2012-02-03
PHANI BABU -musings: బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– దేముణ్ణి కూడా వదలడం లేదు…
అదేం విశేషమో, ఆ శ్రీవెంకటేశ్వరుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగేస్తున్నారు. రెండు రోజుల క్రితం, షిరిడీ నుండి వచ్చిన సాయిబాబా పాదుకలమీద వివాదం. ఈవేళ చిన జియర్ గారూ, ఆయనెవరో పీఠాధిపతి గారూ ఒకరిమీద ఒకరు ఆరోపణలు. ఈ మధ్యలో శ్రీవారి కల్యాణం నేపాల్ లో జరపడం విషయం లో వివాదం. ఇవే కాకుండా ఈ.ఓ. గారొకాయన మీద సిబీఐ వాళ్ళు chargesheet లో ఆయన పేరు ప్రస్తావించారని, ఈయనేమో దేముడి మీద ప్రమాణాలూ వగైరా.. ఏమిటో ఆయనదారిన ఆయన శ్రీవెంకటేశ్వరుడు, ఏదో హాయిగా కళ్ళు మూసుకుని, ఆయన అప్పేదో తీర్చుకుంటున్నారుగా, వీళ్ళనేమైనా అడిగారా పెట్టారా, వదిలేయకూడదూ పోనీ? ప్రతీదాన్నీ రాజకీయం చేయడం ఎందుకో అసలు? ఆయనెవడో, ప్రభుత్వాన్ని రక్షించడానికి ఓటు వేశాడని, టిటిడి ఛైర్మన్ చేశారు. ఇంకోఆయనేమో (మాజీ ఛైర్మన్) అవేవో నిరాహారదీక్షలూ వగైరా చేశాడు. ఒక్కరోజు కూడా, ఏదో ఒక controversy లేకుండా రోజెళ్ళడం లేదు. ఎవరి వాదనలు కరెక్టో కూడా తెలియదు. ఎవర్ని నమ్మాలో అసలే తెలియదు. అందుకనే అన్నారేమో కలికాలం అని.
ఈవేళంతా మన ఐఏఎస్ అధికారులందరూ గొడవ మొదలెట్టారు. ప్రతీ వాళ్ళూ రాజకీయ నాయకుల ఒత్తిడివలన ఆర్డర్లు పాస్ చేశామనే వారే. కానీ దేశం మొత్తం మీద చూస్తే
ఓ ఆర్మీ అనండి, ఇంకం టాక్సనండి, పోలీసనండి, ఎక్సైజనండి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ శాఖలోనూ అతిరథమహారథులున్నారు. గట్టిగా పట్టుకునేసరికి గుండె నొప్పనేవాళ్ళోళ్ళు, నడుంనొప్పనేవాళ్ళోళ్ళు. అసలు ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియదు. ఈ సందర్భం లో OPEN లో వచ్చిన వ్యాసం ఒకటి పెట్టాను.చదవండి.
అమ్మయ్య మొత్తానికి మనవాళ్ళు ఓ మ్యాచ్ నెగ్గారండి బాబూ! దానిక్కూడా ఎంత సస్పెన్సో…
సూటిగా: ఎవరి పాపం..ఎవరికి శాపం? అమరుల కుటుంబాల ప్రశ్న ???
రాజకీయ నిరుద్యోగులు మొదలుపెట్టిన వ్యాపారోద్యమం ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకుని గోడలమీద పటాలుగా మారి తల్లితండ్రులకి కడుపుకోత మిగిల్చి నీచ రాజకీయ,ఉద్యమ నాయకుల(?) చావు బేరాలకు ఉపయోగపడటం తప్ప ఈ అమాయకులు ఆత్మహత్యల ద్వారా సంధించినది ఏమిటి???
____________________________________________________________________
“మాకు పార్టీలతో సంబంధం లేదు. తెలంగాణ కోసం ముందు నిలిచాం. దెబ్బలు తిన్నాం. మా వాళ్లను కోల్పోయాం. మేమూ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం. కానీ… మా త్యాగానికి స్పందనేదీ? సార్థకతేదీ?” ఇది… అమరుల కుటుంబానికి చెందిన రేణుక వేసిన ప్రశ్న! ‘అమరులకు ఇచ్చిన హామీలూ… ఎన్నికల హామీల్లాగే మారిపోయాయి’ అనేంత స్థాయిలో నిర్వేదం! బంగారు భవిష్యత్తు ముందున్న భూమారెడ్డి… నిరుపేద తండ్రికి చేదోడు వాదోడుగా గొర్రెల కాపరిగా మారిన పృథ్వీరాజ్… ఎందుకు అమరులయ్యారు? ఈ అమర వీరుల కుటుంబాల అంతరంగం తెలుసుకునేందుకు ‘ఆన్‌లైన్’ చేసిన ప్రయత్నంలో మనసులను కదిలించే ఆవేదనలు, రాతి హృదయాలను సైతం కరిగించే కన్నీళ్లు, గుచ్చి గుచ్చి అడిగే ప్రశ్నలు ఎన్నో…
“మాకు పార్టీలతో సంబంధం లేదు. తెలంగాణ కోసం ముందు నిలిచాం. దెబ్బలు తిన్నాం. మా వాళ్లను కోల్పోయాం. మేమూ ప్రాణాలు అర్పించేందుకు సిద్ధం. కానీ… మా త్యాగానికి స్పందనేదీ? సార్థకమేదీ?” ఇది… రేణుక అనే అమరుల కుటుంబానికి చెందిన వ్యక్తి ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’ జరిపిన చర్చలో వేసిన ప్రశ్న! ఎవరిది త్యాగం? ఎవరిది పాపం? ఎవరికి శాపం? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే. ‘అమరులకు ఇచ్చిన హామీలూ… ఎన్నికల హామీల్లాగే మారిపోయాయి’ అనేంత స్థాయిలో నిర్వేదం!
బంగారు భవిష్యత్తు ముందున్న భూమారెడ్డి…. నిరుపేద తండ్రికి చేదోడు వాదోడుగా గొర్రెల కాపరిగా మారిన పృథ్వీరాజ్…. ఎందుకు అమరులయ్యారు? వీరి త్యాగం ఫలించేందుకు నేతలు ఏం చేయాలి? ఈ అమర వీరుల కుటుంబాల అంతరంగం తెలుసుకునేందుకు ‘ఆన్‌లైన్’ చేసిన ప్రయత్నంలో మనసులను కదిలించే ఆవేదనలు, రాతి హృదయాలను సైతం కరిగించే కన్నీళ్లు, నేతలను అడిగే ప్రశ్నలు ఎన్నో కనిపించాయి.
గారంగా చూసుకునే అమ్మానాన్న… హైదరాబాద్‌లో చదువు… వర్తమానంలో ఏ దిగులూ లేదు! బంగారు భవిష్యత్తు ముందుంది. అయినా… ఆ యువకుడు ఆత్మాహుతి బాటలో నడిచాడు! తెలంగాణ కోసం చావు కేక వినిపించారు. ఇది… ఏనుగు భూమారెడ్డి వ్యథ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరిగావ్ గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి, లింగమ్మల కుమారుడు భూమారెడ్డి ఆదిలాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి… ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చాడు. మల్టీ మీడియా కోర్సులోనూ చేరాడు. 2010లో ఉధృతంగా కొనసాగుతున్న ఉద్యమంలో తానూ భాగస్వామి అయ్యాడు.
ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు చేపట్టిన ప్రతి ఆందోళనలో తనూ పాల్గొన్నాడు. అదే పోరు బాటలో జోరుగా నడిచి ఉంటే బాగానే ఉండేది. కానీ… భూమారెడ్డి అకస్మాత్తుగా త్యాగాల బాట పట్టాడు. 2010 జనవరి 6న హైదరాబాద్‌లోని తన గదిలో ఉరి వేసుకు మరణించాడు. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో బోరిగావ్‌కు వచ్చారు. సాయం చేస్తామన్నారు. కానీ… భూమారెడ్డి తండ్రి ఆర్థిక సహాయం అందుకునేందుకు నిరాకరించారు. “ఒక్క కూతురికి మూడేళ్ల క్రితం పెళ్లి చేశాను. అండదండగా ఉంటాడనుకున్న కొడుకు తెలంగాణ కోసం చనిపోయాడు. నా కొడుకు ఎలాగూ తిరిగి రాలేడు. కనీసం… అతని ఆశయమైనా నెరవేరాలి’ అని నారాయణ రెడ్డి ‘ఆన్‌లైన్’తో అన్నారు.
ఓ గొర్రెల కాపరి…
2009 నవంబర్ 29…
తెలంగాణ కోసం సిద్ధిపేటలో ఆమరణ దీక్ష చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కరీంనగర్ నుంచి బయలుదేరారు. చివరికి… కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం జిల్లాకు తరలించారు. కాసేపటికే… దండిగ పృథ్వీరాజ్ (19) తన గుడిసెలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతను… ఓ గొర్రెల కాపరి. ఊరు… కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం వాల్గొండ. సుశీల, గంగారాంల మొదటి కుమారుడు. ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు బడి మానేశాడు.
నిరుపేద త్యాగం జిల్లా ప్రజలను కదిలించింది. టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పృథ్వీరాజ్ తల్లిదండ్రులకు రూ.50 వేలు సహాయం అందించారు. కాంగ్రెస్ నేతలు రూ.1.25 లక్షలు ఇచ్చారు. స్థానిక ట్రాన్స్‌కో, రెవెన్యూ అధికారులు రూ.10వేల చొప్పున తమ వంతు సహాయం అందించారు. ఈ సహాయాలేవీ ఆ కుటుంబం కష్టాలను తీర్చేవి కావు. ప్రస్తుతం… ఆ ఇంట్లో పొయ్యి వెలగడమే కష్టంగా మారింది. “మా కొడుకు కోరుకున్న తెలంగాణ రావాలి. ఇప్పటికైనా నాయకులు కల్లు తెరిచి, తెలంగాణ సాధన కోసం కలిసికట్టుగా పోరాడాలి’ అని గంగారాం, సుశీల ‘ఆన్‌లైన్’తో అన్నారు.
……………………………………………………………………………………………………………………………….
సౌజన్యం : ఆంధ్రజ్యోతి (03-2-2012)
Filed under: తెలంగాణ Tagged: తెలంగాణ
2012-02-02
నవ రస(జ్ఞ) భరితం: నువ్వే....నువ్వే....
మానవవాదం: My ebook in Telugu
మానవవాదం: విశ్వనాథ సత్యనారాయణ
సూటిగా: వసివాడిన పసి త్యాగం 15 ఏళ్ల వయసులో సృజన ఆత్మాహుతి ఇది రెండు కుటంబాల వ్యధ
వసివాడిన పసి త్యాగం
15 ఏళ్ల వయసులో సృజన ఆత్మాహుతి
పదో తరగతిలోనే త్యాగాల బాట
టీచర్ కావాల్సిన సందీప్‌దీ అదే దారి
ఇది రెండు కుటంబాల వ్యధ
______________________________________________________________
వ్యక్రిగత స్వార్ధాలతోరాజకీయ నిరుద్యోగులు ప్రేరేపించిన వ్యాపోరోద్యమాలకు బలియిపోయిన వారి కుటుంబాల సూటి ప్రశ్నలకు ఇప్పుడు ఏ ” ఉత్యమం” నాయకుడు జవాబు ఇవ్వరే? ఎంతసేపు 600 మంది 700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుండెలు బాదుకుంటూ చావు బేరాలాడే దగుల్బాజీ రాజకీయ,ఉద్యమం పేరుతొ బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకునేవారిని ఇప్పుడు తెలంగాణ ప్రజలే బట్టలూడదీసి కొట్టవలసిన సమయం ఆసన్నమయింది!
తెలంగాణ ప్రజలారా కాస్త నిమ్మళంగా,నిజాయితీగా ఆలోచించండి.నిజాలు గమనించండి.
______________________________________________________________
2010 ఫిబ్రవరి 24…
ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయం.
ఇంట్లో మంటలు… ఆ మంటల్లో సృజన.
ఆదిలాబాద్ జిల్లా మాదాపూర్‌కు చెందిన లచ్చన్న, లక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వారిలో పెద్దమ్మాయి సృజన. పదో తరగతి చదువుతోంది. చదువంటే ఇష్టం. తెలంగాణ అంటే ఇంకా ఇష్టం. బడికి పోయినం త శ్రద్ధగా తెలంగాణ ఉద్యమంలోనూ పాల్గొనేది. 15 ఏళ్ల వయసులోనే… తెలంగాణ రావాల్సిన అవసరం, దానికి ఉన్న అడ్డంకులపై తీవ్రంగా ఆలోచించేది.
ఏమనుకుం దో, ఏమో… పోరాడి గెలవాల్సిన వయసులో త్యాగాల బాట పట్టింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన సృజనను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. సృజన… చనిపోయింది! సృజన ఆత్మాహుతి ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది. మంచిర్యాల ఎమ్మెల్యే అరవిందరెడ్డి సృజన కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలోని ఒక యువజన సంఘం సృజన స్మారకార్థం ధూమ్ ధా మ్, క్రీడాపోటీలు నిర్వహించింది.
తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఆమె తల్లిదండ్రులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. కానీ, ఇవేవీ సృజన లేని లోటు ను తీర్చేవి కావు. ఉండటానికి సొంత ఇల్లు లేదు. భూ మి లేదు. ఇప్పుడు… పెద్ద కూతురూ లేదు. మిగిలిన కూతుళ్లు మంజుల, స్వాతిలను చదివిస్తూనే.. పెద్దకూతు రు జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్నారు. కులవృత్తితోనే జీవిస్తున్న లచ్చన్నను పలకరించగా కన్నీళ్లు వరదయ్యాయి. “బతికి సాధించుకోవాలి. ప్రా ణాలు తీసుకుని కన్నవాళ్లకు కడుపుకోత మిగల్చవద్దు” అని లచ్చన్న దంపతులు యువతకు విజ్ఞప్తి చేశారు.
___________________________________________________________________________
ఓ సందీప్…
2010 ఫిబ్రవరి 14… మధ్యాహ్నం!
వరంగల్ జిల్లా శాయంపేట మండలం మాందారిపేటలో భిక్షపతి తన సెలూన్‌లో పని చేసుకుంటున్నారు. అంతలో.. హృదయవిదారకమైన అరుపులు.. తలెత్తి చూస్తే.. కళ్ల ముందు కదులుతున్న నిప్పుల నెగడు! ఉవ్వెత్తున మంటలు. ఆ మంటల్లో సందీప్. అతను.. భిక్షపతికి ఒక్కగానొక్క కుమారుడు. తానెంత కష్టపడినా.. కొడుకును బాగా చదివించి ఉపాధ్యాయుడిని చేయాలని భిక్షపతి కలలు కన్నారు.
పరకాలలోని ఓ ప్రైవేటు కాలేజీలో టీటీసీలో చేర్పించారు. మంచి విద్యార్థి అయిన సందీప్.. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించేవాడు. కవితలు, పాటలూ రాసేవాడు. ఉద్యమ ఉద్రేకంలో, ఆత్మాహుతికి ఒడిగట్టాడు. మంటల్లో కాలుతున్న కుమారుడిని చూసి భిక్షపతి ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న సందీప్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయినా, ఫలితం లేకపోయింది. ఆ మరుసటిరోజే సందీప్ కన్నుమూశాడు. 
వెంటాడుతన్న పేదరికం
చెట్టంత ఎదిగి చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు.. అందునా ఒక్కగానొక్క కొడుకు.. కళ్లముందే అగ్నికి ఆహుతి అయిపోవడంతో భిక్షపతి కుటుంబం కుంగిపోయింది. రేపోమాపో కూలిపోయేలా ఉన్న చిన్న పెంకుటిల్లు. పెళ్లీడుకొచ్చి, డిగ్రీ చదువుతున్న కూతురు. రోజూ గోలీలు మింగితేకానీ బతుకులేని భార్య! సెంటు భూమి లేదు! ఇదీ భిక్షపతి కుటుంబం పరిస్థితి. పూర్తిగా క్షౌర వృత్తిపైనే ఆధారపడటం, ఆదాయం అంతంత మాత్రమే కావడంతో కడివెడు కష్టాలు అనుభవిస్తున్నారు. సందీప్‌కు అప్పట్లో టీఆర్ఎస్, టీడీపీ సీనియర్ నేతలు నివాళులు అర్పించారు.
టీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి రూ.10 వేలు, సత్యనారాయణ రూ.2 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఆస్పత్రి ఖర్చులను నాగుర్ల వెంకటేశ్వరరావు భరించారు. పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ ఓదార్పు పేరిట రూ.25వేలు అందించారు. ఇది జరిగి దాదాపు రెండేళ్లయింది. ఇప్పుడిక భిక్షపతి కుటుంబాన్ని పట్టించుకునే వారు లేరు. ఆయన అప్పుడప్పుడు అమర వీరుల కుటుంబాలు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. “కొడుకు పోయాడు. కనీసం వాడి ఆశయం నెరవేరితే చాలు” అని భిక్షపతి కన్నీటిపర్యంతమవుతున్నారు.
______________________________________________________________________________
సౌజన్యం : ఆంధ్రజ్యోతి (02-2-2012)
Filed under: తెలంగాణ Tagged: తెలంగాణ
2012-02-01
youthseva: Youth Seva.com
2012-01-31
PHANI BABU -musings: బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అయినా సరే బతికేస్తున్నాం…
తెలుగువాళ్ళకి ములక్కాడలంటే ఎంత మక్కువో అందరికీ తెలిసిందే. అదేం ఖర్మమో ఈమధ్యన మార్కెట్ లో వాటి ధర కొండెక్కేసింది. మరీ పావుకిలో 20 రూపాయలంటే కొనే పరిస్థితా మనది? ఏదో చవకలో దొరికితే కొనొచ్చు కానీ, మరీ కిలో 80 రూపాయలంటే, కొని పూజ చేయాలనిపిస్తుంది. ఈలోపులో అవి ఎండిపోయి, నా వయస్సుకి వచ్చేస్తాయి, అది వేరే సంగతనుకోండి. దానితో ఈమధ్యన మార్కెట్ కెళ్ళినప్పుడల్లా, దూరం నుంచే చూసేసి, “మమ” అనుకొని వచ్చేస్తున్నాను. అంతేసి డబ్బులు పెట్టి కొనే ఓపిక లేదమ్మోయ్. అలాటిది ఈ మధ్యన ఆదివారం, తెలిసిన కొట్టులో నవనవలాడుతూ కనిపించాయి, పక్కనే ఇంకో ఆవిడ ఏదో కొంటోంది. నాకైతే పావు పదిరూపాయలూ అని వినిపించింది. అమ్మయ్యా ధర తగ్గిందిరా బాబూ అనుకుని, ఓపావిమ్మన్నాను. వాడు తూచి, మరీ పొడుగ్గా ఉన్నాయి కదా అని కోసిపెట్టనా అన్నాడు. మరీ వాటిని ముక్కలు చేయడం ఇష్టం లేక, ( ఇంటికెళ్ళిన తరువాత, ఇంటావిడ పులుసులోకో, చారులోకో ఎలాగూ చేస్తుంది, మరీ ఆ “పాపం” నేనెందుకు కట్టుకోడం అని) వద్దని, ఓ పది రూపాయల నోటిస్తే, కాదూ ఇరవై అన్నాడు. అదేమిట్రా, పదన్నావు కదా అంటే, ములక్కాయలు కాదూ, పనస చెక్క ఖరీదదీ అన్నాడు. మంచిదయింది, వాటిని ముక్కలు చేసుంటే, నాకంటగట్టేవాడు. విడవలేక విడవలేక, సంచీలోంచి వాటిని బయటకు తీసి, తిరిగిచ్చేశాను. ఓ దండం పెట్టుకుని! పోనీ ధరేదో తగ్గేదాకా ఆగొచ్చు కదా, అబ్బే, అప్పుడెప్పుడో తెచ్చి, ఫ్రిజ్ లో దాక్కున్న ములక్కాడముక్కలు వేసి, ఇంటావిడ ఆ ముందురోజే బ్రహ్మాండమైన చారు పెట్టింది. దాంతో మళ్ళీ ములక్కాడలవైపు పోయింది దృష్టి. వెధవ జిహ్వచాపల్యం, బతికున్నంతకాలమూ వదలదు! నిన్న దగ్గరలో ఉన్న మార్కెట్ లో ఏదో కొంటూంటే మళ్ళీ వినిపించింది పావు పదీ… అని. ఆ అర్ధ అనేది మింగేశాడు. అడిగితే చెప్పనే చెప్పాడు మరీ పావు ఇరవై అంటే ఎవడూ ఈపక్కకే రావడం లేదూ, అందుకే అశ్వథామా కుంజరహ అని, అర్ధ మింగేసి, పావే వినిపించేలా అరుస్తున్నానూ అని!మొత్తానికి పదిరూపాయలూ ఇచ్చి అర్ధపావు తీసికున్నాను, రెండంటే రెండు కాడలొచ్చాయి. ఒకటి నాకూ, ఇంకోటి ఇంటావిడకీనూ! చూస్తూండగానే ఆ కొట్టువాడు నలుగురికి అరపావు చొప్పున అమ్మేడు.
పైన చెప్పినది ప్రత్యక్షంగా చూసిన marketing technique. అందరూ అంటారూ, తెలివిమీరిపోయారండీ ఈ రోజుల్లోనూ, అక్కడికేదో వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నట్టు. కానీ పేద్ద పేద్ద కంపెనీలు చేస్తున్నదేమిటిట? పైన ఇచ్చేనే బొమ్మ అందులో indiatimes వాడి యాడ్ చూడండి– అన్ని పుస్తకాలమీదా 40% discount అని పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాశాడు. ఏదో చవకలొ వస్తున్నాయని తీరా ఆ సైట్ లోకి వెళ్ళి చూస్తే కనిపించేదేమిటీ- ఏదో ఒకటీ రెండు వెరైటీలు తప్పించి, దేనిమీదా 25% discount మించి లేదు. బళ్ళమీద అరుస్తూ వస్తారు చూడండి అరటిపళ్ళవాళ్ళు డజను పదిరూపాయలూ.. అంటూ, తీరా బండి ఆపి చూస్తే, నా వయస్సుకు వచ్చేసి, మిగలముగ్గిపోయిన పళ్ళు చూపిస్తాడు. వాడికీ, ఈ indiatimes వాడి యాడ్ కీ తేడా ఏమీ లేదు.
అన్నిటిలోకీ ఈ రిలయన్స్ వాళ్ళు దోచేస్తున్న పధ్ధతి- వాడి Broadband speed 3.1 Mbps అంటాడు. ఎప్పుడు చూసినా దాని స్పీడ్ 0.00. దీంతో ఏమౌతుందీ అంటే, ఏ రైల్వే టికెట్ బుక్ చేసేటప్పుడో, ఆఖరి పేమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి, బ్యాంకు వాడిది బాగనే ఉందికదా అని,పేమెంటు పూర్తిచేస్తాము ,redirecting to irctc… అంటుందే కానీ, ఛస్తే పూర్తిచేయదు, పైగా please do not ” refresh” or ” back”….. అని మెసేజ్ ఓటీ. ఏం చేస్తే ఏం కొంపములుగుతుందో అని దాన్ని చూస్తూ ఊరుకుంటాము. అది తిరుగుతూంటుందేకానీ, ఆ redirecting to irctc… మాత్రం పూర్తవదు. ఓ పదినిముషాలు అయిన తరువాత, పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది.Your log in time expired. please log in again.. గోవిందో… గోవిందా... మనం బుక్ చేసిన టిక్కెట్టు అయిందో లేదో తెలియదు. మళ్ళీ లాగ్ ఇన్ అయితే, ఎక్కడున్నావే గొంగళీ అంటే అక్కడే అన్నట్టు మళ్ళీ మొదలూ.. ఓ నాలుగు రోజులు పోయిన తరువాత డబ్బులు తిరిగొస్తాయనుకోండి. కానీ ఇంత అసౌకర్యం కలగాలంటారా? పోనీ ఆ Broadband వాడికి ఫోను చేద్దామా అంటే, ఒకటి నొక్కూ, రెండు నొక్కూ.. పీకనొక్కూ… అంటాడేకానీ, ఓ జీవించిన మనిషితో మాటాడ్డం మాత్రం కుదరదు..
ప్రొద్దుటే అబ్బాయితో ఇవన్నీ మాట్లాడుతూంటె తను ఓ బ్లాగ్ పోస్ట్ గురించి చెప్పాడు, అదే రెండో ఫొటో… ఇలాటివన్నీ మన దేశంలోనేనా, ప్రపంచం అంతా ఇంతేనా? ఇంకోటండోయ్ నిన్న ప్రొద్దుటే, ఆయనెవరో బ్రేక్ ఫాస్ట్ తీసికుని, తన Volkswagon కారులో కూర్చుని, ఇగ్నిషన్ తిప్పాడో లేదో పరిస్థితి పైన పెట్టిన ఫొటోలో చూశారుగా…
అయినా సరే బతికేస్తున్నాం…..
నవ రస(జ్ఞ) భరితం: కథాజగత్ - భద్రాచలం యాత్ర ... వాళ్ళక్క కథ?
2012-01-28
Culture,Heritage and News of Nadendla: పేటలో ఎడ్ల పోటీలు 28-1-12
నా బ్లాగు.............................నా పిచ్చి గోల: నా వేదన
ఇదీ సంగతి: ప్రవర ( ము )
2012-01-27
నరసరావుపేట్రియాట్స్: మూగవోయిన మా వూరి వేణువు ...ఏల్చూరి విజయరాఘవ రావు...!
2012-01-26
గడ్డిపువ్వు: (శీర్షిక లేదు)
2012-01-25
ఆత్మానందం..: బూచి బల్ల...
ఎద రస నస: తాళి కట్టు శుభవేళ (skit)
ఓ బంధువుల పెళ్ళికి వెళ్ళాను ఆ మధ్య. అక్కడ సరదాగా ఒక skit చేద్దామంటే నేను అప్పటికప్పుడు కూర్చుని ఒక కథనం సమకూర్చడం జరిగింది. ఇది అందరితో పంచుకునే ప్రయత్నమిది.
Roles
1. కిరణ్: హీరో
2. లావణ్య: హీరోయిన్
3. తేజ, రాజా, ఆనంద్, హేమంత్: హీరో ఫ్రెండ్స్
4. లోహిత, హరిత: హీరోయిన్ ఫ్రెండ్స్
5. హీరో అమ్మా నాన్నా
Starting scene
Voice Over
ప్రతి కథా కంచికి చేరినా చేరకున్నా ఎక్కడో అక్కడ మొదలు కాక తప్పదు. ప్రేమ కథలైతే ఎలా మొదలౌతాయో ఎవరికీ తెలియదు. చూపులు కలిసిన శుభవేళగా మొదలైన కథలూ, నిను చూడక నేనుండలేను కథలూ, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా కథలూ ఇలా ఎన్నో. కొన్ని ప్రేమకథలు పెళ్ళిగా మారతాయి. పెళ్ళి వెనుక ఉన్న వలపు కథని సరదాగా ఊహించి మీ ముందు ప్రదర్శించే చిరు ప్రయత్నం ఇది.
Scene 1 – On the Road
లోహిత : Excuse me. జైన్ కాలేజ్ ఎక్కడో చెప్తారా?
తేజ: మీరు చదివే కాలేజ్ మీకే తెలియదంటే మీరు ఎంత బాగా చదువుతున్నారో తెలుస్తోంది.
లావణ్య: హలో, ఓవర్ ఏక్షన్ వద్దు. మేము ఈ రోజే కాలేజీలో జాయిన్ అవుతున్నాం. ఈ ఏరియాకి కొత్త.
కిరణ్: కొత్త డ్రెస్ కొనడానికి గంటలతరబడి రీసెర్చులూ, షాపింగులూ చేస్తారు గానీ కొత్త కాలేజీ ఎక్కడో తెలుసుకునేందుకు, టైం లేదు పాపం!
లావణ్య: Idiots!
Scene 2 – Jain College
కిరణ్: హలో! నేను, ఈడియట్‌ని!
లావణ్య: ఖర్మ! నువ్వూ ఈ కాలేజేనా?
కిరణ్: మీ కాలేజే కాదు, మీ క్లాసేనన్న sad news ఇప్పుడే తెలిసింది. ఇక రోజూ నిన్ను భరించాలి.
లావణ్య: ఆ మాట నేననాలి! నేను చూడ్డానికి అందంగానే ఉంటాను.
కిరణ్: కోతి అందంగా ఉన్నా పెద్ద ప్రయోజనం లేదు!
లావణ్య: నీది కోతి జాతి అని first impression లోనే తెలిసింది. మళ్ళీ నీ వేస్ట్ ఫ్రెండ్ ఒకడు.
రాజా: ఎప్పుడూ ఒకడే వేస్ట్ ఫ్రెండ్ ఉంటే బోరని ఈ సారి వీడితో పాటూ నేనొచ్చా.
హరిత: ఏయ్! ఏంటి దీన్ని అమాయకురాలిని చేసి ర్యాగింగ్ చేస్తున్నారు. మీరూ freshers ఏ అని గుర్తుపెట్టుకోండి.
కిరణ్: ఆడవాళ్ళు అమాయకులనుకునేంత అమాయకుణ్ణి కాదు లెండి
లావణ్య: Idiot!
Scene 3: Freshers day
కిరణ్: Freshers day కపుల్ డేన్స్‌కి మీరు నా పైర్‌గా ఉంటారా? మీరు మంచి డాన్సర్ అని తెలిసింది.
లావణ్య: నీకు ఈ కళలు కూడా ఉన్నాయా? అయినా donkey కి డేన్స్ ఎందుకు?
కిరణ్: థాంక్స్! అందమైన అమ్మాయిలకి పొగరెక్కువని మా ఫ్రెండ్‌తో బెట్ కట్టాను. నువ్వు నన్ను గెలిపించావ్
లావణ్య: యూ…
Scene 4: College canteen
(ఒక సంవత్సరం ఇట్టే గడిచిపోయింది. కిరణ్ extra curricular activities లో బిజీ అయ్యాడు, కాలేజ్‌లో మంచి పాపులర్ అయ్యాడు. ఒక రోజు క్యాంటీన్‌లో తన friendsతో ఉన్నప్పుడు లావణ్య తన స్నేహితురాళ్ళతో వస్తుంది)
ఆనంద్: మా నాన్న నేను బాగా చదవట్లేదని తెగ లెక్చెర్లు పీకేస్తున్నాడురా!
(ఈ మాటలు విని, interfere అవుతూ)
లావణ్య: ఈ కిరణ్ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఉంటే చదువెలా వస్తుందనుకున్నావ్ బాబూ? వీడికి extras ఎక్కువ, చదువు తక్కువ.
కిరణ్: చూశావా, నీ ignorance మళ్ళీ బైటపెట్టుకున్నావ్. క్యాంటీన్‌లో అబ్బాయిల గ్యాంగ్ కనిపిస్తే చాలు, వాళ్ళు బేవార్సని అనుకుంటారు నీలాంటి వాళ్ళు.
లావణ్య: అవునవును! గాసిప్స్, జల్సాలతో టైం వేస్ట్ చేస్తుంటే మార్క్స్ వస్తాయి కాబోలు
హేమంత్: Text booksని భగవద్గీతలా కాకుండా షిడ్నీ షెల్డన్ నవలలా చదవాలని మా సిద్ధాంతం
లావణ్య: అవును, థ్రిల్లర్ నవలలా ఎగ్జాంస్ ముందు రోజంతా నైటౌట్ చెయ్యడం ఎంత థ్రిల్లింగో! అయినా class topper అరవింద్‌ని చూసి బుద్ధి తెచ్చుకోండి
కిరణ్: వాడు బాదంపాల లాంటి వాడు, నేను పెప్సీ లాంటి వాణ్ణి. వాడు బెటర్ అయ్యుండొచ్చు గానీ, నేను super cool and chilling!
లావణ్య: పెప్సీ అంటే pesticide. అందుకే నేను నీలాంటి వాళ్ళతో friendship చెయ్యను.
కిరణ్: సరే, వాడితో friendship చేసి చూడు, నీకే తెలుస్తుంది
Scene 5: Ladies hostel
లావణ్య: ఏంటోనే! ఆ కిరణ్ గాడంటే ఈ మధ్య positive feelings కలుగుతున్నాయ్. వాడు మిరపకాయలా ఘాటనుకున్నా ఇన్నాళ్ళూ, కానీ మిరపకాయ బజ్జీలోనే టేస్టుంది!
లోహిత: అదేంటే! మరి మన class topper అరవింద్ లాంటి sincere student తోనే ఫ్రెండ్‌షిప్ చేస్తానన్నావ్?
లావణ్య: hmm…, వాడు ఎగ్జాంలో ఆన్సర్‌షీట్‌ని బాగా fill చేస్తాడు కానీ వాడి లైఫ్ మాత్రం blank sheet ఏ! ఒక సినిమా లేదు, సరదా లేదు, ఎప్పుడూ స్టడీసే. ఈ కిరణైతే అన్నింట్లో ఉంటాడు, చదువూ ఫర్వాలేదు. I like him.
హరిత: I like him ఆ, లేక I love him ఆ? త్వరగా తేల్చుకో. అసలే నువ్వు spellings లో పూర్!
Scene 6: Hero room
కిరణ్: ఏదో ఘోరం జరుగుతున్నట్టు అనిపిస్తోందిరా! నేను లవ్‌లో పడుతున్నట్టు ఉన్నాను.
తేజ: ఆ లావణ్య పైనేనా లవ్? మేమెప్పుడో అనుకున్నాం. ఐనా లోపల feelings లేకపోతే, అంత ముద్దుగా మీరు దెబ్బలాడుకోలేరు
రాజా: జాగ్రత్తరోయ్, ఈ ప్రేమ దేవుడికి కూడా దోఖా ఇచ్చేస్తుంది.
కిరణ్: I am confident, our love will be a success. కానీ ఎలా చెప్పాలా అనేదే తేలట్లేదు.
ఆనంద్: చూశావ్ రా! pulsar పైన 120 స్పీడ్‌లో వెళ్ళే నీకే starting trouble ఇస్తోంది ఈ ప్రేమ.
హేమంత్: మగాడంటే డేరూ జోరూ ఉండాలి. నువ్వే ముందు ప్రపోజ్ చెయ్యాలి.
కిరణ్: అందుకే రేపు personal గా కలుస్తున్నాను. తనని రమ్మని చెప్పాను.
ఫ్రెండ్స్ అందరూ: అమ్మనీ, నువ్వు తక్కువ వాడివి కాదురోయ్!
Scene 7: Love Proposal
కిరణ్: ఎందుకో ఈ రోజు నిన్ను చూస్తుంటే ఓ మెరుపు మెరిసినట్లు అనిపిస్తోంది
లావణ్య: (చిరునవ్వుతో) నన్ను చూడకపోయినా అనిపిస్తుంది. ఒకసారి పైకి చూడు. వర్షం పడేలా ఉంది. ఆకాశం మబ్బుపట్టి మెరుపులు కురిపిస్తోంది!
కిరణ్: ఆ మెరుపు కాదు, ఈ మెరుపుని మా ఇంట్లో దాచేసుకుందామా అనిపిస్తోంది
లావణ్య: అబ్బో, మెరుపుతో పాటూ ఉరుములూ ఉంటాయి మరి
కిరణ్: మెరుపు తోడుంటే ఉరుముల్ని ఎలాగైనా భరించొచ్చు. మరి వర్షంలో తడిసి ముద్దవ్వడానికి నువ్వు రెడీనా?
లావణ్య: (సిగ్గు)
Scene 8: Hero – Heroine meet at Tank Bund
చదువులు అయిపోయి లావణ్యా కిరణ్‌లూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రణయం కొనసాగుతోంది.
కిరణ్: ఏంటో, కాలేజ్‌లో ఉన్నప్పుడు చదవడానికి టైం లేదు, ఇప్పుడు లవ్ చెయ్యడానికి టైం లేదు. work, work, work!. బాస్ గాడు పీక్కుతింటున్నాడు. వీడి కంటే ఆ కాలేజ్ ప్రిన్సిపాలే బెటర్.
లావణ్య: టైం లేదని చూస్తూ ఉండు. కొన్నాళ్ళకి ఏజ్ కూడా ఐపోతుంది. ప్రతివారం నేను ఇక్కడికి వచ్చేది ఆ బుద్ధవిగ్రహాన్ని చూడ్డానికి కాదు, ఈ బుద్ధవిగ్రహాన్ని చూడ్డానికని మా వాళ్ళకి తెలిసేలోపే నువ్వు మీ ఇంట్లో చెప్పాలి. గంటల తరబడి cell phone లో మాట్లాడుతూ ఉంటే క్యాన్సర్ రావొచ్చట. కాబట్టి ఈ సెల్ ఇంక వదిలి నీ ఇల్లు చేరేలా చెయ్!
కిరణ్: ప్రపోజ్ చేసే రిస్కూ నాదే, ప్రేమించే రిస్కూ నాదే, ఇప్పుడు parents కి చెప్పే రిస్కూ నాదేనా? నువ్వు ముందు మీ ఇంట్లో చెప్పొచ్చుగా?
లావణ్య: సరే, అంత రిస్క్ ఐతే, ఇంక ఇష్క్ బంద్ చేసుకుని బై బై అనుకుందాం
కిరణ్: అమ్మో! ఈ రిస్కు లేకపొతే లైఫే లేదు.
Scene 9: Hero telling to parents about his love
కిరణ్ అమ్మానాన్నలతో dinner table దగ్గర
కిరణ్: అమ్మా! ఎన్నాళ్ళిలా ఒక్కదానివే కష్టపడతావ్. వంటావార్పూ తెలిసిన ఓ మంచి కోడలు కావాలని లేదా? నాన్నా, నిన్ను “మావయ్య గారు” అని పిలిచే అమ్మాయుంటే ఎంత బాగుంటుంది?
అమ్మ: వీడి వాలకం తేడాగా ఉందీ మధ్యని నేననలేదూ? మనం సంబంధాలు చూస్తే వద్దంటాడు. వీడే చూసుకున్నట్టున్నాడు. ఎవరో, ఏమిటో?
కిరణ్: రూపం లోనూ, గుణం లోనూ, చివరికి కులం లోనూ కూడా తను మీకు నచ్చేలాగే ఉంటుంది.
లావణ్య గురించి చెప్తాడు కిరణ్
నాన్న: మీకు నచ్చే పిజ్జాలు నాకు నచ్చవు. మా పద్ధతులు మీకు నచ్చవు. నీకు ఆ రావుగారమ్మాయి రాగేశ్వరి అయితేనే కరెక్ట్. తననే చేసుకోవాలి. ఇది నేనొప్పుకోలేను.
కిరణ్: నా జీవిత భాగేశ్వరిని నేను ఎంచేసుకున్నాక, ఇంకా ఈ రాగేశ్వరి ఎందుకు నాన్నా?
Scene 10: Final scene, Hero and Heroine in a park
లావణ్య: అవునూ, ఇంతకీ మీ నాన్నగారిని ఎలా ఒప్పించావ్?
కిరణ్: simple! నిన్ను చేసుకుంటే కనీసం నేను హ్యాపీగా ఉంటానన్న గ్యారంటీ నాకుంది, మా అమ్మానాన్నా హ్యాపీ కాకపోయినా. మా నాన్న కోరుకున్న సంబంధం చేసుకుంటే ఈ గ్యారంటీ కూడా లేదు కదా. ఇదే చెప్పాను.
లావణ్య: ఏమన్నారు?
కిరణ్: “ఈ వయసులో ఇలాగే అనిపిస్తుంది. అనుభవంతో చెప్తున్నాను, నేను చెప్పిన సంబంధమే అన్నివిధాలా మంచిది” అన్నారు
లావణ్య: నువ్వేమన్నావ్?
కిరణ్: నాకు నచ్చిన ఈ సంబంధం చేసుకుంటే ఆ అనుభవమేదో నాకూ వస్తుంది కదా అన్నాను
లావణ్య: ఓకే
కిరణ్: “నువ్వు మాట వినవ్. తర్వాత నువ్వే ఇబ్బందులు పడతావ్” అన్నారు. పెళ్ళంటూ చేసుకున్నాక ఎలాగూ ఇబ్బందులు పడక తప్పదు కదా అని నేను అనేసరికి ఇంకేమీ అనలేకపోయారు!
లావణ్య: ఓయ్…
2012-01-23
భారతీయం: (శీర్షిక లేదు)
భారతీయం: (శీర్షిక లేదు)
2012-01-22
ఆముక్తమాల్యద: తృతీయాశ్వాసం - సింహావలోకనం
Only 4U - నీ కోసమే నేస్తం ఈ సమస్తం: నిగళ గళ హరా!
2012-01-20
Indian civil services ( IAS/IPS/IRS ) in telugu medium: సివిల్స్ నోటిఫికేషన్ 2012.
2012-01-18
Indian civil services ( IAS/IPS/IRS ) in telugu medium: ఐ. ఎ. ఎస్. వైపే మ్రోగ్గు.
2012-01-13
నా బ్లాగు.............................నా పిచ్చి గోల: సిటి లో సంక్రాంతి ...
2012-01-10
మానస సంచర: మైలురాయి
2012-01-09
ఇదీ సంగతి: నాపుట్టలో వేలెడితే కుట్టనా అందిట.. ఓ చీమ..
ఆత్మానందం..: 18th floor..
2012-01-04
డేర్ టు క్వశ్చన్ నౌ: I am back on Blog after 4 months & wish u all a Very Happy New Year
2012-01-03
ఆత్మానందం..: Sadda haq
శరచ్చంద్రిక: సీక్రెట్ శాంటా.. నా జాతకానికి నిదర్శనం
2012-01-01
"నిత్యం-నానే-సత్యం" --రాఖీ: WISH U HAPPY NEW YEAR-2012
2011-12-28
బ్లాగ్ గురువు: Skype - ఎలా ఉపయోగించుకోవాలి??
2011-12-20
మానవవాదం: ఎం.ఎన్.రాయ్ రచనలు
ఇదీ సంగతి: మీరేమంటారు ???
కం. ఓడుతు పోతున్నారని
వాడల వాడలను తిట్ల వర్షాలాయే
నేడొకటి గెలవగానే
తేడానూ ఒప్పుకోరు తిరిగి జిలేబీ
baga chepparu pateedi rajkeeya konam lo chustunnaru …chala mandi peddalu
ఇంతకంటే ఏమి చేస్తారులెండి. పాపం
ఇలాంటి ఆరోపణలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నవారి మీద వచ్చాయి. ఈ తెలంగాణ ఉద్యమంలో కొత్త కోణం ఏమిటంటే ఆత్మహత్యలు ఎవరికీ వారు స్వంతంగా చేసుకుంటారు.కాని ఇక్కడ మాత్రం నాయకులు ఆత్మహత్యలు “చేస్తారు” !!! ఒక వ్యక్తి ఇలా కామెంటు చేసారు. నిజమే అనిపిస్తుంది.
so simple –good script/skit





