2013-01-19
పద్యం - హృద్యం: సరసాహ్లాదిని
తెలుగు నుడి: తాడెక్కే జనం తలదన్నే ప్రభుత్వం: తొలి చదువులు-28
2013-01-18
రుచి...the temptation: మావిడల్లం పులిహోర
2013-01-17
పద్యం - హృద్యం: రాళ్ళవాన......ధూళికణ పాతమగున్...
2013-01-16
The Inquisistor - సత్య పథ గామి: అందరికీ సాఫ్ట్వేర్ జాబులు రావాలి దేవుడా...!
చాకిరేవు: ఘరానా దొంగ మొదలు కీచకుల బంధువుల వరకు
'''నేస్తమ్...: ఒక్కోసారి
2013-01-14
రవిగారు: అర్ధంకాని హాలాహలం
అభిరుచుల అల్లిక: mural work
అభిరుచుల అల్లిక: mural work
న్యూజింగ్స్: బాహ్యాంతరాలు
2013-01-13
నీలహంస: సమానత్వం కూడా అలాంటిదే .....
రవిగారు: ఆమెని అంతగా ప్రేమించానా ?
2013-01-12
రవిగారు: వికసించని చెట్టు
నీలహంస: వివేకానందుడంటే ఎంటో ..... !!! ????
తెలుగు నుడి: ఇంగ్లషు కోసం వితండ వాదనలు; తొలి చదువులు-27
2013-01-10
రుచి...the temptation: చిక్కుడు కాయతో రెండు కూరలు..
2013-01-07
'''నేస్తమ్...: నీ తోడు కావాలి..!
2013-01-06
మధురవాణి: మనసే పాడెనులే..
2013-01-05
హృదయ కవిత ♥ ツ: చిరునవ్వుల పరిమళం
2013-01-03
సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: మనసు చాటున
2013-01-02
మధురవాణి: జర్మనీయం - దోసెడు మంచు పూలు.. గుప్పెడు గుండె ఊసులు..
2012-12-31
కృష్ణశ్రీ--"ఓ తెలుగు రాడికల్": తెలుగుని........! - 3
వనితావని వేదిక: శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 53
2012-12-30
ఆరెంజ్: ఇంటికి వేసే తాళాలు చంద్రమతి మాంగళ్యమా
ఆరెంజ్: వన్ వే ట్రాఫిక్ లో భారతం
2012-12-29
సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: నిన్ను మరవాల్సి వస్తే
మీతో చెప్పాలనుకున్నా!!!: “ తెలుగు వెలుగులు ”
ఏమండీ, త్వరగా లేవండి, నాకు చాలా పనులున్నాయి అంటూ శ్రీవారికి శ్రీమతి మేలుకొలుపు పలికి వెళ్ళిపోయింది. శ్రీవారు మంచంమీద అటునుంచి ఇటువైపుకి పొర్లి మళ్ళీ నిద్రలోకి జారారు.
అన్ని దుకాణాల్లో షాంపూలు అమ్మకాలు పడిపోయాయి. బదులుగా కుంకుడుకాయలు, నువ్వుల నూనె, నలుగుపిండ్లు బాగా అమ్ముడుపోతున్నాయి. ఎందుకో తెలియక దుకాణదారులు అయోమయంలో పడిపోయారు.
తెల్లవారుతున్నది. ప్రతి ఇంట్లో సందడి మొదలయింది. చిన్నా, పెద్దా అందరూ లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, వంటికి, తలకు నూనె రాసుకుని, పిండితో నలుగు పెట్టుకుని, కుంకుడుకాయలతో తలంట్లు పోసుకుని తయారవుతున్నారు. సూర్యోదయం అయింది. ఆడ పిల్లలు లంగా, జాకెట్లు; కొంచెం పెద్ద పిల్లలు లంగా, ఓణీలు; పెద్దవాళ్ళు పట్టుచీరెలతో; మగ పిల్లలు లాగూ, చొక్కా; కొంచెం పెద్ద పిల్లలు లాల్చీ, పైజమాలు; పెద్దవాళ్ళు పంచె, లాల్చీ, ఉత్తరీయాలు ధరించి, తిలకాలు తీర్చిదిద్దుకున్నారు. ఇంటి గుమ్మాలు పూల తోరణాలతో, మామిడి తోరణలతో అలంకరించబడ్డాయి; వీధి వాకిళ్ళు కళాపిజల్లబడి, చక్కటి అందమైన ముగ్గులు వేయబడ్డాయి. అది ఉగాది పండగరోజు. శ్రీ విజయనామ సంవత్సరం (2013-14). ఇళ్ళల్లో పూజలు పూర్తి అయినాయి; పిల్లలందరూ ఉగాది పచ్చడిని సేవించి, తల్లితండ్రుల కాళ్ళకు నమస్కారాలుచేసి దీవెనలు పొందుతున్నారు. మరికొంతసేపటికి ఆలయాలలో గంటల మ్రోత; అందరూ గుళ్ళకు వెళ్తున్నారు. ‘వినరో భాగ్యము విష్ణుకధా … వీధివీధిన …’ అని పాడితే, ‘ కనరో భాగ్యము వీధివీధిన ’ అన్న చందాన వీధులన్నీ రంగురంగుల సాంప్రదాయిక దుస్తులను ధరించిన చిన్నా, పెద్దలతో నిండిపోయినాయి; అందరి నడకలూ గుళ్ళవైపుకే. తమతమ ఇష్ట దేవతలకి నమస్కరించి, మరొక్కసారి అందరూ ఉగాది పచ్చడిని సేవిస్తున్నారు. ఇంతలో పంచాగశ్రవణం మొదలయింది. అందరూ శ్రద్ధగావిని, ఆ తరువాత ఒకరినొకరు పలుకరించుకుని, శ్రీ విజయనామ సంవత్సరంలో అందరికీ విజయం కలగాలని ఆశిస్తూ, తిరిగి ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోతున్నారు.
సాయంసమయం. రాష్ట్రమంతటా కవి సమ్మేళనాలు; సంగీత విభావరులు; నాట్య ప్రదర్శనలు కోలాహలంగా జరుగుతున్నాయి. నేటి కవులకు, సంగీత విద్వాంసులకు, నాట్యాచారులకు సన్మానాలు జరుపుతున్నారు. వీరికి మరి సన్మాలు జరుపుతున్నది ఎవరో తెలుసా?? అమ్మనోట పలికిన అమృతమయమైన తెలుగు భాషను పరిరక్షిస్తున్న నేటి కవులను అలనాటి కవి దిగ్గజాలైన పోతనామాత్యులు, శ్రీనాథుడు, ఎర్రన, తిక్కన, వేమన, నన్నయ, తెనాలి రామకృష్ణుడు, మొల్ల, తిరుపతి వేంకటకవులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చిలకమర్తి, విశ్వనాధ సత్యనారాయణ, గుంటూరు శేషేంద్రశర్మ మొదలైన వారెందరో దిగివచ్చి సన్మానిస్తున్నారు. ప్రణవనాద రూపమైన సంగీతంతో ప్రజల్ని రంజింపచేస్తున్న నేటి సంగీత విద్వాంసుల్ని అలనాటి నాదబ్రహ్మలైన త్యాగరాజు, అన్నమాచార్య, భద్రాచల రామదాసు, మొవ్వ క్షేత్రయ్యల్లాంటి మహానుభావులెందరో స్వయంగా విచ్చేసి సన్మానిస్తున్నారు. నాట్యాచార్యులను సిద్ధేంద్రయోగి, వేదాంతం రాఘవయ్యలాంటి మహానుభావులెందరో స్వయంగా విచ్చేసి సన్మానిస్తున్నారు.
ఈ ఉగాది పండుగలో కనిపిస్తున్న క్రొత్తదనాన్ని చూస్తూ, ఆనందంతో పరవశించిపోతూ ఆంధ్రరాష్ట్రం మళ్ళీ స్వర్ణయుగంగా మారిందా!! అని అనుకుంటూ శాతవాహన యుగంనాటి రారాజు శాతకర్ణి, కాకతీయ రుద్రమదేవి, తెలుగు చోళరాజులు, రెడ్డిరాజులు, శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా విచ్చేసి అందరినీ అబ్బురపరిచారు. ఆంధ్రరాష్ట్రమంతటా ఒక్కటేతీరుగా పండుగ జరుగుతున్నది.
శ్రీమతిగారు శ్రీవారిని మరొక్కసారి మేలుకొలుపు పాడారు. వారు మరొక్కసారి ఇటునుంచి అటువైపుకు ఒత్తిగిల్లి మరలా నిదురలోకి జారిపోయారు.
‘ఆ రోజు’కు ముందురోజు పూలదండలకి, బట్టలకీ బాగా గిరాకీ పెరిగింది. ఆ రోజు రానే వచ్చింది. గ్రామాల్లో, పట్టణాలలో అన్ని సమాజ మందిరాలు (కమ్యూనిటీ హాల్సు) నిండిపోయివున్నాయి. బ్రాహ్మణుల వేదఘోషతో ఆ పరిసరాలు పునీతమవుతున్నాయి. పిల్లలు తమతమ తల్లితండ్రులను గద్దెలపై కూర్చోబెట్టి, వారికి బ్రాహ్మణుల ఆదేశానుసారం భక్తితో పాద పూజలు చేసి, క్రొత్త బట్టలు పెట్టి, మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ వారి ఆశీర్వాదాలను పొందుతున్నారు; తల్లితండ్రులందరూ తమ పిల్లలలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోయి, ఆనంద పరవశులవుతున్నారు.
శ్రీ వశిష్ట, వాల్మీకి, విశ్వామిత్రుడు, గౌతముడు, ఆత్రేయ, కణ్వాది మహా ఋషులందరూ భూమ్మీదకు విచ్చేసి, ప్రత్యక్షంగా ఈ సంస్కృతీసంబరాలను తిలకించి, పులకించి, ఆహూతులందరిపై పూలజల్లులను కురిపిస్తున్నారు. ఆ మహా ఋషులను చూసి అందరూ పరవశులయ్యారు. ఆంధ్రదేశమంతటా ఒక్కటే తీరుగా ఈ మాతృ,పితృ పూజలు జరుగుతున్నాయి.
శ్రీమతిగారు శ్రీవారిని ఈసారి కొంచెం గట్టిగానే గదిమి, లేస్తారా, లేదా? అంటూ వెళ్ళిపోయింది. శ్రీవారు అటునుంచి ఇటువైపుకి తిరిగి మళ్ళీ నిదురలోకి జారిపోయారు.
ఉదయం పదిగంటలు. ఓహ్, ఇదొక శుభదినం. పాఠశాలలన్నీ చిన్నారి పిల్లలతో కళకళలాడుతున్నాయి. పిల్లలందరూ మహోత్సాహంతో ఉల్లాసంగావున్నారు. బడి గంటలు మ్రోగాయి; ప్రార్ధన అయిపోయింది. పిల్లలందరూ నిలబడే, తమతమ ఉపాధ్యాయులకు నమస్కరిస్తూ, ‘ఆచార్య దేవోభవ, ఆచార్య దేవో భవ’ అని అంటూ, తమ తల్లితండ్రులు ఇచ్చిన తాంబూలము, దక్షిణనను గురువులకు ఇచ్చి వారి దీవెనలను పొందుతున్నారు. పిల్లలందరికి పప్పుబెల్లాలు పంచిపెట్టారు. చిన్నప్పటి పాట గుర్తుకువస్తున్నది: ‘అయ్యవారికి చాలు ఐదువరహాలు, పిల్లవారికి చాలు పప్పుబెల్లాలు … విజయీభవ … దిగ్విజయీభవ’ అని.
మరొక ప్రక్కన ఉన్నతవిద్యాపాఠశాలల్లో, కళాశాలల్లో ఆచార్యులందరూ వేదికలపై ఆశీనులైవున్నారు. విద్యార్ధులందరూ “ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ” అంటూ ముక్త కంఠాలతో పలుకుతూ, తమతమ ఆచార్యులకు నమస్కారం చేస్తూ, వారి దీవెనలను పొందుతున్నారు. ఉన్నతమైన విద్యయొక్క ఆవశ్యకతను గురించి ఆచార్యులు భాషణలు చేసారు. విద్యార్ధులందరూ శ్రద్ధగా విన్నారు.
ఆచార్య నాగార్జున, వేమన, కౌటిల్యుడు, జిడ్డు కృష్ణమూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి, డా. ఎన్.ఎన్.మూర్తి, డా. అంజిరెడ్డి, జీ.రామిరెడ్డి, మొదలైన మహామహులైన ఆచార్యదేవుళ్ళు ముందు నడుస్తుండగా, విద్యార్ధులందరూ వీధుల్లో ప్రదర్శనగా నడుస్తూ, చదువులు నేర్వనివారిని తమతో ఆహ్వానించారు. ఈ అపూర్వ దృశ్యాలను చూసిన తల్లితండ్రులు, పామరులు అందరూ పులకరించిపోయారు. ఆంధ్రదేశమంతటా గురుపూజలు ఇదేవిధంగా జరుగుతున్నాయి.
శ్రీమతిగారు శ్రీవారిని మరలా నిద్రలేపే ప్రయత్నం చేసారు. శ్రీవారు ఇటునుంచి అటువైపుకి తిరిగి నిద్రపోయారు. విసుగెత్తిన శ్రీమతిగారు అక్కడనుంచి విసవిసా వెళ్ళిపోయింది.
తెల్లని మంచుపొరలాంటి చీరె, ఆకుపచ్చని అంచువున్న చీరెను కట్టిన ఆ స్త్రీ ఎంతో అందంగా మెరిసిపోతున్నది. అంతలో ఉదయభాస్కరుడు కూడా ఆమెను చూద్దామని వచ్చాడు. ఆయన రాకతో సిగ్గుపడి, ఆ స్త్రీ, అదేనండి భూదేవి కంటికి కనిపించకుండా (మంచు కరిగిపోయి) మాయమయింది. ఆమె నడిచి వెళ్ళిపోయిన అడుగుజాడల్లో అడుగులువేస్తూ, మడిమ వెనుకకు తిప్పక, ఆ భూదేవి అయిన శ్రీలక్ష్మిని వెతుకుదామన్నట్లుగా హరిదాసులు హరిలో రంగహరి అంటూ భజనలు చేస్తూ, ఇంటింటి ముందూ రంగవల్లులు దిద్దుతున్న ఆడబడుచులను చూసి, వీరే ఆమె, ఆమే వీరని తలచి, వారికి నమస్కరిస్తూ, వారిచ్చిన పండు, దక్షణిలను తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలవారకముందే మంగళ స్నానాలుచేసి, బంతిపూలతో గుమ్మాలను అలంకరించి, సకల సిరిసంపదలూ తమ ముంగిట నిలవాలని వీధుల్లో గొబ్బెమ్మలను పెడుతున్నారు స్త్రీలు. వారిని అనుకరిస్తున్నారు పదాహారేళ్ళ పడుచుపిల్లలు. ఇటువంటి శ్రీలక్ష్మి, భూదేవి వంటి స్త్రీలను గౌరవించి, సముజ్జీలుగా చూసిననాడే కదా దేశంలో నిజమైన సంక్రాంతి వస్తుంది! ప్రపంచ పర్యావరణం, జీవరాశుల పరిరక్షణ సమ్మేళనం ఆంధ్రరాష్ట్రంలో జరిగిన వేళావిశేషమేమో, పల్లెలతోసహా పట్టణాలలోకూడా ఒకప్పటి సంక్రాంతి శోభలు ఉట్టిపడుతున్నాయి నేడు. ప్రతి ఇంటిముందు గింజలు వుంచిన చిన్న ముంతలు వేలాడుతున్నాయి. వాటిని తినటానికి వచ్చిన పక్షుల కిలకిలారావాలతో పరిసరాలన్నీ కోలాహలంగా వున్నాయి.
సంక్రాంతి పండక్కి వచ్చిన కూతుళ్ళు, అల్లుళ్ళతోపాటు అతిథిలుతో కూడి ఇళ్ళల్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. పేదవారికి పిలిచి పండుగ భోజనాలు పెడుతున్నారు జనం. ‘అతిథి’ అంటే ‘తిథి’ తో సంబంధంలేకుండా ఎప్పుడైనా వచ్చేవాడని అర్ధం. సంక్రాంతి పండుగతో ఆంధ్రరాష్ట్ర ప్రజల్లో వచ్చిన మార్పును చూసేమో అలనాటి స్వాతంత్ర్య సమరయోధులు అందరూ అతిథి అవతారమెత్తారు. ‘ అల్లూరి సీతారామరాజు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, పాటు నరసింహారెడ్డి, ఉయ్యలవాడ నరసింహారెడ్డి, టంగుటూరి ప్రకాశం, పింగళి వెంకయ్య, కాళోజీ నారాయణరావు, గౌతులచ్చన్న, కందుకూరి వీరేశలింగం, వి.వి.గిరి, పె.వీ.నరసింహారావు లాంటి మహానుభావులెందరో ఆంధ్రదేశమంతటా ఇంటింటికి వచ్చారు. వారిని చూసి, ఉత్తేజితులై, ఆంధ్రప్రజలు ‘అతిథి దేవో భవ’ అంటూ వారికి ఆతిధ్యమిచ్చారు. ఎంతమార్పు!!
ఉపసంహారం:- ఎంత మార్పోకదా!! మన శ్రీవారిలోకూడా అంతమార్పు వచ్చేసింది!! ఒక్క వుదుటున లేచి, వెంటనే లేవనందుకు శ్రీమతికి క్షమాపణలు చెప్పి, శ్రీవారు తయారయిపోయి, తన కలలో కన్న “ తెలుగు వెలుగులను ” శ్రీమతికి వివరించి, తనుకూడా ఇకనుంచి ఒక అచ్చు తెనుగువాడుగా వ్యవహరించాలని తీర్మానించుకుని, అందుకు నిదర్శనంగా, పంచకట్టు గోచీని బిగించి, నడుంకట్టు కట్టాడు శ్రీవారు. శ్రీవారి తెలుగు వెలుగుల కలలన్నీ నిజమగుగాక!!
మన దేశ సంస్కృతికి నాలుగు స్తంభాలున్నాయి. “తల్లి, తండ్రి, ఆచార్యుడు, అతిథి”. ఈ నలుగురిని పూజించిన, గౌరవించిన వారు సంస్కారవంతులు. అట్టి సంస్కారవంతులు వుండే ఇంటికి ఇల్లాలు స్త్రీ. అట్టి స్త్రీని గౌరవించినవారే నిజమైన సంస్కారవంతులు. అట్టి సంస్కారవంతులతో, సాహితీసాంస్కృతిక సౌరంభాలతో తెలుగునాడు వెలుగొందాలని ఆశిద్దాం; ఆ తెలుగువెలుగులు నలువైపులా వ్యాపించాలని మనసిద్దాం. శుభం. స్వస్తి.
Filed under: "సామాజికం"
2012-12-28
కృష్ణశ్రీ--"ఓ తెలుగు రాడికల్": తెలుగుని........! - 2
న్యూజింగ్స్: చందమామ రావే - ఇంకా ఎవరైనా పాడుతున్నారా?
2012-12-27
శ్రీ లలిత: పిల్లలూ...మిథునం సినిమా చూడండి...
2012-12-25
కృష్ణశ్రీ--"ఓ తెలుగు రాడికల్": తెలుగుని “వుధ్ధరించొద్దు”!
2012-12-24
సీతారామ్‌కి నచ్చిన ఎస్.ఎమ్.ఎస్ లు: (శీర్షిక లేదు)
2012-12-23
వనితావని వేదిక: వైకు౦ఠ ఏకాదశి
2012-12-21
మీతో చెప్పాలనుకున్నా!!!: “ సర్వాంగ పూజ ఎందుకు? ”
నమస్కారానికి ప్రతినమస్కారం చేయటం మన సంప్రదాయం, సంస్కృతి. అలాగే, మనం ఎవరినుంచి అయినా సహాయంకాని, ఉపకారంకానీ పొందితే, తిరిగి వారికి, అవసరాన్నిబట్టి, సమయాన్నిబట్టి ప్రతిసహాయంకాని, ప్రత్యుపకారంకానీ చేయటం ఒక ధర్మంగా చెప్పబడింది. అయితే ఇది త్రికరణసిద్ధిగా ఆచరింపబడాలి. ఈ విధానం సమాజంలో వ్యక్తుల మధ్య పరస్పర అవగాహనకు, స్నేహానికి, ఆత్మీయతకు దోహదపడుతుంది.
నేను పుట్టాను. అయితే, (లోతైన ఆధ్యాత్మిక విశ్లేషణను ప్రక్కనపెడితే) సామాన్యంగా ఆలోచిస్తే, నా శరీరంపై నాకు ఏ హక్కులేదు. కారణం, నేను పుట్టటానికి కారణం నేను కాదుకాబట్టి. కానీ, నా తల్లి,తండ్రులకు నాపై పూర్తి హక్కువుంది. వారు నాకు ప్రాణాన్ని పోసారు కాబట్టి. నాకు ప్రాణానిచ్చి, జీవితాన్ని ఇచ్చిన నా తల్లి,తండ్రులకు నేను ఎప్పుడూ ఋణపడివుంటూ, ఆ ఋణాన్ని తీర్చుకోవాలి కాబట్టి, వారికి నేను సదా సేవలు చేయాల్సిందే. అయితే, ఇక్కడ ఒక్క చిన్న విషయంవుంది. తల్లి,తండ్రులు నా శరీరానికి ప్రాణం పోసారే కానీ, నా శరీరంలోని అంగాంగాలను వారు తీర్చిదిద్దలేదు. ఆ పనిని ప్రకృతి లేదా, విశ్వచైతన్యశక్తి, లేదా భగవంతుడు అనేవాడు చేసిందే! నా ఈ శరీరంతో నేను ఏ కర్మలను చేసినా, ఏ ఉన్నతిని సాధించినా, తద్వారా ఏ ఆనందాన్ని, ఏ లాభాన్ని పొందినా అది అంతా కేవలం ఆ భగవంతుని ఉపకారం వల్లనే.
మరి భగవంతునికి తిరిగి నేను ప్రత్యుపకారం చేయాలికదా? అయితే, ఇక్కడ ఒక ప్రధాన సమస్య, మీమాంస వస్తుంది. తోటి మనుషులు నాకు ఉపకారం చేస్తే వారూ నాలాంటి వారే కాబట్టి నేను వారికి ప్రత్యుపకారం చేయగలను. కానీ, అన్నీ కలిగివున్న భగవంతునికి, ఏ ప్రత్యుపకారమూ ఆశించకుండానే నాకు ఉపకారం చేసే భగవంతునికి నేను ఏ విధంగా ప్రత్యుపకారం చేయగలను? లేదా కృతజ్ఞతలను తెలియచేయగలను? ప్రతి సహాయం, ప్రత్యుపకారం వీటిని రెండు రకాలుగా చేయవచ్చు. ఒకటి, ధన, వస్తు, ఇత్యాది వాటిద్వారా; రెండవది, మాట సహాయం ద్వారా. ఒక్కొక్కసారి, ఒక్క మాటైనా అక్షరలక్షల విలువ చేసేదిగా వుంటుందికూడా!! మరి భగవంతునికి పై రెండు పద్ధతులలో నేను ప్రత్యుపకారం చేయగలనా? అంటే, సమాధానం లేదనే చెప్పాలి. ధన,వస్తు, ఇత్యాదివన్నీ ప్రత్యక్షంగా / పరోక్షంగా ఆయనే నాకు ఇస్తున్నాడు. ఇక మాట సహాయం అంటే వాక్కుని ప్రసాదించిందే ఆ భగవంతుడూ!! మరి నేనేం చేయాలి??
ఈ విషయంపైన మన ఋషులు ఎప్పుడో, ఎంతో ఆలోచన చేసి ఒక పరిష్కారం కనుగొన్నారు. భగవంతునికి ధన,వస్తువులను ఇవ్వలేము; మాట సహాయమూ చేయలేము. అయితే, ఆయన మనకు శరీరాన్ని, అందులో ఎంతో అమూల్యమైన అంగాలను సృజించి ఇచ్చాడుకదా! ఆయా అంగాలతో, చేయవలసిన కర్మలను ధర్మపరంగా చేయటమే ఆయనకు మనంచేసే ప్రత్యుపకారం. దానితోనే ఆయన సంతోషపడతాడు అని పెద్దలు నిర్ధారించుకొని, ఒక ‘పూజా’ విధానాన్ని సూచించారు. దానినే ‘ సర్వాంగ పూజ లేదా అధాంగ పూజ ’ అని అంటారు. ఈ పూజావిధానం ఈ క్రింది విధంగా వుంటుంది. ఇది చాలామందికి తెలిసే వుంటుంది. అయితే, చాలామంది ఈ పూజను యధాలాపంగా చేసేస్తుంటారు. అలాకాకుండా, తత్త్వాన్ని తెలుసుకొని, అనుభవిస్తూ పూజను చేస్తే ఎలావుంటుందో చూద్దాం:-
* పాదౌ పూజయామి (పాదాలు) :- ఏదైనా సాధించాలంటే ముందుకు ఒక అడుగు వెయ్యాలికదా. ఆ అడుగు వెయ్యాలంటే పాదాలు వుండితీరాలి. చీకటిలోకూడా ముందుకు పోవటానికి పాదాలకి కళ్ళుంటాయి! (స్పర్శ); షిరిడి సాయిబాబా అంటారు: నీవు నావైపుకు ఒక అడుగు వెయ్యి, నేను నీవైపు నాలుగు అడుగులు వేస్తానని’. రేడియో తరంగాలను పొందటానికి ‘యాన్‍టెనా’ ఎట్లా ఉపయోగపడుతుందో, మన శరీరానికి కావాలిసిన శక్తిని; ఆ శక్తిని నియమబద్ధం చేయటానికి అరికాళ్ళు, అరిచేతులు పనిచేస్తాయి. మన శరీరంలోని నాడీమండల వ్యవస్థలో ప్రతి అంగానికి సంబంధించిన నాడులయొక్క ఒకవైపు కొనలు అరిచేతుల్లో, అరికాళ్ళల్లో వ్యాపించివుంటాయి. ఆక్యుప్రెజర్ వైద్య విధానంలో అరిచేతుల్లో, అరికాళ్ళల్లో వున్న అన్ని నాడులను ప్రత్యేకంగా నొక్కటంద్వారా మనలోని శక్తి క్రమబద్ధీకరించబడుతుంది. సహజంగా ఈ ప్రక్రియ మనం రోజూ నడవటంద్వారా జరుగుతుంది. పాదాలకి ఇంత ప్రాముఖ్యత వున్నదికాబట్టే, అట్టి పాదాలను మనకు ఇచ్చినందుకు కృతజ్ఞతాభావంతో భగవంతుడి పాదాలను పూజించాలి;
* గుల్ఫౌ పూజయామి (చీలమండల బుడుపెలు):- పాదాలను పిక్కలతో అనుసంధానం చేయటానికి ఇవి తోడ్పడతాయి; పాదాలలోకి వచ్చే అన్ని నాడులకు ఇవి రక్షణ కల్పిస్తాయి; పాదాలు కదలటానికి ఇవి ఉపయోగపడతాయి. అందుకనే వీటిని పూజిస్తాము;
* జంఘే పూజయామి (పిక్కలు):- మోకాలుకి పాదాలకి అనుసంధానమై వుంటాయి; పాదాలకి కావలసిన శక్తిని కొవ్వురూపంలో నిల్వచేసుకుంటాయి. అందుకే పిక్క బలం బాగా వుండాలోయ్ అని అంటుంటారు. ఇక్కడ వుండే రెండు ముఖ్యమైన ఎముకలే మనిషిని నిటారుగా నిలబెడతాయి. కాబట్టి వీటికి పూజ చేస్తాము;
* జానునీ పూజయామి (మోకాళ్ళు):- ఇవి తొడలని, పిక్కలనీ అనుసంధానం చేస్తాయి; తిరుపతిలో మోకాళ్ళ పర్వతాన్ని ఎక్కాలన్నా, హిమాలయ పర్వతాలని ఎక్కాలన్నా మోకాళ్ళయొక్క ప్రాముఖ్యత ఎంతో మనకి తెలిసిందే. అందుకే వాటికి పూజచేస్తాము;
* ఊరుః పూజయామి (తొడలు):- ఇవి పై భాగమైన నడుముకు అనుసంధానించబడి వుంటాయి; వీటికి చాలా ప్రాధాన్యంవుంది; వీటిల్లో కొవ్వు ఎక్కువగావుండి మెత్తగావుంటాయి; మనం కూర్చున్నప్పుడు పరుపులాగా పనిచేస్తాయి; వీటిల్లో కొవ్వు ఎక్కువుగా వుండి, మెత్తగావుండి మన మర్మాంగాలకు దెబ్బతగలకుండా కాపాడుతాయి; వెన్నుపూసలోని ఆఖరి పూసకు కూడా దెబ్బతగలకుండా కాపాడతాయి. ఇంత ముఖ్యమైనవికాబట్టే వీటికి పూజ చేస్తాము;
* కటిం పూజయామి (నడుము):- మన శరీరం మొత్తానికి మధ్యభాగం; పై శరీర భాగంయొక్క మొత్తం బరువు దీనిపై ఆధారపడివుంటుంది;
* ఉదరం పూజయామి:- మనిషి ఆహార రసంనుండి పుడుతున్నాడు; అట్టి ఆహారాన్ని జీర్ణంచేసి, ఆహారరసాన్ని తయారుచేసి శరీరానికి అందచేసే ఒక మహాద్భుత రసాయన కర్మాగారం ఇది అనటంలో అతిశయోక్తి లేదు!! తల్లి తన ప్రతిరూపానికి ప్రాణంపోసి, నిలుపుకుని, నవమాసాలు మోసే ప్రధాన అంగం ఇదే!! ఇతరులకు తెలియకుండా వుంచాల్సిన మాట ఏదైనా వుంటే, నీ మనసులో వుంచుకో అనంకానీ, ‘నీ కడుపులో పెట్టుకో బాబూ’ అనే అంటాం; అమ్మ కడుపు చల్లన అనే నానుడి ఎంతో గొప్పది; విషాన్ని అయినా హరించే శక్తి ఈ ఉదరానికి వుంది; వాడి కడుపునిండా ఆలోచనలే అంటుంటాం, కారణం ఆహారం లేకపోతే మెదడుకూడా పనిచేయదు; “ కడుపు ఆకలితో వున్నవాడికి దేవుడి గురించి చెప్పొద్దు ” అని శ్రీ వివేకానందుడు అంటాడు, కారణం ఆకలితో అలమటించినప్పుడు ఏ మాటా రుచించదు, తలకెక్కదుకూడా. ఇంతటి ముఖ్యమైన అంగం కాబట్టే, దీనికి పూజ చేస్తాము;
* నాభిం పూజయామి:- త్రిమూర్తులలో బ్రహ్మ పుట్టుకకు, భూమిమీద ప్రాణుల్లో మనుషులకు ఆధారమైనది నాభి; నవమాసాలు అమ్మ పొట్టలో పుట్టి, పెరిగే ప్రాణికి తల్లినుంచి అందే ఆహారం, రక్తం, గాలి అన్నీ బొడ్డుతాడు ద్వారానే కడుపులోవున్న బిడ్డకి అందుతాయి. అందుకే దీనికి పూజ;
* హృదయం పూజయామి:- ‘హృదయం లేనివాడు వీడు’ అని ఒక్క మాట అంటే చాలు ఆ వ్యక్తి ఎంత బాధ పడిపోతాడో! ఇంతకంటే హృదయం గురించి ఎక్కువగా చెప్పనక్కరలేదుకదా! ఉదరం ఆహార రసాన్ని తయారుచేసినా, దానిని శరీరంలోని ప్రతి కణానికి అందచేయాలంటే, రక్తప్రసరణద్వారా హృదయమేకదా చేసేది! ‘అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్న క్షణంనుంచి, చనిపోయే క్షణంవరకూ అవిశ్రాంతంగా పనిచేసేదే ఈ హృదయం!! అందుకే పూజ;
* బాహూమ్ పూజయామి (బుజాలు):- చేతులను శరీరభాగానికి కలిపివుంచే భాగమే భుజస్కంధాలు. ఎంత బరువునైనా ఇవి మోయగలవు; కేవలం భుజ బలంతో ప్రపంచాన్నే గెలిచిన మహాధీరులు ఎంతోమంది వున్నారు చరిత్రలో; అంత శక్తి కలవేకాబట్టి వీటికి పూజ చేస్తాము;
* హస్తౌ పూజయామి:- ఇంతకుముందే చెప్పుకున్నాం అరచేతుల్లోకూడా నాడీ కొనలు వ్యాపించివుంటాయి అని. అతి చిన్న పనినుంచి అతి పెద్ద పనులు చేయాలంటే చేతులయొక్క ప్రాముఖ్యం ఎంత గొప్పదో మనకి తెలుసు; కంటిలో నలుసును తీయాలన్నా, ఒక నలుసును (పిల్లల్ని) ఎత్తుకోవాలన్నా చేతులయొక్క అవసరం ఎంతో! ఏ పని చెయ్యాలన్నా మన శరీరంలో ఎక్కువగా వాడబడేవి చేతులే! ఆఖరికి భగవంతుడికి నమస్కారం చేయాలన్నా చేతుల్నే వాడతాం; దానం చేసినా, తీసుకున్నా; ఒక ప్రాణిని పెంచినా, చంపినా; రాజదండాన్ని ధరించినా, ముసలితనంలో చేతికర్రను పట్టుకున్నా; తినాలన్నా, మరొకరికి పెట్టాలన్నా; అనుభూతిని స్పర్శద్వారా తెలిపినా, అభయం ఇచ్చి ఆదుకున్నా అన్నింటికీ ఈ చేతులే! అందుకే వీటికి పూజ;
* కంఠం పూజయామి:- హాస్యంగా, వ్యంగంగా మాట్లాడేటప్పుడు, ‘మెడమీద తలకాయ్ వున్నవాళ్ళందరూ మాట్లాడేవారే!!’ అని అంటుంటాం. నిజమే మెడమీదేకదా తల వుండేది. అనేకమైన రైళ్ళు ఒక ఊరిలో ఆగి, అక్కడనుండి ముందుకుపోతూవుంటే, ఆ ఊరిని రైల్వేవారు ‘జంక్షన్’ గా వ్యవహరిస్తారు. అలాగే, మెదడునుంచి మన శరీరంలోని అన్ని అంగాలను అనుసంధానిస్తూ సాగే ‘నాడు’లన్నీ కంఠం అనే జంక్షన్ నుంచే వెళ్తాయి. ఇక గాలి, ఆహారం ఇవి రెండూ కలిసిపోకుండా చూసే ప్రక్రియకూడా కంఠంలోనే జరుగుతుంది; మంచి మాట మాట్లాడాలన్నా, మంచి పాట పాడాలన్నా కంఠం సహకరించాల్సిందే; చెవు, ముక్కు, కళ్ళు, నోరు వీటన్నిటి అంతర్భాగాల సంధానం కంఠంలోనే జరుగుతుంది; ఒక వ్యక్తిని గౌరవిస్తూ పూలదండ వేయాలన్నా, స్త్రీ తన అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవటానికి నగలు ధరించాలన్నా కంఠం ఒక్కటే ఆధారం. ఇంత ముఖ్యమైనది కాబట్టే, కంఠాన్ని పూజిస్తాం;
* దంతం పూజయామి:- ఏ ఆహారాన్ని అయినా కొరకాలన్నా, నమిలి తినాలన్నా; స్వరపేటికనుండి వచ్చే శబ్దాలను నియంత్రిస్తూ ఉఛ్చారణను స్పష్టపరచాలన్నా దంతాలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకనే వీటికి పూజ;
* వక్త్రం (నోరు) పూజయామి:- దంతాలను, నాలుకను తన అధీనంలో వుంచుకున్నదే నోరు. నోరు అదుపులో వుంటే అంతా మంచే అని అంటారు! నిజమేకదా! చిన్ని కృష్ణుడు యశోదమ్మకు తన నోటిలోనే సమస్త భువనభాండాలనీ చూపించాడు. కనుకనే దీనికి పూజ;
* నాసికాం పూజయామి:- స్పురధ్రూపి అని అనాలన్నా; ముక్కుసూటి మనిషి అని అనాలన్నా చక్కటి నాసికం వుండాల్సిందే; ప్రాణవాయువుని క్రమబద్ధంగా ఊపిరితిత్తులకు పంపాలన్నా; ప్రాణయామంచేస్తూ, నాసికాబంధనం చేస్తూ శరీరంలో ప్రవహించే పంచప్రాణాలను నియంత్రిస్తూ మహా ఋషులు కావాలన్నా ఆధారం నాసికే! అందుకే దీనికి పూజ;
* నేత్రాణి పూజయామి:- రంగుల కలలు కనాలన్నా; ఆశ్చర్యకరమైన ఈ ప్రపంచాన్ని చూడాలన్నా; మన మనస్సులో అలోచనలు కలిగించి, వస్తు, విషయ జ్ఞానాన్ని పొందాలన్నా నేత్రాలదే ప్రధమ స్థానం; మనలోని నవరసాలను ప్రతిబింబించేది నేత్రాలద్వారానే; అన్ని దానాలలోకెల్లా నేత్రదానమే అతి గొప్పది అని పెద్దలు చెప్పటంలో అతిశయోక్తి లేదు. కనుకనే దీనికి పూజ;
* లలాటం పూజయామి:- మనిషి మెదడులోని కొంత ముఖ్య భాగం లలాటం అనబడే ముందుభాగం లోపల వుంటుంది. ధ్యానం చేసేటప్పుడు లలాట భాగంలోని మెదడు ( frontal lobo) నియంత్రించబడుతుంది; యోగభాషలో ‘ఆజ్ఞా చక్రం’ అని అంటారు. అంటే, మన శరీరంలో జరిగే అన్ని ప్రక్రియలను ఇది ఆజ్ఞాపిస్తుంది. కనుకనే దీనికి పూజ;
* కర్ణౌ పూజయామి:- ఒక మనిషి ఎంత గొప్ప పండితుడైనా, అతను చెప్పేది వినాలంటే మనకి చెవులుంటేకదా సార్ధకత! చెవులు కేవలం వినటమనే పనికాకుండా మరొక ముఖ్యమైన పనినికూడా చేస్తాయి: ఒక చేత్తో బరువులు మోసేటప్పుడు, జారుడుగా వుండే నేలమీద నడిచేటప్పుడు మన శరీరం తూలి క్రింద పడిపోకుండా వుండటానికి చెవులులోని ద్రవం సహాయం చేస్తుంది మనకు తెలియకుండానే!! అందుకనే వీటికి పూజ;
* శిరం పూజయామి:- మన శరీరం మొత్తానికి ఆధిపత్యం వహించేది శిరమే! ఇందులోని మెదడు లేనిదే అసలు ఈ శరీరమేలేదు. మనిషిలోని మానవత్వం, జాలి, కరుణ, కోపం, ప్రేమ, ద్వేషం, అనురాగం, ఆత్మీయత, తెలివి ఒకటేమిటి ప్రతిదీ ఈ శిరస్సులోంచి వచ్చేదే!! భగవాన్, ఇన్ని అమూల్యమైన అంగాలను నాకిచ్చావయ్యా అని చెప్పే తెలివిని కలిగివుండేదికూడా ఈ శిరస్సే. కనుకనే ఈ పూజ.
ఉపసంహారం:- ఏ పని చేసినా, ఏది మాట్లాడినా, ఏ పూజ చేసినా ‘త్రికరణ శుద్ధి’గా చేయాలని పెద్దలు చెబుతారు. త్రికరణ శుద్ధిగా అంటే, మనసా, వాచా, కర్మణా అని అర్ధం. భగవంతుడు మనిషికి సంకల్పించటానికి మనసు; మనసులోని సంకల్పాన్ని బయటకు చెప్పటానికి మాట; ఆ మాటను కార్యరూపంలోకి మార్చటానికి జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను ఇచ్చాడు. ఫలితాలను ఆశించినా, ఆశించికపోయినా, త్రికరణ శుద్ధిగా చేసిన ఏ కర్మలకైనా సిద్ధించె ఫలితం ఉత్తమమైనదిగా వుంటుంది. ఇందులో సందేహంలేదు.
పైన చెప్పిన పంద్దొనిమిది అంగాలను పూజ చేయటానికి సామాన్యంగా మనకి కేవలం ఒక నిముషం మాత్రమే పడుతుంది. ఎందుకంటే అది యాంత్రికమైన పూజ కాబట్టి. నూరు సంవత్సరాల ఆయుషు అంటే:- “ రోజుకు 1440 నిముషాలు చొప్పున, 100 సంవత్సరాలు లేదా 36,500 రోజులు లేదా ఖచ్చితంగా చెప్పాలంటే 5,25,60,000 నిముషాలు ” మనకు భగవంతుడు ఇస్తే, అందులో రోజుకి, త్రికరణ శుద్ధిగా, ఒక పది నిముషాలు ఈ పూజను అనుభవిస్తూ చేయలేమా? ఈ పూజలో భగవంతుడి అంగాంగాలను పూజించటంవలన భగవంతునికి ఒరిగేదేమీలేదు. ఆయనిచ్చిన అట్టి అమూల్యమైన అంగములద్వారా మనం తోటి మానవులు, ఇతర ప్రాణులు మెచ్చేటటువంటి సత్కర్మలను చేస్తూ, వాటిని మనకు ప్రసాదించిన భగవంతుడిని సదా స్మరించుకోవటమే ఈ పూజావిధానంయొక్క తత్త్వం. స్వస్తి.
Filed under: ఆధ్యాత్మికం(Spiritual)
2012-12-17
అలుపెరుగని అల్పసంతోషి: కల ‘వరం’
నిశి రాతిరి వేళ …
పరులెటులనున్నా…
తను మాత్రం రాజునని తలచె … ఒక నరుడు
కట్టడాలు, ఆనకట్టలు, బలగాలతో … రాజ్యాన్ని నిర్మించసాగె
యుద్ధాలు ప్రకటించె … ప్రబుద్ధులను సైతం వణికించె …
అఖండ మండలాలను సైతం తన సైన్యముతో సమూహముగా …
ఒక పటముపై అద్బుతంగా సకల వర్ణములతో గీసిన బొమ్మలా …
రాగాన్వేషణతో తపించిపోయే గాయకుడు నిర్విరామముగా ఆలపించే పాటలా … పాలించెను!
సృష్టికర్త గర్వించదగ్గ స్థాయిలో నింగినంటే సింహాసనమును అధిరోహించగా …
అంతకంటే ఎత్తులో తానున్నానంటూ కన్నెర్రజేసి …
నిశిని అంతము చేయుచు తన ఉణికిని చాటిచెప్పెను …
ఆ రాజు సృష్టించుకున్న రాజ్యాన్ని నేలరాల్చె …
ప్రస్థానానికి ప్రతినాయకుడు కూడా వచ్చెనని చెప్పెను ఉదయభానుడు!
ఆ గాయకుని రాగం మూగబోయేట్టు గంట కొట్టెను గడియారం!!
2012-12-15
శ్రీ లలిత: కార్తీక వనభోజనాలు...
2012-12-13
కృష్ణశ్రీ--"ఓసామా....": కబుర్లు - 100
2012-12-12
కృష్ణశ్రీ--"ఓసామా....": కబుర్లు - 99
మధురవాణి: నీ కోపం క్షణమనుకుంటాను.. నీతో నేనొక యుగముంటాను..
శ్రీ కృష్ణారెడ్డి గారికి, నమస్కారములు.
తప్పక ప్రయత్నిస్తాను.
మీ స్నేహశీలి,
మాధవరావు.
శ్రీ రాయుడుగారికి, నమస్కారములు.
మీ అభిమానానికి ధన్యవాదములు. మీ సూచనలను తప్పక పాటిస్తాను.
మీ స్నేహశీలి,
మాధవరావు.
Babu, Fantastic Work!
good one !!!
@sruthi Thanks for the compliments! Would definitely keep posting!!