2013-01-21
64 కళలు డాట్కాం: శంకు కార్టూన్ పుస్తకం........రివ్యూ...
2013-01-20
♛ తెలుగు పాటలు ♛: ♛ నా జీవన సంధ్యా సమయంలో ఒక దేవత ఉదయించింది ♛
♛ తెలుగు పాటలు ♛: ♛ వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే ♛
తెలుగు బ్లాగు - సీ'రియల్' ముచ్చట్లు: మల్టీ స్టారర్ మూవీ కాదు మల్టీ హారర్ మూవీ గా చెప్పుకోవచ్చు.
64 కళలు డాట్కాం: కవిగా సంజీవదేవ్........
manimayuram: Shimla snowfall at eight-year record
2013-01-19
సన్నాయి: తెలుగు రాని ఆంధ్రుడు ....
తెలుగు బ్లాగు - సీ'రియల్' ముచ్చట్లు: గుత్తి వంకాయ కొత్తిమీర కారం కూర
ఇది నా ప్రపంచం: Main Aisa Kyun Hoon
2013-01-18
Vasantha Sameeram: Narayana Suktam
desktoppublishing: పేజిమేకర్ ప్రాథమిక పరిగ్జ్నానం (Introduction)
Musicologist Raja: ' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాకి టైటిల్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
2013-01-17
తమ్మి మొగ్గలు: "మంచి పువ్వు" కాలేని మంచు పువ్వు- కాశీభట్ల వేణుగోపాల్ రచనపై సాయి పద్మ అభిప్రాయం..!!
కాశీభట్ల వేణుగోపాల్ గారి.. ” మంచు పువ్వు” చదవటం పూర్తి చేసాను ఇప్పుడే. ఒక నిమిషం ఏం రాయాలో తెలీని పరిస్థితి నుంచి తేరుకొని రాస్తున్న రివ్యూ ఇది.
ఇది ఒక అందమైన ఇన్సెస్ట్ స్టొరీ. అందమైన అని ఎందుకంటున్నానంటే.. ఒక తండ్రి. తన భార్య పోలికలతో పుట్టిన కూతుర్ని కోరుకోవటం అనే అంశాన్ని కూడా, ఇంత అందంగా రాయగలరని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇన్సెస్ట్ అంటే డిక్షనరీ అర్ధం- దగ్గర సంభందీకుల మధ్య సెక్స్ సంబంధాలు, వాటి గురించిన ఆలోచనల వాతావరణాన్ని మొత్తం ఇన్సెస్ట్ అనొచ్చు. ( వికీ డిక్షనరీ కి నా స్వేచ్చానువాదం)
ఇంక మంచు పువ్వు కథలో కొస్తే.. ఒక కాలేజీ లెక్చరర్, అతని చనిపోయిన భార్య కావేరి, బ్రతికి అతని అనురాగంతో పెరుగుతున్న అడాలసెంట్ కూతురు ప్రియ, అతని దగ్గర స్నేహితులు సుబ్బు, వాళ్ళ ఫ్యామిలీ, దుబాయ్ స్నేహితుడు షుకూర్, ఒక పనావిడ, ప్రియ స్కూల్ ప్రిన్సిపాల్ మల్లికా ( ఈమె మీద కూడా లెక్చరర్ గారికి అంతర్గతంగా కోరిక ఉంటుంది..)
చిన్న పాప ప్రియ, అప్పుడే పదమూడేళ్ళ లోకం చూస్తూ.. కౌమారం లోకి ప్రవేశిస్తుంది. ఆమె ప్యుబర్టీ రీచ్ అవటం కూడా తన కోరికతో కలిపి మరీ విశదీకరిస్తారు రచయిత. ఈ రచన చదవటానికి ఇబ్బంది కలిగించే ఒక ‘మగ’ నిజం అని చెప్పొచ్చు.
ఇలా ఆ కోరికని తట్టుకోలేని తండ్రి పాత్ర, తన స్నేహితుడు సుబ్బు ఆత్మహత్య చేసుకోగానే చెర్నాకోలు తగిలినట్టు మేల్కొంటుంది.. ఎందుకూ.. ఆత్మహత్యకి కారణం సుబ్బు కూడా ప్రియ మీద కోరిక కలిగి ఉండటం.. ఆమెని ఆవిధమైన కోరికతో, తాకటం అన్నట్టుగా చెప్పకనే సుబ్బు లెటర్ చేత చెప్పిస్తారు రచయిత. దానితో, అతనికి తన కూతురు తనకి ఎందుకు దూరంగా జరుగుతోందో, ఆ పసి మనసు సంఘర్షణ మొత్తం కాకపోయినా కొంత అర్ధం అవుతుంది. వెంటనే, మల్లికా కి పప్రపోజ్ చేస్తాడు. ఆమె కూడా ఎంతో ఆనందంగా అంగీకరిస్తుంది. క్లుప్తంగా కథ ఇది.
చీకట్ల కోణాలను మనసు సెర్చ్ లైట్ తో.. నగ్నంగా చూపించటంలో కాశీభట్ల దిట్ట. నాకు తెలిసినంత వరకూ.. తెలుగులో ఇన్సెస్ట్ మీద కథలు రాలేదు.. ( మీకెవరికైనా తెలిస్తే చెప్పండి.) చలం కొంతవరకూ నిర్లజ్జ కాంక్షా రూపాన్ని అంత సహజంగా చెప్పినా.. ఇన్సెస్ట్ ఏంగిల్ నాకు కనబడలేదు. రచయిత మీద ఉన్న కాఫ్కా ప్రభావం భలే కనబడింది.
ఈ కథ పూర్తిగా ఒక మగవాడి దృక్పధం తో చెప్పబడింది.. ఒక రచయిత అలా రాయగలిగినందుకు.. సంతోషం కలిగినా.. చిన్నపిల్లలపై అత్యాచారాలు, రక రకాల హింసలు జరుగుతున్న నేపధ్యంలో.. వాళ్ళ మనసు పడే వేదన, అది వాళ్లకి మిగిల్చే పచ్చి నెత్తురు లాంటి జ్ఞాపకం గుర్తొచ్చి బాధేసింది..!!
మంచు పువ్వు వెనుక సాహిత్య ప్రయోజనం కొంత ఉన్నా..నాకు ఎయిడ్స్ ప్రకటనలు గుర్తొచ్చాయి.. ప్రకటనల ఫలితం కన్నా.. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసారు అన్నదే ప్రధానంగా కనబడింది.. అందానికి ప్రాధాన్యత నివ్వని, ఒక మంచితనం రూపు కట్టినట్టు హీరో కేరక్టర్ తనలోని చీకటితో చేసే యుద్ధ ఘోష బాగా వర్ణించారు.
ఇంత భాషా పటిమ, పాశ్చాత్య సాహిత్యం పై అవగాహన ఉన్న రచయిత.. మంచుపువ్వు లో ఇంకొంచం మంచి ఎక్కువ పెడితే.. చాల మంది పసి మనసులు మంచు ముద్దల్లా మారవన్న నిజం గుర్తొచ్చి ఎక్కడో నిజంగా కలుక్కుమంది. మనం పెంచుకునే మొక్కలు, పిల్లలు కూడా రమణీయంగా తోస్తారు మనకి.. అందంగా..మంచుపువ్వు లానే.. ..రమణీయంగా కనిపించిన వాటితోటల్లా రమించాలనె కోరిక.. ఒక రాక్షసత్వపు ఆలోచన. అందరికీ మైకం అందేది వస్తుంది. నిత్యం మైకంలో ఉండాలనుకుంటే… ఎన్నో జీవితాలు నాశనం అవుతాయి. ఆ విషయం రచయిత సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. పసిపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు ఇలాంటి సుప్రెసుడ్ వాంఛలు చాల వరకు కారణం. కనీసం ఈ దిశగా ఒక పరిష్కారం, ఒక నిజాయితీ హీరో కేరక్టర్ చూపించి ఉంటె.. ఈ రచనకి నిజమైన ప్రయోజనం దొరికేది..!!
రచనకి.. ముందు మాట రాస్తూ.. జయప్రభ గారు ఇలా అన్నారు.. ఇలా ఒక రచయిత్రి “మనసు విప్పి” రాయాలని కోరుకుంటున్నాను అని… కానీ నాకనిపించింది.. ఏంటంటే… సహజాతాల కున్న శక్తి, సౌందర్యం అర్ధం చేసుకొనే.. చాల మంది సాహిత్య కారులు.. అసహజమైన, అప్రాక్రుతిక అంశాలపై దృష్టి ఎక్కువ పెట్టలేదేమో…తమ్ముడ్ని పెళ్ళాడిన క్లియో పాత్రా కూడా.. ఆ పని అడాలసెంట్ ఏజ్ లో చేయలేదు.. ఇదేదో ఆలోచించాల్సిన విషయం నాకు.. మరి మీకు??
చివరగా ఒక్క మాట….
మనిషి లోని చీకటి ని చూసి, అర్ధం చేసుకొని, భరించగలిగే వాళ్లకి.. చావు పెద్ద విషయం కాదు..జీవన సౌందర్యం అనేది మరణం లేదా మరణ సమానమైన కోరికతో ముడి పడి లేదు.. !!
–సాయి పద్మ
© Sai Padma:IPR // All Rights Reserved.
వేటూరి: వేటూరి రాసిన తొలి సినిమా పాట (“మనసులో మాట” సుజాత)
వేటూరి రాసిన తొలి సినిమా పాట చాలా రోజులుగా నెటిజన్లకు, అభిమానులకూ అందని పండుగానే మిగిలింది. “భారత నారీ చరితము..” అంటూ మొదలయ్యే ఈ పాట ఓ సీత కథ సినిమాలోది! అయితే ఈ పాట ఇన్నాళ్ళుగానూ ఆన్ లైన్లో ఎక్కడా వినపడనూ లేదు. కనపడనూ లేదు. ఆడియొ, వీడియో రెండూ లభ్యం కాకుండా పోయాయి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.
ఒకటి…సినిమా దాదాపుగా ఎక్కడా లభ్యం కాకపోవడం. లభ్యమైతే వేటూరి అభిమానులు ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఈ పాటను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచే వారు. ఇంకోటి….సినిమాలో ఈ పాట రెండు భాగాలుగా..రెండు వేర్వేరు సన్నివేశాల్లో చిత్రీకరించడం వల్ల, ఈ రెంటినీ కలిపి పెట్టడం ఇబ్బంది కావడం మరో సమస్య!!
ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుంటే ఇన్నాళ్ళకు ఈ పాట ఆడియో వీడియోలు పట్ట గలిగాము! అది కూడా సినిమా వీడియో (వీసీడీ) దొరకడం వల్ల సాధ్యమైంది. మనీషా వీడియోస్ సంస్థ ఈ సినిమాని వీడియో గా అందించారు. సినిమా వేటూరి పాటతోనే మొదలవుతుంది కానీ,అన్నీ జర్కులూ,జంపులూనూ! రెండు సన్నివేశాల్లో విడి విడిగా ఉండే ఆ పాటను అతికించి యు ట్యూబ్ లో పెట్టాల్సి వచ్చింది.
పాట సాహిత్యం మీ కోసం ఇక్కడ ఇస్తున్నాం
పాట విషయానికొస్తే ఈ పాట ని ఓ సీత కథ (1974) సినిమా కోసం వేటూరి తన తొలి పాట గా రాశారు. వేటూరి మరణానంతరం ప్రచురితమైన “వేటూరి నవరస గీతాలు” లో ఈ పాటను ప్రచురించి సాహిత్యాన్ని అందుబాటులో ఉంచారు. ఈ పాటను పాడింది శ్రీమతి పి. లీల గారు!
పాట సాహిత్యానికి, రికార్డ్ అయిన నాటికీ కొన్ని స్వల్ప మార్పులు జరిగాయి. పాట మొదట్లో వచ్చే “యత్ర నార్యస్తు పూజ్యంతే” అనే మనువు కొటేషన్ పాట సాహిత్యంలో లేదు…రికార్డింగ్ లో కలిపారు. అలాగే “కీచక వధ” భాగంలో కూడా కొన్ని లైన్లలో స్వల్ప మార్పులు కనిపిస్తాయి.
తన తొలి పాట గురించి వేటూరి ఏమన్నారో చూడండి (కొమ్మ కొమ్మకో సన్నాయి నుంచి ధారా వాహిక 2003 జులై హాసం పత్రిక నుంచి)
‘‘నా తొలి సినిమా పాటకు స్వరాలు దిద్దింది- మామ గారు శ్రీ మహదేవన్. ‘ఓ సీత కథ’ చిత్రంలో ‘భారతనారీ చరితము’ అనే మకుటంతో సాగే హరికథ అది.
ఆ సుముహూర్తమెటువంటిదో అది 25 వసంతాలపాటు పుష్ఫించి ఫలించింది. ఆయనతోనూ, ఆయన మానసపుత్రుడు శ్రీ పుగళేంది తోనూ నా అనుబంధాన్ని జీవితంలో మరపురాని మధురఘట్టంగా నిలిపింది.
నా తొలిపాట ట్యూన్ చేసిననాడే ఆయన ఎంత గొప్ప సంగీత దర్శకుడో తెలిసింది. అప్పటికి నాకు సినీ భాష అంతగా పట్టుబడలేదు. సంస్కృత సమాస భూయిష్ఠంగా రచన-
‘‘ భారతనారీ చరితము మధుర కథా భరితము
పావన గుణ విస్ఫురితము పతిసుతానుమతము సతము
శీల జ్యోత్స్నా పులకిత హేలా శారద రాత్రము
అతి పవిత్ర మఘలవిత్ర మీ ధరిత్రి కనవరతము ’’
అంటూ సాగింది.
దానిని అవలీలగా సంగీతీకరించిన క్షణాలు నేను మరిచిపోలేను. హరికథ అంటే ఏదో పురాణగాథ ఆధారంగా సాగే సంగీత సాహితీ రచన. ఇక్కడ అటువంటిదేమీ లేదు. స్త్రీ గొప్పతనం భారత స్త్రీ యొక్క విశిష్టత, పవిత్రత ఇందులో వస్తువు. సాంఘిక చిత్రం (ఓ సీత కథ) లో రాయాలి.
దానికీ భాషేమిటి? నోరు తిరిగినా చెవిలోకి ఎక్కినా అర్థం కాదే..! అయినా ఆ రచనను అంగీకరించిన దర్శకుడి ధైర్యం ఎంత గొప్పది..! మామ ఆ రచనని కాంభోజి, కేదారం మొదలైన రాగాలలో పదిహేను నిముషాలలో స్వరబద్ధం చేసిన తొలి అనుభవం మరువలేను- ఈ పాటను శ్రీమతి పి.లీల గానం చేశారు. ఈనాటికీ అది చెవులకు చెందినట్లు వినిపిస్తూ వుంటుంది.
అటు తర్వాత ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో అన్ని పాటలూ నేను రాయడం, ఆయన స్వరపరచడం ఎన్నెన్నో మధురానుభూతులను కలిగించింది.
పాటల రచయితగా నా ఎదుగుదలకు పునాదులు వేసిన గురువులలో ఒకరు మహదేవన్.
… సినీ కవిగా అప్పుడే కళ్ళు తెరుస్తున్న చిన్నవాడిని తల్లిలా కడుపులో పెట్టుకుని, తండ్రిలా కాపాడిన ఉత్తమ కళా సంప్రదాయానికి చెందిన మహా వ్యక్తి మహదేవన్. ’’
అదీ సంగతి! ఇన్నాళ్ళకి..వేటూరి తొలి పాట ఏదని వెదికే వారికి ఇక పై ,వీడియో యూ ట్యూబ్ లో దొరుకుతుంది…
వేటూరి అభిమానులూ…..ఆనందించండి…
———————————————————
మనసులో మాట బ్లాగర్ సుజాత గారికి,సి.హెచ్.వేణు గారికి కృతజ్ఞతలతో వేటూరి.ఇన్
తృష్ణ...: ఆలోచనలు..
2013-01-16
manimayuram: (శీర్షిక లేదు)
2013-01-15
స్పందన: (శీర్షిక లేదు)
జ్వలిస్తున్న హిమం: భగ్నప్రేమ లేఖ
2013-01-14
♛ మీ పెదవులపై నా చిరునవ్వు ♛: ఆయన రియల్ లైఫ్‌లో గొప్ప హీరో!
జ్వలిస్తున్న హిమం: సీతమ్మ వాకిట్లో చూసిన తర్వాత నాకేమనిపించిందంటే..
Vasantha Sameeram: Vasantha Sameeram: Ganga Sagar
2013-01-13
మనసులో కురిసిన వెన్నెల: ఏదో ఒక రోజు ఈ కలమే మనల్ని కలుపుతుంది అని ఊపిరాగేంత వరకూ ఎదురుచూస్తూ......
ధరణి ఆర్ట్ బీట్స్: సంక్రాంతి శుభాకాంక్షలు మధురంగా చెప్పాలనిపించి ఇలా...!
2013-01-12
శరత్ లిఖితం: గుంజుకున్నావ్ ???
skvramesh: సాంప్రదాయం
Grahabhumi: హ్రీంకార యజ్ఞం టైటిల్
తమ్మి మొగ్గలు: భయపడతావెందుకు?
అచంచలమైన ఆత్మ విశ్వాసాన్ని ప్రకటిస్తూనే
అశాశ్వత అందాన్నెందుకు వెతుకుతావు?
అనంత శూన్య మహా నాదంలో
అపస్వరమెందుకు వింటావు?
అంతరీక్షణ ప్రళయ తాండవం లో
ఆత్మను ఎందుకు అభాసు చేసుకుంటావు?
జీర్ణించుకోలేక నువ్వు కక్కిన వమనం ..
ఒకప్పుడిష్టంగా భుజించిన కీర్తుల విందని ఎందుకు గ్రహించవు ?
నీ ఆకళ్ళ వాకిళ్ళలో
మనఃదీపాన్నెందుకు కొండెక్కిస్తావు?
చీకట్ల మిణుగుర్ల ఊతంతో నడుస్తూ..
అస్తిత్వ వెలుగులంటే భయపడతావెందుకు?
నిజాన్నే చూస్తానంటూ
ఆత్మ విధ్వంసపు దుప్పట్లో శీతముసుగేస్తావెందుకు?
అస్ఖలిత బ్రహ్మచారినంటూ
అప్రాప్త సుందరి కోసం అర్రులు చాస్తావెందుకు?
తెగిపడిన బతుకు శకలాల నడుమ
స్వప్న స్ఖలనాన్నెందుకు ఆశిస్తావ్ ?
స్త్రీ కావడమే సర్వైశ్వర్య మైనప్ప్పుడు
మేధను మధించని ఇల్లాలి వవుతావెందుకు?
మనిషి కావడమే మహోత్కృష్ట మైనప్పుడు
మేధో మైధునం లో కాగిపోతావెందుకు ?
మహోన్నత కళల అవిష్క్రుతి మాని
మద్యం సీసావై మగ్గిపోతావెందుకు ?
అంతులేని ఆవేదనతో విరిగిన వేణువుకు
మరిన్ని గాయాలను గరుపుతావెందుకు ?
అవధులు లేని అనురాగం మనస్సు దాల్చి..
అక్షరాన్ని సాకి, పెంచి, తరించి..
అమ్మా’ అని పిలువరాక ..లంజా’ అంటావెందుకు?
['వాకిలి' వెబ్ పత్రికలో ప్రచురితం..]
© Sai Padma :// All Rights Reserved.
2013-01-11
నిశ్శబ్దం: (శీర్షిక లేదు)
నిశ్శబ్దం: (శీర్షిక లేదు)
2013-01-10
భాష & భావన: స్పందన
జీవన పయనం...Journey of life: అంతా భ్రాంతి
Journo Dreams: అసలు… వాళ్ళని ఉరి ఎందుకు తీయాలి?
తిరుమల రామచంద్ర గారి ఆత్మకథ ‘హంపీ నుంచి హరప్పా దాకా…’ ఒక శతాబ్దిలో వచ్చిన సుమారు రెండువందల స్వీయ చరిత్రలలో ఉత్తమోత్తమ రచన అన్న ప్రశంసలందుకుంది. అందులో ఆయన ఉత్తర భారతంలో తన పర్యటనల్లో ఓ అనుభవాన్ని వివరిస్తారు. ప్రదేశం సరిగ్గా గుర్తులేదు కానీ… ఓ చోట ఆయన కార్మిక సోదరులతో కలిసి కొన్నిరోజులు గడుపుతారు. ఆ నాళ్ళలో ఓ ఘటన… ఓ మహిళను ఆ కుటుంబ మిత్రుడొకడు పదేపదే అడుగుతూంటాడు.. ‘భాభీ తుమ్హారీ ఘడీ మే కితనే బజీ హై’. ప్రతీసారీ ఆమె ఒకటే సమాధానమిస్తూ ఉంటుంది… ‘ఏక్ హీ బజీ హై’ అని. ఈ సంభాషణ మొదట్లో రచయితకు అర్ధం కాదు. తర్వాత దాని అర్ధమూ, అంతరార్ధమూ తెలిసాక.. ఆయనంటాడు… వదినను తల్లిగా చూసే మన తెలుగు కుటుంబాల్లో ఇలాంటి సంభాషణలు సరసం కిందకు రావు, అసభ్యంగా పరిగణించబడతాయి అని.
సరసం విరసమవడానికి… భార్యా భర్తల మధ్యనైనా ఒక చిన్న సందర్భం చాలు. ఇక… ఓ యువతితో సరస సంభాషణ జరపాలంటే ఆ వ్యక్తికి ఎంత స్నేహం, మరెంత సాన్నిహిత్యం ఉండాలి? అప్పుడైనా… ఆ సెన్సిటివ్ మార్జిన్ ఎక్కడ ఆగుతుంది, దానికి ఏది పరిధి అన్నది తెలుసుకోడం ఏ ఇద్దరు వ్యక్తులకూ ఒకేలా ఉండదు. ఇక… సంస్కృతీ భేదాలుండే సందర్భాల్లో ఆ విభజన రేఖ మరింత వెడల్పుగా ఉంటుంది. నాగరికతలూ, స్థాయీ భేదాలూ కూడా ఆ రేఖను మరింత పెద్దది చేస్తాయి. మనకు నచ్చినా నచ్చకున్నా, మనకు తప్పైనది మరొకరికి ఒప్పయినా మనకు ఒప్పైనది మరొకరికి తప్పైనా…. ఆ స్థాయీ భేదాలు జీవిత వాస్తవం. అంతేకాదు… అలాంటి తేడాలున్న సమాజంలోనే అందరం కలిసి బతుకుతుండాల్సి రావడం పచ్చి నిజం.
నేనొక చదువు చదువుకుంటాను. నేనొక కుటుంబంలో జీవిస్తుంటాను. నేనొక బృందంలో స్నేహసంబంధాలు కలిగి ఉంటాను. వాటన్నిటి వల్లా నాకొక సంస్కారం ఏర్పడుతుంది. అది ‘ఎక్స్’కి ఒకలా… ‘వై’కి మరోలా… ‘జెడ్’కి ఇంకోలా ఉంటుంది. నాకూ ఆ ముగ్గురికీ అభిప్రాయ భేదాలూ, కలబోతలూ ఆయా సంస్కారాలను అనుసరించి ఏర్పడతాయి. మా నలుగురికీ దూరంగా… భౌతికంగా కొద్దిగానూ మానసికంగా చాలా ఎక్కువగానూ దూరంగా… ఉండే ప్రపంచంలో ఒక ‘ఎ’ ఉంటాడు. అతని పరిసరాలు, చదువు, సంస్కారం… అన్నీ వేరేగా ఉంటాయి. ఒకానొక ఆకస్మిక అనూహ్య సందర్భంలో మేం నలుగురం, ఆ ఒక్కడూ కలిసి ఒకచోట ఉండాల్సి వస్తుంది. అప్పుడు మా ఐదుగురి మధ్యా ఎలాంటి సంభాషణలు నడుస్తాయి? ఎలాంటి ఇంటరేక్షన్ జరుగుతుంది? నేనా వ్యక్తితో మేలమాడతాను. దాన్ని అతడు అపహాస్యంగా భావిస్తాడు, మండిపడతాడు. ఇంతలో… నేనన్న దానిలో తప్పేముందంటూ నా స్నేహితుల్లో ఒకడు అతన్ని నిలువరించవచ్చు. లేదూ… నేనలా అనకుండా ఉండాల్సిందంటూ మరొక స్నేహితుడు నన్ను వ్యతిరేకించవచ్చు. మరొకడు మా ఇద్దరికీ బుద్ధి లేదంటూ నిందించవచ్చు. ఇవన్నీ కాదు.. ‘ఎ’ బైటివాడు… మనం స్నేహితులం… కాబట్టి మనవాడికి మనం మద్దతు పలకాల్సిందే అని మూడోవాడు అనొచ్చు. చివరికి ఏమైనా జరగొచ్చు. మందిబలం మీద మేమందరం అతన్ని మరింత అపహాస్యం చేయవచ్చు. లేదా శారీరకంగా మా అందరికంటె బలవంతుడై ఉంటే అతను మా అందర్నీ తుక్కుతుక్కుగా కొట్టి ఉండవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో న్యాయాన్యాయాలు నిర్ణయించాల్సింది ఎవరు? ఎలా? దేశమంతటికీ ఒకే చట్టం ఉంది. అది మాత్రం నిర్వికారంగా పని చేసుకుంటూ పోతుంది. సరే… దాని దృష్టిలో ఎవరు ఎలా పడతారన్న దాన్ని బట్టి అది చేసుకుపోయే పని ఆధారపడి ఉంటుంది. దాని కథ గురించి మనకు పెద్దగా తెలిసినదీ, తెలియాల్సినదీ ఏమీ లేదేమో లెండి… దాన్ని పక్కన పెడదాం.
ఫ్యాషన్ డిజైనింగ్ చదువుకున్న చిన్నదానికి కురచ దుస్తులు వేసుకున్నంత మాత్రాన పోయేదేమీ లేదనిపించవచ్చు. ఆమె రోడ్డున పడగానే… ఆ పక్కనే మోటర్ బైక్ మీద స్టైలిష్ గా కూచుని ఉన్న కుర్రాడు వేసే విజిల్ తన అందానికి మెచ్చుకోలుగా అనిపించవచ్చు. అదే దారిన పోతుండే మరో దానయ్యకు అవి చిత్ర విచిత్రంగా కనిపించవచ్చు. ఆ చూపులు ఆ అమ్మాయికి అనాగరికంగా అనిపించవచ్చు. ఈ మొత్తం ఘటనలో తప్పెవరిది? ఒప్పెవరిది? నాగరికత నడిబొడ్డున ఉన్నందున… దానికి విరుద్ధంగా ప్రవర్తించడం దానయ్యదే తప్పు కదా. అదే… పల్లెటూరిలో అలాంటి సీన్ చోటు చేసుకుంటే తప్పు ఆ అమ్మాయిదే అవుతుంది. (ఈ సోషల్ ఎటికెట్ లోకి ఐన్ స్టీన్ వచ్చేస్తున్నాడు. ఆగు బాసూ…)
ఏ ఒక్కరికీ భౌతిక హాని లేనంత వరకూ ఈ చర్చలు ఎలాగైనా చేసుకోవచ్చు. శారీరక దాడి, అత్యాచారం జరిగినప్పుడు మాత్రం బాధితురాలి వైపే సానుభూతి మొత్తం ఉంటుంది.అందులో తప్పేమీ లేదు కూడా. కానీ… నేరానికి పాల్పడిన వాళ్ళు కేవలం నేరస్తులుగా మిగిలిపోతారు. ఆ నేరానికి వారికి ప్రోద్బలం కలిగించిన పరిస్థితులు మాత్రం ఊసులోకి కూడా రావు. ఢిల్లీ కేసులో బాధితురాలు చనిపోయినందుకు… సాధారణ చేతన ఉన్న మనిషన్న ప్రతీ ఒక్క భారతీయుడూ ఆవేదన చెందాడు. సహజమే. ఐతే నిందితుల వైపు నుంచి ఆలోచించగలిగిన వారెందరు?
సన్నిహితులు ఆడితే సరసమైనది ముక్కూమొహం తెలీనివారి నోట విరసమే కాదు అసభ్యమూ అవుతుంది. క్లాస్ సిస్టంలో ఉండే పరస్పర అనుమానాలు కూడా తోడైతే అది మాటల దశ నుంచి చేతల దశ వరకూ వస్తుంది. దానికి మందు మత్తు కూడా కూడితే ఆ చేతలు హింసాత్మకమవుతాయి. ఉన్మాదం ప్రకోపించినప్పుడు ఆ హింస ప్రాణాలూ తీయిస్తుంది. కేవలం వ్యక్తుల నేర స్వభావమే దారుణానికి కారణమైతే ఇంత గింజుకోవలసిన అవసరం లేదు. కానీ… స్వభావరీత్యా నేరస్తులు కాని వ్యక్తులు… అజ్ఞానం నుంచి పుట్టిన అక్కసు వల్ల, విచక్షణ కోల్పోయిన దశలో నేరం చేస్తే ఏం చేయాలి? రేపిస్టులకు ఉరిశిక్ష విధించాల్సిందే అంటున్న వారు ఈ విషయం మీద కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది.
ఆ నిందితులందరూ అధోజగత్ సహోదరులే. పెద్దగా చదువుకున్న వారు కారు. పొట్ట పోసుకోడం కోసం రాజధాని చేరుకున్నవారు. వారిలో ఒకడు బస్సు డ్రైవరుగా పనిచేస్తుంటే మిగిలిన వారూ దాదాపు అలాంటి చిన్నచిన్న పనులు చేసుకు బతుకుతున్న వారే. మహానగరంలో మనుషుల తీరుతెన్నులను తమ కళ్ళతో చూస్తూ, తమకు తోచినట్టు మాత్రమే అర్ధం చేసుకోగలిగినవారు. ఎడతెగక ఏరులై పారుతూ దొరికే మద్యానికి బానిసలు. వెండితెర మీద సరసాల పేరిట అర్ధనగ్న సుందరీమణుల, పూర్తి దుస్తుల ‘మహా’నటుల అసభ్య ప్రేలాపనలకు, శృంగారం పేరిట విశృంఖల లైంగిక చేష్టలకూ ఎడిక్ట్ అయిపోయినవారు. ప్రేమ అంటే కుక్కల, పందుల పొర్లాట అనే భ్రమలు కలిగించే సినిమాల బాధితులు. సెలవు రోజు ఎంజాయ్ చేయడమంటే పూటుగా మందుకొట్టి నోటికొచ్చినట్టు అమ్మాయిలను ఏడిపించడమే అనిపించే సినీ కాలుష్యాలతో కుళ్ళిపోయినవారు. అసలే కోతి, ఆపైన కల్లు తాగింది అన్నట్టు… సమాజ కాలుష్యాలనే తింటూ తాగుతూ బతికినవారికి చేతికో బస్సు దొరికింది… పీకల నిండా పట్టించిన మందు మత్తెక్కించింది, ఆపై ఆడపిల్ల అసహాయ పరిస్థితిలో కనబడింది. వారు చేసింది నేరమే. దానికి ఉరి శిక్ష విధించినా సరిపోదు. నిజమే. కానీ… ఈ సమాజంలో వారొక్కరికే శిక్ష పడడం సమంజసమా?
తందూర్ కేసు గుర్తుందా… అదీ ఢిల్లీలో జరిగిన ఘటనే. ఓ యూత్ కాంగ్రెస్ నాయకుడి భార్య ఆ అమ్మాయి. తన మిత్రుడొకరితో ఆమెకు సంబంధం ఉందేమోనని అనుమానం ఆ యువనేతకు. ఒకరోజు అతను ఇంటికి వచ్చేసరికి ఈ అమ్మాయి మందు కొడుతూ ఫోన్ లో ఆ రెండో వ్యక్తితో మాట్లాడుతూ ఉంది. కోపం ఆపుకోలేక ఆమెను పొడిచి చంపేశాడు. తర్వాత శవాన్ని ఏం చేయాలా అని ఆలోచించాడు. ముక్కలుముక్కలుగా నరికి అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి మిత్రుడి హోటల్లో తందూర్ లో కుక్కి కాల్చేశాడు. ఆ సమయానికి ఆ దారమ్మట పోతున్న పోలీస్ ఎవరో చూడడంతో ఆ ఘటన వెలుగు చూసింది. సుమారు యేడాది తర్వాత అతను లొంగిపోయాడు. ఐతే కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి అక్కణ్ణుంచి మరింత పైకి.. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దాటి రాష్ట్రపతి దగ్గరకి చేరినట్టుంది. ఇదంతా జరిగి పదేళ్ళు దాటిపోయింది. నేరస్తుడు ఇంకా సభ్య సమాజంలోనే తిరుగుతున్నాడు.
కేరళలో సూర్యనెల్లి కేసు ఇంకా దారుణం. పధ్నాలుగేళ్ళ ఓ చిన్న పిల్లని బస్ కండక్టర్ ఒకడు కిడ్నాప్ చేసి రేప్ చేశాడు.తర్వాత ఓ ముఠాకి అమ్మేశాడు.ఆ ముఠాని నడుపుతున్నది రాజకీయ నాయకులూ, లాయర్లూనూ. నలభై రోజుల పాటు రోజుకో ఊరు తిప్పుతూ బ్రోకర్లకు అమ్మేసుకున్నారు. చివరికి ఆమె చేతిలో నాలుగు రూకలుంచి ఏదో ఊళ్ళో వదిలేశారు. అక్కణ్ణుంచి ఆమె నానా కష్టాలూ పడి స్వస్థలానికి చేరుకుంది. కేసు పెట్టారు. ప్రభుత్వం కూడా ఆమె అత్యాచారానికి గురైందని గుర్తించి… ఓ చిన్న ప్రభుత్వోద్యోగం ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఆ ప్యూన్ ఉద్యోగంలోనూ పదేపదే ట్రాన్స్ ఫర్లు.. ఎక్కడికెళ్ళినా చూపులతోనే వెలేసే సమాజం. పధ్నాలుగేళ్ళుగా అలాగే అవస్థలు పడుతోందా కుటుంబం. చావలేక, బతకలేక నరకయాతన అనుభవిస్తోందా అమ్మాయి. ఇంతా చేసి… నేరస్తులెవరో అందరికీ తెలిసినా… ఒక్కరికీ కనీస శిక్ష కూడా పడలేదు. ఇంకో వందేళ్ళ వరకూ వాళ్ళకు శిక్షలు పడతాయన్న గ్యారంటీ లేదు.
ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో నిందితులందరూ వెంటనే లొంగిపోయిన వారే. మొదటి రోజైతే… మా నేరానికి మరణ శిక్షే సరైనది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వారే. వాళ్ళని నిలువునా ఉరితీసేయండంటూ వారి కుటుంబ సభ్యులు మొహాలు దాచుకున్నారు. వారికి ఉన్న సంస్కారం ఈ పెద్దపెద్ద వాళ్ళకి లేదు. తమ అనుకున్న వాళ్ళు ఎంతటి నేరానికైనా పాల్పడనీ, ఎంతటి ఘోరమైనా చేసి ఉండనీ… వారిని శిక్ష నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తారు. ఏదన్నా అంటే జరిగిందేదో జరిగిపోయింది… పరిహారం ఎంత కావాలీ అంటారు. అలాంటి నీచులని నడిరోడ్డున నిలబెట్టి ఉరి తీయాలి. అది జరగదు. ఈ నిర్భాగ్యులకు వ్యతిరేకంగా దేశమంతా ఆందోళనలు. ఈ క్షణంలోనే చంపేయాలంటూ డిమాండ్లు. చిత్రమేంటంటే… మామూలు మనుషుల గోల పక్కన పెడితే… లాయర్లు కూడా వారికి న్యాయ సహాయం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారట. అసలు… ఆ అత్యాచారం జరిగిన మర్నాటి నుంచీ ఆందోళనలు జరిగిన రెండు వారాల్లోనూ దేశ రాజధానిలోనే నాలుగైదు అత్యాచార ఘటనలు జరిగాయి. వాటి గురించి స్పెసిఫిగ్గా మాట్లాడుతున్న వాడే లేడు. దేశవ్యాప్తంగా జరిగిన, జరుగుతున్న ఘటనలను ఎక్కడికక్కడ స్థానిక మీడియా బైటకు తీస్తూనే ఉంది. గత నెల రోజులుగా ఏ పేపర్ చదివినా, ఏ టీవీ చూసినా రేప్ కేసులే. ఇప్పటికిప్పుడు కొత్త చట్టాలు చేసి నేరస్తులను ఉరి తీసేయాలని డిమాండ్ చేసేవారే అందరూనూ. ఇప్పటికే ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయడమైనా సాధ్యమో కాదో ఆలోచించే వాడే కనిపించడం లేదు. న్యాయపరమైన సమస్యలు పక్కన పెడితే… చట్టాల అమలుకు అడ్డు పడుతున్న అతిరథ మహారథులందరూ బాగానే చెలామణీ అయిపోతుంటారు. వాళ్ళనేమీ చేయలేని మనం… మానసికంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ బలహీనులైన నిందితుల విషయంలో జాలి చూపడం కాదు… కనీసం ఆలోచన కూడా చేయడానికి వెనుకాడుతున్నాం.
అసలు… వాళ్ళని ఉరి ఎందుకు తీయాలి?
Filed under: ఉద్దేశాలు
2013-01-09
సన్నాయి: ఆస్ట్రేలియా ప్రభుత్వం సూపర్ స్టార్ కృష్ణ తో విడుదల చేసిన స్టాంప్ పెద్ద బోగస్ అంట.
skvramesh: హేమంతం
ఈనాడు - చదువు: మే 10న ఎంసెట్
2013-01-07
Grahabhumi: 2013 జనవరి 4వ తేదిన భక్తిమాల టీవిలో ప్రసారమైన కార్యక్రమం
Grahabhumi: 2013 జనవరి 3వ తేదిన భక్తిమాల టీవిలో ప్రసారమైన కార్యక్రమం
తృష్ణ...: ముగ్గుల పుస్తకం..
Musicologist Raja: రెహమాన్ ఆర్టికల్ కి దక్కిన గౌరవం
2013-01-06
తృష్ణ...: జంటగా చూసితీరాల్సిన "మిథునం" !
మీరు చెప్పినది అక్షర సత్యం .
వంచనతో తెలంగాణ ఉద్యమాన్ని వాడుకుంటున్న నాయకులు ఎందరో .
ఎందరో మహానుభావులు , అదరికీ ….
తీర సీమ ఆంధ్రలో పట్టు పోకుండా అక్కడి ప్రజలని వెధవలని చెయ్యటానికి వాడబడే శిఖండి లగడపాటి .
ఇంకా సరిగా చెప్పాలంటే ఆంధ్రాలో కేసీఆర్ కి ప్రతిబింబం .
రాష్ట్రం విడిపొతే కొంపలెమీ అంటుకుపోవు. కానీ, పోకపోతే కొంపలంటుకుంటాయి అనే ధోరణి వుంది చూశారూ, ఆ భావన కల్పించిన దుర్మార్గులు క చ రా మరియు వారి కుట్తుంబ సభ్యులు మిగిలిన బ్రుందమే నిజంగా తెలంగానకి ద్రోహం చేసింది. తెలంగాన ప్రజలని చైతన్యవంతం చెయ్యడం ద్వారా వారి మన్నలను పొందవచ్చు. కానీ ఈ ఉద్యమంలొ ఉన్న ప్రధాన తప్పిదం, అంధ్ర ప్రజలను బూచిగా చూపించి ఉద్యమాన్ని కించపరచారు. ఎందుకంటె, తె రా స ద్రుష్టి కేవలం కలెక్షన్, సెలెక్షన్, ఎలెక్షన్ మాత్రమె. ఎప్పుడైతే క చ రా జాగొ భాగొ అన్నడో, అప్పుడె అర్ధమైంది ఆయన గారికి రాష్ట్రం సమైక్యం అంటెనె ఇష్టం అని. తీర సీమాంధ్ర ప్రజలు తినే బిర్యాని, వెసుకొనే బట్టలు, వాళ్ళ పేర్లు (బుల్లబ్బాఇ).. ఇవన్నీ అతను తెలంగాన ప్రజలను ఎంత మాయ చెయ్యడానికి వాడుకున్నాడొ అర్ధమైంది. లగడపాటి పేరు 90 శాతం తీర సీమాంధ్ర ప్రజలకు తెలియదు, అలాంటిది, కచరా గారె ఆయనను పెద్ద వాన్ని చెసారు. క చ రా లెకుండా వుండె ఎలాంటి ఉద్యమమైన బహుశా తెలంగాన ప్రజల ఆశలు తీరవచ్చు.
ఇప్పటికైనా మించి పొయింది లెదు… క చ రా తన వైఖరి మార్చుకొని, తీర సీమంధ్ర ప్రాంతంలొని మితవాదుల్ని కలిసి విడిపొవదానికి ఉన్న 3-4 అభ్యంతరాలు, భయాలు (భయాలు కల్పించింది వారె కాబట్టి) తెలుసుకొని, వాటి పరిష్కారనికి పట్టు విడుపుల ధొరణితొ మెలిగితె సాధ్యమె. దౌర్జన్యంతొ, బెదిరింపులతొ, రాష్ట్రం విడిపొదు.
మాధవ రావు గారూ, వర్డ్‌ప్రెస్.కామ్ వాళ్ళు ఆ సదుపాయాన్ని ఇప్పుడు తీసేసినట్టున్నాడు. ఇంకెక్కడికైనా మార్చాడేమో చూడాలి. కనిపిస్తే మీకు మెయిల్ పంపుతాను.
బాగుంది.. ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది నిజమనిపిస్తుంది..!!
good
haha…very nice
Excellent timing
adirindi bhayya nee ” VAK CHATURYAM”.
kshaminchandi… valmiki ramayanamlo meeru cheppina vishayam yekkadaa ledu. meeru cheppina udaaharana chaalaa mandi chaalaa sandarbhaalalo chepparu, kaani adi mummatiki asathyam.
do not stand at my grave and cry
i am not there, i do not sleep
i am a thousand winds that blow
………………
i am not there, i did not die
—murthy