2012-02-04
a2z డ్రీమ్స్: ‘రామ్ చరణ్’ రచ్చ సినిమాతో కలక్షన్స్ రచ్చ లేపుతాడా?
1) మగధీర సినిమా ద్వారా నీ తండ్రి నీకు ఇచ్చిన స్టామినా ఇది అని రాజమౌళి ‘రామ్ చరణ్’ కు చూపించాడు.
2) దూకుడు, ‘బిజినెస్ మేన్’ సినిమా ల ద్వారా తెలుగు సినిమాల ప్రస్తుతం ఓపినింగ్స్ స్టామినా ఇది అని మహేష్ బాబు ఇంకో గోల్ సెట్ చేసాడు.
3) ఆరెంజ్ సినిమా ద్వారా తన సినిమాకు ప్రేక్షకులకు అర్ధం కాని కాన్సెప్ట్ , దానికి తోడు ఓవర్ బడ్జెట్ అనవసరం అని తెలుసుకున్నాడు.
ఈ పరిస్తితులలో వస్తున్న సినిమా ‘రచ్చ’.
my observation:
మగధిర సినిమా ద్వారా పోకిరీ రికార్డులని ఎలా చిత్తు చేసాడో రచ్చ సినిమా ద్వారా భారీ ఓపినింగ్స్ సాధించి ‘బిజినెస్ మేన్’ రచ్చ లేపాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
ps: లీక్ అయిన title song రచ్చ లేపుతుంది.
వరూధిని: బుజ్జి పండు తెలుగు చదువు - 12 - భామా విజయం - 7
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ETV 2 సఖిలో నిన్న(3 ఫిబ్రవరి 2012) ప్రసారమైన నా సఖి.కామ్ ప్రోగ్రామ్ ఇది
వరూధిని: కాపీ క్యాటులు అనబడు కోతులు !
సాహిత్య అభిమాని: కిషోర్ కుమార్ తో ఇంటర్వ్యూ
పుస్తకం: 2011 లో నా పుస్తక పఠనం
2012-02-03
Padmarpita....: తలపెందుకని?
గిరిం పేట స్కూలోళ్ళ కతల్ వెతల్ స్మృతుల్: అవే కళ్ళు
“ఏమండి … ఓ సారి ఇటు చూడండి” అంటూ భర్తని పిలిదింది రమ్య, కిటికీ దగ్గర నించుని.
“ఏమిటి..” అంటూ వచ్చాడు తన దగ్గరకి కృష్ణ.
“మన ఇంటి ముందు నించున్న ఆ మనిషిని చూడండి.. పొద్దుట నుండీ మననే గమనిస్తున్నాడు. నేను పాపని స్కూల్ కి తీసుకెళ్తే అక్కడికీ వచ్చాడు. సాయంత్రం పాపని స్కూలు నుండి తీసుకొస్తుంటే, మళ్ళీ అక్కడి నుండి ఫాలో అవుతున్నాడు. ఇంటర్వల్ లో పాప కి చాకోలెట్స్ ఇవ్వబోయాడంట. ఆయా చెప్పింది. మీరు ఇంటికి వచ్చే వరకూ, బిక్కు బిక్కు మంటూ తలుపులేసుకుని కూర్చున్నాము.” చెప్పింది రమ్య.
కృష్ణ అతడిని తేరి పార చూస్తూ, ” చూస్తే పిల్లల్ని ఎత్తుకెళ్ళే వాడి లాగ అయితే అనిపించటం లేదు. మన పాప ముద్దోచ్చిందేమో..” అన్నాడు.
“అయితే మటుకు.. ఇలా పొద్దంతా ఫాలో కావాలా..? ఇప్పటికీ వెళ్ళటం లేదు..నాకేదో భయంగా ఉంది.. ” అంది రమ్య.
“నేను వెళ్లి లోనకి పిలిచి విషయం కనుక్కుంటానుండు .” అని బయటికి వెళ్లి పిలిచాడు అతడిని లోనకి.
లోనకి వస్తూనే పాప కోసం ఆత్రుతగా చూసాయి అతడి కళ్ళు..
“పాపని .. ఒక్క సారి పిలుస్తారా..పొద్దుట చాకోలెట్స్ స్కూల్లో ఇవ్వనివ్వ లేదు. ఇవి ఇచ్చి వెళతాను” అన్నాడు.
“మీరెవరు..మా పాప నే ఫాలో అవుతున్నారట.. ఇలా చేయటం న్యూ సెన్స్ అని మీకు తెలియదా..” అన్నాడు కృష్ణ కొంచెం కఠినంగా..
“సారీ అండి.. నా పేరు షణ్ముగం. మా వూరు చిత్తూరు.స్టేట్ బ్యాంకు లో ఉద్యోగం.ఈ వూరికి నేను transfer పై వచ్చాను. దూరం కదా అని నేను ఒక్కడినే ఇక్కడ ఉంటున్నాను.. మా పాప కూడా అచ్చు మీ పాప లాగే ఉంటుంది. నిన్న మీ పాపని బజార్లో చూసాను మీతో పాటు. అప్పటి నుండి, తనే గుర్తు వస్తోంది. అందుకే మీ పాప ని చూడటానికి స్కూలు వెళ్ళాను.”
“సరే లెండి..” అని “చిన్నూ: అని పిలిచాడు కృష్ణ పాపని.
పాప వస్తూనే, షణ్ముగం మొహం విప్పారింది. దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దాడి, చాకోలెట్స్ తన చేతికిచ్చి పాప కళ్ళ వైపే చూస్తుండి పోయాడు కొద్ది సేపు.. రమ్య తెచ్చిన కాఫీ తాగి, బయల్దేరాడు.
ఇంటి గేట్ వరకూ, సాగనంపడానికి వచ్చిన కృష్ణ, ” మీకు మీ పాప అంటే చాల ఇష్టం కదూ.. తను ఇప్పుడు ఏం చేస్తోంది” అని అడిగాడు.
“తను కూడా ఫిఫ్త్ లో ఉంది మీ పాపకి మల్లేనే…” అని ఆగి, ” మీ పాప తో ఉండేసరికి నా పాపనే చూసినట్టు అనిపించింది . థాంక్స్. మీకు ఇబ్బంది కలిగించానేమో… సారీ ” అని షణ్ముగం వెళ్ళిపోయాడు.
“ఆక్సిడెంట్ లో మరణించిన తన పాప కళ్ళే , దృష్టి లోపమున్న కృష్ణ వాళ్ళ పాపకి అమర్చారనీ, ఆ కళ్ళలో తన పాపని చూసుకోటానికే తను ఆ వూరుకి వెతుక్కుంటూ వచ్చాడని” చెప్పాలని వున్నా , ” అలా చెపితే, భయపడి , మళ్ళీ తనని పాపని ఇంకో సారి చూడనివ్వరేమో అని, వాళ్లకు చెప్పకుండా వెళ్ళిపోతున్న షణ్ముగం లోని తండ్రి వేదనతో కదిలాడు తన పాప జ్ఞాపకాలతో.
ఆలోచనా తరంగాలు: కార్పోరేట్ హోమియోపతి
Stamps of Andhra: Builders of Modern India
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: అమ్మో.. డేటా డిలీట్ చేస్తారేమో..! (వీడియో డెమో)
వరూధిని: జిలేబి శతకం - 2
సాహిత్య అభిమాని: సరదాగా చరిత్ర
2012-02-02
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: కంప్యూటర్ ని వేగం చేసుకోవడానికి అద్భుతమైన మార్గం
Balageetham: పిచ్చుక
పుస్తకం: Sita’s Ramayana
2012-02-01
తురుపుముక్క: వానప్రస్థం
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: డివిడి తయారీ కంపెనీలు మనల్ని మోసం చేస్తున్నాయా?
శుభోదయం...: కదలివచ్చిన ఉదయం
2012-01-31
తురుపుముక్క: పోటీ ముగిసింది!
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: Firefox 10 ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ఆంధ్రప్రభ డైలీ పేపర్ లోని నిన్నటి నా టెక్నాలజీ కాలమ్ ఇది
Dr. Acharya Phaneendra: ఏక వాక్య కవితలు (ఇంకొన్ని) …
ఏక వాక్య కవితలు (ఇంకొన్ని) …
[లోగడ నేను ప్రచురించిన టపాలలో కవిత్వాంశకు సంబంధించి - చాలా మందికి నచ్చిన, బాగా చర్చనీయాంశమైన, బహుళ ప్రచారం పొందిన టపాలు రెండున్నాయి. అవి - మార్చ్ 2009 లో, జూలై 2009 లో ప్రచురించబడిన నా ’ఏక వాక్య కవితలు’. అవి ఎంతగా ప్రసిద్ధి చెందాయంటే - అవి ప్రచురించబడి దాదాపు మూడేళ్ళవుతున్నా, ఇప్పటికీ వారానికి ఇరవై నుండి ముప్పయ్ మంది సాహిత్యాభిమానులు వాటిని వీక్షిస్తూనే ఉన్నారు. అవి సాహిత్యాభిమానుల హృదయాలకు ఎంతగా హత్తుకోన్నాయంటే - ఇప్పటికీ అడపా దడపా మంచి మంచి వ్యాఖ్యలను చేస్తూనే ఉన్నారు.
Bhaskara Rami Reddy
మార్చి 17, 2009 @ 03:00:20
ఫణీంద్ర గారు,
ఒక్కోక్క వాక్యం ఒక్కోక్క సంహిత.ఎంతబాగా మాల కట్టారండి.
patanjali
మార్చి 28, 2009 @ 07:14:08
నమస్సులు.
మీ బ్లాగ్ బాగుంది.
ఏక వాక్య సంయోజనలో కవితావిష్కరణ ప్రయోగం అభినందనీయం.
-డా.తాడేపల్లి పతంజలి
lakshmiprabha
మార్చి 31, 2009 @ 22:16:43
namasthe
vakyam rasatmakam - the coinage is justified in your beautifully short expressions.
Vinay
జూన్ 14, 2009 @ 22:49:04
Telugu theyyadanam parimalalalo olaladinchina meeku ede na namassumanjali.
potukuchi taraka phanindra sarma
Feb 12, 2011 @ 01:37:29
meeru vrasina kavitha నీ kosam jeevithakalam nireekshinche preyasi mrutyuvu annaru , a okkapadam tho nenu jeevitamlo marachipolekapotunna nannu prminchina { mosaginchina } naa preyasini marachipoyi jeevitamlo hayiga untunnanu , meeku dhanyvaadalu .
SUDHEER KUMAR
డిసెం 23, 2011 @ 21:35:15
velakakattakattleni vakyala harivillukada idhi
Kaleswara Rao
జన 26, 2012 @ 18:39:31
Sri Phaneedra Garu
kasta manasu bagoleka telugu kavitalu clicks chesa, me kavitalu chusakame Eka vakya kavitalu – manasuki manchi kick la panichesayi
Thanks
కలి
-----------------------------------------------------------------
ఇలాంటి వ్యాఖ్యలు కవిగా నాకు మంచి సంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి సాహిత్యాభిమానుల కోసం నా ఏక వాక్య కవితలు ఇంకొన్నింటిని ప్రచురిస్తున్నాను. మనసారా ఆస్వాదించి, ఆశీర్వదించండి.
- డా. ఆచార్య ఫణీంద్ర ]
*కరిగి కురిసే మేఘమైనా , గర్జిస్తే దిక్కులు కంపిస్తాయి.
*కుందింది మనసైతే, బుగ్గా! నువ్వెందుకే కందడం?
*చిరుత ప్రాయం – గాండ్రింపులు మామూలే!
*జీవితం కాలిపోతున్నా జీవితాల్ని వెలిగించు.
*కష్టాల్లో ఆత్మీయుల పలకరింపులు – వేడి వేసవిలో గొంతులో జారే చన్నీటి చుక్కలు.
*ప్రాణం అంటే తీపి – చస్తే చావను!
*వేల మైళ్ళ ప్రయాణమైనా వేసేది ముందు ఒక అడుగే!
*ఒక బుల్లి పెట్టె వల్ల ఇల్లిల్లూ కల్లోలమే!
*గుండెలు ద్రవించాయి – కళ్ళు వర్షించాయి
*వందలాది ‘లబ్ డబ్’ లకు ‘ఛుక్ ఛుక్’ అంటూ శ్రుతి కలుపుతోంది రైలు!
*నింగి పొయ్యిలో నిప్పు రాజేసి భూగోళాన్ని ‘ఫ్రై’ చేస్తున్నాడు సూర్యుడు.
* కాకికేం తెలుసు విగ్రహం వీర శివాజీదని – రెట్ట వేసింది.
*పురిటి నొప్పులు పడుతున్న పూర్ణ గర్భిణిలా నడుస్తోంది బస్సు.
*ప్రొద్దున్నే సూర్యుడేమిటి – చెట్టు చాటు నుండి దొంగ చూపులు?
*అమాయికత్వం కాకపొతే, అశాశ్వత జీవితాలు వెళ్ళబుచ్చడానికి శాశ్వత భవనాలు కట్టుకోవడమేమిటి?
*కాలం కత్తికి రెండు పార్శ్వాలు – గతం, భవిష్యత్తు!
*నిరక్షరాస్యత – పాల బుగ్గపై కన్నీటి చార!
*ప్రపంచాన్ని రెక్కలకు కట్టుకొని గుమ్మంలో వాలే పక్షి – వార్తా పత్రిక!
*భ్రమలో తేలే మనసుకు వాస్తవాలు ములుకుల్లా గుచ్చుతాయి.
*నీ మునివాకిట్లో వేచి వేచి, నీ పిలుపందేసరికి నివురైపోయాను.
* యంత్రం మానవుని మంత్రం -మానవుడు దేవుని యంత్రం!
*కొందరికి తిండి దొరకక హాహాకారాలు – కొందరికి తిన్నదరగక వ్యాయామాలు!
*ఇంధనం లేక వాహనం, దానం లేక జీవనం – ముందుకు సాగవు!
*చెట్టులా పెరిగి ఏం లాభం? – బుద్ధి చిగురించనప్పుడు!
*బరువంతా గుండెల్లో దాచుకొన్న సంచిని చేతి వేళ్ళకు ఉరేస్తాడు మనిషి.
*మట్టిలోకి తోసేసిన మనిషికే చెట్టై సేవ చేస్తుంది విత్తనం.
*కంటి తడి తెలియని వాడు కవి కాలేడు.
*జీవన వాక్యంలో అనారోగ్యం కామా; మృత్యువు ఫుల్ స్టాప్!
*ఆమెకు, నాకు మధ్య చూపుల తోరణాలు.
*బాల్య చాపల్యం కాకపోతే, భగవంతుడు విశ్వాన్ని బొంగరంలా తిప్పి ఆడుకోవడమేమిటి?
*కరిగిపోయేది కాలం కాదు – నీ ఆయువు!
*నువ్వు తడవకుండా ఉండేందుకు తాను తడిసిపోయే త్యాగి – గొడుగు!
*గుండెదిటువు గలవానికి జీవించడం – ఇరానీ కేఫ్ లో టీ త్రాగినంత సులువు!
*తలబిరుసుతనంతో తరలి వెళుతుంటే, గుడిలో గీతా శ్లోకం కొరడా చరుపై వినిపించింది.
*నిద్రిస్తున్న నగరంలో నడుస్తున్న దివిటీ -గూర్ఖా!
*కన్నీటి కెరటాలలో స్వప్న శకలాలు తేలియాడుతున్నాయి!
*ఎండా వానల స్నేహం ఏడు రంగులతో మెరిసింది!
*తమస్సులో ప్రయాణిస్తున్నాను – ఉషస్సుకై అన్వేషిస్తూ!
*బ్రతుకవచ్చిన కప్ప బావినే మింగితే ఎలా?
* దివి నుండి భువికి దిగివచ్చే దేవత వర్షధార!
*కొండ గుండె పగిలిందేమో – కన్నీరు జలపాతం!
*ఆ వృద్ధ దంపతుల దేహాలు ఇండియాలో – ఆత్మలు అమెరికాలో!
*భావానికి స్నానం చేయించి, పెళ్ళికూతురిలా అలంకరించడమే కవిత్వం!
—***—
పుస్తకం: 2011 లో నేనూ, పుస్తకం, నా పుస్తకాలు
2012-01-30
ఆలోచనా తరంగాలు: వీరవిద్యలు- వింతవాస్తవాలు
నడక - జాన్ హైడ్ కనుమూరి: సిలువ మోత
గిరిం పేట స్కూలోళ్ళ కతల్ వెతల్ స్మృతుల్: ఆసుపత్రిలో ఓ రోజు…A moving saga
ఈ రోజు ఒక ఈ- మెయిల్ లో వచ్చిన మెసేజి సారాంశం
ఒక డాక్టర్ కి అత్యవసర పిలుపు వచ్చింది ఓ అబ్బాయికి ఆపెరేషన్ చేయాలని. ఓ గంట తరవాత ఆసుపత్రిలోకి రొప్పుతూ వచ్చాడా డాక్టరు. వస్తూనే సర్జెరీ దుస్తులు వేసుకుంటూ ఆపరేషన్ థియేటర్ దగ్గరకి పరుగు పెట్టాడు.. అక్కడే అప్పటి వరకూ నిరీక్షిస్తున్న ఆ అబ్బాయి తండ్రికి డాక్టర్ని చూస్తూనే కోపం కట్టలు తెంచుకుంది.
“ఇంత ఆలస్యంగానా రావటం… అవతల చావు బతుకుల్లో ఉన్న నా కొడుక్కి ఏమైనా అయితే ఎవరిదీ బాధ్యత…”
డాక్టర్ చిరు నవ్వుతో ” సారి అండి… నాకు కాల్ వచ్చిన వెంటనే బయల్దేరాను. దూరంగా వుండటం వలన ఆలస్యం అయింది.మీరు శాంతిస్తే, నేను లోనకెళ్ళి నా పని మొదలెడతాను”
“శాంతించటం…? చెప్పటానికి నీతులేన్నైనా చెప్పొచ్చు.. నీ కొడుకే లోన ఉంటె, ఇలా నీతులు చెప్ప గలవా..? అప్పుడు తెలుస్తుంది కన్న బాధ” అప్పటికీ శాంతించని తండ్రి స్వరం
డాక్టర్ అనునయంగా “చూడండి… అందరూ మట్టిలోంచి వచ్చాం. మట్టిలోకి పోయే వాళ్ళమే.. దేవుడిని ప్రార్థించండి మీ అబ్బాయికి ఏమి కాకూడదని.. ఆ భగవదేచ్చ వుంటే… మేము ఆపెరేషన్ విజయవంతంగా చేయాలని ఆ దేవుడ్ని కోరండి”
“సలహాలు చెప్పటం సులువే..” అన్నాడు ఆ తండ్రి ఆక్రోశంతో.
లోనకి వెళ్ళిన డాక్టరు గంటల తరబడి ప్రయత్నించి, ఆపెరేషన్ విజయవంతంగా పూర్తి చేయగలిగాడు.
బయటికి వస్తూనే…ఆ తండ్రిని చూస్తూ ” మీ ప్రార్థనలు ఫలించాయి.. మీ అబ్బాయికేం ప్రమాదం లేదు..” అంటూ అతడి జవాబు కోసం ఎదురైనా చూడకుండా వడి వడి గా అడుగులు వేసుకుంటూ వెళ్ళసాగాడు. వెళ్తూ “మీకేమైనా అనుమానాలుంటే అక్కడే ఉన్న నర్సు ని అడగండి ” అని చెపుతూ కనుమరుగయ్యాడు.
“ఏమిటీ డాక్టరుకి ఇంత అహంకారం… నా కొడుకు పరిస్థితి వివరించి వెళ్ళొచ్చు కదా.. మరీ ఇంత నిర్లక్ష్యమా ..” అన్నాడు పక్కనే ఉన్న నర్సుతో..
ఆ నర్సు అంది (కన్నీళ్లు ఆపుకుంటూ) “ఆ డాక్టరు కొడుకు నిన్న ఓ ఆక్సిడెంట్ లో మరణించాడు. మీ అబ్బాయి ఆపెరేషన్ కోసం మేం అతడిని పిలిచినప్పుడు అంత్య క్రియల ఏర్పాట్లలో ఉన్నాడు. మీ అబ్బాయి కోసం ఉన్న పళంగా వచ్చాడు. మిగతా కర్మ కాండ పూర్తి చేయటానికి ఇప్పుడు వెళ్ళాడు”
నల్లమోతు శ్రీధర్ సాంకేతికాలు: ఫిబ్రవరి 2012 “కంప్యూటర్ ఎరా” మేగజైన్ రిలీజైంది కవర్ పేజీ ఇది
పుస్తకం: తేరా నామ్ ఏక్ సహారా ?!
2012-01-29
నడక - జాన్ హైడ్ కనుమూరి: విశ్వాసము యొక్క సహనము పరీక్షించబడుతుంది
Dr. Acharya Phaneendra: పాడవే చెలి!
పాడవే చెలి! [గీతం]
రచన: డా. ఆచార్య ఫణీంద్ర
[2003లో అనుకొంటాను - ’సిలికానాంధ్ర’ (యు.ఎస్.ఏ.) వారు అంతర్జాతీయ స్థాయిలో ’తెలుగు గేయ కవితల పోటీ’ నిర్వహించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ’న్యాయ నిర్ణేత’గా వ్యవహరించిన ఆ పోటీలో నా ఈ లలిత గీతం పురస్కారాన్ని పొందింది. నేను రచించిన వాటిలో, నాకు బాగా నచ్చిన గీతాలలో ఇది ఒకటి. ఆస్వాదించండి.]
పాడవే చెలి! తీయ తీయగ -
పరవశము నందీయగ!
పరవశము నందీయగ!!
వివిధ భాషల వెలయ జేసిన
మధుర కవితల మధువులన్నీ -
ఒక్కచో కలబోసి గ్రోలుచు
మక్కువను మది తీర్చుకొనునటు -
పాడవే చెలి! …
తీపి గొంతుక తీగ సాగుచు
హృదయ సీమల నెల్ల తాకుచు -
తాకు తాకున తన్మయత్వపు
పూల పుప్పొడి రాల జేయగ -
పాడవే చెలి! …
వేడి వేసవి వీధి సాగుచు
నీడ పట్టున నిలిచినంత -
మలయ పవనం మేను తాకిన
మధురమౌ అనుభూతి కలుగగ -
పాడవే చెలి! …
–-***—
మారుతీయం: ఏవీ ఈ పద్మాలు
మారుతీయం: జాతీయ రుగ్మత
2012-01-28
Padmarpita....: ఎందుకో ఏమో?
♥కవితాంజలి♥: దేహాత్మైక్యం
fukuoka farm: శేఖర్ ఇలా అన్నారు
పుస్తకం: నడిచే విజ్ఞానసర్వస్వం ఎన్నెస్కే
2012-01-27
పుస్తకం: 2011- నా తెలుగు పుస్తక పఠనం
దుర్గా రావు గారు!
ధన్యవాదాలు! మీ కవితా బాగుంది.
శ్రీధర్ గారూ, ఉపయోగపడే సమాచారం సరళంగా అర్థమయ్యేలా అందించారు. థాంక్యూ.
Kavithalu konni chala bagunnai. (VENUKA CHAKRAM THIRUGUTHUNDI MUNDU CHAKRANNI ANDUKOVALANI KANI ENTHAKI ANDADE)
ఛానెల్స్ లంకె తప్పుగా వచ్చింది. ఇదీ సరైన లంకె: http://www.mozilla.org/en-US/firefox/channel/
కొత్త ఫైర్‌ఫాక్స్ వెర్షను గురించి మీ బ్లాగు చదువరుకు తెలియజేయడం ఆనందకరమైన విషయం.
అయితే, మీరు ఇచ్చిన లంకెతో రెండు సమస్యలున్నాయి: (1) అది విండోస్ 32 బిట్ నిర్వాహక వ్యవస్థకు సంబంధించినది (నేను లినక్స్ వాడుతున్నాను కాబట్టి మీ లంకె నాకు పనిచేయదు, అలానే మాక్ లేదా 64 బిట్ నిర్వాహక వ్యవస్థ వాడేవారికి కూడా); (2) అందునా మీ లంకె ఒక ప్రత్యేక మిర్రరుకు సంబంధించినది. (ఈ మిర్రరు అన్ని ప్రాంతాల వారికీ వేగవంతగా పనిచెయ్యకపోవచ్చు. ఏదైనా కారణాల వల్ల ఆ మిర్రర్ డౌన్ అయినా మీ లంకె నిరుపయోగమే.)
ఇలా నేరుగా మిర్రర్లకు లేదా బైనరీలకు లంకెలు ఇవ్వడాన్ని మొజిల్లా ప్రోత్సహించదు. అధికారిక, స్థిరమైన విడుదలలకు http://mozilla.com/ అన్న లంకెను వాడుకోవచ్చు. ఇది వాడుకరి యొక్క నిర్వాహక వ్యవస్థకు మరియు భాషకు తగ్గ డౌన్‌లోడ్ లంకెను అందిస్తుంది.
ఇక భవిష్యత్తు ఫైర్‌ఫాక్స్ విడుదలలను ముందే వాడిచూడడానికి లేదా పరీక్షించడానికి <a href='https://www.mozilla.org/en-US/firefox/channel/'>ఫైర్‌ఫాక్స్ ఛానెల్స్</a> పేజీని లంకెగా ఇవ్వవచ్చు.
very nice post.. heart touching..
pch.. vijnaanam .ni . vichalitam gaa choosaaranna maata.
review బాగుంది.
Hi Sridhar – Thanks for the video. I agree with you on expecting the major responsibility lying wiht Financial organizations who set up these ATMs since customers on remote areas are not completely aware of these technical traps. Perhaps, insurance coverage at free of cost from Banks may be optimal, similar to FDIC in US. More user awareness sessions to be conducted or communicated thru post by banks atleast once a year.





