2007-10-15
ఆత్మ హత్యా ప్రయత్నాలు
నేనూ నా అత్మ హత్యా ప్రయత్నాలు
2007-10-14
(అ)సాధారణ నాయికలు
ఓం బ్లాగాయనమ:
2007-10-13
‘ఇంటిపేరు’ పురుషుడిదే--ఇది ప్రకృతి న్యాయం!
శ్రీసర్వజిత్ శరన్నవరాత్రులు - బాలాత్రిపురసుందరి
2007-10-12
వేటూరి లిరిక్
ప్లాస్టిక్ హృదయం
సహృదయ్‌కుమార్ ఆలోచనలు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. అతడి కెదురుగా ప్లాస్టిక్ గుండెలను తయారుచేయడంలో పేటెంట్ పొందిన ఓ బహుళజాతి సంస్థ ప్రతినిధి కూర్చుని ఉన్నాడు.
“చూడండి సహృదయ్‌కుమార్, మీ ఆఫీసులో రకరకాల గుండె జబ్బులతో బాధపడుతున్నవారు ఉన్నారు. అంతెందుకు మీకు కూడా రేపు గుండె జబ్బు రావచ్చు. అందుకని నేను చెప్పేదేంటంటే…”
ఎంత మెత్తగా మాట్లాడుతున్నాడు? శరీరంలో కొన్ని వేల జీవకణాలతో తయారైన ఓ సజీవ అవయవాన్ని ప్లాస్టిక్‌తో మార్పిడి చేయడం ఎంత సులభమై పోయింది? ఈ ప్లాస్టిక్ గుండెలు డా. క్రిస్టియన్ బెర్నాడ్ కాలంలోనే ఉంటే, ఎంతమంది గుండెలు బాగుపడి ఉండేవో కదా?
“మామూలు గుండె వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. గుండె ఒత్తిడికి గురై నప్పుడు హైబిపినో లోబిపినో వస్తుంది. కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోయి ప్రాణాలకే ముప్పు రావచ్చు. కవాటంలో లోపాలు, ధమనుల్లో అడ్డంకులు, ఛాతి నొప్పి లేదా గుండెపోటు … ఇన్ని ప్రమాదాలున్నాయి. మరి మీలాంటి సామాన్యులు వీటికయ్యే ఖర్చులను భరించగలరా?” అడిగాడు ఆ ప్రతినిధి.
అతను పలికే ప్రతిమాటా సహృదయ్‌కుమార్ గుండెలోకి సూటిగా దూసుకుపోతోంది.
అతడికి తన కౌమారం గుర్తొచ్చింది. తను రాసిన ప్రేమలేఖలు, చిత్రించిన హృదయపు బొమ్మలు గుర్తొచ్చాయి. అప్పటి గుండెనే కదా ఇప్పటికీ అతని శరీరంలో ఉన్నది!
(అవును. నేను అప్పటి గుండెనే. నేను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. నీ కోసం ఎంతో చేశాను. ఆ నాటి ఆ సాయంత్రాన్ని జ్ఞాపకం చేసుకో. చెట్టుకింద నువ్వు, నీ ప్రేయసి మాట్లాడుకున్న రోజు. ‘నన్ను విడిచి వెళ్లిపోతే గుండె పగిలి చస్తానని’ నువ్వు ఆ రోజు అన్న మాటలు గుర్తుతెచ్చుకో, నేను అప్పటి గుండెనే - అంది అతడి గుండె. కాని సహృదయ్‌కుమార్ దాన్ని పట్టించుకోలేదు.)
గొల్‌గొతా పర్వతంపైన ఉండే శిలువ తన ముందే ఉన్నట్లు, క్రీస్తు గుండెలో గుచ్చిన మేకు నుంచి రక్తం ఓడుతున్నట్లు అనిపించింది సహృదయ్‌కుమార్‌కి.
అయినా తన సందేహాలు తీర్చుకోవాలనుకున్నాడు.
“అంటే గుండెకి సంబంధించిన ప్రతి సమస్యా దూరమై పోతుందంటారా?”
“ఖచ్చితంగా! మీరు టివీలో మేము చూపించే ‘టెన్షన్ లేని హృదయం’ అనే ప్రకటన చూడలేదా? ఆ ప్రకటనలో మిస్‌వరల్డ్ అయిన బాలీవుడ్ స్టార్ మరీ సెక్సీగా నటిం చిందని కొందరు విమర్శిస్తారు. అదేం పట్టించుకోవద్దు. అసలు విషయమేమిటంటే గుండె సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటేనే మనుషులు వంద శాతం సెక్సీగా ఉంటారు …” అని వస్తుంది.
సహృదయ్‌కుమార్ ఆ ప్రకటనని మునుపు చాలా సార్లే చూశాడు. కానీ దానికి సరైన అర్థం ఇప్పుడే తెలిసింది. అతడి మనసులో గజిబిజి తొలగి, స్పష్టత వస్తోంది.
“కాని నేనిప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను …”
“అదే పొరపాటు! పైగా అలా అనుకోడం చాలా అశాస్త్రీయం! మీకు తెలుసు కదా - చికిత్సకన్నా నివారణ నయమని, ఒక వేళ మీకు గుండె జబ్బు వస్తే ఏంజియోగ్రాం, పేస్ మేకర్, బైపాస్ సర్జరీ … ఇవన్నీ తలనెప్పి కదూ! పైగా మీ మీదే ఆధారపడ్డ మీ వాళ్లేమైపోతారు?” అంటూ సహృదయ్‌కుమార్ ముఖంలోని భావాలని గమనిస్తూ తిరిగి మాట్లాడసాగాడు.
“ఒక్కోసారి అది ప్రాణాంతకం కావచ్చు. అప్పుడు ఎవరం ఏమీ చేయలేం. పైగా మాకు ఎదురయ్యే వ్యక్తులలో 90 శాతం మంది మీలాంటి వాళ్లే. ఆలోచించండి …” అంటూ ఆపాడు.
కొద్ది క్షణాల తర్వాత మళ్లీ మాట్లాడుతూ “ఇప్పుడు కాస్త మా కంపెనీ గురించి చెబుతాను. మేము ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాలపైన దృష్టి సారించాం. ఈ దేశాలలో రకరకాల గుండె జబ్బులు ఉంటున్నాయి. అందుకే అక్కడ క్లినికల్ ట్రయిల్స్ నిర్వహిస్తున్నాం. మేము అమాయక ప్రజలను ప్రయోగాల కోసం ‘గినీ పిగ్స్’లా వాడుకుంటున్నామని కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం” అని చెప్పాడు.
(అబద్ధం! న్యూయార్క్‌లో ఓ ఎయిడ్స్ మందును అనాథ శరణాలయంలోని శిశువులపైన, చిన్నారులపైన ప్రయోగించారు. అమెరికాలోనే అలా జరిగితే మరి వర్థమాన దేశాల గతేంటి?” అంటూ అతడి గుండె హెచ్చరించింది. కాని సహృదయ్ కుమార్ పట్టించుకోలేదు.)
తనకి కావల్సిన డబ్బుని ఎలా సమకూర్చుకోవాలని సహృదయ్‌కుమార్ ఆలోచించసాగాడు.
ప్రావిడెంట్ ఫండ్ నుంచి అడ్వాన్స్ తీసుకోవచ్చేమో! విదేశీ రుణం పొందడానికి ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్య తగ్గించి, జీత భత్యాలలో కోత విధించాలని నిర్ణయిం చింది. దానికి నిరసనగా ఉద్యోగులు నిరవధిక సమ్మెకి దిగారు. సహృదయ కుమార్ కూడా సమ్మెలో పాల్గొన్నాడు. అందుకని అతడికి జీతమింకా రాలేదు. అతడి భార్య మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టుకున్న కంపెనీ ఇప్పుడు దాన్ని వేలం వేస్తానంటోంది. ఆ మేరకు వాళ్లు రాసిన ఉత్తరం సహృదయ్‌కుమార్ జేబులోనే ఉంది. తను నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నీ గుర్తొచ్చాయి అతడికి. చిన్నగా నిట్టూర్చాడు.
‘ఈ మల్టీ నేషనల్ కంపెనీ ప్రతిపాదన ఏదో బాగానే ఉన్నట్లుంది …’ అనుకున్నాడు. ఆ ప్రతినిధి గొంతు సవరించుకుని మళ్లీ చెప్పసాగాడు.
“మీరు ఆర్డర్ ఇస్తే, పనులు వేగం పుంజుకుంటాయి. మీకు గుండె మార్పిడి ఆపరేషన్ మా పానెల్ లోని ఆసుపత్రిలో జరుపుతాం. మామూలుగా అయితే చాలా ఖర్చవుతుంది. ధనిక దేశాలలో అయితే కనీసం వెయ్యి డాలర్లు! వర్థమాన దేశాలలో కాస్త చవకే. మేము తక్కువ ధరకి అంటే సుమారు ఇరవై ఐదు వేల రూపాయలతోనే సర్జరీ చేయిస్తాం. మరో ఐదువేలు ఆసుపత్రి ఫీజు…! ఇంకేం కట్టనక్కరలేదు. అన్నీ సర్దుకుంటాయి…” అంటూ ఒక క్షణం ఆగాడు.
సహృదయ్‌కుమార్‌కు మరింత నమ్మకం కలిగించేందుకు మళ్లీ ఇలా చెప్పాడు.
“ఆపరేషన్ రెండుగంటలలో పూర్తవుతుంది. ఓ వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఎంతో తేలికగా ఉంటుంది. అటు తర్వాత మీరు గుండెని పూర్తిగా మరిచిపోవచ్చు. జీవితాంతం అది హాయిగా ఒకే తీరుగా కొట్టుకుంటుంది…”
(’వద్దు. ఒప్పుకోవద్దు. నీ డబ్బుని దోచుకునే ప్రయత్నమిది. వాడో హృదయం లేని వెధవ. వాడి మాయలో పడొద్దు…’ అంటూ సహృదయ్‌కుమార్ గుండె రోదించసాగింది)
“అంటే ఆ పైన నాకెటువంటి గుండె జబ్బులు రావా?”కించిత్ ఆశ్చర్యంగా అడిగాడు సహృదయ్‌కుమార్. అతను అడిగిన తీరు చూస్తే దాదాపుగా లొంగిపోయినట్లే అనిపిస్తోంది.
“ఊహు … రాదు! ఒకసారి గుండె మార్పిడి చేయించుకుంటే ఇక దాని గురించి మర్చిపోవచ్చు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు - హృదయ దౌర్బల్యాన్ని వదులుకోమనే కదా! ప్లాస్టిక్ హృదయాన్ని సానుభూతి, దయ, ఔదార్యం వంటి పిచ్చి భావనలు కదిలించలేవు. ప్రస్తుతం సమాజంలో మనకు కావల్సింది అదే కదా! అంతేకాదు మీ జీవితంలో ఇక గుండెపోటు వల్ల చనిపోయే అవకాశమే ఉండదు. మిగతా అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తే, మీ ఆయుష్షు మరింత పెరుగుతుంది కూడా …” చెప్పాడు ప్రతినిధి.
మిగతా అవయవాలు కూడా ప్లాస్టిక్‌లో లభిస్తే ఇంకెంత బాగుండు? ఎంత అద్భుతంగా ఉంటుందో! ఇప్పుడైతే గుండె దొరుకుతోంది. తర్వాత తర్వాత ప్లాస్టిక్ లివర్, ప్లాస్టిక్ కిడ్నీ, ప్లాస్టిక్ బ్రెయిన్ … ఇలా ఎన్నెన్నో. సహృదయ్‌కుమార్ ఆనంద సాగరంలో తేలియాడసాగాడు.
(నీ శైశవం నుంచి బాల్యం వరకు, బాల్యం నుంచి యవ్వనం వరకు, నీ వృద్ధిలోనూ, నీ పతనంలోనూ, నీ అనుభవాలన్నీ నాతో పంచుకున్నావే … నీ రహస్యాలు నాకు తప్ప ఇంకెవరికీ తెలియవే - అటువంటి నా మాటే వినవా? ఆక్రోశించింది అతడి హృదయం. సహృదయ్‌కుమార్ హృదయ స్పందన ఎక్కువైంది. అదిప్పుడు విఫల ప్రేమికుడిలా ఏడుస్తోంది.)
ఒకప్పుడు అమరత్వం పొందాలంటే క్షీరసాగర మధనం చేసి అమృతం తాగాల్సొచ్చేది. అందులోనూ అమృతం తాగే హక్కు దేవతలకి మాత్రమే ఉండేది. కాని ఇప్పుడు అమరత్వం పొందడం సులువైపోయింది. తనకి ఎదురుగా కూర్చున్న ఆ ప్రతినిధి ఓ దేవదూతలా కనిపించాడు సహృదయ్‌కుమార్‌కి. అతడి శరీరమంతా ఓ కాంతి వలయంలా కనబడింది. ఆ కాంతి వలయం క్రమేణా తన శరీరాన్ని చుట్టుకుంటున్న భావన కలిగింది సహృదయ్‌కుమార్‌కి.
ఆ కంపెనీవారి అంగీకార పత్రం మీద చేతిలోకి తీసుకుని సంతకం చేశాడు.
(’అయ్యో … మానవుడా! ఎంతపని చేశావు’ అంటూ గుండె, గుండెలు బాదుకుంది. ఆ తర్వాత లబ్‌డబ్ వినిపించలేదు.)
***
ఓ చక్కటి వ్యాపార అవకాశాన్ని పొందిన ఆనందాన్ని దాచుకోలేక ఆ బహుళజాతి సంస్థ ప్రతినిధి మరో శలభాన్ని వెదుక్కుంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు.
-మళయాళం: ఎం.కె. చాంద్‌రాజ్ - ఆంగ్లం: సుధీర్
(ఈ కథ 2 సెప్టెంబర్ 2007 నాటి ఆంధ్ర జ్యోతి దిన పత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితం)
2007-10-11
నేను కొద్దిసేపు "గ్లాడియేటర్" నయ్యాను
సృష్టిలో పురుషుడే ముందు జన్మించాడు!
2007-10-10
జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!..4
2007-10-09
అవధానం డిశెంబరు 2003, సాయంకాలం
గమ్యం
జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!..3
2007-10-08
కథ చదివారా??
సుప్రసిద్ధ పాతిక
‘బాధల ముళ్లు గుచ్చుకుని బతుకు పచ్చి గాయమై’నా సాహితీ సేద్యాన్ని కొనసాగించిన సహవాసి మిగిల్చి వెళ్లిన చివరి ఫలం ‘నూరేళ్ల తెలుగు నవల’. (more…)
అష్టావక్రుడు
హసీనా
జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!..2
2007-10-06
వుబికే బిందువుల్లో ఓ నది
జీనో పేరడాక్స్ లూ – పూర్వపక్షం!..1
వీడ్కోలు గీతం
ఒక స్నేహితుడు job resign చేసి Phd నిమ్మిత్తం వెళ్ళిపోతున్నాడు. అతని పరంగా చూస్తే కొత్త మార్గంలో ప్రయాణం. కానీ అదే పాత అతను. అందరికీ దూరంగా, దేశం కానీ దేశంలో ఉండాలి. ఈ నిర్ణయం సరి అయినదా, కాదా అనే సందేహంలో ఉన్న మనస్థితి. ఇందులో కొంత బాధ ఉంది. హాయిగా ఉద్యోగం చేసుకుంటూ, అందరిలా ఉండకుండా మనసుకి నచ్చిన దానికై ఈ పరుగులు అనర్థమేమో అన్న భయం ఉంది. అసలు ఇంతా చేసి ఈ కొత్త అనుభవం తనకు సంతృప్తి కలిగిస్తుందా, లేదా? ఏమో, అనుభవం అయితే గానీ తెలియదు. ఈ భావాలు అన్నీ పేర్చి రాసిన కవిత.
రాత్రికి వీడ్కోలు పగలుకు స్వాగతం
తూరుపు మాత్రం ఒకటే
కొత్త దారి, కొత్త నడక
కాళ్ళు మాత్రం పాతవే
కొత్త ఆశలు, కొత్త బంధాలు
జీవితం మాత్రం అదే
మబ్బుతో బంధాన్ని తెంచుకోడం
చినుకుకు కష్టమే
అయినా, చినుకుకి తెలుసు
తన ఉనికి పరమార్థం
నేలకి దాహం తీర్చడమని,
పయనమవ్వక తప్పదని
దారితెన్నూ లేక తిరుగుతోందనిపించినా
నిజానికి కొండవాగుకి తన గమ్యం తెలుసు
ఎప్పుడూ ఒకచోటే పడి ఉండే చెరువులకి
నచ్చిన చోటుకి పరిగెత్తి చేరుకోడంలోని ఆనందం
ఎప్పటికీ తెలియదు!
ఎన్ని మలుపులు బ్రతుకులో!
ప్రతి మలుపూ పాత దారిని కప్పేస్తూనే
కొత్త దారిని చూబెడుతోంది
వెలుగురేఖల్ని మింగే చీకటి కూడా
జాబిల్లి వెన్నలని ఇస్తూనే ఉంది
జీవితం ఒక అన్వేషణ
అలుపులేని పరిశోధన
నడక మొదలెట్టేదాకా
మనకేం కావాలో మనకే తెలియదు!
నది
అదొక నది…
నన్ను రమ్మంటూ పలిచింది
ఊపిరాడనంతగా మునిగాక
కొత్తగా శ్వాసించడం నేర్చుకున్నా
ఈతకొట్టడమెలాగో తెలిశాక
తేలడం కన్నా మునగడమే బాగుంది
చుట్టూ కటిక చీకటి
అయినా దారి కనిపిస్తూనే ఉంది
మొదటి సారిగా తెలిసింది
చూసేది కళ్ళు కాదని…
లోపల వెలుగు ఉంటే,
ఏ రాత్రి నను తాకగలదు?
సుడిగుండాలని చూసి పారిపోయేవాడిని
ఇప్పుడు స్వాగతించడం నేర్చుకున్నా
అవి నన్ను తిప్పి తిప్పి విసిరేస్తాయి సరే
కానీ ఎంత కడిగి కడిగి శుభ్రపరుస్తాయో
నదిలో నేను ఐక్యమయ్యాక
ఇప్పుడిక తడిశాననే తెలీదు
ఈ అనంత జల రాశిలో
ఏది నీటి బొట్టో, ఏది నా కన్నీటి బొట్టో
కొన్ని భావాలు ఎందుకు పుడతాయో, వాటి అర్థమేమిటో తెలియదు. కానీ అప్పుడప్పుడూ ఎవో ఆలోచనలూ, ఊహలూ మనసును కదుపుతూ ఉంటే అప్రయత్నంగా ఏవో అక్షరాలు వెలువడుతూ ఉంటాయ్. ఈ పిచ్చి రాతల్లో, ఆలోచన కంటే అనుభూతే ఎక్కువ. ప్రాసలూ అవీ పక్కన పెట్టి, ఒక విధమైన సహజత నిండిన రాత ఏదో పుడుతుంది. ఇలా నేను రాసుకున్న చాలా కొన్ని కవితల్లో ఇది ఒకటి.
ఇదంతా ఏదో పైత్యం అని నేను అనుకుంటే, “లేదు బానే ఉంది. ఈ మార్పులు చెయ్యండి. ఇంకా బాగుంటుంది” అని edit చేసిన “మూలా సుబ్రహ్మణ్యం” గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
2007-10-05
రైతుకు రొక్కం
” ఏం మాలతీ, ఈ మధ్య రెండో కూర చేయడం లేదేం? ” భోజనానికి కూర్చుంటూ భార్యని అడిగాడు సుధీర్.
“కూరల రేట్లు మండిపోతున్నాయి. అదీ కాక అసలు మార్కెట్లోకి కూరలు రావడం లేదట” చెప్పింది మాలతి వడ్డిస్తూ.
“రేట్లు పెరుగుతున్నాయని నేనూ విన్నాను. కాని కూరలు మార్కెట్లోకి రాకపోడం ఏంటి?”
“నిన్న మావయ్యగారు చెప్పారు. ఆయననే అడగండి వివరంగా చెప్తారు”
“అవునవును. మీ మావగారు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కదా! ఆయనకి ఇటువంటి విషయాలపై మంచి అవగాహన ఉంటుంది. నాన్నతో రాత్రి మాట్లాడుతాలే”
సుధీర్ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తాడు. వాళ్ళ నాన్న సదానందం గారు ఇంకో కొద్ది రోజులలో రిటైరవబోతున్నారు. మూడేళ్ళ క్రితం రాజేంద్రనగర్ లో ఇల్లు కట్టుకున్నారు. పగటిపూట కుదరదని, రాత్రి పూట మాత్రం కుటుంబ సభ్యులందరూ కలసి భోంచేస్తారు. అనుకున్నట్లుగానే ఆ రాత్రి అన్నం తింటున్నప్పుడు తండ్రి ముందు తన సందేహం వ్యక్తపరిచాడు సుధీర్.
“దీనికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది రాష్ట్రంలో నాట్ల సమయంలో వర్షాలు లేకపోడం వల్ల టమాట, పచ్చి మిర్చి, బెండకాయ, దొండకాయ, వంకాయ, పొట్లకాయ వంటి కూరగాయల సాగు బాగా తగ్గింది. ఇకపోతే రెండో కారణం, మన రాజధాని చుట్టూ ఉన్న సాగుభూమి విస్తీర్ణం తగ్గిపోడం!” చెప్పారు సదానందం గారు.
” మొదటి కారణం అర్ధమైంది. రెండోది అర్ధం కాలేదు” అన్నారు కరుణ. ఆవిడ సుధీర్ అమ్మగారు.
” రాజధాని చుట్టుపక్కల భూముల విలువ హఠాత్తుగా పెరిగిపోయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఔటర్ రింగ్ రోడ్డు కోసం భూసేకరణ జరుగుతోంది. ప్రభుత్వం కన్నా ముందే రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులను ప్రలోభ పెట్టి, భూములని సొంతం చేసుకుంటున్నారు. తర్వాత ప్రభుత్వానికి మరింత ఎక్కువ ధరకి అమ్ముకుని లాభాలు పొందుతున్నారు. దానివల్ల సాగు భూమి తగ్గుతోంది. పైగా ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోతున్నది రైతులే” అన్నారు సదానందం.
“మావయ్యగారూ, మరీ విషయం రైతులకి అర్ధం కావడం లేదా?” అడిగింది మాలతి
“తాము మోసపోతున్నామని రైతులు గ్రహించడానికి కొంత సమయం పడుతుంది” చెప్పారు సదానందం.
“తమ భూములని అమ్మమని రైతులు అడ్డు చెప్పచ్చుగా…” అన్నాడు సుధీర్.
” ‘మీ మంచి కోసమేగా ఇదంతా’ అంటూ వట్టిమాటలు చెప్పి అధికారులు నయనా భయానా రైతుల నుంచి భూములని స్వాధీనం చేసుకుంటున్నారు. ఎక్కువ భూమున్న రైతులు లాభపడుతుంటే, కొద్దిపాటి భూమున్న చిన్న, సన్నకారు రైతులు తాము కూడ శ్రీమంతులవ్వాలని ఆశపడుతున్నారు” అన్నారు సదానందం.
” అసలు రైతులు వ్యవసాయం మాని, భూములని ఎందుకు అమ్ముకోవాలని అనుకుంటున్నారు?” అడిగింది మాలతి.
“అందరు రైతులు అలా అనుకోడం లేదమ్మా. గత కొన్నేళ్ళుగా వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదనుకుంటున్న రైతులు మాత్రం, ఏదో ఒక ధరకి భూములని అమ్ముకోవాలనుకుంటున్నారు. పండించిన పంటకి మద్దతు ధర లేకపోడం, కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా అనుకున్నంత రుణాలు మంజూరు కాకపోడం, రైతుమిత్ర సంఘాలు ఆశించిన స్థాయిలో పనిచేయకపోడం వంటి సంఘటనలు వ్యవసాయం పట్ల కొంతమంది రైతులకి విముఖత కల్గిస్తున్నాయి. మీకు మన ఊర్లో మల్లయ్య తెలుసుగా, అదే మొదటినుంచి అతని పొలంలో మా పరిశోధనలు చేసుకోడానికి అంగీకరించిన రైతు, అతడి పొలం కూడ అమ్మేసారు. ఆ సంగతి వినండి……” అంటూ చెప్పసాగారు సదానందం.
** *
“నాయనా, గీ ముచ్చట ఇన్నావా? కిషన్ గూడలో సూరయ్య మామ జిందగీ మారిపోయింది! బూమంతా లక్షలకి లక్షలకి అమ్మిండట, మోటర్ కారు కొంటున్నాడట…….” చెప్పాడు నర్సింహ.
” ఏంది బిడ్డా, బూమిని అమ్మడం ఏంది? లక్షలు సంపాదించడం ఏంది?” అర్ధం కాక అడిగాడు మల్లయ్య.
” ఔ మల్ల, మామ పొలం చుట్టూ గదేందో అవుటర్ రింగురోడ్డు పడుతుందంట. సర్కారోళ్ళు నోటీసు ఇస్తురంట. బ్రోకర్ మదద్ తో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి బూమిని అమ్మిండంట!”
“గదేందిరో, బూమిని అమ్ముకుంటే యవసాయం ఏం జేస్తాడు?”
” ఇంక యవసాయం దేనికి నాయనా, ఎకరం 12 లక్షలు పలికింది. మామకున్న మొత్తం ఇరవై ఎకరాలు అమ్మిండట. మామ హైదరాబాదుకి పోయి, అక్కడనే ఉండిపోతాడట. ఇల్లు, కారు కొంటాడట”
“గామద్య ఎయిర్‌పోర్టు ఏదో వస్తుందని ఇలాగే చాలా మంది తమ బూములను అమ్ముకున్నారు. ఇది కూడ గసుంటిదేనా ”
“గట్లనే అనిపిస్తుంది. నాయనా, మన ఆరెకరాలు కూడ అమ్ముదామే. మనకెటు పంటలు గిట్టుబాటు గావడం లేదు, లాబ ం అటుంచి, ప్రతీసారి మనం పెట్టిన డబ్బు కూడ రావడం లేదు”
“పొలం అమ్మితే, గెట్ల బతుకుతాం బిడ్డా?”
‘ ఫికర్ దేనికి నాయనా, డబ్బు వస్తది కదా. బ్యాంకుల వేసుకుంటే మిత్తీ వస్తది.దానితో హాయిగా బతకొచ్చు. పైగా మనకి పొలం మీద ఆమ్‌దనీ ఏం వస్తున్నది? మరీ అవసరమైతే నేనేమో హైదరాబాదు పోయి అడ్డా మీద లేబర్ గా పోతా, దినం కి అరవై రూపాయలొస్తాయి. చాలుకదా ”’
“బిడ్డా నేల తల్లి అసుంటిది. జాగ్రత్తగా చూసుకోవాలె. గిప్పుడైతే పొలం మీద ఆమ్‌దనీ తక్కువయింది. కాని మునుపు మస్తుగొస్తుండె. దాంతోనే నువ్వు పది దాక చదివినావు. యాదిలేదా?”
“నాకైతే అమ్మడమే మంచిదనిపిస్తోంది”
“వద్దు బిడ్డా. యవసాయాన్ని వదిలి మరో పనిని సేయడం. ఆసాన్ కాదు. సొంతూరుని వదిలి, పరాయి ఊర్లో కూలీ నాలీ చేసుకుని బతకడం కష్టం”
“కాదు నాయనా, సర్కారే బూములని కొంటుందట. రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడ కొంటున్నారు. మన చుట్టు పక్కల రైతులందరూ అమ్ము తుండ్రు. మస్తు పైసలొస్తున్నాయి. నా దోస్తులందరూ కార్లు, ఇండ్లు కొంటుంటే, నేనేమో బేకార్‌గానిలా ఉండిపోవాల్నా?”
‘గట్ల కాదు పోరగా. బ్యాంకులలో ఇచ్చే మిత్తీ రేట్లు ఒక్కతీరుగా ఉండవంట. సదానందం సారు చెప్తుండు. ఆలోచించు”
“లేదు. నేనైతే ఫైసలా తీసేసుకున్నా. అమ్మేద్దాం”
” గట్లనే, నిన్ను యాష్ట పెట్టి నేను బావుకునేది ఏముంది? ”
” ఆ విధంగా వాళ్ళు తమ భూమిని కోల్పోయారు……”అంటూ ముగించారు సదానందం.
“పోన్లెండి! చేను పోయినా, రైతుకి రొక్కం మిగులుతోంది….” అంది మాలతిఆలోచనగా. తర్వాత భోజనాలు ముగించి ఎవరి గదులలోకి వాళ్ళెళ్ళారు.
* * *
కొన్ని రోజులు గడిచాయి. విశ్వవిద్యాలయం రజతోత్సవం హడావుడిలో పడి, తాత్కాలికంగా మల్లయ్య కుటుంబం గురించి మరచిపోయారు సదానందం. ఓ రోజు ఆఫీసయ్యాక ఇంటికి వెడుతుంటే, మారుతీ కారు లో వెడుతున్న నర్సింహ కనిపించాడు. ఆయనని చూడగానే కారు దిగి పలకరించాడు నర్సింహ.
“సారు మా పొలాన్ని సర్కారే కొంది సారు. 14 లక్షలు వచ్చినాయి. అప్పులన్నీ పోగా, ఇంకా 8 లక్షలు మిగిలినాయి. ఈ సెకండ్ హ్యాండ్ కారు కొన్నా సారు. మిగతాది బ్యాంకులో ఏసినా. రియల్ ఎస్టేట్ దందా చేద్దామని అనుకుంటున్నా సారు…” అంటూ ఆనందంగా చెప్పుకొచ్చాడు. అతడి ముఖంలో కొత్తగా డబ్బు తెచ్చిన ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది.
” మీ నాన్న ఎలా ఉన్నాడు?” అడిగారు సదానందం.
“బాగానే ఉండు సారు. ప్రస్తుతానికి మా చెల్లి ఇంటి కాడ ఉన్నాడు. ఆడ యవసాయం చేస్తాడంట. కొన్ని దినాలైనాక వస్తాడంట. సారు, మేము గిప్పుడు హైదరాబాదులోనే ఉంటున్నాం. మా ఊర్లో ఇల్లు కిరాయికిచ్చినా, మలక్ పేట లో ఒక అపార్టుమెంటులో దిగినాం…..” అంటూ తమ ఇంటి అడ్రసు చెప్పాడు.
“సరే, ఉంటాను” అంటూ కదిలారు సదానందం. ఈ సంగతంతా కుటుంబ సభ్యులకి ఆ రాత్రి చెప్పారాయన.
* * *
ఒక రోజు నర్సింహ సెవెన్ సీటర్ ఆటో నడుపుతూ కనిపించాడు సుధీర్ కి. అతడిని పలకరిస్తూ, ” అదేంటి నర్సింహా, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావని నాన్న చెప్పారు. మరి ఈ ఆటో ఏంటి?” అని అడిగాడు.
” లేదు సారు, ఆ దందా లో నిండా మునిగినా. మాయ మాటలు నమ్మి రెండు లక్షలు పోగొట్టుకున్నా. బ్యాంకు వాళ్ళిచ్చే మిత్తీ తగ్గిపాయె. అందుకని ఈ ఆటో కిరాయికి తీసుకుని తిప్పుతున్నా. పెట్రోలు ధర పెరిగిపోడంతో మా కొచ్చే ఆమ్‌దనీ బాగా తగ్గింది సారు”
“వ్యవసాయం చేసుకునే రోజులే మీకు బాగుండేవేమో”
” ఔ సారు. గదైతే అలవాటైన పని. కష్టమనిపించలా. ఈడ ఏ పని చేసినా బాగా కష్టమైతాంది”.
“పోనీ మళ్ళీ వ్యవసాయమే చేసుకో”
“బూమి యాడుంది సారు? మళ్ళీ కొనాలంటే నా తాన ఉన్న డబ్బులకి ఏం వస్తాది? అంతా నా బద్‌నసీబ్! వస్తా సారు..” అంటూ ఆటో పోనిచ్చాడు నర్సింహ.
‘ ఊహలకీ, వాస్తవానికీ మధ్య ఉండే తేడాని నర్సింహ ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాడు’ అని అనుకుంటూ కదిలాడు సుధీర్.
కొద్ది రోజుల తర్వాత ప్రభుత్వం తాము సేకరించిన భూమిని, ప్రభుత్వ భూములని కలిపి బహిరంగ వేలం వేసింది. పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడగా, భూముల ధర ఆకాశాన్ని అంటింది. మల్లయ్య వాళ్ళ పొలం 6 కోట్లు పలికింది. మర్నాడు పేపర్లో ఈ వార్తని చదివి హతాశుడయ్యాడు నర్సింహ. గబగబా సదానందం ఇంటికి పరిగెత్తుకొచ్చాడు .
” సారు, మోసం జరిగింది. సర్కారు మాకు లక్షలు ఇచ్చి, బడా కంపెనీలకి మా భూములని కోట్లకి అమ్మింది. నష్టపోయినాం సారు” అని అన్నాడు బాధగా.
” అప్పట్లో మీ నా న్న ఎంత చెప్పినా నువ్వు వినలేదు” అన్నారు సదానందం.
“నా బాధ అదికాదు సారు. నేనొక్కడినే కాదు. మా ఊర్లో అందరం, ఇంకా మా పక్కూర్ల కూడ రైతులందరం మోసపోయినం. గిప్పుడు మాకు పంటలు పండిద్దామన్నా బూమి లేదు. మా దగ్గర ఉన్న డబ్బుతో ఇంకో చోట బూమి కొనలేం… మళ్ళీ మేము యవసాయం చేయలేం…..” అంటూ వాపోయాడు నర్సింహ.
“అవన్నీ ముందుగానే ఆలోచించుకోవాలి” అని అంది కరుణ, నర్సింహకి టీ కప్పు అందిస్తూ.
“లేదమ్మా. మేము అమ్మమని అన్నా, బలవంతంగానైనా మా భూములని సర్కారు గుంజుకునేది. అందుకే కాస్త మంచి రేటు పలికినప్పుడే అమ్మేయాలని నాయనని సతాయించినా. కాని సర్కారు గిట్ల చేస్తాదనిఅనుకోలేదు”
“రైతుల భూములని కొంటామని ప్రకటనలు చేయడం, మార్కెటౖఉ విలువని బట్టి పొలాలకి ఎకరానికి ఇంతని రేటు నిర్ణయించడం, ఆ తర్వాత ఆ భూములని అభివృద్ధి పనుల కోసం ఉపయోగిస్తామని చెబుతూ, అధిక ధరలకి వేలం వేస్తోంది ప్రభుత్వం. దీంతో ప్రభుత్వ ఖజానా నిండుతోంది కానిరైతులు మాత్రం తమ భూములు పోగొట్టుకుంటున్నారు” అన్నారు సదానందం నిట్టూరుస్తూ.
“మరిప్పుడు ఏం చేస్తావు నర్సింహా?” అడిగారు కరుణ.
“చేయ్యాల్సింది చాలా ఉందమ్మా. నా అసుంటి రైతులందరికీ నా కధ చెబుతా. ఇక పై నాలాగా ఎవరు మోసపోకూడదు. మా నాయనతో కలసి జిల్లా లోని రైతులు/రైతు కూలీ సంఘంలో మీటింగు పెట్టిస్తా. డబ్బు కోసం ఆశ పడద్దని, బూమికి బదులు బూమే ఇవ్వాలని అడగమని చెబుతా. అందరిని కూడగడతా……..” అని చె ప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు నర్సింహ.
అతడి ప్రయత్నం ఫలించాలని మనస్పూర్తిగా కోరుకున్నారు సదానందం, కరుణ.
(ఈ కధ 21 జనవరి 2007 నాటి ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది)
2007-10-04
yahoooooooo!
ఆఫీసు బ్రతుకు ౧
2007-10-03
గుర్రం జాషువా జయంతి సందర్భంగా శ్రీ జి. కళ్యాణ రావు గారి ప్రసంగం లో చిన్న భాగం!
సెంట్రల్ 'వర్సిటిలో జాషువా జయంతి.
(శీర్షిక లేదు)
(శీర్షిక లేదు)
(శీర్షిక లేదు)
(శీర్షిక లేదు)
2007-10-02
“కృకీలు”
2007-10-01
భావాతీతధ్యానం! (మెడిటేషన్)..3
2007-09-29
(శీర్షిక లేదు)
భావాతీతధ్యానం! (మెడిటేషన్)..2
2007-09-28
జాజిపూల జ్ఞాపకాలు
(శీర్షిక లేదు)
నిజమైన మనిషి
నేనో ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్‌ని. ఇది అసలే వేసవి కాలం! పగలంతా ఉక్కపోత తోను, చెమటతోను చికాకుగా ఉంటోంది. నిన్న రాత్రి ‘కాజువాలిటీ’ విభాగమంతా ‘ట్రామా’ కేసులతో కిటకిటలాడిపోయింది. నాకు జరిగిన అన్యాయానికి నా ముఖం పాలిపోయింది. మా పై అధికారులు, అధిపతులు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతుంటే, క్రింది స్థాయికి చెందిన నా లాంటి వాళ్ళం నలిగిపోతుంటాం. రోగులను పరీక్షించడం, కుట్లు వేయడం, ఆసుపత్రిలో చేర్చుకోడం, కేస్ షీటు రాయడం, వైద్య పరీక్షలు చేయడం, ……. ఇవన్నీ ప్రతీ రాత్రి చేయడం, మళ్ళీ తెల్లారగానే తాజాగా తయారై వచ్చే మా అధిపతుల ఆదేశాల కోసం సిద్ధంగా ఉండడంతోనే మా సమయమంతా సరిపోతుంది. నాకు దొరికే కాస్త సమయమల్లా ఓ అరగంట సేపు మాత్రమే.
ఓ కప్పు టీ తాగి బట్టలు మార్చుకుని రావడానికి సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ‘రౌండ్సు’ కి వెళ్ళాలి. ఇదికూడా దాదాపుగా కట్టు బానిసత్వమే!
ఈ పూట నాకు డ్యూటీ లేదు. ఇంటికి వెడదామని బస్ స్టాపు వైపు నడిచాను. జనాలతో కిటకిటలాడుతున్న ఓ సిటీబస్ లోకి జొరబడి, మెట్ల దగ్గరగా నిలబడ్డాను. బస్సు కదిలింది. జనాలు ఒకరినొకరు తోసుకుంటున్నారు, మోచేతులతో నెట్టుకుంటున్నారు. ఒక వైపు మురికి, చెమట, జిడ్డు, చేపల కంపు,…. మరో వైపు కాలివేళ్ళు తొక్కేసే ప్రయాణీకులు, దురుసుగా ప్రవర్తించే కండక్టర్.
రెండు స్టాపుల తర్వాత, జనం కొద్దిగా పలచబడ్డారు. నేను లోపలికి వెళ్ళగలిగాను. కండక్టర్ గట్టిగా ఈల వేస్తూ, ‘లోపలికి రండి’ అని అరుస్తున్నాడు. ఇంతలో అదృష్టవశాత్తు, రెండు వరుసల అవతల నాకో ఖాళీ సీటు కనిపించింది. అలవాటుగా రద్దీ లోంచి తప్పించుకోడానికి చూసాను. నా మెడలో వేలాడుతున్న స్టెతస్కోపు నాకు కాస్త వెసులుబాటు కలిగించింది. సీటు లో కూర్చోబోతూ, ఎందుకో ప్రక్క సీటు ప్రయాణీకుడిని చూసాను. అతడో కుష్టురోగి. చూపులకి భయంకరంగాను, వికారంగాను ఉన్నాడు. అతడు స్థానిక దినపత్రికలో కుంభకోణాలకు, మోసాలకు సంబంధించిన వార్తలను చదువుతున్నాడు. బహుశా చూపు ఆనడం లేదేమో, పేపరుని చాలా దగ్గరగా పెట్టుకుని చదువుతున్నాడు. నేను ఒక్కసారిగా వెనుకడుగు వేసాను. ఈ కురూపి, రోగిష్టి పక్కన నేనెలా కూర్చుంటాను?
బస్సు మధ్యగా ఉన్న గొట్టాన్ని పట్టుకుని, ఆ సీటుకి ముందుగా నిలుచున్నాను. యధాలాపంగా నా దృష్టి కుష్టురోగి చదువుతున్న పేపరు ముందు పేజీ పై పడింది. రాసక్రీడలు సాగిస్తూ, సాక్షాధారాలతో సహా పట్టుబడ్డ ఓ మంత్రి గారి గురించిన వార్త పెద్దపెద్ద అక్షరాలతో ప్రచురితమైంది. ఫోటోలతో సహా ముద్రించి ఉన్న ఆ వార్తని చదవడానికి కాస్త కిందకి వంగాను. ఆ క్షణంలో మా ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నాకంత ఆసక్తి కలిగించిన ఆ వార్త ఏమిటో చూద్దామని అతడు పేపరుని తిరగేసాడు. తర్వాత తన పక్క సీటు ఖాళీగా ఉండడం చూసాడు. నాకేసి అదోలా చూసి, మళ్ళీ పేపరు చదువుకోడంలో నిమగ్నమైపోయాడు.
అ విలేఖరి చేసిన పరిశోధన చాలా ఆసక్తికరంగా ఉంది. కాని కుష్టురోగి పేపరుని తిరగేయడంతో కాస్త అంతరాయం కలిగింది. జరిగిన అంతరాయానికి నేను చింతించాను. సాటి ప్రయాణీకుడు చదువుతున్నాడన్న ఆలోచనైనా లేకుండా పేజీ తిప్పేయడం నాకు చికాకు కలిగించింది. నా తెల్లకోటు, స్టెతస్కోపు అతడిపై ఏ ప్రభావం చూపినట్లు లేదు. మళ్ళీ ఏకాగ్రత తెచ్చుకుని ఆ వార్త చదవడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. ఇంతలో ఏదో స్టాపు వద్ద బస్సు ఆగింది. కొద్ది మంది దిగి, చాలా మంది ఎక్కారు. మళ్ళీ తోపులాట మొదలైంది. ఊర్లో ఇంక బస్సులే లేవా అని నాకనిపించింది. హఠాత్తుగా కుష్టురోగి పేపరు చదవడం ఆపాడు. దాన్ని జాగ్రత్తగా మడతపెట్టి చేతికింద పెట్టుకుని సీట్లోంచి లేచాడు.
“హమ్మయ్య! దేవుడు నా మొర ఇప్పటికి ఆలకించాడు. వీడి బాధ వదిలింది” అని అనుకుంటూ ఆ కుష్టురోగి వెళ్ళడానికి దారి ఇచ్చాను.
అతడు నన్ను దాటుకుని వెడుతుంటే, అసహ్యంతో తల తిప్పుకున్నాను. అతడి చూపులు ఓ క్షణం పాటు నా తెల్లకోటు పైన, స్టెతస్కోపు పైన నిలిచాయి. కొద్దిగా వెనక్కి తిరిగి తను ఖాళీ చేసిన సీటుని చూసాడు. దాంట్లో కూర్చోవలసిందిగా నాకు సైగ చేసాడు.
‘నన్నిక భరించనవసరం లేదు’ అన్న భావన అతడిచూపులో ప్రస్ఫుటమైంది.
అతడు ఏదో చెచెప్పాలనుకుని, పెదాలను కొద్దిగా కదిలించాడు. కాని అంతలోనే ఆ ప్రయత్నం మానుకుని తన చేతి క్రింది దినపత్రికని తీసి సీటు మీద పరిచాడు. నేను నిర్ఘాంతపోయాను. అతడేమీ మాట్లాడకపోయినా, అతడి ఉద్దేశ్యాన్ని నేను గ్రహించాను.
” ఇప్పుడు సుఖంగా కూర్చోండి డాక్టర్! జబ్బులకి దూరంగా ఉండండి. సాటి మనుషుల వేదనకి, బాధకి స్పందించకండి. ఒకప్పుడు ఎంతో ఉన్నతాశయాలు కలిగి నిస్వార్ధమైనదిగా పేరొందిన మీ వృత్తికి కళంకం వచ్చినా పట్టించుకోకండి. హాయిగా ఏకాంతంగా కూర్చుని, ఈ పేపరుని చదువుకోండి” లాంటి భావాలు అతడి ముఖంలో కదలాడాయి.
బస్సు ఒక్క కుదుపుతో ఆగింది. ఆ కుష్టురోగి దిగిపోయాడు. సీటు మీద అతడు పరిచిన దినపత్రిక మాత్రం అక్కడే ఉంది. ఒక్క సారిగా ఏదో తెలియని వ్యధ నన్ను ఆవహించింది. నిస్సత్తువగా అనిపించింది. ఓ వైద్యుడిగా నాకు ఉండాల్సిన ఓర్పు, కరుణ చూపలేనప్పుడు, రోగుల పట్ల ఆదరణా, దయ, జాలి, సానుభూతి చూపలేనప్పుడు, వృత్తిధర్మాన్ని పాటించలేనప్పుడు, నేను పొందిన శిక్షణకి అర్ధమేముంది? ఐదేళ్ళ పాటు మెడికల్ కాలేజిలో చదివినా పొందలేని అనుభవాన్ని, ఈ రోజు ఈ రద్దీ గా ఉన్న బస్సులో పొందగలిగాను.
జీవితం గురించి, అస్వస్థత గురించి ఈ రోజు నాకు అర్ధమైంది. ఓ ఉన్నతమైన వృత్తికి ప్రతినిధులుగా ఉన్న మా మెడికోలం, ముసుగులు ధరించి ఉన్నామని గ్రహించాను. కాని నన్ను నేను తెలుసుకున్నాను.
ఆ కుష్టురోగి తన చిన్న చర్యతో తోటి ప్రయాణీకుడికి కూర్షోడానికి చోటివ్వడమే కాకుండా, ‘సాటి మనుషులకు మీ మనసులోను కాస్త చోటివ్వండి’ అనే సందేశాన్ని అందించాడు.
మనిషి మేధస్సు ఎదగడానికి వేల వేల ఏళ్ళు పట్టిందని విన్నాను. మనిషి పాతరాతియుగం నాటి ఆదిమ మానవుని స్ధాయి నుంచి, విజ్ఞానం సంపాదించిన నాగరిక మానవుడిగా మారడానికి చాలా కాలం పట్టింది. కాని నా తోటి రోగిష్టి ప్రయాణీకుడు నా కోసం తన సీటు పై దినపత్రికని పరిచి, నన్ను కూర్చోమని నిశ్శబ్దంగా సైగ చేసిన క్షణంలోనే ‘నిజమైన మనిషి’ అయ్యాడు.
నేను, మనలో చాలా మంది ఇంకా చేరని మనిషి పరిణామ దశ అది…..!
ఆంగ్ల మూలం: డాక్టర్ అరుణాచలం కుమార్
(ఈ కథ 11 ఆగస్టు 2006 నాటి తేజ వార పత్రికలో ప్రచురితం)
భావాతీతధ్యానం! (మెడిటేషన్)
నవ్వండి -2
2007-09-27
సేవకా వృత్తి
నచ్చితే చదవండి నచ్చకపోతే మానేయండి.
(శీర్షిక లేదు)
ఒక చుక్క మంచి నీటి కోసం
నవ్వండి -1
(శీర్షిక లేదు)
అన్వేషి - బ్రిటిష్ కథ
శిశు వధ ఫ్రెంచి కథ
నేర పరిశోధకుడు అమెరికన్ కథ
చాలా సరళంగా.. మనసుకి హత్తుకునేలా రాసారు.. అభినందనలు
సినిమా నిన్నే చూశా! “రాజేష్” రోల్ అదుర్స్! నిఖిల్ డైలాగులు చెప్తుంటే హాలంతా గొల్లు గొల్లుమని నవ్వుతున్నారు. నా వెనక కుర్చున్న అమ్మాయైతే మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వలేదు, నవ్వుతూనే ఉంది. నా సంగతి చెప్పక్కర్లేదు లెండి!
ఇలాంటి కాలేజ్ సినిమాలో ఏమేమి ఉండాలో ఆ ఎలెమెంట్స్ అన్నీ కరెక్టుగా సద్దేశాడు “శేఖర్ కమ్ముల”. గత సంవత్సర కాలంలో ఇదే ఒకింత సరైన హిట్ movie.
చాలా బాగుందండి.
ఈ కథ మీకు నచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. మీ అభిప్రాయం రాసినందుకు నెనర్లు
Excellent sir, even i am also going for M.Tech at IIT Bombay in 2008 leaving my wife, kid, parents and all other. with full of hopes in future and full of doubts and problems in present.
బాగుంది. ఇందులో కథకన్న వాస్తవమే ఎక్కువ. భూమికి భూమే మంచి కాన్సెప్ట్. లేకపోతే, అనుకోని డబ్బు ఏం చేసుకోవాలో తెలియక లాభం కన్నా నష్టపోయేవాళ్ళే ఎక్కువ. ఇదే కొనసాగితే, బ.జా.కం లు కమర్షియల్ ఫార్మింగ్ మొదలెడితే, రైతులు పూర్తిగా మునిగిపోతారు.