2007-10-09
…please dont miss this
తెలుగు వాడికి 'నోబెల్' ఎప్పుడు?
ఘోరదర్శన్ - నేను
Fox టీవీ వెదర్ ఛానెల్లో ఏ పూటకాపూట ఎంతో కచ్చితంగా వాతావరణం చెప్పే రీతిని చూస్తూంటే, అలనాటి ఘోరదర్శన్ జ్ఞాపకాలు మెదిలాయి……. రోజూ ఇలా మొదలెట్టేవారు..
నమస్కారం, ఈనాటి ఘోరదర్శన్ ప్రసారాలకి స్వాగతం. ముందుగా ఈనాటి ప్రసార విశేషాలు.
ఉదయం 9:00 గంటలకు లకు ఉదయం ప్రసారాలు…
మధ్యాహ్నం 12:00 గంటలకు మధ్యాహ్న ప్రసారాలు…..
సాయంత్రం 5:00 గంటలకు సాయంత్రం ప్రసారాలు…..
(అబ్బో ఏం సృష్టి రహస్యం చెప్పావురా బాబూ, ఉదయం పూట ఉదయం ప్రసారాలుట, మధ్యాహ్నం పూట మధ్యాహ్న ప్రసారాలుట, సాయంత్రం పూట సాయంత్రం ప్రసారాలుట అని తెగనవ్వుకొనే వాళ్ళం.)
తర్వాత టైం పాసు చేయటానికి బొత్తిగా ప్రోగ్రాములు లేక, లలిత సంగీతం పేరుతో ముందుగా ఓ బృందగీతం అని చెప్పి ఓ పెద్ద గుంపుతో (మందగీతం) ఓ రెండు పాటలు పాడిస్తారు. అదో పెద్ద గోలగా ఉండేది.
అదవటమే ఆలశ్యం. వెంటనే ఎక్కడలేని ఆనందంతో అనౌన్సరు ప్రత్యక్షం, ఒక వెకిలి నవ్వుతో! మరే కార్యక్రమం అనౌన్స్ చేయటానికి రాని దొంగ నవ్వు అది. (ఆ నవ్వు వెనకాల ఈ ప్రోగ్రాం దెబ్బకి చావండి కుంకల్లారా అనుకునే ఓ క్రూరమైన కసి) ఎందుకయ్యా అంటే, తమ తురుపుముక్క ప్రోగ్రాం(తొక్కప్రోగ్రాం) అయిన పాడి పంటలు కార్యక్రమం కోసం. కొన్నేళ్ళుగా చూపిస్తూనే ఉన్న అరిగిపోయిన రికార్డులు అయిన, లాభదాయకమైన పందుల పెంపకమనో, కొబ్బరి చెట్టుకు రబ్బరు తెగులో, పశువుల్లో కృత్రిమ గర్భధారణ అనో, మేకల్లో ఆకలి చావులనో … లాంటివి జనం మీద వదిలేసి చావగొట్టేవాళ్ళు. ఈటీవీ వాడొచ్చి “అన్నదాత” పేరుతో అందర్నీ లాక్కెళ్ళిపోయినా అదే వరస.
తరువాత మొదలయ్యేది వాతావరణ ప్రహసనం. నోరెళ్ళ బెట్టుకొని, ఆశగా ఏదో పనికొచ్చే వాతావరణ విషయాలు చెబుతాడేమో అని ఎదురు చూసేవాడికి ఇది దక్కేది.
ఈ రోజు ఆకాశం అక్కడక్కడా మేఘావృతమై ఉంటుంది. పగలు వేడిగా, రాత్రి చల్లగా ఉంటుంది. (ఇంకా నయం పగలు వెలుగు, రాత్రి చీకటి ఉంటాయి అని చెప్పలా). అక్కడక్కడా ఒకటి రెండు జల్లులు పడొచ్చు. తీరప్రాంతాల వాళ్ళు సముద్రములో చేపలు పట్టుకోవచ్చు!(పెద్ద జోకు, అక్కడికి వీడు చెప్పకపోతే, ఏ జాలరి చేపల వేటకి వెళ్ళనట్లు). ఇంత అఘోరించి, చివరలో ఇంతకు మించి పెద్దగా చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు అంటాడు. ఒరే బడుద్దాయ్, ఆ చెప్పుకోదగని మార్పేదో చెప్పిచావరా అని గట్టిగా అనాలనిపించినా, జనాలకి భయపడి నోర్మూసుకునే వాణ్ణి. అలా నాలుగు వాక్యాల్లో మొత్తం రాష్ట్రంలోని రైతు సోదరులందరికీ వాతావరణం చెప్పేడ్చేవాళ్ళు.
ఉన్నట్టుండి, రాత్రి 7:00 అయ్యేటప్పటికల్లా ఏ మాత్రం హావభావాల్లేని భ్రాంతిస్వరూప్ అదే శాంతిస్వరూప్ ప్రపంచంలో ఏ మూలైనా, ఎక్కడున్నా సరే ఊడలేసుకోని దూకేవాడు వార్తలు చదవటానికి. అదేమిటో గానీ, మహానుభావుడు పెళ్ళి వార్తకీ తద్దినం వార్తకీ ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టి చదివేవాడు. ఎవరైనా ప్రముఖుడు పోయిన రోజు వార్తలు పోనీ వేరే వాడితో చదివిస్తాడేమో అనుకుంటే, ఊహూ, తానే వచ్చి చావు వార్తలో కూడా కామెడీ నింపేవాడు. ఇలానే చాలా ఏళ్ళ పాటు ఈయన గారు ఘోరదర్శన్ని దున్నుకున్నా, నాకు తెలిసి మనోడి పంటి వరస చూసిన జ్ఞాపకం లేదు.
ఇదంతా ఏదో హాస్యానికనుకున్నా కూడా, తెలిసిందేమంటే ఈ నాటికీ మనోళ్ళ దగ్గర డాప్లర్ రాడార్ లేదుట. అందుకే ఇలా అర్థం పర్థం లేని వాతావరణం చెప్తూ ఉంటారు. అదుంటే, మనకి గంట గంటకీ వాతావరణ విషయాలు కచ్చితంగా తెలుస్తాయి. మన రైతులకి చాలా ఉపయోగం. బహుశా, ప్రయివేట్ ఛానెల్స్ వాళ్ళకి ఉన్నాయేమో. ఘోరదర్శన్ వాళ్ళు ఇది కొనలేకపోవటానికి డబ్బు మాత్రం కచ్చితంగా కారణం కాదనే నా విశ్వాసం.
అలానే ఈ మధ్య నుంచే ఘోరదర్శన్ ఓ ఫ్రీ చానెల్ ఇక్కడ డైరెక్ట్ టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నారు. క్వాలిటీ… రామ రామ … అటు బ్లాక్ అండ్ వైట్ కాదూ ఇటు కలర్ కాదు, అదో విచిత్రమయిన రంగులో వస్తున్నాయి కార్యక్రమాలన్నీనూ
ఎవరెవరి సంపాదనలెంతెంత?
“పొగ” ల రాజును నేనే, “సెగ” ల రాణివి నీవే …
ప్రతికూల పరిస్థితుల్లో ఒంటరి పోరాటం
100 వ టపా -- బ్లాగోళ జంభ
పెళ్ళైనవారికి మాత్రమే..
పుణుకులు
బ్రహ్మదేవుని ఆవిర్భావం
2007-10-08
ఒక యోధుని గురించి…
అష్టావక్రుడు
ఎందరో మహానుభావులు – 5
2007-10-07
అంతగా ఆకట్టుకోలేకపోయిన సిలికానాంధ్ర సాంస్కృతికోత్సవం
2007-10-08
బుక్కులు
2007-10-07
(శీర్షిక లేదు)
ఈ వారం సినిమాలు
సాహితీవనం -8
2007-10-06
సీరియల్‌మా అమృ'తంగ'మయ
2007-10-05
ఓ సరికొత్త మనసు - పుస్తక సమీక్ష
నే మాట్లాడే పుస్తకం ఓ ఇంగ్లీష్ పుస్తకము, A Whole New Mind By Daniel Pink.
ప్రపంచీకరణతో మనం ఇన్నాళ్ళూ వర్ధమాన దేశాలకు కలిగే కష్టనష్టాలు మాత్రమే చదివాము, విన్నాము. కానీ, ప్రపంచీకరణతో వల్ల యూరోపు,అమెరికాలు కూడా దెబ్బతింటున్నాయి. ఉదా: అవుట్ సోర్సింగ్ లాంటివి…
ఇది ముఖ్య విషయముగా వచ్చిన పుస్తకమే డేనిఎల్ పింక్ రాసిన A Whole New Mind. ఆసియా దేశాలకు ఉద్యోగాల వలసతో బాగా నష్టపోతున్న అమెరికా వంటి దేశాలు భవిష్యత్తులో మరింత నష్టపోకుండా ఏమి చెయ్యాలన్నది సైన్స్ పరముగా కూడా పరిశీలించిన ఈ పుస్తకం మంచి ఆసక్తికరముగా ఉందనటములో సందేహం లేదు.
ఈనాటి సమాచారయుగంలో (Information Age) కీలక పాత్ర వహిస్తున్న ఎడమమెదడు(Left Brain) చేసే పనులయిన Logic, Analysis & Sequence స్థానంలో కుడిమెదడు చేసే పనులయిన simultaneous, contextual, big-picture capabilities మాత్రమే రాబోయే భావసంకల్పయుగం(Conceptual Age)లో కీలక పాత్ర వహిస్తాయి అని పింక్ చెబుతాడు. ఎవరయితే సమాచారయుగం నుంచి భావసంకల్పయుగం దిశగా ఎంత త్వరగా వెళుతారో, వారిదే రాబోయే కాలం. లెఫ్ట్ బ్రెయిన్ చేసే పనులన్నీ ఇప్పుడు వర్ధమాన దేశాలకు అవుట్ సోర్స్ రూపంలో వెళ్ళిపోటం వల్ల (ఇది పెరగటమే తప్ప తరిగేది కాదు), రైట్ బ్రెయిన్ పనులయిన వంటి వాటిపై ఈ దేశాలు దృష్టి పెట్టాలని చెప్తాడు. అలానే రచయిత బానే కష్టపడ్డాడనుకుంటా విషయసేకరణ కోసం. ఇండియాలో సాఫ్టువేరు ఇంజనీర్లని కలవడం, లాఫింగ్ క్లబ్బు (ముంబాయి) కెళ్ళటం లాంటివి.
Left Brain చేసే పనులు ఇవి.
uses logic,detail oriented,facts rule,words and language,present and past,math and science
can comprehend,knowing,acknowledges order/pattern perception, knows object name
reality based,forms strategies, practical, safe
Right Brain చేసే పనులు ఇవి.
Uses feeling,”big picture” oriented,imagination rules, symbols and images, present and future, philosophy & religion, can “get it” (i.e. meaning) believes appreciates spatial perception, knows object function, fantasy based, presents possibilities impetuous,
risk taking
ఈ దిశగా Six Senses అని ఆరు సూత్రాలు ప్రతిపాదించాడు.
- Design: going beyond the utility of your skill set to its significance and emotional appeal;
- Symphony: considering how your combined competencies and attributes contribute to your unique promise of value;
- Story: crafting messages to clearly communicate what you offer;
- Empathy: building a network of mutual benefit with others;
- Joy: identifying work you love where you can be yourself;
- Meaning: making a difference in the lives of the people you serve.
అంటే, Right Brain పనులు ఆసియా దేశాలకు తెలియదా అన్న ప్రశ్న రావొచ్చు. కానీ సృజనాత్మకత, రీసెర్చ్ లాంటి వాటి మీద ఆసియా దేశాలు పెట్టుబడి పెట్టగలవా అన్నది పెద్ద సమస్య. గతాన్ని పరిశీలిస్తే, ఇతరులు కనిపెట్టినవాటిని Re-Produce చెయ్యటము ద్వారా ఆసియా దేశాలు పారిశ్రామికంగా ఆధారపడినాయి కదా.
ఈయన చెప్పింది నిజమే, ఎంచేతంటే కళలన్నీ Right Brain పనులే. అందుకేనేమో, వాళ్ళు (మంచి కళాకారులు) ఎప్పటికీ డిమాండే.
ఈ సందర్భములోనే అలానే మెదడును గూర్చి కొన్ని మంచి సమాచారము కూడా ఇచ్చాడు. ఇవి చదవండి.
The left hemisphere controls the right side of the body;
the right hemisphere controls the left side of the body;
The left hemisphere is sequential;
the right hemisphere is simultaneous;
The left hemispehere specializes in text;
the right hemisphere specializes in context;
The left hemisphere analyzes details;
the right hemisphere synthesizes the big picture;
The left hemisphere is the thousand words;
the right hemisphere is the picture;
అలాగే అంతర్జాలంలో ఈ చిన్నపాటి పరీక్ష వెతికి పట్టా. దీని ద్వారా మీరు ఏ మెదడు ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులో తెలుస్తుంది. పుస్తకం మరీ పెద్దది కూడా కాదు. ఓ ప్రయాణంలో ఈజీగా చదివేయొచ్చు. దాదాపు ఓ రెండు వందల పేజీలనుకుంటా.
అమెజాన్ లో ఈ పుస్తకం దొరుకుతోంది.
'చిరుత': పులి కడుపున పులే పుడుతుంది!
నెనర్లు!
హిప్నాటిజము నా నటన
నటన, సంభాషణలు, దర్శకత్వం
గూగులమ్మ పదాలు
2007-10-04
తమిళం……..
సాహితీవనం -7
పుట్టబాబా విశ్వ విరాట్ దర్శనం అట్టర్ ఫ్లాప్!
గూగులమ్మ పదాలు
గూగులమ్మ పదాలు
తెలుగుబ్లాగు చరిత్ర -2
కొత్త తెలుగు ఫాంటు: ఇండోలిపి వారి e-Telugu
సాహితీవనం -6
2007-10-03
మైదానంలో దేవుడిచ్చిన భార్యకు చివరకు మిగిలేది?
ఉడుకుమోత్తనం, అవస్థ
2007-10-02
జరుక్ శాస్త్రిగారి - కాఫీ పానం కరిష్యామి
మీరే మీ జిల్లా కలెక్టరయితే?
రైలు ప్రయాణంలో పదనిసలు ...
హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు... ముస్లిము సోదరులు
The last straw
గాంధీ గారు - నోబెల్ ప్రైజు
మన వాళ్ళు ఎప్పటిలాగే అక్టోబరు రెండో తారీఖుని, గాంధీ జయంతి పేరుతో స్వలాభం చూసుకోటంతో మొదలెట్టారు. కాకపోతే, ఈసారి కొంచెం వెరైటీగా గాంధీ గారి మీద మరింత దొంగభక్తితో.
ఇంతకీ విషయమేంటయా అంటే, గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదట. అయినా నా పిచ్చి కాకపోతే, ఇస్తే గిస్తే నోబెల్ వాడికి గాంధీ ప్రైజ్ ఇవ్వాలి గానీ, గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ ఇస్తారా అని అడుక్కోవటమేమిటి? ఇది గాంధీ గారి విలువ మరింత తీసేసినట్లు కాదూ.
అదీకాక, నా సొంత అభిప్రాయం సుమా, బతికున్నప్పుడు లేని గుర్తింపు చనిపోయాక ఇస్తా అనటం మించిన మూర్ఖత్వం ఉంటుందా? అసలు ఇలా చేసే, మన పద్మ అవార్డులన్నిటి విలువ తీసేసారు.
నోబెల్ వల్ల గాంధీ గారికి కొత్తగా ఒరిగేదేమీ లేదు ఈరోజు. ఆయన ఎప్పుడూ “నోబులే”. కొసమెరుపేమంటే, ఇవ్వాళే నోబెల్ వాళ్ళు గాంధీ గారికి నోబెల్ ఇవ్వకపోవటం మా తప్పే అన్నారు. ఏమిటో, ఈ బ్రతిమాలుకుని తెచ్చుకునే కిరీటాలు పెట్టుకునేవాళ్ళకెలా ఉన్నా, విషయం తెలిసిన వాళ్ళకి మా చెడ్డ చిరాగ్గా ఉంటుంది.
వనజ: కొన్ని హెచ్చరికలు
ప్రజల సొమ్ము, సబ్సిడీల పాలు
2007-10-01
తోక పోయి కత్తి వచ్చె ఢాం ఢాం ఢాం
చుక్కలకు ఱేడు, వలరాజు మేనమామ - మన చందమామ!
ప్రాయశ్చిత్తం
మాఊరంటే నాకిష్టం
గాలిపటాల వేటగాడు
బద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ, బార్యలు మారరు లే నెవరూ…
(శీర్షిక లేదు)
చెప్పడానికి ఏమీ లేదు! మొత్తం సంఘటనంతా జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఉన్నట్టనిపించి స్థాణువులా మారిపోయాను.
A thought-provoking short movie, thanks for sharing it.
One example of an extended take with no cuts that comes to my mind immediately is in Orson Welle’s Touch of Evil. It is the very first scene in the movie; It goes on for about 4 minutes uncut, starts one one side of Mexican border and ends on the other side. It’s a cinch someone would have done better in the last 50 years.
A thought-provoking short movie, thanks for sharing it.
One example of an extended take with no cuts that comes to my mind immediately is in Orson Welle’s Touch of Evil. It is the very first scene in the movie; It goes on for about 4 minutes uncut, starts one one side of Mexican border and ends on the other side. Its a cinch someone would have done better in the last 50 years.
ఇండియాలో ఉండగా ఘోరదర్శన్ని చూసింది చాలా తక్కువ .. దానిగురించి చెప్పలేను గానీ ఇక్కడ చూసినంతలో ఏక్యువెదర్ (accuweather) వాడు చెప్పినట్టు ఒక్కసారిగూడా జరగలేదు. అద్సరేకానీ, కొన్ని వాక్యాలు బాగా నవ్వించాయి.
అశ్విన్ మరియు నాగారాజా లకు నెనర్లు.
బాగా వ్రాసారు. కానీ ఆమాత్రం తారీకులు గుర్తుంచుకోగలిగితే సోషల్లో 4 మార్కులెక్కువ తెచ్చుకుని ఉండేవాడిని… ప్చ్. :))
అడగంది అమ్మైనా పెట్టదు అన్న సామెత ఎంతవరకూ నిజమో కానీ అడగంది మగాడు ఇవ్వడు అన్నది మాత్రం అక్షరాలా నిజమేమో. పెళ్ళితో భార్యను సాధించాము. ఇంక అక్కడితో ఆ సమస్యా పూరణం అయిపోయింది. ఇంక దాని (సమస్య) గురించి ఆలోచించమెందుకు అనుకుంటారు మగాళ్ళు. మైండ్ లో ఒక ఓపెన్ ప్రాసెస్ తో మగాళ్ళు నిద్రపోలేరు. దాన్ని బలవంతగా బజ్జో పెట్టాలి లేకపోతే ఆ ప్రాసెస్ కు ముగింపైనా పాడాలి. ఒక జన్మదినము కంటిన్యువస్ గా గుర్తుపెట్టుకోవటమనేది మగాడి బుర్రని తినేస్తుంది.
ఆడాళ్ళకి టిప్: మీకు ముఖ్యమైన రోజుకు ముందు దాన్ని గుర్తుచేస్తూ మీ ఆయనకి SMS కొట్టండి. ఆ గిఫ్టుకంటే గుర్తు పెట్టుకోవటమే ముఖ్యం అని అడాళ్ళంటారు (అదేకదా మరి తంటా)
జూన్ నించి అక్టోబరుకి నాలుగు నెలలు.
త్వరలో మీ కొత్త పద్యాన్ని చూడాలి.
No pressure
ఎంత తెలుగు తనం వుట్టి పడుతోంది..ఈ బ్లాగులలొ..
మీ అందరికీ ధన్యవాదాలు..
యడవల్లి శర్మ
అసలు కంటే మందు ముద్దు కదండి
ఖచ్చితంగా వస్తారు
జాన్ గారు ,
అందుకే ఇలాంటి చిన్ని చిన్ని సంతోషాలు భార్యాభర్తలను ఇంకా దగ్గర చేసి వారు కలిసి ఆనందంగా ఎన్ని సమస్యలనైనా ఎదుర్కునేలా చేస్తాయని నా అభిప్రాయం.
అవునండి. దోఖా అంటే హిందీలో మోసం.
“నిజమే జ్యోతిగారు.
ఎంతైనా భర్త గదా!
అందుకని వారికి గుర్టువచ్హేలాగ, వారు ఆఫిసుకి వెళ్ళేటప్పుడు చిన్న హింట్ ఇస్తాను.
మల్లీ అఫ్ఫిసుకి కూడా ఫోను చేసి హింట్ ఇస్తాను.
ఆయన మరిచిపోకండా, ఆ సాయంత్రమ్ తొందరగా ఇంటికి చేరుకునేవారు.చక్కగా ఒక రెండు మూరల పువ్వులు తెచ్చిపెట్టేవారు.
నా అనందం చూసి వారు చాలా సంతోషించేవారు!
చీరలు వారికి గుర్తువచ్చినప్పుడు, నేను ఉహించనప్పుడు, నన్ను ఆస్చర్యపరిచే విధంగా కొనివ్చేవారు.
పాపం ఒకొక్కసారి ఎక్కువ ధర పెట్టికొనేవారు. వారికి తెలియదుగదా! ఆరోజున కొంచెం భాద పదేదానిని.ఆనవసరంగా ఎక్కువ పెట్టి కొన్నారు కదా!
కాని భలే సంతోషం వేసేది. నేను అడగకుండా కొనిచ్చేవారు కదా.
ఏమిటో అదో తుత్తి!”
- మా వారి పెళ్ళాం.
“అలాగని భార్య మీద ప్రేమ లేదని నేననను. కాని అప్పుడప్పుడు ఆ ప్రేమను కాస్త వ్యక్తపరుస్తుండాలని”…
నిజమే, కానీ అదే పెద్ద సమస్య. మన సంస్కృతిలో వ్యక్తపరచటం అన్నది ఓ ఎబ్బెట్టు వ్యవహారంగా చాన్నాళ్ళ నుంచి ఉంది. ఏదో ఈ సినిమా ప్రభావాలవల్ల ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి అలవడుతోంది.
నా మనసుకు నచ్చిన blogs లో ఇది no.1 అని నిస్సందేహముగా చెప్పవచ్చును.నాకు ఈ రోజు కనువిప్పు కలిగింది.
హిందీ మోసం ధోఖా అనుకుంటాగదా!?
జ్యోతి గారికి ధన్యవాదాలు
మీ బ్లాగు చదువుతుంటే ఈ నెలలో మాపెళ్ళి రోజువున్నదని గుర్తుకువచ్చింది.
అనేక వత్తిడుల మద్య కట్టుబట్టలతో ఖైరతాబాదులో దిగిన రోజులు గుర్తుకొచ్చాయి.20 ఏళ్ళు పూర్తి అయ్యాయి. మేము మీరుచెప్పినట్టు పండగలు, పబ్బాలు, తద్దినాలు చేయలేదు గాని ఆర్థింకంగా నిలదొక్కుకోవడానికి అనేక ప్రయత్నాల మద్య బహుశ ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకున్న గుర్తులేదు. పిల్లలు, రొగాలు, రొష్టులు, మారిన వుద్యోగాలు, మారిన అద్దె ఇళ్ళు వీటన్నిటి మద్య మాజంట పడిన వంటరిపోరాటం గుర్తుకువచ్చాయి.