2013-07-07
జాబిల్లి: అక్షరమే అమ్మ
2013-07-01
కొత్తపల్లి: కొత్తపల్లి e-పుస్తకం
కొత్తపల్లి పుస్తకాన్ని ప్రత్యేకమైన...
కొత్తపల్లి: కొత్తపల్లి డౌన్లోడులు
కొత్తపల్లి పత్రిక పిడియఫ్ ప్రతిని ఇక్కడినుండి...
2013-06-20
తెలుగు మాటలు: చింత చెట్టు దయ్యం
బాలయ్య పని మీద హడావిడిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ అడవి ఎంత తొందరగా దాటితే అంత మంచిదని పరిగెత్తినట్టే నడుస్తున్నాడు. ఉన్నట్టుండి మంత్రం వేసినట్టు ఆగిపోయాడు. భయపడినంతా అయ్యింది. చింత చెట్టు మీద దెయ్యం, చెట్టు కొమ్మలకి కోతి కొమ్మచ్చి ఆడుతోంది. బాలయ్యకి అడుగు ముందుకి పడట్లేదు, నోట మాట రావట్లేదు. ఎలా కనిపించిందో అలాగే మాయమయ్యింది దెయ్యం. క్షణం ఆలస్యం చెయ్యకుండా, వెనక్కి తిరిగి చూడకుండా పరుగందుకున్నాడు బాలయ్య. అడవి దాటే వరకూ ఆ పరుగాగలేదు.
అడవి దాటాక అక్కడ ఉన్న ఒక బండ రాయి మీద కూర్చుని ఊపిరి తీసుకున్నాడు. భుజం మీది తువాలు తీసుకుని చెమట తుడుచుకుని కళ్ళు తిరు గుతున్నట్లనిపిస్తే కాసేపు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచి చూసే సరికి మళ్ళీ చింత చెట్టు దగ్గర ఉన్నాడు. బాలయ్యకి ఏమీ అర్థం కాలేదు.
“తెలివి వచ్చినట్లుందే,” అని ఎవరో అనడంతో అటు తిరిగి చూశాడు.
ఆ మాటలన్న ముసలి అవ్వ బాలయ్య దగ్గరికొచ్చి, “ఏం నాయనా, అలిసి పోయినట్టున్నావు. ఆకలితో కూడా ఉండి ఉంటావు. కళ్ళు తిరిగి పడిపోయినట్లున్నావు. ఇటుగా వస్తూ నేను చూశాను కాబట్టి సరిపోయింది. నీళ్ళు తెచ్చి చిలకరిద్దామని చెరువు వైపు వెళ్తున్నాను ఇంతలో నీకు స్పృహ వచ్చింది. అదిగో ఆ చెట్టు పక్కనే నా గుడిసె ఉంది. వచ్చి నాలుగు మెతుకులు తిన్నావంటే ప్రాణం లేచొస్తుంది,” అంటూ తన గుడిసె వైపు నడిచింది. బాలయ్య ఆమెను అనుసరించాడు.
ఆకులో అన్నం వడ్డించి ముసలమ్మ పక్కన కూర్చుంది. “ఏం నాయనా, మీది ఏ వూరు? ఎటు వెళ్తున్నావేం? వెంట ఏమీ తెచ్చుకున్నట్టు లేవు?” అని అడిగింది అవ్వ. అప్పుడు గుర్తుకు వచ్చింది బాలయ్యకు, తన సంచీ తనతో లేదని. జరిగిందంతా అవ్వకి చెప్పాడు.
“దయ్యం లేదు, గియ్యం లేదు, శోష వచ్చి భ్రమపడి ఉంటావు. నీ సంచీ కాస్తా ఏ దొంగలో కాజేసి ఉంటారు,” అంది అవ్వ.
“ఈ రాత్రికి ఇక్కడే పడుకో నాయనా. తెల్లారి నీ పని మీద వెళ్దువు గాని,” అని, బాలయ్యకు బయట ఉన్న నులక మంచం చూపించింది అవ్వ. మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు బాలయ్య.
ఎండ చుర్రుమని పొడిచే సరికి లేచి కూర్చున్నాడు. చూస్తే అడవి బయట బండరాయి మీద ఉన్నాడు. భుజానికి ఉన్న సంచీ అలాగే ఉంది. అందులో తను తెచ్చుకున్న సరుకులూ, డబ్బులూ అలానే ఉన్నాయి. “బడలికతో నిద్రలోకి జారుకుని కల కని ఉంటాను,” అనుకుని లేచి నిలబడి బట్టలు దులుపుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. తనకి కావలిసిన పని ముగించుకుని సాయంత్రం అవుతోందనగా తిరుగు దారి పట్టాడు.
దారిలో అతనికి దానయ్య అనే అతను కనిపించాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ అడవిలోకి వచ్చారు. బాలయ్య తనకు వచ్చిన కల సంగతి చెప్పాడు. అప్పుడు దానయ్య తనకు జరిగిన అనుభవం ఇలా చెప్పాడు.
మొన్నటి రోజు దానయ్య ఈ అడవిలోనే అదే చింతచెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. చెట్టు మీద ఎవరో నవ్వడం వినిపించి చూస్తే అక్కడ ఒక దయ్యం తనను చూసి నవ్వుతోంది. దెయ్యాన్ని చూసిన భయంలో దానయ్య కాళ్ళూ చేతులూ వణక సాగాయి. ఇంతలోనే ఆ దయ్యాం కాస్త మాయమయ్యింది. అదే అదను అని లేచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు తీసి అడవిబయటకి చేరుకున్న దానయ్య శోష వచ్చి పడిపోయాడు. మెళుకువ వచ్చేసరికి చింత చెట్టు కిందే ఉన్నాడు. ముసలి అవ్వ కనిపించడం, బువ్వ తినిపించడం, మళ్ళీ పడుకుని లేచే సరికి అడవి బయట ఉండడం, అచ్చంగా బాలయ్యకు జరిగినట్టే జరిగాయి. అతనూ కల అనుకుని వదిలేశాడు.
ఇద్దరూ తమకి జరిగినవి నిజమైన అనుభవాలే అనీ, కల కాదనీ తెలుసుకున్నారు. చింత చెట్టు దయ్యం తమని ఆట పట్టించిందని తెలుసుకున్న వాళ్ళిద్దరూ ఒక పథకం వేసుకున్నారు. చింత చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు కింద తువ్వాలు పరుచుకుని కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. “ఆ మాంత్రికుడు బలే మంత్రం చెప్పాడు కదా?” అన్నాడు బాలయ్య. దానికి దానయ్య, “అవును ఈ సారి దయ్యం కనిపించగానే ప్రయోగిద్దాము,” అన్నాడు దానయ్య. “ఆ మంత్రం గానీ ప్రయోగించామా, ఇక ఆ దయ్యం మనం చెప్పినట్లు వినాల్సిందే” అన్నాడు బాలయ్య.
వాళ్ళ మాటలు విన్న దయ్యం నిజంగానే వాళ్ళకు ఏదో మంత్రం తెలుసనుకున్నది. “మరి దయ్యం కనిపించకపోతేనో?” అని అంతలోనే అనుమానం వెలిబుచ్చాడు బాలయ్య. “ఏముందీ, ఆకర్షణ మంత్రం వేస్తే అదే పరిగెత్తుకు వస్తుంది,” అన్నాడు దానయ్య.
దయ్యానికి ఇక భయం మొదలయ్యింది. వెంటనే చెట్టు దిగి వచ్చి వాళ్ళని ఏడిపించినందుకు గానూ బాలయ్యనూ, దానయ్యనూ క్షమించమని వేడుకుని వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తాననీ, తన మీద ఏ మంత్రమూ ప్రయోగించవద్దనీ వేడుకుంది. ఐతే అది ఇంక ఎప్పుడూ మనుషులకు కనిపించ కూడదనీ, ఎవ్వరి మీదా ఏ మాయలూ చెయ్యరాదనీ, ఒక వేళ అలా చేసినట్టు తెలిస్తే ఆకర్షణ మంత్రం వేసి రప్పించి బంధిస్తామనీ బెదిరించారు దానయ్యా, బాలయ్య. దయ్యం అలాగే అని ఒప్పుకుంది. ఆ తర్వాత అది ఎప్పుడూ ఇంకెవ్వరికీ కనిపించలేదు. ఆ తర్వాత ఎప్పుడూ, ఎవ్వరికీ ఆ అడవి గుండా వెళ్ళినప్పుడు విచిత్రమైన కలలు రాలేదు.
ఊళ్ళోకి వెళ్ళాక తాము దయ్యాన్ని ఎలా హడల గొట్టిందీ గొప్పగా చెప్పుకున్నారు బాలయ్య, దానయ్యా. కానీ వాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు? ఆ పైన ఆ దయ్యం ఎవరికైనా కనిపిస్తే కదా?
Filed under: కథలు
2013-06-19
తెలుగు మాటలు: పొంచి ఉన్న దయ్యం, పోయిన చోట ప్రత్యక్షం
రాము వాళ్ళ మామయ్య సుందరం ఊరినుంచి వస్తున్నాడంటే రాముతోపాటు అతని స్నేహితులందరికీ కూడా సంబరంగా ఉంటుంది. ఎందుకంటే సుందరం పిల్లలందరితో ఎంతో సరదాగా కాలక్షేపం చేస్తుంటాడు. కథలు చెప్తుంటాడు. సరదా పోటీలు పెడ్తుంటాడు. తను ఊళ్ళు తిరిగి చూసిన వింతలు, విశేషాలు చెప్తుంటాడు.
ఒకసారి అతను రాము వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక కథ చెప్పాడు. “ఇది చీకట్లో పారిపోయే దయ్యం కథ!” అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.
“నాకు చిన్నప్పుడు చీకటంటే చాలా భయం వేసేది. అప్పుడు మా అమ్మా నాలాగే చీకటంటే భయపడే దయ్యం గురించి చెప్పింది. ఆ దయ్యాన్ని మా అమ్మ చూసిందిట కూడా!” అని చెప్పి ఆగాడు సుందరం మామయ్య.
పిల్లలందరూ చప్పుడు చెయ్యకుండా చెవులు రిక్కించి వింటున్నారని గ్రహించి ఇంకా చెప్పసాగాడు.
“మా అమ్మకి అప్పుడు పదేళ్ళుట. అదేమో ఎండాకాలమట. ఒక రోజు ప్రొద్దున మా అమ్మమ్మ తనని కొట్టుకి వెళ్ళి ఏదో కొనుక్కు రమ్మని పంపారుట. అప్పటికే బాగా ఎండెక్కి ఉందిట. మా అమ్మేమో కులాసాగా చేతిలో ఉన్న డబ్బులు ఆడించుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నదల్లా గబుక్కున ఆగిపోయిందట. తను ముందుకి వెళ్తుంటే ఆ ఆకారం కూడా ముందుకి కదుల్తోందిట.”
“అప్పుడిక మా అమ్మ పరిగెత్తడం మొదలుపెట్టిందట. ఆ ఆకారం కూడా పరిగెడ్తున్నట్టే ముందుకి కదిలిందట. ఎలాగో మా అమ్మ కొట్టుకి చేరి కావలసిన సామాన్లు కొనుక్కుని వెనక్కి తిరిగే సరికి ఇంతవరకూ తన ముందున్న ఆకారం కనిపించలేదట. “అమ్మయ్య!” అని ఊపిరి పీల్చుకుని మా అమ్మ నిదానంగా నడుచుకుంటూ ఇంటికి చేరిందట. తీరా ఇల్లు చేరి లోపలికి వెళ్ళేలోపల వెనకనించి తన స్నేహితురాలు పిలిస్తే అటువైపు తిరిగిందట. అప్పుడు ఆ ఆకారం మళ్ళీ కనిపించిందట. ఆ రోజు రాత్రి మా అమ్మమ్మ వెలిగించిన కొవ్వొత్తి పట్తుకుని వెనక నిలబడితే మా అమ్మ ఆ వెలుగులో పెరట్లోంచి ఏదో తీసుకు రాబోయిందట. కొవ్వొత్తి వెలుగులో మళ్ళీ ఆ ఆకారం తన ముందు కనిపించిందట. మా అమ్మ ఏదో అనబోయేంతలో గాలికి కొవ్వొత్తి ఆరిపోయిందట. మరుక్షణమే ఆ ఆకారం మాయమయ్యిందట,” అని కథ చెప్పడం ఆపి నవ్వుతూ పిల్లలవైపు చూశాడు.
కుతూహలంతో “ఆ తర్వాత ఏమైంది?” అని అడిగారు పిల్లలు.
“ఏమో మరి. మా అమ్మ నాకు ఇంతవరకే చెప్పింది. ఆ తర్వాత నన్నొక పొడుపు కథ అడిగింది. దానికి జవాబు చెప్తే కథలో ఏమైందో కూడా తెలుస్తుందని చెప్పింది. మీరేమైనా ఆ పొడుపు కథ విప్పగలరేమో ప్రయత్నించండి,” అని ఆ పొడుపు కథ చెప్పాడు సుందరం మామయ్య,”పొంచి ఉన్న దయ్యం, పోయిన చోట ప్రత్యక్షం. ఏమిటది?”
పిల్లలందరూ గుసగుసలాడుకున్నారు. అందరూ కలిసి, “అది దయ్యం కాదు మామయ్యా, నీడ! వెలుగు ఎటువైపునుంచి వస్తుంటే దానికి వ్యతిరేక దిశలో నీడ పడుతుంది. చీకటిలో అసలు నీడే ఏర్పడదు, కదా?” అని అడిగారు.
“బలే పసిగట్టేశారే!’ అని మామయ్య అభినందిస్తుంటే పిల్లలు మాత్రం, “మాకు దయ్యం కథ చెప్తానన్నావు. అంతా ఉత్తిదే. ఇప్పుడు నిజంగా దయ్యం కథ చెప్పాల్సిందే” అని పట్టుబట్టారు. “దయ్యాలంటే నాకు భయం!” అంటూ సుందరం మామయ్య అక్కడ్నుంచి తప్పించుకున్నాడు.
Filed under: కథలు
2013-06-17
జాబిల్లి: స్వేచ్ఛ
2013-05-23
పాఠశాల: తాబేలు-కుందేలు
2013-05-21
పాఠశాల: జనగణమణ
2013-05-05
బాల కళ: 'తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ '
2013-04-11
Prabhava ప్రభవ: ఇదిగిదుగో ఉగాది !
2013-03-10
Prabhava ప్రభవ: We Did It !
2012-08-20
బాల కళ: స్పాట్ పెయింటింగ్ మరియు ఆధునిక ,సాంప్రదాయ వాయిద్యాల పోటి
2012-03-21
mamcimaata: hyma1947
ఒకే శ్రోత
ఒక మారు ఒక పండితుడు కంచిలోని శంకరాచార్యులవారి వద్దకు వెళ్ళి , భక్తి తో నమస్కరించి
” స్వామీ ! నేను గొప్ప పండితుడ్ని.భగవద్గీత ప్రవచనం చేయడంలో పేరు పొందినవాడిని.ఇంతవరకూ వేయి ప్రవచనాలు చేశాను . తమరు అనుగ్రహిస్తే ఈ శంకర మఠంలో భాగవద్గీత ప్రవచనం పద్ధెనిమిది రోజులపాటు చేయాలని సంకల్పించి వచ్చాను.అనుగ్ర హించగలరు.” అని విన్నవించుకున్నాడు.
ఆచార్యులు చిరునవ్వుతో ” దాందేముంది తప్పక ప్రవచించు ,నేను ఒక పక్షంపాటు యాత్రలకు వెళ్ళవలసి ఉంది.నీవు నిర్విఘ్నంగా నీపని కానీ.” అని చెప్పి ఆచార్యులు మఠం విడచి యాత్రలకై బయల్దేరారు.
మన పండితుడు ఆరోజున మహదానందంగా భగవద్గీత ప్రవచనం మొదలుపెట్టారు. పద్దెనిమిది రోజులూ ఇట్టే గడచిపోయాయి. ఆచార్యులవారు యాత్రలు ముగించుకుని వచ్చారు.పండితుడు వెళ్ళి ఆచార్యుల పాదాలకు నమస్కరించగా ” ఏం ! నాయనా! నీ భగవద్గీత ప్రవచనం నిర్విఘ్నంగా సాగిందికదా! ఏ ఇబ్బందీ కలుగ లేదు కదా!నేను సమయానికి లేకుండా వెళ్ళవలసి వచ్చింది నాయనా! ” అని పలుకరించారు.
” స్వామీ మొదటిరోజు శ్రోతలు బాగానే వచ్చారు.క్రమంగాతగ్గి చివరకు ఒక్కరుమాత్రమే మిగిలారు స్వామీ ! నాశ్రమంతా వృధా ఐంది ,అదే నాబాధ !” అని చెప్పాగా , ఆచార్యులవారు ” నాయనా ! శ్రీకృష్ణ భగవానులవారు గీత బోధించినపుడు విన్నది అర్జునుడు ఒక్కడేకదా!నీలా ఆయన బాధపడినట్లు లేదే!” అన్నారు . పండితుడి అహంకారం వదలి తలదించుకున్నాడు,ఆచార్యులవద్ద తాను మహా పండితుడినని చెప్పుకున్నoదుకు ——————-
2012-02-10
For Kids: ఇరుక్కున్న ముక్కు
For Kids: వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము
2012-02-09
mamcimaata: vinayaka vandanam
బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు.
———————
బొజ్జగణపా! నీకు పొర్లుదండాలు…
బుజ్జిగణపా! నీకు కోటిదండాలు.
1. సాక్షి గణపా !నీకు సాష్టాంగ దండాలు
విద్య గణపా! నీకు వేయిదండాలు
వీర గణపా !నీకు వేవేల దండాలు
సుగుణ గణపా ! నీకు చాలదండాలు .
2.పార్వతీ బిడ్డడా! పాదదండాలు
శివునితనయా !నీకుశిరసు దండాలు
శ్రవణసోదర !నీకు సహస్రదండాలు
దేవపూజ్యుడ ! నీకు దొడ్డ దండాలు .
3. విఘ్న వినాశక! నీకు వీరదండాలు
శతృ విజేయా ! శతకోటిదండాలు
ఏకదంతుడ !నీకు ఏకాగ్రదండాలు
అగ్రపూజ్యుడ !నీకు అరకోటిదండాలు .
4. సిధ్ధిగణపా ! నీకు సర్వదా దండాలు
బుధ్ధిగణపా! నీకు బోలెడు దండాలు
గంగపుతృడ !నీకు గంపెడు దండాలు
గణనాధుడా! నీకు నీ గుడి చుట్టు దండాలు .
దండాలు! దండాలు !దండాలు !దండాలు!.
2011-08-04
పిట్ట కథలు: గోపయ్య నల్లనా.. ఎందువలనా?
2011-05-07
పిట్ట కథలు: చిట్టెలుక - కొత్త కలుగు
2011-04-05
పుస్తకం » Focus-ChildrensLit: Christopher Paolini – Inheritance Cycle
2011-03-19
పుస్తకం » Focus-ChildrensLit: And then what happened, Paul Revere?
2011-02-11
పుస్తకం » Focus-ChildrensLit: అగ్నిమాలా, మృత్యులోయా…
2011-01-06
పుస్తకం » Focus-ChildrensLit: చిన్నప్పటి రష్యన్ కథలు
2010-12-17
ఆహా! ఓహో!: కొత్తపల్లి పత్రిక డిసెంబరు సంచికలో నా కథ! – జారు బాబూ!
2010-09-27
ఆహా! ఓహో!: పగలే వెన్నెలా - పరవశమాయెగా!
2010-07-05
పుస్తకం » Focus-ChildrensLit: పిల్లల కోసం పుస్తకాలు…
2010-06-27
బాల సాహిత్యం: ప్రణాళిక-క్రమశిక్షణ
బాల సాహిత్యం: ఈగలమోత
2010-05-16
మడత పేజీ: ఏమిటీ శబ్దం ?
2010-05-13
మడత పేజీ: తకిట తరికిట
2010-02-27
పుస్తకం » Focus-ChildrensLit: రెండు బాలల పుస్తకాల గురించి..
2010-02-26
పుస్తకం » Focus-ChildrensLit: పిల్లలు, పుస్తకాలు, నా అనుభవాలు
2010-02-24
పుస్తకం » Focus-ChildrensLit: తకిట తరికిట
2010-02-20
పుస్తకం » Focus-ChildrensLit: నాకు పరిచయమైన బాలల సాహిత్యం
2010-02-15
పుస్తకం » Focus-ChildrensLit: అద్భుత చిత్రగ్రీవం
2009-07-26
పిట్ట కథలు - అభివృద్ధి కథలు: ఇంకొక ద్రిమ్మరి
పిట్ట కథలు - అభివృద్ధి కథలు: ఇద్దరు వేటగాళ్లు
2008-09-16
పిల్లలు-బంధానికి అర్ధాలు: వీళ్ళు ఎంత busy
పిల్లలు-బంధానికి అర్ధాలు: sahiti itihas
2007-11-13
Kids World ~ బాల ప్రపంచం: Kid Stories (English)
2007-08-29
Kids World ~ బాల ప్రపంచం: Kid Stories (English)
2006-07-04
తెలుగులో బాల సాహిత్యం: తెలుగులో బాల సాహిత్యం
super vimal kumar garu.
chala bagundhi nirajagaru thankq
ధన్యవాదాలు
చిన్న పిల్లలు బాగా ఆనందిస్తారు. వాళ్ల మెదడుకి మేత కూడ పెట్టారుగా?! ద హ
good collection
Awesome but i want remaining
Hi, this is a comment.
To delete a comment, just log in, and view the posts’ comments, there you will have the option to edit or delete them.