2007-10-21

బ్లాగేశ్వరుడు: నకళ్ళతయారీదారులు

2007-10-21 12:48 AM బ్లాగేశ్వరుడు
గురువుగారు సినిమా అనుభవం గురించి పద్యము వ్రాయ ప్రేరేపింపలేదా అని అన్నారు వారి మాటనుఁద్దేశించి నేను ప్రయత్నించిన కందం. పెద్దలు తప్పులు చెప్పగలరు. చివరి పాదం ఎలా వ్రాయాలొ తెలియలేదు. అడదడి చిత్రము కన వడి వడి వెలువడె వివరము విడువ తెలివిడె కథన్ తొడితొడిన ఆంగ్ల లిపియును తొడుగై రాగా ఘటనలు తొడరును ఇట్లా

2007-10-20

మరమరాలు: మంచి మాట - 14

2007-10-20 10:38 PM మరమరాలు
మనసు ఎదుగుతున్న కొద్దీ శరీరం దానంతటదే సహకరిస్తుంది. శరీరం సహకరించని నాడు మనసు బాగలేదని అర్ధం. - సిగ్మండ్ ఫ్రాయిడ్

మరమరాలు: యురేకా! ...... మళ్లీ యురేకా!

2007-10-20 10:38 PM మరమరాలు
సైన్స్ చరిత్రలో 'యురేకా' అన్న పదానికి చాలా ప్రాధాన్యత ఉంది. స్నానం చేస్తున్న ఆర్కిమెడిస్ (c. 287 BC – c. 212 BC) బుర్రలో తళుక్కున ఓ ఆలోచన మెరవడంతో వంటిమీద బట్టలు కూడా లేని విషయాన్ని చూసుకోకుండా.. వీధిలోకి యురేకా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. యురేకా అంటే.. గ్రీక్ లో నేను కనుక్కున్నానని అర్ధం. వస్తువులు నీళ్లలో ఎందుకు తేలుతాయి అన్న విషయంపై ఆర్కిమెడిస్ పరిశోధనలు నిర్వహిస్తున్న కాలంలో ఈ సంఘటన

తెలుగులో తప్పటడుగులు: Fargo

2007-10-20 10:12 PM Giri
ఉ. నాలిక నోటలేని మగ నాయన నిమ్మన పెద్ద రొక్కమే హేలగ చూసి పొమ్మనియె హేళననోర్వని పెన్మిటంతనే కూలికి పిచ్చిలిద్దరిని కొల్లయు గొట్టగ మామ సంపదా తోలెను మంచిచెడ్డ విడ తొందరపాటున చిక్కెనూబిలో ఫార్గొ చిత్రంలో జీన్ లండ్గార్డ్ తన భర్త జెరి లండ్గార్డ్ గురించి అనదగ్గ మాటలవి. Coen Brothers’ Fargo is a crime thriller that also happens to be a dark comedy, OK make that very dark. Set in the middle of nowhere

నీ కోసం ....: మీ బ్లాగ్‌లో Animated శుభాకాంక్షలు

2007-10-20 06:48 PM గుమ్మడాల చంద్రశేఖర్ గౌడ్
బ్లాగ్ పాఠకులకు విజయదశమి శుభాకాంక్షలు మీ బ్లాగ్‌లో Animated శుభాకాంక్షలు తెలియజేయుటకు html code కు www.nikosam.blogspot.com లో ఒకసారి ప్రయత్నించి చూడాండి. www.nikosam.blogspot.com

నీ కోసం ....: ఆ రాయే రత్నమైంది

2007-10-20 06:48 PM గుమ్మడాల చంద్రశేఖర్ గౌడ్
ఆ రాయే రత్నమైంది హాయ్ నేను చందు. మధు లవర్‌ని. బయట సందేశ్ అన్నా పలుకుతాను. నేను సినిమాల్లోకి రావడం అంతా ఓ కలగా ఉంది. అమెరికాలోని న్యూజెర్సీ ఓ రోజు నెట్‌లో ఉండగా కొత్త నటీనటులు కోసం శేఖర్ గారిచ్చిన ప్రకటన చూశా. ఓ రాయేద్దాం అనుకున్నా. అది రత్నంలాంటి అవకాశాన్నిచ్చింది. నేనక్కడ ప్లస్‌టూ చదువుతున్నా. జూన్‌లో పరీక్షలు. అయినప్పటికీ రివ్వున ఎగిరొచ్చి ఆంధ్రాలో వాలా. ఐదేళ్ల వయసులో అమెరికాకు

కొత్త బంగారులోకం: విజయదశమి(దసరా)శుభాకాంక్షలు

2007-10-20 06:04 PM విహారి(KBL)
అందరికి విజయదశమి శుభాకాంక్షలు. దుర్గామాత యంత్రం: బొమ్మలకొలువు:

ఏది నిజం?!

2007-10-20 05:48 PM Sridhar
శివ శివా?

ఏది నిజం?!: సమాధిలోకి సంగీతమా?

2007-10-20 05:48 PM Sridhar
ఫోటోలక్రింద ఇచ్చిన వివరణ Image రూపంలో వుంటుంది. దాన్ని click చేసి చూడండి

ఏది నిజం?!: యేవీ ఆ ధగధగలిక్కడ?

2007-10-20 05:48 PM Sridhar
ఫోటోలక్రింద ఇచ్చిన వివరణ Image రూపంలో వుంటుంది. దాన్ని click చేసి చూడండి

ఏది నిజం?!: యెవరు వొదిలేసిన మహలిది?

2007-10-20 05:48 PM Sridhar
ఫోటోలక్రింద ఇచ్చిన వివరణ Image రూపంలో వుంటుంది. దాన్ని click చేసి చూడండి

ఏది నిజం?!: యెవడు తొలిచిన చరిత్ర ఇది?

2007-10-20 05:48 PM Sridhar
ఫోటోలక్రింద ఇచ్చిన వివరణ Image రూపంలో వుంటుంది. దాన్ని click చేసి చూడండి

ఏది నిజం?!: ముంతాజ్! ముంతాజ్!

2007-10-20 05:48 PM Sridhar
ఫోటోలక్రింద ఇచ్చిన వివరణ Image రూపంలో వుంటుంది. దాన్ని click చేసి చూడండి

ఏది నిజం?!

2007-10-20 05:48 PM Sridhar
చంద్రవంకా?వంకాయా? చంద్రవంకా?కలశమా?

ఏది నిజం?!: గోరీ గోడలపై తామరపువ్వు

2007-10-20 05:48 PM Sridhar
ఫోటోలక్రింద ఇచ్చిన వివరణ Image రూపంలో వుంటుంది. దాన్ని click చేసి చూడండి

ఏది నిజం?!: Aerial View

2007-10-20 05:48 PM Sridhar

ఏది నిజం?!: తాజ్ మహల్ లోపల్లోకి- కొన్ని దృశ్యాలు

2007-10-20 05:48 PM Sridhar
ఇక తాజ్ మహల్ ని దగ్గిరనుంచి చూసే సమయం వొచ్చింది. రండి. ఆ దృశ్యాల్ని 'మన కన్ను గప్పిన దొంగలు" అనే విభాగం క్రింద చూడండి. ఫోటోలక్రింద ఇచ్చిన వివరణ Image రూపంలో వుంటుంది. దాన్ని click చేసి చూడండి

చంద్రవంక: కాంక్ష

2007-10-20 04:22 PM Sridhar
నాకు నిద్ర ముంచుకొస్తోంది చలనం లేని అనార్కలీ పాదాల చెంత మేల్కోవాలని ఆశించి ఆమె పాదాలను తాకాలన్న బలమైన కాంక్షతో తపించిపోయిన సలీంలా... నాకు మత్తులాంటి నిద్ర ముంచుకొస్తోంది జూలియట్ నవ్వుకోసం స్వప్నంలోంచి మేల్కాంచాలని తపించి దుఃఖసముద్రంలో కొట్టుకుపోయిన రోమియోలా ... నాకు మృత్యువు లాంటి నిద్ర ముంచుకొస్తోంది కొన్ని యుగాల తరువాతయినా ఆమెలో ప్రేమల్ని రగిల్చాలన్న బలమైన కాంక్ష నన్ను గెలిచి... నాకు

వికటకవి: ఇదిగో నా మొదటి పద్యం….

2007-10-20 03:42 PM వికటకవి

రానారె గారి సమస్యకి ఊదం గారి ఈ పూరణతో ప్రేరితమై, నేను చివరికి నా మొదటి పద్యాన్ని అదే సమస్యకి పూరణతో ప్రారంభిస్తున్నాను. పురాణాలు పక్కన పెట్టి కర్ణుడు ఓ కుటుంబంలో కొడుకుగా భావిస్తూ, ఈ పద్యం రాసాను.

జననికి ముదముం గూర్పగ,
జనకుడు బోయె సంతకు జున్నును కొనగ,
తనయేమో బోయె బంతాటకి,
తనయుడు కర్ణుడు చేసె తల్లికి సేవల్!

తల్లికి సంతోషము గూర్చుటకు, తండ్రి సంతకు జున్ను తెచ్చుటకు వెళ్ళగా, కూతురు బంతి ఆటకు బైటికి పోగా, కొడుకు కర్ణుడు ఆమెతోనే ఉండి సేవలు చేసెను.

మొదటి పాదము మళ్ళీ కాస్త మార్చాలనిపించి ఇలా రాసాను.

జననికి మోదము ఖాయము
జనకుడు బోయె సంతకు జున్నును కొనగ,
తనయేమో బోయె బంతాటకి,
తనయుడు కర్ణుడు చేసె తల్లికి సేవల్!

ఇక అక్షింతలో, లక్షింతలో …. మీదే ఆలస్యం.

*******************************************************************************

బ్లాగేశ్వరుడు గారి టపాకు సమాధానముగా మొదటి సవరణతో

జననికి మోదము ఖాయము,
జనకుడు వెళ్ళె సంతకు జడకొప్పులకై,
తనయేమో బోయె బంతాటకి,
తనయుడు కర్ణుడు కాచె తల్లిక్షేమముల్!

తెలుగులో తప్పటడుగులు: దిగిన ముద్ద

2007-10-20 02:38 PM Giri
ఇదివరకు ఇక్కడ లైబ్రరీ వాళ్ళు నా చేతికందించిన రీళ్ళ గురించి చెప్పానుగా. ఉ. పెట్టిరి చేత రెండు కడు పెద్దవి పెట్టెలు ఒక్కసారిగా పెట్టితి నేను నోరునట వెళ్ళ ఇవేమిటి ఇంతవింతనీ తట్టెను బుఱ్ఱకాయకటు తప్పిదమెవ్వరు చేయలేదనీ పెట్టెలు నేను కోరినవి పిక్చరు రీళ్ళని తెల్సి తేటగా రీళ్ళని చూడకుండానే తిరిగి ఇచ్చేద్దామనుకున్న తరుణంలో, కాల్ చేస్తానన్న లైబ్రరీ ఆయన చేసాడు. ఇంటికి దగ్గరలో ఉన్న ఇంకో శాఖలో ప్రొజెక్టరు

జానుతెనుగు సొగసులు: చాటు పద్యం

2007-10-20 02:36 PM Vamsi M Maganti
ఉత్పలమాల రాజిత కీర్తి శాలి అగు రాయని భాస్కరు వేడబోయినన్ ఆజికి ఇట్లనున్ , పరుని ఆలికి ఇట్లను, అర్ధి కిట్లనున్; తేజము పెంపు లేని కడు దీనుని హీనుని వేడబోయినన్ ఆజికి ఇట్లనున్ , పరుని ఆలికి ఇట్లను, అర్ధి కిట్లనున్; వేములవాడ భీమ కవి: ఒక రోజు ఈయనని చయనులు గారింట్లో అవుతున్న విందు భోజనానికి "విధవ కుమారుడు" అని రానివ్వనందుకు కడుపు మండిపోయి చెప్పిన చాటు పద్యం ఇది గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి

దీప్తి ధార: సాహితీవనం -12

2007-10-20 02:18 PM cbrao
పాతాళగంగ కు ఆకాశమార్గం, శ్రీశైలం Photo:cbrao చివరి ప్రశ్నావళి సాహితీవనం శీర్షికలో, ఇది చివరి ప్రశ్నావళి. సూర్యతేజ (Solarflare), తెలుగు వీర సూచనల ప్రకారం,పాఠకుల జవాబులు ప్రచురించబడవు.సరైన సమాధానాలు (key) తో మాత్రమే, పాఠకుల జవాబులు కలిసి ప్రచురించబడతాయి. పాఠకులను చివరి ప్రశ్నావళి లో ఉత్సాహంగా పాల్గొనకోరుతాను. A) క్రికెట్ ఆస్ట్రేలియన్ కెప్టన్ రికీ పాంటింగ్ పై వచ్చిన “Inning

నా బ్లాగు, నా సోది, నా నస.: అమెరికా తెలుగు కథ (మొదటి సంకలనం)

2007-10-20 02:07 PM మాకినేని ప్రదీపు
రెండు నెలల క్రితం ఈ పుస్తకాన్ని మా చుట్టాల ఇంట్లో చూసాను, అప్పటికే వాళ్లింట్లో చదవాల్సినవారందరూ చదివేసినట్లున్నారు, బీరువాలో ఓ మూలకెళ్లిపోయింది... ఏట్లాంటి కథలుంటాయో చూద్దామని మొదటి పేజీ చదవటం మొదలుపెట్టాను, ఇంకొంత సేపటికి పుస్తకంలోని మొదటి కథ పూర్తయిపోయింది; అప్పుడే ఇది మొత్తమంతా చదవాల్సిన పుస్తకం అని అనిపించింది. ప్రస్తుతం ఈ పుస్తకాన్ని రెండోసారి చదువుతున్నాను! ఈ పుస్తకాలలోని కథలు

చందమామ: మీకు తెలుసా?

2007-10-20 01:18 PM డా.పి.మురళీ కృష్ణ.
నెలలు నిండిన గర్భిణిలో గర్భసంచి మాములుకన్నా 500రెట్లు పెరిగివుంటుంది.గర్భిణిలో దంతవ్యాధులు పుట్టబోయే బిడ్డకు హాని కల్గించవచ్చు.గర్భవతులలో పంచేంద్రియాల పనితీరు మరింత నిశితంగా తయారవుతుంది.భార్యకన్నా భర్త వయస్సు ఎక్కువైతే మగపిల్లలు పుట్టే అవకాశం ఎక్కువుంటుంది.పిల్లలు కలగని స్త్రీలలో రొమ్ముకాన్సరుకు అవకాశమెక్కువ.మరణం తర్వాత గోళ్ళు,వెంట్రుకలలో కొన్ని గంటలసేపు ఎదుగుదల వుంటుంది.మనిషి గుండెకు 30 అడుగుల

జ్యోతి: విజయదశమి శుభాకాంక్షలు…

2007-10-20 01:11 PM జ్యోతి
తెలుగు బ్లాగలందరికీ  దసరా శుభాకాంక్షలు…  చిత్రం మీద క్లిక్ చేసి దుర్గా హారతి వినండి…

Royal Youth Association (Bank of Blood Donors): మా ఆశయం :

2007-10-20 12:48 PM Royal Youth Association
మా ఊరిలో ఎన్నో యువ సంఘాలు వున్నాయి కాని, అవి అన్నీ కేవలం పండుగలు పబ్బాలప్పుడు మాత్రమే కనుబడుతాయి, అంతెందుకు ఎక్కడైనా మీరే చూడండి గల్లీ కొక వినాయక సంఘం, యాదవ సంఘం, వాల్మీకి సంఘం, సెహరీ సంఘం, ఇలా గల్లీకొక సంఘాలు ఏర్పడి పండుగలప్పుడు భారీగా బ్యానర్ లు, డ్రెస్సులు, మందు బాబులు కలసి కావలసినంత గొప్పలు జరుపుకుంటారు. మా ఊరి విషయములో కూడా అదే సంగతి జరిగింది, మా ఊరిలో గ్రామ పొలిమేలరనుండి చివరి దాకా యాదవ

తెలుగుదనం బ్లాగు: వంటలు - పెసరపప్పు గంజి

2007-10-20 12:39 PM Murali Krishna Valiveti
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - 2 గ్లాసులు పంచదార - ఆరు స్పూన్లు చిక్కటిపాలు - 4 గ్లాసులు యాలుకల పొడి - కొద్దిగా తయారుచేసే విధానం: పెసరపప్పును కొంచెం నీటిలో బాగా ఉడికించాలి. పప్పు బాగా ఉడికిన తరువాత వేడి చేసిన పాలను పప్పులో పోసి ప్పప్పు, పాలు రెండు బాగా కలిసేలా కలియబెట్టాలి. [ ఇంకా...]

తెలుగుదనం బ్లాగు: వ్యక్తిత్వ వికాసం - ఆత్మ గౌరవం

2007-10-20 12:39 PM Murali Krishna Valiveti
ఎవరైతే కష్టించి పని చేస్తారో, ఙ్ఞానవంతులో, తెలివి కలవారో, నైపుణ్యం కలవారో అటువంటి వారు అన్ని చోట్లా గౌరవింప బడతారని జగమెరిగిన సత్యం. అఙ్ఞానులు, అసమర్ధులు, సోమరిపోతులు, మందబుద్దులు ఎల్లప్పుడూ అవమానాల పాలవుతారు. ఎన్ని సార్లు అవమానించ బడినా, చీత్కరించబడినా, అనేక సార్లు హెచ్చరించబడినా, తాఖీదులందుకొన్నా, తమతప్పులకు చివాట్లు తిన్నా, చివరకు శిక్షించబడినా కూడా కొంతమంది తమకు తాము మెరుగు పరచుకోవడానికి

తెలుగుదనం బ్లాగు: వంటలు - గుమ్మడి చట్నీ

2007-10-20 12:39 PM Murali Krishna Valiveti
కావలసినవి: కందిపప్పు - ఒక కప్పు ఎండుమిర్చి - ఐదు గుమ్మడి తురుము - అర కప్పు ధనియాలు, జీలకర్ర - రెండు స్పూన్లు వెల్లుల్లి - ఒక రెబ్బ చింతపండు - రెండు రెబ్బలు నూనె - తగినంత ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు - తగినంత తయారు చేసే విధానం: ముందుగా ఒక గిన్నెలో కొంచెం నూనె వేడిచేసి కందిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర గుమ్మడి వేసి వేయించాలి. [ ఇంకా...]

తెలుగుదనం బ్లాగు: వంటలు - చురుమురి

2007-10-20 12:39 PM Murali Krishna Valiveti
కావలసిన పదార్థాలు: మరమరాలు - 1/4 కిలో క్యారట్ తురుము - 100 గ్రా కీర తురుము - 100 గ్రా ఉప్పు - తగినంత కారప్పొడి - కొద్దిగా కొత్తిమీర తురుము - కొద్దిగా నిమ్మరసం - రెండుస్పూన్లు తయారుచేసే విధానం: మరమరాలను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని దానికి క్యారట్ తురుము, కీరా తురుము, ఉప్పు, కారప్పొడి, కొత్తిమీర తురుము వేసి చక్కగా కలిపి సన్నటి సెగ మీద రెండు, మూడు నిమిషాలు వేయించాలి. [ ఇంకా...]

తెలుగు వెబ్ ఛానల్: కాంతి వేగాన్ని అధిగమించిన శాత్రవేత్తలు.

2007-10-20 12:39 PM Tulasi Ram Reddy
ఇన్నాళ్ళూ కాంతి వేగాన్ని మాత్రం అధిగమించలేరని అందరూ అనుకుంటున్నారు. కానీ దానికి ఇప్పుడు కాలం చెల్లిపోయింది. జర్మనీకి చెన్దిన ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలు ఈ విషయమై తమ ప్రయోగాలు ఫలించాయని చెప్తున్నారు. ఇదే కనుక నిజమని నిరూపితమైతే మన ఐన్‌స్టైన్, ప్రతిపాదించిన "థీరీ ఆఫ్ రిలెటివిటీ"(Theory of Relativity)కి ఇక కాలం చెల్లినట్లే. సాధారణ భౌతిక సూత్రాల ప్రకారం, ఒక వ్యక్తి తన ప్రయాణమంతా కాంతికంటే వేగంగా

నా ప్రపంచం: First four chapters

2007-10-20 12:28 PM innaiah
The Treeth about the Gita నార్ల వెంటేశ్వరరావు రచనకు సంక్షిప్త తెలుగు సేత ఎన్. ఇన్నయ్య భారత శాస్త్రీయ పరిశీలనా కేంద్రం ఇ-బుక్ ప్రచురణ గీతా రహస్యం పీఠిక దేశ విదేశాలలో కొందరు గొప్పవారు భగవద్గీతను గొప్పమత గ్రంథంగానూ, తత్వం నీతి రంగాలలో తిరుగులేని మార్గ దర్శిగానూ, సామాజిక విజ్ఞాన రంగాలకు సైతం ఆదర్శవంతమైనది గానూ భావించారు. వారిపై నేను తీవ్ర విమర్శచేశాను. అందుకు క్షమాపణ కోరడం లేదు. వారెంత గొప్ప వారైనా

నా ప్రపంచం: Truth about the Gita

2007-10-20 12:28 PM innaiah
వి ఆర్ నార్ల తెలుగు వారికి అందించిన గొప్ప రచన భగవద్గిత పై నిశిత పరిసీలన.ఇంగ్లిష్ లొ ది ట్రూత్ ఎబౌట్ థి గీత రచనను ఆయన మరనానంతరం నేను వెలువరించాను. తెలుగులొ గీతా రహస్యం పేరిట ప్రచురించాము .ఇప్పుదు ఇంతెర్నెట్ ప్రపంచానికి అంథిస్థునాము.గీత ను పారయణం చెయదం గాక శాస్త్రియం గా నార్ల రాసారు .తెలుగు అనువాదం నే ను చెసాను.

తెలుగుదనం బ్లాగు: ఆధ్యాత్మికం - నిరంతర దైవ చింతన

2007-10-20 10:52 AM Murali Krishna Valiveti
జైన శాస్త్రములో ఒక చక్కనిగాధ కలదు. పూర్వము శ్రీ రామచంద్రుడు రావణ సంహారానంతరము పట్టాభిషేకము పూర్తి ఆయినపిదప ఆనందముగా రాజ్యమును పరిపాలించుచుండెను. యుద్దమున శ్రీరామునకు సాయమొనర్చిన పలువురు ఆ సమయమున శ్రీ రామచంద్రుని సమీపించి "మహాత్మా యుద్దకాలమున మేము తమకు ఆనేక విధముల తోడ్పడి తమ సేవలొ పాలుపంచుకొంటిమి. మహత్తర పుణ్యమును తద్వారా మేము సముపార్జించుకొనగలిగితిమి. [ ఇంకా...]

బ్లాగేశ్వరుడు: నేను కథనాయకుడు ఇద్దరం జర్మన్లకి పట్టుబడిపోయాం

2007-10-20 10:40 AM బ్లాగేశ్వరుడు
జీవితం లొ అంతర్జాల పాళ్ళు ఎక్కువై పోయి సినిమా పాళ్ళు తక్కువై పోతున్నాయని భావించి టి.వి. స్విచ్ ఆన్ చెయగానే ఆసక్తి కలిగించే సినిమా ప్రకటన కనిపించింది. లేడికి లేచిందే పరుగని నేను సినిమా పేరు చూసి ఏ సినిమా హాల్ లొ ఆడుతొందో తెలుసుకొని సినిమా గురించి మరే విషయాలు తెలుసుకోకుండా బయలు దేరాను.సినిమా పేరు నకళ్ళతయారీదారులు. సినిమా హాలు కి 15 నిమిషాలు ముందుగా చేరుకొన్నాను. టికెట్టు కొని హాలు లోకి

తెలుగక్షరం...: ఇది కధ ( కాంటీన్ ) కాదు.

2007-10-20 10:05 AM Budaraju Aswin
మొన్నీ మధ్య పాపర్ లో చదివా ఎవరో ఇనప ముక్కలు, రాళ్ళు, గాజు పెంకులు గట్రా గులాబ్ జాములాగా లాగిస్తున్నడన్న వార్త ప్రపంచ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసిందేమొ కాని మా కాలేజి వాళ్ళను మాత్రం కాదు. దానికి కారణం కోకోల్లలు అని కవర్ చేయను. దానికి కారణం మా కాలేజి కాంటీన్. ఎంతటి వారనన్నాతలదన్నేవారున్నరంటారు, కానీ అందరిని తన్నేది మాత్రం మా కాలేజ్ కాంటీన్ అని గర్వంగా చెప్పుకుంటాను(ము). ******** అది నేను కాలేజ్

telugugreetings: విజయదశమి పండుగ వచ్చేసింది!

2007-10-20 09:41 AM పద్మనాభం దూర్వాసుల
విజయదశమి పండుగ వచ్చేసింది! ఇది తెలుగువారందరికీ ఎంతో ముఖ్యమైన పండుగ తియ్యని తెలుగులో, భక్తిభావంతో కూడిన శుభాకాంక్షలు తెలుగుగ్రీటింగ్స్ నుండిమీ స్నెహితులకు, శ్రేయోభిలాషులకు పంపండి. మీ అనుభంధాలను ద్రుఢ పరచండి"అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపెద్దమ్మ ... దుర్గమ్మ "మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను చల్లగా కాపాడాలనీ, ఈ విజయదశమి మీ విజయపరంపరలకు నాంది కావాలని తెలుగుగ్రీటింగ్స్ కోరుకుంటోది

రేగొడియాలు: చిర్రెత్తించిన “చిరుత”

2007-10-20 08:13 AM రాజారావు తాడిమేటి
ఈ సినిమాను చూసి దాదాపు రెండు వారాలు కావస్తున్నా, పని వత్తిడిలో పడి సమీక్ష రాయడం కుదరలేదు. చిరంజీవి కొడుకు సినిమా అన్న ఒక్క కారణం తప్ప, ఈ సినిమాలో చూడడానికి ఏమీ లేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ, హాలీవుడ్ సినిమానుంచి కాపీ కొట్టిన కథనం, ఒక పాట, ఒక పైటు, ఒక సీను.. ఇలా అతుకులబొంతలా సినిమా మొత్తం సాగిపోయింది. సినిమా సాగుతున్నంత సేపూ జనాలనుంచి అసహనంతో కూడిన నిట్టూర్పులు,  “ఎలాంటి సినిమాకొచ్చామురా భగవంతుడా..!!” [...]

నివేదన: విజయదశమి శుభాకాంక్షలు

2007-10-20 08:11 AM Ramya
సర్వ స్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే। భయే భ్య స్త్రాహినో దుర్గా దేవీ నమోస్తుతే। సర్వబాధా ప్రశమనం త్రైలోక్య స్యా దఖిలేశ్వరి। ఏవమేవ త్వయా కావా మస్మద్వైరి వినాశనం। అందరికి ఆయురారోగ్యాలు, సమస్త విజయాలు లభించాలని ఆకాంక్షిస్తూమిత్రులందరికి విజయదశమి శుభాకాంక్షలు Get this widget Track details eSnips Social DNA

నా నువ్వు: ఆకాశం ఏనాటిదో

2007-10-20 06:20 AM Sudhakar
ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది ఆవేశం ఏనాడు కలిగెనో ఆనాడె తెలిసిందది ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తెనో ఏ రాగం ఏ గుండె లోతున ఏ గీతం పలికించునో

నా నువ్వు: నిదురించు జహాపనా

2007-10-20 06:14 AM Sudhakar
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా పండు వెన్నెల్లో వెండి కొండల్లే తాజ్ మహల్ ధవళ కాంతుల్లో నిదురించు జహాపనా

నా నువ్వు: ఆణిముత్యమా

2007-10-20 06:14 AM Sudhakar
అలివేణీ ఆణిముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా జాబిలి చలువో, ఇది వెన్నెల కొలువో స్వాతి వాన లేత ఎండలో జాజి మల్లే పూల గుండెలో

నా నువ్వు: జీవితమే రంగుల వలయం

2007-10-20 05:35 AM Sudhakar
జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం గడిచే ప్రతి నిముషం ఎదిగే ప్రతిబింబం వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం
వ్యాఖ్యలు

2007-10-21

2007-10-21 01:31 AM prayaga satish

vijayadasami subhakankshalu

2007-10-21 12:52 AM విహారి(KBL)
మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.
2007-10-21 12:52 AM వికటకవి

@గిరి,

ఆడవాళ్ళు జున్ను కన్నా జడకొప్పులకే విలుఎక్కువ ఇస్తారు లెండి. జ,జు ల యతిమైత్రి నాకూ అనుమానమే వచ్చింది. కానీ, సుమతీ శతకములో ఈ పద్యము చూడండి.

నడువకుమీ తెరువొక్కట
గుడువకుమీ శత్రు నింట గూరిమి తోడన్
ముడువకుమీ పరధనముల
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ

ఇది చూసి అలా ప్రయత్నించాను. నెనర్లు.

2007-10-21 12:42 AM విహారి(KBL)
మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.
2007-10-21 12:42 AM విహారి(KBL)
మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.
2007-10-21 12:31 AM Giri

నాకన్నా నా ఇతరసగానికి తెగ నచ్చేసింది. మరిన్ని సార్లు చూస్తుంది ట.

2007-10-20

2007-10-20 09:52 PM Mohan Babu
మీకు పురాణాల మీద చాలా మంచి అవగాహన ఉంది. మీరు చెప్పె విషయాలు కూద ఆసక్తికరంగా ఉన్నాయి. చెలరేగిపొండి
2007-10-20 09:52 PM బ్లాగేశ్వరుడు
@బూదరాజు అశ్విన్ గారు సినిమా పేరు నేను చూసిన మొదటి జర్మన్ సినిమా, మీరు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో తెలియదు కాని సినిమా పేరు The counterfeiters జర్మన్ భాష లొ పేరు Die Fälscher http://en.wikipedia.org/wiki/The_Counterfeiters_(film) ఒకసారి చూడవచ్చు సినిమా బాగానే ఉన్నది@ఇన్ని బ్లాగులు తయారు చేశాను కాని వాటిని నిర్వహించగలనా విశ్వనాధ్ వారు చెప్పండి.@గురువుగారు , సినిమా అనుభవం తొ పద్యం
2007-10-20 09:22 PM Giri

చెప్పడం మర్చా, తాటకి ని బంతాటకి ని చేసిన మీ చమత్కారం బావుంది. పద్యం చాలా సుళువుగా అర్ధమయ్యే రీతిలో రాసారు..

2007-10-20 09:18 PM Giri

జ కి జు కి యతి మైత్రి కుదరదు కాబట్టి, జడ కొప్పులే ఆమోదములు.
జడకొప్పుల కోసం జున్నుని కాలదన్నడం బహుశా ఇక్కడొక్క చోటే చూస్తానేమో..

2007-10-20 08:39 PM వికటకవి

బ్లాగేశ్వరుడు గారు,

చాలా కాలం తర్వాత ఓ పరీక్ష రాసి, ఫలితాల కొరకు వేచి చూసే పిల్లాడి పరిస్థితి నాదయిందంటే నమ్మండి. రానారె గారి తాటకి నిజంగా నా తాట వలిచింది. మీరు చెప్పిన విషయములు నిషిద్ధ “జ” గణము గుర్చి అని గ్రహించాను. నెనర్లు. ఇప్పుడు సవరణ పైన చూడండి. మళ్ళీ తప్పయితే, వివరించగలరు, ఎందుకయినదో తప్పు.

2007-10-20 08:36 PM బ్లాగేశ్వరుడు

రెండవ పాదం,చివరి పాదం చంధస్సు సరిపోలేదు. ప్రయత్నించండి , సరైన పద్యం వచ్చేస్తుంది. ఒకసారి చందస్సు చూసుకోండి. చాలా మంచి ప్రయత్నం

2007-10-20 08:35 PM కొత్త పాళీ
ఈ అనుభవం మిమ్మల్ని "ఓరి నీచ నికృష్ట .." అని ఆశువుగా ఒక తిట్టు పద్యం చెప్పటానికి ప్రేరేపించలేదా?
2007-10-20 08:32 PM వికటకవి
ఇదే మొదలు మీ బ్లాగుకి రావటం. చాలా బాగున్నాయి మీ పద్య రత్నాలు.
2007-10-20 08:17 PM బ్లాగేశ్వరుడు

శభాష్ ! చాలా మంచి పూరణం వ్రాశారు , ఇలా ఒక్కొక్కరు రెండేసి పద్యాలా ఒక్కో పూరణికి…. ఊరించి ఊరించి చాలా మంచి పద్యం వ్రాశారు.

2007-10-20 08:06 PM కొత్తపాళీ

Hey, that’s really sweet. I was just about to step out to leave for the venue .. as I saw this. Thanks, Sriram!

2007-10-20 07:32 PM చదువరి
ఓహో ఈ రోజే నన్నమాట మీ కార్యక్రమం! మీ ప్రదర్శన జయప్రదంగా జరగాలని ఆశిస్తున్నాను. కార్యక్రమ కబుర్ల కోసం ఎదురుచూస్తాను.
2007-10-20 07:18 PM విహారి(KBL)
మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.
2007-10-20 06:52 PM పద్మనాభం దూర్వాసుల
జ్యొతిగారూక్రుతజ్ఞతలు. మీ సలహా బాగుందివీలుచూసుకొని తప్పక ప్రయత్నిస్తాను
2007-10-20 06:52 PM పద్మనాభం దూర్వాసుల
కేసరి,సుధాకర్ గారికి మీ సహృదయతకు క్రుతజ్ఞతలు
2007-10-20 06:47 PM జ్యోతి
స్వాగతం పద్మనాభంగారు,మీ సైట్‍లోని గ్రీటింగ్స్ నేను ఎన్నోసార్లు మా స్నేహితులకు పంపా. కాని ఆ ఫ్లాష్ గ్రీటింగ్స్ బ్లాగులో పెట్టడం వీలవుతుందా. ఒకేసారి అందరికీ చెప్పడానికి.
2007-10-20 06:16 PM విహారి(KBL)
మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.మిగతా రెండు బ్లాగులు లాక్ చెసాసేరేంటండి.
2007-10-20 06:11 PM విహారి(KBL)
మీకు విజయదశమి(దసరా)శుభాకాంక్షలు.
2007-10-20 05:18 PM వికటకవి

ఈ తరహా సినిమాలకు అసలు వెళ్ళే సమస్యే లేదు. పూరి జగన్నాథ్ కూడా నిజాయితీగా స్టోరీ లైన్ సమర్దించుకోలేకపోయాడు. “జానీ” సినిమాకు ఖర్చు పెట్టిన డబ్బులు నా జీవితములో వేస్టెస్ట్ ఖర్చు. మీ బాధని బట్టి మీదదే కథేమోనిపిస్తోంది.

2007-10-20 04:52 PM మనవాడు(సత్య)
తాజ్ మహల్ గురుంచి నిజా నిజాలు చాలా చక్కగా విపులీకరించారు. మీ కౄషి కి నిజంగా కౄతజ్ఞతలు. ఇట్లు: సత్యసురేష్ ఆంధ్రా నుండి అమెరికా వరకు... (ap2us.blogspot.com)
2007-10-20 04:52 PM Sridhar
అవును. నాకు ఆ ఆలోచన వుంది(PDF). తాజ్ మహల్ గురించి ఇంకా రెండు పోస్ట్ లు వున్నాయి. అవి అయిపోయాక PDF లో అందరికీ అందుబాటులో వుంచుతాను. అయితే ఈ విషయం ప్రభుత్వ దృష్టికి చాలాసార్లు చాలామంది తీసుకువచ్చారు. ప్రొ. ఓక్ ముఖ్యులు .కోర్టులో కేసు కూడా వేశారు, సీలు వేసిన గదులను తెరవటానికి. కోర్టు కొట్టివేసింది. మన దౌర్భాగ్యం అంతే. మైనార్టీ వోట్లను ఎక్కడ కోల్పోతామేమోనని భయం మన నాయకులకు.
2007-10-20 04:52 PM Budaraju Aswin
మీ కో చిన్న విన్నపం ,మీరు టపా(లు ) తాజ్ మహల్ యొక్క విషయాలు ఆన్నీ ఓ pdf ఫైల్ లో ఉంచి అందరికి అందుబాటులో ఉంచగలరని మనవి ..ఈ బ్లాగు మా స్నేహితులందరితో పంచుకున్నాము మీరు చెప్పే విషయాలు చాలా ఆశక్తి గా ఉన్నయి -------------------------------ఇన్నీ ఆదారాలున్నామన కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీనిని అమలులోకి తీసుకు రాలేదు, ఇప్పటికీ తాజ్ మహల్ షాజహా కట్టించారనే ప్రచరంలో ఉండటానికి కారణం తెలుపగలరా ??
2007-10-20 02:56 PM విశ్వనాధ్
అబ్బో చాలా బ్లాగులు తయారు చేసేసారే.రకానికొక స్వీటు రుచి చూపిస్తారన్న మాట.
2007-10-20 02:22 PM కొత్త పాళీ
అడిగిన వెంటనే విపులంగా చక్కగా సమీక్ష రాసినందుకు బహు బహుత్ షుక్రియా! స్థూలంగా కథల వెనక భావాన్ని మీరు బాగానే పట్టుకున్నారు.
2007-10-20 02:22 PM తెలుగు వీర
మొత్తానికి నాతో చాలారోజుల తరువాత ఒక తెలుగు కథల పుస్తకాన్ని చదివించేట్టున్నారు
2007-10-20 01:56 PM Budaraju Aswin
ఇంతకీ సినిమా పేరు నిజంగానే ఇదే నానకళ్ళతయారీదారులు.
2007-10-20 01:53 PM చదువరి

అవును, ఒక్క సమస్యకు రెండు పూరణలా! పూరణల్లోని చమత్కారమంతా తాటక ను ఉత్త ఆటక?, వింతాటకి అని విరచడంలో ఉంది. దంచారండీ!

అయితే, ఈ విద్యార్థిదో సందేహం.. రెండో పద్యంలోని - పనిగట్టు “కొనిటు” లకుంతి - పర్లేదా? సంధి కుదిరిందా, కుదిర్చారా?

2007-10-20 01:19 PM బ్లాగేశ్వరుడు
గిరిగారు మీ మీద భోళాశంకరుడి వ్యాఖ్య తప్ప ఇంకేమి వ్రాయలేక పోతున్నాను. మీ పద్యాలు నాకు చాలా స్పూర్తిని ఇస్తున్నాయి. చదువరిగారు మీ పద్యం సూపర్గా వచ్చింది. అసలు చదువుతుంటే ఒక ప్రవహామే.. ...
2007-10-20 01:14 PM Budaraju Aswin
మీ బ్లాగు చాలా బావుందందీ...మీరు Bird watchers society of AP లో Secretary ఆ..మీ లాంటి వారిని ఇలా కలినందుకు చాలా ఆనందంగా ఉంది
2007-10-20 01:06 PM Budaraju Aswin
direct topic ని చాలా different గా రాసారు, మీకు నా జోహార్లు...
2007-10-20 01:02 PM budaraju aswin

చిరంజీవి స్టాంప్ తో రిలీజ్ అవ్వటమే తప్ప
ఈ సినిమాకు అంత బాగోలేదండి
హాపి డేస్ హవాకు చిరుత పరుగెత్తిందండి.

2007-10-20 12:51 PM చేతనా

ఈ మాత్రం తొక్కలో సినమాలో ఏంటో posh అనుకుంటున్నరో ఏంటో.. సగం డైలాగులు, ఇంగ్లీషు, హిందీ.. పిచ్చ మొకాలు.. సినిమా చూపించరా బాబు అంటే.. ఫైట్స్ చూపిస్తా, హాలివుడ్ ఎఫెక్ట్స్ చూపించేస్తా (వాడి బొంద) .. నత్తిగా మాట్లాడే హీరో పౌరుషం మాటలు.. అంతకంటే నత్తిగా పైగ తింగరిగా మాట్లడే హీరోయిన్‌, పక్కన ఒక కామెడీ ట్రాక్ ..అందరూ అంతే.. ప్రతీ హీరో.. ప్రతీ డరెక్టర్‌…

2007-10-20 12:43 PM తెలుగు వీర
ఓ, మీరూ స్క్రీన్ ప్రింటింగు చేశారా. నాకూ కొన్నాళ్ళు స్క్రీన్ ప్రింటింగు సహాయకునిగా పనిచేసిన అనుభవం ఉంది. బాగా తీక్షణమైన పని.గిరి, జాన్ గారు శ్రీతో పాటు వెనుక గారు అని కూడా వెయ్యకూడదని తెలిసీ కార్డులు వెయ్యించుకోవటానికి వచ్చిన వాళ్ళకు చెప్పలేకా పడిన అవస్థే ఈ ఆత్మహత్య
2007-10-20 12:43 PM Budaraju Aswin
అయ్యొ Einsteen
2007-10-20 12:42 PM Budaraju Aswin
శ్రీ శ్రీ గారి అనంతం కూడా కలుపుకోండి
2007-10-20 12:39 PM jyothi

చాలా బావుంది లలితా.

2007-10-20 12:33 PM బ్లాగేశ్వరుడు
ఏమోయ్ రానారె మాటలు రావడం లేదన్నావ్ మాటలు వ్రాశావ్ అంకెలు వేస్తే సరిపోయేవి కదా!!!
2007-10-20 12:30 PM ప్రవీణ్ గార్లపాటి

అబ్బో పదిహేను డాలర్ల టికెట్టా ? బాగానే కాష్ చేసుకుంటున్నారన్నమాట అక్కడ జనాలను.
ఈ సినిమా చూడకుండా నే బతికిపోయాను, మీరు అక్కడ బలయిపోయారు :)

2007-10-20 11:52 AM Budaraju Aswin
ఓ చిరిగిన చోక్కా తొడుక్కున్నా పర్వాలేదు, ఓ మంచి పుస్తకం కోనుక్కో అన్నారు...
2007-10-20 11:40 AM Giri

బాగా రాసారు. చిరుత చిత్రం టికెట్లు అధికధరలకమ్మి సొమ్ము చేసుకున్న వారి గురుంచి విన్నాను. నేను రాజమౌళి చిత్రాలేవీ చూడలేదు..కానీ పూరి చిత్రాలలో మీరన్న అతి సంభాషణలు నిజం.

2007-10-20 11:26 AM చదువరి
గిరి గారూ! ఊకదంపుడు గారికి అనుమానం రావడం సహజం. అదాయన నైజం! శ్లేషావతారులు, పన్‌డితులూ కాబట్టి!! కానీ రానారె గారికీ మీకూ అలా అనిపించడమే ఆశ్చర్యం! అసలు సంగతి మీకు తెలీనిదేముంది.. అక్కడ పాదం నిండాలి, గణాలు శాంతించాలి, యతి కుదరాలి. నాకు తట్టిన పదాలు రెండే.. మోదం, మోహం. మోదం మామూలుగా తట్టేదే గదా! సంతోషంతో పద్యం చదవడం వేరు, మోహంతో పద్యం చదవడం వేరు. పైగా, మీరు మోజుతో రాస్తున్నప్పుడు నేను మోహంతో చదవడంలో
2007-10-20 10:59 AM వైజాసత్య

సరూపక్క మస్తు యాదికి జేసినవే, బచ్పన్ల చంచల్‌గూడ గల్లీల ఇదే లొల్లి, ఆ గల్లీలో పోరడు పొద్గాల ట్యూషన్ బోతుంటె మా అక్కను చిడాయిస్తుండంట వాన్కి దమ్కీ ఇద్దాం దారా భయ్ అని ఎప్పుడు ఏదో ఒక కిస్సా నడుస్తుండె

2007-10-20 10:44 AM Nallamothu Sridhar
Padmanabham gaaaru, meeru blog start cheyatam happy ga undi.-Nallamothu SridharCOMPUTER ERA
2007-10-20 10:42 AM బ్లాగేశ్వరుడు
మీరు మరి పోడిగా సమీక్ష వ్రాశారని అనిపిస్తోంది. సినిమా ని వివిధ కోణాలలొ వ్రాయండి. సినిమా కథ గురించి, కథనాయకుడు, కథనాయకి నటన గురించి , సినిమా పాటల గురించి, సినిమా లొ ఉన్న హాస్య సన్నివేశాల గురించి , దర్శకత్వం గురించి ఓవర్ ఆల్ సినిన్మా గురించి, ఇన్ని విభాగాలుగా సినిమాని సమీక్షించమని కోరుతున్నాను
2007-10-20 10:31 AM Giri
మీరు రాసినదానికి ఆత్మహత్యకి ఎలా లంకె వేస్తారోనన్న ఉత్కంఠ చంపేస్తోంది..
పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish