2007-10-09

ఎవరెవరి సంపాదనలెంతెంత?

2007-10-09 05:24 PM చదువరి - చదువరి
నాయకుడు, ప్రతినాయకుడుల సంపాదనలు ఎవరెవరివి ఎంతెంతో తేల్చడానికి విచారణ కమిషను వేసేందుకు సిద్ధమట! ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. మంచిది. ఏం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారో చెబితే సుఖమేముంది? చేస్తే గదా ప్రయోజనం!? కాబట్టి ముఖ్యమంత్రి గారూ! వెంటనే ఆ కమిషనేదో వెయ్యండి. మీరిద్దరేగాదు, రాజకీయులంతా ఎవరెవరు ఎంతెంత మెక్కారో తేల్చండి. మీరిద్దరూ అవినీతిపరులని తేలిందనుకోండి.. మీ సొమ్ములు గుంజేసుకుంటే ఒక్క గజం

2007-10-08

ఒక యోధుని గురించి…

2007-10-08 05:12 PM Dil - గుండె చప్పుడు...
తీక్షణమైన ఆ కళ్లు, చురుకైన అతడి చూపులూ గత నలభై యేళ్లుగా కోట్లాదిమంది హృదయాలపై ముద్ర వేస్తూనే ఉన్నాయి. క్యూబన్ ఫొటొగ్రాఫర్ అల్బెర్టో కొర్డా తీసిన అతని చిత్రం ప్రపంచ చరిత్రలోనే అత్యంత పాపులర్ ఫొటో. అతని జీవితం గురించి ఏమీ తెలియని వాళ్లెందరో అతని బొమ్మ ఉన్న టీ షర్టు ధరిస్తుంటారు.

2007-10-04

పుట్టబాబా విశ్వ విరాట్ దర్శనం అట్టర్ ఫ్లాప్!

2007-10-04 04:35 PM Dil - గుండె చప్పుడు...
సత్యనారాయణ రాజు ఉరఫ్ పుట్టబాబా లేటెస్ట్ గారడీ ప్రదర్శన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చంద్రునిలో “విశ్వరూపం” చూపిస్తానని డంబాలు పలికిన సదరు బాబాగారు విశ్వరూపం కాదుగదా అసలు ఉత్తి చంద్రున్నే చూపలేకపోయాడట. సాయంత్రం నుండీ బ్రేకింగ్ న్యూస్ అంటూ న్యూస్ చానెళ్లు ఊదరగొట్టాయి. బాబా మాటలు విని పోలోమని పుట్టపర్తి విమానాశ్రయానికి తండోపతండాలుగా తరలివెళ్లిన భక్తజనకోటికి సహజంగానే నిరాశే మిగిలింది.

2007-10-02

హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు... ముస్లిము సోదరులు

2007-10-02 02:41 PM చదువరి - చదువరి
హైదరాబాదు జంటపేలుళ్ళపై నా గతజాబు, దానిపై వచ్చిన వ్యాఖ్యలు దీనికి నేపథ్యం. ఆ వ్యాఖ్యలకు సమాధానమే ఈ జాబు. ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకునే ఈ పనులు చేస్తున్నారు. మతం పేరిటే స్లీపర్లను, తదితరులను ఏర్పాటు చేసుకుంటున్నారు. మామూలు యువకులు స్లీపర్లు గాను, మానవ బాంబులు గాను మారటానికి ప్రేరణ మతమే అని నేనంటున్నాను. వీరలా మారడానికి ఉగ్రవాదులతో చేతులు కలపడానికి మరో కారణం ఏంటో చెప్పండి. బాగా చదువుకుని మంచి

ప్రజల సొమ్ము, సబ్సిడీల పాలు

2007-10-02 08:11 AM చదువరి - చదువరి
కిలో బియ్యం రెండు రూపాయలకే! ఉచితంగా మూడు సెంట్ల భూమి! ఉచిత కరెంటు ఉచిత అది ఉచిత ఇది ... బహిరంగంగా చేస్తున్న ఓట్ల వేలం ఇది. వీళ్ళ సొమ్మేం బోయింది, వీళ్ళు మింగేసిన దాంటోంచి ఇవ్వడం లేదుగదా! మన జేబుల్లోంచి తీసేసుకున్నదే ఇస్తున్నారు. ప్రజల డబ్బులతోటి ప్రజల వోట్లను కొనాలను చూస్తున్నారు. కిలో బియ్యం మార్కెట్లో పాతిక రూపాయల దాకా ఉంది. మార్కెట్టు రేటుకు బియ్యాన్ని కొనుక్కొనే తాహతును ప్రజలకు సంపాదించి

2007-09-28

సేతువు వెనుకున్న హేతువు

2007-09-28 03:48 AM Dil - గుండె చప్పుడు...
రామ సేతుగా పిలవబడుతున్న ఆ భూభాగం మొత్తం పొడవు దాదాపు 48 కిలోమీటర్లు. ఇప్పుడు సేతు సముద్రం ప్రాజెక్టు కోసం ఒక చోట 300 మీటర్ల వెడల్పుతో 12 మీటర్ల లోతుతో ఒక కాలువ తవ్వనున్నారు. అంటే అర్ధం మొత్తం “సేతువు”లో ఈ ప్రాజెక్టు వల్ల దెబ్బతినేది 0.006% శాతం అన్నమాట.(చిత్రం చూడండి) భిన్న మతాలూ, సంస్కృతులూ, విశ్వాసాలూ గల పౌరులున్న భారత్ వంటి దేశాల్లో ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు కూడా ప్రభుత్వాల, నేతల నిర్ల్యక్షం, స్వార్ధం [...]

2007-09-25

Cricket is our religion (too)

2007-09-25 12:53 PM శ్రవణ్ - దిల్ సే ... » రాజకీయాలు
మొత్తానికి నాకు ఒకందుకు సంతోషంగా వుంది. ఒక అనవసరపు రచ్చ మరుగున పడిపోయింది. నిన్నటి దాకా నోటికొచ్చినట్టు మాట్లాడిన ఒక పెద్దాయన బ్యాచ్‌కీ, ఆ నోట్లో నాలుకని తెగ్గొయ్యమన్న ఇంకొక పెద్దాయన బ్యాచ్‌కీ సమానంగా సంతోషాన్ని పంచింది నిన్నటి క్రికెట్ మ్యాచ్‌లో విజయం. మనకింత సంతోషంగా వుందికదా! If I am right, వాళ్ళీపాటికి “ఈ దరిద్రులు ఎందుకు గెలిచార్రా? ఎంత కష్టపడి ఒక ఇష్ష్యూ క్రియేట్ చేశాం” అని తెగ బాధపడుతుంటారు. ఇటువంటివాళ్ళని యేమి చెయ్యాలి? మీరేమంటారు?

2007-09-24

రాముడు నమ్మకం, అధికారమే నిజం!

2007-09-24 04:44 PM Dil - గుండె చప్పుడు...
సేతు సముద్రం ప్రాజెక్ట్ పై గతం లోనే ఒక సారి పోస్టు రాశాను. అందులో ఈ వారధిపై బీజేపీ ఎండ్ కో వాళ్లు పనిగట్టుకుని చేస్తున్న అర్ధ సత్యాల ప్రచారం గురించి వివరించాను. ఆ వ్యాసం ఇక్కడ చదవచ్చు. ఇప్పుడు మరో సారి రామ సేతు గురించి వివాదం తలెత్తింది. ఓట్ల వేటలో ఇంగిత జ్ఞానం మరచి నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రచారం చూస్తే మతిపోతోంది నాకు. రాజకీయాలు ఎంత కుళ్లిపోయాయో ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన [...]

2007-09-22

'కుడీ' 'ఎడమా', మధ్యలో కాంగ్రెసు, నెత్తి మీద కరుణానిధి

2007-09-22 01:31 AM చదువరి - చదువరి
మధ్యంతరం వచ్చేటట్టే కనబడుతోంది. కాంగ్రెసుకు తల వాచేటట్టూ కనబడుతోంది. ఒకేపు వామపక్షాలతోనూ, మరో పక్క బీజేపీతోటి ఎడాపెడా వాయింపుకు గురై కుదేలైపోయింది. అయితే పాపం వీళ్ళకంటే కూడా పెద్ద ప్రమాదం తమవాడు, మిత్రుడూ అయిన కరుణానిధి నుండి వస్తున్నది. కాంగ్రెసోళ్ళు సాక్షాత్తూ రాముడి ఉనికినే ప్రశ్నించి, కన్ను లొట్టోయిన దశలో తీరిగ్గా నాలుక్కరుచుకుని, ఆకులు పట్టుకుని 'ఉఫ్ ఉఫ్' అనుకుంటూ ఉన్నారు, ప్రస్తుతం.

2007-09-17

రామ సేతువు - ఎన్డీటీవి చర్చ

2007-09-17 06:43 PM చదువరి - చదువరి
రాముడు ఉన్నాడా, లేడా అనే విషయంపై కాంగ్రెసు ప్రభుత్వం ఛప్పన్నారు తప్పులు చేసి దిద్దుకొంటూండగా జరిగిన అనేకానేక చర్చల్లో ఎన్డీటీవీ వారి ఆదివారం నాటి చర్చ ఒకటి నేను చూసాను. బర్ఖా దత్ వియ్ ది పీపుల్ అనే ఈ చర్చా కార్యక్రమాన్ని చక్కగా మంచి సమయస్ఫూర్తితో చేస్తుంది. నిన్నటి రాత్రి జరిగిన చర్చలో కొన్ని విశేషాలు... నేను టీవీ పెట్టేటప్పటికీ ఆ ప్రొఫెసరుగారు చెబుతున్నాడు.. "రాముడికీ, బ్రిడ్జికీ సంబంధం లేదు.

తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం - ఒక జ్ఞాపకం

2007-09-17 04:10 PM Dil - గుండె చప్పుడు...
సెప్టెంబర్ 17ను గత కొద్ది కాలంగా భారతీయ జనతా పార్టీ వంటివి తెలంగాణా విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. భారత దేశానికి 1947 ఆగస్ట్ 15 నాడు స్వతంత్రం వస్తే తెలంగాణా ప్రజలు ఒక నామమాత్రపు స్వతంత్రం పొందడానికి 1948 సెప్టెంబర్ 17 వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది.

Outlook పత్రికలో ‘కృష్ణ దేవరాయలు’

2007-09-17 05:01 AM Dil - గుండె చప్పుడు...
Outlook పత్రికలో మన ఇస్మాయిల్ పెనుకొండ “కృష్ణ దేవరాయలు” బ్లాగు ప్రస్తావన వచ్చిందని తెలిసి చాలా సంతోషం వేసింది. వారికి నా శుభాకాంక్షలు.

2007-09-16

మనమే నెంబర్ 1

2007-09-16 03:29 AM జాబిల్లి - జాబిల్లి » రాజకీయం

కిడ్నాపులు,దొమ్మీలు,హత్యలు,భుతగాదాలలొ,కౌంటర్ రాజకీయా లలొ మనకిప్పుడు ప్రత్యెకస్థానం కొంచం ఒపికపడితే మనమే మనమే నెంబర్ 1.

మరిన్ని వివరములకొసం శనివారం ఈనాడు ఎడిటొరియల్ చదవండి !

2007-09-15

మీ నిర్వాకం సంగతి చూడ్డానికి వేరే రాష్ట్రానికి పోవాలా ముఖ్యమంత్రీ?

2007-09-15 12:49 PM చదువరి - చదువరి
ఏ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో లాగా అభివృద్ధి జరగడం లేదట. ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ సంగతి తేల్చేందుకు ఏ రాష్ట్రానికైనా సరే వెళ్ళి చూద్దామని సవాలు కూడా చేసాడు. ఇద్దరం కలిసి వెళ్ళి చూసొద్దామని చంద్రబాబును ఆహ్వానించాడు కూడా. మన అభివృద్ధి సంగతి తెలుసుకుని మూర్ఛబోదామని నాకూ ఉంది. కానీ అంతకంటే ముందు చంద్రబాబు, ఇతర ప్రతిపక్షాలు అలా దేశం తిరిగొస్తే ప్రయోజనమేమైనా కలుగుతుందా అని ఆలోచించ దలచాను. ఈమధ్య ఈ

2007-09-14

సద్గురు సుభాషితం

2007-09-14 04:20 PM జాబిల్లి - జాబిల్లి » రాజకీయం

ఇంతమంది దేవుళ్ళుండి,ఇందరు మహాత్ములు పుట్టీ ఆకలి ,బాద,రొగాలు అన్నీ ఇంకా ఎందుకు? ఈ దేశంలొని ఆకలి కీ,తిండి దొరక్కపొవడానికీ ఎవరు కారణం?ఏమాత్రం బాద్యత లేకుండా జనాబాను పెంచింది మీరా?దేవుడా?లెక్కాపత్రం లేకుండా పిల్లలని కనిపారేసి,’ దేవుడిచ్చాడు ‘ అని సిగ్గులేకుండా చెప్పకండి.బుద్దుడు,మహావారుడువంటివాళ్ళంతా జ్ఞానాన్ని పంచడానికి వచ్చారు.తిండి పెట్టడానికి కాదు.మరి మీకు కళ్ళూ,కాళ్ళూ,చేతులూ ఎందుకు?వాటిని సరిగా చక్కగా సరిగా చక్కగా తెలివితేటలతొవాడు కుంటరనేకదా? దేవుడు అవన్ని అమర్చి మిమ్మళ్ళి భూమి మీదకు పంపించింది.   అంటే తప్పు మీదే కదా!మీరు మారేదాకా,ఏ భగవద్గీత వల్లాపలితం లేదు.ఏమతమూ మిమల్ని కాపాడలేదు?దేవుడికి దణ్నం పెడుతు ఆకాశంకేసి చూస్తూ నడిస్తే ,తెరచిఉంచిన మ్యాన్ హొల్ లొ పడాల్సివస్తుంది.
దయచేసి మీ జీవితాన్ని  మీ చేతులొకి తీసుకొండి,దేవునిచేతికి ఇవ్వకండి ? 

ఈవారం స్వాతి సంచికనుంచి “సద్గురు సుభాషితం

మన చట్టాలు అన్ని ఇంతేనా..?

2007-09-14 05:10 AM జాబిల్లి - జాబిల్లి » రాజకీయం

నిన్న ఈనాడు/వసుంధర లొ రెండవ పెళ్ళికి చేసుకునేవాళ్లకి సంక్రమించే హక్కులు,ఉన్నచట్టాలు గురించి చెప్పారు దానిలొనిలొపాలగురించి  బాగానేచెప్పారు! ఎటుతిరిగి ఆడవాళ్ళకే నష్టం ! అవతిలివాడు  మొదటివాడా రెండవవాడా అని వాళ్ళకి తెలియదుకదా! మనసంస్క్ర్రుతికి సర్టిఫికేటు  అడిగేఅంత ఎదగలేదు !! ఏది ఏమైనా వున్న చట్టాల పై సమీక్ష అవసరం ఒకసారి అన్నిటిని తిరగరాస్తే(లొపాలు సవరించి ) బగుంటుంది కదా! మన నాయకులు  పార్లమెంటులొ రైళ్ళ లొ చెబులకివున్న చైన్లగురించి మట్లాడతారుకాని వీటికి మాత్రం సమయం ఉండదు?           

2007-09-13

ఏది అబివ్రుద్ది?

2007-09-13 11:35 AM జాబిల్లి - జాబిల్లి » రాజకీయం

బాగానే ఉంది..!నేను ఎవరిని ఎత్తటం లేదు కాని,ఒకటి..నాకు బబు ఉన్నపుడు రాజకీయాలు తెలియవు,అయితే మాది తెలుగుదేశం పార్టీ అది కారములొ ఉన్న నియొజకవర్గమే మాది అప్పుడు..మా యం.యల్.ఏ ప్రతి 15 రొజులకు ఒకసారైనా వచ్చేవాడు ఇక మావాళ్ళుకూడా వాడిని మార్చారు అప్పుడు మంజూరైనా ఉన్నతపాటశాల ,పశువుల ఆశుపత్రి ఇప్పటికి పనులు కాలేదు ,వాళ్ళువేసిన రాళ్ళు పీకివీళ్ళు రాళ్ళువేసి మొదలేడదాం అన్నారు ? ఇంతవరకూ దానిగురించిపట్టించుకున్న నాదుడే లేడు ఫొని యం.యల్.ఏ ని అడుగుదామాంటే అసలున్నాడొ  లేడొ కూడాతెలియదు ?వాడేనయం అప్పుడప్పుడు కనిపింఛైనా పొయేవాడు  అంటున్నారు మావాళ్ళు…ఇంకొకవిషయం ఏమిటంటే మా ఊరిలొ బడికి పంతులమ్మ తీరిగ్గా 11 గం|ల కి రావటం చూశా అసలే పిల్లలు చిన్నవాళ్ళు మళ్ళి అమెకి ఒక చిన్నబాబు ,రావటం బాబు ని బడిలొనే ఉయలలొ పెట్టి ఊపటం  ఎది ఆమెపని అందుకే అన్నను ప్రబుత్వ ఉద్యొగులు పని చెయటంలేదు అని (ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా అవిరాసే సమయం లేదు !!)   నేను ఏమి తెలియక రాయటం లేదు అనిమనవి!! ఇంకొకవిష్యం నాకు ఈరాజకీయాలగురించి తెలియదు కాని..ఒకటి అన్ని ఈనాడు కు ముదిపెట్తవద్దు సరే , వట్టి గరి బూములు అసైండ్ అని తెలియగానే ఎందుకు స్వాదీనం చేసుకొలేదు!!,మరి బొత్స్త  గారి బాగొతం  బయటపడినప్పుడు ఎందుకు రాజీనామా చేయించి మళ్ళివేరేమంత్రి పదవిలొకి ఇచ్చారు?       cbn ది  nbk విషయంలొ చేసింది
అది అందరికీతెలిసినవిషయమేగా !!మరి kk ది  త్యాగంలెక్క చూపడం ఎందుకు..? అదిసరే ఇప్పుడు ఒకనెలముందు నాట్లు పడుతున్నాయి..సరే ఇప్పటిప్రబుత్వం వరి కి మద్దతు ఇవ్వలేదు కొన్ని ఏరియాలకే ఉంది!!అయినా నాట్లు వేస్తుంటే బాబు ఎమినా వద్దు అన్నాడా…పట్టుకొని ఆపలేదు కదా !!అప్పుడు  వానలు లేవు వేయలేదు అప్పుడు అనావ్రుస్టి ఇప్పుడు అతివ్రుస్టి!!         ఇంజనీరింగ్ ఫీజు ఒకప్పుడు 40000 ఇప్పుడు 25000 ఎంత తేడా,ప్రతి సం|రం వచ్చె వాళ్ళంతా ఏరి,బాగానే స్తిరపడుతున్నారుగా!!ఏదీ ఐనా మనం ఆలొచించు కొవాల్సినవిషయమే! మనకెందుకులేఅనుకుంటే ఎవరు మారుస్తారు వీళ్ళని !!
        

చిర్రెత్తుకొచ్చి …

2007-09-13 09:03 AM శ్రవణ్ - దిల్ సే ... » రాజకీయాలు
ఇది చదివాక చిర్రెత్తుకొచ్చి … మనలో ఎవరు పన్ను కట్టట్లేదు చెప్పండి? ఆదాయప్పన్నో, మనం తినే ఉప్పూ పప్పూ మీద కట్టే పన్నో ఏదో ఒకటి. ఆలాకట్టిన పన్నుల్లో డబ్బు ఇట్లా రోడ్ల పాలు, బ్రిడ్జీల పాలు చేస్తున్నారు. మన పేరు చెప్పి కొన్ని వేల కోట్ల అప్పు తెచ్చారు. దాంట్లో వీళ్ళు తినేదే సింహభాగం. జన్మభూమి కార్యక్రమానికి రాజకీయనాయకులు వాడిన 50% స్కీమునే తీసుకోండి. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిలో యెవరైనా నిన్ను బాగు చేద్దామనో, నన్ను [...]

2007-09-12

Dear భాస్కర్,

2007-09-12 06:10 AM జాబిల్లి - జాబిల్లి » రాజకీయం

నిజంగానే ఇది గుడ్డి దర్బార్  లొ కామెంట్ కు సమాదానంగా…

నేను రాజశేకరుడిని పనికట్టుకుని తిట్టాలని నాకేమైనా దురదా…నీళ్ళు పేరుచెప్పుకుని కాలంవెళ్ళదీస్తున్నది నిజం కాదా..!ఎన్ని ప్రాజెక్టులు ఇప్పటికి కట్టారు..ఎన్ని కడుతున్నారు?ఎంత తిన్నారు ? అది అడిగినందుకేగా ఈనాడు మీదా దాని అనుబంద సంస్తల మీద దాడులు…వీడి  బాగొతం బయట పెట్టినందుకేగా అంద్రజ్యొతి ని అణచివేయాలనిచూసింది?మీడియా ని తొక్కాలని చూసారు నిజం కాదా..!డ్వాక్రా అని ఇంకా చాలా ఉండేవి తెలుగుదేశం హయాం లొ అవన్ని ఇప్పుడు ఏవి? చంద్రబాబు..అప్పులు తెచ్చాడు కాని  పనులు చేయలేదా..అబివ్రుద్ది
జరగలేదా..దేనికిపనికిరాని హైటెక్ సిటి ఏరియా ని ఎంత అబివ్రుద్ది జరిగింది!!
ఇప్పుడు ఎవడన్న ప్రబుత్వ ఉద్యొగి పని చేస్తున్నాడ , “యదా రాజా తదా ప్రజ”
అంతే గా ! ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీ పేరిగాయ్ ..ఎంతామంది ఉపాదిపొందారు?  
ఉక్క వ్యవసాయ రంగం తప్ప ఏరంగం అబివ్రుద్ది జరగలే దు చెప్పండి ?వర్షాలు కు రవక పొతే ఎవడున్నా ఏమీ పీకలేడు ! ఇంకా బబే నయం వర్షాలు లేకపొయినా మా ఊరికి రొజంతా కరెంటు ఉంది ,ఇప్పుడు   పొద్దున పొతే ఎప్పుడొ రాత్రికి కాని రాదు..!
ఇక అప్పు డబ్బులు లేకుండా ఎమి చేస్తాం చెప్పడి.? ఏ అప్పు తప్పా ..!అబివ్రుద్ది జరుగుతుంటే అదే తీరిగ్గా తీరిప్పొతుంది..!పొయినసారి హైదరాబాదు అంటే హైటెక్    సిటి గుర్తుకువచ్చెది ఇప్పుడు…బాంబులు,దందా,…?ఇలా చెప్పుకు పొతే ఎన్నొ..! నీను ఎవడికి సపొర్టుగారాయవలసిన పనిలేదు..!
ఎంత నిజమౌ,ఎంత అవసరమౌ,మీకే వదిలివేస్తునాను..!అసలు కామెంట్లకి సమాదానం ఇవ్వను మీరూఎదొ సపొర్టు అన్నారుగా అందుకే ఈవివరణ..
ఇంకా కావాలంటే కొన్నిరొజులు ఆగండి..తీరిక దొరికినప్పుడు రాస్తాను..!
 

2007-09-11

నిజంగానే ఇది గుడ్డి దర్బార్ !!

2007-09-11 11:42 AM జాబిల్లి - జాబిల్లి » రాజకీయం

మనం చేస్తే ఒప్పు వేరేవాడు చేస్తే తప్పు ఇది ఇప్పుడు జరుగుతున్నది..నిన్నటి వరకు ఎలాఉంది అనెది పక్కనపెడితే ఇప్పుడు బయటికి వెళ్లి అలతిరిగివద్దాం అంటే బయం ఎక్కడ బాంబు పేలుతుందోఅని? లేకపొతే ఎక్కడ ఏది కూలిమీదపడుతుందొనని బయం? నగరంలొ ఇప్పుడు జరగని గొరమే లేదు కిడ్నాప్ ల దగ్గరనుంచి బూములదందా వరకు ఏది కావాలన్న ఇక్కడ జరుగుతాయ్..!అదిగే దిక్కులేదు , పట్టించుకునేనాదుడేలేడు  ! ననొళ్ళకి ఎంతసేపటికి ఎంత తిందామనే యావేతప్ప ప్రజలబాగొగులు ఒక్కడికీపట్టవు.
పంజాగుట్ట ఫ్లై-ఓవర్ విషయములొ చల్లగా 3 ఇంజనీర్లని తొలగించి చల్లగా చేతులు దులుపుకుంటున్నారు ఇక కేకే , ఇదొక పెద్ద కేక వదిలితే మీడియామీద పది కైకై మని అరవటం తప్పితే విషయం ఉండదు !
వీళ్ళుచేసేపనులకు నిదర్శనం ఇతని పుత్రరత్నం విషయం..చంద్రబాబు నాయుడు అపొలొ కొచ్చి  వీళ్ళు దీన్ని అత్మహత్యాయత్నం  అంటారని అన్నాడొ  లేదొ  వాళ్ళు అనేశారు ! మళ్ళి ఎన్నికలకి వీళ్ళు ఏముకం పేట్టుకుని వస్తారొ చూద్దాం !!
ఇదంతా ఒక ఎత్తు ఐతే మన రాజశేకరునిది మాత్రం ఒకటి..తింటానికి తిండి లేదు కాని నాన్న నాకు సిమ్రాన్ కావాలన్నట్టుది వీడి యవ్వారం,మొన్నటివరకు సఫారీలు ఇప్పుడు స్కార్పియొలు ఏదైనా రాజాలాంటిబతుకురానీది పిచ్చిప్రజలు నువ్వు ఏదొ తమని ఉద్దరిస్తావని పట్టంకడితే నిన్ను నువ్వు బాగానే ఉద్దరించుకుంటున్నావు!!
ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఎమిటంటే మన కాంగ్రెస్ పార్టీ రాస్ట్ర వ్యవహరాల మంత్రి దిగ్విజయ సింగ్  ఇప్పుడు  ఆ బాద్యతలనుంచి తప్పుకుంటున్నాడు    మనొళ్ల పరిపాలన పీకమీదికి వస్తుందనుకున్నడొ ఏమొ పాపం!!

నాకైతే మండిపొతుంది…ఎంటని మాత్రం అడకండే!!

_uacct = “UA-2427728-1″;
urchinTracker();

నేను మోనార్క్‌ని …

2007-09-11 09:48 AM శ్రవణ్ - దిల్ సే ... » రాజకీయాలు
చంద్రబాబు : నేను మోనార్క్‌ని. పైకి కనపడను కానీ, ఫైనల్ డెసిషన్ నాదే. జయలలిత : లేడీ మోనార్క్‌ని. ఇట్లాంటి వాళ్ళకి మోడు చెరువుల నీళ్ళు త్రాగించా. ఫినల్ డెసిషన్ నాదే. అమర్ సింగ్ : క్యా బాత్ కర్తే హో. హం సే బడ్ కర్ మోనార్క్ తో సిర్ఫ్ లాలూ హై. ఔర్ కోయీ నహీ. ఫైనల్ డెసిషన్ మేరా హై.

2007-09-10

శవాలూ, వాటిపై పేలాలూ…

2007-09-10 04:20 AM Dil - గుండె చప్పుడు...
ఈపాటికే ఈ దుర్ఘటన గురించి టీవీల్లో చూసి, పేపర్లలో చదివి మళ్లీ బ్లాగుల్లో ప్రతిస్పందనలు చదివి ఉంటారు కాబట్టి మళ్లీ లోతుగా వెళ్లను. కానీ నిన్న జరిగిన రెండు సంఘటనలపై నా మనసులో మెదిలిన రెండు భావాలు మీతో పంచుకోవాలి. శనివారం (8 సెప్టెంబర్) ఉదయం ఇంకా నిద్రలేవక ముందే ఫోన్ వచ్చింది స్వర్ణకు. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ అయిన షీలా, నరేశ్ లు పూనే నుండి పని మీద హైదరాబాద్ వచ్చారట. అమీర్ పేటలోని [...]

2007-09-06

పారాహుషార్…

2007-09-06 04:24 PM శ్రవణ్ - దిల్ సే ... » రాజకీయాలు
మన రాష్ట్రాన్ని గుడిసె లేని రాష్టంగా చేస్తానని “రాజు” గారు సెలవిచ్చారు. గుడిసె వాసుల్లారా పారాహుషార్. మీ గుడిసె G.O.నెం.210 ప్రకారం కూల్చేసి, దానికి సవరణగా వచ్చిన G.O.నెం.420 ప్రకారం మిమ్మల్ని కాల్చేస్తారేమో? ఒక పేపర్లో వచ్చింది దానికి సవరణ G.O.నెం.840 కూడా వస్తుందంట, పారాహుషార్…

కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా …

2007-09-06 04:13 PM శ్రవణ్ - దిల్ సే ... » రాజకీయాలు
“కుక్కపిల్లా, అగ్గిపుల్లా, సబ్బుబిళ్లా కాదేదీ కవితకనర్హం” ఇది పెద్దాయన శ్రీశ్రీ చెప్పిన మాట. “ఊరేగింపూ, వరదముంపూ, చెత్తకంపూ కాదేదీ రాజకీయానికనర్హం” ఇది ఈనాటి రాజకీయనాయకులు చెప్పే మాట. “ఏంటీ చెత్త గోల?” అంటారా… గోల కాదండీ బాబూ, నిజ్జంగా నిజం. నేను చెప్పేది మన పక్క రాస్ట్రంలోని చెన్నయ్ రాజకీయనాయకుల గురించి. “రోడ్డు మీద చెత్త పేరుకుపోయింది” పదండి clean చేద్దాం అని పది మంది నడుం కడితే, “ఆయ్, మాకు చెప్పకుండా clean చేస్తారా?” అని పోలీసులు వాళ్ళని [...]

2007-09-04

రైతుబాంధవునికి సముచిత పురస్కారం

2007-09-04 05:52 AM Dil - గుండె చప్పుడు...
పాలగుమ్మి సాయినాథ్ కు మెగసెసె అవార్డ్ వచ్చిన నాటి నుండీ అతని గురించి ఒక పోస్టు రాయాలనుకుని వాయిదా వేస్తూ వచ్చాను. మొన్న ఆదివారం ఈనాడులో ఎం.ఎల్. నరసింహా రెడ్డి సాయినాథ్ పై చక్కని వ్యాసం రాసాడు. మిత్రుడు ఇస్మాయిల్ పెనుకొండ ఆపాటికే సదరు వ్యాసం గురించి తన బ్లాగులో ప్రస్తావించాడు. అయినా ఒక రికార్డ్ ఉండాలని మొత్తం వ్యాసాన్ని దిగువ ఇస్తున్నాను. రైతు బాంధవుడు కంప్యూటర్లూ సాఫ్ట్‌వేర్ల గురించి మాత్రమే అంతా ఆలోచిస్తున్న ఈ ఆధునిక యుగంలో… ప్రియురాలి [...]

2007-09-03

are we ready?

2007-09-03 03:50 PM శ్రవణ్ - దిల్ సే ... » రాజకీయాలు
”when the people are ready, they will find their leader automatically”  ఇది “mask of zorro”  లో డైలాగు. పోయినసారి ఎలక్షన్లప్పుడు రాజశేఖరరెడ్డి ఇట్లాగే నాయకుడిగా ఎదిగాడన్నది నా అభిప్రాయం. “are we ready to find another one?”

ఎందుకు?

2007-09-03 03:44 PM శ్రవణ్ - దిల్ సే ... » రాజకీయాలు
పాదయాత్రలు చేస్తే “ఇది తప్పు” అనేవాళ్ళని చూశాం, ఖండ ఖండాలుగా “ఖండించే” వాళ్ళని చూశాము. కానీ, రాళ్ళేసేవాళ్ళని ఇప్పుడే చూస్తున్నాం. ఈ old city  ఎప్పుడు బాగుపడుతుందో?

2007-09-02

అలా ముందుకు పొండి కామ్రేడ్స్!

2007-09-02 01:55 PM Dil - గుండె చప్పుడు...
ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో భూపోరాటం చేసి అరెస్ట్ అయిన వామపక్షాల కార్యకర్తలు. వరంగల్ సెంట్రల్ జైలు ముందు క్యూ కట్టిన చిత్రం. స్వతంత్రం వచ్చి అరవై యేళ్లవుతున్నా చారెడు నేల కోసం ప్రజలు ఇలా జైలుకు వెళ్లవలసి రావడం మన దురదృష్టం. – రెండో దశ భూపోరాటంలో భాగంగా నిన్న వామపక్షాలు అటు రామోజీ, ఇటు సంఘీ భూముల్లో ఎర్ర జెండాలు పాతాయి. ముఖ్యంగా రామోజీ భూముల విషయంలో ఎన్నోసార్లు అధికారపార్టీ, వామపక్షాలను రెచ్చగొట్టే ప్రకటనలు చేసింది. ఫిల్మ్ [...]

2007-08-31

ఆవిధంగా ముందుకు పోతున్నాం…

2007-08-31 05:55 AM శ్రవణ్ - దిల్ సే ... » రాజకీయాలు
ఈమధ్య సైంటిస్టులు ఒకటి కనుగొన్నారు, పవరులోలేని రాజకీయనాయకులలో ఒకరకమయిన మానసిక రుగ్మత ఉంటుందని. దీనిపై వేర్వేరు నాయకుల వ్యాఖ్యలు ఇలా వున్నాయి. రాజశేఖరరెడ్డి: “ఇది పురుషుల్లో వుంటే దాన్ని ‘రాజీవ్ రోగం’ అనీ, స్త్రీ లలో వుంటే దాన్ని ‘ఇందిరమ్మ వ్యాధి’ అని పిలవాలి. స్లం లను అన్ని కలుపుకొని ‘డిసీజ్ కారిడార్’ ఎర్పాటు చేస్తున్నారు”. అద్వానీ : “పోటా చట్టం తేవాలి, లేకపోతే ఇటువంటి రుగ్మతలే వస్తాయి”. చంద్రబాబు : “భ్రష్టు పట్టిస్తున్నారు. ఒక ముఖ్య మంత్రి మాట్లాడవలసిన మాటలేనా [...]

2007-08-29

మరింత వినోదం…

2007-08-29 05:07 PM Sriram - సంగతులూ,సందర్భాలూ…. » రాజకీయం
వయ్యస్సార్ ని రీడిఫ్ వాడు ప్రశ్నలు వేసాడు. వాళ్ళకేం తెలుసు, ఈయనకి మీడియా అంటే కోపం అని. అప్పటిదాకా బానే ఉన్నాయన చివరలో ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగగానే ఎలా మారిపోయాడో. పాపం షీలా భట్!

పసుపు చొక్కా పచ్చచొక్కా

2007-08-29 01:22 PM శ్రవణ్ - దిల్ సే ... » రాజకీయాలు
Y.S. ని హిట్లర్ తో పోల్చితే చంద్రబాబుని ఎవర్తో పోల్చాలో మీరే చెప్పండి.

2007-08-28

ఉగ్రవాదము, మతమూ

2007-08-28 08:19 PM చదువరి - చదువరి
హైదరాబాదులో బాంబు పేలుళ్ళు జరగ్గానే "అన్ని మతాల వాళ్ళూ చనిపోయారు ఒక మతంపై ప్రత్యేకించి చేసిన దాడి కాదు" అని వ్యాఖ్యానాలు వచ్చాయి. సహజంగానే ప్రజలు కూడా ఈ పేలుళ్ళను అలా భావించలేదు. మత పరమైన పర్యవసానాలేమీ లేకుండానే ప్రశాంతంగా గడిచిపోయింది. అయితే బాధితుల్లో అన్ని మతాల వారూ ఉన్నారు. కానీ ఈ ఉగ్రవాదులెవరు? ఈ సంఘటనకు కారకులు ఎవరో ఇంకా తెలీక పోయినా, గత అనుభవాలను బట్టి ఇస్లామిక ఉగ్రవాదులని అనుమానాలు

“it happens” అంట

2007-08-28 04:50 AM శ్రవణ్ - దిల్ సే ... » రాజకీయాలు
“it happens” అంట. ఏంటి “it happens”?  సుమారు 50 మంది చనిపోతే ఒక రాష్ట ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఆ చనిపోయిన వాళ్ళలో ఈయన కొడుకో కూతురో ఉంటే ఇట్లాగే మాట్లాడతాడా?

2007-08-27

వేట అదే వేటు అదే నాటి కధే అంతా

2007-08-27 06:25 AM Dil - గుండె చప్పుడు...
రాత్రి 8:15కి బండి స్టాండ్ వేసి ఇంట్లోకి వస్తుంటే వచ్చిందా ఫోన్. అటునుంచి నా బెంగాలీ కొలీగ్. “ఎక్కడున్నావ్” అని ఆదుర్దాగా అడిగాడు. ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నానని బదులిచ్చాను. “కోటీలో, లుంబినీ పార్కులో బాంబ్ బ్లాస్ట్స్ అయ్యాయి. నువ్వు జాగ్రత్త” అని చెప్పాడతను. పరుగున వెళ్లి టీవీ ఆన్ చేశాను. తననూ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇక ఫ్రెండ్స్ కు, బంధువులకు ఫోన్ చేయడం మొదలు పెట్టాను. దిల్ సుక్ నగర్ లో షాపింగ్ చేస్తున్న [...]

2007-08-26

కేసీయార్ రాజీనామా తార్కికమైనదేనా!

2007-08-26 07:44 PM చదువరి - చదువరి
కేసీయార్ రాజీనామా అంకాన్ని పూర్తి చేసాడు. కేసీయార్ దృక్కోణం నుండి చూస్తే ఎందుకో నాకిది తార్కికంగా అనిపించలేదు. రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించి కాంగ్రెసును వీలయినంత ఇబ్బంది పెట్టేసాడు. తెరముందు తన వాదనను బాగా వినిపించి ప్రజల్లోకి మళ్ళీ దూసుకెళ్ళాడు. తాను పొందాల్సిన లాభాన్ని పొందేసాడు. ఇక ఏదో ఒకటి చెప్పి, రాజీనామా వెనక్కు తీసుకుంటాడనుకున్నాను. కానీ, తెగే దాకా లాగాడెందుకో!? రాజీనామా ఉపసంహరణ కోసం

స్వపరిపాలన కోసం తెలంగాణ

2007-08-26 07:44 PM చదువరి - చదువరి
నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ అనేది తెలంగాణ కోరుతున్నవారి వాదన. అయితే "తెలంగాణ కావలసింది అభివృద్ధి కోసం మాత్రమే కాదు, ఆత్మగౌరవం కోసం, స్వపరిపాలన కోసం" అని కేసీయార్ అంటున్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ఇతరులు కించపరుస్తున్నారు, మాండలికాన్ని హేళన చేస్తున్నారు అనే వాదన ఉంది. బతుకమ్మ, బోనాలు మొదలైన తెలంగాణ పండుగలకు ప్రస్తుతం అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదన్నది ఈ వాదనలోని భాగం. తరాలు

సాయిబాబా - తెలంగాణా

2007-08-26 07:44 PM చదువరి - చదువరి
"..ఈ విధంగా దేశాన్ని ముక్కలు చెయ్యడం మహాపాపం. నేను ఏ రాష్ట్రం, ప్రాంతం గురించి మాట్లాడడం లేదు. నాకు అలాంటి భేదాల్లేవు.." - చెన్నై సభలో సాయిబాబా. సత్యసాయిబాబాకు రాష్ట్ర ప్రాంత భేదాల్లేవట. భారతదేశమొక్కటే ప్రధానమైనదట. దేవుడికి మానవాళి అంతా ఒక్కటే కదా, దేశ భేదాలుంటాయా? విశ్వం గురించి మాట్లాడాలసిన దేవుడు, దేశ రాజకీయాల గురించి మాట్లాడ్డమేమిటో? వృద్ధాప్యం వలన ఆయన ప్రసంగంలో స్పష్టత లోపించిందట;

తెలంగాణా సెంటిమెంటు + యాంటీ కాంగ్రెసు సెంటిమెంటు = కరీంనగర్

2007-08-26 07:44 PM చదువరి - చదువరి
కరీంనగర్లో తెరాస గెలుపు కారణంగా తెలంగాణ వస్తుందో రాదో తెలీదు గానీ, తెలంగాణ కావాలని కరీంనగర్ ప్రజలు కోరుకుంటున్నారనేది మాత్రం తేటతెల్లమై పోయింది. కాంగ్రెసు మోసాన్ని, కుటిలనీతిని, మాటలు మార్చే తత్వాన్ని ప్రజలు గ్రహించారు, ఆగ్రహించారు. వారి ధర్మాగ్రహమే నేటి తెరాస విజయం. కేసీయారు పై ప్రజలకు వల్లమాలిన అభిమానం ఉందో లేదో గానీ, తెలంగాణ కాంక్షించి మాత్రం ఆయనకీ మెజారిటీ ఇచ్చారనేది సుస్పష్టం. బీజేపీపై

బీడీ, భాషా, యాసా కాదేదీ ఎన్నికల ప్రచారాని కనర్హం

2007-08-26 07:44 PM చదువరి - చదువరి
మన ఎన్నికలలో మామూలు విషయాలకు కూడా కొత్త అర్థాలు వస్తూంటాయి. ఏ ప్రాముఖ్యతా లేని మామూలు విషయాలను మన రాజకీయులు పెద్దవి చేసి ప్రజల సానుభూతిని, తద్వారా ఓట్లను కొల్లగొట్టే ఆలోచనలు చేస్తుంటారు. కరీంనగరు, బొబ్బిలి ఎన్నికల్లో కూడా ఇలాంటి రెండు విషయాలు పైకి తేలాయి. కరీంనగరు ఎన్నికకు వస్తే... వెంటనే గ్రహించేసి ఉంటారు - బీడీల గురించి అని. ఈ ప్రాంతంలో బీడీ ఆకు (తునికాకు) ఏరుకుని బీడీలు చుట్టి అమ్ముకునే

2007-08-23

ఆహా థాపర్ మహాశేయా, ఎంత చక్కగా కమ్యూనిస్టుల తలంటావయ్యా?

2007-08-23 08:38 PM వికటకవి - వికటకవి » రాజకీయం

అదేదో సామెత ఉంది గద “మొరిగే కుక్క కరవదని”. మన కమ్యూనిస్టులు తీరలాగే ఉంది. తామేదో జాతి రక్షకులమని పేరుతెచ్చుకుందామని మన (అ)ప్రధాని మన్మోహన్ ని అణు ఒప్పందం మీద గట్టిగా బెదిరించారో లేదో, తిక్కరేగిన (అ)ప్రధాని గారు తిరిగి వాళ్ళని మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి పొండి అన్నాడు కన్యాశుల్కం లో లుబ్దావధాన్లు గనక “తాంబూలాలు ఇచ్చేసా,తన్నుకు చావండి” అన్నట్లు.

(అ)ప్రధాని ఇంత దెబ్బ కొడతాడని ఊహించని కమ్యూనిస్టులు ఇప్పుడు జాతికి ఎందుకు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవట్లేదో చెప్పలేక నానా గడ్డి కరుస్తున్నారు. ఇలాంటి పనికి మాలిన బెదిరింపులతో ఇదివరకు స్టాక్ మార్కెట్ ని ఉత్తపుణ్యానికి పడగొట్టి ఎందరిదో ఉసురు పోసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే తంతు, లాక్కో లేక పీక్కో లేక.

సీతారాం ఏచూరి అంతటివాడు కరణ్ థాపర్ ప్రశ్నలకి నీళ్ళు నమలటం చూస్తుంటే, నా సామిరంగా తెగ సంబరపడ్డా, ఎంత బాగా ఎండగట్టావు నాయనా మా అందరి తరపున అనుకుంటూ. వీలైతే మీరూ ఓ లుక్కెయ్యండి డెవిల్స్ అడ్వకేట్ మీద.

అలానే కొన్ని నెలల క్రిందట ఇదే థాపర్ మహాశేయుడు మన వైయస్సు ని ముప్పు తిప్పలు పెట్టాడు.

2007-08-22

బీసీసీఐ నిర్వాకం

2007-08-22 07:55 PM చదువరి - చదువరి
భారత్ లో క్రికెట్టు నియంత్రణ కోసం బీసీసీఐ ఉంది. కానీ.. బీసీసీఐ నియంత్రించేది క్రికెట్టును కాదు, దానిలో వచ్చిపడుతున్న డబ్బులను. ఏ పోటీ ఐనా, ఎక్కడ జరిగినా మన జట్టంటూ పాల్గొంటే చాలు.. డబ్బులే డబ్బులు! మనం ఓడినా, గెలిచినా మన జట్టు ఆడే మాచిల ప్రసార హక్కులు కోట్లు కురిపిస్తాయి. - అంచేత జట్టును ఆడించడమే ముఖ్యం.. గెలుపు కాదు. - అంచేత జట్టును ఎంపిక చేస్తే చాలు.. మంచి జట్టే కానక్కర్లేదు. - అంచేత

2007-08-20

మధ్యంతరం తప్పేటట్టులేదు?

2007-08-20 05:24 AM జాబిల్లి - జాబిల్లి » రాజకీయం

కేంద్రములొజరుగుతున్న రాజకీయపరిమాణాలు,కమ్యూనిస్టుల బెదిరింపు పూరిత చర్యలు చూస్తుంటే మధ్యంతరం తప్పేటట్టులేదు..చంద్రబాబు కొడుకు పెళ్ళి వదిలేసి వీటిమీదే ద్రుస్టి పెట్టినట్టుంది,ఏదైనా కమ్యూనిస్టులతొ పొత్తు అంటే,పిచ్చొడిని సంకలొవేసుకుని తిరగడమే..!

2007-08-19

“విబజించు పాలించు”

2007-08-19 03:59 AM జాబిల్లి - జాబిల్లి » రాజకీయం

తెల్లదొరల పాలనలొ వాళ్ళు మనల్లి ఇలాగే “విబజించు పాలించు” అనే పద్దతి పై పాలించారని చరిత్రలొ చదివాను,మళ్ళి ఇప్పుడు మన రాజశెఖరుని పాలాన చూస్థుంటే అలాగే ఉంది..!2009 ఎన్నికలలొ ఎలాగెలుస్తాం అన్న దానిపై మనవాడి రాజకీయ విశ్లేషన వీడి వక్రబుద్దికి  నిదర్సనం .. ఇందిరమ్మ ఇళ్ళకు ఇంటికి 3 చొప్పున ఒట్లంట,పించన్లకు,…ఇలామన వాడు అన్నింటిని  విబజింఛి పాలిస్తున్నాడు..ఏమో జనం ఎమి తేలుస్తారొ చూడడానికి 2 సం||రాలు  ఆగకతప్పదు.!   

ఇది మనొడి పరిపాలన…!

అణ్వాయుద ముప్పు.!

2007-08-19 03:45 AM జాబిల్లి - జాబిల్లి » రాజకీయం

అణ్వాయుద బిల్లు పై లొక్ సబలొ ఎటువంటి చర్చా లేకపొవడం శొచనీయం..
దానిని అలాగే ఆమౌదించడము అంతమంచిది కాదు..cpm వాళ్ళు అడుగుతున్న దానిలొ  తప్పులేదు!ముందు దేశబద్రతకు,విలువలను ద్రుస్టిలొ ఉంచుకుంటే  బాగుటుంది..అమెరికా ఇంతచొరవచూపుతున్నది అంటే అలొచించవలసిన విషయమే,మన పొరుగు దేశం  పాకిస్తాన్ కు మనకు మద్య ఏదొ అబద్రతాబావం కలుగజేయలని చూడడమే …!   

2007-08-15

బ్రిటీష్ సామ్రాజ్యవాదం నుండి అమెరికన్ సామ్రాజ్యవాదం దాకా

2007-08-15 07:13 AM Dil - గుండె చప్పుడు...
ప్రధమ భారత స్వాతంత్ర్య పోరాటపు 150వ, స్వాతంత్రపు 60వ వార్షికోత్సవం సందర్భంగా Incredible India వారు వెలువరించిన చిత్రం. ————————————————— నిన్న మధ్యాహ్నం బ్రేక్ ఔట్ ఏరియా లో కూర్చుని చాయ్ తాగుతుంటే అడిగాడు మా కొలీగ్, రేపు జెండా వందనం ఎక్కడ చేస్తున్నావని. ఆఫీసంతా మూడు రంగుల బెలూన్లు, జెండాలతో నింపేశారు. ఇక Happy Independence Day సందేశాలకయితే లెక్కే లేదు. అరవై వసంతాలయ్యింది కదూ మనకు స్వతంత్రం వచ్చి. మనుషులకయితే షష్టి పూర్తి అంటే జీవితపు చరమాంకానికి [...]

2007-08-14

గొర్రెల మంద మన నాయకులు..!

2007-08-14 06:31 AM జాబిల్లి - జాబిల్లి » రాజకీయం

నేను ఇంతక ముందు చేప్పినట్ట్లు మన నయకులు ప్రయివేటు రిజర్వేషన్ గానం పాడుతున్నారు ..!మన రాజశేకరుడు ఎక్కడ మిగతా వాళ్ళు అంటారొనని ,మనొడే ఒక అడుగు ముందుకేసి మేముకూడా వాటిని అమలుపరచాలని అనుకుంటున్నామని వచ్చేఎన్నికలనాటికి అమలుపరుస్తామని చేబుతున్నాడు…!
ఇంక ఉన్నతవర్గానికిచేందిన పేదవారికి ఇక ప్రైవేటు రంగములొ  కుడా  చుక్కేదురే!!! 

2007-08-11

వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవచ్చుట, నమ్మొచ్చా ఈ డైలాగ్?

2007-08-11 04:41 PM వికటకవి - వికటకవి » రాజకీయం

మన ప్రధానమంత్రి మన్మోహన్ గారికి అప్రధాని, వెన్నెముకలేని ప్రధాని అని అంటున్నవాళ్ళ మాటలు వినీ వినీ ఉన్నట్టుండి పౌరుషం వచ్చినట్లుంది! ఒక్కసారిగా, వామపక్షాలు ఖబడ్దార్ అని అరచాడు. కానీ, అసలు ఈ డైలాగుల్ని సీరియెస్గా తీసుకునేదెవరు?

వామపక్షాలేమో పోన్లే పాపం తిడితే తిట్టనీ, ఎవరు మాత్రం ప్రజలు, ప్రతిపక్షాలతో అన్నేసి మాటలు పడుతూ ఎన్నాళ్ళు ఊరికే ఉండగలుగుతారు అని పట్టించుకోరు.

“మేడం” గారు సరే సరి, రేపో మాపో దగ్గరికి పిలిపించుకొని మళ్ళీ ఓ క్లాసు పీకి పంపుతుంది.

ఇక ప్రజలంటారా, ఈయన్ని నమ్మటం ఎప్పుడో మానేసారు. రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో దేశంలో ప్రతి వాడికీ తెలుసు.

మరింకా ఈ అరుపులూ, రంకెలూ ఎందుకు ప్రధాని గారు?

మళ్ళీ రిజర్వేషన్లా…!!

2007-08-11 10:19 AM జాబిల్లి - జాబిల్లి » రాజకీయం

ఇన్ని రొజులు ప్రభుత్వరంగం అంతా  రిజర్వేషన్ల మయం అనుకున్నా ఇప్పుడు అది మాయావతి దయవల్ల
ప్రైవేటుకు పట్టుకుంటుంది..ఇకమన వళ్ళు ఊరికే ఉంటారా మన వాళ్ళూ అదే పాట పాడ తారు!!
చూస్తూఉండండి మన వాళ్ళు మళ్ళి ఎన్నికలలి  ఇదే జపిస్తారు..!ఇక వచ్చే కంపెనీలన్ని తట్టా,బుట్టా సర్దుకుంటాఇ.

2007-08-09

ఖాసిం రజ్వీ వారసుల దౌర్జన్యకాండ

2007-08-09 02:36 PM Dil - గుండె చప్పుడు...
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ పై మజ్లీస్ గూండాల దాడి గర్హనీయం. ఆమె తన పుస్తకం “షోద్” ను తెలుగులో వెనిగళ్ల కమల అనువాదం చేయగా ఆవిష్కరించడానికి హైదరాబాద్ వచ్చారు. పాత బస్తీ లో ముస్లింలపై నానాటికీ పట్టు కోల్పోతున్న మజ్లీస్ పార్టీ విద్వేషం రెచ్చగొట్టే పనులు చేయడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉంది. అలనాడు నిజాం తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఖాసిం రజ్వీ నేతృత్వంలో ఏర్పరచిన మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ తదనంతర కాలంలో [...]

2007-08-07

1,10,000 AK-47లు పోయాయట!

2007-08-07 08:50 AM Dil - గుండె చప్పుడు...
ఇరాక్ లో స్థానిక సైన్యానికి గత రెండేళ్లుగా అమెరికా సరఫరా చేసిన ఆయుధాలలో 1,10,000 AK-47లు, 80,000 పిస్తోళ్లు కనిపించట్లేదనే వార్త ఆందోళన కలుగజేస్తుంది. గడచిన అనేక దశాబ్దాలుగా ప్రపంచం లోనే అతిపెద్ద ఆయుధ బేహారిగా మారి, తాను ఉత్పత్తి చేస్తున్న ఆయుధాలు అమ్ముకోవడానికి లక్షలాది ఉసురు తీసే యుద్ధాలు మొదలు పెడుతున్న రక్త పిపాసి అమెరికా పొరపాటున చేసిందో కావాలనే చేసిందో కానీ ఈ తప్పిదం మాత్రం క్షమార్హం కాదు. అత్యంత పురాతన మెసొపొటేమియా నాగరికతకు నిలయమైన [...]
వ్యాఖ్యలు
2007-10-09
2007-10-09 10:36 AM budaraju aswin - Comments for గుండె చప్పుడు...

Nice post

2007-10-07
2007-10-07 05:25 AM Dil - Comments for గుండె చప్పుడు...

నువ్విచ్చిన లింకు ఆ వ్యాసం పార్ట్-2 కి వెళ్తోంది సుధాకర్.

బాబాను సపోర్టు చెయ్యలనే ఆత్రుతతో సదరు భక్తుడు నానాకంగాళీ వ్యాసం ఒకటి కెలికేశాడు. ఆయన అనుచరుడి కారణంగా బాబాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది అనే ఒక హాస్యాస్పదమైన జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం, ఆ తరువాత అయోమయంగా “బాబా గారు స్వతహాగా భోళా మనిషి కావడం, అనుచరులను అతిగా నమ్మడం వల్ల సమస్యలు వస్తున్నాయి. పదిహేనేళ్ళ క్రితం హైదరాబాద్ సత్యసాయి నిగమాగమానికి వచ్చిన ఆయన ఆ కార్యక్రమంలో సహచరుల సలహా మేరకు గాలిలో నుంచి బంగారు గొలుసు తీయబోయారు. దానిని ఆయన గాల్లోంచి తీయలేదని, తన చొక్కా పొడుగు చేతుల్లోంచి తీశారంటూ ఒక ఆంగ్ల దినపత్రిక ఫోటోలతో సహా ప్రచురించింది. బాబా గారి భక్తులు అటువంటి వార్తలను నమ్మరు. ఆయన మీద వారికున్న విశ్వాసం అటువంటిది.”
అని రాశాడు.

ఫొటొలతో సహా పత్రికలో ప్రచురించినా బాబా భక్తులు నమ్మరట!

నెపం ఆయన అనుచరుల మీద వేసి సదరు వ్యాసకర్త ఇప్పుడు చెప్పదలుచుకున్నదేమిటి? “బాబా గారు” ఉట్టి అమాయకుడు, అనుచరులు చెప్పినట్టలా ఆడుతాడనేనా?

ఏమి తెలియని వాడు దేవుడెలా అయినాడు స్వామీ?

ఒక అ”సత్య” దేవుడిని వెనకేసుకురావడానికి ఎన్ని అబద్ధాలూ, అమాయకత్వాలూ, అజ్ఞానాలూ, మోసాలూ…

2007-10-06
2007-10-06 06:17 PM సుధాకర్ - Comments for గుండె చప్పుడు...

అదీ తెలుగు డాటు కాము ఇలా కూసింది..ఇలా రాసుకుంటే ఇక పత్రికెందుకు?

http://thatstelugu.oneindia.in/talk2006/2007/saibaba-vishwadarshan2-051007.html

2007-10-05
2007-10-05 05:32 PM సుధాకర్ - Comments for గుండె చప్పుడు...

రానారెతో నేను విభేదిస్తున్నాను. ఏదో ఒకటి చేస్తున్నాడు గదా అదే నయం అనుకోవటం అమాయకత్వ దివాళాతనం. ఎలా అయినా జనాలని మోసం చేస్తే మోసం మోసమే. లక్షల మందిని మోసం చేస్తూ వారిచ్చిన డబ్బుతోనే వారికి కొన్ని పనులు చెయ్యటం గొప్ప అయితే చరిత్రలో చాలా మంది రాబిన్ హుడ్ లు వున్నారు, బిల్ గేట్లూ, వారెన్ బఫెట్లు వున్నారు. వారిచ్చిన విరాళాల ముందు ఇవి పెద్ద లెక్కేమీ కాదు.

2007-10-05 01:22 PM kranti - Comments for గుండె చప్పుడు...

భలే రాసారండి మీరు.నేను కూడ ఈ విషయం మీద రాద్దాం అనుకున్నాను కాని,బాబా భక్తులందరు కలసి నన్ను కుమ్మేస్తారని నోరుమూసుకున్నాను.

2007-10-05 06:58 AM విశ్వనాధ్ - Comments for గుండె చప్పుడు...

రాజీవశేకరునికి అప్పజెపితే బాబాలు స్వామీజీలు పుట్టరు.
{పెనంలోచి పొయ్యిలో పడ్డట్టుగా}

ఫాదర్స్ పుడతారు “ఆమెన్” అనుకొంటూ…

సోనియాజీ,కాంగ్రెసుల మద్దతుకూడా పుడుతుంది వాళ్ళకు.

2007-10-05 02:26 AM నెటిజన్ - Comments for గుండె చప్పుడు...

ఐతే మన “రాజీవశేఖరుడు” కి చెప్పి, ప్రతి మండల కార్యాలయమ్ లో పరిధిలోను ఒక ౧౦౦ ఎకరాలు ఉచితమ్‌గా ఇవ్వమందాం.
అందులో ఒక బాబా / స్వామిని పోషించమందాం!
వోట్లు,నోట్లు, “దేశవిదేశాలనుండీ చేరుతున్న భక్తుల పరపతిని చాలావరకూ ప్రజాసేవకు ఉపయోగి”ంచుకోవచ్చు.
ఉచితంగా?
ఏమంటారు?

2007-10-04
2007-10-04 09:41 PM రానారె - Comments for గుండె చప్పుడు...

గారడీవాడైనా మాయలవాడైనా, దేశవిదేశాలనుండీ చేరుతున్న భక్తుల పరపతిని చాలావరకూ ప్రజాసేవకు ఉపయోగిస్తున్న బాబాయే నయం. ప్రజాసేవకులమని చెప్పుకొంటున్న రాజకీయ వ్యాపారులకంటే, సమానత్వం పేరుచెబుతూ మానవత్వాన్ని మరచిన మావోయిస్టులకంటే ఇతగాడేమీ హానికరం కాదని నా ఉద్దేశం.

2007-10-04 08:19 PM Uday - Comments for గుండె చప్పుడు...

అయ్యా దిల్ గారు, మీరు ఎమి రాయదలుచుకున్నారొ కాని, మన వాక్ స్వతంత్రం తొ ఇతరులని కించపరచరాదు అని నా అభిప్రాయం. భా.జా.పా వాళ్ళది తప్పు అయితే అయ్యి వుండవచ్చు, కాని వాళ్ళూ ఎ రొజు ఈ వివాధం లొ కాంగ్రెస్ వాళ్ళూ ఒట్ల ఆశతొ రాముడు ఒక్ బ్రమ అని వేసిన అఫిడవిట్ మీద గొడవ పెట్టారే కాని వేరె దేని మీద కాదు.

ఎది ఎమైనా, మీరు ఈ దేశ పౌరులుగా మీ అభిప్రాయం వ్యక్తం చేసారు…good luck..sorry boss, I am lacking time and jumping to english to express my opinion

I feel minority enrichment is different from minority appeasement which the current goverment is doing…is tht not for votes…and a cruder way than what BJP done?..ofcourse they both are theives, in my opinion the earlier goverment is better than the current one.

2007-10-04 07:38 PM సుధాకర్ - Comments for గుండె చప్పుడు...

ఎంతకు తెగిస్తున్నారు ఈ బాబాలు. చంద్రుడిలో దేవుడు కనిపిస్తే, చంద్రుని మీద కాలెట్టిన వాడినేమనాలి? దైవ సన్నిధి చేరిపోయినట్లా…అసలు ఈ బాబా కి విశ్వం మీద ఒక పరీక్ష పెట్టాలి. పైన చెప్పినలాంటు మూర్ఖ భక్త శిఖామణులు పెరిగితే ఇక నాలుక మీద నాకాన్ని చూపించవచ్చు…

నా దగ్గరకు వస్తే నరకాన్ని కూడా చూపిస్తా…హైదరాబాదు రోద్ల మీద…బాబాని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు కూడా కనిపించవచ్చు ఒక పది కిలోమీటర్లు ఈ రోడ్ల మీద బైకు నడిపితే…

2007-10-04 07:33 PM వైజాసత్య - Comments for గుండె చప్పుడు...

హహహ9

2007-09-18
2007-09-18 01:11 AM స్మైల్ - Comments for గుండె చప్పుడు...

చాలా మందికి కమ్యూనిస్టులంటేనే మొదట గుర్తుకు వచ్చే పదం…వెగటు! అదేదో గొప్ప సంగతి కనుకొన్నట్టు చేప-ఇవ్వడం-చేప-పట్టడం కథ కొన్ని వేల సార్లు చెబుతారు. వారి మాటల్లో నిజానిజాలెంతున్నా తెలంగాణా పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర శ్లాఘనీయం. నిజాంకు ఎదురొడ్డి నిలవడమే కాకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడిన ఎందరో మదాంధులకు చక్కటి గుణపాఠం చెప్పారు. నేను ఫక్తు రాయలసీమవాడినైనా…కోస్తా సంబంధం కలుపుకొన్నా…తెలంగాణాతో ఏ సంబంధం లేకపోయినా తెలంగాణా కడగండ్లు తెలిసిన వాడిని. కర్నూలు గాడిచర్ల హరిసర్వోత్తమరావు(రాయలసీమ నామకర్త)గ్రంథాలయంలో ఏకబిగిన చదివిన ‘తెలంగాణా సాయుధ పోరాటం’ ఆనాటి ప్రజల కన్నీళ్లను కళ్ళారా చూపించింది. తెలంగాణా గురించి మాట్లాడేవారెవరయినా 1948కు ముందటి చరిత్ర ఒక్కసారి చదివితే మంచిదని నా అభిప్రాయం!

2007-09-17
2007-09-17 11:11 PM Ravi - Comments for గుండె చప్పుడు...

Oh! God……..

2007-09-17 10:09 AM Madhavarao Tallapaneni - Comments for గుండె చప్పుడు...

danyavaadamulu, ee vaarthanu maaku telipinanduku.

2007-09-11
2007-09-11 01:44 AM చదువరి - Comments for గుండె చప్పుడు...

మీడియా వాళ్ళు రావడం, ఫోటోలు తియ్యడం.. ఇవి జరగాలి. వాళ్ళుండబట్టే కదా మనకు సంగతులు తెలిసింది. కాకపోతే మనవాళ్ళకి కాస్త అత్యుత్సాహం! పదిమంది చనిపోయారని ఒకరంటే పదిహేను మందని మరొకరు.. ఇలా సాగాయి ఆనాటి సంఘటన వార్తలు.

“దయచేసి ప్రమాదాలు, దుర్ఘటనలు జరగగానే మీరు అక్కడ వాలిపోకండి.” - అవును, ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు నాయకులు వెళ్ళగూడదు. వాళ్ళక్కడికి వెళ్ళినందువలన ప్రయోజనం వాళ్ళకే!

జూబిలీ హిల్స్ నేరాలు అని ఓ పుస్తకం రాయొచ్చనుకుంటా. కాల్పులు అనేది అందులో ఒక అధ్యాయం.

2007-09-10
2007-09-10 05:31 PM T. L. Bala Subrahmanyam - Comments for గుండె చప్పుడు...

మీడియాని తప్పుపట్టకూడదు.వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తున్నారు. వాళ్ళు అలా చెయ్యకపోతే బహుశా నాకు చాలా కోపం వచ్చివుండేది.

మిగతావాళ్ళ సంగతి చెప్పలేను కాని ఒక ప్రతిపక్షనాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా నాయుడుగారు అలాంటి సంఘటన జరిగినప్పుడు తప్పనిసరిగా వచ్చితీరాలి. తన పరిపాలనానుభవంతో ఈ సంఘటనని బేరీజువెయ్యాలి. ఆయన అదే చేశాడు. అందుకాయన్ని అభినందిస్తున్నాను.

ఇకపోతే సహాయ కార్యక్రమాలు : అక్కడ జరగాల్సిన ఘోరం ఎలాగూ జరిగిపోయింది. సహాయం పాత్ర చాలా స్వల్పం. ఎవరూ రాకముందే స్థానికులు గాయపడ్డవాళ్ళని ఆస్పత్రులకు మోసుకెళ్ళారు. శిథిలాల్లో ఇరుక్కుపోయిన శవాల్ని తియ్యడం అనేది సాధనసంపత్తి సుశిక్షిత సిబ్బందీ గల ప్రభుత్వానికే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు సాధ్యం కాదు.

2007-09-10 05:30 PM T. L. Bala Subrahmanyam - Comments for గుండె చప్పుడు...

మీడియాని తప్పుపట్టకూడదు.వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తున్నారు. వాళ్ళు అలా చెయ్యకపోతే బహుశా నాకు చాలా కోపం వచ్చివుండేది.

మిగతావాళ్ళ సంగతి చెప్పలేను కాని ఒక ప్రతిపక్షనాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా నాయుడుగారు అలాంటి సంఘటన జరిగినప్పుడు తప్పనిసరిగా వచ్చితీరాలి. తన పరిపాలనానుభవంతో ఈ సంఘటనని బేరీజువెయ్యాలి. ఆయన అదే చేశాడు. అందుకాయన్ని అభినందిస్తున్నాను.

ఇకపోతే సహాయ కార్యక్రమాలు : అక్కడ జరగాల్సిన ఘోరం ఎలాగూ జరిగిపోయింది. సహాయం పాత్ర చాలా స్వల్పం. ఎవరూ రాకముందే స్థానికులు గాయపడ్డవాళ్ళని ఆస్పత్రులకు మోసుకెళ్ళారు. శిథిలాల్లో ఇరుక్కుపోయిన శవాల్ని తియ్యడం అనేది సాధనసంపత్తి సుశిక్షిత సిబ్బందీ గల ప్రభుత్వానికే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు సాధ్యం కాదు.

2007-09-10 10:17 AM Sudhakar - Comments for గుండె చప్పుడు...

అసలు ఆత్మహత్య ఎవరో చేసుకుంటే ఈ వెంకట్ అపస్మారక స్థితిలోకి ఎందుకు పోయాడో అర్ధం కాదు. ఇక అతని భార్య కూడా అపస్మారక స్థితిలోకి పోవటం మరొక కామెడీ. మీరన్నట్లు ప్రతీ దానికి ఒక ఫార్ములా వుంది. బహుశా వెంకట్ ఇది జరిగిన వెంటనే ఒక **య్య కు ఫోన్ చేసి ఏ ఆసుపత్రిలో ఎలా చేరాలో కనుక్కుని వుంటాడు. చంద్రబాబు దీనిపై ఏంటో కిక్కుమనటం లేదు. గట్టిగా మాట్లాడితే వియ్యంకుడికే దెబ్బ అని కాబోలు.

ఎంతయినా పెద్దోల్లందరూ మంచోల్లు…పోలీసో్ల్లు పెద్దోల్ల తీపి గురుతులు.

2007-09-10 08:53 AM Madhavarao Tallapaneni - Comments for గుండె చప్పుడు...

vasundara garu meeru cheppinadi correct, alaa vaallu photos tiyyakoodadu kaani, media vallane aa matramu chalanamu avina vastunnadi adikaarikaganaaniki, leka pote vaallu aa marunaadu vastaaru, adi mana paristiti.

2007-09-10 07:58 AM vasundhara - Comments for గుండె చప్పుడు...

ఇంకొకరిని మర్చిపోయారు. న్యూస్ రిపోర్టర్లని. ఒక పక్క శిధిలాల్లో శవాలు ఇరుక్కుంటే సహాయం మాని పత్రికా విలేఖర్లు శవాల ముఖాలపై కెమేరా పెట్టి ఫొటోలు తీస్తున్న దృశ్యాన్ని వార్తల్లో చూసి నేనూ మా వారూ చాలా బాధపడ్డాం. శవాలతో వ్యాపారం చేయాలని రాజకీయనాయకులు అనుకుంటుంటే దానిలో భాగస్వామ్యం కావాలని మీడియా ప్రయత్నిస్తోంది.

2007-08-29
2007-08-29 06:34 AM Dil - Comments for గుండె చప్పుడు...

చదువరి గారూ,

ఒకసారి అలోచించండి. నేను చెప్పదల్చుకున్నది ఏమిటంటే తీవ్రవాదాన్ని కొన్ని చోట్ల ప్రత్యక్షంగా మరికొన్ని చోట్ల పరోక్షంగా పెంచి పోషిస్తున్నది అమెరికా. అంతెందుకు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఎక్కడ ఉంటున్నాడో అడ్రస్ తో సహా మన గూడచార ఏజెన్సీలు బయటపెట్టాయి. అలాంటివాడికి ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్ ను అమెరికా టెర్రరిజం పై పోరులో తన మిత్రదేశంగా ప్రకటించడం ఏమిటి? అమెరికాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే ముందు కనీసం ఇటువంటి కరడుగట్టిన తీవ్రవాదులను అప్పగించేలా తన మిత్రదేశంపై వత్తిడి తేవాలని షరతు పెట్టలేమా?

విదేశీ టెర్రరిస్టు బృందాలు స్థానికులను తమలో చేర్చుకునేందుకు అనేక పద్ధతులు ఉపయోగిస్తాయి. హిందువుల నుండి ముస్లిములకు చాలా ముప్పు ఉందనేది అందులో ఒకటి. దురదృష్టవశాత్తూ ఒక్కోసారి వారు చెప్పింది నిజం చేస్తారు మన వీర హిందూ మతోన్మాదులు. ఇక పేదరికం, నిరుద్యోగం వంటి సామాజిక సమస్యలు కూడా యువతను టెర్రరిజం వైపు మళ్లిస్తున్నాయన్నది ఇదివరకే రూఢి అయిన విషయం.

వ్యాధి ఏమిటో తెలుసుకుని దానికి మందెయ్యాలనేదే నా కోరిక. వ్యాధి లక్షణాలకు చికిత్స చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. ఇంకోలా చెప్పాలంటే ఆయుధం పట్టుకున్న చేతిని శిక్షించాలి. ఆయుధాన్ని కాదు.

2007-08-28
2007-08-28 06:10 AM చదువరి - Comments for గుండె చప్పుడు...

బాంబు దాడుల్లో చనిపోయింది అన్ని మతాల వాళ్ళూ.. నిజమే! కేవలం ఒక్క మతాన్నే లక్ష్యంగా చేసుకుని దాడి చేసారు అని ఎవరూ అనగా నే చూడలేదు. కానీ ఈ దాడులకు మోటివేమిటి? హేతువేమిటి? ప్రేరణేమిటి?

ఉగ్రవాదులకు మతమేమిటీ, కులమేమిటి అని అడగడం బానే ఉంటుంది. కానీ చంపేవాడెవడైనా చంపేందుకు కారణమేదో ఒకటుంటుంది. నక్సలైట్లకొకటి, మతవాద ఉగ్రవాదులకింకోటి. కానీ కారణమంటూ ఒకటుంటుంది. ఇస్లామిక ఉగ్రవాదానికి మతమే, మతబోధలకు వాళ్ళిచ్చుకునే భాష్యాలే పునాది అనేది కాదనలేం. ఉగ్రవాదం ఎక్కడో అఫ్ఘనులో పుట్టింది.. కానీ ఇక్కడ బాంబులెలా పేలాయి? వాళ్ళనిక్కడ దాచి, పోషించి, కాపాడి, సహకరించే - స్లీపర్లట, మాడ్యూళ్ళట, మోల్సట - వాళ్ళనేమనాలి? ఏంచెయ్యాలి? ఏంచెయ్యాలో తెలిసిన పోలీసులను ఏమీ చెయ్యనీయని రాజకీయాలనేమనాలి? చేదుగా ఉంటాయని నిజాల గురించి మాటాడకుండా బయటి దేశాలను అంటే పేలుళ్ళాగుతాయా?

అసలు ఎక్కడో అఫ్ఘానులోని ఉగ్రవాదులకు ఇక్కడి వారు సాయమెందుకు చేసారు? ఏమాశించి తమ ఊరిని తామే కాల్చేసి, తమ వాళ్ళను తామే పొట్టన బెట్టుకున్నారు? ఏదో ఒక మోటివుండాలి కదా.. ఏంటది? ముందు మన పక్కలో బల్లేలను, మన ఇంటి దొంగలను పట్టుకోవాలి.(థాకరేతో సహా) మన ఇల్లు చక్కబెట్టుకుంటే పరిస్థితులు అవే మెరుగౌతాయి.

2007-08-27
2007-08-27 05:12 PM నాగరాజా - Comments for గుండె చప్పుడు...

మిగతా బాంబుల్ని నిర్వీర్యం చేయడం కొంత ఉపశమనం. సెప్టెంబరు పదకొండుతో అమెరికాకు కూడా అమ్మకం వల్ల “లాభాలు” తెలిసివచ్చాయి. అమెరికాని, రాజకీయ నాయకుల్ని, పౌర-అక్కల నాయకుల్ని, పాత పద్ధతుల్ని వదిలేసి కొత్తగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయింది. “టెర్రరిస్టులను ఎదుర్కోవాలంటే మనం ఇక రొటీన్ కి భిన్నంగా ఆలోచించాలి” అని చక్కగా చెప్పారు…

2007-08-27 04:12 PM రవి వైజాసత్య - Comments for గుండె చప్పుడు...

వైద్యులు చల్లగా ఉండాలంటే జనాలకు రోగాలు రావాలి. అంత మాత్రం చేత వైద్యులే ఉండకూడదూ అంటారా ఏమిటి? ఆయుధాలు ఉండాలి, అమ్మేవాళ్ళు ఉండాలి. ఉపయోగించే వాడికీ కొంచెం బుర్ర ఉండాలి

పైకిబ్లాగులువ్యాఖ్యలువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish