2013-01-21
మయూఖ: అభివృద్ధి అంటే అప్పులా ?
2013-01-20
గోళీసోడా: అల్లావుద్దీన్ – ఆవకాయజాడీ
2013-01-19
ఆంధ్రామృతం: శ్రీ వల్లభవఝల వారి వీణా బంధ ఉత్పల మాల అపురూప ప్రక్రియ.
2013-01-18
కవితావనం: మా చిన్నారి సైన్యం
కవితావనం: నే చూచిన సంక్రాంతి
ఆంధ్రామృతం: శ్రీ వల్లభ వఝల కృత షోడశ ద్వార బంధ సీసము
2013-01-17
మయూఖ: ఎవరు తీసిన గోతిలో వాల్లే పడ్డారు.
మయూఖ: రాష్ట్రాలు ముక్కలైతే ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా ?
2013-01-15
తెలుగినక్స్: ఫైర్ఫాక్స్ తెలుగు వాడుకరులు గణాంకాలు 2012
తెలుగినక్స్: ఫైర్ఫాక్స్ తెలుగు ముద్రాక్షర తనిఖీ గణాంకాలు- 2012
మల్ రెడ్డి పల్లి: మీది ఉంగరాల జుట్టా అయితే ఇలా హెయిర్ స్టైల్ చేసుకోండి
2013-01-14
నల భీమ పాకం: రంగు రంగుల కూర ముక్కల కూర
ఆంధ్రామృతం: ఇంగిత మున్నసత్కవుల కెల్ల మనోజ్ఞము సంకురాత్రులౌన్.
తెలుగినక్స్: తెవికీ క్రియాశీల సూచి 2012
శ్రీఅరుణం.: (శీర్షిక లేదు)
2013-01-13
గోదారి: (శీర్షిక లేదు)
2013-01-12
Lahari.com: తిరుప్పావై 29 & 30వ పాశురము
Lahari.com: బోగి పండగ శుభాకాంక్షలు
2013-01-11
అవీ..ఇవీ...అన్నీ...: రెస్టారెంట్ నడుపుతున్నారా? మీకు పనికొచ్చే బ్లాగ్ ఇదిగో
కవితావనం: శివారెడ్డి
2013-01-09
శ్రీఅరుణం.: పెద్ద పండుగ
2013-01-08
నల భీమ పాకం: కాకరకాయ కారం
2013-01-07
నల భీమ పాకం: గొకమొలె/guacamole
2013-01-06
నాలో మాట: వింత జీవి కవి
అవీ..ఇవీ...అన్నీ...: ప్రపంచ వేదికలపై భారత్ పాత్ర శూన్యం
2013-01-04
శ్రీఅరుణం.: నిరుద్యోగి శాపం
2013-01-03
వేటగాడు: మనసు దోచిన లలన... నీకు వందనాలు…
యాత్ర - A Travelogue: (శీర్షిక లేదు)
ఊహల లోకంలో...: నా కథ! (part 1)
18 ఏళ్ళు ఉంటాయనుకుంటా అప్పుడు నాకు! అమ్మాయిలు, ఆడంబరాలు, కోరికలు, కొట్లాటలు.. ఇవన్నీ కావాలనిపించే వయసు. కానీ నేను మాత్రం వీటన్నింటికీ దూరంగా పెరిగాను. ఎక్కడో అడవుల్లో జరిగింది నా స్కూలింగ్ అంతా. తర్వాత పాలిటెక్నిక్.. నాగార్జున సాగర్‌లో! స్కూల్లో ఉన్నప్పుడు చిన్నవాళ్ళని చెల్లెళ్ళని పెద్దవాళ్ళని అక్కయ్యలని పిలవాల్సిన దౌర్భాగ్యం. సొంత క్లాస్‌లో అమ్మాయిలని మాత్రం శత్రువులని చూసినట్లు చూసేవాళ్ళం. అప్పుడప్పుడు కొట్టుకునేవాళ్ళం కూడా! చివరికి అమ్మాయిలంటేనే చిరాకు దొబ్బి, ఎదురుగా వచ్చినా తలదించుకుని వెళ్ళిపోయేవాడిని., తర్వాత తర్వాత చూడాలనిపించినా సిగ్గో భయమో అడ్డొచ్చేది.
ఇంజినీరింగ్‌లో జాయిన్ అవుతున్న రోజది, ఇన్నేళ్ళు మోడు వారిన జీవితానికి కొత్త శోభ వచ్చేలా కనిపిస్తోంది ఆ వాతవరణం చూస్తోంటే. ఈ కాలేజ్ బావుంటుందని పక్కింటి సీనియర్ అన్నయ్యలు చెప్తే విన్నాను, కాని ఇంతలా ఉంటుందని ఊహించుకోలేదు. ఒక foreign universityని తలపిస్తోంది ఈ GMRIT! పచ్చికతో, పచ్చని చెట్లతో నిండుంది ప్రాంగణమంతా. కాలేజ్ మొత్తంలో CSE బ్లాక్ ని అద్భుతమనక తప్పదు. నోటీస్‌బోర్డ్ లో 2nd CSE క్లాస్‌రూం ఎక్కడుందో చూసి సరాసరి అక్కడికి వెళ్ళాను.
రూంనంబరు 203, బహుశా 2nd year అని 2nd floor ఇచ్చారేమో అనిపించింది. ఆ రోజు శనివారం కావడంతో నేను తప్ప అందరూ సివిల్ డ్రెస్సుల్లో కనిపిస్తున్నారు. క్లాస్‌రూం వరకు వెళ్ళినా, లోపలికి వెళ్ళడానికి ఎదో సంశయం, may be భయమైనా కావచ్చును. తలుపుకి ఉన్న అద్దంలోనుండి చూస్తూ ఒక ఐదు నిమిషాలు బయటనే గడిపాను, క్లాస్‌లో అందరూ లీనమైనట్లుగా కనిపిస్తోంది బయటనుండి చూస్తుంటే. చివరికి ఏదైతేనేం, తప్పదని తెలిసి తప్పించుకోవడం ఎందుకులే అని ఎక్కడాలేని ధైర్యం తెచ్చుకొని తలుపు తీసా.
అలవాటు ప్రకారం May I come in అంటూ లెక్చరర్ వైపు తిరిగిన నాకు, మాట మధ్యలోనే ఆగిపోయింది, గొంతు తడి ఆరిపోయింది. కళ్ళు ఒక్కసారి పెద్దవై lecturer వైపు తదేకంగా చూస్తున్నాయి. మొదటిసారి ఒక అందాల రాశిని చూస్తున్నాను. స్త్రీల వర్ణనని చాలా కథల్లో చదివాను. అదంతా అతిశయోక్తి అనిపించేది నాకు. ఈ కవులు చెప్పేదంతా శుద్ధ అబద్దమని నా ప్రగాఢ నమ్మకం. ఆ నమ్మకం ఆ రోజుతో పటాపంచలయింది. శ్రీశ్రీ నుండి సిరివెన్నెల దాక.. ఏ కవి వర్ణనకీ అందనంత అందం. శరత్ నుండి సిడ్నీషెల్డన్ వరకూ ఏ కథకుడి రచనకూ చిక్కనంత సౌందర్యం. నా మనసులో ఒక సూపర్ కంప్యూటర్ వేగంతో ఇంతవరకూ చదివిన కథలు, కవితల్ని ఒక్కసారి తిరగేసి చూసాను. ప్చ్.. లాభం లేదు.. ఏ ఒక్కరి రాతతోను ఇంతటి అందానికి పోలిక లేకపోయింది. అందరి వర్ణనలూ కలిపినా.. అది ఆమె కళ్ళ చివర కాటుకకు కూడా సమానం కాదనిపించింది.
అర నిమిషంలో ఎన్ని ఆలోచనలు! క్లాస్‌లో అందరూ నవ్వుతూంటే ఒక్కసారి మళ్ళి ఈ లోకంలోకి వచ్చాను. ఆమె కళ్ళతోనే లోపలకి రమ్మన్నట్లు సైగ చేసింది. విచిత్రంగా మూడు వరసలలోని మొదట మూడు బెంచీలన్నీ ఖాళీగా ఉన్నాయి. మధ్య బెంచీలో మాత్రం ఒకతను కూర్చుని ఉన్నాడు, వెళ్ళి అతని ప్రక్కగా కూర్చున్నాను. మరో ఐదు నిమిషాలు పాటు ఆమె సౌందర్య ప్రవాహంలో మునిగి తేలాయి నా కళ్ళు. ఎంతటి అందం, ఇంతమంది కవులూ చేయలేని ప్రయత్నాన్ని నేను చేయడానికి ప్రయత్నించలేదు. కానీ ఆమె కళ్ళతోనే కూచిపూడి చేస్తున్నట్లుగా అనిపించింది. ఆమె మాటలేవి నా చెవులకి చేరడం లేదు, కానీ వాటిని పలికే పెదాలు ఒక విధ్వాంసుడు వలే సంగీతాన్ని పలికిస్తున్నట్లుగా తోచింది. ఆమె ఒక లెక్చరర్ అన్న వూహే లేకుండా ఆలోచనల్లో మునిగిన నాకు అందరూ కొట్టే చప్పట్లతో మెలకువ వచ్చింది.
“Superb Preeti!” అంటూ నా ప్రక్కనున్నతను లేచి నుంచొని board దగ్గరకు వెళ్ళాడు. అప్పుడర్దమయింది, అసలు విషయం నాకు. ఆమె కూడా నా క్లాస్‌మేటే అని. వివేకం మరచి చేస్తోన్న ఊహలకు ఒక్కసారిగా validity వచ్చినట్లయింది. ఆమె తన బెంచ్ వైపు వెళుతూ కళ్ళు చిన్నవిగా చేసి ఒకరకమైన expression ఇస్తూ పోయి కూర్చుంది. ఆమె expression కి అర్దమేంటో వెతకడానికి నా మనసెందుకో ప్రయత్నించలేదు. ఆమె పేరొక్కటే.. గుండె నిండా నిండిపోయింది. ఏమన్నాడు లెక్చరర్, “సూపర్బ్ ప్రీతీ!” అని కదూ!! ఆహ్.. ప్రీతీ.. ఎంతందమైన పేరు! ప్రీతీ, చందూ రెండూ రెండక్షరాల పేర్లే. ఆ పేరుతో నాకు ఏదో తెలియని అనుబంధం ఉందేమో. ఇన్ని రోజులు నిజంగానే మోడువారిన నాకు, ఈ ప్రీతి నాతో శృతి కలుపుతుందేమో!
2012-12-31
ఎవరిమాటా వినడు: ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు
nenu-naa vaallu-naa lokam: సంవత్సరాంతపు ఆలోచన...సరి కొత్త సబ్సిడీ పధకం...ఫ్రీ గా ఉపయోగించొచ్చు...
మహార్ణవం: జాగృతి వారపత్రిక సమీక్ష : జ్ఞానపీఠ పురస్కారానికి అర్హత గల తెలుగు కధా సంపుటిని చూశారా?
Singing in the Train: (శీర్షిక లేదు)
2012-12-27
ఊహల లోకంలో...: మిథునం – అద్భుతః!
మీరు పల్లెటూరు వెళ్ళి ఎన్ని రోజులయింది? అమ్మ, నాన్నలను లేదా అమ్మమ్మ/నాన్నమ్మ తాత య్యలను చూసి ఎన్నాళ్ళవుతోంది? మీ చిన్నప్పటి సంగతులు, తాతయ్యలు చెప్పిన కథలు, ఇంటి పెరటిలో, వీధి గుమ్మంలో, ఏటి నీటిలో మీరాడిన ఆటలు ఇంకా గుర్తున్నాయా! చిన్నప్పుడు మీ సొంతూరిలో మీరున్న పెంకిటిల్లు మీకింకా గుర్తుందా.. ఇంటి పెరటిలో గోడకి కొట్టిన పిడకలు, గుమ్మానికి చల్లిన పేడ కల్లాపు, శాలలో పశువులు.. ఇవన్నీ చదువుతుంటే మనం మరచిన మన పల్లెటూరు గుర్తొస్తోంది కదూ!
మిథునం సినిమ మనం మరిచిపోయిన మన అమ్మమ్మలని, తాతయ్యలని మనకి మళ్ళీ గుర్తు చేస్తుంది. పల్లె అందాలు, పల్లె జీవితాలలోని ఆనందాలని మన ముందు నిలుపుతుంది. మీరు విడిచింది పెద్దలని ఒక్కరినే కాదు, వారి ఆప్యాయతను, ప్రేమను, అనుబంధాలని కూడా అని తెలిసేలా చేస్తుంది.
ఏన్నేళ్ళయింది.. ఒక అచ్చమయిన తెలుగు సినిమా చూసి..ఈ అమ్మ నాన్నలని చూసి మీ కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లుతాయి, ఆ వంటకాలని చూసి మీ నోరు ఊరక తప్పదు. K.విశ్వనాథ్ సినిమాలు చూస్తే కలిగే ఆనందం, ఆయన సినిమాలు కలిగించే ఆర్ధ్రత మళ్ళీ ఇన్ని రోజులకి కలిగించిందీ తెలుగు సినిమా.
ఒక ఇల్లు, ఒక అమ్మ, ఒక నాన్న.. రెండే పాత్రలు, ఎన్నో భావాలు, జ్ఞప్తికివచ్చే అనుభవాలు మనలని మన వూరికి తీసుకెళ్తాయి. ఎవరూ లేని ఆ ఇంటిలో మన అమ్మ నాన్న చేసే అల్లరి, వారు(కాదు మనం) కోల్పోతున్న అనుబంధాలు, వారి మధ్య కలిగే కోప తాపాలు, అలక పాన్పులు ఒక్కటేమిటి.. ఈ సినిమా అచ్చంగా మన అమ్మానాన్నల ప్రేమకథను మనముందుంచుతుంది.
గ్రామీణులకుండే ప్రకృతి ప్రేమను కూడా మనం ఈ సినిమాలో చూస్తాం. వారు పశువులపైనా, చెట్లపైన పెంచుకునే మమకారాన్ని మన కళ్ళకు కడుతుందీ సినిమా. ఒక సన్నివేశంలో తను అల్లారుముద్దుగా పెంచి
న లేగదూడ చనిపోయేసరికి వృద్ధ దంపతులు పడే వేదన నాకు మ ఇంట్లో చిన్నప్పుడు ఆవు చనిపోతే వెక్కి వెక్కి ఎడ్చిన అమ్మమ్మని గుర్తు చేసింది. “బాలు” బావిలో దిగి అందులో పడిన పాత సామాను తీయటం, లక్ష్మి తనకు తప్పిపోయిన సంబంధం గూర్చి దెప్పి పొడవడం, విదేశాలకు పోయిన కొడుకుల పేర్లను చెట్లకు పెట్టుకోవడం.. ఒక్కటేమిటి, సినిమాలో ప్రతీ సన్నివేశం మీకు ఇంతకుముందు అనుభవంలోకి వచ్చినట్లే ఉంటుంది, వచ్చుటుందేమో కూడా!
కొస మెరుపు: ఇది తెలుగు తెలిసిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, తమదని గర్వంగా చెప్పుకోవాల్సిన సినిమా, చూసి ఆనందించాల్సిన సినిమా!
నూజిళ్ళ శ్రీనివాస్: అచ్చతెనుగు నుడికారానికి అభినందన చందనాలు..!
2012-12-26
nenu-naa vaallu-naa lokam: "నేను నా వూరిలో ఎందుకుండాలి?"
2012-12-24
నాలో మాట: క్షణ బంధం
2012-12-22
మీ కోసం - ఈ విషయం: Extract Time from a Date-Time Number in Excel
2012-12-19
మహార్ణవం: దీపావళి కథల పోటీలో బహుమతి పొందిన కథ
2012-12-15
మీ కోసం - ఈ విషయం: Excel లో Inches ని , feet లోకి convert చెయ్యాలి అనుకుంటే.
Hi Kishore,
Debut one to GS aina, chala bagundi..
short and sweet story…
good read..!
Rgds,
/Sirisha.
సెకండ్ హాఫ్ దెబ్బతింది, మాస్టారూ!
చక్కగా మొదలుపెట్టారు…అందంగా వర్ణించారు మరింత అందంగా సాగిస్తున్నారు…ఆ తరువాత ఏంటో త్వరగా సెలవివ్వండి..
hmmmm…what next:-)