2013-07-19
BHASKAR: ||ప్రయత్నం||
2013-07-18
అనువాదలహరి: This Night… Nishigandha, Telugu, Indian
Effacing the last trace of cloudlets
Darkness congeals.
Jasmines of the sky blossom one after another
Whether to trade few pleasantries
Or to pursue the dreams adrift
Deftly sieging the swoons of
Cheery butterflies within the bungled hands
I must gently introduce him soundlessness…
Leaving the shards of memories,
The remotest dreams,
And the toils of the day
For themselves for the moment
I long to live this night!
Instead of coursing through within
I must move off from myself…
Shredding and strewing
The immutable gravity of fears
And must float lighter and lighter…
As the chalky design in the fore yard,
That lay snug all through the day
Started pandiculating
For the occasional whiff of breeze…
I must initiate into my ABC’s for a while
With the Coral Jasmines
Scattered through the yard.
Throwing open the blinds of heartaches
I must kiss him
For five minutes …in the least …
And introduce this gentle night!
Under the breezy skies
The wild flowers scissor the winds…
A hearty touch caresses the palm
And there it is…
The warmth left by the lamp just extinguished …
A reassurance for this night!!!
But
Before a dash of light dabs me to waking
I must live this night to my heart’s content!!!
.
Nishigandha
.
Kiran Yalamanchi, more popular by her pen name Nishigandha, was born and brought up in Vijayawada, Andhra Pradesh. She is an engineer by profession and is currently living in USA. In her own words: “Poetry is my invisible friend stands right next to me and holds my hand in every emotional stage! I don’t publish a lot but I do write more often.. almost everyday.”
She is a blogger since July 2007 running her blog మానసవీణ ( http://nishigandha-poetry.blogspot.com/ )
.
ఈ రాత్రి…
మబ్బుతునకల ఆఖరి చారికను అదృశ్యం చేస్తూ
చీకటి చిక్కపడుతుంది..
ఆకాశమల్లెలు ఒక్కొక్కటిగా విరబూస్తాయి
నాలుగు మాటలు చెప్పుకోడానికో
లేక తప్పిపోయిన కలల్ని వెదుక్కోడానికో!
కేరింతల సీతాకోకచిలుకల కలవరింతల్ని
గాజుల చేతుల కింద పొదవిపట్టేసి
నిశ్శబ్దాన్ని మృదువుగా పరిచేయాలి..
జ్ఞాపకాల శకలాలనీ.. సుదూర స్వప్నాలనీ
పగటి పాట్లనీ
వాటంతట వాటికి వదిలేసి
ఈ రాత్రిని జీవించాలని ఉంది!
నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి!
పగలంతా ఒద్దికగా కూర్చున్న ముగ్గు
ఉండుండి వీచేగాలికి
వళ్ళు విరుచుకుంటుంటే..
వాకిలి పొడవునా రాలిన పారిజాతాలతో
కాసేపు అక్షరాభ్యాసం చేసుకోవాలి!
మనస్థాపాల మసకతెరలని తప్పించి
అతన్ని ఐదునిమిషాలన్నా
చుంబించాలి…
ఈ నింపాది రాత్రిని పరిచయం చేయాలి!
వీచే నింగి కింద
గాలిని కోస్తున్న గడ్దిపువ్వులు…
అరచేతినంటిన ఆత్మీయపు స్పర్శ…
ఇదిగో.. ఇప్పుడే కొండెక్కిన దీపం వదిలిన వెచ్చదనం..
ఈ రాత్రికో భరోసా దొరికినట్లే!
గుప్పెడు వెలుగు ముఖాన్ని తట్టి లేపేలోగా
ఇక ఈ రాత్రిని పూర్తిగా జీవించాలి!!
.
- నిషిగంధ
Filed under: అనువాదాలు, కవితలు Tagged: 21st Century, Nishigandha, Telugu, Woman
సాహితీ-యానం: స్వప్నమునందు నిదురుంచువారు ధన్యులు…..
2013-07-17
అనువాదలహరి: చావూ-బ్రతుకూ .. ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్, అమెరికను
ఫాదర్! జీవితం అంటే ఏమిటి?
“అది ఒక పోరాటం, బిడ్డా!
అందులో ధృఢమైన కత్తి కూడా పనికిరాకపోవచ్చు,
జాగరూకతగల కళ్ళు కూడా మోసపోవచ్చు
దిటవైన హృదయమైనా ధైర్యం కోల్పోవచ్చు.
అక్కడ అన్నిచోట్లా శత్రువులు చేతులుకలిపి
రాత్రీ పగలూ విశ్రమించరు.
పాపం అర్భకులైనవాళ్ళు ఎదురునిలిచి
భీకరపోరాటం మధ్యలో చిక్కుకుంటారు.
ఫాదర్! మృత్యువంటే ఏమిటి?
అది విశ్రాంతి, బిడ్డా!
బాధలూ, పోరాటాలూ ముగిసేక
సాధువూ, శాంతస్వభావుడైన దేవదూత
ఇక మనం పోరాడే పనిలేదని ప్రకటిస్తాడు;
అతను రాక్షసమూకలని తరిమివేసి,
యుద్ధపు హోరును ఆపమని శాసిస్తాడు.
బలహీనమై చేతిలోనుండి వాలుతున్న జండాలనీ,
ఆయుధాలనీ తీసుకుని శాశ్వత శాంతిని ప్రసాదిస్తాడు.
“నన్ను మరణించనీండి, ఫాదర్! ఆ భయంకరమైన
బాధలకీ తల ఒగ్గాలంటే నాకు భయంతో వణుకుపుడుతోంది.”
“తల్లీ, ఈ జీవిత రణరంగంలోనే
స్వర్గానికి కిరీటాన్ని గెలుచుకోవాలి;
బిడ్డా! నీ శత్రువులు బలవంతులూ, ఆరితేరినవారైనా
అతనికి బలహీనులూ, సామాన్యులంటేనే ప్రేమ.
దేవదూతలందరూ ఇప్పుడు నీ పక్షంలో ఉన్నారు
భగవంతుడు అందరికీ ప్రభువు.
.
ఎడిలేడ్ ఏన్ ప్రోక్టర్
(30 October 1825 – 2 February 1864)
అమెరికను.
.
LIFE AND DEATH.
What is Life, Father?”
“A Battle, my child,
Where the strongest lance may fail,
Where the wariest eyes may be beguiled,
And the stoutest heart may quail.
Where the foes are gathered on every hand,
And rest not day or night,
And the feeble little ones must stand
In the thickest of the fight.”
”What is Death, Father?”
“The rest, my child,
When the strife and the toil are o’er;
The Angel of God, who, calm and mild,
Says we need fight no more;
Who, driving away the demon band,
Bids the din of the battle cease;
Takes banner and spear from our failing hand,
And proclaims an eternal Peace.”
”Let me die, Father! I tremble and fear
To yield in that terrible strife!”
“The crown must be won for Heaven, dear,
In the battle-field of life:
My child, though thy foes are strong and tried,
He loveth the weak and small;
The Angels of Heaven are on thy side,
And God is over all!
.
Adelaide Anne Procter
(30 October 1825 – 2 February 1864)
American
Filed under: అనువాదాలు, కవితలు Tagged: Adelaide Anne Procter, United States
2013-07-16
BHASKAR: తొక్కలు -7
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ప్రేమిస్తూనే
2013-07-15
ఏకాంతం: లాలి - ఊగూ ఉయ్యాల
2013-07-14
sowmyawrites .... » Books-Telugu: శ్రీపాద వారికి అన్నగారి సలహా
శ్రీపాద వారికి వారి పెద్దన్న గారు ఇచ్చిన సలహా ఇది. అదివరలో చదివినప్పుడు ఆట్టే గమనించని కొన్ని ఇప్పుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి నాకీ పుస్తకంలో. నా విషయంలో ఇలా జరగలేదు కానీ, ఈ విషయం ఆలోచించదగ్గది!
****
“..గుణదోషాల సంగతి అలా ఉంచు. ఆ పద్యాల బంధం వదులు వదులుగా వుంది గాని బిగువుగా లేదు. ఆదిలోనే అలాంటి తేలిక పుస్తకాలు చదివితే సాహిత్యంలో మంచి ప్రవేశమూ కలుగదు, సరి అయిన రుచీ ఏర్పడదు. కనక ముందు నన్నయ భారతం చదువు. తరవాత మొదటి మూడాశ్వాసాలూ మనుచరిత్ర చదువు. అలాగే పారిజాతాపహరణమున్నూ పూర్వార్థం చదువు. తరవాత శృంగార నైషధం తప్పకుండా చదువు. దాంతో, సరిగా అవి అర్థం అయినా కాకపోయినా, గంభీర రచనలమీద నీకు ఆదరభావం కలుగుతుంది, దృఢపడుతుంది. అప్పుడు అర్థం సాధించాలన్న దీక్ష దానంతట అదే పుడుతుంది. పద్యబంధంలో వుండే బిగువు బోధపడుతుంది. ఆ వరసనే తిక్కన్న భారతం చదవాలి. తెలుగులో నీకు మంచి అభిరుచీ, సాహిత్యమూ కలగాలంటే యిది సరియైన పాఠ్యక్రమం”
2013-07-13
తెలుగు తూలిక: ఊసుపోక – సంకలించడం ఓ శ్రమ
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): రాత్రంతా వర్షం కురుస్తోంది
Telugu Anuvadam | తెలుగు అనువాదం: వెదురు వంతెన
నా అనువాద కథల మూడవ సంకలనం “వెదురు వంతెన” ఇప్పుడు ఈ-బుక్ గా కినిగెలో లభిస్తోంది.
* * *
ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ప్రముఖ రచయిత, అనువాదకులు శ్రీ రంగనాథ రామచంద్రరావు ఇలా అన్నారు:
“ఈ కథలు చదివిస్తాయి. ఆలోచింపజేస్తాయి. వెంటాడుతాయి. కోపాన్ని తెప్పిస్తాయి. కంటతడి పెట్టిస్తాయి. కొన్ని కథలు నివ్వెరపోయేలా చేస్తాయి. పుస్తకం తెరిచి ఈ అనువాద కథలను మీరు చదవటం ప్రారంభించిన వెంటనే అందులో మీరు లీనమవుతారు. అందుకు కారణం కొల్లూరి సోమ శంకర్ ఎన్నుకున్న కథలు, అందుకు ఆయన అనుసరించిన శైలి.
ఇక అనువాదాల విషయానికి వస్తే ఈ అనువాదాలన్నీ సరళంగా, సాఫీగా, క్లుప్తంగా, సొంత కథల్లా తెలుగుతనంతో కూడుకుని పాఠకుడిని వెంటనే ఆకట్టుకుంటాయనటంలో సందేహం లేదు.
ఈ సంకలనంలోని ప్రతీ కథా ఏదో ఒక ప్రత్యేకత కలిగినటువంటిది. వైవిధ్యభరితమైన ఈ కథల్ని చదవటం ఒక అనుభవం. చదివిన వెంటనే మొదట్లో సాధారణంగా ప్రారంభమైన కథలు చివరికి వచ్చేసరికి తల దిమ్మతిరిగేలా చేస్తాయి.
ఈ సంకలనం గుండెల్ని తడుతుంది. ఈ కథలు ఎవరికి వారు చదివి అనుభూతి చెందవలసిందే.”
* * *
మంచి కథలున్న ఈ పుస్తకం కొరకు ఈ క్రింది లింక్‌ని అనుసరించండి.
వెదురు వంతెన On Kinige
2013-07-11
తెలుగు తూలిక: తల్లివేరు
కలానికి అమావాస్య...కాగితానికి పౌర్నమి....: (శీర్షిక లేదు)
2013-07-10
మానస వీణ: ప్రభు నువ్వే నువ్వే
అంతటా అన్నిటా ప్రభు నువ్వే నువ్వే
అణువూ అణువువై నువ్వే విడివడి
భిన్న రూపాలలో మళ్లీ కలిసి
సుందర జగమే రంగస్థలిగా ॥ అంతటా ॥
సంద్రం నుంచి ఎగసే కెరటమై
ఉరిమే మేఘమై కురిసే వర్షమై
నదులూ చెరువులూ జలపాతాలుగా
ఎన్ని రూపాలున్నా అది నువ్వే నువ్వే ॥ అంతటా ॥
మట్టిలో రేణువై మహా పర్వతమై
విత్తులో సారమై విష కంటకమై
శాంతివై కాంతివై మహా ప్రళయమై
ఎన్ని రూపాలున్నా అది నువ్వే నువ్వే ॥ అంతటా ॥
2013-06-30
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): మళ్ళా పోగొట్టుకున్నానని ఎలాచెప్పను
2013-06-29
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): కలేనా???....
2013-06-26
Telugu Anuvadam | తెలుగు అనువాదం: ఈ కథని నేనెందుకు అనువదించానంటే… 3
“నాన్నా!! తొందరగా వచ్చేయ్” అనే నా అనువాద కథల ఈ బుక్ లోని మూడవ కథ “వాళ్ళిద్దరూ, ఆటో డ్రైవరు” గురించి చెబుతాను.
మూలకథని ఆంగ్లంలో విక్రమ్ కపూర్ రాసారు. “Another’s Wealth” అనే శీర్షిక గల ఈ కథ 27 ఆగస్టు 2006 నాటి ది హిందూ దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. ఆడపిల్లలు భారమని భావించి, తన భార్యని బలవంతంగా అబార్షన్ చేయించడానికి బయల్దేరిన ఓ యువకుడి ఆలోచన విధానాన్ని ఓ ఆటో డ్రైవరు మారుస్తాడు. కథ ఇతివృత్తం చిరపరిచితమైనదైనా, కథనం కొత్తగా ఉండడంతో, ఈ కథని అనువదించాలని నిర్ణయించుకుని, ది హిందూ వారికి ఈ-మెయిల్ రాసి రచయితని పరిచయం చేసుకున్నాను. 31 ఆగస్టు 2006 నాడు తెలుగు అనువాదానికి అనుమతి కోరాను. చిత్రంగా నేను కోరిన పది రోజుల తర్వాత, సత్యప్రసాద్ అనే మరో తెలుగు అనువాదకుడు ఈ కథని అనువదించడానికి రచయితని అనుమతి కోరారు. మూలరచయిత నాకు cc చేస్తూ, నాకప్పటికే అనుమతి ఇచ్చేసానని సత్యప్రసాద్ గారికి మెయిల్ చేసారు.
ఈ కథని అనువదించాక, వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురణార్ధం పంపగా, 12 నవంబరు 2006 నాటి సంచికలో ప్రచురించారు. తెలుగు అనువదానికి, ‘పరాయి సొత్తు’, ‘ఆడ’ పిల్ల… లాంటి పేర్లు పరిశీలించినా, చివరికి, “వాళ్ళిద్దరూ, ఆటో డ్రైవరు” అనే పేరుని ఖాయం చేసాను. కథ పేరు, కథని చదవాలనే కుతూహలాన్ని కలిగిస్తుందని నా నమ్మకం.
అయితే ఈ కథలో ఆడపిల్లని ఆ తండ్రి వద్దనుకున్నదీ, భార్యకి అబార్షన్ చేయించాలనుకున్నదీ నేరుగా చెప్పడు. మొత్తం విషయమంతా సూచనాప్రాయంగానే ఉంటుంది.
వీరెక్కిన ఆటో డ్రైవర్ మాటల సందర్భంలో తన కూతురి గురించి చెప్పుకొస్తాడు. మొదట ఆడపిల్ల పుట్టినప్పుడు తాను దేవుడిని తిట్టుకున్నానని, అందరు తనపై తెగ జాలి చూపించారని వాపోతాడు. కానీ శాపం అనుకున్న ఆ పాపే అతనికి వరమైన తీరుని చక్కగా వివరిస్తాడు. అదంతా విన్న ఆ భర్త తన గమ్యస్థానం చేరుకున్నా, ఆటో దిగడు. తాము మనసు మార్చుకున్నామని, తమని బయల్దేరిన చోటే దింపేయమని ఆటో డ్రైవర్ని కోరుతాడు. భార్య సంతోషంతో, భర్త చేతిని తన చేతిలోకి తీసుకోడంతో ముగుస్తుంది.
చివరిదాక ఆసక్తిగా చదివించే కథ ఇది.
* * *
నాన్నా!! తొందరగా వచ్చేయ్ On Kinige
2013-06-23
సురుచి: మహాపురుషుడు
2013-06-19
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): నిద్రను త్రాగి
2013-06-16
అక్షర శిక్షలు!: ఉన్నట్టుండి ఏమిటో…
చిన్నసినిమాలతో ఒక సమస్య ఏమిటంటే అవి ఒడిదుడుకులు తట్టుకుని విడుదల దాకా వస్తాయన్న గ్యారంటీ లేదు. అప్పుడు ఆ సినిమాలకి రాసిన మంచి పాటలు కూడా మరుగైపోతాయి. ఇలాంటి ఒక పాట గుర్తోస్తోంది…
సందర్భపరంగా అమెరికా లోని NRI హీరో, తనకి నచ్చిన అమ్మాయి దొరక్కపోతుందా అని ఇండియాకి వస్తాడు. అమెరికాలో అందగత్తెలకీ, వగలాడులకీ కొదవ లేదు కానీ, తన వయసుని మురిపించే వాళ్ళే తప్ప మనసుని వెలిగించే వాళ్ళు కనబడలేదు. ఇండియాలో ఓ అమ్మాయి బస్సులో తారసపడుతుంది. ఎంతో అందంగా, ఇంకా చెప్పాలంటే సెక్సీగా ఉండడంతో ఒక ఆకర్షణ కలుగుతుంది. కానీ వివేకం హెచ్చరిస్తూనే ఉంది, ఇది నీ మార్గం కాదు, నువ్వు మనసుని వెతుక్కుంటూ వచ్చావ్ అని. ఈ సందిగ్ధంలో పుట్టిన పాట.
గొప్ప ట్యూన్ ఉంటే మాములుగా రాసినా పాట గొప్పగానే అనిపిస్తుంది. ట్యూన్ ఇవ్వకుండా రాయండి అంటే నేను చాలామటుకు నోటికొచ్చిన ట్యూన్లకి రాస్తాను, అయితే కొన్ని సార్లు నాలోని శూన్యాన్ని దాటడానికి సంగీతపు శక్తి కావలసి వస్తుంది. అప్పుడు ఏ రెహ్మాన్ పాటో, ఇళయరాజా పాటో తీసుకుంటాను. ఏ పాట తీసుకోవాలి అన్నది దానంతట అదే స్ఫురిస్తుంది, ఏమిటో! అలా స్ఫురించిన పాట “దిల్సే” చిత్రంలోని “జియా జలే” అన్నది. నిజానికి ఈ హిందీ గీతం శృంగార పరమైంది, అమ్మాయి పాడేది. ఈ సందర్భం కొంత ఫిలాసఫీతో కూడుకున్నది, పైగా అబ్బాయి పాడేది. అయితే ఆ ట్యూన్లో ఈ భావం కూడా పలుకుతుందని నా మనసుకి అనిపించింది.
సరే “జియా జలే” ట్యూన్ తీసుకుందాం, కానీ ఏమి రాయాలి? ఆ పాటని హిందీలో రాసినది గుల్జార్ మహాకవి. నాకు హిందీ బొత్తిగా రాకపోయినా, నాకు తెలిసిన హిందీ పాటలు చాలా తక్కువే అయినా, నేను విన్నంతలో, అర్థమైనంతలో గొప్పగా నచ్చిన కవి గుల్జార్. గుల్జార్‌కి హిందీ రాని పెద్ద ఫ్యాన్‌ని నేను! గుల్జార్‌ని తలచుకుంటేనే ఒక విధమైన ప్రేరణ కలుగుతుంది. అలా పల్లవి వెంటనే పుట్టింది. మిగతా పాట కూడా ఒక భావధారలా అలా వచ్చేసింది ఒక అరగంటలో. రాశాక చూసుకుంటే పెద్ద కవిత్వం కానీ, సాహితీ విశేషం గానీ ఏమీ లేవు. అయినా ఇది నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఇదొకటి. మనసులోంచి పుట్టింది కాబట్టే మనసుకి నచ్చింది అనిపిస్తుంది.
ఉన్నట్టుండి ఏమిటో ఏమిటో
చూపులే మాటాడెలే
అందమే నవ్విందిలే
అంతట్లో నాగుండె జారిందే మరి
|| ఉన్నట్టుండి ఏమిటో ||
ఇంతవరకూ కన్నులే చూడలేదా సోయగం
తనని చూస్తే ఎందుకో వింతగా ఈ కలవరం
గుండె సడిదా వయసు వడిదా
రేగుతున్న పులకరం
నేను కలలో గీసుకున్న
చిత్రమేనా ఈ నిజం
తెలియదే తెలియదే
కాని మది కోరిందిలే!
|| ఉన్నట్టుండి ఏమిటో ||
తరుగుతున్న దూరమే తరుముతోందా నన్నిలా ?
చేతికందే జాబిలీ పంచుతుందా వెన్నెలా?
ముందు అడుగా వెనక అడుగా
తేలదే ఈ తికమకా
ఏది నాదో ఏది కాదో
చెప్పరెవరూ పోలిక
అందమా హృదయమా
నిర్ణయం నాదే ఇక
|| ఉన్నట్టుండి ఏమిటో ||
Filed under: గేయాలు, Situational songs
2013-06-15
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): జీవితంలో వస్తూపోయే జీవనచక్రం
2013-06-04
ఇంద్రధనుస్సు: పద్యసంభాషణ
ఏకాంతం: లాలి - రేవగలు
2013-06-02
ఇంద్రధనుస్సు: రావణాసురుని ఆశ్చర్యం
2013-05-27
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): వర్షం…నీటి దారాల కండె -తుమ్మల దేవరావు కవిత
2013-05-21
కలానికి అమావాస్య...కాగితానికి పౌర్నమి....: (శీర్షిక లేదు)
2013-05-17
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): ఫెంటోలు నా ఆలోచన
2013-05-10
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): వేకువనే మోకరించే ఆమె
2013-05-04
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): క్షణికమైన భయం మాటున వొదిగి
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): చిట్టి పాదాలు
2013-04-30
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): అనుకరణ గురించి ఏమైనా చెప్పగలరా?
2013-04-27
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): తెల్లవారు జామున
2013-04-26
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): తెల్లవారు జామున
2013-04-25
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఆకుపచ్చని సంకేతం
2013-04-24
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): అతికి పోతే.....
పడమటి గోదావరి రాగం.: ఇల్లాలి సన్యాసం..
సాహితీ-యానం: ఊడుపు
2013-04-16
సురుచి: బొస్టన్ లొ బాంబులు
2013-04-14
పడమటి గోదావరి రాగం.: కాలక్షేపం
2013-04-11
మడత పేజీ: ఉగాది మొదలయినట్టే...నా !
2013-04-07
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): There is total silence now - నిశ్శబ్దం ఆవరించింది
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): దుఃఖపుధ్వని
2013-04-03
మడత పేజీ: ఇంతింతై మేమింతై..
2013-04-02
సురుచి: నిన్న వేసిన చిత్రం
2013-04-01
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): జీవితమంటే
2013-03-31
తెలుగు కథలు పద్యాలు: స్వర వరద
ఏ కమ్మని ఊట
ఆ గొంతుబీజాన్ని తడిపి సేద దీర్చిందో!
గంగా? గోదావరా? కృష్ణా? తుంగభద్రా?
నాలోనూ తీగలు సాగుతోంది ఈ పాట.
నావెర్రిగాని, ఇది నాదా? నాదానిది గాని.
ఎన్ని గొంతులు ఆ తడిలో కలిసిపోయేయో!
ఇంకెన్ని తీర్థాలు తనలో ఇముడ్చుకుందో
ఎన్ని పైరగాలులు … ఎన్ని తూర్పారలు
ఎన్ని ఆర్తనాదాలు— ఎన్ని ఆత్మక్లేశాలు
తనలో నిక్షిప్తం చేసుకుందో!
ఈ కాఫీ… ఏ ప్రేయసి మనో వేదనో
ఈ భాగేశ్వరి ఏ ప్రియుని పలవరింతో
ఈ కళ్యాణి ఏ ముగ్ధవధూ మంజీరనాదమో
ఈ భూపాలమే ఉషస్సులకు మేలుకొలుపో
ఈ స్వరఝరికి ఇన్ని మెరుగులెక్కడివి?
ఈ గళవిపంచికిన్ని పదభంగిమలెక్కడివి?
చిమ్మచీకటితోనూ, చిరుదివ్వెతోనూ పొత్తే
పెనుతుఫానుతోనూ, పిల్లగాలితోనూ ఊసులే.
ఇది ధ్వనా? తరంగమా? రసప్రవాహమా?
ఒడ్డున ఉండగలిగినవాళ్లనెవరినైనా అడిగిచూడాలి.
2013-03-29
తెలుగు కథలు పద్యాలు: ఇసుకతిప్ప
నది మోసుకొచ్చే ఇసుకలా
ఆవేశంతో మనం మోసుకువచ్చే విశ్వాసాలే
మన పరగతికి ప్రతిబంధకాలవుతాయి.
వయసుబిగిలో అవి అవధులుతాకిన ఆనందమిచ్చినా
గ్రీష్మతాపంలాంటిజీవనపోరాటంలో
నమ్మకాల తడి అరిపోతూ,
విశ్వాసం నీటిపాయలా సన్నగిలిపోతుంది.
అటకమీది రాగి పాత్రకి కిలుం పట్టినట్లు
జీవితానికి ఎరకాని నమ్మకాలకి కూడ
ఒక్కోసారి కిలుం పడుతుంది.
అందుకనే సమాజపు ప్రయోగశాలలో
వాటిని నిత్యం పరీక్షించుకుంటూ ఉండాలి.
నూతిలోంచి కవ్వుతీసినట్టు
బలిసిపోయిన మూఢనమ్మకాలని తవ్వి అవతల పొయ్యాలి.
మహోన్నతవ్యక్తిత్వాల వరదస్పర్శ అస్తమానం రాదుకదా!
Naa Kavitha: (శీర్షిక లేదు)
2013-03-20
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): కష్టమై పోతుంది
2013-03-19
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): సుహానీ రాత్ డల్ చుకీ
Rama,
Thanks for the comments!
Phani
Gulzar is always wow !! It is a delight to understand his lyrics…..
మీ బ్లాగుని “పూదండ” తో అనుసంధానించండి.
http://www.poodanda.blogspot.com
thanks amdi
funny story
Good one. http://www.screentalent.wordpress.com
Yes, Suryaprakas garu. That was a generation of people who really defined the independent spirit and upheld the personal right of individual to pursue whatever he likes in that new world. People we see there now are but a pale shadow of them …subverting that great human spirit in the name of every excuse…just as in India.
with regards
Thanks for giving these details..its great