ఈ క్రింది బ్లాగుల నుండి టపాలను నాకు చూపించకు:

కూడలిలో మీరు చూడకూడదనుకుంటున్న బ్లాగుల చిరునామాలని (లేదా చిరునామాలోని కొంత భాగాన్ని)ఇక్కడ ఇవ్వండి. ఆ బ్లాగుల నుండి వచ్చే టపాలు ఇకపై మీకు కూడలిలో కనిపించవు. ఉదాహరణ: someblog.wordpress

ఈ జాబితాలో పొరపాటున ఒక బ్లాగుని చేరిస్తే, దాన్ని ఈ జాబితా నుండి తొలగించడానికి ఆ బ్లాగు చిరునామాపై నొక్కండి.

    You have not blogs yet.
| సూచనలు
నిర్వహణ ↓

2010-09-08

నాన్న: సూరిగాడి బడి గోల

2010-09-08 05:38 PM భాస్కర్ రామరాజు
సూరిగాడు మళ్ళీ బడిబాటన పడ్డాడీమద్దిన.ఓరోజు మాయింటికాడి ప్రభుత్వ పాఠశాలకి కాలు చెయ్యి సేసాను, ఇలా మావోణ్ణి బళ్ళో నూకాలా ఎట్టా అని.రేపే ఎత్తుకొచ్చేయండా అని సెలవిచ్చారా బడోళ్ళు.ఎప్పుడ్రంమ్మంటా అన్నాపొద్దునన్నా రండి లేపోతే సాయన్కాలవన్నా రండీ పొద్దున్నె సద్ది మూటకట్టుకొత్తా, అద్సరే ఎన్నింటికి రమ్మంటాఎనిమిదికి రండితొమ్మిదికి రండిపదికి రండిపస్కుండికి రండిపన్నెండు దాటినంక రాకండిఒకేళ ఒచ్చేపనైతే

మా గోదావరి: కొట్టేసినందుకు రోజూ బెదిరిస్తున్న చెట్టు

2010-09-08 06:55 AM Satyavati
ఈ చెట్టు చూసారా?నేను వద్దంటున్నా వినకుండా కూరగాయల మొక్కలకు నీడ వస్తుందని మా వాళ్ళు కొట్టేసారు.దీనిని కొట్టినందుకు నేను వారం రోజులు నా సహచరుడితో మాట్లాడలేదు.ఓ రోజంతా ఏమీ తినలేదు.చెట్టును కొడితే నాకు అంత బాధగా ఉంటుంది.మొత్తం కొట్టొద్దన్న మాటను విని ఇదిగో ఇలా వదిలేసారు.తలలేని ఆ చెట్టేమో తర్జని చూపిస్తూ బెదిరిస్తోంది.నాకు దానిని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. దానికి చిగుర్లు ఎప్పుడొస్తాయా అని నేను

KadaliTaraga : a wave in the Ocean !: కొమరయ్య, కుమార్, కొమ్రన్న…

2010-09-08 04:15 AM ఎన్.వేణుగోపాల్

దళిత బహుజన ఆలోచనా స్రవంతిలో కొన్ని వినూత్నమైన, విభిన్నమైన అవగాహనలు ప్రవేశపెట్టిన చిరకాల మిత్రుడు, పేరుతోనే ఎంతోమందికి అన్న అయిన కొమ్రన్న (కేసరాజు కొమరయ్య) యాభై ఏళ్ల వయసుకే, సమయానికి సరయిన వైద్యం అందక కన్నుమూశాడు. ఇటీవల ఎక్కువగా రాస్తూ, సంభాషిస్తూ రచయితగా, సున్నితమైన బహుజన ఆలోచనాపరుడిగా నిలబడతాడని వాగ్దానం వస్తూ ఉండగానే అనారోగ్యం ఆ వాగ్దానాన్ని దెబ్బతీసింది.

కొమరయ్యగా మొదలై, కొంత ఆకర్షణీయంగా ఉండాలనుకొని కుమార్ అని రాసుకుంటూ, మళ్లీ మూలాల గుర్తింపుతో, కొత్త చూపుతో ‘కొమ్రన్న’గా మారిన కొమరయ్య గురించి ఆలోచిస్తుంటే ముప్పై సంవత్సరాల వెనుకటి రూపమే గుర్తుకొస్తోంది – చామనచాయకు ఒక రవ్వ తక్కువే అయినా కళకళలాడే ఆకర్షణీయమైన రూపం, ఏ భావమయినా పారదర్శకంగా కనిపించే వెడల్పయిన ముఖం, రింగులు తిరిగిన వత్తు జుట్టు, ధారాళంగా సాగే వాగ్ధార, ప్రతిమాటలోనూ వ్యంగ్యమూ హాస్యమూ చిప్పిల్లుతూ శ్రోతను ఆకట్టుకుని తనలో లీనం చేసుకునే హావభావాలు, ప్రభావశీలమైన వ్యక్తిత్వం…. 1979-81 మధ్య వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజిలో చూసిన కేసరాజు కొమరయ్య రూపం అది.

కొమరయ్య నాకు ఒక సంవత్సరం సీనియర్. అప్పటికే కవిత్వం రాస్తున్నాడు, ఉపన్యాసాలు ఇస్తున్నాడు. బాగా పాడేవాడు. మంచి చదువరి. డిగ్రీ విద్యార్థుల తొలియవ్వనంలో ఆకర్షించగల అన్ని లక్షణాలూ ఉన్నవాడు.  అన్నిటికన్న మిన్నగా మా ఊరికి కూతవేటు దూరంలో ఉండే మీదికొండ నుంచి వచ్చాడు. అందుకే చాల సహజంగా సన్నిహిత మిత్రుడయ్యాడు. సాహిత్య, సామాజిక, రాజకీయ ఆసక్తులవల్ల ఆయన తరగతిలోని మరి ఇద్దరు మిత్రులూ, నా బోటి వాళ్లూ ఆర్ట్స్ కాలేజిలో అప్పుడు సాగుతుండిన బ్రహ్మాండమైన విద్యార్థి ఉద్యమ, ఆలోచనాపరుల బృందంలో భాగస్తులమయి సన్నిహితులమయ్యాం. అందరమూ ఒక్క రాజకీయ విశ్వాసాలనే బలపరచేవాళ్లమేమీ కాదు గాని ఒకేరకమైన సాహిత్య, సామాజిక, తాత్విక, రాజకీయ ఆసక్తులుగలవాళ్లం. చదివే, ఆలోచించే, చర్చించే అలవాటున్నవాళ్లం, పాటలంటే చెవి కోసుకునేవాళ్లం. సభలకూ సమావేశాలకూ తప్పనిసరిగా వెళ్లేవాళ్లం. సీనియర్ గనుక, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు గనుక ఒక రకంగా కొమరయ్య మా నాయకుడు. అప్పటికి కాలేజిలో బలంగా ఉండిన విద్యార్థి సంఘాలు – రాడికల్ స్టూడెంట్స్ యూనియన్, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ – మూడిటి లోనూ కొమరయ్యకు ఆత్మీయ మిత్రులు ఉండేవాళ్లు.

మా కాలేజి సాహిత్య కార్యదర్శిగా ఆయన ఎంతోమందిని ప్రభావితం చేశాడు. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం ప్రితిష్ నందీ సంపాదకుడిగా యూత్ టైమ్స్ అని పత్రిక నడిపేవాడు. 1980లోనో, 1981లోనో అది పొయెట్రీ ఆఫ్ లవ్ అని ఒక ప్రత్యేక సంచిక తెచ్చింది. దానిలో కవితలను ఇద్దరమూ పోటీపడి అనువదించడం నిన్ననో మొన్ననో జరిగినట్టుంది. మా ఈ సాహిత్య స్నేహానికి ఒక రాజకీయ చేర్పు కూడ ఉంది. కొమరయ్య ఫైనలియర్ లో, నేను సెకండియర్ లో ఉండగా ఆయన బావమరది వెంకటరమణ ఫస్టియర్ లో చేరాడు. చరిత్రాత్మక తెలంగాణ సాయుధపోరాటపు కడివెండి నుంచి వచ్చిన రమణ ఆ తర్వాత విప్లవోద్యమంలోకి వెళ్లి అమరుడయ్యాడు.

కొమరయ్య ఇంగ్లిషు సాహిత్యం ప్రధానాంశంగా బి ఎ 1981లో పూర్తి చేసుకుని, ఎం ఎ ఇంగ్లిషులో చేరిన తర్వాత కూడ యూనివర్సిటీలోనో, చౌరస్తాలోనో, సభలలోనో కలుస్తుండేవాళ్లం. ఎం ఎ అయిన తర్వాత కూడ చాల రోజులు ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లిష్ కోచింగ్ సంస్థలలోనూ, తక్కువ జీతంతో కాంట్రాక్టు లెక్చరర్ గానూ పనిచేశాక దాదాపు పది సంవత్సరాలకు గాని స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. అఫ్రికన్ ఇంగ్లిష్ సాహిత్యం మీద పిఎచ్ డి చేద్దామనుకుని, అది ఆగిపోయి, చివరికి భాషాశాస్త్ర విషయంతో పిఎచ్ డి ముగించాననిపించాడు. సహచర అధ్యాపకులతో సమస్యలవల్లనో, ఇతర సమస్యలవల్లనో గాని అధ్యాపకుడిగా రాణించవలసినంతగా రాణించలేకపోయాడు. డిగ్రీ రోజుల్లో ఆయన రచనాశక్తీ ఉపన్యాసశైలీ చూసి రచయితగానూ అధ్యాపకుడిగానూ ఎంతో ఎదుగుతాడనుకున్న నా బోటి మిత్రులకు నిరాశ మిగిలింది. ఒక అట్టడుగు కులం నుంచి వచ్చి ఎంతో ప్రతిభా అధ్యయనమూ శక్తి సామర్థ్యాలూ ఉండి అవి సమాజానికి ఉపయోగపడవలసినంతగా ఉపయోగపడడం లేదే అనిపించేది.

మళ్లీ ఆయన క్రియాశీలంగా మారినది కొంత బహుజన ఉద్యమ సందర్భంగానూ, మరికొంత ఎక్కువగా ప్రజారాజ్యం పార్టీ సామాజిక న్యాయ నినాదాన్ని విశ్వసించినప్పుడూ. గత నాలుగైదు సంవత్సరాలుగా చాల వ్యాసాలే రాశాడు, కొన్ని కవితలూ రాశాడు. ఇటీవల ఎక్కువగా పత్రికా చర్చలలో పాల్గొంటున్నాడు. చాకలి ఐలమ్మ ఉజ్వల వారసత్వాన్ని ఎత్తిపడుతూ రచనలు చేశాడు. మొత్తం మీద ముప్పై ఏళ్లుగా రాస్తున్నప్పటికీ రాయవలసినంత రాయలేదు.

తాను సంకలనం చేసిన ఒక కవితా సంకలనం గురించి చెపితే ఆయన విశిష్టత తెలుస్తుంది. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు ప్రకటించగానే, వాటివల్ల దేశ సమైక్యత దెబ్బతింటుందని, వాటిని ప్రతిఘటిస్తూ కవిత్వ సంకలనం తేవాలనుకుంటున్నానని మా ఇద్దరికీ ఆర్ట్స్ కాలేజిలో గురువు పేర్వారం జగన్నాథం గారు ఒక ప్రకటన ఇచ్చారు. మోర్దోపు దున్న అని ఒక కవితా సంకలనం తెచ్చారు. ఆ ప్రకటన, పుస్తకం చూసి ఆగ్రహించిన వాళ్లు ఎంతోమంది ఉండవచ్చు గాని, కొమరయ్య మాత్రమే ఆ ప్రకటనకు ప్రతిగా, ‘ముస్లిం రిజర్వేషన్లను ఆహ్వానిస్తున్న శ్రమగౌరవ ఉత్పత్తి కులాల కవితల సంకనం’ వేస్తానని ప్రకటన ఇచ్చి, దాదాపు ఎనభై కవితలు సంకలనం చేసి ‘మా బోనులోకి మరో సింహం’ ప్రచురించాడు. దానికి తాను రాసిన ఇరవై పేజీల ముందుమాట చాల ఆలోచనాస్ఫోరకమైన విషయాలు చర్చించింది.

ఒకవైపు చాకలి ఐలమ్మ గతం, మరొకవైపు వెంకటరమణ వర్తమానం. ఈ ఇద్దరిమధ్య మరొకదారి కోసం వెతుకుతూ గెలిచాడో ఓడాడో తెలియకముందే మెదడు నరాలు చిట్లి మనమధ్యనుంచి వెళిపోయిన కొమ్రన్న లేవదీసిన ప్రశ్నలలో కొన్ని దురుసుగానో, మొరటుగానో, అసందర్భంగానో కనబడవచ్చు. కాని అవి వేదననుంచి వెలువడిన, నిజాయితీ నిండిన ప్రశ్నలు. తరతరాలుగా ఈ సమాజపు మురికిని వదిలించే గౌరవనీయమైన వృత్తికి చెందిన మనిషి వేసిన ప్రశ్నలు. అన్ని ప్రశ్నలనూ సగౌరవంగా ఆహ్వానించాలనే అవగాహన ఉన్నన్ని నాళ్లూ కొమ్రన్న రూపమూ స్వభావమూ సజీవంగానే ఉంటాయి.


2010-09-07

రేఖా చిత్రం: రచయిత, దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ శత జయంతి

2010-09-07 11:07 PM సురేఖ
గోపీచంద్ (08-09-1910 : 02-11-1962) మరణించాక కూడా చిరకాలం పాఠకులహృదయాల్లో చిరంజీవిగా వుండే అదృష్టం రచయితలదే. అలాటి అదృష్టవంతుడు త్రిపురనేని గోపీచంద్. చక్రపాణి సంపాదకత్వంలో వెలువడిన "ఆంధ్రజ్యొతి" మాస పత్రిక,అటుతరువాత"యువ"లోను ఆయన వ్రాసిన "పనిలేని మంగలి" శీర్షికలో వ్రాసిన రచనలు పాఠకుల విశేష ఆదరణ పొందాయి. గోపీచంద్ కధకునిగా,

స్వాతి ముత్యము: భీభత్స సంఘటనలు -1

2010-09-07 08:19 PM swthi mutyam
మామూలుగా చాలా మందికి హారర్ సినిమాలు అంటే భయముంటుంది, అందులోను అమ్మాయిలకి (అందరికీ కాదనుకోండి) ఇది చాలా ఎక్కువ, ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు.......సినిమాలు చూసి భయపడటం, అది చూసి నిద్ర పట్టక రాత్రిళ్ళు బిక్కు బిక్కు మంటూ గడపటం చాలా మంది చేసేదే ....ఇది అందరికి సినిమా చూస్తేనే జరుగుతుంది. కాని నేను ఎంత వింత అంటే..........ఎంత పిరికి దాన్ని అంటే...స్టొరీ విని.........ఏంటి.......... జస్ట్ స్టొరీ

రేఖా చిత్రం: బహుముఖప్రజ్ఞాశాలి భానుమతీరామకృష్ణ

2010-09-07 04:26 AM సురేఖ
తెలుగు తారలలో చిరంజీవి శ్రిమతి పాలువాయి భానుమతీ రామకృష్ణ. మొట్టమొదటి సారిగా వెండితెర పై భానుమతి 1939 లో కాళీంది పాత్రలో "వరవిక్రయం" చిత్రంతో అడుగు పెట్టారు. బొమ్మరాజు వెంకట సుబ్బయ్య, సరస్వతమ్మ దంపతులకు చిన్నారి భానుమతి 7 సెప్టెంబరు,1925 న జన్మించారు.తన సినిమారంగ ప్రవేశం గురించి భానుమతి

2010-09-06

KadaliTaraga : a wave in the Ocean !: ఎవరికోసమీ ఎక్సైజ్ విధానం?

2010-09-06 03:21 AM ఎన్.వేణుగోపాల్

ప్రభుత్వానికి ఒక ఎక్సైజ్ విధానం అనేది ఉంటుందని, ప్రజలు తాగే మద్యంమీద పన్నులు విధిస్తూ ఆదాయం సంపాదించడమే ఆ విధాన లక్ష్యమని తెలిసిన మధ్యతరగతిలో సాధారణంగా రెండు రకాల ప్రతిస్పందనలు ఉంటాయి. ఒకటి, ‘మరి ప్రభుత్వానికి పాలన నడపడానికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి   నిధులు అవసరం కదా, వీలయిన అన్ని మార్గాలలోనూ పన్నులు వసూలు చేయాలి గదా, లేకపోతే ఇంతమంది ప్రభుతోద్యోగులకు జీతభత్యాలు, ఇన్ని పాఠశాలలు, ఇన్ని ఆస్పత్రులు, ఇన్ని ప్రజారవాణా సాధనాలు, వగైరా వగైరా ఎలా నడుస్తాయి’ అని చాలమంది ప్రశ్నిస్తారు. ఈ రూపంలో పన్ను ఎంత వస్తుందో, ప్రభుత్వ ఖర్చులలో ఈ ఆదాయం లేకపోతే వచ్చే లోటు ఏమిటో, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు ఉన్నాయో లేవో వారికి స్పష్టంగా తెలియకపోవచ్చు. కాని వారికి ఇటువంటి అవగాహన ప్రచార సాధనాల నుంచి అంది ఉంటుంది. ఇటీవల ఒక సినిమాలో హాస్యంలాగ ఒక పాత్ర నోట పలికించిన సంభాషణలో ‘మేం తాగుబోతులం కాం. టాక్స్ పేయర్స్ మి. మేం తాగి పన్నులు చెల్లించకపోతే  ఈ పాలనే నడవదు’ అనే మాట ఈ అవగాహనకు ఒక ఉదాహరణ. ఇక మరొక ప్రతిస్పందన తాగడం అనేదాన్ని నైతికదృష్టితో, ఆరోగ్యదృష్టితో చూసి అది అనైతికమనో, తప్పు అనో, అనారోగ్యకరమనో భావిస్తుంది. ‘మనుషులు తాగగూడదు’ అనే ఆదర్శాన్ని ప్రకటిస్తుంది.  తాగడం వల్లనే చాల నేరాలు జరుగుతున్నాయని అనుకుంటుంది. ఈ తాగుబోతుతనాన్ని ప్రభుత్వాలు ఎందుకు ప్రోత్సహిస్తున్నాయో అని ఆశ్చర్యపోతుంది. ప్రభుత్వాలు నిర్బంధపూరితంగానైనా సరే మద్యనిషేధ విధానాన్ని అమలు చేయాలని, అంటే ఎక్సైజ్ విధానాన్ని వదులుకోవాలని కోరుతుంది.

ఈ ‘పన్ను చెల్లింపుదారు’ అవగాహన గాని, ‘వ్యసనపరుడు’ అవగాహన గాని ప్రభుత్వ ఎక్సైజ్ విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సరిపోవు. ఎక్సైజ్ విధానానికి చారిత్రక మూలాలూ, దానివల్ల  పాలకులకు రాజకీయార్థిక సాంస్కృతిక ప్రయోజనాలూ ఉన్నాయి గనుక, దాన్ని కేవలం పన్నుల వనరు గానో, వ్యసనంగానో చూస్తే అరకొరగానే అర్థమవుతుంది. తప్పనిసరిగా ఎక్సైజ్ విధానంలో పన్ను ఆదాయం కోణం, మద్యపానంలో వ్యసనం కోణం ఉన్నాయి గాని ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతిలో ఎక్సైజ్ విధానం వల్ల పాలకవర్గాలకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు రాజకీయ, సాంస్కృతిక ప్రయోజనాలు కూడ ఉన్నాయి. అందుకే ఈ వ్యవస్థ ఇలాగే ఉన్నంతకాలం పాలకులు ఆ ఎక్సైజ్ విధానాన్ని వదులుకోవడం, మద్యనిషేధాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం సాధ్యం కాదు. నిజానికి ఈ మద్యం మీద, మాదకద్రవ్యాల మీద పన్నులు విధించే అధికారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిదే అయినప్పటికీ, వామపక్ష ప్రభుత్వాలతో సహా ఏ పార్టీ ప్రభుత్వాలు కూడ తాము అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలలో ఎక్సైజ్ విధానాన్ని సమూలంగా మార్చడానికి ప్రయత్నించలేదు. “మద్య నిషేధం ఆచరణ సాధ్యమైన విధానం కాదు గనుక, కల్తీ చేసిన, పన్ను చెల్లించని మద్యాల తయారీని, సరఫరాను, అమ్మకాలను అడ్డుకోవడం,  రాష్ట్రానికి రాగలిగినంత ఎక్కువ పన్ను ఆదాయాన్ని రాబట్టడం అనే రెండు కర్తవ్యాలు ప్రభుత్వం ముందున్నాయి” అని పశ్చిమ బెంగాల్ వామపక్ష ప్రభుత్వం కూడ అంటున్నది.

ప్రస్తుతం నడుస్తున్న ఎక్సైజ్ విధానానికి రూపాలు చాల మారి ఉండవచ్చు గాని సారాంశంలో ప్రజల మద్యపానపు అలవాటు మీద ప్రభుత్వాలు సొమ్ముచేసుకోవచ్చుననే ఆలోచన కౌటిల్యుని అర్థశాస్త్రం నాటినుంచీ ఉంది. అనేక రకాల మద్యాల గురించీ, మద్యపానాన్ని ప్రభుత్వం నియంత్రించడం గురించీ, తాగే స్థలాల గురించీ, తాగే వారి అర్హతల గురించీ, పన్నుల విధానం గురించీ అర్థశాస్త్రం వివరంగా చెప్పింది. అంటే క్రీ.పూ. రెండో శతాబ్దానికీ, క్రీ.శ. రెండో శతాబ్దానికీ మధ్య కాలానికే మద్యపానం మీద పాలకులు పన్నులు వసూలు చేయవచ్చుననే ఆలోచన ఉందని అనుకోవచ్చు. కాని ఆశ్చర్యకరంగా అర్థశాస్త్రంలోనే “ఎవరయినా వారి ఆదాయానికి మించి మద్యపానం చేసినా, భవిష్యత్తుకోసం ఆదా చేయకుండా మద్యపానం చేసినా వారిని రక్షకభటులకు అప్పగించాలి” అనే నిబంధన కూడ ఉంది.

ఏమైనా, అప్పటినుంచి బ్రిటిష్ అధికారం వచ్చేదాకా దేశంలో రాచరికం, భూస్వామ్యం కొనసాగాయి గనుక, ఆ నాటి విలువలలో విలాసాలకు, అందులోనూ మద్యానికి ప్రాధాన్యత హెచ్చు గనుక మద్య అనుకూల విధానాలే కొనసాగాయి.

పెట్టుబడిదారీ విధానంలో అన్ని అంశాలనూ లాభనష్టాల దృష్టితో చూడడం జరుగుతుంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయం గురించి కూడ ఆ దృక్పథమే సాగింది.  అయితే అదే సమయంలో పెట్టుబడిదారీ విధానం తొలిరోజుల్లో బ్రిటన్ లో కొన్ని రంగాలలో నైతిక దృష్టితో కలగలిసి సాగింది. అందుకే పెట్టుబడిదారీ విధాన సిద్ధాంతకర్త ఆడమ్ స్మిత్ తన వెల్త్ ఆఫ్ నేషన్స్ లో మద్యపానం మీద పన్ను గురించి రాసినది చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. “మత్తెక్కించే మద్యాలు సామాన్య ప్రజల ఆరోగ్యాలకు హానికరమైనవి గనుకా, వారి నైతిక వర్తనను కలుషితం చేస్తాయి గనుకా, వాటి వినియోగాన్ని తగ్గించే దిశగా ఇటీవల గ్రేట్ బ్రిటన్ లో పన్నుల విధానం ఉంది” అని ఆ హెచ్చు పన్నుల విధానాన్ని విమర్శిస్తున్న వారికి అది ఎందుకు అవసరమో ఆయన జవాబు చెప్పాడు. అంటే మద్యం మీద ఎక్కువ పన్ను వేసి దాని ధర పెంచడం ద్వారా దాని వినియోగాన్ని తగ్గించాలని బ్రిటిష్ ప్రభుత్వం కనీసం పద్దెనిమిదో శతాబ్దంలోనయినా అనుకున్నదన్నమాట.

అందుకే ఇటువంటి పన్నుల గురించి రాజకీయార్థిక శాస్త్ర పాఠ్య పుస్తకాలలో ‘నిరోధకంగా పనిచేసే పన్ను’ అనీ, ‘అపచారపు పన్ను’ అనీ, ‘పరిసరాలను చెడగొట్టకుండా ఉండే పన్ను’ అనీ, ‘ఆ అలవాటువల్ల కలిగే నష్టాలను పరిహరించడానికి వేసే పన్ను’ అనీ, ‘శిక్షగా వేసే పన్ను’ అనీ చెపుతారు. అయితే ఇవన్నీ పాఠ్య పుస్తకాల వరకే గాని ఈ పన్ను వల్ల నిజంగా మద్యపానం తగ్గిపోవాలని ప్రభుత్వాలు అనుకుంటున్న దాఖలాలు ఏమీ లేవు. ఎప్పటికప్పుడు ఎక్కువమంది తాగాలనీ, ఎక్కువ మద్యం వినియోగం కావాలనీ, తద్వారా ఎక్కువ పన్ను ఆదాయం రావాలనీ లక్ష్యాలు విధించి, అవి సాధించవలసిందిగా, అంటే బలవంతాన తాగించవలసిందిగా ప్రభుత్వాలే సిబ్బందికి ఆదేశాలు ఇస్తున్నాయి.

బ్రిటిష్ పాలనలోని మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం, స్వతంత్ర రాచరికంగా ఉండిన హైదరాబాద్ ప్రభుత్వం రెండూ కూడ మద్యం మీద పన్ను ఆదాయాన్ని ప్రధానంగా భావించాయి. హైదరాబాద్ ప్రభుత్వం చాల విషయాలలో బ్రిటిష్ పాలనావిధానాలను అనుసరించడానికి ప్రయత్నించింది. అంతకుముందు అరాచకంగా ఉండిన ఆబ్కారి (ఎక్సైజ్) విధానాన్ని సంస్కరించాలని, తక్కువ మద్యం వినియోగంతో ఎక్కువ ఆదాయం ఒనగూరే మద్రాసు పద్ధతి అమలు చేయాలని 1905లో భావించింది. నిజానికి మద్రాసు రాష్ట్రంలో మాదకద్రవ్యాల మీదా, మద్యం మీదా ప్రభుత్వ నియంత్రణ 1808లోనే మొదలయి 1886 మద్రాస్ ఆబ్కారీ చట్టం తో క్రమబద్ధమయింది. నాటుసారా, కల్లు, విదేశీ సారా, గంజాయి మొక్క నుంచి తయారయ్యే మత్తుపదార్థాలు, నల్లమందు అన్నీ ఈ చట్టం కిందికి తీసుకువచ్చారు. ఏ ప్రాంతంలో ఎన్ని సారా దుకాణాలు ఉండాలి, అక్కడ అమ్మే సారా ఎంత ఘాటయినది ఉండాలి నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉండేది. ఆ దుకాణాలు నడిపే లైసెన్సును ఏడాదికి ఒకసారి వేలం పాటలద్వారా నిర్ణయించేవారు. దానితోపాటు అమ్మిన పరిమాణాన్ని బట్టి సుంకం ఉండేది. అంటే మొత్తం మీద ఇవాళ్టి ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రాంతాలలోనూ దాదాపు ఒకటే రకమయిన ఎక్సైజ్ విధానం కనీసం 1905 నుంచి 1947 దాకా సాగింది. మళ్లీ ఇప్పుడు కొనసాగుతున్న విధానం కూడ దాని నమూనాలోనే తయారయింది.

ఈలోగా భారత జాతీయోద్యమంలో ప్రభుత్వ వ్యతిరేక దృష్టి నుంచీ, నైతిక దృష్టి నుంచీ కూడ మద్యనిషేధం గురించి ఆలోచనలు, మద్యవ్యతిరేక పోరాట రూపాలు వచ్చాయి. “స్వాతంత్ర్యోద్యమాన్నయినా వాయిదా వేస్తాను గాని, మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని వాయిదా వేయలేను” అని గాంధీ అన్నాడు. అప్పటి ప్రభుత్వాదాయ వనరులలో ప్రధానమయినదిగా ఎక్సైజ్ ఆదాయం ఉండడం వల్ల మద్యపాన వ్యతిరేకత ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నంగా కూడ ఉండింది. బ్రిటిష్ ఇండియాలో అనేక చోట్ల సారా దుకాణాల ముందర ప్రదర్శనలు, సారా దుకాణాలు బద్దలు కొట్టడం, మద్యపాన వ్యతిరేక ప్రచారాలు సాగాయి. హైదరాబాద్ రాజ్యంలో కూడ అదేవిధంగా తాటిచెట్లను నరికే ఉద్యమం, గీసేవాడిదే చెట్టు అనే రూపంలో ప్రభుత్వానికి పన్ను కట్టబోమనే ఉద్యమం నడిచాయి. అయినా 1947 తర్వాత, మొక్కుబడిగా రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో మద్యనిషేధం గురించి ఒక మాట చేర్చడం మినహా, ప్రభుత్వాలు దాన్ని తీవ్రమైన విషయంగా పరిగణించలేదు. ఎక్సైజ్ విధానాన్ని ఒక ఆదాయ మార్గంగా చూస్తూనే వచ్చాయి.

అధికార మార్పిడి తర్వాత మద్రాసు రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు జిల్లాలలో 1948లో మద్యనిషేధం ప్రారంభించి, ఆ తర్వాత దాన్ని రాయలసీమకు కూడ విస్తరించారు. 1952లో దాన్ని మొత్తం ఆంధ్ర ప్రాంతంలో అమలు చేశారు. 1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినతర్వాత కూడ తెలంగాణలో మద్యపానం కొనసాగుతుండగా, కోస్తాంధ్ర, రాయలసీమలలో మాత్రం మద్యనిషేధం అమల్లో ఉండేది. 1969 నవంబర్ 1 న ఆ ప్రాంతాలలో కూడ మద్యనిషేధాన్ని ఎత్తివేసి సారా, దేశవాళీ మద్యం అమ్మకాలను అనుమతించడం మొదలుపెట్టారు. 1986లో తెలుగుదేశం ప్రభుత్వం మద్యం అమ్మకాలను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసింది. మద్యం అమ్మకాలు ప్రభుత్వమే నడపడం మొదలుపెట్టింది. నెల్లూరు జిల్లా దూబగుంటలో మొదలయి జిల్లా అంతటా మద్య వ్యతిరేక ఉద్యమం పెద్ద ఎత్తున సాగిన తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 1993 ఏప్రిల్ లో నెల్లూరు జిల్లాలో, అక్టోబర్ నుంచి మొత్తం రాష్ట్రంలో సారా అమ్మకాలపై మాత్రం నిషేధం విధించింది. దేశవాళీ మద్యం (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ – ఐ ఎం ఎఫ్ ఎల్ అనే పేరుతో ప్రచారంలో ఉన్న ఖరీదయిన మద్యం) అమ్మకాలు సాగనిచ్చారు.

ఆ తర్వాత ఎన్నికలలో మద్యనిషేధ వాగ్దానంతోనే అధికారానికి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 1995 జనవరి 16 నుంచి మొత్తం రాష్ట్రంలో మద్యనిషేధం విధించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1997లో ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. ఇక అప్పటినుంచీ ఏడాదికేడాదికీ ప్రభుత్వమే మద్యం అమ్మకాల లక్ష్యాలు నిర్ణయించి, ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ మద్యం అమ్మకాల ప్రోత్సాహంలో తెలుగుదేశం పార్టీకీ, కాంగ్రెస్ పార్టీకీ ఏమీ తేడాలేదు.

రాష్ట్రంలో అనుమతి పొందిన దాదాపు ఏడువేల మద్యం దుకాణాలలో, 800 బార్లలో మద్యం అమ్మకాలు సాగించే హక్కు ఎవరిదో నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ రెండు సంవత్సరాలకు ఒకసారి వేలం పాటలు నిర్వహిస్తుంది. ప్రతిసారీ వేలం పాటలు జరిగేటప్పుడు ప్రభుత్వమే గత వేలం పాట కన్న 15 శాతం పెంచి లైసెన్స్ ఫీజు నిర్ణయిస్తుంది. అంటే పాటలో నెగ్గాలంటే అంతకన్న ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడాలన్నమాట. మరోమాటల్లో చెప్పాలంటే గత సంవత్సరం కన్న ఈ సంవత్సరం కనీసం 15 శాతం ఎక్కువ మందిచేత, లేదా పాతవారితోనే 15 శాతం ఎక్కువ మద్యాన్ని తాగిస్తామని దుకాణదారులు ప్రభుత్వానికి హామీ ఇవ్వాలన్నమాట.

ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన మొదటి సంవత్సరం (1957-58)లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎక్సైజ్ ఆదాయం రు. 5.95 కోట్లు ఉండింది. అప్పటికి సగానికన్న ఎక్కువ ప్రాంతంలో మద్య నిషేధం అమలులో ఉండడం వల్ల ఇది ప్రాతినిధ్య గణాంకం కాదనుకున్నా, నిషేధం ఎత్తివేసిన తర్వాత మొదటి సంవత్సరమైన 1970-71లో అది రు. 25.88 కోట్లుగా ఉండింది. ఆ తర్వాత గడిచిన నలభై సంవత్సరాలలో అది 300 రెట్లు పెరిగి  2010-11లో రు. 7,512.00 కోట్ల అంచనాకు చేరింది. ప్రజా జీవితంలోని ఇతర ఏ అంశాన్ని తీసుకున్నా ఇలా 300 రెట్ల పెరుగుదల కాదు గదా మూడు నాలుగు రెట్ల పెరుగుదల కూడ లేదు.

ఇలా ఎక్సైజ్ ఆదాయం సంపాదించడం ప్రజాసంక్షేమ కార్యక్రమాల కోసమే అని రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారులు చెపుతుంటారు. కాని లక్షకోట్ల రూపాయల పైన ఉన్న బడ్జెట్ లో ఏడువేల కోట్ల రూపాయల ఆదాయం అంత నిర్ణయాత్మకమైనదేమీ కాదు. ఆపాటి నిధులను ఇతర మార్గాల ద్వారా సంపాదించవచ్చు,   మిగిలిన ఖర్చులలో పొదుపు పాటించి సంపాదించవచ్చు. అసలు ప్రభుత్వం తలచుకుంటే తన ఆదాయ వ్యయాలను సక్రమంగా సమీక్షించుకుంటే తగ్గించుకోగలిగిన ఖర్చులు, పెంచుకోగలిగిన ఆదాయాలు ఎన్నో ఉన్నాయి. భద్రతా వ్యయం, రుణాల అసలు, వడ్డీల చెల్లింపులు, ప్రైవేటు విద్యా, ఆరోగ్య, రవాణా సంస్థలకు చెల్లింపులు, ప్రభుత్వ పనులు చేయడానికి అనవసరంగా కాంట్రాక్టర్లను నియమించుకుని వారికి చేస్తున్న చెల్లింపులు చాల వరకు తగ్గించవచ్చు, కొన్నయితే పూర్తిగా మానెయ్యవచ్చు. అలాగే, ప్రభుత్వాదాయం పెంచుకోవడానికి కూడ ఎన్నో మార్గాలున్నాయి. రాష్ట్రంలోని ఖనిజ వనరులను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అప్పగించి, వారు దోచుకుపోతుంటే చూస్తూ కూచున్న ప్రభుత్వం, ఆ గనులను ప్రభుత్వ ఖనిజాభివృద్ధి సంస్థచేతనే తవ్వించి సొంతంగా ఖనిజాలను అమ్మినా, కనీసం ఆ ప్రైవేటు ఖనిజ సంస్థలు సంపాదిస్తున్న లాభాలలో ఎక్కువభాగాన్ని పన్నుగా వసూలుచేసినా, రాష్ట్రాదాయం పెరుగుతుంది.

కాని అటువంటి చర్యలకు ఈ పాలకవర్గాలు, ఈ ప్రభుత్వం పూనుకోవు. మద్యం వ్యాపారం ద్వారా లాభపడుతున్న వర్గాలు, పరిపాలన సాగిస్తున్న వర్గాలు ఒకటే కనుక ఈ ప్రభుత్వం తన వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయడం అసాధ్యం. అంతే కాక, ప్రజలు ఇలా వ్యసనాలకు, మత్తుపదార్థాలకు, తప్పుడు మార్గాలకు బానిసలయితేనే, పొందవలసిన చైతన్యం పొందకుండా ఉంటారు. అంటే పాలకవర్గాలు సాగిస్తున్న అక్రమాలను ప్రజలు ప్రశ్నించకుండా, ఎదిరించకుండా ఉండాలంటే, తప్పనిసరిగా ప్రజలను ఇటువంటి అపసవ్య మార్గాలలోకి మళ్లించవలసి ఉంటుంది. ఆ రకంగా మద్య వ్యాపారంతో పాలకులకు ఆర్థిక ప్రయోజనాలూ ఉన్నాయి, రాజకీయ, సాంస్కృతిక ప్రయోజనాలూ ఉన్నాయి.

మొత్తం మీద ప్రభుత్వాలు ఇప్పుడు అమలు చేస్తున్న ఎక్సైజ్ విధానం ప్రజల మేలు కోసం కాదు. అది ప్రజల ఆరోగ్యాలను రక్షించేదీ కాదు, ప్రజా సంక్షేమానికి ఖర్చు చేయడానికి నిధులు కావాలనే పేరుమీద ఆ ప్రజల ఆరోగ్యాలనూ జీవితాలనూ కుటుంబాలనూ గుల్ల చేసి డబ్బులు దండుకునేది. ప్రజలను వ్యసనపరులుగా తమ రాజకీయార్థిక విధానాలను ప్రశ్నించి పోరాడలేని శక్తిహీనులుగా మార్చేది. వారి బలహీనతలను పెంచి పోషించి, వారు మేల్కొని తమ మీద, తమ విధానాల మీద తిరగబడకుండా చేసేది. ఇన్ని లోపాలతో, దురాలోచనలతో, ప్రజావ్యతిరేకంగా ఉన్న విధానానికి తప్పకుండా ప్రత్యామ్నాయం ఉంటుంది, ఉండాలి. కాని ప్రస్తుతం ఉన్న సామాజిక రాజకీయార్థిక వ్యవస్థలో, ఈ పాలకవర్గాల ఆధిపత్యంలో ఆ ప్రత్యామ్నాయం సాధ్యం కాదు. ఆ ప్రత్యామ్నాయం గురించి ప్రజలు ఆలోచించడానికి కూడ వీలు లేని స్థితిని పాలకులు తయారుచేసి పెట్టారు. ఉన్న వ్యవస్థలో ఏవో అతుకులూ మాట్లూ వేసినప్పటికీ, ఎక్సైజ్ విధానం వంటి ప్రజావ్యతిరేక విధానాలు కొనసాగుతూనే ఉంటాయని విభిన్న రాజకీయ పక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల చరిత్ర చెపుతోంది.


రేఖా చిత్రం: ఆచార్య దేవోభవ ! శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు

2010-09-06 12:13 AM సురేఖ
హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారు 1922 నాటి నుండి రాజమండ్రి వీరేశలింగమ్ హైస్కూలులో గణితాధ్యాపకులుగాను, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాలుగాను పనిచేసి 1953 లో పదవీ విరమణ చేశారు.హాస్యప్రధానమైన నాటకాలు, నాటికలు వ్రాశారు. 1950 లో జయపూర్ మహారాజా శ్రీ విక్రమదేవవర్మ కామేశ్వరరావు గారిని "హాస్యబ్రహ్మ" బిరుదుతో సత్కరించారు. ఆంధ్రనాటక పద్యపఠనం,

2010-09-05

naa telugu kavithalu for everybody: (శీర్షిక లేదు)

2010-09-05 02:25 PM jameela
ప్రకృతి కాంత సూర్యోదయవేళ! తల నుండి జాలువారు మంచు మేలి ముసుగు తెరను తొలగించుకుంటూ పచ్చ పచ్చని పట్టుచీరను గట్టి అప్పుడే విచ్చిన పూల పుప్పొడి సువాసనల అత్తరుతో రాణివాసము నుండి నునుసిగ్గుతో అడుగు బయటిడెను . ఉదయ భానుని క్రీగంటి చూపులను నుదుట సింధూరముగా దిద్దుకొనగ "ప్రకృతికాంత". చంద్రోదయవేళ!

లోచని: అఙ్ఙానాన్ని తొలగించే వారంతా గురువులే .....

2010-09-05 01:33 PM Lochani
మాత్రుదేవోభవ పిత్రుదేవోభవ గురుదేవోభవ అని ఆర్యోక్తి అంటే తల్లిదండ్రుల తరువాత గురువుకి దేవునితోసమానంగా అంతటి ప్రాధాన్యం ఇచ్చారు. కాని నేడు పిల్లలకు కనిపించె గురుదేవుడు వారికి ఒక జీతానికి పనిచేసే న్యక్తిగా కనపడడం శొచనీయం. పిల్లలు ఏవిషయమైనా తల్లిదంద్రుల నుండే నేర్చుకుంటారు. కనుక తల్లితండ్రులు వారి గురువులను, పిల్లల గురువులనూ భక్తిగా, గౌరవంగా చూస్తీ పిల్లలకు కూడా గురువులపట్ల భక్తి భావన

తుమ్మ వారి తెలుగు కవితలు: ప్రమాదం

2010-09-05 10:51 AM Pramida
మనసనే మకరందంపైకాలమనే గరళం పడినామనసుకే ప్రమాదంకాలమనే గరళం పైమనసనే మకరందం పడినామనసుకే ప్రమాదం------- తుమ్మ ప్రసాద్

మౌక్తికం: విచిత్ర మైత్రి ...

2010-09-05 03:47 AM డా.ఆచార్య ఫణీంద్ర
అతడు నాదు మాట నంగీకరింపడు -ఏను నతని మాట నెప్పు డొప్ప -అయినగాని, సతము నతనితో మాటాడ గుండె లోతులందు కోర్కి రేగు !

2010-09-04

తుమ్మ వారి తెలుగు కవితలు: ఓ అందం

2010-09-04 02:14 PM Pramida
ఓ అందంనీకెంతో గర్వంప్రకాశించే తారలలోపొందుపడాలనుకుంటావువెలగలేక మలగలేక బాధతోకొట్టుమిట్టాడ్తుందని నీకేం తెల్సుగల గల పారే ప్రవాహంలోగంభీరంలా పొంగే సముద్రంలోనీ నీడ చుడాలనుకుంటావుకాని!!ఆ సముద్రం బడబాగ్నులతోఎలా ఘోశిస్తుందో నీకేం తెల్సునిర్మలంగా సాగే ప్రవాహానికిఎన్ని అడ్డంకులో నీకేం తెల్సుకనిపించే జగతిలోకమనీయ దృశ్యాలలోచోటు చేసుకోవాలనుకుంటావుకాని!!జగతి నిండా ఆకలి ఘోషలుకనలేని వినలేని అతర్కమైన

నా రాతలు...: 14th Feb. 2007

2010-09-04 12:45 PM విది
నా రాతలు... నా ప్రేయసి కోసం మొదలు పెట్టిన రాతలు... నా ప్రేయసి జ్ఞాపకాలను అక్షరాలతో చిత్రించి శాశ్వతం చేయాలనీ మొదలు పెట్టిన రాతలు... అన్నీ సంతోష పెట్టేవే కాదు, అన్నీ బాధ పెట్టేవే కాదు... కానీ అన్నీ ఇష్టమైనవి.  తను పంచింది కొద్ది ప్రేమే అయినా, ఉన్నట్టుండి నన్ను వదిలి వెళ్ళిపోయినా,  ఒక జీవితానికి సరిపడేన్ని మధుర స్మృతులను నాకు

సురుచి: కృతజ్ఞత

2010-09-04 10:14 AM జ్ఞాన ప్రసూన
<!--Session data--> ఒక అడవిలో సింహం చిత్తుగా దెబ్బలుతిని చావడానికి సిద్దంగావుంది.ఒకామె జాలిపడి సింహాన్ని తనతో తీసుకు వెళ్లి మందులు వేసి, సేవ చేసింది.కొన్నాళ్ళకి సింహం వెనుకటిలా ఆరోగ్యంగా తయారయింది.తర్వాత ఆమె జూ వాళ్లకి కాల్ చేసి ఈ సింహాన్ని వాళ్ళు తీసుకు వెళ్లి రక్షణ కల్పించాలని కోరిందట. వాళ్ళు వచ్చి సింహాన్ని తీసుకు వెళ్లి, జూ లో పెట్టి కాపాడారు.

చిరునవ్వులు వరమిస్తావా: నా మొదటి బ్లాగు పోస్ట్

2010-09-04 09:15 AM chantabbay
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ......

2010-09-03

వేటూరి సుందరరామమూర్తి :: vETUri sundararAmamUrti - అవినేని భాస్కర్: నేను నీవు ఎవ్వరికెవరం వలపు చిలికెనేలా?

2010-09-03 06:55 PM Avineni Bhaskar
=================================================== నా సాహితీ స్నేహితుడు చావా కిరణ్ కి ఈ టపాని అంకితం ఇస్తున్నాను. ఈ టపా రాయాటానికి ప్రేపన ఇచ్చింది కూడా చావా కిరణ్ పెట్టిన ఒక Buzzఏ కారణం... =================================================== మణిరత్నం తీసిన ఇద్దరు సినిమా, వాణిజ్యపరంగా అంత హిట్ కాదు. పాటలు మాత్రం సూపర్ హిట్. సినిమా పాటల్లో సాహిత్యం కావాలనుకునే వాళ్ళకు ఈ సినిమాలో పాటలు నచ్చుతాయి

సురుచి: వరలక్ష్మి పూజ

2010-09-03 05:47 PM జ్ఞాన ప్రసూన
ఇదుగోనండీ మావరలక్ష్మి దేవి వరలక్ష్మికి రూపాయలతో,పూలతో,పసుపు ,కుంకుమలతో అక్షతలతో అష్టోత్తర శత నామావళి పూజ.పూలు తెచ్చేఅబ్బాయి బిల్వ పత్రాలు తెచ్చాడు,శివునికి అష్టోత్తరం చేసాను.ఆ పూజాశోభ.

మా గోదావరి: ”అమ్మ ఇంట్లో వంట చేయును. నాన్న సంపాదించి తెచ్చును”. ఇక్కడే ఆగిపోయిన పాఠ్యాంశాలు

2010-09-03 05:00 PM Satyavati
ఇటీవల ఒక డిగ్రీ కాలేజీలో ఒక సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ నాకు మిత్రురాలు. విద్యార్థులెదుర్కొంటున్న సమస్యల గురించి, ‘ప్రేమ’ దాడుల గురించి ఇంకా వారు ప్రస్తావించే అంశాల మీద ఈ మీటింగులో మాట్లాడాలని, వారిని చర్చల్లో చురుకుగా పాల్గొనేెలా ప్రోత్సహించాలని తను చెప్పింది. ‘జండర్‌ సెన్సిటివిటీ ‘ గురించి కూడా మాట్లాడాలని నేను సూచించాను. నాతో పాటు ఇంకో ఫ్రెండ్‌ కూడా ఈ సమావేశంలో

మరొ మనిషి: మరొ మనిషి

2010-09-03 10:56 AM maromanishi

మరొ మనిషి….

మీలొ ఒకడిని , మీతొ ఒకడిని మాత్రం కాదు.

ఇక్కడ నకు నచ్చినట్టు రాసుకుంటాను , గీక్కుంటాను , గొక్కుంటాను .

ఇది నా సుదూర ప్రయాణం,

మీ

మరొ మనిషి


SPECTRUM: (శీర్షిక లేదు)

2010-09-03 04:16 AM Nagasuri
27 «Õ¢CÂË 'ÂÌJhÑ X¾Ûª½-²Äˆ-ªÃ©Õ -Åç-©Õ’¹Õ -«-Jq-šÌ “X¾Â¹-{Êå£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ, ÊÖu®ý-{Õœä: NNŸµ¿ ª½¢’éðx NP†¾d 殫-©ÊÕ Æ¢C¢-*Ê 27«Õ¢C “X¾«á-ÈÕ-©Â¹× ¤ñšËd ¡ªÃ-«á©Õ Åç©Õ’¹Õ N¬Áy-N-ŸÄu-©§ŒÕ¢ ÂÌJh X¾Ûª½-²Äˆ-ªÃ-©ÊÕ “X¾Â¹-šË¢-*¢C. ’¹Õª½Õ-„ê½¢ N«-ªÃ-©ÊÕ «JqšÌ …¤Ä-Ÿµ¿u-¹~×©Õ ‚Íê½u ÆÊÕ-«Ö¢œ¿x ¦µ¼Ö«Õ§ŒÕu ÅçL-¤Äª½Õ. ÆŸ¿%-†¾d-D-X¾Âú (®¾%•-¯Ã-ÅŒt¹ ²Ä£ÏÇÅŒu¢), œÄ.>.-N.-X¾Ü-ª½g-ÍŒ¢Ÿþ (X¾J-¬ð-Ÿµ¿Ê), ‡¢.G.-‡-®ý

తేట గీతి: కల గంటి, కల గంటి!

2010-09-03 01:45 AM Murali
నేనూ అప్పారావు గాడు కలిసి ఆఫీస్‌లో ఎంటర్ కాగానే, “పితృత్వంలోనే ఉంది మగ జన్మ సార్థకం. తండ్రి అనిపించుకొనుటే మగ మూర్తికి గౌరవం,” అంటూ పాడుకుంటూ వెళ్తున్న అనిల్ గాడు ఎదురు పడ్డాడు. “ఏంట్రా, పాప పుట్టాక వీడు చాలా హుషారుగా తయారయ్యాడు?” అడిగాను నేను అప్పారావు గాడిని. “అంటే వాడు తండ్రి అయ్యాకే వాడికి వాళ్ళ చుట్టాల్లో పక్కాల్లో బాగా రెస్పెక్ట్ పెరిగిందంట. ఒకప్పుడు కూరలో కరివేపాకులా తీసేసిన వాళ్ళే ఇప్పుడు వాడు రాగానే లేచి [...]

2010-09-02

సంఘమిత్ర: వాస్తును నమ్మాలా ?

2010-09-02 02:28 PM సంఘమిత్ర
నాకు ఎప్పటినుండో వాస్తు విషయాలపైచాలా ఆసక్తి ఉంది నమ్మాలా వద్దా అనేసందేహం నన్ను పట్టి పీదిస్తుండేది .నమ్మడం ఎలా వాస్తు శాస్త్రజ్ఞులు వ్యాపార ధోరణిలో వ్రాసే పుస్తకాలు చూస్తుంటే నిజంగా భయమేస్తుంది .అందుకే సరైన వాస్తు అంటే ఏమిటి అని గత 20 సం .లుగా ప్రయత్నిస్తున్నాను నా  ఈ చిన్న ప్రయత్నానికి అందరి సూచనలు కుడా కావాలి ఎవరైనా ఉత్సా హ వంతులుంటే చర్చించు దామనుకుంటున్నాను.ఎ ఒక్కరినో దృష్టిలో ఉంచుకుని

కృష్ణం వందే జగద్గురుం: కృష్ణం వందే జగద్గురుం

2010-09-02 05:56 AM శేషేంద్ర సాయి
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం

వేటూరి సుందరరామమూర్తి :: vETUri sundararAmamUrti - అవినేని భాస్కర్: మనసు అడిగిన ఆ మనిషెక్కడో - నా పిలుపే అందని దూరాలలో!

2010-09-02 05:41 AM Avineni Bhaskar
22 మే 2010, శనివారం రాత్రి సమయం పదౌతుంది. ఆషాకి ఒంట్లో బాగలేదు. డక్టర్ చెప్పిన ట్యాబ్లెట్లు వేసుకుని, నిద్రపట్టక టీవీ చూస్తుంది. నేను రూంలో కూర్చుని కంప్యూటర్లో పాటలు వింటున్నాను. ఆష గట్టిగ పిలిచింది. ఏమైందో ఏమోనని కంగారుతో వెళితే,"వేటూరి చనిపోయారంట! ఫ్లాష్ న్యూస్ వస్తోంది" ఆష హీనస్వరంలో చెప్పింది!అలాగే కిందకు వాలిపోయాను. మాటలు రావడంలేదు. ఇది కల అయితే బాగుండు. నన్నెవరన్నా ఇప్పుడు నిద్రలేపేయండి

2010-09-01

నాన్న: శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం

2010-09-01 04:25 PM భాస్కర్ రామరాజు
అధౌ దేవకీదేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం | కంసచ్ఛేదనకౌరవాదిహననం కుంతీసుతాః పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం || యవత్ హైందవజనులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.   శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం   భజే వ్రజైకమణ్డనం సమస్తపాపఖణ్డనం స్వభక్తచిత్తరంజనం సదైవ నన్దనన్దనమ్‍ | సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరమ్‍

నాలో నేను: కృష్ణాష్టమి

2010-09-01 06:32 AM సుధా రాణి
కృష్ణాష్టమి శుభాకాంక్షలుపుట్టినరోజు జేజేలు చిట్టి కన్నయ్య  నీకు ఏటేటా ఇలాగే పండుగ జరగాలి             బాల గోపాల స్వామీ బాలగోపాలా             దేవకీనందన గోపాలా             వసుదేవనందన గోపాలా యశోద నందన  గోపాలా             నంద గోపాలా ఆనంద గోపాలా            స్వామీ గోపాలా బాలగోపాలా

నాలో నేను: పరిచయం

2010-09-01 06:18 AM సుధా రాణి
మన తెలుగుభాష అతి ప్రాచినమైన భాష.తేనెలొలికే తెలుగు భాషా ప్రాశస్త్యం ఎంత చెప్పినా తనివి తీరనిది. "చక్కెర కలిపిన తియ్యని కమ్మని తోడుపెరుగు తెలుగు...". అమ్మదనాల,కమ్మదనాల తెలుగు నేలపై మన కవులు,కళాకారులు,గుడులు,గోపురాలు, మన తెలుగు సాంప్రదాయాలు, ఎంకిపా టలలోని పల్లెదనం అందాలు ,కూచిపూడి నాట్య వయ్యారాలు , కృష్ణమ్మగోదావరి తుంగభద్ర ల గలగలలు , కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు , శ్రీశైల మల్లన్న,

SPECTRUM: అవివేకం, అజ్ఞానం వెరసి సంచలనం

2010-09-01 01:04 AM Nagasuri
Aug 30,2010ఒక సంచలన వార్త మీకు వినబడగానే అందులోని సత్యాసత్యాలు తెలుసుకోవడానికి ఏ న్యూస్‌ఛానల్ మొదట చూస్తారు?-ఇది దాదాపు సంవత్సరం క్రితం (మనకు న్యూస్ ఛానళ్లు బాగా పెరిగిన సమయంలో) సి.ఇ.ఓ స్థాయిలో వుండే వ్యక్తి నన్ను అడిగిన ప్రశ్న. ఫలానా చానల్ అంటే నాకు గట్టి నమ్మకం, ఆ ఫలానా ఛానలే చూస్తానని నేను చెబుతూ ఒక చానల్ పేరు చెప్పగలనని ఆయన ఉద్దేశ్యం కావచ్చు. నిజానికి పోటీ పెరిగిన ఇటువంటి పరిస్థితి అటువంటి

2010-08-31

గుండె చప్పుడు...: ‘అన్నదమ్ముల్లా విడిపోదాం.. ఆత్మీయుల్లా కలిసుందాం’

2010-08-31 06:31 AM Konatham Dileep
తెలంగాణ ఉద్యమానికి అనేకమంది సీమాంధ్ర సృజనకారులు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వీరిలో అనేకమంది కొంతకాలం క్రితం ఆంధ్రజ్యోతి “వివిధ” శీర్షిక కింద తమ అభిప్రాయాలు పంచుకోగా తాజాగా మరికొంతమంది కవులు సెప్టెంబర్ 4 నాడు ‘కావడి కుండలు’ అనే పేరుతో ఒక ప్రత్యేక సంకలనం తెస్తున్నారు. ఈ సంకలనాన్ని పరిచయం చేస్తూ కోయి కోటేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతి “వివిధ” లో రాసిన వ్యాసం ఇది. విభజన సాగతీత వల్ల ఇరు ప్రాంతాల ప్రజల మధ్య నెలకొంటున్న అవాంఛనీయమైన ఘర్షణ వాతావరణం [...]

2010-08-29

మనసు పలికే ఉసులెన్నో---Heart says many things: ఓ ఎగిరిపోయే కోయిల ............,

2010-08-29 07:05 PM RAM BHASKAR
ఓ ఎగిరిపోయే కోయిల ............, నింగి నైన కాకపోతిని నీతో ఉసులాడేందుకు,,, గాలినైన కాకపోతిని నీతో పయనించేందుకు,,,, చెట్టునైన కాకపోతినినీకు సేదతీర్చేందుకు,,,,, బంగారపు పంజరాన్ని అనుకుంటివ ఎగిరిపొతివి....,miss you..........................,   పప్పు(రాము )

కాలాస్త్రి: తెలుగువారు - అంతర్గత కలహాలు

2010-08-29 06:28 PM శ్రీ
ఈ అంతర్గత కలహాలు ఒక్క తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం కాదు కానీ ప్రస్తుతం మన కలహాల గురించి కాసేపు  మాట్లాడుకుందాం. ఒక రెండు, మూడు వారాలుగా కూడలిలో చూస్తూ ఉంటే ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ,  కొట్టుకుంటూ అందరూ బాగానే కాలక్షేపం చేసినట్టున్నారు. ఎదో కాలక్షేపంగా నాలుగు రాతలు రాసుకోకుండా రోజంతా  ఒకరిమీద ఒకరు దాడులు చేసుకోవడంలో మనకి ఒరిగేదేమిటి ? అని ఎవరన్నా ఆలోచిస్తున్నారో లేదో! బ్లాగు రాసుకునే

2010-08-27

SPECTRUM: ఓల్డేజి హోంలో గణితం-ANDHRA JYOTHY daily 27.8.2010

2010-08-27 04:38 PM Nagasuri
'నెమలికి పించం ఎలాగో/నాగుబాముకు మణి ఎలాగో'- విజ్ఞాన శాస్త్రానికి గణి తం అలా భాసిస్తుంది. ఈ అర్థం వచ్చే శ్లోకాన్ని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ నెల 19న అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సమ్మేళనంలో పేర్కొన్నారు. మన దేశంలో ఇటువంటి సదస్సు జరగడం ఇదే ప్రథమం. అది కూడా హైదరాబాదులో జరగడం మనకు ఆనందదాయకం. గణితాన్ని 'క్వీన్ ఆఫ్ సైన్సెస్'గా పిలువడం కద్దు. వాస్తవానికి విజ్ఞాన శాస్త్రం అనేది గణితం ద్వారా పలుకుతుంది.

జీవితంలో కొత్త కోణం...: టీ ప్రిపరేషన్ టూ బ్లడ్ డొనేషన్

2010-08-27 02:07 PM శ్రీనివాసకుమార్
అతను టీ పోస్తాడు. రక్తం ధారపోస్తాడు. ఎలాగో తెలుసుకోండి...ఒరిస్సా... కటక్ నగరం... బక్సీ బజార్. తెలతెలవారింది. అక్కడే ఉన్న ప్రకాశరావు టీ కొట్టు జనంతో కళకళలాడుతోంది. ఈ ఊళ్ళో మసాలా టీ అంటే ఎవరైనా ప్రకాశరావు కొట్టుకే రావాలి. సలసల కాగే టీ గ్లాసులు పట్టుకున్న జనంతో దుకాణం కళకళలాడుతున్నా... కాసులతో గల్లాపెట్టె గలగలమంటున్నా ఆ యజమానికింకా సంతృప్తి కలగలేదు. అంతలో ఒక ఫోనొచ్చింది. లుకేమియాతో బాధపడుతున్న

2010-08-26

నైమిశారణ్యం: సన్యాసుల చేతిలో కర్ర ఎందుకు?

2010-08-26 10:32 AM జ్యోతి
జీయర్ స్వాములు మరికొందరు స్వాముల చేతిలో పొడవాటి కర్రలు ఉంటాయి గమనించారా? ఎళ్లవేళలా అవి వారి చేతిలో ఉంటాయి. ఊతకోసమా అంటేకాదు. మరి వాటిని ఎప్పుడు చేత పట్టుకోవడానికి గల కారణం గురించి తెలుసుకుందాం. వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా ఈ పొడవైన కర్ర పట్టుకుంటారు సన్యాసులు (యతులు).ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్ధం ఉంది. ' Y' ఆకారంగల యోగదండాన్ని, కమడలాన్ని

2010-08-25

మనస్వి: నాస్టీ ఎక్స్పీరియన్సా!!! అడ్వంచరా!!!!

2010-08-25 03:19 PM జయ
ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం తప్పకుండా చేస్తాను. ఈ వ్రతమంటే నాకెంతిష్టమో చెప్పలేను. ఎప్పటిలాగే, చక్కటి పీఠం మీద బియ్యంపోసి, తమలపాకులు పెట్టి, విఘ్నేశ్వరున్ని తలచుకొని, ఒక పెద్ద బిందె మీద చిన్న బింద పెట్టి, చేతులుగా ఒక హాంగర్ కట్టి అమ్మవారి విగ్రహం తయారు చేసాను. అమ్మవారికి కొత్తగా కొన్న పట్టుచీర కట్టి, పెద్ద అంచులు కనిపించేట్లుగా అందంగా సద్దాను. పైన కలశం పెట్టి, కళకళ లాడే పెద్ద వెండి మొహాన్ని

2010-08-23

జీవితంలో కొత్త కోణం...: టవర్స్‌కు అందని ప్రేమ... లెవిస్‌పోర్ట్ ఆతిథ్యం

2010-08-23 04:13 PM శ్రీనివాసకుమార్
అమెరికాలో ట్విన్ టవర్స్‌ను నేలకూల్చిన భయానక ఉగ్రవాదదాడి జరిగిన సెప్టెంబర్ 11 (9/11) వ తేదీని మానవాళి ఏనాడు మర్చిపోలేదు. అయితే ఇదే రోజున అమెరికాలోని కొన్ని వేలమందికి "ప్రేమ"ను పంచి ఇచ్చిన సంఘటన జరిగింది. అదేంటో తెలుసుకుందాం. ఆ రోజున ఈ ఘోరం జరిగిన సమయంలో విదేశాల నుంచి వచ్చే విమానాలు అమెరికాలో దిగడానికి అనుమతివ్వలేదు. అమెరికాలో తిరుగుతున్న చాలా విమానాల్ని మధ్యలోనే ఎక్కడికక్కడ సమీప విమానాశ్రయాల్లో

2010-08-22

చరిత్ర: సింగపూర్ లోని ఒక చారిత్రక జైలు

2010-08-22 05:56 PM Praveen Sarma
సింగపూర్ లోని ఒక చారిత్రక జైలు గురించి టివిలో వస్తున్నప్పుడు రికార్డ్ చేశాను. టివి ట్యూనర్ లో రికార్డ్ ఆప్షన్ ఇవ్వడం కొంత ఆలస్యం కావడంతో కొంత భాగం కట్ అయ్యింది.
వ్యాఖ్యలు
2010-09-09
2010-09-09 12:51 AM భావన - నాన్న
మొత్తానికి మీ వాడిని బళ్ళో ఏసి రోజుకో కాయితం చదువుతూ కంగారడుతున్నారన్నమాట. ఇప్పుడే ఏం చూసేరు సంతాకాలు పెట్టీ పెట్టీ, ఆ కాయితాలు చదివి చదివి.... అహె స్కూల్ వద్దు పాడు వద్దు ఇంకో రెండేళ్ళు ఆగుదాములే అనిపిస్తుండి చూడండీ.
2010-09-08
2010-09-08 11:05 PM చిలమకూరు విజయమోహన్ - నాన్న
సూరిగాడికొకటి,వాణ్ణావిధంగా తీర్చిదిద్దిన వాళ్ళమ్మ బాబులకో రెండు వీరత్రాళ్ళు.
2010-09-08 06:48 PM వేణూ శ్రీకాంత్ - నాన్న
సూపరు :)
2010-09-08 06:36 PM krishna - నాన్న
public స్కూళ్ళలో ESL(English as Second Language) పిలకాయలకోసం, ఓ పంతులునో, పంతులమ్మనో పెడతారు, వాళ్లకోసమయినా మన పిలకాయలను జేర్చమని ఓ మాట అడుగుతుంటారు, ఆ ESL గలాసుల వలన మంచిదే, ఒకటో, రెండో తరగతి వరకు పెడితే ఇంగలిపీసు బానే నేర్పిస్తారు. మా టెక్సాస్ లో అయితే అందులో చేరిన పిలకాయలకు ఎండాకాలం కూడా ఓ నెలన్నర ఎండాకాలం బడి పెడతారు (మనకు కాస్త ఎండాకాలం తీరుబాటు అవుతుంది, లేకపోతే వీళ్లను బిజీ అట్టిపెడతానికి
2010-09-08 06:20 PM nagarjuna - నాన్న
ఎనకమాల పిల్లలకు కాకుండ ముందుండే పల్లకాయ్‌లకు కూడా చెప్తాండారా...సెభాశో
2010-09-08 05:56 PM హరే కృష్ణ - నాన్న
:) :)<br />సూరిగాడా మజాకా :)
2010-09-08 05:54 PM సుబ్రహ్మణ్య ఛైతన్య - నాన్న
సూరిగాడికో ఈరతాడు, ఈరగంధం
2010-09-08 04:16 PM gajula - Comments for KadaliTaraga : a wave in the Ocean !

no comment.prastutha vyavasthalo pratyamnayamu kaadu,comment raase parisththi ledu.emani raayaali.anni-andariki thelusu .thaage vaalle daadaapu 90%gaa vunna samaajamulo ,emi korukovaali?evaru vintaaru?evaru amalu chestaaru?kaakapothe etuvanti thaagudu alavaatu leni samaajamu kaavaalani korukovadamu atyaasenaa?

2010-09-08 04:13 PM ఇందు - మా గోదావరి
అవును పాపం...కొట్టెసినందుకు చెట్టుకి కొపమొచ్చుంటుంది...తొందర్లొనే చిగురులు వేసేస్తుందిలెండీ...
2010-09-08 04:08 PM durgeswara - మా గోదావరి
nijame sumamdi
2010-09-08 10:17 AM వేణూ శ్రీకాంత్ - మా గోదావరి
హ్మ్ నిజంగానే అలా ప్రశ్నిస్తున్నట్లుందండీ...
2010-09-08 08:33 AM Krishnapriya - మా గోదావరి
hmm... నిజంగానే మీరు చెప్పినట్టు గా ఉంది..
2010-09-08 06:59 AM sridevi - మా గోదావరి
hi<br />idi bramha kamalam puvvu kadu.<br />idi cactus species sambandinchina mokka dini Queen of the Night,Orchid Cactus,Ducthman&#39;s Pipe catcus antaru.commonly misintrepreted as Bramha kamalam.<br /><br />Bramha Kamalam high altitudes lo mathrame peruguthundi.
2010-09-07
2010-09-07 09:18 PM వేణూ శ్రీకాంత్ - స్వాతి ముత్యము
కామెడీ మిక్స్ చేసిన హార్రర్ సినిమా చూపించేశారు కదా :) ఓ సారీ, పాపం మీరు మీ భయాలు కష్టాలు చెప్తుంటే నేను కామెడీ అనేశాను :) తరువాయి భాగం కోసం ఎదురు చూస్తూ...
2010-09-07 04:51 PM సుభగ - రేఖా చిత్రం
అసలు అవార్డులంటే ఆవిడకు అక్కర కాని పట్టింపు కాని ఉందని నేననుకోను, ఏదో మనలాంటి అభిమానులు ఆవిడకు రావాల్సిన అవార్డులు రాలేదే అని బాధపడడం తప్పించి..<br /><br />antaryagam garu,<br />లౌక్యంగా మాట్లాడి, మెరమెచ్చు కబుర్లు చెప్పేవారే అయితే ఆవిడ భానుమతే కాదు. భానుమతి గారంటే అలానే ఉండాలి :-) ఏమంటారు?
2010-09-07 02:54 PM sravan - Comments for KadaliTaraga : a wave in the Ocean !

@sunamu and @venugopal

i am agreeying with u.
i am from vizag. but my native is kurnool dist. i studied in telangana.
కనీసం ఒక పది జిల్లాలు తిరిగినవారు, అక్కడి పరిస్థితులు పరిశీలించినవారు (నిస్వార్థంగా) ఈ చర్చ చేసేందుకు ప్రముఖులు.

2010-09-07 02:57 PM జయ - మనస్వి
@ రాధిక గారు థాంక్యూ. ఇప్పుడనిపిస్తుంది ఆ దొంగలకే గండం తప్పిందేమో అని. అదే ఇంకోళ్ళైతే ఈ పాటికి పోలీస్ సన్మానం తో సుఖంగా ఉండే వాళ్ళు. <br /><br />@ అజ్ఞాత గారికి, అజ్ఞాత శాపాలు పనిచేయవండి. అందుకే బతికిపోయానేమో, అది చూడండి:) <br /><br />@ హరే కృష్ణ గారు థాంక్యూ. నిజ్జంగానే భయపడ్డానండి. ఒట్టు. అదే ఇంకెవరన్నా అయుంటే అందరికీ చెప్పేదాన్ని:)
2010-09-07 01:07 PM Marco - Mouli@scientilosophy
There is a solution for this problem. Check www.iris2iris.com
2010-09-07 12:45 PM sri - రేఖా చిత్రం
Inthamandhi abhimanualanu sampadinchadame amekoka award. Deeniki minchina awards levane naa nammakam!<br /><br />Yemantaro bloggers?
2010-09-07 12:11 PM హరే కృష్ణ - మనస్వి
హ్మ్మ్!<br />మీరు పడిన భయం సంగతేమో కాని <br />మీరు రాసిన విధానం చాలా బావుంది జయ గారు <br />చాలా భయపడే ఉంటారు :( :(
2010-09-07 11:54 AM Anonymous - మనస్వి
శివరంజని బ్లాగు ని మీరు<br />తీసుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగింది
2010-09-07 11:03 AM Anonymous - ANALYSIS &lt;&lt;&lt;&gt;&gt;&gt; అనాలిసిస్
(తెలంగాన వస్తే తెలంగాన వాల్లకి గ్రూప్1లో 42% కంటిన్యూ చేస్తమని మాటమీద నిలబడతరా? )<br /><br />హ్హ్వా..హ్హ్వా.హ్వ్వ్వ్వ్వ్వ్వ
2010-09-07 11:01 AM Anonymous - ANALYSIS &lt;&lt;&lt;&gt;&gt;&gt; అనాలిసిస్
యాద్గిరి నీవెంత ఏడ్చి మొత్తుకున్నా నమ్మేటోడు లేడు. ఆడలేక మద్దెల మీద ఏడిస్తే ఎవరింటారు? దేశం, ప్రపంచం మొత్తం దండోరా వేసుకున్నారు ఎనక బడినోళ్ళం, ఎనకబడినోళ్ళం అని. ఇపుడు రిజర్వేసన్ ఇస్తే ముందు బడుతాం ముందుబడుతాం అంటున్నారు. రిజర్వేసన్ ఇస్తే మీరు చంద్రమండలం యాత్ర ఫ్రీగా చేస్తరు, మీ సత్తా ఎవరికి తెలియదులే. సిగ్గులేదు ఇట్లా చెప్పిన అబద్దాలే చెప్పడానికి? కొంచెం మార్చండి, ఎపుడూ ఒకటే అబద్దమా! :))<br /><br
2010-09-07 10:25 AM antaryagam - రేఖా చిత్రం
ఆరుద్ర గారి గురించి తల్చుకోవటం అంటే,ఒక &quot;కొండ గాలి తిరిగింది&quot;, ఒక &quot;ఏటి లోని కెరటాలు&quot; ఇలా ఎన్నో.<br /><br />సమగ్రాంద్ర సాహిత్యం వ్రాయగలిగిన ధీశాలి సినిమా పాట వ్రాస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి ఆ పాటలు.<br /><br />మీ ప్రయత్నం అద్భుతం. క్రుతఙ్ఞతలు.
2010-09-07 05:12 AM Sandeep - వేటూరి సుందరరామమూర్తి :: vETUri sundararAmamUrti - అవినేని భాస్కర్
చక్కని బ్లాగును మొదలుపెట్టావు సోదరా. నీ ప్రయత్నానికి నాకు చాలా సంతోషం కలిగించింది. వేటూరి వ్రాసిన కొన్ని expressions చాలా లోతుగా ఉన్నాయి:<br />అనురాగానికి స్వరమేది? సాగరఘోషకు పెదవేది? ఎదురుచూపుకు నిదరేది?<br />ఎండమావిలో నావనులే - ఈ నిట్టూర్పే నా తెరచాపలే!<br />వెన్నెల మండిన వేదనలో- కలువ పువ్వులా కలతపడి<br /><br />ఇవి వేటూరి గొప్పదనాన్ని తెలిపే ప్రయోగాలు.<br /><br />ఇక వైరముత్తు వ్రాసిన పాట కూడా
2010-09-06
2010-09-06 05:08 PM Anonymous - ANALYSIS &lt;&lt;&lt;&gt;&gt;&gt; అనాలిసిస్
Anonymous said...<br />42% తేరగా ఇస్తే మేము పరీక్ష రాయకుండా గ్రూప్1 అవుదామని, భయ్.<br /><br /><br />Correct gaa chepparu ... :-)
2010-09-06 04:05 PM శేషేంద్ర సాయి - కృష్ణం వందే జగద్గురుం
ధన్యవాదాలు భావకుడున్ గారు
2010-09-06 07:40 AM భావన - మా గోదావరి
ఏమో నండి నేను ఇండీయా నుంచి వచ్చేసి మరీ చాలా కాలమయ్యింది ఇక్కడకు వుద్యోగ రీత్యా వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు (ఈ జెనరేషన్ పిల్లలు) బాగానే స్వతంత ప్రతిపత్తి తో వుంటున్నారు. అంటే వీళ్ళే మొత్తం యువత కాదు అనుకోండి. ఏమో కమల్ చదువు విచక్షణ పెంచుతుందని అని అనుకుంటూన్నా, కాక పోవొచ్చులే మరీ కాదని వాదించన ఎందుకంటే నాకు అంత గా అవగాహన లేని టాపిక్ ఇది ఈ తరం వాళ్లతో.
2010-09-06 02:32 AM ammalu - లోచని
Baga rasavu durga keep it up
2010-09-05
2010-09-05 05:13 PM nagarjuna - నాన్న
పూర్వ జన్మలో గానగంధర్వురాలైవుంటుంది....పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు ఆ జన్మలోని తన టాలెంటు గొర్తొచ్చి ఇప్పుడే ప్రాక్టీస్‌ షురూ జేస్తుంది... :)
2010-09-05 10:45 AM పరిమళం - సురుచి
కొందరు మానవులు పశుత్వం అలవరచుకొంటుంటే ...పశువులు మానవసహజమైన కృతజ్ఞత , ప్రేమాభిమానాలు చూపడం అద్భుతమే !
2010-09-05 04:19 AM భావన - సురుచి
అవునండి ప్రేమకు మరి లొంగనిదెవరు..
2010-09-05 04:19 AM భావన - సురుచి
చాలా బాగున్నదండీ మీ వరలక్ష్మి. చామంతులతో బిల్వ పత్రాలతో కూడా పూజ చేసారా. అవును ఈ రోజు శివుడికి ఎందుకండి?
2010-09-05 04:17 AM భావన - సురుచి
బాగున్నాడండి మీ కృష్ణుడు. ఎంతో కళ గా వున్నాడూ, కన్నయ్య రాగాలాపనకు హద్దులేమిటీ మరి. బాగుంది బాగా చేసుకున్నారా ఐతే కృష్ణాష్టమి. :-)
2010-09-05 03:40 AM శ్రీనివాసరాజు - సురుచి
అవును ప్రేమకు లొంగని దెవరు?
2010-09-05 02:32 AM Nagaraju - సినిమాటుడే
Hi,<br />Visit my Blog : http://gsystime.blogspot.com/<br /><br />This is having spiritual and general society information.<br />The way of thinking of thoughts are wonder with my intent to write the Blog.<br />I written from 2009 December onwards.<br />I wtitten in Telugu and English languages (In English few things are wrote).<br />Main Topics covered from Dec 2009 (Note: Important topics I
2010-09-04
2010-09-04 08:44 PM gajula - సురుచి
pashutvamtho polchukunte maanavatvam uniki lekundaa pothundi.gamaninchandi.
2010-09-04 06:31 PM suresh - Comments for తేట గీతి

చాలా బాగుంది…:)…enjoyed it….

“ఎవరైనా చూస్తే నాకు పిచ్చి అని ప్రచారం చేసేస్తారు. ఆ తరువాత ఆ ఇమేజ్‌కి సరిపోయేలా చారల డ్రాయరు వేసుకుని తిరగాల్సి వస్తుంది.”

2010-09-04 06:44 PM Anonymous - రెండు రెళ్ళు ఆరు
గౌతం గారు...మీ బ్లాగులొ తపాలు చదవక ఏడాది గడిచింది.<br /><br />ఇక నైన కరుణించి కటాక్షించండి
2010-09-04 03:42 PM భావకుడన్ - కృష్ణం వందే జగద్గురుం
కృష్ణాష్టమి రోజు మొదలెట్టారన్న మాట. <br />బ్లాగ్లోకానికి స్వాగతం శేషేంద్రగారు.
2010-09-04 01:39 PM కమల్ - మా గోదావరి
@భావన, చదువు వేరు వ్యక్తిత్వం వేరు, మీరు రెండిటిని ఒకేగాటన కట్టారు చదువు వలన వ్యక్తిత్వం పెరిగే అవకాశం ఉన్నది అంతే. ఈ విషయం గురించి పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాయొచ్చు, వాటికి అంతే ఉండదు చాలానే రాయాలని ఉన్నది కాని ఇది సరైన వేదిక కాదని మౌనంగా ఉన్నాను.<br /> ఇక పిల్లల ఆలోచనా పటిమ, విశ్లేషణల గురించి చాలా క్లుప్తంగా సత్యవతిగారు జవాబిచ్చారు, నేనైతే పేరాలు పేరాలు రాసుండేవాడిని, హమ్మాయ్య నాకా బాద
2010-09-04 01:31 PM శ్రీలలిత - సురుచి
అద్భుతంగా వుంది..
2010-09-04 12:51 PM Priya - మా గోదావరి
ఒక స్త్రీ ఇరవై నాలుగు చేతుల్ని కలిగి, ఒక్కో చేత్తో ఒకో పని-ఇంటిపని, పిల్లల పని, వంట పని, పొలం పని, పశువుల పని, ఉద్యోగం, నీళ్ళు తేవడం, వంట చెరుకు తేవడం, పెద్దల సంరక్షణ, బట్టలుతకడం, వాహనాలు నడపడం, నర్సులుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, అధికారులుగా, పోలీసులుగా, సైనికులుగా ఇలా ఎన్నో అవతారాల్లో అనుక్షణం పనిచేసే స్త్రీమూర్తి చిత్రమది. Memu kuda aa presentation ni chudagaligithe entha bagunnu ani
2010-09-04 12:07 PM Satyavati - మా గోదావరి
@జాబిల్లి ఎందుకమ్మా ముందు పెట్టిన కామెంట్ తీసేసావు.మన సమస్యని అర్ధం చేసుకోవడం,అధిగమించే ప్రయత్నం చేయడం చాలా మంచిది కదా.నీకు అభినందనలు.<br /><br />@కమల్ గారూ మీ ఆవేదన సరై<br />ందే.సోషల్ సైన్స్ జీవితానికి ఎంత అవసరమో గత పాలకులు మర్చిపోయారు.పిల్లల్లోని సృజనాత్మకతను అర్ధం చేసుకునే వాళ్ళు లేరు. ఎంసెట్ వేట లో ఏమి కోల్పోతున్నారో అర్థమవ్వడం లేదు.జీవితాన్ని మేనేజ్ చేసుకునే కళ,కళలు,సాహిత్యం అన్నీ
2010-09-04 09:47 AM దేవనకొండ ఓబుల్ రెడ్డి - మా గోదావరి
అంతా బాగానే ఉంది. కానీ మీరు వాళ్ళని మీలా ఆలోచించమని బహిరంగంగా బలవంతం చేస్తున్నట్లుంది. మీరక్కడ మాట్లాడడానికి వెళ్ళారు. వాళ్ళు వినడానికి వచ్చారు. అందుకే వాళ్ళెవరూ నోరు మెదపలేదు.ఆంతే తప్ప, వాళ్ళకేమీ తెలియదనుకోకూడదు. అదే, మీరు వాళ్ళల్లో వాళ్ళిళ్ళకెళ్ళి ఒక్కక్కరితోను సన్నిహితులై మాట్లాడగలిగితే వాళ్ళు మీకు చాలా చెప్పగలరు, మీ దృష్టికి రాని కోణాల గురించి. ఉదాహరణకి - దాడులకు గురయ్యే ఆడపిల్లలెవరూ
2010-09-04 06:11 AM Krishnapriya - మా గోదావరి
మీ టపా చాలా బాగుంది. మీ ఎక్స్ పీరియన్స్ చాలా బాగా వర్ణించారు. ముఖ్యం గా మీరు విద్యార్థులని ఆలోచింపచేసిన విధానం, వాళ్ళని చర్చ లోకి దింపిన పద్ధతీ.. Excellent! <br /><br /><br />పెద్ద సిటీల్లో ప్రొఫెషనల్ కాలేజిల్లో, విశ్వవిద్యాలయాల్లో.. కూడా ఇంతే నంటారా? మీరెన్నుకున్న కాలేజ్ లోనే ఇలా ఉందేమో? (నా ఉద్దేశ్యాన్ని తప్పు గా అర్థం చేసుకోవద్దు.. ఒకవేళ ఇలాగ ఉన్నారు ఈ తరం వాళ్ళు అంటే.. ఒక దిశా, ఒక టార్గెట్
2010-09-04 05:58 AM భావన - మా గోదావరి
బాగుందండి ఐతే, మా జనరేన్ నుంచి ఇప్పటిదాకా ఏమి మారలేదన్నమాట. వేటు అదే వేట అదే నాటి కధే అంతా అంటారా? <br />కమల్ మరి అంత గా చదువువోరియంటెడ్ గా పెరిగిన పిల్లలకు ఈ బేడ్ హేబిట్స్ ఎలా అలవటు అవుతున్నాయి వాటికి పెద్దల పర్మిషన్స్ తోనే చేస్తున్నారా? గత పాతికేళ్ళు గా పిల్లల ఆలోచనా పటిమ ప్రపంచాన్ని అరచేతిలో చూడగలిగే సౌలభ్యం అందువలన విశ్లేషణా శక్తి పెరగలేదంటారా?
2010-09-04 01:21 AM lalithag - మా గోదావరి
మీరు కనీసం వారిని ఆలోచించేలా ఐనా చేస్తున్నారు.<br />పిల్లల జవాబులు ఇలా ఉంటాయని ఊహించలేదు. <br />అంతకన్నా ఊహించనిది మీరు వారిని ఆలోచించేలా చెయ్యడానికి చేసిన ప్రయత్నం.<br />వాళ్ళు ఇలా అన్నారు అనగానే ఏ లెక్చరు ఇచ్చామనో, ఇంకేదో చెప్తారని ఊహించాను.<br />ఎవరికీ మనం ఏమీ నిర్దేశించలేము, నిర్దేశించినా చేయించలేము కానీ ఆలోచింపచేస్తే కొంచెమైనా ప్రయోజనం కనిపించచ్చు.
2010-09-03
2010-09-03 06:47 PM కమల్ - మా గోదావరి
మీరు మంచి ప్రయత్నమే చేసారు గాని..ఒక విషయం మరిచిపోయారు. అసలు మీరెళ్ళి ఈకాలపు యువతకు మానవసంబందాలు, ఉద్వేగాలు, గురించి అడిగితే వారేమి చెప్పగలరు..? మన విద్యావిదానం, పిల్లల తల్లితండ్రుల మానసిక స్థితి ఎలా ఉన్నదో మీరు గ్రహించే ఉంటారు, గత 25 ఏళ్ళుగా మన విద్యావిదానం కేవలం ఒక జీవనభృతి దిశగా మాత్రమే సాగింది..! చదవంటే ఉద్యోగం కోసం సంఘంలో ఆర్థికంగా నిలబడడం కోసమే అన్నట్లు సాగింది..ఎక్కడ సోషియల్ సైన్స్ గురించి
2010-09-03 06:37 PM Phanindra - వేటూరి సుందరరామమూర్తి :: vETUri sundararAmamUrti - అవినేని భాస్కర్
Great, great! innaaLLaki ii blog modaleTTaaru. chaalaa santOsham. vETUri maraNam gurinci prastaavanatO modaleTTaDamtO aa vishayam gurtocci konta baadhaa kaligindi. chivariki aayana paadadhuuLi ayinaa taakagaligaam. antE mana bhaagyam anukOvaali. <br /><br />pOsT lO akkaDakkaDaa telugu tappulu konta ibbandi peDutunnaay. gamanincandi. <br /><br />vairamuttu paaTa kuuDaa goppagaa undi. renTinii
పైకిబ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish