2007-09-27

311.nIvu turagamumIda nErpu-నీవు తురగముమీద నేర్పు

2007-09-27 12:41 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
book:5, kriti:210 నీవు తురగముమీద నేర్పు మెరయ వేవేలు రూపములు వెదచల్లితపుడు పదిలముగ నిరువంక పసిడిపింజల యంప- పొదల తరకసములొరపులు నెరపగ గదయు శంఖము చక్రము ధనుఃఖడ్గములు పదివేలు సూర్యబింబములైనవపుడు సొరిది శేషుని పెద్దచుట్టు పెనుకేవడము సిరిదొలక నొకచేత చిత్తగించి దురమునకు తొడవైన ధూమకేతువు చేత- నిరవైన బల్లెమై యేచెనందపుడు కరకజడాతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను(దొడికి పట్టి చరచె వెను వేంకటస్వామి

2007-09-26

కేశవ గోవింద మాధవా యని….

2007-09-26 06:05 PM వికటకవి - భజన కీర్తనలు

కేశవ గోవింద మాధవా యని
కీర్తన చేసే దెన్నటికో
నాశము లేని మోక్షమును పొందుట
నారాయణ నాకెన్నటికో ||కేశవ||

భక్తి మృదంగము తాళాదులతో
భజనలు చేసే దెన్నటికో
శక్తి మీరగ నృత్యము సేయుట
సారసాక్ష నా కెన్నటికో ||కేశవ||

పూవులతో నీ పాదంబులకును
పూజలు చేసే దెన్నటికో
నైవేద్యం బిడి పరమ భక్తిని
చాటించుట నా ఎన్నటికో ||కేశవ||

పాహి పాహియని పరమపురుష
నీ పాదంబుల బడు టెన్నటికో
దేహి దేహియని నీ కృపకొరకై
దేవురు లాడే దెన్నటికో ||కేశవ||

రామదాసులను బ్రోచినట్లు
సంరక్షణ చేసే దెన్నటికో
భామామణి రుక్మిణితో గూడి
బాసలు చేసే దెన్నటికో ||కేశవ||

309.namO namO dAnavavinASaka- నమో నమో దానవవినాశక చక్రమా

2007-09-26 02:19 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| నమో నమో దానవవినాశక చక్రమా | సమర విజయమైన సర్వేశు చక్రమా || చ|| అట్టె పదారు భుజాల నమరిన చక్రమా | పట్టిన ఆయుధముల బలు చక్రమా | నెట్టన మూడుగన్నుల నిలచిన చక్రమా | రట్టుగా మన్నించవే మొరయుచు చక్రమా || చ|| అరయ నారుగోణాల నమరిన చక్రమా | ధారలు వేయిటి తోడి తగు చక్రమా | ఆరక మీదికి వెళ్ళే అగ్ని చక్రమా | గారవాన నీదాసుల గావవే చక్రమా || చ|| రవిచంద్రకోటి తేజరాసియైన చక్రమా | దివిజ సేవితమైన దివ్య చక్రమా | తవిలి

307.ade chUDarayya pedda-అదె చూడరయ్య పెద్ద

2007-09-26 02:19 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
అదె చూడరయ్య పెద్ద హనుమంతుని గుదిగొని దేవతలు కొనియాడేరయ్య ఉదయాస్తశైలములు ఒకజంగగా చాచె అదివో ధృవమండల మందె శిరసు చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు ఎదుట ఈతని మహిమ యేమని చెప్పేమయ్య || దండిగా బ్రహ్మాండము దాక తోకమీదికెత్తె మెండగు దిక్కుల నిండా మేను వెంచెను గుండు గూడ రాకాసుల కొట్టగ చేతుల చాచె అండ ఈతని ప్రతాప మరుదరుదయ్యా || దిక్కులు పిక్కటిల్ల్లగ దేహరోమములు పెంచె పక్కన లోకములకు ప్రాణమై నిల్చె

303.padiyAruvannela baMgAru -పదియారువన్నెల బంగారు కాంతులతోడ

2007-09-26 02:19 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
పదియారువన్నెల బంగారు కాంతులతోడ పొదలిన కలశాపుర హనుమంతుడు || ఎడమ చేతబట్టె నిదివో పండ్లగొల కుడిచేత రాకాసిగుంపుల గొట్టె తొడిబడ నూరుపులతో తూరుపు మొగమైనాడు పొడవైన కలశాపుర హనుమంతుడు || తొక్కె అక్షకుమారుని తుంచి యడగాళ్ళా సంది నిక్కించెను తోక ఎత్తి నింగి మోవను చుక్కలు మోవపెరిగి సుతువద్ద వేదాలు పుక్కిటబెట్టె కలశాపుర హనుమంతుడు || గట్టి దివ్యాంబరముతో కవచకుండలాలతో పట్టపు శ్రీవేంకటేశు బంటు తానయె అట్టె

2007-09-25

310.ani Anatichche - అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో

2007-09-25 07:10 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప : అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా చ : భూమిలోను చొచ్చి సర్వ భూతప్రాణులనెల్ల దీమసాన మోచేటి దేవుడనేను కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల పండించేటి దేవుడనేను చ : దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తేపుల నఱగించేటి దేవుడనేను ఏపున ఇందరిలోని హ్రుదయములోననుందు దీపింతు తలపు మరపై దేవుడనేను చ : వేదములన్నిటిచేత వేదాంతవేత్తలచే ఆదినే నెరగతగిన ఆ దేవుడను శ్రీదేవితో గూడి శ్రీ

2007-09-24

భజన చేసే విధము దెలియండి…

2007-09-24 09:51 PM bhajans - భజన కీర్తనలు

భజన చేసే విధము దెలియండి, జనులార మీరు
నిజము కనుగొని మోదమందండి ||భజన||

భజన చేసే విధము దెలియక
నిజముగా హరిభక్తు లనుకొని
మదగజము దెగవ్రేయ లేకను
సుజనులని దిరుగంగ నేలను ||భజన||

జ్ఞానులనుకొని యెగసి పడకండీ
జనులార తత్వజ్ఞానమందే మనసు నిలపండీ
జ్ఞానులనుకొని యెగసిపడి
అజ్ఞానములు పైబెట్టుకొన్నను
మానసంబున బుట్టి చచ్చియు
పూని మరి జన్మింపవలయును ||భజన||

వారు వీరని యెంచబోకండి
జనులార మీరు నోరుచచ్చినవారు కాకండి
వారు వీరని యెంచుటెల్లను
సారము లేనట్టి హీనత
పౌరుషులకే గాక పుణ్యము
ఊరి కథలం దేమి యున్నది ||భజన||

ధరణి శ్రీ నరహరిని గొలువండి
జనులార మీరు
పరమపదవి బొంద గోరండి
ధరను శ్రీఘటికాద్రి నరహరి
పరమభక్తవరుల మనుకొని
విరివిగా నరసింహదాసుని
వరకవిత్వము సార మనుకొని ||భజన||
 

అందరికీ నా స్వాగత కీర్తనాంజలి!

2007-09-24 09:51 PM bhajans - భజన కీర్తనలు

అందరికీ నమస్కారములు. మన తెలుగిండ్లలో పాడుకొనే భక్తి పాటలు, భజన కీర్తనలు కొన్నేళ్ళ క్రిందట మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మా నాయనమ్మ మరియు అక్క సేకరించి కూర్చారు. ఇందులో పాటలు, భజనలు, కీర్తనలు వంటివీ మరియు త్యాగరాజ, ముత్తుస్వామి గార్ల కీర్తనలతో సహా ఇతరములూ ఉన్నాయి. అవన్నీ “భజన కీర్తనలు” అన్న పేరుతో ఒక పుస్తక రూపంలో చాలా కాలం క్రిందటే వచ్చాయి. ఆ పుస్తకాన్ని అంతర్జాలంలోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ బ్లాగు ఉద్ధేశ్యం. ఇందులోని ప్రతి కీర్తన/పాట కి ఆడియో సమకూర్చాలని ఆలోచన. ప్రస్తుతానికి సాహిత్యం మాత్రమే ఇస్తున్నాను. కొందరికయినా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.
 

2007-09-22

308.poddikanennaDu voDucunO- పొద్దికనెన్నడు వొడుచునో పోయిన

2007-09-22 01:31 AM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ఒక అధ్బుతమైన విరహ గీతం, అన్నమాచర్యుని కలం నుంచి... బాలకృష్ణప్రసాద్ గరి స్వరం లొ..... Click here to listen this kriti ప|| పొద్దికనెన్నడు వొడుచునో పోయిన చెలిరాదాయను | నిద్దుర కంటికిదోపదు నిముషం బొకయేడు || చ|| కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు | నున్నవి ఒయ్యారంబులు నొచ్చిన చూపులును | విన్నదనంబుల మరపులు వేడుక మీరిన యలపులు | సన్నపు జెమటలుదలచిన ఝల్లనె నామనసు || చ|| ఆగిన రెప్పల నీరును

2007-09-20

306.tAne tAnE yiMdari guruDu-ప|| తానె తానే యిందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి ||

2007-09-20 01:29 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| తానె తానే యిందరి గురుడు | సానబట్టిన భోగి జ్ఞాన యోగి || చ|| అపరిమితములైన యజ్ఞాల వడిజేయ | బ్రపన్నులకు బుద్ధి వచరించి| తపముగా ఫలత్యాగము సేయించు | కపురుల గరిమల కర్మయోగి || చ|| అన్నిచేతలను బ్రహ్మార్పణవిధి జేయ | మన్నించు బుద్ధులను మరుగజెప్పి || ఉన్నతపదమున కొనరగ గరుణించు | పన్నగశయనుడే బ్రహ్మయోగి || చ|| తనరగ గపిలుడై దత్తాత్రేయుడై | ఘనమైన మహిమ శ్రీ వేంకటరాయడై | వినరగ సంసార యోగము గృపసేయు |

2007-09-19

305.OhO yentaTi vaaDE-ఓహో యెంతటి వాడే

2007-09-19 03:06 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ఓహో యెంతటి వాడే వొద్దనున్నవాడే సాహసపు గుణములచతురుడా యితడు జలధిలో బవళించి జలనిధి బంధించి జలనిధి కన్యకను సరిబెండ్లాడి జలనిధిలో నీది జలనిధి మధియించి జలధి వెరించిన చలమరాయితడు ధరణికి బతియై ధరణి గ్రుంగిన నెత్తి ధరణి కూతురు దానె తగ బెండ్లాడి ధరణి పాదము మోపి ధరణి భారము దించి ధరణీ ధరుడైన దైవమా ఇతడు కొండ గొడుగుగ నెత్తి కొండ దూటు పడవేసి కొండకిందగుదురై కూచుండి కొండపై శ్రీ వేంకటాద్రి కోనేటి రాయడై కొండ

304.itaDokaDE sarvESvaruDu-ఇతడొకడే సర్వేశ్వరుడు

2007-09-19 10:53 AM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| ఇతడొకడే సర్వేశ్వరుడు | సిత కమలాక్షుడు శ్రీ వేంకటేశుడు || చ|| పరమ యోగులకు భావ నిధానము | అరయ నింద్రాదుల కైశ్వర్యము | గరిమ గొల్లెతల కౌగిట సౌఖ్యము | సిరులొసగేటి శ్రీ వేంకటేశుడు || చ|| కలికి యశోదకు కన్న మాణికము తలచిన కరికిని తగుదిక్కు | అల ద్రౌపదికిని ఆపద్బంధుడు | చలరేగిన శ్రీ వేంకటేశుడు || చ|| తగిలిన మునులకు తపము సత్ఫలము | ముగురు వేల్పులకు మూలమీతడే | వొగిసలమేల్మంగ కొసరిన పతియితడు |

2007-09-18

మూడవ అధ్యాయము

2007-09-18 05:55 AM తెలుగు బైబిలు - తెలుగు బైబిలు
1 యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారు నామీదికి లేచువారు అనేకులు 2. దేవునివలన అతనికి రక్షణ యేమిదొరకదని నన్నుగూర్చి చెప్పువారు అనేకులు 3. యెహోవా, నీవే నాకు కేడెముగాను నీవేనాకు అతియ్శయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు 4. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ద పర్వతమునుండి నాకుత్తరమిచ్చును 5. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును 6

2007-09-16

302appani varaprasAdi -అప్పని వరప్రసాది అన్నమయ్య

2007-09-16 08:39 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
చినతిరుమలాచార్యుని కీర్తన 10-223 అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య || అంతటికి ఏలికైన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య సంతసాన చెలువొందే సనకసనందనాదు- లంతటివాడు తాళ్ళాపాక అన్నమయ్య || బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు హరిమీద విన్నవించె అన్నమయ్య విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల అరసి తెలిపినాడు అన్నమయ్య || అందమైన రామానుజ ఆచార్యమతమును అందుకొని నిలచినాడు అన్నమయ్య

2007-09-15

హే పాండురంగ, పండరినాథ

2007-09-15 03:29 PM Lavanya - భక్తిగీతాలు
హే పాండురంగ, పండరినాథ శరణం శరణం శరణం బాబా శరణం సాయి శరణు శరణం బాబా చరణం గంగ యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయె ఆ పాండురంగడు కరుణామయుడు సాయె విద్యా బుద్దులు వేడిన బాలకు అగుపించాడు విగ్ణేశ్వరుదై పిల్లా పాపలు కోరిన వారిని కరుణించాడు సర్వేస్వరుడై తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణు రూపుడై మగశ శ్యామకు మారుతి గాను మరికొందరికి దత్తాత్రేయుడిగా యద్భావం తద్భవతని దర్షనమిచ్చాడు ధన్యుల

మా పాపాల తొలగించు

2007-09-15 02:42 PM Lavanya - భక్తిగీతాలు
మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్య మమ్ము కరుణించినావయ్య జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్య మేము తరియించినామయ్య "మా పాపాల" పసిపాప మనసున్న ప్రతిమనిషిలోను పరమాత్ముడున్నాడని వాడు పరిశుద్దుడవుతాడని గోళీల ఆటల్లో కొండంత సత్యం చాటావు ఓ సాయి మమ్ము సాకావు మా సాయి వాసనలు వేరైన వర్ణాలు ఎన్నైనా పూలన్ని ఒకటంటివి నిన్ను పూజించ తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి తలపుల్ని

నువులేక అనాథలం

2007-09-15 02:40 PM Lavanya - భక్తిగీతాలు
సాయిబాబా సాయిబాబా సాయినాథ సాయిదేవా సత్యం నిత్యం నేవే కావా నువులేక అనాథలం భ్రతుకంతా అయోమయం "2" బాబా ఓ బాబా ఇక నీ పరీక్షకు మేమాగలేము ఇటులీ నిరీక్షణ మేమోపలేము నువులేక అనాథలం భ్రతుకంతా అయోమయం బాబా ఓ బాబా మా పాలి దైవం అని మా దిక్కు నీవేనని కొలిచాము దినం దినం సాయి మా ఆర్థి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా ఏ దైవమైనా ఏ ధర్మమైనా నీలోనే చూచాము సాయి

బాబా, సాయి బాబా

2007-09-15 02:38 PM Lavanya - భక్తిగీతాలు
బాబా, సాయి బాబా బాబా, సాయి బాబా నీవూ మావలె మనిషివని నీకూ మరణం వున్నదని అంటే, ఎలా నమ్మేది అనుకొనీ, ఎలా బ్రతికేది బాబా, సాయి బాబా బాబా, సాయి బాబా నువ్వే మరణించావంటె ఆ దేవుడెలా బ్రతికుంటాడు "2" నువ్వే దేవుడివైతే, ఆ మృత్యువెలా శాసిస్తాడు తిరుగాడె కోవెల నీదేహం చిరిగినంతనే శిథిలం అవుతుందా పిలిచినంతనే పలికే దైవం మూగై పోతాడా బాబా, సాయి బాబా బాబా, సాయి బాబా "నీవు మావలె" దివిలో వున్నా భువిలొ వుండె

అల్లా సాయి ,యేసు సాయి

2007-09-15 02:11 PM Lavanya - భక్తిగీతాలు
అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2" శ్రీ గురుదత్త స్వరూప సాయి శ్రీ పండరి విఠలేశ సాయి "2" సర్వాభిష్ట ప్రధాయక సాయి సాధు పురుష పరిపాలక సాయి "2" అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2" అణువణువున దాగిన శ్రీ సాయి అంతరాళమున నిలిచిన సాయి "2" అండపిండ బ్రహ్మాండము సాయి అంతర్హితుడై వెలిసిన సాయి "2" అల్లా సాయి ,యేసు సాయి ,ఈశ్వర సాయి ,సర్వం సాయి "2" త్రిగుణాతీతుడు దైవం సాయి

ఎంతెంత దయనీది ఓ సాయి

2007-09-15 02:05 PM Lavanya - భక్తిగీతాలు
ఎంతెంత దయనీది ఓ సాయి "2" నిను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి "2" నిను ఏమని పొగడను సర్వాంతర్యామి ఎంతెంత దయనీది ఓ సాయి "2" తొలగించినావు వ్యాధులు ఊదితో వెలిగించినావు దివ్వెలు నీటితో "2" నుడులకు అందవు నుతులకు పొంగవు "2" పాపాలు కడిగేసె పావన గంగవు ఎంతెంత దయనీది ఓ సాయి "2" నిను ఏమని పొగడను సర్వాంతర్యామి భక్త కభీరే నీ మతమన్నావు భగవానుడే నీ కులమన్నావు "2" అణువున నిండిన బ్రహ్మాండంలా ఆ

2007-09-13

రెండవ అధ్యాయము

2007-09-13 10:21 PM తెలుగు బైబిలు - తెలుగు బైబిలు
1 అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి? 2 - మనము వారి కట్లు తెంపుదము రండి వారి పాశములను మయొద్దనుంది పారవేయుదము రండి అని చెప్పుకొనుచు 3 భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరొధముగా నిలువబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. 4 ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు 5 ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపముచేత వారిని

మొదటి అధ్యాయము

2007-09-13 04:38 AM తెలుగు బైబిలు - తెలుగు బైబిలు
1 దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక 2 యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. 3. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తనకాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడుచేయునదంతయు సఫలమగును 4. దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు 5. కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులును నీతిమంతుల సభలో పాపులును

2007-09-11

301.itanikaMTE maridaivamu-ఇతనికంటే మరిదైవము కానము

2007-09-11 12:30 AM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
Dasavatara kriti ఇతనికంటే మరిదైవము కానము యెక్కడా వెదకిన నితడే అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె || మదిజలధులనొకదైవము వెదకిన మత్స్యావతారంబితడు అదివో పాతాళమందు వెదకితే ఆదికూర్మమీ విష్ణుడు పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి చెదరక కొండల గుహల వెదకితే శ్రీనరసింహంబున్నాడు తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది పలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడూ తలపున

2007-09-10

తెలుగు బైబిలు

2007-09-10 11:01 PM తెలుగు బైబిలు - తెలుగు బైబిలు
బైబిలులోని కీర్తనలు (150 అద్యాయాలు) పోస్టు చేయడానికి ప్రయత్నిస్తాను.

2007-08-21

291.gaDDapAra miMgitE -గడ్డపార మింగితే నాకలి దీరీనా

2007-08-21 05:08 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| గడ్డపార మింగితే నాకలి దీరీనా యీ- | వొడ్డినభవము దన్నువొడ కమ్ముగాక || చ|| చించుక మిన్నులబారే చింకలను బండిగట్టి | వంచుకొనేమన్న నవి వసమయ్యీనా | యెంచరాని యింద్రియము లెవ్వరికి నేల చిక్కు | పొంచి పొంచి వలపుల బొండబెట్టుగాక || చ|| మంటమండేయగ్గి దెచ్చి మసిపాత మూటగట్టి | యింటిలోపల దాచుకొన్న నితవయ్యీనా || దంటమమకార మిట్టే తన్నునేల సాగనిచ్చు | బంటుజేసి ఆసలనే పారదోసుగాక || చ|| పట్టరాని విషములపాము దెచ్చి

292.vennavaTTuka nEyi- వెన్నవట్టుక నేయి

2007-08-21 05:06 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు- | నెన్నివలసినను దమయేలేటివి కావా || చ|| తలపునకు విష్ణుచింతన నిమిషమాత్రంబు | కలుగుటే కలుగవలెగాక | వలపైనభోగములు వైభవంబులు మరియు | కలవెల్ల తమయెదుట గలిగినవె కావా || చ|| పదిలముగ హరినామపఠన మంత్రము నోరు | కదియుటే కలుగవలెగాక | తుదిలేనిసంపదలు తొలగనిముదంబులును | కదలకెప్పుడు దమకు గలిగినవె కావా || చ|| యించుకైనను వేంకటేశుగిరిశిఖరంబు | కాంచుటే కలుగవలెగాక | అచింతంబైన

297.sakala saMgrahamu- సకల సంగ్రహము

2007-08-21 05:05 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| సకల సంగ్రహము సకల సంచయము | అకృతసుకృత మిది హరినామం || చ|| సకలవేదశాస్త్రములసార మిది| సకలమంత్రరాజంబు నిది| సకలపురాణ రసములమధుర మిది| అకుటిలపావనం హరినామం || చ|| సకలతత్త్వ సంశయఖండన మిది | సకలకర్మ నిశ్చయము నిది | సకలవిధి రహస్యప్రధాన మిది | అకారణహితం హరినామం || చ|| సకలదేవతా స్వామిప్రియం బిది | సకలలోక రక్షణము నిది | ప్రకటం వేంకటపతి నామాంకిత- | మకించనధనం హరినామం || pa|| sakala saMgrahamu sakala

298.SOBanamE SOBanamE- శోభనమే శోభనమే

2007-08-21 05:04 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| శోభనమే శోభనమే వై- | భవముల పావన మూర్తికి || చ|| అరుదుగ మును నరకాసురుడు | సిరులతో జెరలు దెచ్చిన సతుల | పరువపు వయసుల బదారు వేలను | సొరిది బెండ్లాడిన సుముఖునికి || చ|| చెందిన వేడుక శిశుపాలుడు | అంది పెండ్లాడగ నవగళించి | విందువలెనె తా విచ్చేసి రుకుమిణి | సందడి బెండ్లాడిన సరసునుకి || చ|| దేవదానవుల ధీరతను | దావతిపడి వార్థి దరుపగను | శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన | శ్రీ వేంకటగిరి శ్రీనిధికి || pa||

299.aMtaryAmi alasiti- అంతర్యామి అలసితి

2007-08-21 05:03 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| అంతర్యామి అలసితి సొలసితి | ఇంతట నీ శరణిదె జొచ్చితిని || చ|| కోరిన కోర్కులు కోయని కట్లు | తీరవు నీవవి తెంచక | భారపు బగ్గాలు పాప పుణ్యములు | నేరుపుల బోనీవు నీవు వద్దనక || చ|| జనుల సంగముల జక్క రోగములు | విను విడువవు నీవు విడిపించక | వినయపు దైన్యము విడువని కర్మము | చనదది నీవిటు శాంతపరచక || చ|| మదిలో చింతలు మైలలు మణుగులు | వదలవు నీవవి వద్దనక | ఎదుటనె శ్రీ వెంకటేశ్వర నీవదె | అదన గాచితివి అట్టిట్టనక

300.mAdhavunaku maMgaLaM- మాధవునకు మంగళం

2007-08-21 05:01 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| మాధవునకు మంగళం | సాధు ప్రియునకు జయ మంగళం || చ|| మదన గురునకు మంగళము మా | మతిలేలె హరికిని మంగళము | మధురిపు హరునకు మంగళము | చటువులుమూర్తికి మంగళము || చ|| మహిమాధికుణకు మంగళము | మహామహునకు మంగళము | మహీధవునకు మంగళము | సహజ తేజునకు మంగళము || చ|| మాయారహితునికి మంగళము | మాయింటి పతికిని మంగళము | యీ యెడ శ్రీ వేంకటేశ్వరు దీటు | ఛాయ శ్రీపతికి మంగళము || pa|| mAdhavunaku maMgaLaM | sAdhu priyunaku jaya

2007-08-19

293.navanItacOra namOnamO- నవనీతచోర నమోనమో

2007-08-19 02:13 AM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| నవనీతచోర నమోనమో | నవమహిమార్ణవ నమోనమో || చ|| హరినారాయణ కేశవాచ్యుతకౄష్ణ | నరసింహ వామన నమోనమో | మురహర పద్మనాభ ముకుంద గోవింద | నరనారాయణ నమోనమో || చ|| నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ | నగధర నందగోప నమోనమో | త్రిగుణాతీతదేవ త్రివిక్రమ ద్వారక | నగరాధినాయక నమోనమో || చ|| వైకుంఠ రుక్మిణీ వల్లభ చక్రధర | నాకేశవందిత నమోనమో | శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర | నాకజననుత నమోనమో || pa|| navanItacOra namOnamO |

2007-08-17

296.eMta cadivina nEmi vinina-ఎంత చదివిన నేమి వినిన

2007-08-17 04:59 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| ఎంత చదివిన నేమి వినిన తన | చింత యేల మాను సిరులేల కలుగు || చ|| ఇతర దూషణములు ఎడసిన గాక | అతి కాముకుడు గాని యప్పుడు గాక | మతి చంచలము కొంత మానిన గాక |గతి యేల కలుగు దుర్గతులేల మాను || చ|| పర ధనముల యాస బాసిన గాక | అరిది నిందలు లేని యప్పుడు గాక | విరస వర్తనము విడచిన గాక | పర మేల కలుగు నాపద లేల మాను || చ|| వేంకటపతి నాత్మ వెదికిన గాక | కింక మనసున తొలగిన గాక | బొంకు మాటలెడసి పోయిన గాక | శంక యేల మాను

295.chakramA haricakramA- చక్రమా హరిచక్రమా

2007-08-17 04:08 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| చక్రమా హరిచక్రమా | వక్రమైనదనుజుల వక్కలించవో || చ|| చుట్టిచుట్టి పాతాళముచొచ్చి హిరణ్యాక్షుని | చట్టలు చీరిన వోచక్రమా | పట్టిన శ్రీహరిచేత బాయక యీజగములు | వొట్టుకొని కావగదవో వోచక్రమా || చ|| పానుకొని దనుజులబలుకిరీటమణుల | సానలదీరిన వోచక్రమా | నానాజీవముల ప్రాణములుగాచి ధర్మ- | మూని నిలుపగదవో వోచక్రమా || చ|| వెరచి బ్రహ్మాదులు వేదమంత్రములని- | పురట్లు గొనియాడే రోచక్రమా | అరిమురి దిరువేంకటాద్రీశు

294. idigAka sauBAgyamidigAka- ఇదిగాక సౌభాగ్యమిదిగాక

2007-08-17 12:27 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి | యిదిగాక వైభవం బికనొకటి కలదా || చ|| అతివ జన్మము సఫలమై పరమ యోగివలె | నితర మోహాపేక్షలిన్నియును విడచె సతి కోరికలు మహాశాంతమై యిదెచూడ | సతత విజ్ఞాన వాసన వోలె నుండె || చ|| తరుణి హౄదయము కౄతార్థతబొంది విభుమీది | పరవశానంద సంపదకు నిరవాయి సరసిజాసన మనోజయమంది యింతలో | సరి లేక మనసు నిశ్చల భావమాయ || చ|| శ్రీవేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ | భావంబు నిజము గాబట్టి జెలియాత్మ |

290.nagu mogamu tODi vO - నగు మొగము తోడి వో నరకేసరి

2007-08-17 12:17 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| నగు మొగము తోడి వో నరకేసరి | నగ రూప గరుడాద్రి నరకేసరి || చ|| అమిత దానవ హరణ ఆదినరకేసరి | అమిత బ్రహ్మాది సుర నరకేసరి | కమలాగ్ర వామాంక కనక నరకేసరి | నమో నమో పరమేశ నరకేసరి చ|| రవిచంద్ర శిఖ నేత్ర రౌద్ర నర కేసరి | నవ నారసింహ నమో నర కేసరి భవనాశినీ తీర భవ్య నర కేసరి | నవరసాలంకార నర కేసరి || చ|| శరణాగత త్రాణ సౌమ్య నరకేసరి | నరక మోచన నామ నరకేసరి | హరి నమో శ్రీ వేంకటాద్రి నరకేసరి | నరసింహ జయ జయతు

289.ItaDu tArakabrahma-ఈతడు తారకబ్రహ్మ

2007-08-17 12:06 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ఈతడు తారకబ్రహ్మ మితడు మాదేవుడు కౌతుకాన చెప్పే వినగదరే వో జనులు || రాముడు యిందీవరశ్యాముడు నానాసార్వ- భౌముడు షోడశకళాసోముడు దోమటి రాక్షసులను తుత్తుమురు సేసినాడు కామిత ఫలము లిచ్చి కాచినాడు సురల || పూర్ణుడు నీలమేఘవర్ణుడు దానమున వి- స్తీర్ణుడు వాహన సుపర్ణుడు ఆర్ణవము దాటి రావణాదుల గెలిచినాడు నిర్ణయించి చెప్పరాదు నేడీతని మహిమ || వరుడు సీతకు పరాత్పరుడు కోదండ దీక్షా గురుడు దివ్యామోఘశరుడితడు నిరతి

2007-08-16

288.manasija samudra-మనసిజ సముద్ర

2007-08-16 01:03 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
మనసిజ సముద్ర | మధనమిదే || కనుగొను మింతట |కాంతుడ నీవు || సతి చింతామతి |జలనిధి తరువగ అతిగరళపు విర |హము వొడమే || తతి నా పిమ్మట |తమకపు కోర్కులు లతల కల్పకపు |లాకలు వొడమె|| పొలతి కూటములు |పొంగులు పొంగగ పులకల తారలు |పోడమె నవి ఫలమై సాత్విక |భావపు చంద్రుడు నిలువుగ పొడమగ |నేరుపు లలరె || సుదతి తానె నీ | చొక్కపు కౌగిట నదుమన నిందిర |యై పొడమె || కదిసిన శ్రీవేం |కటపతి నీదెస అధరామృతమ |య్యతివకు పొడమె ||

287.tanakEDa caduvulu-తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు

2007-08-16 12:54 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు | మనసు చంచల బుద్ధి మానీనా చ|| జడ్డు మానవుడు చదువ జదువు నాస | వడ్డివారుగాక వదలీనా | గుడ్డికుక్క సంతకుబోయి తిరిగిన | దుడ్డు పెట్లే కాక దొరకేనా || చ|| దేవదూషకుడై తిరిగేటి వానికి | దేవతాంతరము తెలిసీనా | శ్రీవేంకటేశ్వరు సేవాపరుడుగాక | పావనమతియై పరగీనా || pa|| tanakEDa caduvulu tanakEDa SAstrAlu | manasu caMcala buddhi mAnInA ca|| jaDDu mAnavuDu caduva jaduvu nAsa |

2007-08-14

286.jayajaya nRsiMha sarvESa- జయజయ నృసింహ సర్వేశ

2007-08-14 01:04 PM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| జయజయ నృసింహ సర్వేశ | భయహర వీర ప్రహ్లాద వరద || చ|| మిహిర శశినయన మృగనర వేష | బహి రంతస్థల పరిపూర్ణ | అహి నాయక సింహాసన రాజిత | బహుళ గుణ గణ ప్రహ్లాద వరద || చ|| చటుల పరాక్రమ సమఘన విరహిత | నిటుల నేత్ర మౌని ప్రణుత | కుటిల దైత్య తతి కుక్షి విదారణ | పటు వజ్రనఖ ప్రహ్లాద వరద || చ|| శ్రీ వనితా సంశ్రిత వామాంక | భావజ కోటి ప్రతిమాన | శ్రీ వేంకటగిరి శిఖర నివాస | పావన చరిత ప్రహ్లాద వరద || pa|| jayajaya

284.raMga raMga raMgapati -రంగ రంగ రంగపతి రంగనాథ

2007-08-14 12:53 AM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తఱవాయ శ్రీరంగనాథ పట్టపగలే మాతో పలచగా నవ్వేవు వొట్టులేల పెట్టుకొనే వో రంగనాథ వట్టిమాకు లిగిరించు వడి నీ మాటలు వింటే ఱట్టడి వీమేర మీఱకు రంగనాథ చేతులు చాచేవు నీవు చేరి నా చన్నులమీద రాతిరి మాయింటికి రా రంగనాథ యీతల నీ నవ్వులకే యిక్కువలు గరగితి బూతులు తిట్టాకుమీ పోపో రంగనాథ కావేరిరంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు యెక్కడికోయి రంగనాథ శ్రీవేంకటాద్రిమీద చేరి

2007-08-13

281.nIVudEvuDavu - నీవుదేవుడవు

2007-08-13 11:48 AM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
నీవుదేవుడవు | నేనొకజీవుడ ఈవిధి నిద్దరి | కెంత అంతరువు || పొడమిన జగములు | పుట్టెడి జగములు గుడిగొనె మీరోమ | కూపములు యెడయక నీరూప | మేమని ధ్యానింతు అడరి మీవాడ | ననుటే గాక || మునుపతి బ్రహ్మలు | ముందరి బ్రహ్మలు మొనసి మీ నాభిని | మొలచేరు ఘనుడవు నిన్నే | గతి నే దెలిసెద అనువుగ మిముశర | ణనుటే గాక || సహజానందము | సంసారానందము ఇహము పరముగా | నిచ్చేవు అహిపతి శ్రీవేంక | టాధిప నీ కృప మహిలో సేవించి | మనుటే గాక

283.chinni SiSuvu chinni SiSuvu-చిన్ని శిశువు చిన్ని శిశువు

2007-08-13 11:42 AM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడు చూడమమ్మ ఇటువంటి శిశువు || తోయంపు కురులతోడ తూగేటిశిరసు, చింత కాయలవంటి జడల గములతోడ మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాలతోడ పాయక యశోద వెంట పారాడు శిశువు || ముద్దుల వ్రేళ్ళాతోడా మొరవంక యుంగరాల నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలనినంత గద్దించి యశోదమేను కౌగిలించు శిశువు || బలుపైన పొట్ట మీది పాల చారలతోడ నులివేడి వెన్నతిన్న నోరితోడ చెలగి నేడిదే

282.SrIhari nityaSEshagirISa-శ్రీహరి నిత్యశేషగిరీశ

2007-08-13 11:37 AM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
శ్రీహరి నిత్యశేషగిరీశ మోహనాకార ముకుంద నమో || దేవకీ సుత దేవ వామన గోవిందా గోప గోపీనాథా గోవర్ధనధర గోకులపాలక దేవేశాధిక తే నమో నమో || సామాజావన శార్ణపాణి వామనా కృష్ణ వాసుదేవ రామనామ నారాయణ విష్ణో దామోదర శ్రీధర నమో నమో || పురుషోత్తమ పుండరీకాక్ష గరుడధ్వజ కరుణానిధి చిరంతన అచ్యుత శ్రీవేంకటేశ్వర నరమృగ తే నమో నమో || SrIhari nityaSEshagirISa mOhanAkAra mukuMda namO || dEvakI suta dEva vAmana gOviMdA gOpa

2007-08-11

280.tolliyunu marrAku toTTelane- తొల్లియును మఱ్ఱాకు

2007-08-11 12:43 AM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
ప|| తొల్లియును మఱ్ఱాకు తొట్టెలనె యూగెగన | చెల్లుబడి నూగీని శ్రీరంగశిశువు || చ|| కలికి కావేరి తరగల బాహులతలనే | తలగ కిటు రంగ మధ్యపు తొట్టెలను | పలుమారు దనునూచి పాడగా నూగీని | చిలుపాల సెలవితో శ్రీరంగశిశువు || చ|| అదివో కమలజుని తిరువారాధనం బనగ | అదన గమలభవాండమను తొట్టెలను | ఉదధులు తరంగముల నూచగా నూగీని | చెదరని సిరులతోడ శ్రీరంగశిశువు || చ|| వేదములే చేరులై వెలయంగ శెషుడే | పాదుకొను తొట్టెలై పరగగాను |

2007-08-10

279.nEneMduvOye tAneMduvOyI-నేనెందువోయె తానెందువోయీ

2007-08-10 01:00 AM Sravan Kumar DVN - అన్నమయ్య సంకీర్తనలు
నేనెందువోయె తానెందువోయీ రానీలే రానీలే రానీలే || మీనైన నాటి తన మిడుకెల్ల దిగవలె కానీలె కానీలె కానీలె || తలచూపేనాటి తలపెల్ల దిగవలె తలచనీ తలచనీ తలచనీవే || కిరికియైననాటి తన కిటుకెల్లదిగవలె తిరుగనీ తిరుగనీ తిరుగనీవే|| హరియైననాటి అదటెల్ల దిగవలె జరగనీ జరగనీ జరగనీవే|| వడుగైననాటి(తన) వస విడువంగవలె తడవకు తడవకు తడవకువే|| కలుషించే నాటి కడమెల్ల దిగవలె అలుగనీ అలుగనీ అలుగనీవే|| సతిబాసేనాటి చలమెల్ల దిగవలె

2006-12-01

కారుబారు సేయువారు గలరే

2006-12-01 08:50 AM శ్రీ హర్ష PVSS Sri Harsha - త్యాగరాజు కీర్తనలు
రాగం: ముఖారి తాళం: ఆది పల్లవి: కారుబారు సేయువారు గలరే? నీవలె సాకేత నగరిని ||కారు|| అను పల్లవి: ఊరివారు దేశజనులు వరమునులు ఉప్పొంగుచును భావకులయ్యెడు ||కారు|| చరణము(లు): నెలకు మూఁడువాన లఖిల విద్యల నేర్పు గలిగి, దీర్ఘాయువు గలిగి చలము గర్వరహితులు గాలేద? సాధు త్యాగరాజ వినుత రామ! ||కారు||

2006-11-28

కళల నేర్చిన మును జేసినది

2006-11-28 06:40 AM శ్రీ హర్ష PVSS Sri Harsha - త్యాగరాజు కీర్తనలు
రాగం: దీపక తాళం: దేశాది పల్లవి: కళల నేర్చిన మును జేసినది గాక నేమి యరవై నాలుగు క.. అను పల్లవి: కలిమిలేములకుఁ గారణంబు నీవే కరుణఁజూడవే కడుపుకోసమై క... చరణము(లు): కోరి నూపురకొండ దీసి శింగరిముని కూర్మి భుజించెనా? వైరి తమ్ముడు సారమైన రంగని ఇల్లు జేర్చెనా? సరస త్యాగరాజవినుత బ్రోవవే క...

2006-11-23

కలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ

2006-11-23 09:18 AM శ్రీ హర్ష PVSS Sri Harsha - త్యాగరాజు కీర్తనలు
రాగం: పూర్ణలలిత తాళం: ఆది పల్లవి: కలుగునా పదనీరజ సేవ? గంధవాహ తనయ ||కలుగునా|| అను పల్లవి: పలుమారు జూచుచు బ్రహ్మానందుఁడై బరగెడు భక్తాగ్రేసర! తనకు ||కలుగునా|| చరణము(లు): వేకువ జామున నీ కరమున నిడి శ్రీకాంతుఁ డమృత స్నానము జేసి తా సీ, తా కరములచే భుజించి నిను సా త్వీక పురాణ పఠన జేయుమను సాకేత పతిని సర్వాధారుని ప్రాకటముగ త్యాగ రాజనుతుని గన ||కలుగునా||

2006-11-16

కలిగియుంటే గదా కల్గును కామితఫలదాయక

2006-11-16 11:45 AM శ్రీ హర్ష PVSS Sri Harsha - త్యాగరాజు కీర్తనలు
రాగం: కీరవాణి తాళం: ఆది పల్లవి: కలిగియుంటే గదా కల్గును కామితఫలదాయక క... అను పల్లవి: కలిని ఇంగిత మెఱుఁగక నిన్నాడుకొంటి చలముచేయక నాతలను చక్కని వ్రాఁత క... చరణము(లు): భాగవతాగ్రేసరులగు నారద ప్రహ్లాద పరాశర రామదాసులు బాగుగ శ్రీరఘురాముని పదముల భక్తిఁ జేసినరీతి త్యాగరాజుని కిపుడు క...

కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా

2006-11-16 11:26 AM శ్రీ హర్ష PVSS Sri Harsha - త్యాగరాజు కీర్తనలు
రాగం: కుంతలవరాళి తాళం: దేశాది పల్లవి: కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా క... అను పల్లవి: ఇలను వెలయ వర వృష రాజుల కటు కులరుచి తెలియు చందముగానీ క.. చరణము(లు) దారసుతులకై ధనములకై యూరు పేరులకై బహు పెద్దతనముకై సారెకు భక్తవేసముకొనువారికి తారకనామ శ్రీ త్యాగరాజార్చిత క...
5 .
పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish