2007-10-09
2007-10-09 10:36 AM budaraju aswin - Comments for గుండె చప్పుడు...

Nice post

2007-10-07
2007-10-07 05:25 AM Dil - Comments for గుండె చప్పుడు...

నువ్విచ్చిన లింకు ఆ వ్యాసం పార్ట్-2 కి వెళ్తోంది సుధాకర్.

బాబాను సపోర్టు చెయ్యలనే ఆత్రుతతో సదరు భక్తుడు నానాకంగాళీ వ్యాసం ఒకటి కెలికేశాడు. ఆయన అనుచరుడి కారణంగా బాబాకు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది అనే ఒక హాస్యాస్పదమైన జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం, ఆ తరువాత అయోమయంగా “బాబా గారు స్వతహాగా భోళా మనిషి కావడం, అనుచరులను అతిగా నమ్మడం వల్ల సమస్యలు వస్తున్నాయి. పదిహేనేళ్ళ క్రితం హైదరాబాద్ సత్యసాయి నిగమాగమానికి వచ్చిన ఆయన ఆ కార్యక్రమంలో సహచరుల సలహా మేరకు గాలిలో నుంచి బంగారు గొలుసు తీయబోయారు. దానిని ఆయన గాల్లోంచి తీయలేదని, తన చొక్కా పొడుగు చేతుల్లోంచి తీశారంటూ ఒక ఆంగ్ల దినపత్రిక ఫోటోలతో సహా ప్రచురించింది. బాబా గారి భక్తులు అటువంటి వార్తలను నమ్మరు. ఆయన మీద వారికున్న విశ్వాసం అటువంటిది.”
అని రాశాడు.

ఫొటొలతో సహా పత్రికలో ప్రచురించినా బాబా భక్తులు నమ్మరట!

నెపం ఆయన అనుచరుల మీద వేసి సదరు వ్యాసకర్త ఇప్పుడు చెప్పదలుచుకున్నదేమిటి? “బాబా గారు” ఉట్టి అమాయకుడు, అనుచరులు చెప్పినట్టలా ఆడుతాడనేనా?

ఏమి తెలియని వాడు దేవుడెలా అయినాడు స్వామీ?

ఒక అ”సత్య” దేవుడిని వెనకేసుకురావడానికి ఎన్ని అబద్ధాలూ, అమాయకత్వాలూ, అజ్ఞానాలూ, మోసాలూ…

2007-10-06
2007-10-06 06:17 PM సుధాకర్ - Comments for గుండె చప్పుడు...

అదీ తెలుగు డాటు కాము ఇలా కూసింది..ఇలా రాసుకుంటే ఇక పత్రికెందుకు?

http://thatstelugu.oneindia.in/talk2006/2007/saibaba-vishwadarshan2-051007.html

2007-10-05
2007-10-05 05:32 PM సుధాకర్ - Comments for గుండె చప్పుడు...

రానారెతో నేను విభేదిస్తున్నాను. ఏదో ఒకటి చేస్తున్నాడు గదా అదే నయం అనుకోవటం అమాయకత్వ దివాళాతనం. ఎలా అయినా జనాలని మోసం చేస్తే మోసం మోసమే. లక్షల మందిని మోసం చేస్తూ వారిచ్చిన డబ్బుతోనే వారికి కొన్ని పనులు చెయ్యటం గొప్ప అయితే చరిత్రలో చాలా మంది రాబిన్ హుడ్ లు వున్నారు, బిల్ గేట్లూ, వారెన్ బఫెట్లు వున్నారు. వారిచ్చిన విరాళాల ముందు ఇవి పెద్ద లెక్కేమీ కాదు.

2007-10-05 01:22 PM kranti - Comments for గుండె చప్పుడు...

భలే రాసారండి మీరు.నేను కూడ ఈ విషయం మీద రాద్దాం అనుకున్నాను కాని,బాబా భక్తులందరు కలసి నన్ను కుమ్మేస్తారని నోరుమూసుకున్నాను.

2007-10-05 06:58 AM విశ్వనాధ్ - Comments for గుండె చప్పుడు...

రాజీవశేకరునికి అప్పజెపితే బాబాలు స్వామీజీలు పుట్టరు.
{పెనంలోచి పొయ్యిలో పడ్డట్టుగా}

ఫాదర్స్ పుడతారు “ఆమెన్” అనుకొంటూ…

సోనియాజీ,కాంగ్రెసుల మద్దతుకూడా పుడుతుంది వాళ్ళకు.

2007-10-05 02:26 AM నెటిజన్ - Comments for గుండె చప్పుడు...

ఐతే మన “రాజీవశేఖరుడు” కి చెప్పి, ప్రతి మండల కార్యాలయమ్ లో పరిధిలోను ఒక ౧౦౦ ఎకరాలు ఉచితమ్‌గా ఇవ్వమందాం.
అందులో ఒక బాబా / స్వామిని పోషించమందాం!
వోట్లు,నోట్లు, “దేశవిదేశాలనుండీ చేరుతున్న భక్తుల పరపతిని చాలావరకూ ప్రజాసేవకు ఉపయోగి”ంచుకోవచ్చు.
ఉచితంగా?
ఏమంటారు?

2007-10-04
2007-10-04 09:41 PM రానారె - Comments for గుండె చప్పుడు...

గారడీవాడైనా మాయలవాడైనా, దేశవిదేశాలనుండీ చేరుతున్న భక్తుల పరపతిని చాలావరకూ ప్రజాసేవకు ఉపయోగిస్తున్న బాబాయే నయం. ప్రజాసేవకులమని చెప్పుకొంటున్న రాజకీయ వ్యాపారులకంటే, సమానత్వం పేరుచెబుతూ మానవత్వాన్ని మరచిన మావోయిస్టులకంటే ఇతగాడేమీ హానికరం కాదని నా ఉద్దేశం.

2007-10-04 08:19 PM Uday - Comments for గుండె చప్పుడు...

అయ్యా దిల్ గారు, మీరు ఎమి రాయదలుచుకున్నారొ కాని, మన వాక్ స్వతంత్రం తొ ఇతరులని కించపరచరాదు అని నా అభిప్రాయం. భా.జా.పా వాళ్ళది తప్పు అయితే అయ్యి వుండవచ్చు, కాని వాళ్ళూ ఎ రొజు ఈ వివాధం లొ కాంగ్రెస్ వాళ్ళూ ఒట్ల ఆశతొ రాముడు ఒక్ బ్రమ అని వేసిన అఫిడవిట్ మీద గొడవ పెట్టారే కాని వేరె దేని మీద కాదు.

ఎది ఎమైనా, మీరు ఈ దేశ పౌరులుగా మీ అభిప్రాయం వ్యక్తం చేసారు…good luck..sorry boss, I am lacking time and jumping to english to express my opinion

I feel minority enrichment is different from minority appeasement which the current goverment is doing…is tht not for votes…and a cruder way than what BJP done?..ofcourse they both are theives, in my opinion the earlier goverment is better than the current one.

2007-10-04 07:38 PM సుధాకర్ - Comments for గుండె చప్పుడు...

ఎంతకు తెగిస్తున్నారు ఈ బాబాలు. చంద్రుడిలో దేవుడు కనిపిస్తే, చంద్రుని మీద కాలెట్టిన వాడినేమనాలి? దైవ సన్నిధి చేరిపోయినట్లా…అసలు ఈ బాబా కి విశ్వం మీద ఒక పరీక్ష పెట్టాలి. పైన చెప్పినలాంటు మూర్ఖ భక్త శిఖామణులు పెరిగితే ఇక నాలుక మీద నాకాన్ని చూపించవచ్చు…

నా దగ్గరకు వస్తే నరకాన్ని కూడా చూపిస్తా…హైదరాబాదు రోద్ల మీద…బాబాని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు కూడా కనిపించవచ్చు ఒక పది కిలోమీటర్లు ఈ రోడ్ల మీద బైకు నడిపితే…

2007-10-04 07:33 PM వైజాసత్య - Comments for గుండె చప్పుడు...

హహహ9

2007-09-18
2007-09-18 01:11 AM స్మైల్ - Comments for గుండె చప్పుడు...

చాలా మందికి కమ్యూనిస్టులంటేనే మొదట గుర్తుకు వచ్చే పదం…వెగటు! అదేదో గొప్ప సంగతి కనుకొన్నట్టు చేప-ఇవ్వడం-చేప-పట్టడం కథ కొన్ని వేల సార్లు చెబుతారు. వారి మాటల్లో నిజానిజాలెంతున్నా తెలంగాణా పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర శ్లాఘనీయం. నిజాంకు ఎదురొడ్డి నిలవడమే కాకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడిన ఎందరో మదాంధులకు చక్కటి గుణపాఠం చెప్పారు. నేను ఫక్తు రాయలసీమవాడినైనా…కోస్తా సంబంధం కలుపుకొన్నా…తెలంగాణాతో ఏ సంబంధం లేకపోయినా తెలంగాణా కడగండ్లు తెలిసిన వాడిని. కర్నూలు గాడిచర్ల హరిసర్వోత్తమరావు(రాయలసీమ నామకర్త)గ్రంథాలయంలో ఏకబిగిన చదివిన ‘తెలంగాణా సాయుధ పోరాటం’ ఆనాటి ప్రజల కన్నీళ్లను కళ్ళారా చూపించింది. తెలంగాణా గురించి మాట్లాడేవారెవరయినా 1948కు ముందటి చరిత్ర ఒక్కసారి చదివితే మంచిదని నా అభిప్రాయం!

2007-09-17
2007-09-17 11:11 PM Ravi - Comments for గుండె చప్పుడు...

Oh! God……..

2007-09-17 10:09 AM Madhavarao Tallapaneni - Comments for గుండె చప్పుడు...

danyavaadamulu, ee vaarthanu maaku telipinanduku.

2007-09-11
2007-09-11 01:44 AM చదువరి - Comments for గుండె చప్పుడు...

మీడియా వాళ్ళు రావడం, ఫోటోలు తియ్యడం.. ఇవి జరగాలి. వాళ్ళుండబట్టే కదా మనకు సంగతులు తెలిసింది. కాకపోతే మనవాళ్ళకి కాస్త అత్యుత్సాహం! పదిమంది చనిపోయారని ఒకరంటే పదిహేను మందని మరొకరు.. ఇలా సాగాయి ఆనాటి సంఘటన వార్తలు.

“దయచేసి ప్రమాదాలు, దుర్ఘటనలు జరగగానే మీరు అక్కడ వాలిపోకండి.” - అవును, ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు నాయకులు వెళ్ళగూడదు. వాళ్ళక్కడికి వెళ్ళినందువలన ప్రయోజనం వాళ్ళకే!

జూబిలీ హిల్స్ నేరాలు అని ఓ పుస్తకం రాయొచ్చనుకుంటా. కాల్పులు అనేది అందులో ఒక అధ్యాయం.

2007-09-10
2007-09-10 05:31 PM T. L. Bala Subrahmanyam - Comments for గుండె చప్పుడు...

మీడియాని తప్పుపట్టకూడదు.వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తున్నారు. వాళ్ళు అలా చెయ్యకపోతే బహుశా నాకు చాలా కోపం వచ్చివుండేది.

మిగతావాళ్ళ సంగతి చెప్పలేను కాని ఒక ప్రతిపక్షనాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా నాయుడుగారు అలాంటి సంఘటన జరిగినప్పుడు తప్పనిసరిగా వచ్చితీరాలి. తన పరిపాలనానుభవంతో ఈ సంఘటనని బేరీజువెయ్యాలి. ఆయన అదే చేశాడు. అందుకాయన్ని అభినందిస్తున్నాను.

ఇకపోతే సహాయ కార్యక్రమాలు : అక్కడ జరగాల్సిన ఘోరం ఎలాగూ జరిగిపోయింది. సహాయం పాత్ర చాలా స్వల్పం. ఎవరూ రాకముందే స్థానికులు గాయపడ్డవాళ్ళని ఆస్పత్రులకు మోసుకెళ్ళారు. శిథిలాల్లో ఇరుక్కుపోయిన శవాల్ని తియ్యడం అనేది సాధనసంపత్తి సుశిక్షిత సిబ్బందీ గల ప్రభుత్వానికే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు సాధ్యం కాదు.

2007-09-10 05:30 PM T. L. Bala Subrahmanyam - Comments for గుండె చప్పుడు...

మీడియాని తప్పుపట్టకూడదు.వాళ్ళు ఏం చెయ్యాలో అది చేస్తున్నారు. వాళ్ళు అలా చెయ్యకపోతే బహుశా నాకు చాలా కోపం వచ్చివుండేది.

మిగతావాళ్ళ సంగతి చెప్పలేను కాని ఒక ప్రతిపక్షనాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా నాయుడుగారు అలాంటి సంఘటన జరిగినప్పుడు తప్పనిసరిగా వచ్చితీరాలి. తన పరిపాలనానుభవంతో ఈ సంఘటనని బేరీజువెయ్యాలి. ఆయన అదే చేశాడు. అందుకాయన్ని అభినందిస్తున్నాను.

ఇకపోతే సహాయ కార్యక్రమాలు : అక్కడ జరగాల్సిన ఘోరం ఎలాగూ జరిగిపోయింది. సహాయం పాత్ర చాలా స్వల్పం. ఎవరూ రాకముందే స్థానికులు గాయపడ్డవాళ్ళని ఆస్పత్రులకు మోసుకెళ్ళారు. శిథిలాల్లో ఇరుక్కుపోయిన శవాల్ని తియ్యడం అనేది సాధనసంపత్తి సుశిక్షిత సిబ్బందీ గల ప్రభుత్వానికే తప్ప ప్రైవేట్ వ్యక్తులకు సాధ్యం కాదు.

2007-09-10 10:17 AM Sudhakar - Comments for గుండె చప్పుడు...

అసలు ఆత్మహత్య ఎవరో చేసుకుంటే ఈ వెంకట్ అపస్మారక స్థితిలోకి ఎందుకు పోయాడో అర్ధం కాదు. ఇక అతని భార్య కూడా అపస్మారక స్థితిలోకి పోవటం మరొక కామెడీ. మీరన్నట్లు ప్రతీ దానికి ఒక ఫార్ములా వుంది. బహుశా వెంకట్ ఇది జరిగిన వెంటనే ఒక **య్య కు ఫోన్ చేసి ఏ ఆసుపత్రిలో ఎలా చేరాలో కనుక్కుని వుంటాడు. చంద్రబాబు దీనిపై ఏంటో కిక్కుమనటం లేదు. గట్టిగా మాట్లాడితే వియ్యంకుడికే దెబ్బ అని కాబోలు.

ఎంతయినా పెద్దోల్లందరూ మంచోల్లు…పోలీసో్ల్లు పెద్దోల్ల తీపి గురుతులు.

2007-09-10 08:53 AM Madhavarao Tallapaneni - Comments for గుండె చప్పుడు...

vasundara garu meeru cheppinadi correct, alaa vaallu photos tiyyakoodadu kaani, media vallane aa matramu chalanamu avina vastunnadi adikaarikaganaaniki, leka pote vaallu aa marunaadu vastaaru, adi mana paristiti.

2007-09-10 07:58 AM vasundhara - Comments for గుండె చప్పుడు...

ఇంకొకరిని మర్చిపోయారు. న్యూస్ రిపోర్టర్లని. ఒక పక్క శిధిలాల్లో శవాలు ఇరుక్కుంటే సహాయం మాని పత్రికా విలేఖర్లు శవాల ముఖాలపై కెమేరా పెట్టి ఫొటోలు తీస్తున్న దృశ్యాన్ని వార్తల్లో చూసి నేనూ మా వారూ చాలా బాధపడ్డాం. శవాలతో వ్యాపారం చేయాలని రాజకీయనాయకులు అనుకుంటుంటే దానిలో భాగస్వామ్యం కావాలని మీడియా ప్రయత్నిస్తోంది.

2007-08-29
2007-08-29 06:34 AM Dil - Comments for గుండె చప్పుడు...

చదువరి గారూ,

ఒకసారి అలోచించండి. నేను చెప్పదల్చుకున్నది ఏమిటంటే తీవ్రవాదాన్ని కొన్ని చోట్ల ప్రత్యక్షంగా మరికొన్ని చోట్ల పరోక్షంగా పెంచి పోషిస్తున్నది అమెరికా. అంతెందుకు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఎక్కడ ఉంటున్నాడో అడ్రస్ తో సహా మన గూడచార ఏజెన్సీలు బయటపెట్టాయి. అలాంటివాడికి ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్ ను అమెరికా టెర్రరిజం పై పోరులో తన మిత్రదేశంగా ప్రకటించడం ఏమిటి? అమెరికాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే ముందు కనీసం ఇటువంటి కరడుగట్టిన తీవ్రవాదులను అప్పగించేలా తన మిత్రదేశంపై వత్తిడి తేవాలని షరతు పెట్టలేమా?

విదేశీ టెర్రరిస్టు బృందాలు స్థానికులను తమలో చేర్చుకునేందుకు అనేక పద్ధతులు ఉపయోగిస్తాయి. హిందువుల నుండి ముస్లిములకు చాలా ముప్పు ఉందనేది అందులో ఒకటి. దురదృష్టవశాత్తూ ఒక్కోసారి వారు చెప్పింది నిజం చేస్తారు మన వీర హిందూ మతోన్మాదులు. ఇక పేదరికం, నిరుద్యోగం వంటి సామాజిక సమస్యలు కూడా యువతను టెర్రరిజం వైపు మళ్లిస్తున్నాయన్నది ఇదివరకే రూఢి అయిన విషయం.

వ్యాధి ఏమిటో తెలుసుకుని దానికి మందెయ్యాలనేదే నా కోరిక. వ్యాధి లక్షణాలకు చికిత్స చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. ఇంకోలా చెప్పాలంటే ఆయుధం పట్టుకున్న చేతిని శిక్షించాలి. ఆయుధాన్ని కాదు.

2007-08-28
2007-08-28 06:10 AM చదువరి - Comments for గుండె చప్పుడు...

బాంబు దాడుల్లో చనిపోయింది అన్ని మతాల వాళ్ళూ.. నిజమే! కేవలం ఒక్క మతాన్నే లక్ష్యంగా చేసుకుని దాడి చేసారు అని ఎవరూ అనగా నే చూడలేదు. కానీ ఈ దాడులకు మోటివేమిటి? హేతువేమిటి? ప్రేరణేమిటి?

ఉగ్రవాదులకు మతమేమిటీ, కులమేమిటి అని అడగడం బానే ఉంటుంది. కానీ చంపేవాడెవడైనా చంపేందుకు కారణమేదో ఒకటుంటుంది. నక్సలైట్లకొకటి, మతవాద ఉగ్రవాదులకింకోటి. కానీ కారణమంటూ ఒకటుంటుంది. ఇస్లామిక ఉగ్రవాదానికి మతమే, మతబోధలకు వాళ్ళిచ్చుకునే భాష్యాలే పునాది అనేది కాదనలేం. ఉగ్రవాదం ఎక్కడో అఫ్ఘనులో పుట్టింది.. కానీ ఇక్కడ బాంబులెలా పేలాయి? వాళ్ళనిక్కడ దాచి, పోషించి, కాపాడి, సహకరించే - స్లీపర్లట, మాడ్యూళ్ళట, మోల్సట - వాళ్ళనేమనాలి? ఏంచెయ్యాలి? ఏంచెయ్యాలో తెలిసిన పోలీసులను ఏమీ చెయ్యనీయని రాజకీయాలనేమనాలి? చేదుగా ఉంటాయని నిజాల గురించి మాటాడకుండా బయటి దేశాలను అంటే పేలుళ్ళాగుతాయా?

అసలు ఎక్కడో అఫ్ఘానులోని ఉగ్రవాదులకు ఇక్కడి వారు సాయమెందుకు చేసారు? ఏమాశించి తమ ఊరిని తామే కాల్చేసి, తమ వాళ్ళను తామే పొట్టన బెట్టుకున్నారు? ఏదో ఒక మోటివుండాలి కదా.. ఏంటది? ముందు మన పక్కలో బల్లేలను, మన ఇంటి దొంగలను పట్టుకోవాలి.(థాకరేతో సహా) మన ఇల్లు చక్కబెట్టుకుంటే పరిస్థితులు అవే మెరుగౌతాయి.

2007-08-27
2007-08-27 05:12 PM నాగరాజా - Comments for గుండె చప్పుడు...

మిగతా బాంబుల్ని నిర్వీర్యం చేయడం కొంత ఉపశమనం. సెప్టెంబరు పదకొండుతో అమెరికాకు కూడా అమ్మకం వల్ల “లాభాలు” తెలిసివచ్చాయి. అమెరికాని, రాజకీయ నాయకుల్ని, పౌర-అక్కల నాయకుల్ని, పాత పద్ధతుల్ని వదిలేసి కొత్తగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయింది. “టెర్రరిస్టులను ఎదుర్కోవాలంటే మనం ఇక రొటీన్ కి భిన్నంగా ఆలోచించాలి” అని చక్కగా చెప్పారు…

2007-08-27 04:12 PM రవి వైజాసత్య - Comments for గుండె చప్పుడు...

వైద్యులు చల్లగా ఉండాలంటే జనాలకు రోగాలు రావాలి. అంత మాత్రం చేత వైద్యులే ఉండకూడదూ అంటారా ఏమిటి? ఆయుధాలు ఉండాలి, అమ్మేవాళ్ళు ఉండాలి. ఉపయోగించే వాడికీ కొంచెం బుర్ర ఉండాలి

వ్యాఖ్యలు
పైకిబ్లాగులువ్యాఖ్యలువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish