2013-06-09
మాష్టారు: కర్ణాటకలో ఫలించిన ఇంకాం ఎత్తుగడ
జ్యోతిష్యశాస్త్రము- వాస్తవాలు: వృశ్చిక రాశి - ఫలితములు
చిన్ని ఆశ: మళ్ళీ ఎదురైతే...
జ్యోతిష్యశాస్త్రము- వాస్తవాలు: తులారాశి – ఫలితములు
2013-06-08
Gurukrupa: సర్వకార్య సిద్ధికి జయ మ౦త్ర౦
కినిగె బ్లాగు: చందనపు బొమ్మలే
వందేళ్ల తెలుగు కథల్లో నుంచి, ఆ రచయితల నుంచి స్వీకరించవలసినవీ పరిహరించవలసినవీ విజ్ఞతతో గ్రహించిన యువ రచయితలు ఇప్పుడు వస్తున్నారు. తమదైన తాత్విక దృక్పథంతో జీవితాన్ని పరిశీలించి దానికి తగిన శైలిలో రచనలు చేస్తూ వర్తమాన కథను వెలుగుదారిలో నడిపిస్తున్న వీళ్ల సంకలనాలు తెలుగు కథకు ఉజ్వల భవిష్యత్తును వాగ్దానం చేస్తున్నాయి. అరుణ పప్పు కథా సంపుటి ‘చందనపు బొమ్మ‘ ఈ కోవకు చెందినదే. ఇందులోని పది కథల్లో తొమ్మిది శిల్పపరంగా ఉత్తమ పురుషలో చెప్పినవి. వీటిలో కనిపించే ‘నేను’ ఒక విద్యావంతురాలూ ఉద్యోగినీ అయిన యువతి. వృత్తిరీత్యా సమాజంలో రకరకాల మనుషులను కలుసుకునే అవకాశమూ అవసరమూ ఉన్న జర్నలిస్టు. ముందుతరపు స్త్రీల పోరాటాలు సాధించిన హక్కులు, అవకాశాలను అందిపుచ్చుకుని ఆత్మగౌరవంతో తమ పనులకు తాము బాధ్యత వహించే యువతులు ‘నేను’ అంటూ ఈ కథల్లో మనకు కనిపిస్తారు. జర్నలిస్టులు కాకపోయినా దీప, పూర్ణ, మృణ్మయి, లాలిత్య వంటివాళ్లు వివేకవంతులు, ఆలోచనాపరులు, జీవన ప్రేమికులు. లోపల ఉండవలసిన సున్నితత్వాన్నీ సంవేదనలనూ కాపాడుకుంటూనే అవసరమైన చోట నిర్భయంగా నిలబడతారు. ఈ కథలన్నిటిలో వ్యక్తుల మధ్య సంబంధాల్లోని రకరకాల ఛాయలు, మానసిక సంఘర్షణలు ప్రధానంగా కనిపిస్తాయి. మంచి కథకు క్లుప్తత, అనుభూతి ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం అనే నాలుగు లక్షణాలూ ఉండాలని అంటారు విమర్శకులు వల్లంపాటి వెంకటసుబ్బయ్య. ‘చందనపుబొమ్మ’లోని కథలన్నిటిలోనూ అవి ఉన్నాయి. కథలకు నేపథ్యంలో రచయిత్రి అద్దిన రంగులు వాటిని పరిపుష్ఠం చేశాయి. ‘ఏకాంతంతో చివరిదాకా’లో కొండప్రాంతపు వర్ణన, ‘ఒక బంధం కావాలి’లో సముద్రతీరాన సూర్యోదయం, ‘భ్రమణకాంక్ష’లో కథానాయకుడి అనుభూతులు – ఇవన్నీ అలాంటి కొన్ని అందమైన రంగులు. తెలుగు భాషను చక్కగా ఉపయోగించే సామర్థ్యమున్న రచయిత్రి ఇంగ్లీష్ పదాలను, వాక్యాలను అత్యవసరమైతే తప్ప వాడకుండా ఉంటే బాగుంటుంది. ‘చందనపుబొమ్మ’తో తమ ప్రచురణలను ప్రారంభించిన రాష్ట్ర కథానిలయం నందలూరువారు ప్రతి ఏడూ ఇలాంటి ఒక యువ కథాగుచ్ఛాన్ని అందిస్తారని ఆశిద్దాం.
– పి. సత్యవతి
ఆదివారం ఆంధ్రజ్యోతి, 7 ఏప్రిల్ 2013
* * *
“చందనపు బొమ్మ” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ప్రింట్ బుక్‌ని తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
చందనపు బొమ్మ On Kinige
Related Posts:
2013-06-07
కినిగె బ్లాగు: జూన్ 2013 మొదటి వారంలో కినిగె పై టాప్ టెన్ పుస్తకాలు
జూన్ 2013 మొదటి వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు
1. యుగానికి ఒక్కడు – యు. వినాయకరావు
2. రామ్@శృతి.కామ్ – అద్దంకి అనంత్‌రామ్
3. అచలపతి కథలు 2 – ఎమ్బీయస్ ప్రసాద్
4. డబ్బు మైనస్ డబ్బు – యండమూరి వీరేంద్రనాథ్
5. రెండోసారి కూడా నిన్నే ప్రేమిస్తా – సూర్యదేవర రామ్ మోహన రావు
6. మిథునం – శ్రీరమణ
7. శిక్ష – మధుబాబు
8. పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు… – పొత్తూరి విజయలక్ష్మి
9. రామాయణ విషవృక్షం – రంగనాయకమ్మ
10. మిసిమి మే 2013 – మిసిమి
Related Posts:
కినిగె బ్లాగు: కినిగెపై తాజా టాప్ టెన్ పుస్తకాలు
కినిగెపై తాజా టాప్ టెన్ పుస్తకాలు
1. యుగానికి ఒక్కడు – యు. వినాయకరావు
2. రామ్@శృతి.కామ్ – అద్దంకి అనంత్‌రామ్
3. అచలపతి కథలు 2 – ఎమ్బీయస్ ప్రసాద్
4. డబ్బు మైనస్ డబ్బు – యండమూరి వీరేంద్రనాథ్
5. రెండోసారి కూడా నిన్నే ప్రేమిస్తా – సూర్యదేవర రామ్ మోహన రావు
6. మిథునం – శ్రీరమణ
7. శిక్ష – మధుబాబు
8. పొత్తూరి విజయలక్ష్మి హాస్య కథలు… – పొత్తూరి విజయలక్ష్మి
9. రామాయణ విషవృక్షం – రంగనాయకమ్మ
10. మిసిమి మే 2013 – మిసిమి
Related Posts:
2013-06-06
కినిగె బ్లాగు: మనమెరగని ఘంటసాల జీవితం
ఇంతవరకూ మనకు తెలిసింది ‘ఘంటసాల పాట’ మాత్రమే. ఆ ‘పాట’ వెనక ఉన్న జీవితం మనకు అంతగా పరిచయం లేదు. ఆ జీవితాన్ని, ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఘంటసాల కుమార్తె శ్యామల తీసుకువచ్చిన పుస్తకం ఇది. ‘నేనెరిగిన నాన్నగారు‘ అనే పేరు చూడగానే కేవలం తండ్రితో తనకున్న అనుబంధాన్ని మాత్రమే చెబుతున్నారేమో అనుకుంటాం. కానీ, ఘంటసాల పూర్వీకుల పుట్టుపూర్వోత్తరాలతో పాటు ఘంటసాల బాల్యం, యవ్వనం, అంచెలంచెలుగా ఆయన ఎదిగిన క్రమాన్ని పాఠకుడి కళ్లు చెమర్చేలా ఎంతో ఆ్రర్దతతో, ఆర్తితో అవలోకించే ప్రయత్నం చేశారామె. కృష్ణాజిల్లాలో పుట్టి, విజయనగరం సంగీత కళాశాలలో చదివి, సినిమాల్లో పాటలు పాడ్డానికి వెళ్లడమే మనందరికీ తెలిసిన ఘంటసాల చరిత్ర. కానీ .. పౌరోహిత్యం జరుపుకునే కుటుంబంలో పుట్టి ఘంటసాల అనుభవించిన కటిక పేదరికం, తోటి పండితుడి చేత అవమానం పాలై సంగీతం అభ్యసించాలన్న పట్టుదలతో ఎవరీకీ చెప్పకుండా మహారాజా సంగీత కళాశాలను వెతుక్కుంటూ విజయనగరం వెళ్లడం, అక్కడ పట్రాయని సీతారామ శాస్త్రి చూపిన ఆదరణ, ద్వారం వెంకటస్వామినాయుడుగారి మెప్పుతో సంగీత కళాశాలలో సీటు సంపాదించడం, పిల్లజమిందారైన సహపాఠి ముద్దు పాపారావు అపూర్వ చెలిమి, ఆకలికి తాళలేక జోలె పట్టి అన్నం అడుక్కున్న తీరు, ఆనాటి దేవదాసి కళావరురింగు సరిదెల లక్ష్మీనరసమ్మ ఇచ్చిన ఆతిథ్యం, నూనూగు యవ్వనంలో స్వాతంత్య్రోదమంలో పాల్గొని జైలు పాలవడం, మేనమామ కూతురు సావిత్రిని పెళ్లాడడం, సముద్రాల రాఘవాచార్య సహకారంతో మద్రాసుకు మకాం మార్చడం … హెచ్.ఎం.వి.రికార్డులకు పాడుతూ కాణీ, అణా సంపాదించడం, తోటి గాయని వక్కలంక సరళ (కాదు సుమా కల కాదు సుమా – కీలుగుర్రం ఫేం)తో పెళ్లికుదరబోయి, అనుకోని పరిస్థితుల్లో మరో రంగూన్ ‘సరళ’తో ద్వితీయ వివాహం జరగడం, తమిళ గాయకుడు సౌందరరాజన్ ‘అన్నా నీవు తమిళంలో పాడితే మాకు బతుకు తెరువు లేదన్నా’ అని మొరపెట్టుకోగానే తమిళంలో పాటలు పాడటం మానేయడం, లేమిలో తనకు సహాయం చేసిన విజయనగరం మిత్రులకు కలిమిలో సహాయం చేసి రుణం తీర్చుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో నాగయ్యకు (లవకుశ) గాత్రదానం చేయడం వెనకున్న కథా కమామిషూ, ఉత్తరాది సంగీత ప్రముఖులు బడేగులాం అలీఖాన్, మహమ్మద్ రఫీలతో అనుబంధం … ఇలా ఎన్నెన్నో సంఘటనలను సేకరించి గుది గుచ్చి అందించారు శ్యామల. ఘంటసాల చనిపోయినప్పుడు పద్నాలుగేళ్ల ప్రాయంలో ఉన్న శ్యామలకు తెలిసింది కొంతే అయినా, తండ్రిపైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో ఎందరెందర్నో కలిసి, తనకు తెలియని తండ్రి వ్యక్తిత్వాన్ని ఆరాతీసి అక్షర రూపం ఇచ్చారామె. పుస్తకం సాంతం చేతిరాతతో ఉన్నా చదవడానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా కదిలించే శైలితో కథనం నడిపిన శ్యామల అభినందనీయురాలు. ఘంటసాల అభిమానులకు ఇదొక అపురూప కానుక.
– గొరుసు
ఆదివారం ఆంధ్రజ్యోతి, 7 ఏప్రిల్ 2013
* * *
“నేనెరిగిన నాన్నగారు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్ సైట్ ద్వారా ప్రింట్ బుక్‌ని తగ్గింపు ధరకి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్‌ని అనుసరించండి.
నేనెరిగిన నాన్నగారు On Kinige
Related Posts:
2013-06-05
శ్రావణ వీణ...: లెటర్ టు స్వామి వినాయక్!
కినిగె బ్లాగు: సాక్షి”ఫన్‌డే” 2 జూన్ 2013 – టాప్ ఫైవ్ బుక్స్
సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం “ఫన్‌డే” 2 జూన్ 2013 నాటి సంచికలో కినిగె సౌజన్యంతో టాప్ ఫైవ్ పుస్తకాల జాబితాను ప్రచురించారు. వివరాలు:
1. మిస్టర్ మిరియం
– మల్లాది వెంకట కృష్ణమూర్తి
2. ఆత్మ కధాంశాల ఉత్తరాలు
– రంగనాయకమ్మ
3. రామ్@శృతి.కామ్
– అద్దంకి అనంత్‌రామ్
4. “ది బెస్ట్” ఆఫ్ యండమూరి వీరేంద్రనాథ్
– యండమూరి వీరేంద్రనాథ్
5. ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ
– బొందలపాటి
Related Posts:
2013-06-04
కినిగె బ్లాగు: యువనేస్తం… ఈ-పుస్తకం!
యువతలో వ్యాపిస్తున్న ఈ-బుక్ రీడింగ్ అలవాటు గురించి, యువరచయితలు తమకు అందుబాటులో ఉన్న ఈ-పబ్లిషింగ్ అవకాశాలను ఉపయోగించుకుంటున్న తీరు గురించి ఈనాడు ప్రత్యేక పేజి “ఈతరం” లో (తేదీ 1 జూన్ 2013) ఒక వ్యాసం ప్రచురితమైంది. ఆ వ్యాసం నుంచి కొన్ని పేరాలు ఇక్కడ చదవండి.
* * *
యువగుండెల్లో… భావోద్వేగపు పరిమళాలు… అయినా జనం చేరే మార్గం తెలియదు! కలం కదిపితే కమ్మని రచనలు… అచ్చు వేయిద్దామంటే అదో ప్రయాస! ఇలాంటి కష్టాలకిక కాలం చెల్లినట్టే… కాణీ ఖర్చు లేకుండా రచనల్ని ఈ-పుస్తకాలుగా మలుస్తున్నాయి ఆన్‌లైన్ పుస్తక ప్రచురణ సంస్థలు… సత్తా ఉన్న కొత్త రచయితలకు సదా స్వాగతం అంటున్నాయి… ప్రచారం, మార్కెటింగ్ బాధ్యతా వాళ్లదే!
* * *
కుర్రకారు సరదాలకు సరిదోస్తులే. అనుమానం లేదు! వారితోపాటే సాహిత్య ప్రియులు, జ్ఞాన పిపాసులూ ఉంటారండోయ్. అందుకే కాస్త తీరిక దొరికితే పుస్తకం తిరగేస్తుంటారు. వీలైతే కలం కదిలిస్తుంటారు. కథలు, కథానికలు, కవిత్వాలు, నవలలు.. ఎడాపెడా రాసేవాళ్లకి కొదవే లేదు. ఇప్పుడీ యువ రచనా వ్యాసంగం ‘డిజిటల్’ బాట పట్టింది. బ్లాగులు, సైట్లతో ముందుకెళ్లడమే కాదు, తమ రచనలను ‘ఈ-పుస్తకం’గా వెలువరించే ధోరణిని యువత అందిపుచ్చుకుంటోంది. పెరిగిన సాంకేతిక ఈ కొత్త అభిరుచికి దారులు తెరుస్తోంది. యువతలో పెరుగుతున్న ‘ఈ-రీడింగ్’ అభిరుచి అందుకు ప్రోత్సాహం కల్పిస్తోంది. ‘ఈ-రీడర్’ పరికరాలు, స్మార్ట్‌ఫోన్లలో పుస్తకాల డౌన్‌లోడింగ్ పెరుగుతున్న ధోరణి, యువ రచయితలకు ఆన్‌లైన్ మార్గాలు పరుస్తోంది.
* * *
కినిగెలాంటి సంస్థలైతే తమ పుస్తకాల గురించి మీడియాలోనూ ప్రకటనలిస్తున్నాయి. ఇక ఈ-పుస్తకాల్ని కాపీ చేయకుండా, పైరసీకి ఆస్కారం లేకుండా డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్(డీఆర్ఎం) పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు ప్రచురణకర్తలు. కొన్నవాళ్లు మాత్రమే చదవగలరు.
* * *
ఇంకా తన తొలి రచనని కినిగెలో ఈ-బుక్‌గా ప్రచురించిన యువ రచయిత అద్దంకి అనంతరామ్ గురించి కూడా ప్రస్తావించిందీ వ్యాసం.
వ్యాసం పూర్తి పాఠాన్ని ఈ లింక్‍లో చదవచ్చు.
Related Posts:
2013-06-03
సరదా: పగటి వేషగాళ్ళకి, సినిమా హీరోలకీ తేడా ఏమిటి?
2013-06-02
శిరా కదంబం: హనుమద్గురువు.... వెంగమాంబ... సంగీత చికిత్స... ఇంకా...
పలక - బలపం: మొపాస కథలు: దత్తుడు బాబు
2013-05-31
Hyderabad Book Trust: సమాజం విజ్ఞాన శాస్త్రం - డి.డి.కొశాంబి- పునర్ముద్రణ ...
కినిగె బ్లాగు: మే 2013 ఐదవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు
మే 2013 ఐదవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు
1. డబ్బు మైనస్ డబ్బు – యండమూరి వీరేంద్రనాథ్
2. రామ్@శృతి.కామ్ – అద్దంకి అనంత్‌రామ్
3. భవాని – మధుబాబు
4. త్రిపుర కథలు – త్రిపుర
5. వోడ్కా విత్ వర్మ – సిరాశ్రీ
6. మిథునం – శ్రీరమణ
7. రెండోసారి కూడా నిన్నే ప్రేమిస్తా – సూర్యదేవర రామ్ మోహన రావు
8. నవ్విపోదురుగాక… – కాట్రగడ్డ మురారి
9. ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కథ – బొందలపాటి
10. తపన – కాశీభట్ల వేణుగోపాల్
Related Posts:
2013-05-29
కమనీయం: A valuable and important book--'' uttaraandhra sphoortiprradaatalu.
2013-05-26
జగ్‌నే కీ రాత్: మిస్ వహీదా (ఈ వారం కథ - AndhraJyothy Sunday)
పలక - బలపం: స్వప్నశేషం (కథ)
2013-05-25
కినిగె బ్లాగు: మే 2013 నాల్గవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు
మే 2013 నాల్గవ వారంలో కినిగెపై టాప్ టెన్ పుస్తకాలు
1. రెడ్ షాడో – మధుబాబు
2. డబ్బు మైనస్ డబ్బు – యండమూరి వీరేంద్రనాథ్
3. రామ్@శృతి.కామ్ – అద్దంకి అనంత్‌రామ్
4. వోడ్కా విత్ వర్మ – సిరాశ్రీ
5. మిస్టర్ మిరియం – మల్లాది వెంకట కృష్ణమూర్తి
6. తమిళ కథలు – ఆణిముత్యాలు -గౌరీ కృపానందన్
7.కథావార్షిక 2012 – కథావార్షిక
8. అస్తమించని రవి – ఖాదర్ మొహియుద్దీన్
9. యుద్ధకళ – బి. ఎల్. సరస్వతి కుమార్
10. తపన – కాశీభట్ల వేణుగోపాల్
Related Posts:
2013-05-24
Hyderabad Book Trust: భారత రాజ్యాంగాన్ని ఎలా రూపొందించారు? .
కినిగె బ్లాగు: రాలిన కథా కుసుమం
తన రచనలలో మార్మికతకు పెద్దపీట వేసి, కేవలం 15 కథలతోనే చదువరులను అభిమానులుగా మార్చుకున్న త్రిపుర 24 మే 2013 న దివంగతులయ్యారు.
సెప్టెంబరు 2, 1928 నాడు జన్మించిన రాయసం వెంకట త్రిపురాంతకేశ్వర రావు (ఆర్.వి. టి. కె. రావు) ఉరఫ్ త్రిపుర, తన మొదటి కథ 31-5-1963 నాటి ఆంధ్రపత్రికలో ప్రచురించారు. 2012-13 నాటికి త్రిపుర సాహితీసృజనకి యాభై సంవత్సరాలు పూర్తవుతాయి.
త్రిపుర కథల విలక్షణత అయన ఎత్తుగడలో ఉంటుంది, మొదటే అర్థం కాలేదని పుస్తకం పక్కన పడేస్తే మాత్రం కొన్ని అద్భుతమైన కథలని కోల్పోయిన వారవుతారు. మొదట అర్థం కానట్టు అనిపించినా, చదివే కొద్దీ కొత్త భావాలేవో అనుభవంలోకి వస్తున్నట్లు, మళ్ళీ మళ్లీ చదవాలనుకుంటారు పాఠకులు. కథలు సంక్లిష్టంగా అనిపిస్తాయి, వాటి పరిథి పెద్దది – ఫ్లోరిడా, వారణాశి, కేరళ, రంగూన్, థాయిలాండ్, సరిహద్దు ప్రాంతాలు – ఎన్నో చుట్టి వస్తాయి యీ కథలు. జెన్ బౌద్ధం మొదలు నక్సలిజం దాకా అనేక శ్రేణుల్లో తత్త్వచింతన ఈ కథల్లో ఉంది. చదివేకొద్దీ, మరింతగా చదివించే గుణం ఉన్న కథలివి. ఈ కథల్లో సర్రియలిజం, ట్రాన్స్‌పరెంట్ చీకటీ ఉండి అంతర్ముఖీనమైపోయే ఒక కన్ఫెషనల్ ఎలిమెంట్ కనపడుతుందని సుధామ అంటారు.
త్రిపుర కథలే కాకుండా కవితలూ అద్భుతంగా ఉంటాయి. తన 47వ పుట్టిన రోజు సందర్భంగా ” సెగ్మెంట్స్” అనే ఆత్మకథాత్మక దీర్ఘకవితని రాసారు. దీన్ని మరో ప్రముఖ కవి వేగుంట మోహన్ ప్రసాద్ త్రిపుర స్వశకలాలు పేరుతో తెలుగులోకి అనువదించారు. ఫ్రాంజ్ కాఫ్కాకి వీరాభిమాని అయిన త్రిపుర ఆయన ప్రేరణతో, “త్రిపుర కాఫ్కా కవితలు” రాసారు. కాఫ్కా రచనల్లోని నిగూఢత్వం ఈ కవితల్లోనూ గోచరిస్తుంది. ఈ పుస్తకాన్ని “సాహితీమిత్రులు” ప్రచురించారు. 1980 – 1988 మధ్యలో త్రిపుర రాసిన 16 కవితలని “కవిత్వం ప్రచురణలు” వారు “బాధలూ -సందర్భాలూ” అనే శీర్షికతో నవంబరు 1990లో ప్రచురించారు.
“త్రిపుర కథలు, కవితలు, సంభాషణలు, మౌనం ఇవి వేరు వేరు కావు. అవన్నీ కలిసి అల్లే దారులు ఎంతో విస్తారము, సాధారణమైన అనుభవాల కంటె లోతు, అపరిచితమైన సృజనావరణానికి దిక్సూచికల వంటివి” అని అంటారు కనకప్రసాద్.
చక్కని సాహిత్యం ఆస్వాదించాలనే తెలుగు పాఠకులకు ఒయాసిస్సు లాంటివి ఈ త్రిపుర రచనలు.
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేయడంలో తనవంతు పాత్ర పోషించి, కథనరంగం నుంచి నిష్క్రమించిన త్రిపురకి హృదయపూర్వక నివాళి అర్పిస్తోంది కినిగె.
Related Posts:
2013-05-23
కినిగె బ్లాగు: చారిత్రక యానాం కథలు
ఇవి యానాం కథలు. వంతెన అవతల 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తారాజువ్వలు ఆకాశంలో వెలుగులు జిమ్ముతుంటే వంతెన ఇవతల చీకట్లో మూగగా నిలబడిపోయిన ఫ్రెంచి వలసలోని తెలుగు ప్రజలు… నోరొచ్చి ఇన్నాళ్ళకు చెప్పుకున్న కతలు. సాహిత్యం కూడా చరిత్ర ఖజానానే అనుకుంటే… దాట్ల దేవదానం రాజు ‘యానాం కథలు’ చారిత్రక గనేనని చెప్పాలి. చరిత్ర రచనలో చిక్కటి భావుకత్వం కలగలిస్తేనే ఇలాంటి కథలు తయారవుతాయనిపిస్తుంది.
ఫ్రెంచి వలసల్లో బతుకు సాపేక్షంగా బ్రిటిష్ వలసలకన్నా మెరుగేననేది ఈ సంపుటిలోని 18 కథలు చదివాక అర్థమయ్యే విషయం. దోపిడీ లేదని కాదు గానీ, స్థానిక సంస్కృతులు, సంస్కారంపై చిన్నచూపు లేదని కాదు గానీ, యానాం జనజీవనంలోని వైవిధ్యాన్ని మాత్రం చెదరగొట్టలేదు ఫ్రెంచి దొరలు. ప్రపంచంలోనే గొప్ప పౌర సమాజానికి ప్రతినిధులమన్న అభిజాత్యం వారి పాలనలోనూ, వ్యవహార, వ్యక్తీకరణల్లోనూ కనిపిస్తుంది. మనసుపడిన యువకుడితో గడిపేందుకు తన భార్యను అనుమతించిన పాల్ షెల్జ్‌లో (కథోర్‌జియ్) కనిపించేది ఈ అభిజాత్యమే. ప్రేమించిన కామాక్షి కోసం యానాంలోనే ఉండిపోవాలని రొబేర్ నిర్ణయించుకోవడం (లా’మూర్’) అలాంటి వ్యక్తీకరణే. తోటి బ్రిటిష్, డచ్ అధికారుల సాంగత్యంతో పొగరుగా వ్యవహరించిన ఒకరిద్దరు పౌర అధికారులు మినహాయిస్తే, చాలావరకు యానాంతో ఏదో ఒక సంబంధంలోకి వచ్చినవారే.
ఈ మినహాయింపు యానాంలోని బ్రాహ్మణ కులానికీ వర్తిస్తుంది. ఫ్రెంచి పాలన పట్ల పట్టింపుతోనూ, వంతెన అవతలి బ్రిటిష్ వలస పాలనలోని ఎదుర్లంకలో రెక్క విప్పిన ఆధునికత, జాతీయోద్యమం పట్ల మమేకతతోనూ ఉన్న కులమది. దొర బంగ్లాపై జెండా ఎగరేసిన బాపన్న, జంధ్యం తెంపిన దొరపై తిరుగుబాటు లేవదీసిన వెంకటయ్య (తీర్పు వెనుక), ఆధునిక విద్యలు నేర్చుకుని బతుకును మెరుగుపరుచుకున్న రామశాస్త్రి (మండువా లోగిలి)… ఈ ప్రభావాలకు ప్రతినిధులే.
తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఈ కథలకు గొప్ప ప్రాసంగికత ఉండడం మరో ప్రత్యేకత. తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలు ఉండడం తప్పా అనేది ప్రాంతీయవాదుల ప్రశ్న. కానీ, అలా జరిగితే రెండు కాదు, మూడు ప్రాదేశిక సరిహద్దుల్లో తెలుగు ప్రజలు జీవించాల్సి ఉంటుంది. ఎందుకంటే, గత అరవై ఏళ్ళుగా యానాం విడిగానే ఉంది. అలా ఉండడం ద్వారానే సాంస్కృతికంగా, సామాజికంగా, చారిత్రకంగా తమ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతను కాపాడుకోగలమని మెజారిటీ యానాం ప్రజలు భావిస్తున్నారు. నాలుగు కూడళ్ళ మధ్య నిలబడి ఈనాడు తెలంగాణ కోరుతున్నదీ ఇదే కదా!
– వి. అరవింద్
ఆదివారం అనుబంధం, ఆంధ్రజ్యోతి దినపత్రిక, 24 మార్చి 2013
* * *
“యానాం కథలు” డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది. కినిగె వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ చేసి ప్రింట్ పుస్తకాన్ని తగ్గింపు ధరకి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఈ లింక్ చూడండి.
యానాం కథలు On Kinige
Related Posts:
పాఠశాల: తాబేలు-కుందేలు
2013-05-21
పాఠశాల: జనగణమణ
2013-05-20
నాతో నేను నా గురించి: మణిప్రవాళం - తిలక్
2013-05-19
శిరా కదంబం: గురు బ్రహ్మా,,,, వేటూరి వారి తో. లే. పి.... పడవ ప్రయాణం....ఇంకా
2013-05-18
నాతో నేను నా గురించి: కవుల రైలు - తిలక్
మాష్టారు: గీకువీరుడు Greeku Veerudu Telugu Film Rivew
2013-05-17
మురళీగానం: మెలకువలో కల
అప్పుడే తెల్లవారుతున్నట్టుంది. బాల్కనీ నుండి మంద్రంగా వచ్చే సాగర ఘోష నెమ్మదించి, వాహనాల చప్పుడు మొదలయ్యింది. మగత నిద్రలో ఉన్న నాకు కాస్త కాస్తగా మెలకువ వస్తుంది. మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే బాల్కనిలో గోడ మీద కూర్చుని తేజ బీచ్ వైపు చూస్తున్నాడు. వీడికి ఇదేం పిచ్చో ఎప్పుడూ ఆ సముద్రాన్నే చూస్తూ ఉంటాడు అనుకుంటూ లేచాను. కళ్ళు నులుపుకుంటూ, తలుపు తీసుకుని బాల్కనీలోకి వచ్చి”ఏరా తేజా, కాస్త కాఫీ అయినా కలుపుకున్నావా? పొద్దున్నే మొదలెట్టావా” అని అడిగాను. ఏదో పరధ్యానంలో ఉన్నాడో ఏమో అలా నేను హఠాత్తుగా వచ్చి అడిగేసరికి తుళ్ళిపడి గోడ మీద నుండి తూలాడు. కళ్ళల్లో ఏదో కంగారు, బెదురు కనిపిస్తున్నాయి. గోడ మీద నుండి తూలిన వాడు పడిపోతాడేమోనని ఒక్క దూకులో వాడిని అందుకోబోయాను. కానీ పట్టు దొరకలేదు. నా చేతి నుండి ఏదో పొగ జారిపొయినట్టుగా జారిపోయాడు. అయోమయంగా వాడి వైపు చూసాను. వాడు గోడ మీదే ఉన్నాడు స్థిరంగా. నా వైపు వింతగా చూసాడు. నేను నా చేతి వైపు చూసుకుంటూ ఉండగానే సూది గుచ్చినప్పుడు చురుక్కుమనే మంటలా, చప్పున నాకు మూడురోజుల క్రితం జరిగినవి గుర్తొచ్చాయి. నిద్ర మత్తు పూర్తిగా వదిలి తెలివొచ్చింది.
గుండెలు దడదడా కొట్టుకోవటం మొదలయ్యింది. చేతులు, కాళ్ళు వణుకుతున్నాయి. గొంతు తడారిపోయింది. కళ్ళు నాకు తెలియకుండానే భయంతో పెద్దవిగా అయిపోయాయి. వాడింకా అలానే వింతగా నా వైపు చూస్తున్నాడు. ఇప్పుడు స్పష్టంగా తేజ శరీరమంతా ఒక తేజస్సులా కనిపిస్తుంది. మనిషి వెలిగిపోతున్నాడు. నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. మూడు రోజుల క్రితం చనిపోయిన తేజ ఇలా బాల్కనీలో ఎలా కనిపిస్తున్నాడు? భయంతో గట్టిగా అరవాలనిపిస్తుంది, పిచ్చిగా పరిగెట్టాలనిపిస్తుంది కానీ నా శరీరంలో ఏ అవయవం సహకరించటం లేదు. నాలో కలిగిన అలజడి వాడికి అర్ధమయినట్టుంది. బాధపడుతూ తలదించుకున్నాడు.
వెంటనే బాల్కనీ తలుపు దడేల్‌మని వేసేసి పారిపోదామనిపించింది. కానీ వాడి మొహంలో విచారం చూసి అలా పారిపోతే ఏమనుకుంటాడో అని మనసు పీకుతుంది. ఏమన్నా అనుకోని వాడిప్పుడు బ్రతికిలేడు ఆ విషయం మొదట బుర్రకెక్కించుకో అని నా లోపల ఎవరో అరుస్తున్నట్టుగా ఉంది. వాడు తల ఎత్తి నా వైపు చూసాడు. నా కళ్ళల్లోకి సూటిగా చూసాడు. వాడి చూపు తీక్షణత నా మనసుని తాకగానే నా గుండెకొట్టుకోవటం ఆగింది.
ఎవరో అప్పుడే దభ్ దభ్‌మని తలుపు కొట్టారు. బయట మరోమనిషి ఉనికి నా ఊహకు అందేసరికి నా గుండె తిరిగి కొట్టుకోవటం మొదలుపెట్టింది. ఇదే అదనుగా నేను అక్కడనుండి పరిగెట్టుకుంటూ వచ్చేసి కంగారుగా తలుపుతీసాను. ఎప్పుడూ ఏ పనీలేకపోయినా వచ్చి విసిగించే ఎదురింటి ప్రియ మొదటిసారిగా ఈరోజు నాకు నచ్చింది. లోపలికి రమ్మన్నట్టుగా నేను తనకి దారిచ్చాను. కానీ నా చూపింకా బాల్కనీ వైపే ఉంది. భయంతో నిలువెల్లా తడిచిపోయి, వగరుస్తున్న నన్ను చూసి “ఏమయ్యింది? ఏం చేస్తున్నావ్? ఎందుకలా తడిచిపోయావ్? జిమ్ చేస్తున్నావా?” అంటూ ప్రియ ఏవో ప్రశ్నలు వేస్తూ ఉంది. నేను కాదన్నట్టు తల అడ్డంగా ఊపటం తప్ప మాట్లాడలేకపోతున్నా.
తను ఏమనుకుందో ఏమో “సరే అయితే నేను తర్వాత వస్తాను” అని లేవబోయింది. “వద్దు” అంటూ చప్పున లేచి ప్రాధేయపూర్వకంగా తన చేతులు పట్టుకున్నాను. ఎప్పుడు తనొచ్చినా విసుక్కునే నేను ఇలా ప్లీజింగ్‌గా ఉండమనటమేంటో అర్ధంకానట్టు మొహంపెట్టి నా వైపే చూస్తూ కూర్చుంది. తన ఆలోచనలు అర్ధమయ్యి, నేను కాస్త తేరుకుని మామూలుగా ఉండే ప్రయత్నం చేసాను. ప్రియ కూడా మామూలయ్యి ఏవో తన కాలేజ్ కబుర్లు చెబుతూ ఉంది.నా చెవికి ఏం ఎక్కటం లేదు. నా చూపు, ఆలోచనలు ఇంకా బాల్కనీ దగ్గరే ఉన్నాయి. తేజ నాకే కనిపిస్తున్నాడా? లేక ప్రియకి కూడా కనిపిస్తాడా? లేదా ఇదంతా నా భ్రమ? నేనసలు నిద్ర నుండి లేచానా లేదా? ఏం అర్ధం కాని అయోమయంలో ఉన్నాను.
బాల్కనీ నుండి వాడు లోపలికి రాలేదు. నేను వంగి చూసాను. ఆ గోడ మీద తేజ లేడు. కంగారు కొంత కొంతగా తగ్గి ఇదంతా భ్రమేమో అని నా మనస్సుకి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతలో నా బెడ్ రూమ్‌లో ఎవరో మసలుతున్నట్టుగా స్పష్టంగా నాకు తెలుస్తుంది. కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో చెవులు రిక్కించి ప్రతి చిన్న శబ్దంవింటున్నాను. నాకు బాగా పరిచయమున్న అడుగులే అవి తెలుస్తున్నాయి. ఇది నిజమే అని నాకు బాగా అర్ధమయిపోయింది.
ప్రియ లేచి “మూర్తీ నాకు బోర్‌గా ఉంది బయటకు వెళ్దామా?” అని అడిగింది. తను గతంలో ఎన్నోసార్లు ఇలా అడిగింది. కానీ ఇదే మొదటసారి నేను సరే అనటం, అది కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అని లేచాను.
“చీ ఇలానేనా వెళ్ళేది?” అంది ప్రియ.
నా వైపు నేను చూసుకున్నాను. బట్టలు మాసి ఉన్నాయి. కనీసం మొహం కడగలేదు.
“వెళ్ళి కాస్త రెడీ అవ్వు” అని తోసింది ప్రియ.
నాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా బాత్రూమ్‌లోకి వచ్చాను. నిజానికిప్పుడు ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఉండటానికి ధైర్యం సరిపోవటం లేదు. అలాంటిది బాత్రూంలో తలుపులు బిగించి ఒక్కడినే, నాకు తిరిగి కంగారు, భయం మొదలయ్యాయి. మొహం పై నీళ్ళు చల్లుకునే ఒక్క క్షణం కూడా కళ్ళు మూసుకోవాలంటే భయంగా ఉంది. మూసుకున్న కళ్ళు తెరిచే ప్రతిసారి ఏం కనపడుతుందో అని కంగారుగా ఉంది. మొత్తానికి బెరుకుగానే చుట్టూ చూసుకుంటూ రెడీ అయ్యి బయటకి వచ్చాను. వస్తూనే ప్రియ చెయ్యందుకుని పరుగులాంటి నడకతో ఇంటి బయటపడ్డాను.
సాయంత్రం వరకూ ఇంటికి రాకుండా ఊరంతా తిరిగి వచ్చాం. ఎక్కడ తిరుగుతున్నా నా మనసంతా ఒకటే ధ్యాస “ఇదెలా సాధ్యం? దెయ్యాలున్నాయా? ఉంటే ఇంతకుముందెప్పుడూ ఎందుకు కనిపించలేదు? అయినా తేజకి నా మీద పగో,ప్రతికారమో ఉండే అవకాశం లేదు. మరలాంటప్పుడు నేనెదుకు భయపడటం? అయితేమాత్రం దెయ్యాలకి ఈ విచక్షణ ఉంటుందా?” అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నాను.
ఇంటికి వస్తుంటే కాంపౌండ్ వాల్ మీద కూర్చుని బీచ్ వైపే చూస్తూ తేజ. నా కాళ్ళక్కడే ఆగిపోయాయి. ప్రియ నా వైపు చూసి, నా చూపు ఆ గోడమీద ఆగిపోవటం గమనించి గోడ వైపు చూసింది. “ఏమయ్యింది మూర్తీ? అక్కడేం చూస్తున్నావ్?” అని అడిగింది. అంటే ప్రియకి ఏం కనిపించలేదు, నాకు మాత్రమే తేజ కనిపిస్తున్నాడు. ఇంటికి వెళ్ళే ధైర్యం లేక ప్రియని ఇంటికి వెళ్ళమని చెప్పి నేను బీచ్ వైపు నడిచాను. తేజ నన్ను గమనించలేదు.
తేజ నేను గొప్ప స్నేహితులమేమీ కాదు. రూమ్ షేరింగ్ కోసం నేను నా ఫ్రెండ్స్ ద్వారా వస్తే, తనకు పరిచయమున్న వాళ్ళతో తేజ వచ్చాడు. అందరూ ఉద్యోగాలొచ్చి తలో దిక్కు ఎగిరిపోతే మా ఇద్దరం రూమ్మేట్స్ గా మిగిలాం. తన గురించి నాకు తెలిసింది కూడా తక్కువే. తనకి ఎవరూ లేరని, చిన్నప్పుడే తల్లిదండ్రులు చచ్చిపోతే ఊర్లో వాళ్ళ సహాయంతో పెరిగి డిగ్రీ వరకూ చదువుకున్నా అని ఒకసారెప్పుడో చెప్పాడు. నేను ఉదయాన్నే ఆఫీసుకి వెళ్ళిపోతే తను ఇంట్లోనే ఉండేవాడు. పత్రికలకి ఏవో రచనలు పంపేవాడు. ఆ వచ్చే పారితోషకమే అతని జీతం. ఆ కాస్త డబ్బులతో ఎలా బ్రతుకుతాడో అనుకునేవాడ్ని. కానీ అద్దె డబ్బులకి ఏనాడు ఆలశ్యం చేయలేదు. అలసి ఏ రాత్రికో నేను ఇంటికొస్తే నా చేతికి తాళాలిచ్చి తను వెళ్ళి బీచ్‌లో కూర్చునేవాడు. ఎప్పుడొచ్చి పడుకునేవాడో తెలిసేదే కాదు. చాలా విచిత్రమైన వ్యక్తి.
సరిగ్గా మూడురోజుల క్రితం ఏ తెల్లవారు జామునో బీచ్ నుండి తిరిగి ఇంటికి వస్తూ రోడ్డు దాటుతుండగా పాలవ్యాన్ గుద్దేసిపోయింది. జాగింగ్ కోసం వచ్చిన జనాలు 108 కి ఫోన్ చేసి హాస్పిటల్‌కి పంపారు. కానీ అప్పటికే చనిపోయాడు. తన వారెవరూ లేకపోవటంతో అంతిమ సంస్కారాలు నేనే పూర్తిచేసాను. తనుండగా ఇద్దరికీ పెద్ద అనుబంధం ఏం లేకపోయినా, తనుపోయాక నాకు కాస్త ఒంటరితనం తెలిసొచ్చింది.
ఈ ఆలోచనల్లో ఉండగా “మూర్తీ..” అనే ఎవరో గుసగుసగా పిలిచినట్టు గాలిలో తేలుతూ వచ్చింది. నేను కాస్త తుళ్ళిపడ్డాను. అది తేజ గొంతు అవును అతనిదే. ఎంతో ఎక్స్ ప్రెసివ్‌గా ఉండే గొంతు.
“భయపడకు మూర్తీ. నేను నిన్నేం చేస్తాను? అంతా అనుకోకుండా అయిపోయింది. తీరా చనిపోయాక స్వర్గానికో, నరకానికో తీసుకుని వెళ్ళటానికి ఎవరైనా వస్తారేమో అని చూసా. ఎవరూ రాలేదు. నువ్వు నా అంతిమ సంస్కారాలు చేసే వరకూ నా శరీరం వెనుకే తిరిగా. నేనే రెండుగా విడిపోయి, నన్నే నేను ఎదురుగా చూసుకోవటం అర్ధంకాని వింత అనుభవం.
అది ముగిసినప్పటి నుండి ఈ సముద్రం ఒడ్డునే గడిపా. ఇంకా ఎన్నిరోజులు ఇలా గడపాలో తెలియదు. తర్వాత ఏమవుతానో అసలే తెలియదు. ఎవరినైనా అడగాలంటే నాలానే ఈ సముద్రం ఒడ్డున, ఆ బస్‌స్టాప్‌లో, హాస్పిటల్లో చాలామంది దేనికోసమో ఎదురు చూస్తూ దిగులు మొహాలతో కనిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరకి వెళితే మౌనంగా చూస్తారే తప్ప ఏం మాట్లాడరు. మన చుట్టూ మనకి తెలియకుండా ఇంతమంది అదృశ్య వ్యక్తులున్నారని, వాళ్ళు మనల్ని చూస్తారని బ్రతికుండగా అసలెప్పుడూ ఊహించలేదు.
వాళ్ళందరి మొహాలు చూసి చూసి ఏ సమాధానం దొరక్క విసిగి మన గదికొస్తే, నువ్వు నాతో మాట్లాడావ్. నాకు ఆశ్చర్యం వేసింది. నా ఉనికిని నువ్వు గుర్తిస్తుంటే ఆసక్తి కలిగింది. అందుకే నీవెంట వచ్చా. నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేను రానులే” నాకు కనబడకుండా నేను కూర్చున్న రాళ్ళ వెనుక ఎక్కడో ఉండి చెబుతున్నాడు తేజ.
ఏం మాట్లాడాలో నాకు తెలియలేదు. కానీ భయం తగ్గింది. లేచి మౌనంగా నడుచుకుంటూ గదికి వచ్చేసా. నా మౌనాన్ని ఎలా అర్ధం చేసుకున్నాడో తేజ నన్ను అనుసరించలేదు. కానీ రోడ్డు మీద నడుస్తుంటే తేజ చెప్పిన ఆత్మలు ఇక్కడే ఎక్కడొ ఉండొచ్చు, నన్ను గమనిస్తూ ఉండొచ్చు అనే ఆలోచన కాస్త కలవరపెడుతుంది. ఒళ్ళంతా జలదరిస్తున్న ఫీలింగ్.
పడుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా నిద్ర రాలేదు. లేచి తేజ పుస్తకాలు పెట్టుకునే గదిలోకి వెళ్ళాను. తను వస్తాడేమొ అని మనసులో కంగారు ఉన్నా ధైర్యం చేసి తన డైరీ తీసాను. బ్రతికుండగా తనేంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. తన రచనలు కూడా ఎప్పుడూ చదవలేదు. తను కూడా ఎప్పుడూ చదవమని చెప్పలేదు. ఈరోజెందుకో తెలుసుకోవాలనే కోరిక కలిగింది.
“సముద్రమెంతటి జ్ఞానో, అందరికీ అన్నీ ఇచ్చీ ఎవ్వరితోనూ ఏ అనుబంధం పెట్టుకోదు” డైరీలో మొదటి వాక్యం. ఇప్పుడిప్పుడే ఒంటరితనమంటే ఏంటో తెలిసొస్తూ ఉండటం వల్లేమో ఈ అక్షరాలు నాకెంతో అర్ధవంతంగా తోచాయి. కలవరపెట్టే ఆ అక్షరాల వెంట నా కళ్ళు పరుగులు తీసాయి.
“ఙ్ఞాపకాల తట్ట నా నెత్తిన పెట్టే సహాయం మాత్రమే చేస్తావు, నా తోడు రావు.
నేనెప్పుడూ ఒంటరినే అమ్ముకుంటూ ఉంటా భావావేశాన్ని ఈ విశాలరహదారుల్లో బాటసారులకి..”
“చెవులను తాకే ఈ అనంత ఘోష నీదా? నాలోనిదా? నీకెంత ధైర్యమో అలజడంతా పైకే చూపిస్తావ్”
“లక్షలమంది రోజూ పుడుతూ చనిపోతున్న ఈ జనారణ్యంలో ఎవ్వరికీ ఏమీ కాని నేను కూడా సముద్రాన్నే. ఎన్ని జీవాలు లోన ఈదుతున్నా, ఏన్ని నావలు పైన తేలుతున్నా సముద్రానికెవరు సొంతం?”
రాత్రంతా కూర్చుని ఆ డైరీ మొత్తం చదివాను. నా ఒంటరితనాన్ని ఆ అక్షరాలతో బేరీజు వేస్తే తేజ ఏ స్థాయి సంఘర్షణ అనుభవించాడో అర్ధమయ్యింది. తను సంపాదించే ఆ కాస్త జీతం తనకి ఎలా సరిపోయేదో అర్ధమయ్యింది. ఎవరూ లేరు రోజంతా మాట్లాడుకోవటానికి సముద్రం, ఆకలేస్తే నాలుగు మెతుకులు.
పొద్దున్నే లేచి తేజను వెతుక్కుంటూ బీచ్‌లోకి వెళ్ళాను. ఆ రాళ్ళ అంచున కూర్చుని సముద్రాన్నే చూస్తూ ఉన్నాడు.
రోజూ ఆఫీసు నుండి కాస్త ముందే వచ్చి తేజతో కాసేపు ఆ బీచ్‌లో గడపటం అలవాటు చేసుకున్నా. తను ఎన్నో విషయాలు చెప్పేవాడు. తనకి కవిత్వమెలా అబ్బిందో చెప్పాడు. చంద్రునితో తన స్నేహం గురించి, నక్షత్రాలతో తన ఊసుల గురించి, ఆకాశంతో తనువేసుకున్న గొడవల గురించి. కానీ సముద్రం తో తనకున్న అనుబంధం గురించి చెప్పాల్సొస్తే తనకి మాటలు వచ్చేవి కావు. ఏదో తెలియని ఉద్వేగం కనిపించేది. అందులోనే నేను మాటలు వెతుక్కునేవాడ్ని. నా పక్కనే నాకు కనబడని లోకమొకటుందని అప్పుడే నాకు తెలిసింది.
అప్పటికి తేజ చనిపోయి ఒక పదిరోజులయ్యిందేమో. ఒకరోజు చాలా కంగారుగా గదికి వచ్చాడు. తన బట్టలపెట్టె తియ్యమని చెప్పి తనకెంతో ఇష్టమైన సీబ్లూ కలర్ షర్ట్ చూపించి నన్ను వేసుకోమన్నాడు. మొదట నేను కాస్త మొహమాట పడ్డా వేసుకోక తప్పలేదు. తన డైరీ తీసుకుని రమ్మన్నాడు. ఇద్దరం వెళ్ళి బీచ్‌లో కూర్చున్నాం. తను చెప్పేది నన్ను వ్రాయమన్నాడు. ఆ రోజు పౌర్ణమనుకుంటా నిండు కళలతో చంద్రుడు వెలిగిపోతున్నాడు. ఆ వెన్నెలకాంతిలో సముద్రం అందానికి ఆవాసంలా కనిపిస్తుంది. తను తదేకంగా సముద్రాన్నే చూస్తున్నాడు. యుద్దానికి వెళ్ళే సైనికుడు తన ప్రియురాలి మోముని కళ్ళలో నింపుకుంటున్నట్టుగా. ఆ ఏకాగ్రతలో తనని చూస్తుంటే మరింత వెలిగిపోతున్నాడు. తన చుట్టూ గతంలో ఎప్పుడూ లేనంత కాంతివంతంగా ఆరా(aura) స్పష్టంగా తెలుస్తుంది.
“ఎందుకలా అలల చేతులతో తాకాలని నా దాకా వచ్చి
అంతలోనే మరలిపోతావ్.
నా పాదాలు తాకగానే నీ ఆత్రం తీరిపోయిందేమో,
మరి నా ముద్దు చెల్లొద్దా?
అంతంలేని మన ప్రణయంలో
అంతరాయానికా ఈ ఆటలు?
నాకు తెలుసు మనిద్దరం శాశ్వతం”
అని చెబుతూ చప్పున ఆగాడు. వ్రాస్తున్న నేను ఆ ప్రవాహం ఆగిపోవటం నచ్చక తన వైపు బాధగా చూసాను. నా చేతుల్లో కాగితం గాలికి ఎగురుతూపోయింది. తేజ ఏవో అక్షరాలకోసం ఇంకా వెతుక్కుంటున్నాడు. నేను ఎగిరిపోయిన కాగితం వెంట పరిగెత్తాను.
ఒక అమ్మాయి ఆ కాగితాన్ని పట్టుకుని నాకు ఎదురొచ్చింది. పలకరింపుగా నవ్వుతూ ఆ కాగితాన్ని నా చేతికిచ్చింది. నేను కాగితం వైపు చూసాను.
“నాకు తెలుసు మనిద్దరం శాశ్వతం
ఈ కాలాలు, రూపాలు కేవలం ఈ ఆటలో తప్పని నియమాలు” అని కవిత పూర్తి చేసి ఉంది. నేను తనవైపు ఆశ్చర్యంగా చూసాను.
“క్షమించండి చొరవచేసి మీ కవితలో చొరబడినందుకు. నచ్చకపోతే మార్చెయ్యండి” అని నవ్వింది.
నేను తేజ కూర్చున్న వైపు చూసాను తేజ లేడు. చుట్టూ చూసాను ఎక్కడా కనిపించలేదు. కంగారుగా ఆ అమ్మాయి వైపు చూసాను. తేజలో ఎప్పుడూ కనిపించే ఆరా(aura) తన చుట్టూ కనిపించింది.
నా కంగారుని తను ఎలా అర్ధం చేసుకుందో “క్షమించండి నా పేరు సాగరిక. నేను చాలాకాలంగా మిమ్మల్ని గమనిస్తున్నా. మిమ్మల్ని దగ్గర నుండి ఎప్పుడూ చూడకపోయినా నాకెంతో ఇష్టమైన ఈ సీబ్లూ కలర్ షర్ట్ లో ఎన్నో సాయంత్రాలు మీరిలా వెన్నెల్లో సముద్రాన్ని ఆస్వాదించటం చూసాను. నాలాగే సముద్రాన్ని ప్రేమించే మరో మనిషున్నాడని అనుకునేదాన్ని. ఈరోజు ఈ కవిత చూసాక అచ్చంగా నా అంతరంగం అనిపించింది. మీతో మాట్లాడి తీరాలనిపించింది. ఇక నుండీ నేను కూడా మీతో వెన్నెల్లో సముద్రాన్ని షేర్ చేసుకోవచ్చా” అని అడిగి ఆశగా నావైపు చూసింది. ఆ అందమైన వెన్నెల్లో సముద్రం ఒడ్డున తన అందమైన కళ్ళను చూస్తూ అలా నిల్చుండిపోయాను.
2013-05-14
హరివిల్లు: బ్లాగ్ స్పెషల్
2013-05-13
హరివిల్లు: ఆన్ లైన్ లో ప్రసాదం ...
2013-05-12
పాటతో నేను: కథగా కల్పనగా కనిపించెను
2013-05-11
చిన్ని ఆశ: నువు లేవు...అయినా ఉన్నావు
2013-05-10
మురళీగానం: ఆ సాయంత్రం గుర్తుందా?
కార్తీక మాసం కావోసు. ఆకాశం తొందరగా సూరీడ్ని ఆవలకి పంపేసి, రాతిరి రంగుని పులుమేసుకుంది. తుంటరి పిల్ల తెమ్మెరకు చలికాలం కదా అల్లరెక్కువ, రివ్వున చుట్టేసి గిలిగింతలు పెట్టి పోతోంది. ఊరంతా ఏదో తెరపరిచినట్టు మంచు పైనుండి మెల్లగా కురుస్తూ ఉంది. ఏ చెట్టుని, గట్టుని ముట్టుకున్నా చేతికి చల్లాగా తగిలి జిల్లుమంటుంది.
నీ కోసం ఆ వీధి చివర స్ట్రీట్ లైట్ క్రింద ఎంతసేపో మరి అలా ఎదురు చూస్తూనే ఉన్నాను. వళ్ళంతా చల్లబడి చిన్న వణుకు మొదలయ్యింది. గుమ్మాల ముందు కార్తీక దీపాలు మిణుకు మిణుకు మంటు చెప్పే కబుర్లేవో వింటూ కూర్చున్నా.
ఆ పరాకులో నేనుండగా అల్లంత దూరంలో నువ్వు, వెన్నెల దేశపు వేగులా, ఆనందలోకపు అందాల దేవతలా నువ్వు. బేల కళ్ళతో బిత్తర చూపులు చూస్తూ, చలిగాలికి ముడుచుకుని మెల్లగా నడిచొస్తున్న నువ్వు. నీకు తెలుసా ఆ క్షణం ఒక కొత్త స్వర్గానికి కొత్త ఇంద్రుడ్ని నేను. అంత ఐశ్వర్యం నీ క్రీగంటి చూపు ఒక్క క్షణంలో సృష్టిస్తే,నీ తోడెంత అపురూపమో కదా.
చీకట్లో ఒంటరి వీధుల వెంబడి నీతో ఆ గమ్యంలేని నడక, గమ్యం ఎంతటి అసంపూర్ణమో నిర్వచించింది. పెదాలను మౌనంతో కట్టిపడేసి, నీ కళ్ళు పలికిన ఊసులు, భాష ఎంత పిచ్చి ఊహో నేర్పించాయి. నా కళ్ళలోకి నువ్వు సూటిగా చూసిన ఆ చూపు నన్నెంత ఉక్కిరిబిక్కిరి చేసిందో. చూపులు నేలపై పరిచిన ఎంతోసేపటికి కానీ అ కంగారు తగ్గలేదు.
నా తడబాటు గమనించి చెయ్యి అడ్డు పెట్టుకుని నువ్వు నవ్వుకుంటే, ఎంత సిగ్గనిపించిందో. ఆ కదలికలో నీ భుజం నన్ను తాకిన క్షణం, నీ శరీర సుగంధం నను కమ్మేసిన ఆ క్షణం నాలో కలిగిన ప్రకంపనలను ఏమని చెప్పాలి? నేను చెప్పను. అది మోహావేశం మాత్రమే అనుకునే వాళ్ళకి నేను చెప్పనే చెప్పను.
కాస్త కంగారుగా దూరం తొలగి, నన్ను దాటి ముందు నువ్వు నడుస్తుంటే, కనపడనీయక నువు దాచేసిన సిగ్గుని, ఎర్రబడ్డ నీ మోము పైన ఆ అందాల నవ్వుని నా కళ్ళలో దాచేసుకుంటూ నీ వెంట నడిచాను. ఆ అనుభవాలను రికార్డ్ చేస్తున్న జ్ఞాపకాల పుస్తకాన్ని సరిగ్గా అక్కడే మూసేసి, తాడు కట్టేసాను. నువ్వు తిరిగి వెళ్ళిపోవటం జ్ఞాపకాల్లో నిలుపుకోవాల్సిన విషయమేం కాదుగా.
ఆ సాయంత్రం గుర్తుందా?
నువ్వులేని నా వేల సాయంత్రాల్ని వెలిగిస్తున్న ఆ సాయంత్రం నీకింకా గుర్తుందా?
ఙ్ఞాపకాల పందిరి: మా పక్కిల్లు
2013-05-09
ఙ్ఞాపకాల పందిరి: ఇప్పటికీ నన్ను వెంటాడె ఒక కమ్మని పాట
మాష్టారు: గుండెజారిగల్లంతయ్యిందే
2013-05-06
Goparaju Radhakrishna Blog: గుండె సడి .....
Super Murali, As usual- But okka doubt undi..
AA ammi chuttu enduku kanpinchindi aa aura
-Sravan (Virtusa)
chala bagundi murali …