2007-10-09
2007-10-09 09:05 PM స్మైల్ - శ్రీ కృష్ణదేవరాయలు
నా ముద్దుపేరు చింతు.చిన్నప్పటి నుంచి ఇంటిలో, ఇంటి దగ్గర అందరూ నన్ను పిలిచిన పేరు ఇదే. కానీ పాఠశాలలో నా పేరు ఇస్మాయిల్ సుహేల్.ఇప్పుడు అందరికీ నేను ఇస్మాయిల్ నే. చిన్నప్పటి నుంచి నాతో పరిచయమున్న వారు ఎప్పుడైనా చింతు అని పిలిస్తే ఆ ఆనందమే వేరు.ఇక ఆ పేరెలా వచ్చిందంటే: మా నాన్న నాకు ముద్దుపేరు ఏం పెట్టాలని వెతుకుతూంటే ('75) రిషికపూర్ ముద్దుపేరు 'చింటు' నచ్చి నాకదే పేరు ఖాయం చేశాడు. అసలు ఆయనకు ఆ పేరు
2007-10-09 08:17 PM నవీన్ గార్ల - చదువరి
నాలాగే మీక్కూడా రాజకీయాల మీద ఆసక్తి ఉంది కాబట్టి చెబుతున్నాను. ఇంతకు ముందు రానారె బ్లాగులో చెప్పాను. ఆదివారం రాత్రి 9:00కు ఈటీవీ2లో "మాయాబజార్" అనే కార్యక్రమం వస్తుంది తప్పక చూడండి.అది ప్రస్తుత రాజకీయాలపై విసుర్లతో, సెటైర్లతో నిండి ఉంటుంది. శనివారం ప్రొద్దున్నె 11:30కు మళ్ళీ వేస్తాడు. ఇందులో రాజకీయ నాయకులను నేరుగా అనకుండా మారుపేర్లు పెట్టి ఏకిపారేస్తాడు..ఉదాహరణకుపంచెకట్టు భక్తవత్సలం =
2007-10-09 08:13 PM Budaraju Aswin - చదువరి
baavundanDI
2007-10-09 07:46 PM నేనుసైతం - చదువరి
చదువరి గారూ, కమీషన్ నిష్పక్షపాతంగా రిపోర్ట్ ఇస్తే చూసి తట్టుకోగల గుండెధైర్యం ఉందా మనకి? అజ్ఞానం కన్నా ఆనందం లేదు గొర్రెదాటు జనానికి.-నేనుసైతం
2007-10-09 07:34 PM మరమరాలు - చదువరి
అహా! ఏమి మన భాగ్యము, చదువరి గారి మాట చలువతో ఇదే కనుక జరిగితే.. మన తెలుగువాళ్ళు అందరికీ ఉంటుది, నెత్తిన ఓ బంగారు కిరీటం. -
2007-10-09 07:24 PM కొత్త పాళీ - విహారి.
విడియో ఇప్పుడే పూర్తిగా చూశాను. కామెంట్లూ విమర్శలదేముందీ .. ఎన్నైనా రాయొచ్చు, కానీ ఏదైనా కొత్తగా చెయ్యటం కష్టం. వినూత్నమైన ప్రయత్నం, మొదటి అడుగే కాకుండా ప్రశసనీయమైన ప్రయత్నం. అభినందనలు.
2007-10-09 05:44 PM వికటకవి - Comments for వికటకవి
అశ్విన్ మరియు నాగారాజా లకు నెనర్లు.
2007-10-09 05:16 PM సత్యసాయి కొవ్వలి - జ్యోతి
బాగా వ్రాసారు. కానీ ఆమాత్రం తారీకులు గుర్తుంచుకోగలిగితే సోషల్లో 4 మార్కులెక్కువ తెచ్చుకుని ఉండేవాడిని… ప్చ్. :))
2007-10-09 06:06 PM Budaraju Aswin - రెండు రెళ్ళు ఆరు
చంపేశారు 2*2=4మాటలు రావట్లేదుఅబ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బ్బాఆఆఆఆ
2007-10-09 05:00 PM వైజాసత్య - జ్యోతి
అడగంది అమ్మైనా పెట్టదు అన్న సామెత ఎంతవరకూ నిజమో కానీ అడగంది మగాడు ఇవ్వడు అన్నది మాత్రం అక్షరాలా నిజమేమో. పెళ్ళితో భార్యను సాధించాము. ఇంక అక్కడితో ఆ సమస్యా పూరణం అయిపోయింది. ఇంక దాని (సమస్య) గురించి ఆలోచించమెందుకు అనుకుంటారు మగాళ్ళు. మైండ్ లో ఒక ఓపెన్ ప్రాసెస్ తో మగాళ్ళు నిద్రపోలేరు. దాన్ని బలవంతగా బజ్జో పెట్టాలి లేకపోతే ఆ ప్రాసెస్ కు ముగింపైనా పాడాలి. ఒక జన్మదినము కంటిన్యువస్ గా గుర్తుపెట్టుకోవటమనేది మగాడి బుర్రని తినేస్తుంది.
ఆడాళ్ళకి టిప్: మీకు ముఖ్యమైన రోజుకు ముందు దాన్ని గుర్తుచేస్తూ మీ ఆయనకి SMS కొట్టండి. ఆ గిఫ్టుకంటే గుర్తు పెట్టుకోవటమే ముఖ్యం అని అడాళ్ళంటారు (అదేకదా మరి తంటా)
2007-10-09 05:29 PM Budaraju Aswin - జగన్నాటకం
చాలా బావుంది మీ బ్లాగు మంచి విషయాలు రాసారు,రాస్తున్నారు ఇలా నే కొనసాగుతుందని ఆశిసితున్నను, ము
2007-10-09 03:48 PM కొత్త పాళీ - కల్హార
జూన్ నించి అక్టోబరుకి నాలుగు నెలలు.
త్వరలో మీ కొత్త పద్యాన్ని చూడాలి.
No pressure
2007-10-09 01:59 PM యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ - జ్యోతి
ఎంత తెలుగు తనం వుట్టి పడుతోంది..ఈ బ్లాగులలొ..
మీ అందరికీ ధన్యవాదాలు..
యడవల్లి శర్మ
2007-10-09 01:54 PM budaraju aswin - Comments for ప్రసాదం
అసలు కంటే మందు ముద్దు కదండి
ఖచ్చితంగా వస్తారు
2007-10-09 01:31 PM jyothi - జ్యోతి
జాన్ గారు ,
అందుకే ఇలాంటి చిన్ని చిన్ని సంతోషాలు భార్యాభర్తలను ఇంకా దగ్గర చేసి వారు కలిసి ఆనందంగా ఎన్ని సమస్యలనైనా ఎదుర్కునేలా చేస్తాయని నా అభిప్రాయం.
2007-10-09 01:27 PM jyothi - జ్యోతి
అవునండి. దోఖా అంటే హిందీలో మోసం.
2007-10-09 01:20 PM నెటిజన్ - జ్యోతి
“నిజమే జ్యోతిగారు.
ఎంతైనా భర్త గదా!
అందుకని వారికి గుర్టువచ్హేలాగ, వారు ఆఫిసుకి వెళ్ళేటప్పుడు చిన్న హింట్ ఇస్తాను.
మల్లీ అఫ్ఫిసుకి కూడా ఫోను చేసి హింట్ ఇస్తాను.
ఆయన మరిచిపోకండా, ఆ సాయంత్రమ్ తొందరగా ఇంటికి చేరుకునేవారు.చక్కగా ఒక రెండు మూరల పువ్వులు తెచ్చిపెట్టేవారు.
నా అనందం చూసి వారు చాలా సంతోషించేవారు!
చీరలు వారికి గుర్తువచ్చినప్పుడు, నేను ఉహించనప్పుడు, నన్ను ఆస్చర్యపరిచే విధంగా కొనివ్చేవారు.
పాపం ఒకొక్కసారి ఎక్కువ ధర పెట్టికొనేవారు. వారికి తెలియదుగదా! ఆరోజున కొంచెం భాద పదేదానిని.ఆనవసరంగా ఎక్కువ పెట్టి కొన్నారు కదా!
కాని భలే సంతోషం వేసేది. నేను అడగకుండా కొనిచ్చేవారు కదా.
ఏమిటో అదో తుత్తి!”
- మా వారి పెళ్ళాం.
2007-10-09 01:09 PM వికటకవి - జ్యోతి
“అలాగని భార్య మీద ప్రేమ లేదని నేననను. కాని అప్పుడప్పుడు ఆ ప్రేమను కాస్త వ్యక్తపరుస్తుండాలని”…
నిజమే, కానీ అదే పెద్ద సమస్య. మన సంస్కృతిలో వ్యక్తపరచటం అన్నది ఓ ఎబ్బెట్టు వ్యవహారంగా చాన్నాళ్ళ నుంచి ఉంది. ఏదో ఈ సినిమా ప్రభావాలవల్ల ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి అలవడుతోంది.
2007-10-09 01:51 PM cbrao - విహారి.
ఏకవీర విహారీ! సరిలేరు, నీకెవ్వరూ. ఇరగదీసావ్.అభినందనలు.మీ ప్రోగ్రెస్స్ రెపోర్ట్ అందుకోండి.రాజశేఖర్ గా 9/10 మార్కులుఎల్.బి.శ్రీరాం గా 6/10చంద్రబాబుగా 3/10ఆహార్యం 7/10Stage lighting 4.5/10 చాలా సన్నివేశాలలొ, shadows, performance effective value ను తగ్గించాయి. ఎల్.బి.శ్రీరాం డైలాగ్ డెలివరి లో స్పష్టత లోపించింది. స్టైల్ కుదిరింది. చంద్ర బాబు వీడియోలు మీరు కొన్ని చూడాలి.తొలి తెలుగు వీడియో బ్లాగూగా
2007-10-09 12:35 PM chanukyagv - జ్యోతి
నా మనసుకు నచ్చిన blogs లో ఇది no.1 అని నిస్సందేహముగా చెప్పవచ్చును.నాకు ఈ రోజు కనువిప్పు కలిగింది.
2007-10-09 12:10 PM చదువరి - జ్యోతి
హిందీ మోసం ధోఖా అనుకుంటాగదా!?
2007-10-09 11:58 AM జాన్ హైడ్ కనుమూరి - జ్యోతి
జ్యోతి గారికి ధన్యవాదాలు
మీ బ్లాగు చదువుతుంటే ఈ నెలలో మాపెళ్ళి రోజువున్నదని గుర్తుకువచ్చింది.
అనేక వత్తిడుల మద్య కట్టుబట్టలతో ఖైరతాబాదులో దిగిన రోజులు గుర్తుకొచ్చాయి.20 ఏళ్ళు పూర్తి అయ్యాయి. మేము మీరుచెప్పినట్టు పండగలు, పబ్బాలు, తద్దినాలు చేయలేదు గాని ఆర్థింకంగా నిలదొక్కుకోవడానికి అనేక ప్రయత్నాల మద్య బహుశ ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకున్న గుర్తులేదు. పిల్లలు, రొగాలు, రొష్టులు, మారిన వుద్యోగాలు, మారిన అద్దె ఇళ్ళు వీటన్నిటి మద్య మాజంట పడిన వంటరిపోరాటం గుర్తుకువచ్చాయి.
2007-10-09 12:39 PM చదువరి - విహారి.
ముందు రాసిన టెక్స్టు చూసాను. తీరుబడిగా మళ్ళీ చదువుదామని అనుకుని మళ్ళీ ఇప్పుడు చూస్తే - అది తీసేసారు! వీడియో బ్లాగు ప్రయోగం బాగుంది.
2007-10-09 11:44 AM తెలుగు వీర - విహారి.
హై హై నాయకా..తొలి తొలుగు వీడియో బ్లాగు టపా అందించినందుకు నెనర్లు. మీ ప్రయత్నం చాలా బాగుంది
2007-10-09 10:36 AM budaraju aswin - Comments for గుండె చప్పుడు...
2007-10-09 10:51 AM Budaraju Aswin - శ్రీ కృష్ణదేవరాయలు
నేను మరమరాలు తో కలుస్తున్నాను smile గారు
2007-10-09 10:34 AM కొత్త పాళీ - విహారి.
ఆంగికం అదిరింది. పూర్తిగా చూడ్డానికి కొంచెం ఓపిక, బోలెడు టైమూ కావాలి. :-)Short and sweet niext time, okay?
2007-10-09 10:17 AM జ్యోతి - విహారి.
సూపర్ విహారి...అదరింది నీ అభినయనం
2007-10-09 10:17 AM జ్యోతి - విహారి.
సూపర్ విహారి...అదరింది నీ అభినయనం
2007-10-09 09:38 AM ప్రవీణ్ గార్లపాటి - విహారి.
వంద టపాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు.వీడియో బ్లాగు ప్రయత్నం బాగుంది.
2007-10-09 09:27 AM prasadm - విహారి.
అయ్యా, అభినయ విహారి! ఈ ప్రయత్నం అదిరింది. అర్థశతటపోత్సవ అభినయాపు ఆలోచనకు, మీ అబినయానికి అభినందనలు ప్రసాదం
2007-10-09 08:42 AM నేనుసైతం - విహారి.
విహారి గారు,ముందుగా మీకు అభినందనలు.మీ ప్రయత్నం వెరైటీ గా ఉంది.మీ జైత్రయాత్ర కొనసాగించండి."సూపరు, ఇరగ దీశారు, అదిరింది, చింపేశారు, మార్వలెస్, అద్భుతం " :)-నేనుసైతంhttp://nenusaitham.wordpress.com
2007-10-09 08:30 AM వికటకవి - విహారి.
@విహారి,మీ 100వ టపాకు శుభాభినందనలు. నూరోది ప్రత్యేకంగా ఉండాలి అన్న ప్రయత్నం విజయమైనట్లే. కాకపోతే, విజయం ఏ స్థాయిలో అంటే, కచ్చితంగా పాసు మార్కులే. కానీ, మొదటి ప్రయత్నంలో అది విజయంతో సమానమే. పాసు మార్కులని చెప్పా కాబట్టి, విషయ విశ్లేషణ చేయదలచుకోలేదు.http://sreenyvas.wordpress.com
2007-10-09 08:27 AM రానారె - మనిషి
నాగరాజగారికి నెనరులు. ప్రసాదుగారు - మీరనే అర్థం వస్తుంది. కానీ ఇంకోలా తీసుకోవాలని మనవి.పైకోర్టు చీవాట్లుప్రభువులకు అలవాట్లుప్రభువులకు అలవాట్లుపాలితుల గ్రహపాట్లుఅని చదువుకోవాలన్నమాట :).ఊకదంపుడుగారు - మీ ఆశీఃపూర్వక అభినందనలకు మీకనేక ధన్యవాదాలు. సంఖ్య ఇవ్వవచ్చునుగానీ, ఇప్పుడు రాస్తున్నవాటిలో కసుగాయలుండవచ్చు, వాటిని ఏరివేయాలనుకున్నప్పుడు అన్నింటికీ సంఖ్యను మార్చాల్సివస్తుందేమోనని... ఆరు పదాలు ఒక
2007-10-09 08:00 AM రానారె - విహారి.
దుస్తులు, మేకప్ విషయాల్లోనే మీకు చాలా మార్కులు వేసేస్తున్నాను. తరువాత, ఆ ఆత్మ పాత్రను తెరమీదకు తేవాలన్న ఆలోచన. చాలా కష్టపడాలి. చాలా ధైర్యం కావాలి. స్క్రిప్టు చాలా బాగుంది. అందరూ అంటున్నట్లుగా సంభాషణలను పలికేటప్పుడు కాస్త సాగదీశారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంభాషణలు, నిర్మాణపు ఖర్చులు, చివరికి లైట్ బోయ్, పబ్లిసిటీగంగాధర్ అన్నీ మీరే కావడం వల్ల ఆ మాత్రం లోపం జరగడం మొదటిప్రయత్నంలో చాలా మామూలే.
2007-10-09 06:26 AM మరమరాలు - శ్రీ కృష్ణదేవరాయలు
చాలా సంతోషకరమైన టపా. మీకే కాదు, ప్రతి తెలుగు వాడికి గర్వకారణమై. గురుశిష్యులకు నోబెల్ వచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి, డా.బెల్లంకొండ కృష్ణకిశోర్ గారికి కూడా త్వరలో నోబెల్ రావాలి అశిస్తూ..-మరమరాలు
2007-10-09 06:15 AM బ్లాగేశ్వరుడు - జగన్నాటకం
జ్యోతి గారు నారదుడు గురించి మీరు వ్రాసింది ఏపురాణం నుండి???, నాకు సరిగా జ్ఞాపకం లేదు నేను ఏ పురాణం నుండి చదివానో కాని నారదుడు బ్రహ్మ కుమారుడు , దక్షుడు వల్ల శాపం పొంది మళ్ళి జన్మ ఎత్తుతాడు. నేను చదివిన పురాణం మళ్ళి నెమరు వేసి నారదుడు గురించి బ్లాగుతాను
2007-10-09 06:11 AM జ్యోతి - విహారి.
ఈ టపాలో రాసిన ఒక్కముక్క అర్ధమైతే నా వెయ్యి టపాల మీద ఒట్టు. నమస్తె విహారన్నయ్యా. బాగున్నావా..
2007-10-09 03:50 AM మేధ - నాలో 'నేను'
@మరమరాలు గారు, @విహారి గారు నెనర్లండీ...
2007-10-09 03:50 AM విహారి(KBL) - నాలో 'నేను'
చాలా బాగుంది.
2007-10-09 04:49 AM Budaraju Aswin - నైమిశారణ్యం
చాలా బావుందండి హాసిని గారు ఈ కాలం లో ఇలాంటి విషయాలు దొరటం, చదవటం అరుదుమీకు ధన్యవాదాలు మనసారా
2007-10-09 04:12 AM Sharma VJ - విహారి.
గుల గులా!!గుల గులా.మీ జంభ బ్లాగు, బాగు బాగు.
2007-10-09 03:28 AM oremuna - విహారి.
ఈ పైన వ్రాసినదంతా చదివినాను, తరువాత ఏమీ అర్థం కాలేదు, నా కంప్యూటరు మూగది, దానికి మాట్లాడం రాదు, చెవిటిది కూడా, మనం ఏంమీ చెప్పలేము, ఏదో కొద్దిగా నాలుగు అక్షరమ్ ముక్కలు నేర్పబట్టి కీబోర్డు ఉపఓగించి, మానిటరు ఉపయోగించి మేము మాట్లాడుకుంటాము.
2007-10-09 02:21 AM తెలుగు వీర - ఋ ౠ ఌ ౡ
బ్లాద్బద్దకానికి మిల్క్ ఆఫ్ బ్లాగీషియా ఉదయాన్నే లేవగానే ఒక చెంచా పట్టించాలి :-)
2007-10-09 03:12 AM Viswanath - విహారి.
బుళక్ బుళక్... క్లొంచెం వ్లాంతి వచ్చేల్టే లుంది.--హు!హు! గిదేందన్నోయ్ గిస్మంట్ టపా ఇడిచినవ్రాతల్తో చంపనీకి నీకు బ్లాగ్లోళ్ళే దొరికిన్ర అన్నయాడికెళ్ళి దొరకబుచ్చుకున్నవే గిసంటి తరీక