2013-02-02
తెలుగుపదం Google Group: ఒక పద్యం - చరంబు గల ...
*మ్రొక్కిన వర మీని వేల్పు తేటతెలుగు చూ***
*చక్కగ చూపని చరంబు ***
*గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతీ!***
శంకరాభరణం: సమస్యాపూరణం – 955 (హంస పాలను వీడు)
శంకరాభరణం: పద్య రచన – 240
2013-02-01
తెలకపల్లి రవి: గడువులు, గండాలు
మనసులో..: ఓ ప్రాణం లోకం చూడలేకపోయింది.. :(
గత 17 రోజులుగా రకరకాలుగా చేసిన పోరాటం….
ప్రాణాలు వదులుకోవలసి వచ్చింది…
ఆ బాధ కూడా ఓర్చుకోగలిగే స్థైర్యాన్ని స్వంతం చేసుకున్నందుకు గర్వపడాలో… బండబారిన హృదయం చూసి సిగ్గుపడాలో….
ఈ 17 రోజులూ నా భార్య మానసికంగానూ, శారీరకంగానూ.. నేను మానసికంగానూ ఎంత నరకయాతన అనుభవించామో… అయినా నేను నార్మల్‌గానే ఉండడానికి ఎన్ని రకాలుగా ఉద్వేగాల్ని చల్లార్చుకోవలసి వచ్చిందో…
బంగారం లాంటి ఆడబిడ్డ లోకం చూడకుండానే వెళ్లిపోయింది…. ప్రెగ్నెన్సీలో హై బిపి వల్ల బాధలు పడి!!
అందుకే మొన్న మెటర్నటీ వార్డ్ గురించి ఓ పోస్టులో రాశా… మనకున్న ఈ ప్రాణం అదృష్టం మాత్రమే… దాన్ని తెలుసుకోలేకపోతున్నాం అని! ఆ అదృష్టాన్ని మా బిడ్డ దక్కించుకోలేకపోయింది…..
జాలి కోసమో, ఇంకో దానిని ఆశించో ఇది రాయట్లేదు.. బ్రతుకు విలువ ఇప్పటికైనా ఎవరికైనా అర్థమవుతుందన్న ఆశతో నేను తొక్కిపెట్టుకుంటున్న బాధని పంచుకుంటున్నా…
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
2013-01-31
పారదర్శి: ‘మిసిమి’ వ్యాసాలు
దీప్తి ధార: ఆమె ఎవరు?
మనసులో..: మసాలా కావాలా.. ఇంకేమైనానా…
గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌లో ఏం రాయాలో, ఏం రాయకూడదో, ఏం రాస్తే ఎలాంటి తంటాలు వస్తాయో తెలీక చాలామంది గందరగోళంగా ఉన్నారు… మరికొంతమందైతే FB చాలా చప్పగా ఉంటోందని అంటున్న వాళ్లూ లేకపోలేదు…
ఏదో ఒక వివాదానికీ, ఎమోషనల్ పోస్టులకో మనం అలవాటుపడిపోయాం… తిట్టడానికీ, ద్వేషించడానికీ మనకూ ప్రతీ క్షణం ఏదో ఒక కారణం కావాలి… కసిదీరా మేధస్సునంతా ఉపయోగించి నెగిటివ్ ఎమోషన్లు కురిపించేయాలి… లేదా అలా కురిపించబడే updatesని చదువుతూ మనం వినోదించాలి….
ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలతో అందరూ కాస్త ఆచితూచి వ్యవహరిస్తుండేసరికి వివాదాలకు, శృతిమించిన రాతలకు అలవాటుపడిన మనస్సులకు చాలా వెలితి తెలుస్తోంది..
సరిగ్గా ఇదే మంచి సమయం… నెగిటివ్ ఎమోషన్లతో కొట్టుకుపోతున్న మనలోని స్థబ్ధతను మంచి ఆలోచనల వైపు మళ్లించడానికీ! పాజిటివ్ ఎమోషన్లయిన ప్రేమ, ఎఫెక్షన్, హెల్పింగ్ నేచర్, బలమైన హ్యూమన్ రిలేషన్లు వంటి వాటి వైపు మళ్లించడానికి!!
మనస్సులోని ఆలోచనలు ఎటు ప్రేరేపిస్తే అటు పరుగెడతాయి.. చుట్టూ వేల మంది నెగిటివ్ ఎమోషన్లని ప్రేరేపించే వాళ్లుంటే ఎంత బలంగా మంచిగా ఆలోచించాలనుకున్నా మన మనస్సు కలత చెందుతూనే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి స్థబ్ధతతో కూడిన వాతావరణం నుండైనా మనస్సు దారిని మంచి ఎమోషన్ల వైపు అందరం మళ్లించుకోవలసిన అవసరం చాలా ఉంది.
మంచి ఎప్పుడూ చప్పగానే ఉంటుంది… కారణం దానిలో మసాలాలేమీ ఉండవు కాబట్టి! కానీ రక్తాన్ని మరిగించే మసాలాలు ప్రాణాలు తీస్తాయి…. రక్తాన్ని శాంతింపజేసే చప్పదనం ఆహ్లాదాన్ని పంచుతుంది…. ఏది కావాలో నిర్ణయించుకుందాం..
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
2013-01-30
దీప్తి ధార: ఫేస్‌బుక్ అసభ్యరాతల నిందితుల నిర్బంధం
దీప్తి ధార: గాంధీజీ చివరి క్షణాలు
అమృతమథనం: సురభి నాటక సమాజం .. కాంగ్రెస్ పార్టీ .. 1885!
2013-01-29
"తెర"చాటు చందమామ: నమ్మిన నా మది మంత్రాలయమేగా!
ఈ మధ్యే ప్రభాస్ నటించిన “రాఘవేంద్ర“ చిత్రంలోని “నమ్మిన నా మది” పాట విన్నాను. అంతక ముందు చాలా సార్లు విన్నాను. విన్న ప్రతిసారీ గొప్పగా అనిపించింది. “వేటూరి ఎంత బాగా రాశాడో” అనుకోగానే వేటూరి పుట్టినరోజు దగ్గరలోనే ఉందని గుర్తొచ్చింది. అందుకే చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ బ్లాగులో ఈ వ్యాఖ్యానం.
ఈ పాట మంత్రాలయ రాఘవేంద్రస్వామిని స్తుతిస్తూ సాగినా ఒక భక్తుడు భగవంతునికి తనను తాను ఆర్తిగా నివేదించుకోవడమే నాకు కనిపిస్తుంది. అందుకే ఈ పాటని ఎవరికి వారు తమ అనుభవాలతో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెయ్యబోయే వ్యాఖ్యానం కూడా ఈ కోణంలోనే సాగుతుంది.
ముందుగా పాట సాహిత్యం:
నమ్మిన నా మది మంత్రాలయమేగా
నమ్మని వారికి తాపత్రయమేగా
శ్రీగురుబోధలు అమృతమయమేగా
చల్లని చూపులు సూర్యోదయమేగా
గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాతా
హనుమంత శక్తిసాంద్రా
హరినామ గానగీతా
నీ తుంగభద్ర మా పాపాలే కడగంగా
తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో
చరణం : 1
నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా
నీ భజనే మా బ్రతుకైపోనీవా
పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ
నీ చరణం మా శరణం కానీవా
మనసు చల్లని హిమవంతా
భవము తీర్చరా భగవంతా
మహిని దాల్చిన మహిమంతా
మరల చూపుమా హనుమంతా
నీ వీణతీగలో యోగాలే పలుకంగా
తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో
చరణం : 2
వినాశ కాలంలోన ధనాశపుడితే లోన
నీ పిలుపే మా మరుపై పోతుంటే
వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా
నీ తలపే మా తలుపే మూస్తుంటే
వెలుగు చూపరా గురునాథా
వెతలు తీర్చరా యతిరాజా
ఇహము బాపి నీ హితబోధ
పరము చూపె నీ ప్రియగాథ
నీ నామగానమే ప్రాణాలై పలుకంగా
తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో
నమ్మిన నా మది మంత్రాలయమేగా
నమ్మని వారికి తాపత్రయమేగా
మొత్తం పాటలో విషయాన్ని రెండు వాక్యాల్లో గొప్పగా చెప్పారు వేటూరి. మంత్రాలయ రాఘవేంద్రస్వామిని నమ్మిన వారికి ముక్తి, నమ్మని నాస్తికులకి ఏ ప్రాప్తమూ లేదని చెప్పడం వేటూరి ఉద్దేశ్యం కాదు. ఇక్కడ నమ్మకం అంటే కేవలం belief కాదు. నీలోని అహాన్ని పక్కన పెట్టి నిన్ను నీవు సమర్పించుకోవడం. సమర్పణం అన్నది ముఖ్యమైన విషయం, ఎవరికి సమర్పించుకుంటున్నావు అన్నది కాదు. ఇది అంత సులువైనది ఏమీ కాదు. ఓ ఘడియో, ఐదు నిమిషాలో ఆ స్థితిలో ఉండగలిగితే గొప్ప విషయమే. ఆ కొద్దిసేపైనా మనసు భగవంతుని నిలయంగా, మంత్రాలయంగా మారుతుంది. నదిలో ఈదే చేపకి నీటి గురించి తెలుస్తుంది తప్ప ఒడ్డున కూర్చుని తర్కించే మేథావులకి కాదు. అలాగే భగవంతుడిని కేవలం కోర్కెలు తీర్చే కల్పవృక్షంగా భావించి పూజించే భక్తులకి నిజమైన భక్తిభావం అంటే తెలియదు. మన తాపత్రయంలో మనమున్నప్పుడు భగవంతుడు మన చెంతకి ఎందుకు రావాలట అసలు?
తుంగాజలాల సేవ తులసీదళాల పూజ అందుకో
పాటలో “తుంగాదళాల” సేవ అని తప్పుగా వినిపిస్తుంది, కానీ అది “తుంగాజలాల సేవ”. మంత్రాలయ బృందావన క్షేత్రం తుంగభద్ర నదీ తీరంలో ఉంది కాబట్టి వేటూరి తుంగభద్రని ప్రస్తావించారు. పాట మొత్తంలో శ్రీ రాఘవేంద్రస్వామికి సంబంధించిన ఎన్నో విశేషాలని వేటూరి ప్రస్తుతిస్తారు. వాటి గురించి బాగా తెలిసిన వారెవరైనా వ్యాఖ్యానిస్తే బాగుంటుంది.
నిరాశ మూగేవేళా మా దురాశ రేగేవేళా నీ భజనే మా బ్రతుకైపోనీవా
శోకంలో కూరుకుపోయిన వాళ్ళకి భగవంతుడు గుర్తుకు రావడం సహజం. అయితే నిరాశ తోడైతే మాత్రం భగవంతుడూ గుర్తుకు రాడు. నిరాశలో ఉన్న వాడికి దైవసహాయంపైన కూడా ఆసక్తి ఉండదు. అలాగే ఏదైనా కానిది/తగనిది/అనవసరమైనది పొందలానే దురాశ పుట్టినప్పుడు కూడా మన అహంలో, అహంకారంలో, అజ్ఞానంలో మనముంటాం తప్ప దేవుడు గుర్తుకు రాడు. ఈ రెండు స్థితుల్లోనూ చేజారిపోనీక మమ్ము పట్టుకు నడిపించు ప్రభూ అని వేడుకోవడం.
పదాలవాలే వేళ నీ పదాలు పాడే వేళ
నీ చరణం మా శరణం కానీవా
గుడికి వెళ్తే దేవుని పాదాలపై వాలి మొక్కుకుంటాం. పాటలు (పదాలు) పాడతాం. తలవంచి నమస్కరించినప్పుడు కాసేపైనా మన అహంకారం తలవంచిందా? పాట పాడినప్పుడు నిమగ్నమయ్యామా లేక పొగడ్తలకోసమో, ప్రశంసల కోసమో పాకులాడేమా? అందుకే నీ చరణాలే నాకు శరణమనే శరణాగతి ప్రసాదించమని ప్రార్థన.
భవము తీర్చరా భగవంతా
భవము అంటే పుట్టుక అని అర్థం తీసుకుంటే, మళ్ళీ పుట్టుక లేకుండా చెయ్యమని వేడుకోవడం కనిపిస్తుంది. ఆశానిరాశలు, సుఖదుఖాలు మొదలైన ద్వంద్వాలన్నీ మనసు చేసే కల్పనలే. ఇవే బంధనాలై, రుణాలై, ఇంధనాలై “రేపుని” సృష్టిస్తాయి. ఈ “కర్మ” తప్పాలంటే ద్వంద్వాలకి అతీతమైన స్థితిని పొందాల్సి ఉంటుంది. అంటే మనసు పరిధిని దాటి అనంతంలోకి దూకడం అన్నమాట. “మరుజన్మ” లేకపోవడం అంటే ఇదే!
మహిని దాల్చిన మహిమంతా
మరల చూపుమా హనుమంతా
మహిమలు చూపడంలో ఉద్దేశ్యం తన గొప్పతనాన్ని చాటుకోవడం కాదు, మనలోని అల్పత్వాన్ని తెలియపరచడం. అందుకే నీ మహిమలన్నీ మళ్ళీ చూపి మాలోని అల్పత్వాన్ని ఎరుకజెయ్యి స్వామీ అని ప్రార్థన.
వినాశ కాలంలోన ధనాశపుడితే లోన
నీ పిలుపే మా మరుపై పోతుంటే
వయస్సు పాడేవేళా వసంతమాడే వేళా
నీ తలపే మా తలుపే మూస్తుంటే
ఇక్కడ రెండు ప్రలోభాలని ప్రస్తావిస్తున్నారు. ఒకటి కాంక్ష, రెండవది వయసు. ఈ రెండూ తోడు స్నేహితులు కూడా! ఒక తీవ్రమైన వాంఛ, అది ధనం మీద కావొచ్చు, కీర్తి మీద కావొచ్చు లేక మరి దేనిమేదైనా కావొచ్చు, అది “నీలోని నిన్ను” వృద్ధి చేస్తున్నంత వరకూ అది వినాశహేతువే. అలాగే వయసూ, వేగం, శక్తీ ఉన్నప్పుడు ఆ మత్తులో మనం చేసే ప్రతీదీ గొప్పగానే కనిపిస్తుంది. ఈ రెండు స్థితుల్లోనూ వినమ్రత, ఎరుక కలిగి ఉండడం కష్టమే. అందుకే మము కాచి వెలుగు చూపమని ప్రార్థించడం. మనకి తెలిసిన ఈ “ఇహము” కొన్ని సార్లు ప్రియమైనా, కొన్ని సార్లు అప్రియమైనా మనం దాన్ని పట్టుకుని వేలాడుతూనే ఉంటాం. ఈ జంజాటం నుంచి విడిపించి పరతత్త్వాన్ని ప్రసాదించమని వినతి.
ఈ పాట నిండా పరుచుకున్న భక్తితత్త్వం మైమరపింపజేస్తుంది. మణిశర్మ చాలా చక్కటి బాణీ అందించాడు (పాటని ఇక్కడ వినొచ్చు – http://www.raaga.com/play/?id=9132). ఈ బాణీలోని శక్తి వేటూరికి గొప్ప ప్రేరణని ఇచ్చిందని చెప్పడానికి ఆయన ఈ పాటలో చేసిన శబ్దార్థ ప్రయోగాలే నిదర్శనం. లీనమైన కొద్దీ లోతు తెలిసే పాట ఇది. వేటూరి లేని లోటుని తెలిపే పాట కూడా.
దార్ల: దళిత, బహుజనులకు అవమానం ఆషిశ్ నంది వ్యాఖ్యలు
మనసులో..: వామ్మో ఇంత షార్ట్‌గానా….
"సుత్తి లేకుండా సూటిగా చెప్పేయ్" డైలాగ్ ఏదో బాగుంది… నిజమే కదా అన్పించేది మొదట్లో! కానీ అది బద్ధకస్థుడి అసహనంగా తోస్తోంది… ఈ మధ్య ఇలాంటి ముక్తసరి, ముక్కుసూటి మాటల వల్ల మనుషుల మధ్య ఏర్పడుతున్న అపార్థాలను గమనిస్తుంటే!!
వాడాల్సిన చోట మాటలు పొదుపుగా వాడాల్సిందే! కానీ…. లోపల real feelనే మిస్ అయ్యేలా కట్ చేసి మాట్లాడడం మాత్రం చాలా bad habit.
ఈరోజు మనుషులు మొండిగా తయారవ్వడానికి, అన్నీ తమకు తెలిసినవే అనుకోవడానికీ, ఎవరు చెప్పేదీ వినకుండా పోవడానికీ కారణం…. "బేసికల్‌గానే ఓపిగ్గా వినే, చదివే, గ్రహించే" లక్షణాలు కోల్పోవడం!
మనిషి మాట్లాడుతుంటే ఓపిగ్గా వింటే విషయం పూర్తిగా అర్థమవుతుంది…. ఒక్క మాట మాట్లాడగానే మధ్యలో కలగజేసుకుని పది మాటలు మనం రిటర్న్ మాట్లాడితుంటే విషయాలు ఏం అర్థమవుతాయి?
పేరాలు పేరాలు చదవలేరట… మళ్లీ అది చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు చదివే ఓపికే లేని మనకు బ్రతకడానికి ఎంత ఒళ్లు బరువో తెలీట్లేదూ!!
చదవడం, అర్థం చేసుకోవడం, బుర్రకు ఎక్కించుకోవడం ఓ కళ…. అభ్యాసం… జీవితాన్ని మెరుగైన స్థితికి తీసుకెళ్లే path. దాన్ని వదులుకుంటే ఎలా?
మాటలు sms షార్ట్ కోడ్‌లా ఉండడానికీ, సినిమాల్లోని పంచ్ డైలాగుల్లా 2 లైన్లలో మాట్లాడుకోవడానికి జీవితం ఏమీ షార్ట్ ఫిల్మ్ కాదూ… రెండున్నర గంటల్లో ముగిసిపోయే తెలుగు సినిమానూ కాదు…
మన బుర్రలు ఎంత బద్ధకిస్తున్నాయో మనం గ్రహించట్లేదు.. ఎవరి సంగతో ఎందుకు ఇలాంటి మనుషులతో గడిపీ గడిపీ నాకూ కొంత overlook నేచర్ అంటుకుంది…. గతంలో పేజీలు పేజీలు ఓపిగ్గా చదివి అర్థం చేసుకునే నేను ఒక పేరాలో అక్కడో లైనూ, ఇక్కడో లైనూ చదివేసి అంతా అర్థమైందనే ఫీలింగ్‌కి వచ్చేస్తున్నాను… ఇది తప్పు కాదూ…..?
ఇలాంటి తప్పుల్ని సరిచేసుకోమని ఎవరు చెప్తారు… మనకు మనం గుర్తించి సరిచేసుకోపోతే? నాబోటి వాడు ఎవరైనా చెప్పినా కనీసం ఇలాంటివి చదివే ఓపిక కూడా ఉండనప్పుడు ఇక బ్రెయిన్ షార్ప్‌గా ఎక్కడ ఉంటుంది?
gn, tc, tq, svsc… ఇలా ప్రతీదీ షార్ట్ చేసుకుంటూ పోవడం, అదేదో ట్రెండ్‌లా ఫాలో అయిపోవడం గొప్ప మాత్రం కాదు…. ఇది గ్రహించిన రోజున మనకు పోయిన ఓపిక తిరిగి వస్తుంది.
మీరు వివరంగా మాట్లాడందే మీ ఏ రిలేషనూ సరిగ్గా నిలబడదు.. అరే… చాలా డీటైల్డ్‌గా రాస్తుంటేనే, మాట్లాడుతుంటేనే జనాలు అపార్థాలు చేసుకుంటున్నారే… చిన్న చిన్న ముక్కలు రాసేసి/మాట్లాడేస్తుంటే జనాలు భుజాలు తడుముకుని మనకు దూరం అయిపోవట్లేదా?
నేను అప్పుడప్పుడు 2 లైన్లలో రాసే వాటికే.. "ఇందులో చాలా మీనింగులున్నాయే" అని చనువుగా ఫోన్లు చేసి అడిగే మిత్రులూ ఉంటారు… ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం డీటైల్డ్‌గా ప్రవర్తించనంతకాలం రిలేషన్లు బలంగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండవు. అలాగే మన బుర్రలూ బద్ధకంగా మొద్దుబారిపోతాయి…
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అనుకుంటే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
తెలుగుపదం Google Group: మహిళావధానుల వివరాలు తెలపండి
తెలుగులో అవధానం చేస్తున్న మహిళలు వివరాలు దయచేసి తెలపండి
M.R .J. SARMA
[email protected]
9441318641. 8008551846
అమృతమథనం: ఫేస్ బుక్ వాల్ అంటే నగర కేంద్ర గ్రంథాలయం టాయ్‌లెట్ గోడ కాదు!
2013-01-28
దిదిద్ధిమినకపోతరాజు: BRIC అభివద్ధి కథనంపై ఇటుకలు
మనసులో..: నా ఫ్రెండ్స్ అందరూ తప్పక చదవండి… కొంత క్లారిటీ వస్తుంది
మిత్రులందరికీ ఓ స్పష్టత రావడం కోసం ఇది రాస్తున్నాను…
ఇప్పుడు కంప్యూటర్లు వాడుతున్న వారిలో 80% మందికి పైగా కంప్యూటర్ అనేదే తెలీని 1996 నుండి నేను టెక్నాలజీని వాడుతున్నాను… ఎడ్యుకేట్ చేస్తున్నాను…. కానీ నేను టెక్నాలజీ కన్నా మానవ సంబంధాల్ని చాలా ఇష్టపడతాను.
ఒక్కసారి నా ప్రొఫైల్‌లో About చదవండి… టెక్నాలజీతో ముడిపడి ఉన్నవి నా లక్ష్యాలు.. బయట ఇదే టెక్నాలజీ మానవత్వానికి హాని చేస్తుంటే చూస్తుండలేకపోతున్నాను. మానవత్వానికి ప్రాణమిచ్చే నా మనస్థత్వం ఊరకుండన నాకు తెలిసిన మంచి మాటలూ రాస్తూ వస్తున్నాను….
ఇదంతా ఎందుకు ఇప్పుడు అనుకోకండి… పాయింట్‌కి వస్తాను….
నా ఫ్రెండ్‌లిస్ట్‌లో అధికభాగం నా మనస్థత్వం ఫోన్ల ద్వారానూ/నేరుగానూ/మేగజైన్ ద్వారానూ తెలిసి ఉన్న రీడర్సే ఉంటారు… అతి కొద్ది మందే ఇతర రంగాల్లోని ప్రముఖులూ, నా భావజాలం నచ్చి నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపినవారూ ఉంటారు.
ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నా దయచేసి ఈ క్రింది విషయాలు దృష్టిలో పెట్టుకోండి…
1. నేను వర్చ్యువల్‌గా బ్రతికి ఉండడానికన్నా భౌతికంగా, రియల్ లైఫ్‌లో బ్రతికి ఉండడాన్ని ఇష్టపడతాను…. నేనలా ఉండడమే కాదు… నా మాటని గౌరవించి వినే మా రీడర్స్ కూడా టెక్నాలజీ మూలంగా జీవం కోల్పోకుండా తరచూ తాపత్రయపడుతుంటాను, మనుషులు సహజంగా బ్రతకాలన్న కోరిక నాది.
ఇది రాయడానికి కారణం: తమ పోస్టులను likes, కామెంట్లు చేయమని, pages లైక్ చెయ్యమని బలవంతం పెడుతూ, ఫేస్‌బుక్ తప్ప ప్రపంచం లేదన్నట్లు నన్ను రిలేషన్‌షిప్‌తో బ్లాక్‌మెయిల్ చేసే స్థాయికి కొన్ని రిలేషన్లు పెరిగాయి.. నాకు నచ్చినవి, నా మనస్సుకి అన్పించినవి మాత్రమే నేను స్పందించగలను తప్ప ఇలా అసహజంగా ఏ ఫేస్‌బుక్‌నో ప్రపంచంగా బ్రతికే జనాలతో ఇమిడిపోలేను కదా! సో మీలో ఎవరైనా నా likes కోసమే బ్రతుకుతన్నట్లయితే… నేను నిజజీవితంలో బ్రతకగలను తప్ప ఇలా వర్చ్యువల్‌గా మీతో కలిసి బ్రతకలేను
2. నేను ఎంతకాలం బ్రతుకుతానో తెలీదు…. సో నా జీవితానికి ఓ పర్పస్ ఉందని నమ్ముతాను… వీలైనంత వరకూ నా వంతు సొసైటీలో మంచినీ, మంచి ఆలోచనల్నీ పెంచడానికి ప్రయత్నిస్తున్నాను…. ఈ నేపధ్యంలో మీలో ఎవరైనా సమాజం మీద గానీ, దేశం మీద గానీ, వ్యవస్థల మీద గానీ, జనాల మీద గానీ, ప్రాంతాల మీద గానీ ద్వేషాన్ని పెంచుతూ పోతే నేను మిమ్మలను ఎంటర్‌టైన్ చెయ్యలేను. కొద్దిరోజులు చూసి మిమ్మలను unfriend చేయడం తప్పించి నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. అలా Unfriend చేస్తే మీరు నొచ్చుకోవలసిన అవసరం లేదు. కారణం wavelength mismatchని సరిగ్గా అర్థం చేసుకుంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదు.
3. కాలక్షేపపు కబుర్లు చెప్పే టైమ్ నాకు ఉండదు… పర్సనల్ మెసేజ్‌లు రిపీటెడ్‌గా పెడుతూ నా నుండి రిప్లై రాకపోతే.. "అంత పొగరు పనికిరాదు" అని మీరు అనుకుంటే నేనేం చెయ్యలేను. ప్రతీ క్షణాన్నీ నేను వీలైనంత సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఉంటాను. నా పద్ధతులకు, అభిరుచులకు విలువ ఇచ్చే వారితో మాత్రమే నేను నా ఫ్రీ టైమ్‌లోనైనా టైమ్ స్పెండ్ చెయ్యగలను.
ముఖ్యంగా ఆన్‌లైన్, సోషల్ నెట్‌వర్క్ రిలేషన్లు ఎన్ని అపోహలతో కూడినవే నాకు 16 ఏళ్లగా చాలా అనుభవం… సో నేను నిజమైన రిలేషన్లకి విలువ ఇస్తాను.. సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా పరిచయం అయిన వారితోనైనా నేరుగా మాట్లాడి వారి మనస్థత్వం అర్థమైన తర్వాతనే…. వర్చ్యువల్‌గా కన్నా ఫిజికల్‌గానే ఫ్రెండ్ షిప్ చేస్తాను.
సో నాతో ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేస్తున్న, చేయాలనుకుంటున్న, అపార్థాలు చేసుకుంటున్న, ద్వేషాలు పెంచుకుంటున్న ప్రతీ ఒక్కరి స్పష్టత కోసం ఇది రాయవలసి వచ్చింది…..
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
దిదిద్ధిమినకపోతరాజు: పైనాపిల్ అయితే, మరి కిందో?
2013-01-27
....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....: స్పందించిన హృదయాలకు అభినందనలు
2013-01-26
విశ్వ: వ్యాపార ప్రకటనలు(యాడ్స్)లేని, వేగవంతమైన వెబ్ బ్రౌజింగ్ కోసం
2013-01-25
కమ్యూ'నిజం': మతోన్మాదం పై విశేఖర్ గారి కామెంటుకు నా సమాధానం
చేయక చేయక ఒక కామెంటు నేను విశేఖర్ గారి బ్లాగులో చేయడం, దాన్ని ఆయన అంగీకరించి పబ్లిష్ చేయడమే కాక, కమ్యూనిజం అంటే అది, ఇది అని చెప్పడమే కాక, కమ్యూనిస్టుల మైనారిటీ వాదం ఎంత గొప్పదో చెప్పడం జరిగింది.
కాకపోతే అది ఎప్పటిలా డొల్ల సమాధానమే కావడం కాకతాళీయమేమీ కాదు. అందులోని డొల్ల తనాన్ని నేను తిరిగి కామెంటు రూపములో ప్రశ్నించగా, ఈ సారి మాత్రం విశేఖర్ గారు దాన్ని ప్రచురించలేదు. తన టపాను తిరిగి కూడలిలో వచ్చేలా అప్‌డేట్ చేశారు గానీ నా కామెంటును ప్రచురించడం మాత్రం చేయలేదు. సహజంగా వర్డ్‌ప్రెస్ అకౌంటును ఉపయోగించి కామెంటినప్పుడు, మన వ్యాక్య అక్కడ అనుమతికోసం ఎదురుచూస్తూ ఉంటే ఆవిషయాన్ని మనకు తెలుపుతుంది. వ్యాక్య అనుమతి కోసం వేచి ఉన్నది అని. తరువాత మనం మన అకౌంటుతో లాగిన్ అయి, ఎప్పుడు ఆపేజీని సందర్శించినా అలానే అది చూపిస్తుంది. అలా చూపించలేదంటే అది డిలీట్ చేయబడి ఉండాలి. నా కామెంటు ప్రస్తుతం అక్కడ కనిపించడం లేదు కాబట్టి, వేరే గత్యంతరం లేక దాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను.
నేను ఏ కామెంటు కైతే దీన్ని జవాబుగా ఇస్తున్నానో ఆ కామెంటును స్క్రీను షాట్ల రూపములో ఇస్తున్నాను చూడండి.
ప్రతీ వైరుధ్యాన్ని పట్టించుకొని తర్కించడం ఎంత ముఖ్యమో, సరిగ్గా తర్కించి, సరైన అవగాహన కలిగి, సరైన నిర్ణయం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం (అంతకన్నా ముఖ్యం అంటే కరక్టుగా ఉంటుందేమో).
మతం ప్రగతి శీలమా లేక మార్క్సిజం ప్రగతి శీలమా అనే విషయాన్ని తరువాత చర్చిస్తాను. పాకిస్తాను విషయములో మీరు చెప్పిన లాజిక్కు సరికాదు. పాకిస్తాను పేరు చెప్పగానే ఇస్లామిక్ తీవ్రవాదం గురించి మాట్లాడుతున్నారు అంటే అర్థం అది మెజారిటీల తీవ్రవాదం అవ్వడం వలననే అన్నది అపోహ మాత్రమే. నిజానికి అంత ఎత్తున విద్వంసం సృష్టించేది మెజారిటీల మతోన్మాదం కాకుండా, మైనారిటీ మతోన్మాదమే అయితే, ఖచ్ఛితంగా హిందూ తీవ్రవాదం గురించే మాట్లాడుకోవాల్సి వస్తుంది, మాట్లాడుకుంటారు కూడా. అల్ కాయిదాలూ దాని అనుబంధ తీవ్రవాద సంస్థలూ మైనారిటీ వర్గానికి చెందినవి అయ్యుండి, వాటికి సపోర్టు మన దేశము ద్వారానో లేక చైనా ద్వారానో అందుతూ ఉంటే దేని గురించి మాట్లాడుకుంటారు? మెజారిటీలు సాగించే తీవ్రవాదాన్నా లేక మైనారిటీలే అయినా ఇంత విద్వంసం సృష్టిస్తున్న వారి తీవ్రవాదాన్నా?
అసలు శ్రీలంక పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మెజారిటీలు అయిన సిమ్హళీయుల తీవ్రవాదమా లేక మైనారిటీలే అయినా LTTE వారు సాగించే తీవ్రవాదమా? ఖచ్ఛితంగా LTTE తీవ్రవాదమే కదా? కానీ భారత దేశం విషయానికి రాగానే మెజారిటీ మైనారిటీ అంటూ మాట్లాడినప్పుడు సహజంగానే వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ విషయం, మీరు చెప్పిన Generality of contradiction and Particularity of contradiction పరిధిలో ఉందో లేదో, ఉన్నా సరిగ్గా దాన్ని అర్థం చేసుకున్నామా లేదా అన్నది మీరే ఆలోచించుకోండి.
ఇక హిందూ తీవ్రవాదం భారత దేశములో లేదు అని నేను అనను. కానీ, దానికి ఇంత పాపులారిటీ రావడానికి కారణం అదొక రాజకీయ అవసరం అవ్వడమే అన్నది నిష్టుర సత్యం. హిందూ తీవ్రవాదులకు ఊతమిచ్చే దేశాలు ఎన్నున్నాయి, వారికి ఆశ్రయమిచ్చి, అన్ని వసతులూ, ఆయుధాలూ అందించే సైన్యాలూ, గూఢచార వ్యవస్థలూ ఎన్ని ఉన్నాయి? ఇవేవీ పరిగణలోకి తీసుకోకుండా మెజారిటీ, మైనారిటీటీ మతోన్మాదం అంటూ వర్గాలుగా విడగొట్టి, మైనారిటీ కాబట్టి వారిని నేను వెనకేసుకు వస్తాను, లేదా చూసీ చూడనట్టు వదిలేస్తాను అని చెప్పి, దానికి కమ్యూనిజమే అని పేరు పెడితే ఇక చేసే దేముంది? దాన్ని ద్వేషించడం తప్ప?
మెజారిటీల తీవ్రవాదాన్ని వ్యతిరేకించొద్దని చెప్పడం లేదు. కానీ, మైనారిటీల మతోన్మాదాన్ని చూసీ చూడంట్టు వదిలేస్తూ, దాని గురించి ఎవరైనా ప్రశ్నించినప్పుడు టోకనిజాన్ని (ఈసారి మెజారిటీల మీద) ప్రదర్శిస్తూ, ఒకటీ రెండు పొడి పొడి మాటలూ, ముక్తసరి ఖండనలూ చేస్తూ, మెజారిటీ తీవ్రవాదాన్ని మాత్రం అదే పనిగా దుయ్యపడుతూ, ఇదేమిటి అని ప్రశ్నించిన వారిని హాస్యాస్పదులుగా పేర్కొనడం వలన ఎవ్వరికీ ఎటువంటి లాభం ఉండదు.
ఇక కమ్యూనిస్టులు మైనారిటీలను వెనకేసుకు రావడం వెనుక ఉన్న అసలు విషయం వేరు. మైనారిటీలను వెనకేసుకు రావడం అనేది వారి రాజకీయ అవసరం. అందుకే, మత తత్వ పార్టీయే అయినా MIM తో పొత్తుకోసం పాకులాడుతారు. కేరళలో మదానీతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగేది కూడా ఆ రాజకీయ అవసరానికే. వారి రాతలలో ముస్లిములనూ వెనకేసుకు రావడం కూడా ముస్లిం వోటు బ్యాంకు పై ప్రేమతోనే అన్నది బహిరంగ రహస్యం.
=======================
వ్యంగ్యం అనేది ఒక శక్తిమంతమైన భావ వ్యక్తీకరణ పద్దతి. దాన్ని అనేక మంది కమ్యూనిస్టులు ఇదివరకు ఉపయోగించి మతాలనూ, సాంఘిక దురాచారాలనూ ఎద్దెవా చేశారు. కొన్ని కొన్ని చోట్ల సూటిగా చెప్పడం కన్నా, వ్యంగ్యమే గొప్పగా పనికి వస్తుంది కూడా. కానీ, అదే వ్యంగ్యం కమ్యూనిస్టులు మీద ఎవరైనా ప్రదర్శించినప్పుడు మాత్రం ఉడుక్కోవడం ఎందుకు? దాన్ని కూడా హుందాగా స్వీకరించ గలిగితే కనీసం హుందాగా స్వీకరించారు అన్న పేరన్నా దక్కుతుందన్నది నా అభిప్రాయం.
మనసులో..: ఆనందం ఇక్కడ…
సాయంత్రం కాసేపు డాబా మీదకెళ్లి చంద్రుణ్ణి చూస్తూ చుక్కల వరుసల్ని అబ్బురంగా చూడాలన్న ఆలోచన కలిగి ఎన్నాళ్లవుతోంది?
కాసేపు బండిని, కారుని పక్కన పడేసి… అలా నడుచుకుంటూ పరిసరాల్ని చూసుకుంటూ వెళ్లడం మనకు మిగిలున్న జీవితంలో సాధ్యపడే పనిలాగే తోస్తోందా… అస్సలు ఆ ఆలోచన వస్తుందన్న నమ్మకం ఉందా…?
తెలీకుండానే అందరం కొన్ని ఆలోచనల మధ్య ఇరుక్కుపోతున్నామనిపిస్తోంది…. అంతకుమించి లైఫ్‌ని ఊహించుకోలేకపోతున్నాం…
భిన్నంగా ఎలాగుండాలో తోచనూ తోచట్లేదు… భిన్నంగా ఉండాలన్న ఆసక్తీ ఏ కోశానా లేదు…
ఆఫీసూ.. ఇల్లూ.. ఉంటే పిల్లలూ… టివి… బోర్ కొడితే కంప్యూటరూ.. గానుగెద్దు జీవితం…. కొత్తదనం పట్ల ఇంకెక్కడ ఆసక్తి వస్తుంది?
మనస్సు స్వభావం చంచలం….. అంటే నిరంతరం మనస్సులో ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి…. ఆ ఆలోచనలు 90% ఈ క్షణం మనం ఉన్న పరిసరాలూ, మనుషులూ, మానసిక స్థితి చుట్టూనే తిరుగుతుంటాయి…. అవి అక్కడ తిరిగినంత కాలం మనస్సు వేరే అంశం వైపు మళ్లించబడలేదు…. బలవంతంగా మనం మళ్లించుకుంటే తప్ప!
అందుకే జీవితాన్ని మన కంట్రోల్‌లోకి తీసుకోవాలి తప్ప… రొటీన్‌గా సాగే జీవితంలో రొటీన్ మనుషులుగా మిగిలిపోతే చాలా నిస్సారంగా అన్పిస్తుంది లైఫ్!
ఈరోజు మనకు కొత్త రకాల ఆనందాలు కావలసి వస్తున్నాయి… ప్రతీ క్షణం సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం… కారణం మనం ఈ జీవితంతో చాలా విసుగెత్తి పోతున్నాం….
విసుగెత్తిన జీవితాన్ని రీఏక్టివేట్ చేసుకోవడానికి కొత్త ఆనందాలు అవసరం లేదు… మనం ఆస్వాదించలేకపోతున్న పాత అభిరుచులు చాలు…
అంటే సినిమాలకో, పబ్‌లకో, రెస్టారెంట్లకో, కాఫీడేలకో, డ్రైవ్‌లకో వెళితేనో జీవితం హాపీగా ఉంటుందనుకోవడం.. చాలా చాలా చిన్న జీవితాన్ని చూస్తున్నట్లే..
ప్రేమగా మొక్కలకు నీళ్లు పోసినా చాలా సంతోషంగా ఉంటుంది…. (ఇది ఆడవాళ్లు మాత్రమే చేయాల్సిన పని అని మళ్లీ మైండ్‌లో restrictions పెట్టుకోపోతే)
సోది చెప్పి చంపేస్తున్నారు అని విసుక్కోకుండా.. తాత ముత్తాతల దగ్గర కూర్చుని కబుర్లు, అనుభవాలు మనస్ఫూర్తిగా వింటున్నా ఆనందం కలుగుతుంది…
ట్రాఫిక్‌లో బండి ఆగిపోయి ఎంతకీ స్టార్ట్ అవక మన తోవకు అడ్డంగా ఉన్న మనిషిని చిరాకుగా చూడడం మానేసి… ఓ చిరునవ్వు నవ్వు పక్కకు తప్పుకుని వెళ్లినా సంతృప్తిగా ఉంటుంది….
కష్టపడే వ్యక్తిని మనసారా అప్రిషియేట్ చేస్తే ఆనందం రాదా…?
చిన్న ఉదాహరణ చెప్తాను.. ఇటీవల వ్యక్తిగత కారణాల వల్ల ఓ హాస్పిటల్‌కి వెళ్లి వస్తూ ఉన్నాను.. అక్కడ లిఫ్ట్ ఆపరేటర్ పేరు తెలుసుకుని మనస్ఫూర్తిగా వెళ్లినప్పుడల్లా పలకరిస్తుంటే ఆవిడ ఎంత సంతృప్తిగా నవ్వుతుందో…. ఆ నవ్వు చూస్తే హాస్పిటల్ వాతావరణంలో ఉన్నానన్న నా బెరుకు మాయమవ్వదా?
పాజిటివ్ ఎనర్జీస్‌నీ, హాబిట్స్‌నీ కల్టివేట్ చేసుకోవాలే గానీ దేనిలో ఆనందం లేదూ….?
ఆనందం కోసం వెంపర్లాడినంత కాలమూ అది మనకు అస్సలు దక్కదు.. దక్కిందనుకుని లోకానికి ప్రదర్శించుకోగలుగుతామే తప్ప అలా వెంపర్లాడి పొందాలనుకున్న ఆనందం ఎప్పుడూ వెలితిగానే ఉంటుంది….
ఆనందం స్వభావసిద్ధంగా మన పనుల్లో ఉండే విభిన్నత, పాజిటివ్ నేచర్ ద్వారా కలగవలసింది….!!
గమనిక: ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
చెప్పాలని ఉంది!: సామాజిక నెట్వర్కింగ్ సైట్లో కొత్త పోకడ
ఈ మద్య సామాజిక నెట్వర్కింగ్ సైట్లో కొత్త పోకడ గమనిస్తున్నాను . చాలా తీవ్రమయిన ప్రతిస్పందన
మనకు కనీసం తోచినది Facebook లో “How’s it going,Krupal” అన్నా వ్రాసుకొనే వీలు లేదు . వాక్ స్వాతంత్ర హాక్కు తీవ్రమయిన ఆక్షేపణకు గురవ్వుతోంది , కొందరు కులాలను, మతాలను, వ్యక్తులను, మహిళలను, మీడియాను ఆక్షేపిస్తున్నారు మరి కొందరు దానికి తీవ్రమయిన ప్రతిస్పందన తెలియచేస్తున్నారు, ఈ లైకుల బటన్ లతోటి మనకు విచక్షణ కోల్పోతున్నాం నా స్వీయానుభమ్ ఒకటి చెపుతున్నాను చెన్నై లో చదువుకునేటప్పుడు ఒక కాలేజీ ఫెస్టులో సెక్స్ రేషియో మీద వ్రతృత్వ పోటీ జరిగినది నేనేమో తమిళ నాడులో ప్రతి వెయ్యిమంది పురుషులకు గాను 986 మంది స్త్రీ లు వున్నారు ఒకవేళ బృణ హత్యలు లేకుంటే కనీసం
1000 1100 : రేషియోలో వుండేవారు అప్పుడు పరిస్తితి ఏమిటని చెప్పా . పెద్ద గొడవ జరిగినది నేను చెప్పిన దానిలో నాకు తప్పు కనిపించలేదు కానీ చాలా మంది నిరసన వ్యక్తంచేశారు దానితో నేను క్షమాపణ చెప్పక తప్పలేదు కానీ నేను ఎమీ బ్రుణ హత్యలు బలపరచటం లేదు , కాని అప్పుడు అనిపించినది నా వాక్ స్వాతంత్ర హాక్కు ను కోల్పోయానే అని .
నా భాధ ఒక్కటే ప్రపంచంలో చెడూలేదు , మంచీ లేదు, ఇదిగో దీనికి ఇదే పద్దతి అని ఇతిమిద్దమ్ గా చెప్పటానికి లేదు , అసలు న్యాయా అన్యాయాల వూ సే లేదు . ప్రతిదానికి కొన్ని పరిమితులు వున్నాయి, వాటి కి ఎవరికి వారే నిర్వచనాలు ఇచ్చుకోవాలి . We Sometimes Go Overboard, We have strong ties, hope to impress peers , We know that all update are tailored for us but We react and some times overact, and we end up with psychological damage !
Please read http://www.forbes.com/sites/ilyapozin/2013/01/09/social-media-etiquette-12-step-checklist/
http://www.verticalresponse.com/blog/5-social-media-etiquette-rules-emily-post-would-approve-of/
http://abclocal.go.com/wls/video?id=8918699
I do feel social media is valuable in many ways. But maybe we should teach etiquette to guide people on the best ways to use it as a communication tool. After all, like most technology, social media has been hoisted on our world with little or no instruction.
I encourage everyone to think before communicating through social media. Goeckler says everyone should ask themselves the following 12 questions before posting:
- Should I target a specific audience with this message?
- Will anyone really care about this content besides me?
- Will I offend anyone with this content? If so, who? Does it matter?
- Is this appropriate for a social portal, or would it best be communicated another way?
- How many times have I already posted something today? (More than three can be excessive.)
- Did I spell check?
- Will I be okay with absolutely anyone seeing this?
- Is this post too vague? Will everyone understand what I’m saying?
- Am I using this as an emotional dumping ground? If so, why? Is a different outlet better for these purposes?
- Am I using too many abbreviations in this post and starting to sound like a teenager?
- Is this reactive communication or is it well thought-out?
- Is this really something I want to share, or is it just me venting?
Run through these 12 questions in your mind–before clicking “post.” Trust me–you’ll be happy you double-checked before sharing with the world.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Wishing you a very Happy Republic Day 2013
ఏ దేశమేగినా, ఎందు కాలిడినా. ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా. పొగడరా నీ తల్లి భూమి భారతిని. నిలుపరా నీ జాతి నిండు గౌరవము.
PS:Please consider I blog and I write here to log certain thoughts that come to me at a certain point in time. Its a process wherein this is also something I do to watch what I am doing and thinking and rework. And to keep in touch with some of my friends . And like anything else a post is inspired by a certain set of events. Ideas and beliefs according to me need not be something that has to be unchangeable. What is the point to have only one set of ideas and hang on to it till death? Especially when there is a better option? I like the concept of evolving and I shall continue to do so. I like taking new ideas and suggestions as long as it leads to progression. Or to what my notion of progression is. its all about the current state of my mind while bloging
It all need not necessarily have to conform everything under the heading of standard-ly accepted.
Why conform to that anyway? My journey is not about conforming to standards at all. Again, that is a personal viewpoint and I don’t expect that you should agree. And this space primarily is to watch that process.thanks
....ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....: ఫేస్ బుక్ లో మహిళా వ్యతిరేక ఉన్మాదం...
2013-01-24
కమ్యూ'నిజం': స్పెషల్ టపా .. మతం Vs మార్క్సిజం
ఈ సైటు క్లోస్ చేశానని ఇక మీదట పోస్టులేయనని చెప్పడం జరిగింది. కానీ, ఒక ప్రత్యేక సందర్భములో, ఇదివరకే రాసిన టపాలో కొంత భాగాన్ని టపాగా ఇవ్వడం బావుంటుంది అని ఈ పోస్టు వేస్తున్నాను అంతే.
=================================
మార్క్సు మతం గురించి చెప్పిందాన్నే మార్క్సిజానికి కూడా అన్వయించి చదువుకుంటే ఎలా ఉంటుంది? ఖచ్ఛితంగా సరిపోతుంది. మతం అనేది మత్తయితే, మార్క్సిజం కూడా మత్తే. ఈ కిందిచ్చిన పేరా నిజానికి మార్క్సు మతం గురించి చెప్పినది. నేను సింపులుగా అందులో మతం అని ఉన్న చోట, మార్క్సిజం అని పెట్టాను. ఆశ్చర్యకరంగా, మార్క్సు మతం గురించి చెప్పింది, మార్క్సిజానికే బాగా సూటవుతుందని అది నిరూపిస్తుంది.
The foundation of criticism is: Man makes Marxism, Marxism does not make man. Marxism is, indeed, the self-consciousness and self-esteem of man who has either not yet won through to himself, or has already lost himself again. But man is no abstract being squatting outside the world. Man is the world of man – state, society. This state and this society produce theories like Marxism, which is an inverted consciousness of the world, because they are an inverted world. Marxism is the general theory of this So – called oppressed people, its encyclopaedic compendium, its logic in popular form, its philosophical point d’honneur, its enthusiasm, its moral sanction, its solemn complement, and its universal basis of consolation and justification. It is the fantastic realization of the human essence since the human essence has not acquired any true reality. The struggle against Marxism is, therefore, indirectly the struggle against that world whose philosophical aroma is Marxism.
Marxist suffering is, at one and the same time, the expression of real suffering and a protest against real suffering. Marxism is the sigh of the oppressed creature, the heart of a heartless world, the soul of soulless conditions and strategy of no-strategy world. It is the opium of the so-called oppressed people.
The abolition of Marxism as the illusory happiness of the people is the demand for their real happiness. To call on them to give up their illusions about their condition is to call on them to give up a condition that requires illusions. The criticism of Marxism is, therefore, in embryo, the criticism of that vale of tears of which Marxism is the halo.
Criticism has plucked the imaginary flowers on the chain not in order that man shall continue to bear that chain without fantasy or consolation, but so that he shall throw off the chain and pluck the living flower.
2013-01-23
తెలకపల్లి రవి: తలచినదే జరిగినదీ!
2013-01-22
పద్యమంజూష: మొల్ల రామాయణము - 20
పద్యమంజూష: శ్రీ కృష్ణుని సుభాషితాలు!
2013-01-21
మనసులో..: జీవితం ట్రాజెడీ కాదు….
మనుషులు నిర్ధయగా మాటల గారడీ మధ్య ఇరికించేస్తారు…
మనం మాట్లాడే మాటలు వేరే అర్థాలతో ధ్వనింపజేయబడతాయి.. అస్సలు మనం మాట్లాడనే మాట్లాడని మాటలు కొత్తగానూ సృష్టించబడతాయి…
ఎవరికి అనుకూలంగా వాళ్లు బలమైన platform నిర్మించేసుకుంటారు…. నిలబడడానికి మనకు నేల కూడా మిగలదు….. ఇలాంటి మనుషులతో జీవితం ఎలా అని తెలీని భయమూ వేసేస్తుంది…
ఇది విశ్లేషణ కాదు.. ఎన్నో సందర్భాల్లో నేను స్వయంగా ఎదుర్కొన్న పలు అనుభవాల సారం…
ఏం లేదు…. మనుషులు గెలవాలి అంతే! మాటలు వంపులు తిప్పితే గెలిచిపోతామన్న పిచ్చి నమ్మకం
పోనీయండి….
మాటలు అనుకూలంగా మలుచుకోబడినంత మాత్రానా…. ఎదుటి వ్యక్తిని దబాయించడానికి మాటలొక్కటే ఆయుధంగా భావించినంత మాత్రానా తప్పు ఒప్పయిపోదు కదా! విచక్షణతో కూడిన మౌనం మాటలతో నెగ్గడం కన్నా బలమైందని అర్థమైతే మరోమారు మాటలతో ఓటించి కొట్టడానికి ఎవరూ ముందుకు రారేమో
తప్పుని ఒప్పుకోని వాడు పెద్ద గొంతునే నమ్ముకోవడంలో ఆశ్చర్యమేముంది… తల వంచుకుని మౌనంగా నిలబడడం ఎంత గొప్ప విషయమో అందరం అర్థం చేసుకోవాలి…
చాలా సందర్భాల్లో నేను ఓ ప్రేక్షకుడిలా చూస్తూ ఉన్నాను….
ఎన్నాళ్ల నుండి మనస్సుల్లో తుప్పు పట్టించుకుని దాపెట్టుకున్న కత్తుల్ని ఒకరిపై ఒకరు దూసుకోవడం…. ఆ కత్తులు ప్రతీ మనస్సునీ ఎంతెంత గాయాలు చేస్తున్నాయో ఒక్కరికీ పట్టదే? నాకొకటే అన్పిస్తుంది… ఇలాంటివి చూసినప్పుడల్లా….!!
"చంపుకోండి… ఇలా మాటలతో చంపుకోవడం కన్నా ఒకరి తలలు మరొకరు నరుక్కుని చావడం చాలా నయం" అని!
మనిషిని మనిషితో కలిపి ఉంచలేని ఈ చదువులు ఎందుకు.. ఈ తెలివితేటలెందుకు….సిగ్గేస్తోంది మనుషుల్ని చూస్తుంటే!! నిజ్జంగా ఇది మనసులో కలుక్కుమని అన్పించి రాస్తున్నా…. నేను చూసిన ఎన్నో సంఘటనలకు స్పందనగా రాస్తున్నా!!
40-50 ఏళ్లు ఒకర్నొకరు గౌరవించుకుంటూ బ్రతకడం కూడా చేతకాదు… ఏం చేసుకోను మనందరికి ఈ జీవితం?
ప్రతీ ఒక్కరికీ రోషాలూ, పౌరుషాలూ, పట్టింపులూ, ప్రతీకారాలూ!! తోటి మనిషితో మాట పట్టింపు వస్తే చాలు… "చచ్చినా వెనక్కి తగ్గేది లేదని" సవాళ్లు!! ఇలాంటి సవాళ్లకు నిజంగా శక్తే ఉంటే… ఎలా వెనక్కి తగ్గలేమో అంతుచూసి కానీ వదలవు… అప్పుడు అన్పిస్తుంది… సవాళ్ల కన్నా చావు భయంకరమైనదని… చచ్చినా మళ్లీ సవాళ్లకు చావు అనే పదాన్ని వాడుకోకూడదని!!
కాస్తో కూస్తో చుట్టూతా మంచి మనుషులే ఉన్నారు కదా….. ఏదో చావలేక బ్రతుకుతున్నట్లు ప్రతీ క్షణం ఏడుపులెందుకు?
మనిషిని కలుపుకుపోతే ఏం పోతుందని?
కొందరికి ఉమ్మేయడం అలవాటు…. అలా వేసిన వారినీ క్షమించి కలుపుకుపోతే మనస్సులో ఇంకేం బాధ మిలుగుతుంది?
చివరిగా ఒక్కమాట దేన్ని ఎంతవరకూ ఎలా తీసుకోవాలో తెలీక చాలా జీవితాలు వేదనలో, బాధల్లో, కష్టాల్లో, ఎడతెరిపి లేని ఆలోచనల్లో కృంగి కృశించిపోతున్నాయి…
బాధ ఎక్కడో లేదు…. మన మనస్సులో తయారయ్యేది తప్పింది బాహ్యమైనది కాదు!!
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
2013-01-17
మనసులో..: ఎలా తీర్చుకోగలం.. ఆ రుణం?
పిచ్చివాళ్లం.. ఈ క్షణం ఈ జీవితం ఉంది అంటే… అది ఎంత అదృష్టమో నేను కళ్లారా చూస్తున్నాను…
ఈ ప్రపంచంలో మనకంటూ చోటు దక్కడం ఎంత అదృష్టమో గత కొన్ని రోజులుగా నేను గమనిస్తున్న పరిణామాలను బట్టి మరింత స్పష్టంగా అర్థమవుతోంది…
మెటర్నిటీ హాస్పిటల్‌లో లేబర్ వార్డ్‌లో తల్లులు పడుతున్న ప్రసవ వేదనని చూస్తే… మా అమ్మ గారిపై నాకు వ్యక్తపరచలేనంత గౌరవం పెరిగిపోయింది..
కొద్దిగా వయస్సూ, ఆలోచనా, బుద్ధీ రాగానే…….
విర్రవీగుతున్నాం………………………………
మనమంటూ ఈ ప్రపంచంలోకి ఊడిపడడం యాక్సిడెంటల్ కాదూ, సైన్సూ కాదు… ఖచ్చితంగా అదృష్టం.
తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి తల్లి చేసే పోరాట ఫలితమే మన జీవితం….
తన వల్ల కాదనుకుంటే… తల్లి ఏ క్షణమైనా మనల్ని తుంచేయవచ్చు… అయినా ఆ మహాతల్లుల గొప్ప ఓర్పుకి వరంగా మనకు జీవమూ, జీవితమూ ఏర్పడుతోంది… జీవిత కాలంలో ఒక్క రోజైనా ఈ విషయం మనస్సు పెట్టి ఆలోచించలేని ఏ మానవ జీవితమైనా నిరర్థకమైనది…
"అయ్యో.. భగవంతుడా" అని తల్లులు పురుటి నొప్పులతో అరిచే ప్రతీ అరుపూ ఎలాంటి మనిషినైనా కదిలించి వేస్తుంది…. వారి రుణం ఏమిచ్చీ తీర్చుకోలేం….
నా వరకూ నాకు ఈ జీవితం ఎంత గొప్ప భగవత్ ప్రసాదమో చాలా చాలా చాలా స్పష్టంగా అర్థమైంది…. అలా అర్థమైన క్షణం జీవితంపై బాధ్యత, ప్రేమా మరింత పెరిగింది…..
జీవితాన్ని ఏదో కాజువల్‌గా గడిపేయడం కాదు… ఈ చిన్న జీవితాన్ని అండర్‌లైన్ చేసుకోవాలి… అని ఎప్పటి నుండో నేను నమ్మే సిద్ధాంతానికి మరింత బలం చేకూరింది…!!!
భగవంతుడికీ, భగవత్ స్వరూపులైన తల్లులకూ ప్రణామాలతో…
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
ఉషస్సు: పెళ్ళి కాబోయే ఆడపిల్ల
2013-01-13
హాస్యాంజలి: అరుపు
మనసులో..: మనిషి శిధిలమవ్వకుండా…
వీడియో లింక్ ఇది: http://bit.ly/srihuman
ఏ రోజైతే మనిషి తన మానవత్వపు స్వభావాన్ని చంపుకుంటాడో… ఆ క్షణం తోటి మనిషి శత్రువులా తోస్తాడు…
ఏరోజైతే మనిషి తన అవసరాలే, తన స్వార్థమే ముఖ్యమనుకుంటాడో ఆ రోజు సమాజం పతనానికి చేరువవుతుంది..
ఈరోజు మన మనస్సుల్లో ప్రశాంతత కావాలంటే తెలివైన బుర్రల కన్నా సుతిమెత్తని మనసులు చాలా అవసరం.
మానవత్వం ఎందుకు ముఖ్యమో, ఎంత ముఖ్యమో, ఇప్పటికీ దీని గురించి ఆలోచించకపోతే ఏమవుతుందో ఈ వీడియోలో వివరించాను.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srihuman
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
2013-01-12
మనసులో..: మీరు యూత్ అని భావిస్తుంటే ఇది తప్పక చదవండి…
ఏం చెయ్యాలో, జీవితాన్ని ఎలా మలుచుకోవాలో గందరగోళంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆయన మాటలు ఆదర్శం…
"ఇనుప కండరాలు, ఉక్కు పిడికిళ్లు… బలమే జీవితం, బలహీనతే మరణం…" వంటి వివేకానందుని మాటలు వింటే చాలు నీరసపడిన మనస్సుల్లోకీ అంతులేని శక్తి క్షణాల్లో తిరిగి వచ్చేస్తుంది…
కొన్ని తరాలు ఆయన అడుగుజాడల్లో ఊపిరి పోసుకున్నాయి…
ఇంత స్వార్థపూరిత, తన ఆనందం తప్ప వేరేదీ పట్టని ప్రపంచంలో ఏ మూలనో సామాజిక బాధ్యత కన్పిస్తోందంటే అది వివేకానందుని అనుచరుల చలవే.
వివేకానందని మర్చిపోయాం.. ఏ రామకృష్ణ మఠానికో వెళ్లి ఆయన మాటలు చదివే "బోరింగ్" ఇంట్రెస్టులు ఎవరికీ లేవు…
నిజ్జంగా నా మనస్సుకి అన్పించింది చెప్తున్నాను…. ఈ తరాన్ని చూసి సిగ్గుపడాల్సి వస్తోంది… వెకిలి వేషాల హీరోల్ని ఆదర్శంగా తీసుకునే దౌర్భాగ్యం మన యువతకు…
వీలైతే ప్రసంగాల్ని చదవండి… త్రికరణశుద్ధిగా ఆ మాటలు మనస్సులోకి తీసుకుని ఆచరించండి…. ఇప్పటివరకూ బ్రతుకుతున్నది ఎంత meaningless లైఫో అర్థమవుతుంది…!!
వివేకానంద పేరు చెప్తే లక్షల్లో ఫీజులు వసూలు చేసే ఇనిస్టిట్యూట్ పేర్లు మాత్రమే గుర్తొస్తుంటే.. అంతకన్నా నరాల్లో చైతన్యం కట్టలు తెచ్చుకోపోతే ఈ దేశంలో మనం పొరబాటున పుట్టినట్లే!
అస్సలు ఓపికే లేని శక్తిహీనమైన దేహాలూ… దేనిపై ఆసక్తే లేని శూన్యమైన మనస్సులూ… ఎక్కడెక్కడో ఆనందం కోసం వెంపర్లాడుతూ పోతుంటే… ఆ వెంపర్లాటలో నెగిటివ్ ఎమోషన్లనీ, మసాలాల్నీ నింపేసి మీడియా తన స్వార్థం తాను చూసుకుంటూ ఉంటే…. ఒక్క క్షణం ఆనందం కోసం చేయరాని పనులూ చేయడానికి మనం వెనుకాడకపోతుంటే…. ఏం మిగిలిందని ఈ జాతిలో!
ఒక్కసారి వివేకానందని తెలుసుకుంటే.. అన్నీ చక్కబడతాయి..!! ఇది అక్షరాలా నిజం.. ఈ జాతికి కావలసింది వివేకానందలు తప్ప పనికిమాలిన సినిమా హీరోలూ, వారిని గుడ్డిగా అభిమానించి తమ జీవితాల్ని మర్చిపోయే బాధ్యత లేని అభిమానులూ కాదు…
ఇది చదివి ఏ ఒక్క కాలేజ్ స్టూడెంట్ అయినా వివేకానంద మాటల్ని చదవగలిగితే అంతకన్నా నాకు సంతోషం లేదు…
నావరకూ నాకు నా జీవితంలో వివేకానందని మించిన స్ఫూర్తి ఏదీ లేదు..!! నా లైఫ్ ఆయన్ని ఆదర్శంగా తీసుకునే డిజైన్ చేయబడింది!!
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
2013-01-11
మనసులో..: కన్నీటికి కారణం తప్ప ఏమీ లేదు!!
ఎంతైనా వాళ్ల వాళ్లంటే ఎంత ఎఫెక్షనో… అని ఎవరో ఒకర్ని point out చేస్తూ ఒకింత అసూయతో ఎప్పుడోసారి మాట్లాడేస్తూనే ఉంటాం
చూపుల్లో ఆరానీ, మెదడులో ఆలోచననీ కట్టిపెట్టి కాజువల్‌గా చూస్తే.. ఏముంది తప్పు అందులో?
తీగ చూపిస్తే లతలు అల్లుకోవడం ఎంత కామనో.. మనుషులకు బంధాలు అల్లుకోవడమూ అంత కామన్.
"వాళ్ల నేచర్ తెలీక గుడ్డిగా నమ్ముతున్నారు… ఎప్పుడోసారి బోర్లాపడతారు" అని కూడా అనేసుకుంటాం ఉండబట్టలేక!!
నేచర్ కన్నా నమ్మకం ఎక్కువ పనిచేస్తుంది రిలేషన్లు నిలబడడానికి… కావాలంటే ఎక్కడైనా ఈ fact టెస్ట్ చేసుకోండి!!
మనిషి అతి చెడ్డవాడు అని తెలిసినా.. నమ్మకం కొద్దీ చుట్టూ మూగే జనాలు ఎందరో! గుడ్డిగా అల్లుకునే ఏ రిలేషనూ మంచి చెడ్డల గురించి పెద్దగా పట్టించుకోదు. మంచో చెడో తనకనవసరం… తనవరకూ ఎలాంటి లోటు లేకుండా ఉంటే చాలు!!
అందుకే కొరుకుడు పడని క్యారెక్టర్లున్న ఫ్యామిలీ మెంబర్ల దగ్గరా ఏమీ తెలీని పిల్లలు చాలా comfortbleగానే ఉంటారు… ఎటొచ్చీ సమస్యల్లా అన్నీ ఆలోచించే మన బుర్రతోనే!
మన మనిషి అనుకున్న మనిషి.. మనల్ని విడిచి నలుగురితో కలిసిపోయి గడిపేస్తుంటే ఏదో మూల ఒంటరితనం అలుముకునే బేల హృదయాలే అందరివీ!
ఆ ఒక్క పొసెసివ్‌నెస్‌నే మనుషుల్ని దగ్గరా చేస్తోంది.. దూరమూ చేస్తోంది..
మన మనస్సే మన ఆధీనంలో ఉండదు… ఈ క్షణం మనం ఆలోచించినది మరుక్షణం మారిపోతుంది… అలాంటిది ఏకంగా ఒక మనిషి తన ఉనికి వదులుకుని పూర్తిగా మన కనుసన్నల్లో మెలగాలంటే అత్యాశే కదా! ఈ అత్యాశకు లోనయ్యే అనుక్షణం ప్రత్యక్ష నరకం చూసే భార్యాభర్తలు ఉంటున్నారు… వారి భవిష్యత్ గురించి దిగులు కన్నా ఎక్కడ తమ మాట వినకుండా పోతారోనన్న భయంతో పిల్లల్ని కట్టుదిట్టం చేసే పేరెంట్స్ ఉంటున్నారు… వేరే ఫ్రెండ్స్‌తో మూవ్ అవుతుంటే కుళ్లుకునే ఫ్రెండ్సూ ఉంటున్నారు…
ఎవరి జీవితం వారిది.. ఎవరికి జీవితాన్ని ఎవరికి నచ్చినట్లు వాళ్లు జీవించే స్వేచ్ఛ బ్రహ్మలిఖితం. మనమెవ్వరిమి…. బంధనాలతో బంధాలను మన ఒళ్లోనే కట్టిపడెయ్యాలని తాపత్రయపడడానికి…? పిచ్చి తాపత్రయం కాదూ!!
మన కళ్లెదుట ఓ మనిషి ఉన్నంతసేపే వారి ఉనికి మన జీవితంలో! మన ఆలోచనల్లో ఒక మనిషి ఉన్నంత వరకే వాళ్ల గురించి మమకారం మనకు మనస్సులో!
కళ్లెదుట జీవితాంతం ఉంచుకోలేక ఆలోచనల్లో ఎఫెక్షన్ పెంచేసుకుంటూ పోతే.. దాన్ని త్యాగంగా, ఎవరూ అందించలేని ప్రేమగా పేర్లు పెట్టేసుకుంటే…
హహహహ అవతలి వారికి అస్సలు అవసరం లేని ఈ పిచ్చి ప్రేమలు ఎవరికి కావాలి? కళ్లమ్మట నీళ్లు తెచ్చుకోవడానికి ఓ కారణంగా మిలగడం తప్ప!
కళ్లెదుట సాగిపోనీండి మనుషుల్నీ, ఆలోచనల్లో కదలాడనీయండి వారి జాడల్ని… ఎవరెలా పోయినా.. ఎవరెవరితో అల్లుకుపోతున్నా… ఓ చెరగని నవ్వుని నమ్ముకుంటే అంతకన్నా విశాల హృదయం ఏముంది ఈ జీవితంలో!!
గమనిక: ఇది ఎవరిలోనైనా ఆలోచనలు రేకెత్తిస్తుంది అనుకుంటే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
దార్ల: University of Hyderabad Admission Notification for 2013-14
2013-01-09
వీవెనుడి టెక్కునిక్కులు: మొబైళ్ళలో తెలుగు → తెలుగులో మొబైళ్ళు
2013-01-08
పదహారణాలా తెలుగబ్బాయి: ప్రవాస భారతీయ దినోత్సవం
అంతరంగం: అక్బర్ ది గ్రేట్!
ఫణీంద్ర గారు చాలా బాగా రాసారండి. పాట అర్థం చాలా బాగా వివరించారు … Excellent
chalaabagunnae
@sravan: తాపత్రయం అంటే అసలు అర్థాన్ని వివరించినందుకు thanks. నేను వ్యవహారార్థం తీసుకుని నా వివరణ రాశాను.
చాలా బాగా వ్రాశారు. ముఖ్య్మగా కాలిన కడుపుతో నేరం చేసే వాడికంటే నిండిన కడుపుతో నేరం చేసేవాడూ ఎక్కువ నేరస్తుడు కాదా? అని అడిగారు కదా? అసలాలొచించాల్సిన కోణమదే.
ఇన్నిరోజులూ తాడేపల్లి గారి వాఖ్య చూడలేదు. ఇప్పుడు దీనికి విలువా లేదు.
చాలా బాగా చెప్పారు.
అత్యంతా హాస్యాస్పదం ఏంటంటే, వాళ్ళ కామెంట్ కి, పేజి లకి లైక్ లు కొట్టమని అడగటం ఏంటో , మరీ వింతగా అనిపిస్తుంది. నవ్వొస్తుంది.
ఇంతకు ముందు ఆర్కుట్ లో ఇలాగె testimonials రాయమని తెగ బలవంతం చేసేవారు, ఆ పిచ్చి ఎంతవరకు వెళ్లిందంటే నా ఎకౌంటు నుండి వాడికి వాడె testimonials రాసుకునే అంత .
Thank you sir…
వంశీ గారు..
మన వ్యక్తిగత సంతృప్తికి మించిన కొలమానం జీవితంలో మరొకటి లేదు. మీ జీవితాన్ని మీ దృష్టితో చూడడమే మేలు.. ఇతరుల దృష్టితో ఎప్పుడూ చూడకండి, విపరీతమైన డబ్బు సంపాదిస్తేనే సంతోషంగా ఉండగలుగుతాం అన్నది ఒట్టి భ్రమ… అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.
Hello Sir, I am following your blog for the past 6 months. It was really superb. Really i appreciate your efforts in creating this kind of stuff.
I would like to ask a small suggestion.
My family (Elder Brother & Dad) is not satisfy with my salary. They are expecting much more than my current package. But myself and my wife are happy with the money which i am earning now, Nearly i am saving half of my salary for the future use.
My dad is feeling sad by comparing my salary with that of my cousins.
What should i do Sir ?? Do we need lot of money to be happy in our life ?
For me Health and Happiness are most important factors to be consider.
What should i do sir ? I am really enjoying the work in current position…
Waiting for you reply
”i request plz give importance to act/works rather than talks”. మీ దగ్గరి వారికే మీ చర్యలు తెలుస్తాయి. మీకు దూరంగా ఉన్నవారికి, లేదా మీ అపరిచితులకి మీ గురించి మీ మాటే తెలియజేస్తుంది. మీరు ఎలాంటివారో ఇతరులకు తెలిసేది మాట ద్వారానే. మీరు ప్రపంచంతో కమ్యూనికేట్ అయ్యేది మాట ద్వారానే. అపరిచితుల దాకా ఎందుకు, మీరు చేసిన మంచి పనుల గురించి తెలిసిన మీ మిత్రులైనా, మీ కుటుంబ సభ్యులైనా సరే మీరు మాట జారినా, లేదా ఇల్లాజికల్ గా మాట్లాడినా తప్పు పడతారు. కనుక మాట చాలా ముఖ్యం. మాటే నిజమైన ఆభరణమని భర్తృహరి అన్నాడు. హనుమంతుడికి వాక్య విశారదుడనే బిరుదు ఉంది. ధర్మరాజుకు, అతని మిగిలిన సోదరులకు తేడా మాట తేడాలోనే ఉంది. ఆ మధ్య టీకే అరుణ్ అనే కాలమిస్ట్ రాసిన ఒక వ్యాసం చదివాను. మనలో చాలామంది మాటల్ని మంచి నీళ్లలా ధారాళంగా వాడతారని, మాట్లాడే ముందు ఆలోచించరనీ ఆయన అంటాడు. పారిశ్రామిక సమాజాలలో కన్నా పారిశ్రామికం కాని సమాజాల్లో మాటపై బేఖాతరు ఎక్కువంటాడు.
I was expecting this kind of comment , మీరు ఎవరో కూడా నాకు తెలవదు కాని మీరు ఒక మాట అన్నారు . నాకు లాజిక్ లేదని , నా ప్రవర్తన పట్ల విచారం వ్యక్తం చేసారు , నేను ఎలా మాట్లాడి ఉండాల్సినదో కూదా చెప్పారు any way I informed that I am not supporting infanticide, this post with response to our quick reactions on web. i request plz give importance importance to act/ works rather than talks. For your information may social works are acknowledged by Two state level awards and Four district level awards , I work with Indian Redcoross, Vivekanada Human Excellence , Sathaysai Seva and actively associated with Tamd.org&Rotract Club in many programs that includes polio, AIDS, and I provide career guidance freely to thousands of students. you may check with any of my peers about this . This is not some things to showcase my works but people used to give quick response based on some comments when i gone overboard. ఒక చిన్న ఉదాహరణ: మీతో పెద్దగా పరిచయం లేని వ్యక్తి ఎదో ఒక సంధర్బం లో మీకు సహాయాలు చేసాడు అనుకొందాం అతని పనుల వలన మీకు అతనిపై మంచి అభిప్రాయం కలుగుతున్న సమయం లో అతని వెర్రి మాట వలనో , ఆవేశంలో చేసిన ఓ తిక్క చేష్ట వలనో అప్పటిదాకా ఉన్న అభిప్రాయాన్ని మార్చు కొంటే ఎలా వుంటుంది
Well things have begun to change as can be seen from the statement of Mr. Azim Premji at WEF
chala chakkaga chepperu
ఈ టపా శీర్షిక అర్థం కాలేదు. తండ్రికీ, మానభంగాలకీ సంబంధం…. అది కూడా అర్థం కాలేదు. అయితే మానభంగాల టాపిక్కుతో సంబంధం లేని ఒక వాస్తవం, అనుభవసారం – అహంకారం లేని, చూపించని మగవాళ్ళు ఆడవాళ్ళకి నచ్చరు.
మీరన్నది నిజం. అమ్మాయిలకు ఇంకేమీ అఖ్ఖర్లేదని, ఈ సోకాల్డు ‘శీలం’మాత్రం ఉంటేచాలుననీ, ఇదొక్కటిలేకపోతే ఇంకెన్నున్నా అనవసరమనే భావనలు పోవాలి. సమాజం ‘శీలం’ విషయంలో స్త్రీల జననాంగాలమీద ఆసక్తిని కనబరచే స్థాయినుంచి ఎదగాలి.
మీరన్నది నిజం. ఎవరైనా జేబుదొంగతనం నేరంలో అరెస్టవ్వాల్సి వచ్చి “నాకు నలతగా ఉంది. ముందు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళండి” అంటే నాలుగు తన్ని ఈడ్చుకెళతారు. అదేమాట ఇలాంటి పొగరుబోతులంటే మాత్రం “జీహుజూర్” అంటుంది గవర్నమెంటు. చివరికయ్యేది ప్రభుత్వానికీ, మజ్లిస్‌కీ మధ్య సంధి కుదరటం. ఇలాంటిమాటలు ఇంకే పాశ్చాత్య దేశంలోనైనా అంటే జైల్లోకూరి గోళ్ళూడగొడతారు. మనది లౌకికరాజ్యమాయె.
ఈ సందర్భంగా ఇంకొక విషయం. అక్బరుడు అన్నేసిమాటలంటే తాటతీసిందేమీలేదుగానీ, ఆయన్ను విమర్శించినవారినిమాత్రం ఠంచనుగా అరెస్టుచేసేశారు. ఇలా ఉంటుందన్నమాట ఆచరణలో ప్రభుత్వాలు “భావవ్యక్తీకరణ హక్కు” ను గౌరవించడం.
telugulo ela message vastundi……
యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః