2013-01-21
పని లేక..: అవే కళ్ళు!
2013-01-20
సృజన - అనుసృజన: ముసలోడూ సముద్రమూ
2013-01-19
శ్రీకృతి: ద్వైతాద్వైతం
హర్ష వీక్షణం: The Journey!
ఘంటసాల: ఘంటసాల గానంలో హిందోళ రాగ వైభవం - ఆఖరి భాగం
అక్షరం: (శీర్షిక లేదు)
2013-01-18
నేను-మీరు: ఒక కవిత నిదురిస్తుంది నా ఎదలో.....జమీలా నిషాత్
2013-01-17
జానుతెనుగు సొగసులు: మన ఆత్మీయ రాధాకృష్ణ గారు (Andhra Jyothi) కలకాలం యుద్ధ రంగములో కదను తొక్కాలని కోరుకుంటూ
2013-01-16
శ్యామలీయం: ఒద్దిక నుంటిని నేను విడచి పోవద్దని యడిగి యుంటిని నేను
2013-01-15
పని లేక..: చదువే ఒక రోగం!
2013-01-14
జానుతెనుగు సొగసులు: Eemaata Jan Issue - Some thoughts!
హర్ష వీక్షణం: Congratulations :)
2013-01-13
జానుతెనుగు సొగసులు: Gangster Squad Movie - A Short Review!
2013-01-12
ఘంటసాల: శ్రీశ్రీ ప్రబోధాత్మక గీతం 'పసిడి మెరుగుల బాలల్లారా' - ఘంటసాల, సుశీల గళాలలో 'ఆడ పెత్తనం' చిత్రం నుండి
కొత్త పాళీ: కర్నాటక సంగీతం - రాగాలు
2013-01-11
సత్యవాణి: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు !!
2013-01-08
శ్రీకృతి: (శీర్షిక లేదు)
2013-01-06
బ్లాగాడిస్తా!: జంతు ప్రపంచం
2013-01-03
గోదావరి: మతిస్థిమితం లేని రాజకీయ నాయకులు
2013-01-01
కొత్త పాళీ: నా కొత్త కథ: మంచుగూడు
కొత్తావకాయ: గాలిసంకెళ్ళు
2012-12-31
స్వగతం: నూతన సంవత్సర శుభాకాంక్షలు
భాగ్యనగరం: 2012 in review of my blog
2012-12-29
కొత్తావకాయ: సగం మనుషులం..
2012-12-28
తెలుగుస్నేహితులు: ఎదురుచూస్తున్నాను
రామ-చిలక-పలుకులు: smaraNe ondE sAlade - Purandaradasa kriti , Malayamarutam
2012-12-27
కలానికి అమావాస్య...కాగితానికి పౌర్నమి....: (శీర్షిక లేదు)
e-తెలుగు: 27 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు కార్యక్రమాల నివేదిక
27 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసే క్రమంలో e-తెలుగు ప్రతి సంవత్సరం లాగానే ఒక స్టాలు తీసికొని నిర్వహించింది. ఈ సారి కూడా e-తెలుగు సభ్యులు, తెలుగు బ్లాగరులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి
నీలాంబరి: సంగీత సాహిత్య సమలంకృతే -I
భారతీయ సంగీతంలో రాగానికీ, భావానికీ, లయకూ సమానమైన ప్రాధాన్యత వుంది. అందమైన భావాన్ని పలికించి నిలబెట్టటానికి రాగమూ, లయా కలిసి పనిచేస్తాయి. ఈ సూత్రానికి సినిమా సంగీతమూ మినహాయింపు కాదు. ఎంత అద్భుతమైన భావమైనా, శ్రావయమైన సంగీతం లేకపోతే చెవులకి వినిపించదు. ఎంత అత్యాధునికమైన సంగీతంతో హోరెత్తించినా అందమైన భావనలేకపోతే మనసుకి హత్తుకోదు.
మరీ ముఖ్యంగా, సంగీతమే ప్రధానమైన అంశం గా వుండే సినిమాల్లో పాటలు మామూలు పాటాలకంటే మంచి స్థాయిలో వుంటాయని ఆశిస్తాం. తెలుగులో ఇలాటి సంగీత ప్రధానమైన సినిమాలెన్నో వొచ్చాయి, మంచి పాటలనందించాయి కూడా.
చాలా పాతవాటి సంగతేమో కానీ, ఎనభైల్లో వచ్చిన రుద్రవీణ (1988) సినిమాలోని పాటలు అన్ని విధాలా గొప్ప స్థాయిలో వున్నాయనిపిస్తుంది. నాకైతే ఈ సినిమాలో ముగ్గురు హీరోలని ఒక భావన. తెర మీద కనిపించేది చిరంజీవి అయితే, సీతారామ శాస్త్రీ, ఇళయరాజా తెర వెనక హీరోలు.
సినిమా కథకున్న రెండు పార్శ్వాలూ (సంఘ సంస్కరణా, శాస్త్రీయ సంగీతమూ), నటీ నటుల నటనా, మనసుని తట్టి లేపే డైలాగులూ అన్నీ కలిపి సినిమాని చిరంజీవి కున్న గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలబెట్టాయి. అయితే ఈ సినిమాలో సంగీతం గురించి మాట్లాడుకోవటానికే చాలా వుంది. కేవలం పాటాలూ, నేపథ్య సంగీతం కొరకే ఈ సినిమా నేను లెక్క లేనన్ని సార్లు (ఈ మధ్యనే మళ్ళీ ఇంకొక సారి) చూసాను. తరచి చూస్తే ఇందులో మూడు పొరలు కనపడతాయి.
——————————————
అ) తేలికగా వున్నా, లోతైన సాహిత్యంతో కూడిన పాటలు, “చుట్టు పక్కల చూడరా చిన్నవాడా”, “తరలి రాద తనే వసంతం“, “నమ్మకు నమ్మకు ఈ రేయినీ,”"రండి రండీ, దయ చేయండీ,” పాటలు.
ఆ) రెండో పొరలో సందర్భానుసారంగా వచ్చే చిన్న చిన్న బిట్స్, “తులసీదళములచే“, “అలకలల్లల్లాడగ“, నాద స్వరంలో “ఖరహరప్రియ“, “సహాన“, ఆఖర్న బిళహరి రాగంలో “పరిదానమిచ్చితే” మొదలైనవి.
ఇ) అన్నిటికంటే సంగీత పరంగా సోఫిస్టికేటేడ్ గా వినిపించేవి, పూర్ణ చంద్రిక రాగంలో “మానవ సేవ ద్రోహమా“, లలిత రాగంలో “లలిత ప్రియ కమలం విరిసినదీ“, బిళహరి రాగంలో “నీతోనే ఆగేనా సంగీతం“ పాటలు.
———————————————————————
“ఏదీ సొంతం కోసం కాదను సందేశం” ముఖ్య ఉద్దేశ్యమైన కథలో, మొదటి పాటే కథానాయకుని పాత్రలో కీలకమైన మలుపు తెస్తుంది.
“స్వర్గాలను గెలిచెయ్యాలని,
వడిగా గుడి మెట్లెక్కేవు,
సాటి మనిషి వేదన చూసి
జాలి లేని శిలవైనావు,” అని వీపున చరచి అతన్ని అంతర్ముఖున్ని చేస్తుంది.
ఆ తరవాత వచ్చే “తరలి రాద తనే వసంతం“ సంగీత పరంగా, సాహిత్య పరంగానూ మామూలుగానే వున్నా, కథానాయకుని స్వగతం లా అనిపిస్తుంది.
“ఇది తెలియని మనుగడ కథ, దిశ ఎరుగని పయనము కద,” అని కథకూ, తన వ్యక్తిత్వానికీ దిశా నిర్దేశనం చేసుకుంటున్నాడా, అనిపిస్తుంది. “హంసధ్వని” లాటి బరువైన రాగంలో తేలికగా వొదిగిపోయిందీ పాట.
“నమ్మకు నమ్మకు ఈరేయినీ“ పాటకి కూడా పెంటాటొనిక్ హిందోళాన్నే వాడారు ఇళయరాజా, బహుశా ఈస్తటిక్ ప్లెజర్ కోసమేమో.
“వెన్నెలలోనీ మసకలలోనే మసలును లోకం అనుకోకు,
రవి కిరణం పడితేనే తెలియును తేడాలన్నీ,”
“పుడమిని చూడని కన్నూ నడపదు ముందుకు నిన్నూ” అనే లైన్లు చాలా లోతుగా అనిపిస్తాయి.
ఏవో అందమైన ఆభరణాలు ధరించి రాజ ప్రసాదంలో గంభీరంగా కూర్చున్న గొప్పింటి స్త్రీలా అనిపించే శాస్త్రీయ సంగీతాన్ని, మామూలు అమ్మాయిలా చిన్న బొట్టు పెట్టి, జడ అల్లి అందరి మధ్యలో కూర్చోబెట్టినట్టు అనిపిస్తుంది, “రండి రండి రండీ, దయ చేయండీ,” పాట వింటుంటే. ఎవరి అందం వారిదే కదా?
“మాకు నిలయ విద్వాంసులు చిలక రాజు గారు,
కీరవాణి వీరి పేరు, పలుకు తేనెలూరు“ అన్న మాటల్ని కీరవాణి రాగంలో,
“తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారూ“ అన్న వాక్యాన్ని దర్బారు లోనూ,
“శునకమైన పలుకు కనకాంగి రాగాన,” అన్న వాక్యాన్ని కనకాంగిలోనూ విన్నప్పుడు, శాస్త్రీ, రాజా ఇద్దరూ సమ ఉజ్జీలే అనిపించింది. పప్పన్నం లో అప్పడాలు నంచుకున్నట్టు స్వరాక్షరాలూ, శ్లేషలూ సరే సరి.
“మాటలనే సంగతులు చేయటం, సంగతులనే సద్గతులనుకొనటం,
సరిగా, సరిగా, సరి సరి సరిగా తెలుసుకొన్నాను ఈనాడు.”
“కళ్ళ ముందు కటిక నిజం,
కానలేని గుడ్డి జపం,” అన్న ఎద్దేవాతో మొదలైన కథానాయకుని ప్రస్థానం,
“నిలువునా నన్ను కమ్ముకున్నాయి,
శాంతితో నిలవ నీయకున్నాయి,
ఈ చీకటి తొలగించాలి, ఈ అపశృతి సవరించాలి,
జన గీతిని వద్దనుకుంటూ, నాకు నేనె పెద్దనుకుంటూ
కలలో జీవించను నేను, కలవరింత కోరను నేను,” అన్న తెగింపుతో
ఒక నిర్ణయానికొస్తుంది! (చెప్పాలని వుంది, గొంతు విప్పాలని వుంది). ఆ పాట క్లైమాక్స్ లో కేవలం మృదంగ ధ్వని తోనే అంత టెన్షనూ, ఆవేదనా పలికించొచ్చని మొదటిసారి తెలిసింది.
(సశేషం)
2012-12-21
భాగ్యనగరం: దున్నపోతీయం–రెండవభాగం
2012-12-17
అలలపై కలలతీగ(జాన్ హైడ్ కనుమూరి): ఒకానొక కోరిక
2012-12-16
సృజన - అనుసృజన: “కొంటె బొమ్మ సాహసాలు” పుస్తకం – 27వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో.
తెలుగుసినిమా చరిత్ర: దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి
తెలుగుసినిమా చరిత్ర: వెండితెరపై 'యమ'ముద్ర..!
2012-12-15
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): సతీష్ చందర్ కవిత్వం - పంచమ వేదం
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): కె. శివారెడ్డి కవిత్వం - కవిత
2012-12-14
సం"గతులు" (జాన్‌హైడ్ కనుమూరి): చెరబండ రాజు - కవిత్వం - పాట
నీలాంబరి: వికటించిన హాస్యం
హాస్యం చాలా సున్నితంగా వుండాలన్న విషయం అందరికీ తెలిసిందే. మాటలతో నైనా, చేతలతోనైనా ఎవరినైనా వుడికిస్తే, ఆ తర్వాత ఆ సంగతి ఎప్పుడు తలచుకున్నా నవ్వు రావాలి. “అతి సర్వత్ర వర్జయేత్” అన్న సూక్తి హాస్యానికి వర్తించినంతగా ఎక్కడా వర్తించదేమో.
ఈ మధ్య నే జరిగిన నర్సు జసింతా సల్దానా విషాద ఉదంతం వింటే ఇదే అర్ధమవుతుంది. ప్రపంచమంతటా మీడియా చేసే అతి వికృత రూపాలు దాలుస్తుందేమో అన్న అనుమానం రాక మానదు ఈ ఉదంతాన్ని పరిశీలిస్తే. ఇంతకీ జరిగిందేమీటంటే-
అసలే ఆస్ట్రేలియన్లకి రాణి గారన్నా, ఆవిడ పరివారమన్నా మహా మోజు. ఇంగ్లండులో కూడా Queen’s birthday అనే సెలవుండదు, కానీ ఆస్ట్రేలియాలో మాత్రం వుంటుంది. అలాటిది ఇహ ఏకంగా రాణీ గారి మనవరాలి వేవిళ్ళ సంగతి గురించి అడగాలా. అబ్బో, హంగామా, వార్తలూ, వ్యాఖ్యలూ, పులకరించిపోవడాలూ, చెప్పలేని ఓవరాక్షనూ! అసలే మీడియా, దానికి తోరుగు రాచరికపు గర్భం. ఇహ చూడండి, ఆస్ట్రేలియాలో మీడియా రెచ్చిపోయింది. “డచెస్ఆఫ్ కేంబ్రిడ్ద్జీ”, మరియూ ప్రిన్స్ విలియం ముద్దుల భార్యా అయిన కేట్ వచ్చే తొమ్మిది నెలల్లో వేసుకోబోయే గౌన్ల దగ్గర్నించి, ఆవిడ మంచి తల్లి కాగలదా అనే విషయం వరకూ పేపర్లు హోరెత్తిస్తున్నాయి. మేమూ ఏం తక్కువ లేదనుకుంటూ రేడియో కూడా రంగంలోకి దిగింది.
ఈ నెల మూడో తారీఖున యువరాణి కేట్ కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్ లో డీహైడ్రేషన్ తో చేరారు. మర్నాడు ఆస్టేరియో అనే మీడియా సంస్థ అధీనంలో వుండి, సిడ్నీనించిప్రసారమయ్యే టుడే ఏఫ్ ఏం (2DayFM) అనేరేడియో చానెల్లో వచ్చే బ్రేక్ ఫాస్ట్ షో జాకీలు మెల్ గ్రెగ్, మైకెల్ క్రిస్టియన్ ఆస్పత్రి కి ఫోన్ చేసారు. రేడియోజాకీలుమామూలుమనుషులనిటెలిఫోనులోపిలిచిరకరకాలుగాఏడ్పించడంఎప్పణ్ణించోవున్నదే. ఇదీఅలాటిఅల్లరిఫోన్కాలే. అన్నట్టుమెల్గ్రెగ్దిమావూరే, అడిలైడ్!
వీలైనంతగా ఇంగ్లీషువారి యాస ననుకరిస్తూ అస్పత్రిలో ఫోనెత్తిన నర్సు జసింతాతో, క్వీన్ ఎలిజబెత్ నిమెల్గ్రెగ్, అటుపిమ్మట ప్రిన్స్ చార్లెస్ నిమైకెలూ అనుకరిస్తూ యువరాణీ గారి ఆరోగ్యం గురించి వాకబు చేసారు. పాపం ఆ అమాయకురాలు వారి ఫోన్ ని ఆస్పత్రిలోని వార్డులొకి ఇచ్చింది. అక్కడ నర్సు ఇంకా అమాయకంగా ఫోన్లో అమ్మాయిగారి పరిస్థితి పూస గుచ్చినట్టు చెప్పింది.
ఇద్దరూపొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ, సంభాషణంతారికార్డు చేసి ప్రసారం చేసే ముందు పై అధికారులకి పంపారు. అప్పటివరకూ ఇది రేడియో జాకీలు చేసే మామూలు అల్లరే, కొంచెంశృతి మించినట్టుగా అనిపించింది.
కానీ, ఆసంభాషణని ప్రసారం చేసే ముందు ఇంగ్లండులోని కింగ్ ఎడ్వర్డు ఆస్పత్రి అనుమతీ, రాణీగారిపరివారం అనుమతీ ఏదీ తీసుకోకుండా, ప్రోటోకాల్స్అన్నీ బేఖాతరు చేసి రేడియో ఈ సంభాషణని ప్రసారం చేసింది. ఆతర్వాత రెండు రోజులకి నర్సు జసింతా సల్దానాహాస్పిటల్స్టాఫ్ గదిలో చచ్చిపోయి పడి వుంది. ఇద్దరుపిల్లలతల్లిఆత్మహత్యచేసుకుంది. వెంటనేఇద్దరు జాకీల షోను రద్దు చేయటమూ, వాళ్ళఉద్యోగాలు ఊడటమూ, 2DayFM సొంతదారు ఆస్టేరియో కీ ఆస్పత్రికీ మధ్య మాటల యుధ్ధాలూ, దుమ్మెత్తిపోసుకోవటాలూ, సందట్లోసడేమియా అని సోషల్ నెట్ వర్క్ గ్రూపులు జాకీల మీద కారాలూ మిరియాలూ నూరడాలూ, అన్నీమామూలే. బకింగ్హాంపాలెస్నించిదీనిగురించిఇంతవరకూఎటువంటివ్యాఖ్యానమూ, వివరణారాలేదు.
అసలుఈ విషాదం లో తప్పెవరిది? బాధితులెవరు? అంటేఏమో అర్ధం కావడం లేదు. ఇప్పుడుఆ రేడియో జాకీలని” సంస్కారంతెలియని హీనులు“, “రక్తంతో మీ చేతులు తడిసాయి,” అనితిడుతున్న వాళ్ళే , ఇంకొకరోజు అంతకంటే చెత్త ప్రాక్టికల్ జోకుకి పడీ పడీ నవ్వుతూ రేటింగులు పెంచేస్తారు. ఆరేటింగుల కోసం మళ్ళీ, మళ్ళీతమ హద్దులు మర్చిపోతారు రేడియో జాకీలు. ఇదేసంస్థ వారిఇంకొకరేడియోజాకీకైల్ సాండిలాండ్స్ ఇలాటి వివాదాలకు పెట్టింది పేరు. పదహారేళ్ళఅమ్మాయిని అసభ్యమైన ప్రశ్నలు వేసి వేధించాడని అతని మీద వేటు పడింది.
చిన్నపిల్లలముద్దు మాటలూ, అల్లరిచేష్టలూ చూసి మనం నవ్వినప్పుడు వాళ్ళు అవి ఇంకా ఎక్కువ చేస్తారు. అదిఎక్కడ ఆపాలో వాళ్ళకి అర్ధం కాదు, తెలియదూ! ఎక్కడోఒక దగ్గర పెద్దలకి కోపం రాగానే మొహం చిన్న బుచ్చుకుంటారు. మీడియాఆంకర్లదీ అదే తంతేమో. హాస్యానికీ, అసభ్యతకీమధ్య వున్న సన్నని గీత ప్రేక్షకుల హర్ష ధ్వానాల మధ్య వాళ్ళకి కనబడదు. హద్దుదాటింతర్వాతగానీతెలియదు. అప్పటికేజరగాల్సినహానిజరిగిపోతుంది.
తప్పెవరిదైనా, మూడుజీవితాలు అన్యాయంగా పాడైపోయాయి. నిన్నరాత్రి మెల్, మైకెల్ఇద్దరూ కన్నీళ్ళతో, ఇలాజరుగుతుందని మేమేమాత్రమూఊహించలేదని చెప్పారు.
“అసలుమమ్మల్నెవ్వరూ నమ్మరు, ఎవరోఫోన్ పెట్టేస్తారనుకున్నాము కానీ, ఇంతవరకూవొస్తుందనుకోలేదు,” అన్నారిద్దరూ. ఏదిఏమైనాప్రపంచమంతటామీడియా, సామాన్యప్రజలజీవితిల్లోకిఎంతవరకుచొచ్చుకొనిరావటంమంచిదిఅన్నవిషయంమీదసరైనఅవగాహనా. కొంచెంస్వయంనియంత్రణాఅలవర్చుకోకతప్పదు.
2012-12-12
గోదావరి: కుల దృవీకరణ ధరఖాస్తు పూర్తి చేసారా ?
2012-12-09
బ్లాగాడిస్తా!: క్రిష్ ఆడిన నాటకం - కృష్ణం వన్దే జగద్గురుమ్
మురళీకృష్ణ గారికి:
రచయితలే కలిసి ఇలా పుస్తక పరిచయ సభలు ఏర్పాటు చేసుకోవడం అన్న ఆలోచన చాలా బాగుంది. ఈ చిన్న ప్రకటనలో ఉన్న టైపోలు మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టాయి. కొంచెం సరిచూసుకోండి… (పాథకులు..పాథకులు అని అన్నిసార్లు చదువుతూ ఉంటే…ఏదో మేము పాతాళ వాసులం అన్నట్లు తోచింది నాకు!)
http://www.koumudi.net/Monthly/2013/january/jan_2013_pustakaparichayam.pdf
ధన్యవాదములండీ
Thanks
chala bagunai mee kavithalu
I agree with you, tRshNa gArU.