణ్ని కాను అతి శూద్రుణ్ని అసలేకాదు గుట్టు చప్పుడు కాని జీనోసైడ్‌ వెర్బల్‌ దాడి చెయ్యొద్దు

సజీవ వీడ్కోలు

2007-10-01 08:50 PM డా. కె. గీత - ప్రాణహిత
నేస్తం! ప్రేమ తళతళామెరిసే నా కళ్లమీద త్వరగా కాసిన్ని ముద్దులు పెట్టు తనివితీరా హత్తుకుని నాకు వీడ్కోలు చెప్పు సాయంత్రం ఇలా వస్తానో - రానో - సజీవంగా -

బతుకొక ఎర్రదీపం

2007-10-01 08:48 PM తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ - ప్రాణహిత
ఆత్మవంచన మోనాపలీలో “మహాఆత్మ” కలిగినట్లు కనిపిస్తూ ఆడాళ్ళతో నగ్న శరీరిలా కనిపించే వాడొకడు తనది బ్రహ్మచర్యమని నిలువునా బొంకుతాడు

పెనుగులాట

2007-10-01 08:39 PM అన్నవరం దేవేందర్‌ - ప్రాణహిత
నాగలి దున్నే చేతుల్లో ఎర్రజెండాలు దండు కట్టి నినదిస్తున్నాయి ఊరూరి దొరలు ఒక్కటై నైజాం పైజామల జాక్కున్న రోజులు

నడిచే మోదుగ చెట్టు

2007-10-01 08:38 PM ఆర్‌. రత్నాకర్‌ రెడ్డి - ప్రాణహిత
గోడెక్కి దశన్న పూవు - మొగ్గదీరి మల్లె - చెమ్మగిల్లిన వాకిలి ఆ వచ్చేది కచ్చితంగా అక్కనే ఔ! తమ్ముడికచ్చే ఒక్కగానొక్క పండుగ అక్కే కదా చెక్కర కుడుకతో రాఖీపండుగో ఏదో ఒక సందు

సొంతిల్లు

2007-10-01 08:37 PM ముకుంద రామారావు - ప్రాణహిత
మనదనుకుంటే మనదే కాదనుకుంటే కాదు అనేవారు తాతయ్య

నిర్దేశాత్మక వ్యాకరణం - ప్రాదేశిక భాషలు

2007-10-01 08:35 PM జిలుకర శ్రీనివాస్‌ - ప్రాణహిత
-జిలుకర శ్రీనివాస్‌, పసునూరి రవీందర్‌ ‘వ్యాకరణం’ మానవీయ శాస్త్రాలకు అత్యంత ప్రాధమిక అంశమూ కీలక అంశమూ అని విశ్వసించిన కాలం నుంచి వ్యాకరణశాస్త్ర అభ్యాసం, బోధన రెండూ అవసరమా అన్న విచికిత్స కొనసాగుతున్న సందర్భంలో తెలుగు వ్యాకరణాలను పునస్స­మీక్షించుకొంటున్నాం. వ్యాకరణం ప్రాభవం క్షీణించి భాషాశాస్త్రం వెలుగులో విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖలు నూత్న మార్గాలు అన్వేషిస్తున్న వర్తమానం యిది.

నూరేళ్ల మార్టిన్‌ ఈడెన్‌

2007-10-01 08:32 PM ముక్తవరం పార్థసారథి - ప్రాణహిత
ప్రతి రచయితా ‘లక్షలు సంపాదించడం ఎలా?’ అనేది అలా ఉంచి, ‘కీర్తి ప్రతిష్ఠలు ఎప్పుడొస్తాయి? పాఠకులు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు?’ అని కలలు కంటాడు. ఆ కలల్లో అసహజత్వమేమీలేదు. అత్యాశ కూడాలేదు. రాసేది అభిప్రాయ వ్యక్తీకరణ కోసమే అయినప్పటికీ, అది నలుగురూ చదువాలనే కోరిక అందరికీ ఉంటుంది.

కలమ్మ కలకలం

2007-10-01 08:28 PM జూపాక సుభద్ర - ప్రాణహిత
‘వో అమ్మా గా సిన్నపోషన్నోల్లు యింటికొచ్చిండ్రే… అచ్చి నిన్ను బిన్న రమ్మంటండ్రే’ కలుపుదీసే సర్పంచి కలమ్మను తన బిడ్డె వనమ్మ కీకబెట్టినట్లు సెప్పింది. ‘ఎందుకాట బిడ్డా’ దూరంగ నిలుసున్న బిడ్డెతోని అంతే బిగ్గెరగ అన్నది కలమ్మ. ‘ఏమోనే నాకేమెర్క’ అని తల్లి కలుపుదీసే పాలుకు పక్కపోంటి వచ్చి నిలుసున్నది.

సమాచార విప్లవం

2007-10-01 08:27 PM కొండేపూడి నిర్మల - ప్రాణహిత
…….. యూజరు నేమ్: భారతీదేవి సబ్జెక్టు: ఐ లవ్యూ, వామన రావు …….. రిజిస్టరు నంబరు: టి.405081 గారికి, ‘డోకూ’ డాట్ కామ్‌లో మిమ్మల్ని చూశాను. మీరు చాలా అందంగా వున్నారు. సో నేను ఆన్సరు చేయాల్సిన వంద మెయిల్సు పక్కన పెట్టి మీకే ముందుగా జవాబిస్తున్నాను.

తెల్లకాకులు – నల్లపత్తి

2007-10-01 08:23 PM ఏ. సువర్ణ - ప్రాణహిత
మట్టి గోడకు కాళ్లాడుతున్న చిమ్మినీ దీపం ఆరిపోయింది. కొటాయ్‌కు మెళుకు వచ్చింది. గుడిసెలో కటిక చీకటి. అతనికి కొంచెం దూరంలో పెళ్లాం పిల్లలు పడుకున్నారు. గురక మాత్రమే వినిపిస్తున్నదే కానీ మనుష్యులు అగుపించడం లేదు కొటాయ్‌కు. పైసలివ్వకపోతే దీపంలోకి కిరసనాయిలు కూడా పొయ్యనన్నాడు కోమటి కొట్టు సుబ్బారాయుడు.

అడుగుజాడలు

2007-10-01 08:20 PM జి. వెంకట క్రిష్ణ - ప్రాణహిత
”అమ్మా సుజీ, లేమ్మా కాఫీ తాగుదువు గానీ…” నాన్న అంత ప్రేమగా పలకరిస్తుంటే బదులు చెప్పకుండా వుండలేకపోయాను. ”గంటనుంచీ నాన్నమ్మ పిలుస్తుంటే పలక్కుండా వున్నావంట. యీ మాత్రం దానికే యిట్లయితే ఎట్ల తల్లీ. యిట్లాంటివి యింకా ఎన్ని చూడాలో. యీ పదైదేండ్లలో నేనెన్ని చూసిండాలి చెప్పు. లే, లేచి కాఫీ తాగు”

సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ - విడియో

2007-10-01 08:00 PM ప్రాణహిత - ప్రాణహిత

పాటే నా ప్రాణం – సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ - 3

2007-10-01 07:50 PM ప్రాణహిత - ప్రాణహిత
ప్రాణహిత: దాదాపు రెండు వేల ఏళ్ల తెలుగు సాహిత్యంలో రైతును అనేక విధాలుగా వర్ణించారు. రైతు గురించి పద్యాలు రాసారు. అశోక్: రైతు రామాయణం రాసాడు ఒకాయన. ప్రాణహిత: అవును! ఏటుకూరి వెంకటనర్సయ్య రైతు మీద కావ్యం రాసారు. అట్లాగే దువ్వూరి రాంరెడ్డి కూడా రైతు గురించి రాసారు. శ్రీశ్రీ ‘పొలాలనన్ని హలాలు దున్ని’ అని రాసారు. కానీ మీరు రైతుని ఒక కొత్త పద్ధతిలో పట్టుకున్నారు. చందమామతో పోలుస్తూ ‘ఆకుపచ్చ చందమామ’ అన్నారు. ఆ పాట జలపాత రహస్యం [...]

పాటే నా ప్రాణం – సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ - 4

2007-10-01 07:45 PM ప్రాణహిత - ప్రాణహిత
ప్రాణహిత: పాట చాలా శక్తివంతమైన మాధ్యమం దీన్ని మనం వాడుకోవాలి అన్నారు. అట్లా వాడుకునే పద్ధతిలో, ప్రజలకు ఉపయోగపడే విధంగా, లేదా మీరు చెప్పే భావాలకు ఉపయోగపడే విధంగా సినిమా రంగాన్ని వాడుకునే ప్రయత్నాన్ని మీరేమైనా చేస్తున్నారా?

పారిస్ రివ్యూ - పాబ్లో నెరూడా ఇంటర్‌వ్యూ - 3

2007-10-01 07:41 PM ప్రాణహిత - ప్రాణహిత
ప్ర: మీరు కార్లో ప్రయాణం చేస్తూ రాయడం చూసాను? నె: నేనెక్కడ ఎప్పుడు రాయగలిగినా రాస్తాను. ఎల్లప్పుడూ రాస్తూ ఉంటాను. ప్ర: మీరెప్పుడూ రచనలన్నీ చేత్తోనే రాస్తారా? లేదా టైపు యంత్రం వాడతారా? నె: నేను ప్రమాదం లో నా వేలు విరగ్గొట్టుకుని టైపు యంత్రాన్ని కొన్ని నెలలు వాడలేక, మళ్ళీ చేత్తో రాసే నా యవ్వనపు రోజుల్లోని అలవాటు వైపు మళ్ళాను.

అపరాజిత - అధ్యాయం 1: హి - డాగ్ నుంచి వచ్చిన స్త్రీ

2007-10-01 07:15 PM మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత - ప్రాణహిత
“ఒక జాతి స్త్రీలు స్థైర్యం కోల్పోనంతవరకూ ఆ జాతి ఓడిపోయినట్లు కాదు. పురుషుల చేతులలోని కత్తులు కటార్లు ఎంత పదునైనవైనా సరే, జాతి స్త్రీలు స్థైర్యం కోల్పోతే ఆ జాతి పోరాటంలో అంతా కోల్పోయినట్లే” - చెయాన్ సామెత

సూక్ష్మజీవుల శక్తి సామర్య్థాలు

2007-10-01 07:13 PM డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ - ప్రాణహిత
“సృష్టి రహస్యాలను” గురించీ, “భగవంతుడి లీలలను” గురించీ నమ్మబలికే వేదాంతులు ప్రవచనాలు చేసేటప్పుడు సామాన్యంగా శాస్త్రవిజ్ఞానం ద్వారా తెలియవచ్చే సంగతుల మీదనే ఆధారపడతారు. వారికి స్వయంగా శాస్త్ర ప్రయోగాలు చేసే అవకాశం ఉండదు. వాటిని అంత ముఖ్యమైనవిగా వారు భావించకపోవచ్చు కూడా. టెలిస్కోప్‌ ద్వారా అంతరిక్షం గురించిగాని, మైక్రోస్కోప్‌ ద్వారా సూక్ష్మజీవుల గురించిగాని ముందుగా తెలుసుకునేది శాస్త్రవేత్తలే.

కొయ్యగుర్రం - నగ్నముని

2007-10-01 04:56 AM ప్రజాకళ - ప్రజాకళ
జీవితం మిధ్య అనడం అబద్ధం ఎంగిలి మెతుకులేరుకుని ఎలక్ట్రిక్ తీగల మీదా ఇళ్ళ కప్పుల మీదా జంతు కళేబరాల మీదా ‘అలగాజనం’ పుళ్ళ మీదా పొడుచుకు తినడానికి చేరే కాకులు మాత్రమే మిధ్య గూర్చి కావుకావుమంటూ ప్రవచించగలవు మానవత్వం బతికి వుందనడం అబద్ధం కప్పుకోవడానికి మేక చర్మాల కోసం తిరిగే మెకాలు మాత్రమే నీతి వాక్యాలు వేదికల నుంచి ఉపన్యసించగలవు విశ్వశ్రేయం కావ్యం అని అరుస్తూ ప్రబంధ నాయకి తొడల బంధనాల్లో పాదాలకు పూసుకుని ఎగిరే లేపనాల్లో అంటుకున్న కవిత్వం అబద్ధం తపస్సు చెయ్యడానికి వెళ్ళవలసింది హిమాలయాల్లోకి కాదు జనం లోకి పరిత్యజించవలసింది సంసారబంధం కాదు స్వార్దాన్ని ఓంకారం కాదు ఆర్తనాదమే జీవికి అన్ని [...]

కలత - నందిని సిధారెడ్డి

2007-10-01 04:55 AM ప్రజాకళ - ప్రజాకళ
తప్పిన అడుగుల్లో తలలు నాటుతున్నాం కంటున్న కల పూర్తికాకుండానే దబుక్కున మెలకువొస్తుంది ఇక్కడేదో హార్మోనియం పెట్టె పగలినట్టు శృతి విరిగిపోయింది జానపదగీతం వినెతందుకు జన్నభూమి మొరాయిస్తున్నది ఊగిసలాటలో ఉడుకుతున్న జీవితం చావువాసన సంతరించుకుంటున్నది వానజల్లులు జల్లులుగా కురిసినా మునుపటి వలె నేల పులకించటం లేదు పాతనవి మొక్కలు కాదు రాతికనీలు వసంతం అడుగిడినా అవి చిగురించవు తప్పిన దారుల్లో కలలు వెదజల్లుతున్నాం అష్టభుజి సందడిలో ఉన్నభూజాలు పోతాయి నిర్వాసితుల కన్నీళ్ళు కంప్యూటర్ ను చెమరించలేవు నిండు సభలో మనిషి శిరచ్ఛేదాన్ని ఆపెతందుకు ఎవరూ ముందుకు రారు అందరిదీ ఒకే తల నమ్రంగా నాలుక తిప్పటమే ఇ-కళ దూప తీరకముందే నది అదృశ్యం ఎక్కక ముందే కొండ అదృశ్యం విషాదాలు మోసెతందుకయినా తలలుండాలె వివేచన చేసెతందుకయినా తలలుండాలె ఎవల భుజాల మీద వాళ్ళ తలలే ఉండాలె సౌజన్యం: తెలుగు [...]
వ్యాఖ్యలు
2007-10-09
2007-10-09 10:31 PM venkatesh - Comments for ప్రాణహిత

కొత్త ప్రతిపాదన తెచ్చిన రచయితలకు నమస్కారములు.కాని తెలంగాణ కు ప్రత్యెక వ్యాకరణం ఉండాలన్న ఆశ అంతా సబబు కాదెమొ!

2007-10-08
2007-10-08 06:14 PM bhargava - Comments for ప్రాణహిత

ప్రాణ హిత అంటె ఒక నది అని కాక, అన్ని జీవరూపాలను గౌరవించెది అని నెను అర్థము చెసుకుంటున్నాను.ఎందుకంటె మా జీవితాలు తుంగభద్ర తొ పెనవెసుకొనివుంటాయి.
ప్రాణహిత కు swagatham.
ఏదైనా గుచ్చుకున్నప్పుడు అప్రయత్నంగా వెల్వడే బాధా స్వరం కవిత్వం.తనని అందరు గమనించాలనుకునే పిల్లవాని ఏడుపు ఒక communication strategy కాగల్గుతుందేమో కాని కవిత్వం మాత్రం కాదని నాకనిపిస్తుంది.
ఇంకో కోణం లో చూస్తే సామాజిక గుర్తింపుకోసం తపన చెందే మనిషి అభివ్యక్తికి కవిత్వంకన్నా అనుకూలమైన ప్రక్రియ మరొకటి వుండదనికూడా అనిపిస్తుంది.కొందరికి బాధా ,ఏడుపు ఏకాంతంలో మాత్రమే సాధ్యం.కాని పీడితులకు అది సామూహికంగా మాత్రమే సాధ్యం.బహుశా అందుకే కావచ్చు సామూహిక అస్తిత్వాల వేదనా స్వరం లో ఒక మొనాటని అనివార్యంగా వినిపిస్తుంది.దీన్ని సక్రమంగా అర్థం చేసుకోలేని నయాశిష్టులు(neo literary liberals)ఈ కవిత్వ్హాన్ని అకవిత్వం అని ఆదుర్దా గా తీర్పులిస్తుంటారు.పొలం పనులు ఇస్టపడని పల్లె యువకులు ఎందరో గౌండాలు(మేస్త్రీలు)అయినట్టు,కష్టమైన ఇతర సాహిత్యప్రక్రియలలోకి వెళ్ళలేకపోయిన వారెందరరోకవిత్వరచన ప్రారంభించారు.వలసకార్మికుల జీవితాలలో ఎలాగైతే నైపుణ్యరాహిత్యం ఒక లక్షణమో మన కొత్తకవుల కవిత్వంలో కూడా శిల్పనైపుణ్యం కనిపించకపోవడం విచిత్రమేమికాదు.సమస్యంతా, నగరాలలొ తిష్టవేసుకుని కవిత్వపీఠాలు స్థాపించుకుని,కుర్రకవులను గాలించి పట్తుకుని, తమ పట్టులోకి తెచ్చుకుని తమ పీఠాల మందబలాన్ని పెంచుకోవడమే వృత్తిగా కల నగర పీఠాధిపతుల వల్లనే. ఈ పీఠాధిపతులు తమ శిష్యుల కీర్తిని పెంచడం కోసం ఎన్నో వ్యూహాలు పన్నుతుంటారు.కవిత్వాన్ని పొగడ్డం, అనుకూల సమీక్షలు రాయడం ,రాయించడం,సంకలనాలు అచ్చెయించడం,ముందుమాటలురాయడం,వగైరా…..
ఎద్దుల కొట్లాటలో దూడల కాల్లు విరిగినట్లు ఈ వ్యూహ,ప్రతివ్యూహాలలొ మన ఔత్సహిక యువకవి పొగరుబోతుగానో,కుట్రదారుగానో,కెరీరిస్టుగానొ ఘనీభవిస్తాడు.ఇతరుల మాటలు వల్లె వేసె చిలుక గానో,ఇతరులకోసం యుధ్దం చేసే కిరాయిసైనికుడిగానొ పరాయీకరన చెంది తన అసలు మూలాన్నీ, అసలు గమ్యాన్నీ మరచిపోతున్నడు.సరిగ్గా అలంటి సందర్భల్లోనే అనుకుంటా”కవిత్వమే నా జీవితం” లాంటి అసంబద్ధ వాక్యాలు పుట్తుకొస్తాయి.

2007-10-07
2007-10-07 11:55 PM - ప్రజాకళ

పజా కళ పై హాకింగ్ ను ఖండించండి.

2007-10-07 05:21 AM - ప్రజాకళ

వ్యాకరణం పేరుతో, ఉచ్చారణ పేరుతో ఆంధ్ర ప్రదేశ భాషాధిపత్యం, తెలంగాణ ప్రాదేశిక భాషను మాండలికంగా మభ్యపెట్టి, ప్రాదేశికపర సహజ వ్యక్తికరణను నియంత్రించిన తీరును చాలా స్పష్టంగా చెప్పేరు. భాష వ్యాప్తి రాజకీయంలో యిమిడిన/దాక్కున్న ఆర్ధిక ప్రయోజనాలు, ఒక కుల ఒక వర్గ ఒక ప్రదేశ ఆధిపత్యం రేఖామాత్రంగానైనా విస్పష్టం చేశారు. తెలంగాణ ప్రాదేశిక భాషకు తగిలించిన మాండలిక శృంఖలాలను చేదించాలని, ఒక సర్వసత్తాక భాషగా గుర్తింపు కావాలనే ప్రజాస్వామ్యబద్దమైన వాదనను చాలా శక్తివంతంగా చెప్పారు.

సాంబయ్య గుండిమెడ

2007-10-06
2007-10-06 10:00 PM - ప్రజాకళ

నీవు పుట్టిన గడ్డ పైన
నిను పెంచిన వారిపైన
నీకెంత మమకారం!

ప్రాణాలు పాతరైనప్పుడు
ఊరు వల్లకాడైనప్పుడు
నీ హృదయం ఎంత క్షోభించిందో కదా!

గుండెలు పిండెస్తున్న - దు:ఖంతో
భగ భగ మండె - ఆవేశంతో
ఎంతలా దహించుకు పోతున్నావో కదా!

మిత్రమా!
దు:ఖించు - యింకా దు:ఖించు!
రత్నమా!
ఆవేశపడు - యింకా ఆవేశపడు!

నీ దు:ఖమే - జ్వలనమై
నాగలికర్రుకు ఉరితాడు పేనినోడ్ని దహించు
నీ ఆవేశమే - ఆలోచనలై
చరిత్ర తెలినోడికి చరిత్ర లిఖించు!

- రవీంద్ర, నీ కవితలో మా ఊరుని చూసుకున్నాను. నాగలి కర్రు పట్టిన మా నాన్నని గుర్తు తెచ్చుకున్నాను. ఒక మంచి కవితతో ఒక ఆవేశాన్ని, ఒక ఆలోచనని యిచ్చిన్నందుకు కృతఙతాభినందనలతో,

సాంబయ్య గుండిమెడ.

2007-10-06 09:02 AM - Comments for భూమిక

చాలా బాగుంది పత్రిక. తెలుగులొ వ్రాసె ఫెసిలిటీ బాగుంది. నా వెబ్ చూస్తారా?
www.vuhalapallaki.com

తాతారావు

2007-10-06 06:00 AM - ప్రజాకళ

చంద్రశేఖర్,

ప్రజాకళలో మీరు వేసిన ప్రశ్నలు ఆహ్వానిస్తున్నాం. “కొయ్యగుర్రం” కవిత వేయడానికి వెనక ఉద్దేశాలు ఏమీలేవు. రచనలు సేకరించడం క్లిష్టంగా వుంది కాబట్టి, కొన్ని పాత మరియు క్లాసికల్ రచనలు వేయవలసివస్తోంది. సామాజిక వాస్తవాలను ప్రతిఫలించే ఆనీ రచనలను ప్రజాకళ వేస్తుంది. అదే క్రమంలో “సముద్రం” కవిత కూడా వేయడం జరిగింది. సౌజన్యం మరియు వైబ్ సైటు పేరుకూడా పేర్కొనడం జరిగింది. మీరు చేసిన సూచనను కూడా పరిగణలోకి తీసుకొన్నాం. మీ మనస్సు బాధ కలిగించినందుకు చింతిస్తున్నాం,

“పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద లక్షణమైన గుంజుకోవడం …..” అని మీరు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.
ప్రజాకళ మొత్తం చదివి మీ వైఖరిని పునరాలోచన చేయండి. సామాజిక ప్రయోజనానికి పత్రిక నడపటం ఒక ‘పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద లక్ష’ణంగా మీకు అనిపించటం చాలా విచారకరమైన అంశం. ప్రత్యామ్నాయం ఏమిటో మీరు ఆచరణాత్మకంగా తెలియజేయండి.

- ప్రజాకళ మిత్రులు

2007-10-05
2007-10-05 09:03 PM - ప్రజాకళ

రోహిణీ ప్రసాదు గారి నిర్విరామ కలానికి అభినందనలు. మీ వ్యాసం ప్రాణహితలో
http://www.pranahita.org/2007/10/sukhsma_jeevulu_2/ కూడా చూసి ఆనందం కలిగింది.

2007-10-05 09:01 PM - ప్రజాకళ

ఈ కవిత http://www.varavararao.org/te/poetry/samudram.html

లో ఉన్నది. మళ్ళీ ఇక్కడ వేయడం మంచిదే కానీ అక్కడ ఉన్నదనే విషయం కూడా చెప్పి ఉంటే బాగుండేది, అట్లే యు ట్యూబ్ నుండి విడియో తీసికున్నప్పుడు అది ఎవరి నుండి తీసుకున్నామో ఎవరక్కడ పెట్టారో తెలిపి ఉంటే మర్యాద గా ఉండేది.
విప్లవ సాహిత్యాన్ని, ప్రజా సాహిత్యాన్ని ఎవరు బడితే వాళ్ళు నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు కానీ అటువంటి కృషి వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు దానిని గుర్తించడం నిజమైన విప్లవ స్ఫూర్తి అవుతుంది - లేక పోతే పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద లక్షణమైన గుంజుకోవడం, కాపీ కొట్టడం, పేటెంటు నాదే అనడం, వగైరాలన్నీ అవుతాయి.

2007-10-05 08:54 PM - ప్రజాకళ

ఇంతకీ ఇప్పుడీ కవిత వేయాల్సిన అవసరమేమిటో? అది కూడా పూర్తిగా వేయలేదు. అసలిది ఇంకా ఉందనే విషయం తెలుసా మీకు?

2007-10-05 08:48 PM - తెలంగాణ సోయి

దన్యవాధములు.

2007-10-05 08:28 PM ప్రవీణ్ గార్లపాటి - Comments for ప్రాణహిత

రోహిణీ ప్రసాద్ గారు,

మీ వ్యాసం చాలా బాగుంది. మీరిచ్చిన వివరణలు, పరిణామ క్రమంలో సూక్ష్మజీవుల మార్పులు ఎంతో ఆసక్తి కలిగించేలా ఉన్నాయి.

2007-10-05 08:25 PM - ప్రజాకళ

మహిమలకు కొదవ లేదు. తాజా వార్తలో “గుడ్డు” గణేశుడు!
http://eenadu.net/story.asp?qry1=15&reccount=28

2007-10-05 02:26 PM Rohiniprasad - Comments for ప్రాణహిత

జయశ్రీగారి కామెంటు గురించి:

సైన్సు వ్యాసాలు సైన్సు పాఠాలవంటివి కావు. సూక్ష్మజీవుల గురించి తెలుసుకోవాలనుకుంటే అందుకు పనికొచ్చే ప్రామాణిక గ్రంథాలెన్నో కనిపిస్తాయి. ప్రాణహిత సామాన్య పాఠకులు చదివే పత్రిక. విజ్ఞాన సర్వస్వం కాదు.

నిత్యజీవితంలో సైన్సుకు ఎటువంటి స్థానం ఉండాలి? సైన్సు విషయాలను అర్థం చేసుకోవడం వల్ల మన దృక్పథంలో ఏమైనా మార్పు కలుగుతుందా, లేక ఈ కొత్త విషయాలన్నీ ఏదో కొత్త సినిమా కథలాగా మనకు తాత్కాలిక ఆసక్తిని మాత్రమే రేకెత్తిస్తాయా?

ప్రముఖ దిన, వార పత్రికలన్నీ “ఆధ్యాత్మిక” పేజీలు కేలండరు టైప్ రంగుబొమ్మలతో నింపి, అర్థంలేని నమ్మకాలనూ, సంప్రదాయాలనూ ప్రచారం చేస్తూ ఉంటే ఎవ్వరూ నోరు మెదపడం లేదు. వీటిని నమ్మనివారూ, వామపక్షభావాలు కలవారూ మాత్రం వీటి గురించి ఊరికే “అదంతా గుడ్డినమ్మకం” అనేసి ఊరుకుంటున్నారు. గుడ్డి నమ్మకాలు ఎంత లోతుగా పాతుకుని ఉన్నాయో, సామాన్యుల్లో “గుడ్డితనాన్ని” ప్రోత్సహించడం ఏ స్థాయిలో జరుగుతోందో సైన్సు రచయితలు చెప్పితీరాలని నా ఉద్దేశం. సైన్సు భౌతికవాద, హేతువాద దృక్పథాలను నెలకొల్పలేకపోతే లాభం ఉండదు.

ఈ వ్యాసాలు పన్నెండో తరగతి పాఠాలు కావు. మన అవగాహనా, దృక్పథమూ ఆధునిక విజ్ఞానం సహాయంతో మెరుగుపడాలనీ, అందుమూలంగా మన వ్యక్తిగత, సామాజిక దృక్పథంలో కూడా మార్పు వచ్చి తీరాలనీ నా కోరిక. దీనికి ప్రధానంగా అడ్డుతగిలేవి సంప్రదాయం, సంస్కృతి పేరుతో కొనసాగుతున్న మతప్రచారమే.

కుటుంబమంతా సరదాగా తమ ఇంట్లో ఏ వినాయకచవితి పండగో జరుపుకుంటే కొంప మునిగేదేమీ లేదు. అయితే చదువుకున్నవారు పెద్ద ఎత్తున పబ్లిక్ గా జరిపే పూజల్లో పాల్గొంటున్నప్పుడు చదువురానివారికీ, వెనకబడినవారికీ ఎటువంటి మెసేజ్ వెళుతోందో ఎవరూ గమనించరు. అంధవిశ్వాసాలు పెద్దపెట్టున నిలదొక్కుకోవటానికి ఇలాంటివి దోహదపడతాయి. వాటి వికృతరూపం చేతబడి, బాణామతి పేర్లతో కుగ్రామాల్లో ఏ ముసలమ్మనో చంపినప్పుడు బైట పడుతుంది. “విద్యాధికులు” ఆ వార్తలను చదివి, ముఖం చిట్లించి, పేజీ తిప్పేస్తారు. అందులో తమ బాధ్యత ఏమైనా ఉందా అని ఆలోచించరు.

ఆధునికులుగా చలామణీ అవుతున్నవారి వెనకబాటుతనాన్ని సైన్సు వ్యాసాల్లో గుర్తు చేస్తూ ఉండక తప్పదు. అందుకు ఎవరైనా నొచ్చుకుంటే క్షమించమనడం తప్ప రచయిత చెయ్యగలిగినదేమీ ఉండదనుకుంటాను.

నార్లవారు చెప్పినట్టుగా “రామ నామమను తీపి మిఠాయి”ని ఎవరైనా తింటే తిని, ఆనందించండి. అభ్యంతరం చెప్పే హక్కు ఎవరికీ లేదు. అయితే ఇటువంటి భావనలు అసలు ఎందుకు తలెత్తుతాయో సైన్సు చెపుతుంది. ఆ వివరాలను నేనొక సందర్భంలో వివరించాను: http://prajakala.org/mag/category/essays/alochanalu_avagaahana/

2007-10-05 01:51 PM GurramSeetaramulu - Comments for ప్రాణహిత

చాలా మంచి వ్యాసం రాసారు. జిలుకరకు అభినందనలు, రవీ నీకు కూడా.
ప్రాణహితకు ధన్యవాదాలు.

2007-10-05 01:34 PM - ప్రజాకళ

చలా మంచి కవిత చాలా బాగుంది

2007-10-05 12:11 PM Jayasri - Comments for ప్రాణహిత

The article is very informative with amazing facts. Thanks.
The style of the language makes it further interesting.
But, is it necessary to comment on the people’s religious beliefs in every article? My personal view is : If such informative article starts with direct attacks on misinformed people, it will discourage them to read further. The purpose of the article itself may be defeated if spreading knowledge is the purpose.
Once any person becomes more and more informed about Scientific facts, Nature, the less and less he will be superstitious.
Rohiniprasadgaru, the person like you who has so much communication, writing skills and the necessary knowledge can really help to educate people provided you be more patient and tolerant in your approach of the ‘Religion’ subject. This as my request and not my comment.

2007-10-05 11:56 AM bhask - Comments for ప్రాణహిత

చాలా బాగుంది.

2007-10-05 11:22 AM - ప్రజాకళ

బాగుంది.. బాగుంది…
అభినందనలు

2007-10-05 09:57 AM B.AJAY PRASAD - Comments for ప్రాణహిత

రోహిణీ ప్రసాదుగారూ
మీకు నా పత్యేక అభినందనలు. మీ వ్యాసం చాలా బాగుంది. మీ సైన్సు వ్యాసాలు అనేక పత్రికలలో చదువుతున్నాను. మీ పుస్తకం కోసం ఎదురుచూస్తున్నాను. మీ నాన్నగారి సైన్సు వ్యాసాల పుస్తకం (విరసం ప్రచురణ) ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు.

2007-10-05 09:47 AM ynv lakshmi - Comments for ప్రాణహిత

మీరు చాలా చక్కగా చెప్పారు.

2007-10-05 08:36 AM పొద్దు - Comments for పొద్దు

నారాయణరావుగారు సూచించిన విధంగా గమనికను చేర్చాం. జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం.

2007-10-05 06:33 AM కారణి నారాయణ రావు - Comments for పొద్దు

ఇదే శీర్షిక, ‘అక్షరాలతో అద్భుతాలు ‘ మకుటంతొ, ఆచార్య తిరుమలగారి “నవ్వుటద్దాలు”(హాసం ప్రచురణలు,హైదరాబాదు,ప్రథమ ముద్రణ2005) పుస్తకంలో ఉంది(పుటలు63 నుండి 67వరకు).అలాగే అంకెలతో ముడిపడిన పద్యాలు “అంకెలతో పద్యాలాట” కూడా ఈ పుస్తకంలోనిదే.వలబోజు జ్యోతిగారు, ఈ వ్యాసకర్త- ఆచార్య తిరుమలగారి పేరు సూచించివుంటే బావుండును.

2007-10-05 03:21 AM Deepak - Comments for ప్రాణహిత

Ashoke gaari interview was excellent. His explanation of this song writing and meaning is outstanding. I was so curious to listen to his explanation, so I watched all 14 episodes without brake. All the best and keep up the good work.

– Deepak

2007-10-04
2007-10-04 05:31 PM - ప్రజాకళ

కథ బాగుంది. అనువాదం కూడా హాయిగా సాగింది.

2007-10-04 02:23 PM Alok - Comments for ప్రాణహిత

కవిత్వం శూన్యం.

2007-10-04 06:55 AM Rakesh - Comments for ప్రాణహిత

Dear Rohiniprasad Sir,

1. Your artciles are so wonderful!! (Informative, useful and what a fantastic narration on a highly technical / otherwise un-interesting sunbject)

2. For generating interest in other readers, I am qouting some parts of your artcile:

“మనుషులు మొదటినుంచీ తమ ప్రాణరక్షణ గురించీ, మంచిచెడ్డల గురించీ ఆలోచించినంతగా తక్కిన జంతుజాలం గురించి “నిస్వార్థ” దృక్పథంతో గమనించలేదనే చెప్పాలి”
“ప్రమాదవశాత్తూ ఒలికిపోయిన చమురు, కీటనాశక పదార్థాల వంటివాటిని జీర్ణించుకుని, నిరపాయకరమైన పదార్థాలుగానో, పనికొచ్చేవిగానో మార్చగలిగిన బాక్టీరియా రకాలను అవసరమైనప్పుడు కృత్రిమంగాకూడా తయారుచేసి ఉపయోగిస్తున్నారు. 1980లో అమెరికాలో దీన్ని మొదటగా తయారుచేసిన ఆనంద చక్రవర్తి అనే శాస్త్రవేత్త జీవరాశిని కృత్రిమంగా సృష్టించవచ్చునని కోర్టులో పేటెంట్‌ హక్కును గెలుచుకున్నాడు ”

“కొన్నిటికి మంచినీరు ప్రాణాంతకం అయితే మరికొన్నిటికి ఆక్సిజన్‌ విషతుల్యం”

” కీడు జరిగి ప్రాణి బలహీనపడడమో, చావడమో జరిగితే బాక్టీరియాకు కూర్చున్న చెట్టు కొమ్మను నరుక్కున్న పద్ధతిలో అసలుకే మోసం వస్తుంది. కనక అవి “స్వంతలాభం కొంత చూసుకు” తమను “భరిస్తున్న” ప్రాణిని ఇబ్బంది పెట్టకుండా జీవిస్తాయి. తమవల్ల ప్రాణికి లాభం కలిగేలా కూడా చూస్తాయి”

3. Excellent information on “HISTORY” of Bacteria!!

“అన్నిటికన్నా పురాతనమైనవి 350 కోట్ల సంవత్సరాలనాటివి”
“ఏ కారణం వల్లనైనా ఉష్ణోగ్రత 90 డిగ్రీలకు తక్కువైతే ఆ సూక్ష్మజీవులన్నీ”చలి”కి తట్టుకోలేక చచ్చిపోతాయి! అలాగే మరికొన్ని మైనస్‌ 20 డిగ్రీల (సెల్సియస్‌) చలిలో ఎన్ని కోట్ల సంవత్సరాలైనా తట్టుకుని జీవించగలవు. గడ్డకట్టిన మంచు అడుగున నీరు ఉంటుంది. ఎందుకంటే ఆ నీరు ఘనీభవించకుండా మంచే కాపాడుతుంది. దీనికి భూగర్భం నుంచి తగిలే వెచ్చదనం తోడవడంతో ఏర్పడే నీటి కొలనుల్లో బాక్టీరియాకు స్థావరాలు లభిస్తాయి. వీటిలో ఒకటి 3.7 కిలోమీటర్ల అడుగున 500 మీటర్ల లోతు కలిగి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నీటిలో ఎటువంటి బాక్టీరియా ఉన్నాయో తెలుసుకోగలిగితే జీవరాశి పుట్టిన తొలియుగపు విశేషాలు తెలుసుకోవచ్చునని శాస్త్రవేత్తల ఆశ.”

4. శాస్త్రవేత్తలకు కలిగే ఇటువంటి ఆశలే, మానవకళ్యానికి, మనుగడకూ ప్రాణం పోస్తున్నాయి!!
Thank you very much for another wonderful artcile.
Thanks to Pranahita too!!

2007-10-04 01:04 AM మదు కాకులవరం - Comments for ప్రాణహిత

స్కైబాబ గారు,

మీ పద్యం చాలా బాగుంది. ఈనాడు మన సమాజంలో ప్రతి ఒక్కరు స్వంతగా ఆలోచించి ముందుకు పోవడం చాలా ముక్యం. చదువుకోని వారి కన్న చదువుకున్నవారు మన సమాజంలో కులం, మతం పేరుతో మూర్కంగా ప్రవర్తిస్తారు . మీ పద్యం అందరికి కనువిప్పు కలిగిస్తాదని నాఆశ!

2007-10-03
2007-10-03 09:03 PM Mallikarjuna Sharma - Comments for ప్రాణహిత

కథ ఇతివృత్తం బాగుంది. కథనం కూడ మంచిగుంది. కాని మొత్తం యాసలో వుండడం బాగా లేదు. ముగింపుకూడ బాగా లేదు.
కథ మామూలు పత్రికల భాషలో వుండి మధ్య మధ్య బాగా అవసరమైన కొన్నిచోట్లమాత్రమే యాసబాస పెడితే మంచిగుంటది. తేలిగ్గా చదువుకోవస్తది.
ఎస్ పి మంచివాడు కాకుంటే ? కలమ్మ అవమానానికి ఆమె ఒంటరిగానైనా లేక కొంతమంది సహచరులతోనైనా ఏదో ఒక పోరాటరూపంలో ఆందోళన చేసి ఎంతో కొంత నెగ్గినట్లో లేకుంటే ఓడినట్లో రాస్తే బాగుండెనని నా కనిపిస్తాంది.
ఏమైనా రచయిత్రి ప్రతిభను మెచ్చుకోకతప్పదు. కీప్ ఇట్ అప్.

2007-10-03 08:25 PM కొత్తపాళీ - Comments for ప్రాణహిత

ఈయన్ని ఇంటర్వ్యూ చెయ్యాలనే అవిడియా వచ్చినందుకూ, చక్కంటి ప్రశ్నలడిగి ఆయన ఆలోచనల flood gates ని తెరిచినందుకూ, అంతా చక్కగా కూర్చి ప్రచురించినందుకూ మీ గుంపుకి ప్రత్యేక అభినందనలు. అశోక్ తేజ గారు తన అనుభవాలు దృక్పథాల గురించే కాక కవిత్వ పద్ధతుల గురించి, పాట ప్రాణం గురించీ గొప్ప విషయాలు చెప్పారు. ప్రాచీన సమకాలీన కవుల్ని తల్చుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన వినయాన్నీ నిజాయితీనీ సూచిస్తాయి. ఈ ఇంటర్వ్యూ ఒక వండర్ఫుల్ ఎఛీవ్మెంట్!

2007-10-03 04:28 PM చదువరి - Comments for ప్రాణహిత

ఇంటర్వ్యూ బ్రహ్మాండంగా ఉంది. అశోక్ తేజ బాల్యం నుండి సినిమా కవి అయ్యేదాకా ఆయన జీవితాన్నంతా వివరంగా చెప్పించారు. కొన్ని కొన్ని చోట్ల కళ్ళు చెమర్చాయి.

“వంద సంవత్సరాలు ప్రయత్నం చేసినా అది నేను రాయగలనా? “-ఒక గొప్ప పాట గురించి, కవి గురించి మరో కవి నిజాయితీగా చెప్పిన మాటలు నాకెంతో నచ్చాయి.

నేను చదివిన గొప్ప ఇంటర్వ్యూల్లో ఒకటి. ఇంటర్వ్యూ చేసినవారిని మనసారా అభినందిస్తున్నాను.

అలానే ప్రాణహితకు నా నెనర్లు.

2007-10-03 02:31 PM - ప్రజాకళ

నాగలి కర్రుకు ఉరితాడు పేనింది ఎవడు
వ్యాపార పంటల ఆశ చుపింది ఎవడు
ఎవడు…..?
ఎవడు…..?

మిత్రమా..|

శఃత్రువును పదాల పరదాల చాటున దాచడం మంచిది కాదేమొ
ప్రస్తుతం శఃత్రువు బహిర్గతమె….|

మీ కవిత్వం చాలా బాగుంది.

2007-10-03 12:14 PM Rakesh - Comments for ప్రాణహిత

రవన్నా, శ్రీనన్నా నమస్తే.
చాన మంచి topic గురించి రాస్తున్నరు!

తెలంగాణ భాష అనేది ప్రత్యేకమైన భాష అని చెప్పుకొనేందుకు ఎన్నో ఆధారాలున్నై.
కర్ణాటక రాష్ట్రంలసూత ఎన్నో భాషలున్నై. కానీ ఎక్కడికక్కడ వాండ్ల వాండ్ల భాషాసాంస్కృతుల పరిరక్షణ ఉన్నదిగన్కనే భాషలు స్వల్పతేడాలున్నా ఒక్కకాణ్ణే ఉన్నరు.
తుళు, హవ్యక, కొంకణి, మాడీ వగైరాలు. ఐతే, లిపి అందరికి లేదు. చాలా భాషలను కన్నడ లిపిలల్లనే రాస్కుంటండ్రు.
ఇగమరి ఒక్క భాషనే కాక, ఒక్క లిపివాడేటోల్లు వేర్వేరు రాష్ట్రాలల్ల ఉంటాండ్రు.
అట్లనే, మల్ల హిందీభాష లిపిలనే కనీసం అయిదారు రాష్ట్రాలల్ల ఉండేటోల్లు వాల్ల వాల్ల భాషలను రాస్కుంటుండ్రు.
మరాఠీ భాష లిపి చూస్తె అచ్చం హిందే. కాని ఒకట్రెండు అక్షరాలు (ళ, ఱ) హిందీల లెవ్వు.

అసలు history తెలిసినోల్లకు తెల్సినమాట ఏందంటే, తెలంగాణరాజ్యంల తెలంగాణభాష ఎప్పటిసందో అధికారభాషే…….
ఆంధ్రోల్లు మద్రాసుల ఉన్నప్పుడే ఈప్రాంతపోల్లెందరో దేశవ్యాప్తంగా పేరుగాంచిండ్రు.
మాకుతెలిసిన శానమంది బొంబై, గ్వాలియర్, పూనా, బరోడా, ఇందోర్ సంస్థానాలల్ల ఆస్థానవైద్యులుగా, నేతగాండ్లుగా, వంటవాళ్ళుగా, పురోహితులుగా స్థిరపడి ఎన్నోతరాలైంది.
వాల్లందరి ఇంటిపేరు ఒక్కటే…….. అదే… “తేలంగ్” లేదా “తేలంగి”.
you can serch “orkut.com” or google to locate lacs of TELANG people spread across the country & world!!

మరి వాల్లభాషకు “ప్రత్యేక” భాషగా గుర్తింపు “ప్రత్యేక తెలంగాణ” రాష్ట్రమైతేగాని రాదా ఏంది??

మన దేశంలనే అధికారికంగ తమకొక “భాష” అన్న గుర్తింపు పొందిన తెగలవారు, ప్రాంతాలవారు చాన ఉన్నరు. మీకొక web-site లింకు ఇస్తున్న.
http://www.languageshome.com

ఇక్కడ మీరు భారతీయ భాషల గురించి తెల్సుకోవచ్చు.

ఐతే,గమనించాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఒకటున్నది.
“ANGIKA AWADHI BAGELKHANDI BHOJPURI BISHNUPRIYA BUNDELKHANDI MAITHILI MARWADI”
ఇవ్వన్నీ రాష్ట్రమేలేని ఎన్నో భాషలు.
ఐతే, వాటికీ అవి మాట్లాడే వాళ్ళున్నరాష్ట్రపు భాషకూ పెద్ద తేడా లేదన్నదీ చూడాచ్చు.
కొంకణీ, మరాఠీ భాషలలోని ఎన్నో పదాలు, వాటి ఉచ్చారణా దాదాపు ఒక్కతీర్గనే ఉంటయి. కాని, దేనికదె భాషగా గుర్తింపున్నది.

కనుక తెలంగాణ ప్రాంతపు భాష కూడా “ప్రత్యేక” మైనదని తెలియజేయాలంటే -తెలంగాణ ప్రాంతపు భాషలో ఒక అర్థాన్ని communicate చేసేందుకు popular గ వాడుతున్న ఒక పదానికి, ఆంధ్రలో అదే అర్థాన్ని communicate చేసేందుకు popular గ వాడుతున్న పదానికి గల తేడాలను సామ్యాలను గుర్తిస్తూ పోవాలె.

అట్లనే -
ఒకే పదం రెండు జాగలల్ల విభిన్న అర్థాలనిస్తె అవిగూడ సేకరించాలె.(విపరీత / విపత్కర అర్థాలుగూడ ఉన్నయి)
ఉదాహరణకు:
ఆంధ్రవాల్లకు “జెల్ల” నిస్తమంటె, తెలంగాణ వాల్లకు “ఠోంగు” ఇచ్చినట్టు
తెలంగాణోనికి జెల్లలిస్తె, కమ్మగ పులుసొండుకోడా?
మా పిల్లగాడు టేబుల్ “దొబ్బు”మంటె(నూకుడు), వాని దోస్తులు నవ్విండ్రట.
వాల్లకు దొబ్బుడంటె, ఎత్తుకచ్చుడట!
మరదే ఆంధ్ర పిల్లగాడో, పిల్లనో మనోల్లతో, “మీ బుల్లి ఫోటో బావుంది” అన్నా, “నాకు ఈ హీరో పిచ్చ ఇష్టం” అన్నా,మరి మనోల్లు ఏమంటరు?
“దెంకపోవుడు” అన్నపదాన్ని తెలంగాణలో “పారిపోవుడు” అన్నఅర్థానికి వాడ్తరు.
గట్నే పల్లెల్లో examination pad లను పరీక్ష వట్టలు (అట్ట కు గ్రామ్యం) అంటారు.
అక్కడివి ఇక్కడ, ఇక్కడివి అక్కడ వాడితె ఎన్ని తిప్పలు మరె.

2007-10-03 11:34 AM Rakesh - Comments for ప్రాణహిత

అధ్బుతమైన తెలంగాణ పదాలు!

“”"”"” “దశన్న పూవు, చెక్కర కుడుక, పడిశెం, తవుటం, యాపచెట్టు, రేగ్గాయచెట్టు, పులిచింతచెట్టు, పందిరిగిర్క, మోస్సపోసుకుంట, సోపతిగాల్లం, సత్తుగట్టిన ముల్లె, సాదమల్లె, బోళ్లాట, హనుమండ్ల పలారం, బర్ల గుడిసె, పుస్తకాలకేసిన పుట్టలు, బచ్చీసీల దండ, ఎక్కిన రంకురాట్నం, బండెడు పెండ, ఉరికురికి, వడ్ల కల్లం, గుమ్ములు, గంపల లెక్క, కొప్పెర, ఉడుకుడుకు తానాలు, కల్లం కాంచి, తమ్మీ పైలం, భంగపడ్డ కండ్లు,
నిలువెత్తుకాంట, అరుసుకునే, పుట్టెడు సారుగాలు,తీరుతీరు సకినాలు,
చేతుల గొట్టే పల్లికాయ, కనికట్టు, కుడిపె, సద్ది, ఇత్తనపు సాల్లల్ల మొలక, ముట్టిచ్చిన ఎక్కా, చింతిత్తు చెమ్మలు, పచ్చీసు కాయలు, ఓనగుంతల పెట్టె, పంచసాల, కైలేదు కుయిలేదు, అట్టో… సర్వపిండో, నన్నెంబడి పెట్టుకొనిపోతది, తెంపిన మల్లెమొగ్గ,
పన్నీసుమందం, మానెడు వట్టే గంజే, వడ్లబోరెం, బాసింగం , సెల్క “”"”"”

తెలంగాణ భాషను పొరపాటుగా యాస అనో, మాండలికం అనో పిలిచేవాళ్ళకు కనువిప్పు కలిగించే విధంగా ఉన్నదీ పద ప్రయోగం…

అక్క పామురవడ్డ ముచ్చట చదువుతాంటె, కండ్లముంగట -మా పెద్దమ్మ బిడ్డనే కనవడ్డది.

“..తండ్రికి పట్నంల నౌకరి, తల్లి బడిల, పొలంల డబల్ పన్లతో పరేషానైతాంటె, తను స్వయాన చిన్నపిల్లైనా ఇద్దరు కవల తమ్ముల్లను కన్నబిడ్డల్లెక్క సాకిన మా ఇందక్క యాదికచ్చె.. కండ్లల్ల నీల్లుదిరిగె.”

చిన్నప్పటి ఆటలన్ని యాదై, నాకొక ఆనందపు జలదరింపూ, ఒక కన్నీటితెరా….

2007-10-03 09:01 AM Rakesh - Comments for ప్రాణహిత

చాన మంచిగ రాశినవు తల్లీ.
కులవివక్ష అంతట కనవడ్తనే ఉన్నది.
ప్రతి ఒక్కలు కలమ్మ లెక్కనె దైర్నంజేస్తెనె, ఈ “కొత్త దొర”లకు సమజైతది.

ఇసొంటి మౌనబాధితులకు మీ కథ చాన inspiration అవ్వాలె!!

2007-10-03 06:34 AM khaja - Comments for ప్రాణహిత

విల్సన్ సుధాకర్ గారి కవిత చాల బాగుంది. ఈ దేశం ధనవంతులకు, క్రికెట్ వీరులకు, పెట్టుబడిదారులకు, పై కులాలకు బానిస. రాయితీలన్నీ దొబ్బి తినేది వాళ్లే. కిందికులాల వాళ్లూ, పేదలూ పై వాళ్లకు వూడిగం చేయడానికే పుట్టారనుకునే కురచ బుధ్ధి అంత తొందరగా మారదు, హాఫ్నేనేకెడ్ ఫకీర్ల మోసం అంత త్వరగా వీడదు. కవిత్వపు నిజ రూపం ఎంత ఆగ్రహంగా వుంటుందో విల్సన్ సుధాకర్ గారు ఆవిష్కరించారు.. అభినందనలు..

2007-10-03 06:34 AM - Comments for ఈమాట

నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి పంక్తి భోజనం చేసినట్టుంది నా తెలుగు సోదరులతో……కవిత రాసిన వారికి విమర్శ చేసిన వారికి, నా వందనాలు. చూస్తుంటే అందరూ కవనంలో బాగా పండిన కవుల్లాగున్నారు
మీరందరూ ఇలాగే తెలుగును ఆ భాషయొక్క తీయదనాన్ని అందరికీ పంచుతారనే భావిస్తాను….(కులాల ప్రసక్తి తేకుండా…..)

2007-10-03 05:30 AM manoj kumar - Comments for ప్రాణహిత

TV9లో వ్యభిచారగ్రుహాల్లో చిక్కుకుపోయిన అమ్మాయిల ఇంటర్వూలు చూశాం.మమ్మల్ని కాపాడండిబాబో అని టీవీలో మొత్తుకుంటున్న వాళ్ళ గోడువింటే మనస్సు కరిగిపోతుంది. వాళ్ళ జీవితాలగురించి వ్రాసిన విల్సన్ సుధాకర్ గారి కవిత పవర్ పుల్ గా ఉంది. ఆయనకు హేట్సాఫ్.
దాసరి మనోజ్ కుమార్.

2007-10-02
2007-10-02 04:36 PM Doddigarla Vijayabharathi - Comments for ప్రాణహిత

విల్సన్ సుధాకర్ గారి కవిత హ్రుదయాల్ని కదిలించింది. రెడ్ లైట్ బతుకులకు ఈ కవిత ఒక నివాళి. కవిత్వమూ ఒక వ్యభిచారమైపోయిందనడం ఒక మంచి ఏక్స్ ప్రెషన్. కొత్త డిక్షన్లో వ్రాయడం, కొత్త పోలికల్తో వ్రాయడం ఆయనకు ఆయనే సాటి. సుధాకర్ గారి కవితలకోసం ఎదురు చూడాలనిపిస్తుంది. సామాజిక సమస్యల్ని పట్టించుకునేకవి సుధాకర్ గారికి నా అభినందనలు.
దొడ్డిగర్ల విజయభారతి

2007-10-02 01:55 PM - Comments for ఈమాట

అలోక్ గారూ,
అసలు “వాన-పాట” కు సంబంధించి కవి లో గాని,కవితలో గానీ అస్పష్టత (ambiguity) ఉన్నదని నేను అనలేదు కదా!
ఒక వేళ ఒకానొక కవితలో అస్పష్టత ఉంటే, దాని లో అస్పష్టత ఉన్నదని అనవచ్చును. కానీ, దాని నాధారం చేసికొని,ఆ కవి యొక్క, దాదాపు అన్ని కవితలనీ సాధ్యమైనంత సమగ్రంగా అధ్యయనం చేయకుండా ఆ కవి లో
అస్పష్టత ఉన్నదనటం Rash and Irresponsible Comment అవుతుంది.

“వాన -పాట” కవిత చాలా స్పష్టం గా ఉంది. సందేహం లేదు. పైన నా అభిప్రాయం లో చెప్పినది దీనిలోని అననుసంధానుభూతి,రసవైరుధ్యం గురించి. అవి Contradictions క్రిందికి వస్తవి. వాటిని గురించి చెప్పవలసింది నా అభిప్రాయం లో చెప్పాను కాబట్టి ,మరలా చెప్పటం చర్విత చర్వణం అవుతుంది.

ఇంతకుముందు నేను వ్రాసిన అభిప్రాయం కేవలం ఈ కవితకు మాత్రమే పరిమితమైనది. కవికి కాదు.

C.S.Rao

పైకిబ్లాగులువ్యాఖ్యలువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish