2010-09-08
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on current Events: పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan Cricket Team)
Chandu --Neninthe: అబే ఓ ఇంగ్లిష్ మీడియం
అనంతం (∞): నేను చదివిన / చదవాల్సిన ఇంగ్లీష్ నవలలు
రచన - The Creation: Nitro PDF Reader - పీడీఎఫ్ రీడర్, క్రియేటర్, టెక్స్ట్ కన్వర్టర్, ఇంకా ఎన్నో ....
గడ్డిపూలు: Id - Munshi Premchand
2010-09-07
రచన - The Creation: EASEUS Todo Backup - ఉచిత బ్యాక్అప్ / రీస్టోర్ సాప్ట్‌వేర్ ...
రచన - The Creation: వ్యవసాయదారుల కోసం కిసాన్ కాల్ సెంటర్
అంతర్యానం: కాషాయ తీవ్రవాదం - కారణాలు
2010-09-06
వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జిGeneral Knowledge in Telugu on current Events: బ్రహ్మోస్ క్షిపణి (Brahmos Missile)
ఆమని కోయిల: స్కూలు జీవితం
2010-09-05
Viplava Sandesam: Facebook (11) | Videos Posted by Satish Kumar Bhandari: Gujarat the State of our Vision
2010-09-04
తెలుగు పాటలు: సఖియ : నన్నొచ్చి తాకింది ఓ మెరుపులా
2010-09-03
జాహ్నవి: కన్నయ్యా......
AVS POST .....: వర్మ గారొక మర్మయోగి .
రిషి: S.M.S
Chandu --Neninthe: వర మంటి మనసే పొంది విసిరేసు కుంటానంటే పరిహాస మవదా జీవితం
2010-09-02
రిషి: మా ఇంట్లో కృష్ణాష్టమి
గడ్డిపూలు: అప్రస్తుతం !
ఆమని కోయిల: కాలం
తూర్పు-పడమర: తన్హాయి-24
2010-09-01
తెలుగు పద్యం: గ్లోబల్ దేవుడు గోవిందుడే!
తూర్పు-పడమర: తన్హాయి-23
2010-08-31
నువ్వు-నేను-మనం: దేవుళ్ళూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే!
2010-08-28
క్రిక్కెట్ బబ్లూ: రిక్కి పేంటింగ్......
తూర్పు-పడమర: తెలంగాణా ఉద్యమ గొంతుక మధుప్రియ !
2010-08-27
నా మదిలో ..: స్త్రీ
2010-08-26
2010-08-25
వేణుగానం: వంద మంచి పుస్తకాలు
నేను చదివిన పుస్తకాలలో నాకు నచ్చినవి, చదవడం వలన నాకు తృప్తినిచ్చినవి అయిన పుస్తకాలను జ్ఞాపకం చేసుకుంటూ ఒక list రాయగా అవి సుమారు ఒక వంద దాకా వచ్చాయి. నా personal library చూసి రాస్తే ఈ సంఖ్య మరికొంత పెరిగేదేమో. ఇందులో మొదట పేర్కొన్న కొన్ని గ్రంథాలు మాత్రం Highly recommended. ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన పుస్తకాలవి.
నేను ఈ బ్లాగులో ‘మంచి పుస్తకం’ శీర్షికతో నేను చదివిన వాటిలో కొన్ని మంచి పుస్తకాలను పరిచయం చేశాను. ఆ పని నా మిగతా ప్రోజెక్టులలాగే తాత్కాలికంగా ఆగిపోయింది. ఆ పని తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తానో, ఆ శీర్షిక ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేను. అందాకా ఈ లిస్ట్ చూడండి. నేను ఎప్పటికి పరిచయం చేసినా కూడా అవి దాదాపూ ఈ పట్టికలోనివి మాత్రమే అయి ఉంటాయి.
1.భగవద్గీత-శిష్ట్లా సుబ్బారావు వ్యాఖ్యానం
2.భారతజాతికి నా హితవు-స్వామి వివేకానంద
3.Glimpses of World History- Jawaharlal Nehru
4.ఆత్మకథ-మహాత్మా గాంధి
5.యం.యన్.రాయ్ స్వీయగాథలు
6.ఆత్మవికాసము (self unfoldment)-స్వామి చిన్మయానంద
7.The Prince- Machiavelli
8.Letters to His Son-Lord Chesterfield
9.The 48 Laws of Power-Robert Greene
10.The Art of Seduction-Robert Greene
11.The 33 Strategies of War-Robert Greene
12. The Art of Love-Ovid
13.The Art of War-Sun-Tzu
14. రాజయోగం-స్వామి వివేకానంద
15.శ్రీమదాంధ్ర మహాభారతం-పిలకా గణపతి శాస్త్రి
16.స్తోత్ర రత్నావళి-వివిధ దేవతా స్తోత్రాల సంకలనం
17.చలం-బిడ్డల శిక్షణ
18.భర్తృహరి సుభాషితాలు-ఏనుగు లక్ష్మణకవి (అనువాదం)
19.గీతగోవిందం-భక్త జయదేవుడు
20.శ్రీమద్భాగవతం-భక్త పోతన
21. భారతజాతీయ పునరుజ్జీవనం
22.వీరభారతం-పురిపండ అప్పలస్వామి (1857 తిరుగుబాటు)
23.మన చరిత్ర- ఏటుకూరి బలరామమూర్తి
24.ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర-ఏటుకూరి బలరామమూర్తి
25.భారతీయ సంస్కృతి– ఏటుకూరి బలరామమూర్తి
26.ఉపనిషత్ చింతన-ఏటుకూరి బలరామమూర్తి
27.సాధన రహస్యం-అనుభవానంద స్వామి
28.రాహుల్ సాంకృత్యాయన్ జీవిత చరిత్ర-ఓబుల్ రెడ్డి
29.విశ్వదర్శనం-నండూరి రామమోహనరావు (ప్రాచ్య, పాశ్చాత్య తత్త్వశాస్త్రాల పరిచయం)
30.స్వీయచరిత్రము-కందుకూరి వీరేశలింగం
31.కన్యాశుల్కం-గురజాడ అప్పారావు
32.లెనిన్ జీవిత చరిత్ర-మరియా ప్రిలెజాయెవ
33.విప్లవపథంలో నా పయనం-పుచ్చలపల్లి సుందరయ్య
34.వీర తెలంగాణ-రావినారాయణ రెడ్డి
35. కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక-మార్క్స్ మరియు ఎంగెల్స్
36. రాజ్యం-విప్లవం-లెనిన్
37.The Great Road-Agnes Smidely (చైనా నాయకుడు జనరల్ ఛూటే జీవిత చరిత్ర)
38.Red Star Over China-Edgar Sno
39.అమ్మ-మాక్సిం గోర్కి
40.అసమర్థుని జీవయాత్ర-త్రిపురనేని గోపీచంద్
41.చివరికి మిగిలేది-బుచ్చిబాబు
42.ప్రాంచీల బూచి ‘బుస్సీ’-పులిచెర్ల సుబ్బారావు (ఫ్రెంచి సేనాని బుస్సీ చరిత్ర)
43.భారతదేశ స్వాతంత్ర్య సమరం-బిపిన్ చంద్ర
44.ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర-రఘునాథరావు
45.ఆధునిక ప్రపంచ చరిత్ర-తెలుగు అకాడమి (B.A.,పాఠ్య గ్రంథం)
46.ఆధునిక భారతదేశ చరిత్ర-HBT ప్రచురణలు
47.మధ్యయుగ భారతదేశ చరిత్ర-తెలుగు అకాడెమి ప్రచురణ
48.ఏడుతరాలు-అలెక్స్ హేలీ
49.సత్యాన్వేషి చలం-వాడ్రేవు వీరలక్ష్మి దేవి
50.ప్రవహించే ఉత్తేజం-చెగువెరా జీవితచరిత్ర
51.మైదానం-చలం
52.జీవితాదర్శం-చలం
53.మ్యూజింగ్స్-చలం
54.స్త్రీ-చలం
55.చలం-చలం ఆత్మకథ
56.తారాపథం (ఆకాశంలో కనిపించే నక్షత్రాలు, రాశులు, గ్రహాల గురించి)
57.జైభవానీ! జైశివాజీ! -పులిచెర్ల సుబ్బారావు (ఛత్రపతి శివాజి చరిత్ర)
58.సైతాన్ కా బచ్చా!-పులిచెర్ల సుబ్బారావు (మొఘల్ రాజ కుటుంబం యెడల గులాంఖాదిర్ అకృత్యాలు)
59.ఓల్గా సే గంగా-రాహుల్ సాంకృత్యాయన్
60.లోకసంచార శాస్త్రం-రాహుల్ సాంకృత్యాయన్
61.పురిపండా భారతం-పురిపండ అప్పలస్వామి
62.పురిపండ రామాయణం- పురిపండ అప్పలస్వామి
63.పురిపండ భాగవతం- పురిపండ అప్పలస్వామి
64. వాత్సాయన కామసూత్రాలు
65.You Can Win-Shiv Khera
66.The Magic of Thinking Big
67.The Monk Who Sold His Ferrari-Robin Sharma
68.Mega Living-Robin Sharma
69.Who Moved My Cheese
70.Stop Worrying and Start Living-Dale Carnegie
71.How to Win Friends and Influence People- Dale Carnegie
72. Chicken Soup for The Soul
73.నేను-నాదేశం-దర్శి చెంచయ్య (గదర్ పార్టీలోని ఏకైక దక్షిణభారతీయుడు)
74.మహాప్రస్థానం-శ్రీశ్రీ
75.కృష్ణపక్షము-దేవులపల్లి కృష్ణశాస్త్రి
76.ఎంకిపాటలు-నండూరి సుబ్బారావు
77.శ్రీనాథుని చాటువులు-పోలవరపు కోటేశ్వరరావు సంకలనం
78.విజయనగరపతనం-ప్రసాద్
79.ఖారవేలుడు (ప్రాచీన కళింగ రాజు)
80.పుష్యమిత్ర
81.ఆర్య చాణక్య-ప్రసాద్
82.యుగంధర (కాకతీయ ప్రతాపరుద్రుని మంత్రి)-ప్రసాద్
83.సిరాజుద్దౌలా-ప్రసాద్
85. తెలంగాణా సాయుధ పోరాటం-ఆరుట్ల రామచంద్రా రెడ్డి
86.హెడ్గేవార్ జీవిత చరిత్ర (ఆర్.యస్.యస్.స్థాపకుడు)
87.స్వామి వివేకానంద జీవితచరిత్ర-రామకృష్ణ మఠం ప్రచురణ
88.తెలుగు సామెతలు
89.బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఆత్మకథ
90.గారీబాల్డి జీవిత చరిత్ర (ఇటలీ స్వాతంత్ర సమరయోధుడు)
91.తపోవన స్వామి ఆత్మకథ (స్వామి చిన్మయానంద గురువు)
92.సక్సెస్ మేనేజ్‌మెంట్-కంఠంనేని రాథాకృష్ణమూర్తి
93.రాళ్ళు-రప్పలు-తాపీ ధర్మారావు ఆత్మకథ
94.దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు?-తాపీధర్మారావు
95.విజయవిలాసం-తాపీవారి వ్యాఖ్య
96.మహాభగవద్గీత-ఏర్పేడు ఆశ్రమ ప్రచరణ
97.గీతామకరందం-స్వామి విద్యాప్రకాశానంద గిరి
98.మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు-యస్.బి.రఘునాథాచార్య
99.శ్రీమద్భగవద్గీత-రావుల సూర్యనారాయణ మూర్తి
100. పాంచజన్యం-మాధవ సదాశివ గోల్వల్కర్ (బైబిల్ ఆఫ్ ఆర్.యస్.యస్.)
Filed under: Uncategorized
నువ్వు-నేను-మనం: అనురాగ బంధం - రాఖీ
2010-08-24
క్రిక్కెట్ బబ్లూ: రౌడీల రాజ్యం....
2010-08-22
తెలుగురథం: (శీర్షిక లేదు)
2010-08-20
గడ్డిపూలు: ప్రపంచ దోమల దినం.
2010-08-19
అనంతం (∞): నమ్మకం మీద నమ్మకం
మీరు చదివారా?: ఒక సోంపేట – కొన్ని గుణపాఠాలు
గత రెండు దశాబ్దాలుగా సర్దార్ సరోవర్ డ్యామ్ కు వ్యతిరేకంగా గిరిజనులను, ఆదివాసులను, రైతాంగాన్ని, పర్యావరణవాదులను, మానవహక్కుల పోరాటకారులను ఏకతాటిమీద నిలబెట్టి ఉద్యమ సారధ్యం చేస్తున్న మేధాపాట్కర్ శ్రీకాకుళం జిల్లా సోంపేట పోలీసుల కాల్పులలో హతులైన వారి కుటుంబాలను పరామర్శించడానికి వచ్చినపుడు యాదృచ్ఛికంగా ఆ రోజే చనిపోయిన వారికి ఆ కుటుంబీకులు పెద్ద కర్మ చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ, అరాజకీయ దన్నులు లేకుండా ప్రజలే నడుపుకొంటున్న ఈ ఉద్యమాన్ని చూసి నివ్వెరపోయిన ఆమె విస్తుపోతూ ఉద్యమకారులకు నీరాజనాలు పలికారు. నాలుగు దశాబ్దాల కిందట రైతాంగ ఆదివాసీ ఉద్యమాలకు ఉగ్గుపాలు పోసి ఓనమాలు దిద్దించిన మహత్తర శ్రీకాకుళ పోరాటం మరో కొత్త రూపంలో దేశవ్యాప్తంగా ప్రజాఉద్యమాలకు కొంగొత్త సందేశాలను మోసుకుపోవడానికి సిద్ధమైంది.
రాజకీయ పార్టీల దన్నులేదు
నిజానికి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజానీకానికి రాజకీయ పార్టీల
మద్దతు లేదు. ముందునుంచీ కాంగ్రెస్ పార్టీ దేవతావస్త్రాలవంటి అభివృద్ధి నమూనాకు మొగ్గు చూపిస్తోంది. తెలుగుదేశం పార్టీ బృందం తరపున మాజీ పార్లమెంట్ సభ్యులు హతులైన రైతు కుటుంబీకులను పరామర్శిస్తూ ‘ప్రజల సందేహాలను తీర్చకుండా ప్లాంటులు నిర్మించడం దారుణమ’ని శెలవిచ్చారు. పాపం కొత్తగా రాజకీయాలలో చేరిన స్థానిక యువ ఎమ్మెల్యే ప్రజల గుండె చప్పుడు ఆలకించి ప్రజాబాహుళ్యపు గొంతుగా నిలబడి ఎన్ సి సి (నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ) నిర్మాణాన్ని వ్యతిరేకించినప్పటికీ ఆ పార్టీలో ఆయన వాదన వినే నాధుడు కరువయ్యాడు. ఇక కమ్యూనిస్టుల సంగతి చెప్పనక్కరలేదు. ఎక్కడైనా తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అనేవారిని ఏమంటారో మనకు తెలియదు గాని, మన రాష్ట్రంలో కమ్యూనిస్టులని అంటారని చిన్నపిల్లలని అడిగినా చెప్పేస్తారు. ఎప్పటికప్పుడు స్నేహాలు మారుస్తూ, అప్పటికి మిత్రపక్షాలు ఏమి మాట్లాడితే వాటినే తమ మాటగా చెల్లుబాటు చేసుకుంటున్న కమ్యూనిస్టు పార్టీలు సైతం ఇక్కడి ఉద్యమ శ్రేణులకు మద్దతు పలికింది లేదు. ఇక ప్రజారాజ్యం పార్టీ గురించి శ్రీకాకుళం జిల్లావరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. గమ్మత్తుగా ఇతర విప్లవ పార్టీలు సైతం ఏకమొత్తంగా ప్రభుత్వం చేసే పనులన్నింటినీ వద్దంటున్నాయే గాని, సమగ్ర ప్రత్యామ్నాయ పథకమేమీ ప్రజలకు ఇంతవరకూ వివరించలేదు. ఇదంతా పోలీసు కాల్పులు జరిగిన ముందురోజు వరకు పరిస్థితి. పోలీసు కాల్పులు జరిగిన తర్వాత పార్టీలన్నీ పరిస్థితి తీవ్రతను గుర్తించాయి. ప్రజల హృదయస్పందన తెలుసుకుంటున్నట్టు నటిస్తున్నాయి. ఏవేవో సన్నాయిరాగాలు ఆలపిస్తున్నాయి. కానీ పాలకపక్షం ఇప్పటికీ ససేమిరా అంటుందనుకోండి.
కళ్లు తెరిపించిన పోలీసు కాల్పులు
ఒక ప్రైవేటు కంపెనీ పునాది రాయి వేసుకోవడానికో, నిలువు గొయ్యి తవ్వుకోవడానికో సిద్ధమైనప్పుడు అన్ని వేలమంది పోలీసులు పహరా కాయడమేమిటని ఎక్కడెక్కడినుంచో పరామర్శలకు వస్తున్న మేధావులు, పర్యావరణ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. మావోయిస్టుల ఏరివేతకు బయల్దేరినప్పుడు కూడా అన్ని వేలమంది బలగాలను కేంద్ర ప్రభుత్వం మోహరించిందంటే నమ్మలేం. ఆవిధంగా మన పోలీసులకు పెట్టుబడిదారులకువున్న అవ్యాజానురాగాలతో కూడిన అమలిన అలౌకిక ప్రేమబంధాన్ని చూసిన వారందరూ సెంటిమెంటుతో కంటతడి పెట్టుకుంటున్నారు. పోలీసులతో పాటు ఎన్ సి సి కూడా ప్రైవేటు వ్యక్తులను పెద్దఎత్తున మోహరించిందని స్థానికులే ఫిర్యాదు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పోలీసులమీదే కాక, ప్రైవేటు వ్యక్తుల మీద, ముఖ్యంగా వాటిని ప్రజలకు నివేదిందాల్సిన నాలుగో స్తంభమైన జర్నలిస్టులమీద తిరగబడడం ప్రత్యేకంగా పరిశీలించాల్సిన విషయం. ఒక్కసారి పోళీసు కాల్పులు జరగగానే ప్రపంచం దృష్టిని సోంపేట ఆకర్షించగలిగింది. అప్పటికి దగ్గరదగ్గర మూడొందలు రోజులుగా దీక్షలు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్న ప్రజలను పట్టించుకున్న వారేరీ? అసలు అన్ని రోజులనుంచి ఉద్యమం నడుస్తున్నప్పుడు అణిచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నించలేదా? ఇలాంటి అనేక సందేహాలు మనకు రావడం సహజం.
అటునుంచి నరుక్కురండి
దేశ సహజవనరులను కొల్లగొడుతూ, స్థానిక ప్రజలను దోపిడీ చేయడానికి పూనుకున్న పెట్టుబడిదారీ వర్గం ఈ ప్రక్రియకు అభివృద్ధి అనే అందమైన పేరు పెట్టింది. ఆ అభివృద్ధి క్రమాన్ని వ్యతిరేకించేవారందరూ అభివృద్ధి వ్యతిరేకులు. ప్రగతి నిరోధకులు. ఈ అంశాలపై అప్పటికే ఆ ప్రాంతంలో చురుగ్గా తిరుగాడుతూ గ్రామగ్రామానా పర్యటించి అభివృద్ధి అసలు స్వరూపాన్ని ప్రజలకు వివరించి చైతన్య దీప్తిని వెలిగించింది దేశంలోనే పేరొందిన మానవ హక్కుల ఉద్యమకారుడు కె. బాలగోపాల్. ఉదతమీద చారలమాదిరిగా ఉద్దానం ప్రాంతంలో సముద్రతీర ప్రాంతం, మైదాన ప్రాంతం, అటవీ ప్రాంతం కలగలుపు చూడముచ్చటగా వుంటుంది. నిజానికి ప్రకృతి వనరులపై ఆధారపడి చాలా హాయిగా బతకొచ్చు గాని, ఆ ప్రకృతే అభివృద్ధి ఆటలో పావుమాదిరిగా స్థానికేతరుల సొంతమైనప్పుడు బతుకు తెరువుకోసం ఉద్దానం ప్రజలు దూరతీర ప్రాంతాలకు కాందిశీకులుగా వలసపోయాఋ. అలా వలసపోయిన ప్రజలు ప్రపంచం చూస్తుండడం వల్ల ఎక్కడ ఏం జరుగుతున్నదీ, ఇక్కడ ఏం జరగబోయేదీ తమవారికి ఎప్పటికప్పుడు తెలియజేస్తుండడం కూడా మనం మరవకూడదు. థర్మల్ పవర్ ప్లాంటుల వల్ల బీలభూములు పోయి తమ బతుకు ఎలాగూ బుగ్గికావడం తప్పనప్పుడు అనవసరంగా యాష్ పాండ్ (పవర్ ప్లాంటులనుంచి వచ్చే ప్రధాన కాలుష్యం బూడిదను ఉంచడానికి తీసే వందల ఎకరాల మడుగులు) లలో పడి చావడమెందుకని ప్రజలు తెగించిన ఫలితమే ఈ ఉద్యమం. అయితే హైదరాబాద్ స్థాయినుంచి డబ్బులు విరజిమ్ముతూ వచ్చిన పెట్టుబడిదారుడు స్థానిక పాలకుల వరకూ వచ్చి ఆగకుండా పత్రికల ప్రతినిధులను సైతం కొనుగోలు చేసారని నమ్మడమే సోంపేట సంఘటనలో ప్రజల కోపానికి కారణమని విజ్ఞుల విశ్వాసం.
ప్రభుత గొంతులో పచ్చి వెలక్కాయ
‘సరే ప్రజలకు కోపం వచ్చింది, దాని ఫలితం అనుభవించి చచ్చారు, అంతమాత్రాన మన అభివృద్ధి అజెండా నుంచి వైదొలగడం తెలివితక్కువతనమ’ని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ సోంపేటలో వెనక్కితగ్గితే ఇంకా ఇదే జిల్లాలో మరో ఎనిమిదివరకూ మర్చంట్ పవర్ ప్లాంటులు (అంటే ఇందులో కనీసం ఒక్క వాట్ విద్యుత్తయినా మనకు దక్కదు సరికదా, వారి ప్లాంటు నడపడానికి కూడా మన విద్యుత్తే కారుచవకగా పొందేవని అర్థం) నిర్మించ తలపెట్టిన ప్రభుత్వానికి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా పరిస్థితి తయారయ్యింది. తమ మనుగడకు కీలకాధారమైన పెట్టుబడిదారీ వర్గానికి ఏ సందేశం ఇవ్వదలచుకున్నారో ఇప్పుడు తెలియాలి. ఈ ప్రత్యేక సోంపేట సంఘటనలో ఎన్ సి సి కావలిస్తే నందిగ్రామ్ వ్యవహారంలో తోకముడిచిన టాటా కంపెనీ నుంచి గుణపాఠం నేర్చుకోవచ్చు. కానీ ప్రభుత్వం తన పెట్టుబడిదారి వర్గానికి ఏ సందేశం పంపదలచుకున్నదీ ఈ దెబ్బతో తేలిపోతుంది. అందుకే రెవిన్యూ, పునరావాస శాఖామాత్యులు మేకపోతు గాంభీర్యపు మాటలు ఎన్నో పలుకుతున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకునే ప్రభుత్వాలకు ఏం శాస్తి జరగనుందో సోంపేట యావత్ప్రపంచానికి విస్పష్టంగా చాటిచెప్పింది. తమలో చైతన్యం రాజేసిపోయిన అమరవీరులందరూ వారసత్వంగా తమకిచ్చిన ఉద్యమబాటను వీడలేమని అది తమ రక్తమాంసాలలోనే కూడ ఆత్మలో సైతం నివురుగప్పిన నిప్పులా ఇంకిపోయిందని ప్రకటించిన వేలాదిమంది ఏ జెండా మోయకుండా ఇతరేతర ఎజెండాలేమీ లేకుండా ఒకేరోజు ఒకచోటికి చేరి గొంతులు నినదించిన వేళ… ఈ ప్రపంచానికి, ముఖ్యంగా ప్రభుత్వం అభివృద్ధి అనుకుంటూ విర్రవీగుతున్న నమూనాను వ్యతిరేకిస్తున్న ఈ దేశపు అనేకానేక సమూహాలకు అందాల్సిన గుణపాఠం అందనే అందింది. ఇప్పటికైనా బీలప్రాంతంలో పవర్ ప్లాంట్ నిర్మాణం ద్వారా పర్యావరణానికి ఎంత తీవ్రమైన ముప్పు వాటిల్లనున్నదో గొంతెత్తి షోషిస్తున్న పర్యావరణ వేత్తల మాటలు మన నాయకవినాయకులు అలకించాలి.
నిజంగా ప్రజల దృష్టిలో అభివృద్ధి నమూనా అంటే ఏమిటో తెలుసుకోవాలంటే సదరు మంత్రివర్యులు ప్రజాశ్రేణులను కలవాలి. ఎవరి కాళ్లపై వారు నిలదొక్కుకుని, దేశప్రగతి నిలదొక్కుకునేలా చేయగలిగిన పరిశ్రమల బ్లూ ప్రింటులు అందిస్తాం. చేతనైతే వాటిని ప్రజలకు అందించాలి. పుబ్బలో పిట్టి మఖలో మాడిపోయే రాజకీయ జీవితం గడిపేకంటే ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయేలా తమ పాలనను మెరుగుపరుచుకునే అభివృద్ధి నమూనాలు ప్రజలవద్ద కూదా లభిస్తాయి.
(స్వల్ప మార్పులతో ఈ వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రిక 14.08.2010 (శనివారం) ఎడిట్ పేజీలో అచ్చయింది)
Filed under: మరింకేదైనా..






