2010-07-30
షడ్రుచులు: ఉల్లిపాయ గుత్తి కూర
[[ This is a content summary only. Visit my website for full links, other content, and more! ]]
2010-07-29
స్నాక్స్: అలు-టిక్కి (Alu Tikki)
![]() |
కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు--3 |
విధానము:
1.ఆలు గడ్డలు ఉడికించి తొక్క తీసి, తురిమి పక్కన పెట్టుకోవాలి.
2.తరువాత గిన్నె లో తురిమిన ఆలుగడ్డలు, బ్రెడ్ పొడి(బ్రేడ్, టొస్ట్ చేసి పొడి చేసుకోవాలి),చిన్నగా కట్ చేసిన మిర్చి, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎర్ర కారం,గరం మసాల, ఉప్పు వేసి బాగా కలపాలి.

3.తరువాత తయారు చేసుకున్న మిశ్రమాన్ని, గుండ్రంగా టిక్కి లా చేసుకోవాలి.

4.పెనం పైన నూనె వేసి, తయారు చేసుకున్న టిక్కి లని వేసి, రెండు వైపులా ఎర్రగా కాల్చాలి.

ఎంతో రుచిగా ఉండే అలు-టిక్కి రెడి.ఈ టిక్కిలు సాస్ తో/పెరుగుతో/కెట్చప్/కోత్తిమీర చట్ని తో తింటే చాలా బాగుంటుంది.
స్నాక్స్: బొరుగుల/ముర్మురా చాట్(కారం బొరుగులు) (Murmura chat)
|
కావలసిన పదార్థాలు: బొరుగులు--4 కప్స్ |
విధానము:
1.బానలి లో 1/2 స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక పసుపు, బొరుగులు వేసి 5 నిముషాలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
2.తరువాత ఒక గిన్నె లో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, టమొటా, పచ్చి మిర్చి, కొత్తిమీర, నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
3.ఒక గిన్నెలో వేయించిన బొరుగులు, కట్ చేసిన ఉల్లిపాయ, టమొటా ,కొత్తిమీర వేసి బాగా కలపాలి.
4.తరువాత చిటికెడు గరం మసాల, ధనియాల పొడి , ఉప్పు వేసి బాగా కలపాలి.
5.తరువాత బొరుగుల పైన బూంది వేసుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే ముర్మురా/బొరుగుల చాట్ రెడి.
స్వీట్స్: సేమియా పాయసం (Vermicelli kheer)
|
సేమియా--1 కప్ |
విధానము
1.నెయ్యిలో సేమియా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
2.నట్స్ కూడా నెయ్యి లో వేయించి పక్కన పెట్టుకోవాలి.
3.తరువాత గిన్నె లో పాలు వేసి కాగనివ్వాలి.
4.పాలు కాగినాక చెక్కర వేసి బాగా కలపాలి.
5.తరువాత పాల్లల్లో చెక్కర బాగా కలిసాక, వేయించిన సేమియా, నట్స్ వేసి ఉడికించాలి.
6.పాల్లల్లో మిశ్రమం బాగా కలిసాక ఏలకుల పొడి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఎంతో రుచిగా ఉండే సేమియా పాయసం రెడి.
గమనిక:1.సేమియా పాయసం స్టవ్ ఆఫ్ చేసినాక, గిన్నె లో కొద్దిగా పాలు ఉన్నా, చల్లగా అయ్యాక సేమియా పీల్చుకొని గట్టిపడుతుంది.
2.ఇష్టమున్న వారు రోస్ ఎస్సెన్స్,లేక ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు.
2010-07-26
స్నాక్స్: గోబి మంచూరియా (Gobi Manchuria)
![]() |
కావలసిన పదార్థాలు: గోబి/కాలిఫ్లవర్ -- 2 కప్స్ |
విధానము:
1.కాలి ఫ్లవర్ చిన్న ముక్కలు గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2.కార్న్ పిండి లో కట్ చేసిన కాలిఫ్లవర్ వేసి, పిండి అంతా ముక్కలకు పట్టెలా అద్ది , వాటి పైన నీళ్ళు చిలకరించాలి.(అప్పుడు పిండి బాగా ముక్కలకు అతుకుంటుంది (నీళ్ళు ఎక్కువ వేయరాదు)

3.బానలి లో నూనె వేసి ,వేడి అయ్యాక, కార్న్ పిండి లో అద్దిన కాలిఫ్లవర్నుజాగ్రత్త గా వేసి గోధుమ రంగు వచ్చేలా వేయించి పక్కన పెట్టుకోవాలి.

4.ఉల్లికాడలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5.బానలి లో 2 స్పూన్స్ ఆలివ్ నూనె వేసి కట్ చేసిన ఉల్లికాడలు, పచ్చి మిర్చి, వెల్లుల్లి వేసి గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.
6.తరువాత సోయ సాస్, హాట్ & స్వీట్ టమొటా సాస్, చిటికెడు ఉప్పు వేసి వేయించాలి. (సోయ సాస్ లో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవాలి)

7.తరువాత వేయించిన కాలిఫ్లవర్లు జాగర్తగా వేసి మిశ్రమం లో బాగా కలపాలి.
8.తరువాత 2 నిముషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరిలో కొత్తిమీర వేసుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే గోబిమంచూరీ రెడి. ఇది స్నాక్ గా తిన్నా బాగుంటుంది. లేక్ చైనీస్ ఫ్రైడ్ రైస్ తో తిన్నా బాగుంటుంది.

చిట్కా: 1. మీకు మంచూరీ జారుగా కావాలి అం టే ... సోయ సాస్ హాట్ & స్వీట్ టమొటా సాస్ ఎక్కువ వేసి జారుగా చేసుకోవచ్చు.
2. కాలిఫ్లవర్ పై పిండి ఎక్కువ ఇష్టపడే వారు, ఒక గిన్నె లో కార్న్/శనగ పిండి, ఉప్పు, కొద్దిగా కారం వేసి కొద్దిగా నీరు వేసి, పకోడి పిండి లా కలిపి అందులో ఉడికించిన కాలిఫ్లవర్ అద్ది, వేయించి, తయారు చేసుకున్న సాస్ మిశ్రమం లో వేసి ఉడికించుకోవచ్చు.
2010-07-23
షడ్రుచులు: ఓట్స్ ఉప్మా
[[ This is a content summary only. Visit my website for full links, other content, and more! ]]
2010-07-20
శాకాహారం- కమ్మని వంటలు: చోప్సి
2010-07-11
2010-07-09
Shakthi's recipes: spinach(తోటాకు)..టోమాటో కూర
2010-07-08
2010-06-30
స్నాక్స్: ఉద్ది పిండి మురుకులు (జంతికలు)(Urad Muruku)
![]() |
కావలసిన పదార్థాలు: బియ్యప్పిండి--3 కప్స్ ఉద్ది పిండి --1 కప్ వాము--1 స్పూన్ ఉప్పు---తగినంత ఎర్ర కారం --11/2 స్పూన్ ఇంగువ--1/2 స్పూన్ నూనె--3 కప్స్(వేయించడానికి) |
విధానము:
1.పెద్ద గిన్నె లో బియ్యప్పిండి, ఉద్ది పిండి, వాము, ఉప్పు, ఎర్ర కారం, ఇంగువ వేసి బాగా కలపాలి.
2.తరువాత 5 లేక 7 స్పూన్స్ వేడి నూనె వేసి, మిశ్రమాన్ని బాగా కలపాలి.
3.పిండి నూనె లో కలిపినాక, కొద్దిగా పిండి చేతితో పట్టుకుంటే ముద్దలాగా, బాల్ లా అతుక్కోవాలి. పొడి పొడి గా పడిపోకుండా ఉండాలి.(ఒకవేల పిండి పొడి పోడి గా రాలుతుంటే కొద్దిగా నూనే వేసుకోవాలి)
4.తరువాత పిండిలో కొద్ది కొద్దిగా నీరు వేస్తు, గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.(జారుగా కలపరాదు)
5.తరువాత నూనె వేడికి పెట్టాలి.
6.తరువాత కొద్దిగా పిండి తీసుకొని, మురుకుల గొట్టములో వేసి, జాగ్రత్తగా వేడి నూనె లో పిండాలి.
7..మీకు నచ్చిన విధంగా మురుకల ప్లేట్స్ లో స్టార్,గుండ్రంగా,పొడవుగా పెట్టి వేసుకోవచ్చు.
8.రెండువైపులా మురుకులను పచ్చిదనం పోయేలా వేయించాలి.
9.వేయించిన మురుకులను ప్లేట్ లో పేపర్ వేసి, పేపర్ మీద తీయాలి.(పేపర్ లో వేయడం వల్ల ఎక్కువగా ఉండే నూనె, పేపర్ పీల్చుకుంటుంది).
ఎంతో రుచిగా ఉండే కరకరలాడే ఉద్ది పిండి మురుకులు/జంతికలు రెడి.ఇవి డబ్బాలో వేసుకోని పెట్టుకుంటే నెల రోజులదాక నిల్వ ఉంటాయి.
స్నాక్స్: అటుకుల మిక్చర్ (Rice Flakes Mixture)
![]() |
కావలసిన పదార్థాలు: అటుకులు-- 3 కప్స్ ఎర్ర కారం--1 టీ స్పూన్ ఉప్పు--1 టీ స్పూన్ ఇంగువ--1/4 టీ స్పూన్ కరివేపాకు--5-10 ఆకులు వెల్లుల్లి--2 తొనలు పసుపు--1/2 స్పూన్ పుట్నాల పప్పులు--1/4 కప్ వేరు శనకాయ విత్తనాలు--1/4 కప్ |
విధానము:
1.నూనే వేడికి పెట్టాలి.
2.జాలరి గరిట (మెష్ ఉండే గరిట)వేడి నూనె లో పెట్టి అందులోకి గట్టి అటుకులు వేసి, వేగిన వెంటనే(అటుకులు కొద్దిగా లావుగా అయ్యాక) పేపర్ వేసిన ప్లేట్ లో తీసుకోవాలి.
3.తరువాత పుట్నాల పప్పులు కూడా వేసి వేయించి, వేయించిన అటుకులలో కలపాలి.
4.వేరుశనకాయలు కూడా వేసి వేయించి, అటుకులలో కలపాలి.
5.కరివేపాకు, దంచిన వెల్లుల్లి ,వేయించి అటుకులలో కలపాలి.
6.తరువాత పసుపు, ఉప్పు, ఎర్ర కారం ,ఇంగువ వేసి బాగా కలపాలి.
ఎంతో రుచిగా ఉండే అటుకుల మిక్చర్ రెడి.
స్నాక్స్: శనగ పిండి రిబ్బన్లు (Besan Ribbons)
![]() |
కావలసిన పదార్థాలు: బియ్యప్పిండి--3 కప్స్ శనగ పిండి--1 కప్ వాము--1 స్పూన్ ఉప్పు---తగినంత ఎర్ర కారం --11/2 స్పూన్ ఇంగువ--1/2 స్పూన్ నూనె--3 కప్స్(వేయించడానికి) |
విధానము:
1.పెద్ద గిన్నె లో బియ్యప్పిండి, శనగ పిండి, వాము, ఉప్పు, ఎర్ర కారం, ఇంగువ వేసి బాగా కలపాలి.
2.తరువాత 5 లేక 7 స్పూన్స్ వేడి నూనె వేసి, మిశ్రమాన్ని బాగా కలపాలి.
3.పిండి నూనె లో కలిపినాక, కొద్దిగా పిండి చేతితో పట్టుకుంటే ముద్దలాగా, బాల్ లా అతుక్కోవాలి. పొడి పొడి గా పడిపోకుండా ఉండాలి.(ఒకవేల పిండి పొడి పోడి గా రాలుతుంటే కొద్దిగా నూనే వేసుకోవాలి)
4.తరువాత పిండిలో కొద్ది కొద్దిగా నీరు వేస్తు, గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.(జారుగా కలపరాదు)
5.తరువాత నూనె వేడికి పెట్టాలి.
6.తరువాత కొద్దిగా పిండి తీసుకొని,మురుకుల గొట్టములో వేసి, చతురస్త్రం పేట్ పెట్టి, జాగ్రత్తగా వేడి నూనె లో పిండాలి.
7.రెండువైపులా మురుకులను పచ్చిదనం పోయేలా వేయించాలి.
8.వేయించిన మురుకులను ప్లేట్ లో పేపర్ వేసి, పేపర్ మీద తీయాలి.(పేపర్ లో వేయడం వల్ల ఎక్కువగా ఉండే నూనె, పేపర్ పీల్చుకుంటుంది).
ఎంతో రుచిగా ఉండే కరకరలాడే శనగపిండి రిబ్బన్లు రెడి.ఇవి డబ్బాలో వేసుకోని పెట్టుకుంటే నెల రోజులదాక నిల్వ ఉంటాయి.ఇవి మిక్చర్ లో కలుపుకొని తింటే చాలా బాగుంటాయి.
స్నాక్స్: శనగ పిండి మురుకులు (జంతికలు)(Besan Muruku)
![]() |
కావలసిన పదార్థాలు: బియ్యప్పిండి--3 కప్స్ శనగ పిండి--1 కప్ వాము--1 స్పూన్ ఉప్పు---తగినంత ఎర్ర కారం --11/2 స్పూన్ ఇంగువ--1/2 స్పూన్ నూనె--3 కప్స్(వేయించడానికి) |
విధానము:
1.పెద్ద గిన్నె లో బియ్యప్పిండి,శనగపిండి,వాము,ఉప్పు, ఎర్ర కారం, ఇంగువ వేసి బాగా కలపాలి.
2.తరువాత 5 లేక 7 స్పూన్స్ వేడి నూనె వేసి, మిశ్రమాన్ని బాగా కలపాలి.
3.పిండి నూనె లో కలిపినాక, కొద్దిగా పిండి చేతితో పట్టుకుంటే ముద్దలాగా, బాల్ లా అతుక్కోవాలి. పొడి పొడి గా పడిపోకుండా ఉండాలి.(ఒకవేల పిండి పొడి పోడి గా రాలుతుంటే కొద్దిగా నూనే వేసుకోవాలి)
4.తరువాత పిండిలో కొద్ది కొద్దిగా నీరు వేస్తు, గట్టిగా ముద్దలా కలుపుకోవాలి.(జారుగా కలపరాదు)
5.తరువాత నూనె వేడికి పెట్టాలి.
6.తరువాత కొద్దిగా పిండి తీసుకొని, మురుకుల గొట్టములో వేసి, జాగ్రత్తగా వేడి నూనె లో పిండాలి.
7..మీకు నచ్చిన విధంగా మురుకల ప్లేట్స్ లో పెట్టి స్టార్, గుండ్రంగా, పొడవుగా వేసుకోవచ్చు.
8.రెండువైపులా మురుకులను పచ్చిదనం పోయేలా వేయించాలి.
9.వేయించిన మురుకులను ప్లేట్ లో పేపర్ వేసి, పేపర్ మీద తీయాలి.(పేపర్ లో వేయడం వల్ల ఎక్కువగా ఉండే నూనె, పేపర్ పీల్చుకుంటుంది).
ఎంతో రుచిగా ఉండే కరకరలాడే శనగపిండి మురుకులు/జంతికలు రెడి.ఇవి డబ్బాలో వేసుకోని పెట్టుకుంటే నెల రోజులదాక నిల్వ ఉంటాయి.
2010-06-18
రుచి...the temptation: Green Tea అద్భుతాలు
2010-06-16
రుచి...the temptation: Kitchen Essentials:
2010-05-28
మా సీమవంట: వంకాయ పచ్చడి
2010-04-13
మనరుచులు: పుదీనా,కొత్తిమీర,కరివేపాకు మిక్స్డ్ చట్నీ
2010-03-21
స్వీట్స్: పైనాపిల్ పుడ్డింగ్ (Pineapple Pudding)
![]() |
కావలసిన పదార్థాలు: విప్ క్రీం --1/2 కప్ కండెన్స్డ్ మిల్క్--1 కప్ సోర్ క్రీం—1 కప్స్ మామిడి పండు గుజ్జు--1 కప్ పైనాపిల్ ముక్కలు--1 కప్ చెక్కర--2 కప్ |
విధానము:.
1.ఒక గిన్నె లో విప్ క్రీం, సోర్ క్రీం, మామిడి పండు గుజ్జు, చెక్కర వేయాలి.
2. తరువాత మిశ్రమం బాగా కలిసేలా కవ్వం తో చిలకాలి.
3.తరువాత పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలపాలి.
4.తరువాత ఇలా తయారు చేసిన పైనాపిల్ పుడ్డింగ్ ను ఫ్రిడ్జ్ లో 2 లేక 3 గంటలు పెట్టాలి.
ఎంతో రుచిగా ఉండే పైనపిల్ పుడ్డింగ్ రెడి.
స్వీట్స్: కొబ్బెర బర్ఫీ (Coconut Burphy )
|
కొబ్బెర తురుము---1 కప్ |
విధానము:
1.బానలిలో నెయ్యి వేసి కొబ్బెర తురుము పచ్చి వాసన పోయేలా వేయించాలి.
2.తరువాత వేయించిన కొబ్బెరలో చెక్కర వేసి, మాడిపోకుండా కలుపుతూ ఉండాలి.
3.మిశ్రమం అంతా బాగా కలిసి హల్వాల ముద్దలా తయరైనప్పుడు, ఏలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం, వేసి 1 నిముషం కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
4.తరువాత ఒక ప్లేట్ లో నెయ్యి రాసి, తయారు చేసిన మిశ్రమం వేయాలి.
5.బర్ఫీ చల్లగా అయ్యాక, మీకు నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి.
6.ఇలా కట్ చేసుకున్న కొబ్బెర బర్ఫీలను ప్లేట్ లో తీసుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే కొబ్బెర బర్ఫీ రేడి.
గమనిక: పచ్చ కర్పూరం వేయకపోయిన పర్లేదు గాని, ఎక్కువ వేస్తే బర్ఫీ చేదు వస్తుంది.
స్వీట్స్: జిలేబి (jilebi)
![]() |
కావలసిన పదార్థాలు: మైదా--1 కప్ |
విధానము:
1.ఒక గిన్నెలోమైదా,బియ్యప్పిండి,సోడ,పెరుగు వేసి కొద్దిగా నీరు వేసి పిండిని ఉంటలు లేకుండా జారుగా కలుపుకోవాలి.
2.ఇలా కలిపిన పిండిని కనీసం 20 నుంచి 24 గంటల వరకు నాననివ్వాలి.(పక్కరోజు జిలేబి చేయాలంటే ముందు రోజే పిండి తయారు
చేసుకోవాలి)
3.తరువాత నానిన పిండి లో, కేసర్ కలర్ వేసి బాగా కలపాలి.

4.పక్కరోజుకంతా మైదా పిండి బాగా నాని, తీగ లా జారుగా తయారవుతుంది.
5.జారుగా ఉంటేనే జిలేబి బాగా వస్తుంది.

6.తరువాత తయారు చేసుకున్న పిండిని కవ్వం తో చిలకాలి.అప్పుడు పిండీ నురగలుగా వస్తుంది.
7.తరువాత ఒక గిన్నె లో చెక్కర వేసి, చెక్కర మునిగేలా నీరు వేసి, తీగ పాకం చేసుకోని పక్కన పెట్టుకోవాలి.
8.తరువాత వెడల్పాటి బానలి లోనెయ్యి వేసి, వేడి చేయాలి.
9.తరువాత ప్లాస్టిక్ కవర్ మధ్యలో చిన్న గా రంద్రం చేసి తయారు చేసిన మైదా పిండిని వేయాలి.
10.తరువాత నెయ్యి కొద్దిగా వేడి అయ్యాక చిన్నగా చుట్లు తిప్పుతూ జిలేబి వేసుకోవాలి.

11.ఇలా వేసిన జిలేబిలు గోధుమ రంగు వచ్చేలా రెండు వైపులా కాల్చాలి.
12.ఇలా కాల్చిన జిలేబిలను పక్కన పెట్టుకున్న తీగ పాకం లో వేసి 1 నిముషం పాటు ఉంచాలి.
13.తరువాత తీసి,ప్లేట్ లో తీసుకొని కాసేపు అయ్యాక తింటే పాకం అంతా జిలేబి కు పట్టి, ఎంతో రుచిగా ఉంటుంది

ఎంతో రుచిగా ఉండే జిలేబి రెడి.
గమనిక:1.జిలేబీలు చేయడానికి నూనె బదులు నెయ్యి వాడితేనే రుచిగా ఉంటాయి.
2.నెయ్యిలో జిలేబి వేసినప్పుడు నెయ్యిని సన్నటి సెగలో పెట్టాలి, అప్పుడే జిలేబి వేయడానికి వస్తుంది.లేకపోతే జిలేబి వేస్తున్నప్పుడే పైకి వచ్చేసి,వేయడానికి సరిగా రాదు.
3. జిలేబి ప్లాస్టిక్ కవర్తో వేయడం రాకపోతే సాస్ బాటిల్/కొబ్బరి చిప్ప కూడా వాడుకోవచ్చు.
స్వీట్స్: గోల్డ్ కాయిన్స్ (Gold Coins)
![]() |
కావలసిన పదార్థాలు: మైదా---1 కప్డాల్డ/బటర్/నెయ్యి--3 స్పూన్స్ చెక్కర--1/2 కప్ బేకింగ్ పౌడర్--3/4 స్పూన్ నూనె----2 కప్స్ వేయించడానికి కేసరి కలర్--చిటికెడు |
విధానము:.
1.ఒక గిన్నె లో మైదా, డాల్డ/నెయ్యి, బేకింగ్ పౌడర్, చెక్కర,కేసరి కలర్ వేసి, కొంచం నీరు వేసి, పూరీ పిండి లా గట్టిగా కలుపుకోవాలి.2.తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉంటలుగా చేసుకోవాలి.
3.తరువాత తయారు చేసుకున్న ఉంటను, చపాతి లా వత్తుకోవాలి.
4.వత్తిన చపాతిని,గుండ్రంగా కట్ చేసుకోవాలి.
5.నూనె వేడికి పెట్టి, వేడి అయ్యాక,గుండ్రంగా కట్ చేసుకున్నగోల్డ్ కాయిన్స్ వేసి, గోధుమ రంగు వచ్చేలా వేయించాలి.
6.ఇలా వేయించిన గోల్డ్ కాయిన్స్ ను ప్లేట్ లో తీసుకోవాలి.
ఎంతో రుచిగా ఉండే గోల్డ్ కాయిన్స్ రెడి.
స్వీట్స్: గోధుమ-కర్జూరం కేక్( Atta-Dates Burphy )
![]() |
కావలసిన పదార్థాలు: గోధుమ పిండి--2 కప్స్ నెయ్యి---1 కప్ కర్జూరం ముక్కలు--1 కప్ నట్స్---1/4 కప్ (బాదాం, జీడిపప్పు ముక్కలు) ఏలకుల పొడి--చిటికెడు బెల్లం--1 కప్ |
విధానము:.
1.బానలి లో నెయ్యి వేసి వేడి చేయాలి.
2.తరువాత గోధుమ పిండి, బాదాం, జీడిపప్పు ముక్కలు వేసి, పచ్చి వాసన పోయేదాక వేయించాలి.
3.తరువాత బెల్లం వేసి, బాగా కరిగినాక బాగా కలపాలి.
4.కర్జూరం ముక్కలు, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి.
5.ప్లేట్ లో కొద్దిగా నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి.
6.గోధుమపిండి-కర్జూరం మిశ్రమము నెయ్యి పూసిన ప్లేట్ లో వేసి వేడల్పుగా చేయాలి.

7.తరువాత 15-30 నిముషాలు కదపకుండా పక్కన పెట్టాలి.
8.తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

9.ఎంతో రుచిగా ఉండే గోధుమ-కర్జూరం బర్ఫీ రెడి.
చిట్కా: గోధుమ పిండి, బెల్లం, కర్జూరం అన్నీ అరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు కూడా ఈ స్వీట్ ఎంతో ఇష్టపడతారు.స్వీట్స్: సున్నుండలు(Sununda/Urad Laddu)
![]() |
కావలసిన పదార్థాలు: ఉద్దిపప్పు---2 కప్స్ పెసర పప్పు---1/2 కప్ చెక్కర---2 కప్స్ ఏలకుల పొడి--1/2 టీ స్పూన్ నెయ్యి---1/2 కప్ నట్స్ పౌడర్--1/4 కప్ (జీడిపప్పు, బాదాం ,అక్రూట్) |
విధానము:.
1.ఉద్దిపప్పు,పెసరపప్పు నూనె వేయకుండా, గోధుమ రంగు వచ్చేలా వేయించుకోవాలి.
2.మిక్సీ జార్ లో ఉద్దిపప్పు, పెసర పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3.ఒక గిన్నె లో గ్రైండ్ చేసుకొన్న ఉద్దిపప్పు-పెసర పప్పు పొడి, చెక్కర ,ఏలకుల పొడి, నట్స్ పౌడర్ వేసి బాగా కలపాలి.
4.తయారు చేసుకొన్న మిశ్రమం లో కరిగించిన నెయ్యి కొంచం కొంచం వేసుకుంటూ ఉంటలు గా కట్టుకోవాలి.(నెయ్యి వేయడం వల్ల సున్నుండ బాల్ లాగా గట్టిగా అతుకుంటుంది)
5.బాల్ లాగా గుండ్రంగా చేసుకొని ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి.
6.ఎంతో రుచిగా ఉండే సున్నుండలు రెడి.
చిట్కా: పెసర పప్పు వేయడం వల్ల సున్నుండ తినేటప్పుడు పండ్లకు అతుకోకుండా ఉంటుంది మరియు ఎంతో రుచిగా కూడా ఉంటుంది.
2.సున్నుండలు అరోగ్యానికి ఎంతో మంచిది. ఉద్దిపప్పు లో ఐరన్ ఉండడం వల్ల పిల్లలకు మరియు గర్బిని స్రీలకు ఎంతో మంచిది.
స్వీట్స్: స్ట్రాబెర్రి కప్ కేక్స్(Strawberry Cup Cakes )
![]() |
కావలసిన పదార్థాలు: మైదా---2 కప్స్ |
విధానము:
1.స్ట్రాబెర్రిస్ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2.జీడిపప్పు,అక్రూట్,బాదాం నున్నగా కాకుండా బరకగా గ్రైండ్ చేయాలి.
3.ఒక గిన్నె లో గ్రైండ్ చేసిన స్ట్రాబెర్రి మిక్స్ ,చెక్కర, బటర్ (నెయ్యి/నూనె కూడా వేసుకోవచ్చు)వేసి బాగా కవ్వం తో చిలికి పక్కన పెట్టుకోవాలి.కవ్వం తో చిలకడం వల్ల మిక్స్ అంతా బాగా కలుస్తుంది.
4.తరువాత ఒక గిన్నె లో మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్, గ్రైండ్ చేసిన జీడిపప్పు, బాదాం, అక్రూట్, ఏలకుల పొడి వేసి బాగా కలిపి,పక్కన పెట్టుకొన్న స్ట్రాబెర్రి మిక్స్ కూడా వేసి, పిండి అంతా కలిసేలా కలపాలి.
5.పాలు వేసి,పిండి జారుగా (ఇడ్లి పిండి లా) కలుపుకోవాలి.

6.తరువాత కప్ కేకె ట్రే లో,తయారు చేసుకున్నమిశ్రమాన్నిస్పూన్ తో సగానికి వేయాలి.(నిండుగా వేయరాదు)

7.తరువాత ఒవన్ 350 డిగ్రీస్ లో పెట్టి 5 నిముషాలు వేడి చేయాలి.
8.ఒవెన్ వేడి అయ్యాక, ట్రే లో వేసిన పిండి ని ఒవన్ లో పెట్టి 25-30 నిముషాలు వేడి చేయాలి.
9.తరువాత ఒవన్ తీసి కప్స్ కేక్స్ బాగా పొంగి, గోధుమ రంగుగా వచ్చినప్పుడు, పుల్ల తీసుకొని కప్ కేక్ పై గుచ్చితే పుల్లకు పిండి అంటకుండా
రావాలి.(ఒక వేల పుల్లకు పిండి అంటుకుంటే మరొక 5 నిముషాలు బేక్ చేయాలి).
10.వెంటనే ఒవన్ ఆఫ్ చేసి కప్ కేక్స్ బయట పెట్టాలి.

ఎంతో రుచిగా ఉండే స్ట్రాబెర్రి కప్ కేక్స్ రెడి.
స్వీట్స్: పెసర పప్పు పాయసం(Moong Daal Kheer)
![]() |
కావలసిన పదార్థాలు: పెసర పప్పు--1 కప్ పాలు--- 3 కప్స్ బెల్లం---1 కప్ జీడిపప్పు--10 ఏలకుల పొడి---1/2 స్పూన్ నెయ్యి---2 స్పూన్స్ |
విధానము:
1.బానలి లో 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
2.అదే బానలి లో కొంచం నెయ్యి వేసి, పెసర పప్పు వేసి దోరగా వేయించాలి.
3.తరువాత పాలు వేసి పెసర పప్పు బాగా మెత్తగా ఉడకనివ్వాలి.
4.మెత్తగా పెసర పప్పు ఉడికినాక, బెల్లం కూడా వేసి బాగా ఉడకనివ్వాలి.
5.బెల్లం ,పాలు, పెసర పప్పు బాగా ఉడికి క్రీం లా తయారవుతుంది.
6.తరువాత ఏలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు పాయసం రెడి. ఈ పాయసం చల్లగా/వేడిగా కూడా బాగుంటుంది.
చిట్కా: పెసర పప్పు, బెల్లం దేహానికి వేడిని తగ్గిస్తుంది. ఎండాకాలం లో అప్పుడప్పుడు ఈ పాయసం తింటే అరోగ్యానికి మంచిది మరియు ఎంతో రుచిగా కూడా ఉంటుంది.
2010-03-15
మా సీమవంట: ఉగాది పచ్చడి ఒక్కో ప్రాంతంలో
2010-02-11
మా సీమవంట: పాలకూర చెట్నీ
2010-01-30
మనరుచులు: వెజ్ నూడిల్స్/veg noodles
2010-01-03
మనరుచులు: అల్ల౦ పచ్చడి
2009-12-28
Shakthi's recipes: బీన్స్ కూర
2009-10-14
శాకాహారం- కమ్మని వంటలు: వెజిటబుల్ పులావ్
శాకాహారం- కమ్మని వంటలు: కాజాలు లేదా చెక్కర బాణాలు
2009-10-10
Shakthi's recipes: చంద్రకాంతలు---(పెసర పప్పుతో చేసే ఒక రకమైన పిండి వంట.)
2009-09-15
Shakthi's recipes: !! పెసరపప్పు బూరెలు !!
2009-09-03
Shakthi's recipes: గోంగూర పప్పు
2009-08-29
Shakthi's recipes: వంకాయ,మామిడికాయ,పప్పు
Shakthi's recipes: బీహూన్ రైస్ నూడుల్స్
2009-08-26
Shakthi's recipes: మైసూర్ మసాల దోస
2009-08-25
Shakthi's recipes: వంకాయ ఆనియన్ పచ్చి పులుసు
Shakthi's recipes: బీట్రూట్ మసాల కూర
2009-08-24
Shakthi's recipes: బాదం పచ్చది
2009-08-10
Shakthi's recipes: నువ్వుల పొడి అన్నం
Shakthi's recipes: అరటిపువ్వు కూర
2009-07-26
మోడ్రన్ వంటకాలు: వెజిటబుల్ సల్ నూ
మోడ్రన్ వంటకాలు: రొయ్యల కట్లెట్
2009-07-17
Shakthi's recipes: దొండకాయ కూర
2009-07-16
Shakthi's recipes: దోస ఆవకాయ
Shakthi's recipes: టోమాటో పప్పు
Shakthi's recipes: బిసి ఉప్పినేకాయి (కన్నడ వాళ్ళ ఐటం) Instant Pickles




కావలసిన పదార్థాలు :










